nadigar sangam
-
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్‌లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్‌లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్‌పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కోటి రూపాయలు సాయం చేసిన కమల్.. హీరో కార్తీ చేతికి చెక్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కోలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రంగానే కష్టపడుతున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. సుమారుగా రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న భవనం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ కోటి రూపాయాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చెక్కును హీరో కార్తీ చేతికి ఆయన అందించారు. ఆ సమయంలో కార్తీతో పాటుగా ప్రధాన కార్యదర్శి విశాల్, వైస్ ప్రెసిడెంట్ పూచీ మురుగన్‌తో కమల్ సమావేశం అయ్యారు. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విన్నపం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. త్వరలోనే ఈ సంఘం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సూర్య, కార్తీ విరాళం
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల -
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శిపై కేసులు
మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అక్రమాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సంఘం 66వ సర్వసభ్య సమావేశం ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ సంఘం ఎన్నికలు 2019లో జరిగినా.. అక్రమాలు జరిగాయంటూ ఐసరి గణేష్‌కు చెందిన స్వామి శంకరదాస్ జట్టు చెన్నై హైకోర్టు గుమ్మం తొక్కింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పలు దఫాలు విచారణ జరిపినా న్యాయస్థానం ఇటీవల సంఘం ఎన్నికలు సక్రమమే అంటూ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పోటీ చేసిన పాండవర్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం స్థానిక శాంథోమ్ రోడ్‌లోని శాంథోమ్ హైయ్యర్ సెకండరీ పాఠశాలలో నడిగర్ సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు కరుణాస్, పూచి మురుగన్‌లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ సభ్యుల అనుమతి కోరారు. ముఖ్యంగా నడిగర్ సంఘం నూతన భవనాన్ని పూర్తి చేయడం, అందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటి అంశాలపై చర్చించారు. చదవండి: ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్ అయిపోయింది క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది.. -
కమలహాసన్‌తో నడిగర్ సంఘ నాయకుల భేటీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నాయకులు సోమవారం స్థానిక ఆళ్వార్‌పేటలో ని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన పాండవర్ జట్టు.. తమ సంఘం ట్రస్టీ సభ్యుడిగా కమలహాసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ మర్యాదపూర్వకంగా కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు కమలహాసన్‌ను సంఘం ట్రస్టీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు కమలహాసన్ కూడా అంగీకరించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో నటీనటుల సంఘం నాయకులు తెలిపారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నడిగర్ సంఘం ఎన్నికలపై స్పందించిన హీరో విశాల్
Vishal Celebrates Nadigar Sangam Election Victory Viral Photos: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల్లో పాండవర్ జట్టు విజయంపై ఆ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఇది చాలా కాలం క్రితం జరిగిన ఒక యుద్ధం లాంటిదని, కాస్త ఆలస్యమైనా నిజమే గెలిచిందని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నడిగర్ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. పాండవర్ జట్టుకు శుభాకాంక్షలని, ఈ విజయం తమ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ముందే చెప్పినట్లుగా చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని, సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని విశాల్ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, పోలీస్ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా లత్తీ చిత్రం షూటింగ్ స్పాట్లో విశాల్ యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. -
ఎట్టకేలకు 'నడిగర్' ఫలితాలు విడుదల, గెలిచిందెవరంటే?
