MPTC & ZPTC
-
జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులకు నేడు, రేపటి నుంచి ఐదేళ్ల పదవీ కాలం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా, పోలింగ్ 2021 ఏప్రిల్ 8న, కౌంటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీన ముగిశాయి. మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. -
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఆదివారం విడుదలై షరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఇప్పటివరకు 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్సీసీ 5998 స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. -
రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-
తెలంగాణలో భారీగా జీతాల పెంపు
ఫుల్‌టైమ్ కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్ల జీతం రూ.8 వేల నుంచి రూ.10,400కు.. ఇందులో పార్ట్‌టైమ్ వారి వేతనం రూ.4 వేల నుంచి రూ.5,200కు పెంపు. సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500కు.. జడ్పీటీసీలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు చేరనుంది. దినసరి వర్కర్లకు రూ.300 నుంచి రూ.390కు పెంపు.. వేతనాల పెంపు ఈ ఏడాది జూన్ నుంచే అమల్లోకి.. అంటే పెరిగిన జీతాలు జూలై ఒకటిన ఉద్యోగుల చేతికి అందుతాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గౌరవ వేతనం/ ప్రోత్సాహకం రూపంలో వేతనం పొందుతున్న ఉద్యోగులు, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులకు కూడా వేతనాల పెంపును వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో హోంగార్డులు, అంగన్వాడి వర్కర్లు, అంగన్వాడి అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఏలు), విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీఏవోలు), ఆశ వర్కర్లు, సెర్ప్ సిబ్బందితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంచాలని నిర్ణయించినందున.. ఉద్యోగుల వివరాలన్నీ వెంటనే పంపాలని కోరుతూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ నోట్ పంపింది. ఆయా శాఖల నుంచి వివరాలు అందగానే జీతాల పెంపు ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు తెలిపారు. సర్కారుపై మరింత భారం: ఏయే వర్గాలకు వేతనాలు పెంచితే ఎంత మేర భారం పడుతుందన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు ద్వారా ఖజానాపై రూ.35 కోట్ల మేర భారం పడనుంది. హోంగార్డులకు పెంపు వల్ల రూ.130 కోట్లకు పైగా, వీఆర్ఏలకు రూ.83 కోట్లు, అంగన్వాడీ వర్కర్లకు రూ.135 కోట్లు, అసిస్టెంట్లకు పెంపుతో రూ.85 కోట్ల మేర అదనపు భారం పడనుంది. వీరితోపాటు సెర్ప్ సిబ్బంది, ఆశావర్కర్ల గౌరవ వేతనాలు కలిపితే.. ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.550 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు. ఆ కేటగిరీల్లోకి రాని తాత్కాలిక ఉద్యోగులకూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1, 2, 3 కేటగిరీల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైనా.. ఈ మూడు కేటగిరీల్లోకి రాకుండా నిర్ధారిత వేతనం మీద పనిచేస్తున్న సిబ్బందిని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజాగా వారికి కూడా పెంపు అమలవుతుందని, అయితే 2020 రివైజ్డ్ పేస్కేల్ నిబంధనల ప్రకారం ఈ పెంపు ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కేటగిరీలకు పెంచుతూ ఉత్తర్వులు దినసరి వేతనంపై పనిచేస్తున్నవారు, కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్లు, పార్ట్‌టైమ్ వర్కర్లకు వేతనాలు 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు జీవో నం.64ను విడుదల చేశారు. జూన్ నుంచే పెంపు అమల్లోకి వస్తుందని, జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని తెలిపారు. గౌరవ వేతనం పెరిగే కేటగిరీలు, లబ్ధిదారుల సంఖ్య కేటగిరీ సంఖ్య హోంగార్డులు 17,850 అంగన్వాడీ వర్కర్లు 35,700 అంగన్వాడీ హెల్పర్లు 31,711 వీఆర్ఏలు 20,292 ఆశా వర్కర్లు 26,341 సెర్ప్ 4,200 జెడ్పీటీసీలు 538 ఎంపీటీసీలు 5,817 సర్పంచ్‌లు 12,759 -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ :నెల్లూరు జిల్లా
-
హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. చదవండి: చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం సిట్టింగ్‌లకు టీడీపీ షాక్.. జనసేనతో లోపాయికారి ఒప్పందం! -
ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది! ఏకగ్రీవాలను నీరుగార్చి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి భంగపడింది. గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఒకే ఒక నామినేషన్ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దని ఎన్నికల కమిషన్, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఇవీ పిటిషన్లు... ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, ఎస్ఆర్ వివేక్ చంద్రశేఖర్‌లు వాదించగా ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదించారు. ఆర్వోల విధుల్లో కమిషనర్ జోక్యం చేసుకోరాదు.. ‘రాజ్యాంగంలోని అధికరణ 243 కే కింద తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలో నిబంధనల్లో స్పష్టంగా ఉంది. వారి విధుల్లో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల కమిషనర్ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్మ్యాన్లా వ్యవహరిస్తున్నారు’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయక ముందే దాఖలైన ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ పేర్కొన్నారు. ఆ అధికారం మీకెక్కడుంది..? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. -
