Mothers Day
-
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
అమ్మ ప్రేమను వర్ణించే మధురమైన పాటలు
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..1. నాలో నిను చూసుకోగా.. 2. వంద దేవుళ్లే కలిసొచ్చినా.. 3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా.. 4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. 5. సువ్వి సువ్వాలమ్మా.. 6. ఎదగరా.. ఎదగరా.. 7. అమ్మా అని కొత్తగా.. 8. అమ్మ 9. అమ్మనే అయ్యానురా.. 10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల.. 11.. అమ్మా.. వినమ్మా.. 12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి. -
మదర్స్ డే వెనకాల మనసును కదిలించే కథ!
అవతార మూర్తి అయిన అమ్మ ప్రేమకు దాసోహం అన్నాడు. కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని పురాణాలు సైతం చెబుతున్నాయి. అలాంటి అపురూపమైన అమ్మ ప్రేమ, సేవలను తలుచుకుని గౌరవించడం కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేని వేడుకగా జరుపుకుంటున్నాం. అయితే ఈ మదర్స్ డే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చి ఎలా ఏర్పడిందో వింటే మనసు భావోద్వేగానికి గురవ్వుతుంది. అమ్మ అనే రెండు అక్షరాలు ఎంతటి బాధనైనా పోగొట్టేస్తుందనడానికి ఈ గాదే ఉదహారణ.అమెరికా అంతర్యుద్ధం...1861-65 కాలం అమెరికాలో భయంకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో అప్పటిదాక ఒకటిగా ఉన్న ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోయారు యూనియన్ కాన్ఫడరేంట్ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు అలాంటి సమయంలో వర్జినియాలో శత్రువులకు సంబంధించిన సైనికుడు చనిపోయారు. అతన్ని చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. మూపైళ్లు కూడా లేని ఓ మహిళ మాత్రం అతనని సాటి మనిషిగా భావించింది. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించింది.ఆమె పేరు యాన్ జార్వీస్. కేవలం ప్రార్దనలతో సరిపెట్టలేదు. తను స్దాపించిన మదర్స్ డే వర్క్స్ క్లబ్‌తో ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించే యత్నం చేశారు. దేశంలో ప్రతిఒక్కరూ ఎవరోఒకరి పక్షాన ఉండితీర్సాలిన ఆ పరిస్దితిలో కూడా తమ క్లబ్ యుద్ధానికి వ్యతిరేకమని ఏ పక్షంవైపు ఉండబోమని స్పష్టం చేశారు. ఆ క్లబ్ ఏ సైనికుడు అవసరంలో ఉన్నా.. తిండి, బట్టలు అందించారు. సైనిక శిబిరంలో టైఫాయిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తుంటే సపర్యలు చేశారు.ఇంతకీ ఈ యాన్ ఎవరంటే..1832లో వర్జీనియాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు యాన్. తన జీవితం సాఫీగా సాగిపోతుండేది. నచ్చిన వ్యక్తితో పెళ్లి ఆ తర్వాత పిల్లలు. అక్కడ నుంచే తనని కలిచి వేసే సంఘటనలు సందర్భాలు ఎదురు పడ్డాయి. అప్పట్లో పసిపిల్లలు చనిపోవడం ఎక్కువగా ఉండేది. అలానే యాన్‌కి పుట్టిన 13 మంది పిల్లల్లో నలుగురు మాత్రమే ఉన్నారని చెబుతారు. టైఫాయిడ్, డిప్తీరియా వంటి వ్యాధుల వల్ల ప్రతీ ఇంట్లో ఇలాంటి పరిస్దితే ఉండేది. యాన్ తన పిల్లలను ఎలాగో కోల్పోయింది. కానీ ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం కనుక్కోవాలనుకుంది. వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం, సమయానికి మందులు వాడకపోవడం శుభ్రత లేకపోవడం వంటివే శిశు మరణాలకు కారణమని తెలుసుకుంది. దాంతో మదర్స్‌డే వర్క్ క్లబ్స్‌ని ఏర్పాటు చేసింది. అయితే చాలామంది దీనిలో చేరి సేవలందించేందుకు ముందుకు వచ్చారు. వాళ్లంతా ఇంటిఇంటికి వెళ్తూ పసిపిల్లలకు వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పిస్తూ..మందులు ఇస్తూ సేవలు చేశారు. అలా పసిపిల్లల మరణాలను చాలా వరకు తగ్గించగలిగారు. అదుగో అలాంటి సమయంలో అమెరికన్ అంతర్యుద్ధం రావడంతో శాంతిని నెలకొల్పేందుకు మదర్స డే వర్స్ క్లబ్స్ మరో అడుగు వేశాయి. అవి ఎంతలా విజయం సాధించాయంటే..యుద్ధం పూర్తి అయిన తర్వాత ప్రజలందరిని ఒకటి చేసేందుకు అధికారులు యాన్ని సంప్రదించారు. దాంతో యాన్ 'మదర్స్ ఫ్రెండ్ షిప్ డే' పేరుతో రెండు వర్గాలకు చెందిన సైనికుల కుటుంబాలని ఒకటి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పనిచేస్తే ఊరుకునేది లేదంటూ అధికారులు సీరియస్ అయ్యారు. వాళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గకుండా ఇరు సైనికుల కుటుంబాలను సమావేశ పరిచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పూర్తి స్దాయిలో సఫలం అయ్యింది యాన్. తల్లి ప్రేమతో ఎలాంటి సమస్యనైనా పరిష్కిరించొచ్చని చాటిచెప్పింది.