చెన్నై (తమిళనాడు): దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్ రెండోసారి గెలుపొందాడు. నడిగర్ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. కాగా 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా ఒక ప్యానల్ నుంచి కె. భాగ్యరాజ్ అధ్యక్షుడిగా, గణేశన్ సెక్రటరీగా మరో ప్యానల్ నుంచి పోటీ చేశారు. ఓటింగ్‌లో హీరో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. తాజాగా రిటైర్డ్ జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరపగా మరోసారి నాజర్ ప్యానెల్ గెలుపొందింది. చదవండి: Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్
సాక్షి, చెన్నై: తమిళ సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన తవసికి పెద్ద కష్టం వచ్చిపడింది. గత కొంత కాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న తవసి ఆర్థికంగానూ చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను అభ్యర్థించారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం స్పందించింది. తవసికి సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియాలో వేదికగా అర్థించింది. తన కామెడీతో నవ్వులు పూయించిన తవసి దీనస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. తోచినంత సాయం చేస్తామని ముందుకొస్తున్నారు. (చదవండి: వైద్య చరిత్రలోనే గొప్ప మైలురాయికి నాంది) Condition of VVS fame Actor #Thavasi now, he is strongly affected by cancer and seeking for a help. #SIAA #nadigarsangam pic.twitter.com/q6wiONwnZN — NadigarSangam PrNews (@NadigarsangamP) November 16, 2020 -
పెద్ద మనసు చాటుకున్న విశాల్
తమిళ సినిమా : కరోనా దెబ్బకు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) సభ్యులు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. సంఘానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ప్రతినిధి ఆదుకోవాలని సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. కొందరు నడిగర్ సంఘం సభ్యులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సభ్యులను ఆదుకునేందుకు విశాల్ ఆదివారం ముందుకు వచ్చారు. 150 మంది సభ్యులకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. సహాయ కార్యక్రమంలో నటుడు శ్రీమాన్, దళపతి దినేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర ఊర్లలో ఉన్న సభ్యులకు ఈ సాయం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 300 మంది హిజ్రాలకు నిత్యావసర వస్తువులను అందించారు. అదేవిధంగా కరోనా నివారణకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 1,000 మాస్క్‌లు, 1,000 శానిటైజర్లు అందించారు. -
విశాల్‌పై చర్యలు తీసుకుంటాం
చెన్నై : నటుడు విశాల్‌పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు నటుడు.నిర్మాత కే.రాజన్ తెలిపారు. ఆర్చెర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నవ నటుడు ఉదయ్ కథానాయకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్న చిత్రం ఉదయ్. నటి లీమా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్‌సెల్వన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారరం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కే.రాజన్, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వతంగం ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై కే.రాజన్ మాట్లాడుతూ నిర్మాతల మండలిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నటుడు విశాల్ ఈ సంఘాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సుమారు రూ.13 కోట్లు అవకతవకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతకుముందు ఇబ్రహిం రావుత్తర్ నిర్మాత కలైపులి ఎస్.ధాను వంటి వాళ్లు నిర్మాతల సంఘానికి నిధులను చేర్చి పెట్టగా దాన్ని విశాల్ విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఆయన సంఘానికి చెందిన ఆదాయవ్యయ ఖర్చులను చెప్పి తీరాలని, లేని పక్షంలో విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని కే.రాజన్ పేర్కొన్నారు. కాగా ఉదయ్ చిత్ర పాటలు, ప్రచార చిత్రం బాగున్నాయని, ఈ చిత్రానికి విడుదల సమయంలో తగిన థియేటర్లు లభించేలా సహకరిస్తామని ఆయన అన్నారు. చిత్ర హీరో ఉదయ్ మాట్లాడుతూ తనకు హీరోగా ఇదే తొలి చిత్రం అని, ఇంతకు ముందు ఒక షార్ట్ ఫిలింలో నటించిన అనుభవంతో ఈ చిత్రంలో నటించానని తెలిపారు. ఉదయ్ చిత్రం లవ్, యాక్షన్, సెంటిమెంట్ తదితర అంశాలు కలిసిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, అన్ని వర్గాలకు నచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. -
‘నడిగర్ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’
పెరంబూరు : నడిగర్ సంఘంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్ శాఖకు, రాష్ట్రర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికల జరిగినా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగలేదు. ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈ నెల 15వ తేదీన వెల్లడించనున్నట్లు చెన్నై హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సంఘాల శాఖ నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లకు నోటీసులు జారీ చేసింది. అందులో సంఘనిర్వాక విధులను సరిగా నిర్వహించలేదని తెలిసిందని, దీంతో తామే ప్రత్యేక అధికారితో ఎందుకు సంఘ బాధ్యతలు నిర్వహించారాదు? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు నడిగర్‌సంఘం సభ్యులను ధిగ్భ్రాంతికి గురి చేసింది. వారు సంఘాల శాఖ అధికారికి, రాష్ట్ర సచివాలయానికి ఒక లేఖ రాశారు. అందులో తమకు నోటీసులు, పత్రికల్లో వెలువడ్డ వార్త దిగ్భ్రాంతిని, మనస్థాపాన్ని కలిగించాయన్నారు. సంఘంలో చాలా కాలంగా పొందని పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ మూడేళ్లలో తాము పొందుతున్నామన్నారు. ముఖ్యంగా విశ్రాంత నటీ, నటులకు వృద్ధాప్య భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ఫలితాలు వెలువడక పోయినా అందిస్తోందని చెప్పారు. అలాంటిది కొందరు కావాలనే ఉసుగొల్పి, ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. సంఘ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. అలాంటిది సంఘానికి చేటు వాటిల్లేలా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించరాదన్న నోటీసులు సంఘంలోని 80 శాతం సభ్యులను బాధించాయన్నారు. 200 మంది వరకూ లేఖలో సంతకాలు చేసి పంపారు. -
ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి
విమర్శకుల దృష్టి ఇప్పుడు నయనతారపై పడింది. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలోనే ఇటు సూపర్‌స్టార్‌తో, అటు దళపతి విజయ్‌తో ఏకకాలంలో నటిస్తున్న నటి ఈమె. ఆ మధ్య తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధారవి మాట్లాడుతూ నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ, మరో చిత్రంలో సీతగానూ నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చుననీ, ఇంతకు ముందు సీతగా నటించాలంటే కేఆర్.విజయనే ఎంపిక చేసేవారని అన్నారు. ఇప్పుడైతే నమస్కరించేవారూ నటించవచ్చు, అందుకు భిన్నమైన వారూ నటించవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. చాలా మంది ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు. సాధారణంగా ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నయనతార ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. వెంటనే రాధారవికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. అందులో ఇకపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నానని పేర్కొంది. అంతేకాదు నడిగర్ సంఘాన్ని గట్టిగానే ప్రశ్నించింది. సంఘం తమకు వృత్తిపరంగా సహకరించే విషయం గురించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకుముందే ఒక లేఖ ద్వారా తెలియజేశానని, సుప్రీంకోర్టు వెల్లడించినట్లు నడిగర్ సంఘం ద్వారా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారా? విశాఖా కమిటీ సూచనల మేరకు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నడిగర్‌సంఘం వెంటనే రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ లేఖ రాసింది. కాగా ఆదివారం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపధ్యంలో నయనతార ఓటు వేయడానికి రాలేదు. దీంతో తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్సంఘంను ప్రశ్నించిన నయనతార, అదే బాధ్యతతో ఓటు వేయడానికి రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నయనతార ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. దీంతో ఒకరిని ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా నిర్వహించాలిగా అంటూ ఈ సంచలన నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్‌ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్‌ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్‌సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
వేడి పుట్టిస్తున్న నడిఘర్ సంఘం ఎన్నికలు
