Nails
-
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన -
మాదాపూర్ లో స్నైల్స్ , హెయిర్, బ్యూటీ & నెయిల్స్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించిన జబర్దస్త్ రితు చౌదరి, డైరెక్టర్ సందీప్ రాజ్ (ఫోటోలు)
-
గోళ్లు పొడవుగా అందంగా ఉండాలంటే..ఇలా చేయండి!
గోళ్లు ..పొడవుగా అందంగా ఉండే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొందరిలో కొద్దిగా పెరగగానే విరిగిపోతుంటాయి. కొంతమందికి అసలు పెరగవు. దీంతో నెయిల్ పెయింట్ వేసుకోవాలంటే ఇబ్బంది. గోళ్లను చక్కగా పెంచే ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి మీ కోరిక తీరుతుంది.. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆలివ్ ఆయిల్ ముందుంటుంది. దీనిలోని విటమిన్ ఇ గోళ్లకు పోషణ అందించి చక్కగా పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను గోళ్లమీద రాసి మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ చక్కగా జరిగి గోళ్లలో పెరుగుదల కనిపిస్తుంది. టీస్పూను యాపిల్ సైడర్ వెనిగర్‌లో టీస్పూను వెల్లుల్లి తరుగు వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లపై రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే గోళ్లు విరగకుండా చక్కగా పెరుగుతాయి. వెల్లుల్లి రెబ్బను రెండు ముక్కలు చేసి గోళ్లపై పదినిమిషాలపాటు రుద్దాలి. కొద్దిరోజుల్లోనే గోళ్ల పెరుగుదల కనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌ను గోళ్లకు పూతలా అప్లైచేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది గోళ్లను అందంగా పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చేయలేకపోతే కొబ్బరినూనెను గోళ్లపై రాసి రోజూ మర్దన చేయాలి. కొబ్బరినూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు గోళ్ల పెరుగుదలకు దోహదపడతాయి. (చదవండి: కీర్తి సురేశ్ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!) -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్‌మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!
మీ గోళ్ల ఆకృతి మీ గురించి, మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుందని తెలుసా!. ఔను అనే చెబుతున్నారు నిపుణులు. గోళ్ల ఆకృతి ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు అంటున్నారు నిపుణులు. వారు జరిపిన అధ్యయనాల ప్రకారం..నాలుగు రకాల గోళ్ల ఆకృతిపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని 'నెయిల్ షేప్ పర్సనాలిటీ టెస్ట్‌గా' పేర్కొన్నారు. ఈ గోళ్ల ఆకారం బట్టి మీ నిర్ణయాలు మంచివేనా, మీరు ఎలాంటి మనస్తతత్వం కలవారో చెప్పొచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆలస్యం ఎందుకు? మీ గోళ్లు ఏ ఆకారంలో ఉన్నాయో చెక్‌చేసుకుని మీ వ్యక్తితత్వం అలానే ఉందా లేదో తెలుసుకునేందుకు సిద్ధంకండి! వ్యక్తిత్వాన్ని అంచనావేసే గోళ్ల ఆకారాలను నాలగు రకాలుగా విభజించారు నిపుణులు అవి పొడవాటి గోర్లు, గుండ్రటి గోర్లు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోర్లుగా విభజించారు. నిలువుగా పొడవాటి గోర్లు ఉన్నట్లయితే.. ఇలాంటి గోర్లు ఉన్నవాళ్లు సృజనాత్మకంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధికలవారై ఉంటారు. వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా, తార్కికంగా కూడా ఆలోచిస్తారు. తమ సృజనాత్మక ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు. ఎక్కువగా నిరుత్సాహానికి గురవ్వుతుంటారు. దీంతో అక్కడే చతికిలపడిపోతారు. తిరిగి నూతనోత్సాహాంతో యథాస్థితికి రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణలో ఉండేదుకు యత్నించి.. నిరుత్సాహన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు అంటున్నారు నిపుణులు. దీర్ఘచతురస్రాకార గోర్లు.. వీరు ఓపెన్‌మైండెడ్‌గా ఉంటారు. మంచి నమ్మకస్తులుగా కూడా ఉంటారు. భాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నపటికీ.. తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారై ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా. కట్టుబాట్లను అనుసరించడానికే ఇష్టపడతారు. ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పటికీ పరిస్థితిని బ్టటి ..తనను తాను నియంత్రించికుని సానుకూలంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం. గుండ్రటి గోళ్లు కల వ్యక్తి లక్షణాలు ఈ ఆకృతి గల వ్యక్తి అంత తేలికగా కంగారుపడరు. ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు. పరిశోధనాత్మకంగా ఉంటారు. ప్రశ్నించే గుణం ఎక్కువ. కొత్త సమాచారం కోసం వెతుకుతుంటారు. గొప్ప అభ్యాసకులుగా ఉంటారు. ఎదురు దెబ్బల తట్టుకుని పుంజుకుని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందర్నీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థంచేసుకోగలరు త్వరితగతిన స్నేహితులను సంపాదించుకోగలరు. విభేధాలను పరిష్కరించడంలో దిట్ట. చతురస్రాకార గోళ్లు ఉంటే.. వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు., ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానకి ఇష్టపడతుంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్తవాటి కోసం అన్వేషిస్తూ..కొత్త కొత్త ప్రదేశాలను తరుచుగా సందర్శిస్తుంటారు. లక్ష్యం కోసం ఎంత శ్రమననై ఓర్చకుని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కొవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు. అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు, కేవలం వారు చెప్పాలనుకున్నది చెప్పేందుకే ఇష్టపడుతుంటారు. అలాగే కుటుంబం, స్నేహితులకు ప్రాముఖ్యత ఇవ్వడమే గాక మంచి శ్రేయోభిలాషిగా ఉంటారు కూడా. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
పాప కళ్లలోంచి బియ్యం గింజలు, గోర్లు.. వైద్యులు ఏం చెప్పారంటే..?
ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచైనా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు. దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి ఆర్ఎంఓ సంతోష్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు. చదవండి: షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి -
42 అడుగుల గోళ్లు.. గిన్నిస్ రికార్డు బద్దలు
ఎవరైనా గోర్లు ఎంత పెంచుకుంటారు? ఇంచు.. మహా అయితే రెండు ఇంచులు. కానీ, డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ మాత్రం ఫీట్ల కొద్దీపెంచేసింది. ఆమె గోర్లన్నీ కలిపితే.. 42 అడుగుల 10.4అంగుళాలు పొడవు. అంటే.. నాలుగంతస్తుల భవనం కంటే ఎక్కువేనన్నమాట. అందుకే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఆమె గోర్లలో అతి పొడవైనది 4 అడుగుల 6.7అంగుళాలు ఉండగా, అతి చిన్నది 3 అడుగుల 7 అంగుళాల పొడవుతో ఉంది. అయితే డయానా గోళ్లు పెంచడం వెనుక ఓ విషాద గాథ ఉంది. డయానా కూతురు ఆస్తమాతో చనిపోయింది. చనిపోవడానికి ముందు రోజంతా తల్లితోనే గడిపిన ఆ అమ్మాయి.. రాత్రిపూట తల్లి గోళ్లు తీసి, పాలిష్ చేసింది. తల్లీకూతుళ్లు ఆ రాత్రంతా ముచ్చట్లతోనే గడిపేశారు. తెల్లారి ఆ అమ్మాయి చనిపోయింది. కూతురు పాలిష్ చేసిన గోళ్లను కట్ చేయొద్దనుకుంది డయానా. అంతే... 25 ఏళ్లుగా పెంచుతూనే ఉంది. మిగిలిన పిల్లలు గోళ్లు కట్ చేసుకోమని సూచించారు. బయటికి వెళ్లినప్పుడు జనాలు వింతగా చూశారు. అవేమీ పట్టించుకోలేదామె. ఎందుకంటే ఆ గోళ్లను చూసుకున్నప్పుడల్లా తన కూతురు తనతోనే ఉన్నట్లనిపిస్తుందంటుంది. అదే విషయాన్ని పిల్లలతోనూ చెప్పింది. ఆ తరువాత వాళ్లెప్పుడూ కట్ చేసుకోమని చెప్పలేదు. ఇక బయటికి వెళ్లినప్పుడు కొందరు ఆమెతో ఫొటో దిగడానికి ఇష్టపడ్డా.. ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు, గిన్నిస్ రికార్డు తరువాత ఫొటోస్‌కు ఓకే చెబుతానంటోంది. వేర్లలా పెరిగిన గోళ్లతోనే ఆమె అన్ని పనులూ చక్కబె డుతుంది. ల్యాప్‌టాప్‌ను సైతం ఆపరేట్ చేస్తుంది. ఒక్క వంటమాత్రమే చేయలేనని చెబుతోంది. లక్ష డాలర్లు ఇస్తామని చెప్పినా తాను గోళ్లు మాత్రం కట్ చేయనంటోంది. చదవండి: మంకీపాక్స్‌తో వణికిపోతున్న అమెరికా.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన -
గోళ్లు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
వర్షాకాలంలో అధికంగా ఉండే తేమకు గోళ్లు విరిగిపోతుంటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం మరింత సున్నితంగా మారి పాడవుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... రాత్రి పడుకునే ముందు సైంధవ లవణం వేసిన నీటిలో పది నిమిషాలపాటు వేళ్లను నానబెట్టాలి. తరువాత తడిలేకుండా తుడిచి క్రీమ్ రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పెళుసుబారకుండా ఉండటంతోబాటు గోళ్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా మారుతుంది. ఆలివ్ ఆయిల్లో గోళ్లను మర్దన చేస్తే మరింత షైనింగ్‌గా కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను వేడిచేసి గోళ్ల మీద వేసి మర్థన చేయాలి. మర్దన తరువాత నీటితో కడిగేయాలి. రోజుకి రెండు సార్లు ఇలా చేయడం వల్ల గోళ్లు మరింత అందంగా మెరుస్తాయి. గోరు చుట్టూ ఉన్నచర్మానికి క్యూటికల్ సమస్య బాధిస్తుంటే తేనె రాసి మర్దన రాసి చేయాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగి తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యూటికల్ తగ్గు ముఖం పడుతుంది. పచ్చిపాలలో ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లు, చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోజూ రాత్రి పడుకునేముందు పచ్చిపాలలో చేతివేళ్లను పదినిమిషాలపాటు నానపెట్టి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. -
మధ్యాహ్నం హత్య.. భర్తను పట్టించిన చేతి గోళ్లు
ముంబై: భార్యభర్తల గొడవలనేవి సహజం. కలహాలు లేని కాపురమే ఉండదు. కానీ ఆ మనస్పర్థలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ ఎవరిమానాన వారు బతికినా పర్వాలేదు గానీ కక్ష పెంచుకుని దారుణమైన నేరాలకు పాల్పడితే ఇరు జీవితాలు నాశనమవుతాయి. అచ్చం అలాంటి సంఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్ ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా భోలా యాదవ్ నివశిస్తున్నారు. ఐతే వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివశించడం మొదలు పెట్టారు. అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు రీమా స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐతే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలే అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’) -
30 ఏళ్లుగా పెంచుకున్న గోళ్లను ఆ కారణంగా కట్ చేయించుకుంది..
వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ.. తన చేతి వేళ్ల గోళ్లను 30 సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె 2017లో అత్యంత పొడవైన చేతి వేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అయితే గత కొంతకాలంగా తన పొడవాటి గోళ్లతో ఇబ్బందులు పడుతున్న ఆమె.. వాటిని కత్తరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆమె వైద్యుల సమక్షంలో గోళ్లను తొలిగించుకుంది. ఆమె గోళ్లను చివరి సారిగా కొలిచినప్పుడు వాటి పొడవు 733.55 సెంటీమీటర్లుగా నమోదైంది. ఆమె తన రెండు చేతుల గోళ్లను పాలిష్ చేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరమయ్యేది. ఇందుకు గాను ఆమెకు దాదాపు 20 గంటల సమయం పట్టేది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) కాగా, గత కొంతకాలంగా రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆమె టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ చర్మవ్యాధుల ఆసుపత్రిని సంప్రదించింది. నిపుణుల సమక్షంలో ఆమె తన గోళ్లను కత్తిరించుకుంది. తొలగించే సమయంలో గోళ్ల పొడవు 24 అడుగుల 7 అంగుళాలుగా తేలింది. అయితే గోళ్లు తొలగించిన తర్వాత ఆమె సంతోషంగా పనులు చేసుకోగలుగుతున్నానంటోంది. వంట చేయడం, పాత్రలు కడగటం, మంచంపై దుప్పట్లు పరచడం వంటి పనులను చిటికెలో చేసుకోగలుగుతున్నానంటూ తెగ సంబరపడిపోతుంది. -
రైతు ఉద్యమం: వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, ఫిబ్రవరి 7న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైతులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించింది. ఈ ఘటనకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఢిల్లీ పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు) అటు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. శిరోమణి అకాలీదల్‌కు చెందిన హరి సిమ్రత్ కౌర్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కు చెందిన సుప్రియ సులే, డీఎంకెకు చెందిన కనిమెళి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌతా రాయ్ ఉన్నారు. కాంక్రీట్ బారికేడ్స్, ముళ్ల కంచెల వెనుక రైతులున్న దృశ్యాలను చూసి షాకయ్యానంటూ హరిసిమ్రత్ పేర్కొన్నారు. (రైతు ఉద్యమం : ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక) మరోవైపు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. అటు ఈ వ్యవహారంపై రైతులతో చర్చలు జరిపాలని, చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. #ghazipurborder #FarmersProtest https://t.co/zlrWJngT3d — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) February 4, 2021 -
బ్యూటిప్స్
కొండంత అందం గోళ్లకు ముందు వేసుకున్న నెయిల్ పాలిష్‌ను రిమూవర్లో ముంచిన దూదితో తుడిచేయాలి. వెడల్పాటి పాత్రలో గోరువెచ్చటి నీటిని పోసి రెండు చుక్కల మైల్డ్షాంపూ కాని లిక్విడ్‌సోప్ కాని వేసి కలిపి అందులో రెండు చేతులను ముంచి పది నిమిషాల సేపు ఉంచాలి. నెయిల్ కటర్‌తో గోళ్లను అందంగా షేప్ వచ్చేటట్లు కత్తిరించాలి. బ్రష్‌తో చేతిని, వేళ్లకు, గోళ్లకు మర్దన చేసినట్లు రుద్ది కడగాలి. మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్ అప్లయ్ చేసి మర్దన చేయాలి. వేళ్లకు, ప్రతి కణుపు మీద వలయాకారంగా క్లాక్‌వైజ్ గానూ వెంటనే యాంటి క్లాక్ వైజ్ గానూ మసాజ్ చేయాలి. అలాగే ప్రతి గోరుకూ చేయాలి. అన్నింటికీ ఒకే నంబర్ మెయింటెయిన్ చేయడం ముఖ్యం. అంటే మొదటి వేలికి ఒక కణుపుకు క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు చేస్తే యాంటి క్లాక్‌వైజ్‌గా కూడా ఐదుసార్లు మాత్రమే చేయాలి. ఇదే కౌంట్‌ను అన్ని వేళ్లకు, గోళ్లకు పాటించాలి. ∙టిస్యూ పేపర్‌తో వేళ్లకున్న ఆయిల్ తుడిచి నెయిల్ పాలిష్ వేయాలి. -
గోళ్లు పలచబడి విరిగిపోతుంటే...
గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం... కాల్షియం, ఐరన్ లోపం. దీంతో పాటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోళ్ల మీద రాసి, మసాజ్ చేయాలి. లేదా బాదం నూనెను వేలితో అద్దుకొని, గోరు చుట్టూ రాసి మృదువుగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. దీనికి ఉప్పు, షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు వేళ్లు మునిగేలా ఉంచి, తర్వాత మెనిక్యూర్ టూల్‌తో గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. గోళ్లను ఒక షేప్‌లో కత్తిరించి, పెట్రోలియమ్ జెల్లీ లేదా బాదం నూనెతో మర్దనా చేయాలి.వీటితో పాటు.. ∙ఆహారంలో కాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. -
శ్రీధర్ ఘనత.. నమ్మి తీరాల్సిందే!
ప్రపంచంలో అత్యంత పొడవైన గోళ్లతో గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్న శ్రీధర్ ఛిల్లల్(82).. ఎట్టకేలకు వాటిని కత్తిరించేసుకున్నారు. పుణేకు చెందిన ఈ పెద్దాయన.. 1952 నుంచి తన ఎడమచేతి గోళ్లను పెంచుతూ వస్తున్నారు. అయితే చేతికి పక్షవాతం సోకటంతో చివరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో జరిగిన ‘నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీ’లో 31 అడుగుల పోడవైన గోళ్లను కత్తిరించేసుకున్నారు. అంతేకాదు రిప్లే'స్ బిలివ్ ఇట్ ఆర్ నాట్!(వింతలను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు) మ్యూజియమ్ నిర్వాహకులు శ్రీధర్ నుంచి వాటిని కొనుగోలు చేసి.. ప్రదర్శనకు ఉంచారు. 66 ఏళ్ల కష్టం... గవర్నమెంట్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌గా విధులు నిర్వహించిన రిటైర్ అయిన శ్రీధర్.. ‘గోళ్లు పెంచటం ఏనాడూ ఇబ్బందిగా అనిపించలేదు’అని చెబుతున్నారు. హైస్కూలులో ఉండగా తన టీచర్ చేతి గోరును అనుకోకుండా శ్రీధర్ విరగ్గొట్టడంతో టీచర్ కోప్పడ్డారట. పొడవైన గోళ్లు పెంచడం అంత తేలికైన విషయం కాదు అని టీచర్ చెప్పేసరికి శ్రీధర్‌కి ఆ ఆలోచన కలిగింది. అంతే.. అప్పటి నుంచి తన చేతి గోళ్లను పెంచడం ప్రారంభించారు. ఎవ్వరు వద్దన్నా, చివరకు టీచరే వ్యతిరేకించినా సరే ఆయన విన్లేదు. గోళ్ల కారణంగా శ్రీధర్ పెళ్లీడు వచ్చినా పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయినా సరే గోళ్లను కట్ చేయడానికి మాత్రం ఆయన ససేమిరా అన్నారు. చివరకు 29 ఏళ్ల వయసులో బంధువుల అమ్మాయితో ఎలాగోలా పెళ్లి కుదిరింది. అప్పటివరకు రెండు చేతుల గోళ్లూ పెంచిన శ్రీధర్.. భార్య మాట విని కుడి చేతి గోళ్లు కట్ చేశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కగా(ఆ సమయంలో 30 అడుగులు).. అతడి రికార్డు పరిగణనలోకి తీసుకుని ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు నేతలు పుణే మున్సిపల్ కార్పోరేషన్‌కు విజ్ఞప్తి కూడా చేశారు. -
వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు!
గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే పాలిష్‌పైన డిజైన్లు వేయడం చూస్తుంటాం. కానీ గోళ్లకు అందమైన రింగులు తొడిగితే అవి ఇంకెంత మెరిసిపోతాయో తెలపడానికే డిజైనర్లు పోటీపడుతున్నారు. వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి. ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి. -
మా జోలికొస్తే గోళ్లు కత్తిరిస్తా: ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బాగా అలవాటయ్యింది త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్. ఈయన ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విప్లవ్‌ని, బీజేపీలను విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం, ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస వివాదస్పద వ్యాఖ్యలతో రోజు మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా బిప్లబ్ కుమార్ దేబ్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రమాదం తప్పదు అని హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో తన ప్రభుత్వం జోలికి వస్తే ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చెప్పడానికి ఆయన కూరగాయలు అమ్మే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు. ‘కూరగాయలు అమ్మే వ్యక్తి సొరకాయలను అమ్ముదామని ఉదయ 8 గంటల ప్రాంతంలో మార్కెట్‌కు వచ్చాడు. కానీ 9 గంటలకల్లా ఆ సొరకాయ చెడిపోయింది. కారణం... వచ్చిన వినియోగదారలందరూ సొరకాయను పరీక్షించడానికి తమ గోర్లతో నొక్కి చూసారు. అందువల్ల ఆ సొరకాయ చెడిపోయింది.’ అలానే ఎవరైన నా ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకున్న, నా ప్రభుత్వాన్ని హేళన చేస్తే... నేను వారి గోళ్లను కత్తిరిస్తాను. కాబట్టి జాగ్రత్త నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం కూడా చేయకండి అంటూ హెచ్చరించారు. బిప్లబ్ రోజు ఇలా ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. బిప్లబ్‌ను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2నఆయనను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్లు సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. -
గోళ్లు కుట్టించుకుంటారా?
మీరు కరెక్ట్‌గానే చదివారు! గోళ్లు కుట్టించుకుంటారా అని!? ‘దిమాగ్ గిట్ల కరాబయ్యిందా ఏంటి? అసలూ.. ఎవరైనా గోళ్లు కుట్టించుకుంటారా?’ అంటూ కోపం తెచ్చుకోవద్దండి!! ఇది నెయిల్ ఆర్ట్‌లో లేటెస్ట్ ట్రెండ్! చెవులు, ముక్కు కుట్టించుకున్నట్లే.. గోళ్లు కుట్టించుకుని (హోల్ పెట్టించుకుని).. ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్లుగా మెరిపించుకోవచ్చు. గోళ్లతోనే డిస్కో డాన్స్ చేయించొచ్చు. నిజానికి ఈ రోజుల్లో నెయిల్ ఆర్ట్‌కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ. గోళ్లను పొడవుగా పెంచుకుని.. కొమ్మలు రెమ్మలు, పక్షులు, చేపలు ఇలా ఎన్నో అద్భుతాలను నెయిల్ ఆర్ట్లుగా డిజైన్ చేసుకోవడం... ఆ ఆర్ట్‌కు అక్కడక్కడా మెరుపుకోసం కుందమ్స్ అతికించుకోవడం ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నాజూగ్గా, పొడవుగా పెరిగిన గోళ్లను మెరిసే స్టడ్స్‌తో మరింత మెరిపించుకోవడమే ఇప్పటి ట్రెండ్. అందుకే మరి, నాజూకైన గోళ్లకు మెరుపుల స్టడ్స్ పెట్టుకుని కిరాక్ బాట పడుతోంది ఊత్. Eunkyung అనే దక్షిణ కొరియా యువ కళాకారిణి పరిచయం చేసిన ‘లెడ్ డిస్కో నెయిల్’ ఇప్పుడు మనదేశంలోనూ చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ స్టడ్స్‌ని అన్ని నెయిల్స్‌కి అటాచ్ చేసుకుని చీకట్లో ‘బూమ్ బూమ్ షకలక’ అంటూ.. డిస్కో లైట్స్ మాదిరిగా తళుక్కుమనిపించొచ్చు. ఇంతకీ ఈ మెరుపుకు కారణం ఏంటంటే.. విద్యుత్ దీపంలో ఉపయోగించే లెడ్ను స్టడ్స్‌లో వాడటంతో పాటు అది వెలిగేందుకు చిన్న బ్యాటరీ కూడా గోరు వెనుక భాగంలో అటాచ్ చెయ్యడం వల్ల చీకట్లో మెరుస్తుంది. – సంహిత -
హార్ట్లీ బెలూన్స్
మనసు లయలను మధురంగా స్పర్శించే గొప్ప భావం ప్రేమ. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు.. రాతల్లో చూపే ఆకారమే హృదయాకారం(లవ్ సింబల్). అవును మరి, అందులో కోటి భావాలను ఒకేసారి పలికించొచ్చు. అందుకే ప్రపంచమంతా ఆ సింబల్‌ని ‘మనసు చాటు మంత్రం’లా విరివిగా వాడుతుంది. అందానికే అందంతెచ్చే ఆ సింబల్స్‌ని నాజూకైన మీ గోళ్లపై ఎగరనివ్వండి. 1. ముందుగా నెయిల్స్ షేప్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి. 2. ఇప్పుడు అన్ని నెయిల్స్‌కి లేదా మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ అప్లై చేసుకుంటే మిగిలిన నెయిల్స్‌కి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. 3. ఇప్పుడు లైట్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని... ఇంతకు ముందు వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న మధ్య వేలుకి చిత్రంలో కనిపిస్తున్న విధంగా లవ్ సింబల్ వేసుకోవాలి. 4. తరువాత ఆ సింబల్ కింద భాగంలో చిత్రాన్ని అనుసరిస్తూ.. పెద్ద చుక్క దానికి ఇరు పక్కలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి. 5. ఇప్పుడు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. ఆ డిజైన్‌కి ఎడమ వైపు మరో సింబల్(సేమ్ సైజ్) చిత్రంలో కనిపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. 6. తరువాత అదే రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌తో ఆ సింబల్ కింది భాగంలో (చిత్రాన్ని గమనిస్తూ) ఎడమ వైపుకు పెద్ద చుక్క, కుడివైపుకు చిన్న చుక్క అప్లై చేసుకోవాలి. 7. ఇప్పుడు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని లవ్ బెలూన్స్ లాగా (చిత్రాన్ని ఫాలో అవుతూ) డిజైన్ చేసుకోవాలి. 8. ఇప్పుడు డిజైన్ మొత్తం ఆరిపోయిన తరువాత ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి.తరువాత మధ్యవేలును అనుసరిస్తూ... ఉంగరపు వేలుకి రెండు సింబల్స్ మధ్య కాస్త డిస్టెన్స్ ఉంచి సేమ్ డిజైన్ అప్లై చేసుకోవాలి. (ఒకవేళ మిగిలిన నెయిల్స్‌కి కూడా వైట్ కలర్‌నే అప్లై చేసుకుంటే మధ్య, ఉంగరపు వేళ్లకు ఎలా డిజైన్ చేసుకున్నామో అదే విధంగా వాటిని కూడా డిజైన్ చేసుకోవాలి.) -
కడుపులో మేకులు.. మెడలో బాణం
కోల్కటా : పశ్చిమ బెంగాల్ రెండు వేర్వేరు ఘటనల్లో బాధితులను వైద్యులు సురక్షితంగా రక్షించగలిగారు. ఆపరేషన్ చేసి ఓ వ్యక్తి కడుపు నుంచి 600కి పైగా మేకులు బయటకు తీయగా.. మరో ఘటనలో ప్రమాదవశాత్తూ బాణం మెడలోకి దూసుకుపోయిన ఓ బాలికను వైద్యులు రక్షించగలిగారు. కోల్‌కతాలోని ఉత్తర 24 పరగణా జిల్లాలో గోబర్దంగా ప్రాంతానికి చెందిన ఓ 48 ఏళ్ల స్క్రీజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు. మేకులు, మట్టి ఎక్కువగా తినేయటంతో కడుపు నొప్పి ఎక్కువైంది. దీంతో ఆస్పత్రిలో కలకత్తా మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 639 మేకులను బయటకు తీశారు. కడుపు దగ్గర చిన్న గాటుపెట్టి అయస్కాంతం సాయంతో వాటిని బయటకు తీయటం విశేషం. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్ బిశ్వాస్ వెల్లడించారు. బాలిక మెడలో బాణం... బిర్భమ్ జిల్లాలోని సాయ్(స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్లో ప్రమాదవశాత్తూ ఓ బాలిక మెడలో బాణం గుచ్చుకుంది. జువెల్ షేక్ అనే ఆర్చర్ సాధన చేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న మరో యువ ఆర్చర్ ఫజిల్లా ఖాటూన్(14) మెడలోకి బాణం దూసుకెళ్లింది. వెంటనే బాలికను బోల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బాణాన్ని విజయవంతంగా తొలగించారు. ఫజిల్లాకు ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు. బాలిక అతన్ని(జువెల్) గమనించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కోచ్ తెలిపారు. -
పిల్లలు గోళ్లు కొరుకుతూనే ఉన్నారా?
సెల్ఫ్ చెక్ పిల్లలకు నోట్లో వేలు వేసుకోవడం, గోళ్లు కొరకడం సులభంగా అలవాటవుతాయి. వాటిని మాన్పించడానికి తల్లి సహనాన్ని అరువు తెచ్చుకోవలసిందే. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? 1. గోళ్లు కొరకడం లేదా నోట్లో వేలు వేసుకోవడం అనేది పైకి కనిపించే లక్షణమేనని, ఇందుకు పిల్లలు మానసిక ఘర్షణకు లోనుకావడం కూడా కారణం కావచ్చని ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 2. స్కూలు, హోమ్‌వర్క్ లేదా ఇతర పిల్లలతో ఆడుకోవడంలో సరిగా కలవలేక పోవడం... ఇలా ఏ విషయంలో ఆందోళన పడుతున్నారో గమనించి దానిని పరిష్కరిస్తారు. ఎ. అవును బి. కాదు 3. గోళ్లు కొరకవద్దని, నోట్లో వేలు వేయకూడదని ఆంక్షలు పెడితే అలవాటు మానలేరని, పైగా మరింత మొండిగా పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 4. వేళ్ల మీద కొట్టడం వల్ల ఆ నిమిషంలో ఏడుస్తారు, ఆ బాధ నుంచి సాంత్వన పొందడానికి తిరిగి ఆ అలవాటునే ఆశ్రయిస్తారు. ఎ. అవును బి. కాదు 5. గోళ్లలో ఇన్ఫెక్షన్ చేరుతుందని, నోట్లో పెట్టుకున్నప్పుడు అది కడుపులోకి చేరితే అనారోగ్యమని జాగ్రత్త చెప్పాలి. ఎ. అవును బి. కాదు 6. నోట్లో వేలు వేసుకుంటే నీ చేతితో ఏదైనా పెడితే నీ ఫ్రెండ్స్ తినరు, అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఆలోచించమని చెప్తే ఈ అలవాటుని మానడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఏమీ తోచనప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. వాళ్లను ఆటలు లేదా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమయ్యేటట్లు చూస్తే తమకు తెలియకుండానే మానేస్తారు. ఎ. అవును బి. కాదు 8. ‘ఒక గంట సేపు గోళ్లు కొరకకుండా ఉండి ఆ తర్వాత మాత్రమే ఈ చాక్లెట్ తినాలి’ అని సరదాగా కండిషన్ పెడితే తమ మీద తాము కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లల పెంపకంలో వాళ్ల సైకాలజీని గమనించి జాగ్రత్తలు తీసుకోవడం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే పిల్లలు చేసే పనులకు దారి తీస్తున్న కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. -
గోరు... అనిపించకూడదు బోరు..!
నెయిల్ జిగేల్ గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్ ఆయిల్లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి. మ్యానిక్యూర్ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్ గోటి క్యూటికిల్ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు. వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్ పాలిష్ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్ పెయింట్ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం. మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్ జెల్లీ పూసి, పాలిష్ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్ చేయాలి. గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. గోరు ఆరోగ్యం కోసం బ్రాకోలీ, చేపలు, ఉల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ఆకుపచ్చని కూరలు తీసుకుంటూ ఉంటే గోరు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
సిలికాన్ సిటీలో టైర్ పంక్చర్ మాఫియా
బెంగళూరు : సిలికాన్ సిటీలో పంక్చర్ మాఫియా హడలలెత్తిస్తోంది. రోడ్లుపై తమ వాహనాల్లో ఒకటి, రెండు కిలోమీటర్లు వెళ్లగానే వాహనాలు పంక్చర్ అవుతున్నాయి. ఇక చేసేది లేక రోడ్డుపై అటు, ఇటు చూడగానే కూతవేటు దూరంలో మనకు పంక్చర్ దుకాణం కనబడుతుంది. ఈ సమస్య బెంగళూరులో కేవలం ఒకరిద్దరికి ఎదురయ్యే సమస్య కాదు ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు వేలమంది అనుభవిస్తున్నారు. బీబీఎంపీ రోడ్లు అధ్వానకరంగా మారడంతోనే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని భావిస్తే అది మీతప్పే అవుతుంది. మీ వాహనం, బైక్ పదే, పదే టైర్ పంక్చర్ అవుతుండటం మీకు దగ్గరలోనే పంక్చర్ దుకాణం ఉండటం కాకతాళీయం కాదు. దీని వెనుక నగరంలో పంక్చర్ మాఫియా హస్తం ఉండటం నిజం. ఇది ఏంటి పంక్చర్ మాఫియా అంటే పంక్చర్ షాప్ ఉన్న ప్రదేశాల్లోని రోడ్లు, సర్కిల్స్ వద్ద ఇనుక కమ్మీ మేకులు వేసి వాహనాలను పంక్చర్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు తమ షాపుల వద్దకు విచ్చేయడం అంతేగాక ఒక పంక్చర్‌కు కనీసం రూ.80 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ మూడునాలుగు పంక్చర్లు అయితే మాత్రం కనీసం రూ.250, 300 ముట్టజెప్పాలి. ఇలా చేస్తూ ప్రతినిత్యం వాహనాలకు పంక్చర్ చేసి చేతుల నిండా డబ్బు సంపాదించడమే పంక్చర్ మాఫియా ద్యేయం. ఎలా వెలుగులోకి వచ్చింది... బనశంకరి నివాసి బెనడిక్ట్ జిబాకుమార్ ప్రతినిత్యం తన సైకిల్‌పై 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డులో కార్యాలయానికి వెళతారు. పదే, పదే సైకిల్ పంక్చర్ కావడం ఇతడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏంటిది నిత్యం సైకిల్ పంక్చర్ అవుతుందని సైకిల్ ను పంక్చర్ దుకాణం వద్దకు వెళ్తే అక్కడ వెలుగుచూసింది పంక్చర్ మాఫియా. పంక్చర్ అయిన స్థలంలో గాలించగా అక్కడ 15కు పైగా ఇనుక మేకులు కనబడ్డాయి. దీని ఆధారంగా పంక్చర్ మాఫియా కనిపెట్టాలని బెనడిక్ట్ జిబాకుమార్ నిర్ణయించుకున్నాడు. హెచ్ఎస్ఆర్.లేఔట్–బీడీఏ బ్రిడ్జ్ సమీపంలో ప్రతినిత్యం అక్కడ గాలించగా 15–20 మేకులు లభించాయి. మేకులు దొరికిన ప్రాంతంలో ఉన్న పంక్చర్షాప్ నిత్యం బిజీగా ఉండటం, రోడ్డులో లభించిన మేకులను షాప్ వద్ద ఉన్న వాటిని గమనించగా దీనికి పంక్చర్షాప్ కారణమని తెలిసింది. ఎలాగైనా చేసి పంక్చర్మాఫియా అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్న బెనడిక్ట్ గత 2015 నుంచి ఫేస్బుక్లో మైరోడ్, మై రెస్పాన్సిబిలిటీ అనే పేజీ తెరిచారు. అందులో ప్రతినిత్యం ఇతను సేకరించిన ఇనుక మేకులను నమోదు చేశారు. ఇంతవరకు ఇతను సేకరించిన ఇనుక మేకులు మొత్తం 70 కిలోలు. బెనడిక్ట్ తమ నివాసాన్ని తమిళనాడులో పెట్టారు. కాని పంక్చర్మాఫియా మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది. ట్రాఫిక్పోలీసులు మేల్కొని కొన్ని ప్రదేశాల్లో పంక్చర్ మాఫియాకు అడ్డుకట్టవేసి వారిని అరెస్ట్ చేసి చర్యలు చేపట్టింది. -
ఐదేళ్ల బాలికతో హత్య మిస్టరీ వీడింది!
బెంగళూరు: బెంగళూరులోని మిల్క్ మెన్ స్ట్రీట్‌లో ఇటీవల 29 ఏళ్ల సుప్రీత తన ఇంట్లో హత్యకు గురైంది. ఆమె భర్త రవిరాజ్ శెట్టీనే ఆ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే రవిరాజ్ మాత్రం పొంతనలేని సమాధానాలతో పోలీసుల విచారణను తప్పుదోవపట్టించాడు. తన భార్య మానసికవ్యాధితో బాధపడుతోందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విచారణలో రవిరాజ్ చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోలేనని.. తన ఐదేళ్ల కూతురు రీతూ నిద్రిస్తుందని పోలీసులకు చెప్పాడు. దీంతో రీతూ సహాయంతో పోలీసులు కేసును చేదించారు. హత్య అనంతరం తాతయ్య ఇంట్లో ఉంటున్న రీతూను విచారించడానికి మఫ్టీలో వెళ్లిన మహిళా పోలీసు అధికారి.. చాక్లెట్లు, బొమ్మలతో ముందుగా బాలికను మచ్చిక చేసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అమ్మ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని రీతూ చెప్పడం విశేషం. అమ్మ అసలు ఎలా గాయపడింది అని ప్రశ్నించగా.. 'నాన్న ఆ రోజు అమ్మను భుజాలపై కిచెన్‌లోకి తీసుకెళ్లాడు. తరువాత రక్తం మరకలతో బయటకు వచ్చాడు. అమ్మ కిచెన్‌లో కింద పడింది అని నాన్న చెప్పాడు' అని బాలిక జరిగింది జరిగినట్లుగా చెప్పింది. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు బాలిక తండ్రి రవిరాజ్‌కు చూపించారు. ఇక చేసేదిలేక రవిరాజ్ హత్యానేరం అంగీకరించాడని ఉల్సూర్ పోలీసులు వెల్లడించారు. -
నవ్వులు రువ్వే పువ్వులు
నెయిల్ ఆర్ట్ గోళ్లు నవ్వడం ఎప్పుడైనా చూశారా! మునివేళ్లలో నవ్వులు ఎప్పుడైనా వీక్షించారా! గులాబీ, బంతి, చామంతి, గోరింట అందాలతో మురిసిపోతూ నవ్వే గోళ్లు మీవి కావాలని ఉందా! అయితే చాలా సింపుల్‌గా ఆ నవ్వులను మీ గోళ్లకు అతికించవచ్చు. పువ్వుల కాంతులను వెదజల్లవచ్చు. మార్బుల్ ఆర్ట్ ద్వారా మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు. ముందుగా గోళ్లకు బేస్ కోట్ వేసుకోవాలి. దీని వల్ల డిజైన్ బ్రైట్‌గా కనిపించడమే కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ తర్వాత తెలుపు రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆరనివ్వాలి. గోరును మాత్రమే వదిలేసి చుట్టూతా (వేలికి) పెట్రోలియమ్ జెల్లీ రాయాలి. చుట్టూ గ్లూ ఉండే టేప్ అతికించాలి. 1. చిన్న గాజు గిన్నెలో ముప్పావు వంతు నీళ్లు పోయాలి. నచ్చిన నెయిల్ పాలిష్‌ను ఎంచుకోవాలి. (ఇక్కడ గులాబీ రంగు నెయిల్‌పాలిష్‌ను ఎంచుకున్నాం) ఒక చుక్క నెయిల్‌పాలిష్‌ను నీళ్ల మధ్యలో వేయాలి. 2. నెయిల్ పాలిష్ చుక్క నీటి పై భాగంలో స్ప్రెడ్ అవగానే తెలుపు రంగు నెయిల్ పాలిష్ డ్రాప్ వేయాలి. ఇలా ఒకసారి గులాబీ రంగు, మరోసారి తెలుపు రంగు నెయిల్‌పాలిష్ డ్రాప్స్ నాలుగైదు సార్లు వేయాలి. 3. టూత్ పిక్ తీసుకొని మధ్యలో పువ్వు వచ్చేలా నెయిల్‌పాలిష్‌ను కదపాలి. 4. టేప్ వేసిన వేలి గోరు మునిగేలా డిజైన్ చేసిన నెయిల్‌పాలిష్‌లో నెమ్మదిగా ముంచి, తీయాలి. 5. నెయిల్ పాలిష్ ఆరాక టేప్ తీసేయాలి. 6. పువ్వుల రేకలతో అందమైన డిజైన్ గోళ్ల మీద సాక్షాత్కరిస్తుంది. దీని మీద మళ్లీ ట్రాన్స్పరెంట్గా కనిపించే బేస్‌కోట్ వేయాలి. ఇలా చూడముచ్చటైన డిజైన్లు మీ గోళ్ల మీద అందంగా కనువిందు చేయవచ్చు.