mortuary
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
మృతదేహాలతో.. వ్యాపారం ? ..
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అనాథ శవాలే అక్కడి కొందరు సిబ్బందికి ఆదాయ వనరులుగా మారాయి. ఏలూరు జీజీహెచ్‌లో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అవినీతి బాగోతం బహిర్గతమైంది. పదిరోజుల కిత్రం జరిగిన ఓ ఘటనతో తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు..మార్చురీలో సాగుతున్న అక్రమ శవాల వ్యాపారం వెలుగులోకి వచి్చంది. ఈ ఆసుపత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా 8–10 అనాథ శవాలను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో శవాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు వరకూ విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్‌లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. దీనిపై ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి ఎన్ని అనాథ శవాలు పోస్టుమార్టం నిమిత్తం వచ్చాయి ?అనాథ శవాలను ఎవరైనా బంధువులకు ఇచ్చారా ? శవాలను పూడ్చిపెట్టారా ? లేక దహనం సంస్కరాలు చేశారా... ఇలా పలు అంశాలపై విచారణ చేపడుతున్నారు. -
AP: ఇంత నిర్లక్ష్యమా?.. మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలించగా, వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు ఉండగా, రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే కుటుంబీలు నిరీక్షిస్తున్నారు. పోస్టు మార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు అధికారులు, పోలీసులు జాప్యం చేస్తున్నారు.కాగా, బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!
అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలకు పాతర! పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ రూ. 2,000–2,500 మ«ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుర్రె, ఎముకల విక్రయం! అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మరో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మరోౖవెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లేకున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమన్వయంతో అంత్యక్రియలు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొప్పున జీహెచ్ఎంíసీ సిబ్బంది తీసుకెళ్తున్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు గుర్తుతెలియని వ్యక్తిని అనాథ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రామాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్ఎంసీకి అప్పగించింది. – డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి తరలింపులో కొన్నిసార్లు జాప్యం అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జాప్యం లేదు.. 3 అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ముకుందరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్ -
నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..దాదాపు 12 గంటలు తర్వాత...
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. సాక్షి, బంజారాహిల్స్: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి. కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు. రోడ్డుపైన, ఫుట్‌పాత్‌పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. (చదవండి: ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..) -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన.. వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
-
ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. చాదర్‌ఘాట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. -
సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదేమో!.. చనిపోయి మళ్లీ బతికాడు.. వీడియో వైరల్
లక్నో: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతకడం లాంటివి సినిమాలో చూసుంటాం. కానీ ఈ తరహా ఘటనే యూపీలోని మోరదాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయాడనుకుని సుమారు 7 గంటలపాటు మార్చురీ ఉంచిన్నప్పటికీ సజీవంగా బతికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్ పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ శ్రీకేష్ కుమార్ (40) పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వేగంగా వస్తున్న బైక్ ఢీకొనడంతో శ్రీకేష్ కుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు అతను చనిపోయినట్లు ధ్రువీకరించి అతన్ని మార్చురీలో ఫ్రీజర్‌లో ఉంచి పోస్ట్‌మార్టం పరీక్ష పెండింగ్‌లో ఉంచారు. పంచనామ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేశ్ కుమార్ మృతదేహంలో కదలికలను అతని వదిన గుర్తించారు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంటనే డాక్టర్లు శ్రీకేశ్కు చికిత్స అందించగా బతికి బయటపడ్డాడు. చదవండి: Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే -
మృతదేహాన్ని పీక్కుతున్న ఎలుకలు, చీమలు
లక్నో: మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కానీ, కరోనా దెబ్బకు బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతున్నాయి. కుటుంబసభ్యులు చనిపోతేనే దగ్గరుండి అంత్యక్రియల్ని జరిపించలేకపోతున్నాం. దీంతో స్మశానాల్లో, ఆస్పత్రులలో మృతదేహాల పరిస్థతి దారుణంగా తయారైంది. చీమలు, ఎలుకలు పీక్కుతింటున్నాయి. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర సాతారా జిల్లాలో ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో.. సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తిన్న దృశ్యాలు నెటిజన్లు కంటతడి పెట్టించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఆజమ్‌ఘడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రి మార్చురీలో మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తినడం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 29న రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడింది. అత్యవసర చికిత్స కోసం స్థానికులు బల్రాంపూర్ మండల ఆస్పత్రికి తరలించారు. వైద్యపరిక్షలు నిర్వహించి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ అందిస్తుండగా.. మరుసటి రోజే ఆమె మరణించింది. దీంతో ఆమె మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించాలని వైద్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. కానీ, 4 రోజుల తర్వాత పోలీసులు, డాక్టర్ల నిర్లక్క్ష్యంతో మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చీమలు, ఎలుకలు తిన్నాయి. ఈ దారుణం వెలుగులోకి రావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే మిశ్రా అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు
లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో విషాద.. అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కథలు ఎన్ని చెప్పిన తక్కువే. తాజాగా ఓ ఆస్పత్రి అధికారులు కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా పది రోజులుగా మార్చురీలోనే పడేశారు. మృతుడికి సంబంధించిన బంధువులు రాలేదంట.. వచ్చిన అతడి కుమారుడు మైనర్ బాలుడు కావడంతో అతడికి మృతదేహం అప్పగించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో ఆ పిల్లాడు కాళ్లరిగేలా తండ్రి మృతదేహం తీవ్రంగా కష్టపడ్డాడు. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలగజేసుకోవడంతో ఎట్టకేలకు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న దీన్‌దయాల్ ఆస్పత్రికి రోజువారీ కూలీ రాజు ఏప్రిల్ 21వ తేదీన వచ్చాడు. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందాడు. దీంతో కొడుకు తన తండ్రి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరాడు. అయితే పిల్లాడు మైనర్ కావడంతో అధికారులు శవం అప్పగించడానికి నిరాకరించారు. ఎవరైనా పెద్దవారిని తీసుకురా అని చెప్పాడు. అయితే ఆ బాలుడికి తండ్రి తప్ప నా అనేవారు ఎవరూ లేరు. బంధువులను బతిమిలాడాడు. అయితే కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో పది రోజులుగా రాజు మృతదేహం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది. చివరకు స్థానికుడు మహేశ్ స్పందించి ఎమ్మెల్యే అనిల్ పరషార్, ఎమ్మెల్సీ మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ సహాయంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని పది రోజుల అనంతరం బయటకు తీసుకువచ్చారు. అయితే తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలుడి వద్ద డబ్బు కూడా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి అంత్యక్రియలను జరిపించారు. ఈ విధంగా తండ్రి మృతదేహం కోసం ఆ బాలుడు తీవ్రంగా కష్టపడి చివరకు అతికష్టమ్మీద తన తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడు. అయితే ఆస్పత్రి అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడి తండ్రి మృతదేహం అప్పగించడంలో నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
పగవాడికి కూడా రావొద్దు ఈ కష్టం
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ముసలి, ముతకా, ఉన్నోడు, లేనోడు ఇలా తారతమ్యాలు లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపిస్తుండడంతో బ్రతుకు జీవుడా అంటూ క్షణం క్షణం భయం గుప్పిట్లో జనం బతుకుతున్నారు. ఓవైపు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లు చేయించుకుందామనేలోపే ఊపిరి ఆగిపోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల జాగృతి సాఫ్ట్ వేర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమెకు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర చికిత్స కోసం ఆమె భర్త తన కారులో ఇంటినుంచి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వాసుపత్రికి బయలు దేరారు. ఆస్పత్రి బయట పార్కింగ్ ఏరియాలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు ఆక్సిజన్ సిలీండర్ కావాలని, తన భార్య ప్రాణాపాయస్థితిలో ఉందని ఆస్పత్రి సిబ్బందని వేడుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో చివరికి ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని స్ట్రెచ్చర్ కోసం వెతికాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. పార్కింగ్ స్థలంలో ఉన్న కారులోనే జాగృతి మరణించింది. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమె డెడ్‌బాడీ పట్ల మరింత కాఠిన్యం ప్రదర్శించారు. ప్రోటోకాల్ పేరుతో మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి దహనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు.పైగా దహన సంస్కారం చేసే ముందు సుమారు 3 గంటల పాటు తన భార్య జాగృతి మృతదేహాన్ని కారులో అలాగే ఉంచారని బాధితురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. -
మార్చురీలో బాడీని కోస్తుండగా కళ్లు తెరిచాడు
కెరిచో: ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం మనిషి బతికుండగానే మార్చురీలో పడుకోబెట్టేలా చేసింది. చనిపోయాడనుకున్న వ్యక్తిని అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా స్పృహలోకి రావడంతో సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కెరిచో దేశానికి చెందిన ముప్పై రెండేళ్ల పీటర్ కైగెన్ కడుపు సంబంధిత సమస్యలతో కప్లాటెట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఓ నర్సు అతడు చనిపోయినట్లు రోగి కుటుంబానికి తెలిపింది. దీంతో సిబ్బంది అతడిని మార్చురీ గదిలోకి తరలించారు. అంత్యక్రియలు జరిపేవరకు అతడి శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు సిబ్బంది ఎంబాలింగ్ ప్రక్రియను చేపట్టారు. (చదవండి: షాకింగ్ వీడియో: యువతి మృతదేహాన్ని..) అందులో భాగంగా అతడి శరీరం నుంచి రక్తాన్ని వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంతలో అతడు నొప్పితో కళ్లు తెరిచి, కేకలు పెట్టగా చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వచ్చిందని సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కాసేపటికే అతడు చనిపోలేదని నిర్ధారణకు క్యాజువల్ సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన గురించి కైగెన్ సోదరుడు మాట్లాడుతూ.. "మార్చురీలో ఉన్న వ్యక్తి కంగారుగా మా దగ్గరకు వచ్చి లోపలకు రమ్మన్నారు. అక్కడ కైగెన్ శరీరంలో కదలికలు చూసి షాకయ్యాం. ఓ క్షణం పాటు ఏం జరుగుతుందనేది మాకే అర్థం కాలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది" అని చెప్పుకొచ్చారు. మరోవైపు కైగెన్ మాట్లాడుతూ.. 'ఇది నేనే నమ్మలేకపోతున్నాను. నేను చనిపోయానని డాక్టర్లు ఎలా చెప్పారు? అసలు ఎప్పుడు స్పృహ కోల్పోయానో, ఎప్పుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చానో నాకే తెలీట్లేదు. ఏదేమైనా నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు" అని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) -
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
-
అడ్డంగా దొరికిన ఆస్పత్రి అటెండర్
సాక్షి, విజయవాడ: కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించాడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని మార్చురీ అటెండర్ డిమాండ్ చేశాడు. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే, ఆ అటెంటర్ లంచావతారం మొత్తం వీడియోలో రికార్డవడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ నెల 21 సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శవాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్ రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. ఈక్రమంలో వారి బంధువులు అటెండర్ బాగోతాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మార్చురీ అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
గాంధీలో మళ్లీ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి మార్చురీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా వైరస్ బారిన పడి మూ డ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో మరణించిన బేగంపేటకు చెందిన వ్యక్తి (48) మృతదేహం తారుమారైన ఘటన మరకముందే తాజాగా గురువారం మరో వ్యక్తి (37) మృతదేహం కనిపించకుండా పోవ డం వివాదాస్పదంగా మారింది. తీరా కు టుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఒకరికి ఇవ్వాల్సిన మృతదేహాన్ని మరొకరికి ఇచ్చినట్లు తేలింది. అయితే ఈ అంశాన్ని గాంధీ వైద్యులు కానీ.. పోలీసులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అసలేమైందంటే..? మెహిదీపట్నానికి చెందిన రషీద్‌ఖాన్ (37) దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల ఏడో తేదీన నగరంలోని మెడిసిటీ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 8న ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తర లించారు. తొమ్మిదో తేదీ రాత్రి ఆయన మృతిచెందాడు. ఇదే సమయంలో.. గాం ధీలో కరోనాతో ప çహాడీషరీఫ్కు చెంది న మహమూద్ (40) మరణించాడు. ఇరువురి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బుధవారం (10వ తేదీన) ఉదయం పçహాడీషరీఫ్ మృతునికి సంబంధించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఒక మృతదేహాన్ని చూసి, ఇది తమదేనని చెప్పి వెంట తీసుకెళ్లి అం త్యక్రియలు పూర్తి చేశారు. ఇటు మరణించిన మెహిదీపట్నం వ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించగా, వాటిలో రషీద్‌ఖాన్ మృతదే హం కన్పించకపోవడంతో వారు అధికారులను నిలదీశారు. వార్డులన్నీ తిరిగి.. చివరికి మారిపోయి నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి సహా, స్థానిక డీసీపీ కల్మేశ్వర్‌లు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఒకవేళ రషీద్ చనిపోయి ఉండకపోతే ఆస్పత్రిలోనే ఉండి ఉంటారని భావించి, ఆ మేరకు కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రిలోని ఐసీయూ, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులందరినీ పరిశీలించారు. వారిలో సదరు వ్యక్తి కన్పించకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అంతా కలసి చివరకు మళ్లీ మార్చురీకి చేరుకున్నారు. ఈ నెల 10న మార్చురీకి చేరుకున్న వారి మృతదేహాలతో పాటు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లిన వారి వివరాల ను ఆరా తీశారు. మెహిదీపట్నంకు చెందిన రషీద్ మృతదేహాన్ని పహాడీషరీఫ్‌కు చెందిన మహమూద్‌గా భావించి సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మేరకు వారిని ఆస్పత్రికి పిలిపించారు. మహమూద్ మృతదేహం గాంధీ మార్చురీలోనే ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఇరువురు కుటుంబసభ్యులతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. కాగా, మహమూద్ మృతదేహాన్ని కూడా అంత్యక్రియల కోసం జీహెచ్ఎంసీ సిబ్బందికే అప్పగించడం కొసమెరుపు. అధ్వానంగా రికార్డుల నిర్వహణ.. మార్చురీకి వచ్చే మృతదేహాలను భద్రపరిచే విషయంలోనే కాదు వాటికి సంబంధించిన కేసు షీట్లు, రికార్డుల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను పూర్తిగా కవర్ కట్టిపెట్టడం, వాటికి రికార్డ్ ట్యాగ్లు లేకపోవడం, గుర్తింపు కోసం వచ్చిన బంధువులు కూడా ఎక్కడ తమకు వైరస్ సోకుతుందో అనే భయంతో దూరం నుంచే వాటిని చూడాల్సి రావడం, మృతదేహాల ముఖం పూర్తిగా కన్పించకపోవడం, అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పూర్తిగా తెరిచి చూపించకపోవడం సమస్యకు కారణమవుతోంది. ఇకపై మృతదేహాల గుర్తింపు పక్కాగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహానికి మృతుని పేరు, వయసు, చిరునామాతో కూడిన ట్యాగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గుర్తింపు కోసం వచ్చే బంధువులను కూడా ఫొటో, వీడియో రూపంలో రికార్డు చేయాలని నిర్ణయించారు. -
కరోనా శవాల బాధ్యత కూడా వారిదే
విష్ణు గుర్జార్.. అతను జైపూర్‌లోని స్వారీ మాన్ సింగ్(ఎస్ఎమ్ఎస్) ఆసుపత్రిలో మార్చురీ గదిలో పనిచేస్తాడు. శవాల మధ్యలో పని చేసినప్పటికీ ఎప్పుడూ శ్మశానం వైపు వెళ్లేవాడు కాదు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇప్పుడు అతను తరచూ శ్మశానానికి వెళ్తున్నాడు. అనాథలా మిగిలిపోతున్న శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తున్నాడు. హిందువులైనా ముస్లింలైనా తనకు అందరూ సమానమేనంటూ అంతిమ సంస్కారాలు చేస్తున్నాడీ యువకుడు. కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల బాధ్యత మార్చురీ వర్కర్ల మీద పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఆరు గంటల షిఫ్ట్ కేటాయిస్తూ కరోనా శవాల అంతిమ సంస్కారాలకు సాయం చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. వైరస్ సోకుతుందన్న భయం వెంటాడుతుంది ఈ నిర్ణయం గురించి గురించి విష్ణు గుర్జార్ మాట్లాడుతూ.. "నా జీవితంలో శ్మశానానికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. పైగా ఆ ప్రదేశమంటే నాకు భయం కూడా. అంతేకాకుండా ఇస్లామిక్ ఆచారాల గురించి ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు హిందువులైనా, ముస్లింలైనా నాకు అందరూ సమానమే. ఎందుకంటే నాకు ఎలాంటి మతం లేదు. ఎవరూ లేని వారికీ నేనున్నా" అని చెప్పుకొస్తున్నాడు. ఇతనితోపాటు తోటి వర్కర్లు పంకజ్, మనీశ్, మంగళ్, అర్జున్, సూరజ్‌లు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. (ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు) మమ్మల్ని ఎవరూ గుర్తించరు.. ఆరు నెలల పాప, మూడేళ్ల కొడుకు ఉన్న విష్ణు గత 40 రోజులుగా ఇంటికే వెళ్లలేదు. మరోవైపు పంకజ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వీరి శ్రమను, సేవలను ప్రజలు, ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. గుర్జార్ మాట్లాడుతూ.. "ఇళ్లకు వెళ్లినప్పుడు కాలనీ వాసులు ప్రశంసించడం మాని తిరిగి భయపెడతారు. మమ్మల్ని, మా సేవలను గుర్తించరు. కనీసం మాకు మంచి భోజనం వంటి సరైన సదుపాయాలు కూడా లభించవు" అని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 63 మంది మరణించగా ఇందులో 36 శవాలను శ్మశానానికి తీసుకెళ్లి మరీ మార్చురీ వర్కర్లు అంత్యక్రియలు నిర్వహించారు. (హెల్మెట్ ధరిస్తే.. శానిటైజర్ ఫ్రీ) -
మార్చురీలో ఎలుకలపై విచారణ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహం కనుగుడ్లు, కనురెప్పలను ఎలుకలు తినివేసిన సంఘటనపై ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యవిధాన పరిషత్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఏపీ మెడికల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు విచారణ చేశారు. మార్చురీ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీఎంహెచ్ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆ సుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎస్ రామ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి మార్చురీ నిర్వహణ ఎలా ఉందో స్వయంగా తనిఖీ చేశారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులను, సౌకర్యాలను గమనించారు. ఫ్రీజర్ బాక్సులకు రంధ్రాలు ఉండటాన్ని చూసి రీజనల్ డైరెక్టర్ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలుకలు ఎందుకు వెళ్లకుండా ఉంటాయంటూ వైద్యాధికారులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగంటూ అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు ఆసుపత్రి ప్రాంగణంలోని రెండు మార్చురీ గదులను పరిశీలించామని, ఒక గదిలో సరిగా సౌకర్యాలు లేకపోవటంతో దానిని సీజ్ చేయాలని ఆదేశించినట్టు ఆర్డీ వాణి తెలిపారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించామని, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి పారిశుధ్య విభాగానికి సంబంధించి ఫెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని, పూర్తి జాగ్రత్త తో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈగల్ హంటర్ అనే సంస్థకు ఫెస్ట్ కంట్రోల్ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలుకలు, పాములు, పందులు, కుక్కలు, క్రిమికీటకాలు లేకుండా ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటమే వారి బాధ్యత అన్నారు. ఈ ఫెస్ట్ కంట్రోల్ సంస్థకు నెలకు రూ.40 వేలు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. సంస్థ ఇద్దరు సిబ్బందిని నియమించి, రాత్రి, పగలు పనిచేసేలా చూస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావును బాధ్యతల నుంచి తొలగించామని, వేరే సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ ౖచైర్మన్ జయప్రకాష్, ఆర్ఎంవో తవ్వా రామ్మోహనరావు, క్వాలిటీ మేనేజర్ మనోజ్ తదితరులు ఉన్నారు. -
చనిపోయిందని వదిలేసి వెళ్లారు!
కర్నూలు (హాస్పిటల్): అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోతే.. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు కుటుంబసభ్యులు. వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన లావణ్య (10)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తండ్రి భాస్కర్, తాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. పాప కోలుకోకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందింది. అప్పటికే తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోగా.. చనిపోయే వరకు ఉన్న తాత కూడా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి మెల్లిగా జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పేషెంట్ రిజిస్టర్లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు బాలిక కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. -
శవాలకూ రక్షణ కరువు
సాక్షి, జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధానాస్పత్రిలో శవపరీక్షలకు కష్టకాలం వచ్చింది. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ గది చిన్నగా ఉండడం, ఫ్రీజర్ సైతం ఒకటే ఉండడం ఇబ్బందిగా మారింది. సెలవు దినాల్లో రెండుకు మించి మృతదేహాలు వస్తే భద్రపరచడం కూడా కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు తిన్నాయి. అంతేకాకుండా ఫ్రీజర్‌లోనూ రెండు మృతదేహాలను మాత్రమే భద్రపరిచే అవకాశం ఉంది. అది కూడా ఒక దానిపైన మరో శవాన్ని ఉంచాల్సి వస్తుండడంతో మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఒకే ఫీజర్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగి చనిపోతే పోస్టుమార్టం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆస్పత్రిని అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం జిల్లాగా అవతరించడం, జనాభా పెరగడం తో ఆస్పత్రి సరిపోవడం లేదు. దీంతో పోస్టుమార్టం గది సైతం చిన్నగా మారింది. ఈ గదిలో రెండు ఫ్రీజర్లతోపాటు ఒక బల్ల మాత్రమే ఉన్నా యి. ఈ ఆస్పత్రికి వారంలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలు వస్తుంటాయి. సాయంత్రం వేళ పోస్టుమార్టం చేయకపోవడం, రాత్రి వేళ చనిపోయిన వారిని ఇక్కడే తేవడంతో మృతదేహాలను పోస్టుమార్టం గదిలో భద్రపరుస్తుంటారు. రెండు మృతదేహాలకన్నా ఎక్కువగా ఉంటే బయట వరండాలోనే వేయాల్సిన దుస్థితి. అన్నీ అసౌకర్యాలే.. పోస్టుమార్టం గదికి ఒక భవనంతోపాటు మృతదేహాలను భద్రపర్చేందుకు ఒక గది, కుళ్లిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచేందుకు ఒక గది ఉండాలి. కానీ ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇందులో నిరంతరం నీటి సరఫరాతోపాటు శుభ్రం చేసేందుకు వాక్యుమ్‌క్లీనర్లు ఉండాలి. ఇవన్నీ కనిపించడం లేదు. పరికరాలు సైతం స్టీల్‌తో చేసినవి ఉండాలి. గది లోపలికి గాలి వెళ్లేందుకు ఎగ్జిట్‌ఫ్యాన్లు సైతం ఉండాలి. కానీ ఈ గది పురాతనమైనది కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా ఇతర సామగ్రిని సైతం ఇందులోనే వేస్తున్నారు. శవ పంచనామా రాసేందుకు ప్రత్యేక గది లేదు. మరొకటి ఎప్పుడో ? జగిత్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఆ స్థాయిలో వసతులు కల్పించలేదు. మృతదేహాలు సైతం దాదాపు నెలకు 30కి పైగానే వస్తుంటాయి. వీటన్నింటికి పోస్టుమార్టం చేసేందుకు ఒకే గది ఉంది. గతంలో అధికారులు పరిశీలించినప్పటికీ స్థలం లేదని, ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మరో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్థలం లేకనే ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదికి మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరో గదిని ఏర్పాటు చేయాలంటే స్థలం లేదు. ప్రస్తుతం ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనంలోకి గైనిక్ విభాగం వెళ్తే ఇబ్బందులు తొలగుతాయి. ఇటీవల మృతదేహాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుదక్షిణాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బతికేవున్నా.. చచ్చాడంటూ..
మధ్యప్రదేశ్: డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి రాత్రంతా మార్చురీలో ఉంచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీరాం(72) అనే వృద్ధుడు గురువారం రోజు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయాడు. స్థానికులు అతన్ని సాగర్ జిల్లాలోని బినా సివిల్ ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అతడు మృతి చెందినట్లు నిర్ధారించాడు. బాడీని రాత్రంతా మార్చురీలో (మృతదేహాలను ఉంచే గది) ఉంచారు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని మర్చురీ ఉంచినట్లు పోలీసులకు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు శుక్రవారం ఉదయం అస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా.. అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కంగుతిన్న డ్యూటీ డాక్టర్ బతికున్న ఆ వృద్ధుడికి చికిత్స అందించారు. అయినప్పటికినీ అతను కొంత సమయం పాటు చికిత్స పొంది..మృతి చెందాడు. విచారణలో భాగంగా ..ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ నెల 14న ఆస్పత్రికి వచ్చాడని తేలిసింది. ‘వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని, ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగానికి చేరవేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై ఎంక్వైరీ నిర్వహించి, డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే గుర్తించి మోమో జారీ చేస్తామన్నారు. -
ఎన్ఎఫ్
జూన్ 10వ తేదీ తెల్లవారుజాము 5 గంటలవుతోంది. నార్త్ జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగుతోంది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిద్ర మత్తులో ఉండి అసహనంగా రిసీవర్‌ను చెవిలో పెట్టుకున్నాడు. ‘‘సార్... ఇక్కడ ఒక శవం ముక్కలు ముక్కలుగా నరికి పడి ఉంది. అర్జెంట్‌గా రావాలి’’ అవతలి వ్యక్తి భయంగా చెప్పాడు. ఇది విన్న కానిస్టేబుల్ నిద్ర మత్తు వదిలించుకుని ఆ వ్యక్తి చెప్పిన వివరాలన్నీ నమోదు చేసుకున్నాడు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఎస్సై షుకూర్ తన సిబ్బందితో ఎంజీ ఫ్లై ఓవర్ పక్కన శవం ఉన్న స్థలానికి వెళ్లాడు. ఆ స్థలం చిన్న చెత్తకుప్పలా ఉంది. చుట్టూ జనం మూగి ఉన్నారు. ‘‘ఆ..ఎవరు ఇక్కడ పోలీసులకు ఫోన్ చేసింది?’’ ఎస్సై అడిగాడు. ‘‘నేనే సార్’’ అని అక్కడున్న 45 ఏళ్ల వ్యక్తి చేతులు కట్టుకుని ఎస్సై దగ్గరికి వచ్చాడు. ‘‘ఇక్కడెందుకున్నావ్? నీకెలా కనిపించింది ఈ శవం?’’ అడిగాడు ఎస్సై. ‘‘సార్.. నేను మున్సిపాలిటీలో చెత్తను సేకరించే వ్యక్తిని. నా పనిలో భాగంగా ఈరోజు ఉదయమే ఈ ఏరియాలో చెత్త తీయడానికి వచ్చా. అప్పుడే చెత్తలో కనిపించిన శవాన్ని చూసి మీకు ఫోన్ చేశా’’ అన్నాడు. అతనితో మాట్లాడుతూనే దగ్గరికొస్తూ పరిశీలనగా చూశాడు ఎస్సై. ఆ శవాన్ని ముక్కలుగా నరికి చికెన్ వ్యర్థాల్లో కలిపి పడేశారు. దానిపై చెత్త కప్పడాన్ని చూశాడు. బహుశా పోలీసు జాగిలాలకు క్లూ దొరక్కుండా నేరస్తులు ఇలా చేశారనుకున్నాడు ఎస్సై. అక్కడ ఉపయోగపడే క్లూలు సేకరించి శరీర భాగాలను మార్చురీకి పంపాడు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈస్ట్‌జోన్ పరిధిలోని కంప చెట్లలో ఓ యువతి శవాన్ని కనుగొన్నారు పోలీసులు. అక్కడకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు చేరారు.మీడియా వాళ్లను స్పాట్‌కు రానివ్వకపోవడంతో దూరం నుంచే వీడియోలు తీస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అంతకంతకూ జనం తాకిడి పెరుగుతుంటే కంట్రోల్ చేయడానికి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఈస్ట్‌జోన్ ఏసీపీగా కొత్తగా విధుల్లోకి చేరిన భగత్ అప్పుడే ఆ స్పాట్‌కు వచ్చాడు. శవాన్ని పరిశీలిస్తూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరిస్తున్నాడు. ‘‘సార్... యువతి వయసు 25 ఏళ్లు ఉంటుంది. నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. మొహం గుర్తు పట్టకుండా ఉండేలా యాసిడ్ పోయడంతో ముఖం మొత్తం కాలిపోయింది’’ చెప్పారు సిబ్బంది. ‘‘సరే ఏవైనా క్లూస్ దొరికాయా?’’ అని అడిగి మొత్తం కులంకషంగా పరిశీలించాలని ఆదేశించాడు భగత్. యువతి చేతి గోర్లకు రక్తం మరకలు అంటి ఉండటాన్ని సిబ్బంది గమనించి భగత్‌కు చెప్పారు. దీంతో ఫోరెన్సిక్ వారు వచ్చి ఆ క్లూస్‌ని తీసుకుని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అనంతరం యువతి శవాన్ని పంచనామా కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి ఎస్సై ప్రసాద్, ఏసీపీ భగత్‌కు కాల్ చేసి యువతి శరీరంపై 4 పొడవాటి వెంట్రుకలు ఉన్నాయని చెప్పాడు. నేరస్తుల్లో మహిళ కూడా ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చాడు. మరిన్ని వివరాల కోసం ఆ స్పాట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని సిబ్బందితో బయలుదేరాడు భగత్. అక్కడంతా తిరిగి వెతికాడు. ఏ ఇతర క్లూ దొరకలేదు. కానీ అక్కడ బ్లూ కలర్లో ఉన్న కుడికాలు ప్లాస్టిక్ చెప్పు ఒకటి కనిపించింది. అది బాగా వాడబడి ఉంది. అందుకేనేమో కాళ్ల వేళ్లన్నీ అనిగి గుంటలు పడి ఉన్నాయి. ఆ చెప్పును తీక్షణంగా పరిశీలించిన భగత్..కుడికాలి బొటన వేలి పక్క వేలి ముద్ర లేకపోవడాన్ని గమనించాడు. చెప్పు పై భాగంలో ‘ఎన్ఎఫ్’ అనే సింబల్ మాత్రం కనిపించి కనిపించనంతగా అరిగిపోయి ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న భగత్ సిబ్బందితో ఆఫీసుకు వచ్చాడు. ‘‘సార్ ఇప్పుడే ఫాక్స్ వచ్చింది. ఈస్ట్‌జోన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ నాగేందర్ బహిరంగ సభ ఉందట. డీజీపీ ఆఫీసు నుంచి ముందస్తు సమాచారం వచ్చింది’’ అసిస్టెంట్ ఏసీపీ భగత్‌కు తెలిపాడు. ‘‘సరే చూద్దాం’’ అంటూ ఆ విషయాన్నంతగా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ‘‘ఆ హత్య వివరాలు వచ్చాయా? పోస్టుమార్టమ్ రిపోర్టు ఏమైంది? ఆ అమ్మాయి వివరాలు తెలిశాయా?’’ అంటూ శంకర్‌ను అడిగాడు భగత్. ‘‘తెలిసింది సార్. ఆ అమ్మాయి విజయ్ సేథ్ అనే నగల వ్యాపారి కూతురు. పేరు మీనాక్షి. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గొతు నులిమి చంపారని తర్వాత ముఖంపై యాసిడ్ పోసి గుర్తు పట్టలేనంతగా నిందితులు మార్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది’’ అన్నాడు.అప్పుడే ఫోరెన్సిక్ ఎస్సై ప్రసాద్ నుంచి భగత్‌కు ఫోన్ వచ్చింది.‘‘ప్రసాద్ ఎనీ ప్రోగ్రెస్?’’ అని అడిగాడు. ‘‘సార్.. హత్య జరిగిన స్థలంలో ముగ్గురు, నలుగురి పాద ముద్రలు గుర్తించాం. బహుశా ఆ హత్యలోముగ్గురు నలుగురు పాల్గొని ఉండొచ్చు’’ అని చెప్పాడు. ‘‘సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు’’ అని ఫోన్ కట్ చేశాడు భగత్. ‘‘నేను ఇక్కడ చార్జ్ తీసుకోకముందు నార్త్‌జోన్‌లో జూన్ 10న కార్పొరేటర్ చిన్నారావు మర్డర్ జరిగిందిగా.. ఆ వివరాలు కావాలి’’ అని ఏసీపీ భగత్ ఎస్సై శంకర్‌ను అడిగాడు. ‘‘ఆ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది. పూర్తి వివరాలు రాకపోవచ్చు’’ చెప్పాడు శంకర్. ‘‘నాకు అర్జెంటుగాఆ వివరాలు కావాలి’’ అని గట్టిగా చెప్పాడు భగత్.దీంతో ఎస్సై శంకర్ మధురానగర్ పోలీస్‌స్టేషన్ ఎస్సై షుకూర్‌కు ఫోన్ చేసి ‘‘ఏసీపీ సార్ కార్పొరేటర్ చిన్నారావు మర్డర్ కేసుకు సంబంధించి మాట్లాడతారంట’’ అని భగత్‌కు ఫోన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి హత్య గురించి ఎంత వరకు విచారణ జరిగింది, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ వివరాలన్నీ ఎంత వరకు సేకరించారో ఎస్సై షుకూర్ ఏసీపీ భగత్‌కు వివరించాడు. ‘‘ఓకే ఆ ఫైల్ నేనొకసారి చూడాలి. రేపొకసారి ఫైల్‌తో కలవండి’’ భగత్ ఆదేశించాడు.మర్నాడు ఉదయమే ఎస్సై షుకూర్ ఆ హత్యకు సంబంధించిన ఫైల్‌ను తీసుకుని ఏసీపీ భగత్ ఆఫీసుకు వచ్చాడు. ఎస్సై శంకర్ షుకూర్‌ను ఏసీపీ భగత్‌కు పరిచయం చేశాడు. ‘‘సార్ ఇదే ఆ ఫైల్. హత్య వివరాలు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టు అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి’’ ఫైల్‌ను భగత్‌కు ఇచ్చాడు ఎస్సై షుకూర్.ఫైల్ చూసిన భగత్ ‘‘ఇదేంటి... మృతుడి మొహం రాడ్‌తో చితక్కొట్టిననట్లుంది’’ అడిగాడు. ‘‘అవును సార్. కత్తితో గొంతుకోసి హత్య చేశాక మొహాన్ని గుర్తు పట్టకుండా చేసి శరీరాన్ని ముక్కలుగా కట్‌చేసి చికెన్ వ్యర్థాలతో కలిపి చెత్త కుప్పలో పారేశారు’’ షుకూర్ చెప్పాడు. ‘‘అయితే హత్య ఎన్ని గంటల ముందు జరిగింది?’’ అడిగాడు భగత్. బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి 6 లేదా 7 గంటల ముందు జరిగి ఉంటుందని పోస్టుమార్టంలో తేలిందని తెలిపాడు.షుకూర్ ఏదో చెప్పబోతుండగా మధ్యలో ఆపిన భగత్ ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌కు ఫోన్ చేసి మీనాక్షి బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి ఎంత సమయం ముందు జరిగిందని అడిగాడు.సుమారు 6 గంటల ముందు జరిగి ఉంటుందని డాక్టర్ చెప్పాడు. ఓకే అని ఫోన్ పెట్టేసిన భగత్...‘‘అంటే రెండు హత్యలు దాదాపుగా అర్ధరాత్రి జరిగి ఉంటాయి’’ అని ఎస్సైతో అనుమానం వ్యక్తం చేశాడు.ఇన్వెస్టిగేషన్ గురించి ఎస్సై శంకర్‌తో మాట్లాడుతుండగానే కమీషనర్ నుంచి భగత్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘గుడ్ మార్నింగ్ సార్’’ విష్ చేశాడు భగత్. ‘‘ఆ మర్డర్ కేసు ఏమైంది?’’ భగత్‌ను అడిగాడు. ‘‘అదే పనిలో ఉన్నాం సార్. ఇన్పుట్స్ సేకరిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది’’ అని చెప్పాడు భగత్. వీలైనంత త్వరగా కేసు ముగించాలని ఫోన్ పెట్టేశాడు కమీషనర్. ఏసీపీ భగత్ మాజీ కార్పొరేటర్ నాగేందర్ సభ విజిటింగ్‌కు బయల్దేరాడు. సభా ప్రాంగణానికి వచ్చిన భగత్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.‘‘మినిస్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కాన్వాయ్ బయల్దేరిందా?’’ ఎస్సై శంకర్‌ను అడిగాడు భగత్. ‘‘ఇప్పుడే స్టార్ట్ అయింది సార్’’ శంకర్ బదులిచ్చాడు. ఇంతలోనే సభకు ముఖ్య అతిథిగా వస్తున్న మినిస్టర్ కాన్వాయ్ వచ్చింది. అభిమానుల తోపులాటమధ్య మినిస్టర్, ఇతర నాయకులను వేదికపై భద్రంగా పంపించారు. సభ భద్రతకు వచ్చిన సిబ్బంది ఎండ, ధూళిని లెక్క చేయకుండా తమ విధుల్లో మునిగిపోయారు. భగత్ మాత్రం సభకు కొంచెం దూరంగా ఉన్న తన వాహనం దగ్గరకు వచ్చి ఆ హత్యల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ‘‘హాయ్ భగత్’’ అంటూ పక్క నుంచి ఒక పలకరింపు వినిపించింది. తీరా అటూ ఇటూ చూసేసరికి ఓఎస్డీ ప్రభాకర్ ఎదురుగా ఉన్నాడు. ఓఎస్డీ ప్రభాకర్ ఏసీపీ భగత్‌లు ఒకే బ్యాచ్. అదీగాక వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. కొంతసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. వీళ్లు తమ మాటల్లో ఉండగానే సభ కూడా పూరై్తంది. ‘‘భగత్ సాయంత్రం చిన్న ఈవెంట్ ఉంది నువ్వు కూడా రా..నీకూ రిలీఫ్‌గా ఉంటుంది’’ అని ప్రభాకర్ ఆహ్వానించాడు. ‘‘ ఏం ఈవెంట్? ఎక్కడ?’’ అని అడిగాడు భగత్. ‘‘ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో తెలిసిన స్వచ్ఛంద సంస్థ వారు ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా నన్ను రమ్మన్నారు. నువ్ కూడా రా అలా వెళ్లొద్దాం’’ అనేసరికి భగత్ తలూపాడు.సాయంత్రం 4గంటలకు ఎస్సై శంకర్‌తో ఎసీపీ భగత్ ఎర్రగడ్డలోని ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే వచ్చిన ఓఎస్డీ ప్రభాకర్ భగత్‌ను రిసీవ్ చేసుకున్నాడు. ‘నేస్తం’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేషెంట్లకు చెప్పులు, దుస్తులు, పండ్లు పంపిణీ జరుగుతోందని అక్కడ కట్టిన బ్యానర్లను చూసేసరికి భగత్‌కు అర్థమైంది. ఆ సంస్థ నిర్వాహకుడు యాదగిరిని భగత్‌కు పరిచయం చేశాడు ప్రభాకర్. మా సంస్థ ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా ఆర్నెళ్లకోసారి ఇలా పంపిణీ చేస్తామని యాదగిరి తెలిపాడు. చిన్నపాటి ప్రసంగం తర్వాత బహుమతుల ప్రదానం జరిగింది. తర్వాత టీ విరామంలో నిర్వాహకుడు యాదగిరి ఆస్పత్రి ముఖ్య డాక్టర్‌ను వీరికి పరిచయం చేశాడు. తర్వాత డాక్టర్, భగత్, ప్రభాకర్‌లు ఏదో విషయమై కొంతసేపు ముచ్చటించారు. అలా మాట్లాడుతూనే ఆస్పత్రి ఆవరణ అంతా కలియతిరిగారు. కార్యక్రమం పూరై్తన తర్వాత తన కారు ఎక్కబోతున్న భగత్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వేరే డాక్టర్‌తో మాట్లాడుతున్న ప్రభాకర్ ఏమైందని ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్సై శంకర్ కూడా వచ్చాడు. అటుగా వెళ్తున్న పని మనిషిని పిలవమని శంకర్‌ను అన్నాడు. శంకర్ ఆ చెత్తబుట్ట తీసుకెళ్తున్న ఆమెను పట్టుకొచ్చాడు. ఆ చెత్తబుట్టలో ఉన్న చెప్పును తీసి చూపిస్తూ ‘‘శంకర్ నీకిది గుర్తుందా? మీనాక్షి మర్డర్ జరిగిన చోట ఇలాంటిదే దొరికింది!’’ ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకర్. ‘‘అవును సార్ అచ్చం అలాగే ఉంది’’ బదులిచ్చాడు శంకర్. ‘‘ఈ చెప్పు ఇక్కడెలా ఉంది?’’ అని డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇది మా ఆస్పత్రిలోని రోగులకు పంపిణీ చేసింది. అందరికీ ఇదే మోడల్ ఇచ్చారు’’ అని అక్కడికొచ్చిన నిర్వాహకుడు యాదగిరి బదులిచ్చాడు. మరి ఇందాక పంపిణీ చేసినవి వేరే డిజైన్‌లో ఎందుకున్నాయని భగత్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘పాత మోడల్ చెప్పులతో నడవడానికి ఇబ్బంది కలుగుతోందని ఫీడ్‌బ్యాక్ వస్తే ఈ రోజు పంపిణీ చేసిన వాటితో కొత్త మోడల్ ప్రారంభించాం’’ చెప్పాడు యాదగిరి. పాత మోడల్ చెప్పు ‘ఎన్ఎఫ్’ అనే అక్షరాల లోగో అర్థం ఏంటని భగత్ అడిగేసరికి ‘నేస్తం ఫౌండేషన్’ అని యాదగిరి చెప్పాడు. ‘‘కొత్త మోడల్ చెప్పుపై కూడా ఇవే అక్షరాలుంటాయి. కానీ లోగో వేరే డిజైన్‌లో పెద్దగా ఉంటుంది’’ అని చెప్పాడు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన చెప్పును తీసుకురమ్మని ఎస్సై శంకర్‌కు భగత్ చెప్పాడు. శంకర్ వెళ్లాక డాక్టర్‌తో మాట్లాడుతూ ‘‘ఈ వరుస హత్యలతో దొరికిన ఏకైక క్లూ ఈ చెప్పు. మీరు మా విచారణకు సహకరించాలి’’ అని కోరాడు. ‘‘సరే’’ అన్నాడు డాక్టర్.ఇంతలోనే ల్యాబ్‌లో ఉన్న చెప్పును తీసుకుని ఆస్పత్రికి చేరుకుని భగత్‌కు చూపించాడు శంకర్. దాన్ని యాదగిరికి చూపించి నిర్ధారించుకున్నాడు. ఏసీపీ భగత్, డాక్టర్, ప్రభాకర్‌లు ఆస్పత్రిలోని ఒక గదికి వెళ్లారు.మొత్తం ఇక్కడ ఎంతమంది పేషెంట్లు, పనివాళ్లు, డాక్టర్లు ఉంటారని ముఖ్య డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇక్కడ మొత్తం 132 మంది పేషెంట్లు, 20కి పైగా సిబ్బంది ఉంటారు’’ అని బదులిచ్చాడు. ‘‘మాకు దొరికిన ఈ చెప్పును బాగా పరిశీలిస్తే కొన్ని క్లూలు దొరికాయి. దాన్ని బట్టి నిందితులు ఇక్కడివారేనని నాకు అనుమానం వస్తోంది. ఈ చెప్పులో అన్ని వేలి ముద్రలున్నాయి. కానీ కుడికాలు బొటనవేలి పక్క వేలి ముద్రలేదు. అలాగే ఇది 7 అంగుళాల సైజు ఉన్న చెప్పు. అంటే ఆ వ్యక్తి దాదాపు 65 కేజీల బరువు, 5.5 అడుగుల పొడవుంటాడు’’ చెప్పాడు భగత్. నేరస్తులను గుర్తించడానికి పేషెంట్లతో సహా సిబ్బందిని బయటి నిల్చోబెట్టారు. అందర్నీ బయటికి తెచ్చే క్రమంలో ఇద్దరు వ్యక్తులు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను భగత్ దగ్గరకు తీసుకొచ్చారు. అందులో ఒకరికి బొటనవేలి పక్కన వేలు లేదు. వారిని గదమాయించగా మిగతా ఇద్దరిని ఆ వరుసలో చూపించారు. అందరినీ పోలీస్ స్టైల్లో అడిగేసరికి ఆ రెండు హత్యలు వారే చేశారని ఒప్పుకున్నారు. ‘‘మాతో మాజీ కార్పొరేటర్ నాగేందర్ ఈ హత్యలు చేయించాడు’’ అని నిజం చెప్పారు. ‘‘ఈ హాస్పిటల్లో ఎందుకున్నారు?’’ అని గదమాయించగా, ‘‘ హత్యలకు ప్లాన్ చేసే ముందు ఏదైనా సేఫ్ ప్లేస్ ఎంచుకుంటాం. ఇంతకుముందు హత్య చేసి వేరే రాష్ట్రం పారిపోయేవాళ్లం. కానీ ఈసారి ఎన్నికలొస్తున్నందున నాగేందర్ మమ్మల్ని అందుబాటులో ఉండేలా ఈ ఆస్పత్రిలో ఉండమని ప్లాన్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి హత్య ప్లాన్ చేస్తే ఎవరికీ అనుమానం రాదని మెంటల్ పేషెంట్లుగా చేరాం. తనకు రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని కార్పొరేటర్ చిన్నారావును, షేర్ నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతని కూతురు మీనాక్షిని రేప్ చేసి హత్య చేశాం’’ అని ఒప్పుకున్నారు. ‘‘హాస్పిటల్ నుంచి ఎలా వెళ్లారు?’’ భగత్ అడిగాడు.‘‘రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మెంటల్ ఆస్పత్రి నుంచి జనరల్ హాస్పిటల్‌కు వ్యాన్‌లో చెకప్‌కు తీసుకెళ్తారు. ఆ సమయంలో మేం నలుగురం ఒకేసారి వెళ్లి హత్య చేసి గోడ దూకి హాస్పిటల్‌కి వచ్చాం’’ అని చెప్పారు. అందులో ఒకడి జుట్టు పొడవుగా ఉండటం చూసి అక్కడ దొరికిన పొడవైన వెంట్రుక వీరిదేనని, ఆడవాళ్ల పాత్ర లేదని భగత్ నిర్ధారించాడు.వీళ్లు చెప్పిన ఆధారాలతో మాజీ కార్పొరేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.నేరాన్ని ఒప్పుకున్నాడు నాగేందర్. - ఉమేశ్ కోమటి