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘం ఎన్నికలు చర్చనీయాంశంగా మారింది. గతంలో శరత్ కుమార్ బృందాన్ని ఢీకొట్టి గెలిచిన పాండవర్ టీం మళ్లీ బరిలోకి దిగింది. ఈసారి కొత్తగా సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పటుతుండటంతో ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 23న జరిగే ఈ ఎన్నికలకు న్యాయస్థానం ప్రత్యేక రిటర్నింగ్ అధికారిని నియమించగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో పాండవర్ టీమ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా.. భాగ్యరాజా టీమ్ వారికంటే తాము నడిగర్ సంఘాన్బి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామంటూ బరిలో దిగారు. భాగ్యరాజా టీమ్ సీనియారిటీ పేరుతో నడిగర్ సంఘాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టగా పాండవర్ టీమ్ మాత్రం గత మూడేళ్లుగా తమ అభివృద్దే మరోమారు విజయానికి దోహదపడుతుందనే ధీమాలో ఉంది. పాండవర్ టీమ్ నుండి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తితోపాటు ఉపాధ్యక్ష, సభ్యుల పదవి పాత వర్గమే బరిలో ఉంది. గత కమిటీలో శరత్ కుమార్ టీమ్ పై వ్యతిరేకతతో భాగ్యరాజా వంటి సీనియర్ నటులంతా పాండవర్ టీమ్ కి మద్దతుగా నిలిచారు. అయితే నడిగర్ సంఘానికి సొంత భవనంతోపాటు పేద కళాకారులకు ఆర్థిక సాయం వంటి భారీ పథకాలతో పాండవర్ టీమ్ ముందుకు సాగుతుండటం, పాత కమిటీ అవినీతిని బయట పెడుతుండటం సీనియర్లకు కొంత ఇబ్బందులను తెచ్చేలా చేసింది. దీంతో సీనియర్ల నుంచి భాగ్యరాజా అధ్యక్షుడిగా బరిలో దిగగా నిర్మాత నటుడు ఐసరీ గణేష్ రెండవ టీమ్ కు వెన్నదన్నుగా నిలుస్తున్నారు. గతంలో పాండవర్ టీమ్ లోనే ఉన్న ఐసరీ గణేష్ ఒక్కసారిగా టీమ్ మారటం ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా మారేందుకు కారణమైంది. మొత్తానికి రెండు టీమ్‌లు గెలుపుకోసం ఎవరి దారిలో వారు సభ్యుల ఓట్ల కోసం వేట మొదలు పెట్టింది. -
నడిఘర్ సంఘం భవనానికి రూ.కోటి విరాళం
పెంరబూరు: దక్షిణ భారత నటీనటుల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం నాజర్, విశాల్, కార్తీల బృందం మళ్లీ పోటీకి సిద్ధం అయ్యారు. ఈ జట్టును ఢీకొనేందుకు ఐసరిగణేశ్, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ల జట్టు సిద్ధం అయ్యింది. ఈ జట్ల నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయ్యింది.ఇదిలాఉండగా నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంఘ కోశాధికారి బాధ్యతలను నిర్వహిస్తున్న నటుడు కార్తీ భవన నిర్మాణానికి కోటి రూపాయలను ఆర్థిక సాయం చేసినట్లు, అదే విధంగా సంఘ కార్యదర్శి విశాల్ రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ప్రచారం అవుతోంది. సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, విశాల్ ఆర్థిక సాయం చేయడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలేనన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
పెరంబూరు: సాధారణంగా ఒక వ్యక్తి విషయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు అందులో ముందు గుడ్ న్యూస్ చెప్పమంటారా? బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? అని అడుగుతుంటారు. ఇప్పుడు కరెక్ట్‌గా నటుడు విశాల్ పరిస్థితి ఇలాంటిదే. ఆనందంతో పాటు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. విశాల్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన సంఘటన చోటు చేసుకున్నా, వృత్తిపరంగా విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కీడెంచి మేలెంచమన్న సామెతను పక్కన పెట్టి ముందు విశాల్‌కు సంబంధించిన మంచి వార్త గురించి చెప్పుకుందాం. మోస్ట్ బ్యాచిలర్ అయిన నటుడు విశాల్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అనీషారెడ్డి అనే నటితో వివాహం నిశ్చయం అయిన విషయం విదితమే. ఆ మధ్య వివాహ నిశ్చితార్థం వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. అయితే వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా తన పెళ్లి వేడుక అక్టోబర్ 9న జరగనుందని నటుడు విశాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే వివాహ వేదిక ఎక్కడన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. సమస్యలేంటంటే.. కాగా ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించి జోడు పదవుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలిలో అవినీతి, అవకతవకలు జరిగాయంటూ వ్యతిరేక వర్గం ఆరోపణలను గుప్పిస్తున్నారు. మండలి కార్యవర్గం ఏ విషయంలోనూ విధి, విధానాలు పాఠించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల్లో మండలిలో వ్యతిరేక వర్గం ఫిర్యాదు మేరకు ప్రభుత్వం మండలి నిర్వహణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. అందుకు ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఇది విశాల్ వర్గాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతో ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది. మండలికి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్‌కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. అందులో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, నటుడు కే.రాజన్, టీజే.త్యాగరాజన్ 9 మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సారి హైకోర్టులో కూడా విశాల్ వర్గానికి చుక్కెదురైంది. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్తానం అడహాక్ కమిటీని రద్దు చేయలేమని తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం నియమించింది ప్రత్యేక అధికారికి తాత్కాలిక సలహా అడహాక్ కమిటీని నియమించిందని, దాన్ని రద్దు చేయడం వీలుకాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు. ఈ తీర్పు కూడా విశాల్ వర్గానికి అవమానకరమైన విషయమే అవుతుంది. -
బుల్లితెర నడిగర్ సంఘానికి చతుర్ముఖ పోటీ
పెరంబూరు: ఎన్నడూ లేనంతగా చతుర్మఖ పోటీగా సాగిన తమిళనాడు బుల్లితెర నడిగర్ సంఘం ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘానికి ఎన్నికల మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. కాగా ప్రస్తుత నిర్వాహకం పదవీకాలం పూర్తి కావడంతో శనివారం సంఘం ఎన్నికలు జరిగాయి. పోటీలో జట్లు విరుగంబాక్కమ్‌లోని ఏకేఆర్ మహాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత కార్యవర్గ అధ్యక్షుడు శివన్ శ్రీనివాసన్ జట్టు మళ్లీ పోటీ చేస్తుండగా, నటి నిరోషా జట్టు, రవివర్మ జట్టు, బోస్‌వెంకట్ జట్టు అంటూ నాలుగు జట్లు పోటీ పడ్డాయి. నటి నిరోషా జట్టులో భరత్ కార్యదర్శి పదవికి, ఎస్.శ్రీధర్ కోశాధికారి పదవికి, వీటీ.దినకరన్, కన్యాభారతీ ఉపాధ్యక్ష పదవికి, విజయ్, ఆనంద్, రవీంద్రన్, మోనిక ఉపకార్యదర్శి పదవులకు పోటీ చేశారు. అదే విధంగా శివన్ శ్రీనివాసన్ జట్టులో కార్యదర్శి పదవికి భరత్కల్యాణ్, ఉపాధ్యక్షపదవికి రాజశేఖర్, మనోబాలా, కోశాధికారి పదవికి శ్రీవిద్య, ఉపకార్యదర్శి పదవులకు దళపతిదినేశ్, ఎంటీ.మోహన్ కర్పగవల్లి, సవాల్రావ్ పోటీలో ఉన్నారు. ఇక బోస్‌వెంకట్ జట్టులో కార్యదర్శి పదవికి పీకే.గణేశ్, ఉపాధ్యక్ష పదవికి సోనియా, ఎల్.రాజా, కోశాధికారి పదవికి రవీందర్, ఉప కార్యదర్శి పదవులకు కే.దేవానంద్, దాడి బాలాజి, శ్రద్ధిక, కే.కమలహాసన్ పోటీ చేశారు. సంఘంలో మొత్తం 1,551 సభ్యులు ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. సినీ దర్శకుడు లియాఖత్అలీఖాన్ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ ఎన్నికలు గట్టి పోలీస్‌బందోబస్తు మధ్య జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల లెక్కింపు మొదలైంది. అయితే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. -
హన్సికపై ఫిర్యాదు
సాక్షి, సినిమా : నటి హన్సికపై ఆమె కార్యనిర్వాహకుడు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ముంబై భామ హన్సిక. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మాప్పిళై, విజయ్ సరసన వేలాయుధం ఒరుకల్ ఒరు కన్నాడి, తీయవేలై చేయనుమ్ కుమారు వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ నటిగా ముద్ర వేసుకున్నారు. జయంరవి, ఆర్య, సిద్దార్థ్ వంటి యువ హీరోలతో నటించి మంచి పేరు తెచుకున్న హన్సిక శింబుతో ప్రేమ వ్యవహారంలో మినహా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదనే చెప్పాలి. ఇటీవల హీరోయిన్ రేస్‌లో కాస్త వెనుకబడిన ఈ అమ్మడు నటించి తాజాగా విడుదలైన చిత్రం గులేభకావళి. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా తుపాకిమునై, అధర్వ సరసన ఒక చిత్రం మాత్రమే హన్సిక చేతిలో ఉన్నాయి. ఇకపోతే ఈమె వద్ద మునిస్వామి అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య హన్సిక కాల్షీట్స్ వ్యవహారాలను ఆమె తల్లి చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హన్సిక వద్ద ఇంతకుముందు మేనేజర్‌గా పని చేసిన మునిస్వామి సోమవారం ఆమెపై నడిగర్‌సంఘంలో పిర్యాదు చేశారు. అందులో.. తాను హన్సిక వద్ద మేనేజర్‌గా పని చేసినందుకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, హన్సిక నుంచి తనకు రావలసిన పారితోషికాన్ని ఇప్పించాలని కోరారు. ఈ వ్యవహారంపై నటి హన్సిక ఎలా స్పందిస్తారో? నడిగర్‌సంఘం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. -
పెళ్లి కోసం మండపాన్ని బుక్ చేసిన విశాల్
సాక్షి, చెన్నై : హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. సినిమాల్లోనే అనుకున్నా.. ఇక చెన్నైలో రౌడీముఠా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విశాల్ స్పందిస్తూ...‘రౌడీ ముఠా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం, అందులో ఆటా, పాటా లాంటివి సినిమాల్లోనే చూపిస్తారనుకుంటామని, నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించాడు. మార్చి నుంచి సమ్మె చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ లాంటి సమస్యలపై పోరాడే విధంగా దక్షిణ భారత సినీనటుల సంఘం మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి చిత్రాల విడుదల ఉండదని వెల్లడించారు. ఈ విషయమై స్పందించిన విశాల్ మార్చి 1 నుంచి సమ్మె తథ్యం అని స్పష్టం చేశాడు. అయితే క్యూబ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళభాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులను అందించే విషయమై నటీనటుల సంఘం సమాలోచనలు చేస్తోందని తెలిపాడు. -
నా తండ్రి భిక్షమడగడం కళ్లారా చూశా: టాప్ హీరో
పెరంబూర్: నా తండ్రి భిక్షమడగడం నేను కళ్లారా చూశాను అని హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్యానల్ సభ్యుల పరిచయ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నిర్మాతలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తెలిపారు. నడిగర్ సంఘంలో జరిగే మంచి పనులు ఆ సంఘంలోని సభ్యులకే లబ్ధి చేకూరుస్తాయని, అదే నిర్మాతల మండలిలో అయితే పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కాగా నడిగర్ సంఘానికి తమ కార్యవర్గం చేసిన వాగ్ధానాలన్ని నెరవేర్చామన్నారు. అదే విధంగా నిర్మాతల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తామన్నారు. తన తండ్రి మహాప్రభు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారని, ఐ లవ్ ఇండియా చిత్రం నిర్మించి.. దాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఒక ల్యాబ్ ముందు భిక్షమడిగారన్నారు. తాను చేసిన ఒకే ఒక తప్పు ఈ చిత్రాన్ని నిర్మించడం అని ఆయన అన్న మాటలు తనను ఇంకా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రికి చెప్పినప్పుడు పోటీలో నెగ్గి ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారని అన్నారు. ప్రతి నిర్మాతకు కనీసం అర గ్రౌండ్ లేదా పావు గ్రౌండ్ స్థలాన్ని అందించగలిగితేనే ఇంటికి రా లేకపోతే రావొద్దు అని తన తండ్రి అన్నారని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ వాగ్ధానాల పట్టికను వెల్లడించారు. -
అర్ధరాత్రి.. గుట్టుగా ఆందోళనస్థలికి సూపర్ స్టార్!
జల్లికట్టు ఆందోళనకు విజయ్ మద్దతు తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు. అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇలయదళపతి విజయ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే రోజు రాత్రి విజయ్ మేరినా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న లక్షలమంది యువతకు ఆయన మద్దతు పలికారు. వారితో కలిసి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జల్లికట్టు ఆందోళనకు ముఖ్యకేంద్రంగా ఉన్న చెన్నైలోని మెరీనా బీచ్‌కు రహస్యంగా వచ్చిన విజయ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్‌లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. చెన్నై : గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సంఘ అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకలను, దివంగత ప్రముఖ కథాకారుల పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు. బి.సరోజాదేవికి మక్కల్ తిలకం అవార్డు కాగా ప్రఖ్యాత నటి సరోజాదేవిని మక్కల్ తిలకం అవార్డుతో సత్కరించారు, అదే విధంగా నడిగర్ తిలకం అవార్డును నటి కాంచనకు, భానుమతి అవార్డును నటి ఊర్వశీ శారదకు, అంజలిదేవి అవార్డును, నటి వాణిశ్రీకి, ఎంఆర్.రాధ, తంగవేల్ల పేరుతో అవార్డును నటుడు వెన్నిరాడై మూర్తికి, టీపీ.రాజ్యలక్ష్మి అవార్డును ఎంఎస్.రాజ్యంకు, మనోరమ అవార్డును ఎస్.పార్వతికి, సహస్రనామ అవార్డును ఎన్ఎస్కే.థామ్‌కు, ఎస్ఎస్.రాజేంద్రన్ అవార్డును వినూచక్రవర్తికి అందించి ఘనంగా సత్కరించారు. తమిళసినిమా శతాబ్ది అవార్డుల ప్రదానం అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు. ఆందోళన, ముష్టి యుద్ధాలు: సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. విశాల్ కార్యాలయం పై దాడి: అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు. వేటును సమర్థించుకున్న నిర్వాహకులు కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు శఅనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపారు. నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు.