Mushrooms
-
నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!
ఫొటోలో వింత పువ్వులా కనిపిస్తున్నది నిజానికి పువ్వు కాదు, పుట్టగొడుగు. చూడటానికి నక్షత్రాకారంలో కనిపించడం వల్ల దీనిని ‘రౌండెడ్ ఎర్త్స్టార్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘గీస్ట్రమ్ సాకేటమ్’. ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా ఎండకు ఎండి, వానకు నాని పుచ్చిపోతున్న కలప దుంగలపై వేసవి చివరి భాగంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. హవాయి పొడి అడవుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. అమెరికా, కెనడా, చైనా, ఉరుగ్వే, కాంగో, క్యూబా, మెక్సికో, పనామా, దక్షిణాఫ్రికా, టాంజానియా, టొబాగో, భారత దేశాలలో కొంత అరుదుగా కనిపిస్తాయి. పుచ్చిపోయే దశలో ఉన్న కలప దుంగల్లోని క్యాల్షియంను ఆహారంగా చేసుకుని ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి మాసిపోయిన తెలుపు, లేతగోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు వివిధ ఛాయల్లో కనిపిస్తాయి.అయితే, ఇవి తినడానికి పనికిరావు. -
Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!
పుట్టగొడుగులు చాలా రకాలున్నాయి. ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి. అయతే బటన్ మష్రూమ్స్‌తో ఓస్టెర్ మష్రూమ్ ఎక్కువ రుచిగా ఉంటాయివీటిల్లోని గ్లుటామిక్ యాసిడ్ భిన్నమైన రుచిని అందిస్తుంది. సాధారణ బటన్ పుట్టగొడుగుల కంటే ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువ గ్లుటామిక్ యాసిడ్ ఉంటుంది. పుట్ట గొడుగులు శాకాహారమే అయినప్పటికీ ఖనిజాలు,ఫైబర్, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాన్‌వేజ్ తినని వారికి విటమిన్లు పూర్తిగా అందడంతోపాటు, సెలీనియంతో పాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ , ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఓస్టెర్ పుట్టగొడుగులు గ్లూటెన్-ఫ్రీ డైట్‌కు అద్భుతం పని చేస్తాయని, తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీఆక్సిడెంట్,యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయని చాలా మంది నిపుణులు నమ్ముతారు. రుచితో పాటు పోషకాలు మెండుగా ఉన్న ఓస్టెర్ పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు మరికొన్నింటిని చూద్దాం. ఓస్టెర్ పుట్టగొడుగులు: లాభాలు ♦ ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది ♦ విటమిన్ డి లెవల్స్ పెరగాలంటేపుట్టగొడుగులు తినాలి. ♦ సుగర్, బీపీ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ♦ రక్తహీనతనుంచి కాపాడుతుంది. ♦ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ♦ పుట్టగొడుగులను తింటే ఎముకలు దృఢంగా మారతాయి. ♦ కేన్సర్ఉంచి రక్షిస్తుంది. ♦ తక్కువ కేలరీలు పుట్టగొడుగులు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ♦ నరాల ఆరోగ్యానికి మంచిది: ♦ మానసిక ఆరోగ్యాన్ని కాపాడే డోపమైన్ , సెరోటోనిన్‌ను పుట్టగొడుగులలోని కాపర్ కంటెంట్ మనకు అందిస్తుంది. ♦ ఈ పుట్టగొడుగుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇందులోని B గ్రూప్ విటమిన్, నిద్ర, జ్ఞాపకశక్తికి చాలా మంచిది. నోట్: పుట్టగొడుగులను తినేముందు అవి మంచివా? కాదా? అని పరిశీలించుకోవాలి. అలాగే పుట్టగొడుగు నాణ్యతను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం. -
Health Tips: క్యారెట్లు, బీట్రూట్ తరచుగా తింటున్నారా? డేంజర్!
Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్యారట్లు క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ బీట్రూట్స్ను సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
ఈ పుట్టగొడుగులతో జాగ్రత్త సుమా!
సాక్షి, అమరావతి బ్యూరో: ఔషధ గుణాలు, పోషక విలువలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను లొట్టలేసుకుని తిననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పుట్టగొడుగులపై శాకహారులతోపాటు మాంసాహారులు కూడా మోజు పడుతున్నారు. హోటళ్లలోనే కాదు.. ఇంట్లో వంటకాల్లోనూ ఇదో స్పెషల్ డిష్‌గా ప్రత్యేకతను చాటుకుంటోంది. కోవిడ్ సమయంలోనూ ప్రజలు మాంసాహారానికి దీటుగా పుట్టగొడుగులను అధికంగా తీసుకున్నారు. ఈ తరుణంలో కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రాణాంతకమవుతున్నాయన్న వార్తలు జనంలో కలవరాన్ని రేపుతున్నాయి. తాజాగా అసోంలో పుట్టగొడుగులు తిని పది రోజుల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడటం, పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం అందరిలోనూ అలజడికి కారణమవుతోంది. ఈ పుట్టగొడుగులే ప్రాణాంతకం.. సాధారణంగా పంట పొలాలు, కొండ కోనలు, కాలువ గట్లు, అరణ్య ప్రాంతాలతోపాటు తడి కలిగిన ప్రదేశాల్లో పుట్టగొడుగులు సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. ఇలాంటి పుట్టగొడుగులు ఎక్కువ శాతం విషతుల్యమని.. అందువల్ల వీటిని తినడం ప్రాణాంతకమని వ్యవసాయ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పుట్టగొడుగులను తింటే కాలేయం, మూత్రపిండాలను స్వల్ప వ్యవధిలోనే దెబ్బతీసి మృత్యువాత పడేలా చేస్తాయని చెబుతున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయంగా కృత్రిమ వాతావరణంలో పెంచే పుట్టగొడుగులు విషపూరితం కావని పేర్కొంటున్నారు. తినే రకాలు నాలుగే.. ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా.. దేశంలో 283 పుట్టగొడుగుల జాతులున్నాయి. క్యాన్సర్, హైపర్‌టెన్షన్ వంటి జబ్బులకు పుట్టగొడుగులు ఔషధాలుగా పనిచేస్తాయి. ఇలా ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన, ప్రమాదకరం కాని నాలుగు రకాల జాతులనే పెంపకానికి అనువైనవిగా ఎంపిక చేశారు. వీటిలో వైట్ బటన్ మష్రూమ్, ముత్యపు చిప్ప లేక అయిస్టర్ మష్రూమ్, వరిగడ్డి లేదా చైనీస్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ రకాలను తినడానికి అనువైనవిగా గుర్తించారు. దీంతో కొన్నేళ్లుగా అటు దేశంలోనూ, ఇటు మన రాష్ట్రంలోనూ ఈ 4 రకాల పుట్టగొడుగులనే పెంచుతున్నారు. విషపూరిత మష్రూమ్‌లు.. పుట్టగొడుగుల్లో ఏడు రకాలను విషపూరితమైనవిగా గుర్తించారు. వాటిలో డెడ్ కాప్, కనోసీ బెట్టిలారిస్, వెబ్ కాప్స్, ఆటం స్కల్కాప్, డెస్ట్రాయింగ్ ఏంజెల్స్, పొడిస్టాన్ అకార్నడెమె, డెడ్లీ డాపర్లెరీలు ఉన్నాయి. తిన్నవారిపై 6 నుంచి 24 గంటల్లో ప్రభావం విషపూరిత పుట్టగొడుగులను తిన్నవారిపై ఆ ప్రభావం 6 నుంచి 24 గంటల్లో కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వాంతులు, నీరసం, కడుపులో నొప్పి, మగతగా ఉండడం, విరేచనాలు, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి లక్షణాలతోపాటు గ్యాస్ సంబంధిత ఇబ్బందులు కనిపిస్తాయి. బయట ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో ప్రమాదకర ముస్కోరిన్, ఇబోటెనిక్ అనే విష పదార్థాలుంటాయి. వాటిని తినడం ప్రమాదకరం, ప్రాణాంతకం. శాస్త్రీయంగా పెంచే పుట్టగొడుగులు ఆరోగ్యకరం. – వి.ప్రసన్న, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలంటే.. సామాన్య ప్రజలు విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా విచ్చుకున్నవి, పచ్చ రంగు, ఫంగస్‌తో ఉన్నవి, నల్ల మచ్చలతో ఉన్నవి తినడానికి పనికిరావని, ఒకవేళ వాటిని తింటే ప్రాణాంతకమవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా ప్రమాణాలు పాటించి పెంచే పుట్టగొడుగులే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. విషపూరిత పుట్టగొడుగులను అటవీ ప్రాంతాల ప్రజలు, శాస్త్రవేత్తలు తమ అనుభవంతో తేలిగ్గా గుర్తించగలుగుతారని చెబుతున్నారు. -
విషాదం: పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
అస్సాంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుట్టగొడుగులు తిని 13 మంది దుర్మణం పాలయ్యారు. అవి విషపూరితమైనవి కావడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అడవి పెరిగే పుట్టగొడుగులు తిని.. అస్సాం ఎగువ ప్రాంతం చరయ్దియో, దిబ్రుఘఢ్, శివసాగర్, టిన్సుకియా జిల్లాల నుంచి సుమారు 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఇందులో నలుగురు సోమవారం, తొమ్మిది మంది మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి ఉండగా.. ఎక్కువ మంది టీ తోటల్లో పని చేసే కూలీలని తెలుస్తోంది. అడవుల్లో పెరిగే పుట్టగొడుగుల్లో విషం ఉంటుంది. అయితే తినేవిగా పొరబడి ఇళ్లకు తీసుకెళ్లారు వాళ్లు. వండుకుని తిన్నాక ఫుడ్ పాయిజన్ కావడంతో నాలుగు జిల్లాలకు చెందిన 13 మంది మృతి చెందినట్లు అస్సాం మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ప్రశాంత దిఘింగియా వెల్లడించారు. చికిత్స తీసుకుంటున్న టైంలోనే వాళ్లంతా చనిపోయినట్లు తెలిపారు. అస్సాం అడవుల్లో దొరికే విషపూరితమైన పుట్టగొడుగుల్ని.. తినేవిగా పొరబడడం, ఇలాంటి ఘటనలు జరగడం మామూలే. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం ఇదే మొదటిసారి కావొచ్చని వైద్యులు అంటున్నారు. -
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
Mushrooms: పుట్టగొడుగులు తిన్నారంటే..
Mushrooms Health Benefits In Telugu: పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజ పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ ఉండడం వల్ల యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేయడమేగాక, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని కొన్ని రకాల ఎంజైమ్‌లు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. ►పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి ఖనిజపోషకాలు, విటమిన్లు, పీచు పదార్ధాలు, కార్బొహైడ్రేట్స్ అందుతాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ►ఆహారంలో పుట్టగొడుగుల్ని చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు, అజీర్ణం, మలబద్దకం సమస్యలు దరిచేరవు. ►ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఎదరుకాదు. చదవండి: Health Tips: బరువును అదుపులో ఉంచే మిరియాలు -
ఓ సామాన్య రైతు విజయగాథ.. నెలకు రూ.1.50 లక్షల ఆదాయం
నాతవరం( విశాఖపట్నం): ఓ రైతు సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడ్పడింది. కరోనా విసిరిన సవాళ్లతో వారి కృషి మరింత రాటు దేలింది. ఇప్పుడు వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన ఓ సామాన్య రైతు విజయగాథ ఇది. వెదురుపల్లి గ్రామానికి చెందిన చిత్రాడ వెంకటేశ్వరరావుకు చిన్నప్పట్నుంచీ పుట్టగొడుగుల పెంపకం అంటే అమితాసక్తి. పుట్టగొడుగుల (మష్రూమ్స్) ఉత్పత్తిపై అవగాహన పెంచుకున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న 26 సెంట్ల భూమిలో 2018లో శ్రీతులసి పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో వడ్డీలకు అప్పు చేసి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు నుంచి విత్తనాలు కొనుగోలు చేసి స్ధానికంగా లభ్యమయ్యే వ్యవసాయ వ్యర్ధాలతో తన కుమారుడు దుర్గాప్రసాద్ సాయంతో 2019లో పాల రకం పుట్టగొడుగుల (మిల్కీ మష్రూమ్స్) పెంపకాన్ని ప్రారంభించారు. మొదట్లో రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి విక్రయాలు చేసేవారు. వీరి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న ఉద్యానవనశాఖ అధికారులు యూనిట్‌ను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రాయితీపై రుణం ఇస్తామని అధికారులు సూచించారు. వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ యూనిట్ ఏర్పాటు కావలసిన డీపీఆర్ తయారు చేసి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబదీ్ధకరణ పథకంలో రుణానికి దరఖాస్తు చేసారు. ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసి దాంట్లో రూ.8 లక్షలు (40 శాతం) రాయితీని ఇచి్చంది. ప్రభుత్వ సాయంతో ఇప్పుడు నెలకు సరాసరి 1000 కేజీల పుట్టగొడుగులు తయారు చేస్తున్నారు. వీటిని విశాఖపట్నం, నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలలో ఉన్న హోల్‌సేల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కేజీ ఒక్కంటికి రూ 200 నుంచి 220 వరకు విక్రయాలు చేస్తున్నారు. పెట్టుబడితోపాటు కూలి సొమ్ము పోగా నెలకు లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని దుర్గాప్రసాద్ చెప్పారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసినవి: పుట్టగొడుగులు (మష్రూమ్స్)-1 కప్పు, కాప్సికం ముక్కలు-1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసినవి),వెల్లుల్లి- 4 రెబ్బలు, టొమాటో కెచప్-2 టేబుల్ స్పూన్లు, వెనిగర్-1 టేబుల్ స్పూన్, సోయా సాస్-2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-సరిపడా, నీళ్లు- కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు- గార్నిష్‌కి, నూనె-తగినంత తయారీ: ముందుగా పుట్టగొడుగులను నూనెలో మీడియం మంట మీదే దోరగా వేయించాలి. అదే సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, సోయాసాస్, వెనిగర్‌ను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయి తీసుకుని, 2 గరిటెల నూనె వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలతో పాటు.. క్యాప్సికమ్ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఆపై పుట్టగొడుగుల్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం మిగిలిన టొమాటో కెచప్‌తో పాటు.. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కీమా పోహా కావలసినవి: కీమా-పావు కప్పు (మెత్తగా ఉడికించుకోవాలి), అటుకులు(పోహా)-ముప్పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు-అర టీ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి), కారం-అర టీ స్పూన్, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్-1 టీ స్పూన్ చొప్పున, గ్రీన్ బఠాణీ-కొద్దిగా (నానబెట్టి, ఉడికించినవి), పసుపు-అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-3 టేబుల్ స్పూన్లు, టొమాటో, క్యారెట్ ముక్కలు-కొన్ని (చిన్నగా కట్ చేసినవి) కరివేపాకు, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీ: ముందుగా 2 టీ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. అందులో టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం ఉడికించిన కీమా వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. తర్వాత ఆమ్ చూర్ పౌడర్, గ్రీన్ బఠాణీ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈలోపు అటుకులు తడిపి, వెంటనే నీళ్లు లేకుండా గట్టిగా పిండి, కీమాలో వేసుకుని తిప్పుతూ ఉండాలి. కళాయికి మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర, కారప్పూస వంటివి వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. వాల్నట్ షీరా కావలసినవి: రవ్వ-1 కప్పు (దోరగా వేయించుకోవాలి), వాల్నట్స్-1 కప్పు (మెత్తగా మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి కోరు- పావు కప్పు, ఏలకుల పొడి-కొద్దిగా, నెయ్యి- పావు కప్పు, పంచదార-1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు), పాలు-రెండున్నర కప్పులు, చాక్లెట్ పౌడర్-పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు-గార్నిష్ కోసం(అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంత సేపు తర్వాత చాక్లెట్ పౌడర్, వాల్నట్స్ గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ, కొబ్బరి కోరు వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడేదాకా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ వాల్నట్ షీరా. అభిరుచిని బట్టి పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. -
మష్రూమ్ మెరుపులు
భారత్, చైనాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల కాంతులీనే పుట్టగొడుగుల్ని కనుగొంది. ఈశాన్య భారత్ లోని వెదురు అడవుల్లో వీటిని గుర్తించారు. రేడియం లాగా చీకట్లో మిరుమిట్లు గొలపడం వీటి ప్రత్యేకత. పుట్టగొడుగుల్లో జీవ వైవిధ్యంపై 2019లో జరిపిన సర్వేలో మొదటిసారిగా ఇవి ‘వెలుగు’ లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాంతులు విరజిమ్మే జీవ జాతుల సంఖ్య 97కు చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకివి మెరుస్తున్నాయంటే.. ఈ పుట్టగొడుగులు ఇలా మిలమిలా మెరవడానికి కారణం వాటిలో స్రవించే లూసిఫరేజ్ అనే ఎంజైమ్. వాటి జీవక్రియల్లో భాగంగా జరిగే రసాయనిక చర్యల్లో ఎప్పుడైనా శక్తి అధికంగా ఉత్పత్తి అయితే అది ఆకుపచ్చని కాంతి రూపంలో విడుదలవుతుందని పరిశోధకులు వివరించారు. అయితే ఆ కాంతి వాటి కాండం వరకే ఎందుకు పరిమితమైందనేది తమకు సైతం అంతుపట్టని మిస్టరీనే అని వారు పేర్కొన్నారు. అసలు కారణమిదేనా? ఫలదీకరణం కోసం మొక్కలు పూల ద్వారా రకరకాల కీటకాలను ఆకర్షిస్తాయనేది తెలిసిందే. ఈ పుట్టగొడుగులు కూడా ఇందుకోసమే కాంతిని వెదజల్లుతున్నాయని ఒక వాదన వినిపిస్తోంది. జంతువులు తమను తినకుండా బెదరగొట్టేందుకే ఇవి ఇలా మెరుస్తుంటాయని కూడా మరో వాదన ప్రచారంలో ఉంది. ఏదేమైనా ఇలా ఆకుపచ్చ రంగులో మెరవడం సాధారణంగా సముద్రజీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భూమిపై నివసించే ప్రాణుల్లో ఇప్పటివరకూ మిణుగురులు మాత్రమే ఆకుపచ్చ రంగును వెదజల్లుతుండగా, తాజాగా ఆ జాబితాలో ఈ పుట్టగొడుగులు కూడా చోటు దక్కించుకున్నాయి. -
అవి మాత్రమే తినదగిన మష్రూమ్స్
డెహ్రాడూన్: కుమావన్ ప్రాంతంలోని సాల్ అడవుల్లో పెరిగే 34 రకాల పుట్టగొడుగు జాతులను ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధన విభాగం గుర్తించింది. వాటిపై పరిశోధన జరిపిలో 14 రకాలు జాతుల పట్టగొడుగులు మాత్రమే తినదగినవిగా గుర్తించారు. అయితే పుట్టగొడుగులపై సాల్ అడవుల్లోని అయిదు వేర్వేరు ప్రదేశాల్లో గత మూడు నెలలుగా అధ్యయనం జరుపుతున్నామని అటవీ శాఖ పేర్కొంది. అందులో మూడు నైనిటాల్ జిల్లాలో, మరో రెండు ఉధమ్ సింగ్ నగరంలో ఉన్నట్లు చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా సాల్ అడవుల్లో 34 జాతుల పుట్టగొడుగులను సేకరించినట్లు పరిశోధన విభాగం జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ కిరణ్ బిష్ట తెలిపారు. వీటిలో కేవలం 14 జాతులు మాత్రమే తినదగినవని ఆయన వెల్లడించారు. వీటిలో టెర్మిటోమైసెస్, జిలేరియా హైపోక్సిలాన్ మొదలైన పుట్టగొడుగులను స్థానిక ప్రజలు అత్యంత ఎక్కువగా తింటుంటారని ఆయన వెల్లడించారు. అంతేగాక ఈ పుట్టగొడుగులపై స్థానిక ప్రజలకు మంచి అవగాహన ఉందని మరో పరిశోధకుడు జ్యోతి ప్రకాష్ తెలిపారు. వారు తరచూ ఈ అడవుల్లో తిరగడం వల్లే వీటిపై అవగాహన పెరిగిందని వివరించారు. (చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి) ఈ పుట్టగొడుగులను స్థానిక ప్రజలు రుతుపవనాల సమయంలో మార్కెట్లలో విక్రయిస్తున్నందున ఈ అధ్యయనం వారికి ఉపయోగిపడటమే కాకుండా పుట్టగోడుగులపై మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందన్నారు. పుట్టగొడుగులు మంచి ఆహారమే కాకుండా ఆదాయ వనరుగా ఉపయోగిపడుతున్నాయన్నారు. బటన్ తరహా పుట్టగొడుగులు కిలోకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉందని జ్యోతీ ప్రకాష్ తెలిపారు. ఈ రీసెర్చ్‌ను అటవీ పరిశోధన విభాగం జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. కిరణ్ బిష్ట, జ్యోతి ప్రకాష్‌లతో పాటు తనూజా పాండే, కనిష్ కుమార్(ఫారెస్ట్ గార్డు)లు పుట్టగొడుగులపై అధ్యయనం చేస్తున్నారు. వారు గుర్తించిన కొన్ని తినదగిన పుట్టగొడుగులలో కోప్రినెల్లస్ డిసెమినాటస్, కోప్రినస్ కోమాటస్, హైగ్రోసైబ్ కాంటారెల్లస్, రుసుల్లా బ్రీవిప్స్, మాక్రోలెపియోటా ప్రోసెరా, గానోడెర్మా లూసిడమ్, కోప్రినెల్లస్ మైకేసియస్ మొదలైనవి ఉన్నాయని తనూజా పాండే వెల్లడించారు. (చదవండి: ఇలాంటి స్పైడర్ ఎప్పుడైనా చూశారా..) -
పుట్టగొడుగులతో జాబిల్లిపై ఇళ్లు?
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. భవిష్యత్తులో జాబిల్లిపై కట్టే ఇళ్లు ఇతర ఆవాసాలకు పుట్టగొడుగులను వాడతారట! అదెల? అని ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ అంశంపై ఇప్పటికే కొంత పనిచేసింది. చంద్రుడితోపాటు అంగారకుడు.. ఇతర గ్రహాలపై కూడా పుట్టగొడుగులు (శాస్త్రీయ నామం మైసీలియా ఫంగస్)ను పెంచడం ద్వారా ఇళ్లు, భవనాలను కట్టేయవచ్చునని నాసా అంటోంది. అంతేకాదు. అంగారకుడి మట్టిపై పుట్టగొడుగులు పెంచడం ఎలా అన్నది కూడా ఇప్పుడు పరీక్షిస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇతర గ్రహాలపై ఆవాసాలకు ఇక్కడి నుంచి సామాగ్రి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. నిద్రాణ స్థితిలో ఉన్న పుట్టగొడుగులు కొన్నింటిని తీసుకెళితే చాలు. ఆ గ్రహం చేరిన తరువాత వాటిని పెంచేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే చాలని, సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకోగల బ్యాక్టీరియా అందిస్తే పెరుగుతున్న క్రమంలోనే పుట్టగొడుగుల ఆకారాన్ని కూడా నిర్ణయించవచ్చునని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా పెరిగిన వాటిని వేడి చేస్తే.. ఇటుకలు సిద్ధమవుతాయి. వాటితో ఎంచక్కా మనకు కావాల్సిన నిర్మాణాలు చేసుకోవచ్చునన్నమాట! అంతేకాదు.. ఇటుకలుగా మారకముందు పుట్టగొడుగుల సాయంతో నీటిని, మలమూత్రాలను శుభ్రం చేసుకుని వాటి నుంచి ఖనిజాల్లాంటివి రాబట్టుకోవచ్చునని నాసాలోని ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త లిన్ రోథ్స్‌ఛైల్డ్ తెలిపారు. -
ఇంటింటా పౌష్టికాహార ‘పుట్ట’!
మన దేశంలో ప్రజలు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేయగలిగినవి పుట్టగొడుగులు. వీటిలోని పోషక విలువలు, ఔషధగుణాల గురించి తెలిసినప్పటికీ.. ప్రజలకు అందుబాటులోకి తేవడం అంతగా సాధ్యపడటం లేదు. పుట్టగొడుగులు పట్టణాలు, నగరాల్లో కూడా అరుదుగానే అందుబాటులో ఉంటున్నాయి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి పోషకాల గనులైన పుట్టగొడుగులు ఇప్పటికీ అందని ద్రాక్షల్లాగే మిగిలిపోయాయి. వీటి పెంపకానికి నైపుణ్యం అవసరం. విత్తన లభ్యత కూడా పెద్ద సవాలుగా ఉంది. అయితే, పుట్టగొడుగులను ఎక్కడో పెంచి తీసుకువచ్చి దుకాణాల్లో ప్రజలకు అమ్మేదానికి బదులు.. ‘పుట్టగొడుగులను అందించే సంచి’ని అమ్మటం ఉత్తమమైన పని అని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనాసంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకోసం వారు ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్ సాంకేతికతకు రూపకల్పన చేశారు. ఒక్కో బ్యాగ్‌తో 300 గ్రా. పుట్టగొడుగులు కిలో బరువుండే బ్యాగ్‌ను తెచ్చుకొని ఇంట్లో ఎండ తగలని, గాలి పారాడే చోట వేలాడదీసి ఉంచితే.. ఐదు లేక 6 రోజుల్లో 200–300 గ్రాముల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. ఈ బ్యాగ్‌ను బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో ముందుగా బుక్ చేసుకున్న వారికి లాభాపేక్ష లేకుండా రూ. 20లకే విక్రయిస్తోంది. అయితే, దీన్ని తయారు చేసే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది. ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలకు సాంకేతికతను అందించడంతోపాటు, ఏడాదిలో 3 దఫాలు శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకానికి వరిగడ్డితో బ్యాగ్‌ల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలు బ్యాగ్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోదలచిన వారు ఐఐహెచ్ఆర్ రూపొందించిన మల్టీఫ్యూయల్ బాయిలర్, స్టెరిలైజేషన్ యూనిట్, మోటారుతో నడిచే చాఫ్ కట్టర్లను రూ. 5–6 లక్షల ఖర్చుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3–4 గదుల షెడ్/భవనంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పాన్‌ను ఐఐహెచ్ఆర్ లేదా మరెక్కడి నుంచైనా తెచ్చుకొని బ్యాగ్‌లను ఉత్పత్తి చేసుకొని వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ఈ యూనిట్ ద్వారా రోజుకు కిలో బరువైన బ్యాగ్‌లు 100 వరకు (2 కిలోల బ్యాగులైతే 50 వరకు) ఉత్పత్తి చేయొచ్చు. బ్యాగ్‌లలో పుట్టగొడుగులు పెంచుతున్న గృహిణులు స్పాన్ ఉత్పత్తి కీలకం పుట్టగొడుగుల పెంపకంలో స్పాన్ (విత్తనం) లభ్యత కీలకాంశం. అయితే, పుట్టగొడుగుల స్పాన్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ. 20 లక్షల పెట్టుబడితోపాటు 1500 చదరపు అడుగుల పక్కా భవనంలో వసతి అవసరమవుతుంది. స్పాన్ ఉత్పత్తి సాంకేతికతను ఐఐహెచ్ఆర్ అందిస్తోంది. శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ కాలం 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వ శాఖలు కోరితే రాష్ట్రాల్లోనూ శిక్షణ ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌లను, పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి సాంకేతికతలపై ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వచ్చి కూడా శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ/ఉద్యాన శాఖల కోరిక మేరకు కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షణా తరగతులు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం 5 చోట్ల పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజలకు బ్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. చలికాలంలో ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం మిల్కీ మష్రూమ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర సమాచారం కోసం ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు సంప్రదించాల్సిన చిరునామా: అధిపతి, విస్తరణ–సాంఘిక శాస్త్రాల విభాగం, ఐసిఎఆర్–ఐఐహెచ్ఆర్, హెసరఘట్ట, బెంగళూరు – 560089. Email: Venkattakumar.R@icar.gov.in http://www.iihr.res.in/ 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు పుట్టగొడుగులను అందించే ఈ రెడీ మేడ్ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు సులభంగా ఐదారు రోజుల్లో తాజా పుట్టగొడుగులను కళ్లముందే పెంచుకోవచ్చు. పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లో శుద్ధి చేసిన వరి గడ్డి ముక్కలతోపాటు పుట్టగొడుగుల విత్తనం చల్లి, మూతి కట్టేస్తారు. ఈ బ్యాగును వినియోగదారుడు కొని తెచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టుకొని, దానికి అక్కడక్కడా చిన్న బెజ్జాలు చేస్తే చాలు. ఆ బెజ్జాల్లో నుంచి పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిపై నీటి తుంపరలను రోజుకోసారి పిచికారీ చేస్తుంటే చాలు. బ్యాగ్‌పై పుట్టగొడుగులు పెరగడానికి వీలుగా చిన్న బెజ్జం చేస్తున్న దృశ్యం కేవలం 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు వంటకు సిద్ధమవుతాయి. ఇలా ఎవరికి వారు ఇంట్లోనే పెద్ద హైరానా ఏమీ లేకుండా సునాయాసంగా పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. మరీ ముదిరిపోక ముందే కోసుకుంటే చాలు. ఈ పని చేయడానికి నైపుణ్యం ఏమీ అవసరం లేదు. చదువు లేని గృహిణులు కూడా సులభంగా ఈ పద్ధతిలో పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకోగలుగుతారు. తాజా పుట్టగొడుగులను కూర వండుకోవచ్చు లేదా ఎండబెట్టి పొడి (ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు) చేసి రోజువారీగా ఆహార పదార్థాల్లో కలిపి వాడుకుంటూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాగ్‌పై మొలిచిన పుట్టగొడుగులపై నీటి పిచికారీ పోషక గనులు.. ఔషధ గుణాలు! పుట్టగొడుగులు కూడా మొక్కల్లాంటివే. మొక్కల్లో మాదిరిగా క్లోరోఫిల్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. పోషకాల గని వంటివి పుట్టగొడుగులు. ప్రొటీన్లు, బి విటమిన్లు ఉన్నాయి. విటమిన్ డిని కలిగి ఉండే ఏకైక శాకాహారం పుట్టగొడుగులు మాత్రమే. వీటిల్లోని ఐరన్ ఆహారంగా తీసుకున్న వారికి ఇట్టే వంటపడుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి టైప్ –2 మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా తినవచ్చు. సోడియం అతి తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి కొలెస్ట్రాల్ అసలు లేని కారణంగా పుట్టగొడుగులు హృద్రోగులకు అద్భుత ఆహారం. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తాయి. పుట్టగొడుగులు శాకాహారులకు అద్భుతపోషకాల వనరు మాత్రమే కాదు, మాంసాహారం వాడకాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి రుచికరమైన సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ లాబ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. మీరా పాండే తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ పుట్టగొడుగులు ఇప్పటికీ భారతీయ ప్రజల రోజువారీ ఆహారంలో భాగం కాలేకపోతున్నాయి. అందుకోసమే ఇంటింటా పుట్టగొడుగులు పెంచుకునే సులభమార్గాన్ని తాము రూపొందించినట్లు డా. మీరా పాండే ‘సాక్షి’తో అన్నారు. డా. మీరా పాండే – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బ్యాక్టీరియాతో ఒత్తిడికి ఔషధాలు..
పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ఉండే సైలోసైబిన్ అనే రసాయనం ఒత్తిడి చికిత్సకూ ఉపయోగపడుతుంది. అయితే వీటి మోతాదు చాలా తక్కువ. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ బ్యాక్టీరియా సాయంతో సైలోసైబిన్ రసాయనాన్ని తయారు చేసే పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జీవక్రియల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. పుట్టగొడుగుల్లో సైలోసైబిన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే జన్యువులను ఇకోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి గ్రాముల స్థాయిలో సైలోసైబిన్ ఉత్పత్తి చేశాయి. ఇది ఒకరకంగా బీర్ తయారు చేయడం లాంటిదేనని.. ధాన్యం గింజలతో తయారైన ద్రావణాన్ని బ్యాక్టీరియా సాయంతో పులియబెట్టినట్లు ఉంటుందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. తగిన పరిస్థితుల్లో ప్రతి లీటర్ ద్రావణం ద్వారా 1.16 గ్రాముల సైలోసైబిన్ ఉత్పత్తి అయినట్లు చెప్పారు. తొలుత ఈ పద్ధతిలో మిల్లిగ్రాముల స్థాయిలో మాత్రమే సైలోసైబిన్ ఉత్పత్తి అయ్యేదని, ఉష్ణోగ్రత వంటి అనేక అంశాల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఉత్పత్తిని 500 రెట్లు ఎక్కువ చేయగలిగామని వివరించారు. పరిశోధన వివరాలు మెటబాలిక్ ఇంజనీరింగ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
పాల పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ వ్యాపకంగా పాల పుట్టగొడుగుల(మిల్కీ మష్రూమ్స్) పెంపకాన్ని చేపట్టవచ్చని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సూచిస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే పాల పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులు నిరంతరాయంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చని, తమకు అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ పెట్టుబడితోనే పుట్టగొడుగుల సాగును చేపట్టవచ్చని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల మొక్కల తెగుళ్ల శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల తెలిపారు. తమ కళాశాల ఆవరణలో రైతులకు ప్రతి నెలా మూడో శనివారం ఆమె శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వపరంగా పుట్టగొడుగుల సాగుపై సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇస్తున్నది ఈ ఒక్క చోట మాత్రమే. శిక్షణ పొందిన వారు తమ ప్రాంతంలో పుట్టగొడుగుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చు. రైతులు, ఇతర స్వయం ఉపాధి మార్గాలను అనుసరించే వారు దీన్ని ఉప వ్యాపకంగా చేపట్టవచ్చు. ఆసక్తి గల వారు ప్రతి నెలా మూడో శనివారం నేరుగా తమ కళాశాలకు వచ్చి రూ. 500 చెల్లించి శిక్షణ పొందవచ్చని డా. ప్రమీల వివరించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా వచ్చి.. ప్రతి నెలా మూడో శనివారం ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు శిక్షణ పొందవచ్చు. సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. గ్రామాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వరి గడ్డి, వెదురు కర్రలు తదితరాలను వినియోగించి.. రూ. వెయ్యి పెట్టుబడితో కూడా పాల పుట్టగొడుగుల సాగును ప్రారంభించవచ్చని డా. ప్రమీల వివరించారు. శిక్షణ పొందిన వారిని ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చి.. తదనంత కాలంలో పుట్టగొడుగుల సాగులో వచ్చే సమస్యలు, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తామన్నారు. పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సిన విత్తనం ధర కిలో రూ. 100 ఉంటుంది. కిలో విత్తనంతో సుమారు రూ. 2 వేల ఖరీదైన పుట్టగొడుగుల దిగుబడి పొందవచ్చన్నారు. మెలకువలు పాటిస్తే ప్రతి పుట్టగొడుగునూ 130 నుంచి 230 గ్రాముల బరువు వరకు పెంచవచ్చన్నారు. మామూలుగా 3–4 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే 15–20 రోజులుంటాయి. పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారం! పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారమని, అయినా మాంసాహారంలో ఎక్కువగా ఉండే బి12తోపాటు విటమిన్ డి, బి, నియాసిన్ వంటి విటమిన్లు.. కాల్షియం, సెలీనియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయని డా. ప్రమీల తెలిపారు. బి12 విటమిన్ కేన్సర్ రాకుండా చేస్తుందని, కేన్సర్‌ను నయం చేస్తుందన్నారు. పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే చర్మ సమస్యలు ఉపశమిస్తాయని, బీపీ నియంత్రణలో ఉంటుందని, పీచు పుష్కలంగా ఉండటం మూలాన ఊబకాయాన్ని తగ్గించడంలోనూ ఉపకరిస్తాయన్నారు. ఎండబెట్టిన పుట్టగొడుగుల పొడితో జావ చేసుకొని తాగినా, ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని కూర వండుకొని తిన్నా విటమిన్ డి లోపం తగ్గిపోతుందని ఆమె వివరించారు. ఎండబెట్టుకోవడానికి ఆయిస్టర్ మష్రూమ్స్ అనువుగా ఉంటాయన్నారు. వివరాలకు.. డా. ప్రమీలను 040–24015011 నంబరు ద్వారా సంప్రదించవచ్చు. ∙ఎండిన పుట్టగొడులతో డా. ప్రమీల -
పుట్టగొడుగుల కోసం ఇరు వర్గాల గొడవ
సాక్షి, బల్లికురవ (ప్రకాశం): పుట్టగొడుగుల కొనే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రెండు సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కొనిదెన గ్రామంలో జరగ్గా మంగళవారం సాయంత్రం దర్శి డీఎస్పీ ప్రకాశరావు బీసీ, ఎస్సీ కాలనీలో విచారణ చేపట్టారు. అందిన సమాచారం ప్రకారం రాజుపాలెం గ్రామానికి చెందిన కొండలు కొణిదెన సెంటర్లో పుట్ట గొడుగులు అమ్ముతున్నాడు, ఎస్సీ కాలనీకి చెందిన జండ్రాజుపల్లి ముత్తయ్య, రాజేష్ బేరం చేసి పుట్టగొడుగులు కొనుగోలు చేశాడు, అయితే కొండలుకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పల్లపు సురేష్ డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు అనే విషయంలో సురేష్ ముత్తయ్య రాజేష్‌ల మధ్య మాటామాటా పెరిగింది. సమీపంలో ఉన్నవారు ఇరువురి సర్ది చెప్పి పంపారు. ఆ తదుపరి ముత్తయ్య, రాజేష్, లోక్‌ష్‌లు మారణాయుధాలతో బీసీ కాలనీలోకి వచ్చారు. కాలనీ వాసులు గతంలో ఉన్న పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని భయపడి ముగ్గురిని నిర్భంధించారు. తమపై దాడిచేశారని ముత్తయ్య, తన్నీరు పుల్లయ్య, పైన పిచ్చయ్య, పల్లపు గోపి, పోతురాజు మరికొందరిపై బల్లికురవ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గొడ్డళ్లతో తమనే చంపేందుకు తమ కాలనీలోకి వచ్చారని యనమల పద్మ, ముత్తయ్య, రాజేష్, లోకేష్‌లపై బల్లికురవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై పీ.అంకమ్మరావు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదులపై దర్శి డీఎస్పీ ప్రకాశరావు అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్ ఎస్సై అంకమ్మరావు బీసీ, ఎస్టీ కాలనీల్లో విచారణ చేపట్టారు. -
ఇంటిపంటలతోపాటే పుట్టగొడుగులూ పెంచుకోవచ్చు!
పుట్టగొడుగుల పెంపకం సాధారణంగా వేడి, వెలుతురు తగలని పక్కా భవనాల్లోని గదుల్లో చేపడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా స్థానం (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఆరుబయట పెరట్లో లేదా మేడ మీద(గ్రామాల్లో లేదా నగరాల్లో) పెట్టుకొని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఉత్పత్తి చేసుకునే ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్‌కు రూరపకల్పన చేశారు. సౌర విద్యుత్తుతో పనిచేయడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చుతోనే ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌ను రూపొందించారు. ఎవాపొరేటివ్ కూలింగ్ సూత్రం ఆధారంగా పని చేసే ఈ అవుట్‌సైడ్ మొబైల్ ఛాంబర్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎండలు మండిపోయే ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ ఛాంబర్లో ఎంచక్కా పుట్టగొడుగులను పెంచుకోవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి ఛాంబర్ల ద్వారా పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన వారితో పాటు.. ఈ ఛాంబర్ల తయారీదారులు కూడా స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలున్నాయి. పుట్టగొడుల పెంపకాన్ని సులభతరం చేసే ఈ ఛాంబర్ వల్ల పుట్టగొడుగుల వినియోగం కూడా పెరుగుతుంది. మహిళలు వీటి పెంపకాన్ని చేపడితే వారిలో పౌష్టికాహార లోపం తగ్గడంతోపాటు ఆదాయ సముపార్జనకూ దారి దొరుకుతుంది. మష్రూమ్ ఛాంబర్ తయారీ పద్ధతి ఇదీ.. ఈ ఛాంబర్‌ను 1 అంగుళం మందం గల సీపీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌తో తయారు చేసుకోవాలి. చాంబర్ పొడవు 1.35 మీటర్లు, వెడల్పు 0.93 మీటర్లు, ఎత్తు 1.69 మీటర్లు. పురుగూ పుట్రా లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం, గాలి పారాడటం కోసం దీని చుట్టూతా నైలాన్ 40 మెష్‌ను అమర్చుకోవాలి. ఈ మెష్ పైన గన్నీ బ్యాగులు చూట్టేయాలి. గన్నీ బ్యాగ్‌లను తడుపుతూ ఉంటే ఛాంబర్ లోపల గాలిలో తేమ తగ్గిపోకుండా ఉంచగలిగితే పుట్టగొడుగులు పెరగడానికి తగిన వాతావరణం నెలకొంటుంది. ఛాంబర్ లోపల నిరంతరం సన్నని నీటి తుంపరలు వెదజల్లే 0.1 ఎం.ఎం. నాజిల్స్‌తో కూడిన 30 డబ్లు్య డీసీ మిస్టింగ్ డయాఫ్రం పంప్‌ను అమర్చుకోవాలి. 300 వాల్ట్స్ పేనెల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజీ బ్యాటరీలను, ఒక టైమర్‌ను అమర్చుకొని.. విద్యుత్‌తో గాని లేదా సౌర విద్యుత్తుతో గాని నడవపవచ్చు. ఈ ఛాంబర్ మొత్తాన్నీ స్టీల్ ఫ్రేమ్ (1.08 “ 1.48 “ 1.8 సైడ్ హైట్ “ 2.2 సెంటర్ హైట్) లోపల ఉండేలా అమర్చుకొని, ఛాంబర్ కింద 4 వైపులా చక్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటే.. ఛాంబర్‌ను అటూ ఇటూ కదుల్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సోలార్ పేనల్స్‌ను ఫ్రేమ్‌పైన అమర్చుకోవాలి. ఫ్రేమ్ లోపల ఇన్వర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలి. 30 లీటర్ల నీటి ట్యాంకును, మిస్టింగ్ పంప్‌ను స్టీల్ ఫ్రేమ్‌లో కింది భాగంలో అమర్చుకోవాలి. అంతే.. మష్రూమ్ ఛాంబర్ రెడీ. మూడేళ్ల పరిశోధన పక్కా భవనంలోని గదిలో, ఆరుబయట సోలార్ ఛాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్ పుట్టగొడుగుల రకాలను 20 బ్యాగ్‌ల(ఒక కిలో)లో మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా పెంచారు. 2016 నుంచి 2018 వరకు అన్ని నెలల్లోనూ ఈ పరిశోధన కొనసాగించి ఫలితాలను బేరీజు వేశారు. పక్కాభవనంలో కన్నా సోలార్ చాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి సగటున 108% మేరకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదేమాదిరిగా వైట్ మష్రూమ్స్ దిగుబడి 52% పెరిగింది. ఈ యూనిట్ నుంచి నెలకు సగటున 25–28 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయవచ్చని ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌కు రూపకల్పన చేసిన ఐ.ఐ.హెచ్.ఆర్. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సెంథిల్ కుమార్ (94494 92857) ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఆయనను సంప్రదించవచ్చు. అయితే, ఈ యూనిట్‌కు సంబంధించిన టెక్నాలజీ హక్కులను ఐఐహెచ్ఆర్ వద్ద నుంచి ఎవరైనా కొనుగోలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత, ఈ యూనిట్లను తయారుచేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టవచ్చని డా. సెంథిల్ కుమార్ తెలిపారు. దీనిపై ఆసక్తి గల వారు ఐ.ఐ.హెచ్.ఆర్. డైరెక్టర్‌ను సంప్రదించాల్సిన ఈ–మెయిల్:director.iihr@icar.gov.in మష్రూమ్ స్పాన్ లభించే చోటు.. బెంగళూరు హెసరఘట్ట ప్రాంతంలో ఉన్న ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ సెంటర్‌కు ఫోన్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే మష్రూమ్ స్పాన్(విత్తనాన్ని)ను విక్రయిస్తారు. మష్రూమ్ స్పాన్‌ను బుక్ చేసుకున్న వారు 30 రోజుల తర్వాత స్వయంగా ఐ.ఐ.హెచ్.ఆర్.కి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాగులను ఎవరికి వారే వెంట తెచ్చుకోవాలి. స్పాన్ బుకింగ్ నంబర్లు.. 70909 49605, 080–23086100 ఎక్స్టెన్షన్–349, 348, 347, డైరెక్టర్– 080–28466471, ఎస్.ఎ.ఓ. – 080 28466370 ఝuటజిటౌౌఝఃజీజీజిట.ట్ఛట.జీn -
ప్లాస్టిక్ సమస్యకు పుట్టగొడుగు పరిష్కారం...
ఆస్పెర్ గిలియస్ టుబినిజెనిసిస్! భూమ్మీద ఉన్న అనేకానేక పుట్టగొడుగు జాతుల్లో ఇది ఒకటి. కాకపోతే ఇది ప్లాస్టిక్‌ను తిని హరాయించుకోగలదు. ఈ అద్భుత లక్షణాన్ని ఉపయోగించుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాల భరతం పట్టవచ్చునని అంటున్నారు లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ శాస్త్రవేత్తలు. ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఫంగీ – 2018’లో ప్రచురితమైన వివరాల ప్రకారం పుట్టగొడుగులు కొన్ని ప్లాస్టిక్‌ను తినడమే కాదు.. నేల, నీటి కాలుష్యాన్ని ఎంచక్కా తొలగించగలవని, ఇంకొన్ని కాలుష్యానికి ఆస్కారం లేని భవన నిర్మాణ సామాగ్రి కూడా అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏడాది క్రితం పాకిస్థాన్‌లోని ఓ చెత్తకుప్పలో దీన్ని తొలిసారి గుర్తించారు. ప్లాస్టిక్ చెత్త నాశనమయ్యేందుకు సహజంగా కొన్ని ఏళ్ల సమయం పడితే.. ఈ పుట్టగొడుగు మాత్రం వారాల్లోనే నాశనమయ్యేలా చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ చెత్తపై నేరుగా పెరగడంతోపాటు ఆ క్రమంలో ప్లాస్టిక్ అణువుల మధ్య ఉన్న రసాయన బంధాలను దెబ్బతీయడం ద్వారా ఈ పుట్టగొడుగు ఎదుగుతుందని టామ్ ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త వివరిస్తున్నారు.ప్లూరోటస్ ఒస్ట్రాటస్, ట్రామెటిస్ వెర్సికలర్ జాతి పుట్టగొడుగులు నేల, నీటిలోని క్రిమిసంహారక మందుల అవశేషాలు, రంగులు, పేలుడు పదార్థాల అవశేషాలను సురక్షితంగా తొలగించవని ప్రెస్కాట్ అంటున్నారు. -
మష్రూమ్ కాఫీతో మరింత ఆరోగ్యం
ఘుమ ఘుమలాడే వేడి వేడి కాఫీ కడుపులో పడందే మంచం దిగడానికి మనసొప్పదు. ఓ నాలుగు సిప్పులు జుర్రుకున్నాకే నిద్రమత్తు వదిలేది. అతిగా కాఫీ అలవాటు ఎసిడిటీకి దారితీస్తుందనీ, కాఫీలో ఉండే కెఫెన్ అనే పదార్థం ఆరోగ్యానికి కీడు చేస్తుందనీ నిపుణులు తేల్చారు. ఇక షుగర్ పేషెంట్స్ విషయమైతే చెప్పక్కర్లేదనుకోండి. అయినా సరే ఆ కాఫీ పై ఆశచావదు కదా? అందుకే కాఫీ తాగేందుకు ముందూ వెనకా ఆలోచంచే కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీ అంటే పడిచచ్చేవారికోసం ఇప్పుడు మార్కెట్లో మష్రూమ్ కాఫీ ఉవ్విళ్లూరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది. పుట్టగొడుగులతో కాఫీయా అని ఛీ కొట్టకండి మరి. ఇప్పుడదే ఆరోగ్యానికి కీడు చేయని కాఫీ అంటున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకతట. అలాగే రాత్రిళ్ళు కాఫీ తాగాలంటే నిద్రకు దూరమౌతామేమోనని కూడా సంకోచించాల్సిన అవసరం లేదంటున్నారు. అతి తక్కువ కెఫెన్ ఉండడమే అందుకు కారణమని చెపుతున్నారు. నిజానికి మంచినిద్రకు మష్రూమ్ కాఫీ దోహదం చేస్తుందట. తక్కువ కొలెస్ట్రాల్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే మష్రూమ్ కాఫీ రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుందనీ, గుండె సంబంధిత ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనీ, షుగర్ లెవల్స్‌ని కూడా సమతూకంలో ఉంచుతుందనీ మష్రూమ్ కాఫీని పొగిడేస్తున్నారు. నిజానికి మష్రూమ్ కాఫీ మన శరీరానికి చేస్తున్న మేలు గురించి సైంటిఫిక్‌గా రుజువు కాలేదు. కానీ మష్రూమ్, కాఫీ మేలు కలయికతో ఏర్పడిన మష్రూమ్ కాఫీ ఆరోగ్యానికి మంచే చేస్తుందన్నది వీరి వాదన. ప్రధానంగా మష్రూమ్స్‌తో లిప్‌స్టిక్, పెర్ఫ్యూమ్స్లాంటి దాదాపు వందకు పైగా రకాల ఉత్పత్తులను తయారుచేస్తోన్న మలేషియాలో ఈ మష్రూమ్ కాఫీ ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. గతంలో కర్నాటకలో విసృతంగా దొరికే వక్కలతో కూడా కాఫీ తయారీ కోసం ప్రయత్నం కర్నాటకలో జరిగింది. అయితే యిప్పుడు ప్రపంచవ్యాప్తంగా మష్రూమ్ కాఫీ గురించే చర్చిస్తున్నారు కాఫీప్రియులంతా. -
పరి పరిశోధన
మిల్క్‌షేక్స్‌తో గుండెకు చేటు అసలే వేసవి. దాహార్తితో అల్లాడే జనం శీతల పానీయాల కోసం అర్రులు చాస్తారు. నిమ్మరసం మొదలుకొని నానా రకాల పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, మిల్క్ షేక్ వంటి పానీయాలను గ్లాసుల కొద్దీ తాగేస్తారు. మిగిలిన పానీయాలు ఫర్వాలేదు గాని, మిల్క్ షేక్స్ విషయంలో కొంత జాగ్రత్త తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్కలంగా మీగడ వేసి తయారుచేసే మిల్క్ షేక్స్ స్వల్ప వ్యవధిలోనే రక్తనాళాలపై, ఎర్ర రక్త కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో తేలిందని, రుచి కోసం ఎడాపెడా మిల్క్ షేక్స్ తాగేస్తూ పోతే దీర్ఘకాలంలో గుండెకు చేటు తప్పదని జార్జియాలోని అగస్టా యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. పరీక్షాత్మకంగా పదిమంది ఆరోగ్యవంతులకు ఒక్కో మిల్క్ షేక్ ఇచ్చారు. మిల్క్ షేక్ తాగిన నాలుగు గంటల తర్వాత వారిపై పరీక్షలు జరిపితే, వారి రక్తనాళాలు కుంచించుకుపోవడంతో పాటు, ఎర్ర రక్తకణాలు మృదుత్వాన్ని కోల్పోయినట్లు గుర్తించామని అగస్టా వర్సిటీ మెడికల్ కాలేజీలోని సెల్ బయాలజీ అండ్ అనాటమీ ప్రొఫెసర్ జూలియా బ్రిటన్ వెల్లడించారు. పుట్టగొడుగులతో వార్ధక్యానికి కళ్లెం వార్ధక్యానికి కళ్లెం వేయాలంటే నవయవ్వన గుళికల కోసం వెదుకులాడాల్సిన పనేమీ లేదు గాని, పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలని చెబుతున్నారు అమెరికన్ వైద్య నిపుణులు. పెన్సిల్వేనియా స్టేట్ సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రోడక్ట్స్ ఫర్ హెల్త్ సంస్థకు చెందిన పోషకాహార నిపుణుడు ప్రొఫెసర్ రాబర్ట్ బీల్మాన్ పుట్టగొడుగులపై తాము జరిపిన పరిశోధనల్లో బయటపడిన కీలకమైన అంశాలను వెల్లడించారు. పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనీన్, గ్లూటాథియోన్ అనే యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో ఉంటాయని, వార్ధక్య లక్షణాలను దూరం చేయడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ బీల్మాన్ వివరించారు. తినడానికి పనికొచ్చే పుట్టగొడుగులన్నింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, వాటిలో ‘పోర్సిని’ రకానికి చెందిన పుట్టగొడుగుల్లో వీటి మోతాదు మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. -
కాంగ్రెస్ నేతకు తైవాన్ మహిళ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓట్ల కోసం కాంగ్రెస్ యువనేత అల్పేశ్ ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ భోజనం ఖర్చు రోజులకు రూ.4 లక్షలంటూ పఠాన్ జిల్లాలోని రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తైవాన్ మహిళ మెస్సీ జో స్పష్టం చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తైవాన్ నుంచి తెప్పించిన స్పెషల్ పుట్టగొడుగులు (మష్రూమ్స్) మోదీ తింటారని, వాటివల్లే ఆయన అందంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది అవాస్తవమని చెప్పారు. అల్పేశ్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, అందుకు నిదర్శనంగా తైవాన్ మహిళ పలు విషయాలను వెల్లడించిన వీడియోను ప్రమోద్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. తైవాన్ మహిళ ఏమన్నారంటే.. భారత మీడియాలో తైవాన్ పుట్టగొడుగుల గురించి వార్త చదివాను. భారత ప్రధాని మోదీ తైవాన్ మష్రూమ్స్ తినడం వల్లే అందంగా, ఆకర్షణీయంగా తయారయ్యారని కథనాలు చూశాను. కానీ ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. మా దేశం (తైవాన్)లో అలాంటి మష్రూమ్స్ లేవు. అసలు వాటి గురించి ఎప్పుడూ వినలేదు. రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ వీడియో ద్వారా మెస్సీ జో వెల్లడించారు. దీంతో ఓట్ల కోసమే కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీగారు తినేది సాధారణ భోజనం కాదు. తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారు. రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలు. భారీ స్థాయిలో తన ఆహారానికి మోదీ ఖర్చు చేస్తున్నారంటూ' తీవ్ర ఆరోపణలు చేశారు. Here is a stinging response from a Taiwanese woman to #AlpeshThakor 's blatant lie that one can get fairer by consuming Taiwanese mushroom. pic.twitter.com/kBrxjXOOyQ — Pramod Kumar Singh (@SinghPramod2784) 12 December 2017 -
కాంగ్రెస్ నేతకు తైవాన్ మహిళ షాక్..
-
పొట్ట అడుగు
పొట్ట అడుగుతుందా! బిర్యానీ చేసిపెట్టమని.. ఆమ్లెట్ వేసిపెట్టమని.. మంచూరియా కావాలని.. చిల్లీ కర్రీని టేస్ట్ చేస్తానని!! అడగదు పాపం. ఆకలో రామచంద్రా అంటుంది కానీ.. అది కావాలి రామచంద్రా.. ఇది కావాలి రామచంద్రా.. అని రాగాలు తీయదు. కానీ పుట్టగొడుగులు వేరు. వాటితో ఒక్కసారి ఏదైనా చేసి పెట్టామా? పొట్ట మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటుంది. అవురావురుమంటూనే ఉంటుంది. మష్రూమ్ మంచూరియా కావలసినవి: మష్రూమ్స్ – 250 గ్రా; ఉడికించిన బంగాళాదుంపలు – 2 పెద్దవి; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్; మైదా – 2 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్; నూనె – టీప్ ఫ్రైకి సరిపడ. గ్రేవీ కోసం: ఉల్లి తరుగు – 4 టేబుల్ స్పూన్స్; తెల్ల ఉల్లికాడల తరుగు – 2 టీ స్పూన్స్; గ్రీన్ ఉల్లికాడల తరుగు – 4 టీ స్పూన్స్; పచ్చిమిర్చి తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లుల్లి తరుగు – 6 టీ స్పూన్స్; అల్లం తరుగు – 6 టీ స్పూన్స్; ఉప్పు – తగినంత; సోయా సాస్ – 6 టీ స్పూన్స్; చిల్లీసాస్ – 2 టీ స్పూన్స్; వెనిగర్ – 6 టీ స్పూన్స్; పంచదార – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 3 టీ స్పూన్స్; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙మష్రూమ్స్‌ను కడిగి కాడలను తుంచి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో తరిగిన మష్రూమ్, ఉడికించిన బంగాళా దుంపలను కలపాలి ∙ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి ముద్దగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్‌లో కూరి పక్కన పెట్టుకోవాలి ∙మరొక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి నీరు పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక, స్టఫ్ చేసిన మష్రూమ్స్‌ను పిండి మిశ్రమంలో ముంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ మరో కడాయిలో నూనె వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి ∙ఇప్పడు వరుసగా ఉల్లి, పచ్చిమిర్చి, తెల్ల ఉల్లికాడల తరుగు, ఉప్పు, కారం, సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుతూ ఉండాలి ∙చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న స్టఫ్డ్ మష్రూమ్స్‌ను వేసి గ్రేవీ పట్టేలా మరికొంతసేపు వేగనివ్వాలి ∙స్టౌ ఆఫ్ చేసి గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ ఛీజ్ ఆమ్లెట్ కావలసినవి: కోడిగుడ్లు – 4; మష్రూమ్స్ – 100 గ్రా; ఉల్లిపాయ – 1; వెల్లుల్లి – 4 రెబ్బలు; తరిగిన ఛీజ్ – 2 టేబుల్ స్పూన్స్; కొత్తిమీర తరుగు – కొంచెం; ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ∙స్టౌ పైన పాన్ పెట్టి వేడయ్యాక 1 స్పూన్ నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర కలిపి పక్కనపెట్టుకోవాలి . ఒక గిన్నెలో గుడ్లు కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి ∙పాన్‌లో నూనె వేసి వేడయ్యాక బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని కొంచెం మందంగా ఆమ్లెట్‌లా వేసుకోవాలి ∙ముందుగా తయారు చేసుకున్న మహ్రూమ్స్ మిశ్రమాన్ని కూడా వేసి రెండు వైపులా ఆఫ్ బాయిల్ అయ్యేలా చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. మష్రూమ్ బిర్యాని కావలసినవి: మష్రూమ్స్ – 900 గ్రా; బాస్మతి బియ్యం – 4 కప్పులు; ఉల్లిపాయలు – 2; పచ్చిమిరపకాయలు – 4; టమోటాలు – 3; క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్; అల్లం తరుగు – 3 టీ స్పూన్స్; వెల్లులి – 3 రెబ్బలు; నెయ్యి/నూనె – 1/2 కప్పు; నిమ్మకాయ – 1; లవంగాలు – 7; దాల్చినచెక్క – అంగుళం ముక్క; యాలకులు – 3; ధనియాల పొడి – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 2 టీ స్పూన్స్; కారం – 1 1/1 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; నీళ్లు – 7 కప్పులు; పుదీనా – కొంచెం. తయారి: ∙బాస్మతి బియ్యాన్ని కడిగి సరిపడ నీరు పోసి గంట సేపు నానబెట్టి నీరు వాడ్చి పెట్టుకోవాలి ∙స్టౌ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 5 నిమిషాలు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙మష్రూమ్స్‌ను పెద్ద ముక్కలుగా తరుగిపెట్టుకోవాలి ∙అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ∙ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేలా సిమ్‌లో వేగనివ్వాలి ∙సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి పది నిమిషాలు వేయించుకోవాలి ∙ఇప్పుడు వరుసగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ∙ముక్కలన్నీ వేగిన తర్వాత 7 కప్పుల నీరు పోసి మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి సిమ్‌లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి ∙ప్రెషర్ పోయిన తర్వాత పుదీనా గార్నిష్ చేసుకోవాలి. చిల్లీ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ పెద్ద సైజువి – 10; నల్ల మిరియాల పొడి – 1/4 టీ స్పూన్; మైదా – 4 టేబుల్ స్పూన్స్; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్; రెడ్ కాప్సికమ్ – 1/2 కప్పు; గ్రీన్ కాప్సికమ్ – 1/2 కప్పు; ఎల్లో కాప్సికమ్ – 1/2 కప్పు; ఉల్లిపాయ – 1 (ఆప్షనల్); పచ్చిమిర్చి తరుగు – 4 టీ స్పూన్స్; అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్; టమోటా సాస్ – 3 టీ స్పూన్స్; సోయా సాస్ – 1 టీ స్పూన్; వెనిగర్ – 1 టీ స్పూన్; కారం – 1/2 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; కొత్తిమీర – గార్నిష్ కోసం; నూనె – వేయించడానికి సరిపడ. తయారి: ∙మష్రూమ్స్ కాడలను కట్ చేసి తుడిచి పెట్టుకోవాలి ∙బౌల్లో మైదా పిండి ఉప్పు, మిరియాల పొడి వేసి నీరు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి ∙నూనె వేడయ్యాక మష్రూమ్స్‌ను పిండిలో ముంచి బజ్జీల్లా బంగారు రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మరో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అర కప్పు నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి ∙మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి రెడ్, గ్రీన్, ఎల్లో కాప్సికమ్ ముక్కలు వేయించాలి ∙5 నిమిషాలు వేయించి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి మూత పెట్టి సిమ్‌లో నిమిషం మగ్గనివ్వాలి ∙ఇప్పుడు టమోటా సాస్, సోయా సాస్, వెనిగర్, సరిపడ ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్‌ను వేసి మరో రెండు నిమిషాలు వేసి వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుంటే వేడి వేడి చిల్లీ మష్రూమ్స్ కర్రీ రెడీ. రైస్‌లోకి, చపాతీలో కూడా బాగుంటుంది. పుట్టగొడుగులతో దీర్ఘాయుష్షు! పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివని అప్పుడప్పుడూ తినడం మేలన్నది మనందరికీ తెలుసుగానీ.. కారణాలేమిటో చూద్దాం. పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా ఇలా చెప్తున్నారు. మిగిలిన పోషకాలను పక్కకు పెట్టి కేవలం పుట్టగొడుగుల్లో ఉండే రెండు యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా మన ఆయుష్షు పెరిగే అవకాశముందన్నది సారాంశం. ఎర్గోథియోనైన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగులో ఉంటాయి. శరీరం మనం తిన్న ఆహారాన్ని ఇంధనంగా మార్చుకునే క్రమంలో ఒక రకమైన ఆక్సిజన్ కణాలు పుడుతూంటాయి. ఫ్రీ రాడికల్స్ అని పిలిచే ఈ కణాలు శరీరం మొత్తం తిరుగుతూ ఒక ఎలక్ట్రాన్‌ను ఆకర్షించుకుని స్థిరపడేందుకు ప్రయత్నిస్తూంటాయి. ఈ క్రమంలో ఇవి మన కణాలు, ప్రొటీన్లు.. డీఎన్ఏకు నష్టం కలిగిస్తూంటాయి. యాంటీ ఆక్సిడెంటు పుష్కలంగా లభిస్తే ఫ్రీరాడికల్స్‌తో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించుకుని దీర్ఘాయుష్షు పొందవచ్చునని శాస్త్రవేత్త రాబర్ట్ బీల్మన్ తెలిపారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకునే ఫ్రాన్స్, ఇటలీల్లో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండింటికీ మధ్య సంబంధం ఏమిటన్నది కూడా పరిశీలించాలని తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు. -
లాభాలకు గొడుగులు
ఆషాడమాసంలో కురిసిన వర్షాలకు గ్రామీణప్రాంతాలలోని పుట్టలపై ప్రకృతిసిద్ధంగా మొలిచే పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేకువజామునే పుట్టల వెంట తిరుగుతూ వీటిని సేకరిస్తుంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కలిగి ఉండే వీటిని సిటీ మార్కెట్లలో కిలో రూ.500 వరకు విక్రయిస్తుంటారు. తగరపువలస : ఆషాడమాసంలోనే కాకుండా ఏడాది పొడుగునా పుట్టగొడుగులను సాగుచేసి లాభాలబాట పడుతున్న కుటీర పరిశ్రమలు ఇటీవల మారుమూల గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇంటిపంటలుగా సాగుచేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలోనే కాకుండా బటన్ రకం పుట్టగొడుగులను రసాయనాలు ఉపయోగించి కూడా పండిస్తున్నారు. కర్రీ పాయింట్లు, విందుభోజనాలలో పుట్టగొడుగులకు ప్రముఖ స్థానం ఉంది. వీటికితోడు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పుట్టగొడుగులను ఉపయోగించి రకరకాల స్నాక్స్, ఊరగాయాలు చేస్తుండడంతో ఆహారంలో వీటి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. ఇలా పండిస్తారు మిల్కీ, పేడీ, అయిస్టర్,బటన్ రకాలుగా పిలవబడే పుట్టగొడుగులకు ప్రధాన వనరు వరిగడ్డే. ఏడాదిలోపు వయసుండే నిల్వగడ్డిని సేకరించుకుని ముక్కలుచేసి పాలిథిన్ కవర్లలో ఉడకబెట్టిన గడ్డిని పొరలుగా వేసి మద్యలో విత్తనాలు ఉంచి మూతికట్టి 21 రోజుల పాటు ఫంగస్ సోకని నీడలో భద్రపరుస్తారు. తరువాత కవరును సగభాగంగా వేరుచేసి దానిపై మట్టి పరచి ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిపై నీళ్లు చిలకరిస్తారు. ఇలా పదిరోజులు చేసేసరికి మొదటికోతకు గొడుగులు సిద్ధమై 40 రోజుల వరకు దిగుబడి ఇస్తాయి. సస్యరక్షణను బట్టి కిలో విత్తనాలకు 6 నుంచి 10 కిలోల దిగుబడులు పొందవచ్చు. మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి వీటి ధర సగటున రూ.250 వరకు ధర పలుకుతుంది. పేడీ స్ట్రా పుట్టగొడుగుల ధర రూ.400 నుంచి 500 వరకు ఉంది. పోషకాలు భలే పుట్టగొడుగులలో ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలోని లోవాస్టాటిన్ అనే పదార్థం వల్ల కొవ్వును తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తుందంటున్నారు. కేన్సర్ నిరోధానికి, విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఆస్థమా ఉన్నవారికి మంచి ఆహారం. ఇందులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు. కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు లేకపోవడంతో మధుమేహరోగులకు మంచి ఆహారం అంటున్నారు. స్థూలకాయం, మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ నుంచి గట్టెక్కిస్తుందట. నోరూరించే వంటలు.. పుట్టగొడుగులను కేవలం కూరగానే కాకుండా ఫ్రై, పకోడి, బిర్యాని, స్టఫ్డ్ మష్రూమ్స్, సూప్, ఖీర్, మిల్క్‌షేక్, మునగాకుతో ఇగురు, చింతచిగురు కాంబినేషన్, కోనసీమ వేపుడు పేరుతో ఎన్నోరకాలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి శ్రేష్టమైనవి.. పుట్టగొడుగులు చెరువు చేపల తరువాత అంతటి శ్రేష్టమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. కొన్ని వ్యాధుల నిరోధానికి బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలోనూ, ఆ తరువాత గ్రామాలలో పుట్టలపై పుట్టగొడుగులు తవ్వి తీస్తుంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుని తినాలి. అందులో కొన్ని విషతుల్యంగాను, పురుగులు చేరి ఉంటాయి. ఇక కుటీర పరిశ్రమలలో అత్యంత శ్రద్ధగా పండించే పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వలేకుండా తింటే మంచిది. –డాక్టర్ కె.రామారావు, పట్టణ ఆరోగ్యకేంద్రం, తగరపువలస తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పుట్టగొడుగుల సాగును పసిపిల్లల్లా చూసుకోవాలి. ఏ మాత్రం వైరస్ సోకకుండా జాగ్రత్తగా చేసుకుంటే పెట్టుబడికి మంచిలాభాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొందరు శిక్షణ ఇచ్చి విత్తనాలు మేమే ఇచ్చి, దిగుబడి మేమే కొంటామంటూ మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మార్కెటింగ్ చేసుకోగలిగితే దీనిని మించిన సాగులేదు. ఇది మంచి పౌష్టికాహారం కూడా. –ఎర్నింటి రమేష్, పుట్టగొడుగుల పెంపకదారుడు -
నాసి సీడ్ వలలో.. వెనామీ సాగు
* పుట్టగొడుగుల్లా వెలస్తున్న అనధికార హేచరీలు * నాణ్యత లేని రొయ్యపిల్లలకు వైరస్ వ్యాధులు * పెద్ద ఎత్తున నష్టపోతున్న ఆక్వా రైతులు * అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతి కాట్రేనికోన: కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతులు లేకుండా తీరం వెంబడి పుట్టగొడుగుల్లా వెలసిన వెనామీ హేచరీల్లో ఉత్పత్తవుతున్న నాణ్యత లేని రొయ్య సీడ్ (పిల్లలు) రైతులను దెబ్బ తీస్తోంది. వెనామీ రొయ్య ధర బాగున్నా సీడును యధేచ్ఛగా ఉత్పత్తి చేస్తున్నారు.రైతులు ఆశించిన స్థాయిలో వెనామీ రొయ్యలు ధరలు ఉన్నప్పటికీ సీడ్ నాసిరకం కావడంతో వైరస్ వ్యాధులు సోకి, నష్టాల పాలవుతున్నారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ పరిధిలో 2016కి సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 254 వెనామీ హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతి ఉంది. అనుమతి ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 400 నుంచి 10 వేలకు పైగా వ్యాధిరహిత (ఎస్పీఎఫ్) తల్లి రొయ్యలను సీఏఏయే సరఫరా చేసింది. రాష్ర్టంలో 189 హే చరీలకు మాత్రమే అనుమతి ఉండగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో అనధికారిక హేచరీలు విస్తృతంగా ఉన్నాయి. తీరం వెంబడి ఉన్న హేచరీల్లో సగానికి పైగా సీఏఏ అనుమతి లేనివే. జిల్లావ్యాప్తంగా తీరంలో 200లకు పైబడి హేచరీలుండగా 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 15 హేచరీలుండగా అల్లవరం మండలంలోని ఐదింటికే అనుమతి ఉంది. వెనామీ రొయ్యల పెంపకం చెరువులు, హేచరీలకు సీఏఏతో పాటు సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ అనుమతి తప్పనిసరి. అనుమతికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో మ త్స్యశాఖ డీడీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయశాఖ అధికారులు సభ్యులుగా ఉంటా రు. ఈ కమిటీ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షించి నిబంధనల ప్రకారం ఉంటే అనుమతి ఇస్తారు. సీడ్ నాసిదైనా రేటు ఎక్కువే.. మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లలో వెనామీ సాగు జరుగుతోంది.అనుమతులు లేకుండా అనధికారికంగా మరొక 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు అంచనా. సీఏఏ అనుమతులు లేని హేచరీలతో పాటు అనుమతి ఉన్న హేచరీలు కూడా ఒక అనుమతితో మరికొన్ని ఏర్పాటు చేసి, స్థానికంగా దొరికే తల్లిరొయ్యల తోనే సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారుు. సీఏఏ అనుమతి ఉండి , నిబంధనల ప్రకారం నాణ్యైమైన రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్న హేచరీలు పిల్లను 35 పైసల నుంచి 40 పైసల వరకు విక్రయిస్తుంటే అనుమతులు లేని హేచరీలు కూడా అదే ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుు. అనుమతులు లేని హచరీల్లో నాసిరకం సీడ్ ఉత్పత్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వైరస్ రహిత సీడ్‌ను అందించేలా చూడాలి సీఏఏ అనుమతులు లేని హేచరీలు ఉత్పత్తి చేస్తున్న నాణ్యత లేని రొయ్య సీడు ఎదుగుదల లేక, వైరస్ వ్యాధులుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నాం. వైరస్ రహిత ఎస్పీఎఫ్ సీడ్‌నే హేచరీలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. - భూపతిరాజు సుబ్రమణ్యంరాజు(బులిరాజు), రైతు, ఎదుర్లులంక అనుమతి ఉన్న హేచరీల్లోనే సీడ్ తీసుకోవాలి జిల్లాలో 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉండగా 80 హేచరీలకు అనుమతులు లేవు. 20 హేచరీలు నిర్మాణంలో ఉన్నట్టు గుర్తించాం. అనుమతులు లేకుండా సీడ్ ఉత్పత్తి చేయడం నేరం. అనుమతులు లేని హేచరీలు దరఖాస్తు చేసుకోవాలని, పాత హేచరీలు రెగ్యులర్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశాం. సీఏఏ అనుమతి ఉన్న హేచరీల నుంచే రైతులు సీడ్ తీసుకోవాలి. - టి.కళ్యాణం, మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్