తన తల్లిలాంటి వాళ్ల కోసం..అలా ఆమె తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక స్వచ్ఛంద సేవలో పాల్గొంటూనే ఉన్నారు యాన్. 1905లో యాన్ చనిపోయారు. యాన్ కూతురైన అన్నాకు తల్లి అంటే ఆరాధనగా ఉండేది. ఆమె కెరీర్లో ఎన్నో విజయాలు సాధించినా..తల్లి ఆశయాలు వాటి కోసం ఆమె చేసిన కృషి చూసి గర్వపడేది. అందుకే తల్లి చనిపోయాక తన తల్లిలాంటి వాళ్లని తలుచుకునేందుకు ప్రత్యేకంగా ఓ రోజు ఉండాలని, మదర్స్ డే ఏర్పాటు చేసి, దాన్ని పాటించాలనే ఉద్యమం మొదలు పెట్టింది. నిజానికి ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి అమ్మకోసం కేటాయించడం అనేది అప్పట్లో కొత్తేమి కాదు. ఈస్టర్కి ముందు ఒక నలభై రోజుల పాటు సాగే లెంట్ అనే సంప్రదాయంలో భాగంగా దూరంగా ఉన్న పిల్లలు తల్లిదగ్గరకు వచ్చే ఆచారం ఒకటి ఉంది. ఈజిప్టు నుంచి రష్యా వరకు మదర్స్ డే వంటి సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే యాన్ కూతురు మొదలు పెట్టిన మదర్స్ డే కాస్త వ్యక్తిగతంగా, ఆధునికంగా కనిపిస్తుంది. అందుకే త్వరలోనే ప్రచారంలోకి వచ్చేసింది. మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాటం..క్రమంగా మదర్స్ డే ప్రతి ఇంటికి చేరుకుంది. కానీ దాని మొదలు పెట్టిన అన్నా మాత్రం సంతోషంగా ఉండేది కాదు. తల్లిని తలుచుకుని తనతో మనసులోని మాటను పంచుకోవాల్సిన సమయాన్ని ఇలా గ్రీటింగ్ కార్డుల తంతుగా మారడం చూసి బాధపడేది. ఒక తెల్లటి పువ్వుని ధరించి తల్లిని గుర్తు చేసుకోవాలనే 'మదర్స్ డే; సంప్రదాయం పూల వ్యాపారంగా మారడం చేసి అన్నా మనసు విరిగిపోయింది. అందుకే తను మొదలు పెట్టిన మదర్స్‌డే ని రద్దు చేయాలంటూ మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. చివరి రోజుల వరకు మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాడింది. ఇక ఓపిక లేని దశలో ఓ శానిటోరియంలో చేరి దయనీయమైన స్దితిలో చనిపోయింది. మదర్స్ డే మొదలై ఇప్పటికీ నూరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెండు భిన్నమైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఫార్మాల్టిగా అమ్మను తలుచుకోవడమా!..లేకపోతే ప్రేమకు, సహనానికి మారురూపం అయిన అమ్మ పట్ల అభిమానాన్ని చాటుకోవడమా! చాయిస్ ఈజ్ అవర్స్..!.(చదవండి: మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు) -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్‌గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్‌కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్‌ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్‌తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్‌లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామాపొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి. అమ్మకిష్టమైన వంటఅమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి. అమ్మకోరిక తెలుసుకోండినిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.అమ్మతో బయటికికుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.స్పాకి తీసుకెళ్లండిసంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. దూరంగా ఉన్నారా..అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!! -
మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు
సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకునే రోజే మదర్స్ డే. మే నెల రెండోఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మాతృమూర్తుల త్యాగాలను, కష్టాలను గుర్తించడం, తిరిగి ప్రేమను అందించడమే ఈ మదర్స్ డే లక్ష్యం.అంతులేని త్యాగానికి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం. ఆ దేవదేవుడికైనా, సామాన్య మానవుడికైనా అమ్మే ఆది దైవం, గురువు అన్నీ.ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా , అమెరికాలలో మే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. 1908వ సంవత్సరంలో అమెరికాకు చెందిన కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లిని గౌరవించేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని ప్రారంభించింది. ఆ తరువాత తల్లి కష్టాలను గుర్తించే రోజుగా మదర్స్‌డేగా ప్రాచుర్యంలోకి వచ్చింది.మదర్స్ డే చరిత్రనిజానికి మదర్స్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది. పురాతన గ్రీకు నాగరికతలో వసంత వేడుకలా దీన్ని జరుపుకునేవారు. రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. అదే 1872 లో అయితే జూలియ వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని నిర్వహించారు.అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. 1914 నుంచి అధికారికంగా జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మేనెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో మదర్స్ డే జరుపుకుంటారు.ఏడాదికి రెండు సార్లు మదర్స్ డే?కొన్ని దేశాల్లో మార్చిలో కూడా జరుపుకుంటారు. యూకే, కోస్టారికా, జార్జియా, సమోవా , థాయిలాండ్‌లలో ఈస్టర్ ఆదివారం కంటే మూడు వారాల ముందు మదర్స్ డే జరుపుకుంటారు.మదర్స్ డే వెనుక ఇంత కథ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. అమ్మ ప్రేమని ఈ కేవలం ఒక్కరోజు స్మరించుకుంటే సరిపోతుందా? ఒక గులాబీ పువ్వో, లేదా ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక హగ్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఎంతమాత్రం కానే కాదు. కల్మషం ఎరుగని అమ్మ సేవలకు విలువ కట్టలేం. కానీ కన్నబిడ్డగా ఆమె రుణం తీర్చుకోవచ్చు. అమ్మకు అమ్మంత ప్రేమను తిరిగి ఇచ్చేయండి. అమ్మకు అండగా నిలవండి. ఈ సంవత్సరం మదర్స్ డే రోజు అమ్మకు ఇంతకంటే అద్భుతమైన బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. -
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే.. -
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా
ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్ డే’.» అమ్మ ఫోన్ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్ కాల్కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్ వాచ్ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్ రేడియో), మంచి ఫోన్ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్ సబ్స్క్రిప్షన్, ఓటీటీల సబ్స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
Mother's Day 2023: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' హవా..
'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.. ఫల్గుణి & అద్వైత నాయర్ అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు. షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్ షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది. శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది. జయ & శ్వేతా శివకుమార్ వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు. నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు. -
ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!) అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్‌లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) విఘ్నేశ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన నిహారిక.. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. అమ్మకు మేకప్ వేస్తూ ఆమె గొప్పదనం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) నిహారిక తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అమ్మ నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా అలంకరించేది. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా. అమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ బయటికి వెళ్లేందుకు అమ్మను రెడీ చేస్తున్నా. ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అమ్మ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. నిహారిక నటించిన వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Ishita Dutta: మదర్స్ డే నాకు ఎంతో ప్రత్యేకం..
-
అమ్మ.. అత్తమ్మ ఫొటోలతో కోహ్లి! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న సచిన్!