అభివృద్ధే ధ్యేయం
సాక్షి, ఖమ్మం : జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించింది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయిన కోరం కనకయ్య(టేకులపల్లి)తో పాటు వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు(చుంచుపల్లి), మిగిలిన జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులతో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఎన్నికల అధికారి హోదాలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలన వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేయడంతో పాటు గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని అన్నా రు. ప్రస్తుతం కొత్త జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పా టు కావడంతో గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలిగిందన్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర రంగాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే గత ఐదేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ తనకు ఈ విధంగా నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. అందరి తోడ్పాటుతో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత పంచాయతీలు, ప్రస్తుతం పరిషత్‌లు కూడా విభజించడంతో పాలన దగ్గరైందన్నారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలిసారిగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ వారిచే ప్రమాణం చేయించారు. వారిలో వాంకుడోతు ఉమాదేవి (ఇల్లెందు), భూక్య కళావతి (జూలూరుపాడు), కొమరం కాంతారావు (కరకగూడెం), పోశం నరసింహారావు (మణుగూరు), సున్నం నాగమణి (ములకలపల్లి), బిందు చౌహాన్ (సుజాతనగర్), వాగబోయిన రామక్క (గుండాల), లాలమ్మ (అన్నపురెడ్డిపల్లి), చిన్నంశెట్టి వరలక్ష్మి (అశ్వారావుపేట), మేరెడ్డి వసంత (లక్ష్మీదేవిపల్లి), బరపటి వాసుదేవరావు (పాల్వంచ), కొడకండ్ల వెంకటరెడ్డి (చండ్రుగొండ), పైడి వెంకటేశ్వరరావు (దమ్మపేట), ఇర్పా శాంత (చర్ల), కామిరెడ్డి శ్రీలత (బూర్గంపాడు), బెల్లం సీతమ్మ (దుమ్ముగూడెం), దాట్ల సుభద్రాదేవి (పినపాక), సూదిరెడ్డి సులక్షణ (అశ్వాపురం), కొమరం హనుమంతరావు (ఆళ్లపల్లి), కో–ఆప్షన్ సభ్యులు షర్ఫుద్దీన్ అహ్మద్, సయ్యద్ రసూల్ ఉన్నారు. -
ముహూర్తం నేడే..
సాక్షి, కొత్తగూడెం : జిల్లాలో కొత్తగా ఎన్నికైన మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మంగళవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. పునర్విభజన సమయంలో కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య పెరిగింది. గతంలో భద్రాద్రి జిల్లా పరిధిలో మొత్తం 17 మండల పరిషత్‌లు ఉండగా, వాటిలో రెండు రద్దయ్యాయి. కొత్తగా మరో 6 పెరిగాయి. దీంతో ఇప్పుడు వాటి సంఖ్య 21కి చేరింది. మండలాల పునర్విభజన తర్వాత కొత్తగూడెం మండలం పూర్తిగా మున్సిపాలిటీలో ఉండడం, భద్రాచలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రతిపాదించడంతో ఈ రెండు మండల పరిషత్‌లు రద్దయ్యాయి. కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తం 21 మండలాల్లో ప్రస్తుతం 20 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు కొత్తగా కొలువుదీరనున్నాయి. బూర్గంపాడు మండల పాలకవర్గ కాలపరిమితి మరో ఏడాది ఉండడంతో అక్కడ మండల పరిషత్ ఎన్నికలు జరుగలేదు. కాగా, బుధవారం జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావుతో కలిపి మొత్తం 21 మంది జెడ్పీటీసీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో కొత్తగూడెం ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్పు చేశారు. ఆలస్యంగా పాలకవర్గాల ప్రమాణస్వీకారాలు... జిల్లాల పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు కొనసాగాయి. ఇటీవల ఎన్నికలు జరిగి చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నప్పటికీ ఆయా పాలకవర్గాల ప్రమాణస్వీకారంలో మాత్రం ఇతర జిల్లాలతో పోలిస్తే నెల రోజులు ఆలస్యం అయింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక (భద్రాచలం రూరల్) మండలాలు ఏపీలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు నెలరోజులు ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించాయి. అయితే బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మాత్రం ఏడాది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ మండలంలోని నాలుగు గ్రామాలు ఏపీలో కలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం బూర్గంపాడు మండల పరిషత్‌కు ఎన్నికలు జరుగలేదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకవర్గం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం 20 మండల పరిషత్‌లు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. రేపు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. జిల్లా పరిషత్ విషయంలోనూ ప్రత్యేకతే ఉంది. గతంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సైతం రాష్ట్ర విభజన సమయంలో నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కాగా ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు ములుగు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గాలు సైతం నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేయనున్నాయి. బుధవారం ఈ నాలుగు జిల్లాపరిషత్‌లు కొలువుదీరనున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. గతంలో పీఓలుగా నియమించిన అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు ఫర్నిచర్ కూడా మంజూరు చేసినట్లు వివరించారు. భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాలు మినహా మిగిలిన 14 పాత మండలాలు, 6 కొత్త మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారని వివరించారు. -
‘కో–ఆప్టెడ్’కు ఇద్దరు పిల్లల నిబంధన
సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)లలో కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న నియమ, నిబంధనలన్నీ కో–ఆప్టెడ్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. శుక్రవారం ఎంపీపీ లు, శనివారం జెడ్పీపీలలో కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్ని క జరగనుంది. 1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనర్హులు కానున్నారు. ఎంపీపీలలో ఒకరిని, జెడ్పీలలో ఇద్దరి చొప్పున కో–ఆప్టెడ్ సభ్యులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సమా వేశం నిర్వహించే రోజు ఉదయం 9–10 గంటల మధ్య కో–ఆప్టెడ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి కూడా ఎన్నికైన సగం కంటే ఎక్కువ మంది సభ్యుల కోరం ఉంటేనే ఈ ఎన్నిక నిర్వహిస్తారు. కో–ఆప్టెడ్ సభ్యుడిగా పోటీచేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండటంతో పాటు 21 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండొద్దు. కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యాక ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల కోసం నిర్వహించే సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. అయితే వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎంపీపీ, జెడ్పీపీ కో–ఆప్షన్ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చిన పక్షంలో డ్రా ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ కో–ఆప్టెడ్ ఎన్నిక జరగకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. -
క్యాంపునకు పోదాం... చలో చలో!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ రాజకీయం మరింత రసవత్తరమైంది. ఇన్నాళ్లూ ఫలితాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులంతా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అధ్యక్ష ఎన్నిక గడువు ముంచుకొస్తుండడంతో ఆశావహులంతా ప్రాదేశిక సభ్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల రేసులో ఉన్న అభ్యర్థులు సంప్రదింపుల్లో తలమునకలయ్యారు. తమకు మద్దతివ్వాలని ప్రాధేయపడుతున్నారు. కీలక సభ్యులతో క్యాంపు రాజకీయాలు సైతం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 538 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు, 534 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఈనెల 8న జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గులాబీదే ఆధిక్యమైనా... జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి చెందిన వారే గెలుపొందడంతో 32 జిల్లాల్లో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను ఆ పార్టే కైవసం చేసుకోనుంది. పార్టీ ఆదేశానుసారం ఖరారైన అభ్యర్థులకే టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ సభ్యులంతా అందుబాటులో ఉండేలా ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మండల పరిషత్ స్థానాల్లోనూ అధికార పార్టీనే మెజార్టీ సీట్లు దక్కించుకుంది. కొన్ని మండలాల్లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రదర్శించింది. దీంతో హస్తం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 534 మండలాల్లో 437 మండల పరిషత్ పీఠాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి. మరో 67 మండలాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 30 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఈ మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రెబెల్స్, స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యుల మద్దతు కీలకం కానుంది. దీంతో వీరిని బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని సమీపంలో.. పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నెల 7, 8వ తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నిక ఉండడంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మండలాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్న చోట్ల కూడా క్యాంపులకు ఆస్కారమవుతోంది. సభ్యులు అందుబాటులో ఉండేలా, ఎన్నిక సమయానికి నేరుగా అక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రెండ్రోజులే గడువు ఉండటంతో ఆర్థిక భారం పెద్దగా ఉండదని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ తరహా క్యాంపులకు తెరలేపాయి. మరోవైపు హంగ్ ఉన్న మండలాల్లో అధికారపార్టీ తన బలాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తోంది. సంబంధిత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కీలక అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. స్వతంత్ర, ఇతర పార్టీకి చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు భారీ మొత్తంలో తాయిలాలు ప్రకటిస్తున్నా రు. రిజర్వ్ స్థానాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవినే కట్టబెడతామని ప్రలోభ పెడుతుండటంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొత్తంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసే దాకా ఈ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగనున్నాయి. -
యువకుడి ప్రాణం తీసిన పరిషత్ ఎన్నికలు
-
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
క్యాంప్‌లు నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘించినట్టే
సాక్షి, హైదరాబాద్: క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టతనిచ్చింది. వివిధ పరిషత్ పదవులకు నిర్వహించే పరోక్ష ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని వివిధ రాజకీయపార్టీలకు ఎస్ఈసీ తెలిపింది. కౌంటింగ్‌కు, ఎన్నికల నిర్వహణకు మధ్య మూడురోజుల వ్యవధి ఉన్నందున క్యాంప్ రాజకీయాలకు ఆయా పార్టీలు ఆస్కారం కల్పించినట్టు రుజువైతే నియమ, నిబంధనల ప్రకారం ఎస్ఈసీ చర్యలు చేపడుతుందని హెచ్చరించింది.ఈ నెల 7న మండల ప్రజాపరిషత్(ఎంపీపీ), 8న జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ) పదవులకు నిర్వహించే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ శనివారం ఎస్ఈసీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించింది. మండల, జిల్లా ప్రజాపరిషత్ కో ఆప్టెడ్ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల గురించి వివరించారు. కోఆప్టెడ్ ఎన్నికలకు పాటించాల్సిన నియమ, నిబంధనలు, జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు విప్‌లు ఎలా జారీచేయాలి, ఎప్పటిలోగా వాటిని పంపించాలి తదితర అంశాలను గురించి రాజకీయపార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటీ, రాజకీయ పార్టీలవారీగా పాటించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై అవగాహన కల్పించారు. ఎంపీపీ, జెడ్పీపీ పదవులకు నిర్వహించే ప్రత్యేక సమావేశా ల్లో కోరం లేకపోతే ఏం చేయాలి, ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరిం చారు. ఎస్ఈసీ తీసుకున్న చొరవ వల్లే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ వి.నాగిరెడ్డి, కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్తకార్యదర్శి జయసింహారెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి జి.నిరంజన్, మర్రి శశిధర్‌రెడ్డి(కాంగ్రెస్), శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్ఎస్), ఎన్.బాలమల్లేశ్(సీపీఐ), నంద్యాల నర్సింహారెడ్డి(సీపీఎం), ఇతరపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. -
‘చే’ జారొద్దు!
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాలకు ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ నిర్ణయించింది. మెజార్టీ స్థానాల్లో తమ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నందున అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వర కు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు గెలిచిన సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ, సమన్వయం చేసుకుంటూ సాగాలని పార్టీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విప్ జారీ చేసే అధికారంతో పాటు విప్‌ను ఉల్లంఘిస్తే సదరు సభ్యుడిపై వేటు పడే అవకాశం ఉండ టంతో విప్ల జారీని పకడ్బందీగా పూర్తి చేసి రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని నిర్ణయించారు. మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ఉత్తమ్ అప్పగించారు. జూన్ 2న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియ గురించి స్థానిక నేతలకు అవగాహన కల్పించాలని, ఎక్కడకూడా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేలా స్థానిక నాయకత్వాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సభ్యులతో 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించి, అధ్యక్ష ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టాలన్నారు. ఇందుకు 25 జిల్లాలకు టీపీసీసీ నుంచి పరిశీలకులను నియమించారు. ఈ పరిశీలకులే కౌంటింగ్ నుంచి చైర్పర్సన్ ఎన్నికల వరకు ఆయా జిల్లాల్లో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని సమావేశంలో తీర్మానం చేశా రు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.కుసుమకుమార్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పరిశీలకులు వీరే.. ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (సూర్యాపేట), మల్లు భట్టి విక్రమార్క (ఖమ్మం), కె.జానారెడ్డి (నల్లగొండ), షబ్బీర్‌అలీ (కామారెడ్డి), రేవంత్‌రెడ్డి (మేడ్చల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), జె.కుసుమకుమార్ (మెదక్), జి.చిన్నారెడ్డి (వనపర్తి), సీహెచ్ వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సంపత్‌కుమార్ (గద్వాల), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), డి.శ్రీధర్‌బాబు (భూపాలపల్లి), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (వికారాబాద్), మల్లురవి (నాగర్‌కర్నూల్), పి.సుదర్శ¯న్‌రెడ్డి (నిజామాబాద్), ఎ.మహేశ్వర్‌రెడ్డి (ఆదిలాబాద్), కె.ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), దొంతి మాధవరెడ్డి (మహబూబాబాద్), సీహెచ్ విజయరమణారావు (పెద్దపల్లి), కె.లక్ష్మారెడ్డి (రంగారెడ్డి), పాల్వాయి హరీశ్ (ఆసిఫాబాద్). మరో ఎనిమిది జిల్లాలకు పరిశీలకులను నేడో, రేపో ప్రకటించనున్నారు. కోటి మంది తరఫున అడుగుతున్నాం: ఉత్తమ్ ‘తెలంగాణలోని కోటి మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల తరఫున అడుగుతున్నాం. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలి’ అని ఉత్తమ్ కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీనే కొనసాగాలని కోరుతూ గురు వారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన ఉత్తమ్ మాట్లాడుతూ, రాహుల్ అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డారని చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నదే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయమని ఉత్తమ్ చెప్పారు. అనంతరం ఆయన కిషన్, వీహెచ్‌లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్‌అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 4న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు
-
పరిషత్ తొలి భేటీకి నిబంధనలు సవరించాలి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన వెంటనే జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. ఈ నిబంధనలు సవరించడం ద్వారా పరిషత్ ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ ఆలస్యం లేకుండా ఎన్నికైన సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునే వీలుంటుందని ఎస్ఈసీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అందగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుందన్నారు. సోమవారం జరగాల్సిన పరిషత్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ కౌంటింగ్ నిర్వహించే తేదీని ఎస్ఈసీ ప్రకటించాల్సి ఉంది. -
జూన్ రెండోవారంలోగా ‘పరిషత్’ కౌంటింగ్!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ రెండోవారంలో నిర్వహించే అవకాశముంది. రంజాన్ పండుగ ముగిశాక 12వ తేదీలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తిచేయవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించిన నేపథ్యంలో అప్పటిలోగా కౌంటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)యోచిస్తున్నట్టు తెలిసింది. బ్యాలెట్ బాక్సులను ఎక్కువగా పాఠశాలలు, విద్యాసంస్థలలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరచడంతోపాటు ఆయా చోట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మే 27న కౌంటింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఇదివరకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, పరిషత్ ఫలితాలు వెల్లడయ్యాక, జెడ్పీపీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికను 40 రోజుల తర్వాత నిర్వహిస్తే సభ్యులను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అవకాశం ఉందని ఎస్ఈసీకి వివిధ రాజకీయపక్షాలు ఫిర్యాదు చేశాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు వాయిదా వేయడం లేదా కౌంటింగ్ కాగానే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని కోరాయి. రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు... రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు సోమవారం నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్ఈసీ వాయిదా వేసింది. ఫలితాలు వెలువడ్డాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని, ఆ తర్వాత ప్రమాణస్వీకారం చేసేలా ప్రస్తుతమున్న పీఆర్ చట్ట నిబంధనలు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూలై మొదటివారంలో ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తవారు ప్రమాణస్వీకారం చేపట్టేలా చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫలితాలు ప్రకటించాక, పరోక్షపద్ధతుల్లో చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నికకు ఇంత వ్యవధి ఉండాలన్న నిబంధనను సవరిస్తే సరిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటున్న తరహాలోనే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికను కూడా పూర్తిచేస్తే సమస్యలుండవని పేర్కొంటున్నారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి స్పందన రాగానే జూన్ 12వ తేదీలోగా కౌంటింగ్ ముగించి జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత సభ్యుల పదవీకాలం ముగియకముందే కొత్త సభ్యుల ఎన్నిక పూర్తిచేసి, ఆ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కొత్త పీఆర్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా... ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వ తేదీ వరకు ఉంది. పరిషత్ ఓట్ల లెక్కింపు తర్వాత జూలై 4వ తేదీన కొత్త జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కొనసాగనున్న కోడ్... ఓటింగ్ ముగిసినా కౌంటింగ్, ఫలితాల ప్రకటన, చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నిక వంటి ప్రక్రియ పూర్తికానందున స్థానిక ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఎస్ఈసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేయవద్దని చెబుతున్నారు. జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక పూర్తయ్యాకే కోడ్ ముగుస్తుందని తెలిపారు. -
ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 25న రీపోలింగ్‌నకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈనెల 14న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా గుర్రంబోడ్ తండా (పోలింగ్ స్టేషన్ :39)లో రహస్య ఓటింగ్‌కు ఆటంకం కలగడంతోపాటు ఒకరికి బదులు మరొకరు ఓటేయడం, ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఒక ఓటరు ఉండగానే, మరొకరు ప్రవేశించడం, కొందరు రెండుసార్లు ఓటు వేయడం వంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఎన్నికలను సరిగా నిర్వహించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ జరిగినట్టు, చనిపోయిన వారి ఓట్లను కొందరు వేశారని, కొందరు ఓటేశాక బ్యాలెట్ పత్రాలను పోలింగ్ ఏజెంట్లకు చూపారని చిలకా కిషోర్‌కుమార్ అనే గ్రామస్తుడు ఎస్ఈసీకి చేసిన ఫిర్యాదుపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకుల నుంచి తీసుకున్న నివేదికల్లోనూ ఇదే అంశం స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న సూర్యాపేట జిల్లాలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నిక రద్దు చేస్తున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 14న ఈ స్థానాల్లో (పోలింగ్ కేంద్రం–39) పోలైన బ్యాలెట్‌బాక్స్‌లను విడిగా భద్రపరచాలని, ఓట్లను లెక్కించరాదని స్పష్టం చేశారు. -
కౌంటింగ్ తర్వాత 3 రోజుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీల ఎంపిక అంశంపై అఖిలపక్షం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 27న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మూడు రోజుల్లోనే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అఖిలపక్ష బృందం విజ్ఞప్తి చేసింది. జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకున్నాక జూలై మొదటివారంలో వారు పదవి స్వీకరించేలా చూడాలని, లేనిపక్షంలో కౌంటింగ్‌ను వాయిదా వేయాలని సూచించింది. కౌంటింగ్ పూర్తయ్యాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తే కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశముందని పేర్కొన్నాయి. ఈ మేరకు శుక్రవారం నాగిరెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.కోదండరెడ్డి, జి.నిరంజన్ (కాంగ్రెస్), ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), డాక్టర్ చెరుకు సుధాకర్(తెలంగాణ ఇంటి పార్టీ), ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు(టీజేఎస్), కె.గోవర్థన్ (న్యూడెమోక్రసీ) వినతిపత్రం సమర్పించారు. విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు... రైతుల పొలం పనులు, వర్షాకాలం వచ్చేలోగా ఎన్నికలు పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఎస్ఈసీ పరిషత్ షెడ్యూల్ విడుదల చేసినట్టు నాగిరెడ్డి చెప్పారని అఖిలపక్షనేతలు మీడియాకు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలనే విషయంపై అఖిలపక్ష బృందం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఫలితాలు ప్రకటించాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక చేపడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశముంటుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. పరిషత్ ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్పర్సన్ల ఎన్నిక జరిగేలా చూడాలని కోరినట్లు చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నల్లధనం, పోలీసులను ప్రయోగించి అధికారపార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇతర పార్టీ ల నాయకులను చేర్చుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, 3 రోజుల్లో జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని జూలై 5 తర్వాత బాధ్యతలు చేపట్టేలా చూడొచ్చని సూచించామన్నారు. గత 11 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వమనేదే లేదని, జూలైలో మున్సిపల్ ఎన్నికలు పెడతామని ఎన్నికల కమిషన్ చెబుతోందని షబ్బీర్ అలీ అన్నా రు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యా యని ఆరోపించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, జెడ్పీలు, ఎంపీపీల ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ను కోరినట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చట్టా లంటే ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
కౌంటింగ్... జర భద్రం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో పలు జాగ్రత్తలు వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. పింక్‌స్లిప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. గురువారం ఉత్తమ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీచేసిన అభ్యర్థులతో సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ పంపిన మార్గదర్శకాలను ఉత్తమ్ వివరించారు. కౌంటింగ్ మొదలు కాకముందే కేంద్రం లోపలికి వెళ్లాలని, ఆ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే అక్కడ్నుంచి బయటకు రావాలని ఏజెంట్లకు సూచించాలని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించిన తీరు, పోలింగ్ సరళి ఆధారంగా ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రాదేశిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధిస్తామని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఈసీని కలవనున్న టీపీసీసీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని, అధికార పార్టీకి సానుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. దీంతో జెడ్పీచైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక ప్రక్రియను కూడా ఫలితాలు వచ్చిన వెంటనే నిర్వహించాలని, లేదంటే పాత సభ్యుల పదవీ కాలం ముగిసేంతవరకు ఫలితాలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లి కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తున్న సిద్ధిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి చేత దీక్షను విరమింపజేశారు. అపహాస్యం చేయడమే: ఉత్తమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నికలు నిర్వహించడమంటే ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్, కుసుమ కుమార్‌లతో కలసి ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఫలితాలు వచ్చిన వెంటనే కొత్త వారిని ప్రమాణ స్వీకారం చేయించి వారిచేత ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించాలని, ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ఎంపీపీ, జెడ్పీచైర్మన్లను ఎన్నికలను కూడా నిర్వహించాలని, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెలరోజుల్లో బేరసారాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని, ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈనెల 21 రాజీవ్‌గాంధీ వర్థంతిని ఘనం గా నిర్వహిస్తామని, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి, జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బలరాంనాయక్, గాలి అనిల్‌కుమార్, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్‌లతో పాటు 15 జిల్లాల డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. -
‘ప్రాదేశికం’లో ప్రాభవం.. కాంగ్రెస్‌లో కొత్త ఆశలు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ పోరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి ఆశలే పెట్టుకుంది. ముగిసిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కనీసంగా 20 జిల్లా పరిషత్‌లలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొన్నామని, ఆయా స్థానాల్లో మెజార్టీ పీఠాలు కైవసం చేసుకుంటామని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలు, గ్రామీణ జిల్లాలే అయినా చిన్న జిల్లాలు, పాత జిల్లా కేంద్రాలున్న చోట్ల ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగామని, మిగిలిన చోట్ల కూడా శక్తిమేరకు పోరాడామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాగా, ప్రాదేశిక ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుని ఫలితాలపై బేరీజు వేస్తున్నారు. ‘ప్రాదేశికం’లో కాంగ్రెస్ ప్రాభ వం చాటుతుందని అంచనా వేస్తున్నారు. 10 పీఠాలన్నా దక్కాలి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో గట్టిపోటీనే ఇచ్చినా జిల్లా పరిషత్ పీఠాలు దక్కించుకునే విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కన్నా ఒకటి, రెండు జడ్పీటీసీ స్థానాలు ఎక్కువగానే సాధించినా అధికార పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో పరిషత్ పీఠం చేజారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కనీసం 10 జడ్పీ స్థానాలయినా దక్కుతాయా లేదా అన్నదానిపై లెక్కలు కడుతున్నారు. ఈ లెక్కల కోసమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల నుంచి తెప్పించుకున్న నివేదికలపై కసరత్తు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన ఫలితాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, ఏ మాత్రం అవకాశం ఉన్నా జిల్లా పరిషత్ పీఠం చేజారిపోకుండా వ్యూహం రచిస్తున్నారని అంటున్నాయి. అదే విధంగా ఎంపీటీసీల విషయంలో కూడా మంచి ఫలితాలే సాధిస్తామని, కనీసం 100–150 ఎంపీపీ పీఠాలు కూడా దక్కే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. వీటిపై కూడా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బృందం భారీ కసరత్తే చేస్తోందని తెలుస్తోంది. అవసరమైతే క్యాంపులు ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఈనెల 27నే వస్తున్నప్పటికీ జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక కోసం జూలై4 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు పాత సభ్యుల పదవీకాలం ఉన్నందున ఆ తర్వాతే కొత్త సభ్యులతో చైర్మన్లను ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి, ఫలితాలకు నెలకు పైగా సమయం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందనే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు. గెలిచిన సభ్యుల సాయంతో జిల్లా లేదా మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం స్పష్టంగా ఉంటే అవసరమైతే నెలరోజుల పాటు క్యాంపులు నిర్వహించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్కు మేలు జరిగేలా తమ పార్టీకి చెందిన కొత్త జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిర్ణయం తీసుకోకుండా వారిని కూడా వీలున్నంత మేర కట్టడి చేసేందుకు పథకాలు రూపొందిస్తున్నారు. అటు తమకు దక్కాల్సిన వాటిని దక్కించుకోవడంతో పాటు తమ ద్వారా టీఆర్ఎస్కు మేలు చేకూరకుండా అన్ని జాగ్రత్తలను ఇప్పటి నుంచే తీసుకుంటున్నామని, ఫలితాల తర్వాత వ్యూహం అధికారికంగా వెల్లడవుతుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం గమనార్హం. -
మూడో విడత పరిషత్ ఎన్నికలకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 14న మూడో విడత పోలింగ్ నేపథ్యంలో మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంక ర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం ఆదివారం సాయం త్రం 4 గంటలకు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన పరిషత్ మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు ప్రచారం పూర్తి చేయాలని పేర్కొంది. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానా ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ఇంకా ఉంటే కేసులు నమోదు చేస్తామని ఎస్ఈసీ పేర్కొంది. టీవీలు, రేడియోల్లో ప్రచారాన్ని ఆపేశా రు. మూడో విడత పోలింగ్ ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల గుర్తులను ప్రసారం చేయరాదని, బహిరంగంగా గుర్తులతో తిరగరాదని ఎస్ఈసీ తెలిపింది. గ్రామాలు, ప్రాదేశిక నియోజకవర్గాలు, మండలాల వారీగా పరిశీలకులు, వ్యయ పరిశీలకులు తిరుగుతున్నారు. ఇక ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులైన నేతలు రెండో విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఉండరాదని ఎస్ఈసీ ఆదేశించింది. అలాంటి వారు ఉంటే కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఇప్పటికే తొలి, రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు ముగిశాయి. అన్ని విడతల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. రూ. 3.22 లక్షల నగదు స్వాధీనం పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోరు కోసం ఓటర్లను మభ్య పెట్టేందుకు తరలిస్తున్న నగదు, మద్యాన్ని పట్టుకున్నారు. వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.3,22,140 నగదు, రూ.9.45 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం రూ.87,11,290 నగదును స్వాధీనం చేసుకోగా.. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షలు పట్టుకున్నారు. ఇక 280 మందిపై కేసు నమోదు చేసి, 233 మందిని అరెస్ట్ చేశారు. -
నేడు రెండో విడత పరిషత్ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల్లో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండోవిడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. (నక్సల్ ప్రభావిత 5 జిల్లాల పరిధిలోని కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలో గంట పోలింగ్ కుదించారు. మొత్తం 10,371 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయం నుంచే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు చేరుకోవడం మొదలైంది. శుక్రవారం 31 జిల్లాల పరిధిలో (మేడ్చల్ జిల్లాలో తొలివిడతలోనే ఎన్నికలు పూర్తి) కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పరిషత్ ఎన్నికలు ముగుస్తాయి. మిగిలిన 27 జిల్లాల్లో ఈ నెల 14న తుది విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని విడతలకు కలిపి పరిషత్ ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, గురువారం రూ.3.19 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ. 83.61 లక్షల విలువైన నగదును, రూ.89.86 లక్షల విలువైన ఇతర వస్తువులను పోలీసులు, ఇతర అధికారులు జప్తుచేశారు. ఇప్పటివరకు 215 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 188 కేసుల్లో చర్యలు తీసుకున్నారు. మూడోవిడత జాబితా సిద్ధం... ఈ నెల 14న జరిగే మూడో విడత ఎన్నికలకు సంబంధించి రాజకీయపార్టీలు, ఇండిపెండెంట్లవారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ విడతకు సంబంధించి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. 1,738, ఎంపీటీసీలు, 161 జెడ్పీటీసీలకు... మూడో విడతలో 161 మండలాల పరిధిలో 1,738 ఎంపీటీసీ, 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 5,726 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీలకు 741 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల విషయానికొస్తే సగటున ఐదు మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇదిలాఉంటే రెండో విడతలోనే ఎన్నికలు ముగియడంతో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మేడ్చల్–మల్కాజిగిరి, వరంగల్అర్భన్ జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు లేవు. -
పాత ప్రాదేశిక సభ్యులకే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో గెలిచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. మూడు విడతల్లో సాగుతున్న పరిషత్ ఎన్నికలు ఈనెల 14న ముగుస్తుండగా, ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, 27న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాత సభ్యులకు ఓటింగ్ అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ హక్కును కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కూడా కలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతూ కొత్తగా ఎన్నికవుతున్న పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై మొదటివారంలోనే మొదలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కొత్త సభ్యులు ఓటు వేసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. అదీగాకుండా ఈ స్థానాలకు జరుగుతున్న వి ఉప ఎన్నికలు కాబట్టి, పాత సభ్యులే ఓటేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. అంతకు ముందే కొండా మురళీధర్‌రావు కూడా తన ఎమ్మెల్సీ సీటును వదులుకున్నారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామాలిచ్చిన 6 నెలల్లోగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండడంతో ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది.