MLA seat
-
మహిళకు మకుటం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అన్నిటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేశారు. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు తీసుకొచ్చారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే. ఐదేళ్లుగా అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను సాధించారు. గత ఎన్నికల్లో మహిళలకు 19 ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా ఇప్పుడు 24కు పెంచారు. ప్రధాన విపక్ష అభ్యర్థులపై వైఎస్సార్సీపీ నుంచి మహిళలనే పోటీకి దించారు. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై బీసీ మహిళ మురుగుడు లావణ్యకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నుంచి వంగా గీతను పోటీకి దించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్సీపీ తరపున బీసీ మహిళ టి.నారాయణ దీపికను బరిలోకి దించారు. విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేయగా సీఎం జగన్ చరిత్రను తిరగరాస్తూ బీసీ మహిళ బొత్స ఝాన్సీలక్ష్మికి వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చారు. చాలాకాలంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కోటీశ్వరులే పోటీలో నిలవగా సీఎం జగన్ సాధారణ కార్యకర్త, బీసీ మహిళ గూడూరి ఉమాబాలను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మిగనూరులో టీడీపీ అగ్రవర్ణాలకు టికెట్ ఇవ్వగా బీసీ మహిళ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మహిళా నేతలకు టికెట్లు.. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థులుగా వి.కళావతి(పాలకొండ), పుష్పశ్రీవాణి (కురుపాం), ఎన్ ధనలక్ష్మి(రంపచోడవరం), విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని తానేటి వనిత(గోపాలపురం), శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మీ బరిలో ఉన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కంగాటి శ్రీదేవి(పత్తికొండ), బుట్టా రేణుక (ఎమ్మిగనూరు), హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా జోలదరాసి శాంతి, హిందూపురం, పెనుగొండ అసెంబ్లీ స్థానాల నుంచి టి.నారాయణ దీపిక, కేవీ ఉషశ్రీచరణ్, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు పశి్చ మ, గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానాల నుంచి మేకతోటి సుచరిత, మురుగుడు లావణ్య, విడదల రజని, షేక్ నూరి ఫాతిమా, కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేలు అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ దాసరి సుధ, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాల నుంచి ఆర్కే రోజా, కళత్తూరు కృపాలక్ష్మిలు పోటీ చేస్తున్నారు. రాజకీయ సాధికారత.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారి హోంమంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమం లాంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చారు. మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64 శాతం మహిళలే ఛైర్పర్సన్లుగా ఉన్నారు. ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు అంటే 55 శాతం మహిళలకే దక్కాయి. సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే దక్కడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించగా వీరిలో 53 శాతం మహిళలే ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారు. -
ఎట్టకేలకు ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
సాక్షి, విజయవాడ: లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ 111 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి ఆరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం,, రాజంపేట, తిరుపతి ఎంపి స్ధానాలకి అభ్యర్ధుల ఖరారయ్యారు. తెలంగాణ నుంచి రెండు ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం తాండ్ర వినోద్ రావులకు టికెట్లు కేటాయించింది. ఏపీ ఎంపీ స్ధానాలకు ఖరారైన పేర్లు అనకాపల్లి- సీఎం రమేష్ అరకు- కొత్తపల్లి గీత రాజమండ్రి- పురందేశ్వరి నరసాపురం- శ్రీనివాస వర్మ రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి- మాజీ ఐఎఎస్ మరియు గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ అసలైన బీజేపీ నేతలకు దక్కని సీట్లు ఇప్పటివరకూ పోటీలో ఉన్న అసలైన బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజులకు కూడా టికెట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు కొత్త ఎత్తుగడలకు జీవీఎల్, పోము వీర్రాజులకు సీట్లు దక్కలేదు. బీజేపీలో కూడా తమ వాళ్లకే సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం రచించడంతో అసలైన బీజేపీ నేతలను పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీకి సేవ చేసిన నేతలు ఈ జాబితా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉన్నవారికి బీజేపీ టికెట్లు కేటాయించడంపై అసలైన బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆశించిన రఘురామకృష్ణం రాజుకు చుక్కదురైంది. రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపించగా, అక్కడ ఎంపీ టికెట్‌ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది బీజేపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా కోసం క్లిక్ చేయండి -
జనసేన బలాన్ని బట్టి రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదంటున్న టీడీపీ
-
ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ లో 20 మందికిపైగా సిట్టింగ్ లకు నో టికెట్
-
బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్
వారిద్దరూ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులే. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరమో ఎమ్మెల్సీ. ఇద్దరూ కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి అక్కడ తిరుగే ఉండదు. కానీ.. ఆ ఇద్దరికి అసలు పడదు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుటి వైరమే బీఆర్ఎస్లోకి వచ్చాక కూడా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు నేతల తీరు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధిని మార్చాల్సిందే అని నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడేం జరుగుతోంది?.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారా స్దాయికి చేరింది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ పార్టీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. 2014లో ఓడిపోయిన జైపాల్‌యాదవ్ కల్వకుర్తి నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. కసిరెడ్డి స్దానికసంస్దల ఎమ్మెల్సీగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి కల్వకుర్తి సీటు ఆశించారు. కానీ.. జైపాల్‌యాదవ్‌కే అవకాశం ఇచ్చింది. మరోసారి ఆయన ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు.. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశంలోనూ ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు సాగుతోంది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కసిరెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు కూడా చేస్తున్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోఉన్న బీఆర్ఎస్కి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడ తలనొప్పిగా తయారైంది. ఒకరికి సీటు ఇస్తే ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కూడా జైపాల్‌యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జైపాల్‌యాదవ్‌కు సీటు ఇస్తే సహకరించేది లేదని వారంతా హెచ్చరిస్తున్నారు. డిమాండ్ ఇదే.. ఇటీవల కసిరెడ్డి నారాయణరెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పలు తీర్మానాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా జైపాల్‌యాదవ్‌కు ఈసారి సీటు ఇస్తే సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నారట. కసిరెడ్డికి సీటు ఇస్తే కలిసి పనిచేసి గెలిపిస్తామని.. ఆయనకు కాదంటే మరో బీసీ నాయకుడికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం జైపాల్‌యాదవ్‌కు సీటు ఇస్తే తమందరి తరపున స్వతంత్ర అభ్యర్దిని బరిలో దింపే యోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. గతంలో కూడ జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. టెన్షన్లో పార్టీ కేడర్.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇస్తామని సీఎం ప్రకటించటంతో ఈసారి తనకే వస్తుందనే ధీమాలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో ఉద్యమకాలం నుంచి పనిచేసిన గోలి శ్రీనివాస్‌రెడ్డి కూడ వనపర్తి సీటు కోరుతున్నారు. మొత్తంగా గులాబీ పార్టీలో నెలకొన్న వర్గపోరు కొంప ముంచేలా ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇది కూడా చదవండి: TS Election 2023: 'ఈవీఎం'లపై ఓటర్లకు అవగాహన తప్పనిసరి.. -
మంత్రి పదవిపై తండ్రి ఆశలు, అక్కడే ఉంది ట్విస్టు! కొడుకేమంటాడో?
రాజకీయ కుటుంబాల్లో సీటు పంచాయితీ కామనే. చాలా నియోజకవర్గాల్లో అన్న దమ్ముల మధ్య, కజిన్స్ మధ్య సీటు కోసం కుస్తీ పోటీలు జరుగుతుంటాయి. కాని ఓ నియోజకవర్గం కోసం తండ్రీ కొడుకులే కుస్తీ పట్లు పడుతున్నారు. ఇప్పుడిదే తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీటు త్యాగం చేయడానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని టాక్. వారి సంగతేంటో తెలుసుకుందా.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ తండ్రీ కొడుకుల పొలిటికల్ కుస్తీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ పీసీసీలో ముఖ్యులే. కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితులే. కాని సీటు కోసం అటు తండ్రి, ఇటు కొడుకు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ, టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్‌కుమార్ యాదవ్ ముషీరాబాద్ సీటు కోసం పోటీ పడుతున్నారట. రెండోసారి తప్పుకుంటే ఎలా.. అంజన్‌కుమార్ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలవగా, ఆయన తనయుడు అనిల్‌కుమార్ ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని అనిల్‌కుమార్ కోరుకుంటున్నారు. అయితే ఆయన తండ్రి కూడా తమకు పట్టున్న ముషీరాబాద్ నుంచే పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నారు. ఇక్కడే ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. తనకు రానున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తన కొడుకు అనిల్‌కుమార్‌ను డ్రాప్ చేసుకోవాలని అంజన్‌కుమార్ కోరుతున్నారు. అయితే అనిల్ మాత్రం ఒకసారి పోటీ చేసి రెండోసారి తప్పుకుంటే తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సారి పోటీ చేయకుంటే మళ్ళీ ఆ తర్వాత టిక్కెట్ రావడం కష్టమని అనిల్ భావిస్తున్నారట. అందుకే తన తండ్రిని ఎలాగైనా ఒప్పించి ఎలాగైనా ముషీరాబాద్ బరిలో నిలవాలని అనిల్ పట్టదలతో ఉన్నారు. అయితే తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారా అనే అనుమానం కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తండ్రీ కొడుకుల్లో ఎవరో ఒకరు త్యాగం చేసి తప్పుకోకపోతే.. ఇద్దరూ నష్టపోతారని హితవు చెబుతున్నారు అంజన్‌కుమార్ సన్నిహితులు. హైకమాండ్ కరుణిస్తే ఓకే లేదంటే.. కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన కాంగ్రెస్ హైకమాండ్ కచ్చితంగా అమలు చేస్తే ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్ పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఇద్దరికీ టిక్కెట్లు ఇస్తే చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకే సీటు కోసం తండ్రీ కొడుకులు పోటీ పడుతుండటం విచిత్రంగా ఉందని గాంధీభవన్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఒక్కరికే సీటిస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంజన్కుమార్యాదవ్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి తండ్రి కోసం కొడుకు సీటు త్యాగం చేస్తాడా? అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా ముషీరాబాద్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రీ కొడుకుల్లో ఎవరికైనా దక్కుతుందా? లేక పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా మూడో వ్యక్తికి ఇస్తారా అనేది చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
బీజేపీలోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి? మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నిర్మల్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల్లో సీట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ ఇస్తారో లేదోనని కొందరు, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓటమి తప్పదని మరికొందరు పార్టీలు మారుతుండటం సహజం. కానీ, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తున్నారనే సమాచారం మాత్రం పెద్ద వార్తే అవుతుంది. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కమలం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి తమ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని, ఆ మేరకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి. (మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!) నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన స్నేహితుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారన్నారు. కావాలంటే తనవద్ద రుజువులు ఉన్నాయన్నారు. బీజేపీలో చేరితే ఇంద్రకరణ్‌రెడ్డికి ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామన్నారు. కానీ, ఇతరులపై విమర్శలు చేయవద్దని మంత్రికి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఓటమి తప్పించుకోవడానికి మంత్రి దారులు వెతుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (అనాగరిక చర్య.. విచారకరం: మణిపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన) -
కేటీఆర్ ప్రకటనలు...!
-
80 సీట్లను బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుంది: మంత్రి ఎర్రబెల్లి
-
ఒక్క సీటుకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురి పోటీ? పార్టీ అలా చేస్తే మాత్రం ట్విస్టే!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అక్కడున్న జనరల్ సీట్లు కేవలం మూడే కావడంతో పోటీపడేవారు ఎక్కువయ్యారు. పార్టీలోని పోటీ తట్టకోవడమే కష్టంగా ఉంటే... ఇప్పుడు సీపీఐ నుంచి మరో ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంటా, బయటా జరిగే పోటీలో తమకు సీటు దక్కుతుందా లేదా అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆ సీటులో నేనే పోటీ చేస్తా.! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెరో ఐదు సీట్లు వచ్చాయి. వీటిలో కేవలం మూడే జనరల్ సీట్లు ఉండగా... కొత్తగూడెం జిల్లాలో అయితే ఒక్క కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కొత్తగూడెం సీటు కోసం టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే... ఇతర నాయకుల మధ్య పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలగం వెంకట్రావు పరాజయం చెందారు. గెలిచిన కొంతకాలానికే వనమా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారులో ప్రయాణం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే కొత్తగూడెం సీటు ఇస్తారని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్) సర్వేల్లో నా పేరే చెబుతున్నారు గత ఎన్నికల్లో వనమా మీద ఓడిన, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం టిఆర్ఎస్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉండటంతో గులాబీ బాస్ టికెట్ తనకే ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. వీరిద్దరితోపాటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాసరావు టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వారానికి రెండు రోజులు కొత్తగూడానికి కేటాయిస్తున్నారు. మరో రెండు నెలల తర్వాత కొత్తగూడెంలో ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. గడల శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందని ఆయన వర్గీయులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారట. దీంతో కొత్తగూడెం టిఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోందన్న గందరగోళంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుందా? ఇదిలా ఉంటే అసలు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు దాదాపు ఖరారు అయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖచ్చితంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్న చర్చ సైతం ఆసక్తికరంగా సాగుతోంది. టికెట్ ఇవ్వకపోతే జంప్ జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న కొత్తగూడెం గులాబీ నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ముగ్గురు నాయకులు కాంగ్రెస్, బిజేపి పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా లెక్కలు తేడా కొట్టినట్లు తెలిస్తే గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారట. ఒకవైపు గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూనే... రాకపోతే అన్న అనుమానంతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు. (చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన) -
తప్పని ఎన్నిక.. మునుగోడులో తొలి ఉపపోరు.. మొదటిసారి గెలిచిందెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా ఉపఎన్నిక జరుగనుంది. తాజామాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2018 వరకు ఈ నియోజకవర్గానికి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి (2014లో) టీఆర్ఎస్ గెలిచాయి. 1967కు ముందు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగం చిన్నకొండూరు, మిగిలిన ప్రాంతం నల్లగొండ నియోజకవర్గంలో ఉండేవి. మునుగోడు ప్రాంతం చిన్నకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1965లో ఒకసారి ఉపఎన్నిక జరిగింది. చిన్నకొండూరు నుంచి 1962 సాధారణ ఎన్నికల్లో సీసీఐ అభ్యర్థి కొండవీటి గురునాథరెడ్డి విజయం సాధించగా, ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీనేత, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ కోర్టు మూడేళ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీంతో 1965లో చిన్నకొండూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులే ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967, 1972, 1978, 1983, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఇక సీపీఐ అభ్యర్థులు ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1985, 1989లో, 1994లో ఉజ్జిని నారాయణరావు, 2004లో పల్లా వెంకట్‌రెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్‌రెడ్డిపై 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
ఇక్కడ సిట్టింగ్‌లు మాజీలే..!
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి ఎన్నికల్లో టికెట్ రాకపోవటమో, గెలవకపోవడమో జరుగుతుంది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన తదుపరి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిపోతూ వచ్చారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా కూడా చేశారు. వారు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే హోదాలో ఎన్నికలకు వెళితే ఓటమి కావాల్సిందే. ఈ అంశాలను నియోజకవర్గ చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అందులో తొలిసారిగా తమ్మిన పోతరాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో పోతరాజుపై సీనియర్ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత మరుపిళ్ల చిట్టిపై 1962 ఎన్నికల్లో పోతరాజు ఎన్నికయ్యారు. ఆయనపై మళ్లీ 1967 ఎన్నికల్లో మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఇలా ఆసిఫ్‌పాషా (1972), పోతిన చిన్నా (1978), బీఎస్ జయరాజు (1983), ఉప్పలపాటి రామచంద్రరాజు (1985), ఎంకే బేగ్ (1989), కె.సుబ్బరాజు (1994), జలీల్‌ఖాన్ (1999), షేక్ నాసర్‌వలీ (2004), వెలంపల్లి శ్రీనివాసరావు (2009), జలీల్‌ఖాన్ (2014) ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వరుసగా గెలిచిన చరిత్రలో లేదు. రెండు సార్లు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా ఈ నియోజకవర్గం లో ఓటమి పాలైన చరిత్ర కొనసాగుతూనే ఉంది. ఒకే పార్టీ వరుసగా గెలిచినా.. అభ్యర్థులు వేరు పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఒకే పార్టీ మూడు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అయితే మూడు సార్లు ముగ్గురు వేరువేరు అభ్యర్థులు నిలబడటంతో అక్కడ ఆ విజయం సాధ్యమైందని సీనియర్ నాయకులు చెబుతుంటారు. 1967 కాంగ్రెస్ పార్టీ నుంచి మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఆసిఫ్‌పాషా ఎన్నికయ్యారు. మూడో సారి అదే పార్టీ నుంచి 1978 ఎన్నికల్లో పోతిన చిన్నా ఎన్నికయ్యారు. ఒకే పార్టీ మూడు సార్లు గెలిచినా చరిత్ర ఈ నియోజకవర్గంలో అదే ఆఖరు. ఆ తరువాత ఒకే అభ్యర్థే కాకుండా పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. -
సిట్టింగులకే సీట్లు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని మెజారిటీ సీట్లలో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డికే సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పాణ్యం, నందికొట్కూరు సీట్ల విషయం మాత్రం ఇంకా తేలలేదు. పాణ్యంలో ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి పనితీరు బాగోలేకపోవడం.. నందికొట్కూరు ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి, గతంలో పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి మధ్య వైరుధ్యాల కారణంగా ఈ రెండు సీట్లను తేల్చలేదని తెలుస్తోంది. నంద్యాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఫరూక్ మాత్రం బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం. ప్రాథమికంగా నంద్యాల సీటు బ్రహ్మనందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరుకు కోట్ల సుజాతమ్మ, ఆదోని బుట్టారేణుక, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే సీట్లతో పాటు నంద్యాల ఎంపీ సీటును టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది. రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని... కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు. నంద్యాల ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇంకా తేలలేదు. మొదట్లో మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ సీటు తమకే కావాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టడంతో చంద్రబాబు కొత్త కొర్రీలను వేసినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని, సదరు మొత్తం డిపాజిట్‌ను తమకు చూపాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసీ రూ. 60 కోట్లు అడగడం ఏమిటని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. తాము అంత మొత్తం సమకూర్చుకోలేమనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొర్రీలు వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ఎంపీ సీటు ఇస్తామని చెబుతూనే ఎగ్గొట్టేందుకు ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఎవరినీ అడగకుండా తమను మాత్రమే డబ్బు గురించి అడగటం ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నేరుగా చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ విధంగా ఖర్చును భరించలేమన్న వారికి సీటు కేటాయిస్తున్నట్టు చెప్పి.. తమను మాత్రం ఎందుకు రూ.60 కోట్లు అడిగారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. -
వీడని ' సీటు' ముడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహేశ్వరం బీజేపీ టికెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పార్టీ అధినేత అమిత్‌షా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన జాబితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసినా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మహేశ్వరం టికెట్ రేసులో బీజేపీ జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నేతలు అందె శ్రీరాములు, ఎ.శంకర్‌రెడ్డి పోటీపడుతున్నారు. ఈ ముగ్గురి పేర్లను పరిశీలించిన అధినాయకత్వం బొక్క నర్సింహారెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా మూడో జాబి తాలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే, అనూహ్యంగా ఆయన పేరు నాలుగో జాబితాలో కూడా లేకపోవడం తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నర్సింహారెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడడానికి సంఘ్ పరివార్ జోక్యమేనని ప్రచారం జరుగుతోంది. శ్రీరాములును అభ్యర్థిగా ప్రకటించాలని సంఘ్ పెద్దలు ఒత్తిడి తెస్తుండడంతో టికెట్ అంశం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో మహేశ్వరం ఒకటి కావడం.. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బలీయంగా ఉండడం.. ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి వస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు నామినేషన్ల దాఖలుకు ఒక రోజే గడువు మిగిలి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సస్పెన్స్‌కు ముగింపు పలకాలని రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సీనియర్ నేత గంగాపురం కిషన్‌రెడ్డిని ఈ ఇరువురు ఆశావహులతో చర్చించి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ఆదేశించడంతో శనివారం రాత్రి ఇద్దరు నాయకులతో కిషన్‌రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. కరణం రాజీనామాతో.. వికారాబాద్ బీజేపీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు రాజీనామాతో పరిగి అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. ఈ నియోజకవర్గానికి ఇతర పార్టీ నుంచి బలమైన వ్యక్తిని బరిలో దించాలని అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో పరిగి సీటును ప్రకటించకుండా పక్కనపెట్టింది. మూడు జాబితాలు విడుదల చేసినా తన పేరు లేకపోవడంతో ప్రహ్లాదరావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న సదరు నేత.. ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప నిర్ణయం వెల్లడించే పరిస్థితి లేదు. దీంతో అనివార్యంగా కరణం వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. ఇదిలావుండగా, వికారాబాద్ టికెట్‌ను మాజీ పోలీస్ అధికారి సాయికృష్ణకు కేటాయించింది. -
టీఆర్ఎస్ సీటు నాదే.. గెలుపు నాదే..!
సాక్షి,హుజూర్నగర్ : నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదేనని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసోజు శంకరమ్మ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలకు అండగా ఉంటూ విశేషంగా కృషి చేశానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పట్ల ప్రజాదరణ పెరిగేలా చొరవ చూపడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్ విషయంలో తప్పక ఆలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో పార్టీలో కనీసం సభ్యత్వం లేని ఎన్ఆర్ఐ సైదిరెడ్డి తనకు టికెట్ వస్తుం దని, పార్టీ ఎన్నికల సామగ్రీ పంపిందని కార్యకర్తలకు చెపుతూ అయోమయానికి గురి చేస్తున్నాడన్నారు. అధిష్టానం ఎన్ఆర్ఐలకు టికెట్ కేటాయించాలనుకుంటే నియోజకవర్గానికి చెందిన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత అన్నెపురెడ్డి అప్పిరెడ్డికి టికెట్ కేటాయించాలని లేనిపక్షంలో సీనియర్ నాయకులు సాముల శివారెడ్డికి టికెట్ కేటాయించినా సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న సైదిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, ఎహెచ్‌ఆర్ ఫౌండేషన్ అధినేత అన్నెపురెడ్డి అప్పిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులున్నారు. -
ఎవరికో.. స్నేహ‘హస్తం’?!
పదిరోజుల్లో అభ్యర్థుల తొలిజాబితాను వెల్లడిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ.. అధిష్టానం మాత్రం అంతకంటే ముందుగానే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పదిరోజుల్లో అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ.కుంతియా ఈనెల 23న ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. నిన్నామొన్నటి పరిణామాలను పరిశీలిస్తే రెండు మూడు రోజుల ముందే తొలివిడత జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశావహులు, తొలి జాబితాలో పేర్లుండే అవకాశం ఉన్న నేతలకు అధిష్టానం నుంచి సంకేతాలు కూడా అందినట్లు సమాచారం. నవంబర్ 1 తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటించాలన్న నిర్ణయం మేరకు జిల్లా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు అందిన దరఖాస్తులపై పరిశీలన జరిపిన ఈరెండు కమిటీలు.. స్క్రీనింగ్ కమిటీకి పంపించినట్లు ఇదివరకే ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కూడా కసరత్తు పూర్తి చేయగా.. రాహుల్‌గాంధీ ఆమోదముద్రే తరువాయిగా మారింది. ఇదంతా ఒకటిరెండు రోజులు పూర్తి చేస్తే.. వచ్చేనెల ఒకటి తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి డీసీసీ, టీ పీసీసీలకు పోటాపోటీగా దరఖాస్తులు అందాయి. అన్ని స్థానాలకూ మూడు నుంచి 14 మంది వరకు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నుంచి 11 మంది, చొప్పదండి నుంచి 14, హుజూరాబాద్ నుంచి ఐదుగురు, మానకొండూరు నుంచి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు, సీనియర్ నేతలను దష్టిలో పెట్టుకుని ఇద్దరు, ముగ్గురి పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో ఇటీవల పార్టీలో చేరిన నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, చొప్పదండి నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి నుంచి 11, 14 మంది అభ్యర్థులు పార్టీ టికెటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వడబోత అనంతరం నియోజకవర్గానికి రెండు, మూడేసి పేర్ల చొప్పున జాబితాలో చేర్చినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి మూడు, మానకొండూర్ నుంచి రెండు పేర్లు పంపినా.. ఇక్కడ అభ్యర్థులుగా పొన్నం ప్రభాకర్, ఆరెపల్లి మోహన్ పేర్ల ప్రకటన లాంఛనమే అంటున్నారు. హుజూరాబాద్, చొప్పదండి నుంచి మాత్రం మూడేసి పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపినట్లు తెలిసింది. దసరా తర్వాత.. దీపావళికి ముందుగా అధికారికంగా అభ్యర్థులపై ప్రకటన ఉంటుందని ప్రకటించినా ఇప్పటికీ వెల్లడికాలేదు. అయితే మిత్రపక్షాలతో కాంగ్రెస్ «అధిష్టానం చర్చలు శనివారం సాయంత్రం కొలిక్కివచ్చిన నేపథ్యంలో నవంబర్ 1న, లేదా ఆ తర్వాత ప్రకటించేందుకు సిద్ధం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. మిత్రపక్షాల సీట్లపై ఇంకా పీటముడి ఉమ్మడి జిల్లాలో మహాకూటమికి ఐదుస్థానాలు కోరుతుండగా, మొదట కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్‌ను టీడీపీ, టీజేఎస్‌లు, కరీంనగర్ కోసం టీజేఎస్ గట్టిగా పట్టుబట్టాయి. హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి హుజూరాబాద్ నుంచి పోటీచేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. దీంతో ఇప్పుడా స్థానాన్ని పొత్తుల్లో భాగంగా తెలంగాణ జన సమితికి కేటాయించాలని పట్టుబడుతున్నారు. ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ముక్కెర రాజు కోసం టీజేఎస్ అడుగుతోంది. అదేవిధంగా కరీంనగర్ స్థానాన్ని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. నరహరి జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తూ.. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్ ధూంధాం పేరిట భారీ సదస్సు నిర్వహించిన జగ్గారెడ్డి.. టీజేఎస్ అధినేత కోదండరాంను మెప్పించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ స్థానంపైనా టీజేఎస్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరెండు స్థానాలపై ఇంకా ఏమీ తేలకపోగా మిత్రపక్షాల స్థానాల కేటాయింపు ఇంకా పీటముడిగానే ఉంది. నవంబర్1 లోగా వీటన్నింటిపై స్పష్టత రావడమే తరువాయి.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. దీపావళి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయంతో కసరత్తు వేగం పెంచిన కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఒకటిన లేదా ఆ తర్వాత ప్రకటించనుందన్న సమాచారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఎవరికి వారే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలలేదు... ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి... టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు... ఈ పరిస్థితిల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ముందస్తు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారే ‘పార్టీ టికెట్టు నాదే... పోటీ చేసేది నేనే’ అనే ధీమాతో ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని కొనసాగించే పనిలో పడ్డారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి కాంగ్రెస్ పార్టీ జెండాలతో ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. ఎవరికి వారే ‘టికెట్టు నాదే’ అని గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. మంచిర్యాలలో కొక్కిరాల... అరవింద్‌రెడ్డి మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు 2014 ఎన్నికల్లో సిర్పూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓటమి తరువాత భవిష్యత్తు రాజకీయానికి మంచిర్యాలను ఎన్నుకొన్నారు. అప్పటినుంచి మంచిర్యాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు నుంచి పోటీ చేసేది తానేనని పేర్కొంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండేళ్లుగా ప్రేంసాగర్‌రావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పథకాలకు పోటీగా సొంత ఖర్చుతో ప్రజలకు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా పేరిట పంపకాలు జరుపుతున్నారు. యువజన, మహిళా, కుల సంఘాలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. ఇక ప్రస్తుతం టికెట్టు తనదే అనే ధీమాతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుకు పోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సైతం టికెట్టు తనదే అనే ధీమాతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తనదే టికెట్టు అని స్పష్టం చేసిన ఆయన మండలాలలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎవరికి వారే తమ అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. సిర్పూరు ప్రచారంలో హరీష్‌బాబు ముందంజ సిర్పూరు మాజీ ఎమ్మెల్యే, దివంగత పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌బాబు ఆరునెలల ముందు నుంచే ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించి ప్రచారం ప్రారంభించిన హరీష్‌బాబు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు రెండు నెలల క్రితం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి కాంగ్రెస్ కండువాలతో గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు ధీటుగా హరీష్ ప్రచారాన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. కాగా ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్న రావి శ్రీనివాస్ కూడా తన వర్గాన్ని ప్రచారంలోకి దింపారు. ఇటీవల రాహుల్‌గాంధీ భైంసా బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరిపిన రావి శ్రీనివాస్ టికెట్టు తనకేనని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకు టికెట్టు ఖాయమనే చెప్పుకుంటుండం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీసీ కార్డుతో శ్రీనివాస్‌యాదవ్ సైతం టికెట్టు వేటలో ఉండడం గమనార్హం. చెన్నూరులో వెంకటేష్ నేత... బోడ జనార్దన్ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరైన ఓ నేత సిఫారసుతో గ్రూపు1 అధికారిగా రాజీనామా చేసిన బోర్లకుంట వెంకటేష్ నేత ఇప్పటికే కాంగ్రెస్ కండువాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తి నాయకులను దరికి చేర్చుకుంటూ తానే అభ్యర్థిగా ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ధీటుగా ప్రచారం సాగిస్తున్న వెంకటేష్ నేత తనకే టికెట్టు ఖాయమని చెప్పుకుంటున్నారు. కాగా నియోజకవర ్గంలో సీనియర్ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్ధన్ కూడా కాంగ్రెస్ టికెట్టు తనకే నన్న ధీమాతో ఉన్నారు. ఆయన తనదైన శైలిలో గ్రామాలు, మండలాలకు చెందిన పాత తెలుగుదేశం నాయకులను కలుస్తూ , కాంగ్రెస్ టికెట్టు తనకే వస్తుందని చెప్పుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ముక్కోణపు పోటీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్‌పాండేల మధ్య టికెట్టు కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. పాత తరం నాయకుడిగా రామచంద్రారెడ్డి చివరి అవకాశంగా తనకు టికెట్టు ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించి తన వంతు ప్రచారం సాగిస్తున్నారు. మంత్రి జోగు రామన్నను ఢీకొని నిలబడేది తానే అంటూ రామన్న సామాజిక వర్గానికి చెందిన గండ్రత్ సుజాత టికెట్టు వేటలో ఉన్నారు. ఆమె తన ప్రచారాన్ని మండలాల స్థాయిలో ఇప్పటికే ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. యువ నాయకుడు , గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భార్గవ్ దేశ్‌పాండే డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండదండలతో తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముథోల్‌లో పటేల్‌ల మధ్య పోటీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు సోదరుడి వరుసైన రామారావు పటేల్ మధ్య ముథోల్ సీటు దోబూచులాడుతోంది. ఇటీవలి రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయడంలో ఇద్దరు నేతలు కష్టపడ్డా, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామారావు పటేల్ ప్రధాన పాత్ర పోషించారు. ఎవరికి వారే తమ అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ ముథోల్ నుంచి సీటు తెచ్చుకొనే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. రాహుల్‌గాంధీ సభలో బల ప్రదర్శనకు కోసం ఇద్దరు నాయకులు కష్టపడ్డారు. బెల్లంపల్లి చిలుముల శంకర్‌తో పాటు టికెట్టు ఆశిస్తున్న శారద ప్రచారం నిర్వహిస్తుండగా, అధిష్టానం ఆశీస్సులతో గద్దరు తనయుడు సూర్యకిరణ్ సీటు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. బోథ్‌లో నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి అనిల్ జాదవ్ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అండదండలతో ప్రచారం సాగిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ద్వారా టికెట్టు పొందా లని భావిస్తున్నారు. వీరిద్దరు ఎవరికి వారు ని యోజకవర్గంలో ప్రజల వద్దకు వెళుతున్నారు. ఖానాపూర్‌లో టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ రాథోడ్ రమేష్ కాంగ్రెస్‌లో చేరి పాత సంబంధాలతో ప్రచారం జరుపుతున్నారు. టికెట్టు కోసమే కాంగ్రెస్‌లో చేరినట్టు చెపుతున్న ఆయన పోటీలో నిలిచేది తానే అనే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన హరినాయక్, ఇటీవల పార్టీలో చేరిన చారులతతో పాటు మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా టికెట్టు రేసులో తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరికి వారే తమకే టికెట్టు ఖాయమనే ధోరణిలో ఉండడం గమనార్హం. టికెట్ రాకుంటే రెబల్గానే..! మంచిర్యాలలో టికెట్టు రేసులో ఉన్న ప్రేంసాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలలో ఎవరికి టికెట్టు రాకపోయినా, ఇండిపెండెంట్‌గా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. చెన్నూరులో వెంకటేష్ నేతకు టికెట్టు ఇస్తే బీఎస్పీ లేదా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే ఆలోచనలో బోడ జనార్ధన్ ఉన్నట్లు సమాచారం. సిర్పూరులో ఇండిపెండెంట్‌గానే పోటీ చేయాలని భావించి బరిలోకి దిగిన హరీష్‌బాబు ఒకవేళ సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గానే బరిలో ఉండడం ఖాయం. హరీష్‌కు సీటొస్తే రావి శ్రీనివాస్ కూడా పోటీలో ఉంటారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బోథ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సోయం బాపూరావు ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని ప్రకటించారు. ఖానాపూర్‌లో కూడా టికెట్టు రాని వారిలో ఒకరైనా రెబల్‌గా నిలబడే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో టికెట్టు రానివారు రెబల్స్‌గా పోటీ చేయకపోయినా, ప్రత్యర్థి శిబిరాలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ల ప్రకటన తరువాత తమకు నియోజకవర్గాల్లో అనుకూలత పెరుగుతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు యోచిస్తున్నారు. -
చోటు దక్కేదెవరికో ?
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు కావొస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన బీజేపీ మాత్రం శనివారం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతుంది. ఇందులో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తొలి జాబితాలో చోటు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా చర్చ సాగుతోంది. పరకాల, వర్ధన్నపేటపై ప్రత్యేక దృష్టి.. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు బీజేపీ, ఒక సారి జనతా పార్టీ గెలుపొం దింది. జనతా పార్టీ తరఫున 1978లో మాచర్ల జగన్నాథం 4 వేల ఓట్ల మెజార్టీ తో, బీజేపీ తరఫున 1985లో వన్నాల శ్రీరాములు 14 వేల మెజార్టీతో, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్ రావు 10 వేల మెజార్టీ తో గెలుపొందారు. రెండు సార్లు బీజేపీ, టీడీపీ పొత్తుతో టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరకాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనసంఘ్ పార్టీలు దక్కించుకున్నాయి. 1967లో భారతీయ జనసంఘ్ తరఫున చందుపట్ల జంగారెడ్డి పోటీ చేసి 3 వేల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి ఒంటేరు జయపాల్ 1985లో 17 వేల ఓట్ల మెజార్టీ తో, 1989లో 2,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తుతో పరకాల నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించారు. టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో గతంలో గెలుపొందామనే దృష్టితో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బ న్(శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిష న్) పథకం కింద పర్వతగిరి మండలంను గతంలోనే ఎంపిక చేశారు. మండలాన్నిరూ.135 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రత్యేకంగా కేటాయిస్తోంది. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఇటీవల బీజేపీ బస్సు యాత్రను సైతం నిర్వహించింది. పరకాలలో బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తోపాటు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు. మండల అధ్యక్షుల అభిప్రాయ సేకరణ.. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్, మహా కూటమి అభ్యర్థులకు దీటుగా బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆయా వర్గాల అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రాధాన్యమిచ్చే అంశాలను పరిశీలిస్తోంది. ఈ నెల 3న జిల్లాలోని మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను, జిల్లా నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ సేకరించింది. పరకాల నియోజకవర్గం నుంచి డాక్టర్ పెస రు విజయచందర్ రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పెసరు విజయచందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పంచాయతీ రాజ్ రిటైర్డ్ ఎస్ఈ కొత్త సారంగరావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి వరంగల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ఆశిస్తున్నారు. తొలి జాబితాను 30 మంది అభ్యర్థులతో బీజేపీ పార్లమెంటరీ కమిటీ ముందు రాష్ట్ర కమిటీ పెట్టింది. శనివారం విడుదల చేయనున్న ఈ జాబితాలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో చోటు ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. -
అయోమయంలో కాంగ్రెస్ ఆశావహులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఒకవైపు మహాకూటమి పొత్తులు.. మరోవైపు టికెట్ల హామీతో ఇతర పార్టీలనుంచి హస్తం గూటికి చేరిన నాయకులు.. ఇంకోవైపు సిట్టింగ్ స్థానాలు.. సీనియర్ల నియోజకవర్గాలు.. ఇలా, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాము కానుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల వేళ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు కొంత అయో మయంలో పడ్డారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకే కుటుంబంనుంచి రెండు టికెట్ల పీటముడి మరింత గట్టిపడుతోంది. మహాకూటమి గట్టాక, మిత్రులు కోరుతున్న స్థానాల్లో ఏకపక్షంగా అప్పుడే పార్టీ నాయకులు తామే అభ్యర్థులమని ఎలా ప్రచారం చేస్తారన్న భాగస్వామ్య పక్షాల అసంతృప్తి.. వెరసి కాంగ్రెస్ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడినట్లే కనిపిస్తోంది. పార్టీ సీనియర్లు, సిట్టింగులు ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఏదో ఒక సమస్య, లేదంటే మరేదో లింకు ఉన్నవే కావడం గమనార్హం. టికెట్ హామీ అంతే సంగతులా ! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని పదే పదే చెప్పుకున్నా.. ఆ క్రెడిట్‌ను ఓట్లుగా మలుచుకోలేక గత ఎన్నికల్లో బొక్కా బోర్ల పడిన కాంగ్రెస్ జిల్లాలో మాత్రం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. తమ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఐని దేవరకొండలో గెలిపించుకుంది. అంటే 12 స్థానాల్లో ఆరు చోట్ల గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈసారి అధికారంలోకి రావాలంటే ఒక్కో సీటు ఎంతో విలువైనదిగా భావించడంతో ఇతర రాజకీయ పక్షాల నుంచి సీనియర్లను, గత ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన వారిని పార్టీలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలోనే టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్ దేవరకొండనుంచి, సూర్యాపేటనుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్ రమేష్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరూ రేవంత్‌రెడ్డి వెంట ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ సమయంలోనే వీరికి టికెట్ హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. మరోవైపు టీఆర్ఎస్లో అవకాశం రాకపోవడంతో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ తిరిగి కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. ఆయన కూడా కాంగ్రెస్ పెద్దల దగ్గర టికెట్ హామీ తీసుకున్న తర్వాతే పార్టీ మారారని అంటున్నారు. వీరంతా బయటి పార్టీల్లో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పార్టీ బరువు బాధ్యతలు చూసిన జగన్‌లాల్ నాయక్ టికెట్‌పై ఆశపెట్టుకున్నారు. మహా కూటమి పొత్తులో భాగంగా సీపీఐ మరోసారి దేవరకొండను కోరుకుంటోంది. ఈ పరిస్థితుల్లో దేవరకొండ టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక, సూర్యాపేటలోనూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.దామోదర్ రెడ్డి టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ హామీతోనే పార్టీలో చేరిన పటేల్ రమేష్‌రెడ్డికి అవకాశం దక్కుతుందా..? లేదా..? లేకుంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో పీటముడులు ! సుదీర్ఘ కాలంగా తామే ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడును ఈసారి కూడా కోరుతున్నామని, పొత్తుల్లో భాగంగా స్థానాల కేటాయింపు ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ నాయకులు ఏకపక్షంగా ఎలా ప్రచారం చేస్తారని మహాకూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ మండిపడుతోంది. ఈ నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయడాన్ని సీపీఐ ఆక్షేపిస్తోంది. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ తనకు టికెట్ పక్కా అన్న ధీమాతో ఉన్నారు. కానీ, సీపీఐ ఈ స్థానాన్ని కూడా ఆశిస్తోంది. ఈ లెక్క తేలకుండా టికెట్లు ఖరారు కాకుండా ప్రచారం ఎలా చేస్తారన్న ప్రశ్న సీపీఐ నుంచి వస్తోంది. పొత్తుల వల్ల ఇరకాటంలో పడిన మరో నియోజకవర్గం నకిరేకల్. ఈ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ, టీడీపీ ఆశిస్తున్నాయి. కానీ, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఇక, మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భాస్కర్ రావు టీఆర్ఎస్లో చేరడం, ఈ సారి గులాబీ పార్టీ తరఫునే అభ్యర్థిగా నిలబడడంతో ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారన్న ప్రశ్న ఆసక్తిరేపుతోంది. జానారెడ్డి ఇక్కడికి మారుతారని జరిగిన ప్రచారానికి ఆయన తెరదించారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై అవునని కానీ, కాదని కానీ స్పష్టత ఇచ్చిన వారు లేరు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోతోంది. తుంగతుర్తి, భువనరిగిలో ముగ్గురు చొప్పున పోటీ దారులు ఉండడంతో.. అభ్యర్థులు ఖరారు కాక, ప్రచారం మొదలు పెట్టే అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అసెంబ్లీ బరిలో జైపాల్‌రెడ్డి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు జైపాల్‌రెడ్డి స్వయంగా ఫోన్లు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం అంటే 1985కు ముందు అసెంబ్లీకి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఢిల్లీ బాట పట్టారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వంలోనే కాకుండా యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో కీలకమైన మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. పార్లమెంట్ ఎన్నికలు లేకపోవడంతో సీనియర్లందరూ అసెంబ్లీ బరిలో ఉండాలని అధిష్టానం సూచిస్తోంది. కల్వకుర్తిలో జైపాల్‌రెడ్డికి మొదటి నుంచీ కొంత వర్గం ఉంది. గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కొందరు స్థానిక నేతలు తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో నడిచేందుకు ససేమిరా అంటుండటంతో ‘అభ్యర్థి ఎవరనేది విడిచిపెట్టండి. మనం ఎమ్మెల్యే సీటు గెలవాలి. ఎందుకంటే సీఎం రేసులో నేనే ఉన్నా. మిమ్మల్ని నేను చూసుకుంటా’ అంటూ జైపాల్‌రెడ్డి ఫోన్లు చేస్తుండడం చర్చనీయాంశమైంది. -
తారస్థాయికి..అసమ్మతి రాగం!
మిర్యాలగూడ నియోజకవర్గంలో బుధవారం అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి భారీ ర్యాలీ.. నార్కట్‌పల్లిలో దుబ్బాక నర్సింహారెడ్డి, మరికొందరు నేతలతో కలిసి సన్నాహక సమావేశం.. మునుగోడులో వేనేపల్లి వెంకటేశ్వరరావు, నాగార్జునసాగర్‌లో ఎంసీ కోటిరెడ్డి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు.. ఇదీ.. జిల్లాలో రెండు, మూడు రోజులుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన టీఆర్ఎస్ అసమ్మతి నేతల హడావుడి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్లో రోజు రోజుకూ పెరిగిపోతున్న అసమ్మతి రాజకీయం ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పది స్థానాలకు టికెట్లను ఖరారు చేశారు. నల్లగొండలో కొత్తగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న కంచర్ల భూపాల్‌రెడ్డిని మినహాయిస్తే మిగిలిన తొమ్మిది స్థానాల్లో ఎని మిది మంది సిట్టింగులే ఉన్నారు. నాగార్జునసాగర్‌లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇన్చార్జి నోముల నర్సింహయ్యకే టికెట్ ఇచ్చారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల ఖరారు పెండింగులో ఉంది. కాగా, ఈ స్థానాల్లో వేనేపల్లి చం దర్రావు, శంకరమ్మ పేర్లనే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టికె ట్లు ప్రకటించిన నియోజకవర్గాల్లో సగానికి సగం స్థానాల్లో అసమ్మతి రాజకీయాలు నడవడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. టికెట్లు ప్రకటించిన మరుసటి రోజు నుం చే దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, తుంగతుర్తి, నల్లగొండ, మిర్యాలగూడలో అసమ్మతి నేతల రాగాలు మొదలయ్యాయి. దేవరకొండకు చెందిన జెడ్పీ చైర్మన్ బాలూ నాయక్ తన దగ్గరి నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యి సమాలోచనలు జరిపారు. నాగార్జున సాగర్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో తేరా చిన్నపరెడ్డి ఇంటిలో భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకు హాలియా మార్కెట్ యార్డులో నోముల నర్సిం హయ్య అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెద్ద సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గం లోని మెజారిటీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా ముం దుకు వచ్చి స్థానికేతరుడైన నోములకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒక వేళ బీసీ కోణంలో ఆలోచిస్తే, నియోజకవర్గంలోనే సమర్థులైన బీసీ నేతలు ఉన్నారని, వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హాలియా సమావేశంలో తీర్మానించారు. ఇక, మిర్యాలగూడలో ఆ పార్టీ సీనియర్ నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం భాస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. బుధవారం ఆయన ర్యాలీ నిర్వహించడమే కాకుండా సమావేశం కూడా జరిపి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తుంగతుర్తిలో అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్‌ను స్థానికేతరుడని పక్కన పెట్టాలన్న డి మాండ్‌తో అసమ్మతి సమావేశం జరిగింది. మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వీరంతా ఇప్పటికే హైదరాబా ద్లో సమావేశమై చర్చించారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి పార్టీ సీనియర్లనుంచి సహా య నిరాకరణ మొదలైంది. ఆయనకు కాకుండా, సీని యర్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ మారు చకిలం అనిల్‌కుమార్ సమావేశం జరిపి తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. ఏడాది కిందటి దాకా ఇన్చార్జ్గా వ్యవహరించిన దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో బుధవారం నార్కట్‌పల్లిలో సన్నాహక సమావేశం జరిపారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎన్జీ కాలేజీ మైదానంలో అసమ్మతి సభ జరపాలని నిర్ణయించారు. నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందునుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను గౌరవించి టికెట్ ఇవ్వాలన్నది అసమ్మతి నేతల డిమాండ్‌గా ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయం జోరుగా సాగుతోంది. తారస్థాయికి..అసమ్మతి రాగం! -
లోక్‌సభ నుంచి శాసనసభకు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు ఫుల్లు గిరాకీ ఏర్పడింది. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన చాలా మంది నేతలు ఈసారి అసెంబ్లీ సీట్లపై కన్నేశారు. ఈసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభకు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచనతోనే తమ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడినా మళ్లీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌సభ బరిలో ఉండవచ్చనే ఆశతో ఆయా నేతలు ఇప్పుడు శాసన సభ సీట్లపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. చూద్దాం... ఓసారి... అయితే, గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది నేతలు అసెంబ్లీ సీట్లపై దృష్టి సారించారు. వీరిలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన సర్వే సత్యనారాయణ ముందున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చిన పక్షంలో తాను అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కంటోన్మెంట్ (ఎస్సీ) సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ సీటును తొలుత సర్వే అల్లుడు క్రిశాంక్‌కు కేటాయించి చివరి క్షణంలో మార్పు చేశారు. ఈ సారి కూడా క్రిశాంక్ పేరే ఇప్పటివరకు వినిపించినా.. తాజాగా సర్వే పేరు బలంగా తెరపైకి వస్తుండటం గమనార్హం. నల్లగొండ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానంపై పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇదే కోవలోకరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. అయితే, తాను లోక్‌సభకే పోటీచేస్తానని అంటున్నా.. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలుత వేములవాడ నుంచి బరిలో ఉంటారని భావించినా.. అక్కడి నుంచి ఆది శ్రీనివాస్, కొనగాల మహేశ్ సీటు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మహేశ్ రాష్ట్రస్థాయితో పాటు తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో సీటు తనకే వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, అసెంబ్లీ బరిలో దిగాల్చి వచ్చినా వేములవాడ నుంచి పోటీ చేయనని పొన్నం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనివార్యమైతే కరీంనగర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉండవచ్చని సమాచారం. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈయనకు ఈ సీటు దాదాపు ఖరారయిందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సెటిలర్ల దగ్గరా.. ఖమ్మం ఖిల్లా మీదా.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు కూడా అసెంబ్లీ జాబితాలోకి వచ్చి చేరింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గంలో ఆమెను నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఖమ్మం అసెంబ్లీ బరి నుంచి కూడా ఆమె రంగంలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న సురేశ్‌షెట్కార్ ఈసారి నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరితో పాటు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన మరో ముగ్గురు, నలుగురు నేతలు కూడా అసెంబ్లీ స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. -
ఇది మీకు... అది మాకు !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముందస్తు ఎన్నికలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరి కంటే ముందే సీట్ల ప్రకటించిన టీఆర్ఎస్ ఇప్పటికే అసమ్మతి పోరుతో సతమతమవుతోంది. మరోవైపు బలమైన టీఆర్ఎస్ను ఢీ కొట్టేందుకు విపక్ష పార్టీలన్ని కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేసీ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అందుకు అనుగుణంగా పాలమూరు ప్రాంతంలో టీడీపీ మూడు స్థానాలు, తెలంగాణ జన సమితి ఒక స్థా నం కోసం పట్టుబడుతున్నాయి. అయితే రాజకీ య సమీకరణాలు, పార్టీల బలాబలాల నేపథ్యం లో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నా యి. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికి, ఎక్కడెక్కడ సీ ట్లు కేటాయించాలనే విషయంలో మహాకూట మిలోని పార్టీలు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే, ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. పాలమూరుపైనే అన్ని పార్టీల కన్ను ఈసారి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పాలమూరు ప్రాంతం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్లు పాలమూరు అంశాన్ని ప్రస్తావించారు. ప్రగతి నివేదన సభతో పాటు పలు వేదికలపై పాలమూరు అభివృద్ధిని చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ స్థానాలు గెలుపొందాలని గులాబీ దళపతి వ్యూహ రచన చేస్తున్నారు. అలాగే పాలమూరులో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి భారీ ఆశలు పెట్టుంది. మెజారిటీ స్థానాలు గెలుపొంది టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే కాస్త బలమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీతో పాటు ఉద్యమ నేపథ్యం కలిగిన కోదండరాం నేతృత్వంలోని టీజేసీ, సీపీఐలను కూడా కలుపుకొని పోటీలో నిలవాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టింది. సీట్ల విషయంలో తకరారు మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తూనే... కాస్త బలం కలిగిన టీడీపీకి కూడా అవకాశం కల్పించాలని భావిస్తోంది. అదే విధంగా పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి కూడా ఉమ్మడి జిల్లాలో ఒక స్థానం కేటాయించాలని పట్టుబడుతోంది. ఇది వరకే పలుమార్లు సాగిన ప్రాథమిక చర్చల్లో భాగంగా సీట్ల విషయంలో కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఐదు స్థానాలను సిట్టింగ్‌లకే కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గద్వాల నుంచి డీకే.అరుణ, అలంపూర్ నుంచి సంపత్‌కుమార్, వనపర్తి నుంచి జి.చిన్నారెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, కొడంగల్ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డికి బెర్తులు ఖరారు చేశారు. మిగిలిన సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం పాలమూరు జిల్లాలోనే మూడు సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కోసం జడ్చర్ల, పార్టీ ముఖ్యనేత మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోసం వనపర్తి, మరో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కోసం మక్తల్ స్థానాలను పట్టుబడుతోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని రాజేందర్‌రెడ్డి కోసం కోరుతోంది. ఇలా మొత్తం మీద సీట్ల విషయంలోనే తకరారు నెలకొంది. పట్టున్న స్థానాలే ఇవ్వండి... కూటమి పొత్తులో భాగంగా టీడీపీ, టీజేసీలు తమకు ఆయా ప్రాంతాల్లో బలమైన పట్టుతో పాటు ఓటు బ్యాంకు ఉన్నట్లు కాంగ్రెస్ ముందు లెక్కలు ఉంచాయి. జడ్చర్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎర్ర శేఖర్ గెలవడంతో పాటు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు జడ్చర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు దశాబ్దాల కాలంలో ఒక్క ఉప ఎన్నికల్లో మినహా మరే ఇతర ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పొత్తులో భాగంగా ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల స్థానం కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే వనపర్తి విషయంలో మాత్రం ఎలాంటి పేచీ ఉండటం లేదని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి పొత్తులో భాగంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించేందుకు సిద్ధమేనని తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి చెబుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు వనపర్తి చరిత్రలో వరుసగా రెండు సార్లు ఏ ఒక్క ప్రజాప్రతినిధి గెలిచిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తన మిత్రుడు రావుల పోటీ చేసే అవకాశం వస్తే స్వచ్ఛందంగా పక్కకు తప్పుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే, మక్తల్ నియోజకవర్గం విషయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే మక్తల్‌లో కాంగ్రెస్‌కు ఇన్‌చార్జ్‌లెవరూ లేకపోవడంతో పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి... మహబూబ్‌నగర్ పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో పోటీ చేయాలని భావిస్తోంది. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో టీజేసీ పార్టీని బలోపేతం చేయడం కోసం రాజేందర్‌రెడ్డి గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ స్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా పొత్తులు కలిసినా.. సీట్ల కోసం ఎవరి బలాలు వారు ప్రదర్శిస్తుండడండంతో కొంత అస్పష్టత నెలకొన్నా.. రేపో, మాపో స్ఫష్టత వచ్చే అవకాశముందని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నారు. -
గులాబీ ముల్లు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల కోసం శాసనసభను రద్దు చేసిన నాడే ఉమ్మడి జిల్లాలో పది మంది పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గులాబీ దళపతిని అసంతృప్తి రాగాలు వెంటాడుతూనే ఉన్నాయి. పది మంది అభ్యర్థుల్లో తొమ్మిది మందిని సిట్టింగ్‌లను ఎంపిక చేసి చెన్నూర్‌లో మాత్రం విప్‌గా సేవలందించిన నల్లాల ఓదెలును మార్చి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన నాయకులు తీరా చోటుచేసుకున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. బాహాటంగానే తమ నిరసన వ్యక్తం చేసిన వారు కొందరైతే... చాపకింది నీరులా అసంతృప్తిని వెళ్లగక్కుతూ ప్లాట్ఫారం తయారు చేసుకుంటున్న వారు మరికొందరు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన స్వీయ గృహ నిర్బంధం ఎపిసోడ్‌తో అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లయింది. ఓదెలును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించుకోవడంతో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీలోని ఇతర నాయకులు, రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చెన్నూర్‌పై పట్టు పడుతున్న ఓదెలు చెన్నూర్‌లో 2009 నుంచి మూడుసార్లు విజయం సాధించిన నల్లాల ఓదెలు ఈసారి కూడా తనకు టిక్కెట్టు ఖాయమనే ధీమాతోనే ఉండేవారు. తనకు ప్రమాదం పొంచి ఉందంటే మాజీ మంత్రి గడ్డం వినోద్కుమార్తోనే నని భావించేవారు. అయితే మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీటివ్వాల్సిన అనివార్య పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్‌కు ప్రత్యామ్నాయం చూపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో గత 6వ తేదీన విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆ యనకు చెన్నూర్ అసెంబ్లీ సీటును కేటాయించారు. ఇది ఓదెలుకు పెద్ద దెబ్బ. తనకు టికెట్టు రాలేదని తెలియగానే హైదరాబాద్ వెళ్లిన ఓదెలు రెండురోజుల పాటు మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఓదెలు నివాసానికి వెళ్లి కలిసిన సుమన్ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తనకే సీటు వస్తుందనే ధీమాను వ్యక్తం చేసిన ఓదెలు,,, సీఎంతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరుసటి రోజు మందమర్రికి వచ్చిన ఆయన సు మన్పై విమర్శలకు పదును పెట్టారు. ఇక మంగళవారం ఏకంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా ముఖ్యమంత్రి ఓదెలుకు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని ఆహ్వానించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. ముథోల్‌లో ముసలం పుట్టించిన వేణుగోపాలాచారి ముధోల్‌లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సముద్రాల వేణుగోపాలాచారి నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. అయితే ఆయనకు ముధోల్‌ను వదులుకోవడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్లో చేరిన విఠల్‌రెడ్డికే మరోసారి టిక్కెట్టు ఖరారైంది. ఈ క్రమంలో రెండురోజుల క్రితం భైంసా వచ్చిన వేణుగోపాలాచారి తన అనుచరులు, అనుయాయులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చిన విషయాన్ని పునరాలోచించాలని ఆయన అనుచరులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందనే రీతిలో స్పందించారు. దీంతో ముధోల్‌లో కూడా ముసలం పుట్టినట్లయింది. బోథ్‌లో గళం విప్పిన ఆదివాసీ నాయకులు బోథ్‌లో పోటీ చేయాలని భావించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఆశలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు చల్లారు. ఆదివాసీలు బలమైన శక్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో లంబాడా వర్గానికి చెందిన సిట్టింగ్ బాపూరావు రాథోడ్‌కు సీటివ్వడాన్ని నగేష్, ఆయన అనుయాయులు జీర్ణించుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు తన వర్గీయులతో సమావేశమైన నగేష్ ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆదివాసీ సంఘాల నాయకులు నగేష్‌కు మద్ధతుగా గళం విప్పారు. బో«థ్ నుంచి లంబాడాకి సీటిస్తే తాము వ్యతిరేకిస్తామని తెగేసి చెప్పారు. ఇచ్చోడలో ప్రారంభమైన ఈ వ్యతిరేక గళాలు బుధవారం నుంచి అన్ని మండలాలకు వ్యాపిస్తాయనడంలో సందేహం లేదు. ఖానాపూర్‌లో రాథోడ్ రణభేరి అసెంబ్లీ సీటు హామీతోనే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన రమేష్ రాథోడ్ సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కే సీటివ్వడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. స్థానిక నినాదాన్ని తీసుకొచ్చిన ఆయన రేఖా నాయక్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్‌ను కూడా వదలలేదు. టికెట్టు ఇవ్వకపోయినా , ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు. ఖానాపూర్ తన జాగీరుగా ప్రకటించుకున్న రమేష్ రాథోడ్ స్థానికేతరులను తరిమికొట్టనున్నట్ల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ రమేష్ రాథోడ్ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గులాబీ గూటిలో గుబులు పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన స్థానాల్లో అంతర్గత ముసలం మొదలవడం పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. చెన్నూర్‌లో ఓదెలు ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని పార్టీ వర్గాలే ఆందళన వ్యక్తం చేస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓదెలు వెంట ఎంఆర్పీఎస్ ఉండడం, నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగానే ఉండడం కలవరపరిచే అంశమే. బోథ్‌లో ఆదివాసీ అంశాన్ని తెరపైకి తేవడం పక్కా ప్రణాళికలో భాగమే. బోథ్‌లో నగేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఇక్కడ ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండడంతో అదే వర్గానికి చెందిన నగేష్‌కు సీటిస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. బాపూరావు రాథోడ్‌కు ఆదివాసీ వర్గం దూరంగా ఉండడం నిర్వివాదాంశం. ముథోల్‌లో వేణుగోపాలాచారి రంగప్రవేశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. వేణుగోపాలాచారి 2014లో ఓడిపోయిన తరువాత ఈ నియోజకవర్గం గురించి పట్టించుకోవడం ఆయనకు మైనస్. మంచిర్యాలలో బీసీ నాయకుడు బేర సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండగా, టికెట్లు ఆశించిన ముఖ్య నాయకులు అభ్యర్థి దివాకర్‌రావు వెంట కనిపించకపోవడం గమనార్హం.