Mothers Day 2023- Virat Kohli- Sachin Tendulkar: స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయతకు ప్రతిరూపం అమ్మ. అమ్మంటే అంతులేని అనురాగం. కడుపులో నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డను కంటికి రెప్పలా కాచే దైవం. కడుపున పుట్టిన బిడ్డల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భర్తతో కలిసి అనేకానేక త్యాగాలు చేసి వారు కోరుకున్న జీవితాన్ని ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసే సహనశీలి. అలాంటి మాతృమూర్తి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా మంది అమ్మకూచిగానే ఉంటారు. మన టీమిండియా స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి కూడా ఆ కోవకు చెందినవారే! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మాతృ దినోత్సవం సందర్భంగా అందమైన ఫొటోలను పంచుకున్నారు ఈ సెంచరీల వీరులు. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. ‘‘కృత్రిమ మేధ(AI)తో అద్భుతాలు చేస్తున్న ఈ నవయుగంలో.. ఒక్క అమ్మ(AAI- ఆయి) స్థానాన్ని మాత్రం దేనితో భర్తీ చేయలేం’’ అంటూ తల్లి తనను దీవిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. అద్భుతమైన క్యాప్షన్‌తో అమ్మపై ఉన్న అనంతమైన ప్రేమను చాటుకున్నాడు. అమ్మ.. అత్తమ్మ.. వామిక తల్లి! ఇక విరాట్ కోహ్లి సైతం మదర్స్ డేను పురస్కరించుకుని తన తల్లి సరోజ్ కోహ్లి, అత్తగారు ఆషిమా శర్మల ఫొటోలను పంచుకున్నాడు. వారిద్దరితో పాటు తన సతీమణి అనుష్క శర్మ తమ గారాల పట్టి వామికను ఎత్తుకుని ఉన్న చిత్రాన్ని షేర్ చేస్తూ ఆమెకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. కోహ్లి ఈ మేరకు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్-2023లో కాగా వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్‌గా ఉన్న సచిన్.. అదే జట్టు తరఫున తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఈ ఏడాది అరంగేట్రం చేయడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి నేడు (మే 14) రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82*. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా 'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్ Happy Mother’s Day ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/oXTBkKWeIE — Virat Kohli (@imVkohli) May 14, 2023 In the Age of AI, the one that is irreplaceable will always be A”AI”!#MothersDay pic.twitter.com/p9Ys5CSVcP — Sachin Tendulkar (@sachin_rt) May 14, 2023 -
అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం: మెగాస్టార్
ఎంతగొప్ప పేరు గలవాడైనా ఆమె ముందు ఎప్పటికీ చిన్నవాడే. ఎందుకంటే ఈ సృష్టికి నిన్ను పరిచయం చేసిన ఆమె కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) మెగాస్టార్ ట్వీట్ రాస్తూ.. 'అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళాశంకర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d — Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023 -
మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా?
అమ్మ...ఆ పదం పలకడానికి పెదాలు కమ్మగా కదులుతాయి. అలా పిలవడానికి మనసు నిలువెల్లా పులకరించి గొంతులో ఏకమవుతుంది. అమ్మ గర్భంనుంచి బయటకొచ్చిన బిడ్డ కూడా ఈ ప్రపంచంకంటే ముందు అమ్మనే చూస్తుంది. అమ్మనే పిలుస్తుంది. అమ్మా అనే ఏడుస్తుంది. అమ్మ చుట్టూనే ప్రపంచం.. అమ్మ ఉంది కాబట్టే ప్రపంచం. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మను కీర్తిస్తూ అలరించిన గీతాలపై ఓ లుక్కేద్దాం. అమ్మంటే ప్రేమకి పర్యాయపదం. అమ్మ మనసు అనురాగ నిలయం. అమ్మ కమ్మని కథలు చెబుతూ.. నమ్మలేని లోకాల్ని కళ్లముందు చూపెడుతుంది. అంతే కాదు.. అమ్మ ధైర్యాన్ని నూరిపోస్తుంది. కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దుతుంది. ఐనా కొడుకెప్పుడా ఆ మమతల తల్లి మదిలో చిన్నిపిల్లవాడే. జన్మనిచ్చేదే అమ్మ అయినపుడు... ఆ అమ్మకు జన్మనిచ్చింది కూడా అమ్మే అయినపుడు అమ్మను మించిన దైవమేముంటుంది.. ఆ మాట మనుషులే కాదు.. ఆ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకే అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే అన్నారు. అమ్మ గురించి వింటుంటే.. అమ్మను చూస్తుంటే.. అమ్మ ఒడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే.. ప్రతిదీ మనసు ఫలకంపై అక్షరాలు దిద్దినంత గట్టిగా తాకుతుంది. అమ్మ ప్రేమకన్నా విలువైన సంపద ఈ సృష్టిలో లేనేలేదు. అమ్మ ఆప్యాయత ముందు ఏదీ నిలవదు. వందమంది దేవుళ్లు ఎదురుగా వచ్చి నిలబడినా.. ఆమ్మ అందించే ప్రేమ ముందు తక్కువే అవుతారు. కంటికి వెలుగునిచ్చే అమ్మ కదిలే దేవతే కదా. అమ్మా అని తొలిపలుకు పలికే అదృష్టం పెదాలకు దక్కిన అదృష్టమే కదా! సృష్టిలో ఒక మనిషికే కాదు.. ఏ జీవికైనా అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మలోని కమ్మదనం.. అమ్మప్రేమలోని మధురం ఒక్కటే. జన్మనిచ్చే తల్లే ఎవరికైనా తొలిదైవం... ఏ జీవికైనా అమ్మే ఒక వరం. బిడ్డ అలిగితే తల్లి బుజ్జగిస్తుంది. బ్రతిమిలాడో, బామాడో అన్నం తినిపిస్తుంది. అప్పుడే తన కడుపు నిండినట్టు భావిస్తుంది. ఐతే.. కొన్ని సందర్భాల్లో అమ్మ కూడా అలకబూనుతుంది. అప్పుడు కొడుకు పడే వేదన హృదయాన్ని తాకుతుంది. అమ్మ మీద ప్రేమని చెప్పకనే చెబుతుంది. అమ్మ అనే రెండక్షరాల పదం కంటే గొప్పది ఎవరు మాత్రం రాస్తారు. అసలు అంతకంతే గొప్పమాట.. అమ్మగురించి పాడటంకంటే గొప్ప పాట ఏముంటాయి? రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతున్నా... తనును నడిరోడ్డుమీద వదిలేసినా.. ఏ తల్లీ బిడ్డను శపించదు.. ఆకలికడుపుతో అలమటిస్తూనే నవ్వుతూ బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది. అమ్మా అని ప్రేమగా పిలిస్తే చాలనుకుంటుంది. మనిషైనా.. మాకైనా.. అమ్మకు.. అమ్మ మనసుకు ఆ భేదాలేమీ ఉండవు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది.. పాలిస్తుంది.. లాలిస్తుంది. ప్రాణంకంటే మిన్నగా కాపాడుకుంటుంది. జాబిల్లిని పిలిచినా... బూచోడని భయపెట్టినా ఊరుకోని బిడ్డ... అమ్మ చేతి స్పర్శ తగిలితే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే అమ్మ పిల్లల ప్రాణాలను తన అరచేతుల్లో పెట్టుకుని బతుకుతుంది. మన జీవితంలో అమ్మ లేని చోటుండదు.. అమ్మను స్మరించుకోని క్షణాలుండవు. మనకు తెలిసినా.. తెలియకపోయినా.. తమకు మాటలు నేర్పిన అమ్మను పిలవడానికి, తలవడానికి పెదాలెప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. బాధకలిగితే అమ్మా.. అలసిపోయేంతగా నవ్వితే అమ్మ.. దెబ్బ తాకితే అమ్మ.. కన్నీళ్లొస్తే అమ్మ.. కడుపు మాడితే అమ్మ.. కడుపు నిండినా అమ్మే.. అమ్మ తలపురాని చోటుండదు. ఎందుకంటే తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లలతోనే ఉంటుంది. అమ్మ బంధం కంటే వరమేముంటుంది... ఇలలో అంతకంటే సంతోషాల ఆనందం ఏముంటుంది. అందుకే అమ్మగురించి రాయని వాళ్లులేరు. అమ్మ జోలపాట గుర్తొచ్చి పాడనివాళ్లూ లేరు. అసలు ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు కూడా అమ్మే. అది అమ్మకు మాత్రమే సొంతమయ్యే ఘనత. బిడ్డకు ఎలాంటి హాని జరిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. దగ్గరుండి మనసు గాయాల్ని మాన్పుతుంది. మరి అమ్మకే తీరని కష్ణమొస్తే.. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ?కనిపెంచిన అమ్మకు ఏమైనా జరిగితే.. తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి కష్టకాలంలో ఆమ్మ జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది. వయసంతా వెనక్కి మళ్లి అమ్మ ఒడిలోకే పారిపోతుంది. నిజమే కదా... ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా.. బిడ్డను గుండెలకు హత్తుకుని.. ఆకశంలో విరిసే హరివిల్లును బిడ్డ బోసినవ్వుల్లోనే చూసుకునే అమ్మ మెరిసే మేఘం.. కురిసే వాన. అమ్మ గురించి పాడినా.. అమ్మగురించి రాసినా.. అమ్మగురించి మాట్లాడినా... అమ్మ గురించి చదివినా జన్మ గుర్తొస్తుంది. జన్మజన్మలకు అమ్మకు మొక్కుతూనే ఉండాలనిపిస్తుంది. కడుపున పుట్టకపోయినా... ఒక పసిబిడ్డ అమ్మకు కన్నబిడ్డలాగే కనిపిస్తుంది. ఒక అనాదను తీసుకొచ్చి పెంచుకున్నా..నిజమైన తల్లిమనసుకు ఎప్పుడూ పరాయి అనే భావమే ఉండదు. ఉంటే అమ్మ అనిపించుకోదు. ఇప్పుడు ఎంతో మంది తల్లులు అనాథపిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ప్రేమించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మకు సాటి పోటీ ఏమీ లేదు. ఏమన్నా ఉంటే అది మళ్లే అమ్మే అవుతుంది.. అక్కడకూడా అమ్మే ఉంటుంది. బిడ్డ కంటికి రెప్ప అమ్మ. ప్రేమైక శక్తి అమ్మ. ప్రపంచమంతా అమ్మను ఈరోజు విష్ చేయొచ్చు.. కానీ ఆ ప్రపంచాన్ని అమ్మ ఎప్పుడూ విష్ చేస్తూనే ఉంటుంది. అమ్మను ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రేమిద్దాం. ప్రేమగా పలకరిద్దాం. -
ఈ సూపర్ మామ్స్‌కి కుడోస్.. మదర్స్ డే స్పెషల్
కోవిడ్ టైమ్‌లో.. ఇటు ఆఫీస్ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్ మదర్స్ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 32.3 శాతమేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్ సెంటర్స్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్ కౌన్సెలర్స్ సపోర్ట్ అవసరమని స్పష్టం చేశారు. అది జాబ్స్ ఫర్ హర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే వివరం. కోవిడ్ తర్వాతే.. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్ మదర్స్ కోవిడ్ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్ మదర్స్ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట! ‘ప్రిడిక్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్ మదర్స్ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్ మదర్స్.. మెటర్నిటీ లీవ్, పాండమిక్ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్‌తో. ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్.. ఈ రోజు మదర్స్ డే! ఆ సందర్భంగా వర్కింగ్ మదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్‌గా డిఫరెంట్ కెరీర్‌కి స్విచ్ ఆన్ అయిన వర్కింగ్ మదర్స్ పరిచయ ప్రయత్నమే ఈ కథనం.. మమీయూ ఇదో మెటర్నిటీ గార్మెంట్స్ బ్రాండ్. శాలినీ శర్మ బ్రెయిన్ చైల్డ్. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి. ఆన్లైన్.. ఆఫ్‌లైన్ మార్కెట్ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లోనూ వెదికింది. ఫారిన్ బ్రాండ్స్‌లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. ఆ ప్రయాణానికి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్ నుంచి మిజోరమ్ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది. మమీయూను కమ్యూనిటీ బేస్డ్ క్లాతింగ్ బ్రాండ్‌గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్లో మెటర్నిటీ గార్మెంట్స్‌కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్‌ను లాంచ్ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్‌గా దేశంలోని డిఫరెంట్ సిటీస్‌లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. చాలెంజెస్‌ను హ్యాండిల్ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్ ప్లేస్‌నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్ కోసం హిమాచల్, సోలన్ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్ వర్క్ స్కిల్స్.. డిఫరెంట్ వర్క్ టైమింగ్స్‌లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్ సక్సెస్‌కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్‌గా మారిన మదర్ శాలినీ శర్మ. జాబ్స్ ఫర్ హర్.. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్ మదర్స్ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్ అంట్రప్రెన్యూర్ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్‌లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్గా సక్సెస్ఫుల్ కెరీర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది. ‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్‌లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్‌కి సంబంధించి అప్టు డేట్ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్‌ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్ మదర్స్‌కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్ చేసి.. వాళ్ల చేత సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్కెరీర్ను స్టార్ట్ చేసింది. అదే జాబ్స్ ఫర్ హర్ సంస్థ. మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఎంటర్ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్ ఫర్ హర్ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్ మదర్స్‌కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా. మిష్రీ డాట్ కామ్ జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్డీటీవీ ఫుడ్ చానెల్‌కి పదేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్‌కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్ రివ్యూ వెబ్‌సైట్‌గా డిసైడ్ అయింది. అదే మిష్రీ డాట్ కామ్ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్‌హుడ్ కారణంగా జాబ్ వదిలేసిన తల్లులు తమ కిచెన్ స్కిల్స్‌కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేసే తొలి వెబ్సైట్ కూడా! ‘మన ఎక్స్పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్ చానెల్లోని నా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నే నా ఈ ఫుడ్ రివ్యూ వెబ్సైట్ మీద ఇన్వెస్ట్ చేశా. సక్సెస్ చూస్తున్నా. ఈ వెబ్సైట్లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్‌లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. వీళ్లు సరే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తమ మదర్ హుడ్‌తో ఇన్ఫ్లుయెన్స్ చేసి.. మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వేల.. లక్షల ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. అనుప్రియ కౌర్.. ఆమె ఇన్స్టాగ్రామ్ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్ అండ్ ఫిట్ అని! కార్పొరేట్ ఉద్యోగిని. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఫిట్నెస్, శారీ ఫ్యాషన్ వరకు చాలా విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. రిద్ధి డోరా సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్ కోసం బయట కూడా వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను’ అంటుంది. చావి మిత్తల్ ‘మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్’విన్నర్. కంటెంట్ క్రియేటర్. ‘బీయింగ్ ఉమన్ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్‌కి సంబంధించి అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సరు ముఖర్జీ శర్మ ‘డైపర్స్ అండ్ లిప్స్టిక్స్’ పేరుతో పేరెంటింగ్ నుంచి ఫ్యాషన్, ఫిట్నెస్ దాకా అన్ని విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్‌లోని ‘బికాజ్ యూ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఏ మామ్’ అనే స్టేట్మెంట్తో! శ్రద్ధ సింగ్.. యూట్యూబ్‌లో చాలా పాపులర్. ఇన్‌స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్‌హుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్‌లను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్‌స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్ శ్రాడ్స్తో ఇంకో ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్ చేస్తూంటుంది. మదర్స్ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్.. షెఫ్.. బైకర్ గర్ల్.. స్కూబా డైవర్ అండ్ యాక్టర్’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్ అన్నీ ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్‌లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్ లేకుండా తనను తనలాగే ఇన్‌స్టాలో ప్రెజెంట్ చేసుకుంటుంది. గ్లామర్ రంగంలో వైట్ స్కిన్ పట్ల ఉన్న అబ్సేషన్ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్ నుంచి కాస్మెటిక్ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్ఫెక్ట్లీపర్ఫెక్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయినే చెప్తోంది. ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్‌గా పోస్ట్‌లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్‌పార్టమ్ స్ట్రెస్ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్ క్యారెక్టర్లకు కాల్షీట్స్ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్ గ్రామర్ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్ వంటివారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ మామ్స్కీ కుడోస్.. బాక్సర్ మేరీ కామ్ అంటే తెలియని వాళ్లుండరు! 2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు. వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్ మామ్ మేరీ కామ్. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్ టెన్నిస్ కోర్ట్‌లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం.