memorial
-
భీమా కోరేగావ్ చరితను మరుగు పరిచే కుట్రలు!
చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. అందుకు మంచి ఉదాహరణ భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర. మహారాష్ట్రలోని ప్రస్తుత పుణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్ (Bhima Koregaon). 1818 జనవరి1న అక్కడ ఓ యుద్ధం జరిగింది. మరాఠా (Maratha) సమాఖ్యలోని పీష్వా వర్గానికీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి.అసలేం జరిగిందంటే...బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వికదళం, 24 గన్నర్లతో బెటాలియన్ తరలి వెళ్తున్న సమయంలో ‘కోరేగావ్’ గ్రామంలో (పుణేకు 30 కిమీ) 20,000 పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్విక దళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారూ పారిపోయినా మహర్లు (Mahars) వెనకడుగు వేయకుండా పోరాడసాగారు. ఒకానొక దశలో ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనను లొంగి పొమ్మని ఆజ్ఞాపించాడు.అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ యుద్ధాన్ని విరమించడానికి నిరాకరించాడు. వందల సంవత్సరాలుగా తమని బానిసలుగా మార్చి పశువులకన్నా హీనంగా చూస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఇదే అవకాశం అని వాదించాడని అంటారు. మొత్తానికి కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. దీంతో పీష్వా సైన్యం, ఫూల్గావ్ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు. వారిని భీమా నది దాటేదాకా తరిమింది మహర్ సైన్యం.చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో–మరాఠా యుద్ధంగా, అందులో పోరాడిన పీష్వాను స్వాతంత్య్ర సమరయోధునిగా చెబుతారు సంప్రదాయ చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కోరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో ‘విజయస్తూపం’ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది.చదవండి: ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...‘ఇది మహర్ పోరాట యోధుల చరిత్ర. యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాట’మని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1927 నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా ఈ విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న ‘సమతా సైనిక్ దళ్’వారు ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం. అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.– ములక సురేష్, ఉపాధ్యాయుడు -
ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుక.. ప్రముఖులకు సన్మానం (ఫొటోలు)
-
గాల్వాన్ అమర జవాన్ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్ సైనికుడు జై కిషోర్ సింగ్ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్ తండ్రిపై బిహార్ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్లో దీని చుట్టూ గోడ కట్టారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్‌ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు. Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET — Anish Singh (@anishsingh21) February 26, 2023 -
డల్లాస్‌లో గాంధీ స్మారకాన్ని సందర్శించిన డా.సతీష్ రెడ్డి
డల్లాస్: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ తప్పు చేశాడా ..?
-
నాన్న కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం
-
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్‌యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
‘లోక్మత్’ ఆధ్వర్యంలో.. కార్గిల్ స్మారక భవనం
ద్రాస్ (లదాఖ్): జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టర్లో లోక్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్ స్మారక భవనాన్ని జవాన్లకు అంకితం చేశారు. కార్గిల్ యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్ వార్ మెమోరియల్ రక్షణ విధుల్లో ఉండే జవాన్ల సౌకర్యార్థం లోక్మత్ మీడియా గ్రూప్ దీన్ని నిర్మించింది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనాన్ని లోక్మత్ మీడియా ఎడిటోరియల్ గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ విజయ్ దర్దా చేతుల మీదుగా జవాన్లకు అంకితం చేశారు. గడ్డ కట్టించే చలిలో స్మారక పరిరక్షణ విధుల్లో ఉండే జవాన్లకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా దర్గా ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్‌గుప్తా, మేజర్ జనరల్ నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
లతా మంగేష్కర్ స్మారక నిర్మాణంపై దుమారం
Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్ వద్దే మెమోరియల్ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్.. ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్‌పై స్వరం మార్చారు నానా. ఇక బీజేపీ డిమాండ్‌పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్‌తో ఉన్న అనుబంధం. బాల్ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్ నిర్మాణం డిమాండ్‌పై మౌనం పాటిస్తోంది. ఇక ఈ డిమాండ్..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా9MNS) నేత సందీప్ దేశ్‌పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్ ప్రజలు ఈ పార్క్ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్ ట్వీట్ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు. ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్. లతా మంగేష్కర్ మెమోరియల్ డిమాండ్‌పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్ కాదని, దయచేసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు. -
జైలులో మగ్గుతూనే ఉన్నారు!
‘భీమాకోరేగాం యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలైన సందర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్ర వర్ణాలవారు దాడి చేశారు...’ ‘స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి’ అని సాయిని నరేందర్ ‘సాక్షి’ దినపత్రికలో (1 జన వరి, 2022) రాసిన విశ్లేషణలో, ఆ దాడి జరిగిన వధూభద్రక్లో శంభాజీ మహరాజ్‌కు సమాధి నిర్మించిన దళితుని సమాధిని 2018 జనవరి 1న అగ్రవర్ణాలు కూల్చేసిన విషయాన్ని ప్రస్తావించ లేదు. భీమాకోరేగాం శౌర్యస్థలికి, ఒక రోజు ముందు (డిసెంబర్ 31, 2017) జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ (శనివార్ వాడ, పుణే)కు ముంబై నుంచి దళితులను, అణచబడిన కులాలవారిని తరలించిన ఆరోపణపై 8 మంది తెలంగాణకు చెందిన రిలయన్స్ కంపెనీ కార్మికులను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసిన ప్రస్తావనా ఆ వ్యాసంలో లేదు. ఈ అరెస్టు సందర్భంగా ఏటీఎస్ వాళ్లు చేసిన మానసిక చిత్రహింసలు భరించలేక తెలుగు, మరాఠీ సాహిత్యవేత్త మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఎనమండుగురు యువకులు ఉద్యోగాలు కోల్పోయి రెండేళ్లు జైల్లో ఉండి విడుదలయ్యారు. భీమాకోరేగాం అమరుల 200వ సంస్మరణ సభ నిర్వహించిన 280 సంస్థల ఎల్గార్ పరిషత్ సమావేశం (31 డిసెంబర్ 2017–శనివార్ పేట, పుణే)లో ‘నయీ పీష్వాయీ నహీ చలేగీ’ అని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయించిన సాంస్కృ తిక కళాకారుడు, రిపబ్లిక్ పాంథర్స్ సంస్థాపకుడు సుధీర్ ధావ్లే, కబీర్ కళామంచ్ కళాకారులు రమేశ్, సాగర్, జ్యోతి ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నారు. (చదవండి: ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్) ఈ కేసును 2020 జనవరి నుంచి కేంద్ర ఎన్ఐఏ కోర్టు– ముంబై చేపట్టింది కనుక, వీళ్లతో పాటు అంబేడ్కరిస్టు మార్క్సిస్టు మేధావి ఆనంద్ టేల్టుంబ్డే, ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన సహచరులపై గడ్చిరోలీ కుట్ర కేసును వాదించిన ప్రముఖ క్రిమినల్ లాయర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఏపీఎల్) కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్, ‘కలర్స్ ఆఫ్ కేజ్’ (సంకెళ్ల సవ్వడి) రచయిత, ఐఏపీఎల్ కోశాధికారి అరుణ్ ఫెరీరా, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రీసెర్చ్ స్కాలర్ రోనా విల్సన్, ప్రొ. జీఎన్ సాయిబాబా డిఫెన్స్ కమిటీకి సహకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ హనీబాబు, ప్రొఫెసర్ షోమా సేన్, వర్ణన్ గొన్జాల్వెజ్, మహేశ్ రౌత్, గౌతమ్ నవ్లఖా ఇంకా జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. కస్టోడియల్ మరణానికి గురయిన స్టాన్ స్వామి గురించి ఇక చెప్పేదేముంది? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) – సాథీ, హైదరాబాద్ -
స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి
పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్. 500 మంది మహర్ వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్ వాళ్లు తమతో కలిసి పోరాడాలని మహర్లను కోరారు. అప్పటి మహార్ నాయకుడు సిద్‌నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖలే కరాఖండీగా చెప్పారు. వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచు కోవాలని ప్రతిన బూనిన ఐదు వందల మంది మహర్ సైన్యం, రెండు వందల మంది బ్రిటిష్ సైన్యంతో కలిసి 200 కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కని పిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ బతికితే పోరాట వీరులుగా బత కాలనీ, లేదంటే హీనమైన బతుకులతో చావాలనీ నిర్ణయించుకున్న మహర్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడింది. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసిన బ్రిటిష్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడింది. పీష్వా సైన్యం వెనక్కి తగ్గింది. అమరులైన 12 మంది మహార్ సైనికులకు బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజిమెంట్ ఏర్పాటు చేశారు. (చదవండి: డెస్మండ్ టూటూ.. వివక్షపై ధిక్కార స్వరం) 1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొదటిసారి సందర్శించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ దీన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఎందరో దళితులు జనవరి ఒకటిన దీని దర్శనానికి వెళ్లడం మొదలైంది. దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజు అయినందున దేశవ్యాప్తంగా శౌర్య దివస్‌గా జరుపుకొంటున్నారు. (చదవండి: జీవించే హక్కు అందరి సొంతం కాదా?) అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణె ప్రాంతంలో ఉండేది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడదనీ, దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇళ్లకు గానీ వారి దగ్గరకు గానీ పోగూడదనీ, తమ నీడ తమ పైన పడే పట్టగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది. శివాజీ పాలనలో ఇలా ఉండేది కాదు. శివాజీ పాలనలో సైన్యంలో ఉన్న మహార్లను అనంతర పాలకులు తొలగించి మనుధర్మాన్ని పకడ్బందీగా అమలుపరిచారు. 200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. యుద్ధం జరిగి 200 సంవత్సరాలు జరిగిన సంద ర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఇప్పటికి దళితులూ, అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు భేదభావం లేదంటూ దళిత వాడల్లో భోజనాలు చేస్తూనే, మరోపక్క కోరేగావ్ లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. (చదవండి: కీలవేణ్మని పోరాటం.. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన) శౌర్య దివస్ స్ఫూర్తిగా బ్యాలట్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో బహుజన రాజ్యం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. జ్యోతిరావు ఫూలే, పెరియార్, సాహూ మహారాజ్, నారాయణ గురు లాంటి మహానుభావుల మార్గంలో– బహుజనుల్లో ఎదిగిన వాళ్లు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేయాలి. - సాయిని నరేందర్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (జనవరి 1న భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం) -
శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్‌లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు. స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు. ‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు. చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్‌ని ఎత్తి వ్యాన్‌లో వేశారు శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్ నాగ్‌పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు. అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
'అణగారిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి పూలే'
సాక్షి, విజయవాడ : మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే చేసిన పోరాటం గుర్తుచేశారు. బలహీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. దళిత వర్గం నుంచి వచ్చిన అంబేడ్కర్, పూలేలు అమలు పరిచిన విధానాలను ఇప్పటికి ఆచరిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని పౌరుల్లో ఎక్కువ, తక్కువ అనే బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు పూలే పాటు పడ్డారని తెలిపారు. బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని మహానేత వైఎస్సార్ భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ చేశామని, అందుకోసం బడ్జెట్లో వారి సంక్షేమం కొరకు రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో బలహీనవర్గాలకు చెందిన 60శాతం మందికి మంత్రివర్గంలో చోటు కల్పించామన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. జిల్లాలోని 19 మార్కెట్ యార్డుల్లో చైర్మన్ పదవులకు సంబంధించి 10 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రస్తావించిన కొన్ని ముఖ్య విషయాలు : బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని రకాలుగా ముందడుగు వేస్తున్నామన్నారు. వీటికి సంబంధించి చట్టాలను ఏర్పాటు చేసి బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నట్లు తెలిపారు. ఐదు నెలల్లోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించామని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చట్టం చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 46 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. దీంతో పాటు కౌలు రైతులకు కూడా ఈ సాయం అందేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నట్లు స్ఫష్టం చేశారు. అమ్మ ఒడి కింద జనవరి 9నుంచి ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించారు. వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, పల్లెలో, పట్టణాల్లో సెంట్ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు. బడుగుబలహీన వర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళల విద్యావికాసానికి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సమసమాజ స్థాపనకు బాటలు వేసిన పూలే గారి ఆశయాలే స్ఫూర్తిగా ముందుకు సాగుదాం.#jyotibaphule — YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2019 -
నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. సీఎం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆదేశాలను జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం.. సమస్య పరిష్కారం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. పట్నాయక్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
వివాదం సృష్టిస్తోన్న శిలాఫలక ధ్వంసం
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. జెడ్పీ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసమై ఉండటం కలకలం రేపుతోంది. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రాగంణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. అనంతరం అధికారులు రాత్రికి రాత్రే పాత తేదీలతో చంద్రబాబు ప్రారంభించినట్టు శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఉదయం వరకూ ఆ శిలాఫలకాన్ని పగలకొట్టారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు. -
అంతా ఆర్భాటం
సాక్షి కడప : అధికారంలోకి రాకమునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత మరొక మాట చెబుతూ బాబు ముందుకు వెళుతున్నారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదిసార్లు అంతకన్నా కాదు.. దాదాపు 38సార్లు జిల్లాకు వచ్చినా.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ‘ఏరు దాటకమునుపు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా చంద్రబాబు వైఖరి ఉంటోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. జిల్లాకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ప్రకటించినా ఈనాటికీ రూపుదాల్చకపోవడం అందుకు బలం చేకూర్చుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రకటనలు తప్ప.. ప్రగతి కనిపించడంలేదు. ప్రత్యేకంగా వాటి నిర్మాణాల కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమవుతున్నాయే తప్ప.. వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. కనిపించని పర్యాటక సర్క్యూట్ జిల్లాలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామంటూ పలుమార్లు ఒంటిమిట్ట, గండికోటలకు సీఎం వచ్చిన సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఐదు పర్యాటక క్షేత్రాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపలేదు. హామీలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ప్రతి సందర్భంలోనూ బాబు నోట సర్క్యూట్ మాట వస్తున్నా.. ఆచరణలో కనిపించకపోవడం విచారకరం. ఏళ్లు గడుస్తున్నా సర్క్యూట్‌కు మార్గం లేకపోవడంతో పర్యాటక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడా లేని కొండ లోయలు ఇక్కడే ఉన్నాయి. రెండు కొండ లోయల మధ్య పారే పెన్నా జలపాతం ఇక్కడి సొంతం. ఏదో ఇతర దేశాలలో తప్ప.. ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే గండికోటలో స్కై వాక్కు చర్యలు చేపడతాం.. పూర్తిస్థాయిలో గండికోటను అభివృద్ధి చేస్తామని గండికోటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు చెప్పారు. కానీ ఆ మాటలు అలాగే మిగిలిపోయాయి. ఈనాటికీ స్కై వాక్కు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. పైగా దాన్ని రోప్ వేగా మార్చి అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పారు. అది కూడా ప్రతిపాదనలు మంజూరు దశలో ఉందే తప్ప.. కార్యరూపం దాల్చలేదు. అంతేకాదు గండికోటను ప్రపంచ చరిత్ర పటంలో నిలుపుతామంటూ పేర్కొన్న.. ఆర్కియాలజీ శాఖలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఇంతవరకు గండికోటలో పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు తయారైంది. ఒంటిమిట్టలోనూ అంతంతే అభివృద్ధి.. రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తామని చెప్పినా.. అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అప్పట్లో టీటీడీ ద్వారా రూ.100కోట్లు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినా.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. గత ఏడాది కల్యాణోత్సవం సందర్భంగా పెద్ద ప్రమాదం సంభవించిన విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికి ఈనాటికి పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు.. బోటింగ్, ట్యాంక్ బండ్ తరహాలో ఉద్యానం, ఇతర మహనీయుల విగ్రహాలను కూడా పెట్టాలనుకున్నా రూపుదాల్చ లేదు. ఇళ్లు కోల్పోయిన వారికి గృహాలు, శ్రీరామ పంపింగ్ స్కీం మినహా మిగతా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. పర్యాటకం కూడా ఆశించిన మేర అభివృద్ధి చెందలేదనే చెప్పవచ్చు. శిలా ఫలకాలకే పరిమితం బద్వేలు: పట్టణ పరిధిలోని తెలుగు గంగ కాలనీ వద్ద మంత్రి ఆదినారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలు దిష్టిబొమ్మను తలపిస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి రూ.2.50 కోట్లతో గత రెండు నెలల కిందట శిలాఫలకం వేశారు. దీంతోపాటు క్రిటికల్ ఇన్ఫ్ర్స్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద నిర్మాణానికి రూ. రూ.37.91 కోట్లు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లతో శిలాఫలకాలు వేశారు. అనంతరం కనీసం పునాదులు కూడా తీయలేదు. గత ఐదేళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి రూ.4 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదరాబాదరాగా రూ.42 కోట్లతో పనులు చేపడుతున్నట్లు శిలాఫలకాలు వేశారు. ఓట్ల కోసమే ఈ పాట్లు అని మున్సిపాలిటీ వాసులు చర్చించుకుంటున్నారు. కలగా మిగిలిన హార్టికల్చర్ హబ్.. రాయలసీమలో ఉద్యాన పంటలకు తిరుగులేదు. ప్రధానంగా జిల్లాలో పండ్ల తోటలకు పెట్టింది పేరు. ఉద్యాన హబ్‌గా మారుస్తామంటూ ఒక్కసారి కాదు.. వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నోటి నుంచి వెలువడే హామీల్లో ఇది ఒకటి. కానీ ఇంతవరకు ఉద్యాన హబ్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కనిపించడంలేదు. పైగా ఎక్కడ పెడతారన్నది కూడా ప్రశ్నార్థకమే. దాదాపు ఐదేళ్లుగా జిల్లాలో ఎక్కడ సీఎం సభలు జరిగినా కచ్చితంగా బాబు నోటి నుంచి ఉద్యానహబ్ మాట వస్తూనే ఉంది. ఇంతవరకు అతీ.. గతిలేదు. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాట హామీ ఇచ్చినా.. అది కూడా హామికే పరిమితమైంది తప్ప.. అమలుకు నోచుకోలేదు. పండ్ల ఉత్పత్తులకు సంబంధించి కూడా పలుచోట్ల కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలు చేపడతామన్నా వాటి రూపు లేదు. మొత్తానికి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని చెప్పక తప్పదు. బాబు మాట... నీటి మూట.. రాయచోటి: జిల్లాలోని రాయచోటి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని పీలేరు, వాయల్పాడు ప్రాంతాలకు హంద్రీనీవా నీరిచ్చి తీరుతా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండల సమీపంలోని కలిబండ వద్ద జిల్లాలోకి హంద్రీ–నీవా ప్రాజెక్టు అడుగులు వేసేలా నాడు ఆ మహానేత వైఎస్సార్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పనులను కూడా వేగవంతం చేసి ముందుకు నడిపించి 80 శాతం వరకు పూర్తి చేయించారు. ఆయన హఠాన్మరణంతో పనులలో వేగం తగ్గింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో 90 శాతం పూర్తయి నీటి రాక కోసం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్టుతోనైనా తమ కరువు ప్రాంతంలో నీరు పారుతుందని ఆశించిన జిల్లా రైతులకు నిరాశే ఎదురైంది. 2015 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డిలు హంద్రీ–నీవా ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వారి స్పందనపై నోరు తెరిచిన బాబు అసెంబ్లీలోనే 2016 కల్లా హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను కడప జిల్లాలో పారిస్తానన్నారు. ఆ మాటలు నేటికి అమలుకు నోచుకోలేదు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంపై ఉన్న ప్రేమ అనంతపురం జిల్లాలోని కదిరి, కడప జిల్లాలపై లేదని మరోమారు నిరూపితమైంది. నెరవేరని బాబు హామీలు రైల్వేకోడూరు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలకు రైల్వేఅండ్బ్రిడ్జి, బైపాసురోడ్డు, కోడూరు–వెంకటగిరి రోడ్డు, కోల్డ్‌స్టోరేజి, హార్టికల్చర్ హబ్, ఉద్యాన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకయాతన నాపేరు తిరుపతి శేఖర్. మా ఊరు బుడుగుంటపల్లి, పట్టణానికి దగ్గరలోనే మా గ్రామం ఉంది. అత్యవసర సమయాల్లో పట్టణానికి రావాలన్నా, తిరిగి వెళ్లాలన్నాæ మధ్యలో రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాల ఆవలి వైపు 40 గ్రామాలు ఉన్నాయి. ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని పోరాడుతున్నా బాబు ప్రభుత్వంలో స్పందన లేదు . హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం నాపేరు పర్వత విజయకుమార్‌రెడ్డి. మాది కోడూరు పట్టణం. గతంలో ఎన్నో ప్రభుత్వాల పరిపాలన చూశా. చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలో రైతుల ప్రధాన సమస్య కోల్డ్‌స్టోరేజి గురించి పట్టించుకోలేదు. సర్వరాయసాగర్ పనుల్లో జాప్యం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుచి సర్వరాయ సాగర్ ప్రాజెక్టు పనుల నిర్వహణలో జాప్యం జరుగుతూనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 75శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు పనుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తూ రావడంతో నేటికీ పనులు పూర్తి కాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పూర్తవుతుందని ఆశిస్తున్నాం.– ఎన్ విశ్వనాథరెడ్డి, గడ్డంవారిపల్లె, వీరపునాయునిపల్లె మండలం పది నెలలుగా అతీగతీ లేదు ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె, నాగాయపల్లె గ్రామాల్లో 2018 జూన్ 6వ తేదీన నవనిర్మాణదీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అయితే ఏ ఒక్కటీ పూర్తి కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాగాయపల్లె గ్రామంలో రూ.9.75 లక్షల అంచనాలతో పాఠశాల ప్రహరీ, వంటగది నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే మధ్యలోనే పనులు ఆగిపోయాయి. గత ఏడాది వినాయకచవితి పండుగ రోజున కాంపౌండ్ వాల్ నిర్మాణానికి గుంతలు తీసి మూడు నెలలు అలాగే వదిలేశారు. ప్రసుత్తం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి బెడ్ వేసి పిల్లర్లు ఏర్పాటు చేసి వదిలేశారు. పాఠశాలలో వంటగది నిర్మాణం కూడా ఇంత వరకు పూర్తి కాలేదు. పూర్తి కాని తారురోడ్డు పనులు... రూ.199 లక్షలతో ప్రొద్దుటూరు నుంచి చెన్నమరాజుపల్లె మీదుగా దువ్వూరు, కర్నూలు జిల్లా చాగలమర్రి వరకు నిర్మించాల్సిన తారురోడ్డు పనులు ఇంత వరకు పురోగతి సాధించలేదు. ఈ విధంగా సీఎం చంద్రబాబు రూ.4.22 కోట్ల పనులకు శిలాఫలకాలు ప్రారంభించారే కానీ పనులు పూర్తిచేయలేదు. ఎన్నికల ముందు తొందర.. పాలనంతా చిందర వందర కడప కార్పొరేషన్: నాలుగున్నరేళ్లు ప్రజా సంక్షేమం గాలికొదిలేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు చక్కర్లు కొడుతూ గాలిలో గ్రాఫిక్స్ మేడలు కట్టారు. ముందే అన్నీ చేసేస్తే ప్రజలు మర్చిపోతారని, ఎన్నికల ముందు చేస్తే గుర్తుంచుకొని ఓట్లేస్తారని భావించారు. ఈ మేరకు ఎన్టీఆర్ గృహాలు, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, పసుపు, కుంకుమ, అన్న క్యాంటీన్లు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)...ఇలా అన్నీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే చేయాలనే తొందరలో ఏవీ పూర్తి చేయలేక చతికిలబడ్డారు. ఫలితంగా పరిపాలనను చిందర వందరగా మార్చారు. కాలువలో పడి ప్రమాదాలు రూ.157.50 లక్షలతో నాగాయపల్లె, చెన్నమరాజుపల్లెల్లో ఏర్పాటు చేయాల్సిన కాలువల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి నెలలు గడుస్తోంది. కాలువను చాలా లోతుగా తీయడంతో చిన్న పిల్లలు, మూగ జీవాలు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నాయి. కాలువల నిర్మాణ సమయంలో 6 నెలల కిందట తాగునీటి కుళాయిలన్నీ ధ్వంసం చేయడంతో మంచి నీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రూ.39.15 లక్షలతో రెండు గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు శిలాఫలకం ఆవిష్కరించారే తప్ప పనులు పూర్తి కాలేదు. శిలాఫలకంతో సరి జమ్మలమడుగు: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీని కేంద్రం ద్వారా అమలు చేయించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలయ్యారు. నాలుగేళ్ల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకుని తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద మూడు వేల ఎకరాల భూమిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటూ శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శిలాఫలకం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ పనుల గురించి పట్టించుకోకపోవడంతో పనులు ఒక ఇంచి కూడాముందుకు సాగలేదు. -
చరిత్రను చెరిపే పచ్చనేతల ప్రయత్నం
సాక్షి, కావలిః నియోజకవర్గ టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ఉత్తుత్తి శిలాఫలకాలను ఆవిష్కరించే జాతరను కొనసాగించే క్రమంలో కావలి పట్టణంలో చరిత్రగా మిగిలి ఉన్న ఆనవాళ్లను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పట్టణ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రజాగ్రహానికి భీతిల్లి శిలాఫలకాన్ని వారే ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల్లో ఉచిత ప్రచారం కల్పింస్తుందనే ఆశతో టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా శిలాఫలకాల్ని హడావుడిగా ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో 120 సంవత్సరాల చరిత్ర ఉన్న వాయునందన ప్రెస్‌వీధి పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు. 1875–1900 కాలంలో పట్టణంలోని 33, 34, 37, 40వార్డుల పరిధిలో వాయునందన ప్రెస్‌ను ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల నిరంకుశ విధానాలపై పోరాటానికి, ప్రజలను సంఘటితం చేయడానికి అవసరమైన కరపత్రాలు ఈ వాయునందన ప్రెస్లోనే ప్రచురించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రధాన వీధికి వాయునందన ప్రెస్ వీధిగా స్థిరపడిపోయింది. అయితే టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా 1,000 శిలాఫలకాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగానే వాయునందన ప్రెస్‌వీధి అనే పేరును తొలిగించి కొత్త పేరు పెట్టాలని, అందుకు ఆ ప్రాంతంలో శిలాఫలకాన్ని కూడా హడావుడిగా నిర్మించారు. ఇక బీద మస్తాన్‌రావు వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉందనగా, ఈ విషయం పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చరిత్రకు ఆనవాళ్లును ధ్వంసం చేసే హక్కు టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావుకు ఎవరిచ్చారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు వాయునందన ప్రెస్ వీధి పేరును మార్పు చేసే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తే, అక్కడ స్థానికులతో వివాదం జరిగే ప్రమాదం ఉందని నిర్ధారించుకొన్నారు. ఈ వ్యవహరంలో పార్టీకి జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇంకా శిలాపలకాన్ని ఆవిష్కరిస్తే పట్టణ ప్రజలు సెంట్‌మెంట్‌గా భావించి పార్టీని బజారుకీడ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నాయకుడు తన శిలాఫలకాల ఆవిష్కరణ సంఖ్యలో ఒక్కటి కోల్పోయాననే భాదతోనే, వాయునందన ప్రెస్ వీధి పేరు మార్పు శిలాఫలకాన్ని ఆవిష్కరణను విరమించుకొన్నారు. వెంటనే ఆ శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. దీంతో బీద మస్తాన్‌రావు వ్యవహారశైలి పట్ల పట్టణ ప్రజల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. -
రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం
సాక్షి, ఒంగోలు సిటీ : మీ ఊరికి ఎంత దూరమో .. మా ఊరికి అంతే దూరం అన్న లోకోక్తిని మరో మారు జనం ముందుకు తెస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎప్పుడో శంకుస్థాపన చేసిన షాదీఖానా నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అందరూ హర్షించదగ్గదే. అయితే శంకుస్థాపన చేసిన పూర్వ నాయకుల పేర్లను మారడమే విమర్శలకు తావిచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ వద్ద షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకం వైఎస్సార్ అభిమానులు కలత చెందేలా చేసింది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పాత శిలాఫలకాన్ని మాయం చేసి, కొత్తగా దామచర్ల జనార్దన్ ప్రారంభకులుగా వేసిన శిలాఫలకం చర్చలకు దారి తీసింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు విమర్శలను మూట గట్టుకున్నారు. పాత ఫలకాన్ని తొలగించి రాత్రికి రాత్రే కొత్త ఫలకం ఏర్పాటు అసలు జరిగింది ఇది ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు షాదీఖానా కోసం వినతులు వచ్చాయి. ఆయనకు వైఎస్సార్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఒంగోలు పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేయించి పనులు వెంటనే మొదలు పెట్టించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. బాలినేని చొరవతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ పని అప్పగించారు. వెంటనే ఉత్తర్వులను జారీ చేశారు. ఎండబ్ల్యూడీ గ్రాంటు నుంచి షాదీఖానాకు నిధులు కేటాయించారు. సీఎం హోదాలో రాజశేఖర్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒంగోలుకు మంజూరైన షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ దేవానంద్ ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే అనంతరం జరిగిన ప్రభుత్వం మార్పు, రాష్ట్ర విభజన ఇతర అంశాలు తోడై షాదీఖానా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన దివంగత వైఎస్సార్ వేసిన పేరు లేకుండా కొత్త శిలాఫలకం వేయడంతో అభిమానుల విమర్శలకు దారి తీసింది. టీడీపీ ఇదో తరహా రాజకీయం? నగరంలోని కొత్త మార్కెట్ వద్ద అధికార పార్టీ నేతలు బుధవారం నియోజకవర్గం పరిధిలో పూర్తయిన పలు పనులను ప్రారంభించే క్రమంలోనే షాదీఖానాను కూడా ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే అసలు రాజకీయం చోటు చేసుకుందని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాయం చేశారన్న అపవాదును అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు మూటగట్టుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించడం లేదు. తమ నాయకుని పేరును శాశ్వతంగా భవనంపై లేకుండా చేశారని బాధపడుతున్నారు. త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఈ తరహా రాజకీయం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయమా? అధికారికంగా వేసిన ఆహ్వానం పత్రికల్లోనూ ‘తాత శంకుస్థాపన–మనవడి ప్రారంభోత్సవం’ అంటూ ముద్రించిన పత్రికలోని వివరాలు చూసిన అభిమానులు ఇంత అన్యాయమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. పత్రికలో, కొత్త శిలాఫలకంలో కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వేయడం గమనార్హం. షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన కొత్త శిలాఫలకం న్యాయం కోరతామంటున్న వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించి, రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి న్యాయం కోరతామని, పాత శిలాఫలకాన్ని సంబంధిత అధికారులు ఏం చేశారో సమాచారం ఇవ్వమని కోరతామన్నారు. ఇక్కడ తగిన స్పందన రాని పక్షంలో న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
కాన్షీరాం జ్ఞాపకార్ధం.. ఖాళీ చేయం
లక్నో: తనకు కేటాయించి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేది లేదని యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తాను నివాసం ఉంటున్న 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మెమోరియల్‌గా అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఈ మేరకు మాయావతి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కి లేఖ రాశారు. 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లాను 2011లో కాన్షీరాం జ్ఞాపకార్ధం మార్చారని, బంగ్లాలో తనకు కేటాయించి రెండు గదులనే నివాసం కొరకు ఉపయోగించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బంగ్లా భద్రత, సంరక్షణను తాను క్షేమంగా చూసుకుంటానన్న నమ్మకంతోనే తనకు ఆ బంగ్లాను కేటాయించారని అమె లేఖలో పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని త్వరలోనే అధికారలకు అప్పగిస్తానని మాయావతి తెలిపారు.కాగా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ ప్రభుత్వం మాజీ సీఎంలు బంగ్లాలు ఖాళీ చేయవల్సిందిగా ఉత్తర్వులు జారిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మాజీ సీఎంలు, అఖిలేష్ యాదవ్, ములాయంసింగ్, ఎన్డీ తివారి బంగ్లాలు ఖాళీ చేయడం కోసం తమకు కొంత సమయం కావాలని యోగి ఆదిత్యానాథ్‌కు లేఖలు రాశారు. -
అమ్మానాన్నకు ప్రేమతో..!
హుజూర్నగర్ : అమ్మానాన్న జ్ఞాపకార్థం మసీదును నిర్మించి ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మత పెద్దల సమక్షంలో ప్రారంభించాడు.. హుజూర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు ఎంఏ.మజీద్. ఈయన తల్లిదండ్రులు అబ్దుల్నబీ, తహెరాబేగంలు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అమ్మానాన్నల మీద ప్రేమతో స్థానిక షాదీఖానా సమీపంలో రూ. 20 లక్షలతో మసీదును నిర్మించాడు. మసీదుకు మజీద్–ఈ–తహెరా అబ్దుల్నబీ అనే పేరు పెట్టాడు. చిరకాలంగా తల్లిదండ్రుల పేరు చరిత్రలో నిలిచిపోనున్నందున వారి కుమారుడిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మజీద్ తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీదుగా మసీదు నిర్మాణం చేపట్టడంపై పలువురు మజీద్‌ను అభినందించారు. -
మల్లికార్జున్ మెరుపు సెంచరీ
సాక్షి, హైదరాబాద్ : జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో మెదక్ మావెరిక్స్ జట్టు బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (52 బంతుల్లో 110; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజి గ్రౌండ్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో మెదక్ 43 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు సాధించింది. మల్లికార్జున్ విజృంభణకు తోడు మికిల్ జైశ్వాల్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బౌండరీలతో హడలెత్తించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్ పోరాడి ఓడిపోయింది. బౌలర్లు వై. చైతన్య కృష్ణ (3/21), వి. భరత్ కుమార్ (3/46) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎం. యశ్వంత్‌రెడ్డి (22 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), యతిన్ రెడ్డి (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన జె. మల్లికార్జున్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ థండర్ బోల్ట్స్ 39 పరుగుల తేడాతో ఖమ్మం టిరా జట్టుపై గెలుపొందింది. బ్యాటింగ్‌లో చందన్ సహాని (50 బంతుల్లో 92; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు సాధించింది. విఠల్ అనురాగ్ (30) రాణించాడు. అనంతరం ఖమ్మం టిరా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులే చేసి ఓడిపోయింది. కె. రోహిత్ రాయుడు (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జునైద్ అలీ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. చందన్ సహాని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు కరీంనగర్ వారియర్స్: 156/6 (జి. వినీత్ రెడ్డి 30, అమోల్ షిండ్ 52), నల్లగొండ లయన్స్: 160/3 (ఎ. వరుణ్ గౌడ్ 63 నాటౌట్, శశిధర్ రెడ్డి 44). ఆదిలాబాద్ టైగర్స్: 184/8 (టి. రవితేజ 30, నీరజ్ బిస్త్ 44, హితేశ్ యాదవ్ 45; కనిష్క్ నాయుడు 2/35, మెహదీహసన్ 2/24), రంగారెడ్డి రైజర్స్: 143/9 (అక్షత్ రెడ్డి 55; జి. సదన్ రెడ్డి 3/23, హితేశ్ యాదవ్ 2/16). -
శివాజీగణేశన్ అభిమానులకు శుభవార్త
సాక్షి, పెరంబూరు: శివాజీగణేశన్ స్మారక మండపాన్ని అక్టోబర్ ఒకటిన ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. శివాజీగణేశన్ భౌతికంగా లేకపోయినా, సినీ జగం ఉన్నంత కాలం అందులో ఆయన జీవించే ఉంటారు. శివాజీగణేశన్ స్మారక మండపం నెలకొల్పాలన్నది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అలాంటి మండపాన్ని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్మించాలని భావించినా, అది జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం శివాజీగణేశన్ కు స్మారక మండపం కట్టించడానికి ముందుకొచ్చింది. స్థానిక అడయారులోని సత్యా స్టూడియో ఎదురుగా 2.80 కోట్లతో గత ఏడారి డిసెంబరులో మండపం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మేలో సర్వాంగసుందరంగా స్మారకమండపం పూర్తయ్యింది. స్థానిక మెరీనా తీరంలో శివాజీగణేశన్ శిలావిగ్రహాన్ని తొలగించి అడయారులోని స్మారకమండపంలో ఏర్పాటు చేశారు. మండపం ప్రారంభం కోసం శివాజీగణేశన్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. వారికి శుభవార్త ఏమిటంటే శివాజీగణేశన్ 90వ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు ఒకటవ తేదీన ఆయన స్మారక మండపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మండపాన్ని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించనున్నారు. -
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
-
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
రంగం సిద్ధం చేసిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు సంతకాల సేకరణ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాపత్రయపడుతున్న శశికళకు, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాకులిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో మకాం వేసిన శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకమందిరంగా మార్చడానికి సంతకాల సేకరణ ఉద్యమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను శనివారం పన్నీర్‌సెల్వం ప్రారంభించారు. అంతేకాక వేదనిలయంలో ఉంటున్న శశికళను ఖాళీ చేయించాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశారు. జయలలిత తన తల్లి మీద ప్రేమతో పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి వేదనిలయంగా పేరు పెట్టుకున్నారు. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె నివాసాన్ని స్మారకమందిరంగా మార్చాలని అప్పుడే పలువురు డిమాండ్ చేశారు. కానీ ఎప్పటినుంచో జయతో కలిసి ఉంటున్న శశికళ, అమ్మ అంత్యక్రియల అనంతరం డైరెక్ట్‌గా పోయెస్ గార్డెన్‌కే వెళ్లారు. ఇక అక్కడే ఆమె నివాసం ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి చక్రం తిప్పుతున్న శశికళను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి తరిమివేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు.