Nandamuri Taraka Rama Rao
-
టెన్నీస్ ఆడి పాతాళభైరవి సినిమాకు సెలక్టైన ఎన్టీఆర్..!
పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. (చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. - అలిపిరి సురేష్ -
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)
-
అది నా అదృష్టం – వైవీఎస్ చౌదరి
‘‘నా కెరీర్లో ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేశాను. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశాను. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు దివంగత జానకి రామ్(ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాని ప్రకటించారు వైవీఎస్ చౌదరి. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ–‘‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ మూవీతో దర్శకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి రుణపడి ఉంటాను. తొలి సినిమాకే నాగేశ్వరరావుగారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాజాగా నా కొత్త సినిమాకి హీరోగా ఎవర్ని తీసుకోవాలి? అనుకుంటున్న సమయంలో తమ్ముల ప్రసన్న కుమార్‌గారు తారక రామారావుని చూపించారు. తనని చూడగానే జానకి రామ్ కలని నెరవేర్చుతాడనిపించింది. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు. ‘‘మా స్నేహితులు, సన్నిహితుల అండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి. -
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
Jr NTR Unseen Photos: ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేకమైన ఫోటోలు
-
చేతకాని చిన్నమ్మ.. దద్దమ్మ టీడీపీ
నటనతోనే కాదు.. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తికి భారతరత్న అనే దేశ అత్యున్నత గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. కేంద్రం గుర్తించడం లేదా? లేకుంటే కావాలనే ఎవరైనా అడ్డుకుంటున్నారా?.. ఈ విషయంలో నారా-నందమూరి కుటుంబాలపై ఆయన అభిమానుల కోపం సరైందేనా?.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొత్తదేం కాదు కదా. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ పెట్టలేదు. ఇటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ను సీరియస్‌గా పరిశీలించలేదు. కాబట్టి దీనిపైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ.. ►నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతోత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ ఎన్టీఆర్‌పై ప్రేమను ఒలకబోస్తూ.. భారతరత్న డిమాండ్‌తో రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్ వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అక్కడా నారావారి రాజకీయాన్ని తెలుగు ప్రజలు చూసిందే. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్ కావడంతో ఎన్టీఆర్ భారతరత్నకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావించారు. కట్ చేస్తే.. ►కేంద్రం తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్‌తో ఠాకూర్‌కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్‌కు బీజేపీకి కటీఫ్ అయ్యి చాలా కాలమే అవుతోంది. రాజకీయంగానూ నిత్యం ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. అలాంటిది ఠాకూర్‌కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవ్ ఇటీవలికాలంలో జాతీయ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి వాళ్లు పెద్దగా తెలియకపోయినా.. వాళ్లు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక జరిగినట్లు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలురకే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయని..అందులోనూ కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు.. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఒకవేళ ఇప్పుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అది బీజేపీకే మైలేజ్ ఇచ్చే అంశం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గానికి బీజేపీ దగ్గరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాక.. చంద్రబాబు చేయలేని పని తాము చేశామని చెప్పుకోవచ్చు. అప్పుడు టీడీపీని ఇరుకున పెట్టొచ్చు. ఎన్నికల వేళ ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మంచి అవకాశమే కదా. చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? ఎన్టీఆర్ తనయ.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి. సుష్మాస్వరాజ్ తర్వాత చిన్నమ్మగా ఆమెకంటూ ఓ ట్యాగ్ లైన్ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ హయాంలో.. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన రాజకీయాలు అర్థవంతంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలను తల్చుకుంటే జాలేస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు అవుతోంది. బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ 9 ఏళ్లు, పోనీ చీఫ్‌గా 6 నెలల కాలంలో ఆమె బీజేపీకి విజ్ఞప్తులు చేసినా.. ఆఖరికి ఒత్తిడి చేసినా తన తండ్రికి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించేదేమో. కానీ, ఆమె ఆ విషయంపై మాత్రం ఎందుకనో శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. మొక్కుబడి ప్రకటనలకు తప్ప.. ఏనాడూ ఆమె మనసు పెట్టింది లేదనేది స్పష్టం అవుతోంది. ఆమె చేతకానితనం వెనుక మరిది చంద్రబాబు హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ దద్దమ్మ.. ఇది తెలిసిందే! ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. ఇక.. గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఇప్పిస్తే.. తెలుగుదేశం పార్టీ తన సొంతంది కాదనేది .. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు రాజకీయం దేశానికి తెలిసిపోతుందన్న భయం ఆయనలో ఉండొచ్చు. అందుకే నందమూరి కుటుంబాన్ని కూడా మొదటి నుంచి తన గుప్పిట ఉంచుకుని అణగదొక్కుతూ వస్తున్నాడు. ఏదైతేనేం.. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది తేటతెల్లం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నారా-నందమూరి కుటుంబాలపై ఎన్టీఆర్ అభిమానుల కోపం సరైంది కాదంటారా? ‘‘ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. బీజెపీకి చెబుతున్నా.. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోంది. పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోండి.. ’’ దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమ సమయంలో ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు.. ::లోకీ, సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
ఆ ఇద్దరూ నాకు దైవసమానులు: చిరంజీవి
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నాకు దైవసమానులు, వారితో కలిసి పని చేయడం అదృష్టం అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విశాపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి, సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేష సాయి, వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నో మంచి సలహాలిచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, అందరినీ ఆకట్టుకునే తత్వం తనదని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీపరిశ్రమకు రెండు కళ్లువంటి వారని వీరిద్దరూ తనకు జీవితంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ.. 'యండమూరి వీరేంద్రనాథ్ నవలల వల్ల యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ సాహిత్య సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడం సంతోషం. సాహిత్య కారులతో పులకించిన నేల ఉత్తరాంధ్ర.. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, ఏఎన్నార్' అని చెప్పుకొచ్చారు. నిజమైన వారసుడు చిరంజీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 'లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు నిజమైన వారసుడు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో పేరు ప్రఖ్యతలు తెచ్చారు. చిరంజీవి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు' అని వ్యాఖ్యానించారు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
ఆనాడు సీఐడీ ఆఫీసర్‌గా NTR.. చంద్రబాబును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
'నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు..' ఇది సినిమా పాటే అయినా ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అన్నట్లు దొంగపనులు, పాపాలు చేసిన చంద్రబాబు ఆ పాపాలకు మూల్యం చెల్లించుకోకా తప్పదు. దొరికినకాడికి దోచుకున్న బాబు ఇటీవలే కటకటాలపాలైన సంగతి తెలిసిందే! నేడు(సెప్టెంబర్ 23న) ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. అన్యాయాన్ని చీల్చి చెండాడే ఆఫీసర్‌గా ఎన్టీఆర్ సరిగ్గా 58 ఏళ్ల కిందట ఇదే రోజు C.I.D. సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు? ఎన్టీ రామారావు. తాపి చాణక్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీఐడీ ఆఫీసర్ రవి పాత్ర పోషించారు. తండ్రి చలపతిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం హీరోదైతే, దురలవాట్లు, అక్రమాలతో అడ్డదారిలో డబ్బు సంపాదించి జల్సా చేసే తత్వం ఆయన తండ్రిది. C.I.D కథ ఇదీ.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు చలపతి. తాను చనిపోయినట్లు నమ్మించి తర్వాత బాబా అవతారమెత్తి మరెన్నో తప్పులు చేస్తాడు. మరోవైపు అతడి కొడుకు రవి పెద్ద చదువులు చదివి సీఐడీ ఆఫీసర్‌గా మారతాడు. బ్యాంకుకు కన్నం వేసిన బాబా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతాడు. చట్టం కళ్లు తప్పి ఎవరూ తప్పించుకోలేరన్నట్లు చివరకు కొడుకు చేతిలోనే అరెస్ట్ అవుతాడు చలపతి. ఇదీ సీఐడీ సినిమా కథ! అప్పుడు సీఐడీ రిలీజ్.. ఇప్పుడు సీఐడీ విచారణలో బాబు వెనక్కు తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని తప్పులు చేసిన చంద్రబాబు సైతం చివరకు అరెస్ట్ అవక తప్పలేదు. నేడు, రేపు సీఐడీ బృందం చంద్రబాబును విచారించనుంది. ఎన్టీఆర్ సీఐడీ సినిమా రిలీజైన రోజే చంద్రబాబు సైతం సీఐడీ విచారణకు హాజరవడం యాధృచ్చికమే అయినా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..? -
షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట
కామెడీ, విలనిజం.. వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన ఆయన నటప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలకొద్దీ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 'ఒకసారి ఏమైందంటే సెట్‌కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదన్నారు. ఎమ్మెస్ నారాయణ.. ఏంటి అన్నాయ్, ఇంకా చాలా టైముందిగా అని బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కు రమ్మని కబురొచ్చింది. సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి? పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు. ఇకపోతే మండలాధీశుడులో ఎన్టీఆర్ పాత్ర ఆఫర్ చేశారు. అప్పటికే ఈ రోల్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణగారు చేయమని ప్రోత్సాహించారు. నాకేమో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉందాం, లేదంటే ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నా. మండలాధీశుడు మంచి విజయం సాధించింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓసారి నా కూతుర్ని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ, కొట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు. చదవండి: సుమతో విబేధాలు? రాజీవ్ కనకాల ఏమన్నాడంటే? సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ -
ఆ ఘనత ఎన్టీఆర్కే చెల్లింది: రాజేంద్ర ప్రసాద్
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు సొంతమని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని... "కలయిక ఫౌండేషన్" అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రథములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి - విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిధులుగా పాల్గొని... "కలయిక ఫౌండేషన్" అధినేత చేరాల నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా చేరాల నారాయణ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి: రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్ -
NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ
సాక్షి, విజయవాడ: నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదన్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆదివారంనాడు విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆర్జీవీ మాట్లాడుతూ.. 'మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి(చంద్రబాబు) ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేశారు. అయినా సరే చాలామంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటున్నారు.. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే! నందమూరి తారకరామారావుగారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్‌కు నేను థ్యాంక్స్ చెప్తున్నా' అన్నాడు రామ్‌గోపాల్ వర్మ. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు 3 సార్లు గుండెపోటు అప్పుడు వరకట్నం కేసు పెట్టి, ఇప్పుడేమో మాజీ భర్తతో చెట్టాపట్టాల్ -
తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
హీరోలు పాత్రల్లో నటిస్తారు. కానీ కొందరు నటిస్తే ఆ పాత్రలే పరిపూర్ణమవుతాయి. ఆయా పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాంటి దిగ్గజ దివంగత నటుడే నందమూరి తారక రామారావు. 'మన దేశం'తో మొదలైన ఆయన ప్రయాణం 'మేజర్ చంద్రకాంత్' వరకు సాగింది. ఈ ప్రయాణంలో దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. నేడు(మే 28) ఆయన శతజయంతి . ఈ సందర్భంగా తాతను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ చివర్లో తన సంతకాన్ని జత చేశాడు. మా గుండెలను మరొక్కసారి తాకిపోండి తాతా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని తన ట్వీట్లో యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx — Jr NTR (@tarak9999) May 28, 2023 చదవండి: ఆరు పడవల ప్రయాణం.. దటీజ్ ఎన్టీఆర్ -
NTR Birth Anniversary: దటీజ్ ఎన్టీఆర్.. రెండుసార్లు ఫ్రాక్చర్ అయినా..
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు.... ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్.టి.ఆర్). ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా... పౌరాణికం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా. మేకప్ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్ఆర్. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్ ఈజ్ ఎన్టీఆర్’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్’ (1958) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. జానపదం ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్ పోరాడే యాక్షన్ సీన్ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్ సీన్ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్. కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి. సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. సాంఘికం హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’. ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’, కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు. అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్ చౌదరి, ‘మేజర్ చంద్రకాంత్’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మకం ‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు. అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డీ గ్లామరస్ రోల్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ అభినయిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు. చారిత్రకం ‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్. ఒక యాక్షన్ హీరో అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్ చేశారు. రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్ సలీం అనార్కలి’లో అక్బర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్ అశోక్’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. -
టిఫిన్‌లో చికెన్.. ఎన్టీఆర్ నాకు ఆప్యాయంగా వడ్డించారు: రామ్‌చరణ్
నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకు దిక్సూచి. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన వారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయిలన్నింటినీ మించిన పెద్ద పేరు, పెద్ద వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు వేసిన దారుల్లో నడుస్తూ వారిని గుర్తు చేసుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా సెట్లో నాతో సహా ప్రతి ఆర్టిస్ట్ ఎన్టీఆర్ పేరును గుర్తు తెచ్చుకోకుండా ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీరామారావు. అలాంటి వ్యక్తి పని చేసిన చిత్రపరిశ్రమలో మనందరం పని చేస్తున్నామంటే అంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. నేను ఎన్టీఆర్‌ను ఒకే ఒకసారి మాత్రమే కలిశాను. నేను, పురందేశ్వరిగారి అబ్బాయి రితేష్ కలిసి స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. పొద్దున్నే ఐదున్నర, ఆరు గంటలకంతా క్లాసులు అయిపోయేవి. ఓ రోజు మా తాతయ్య గారి ఇంటికి వెళదామా? అని రితేష్ అన్నాడు. అప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అక్కడకు వెళ్లగలమా? లేదా? అని చెప్పే అవగాహన నాకు లేదు. నేను సరేనని చెప్పాను. ఇద్దరం స్కేటింగ్ చేసుకుంటూ పురందేశ్వరి ఇంటి నుంచి రామారావు గారి ఇంటికి వెళ్లాం. అప్పుడు ఉదయం ఆరున్నర గంటలు అవుతుంది. ఎన్టీఆర్‌గారిని కలిసి వెళ్లిపోదామనుకున్నా. అయితే ఆయన అప్పటికే నిద్రలేచి రెడీ అయిపోయి టిఫిన్‌కి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే ఆ వయసులోనూ ఉదయాన్నే చికెన్ తింటున్నారు. నేను వెళ్లగానే నన్ను కూడా కూర్చోపెట్టి నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి టిఫిన్ తిన్న క్షణాలను జీవితాంతం నేను మర్చిపోలేను. తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఆయన పేరు బతికే ఉంటుంది. జై ఎన్టీఆర్’ అంటూ స్పీచ్ ముగించాడు చెర్రీ. చదవండి: వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా రూ.2000 నోట్ల కట్టలు -
నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. బ్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను కళ్యాణ్‌రామ్ రిలీజ్ చేశాడు. బ్రీత్: అంతిమ పోరాటం అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్లో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. బసవతారకం క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Here's a glimpse from the Launch of #BreatheFirstLookLaunch by @NANDAMURIKALYAN ❤️🔥#BREATHE 🎬🌟ing #NandamuriChaitanyaKrishna Directed by @VKrishnaakellaMore Updates Loading Soon 💥 #NandamuriJayaKrishna @BTRcreations pic.twitter.com/WWo2BGktRg— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 Here's the First Look & Title of @BTRCreations Prod No.1 💥Presenting You all #NandamuriChaitanyaKrishna in a Breathtaking Avatar from #BREATHE ❤️🔥A film by @VKrishnaakella#BreatheFirstLook Launched by @NANDAMURIKALYAN 😍More Details Soon! pic.twitter.com/Yy9cUyOGRd— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 -
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం..
అలనాటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన హీరోయిన్ జమున ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్గా రాణించిన ఆమె ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. నందమూరి తారకరామారావుతో మిస్సమ్మ, భూకైలాస్, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది. చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున కన్నుమూత -
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్. మెంటల్ హ్యాష్‌ట్యాగ్ ‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్ మామయ్య’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘ఈ మెంటల్‌కి సర్టిఫికెట్ రెన్యూవల్ చేయలేదా?.. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. Ma mental balakrishna ni kutha pagal degai la Unaru 🤣 Andhukai mata matladai mundhu alochinchi matladali... Adhi yavar ina sare.... #MentalBalaKrishna pic.twitter.com/rvD6oVOlEV — AK Badri (@AKBadri6848) January 25, 2023 సినిమాల్లో డైలాగ్స్ ఏముంది బొచ్చడు చెప్పుకోవచ్చు కానీ బైట అలా ఉండదు #VeeraSimhaReddy#MentalBalaKrishna pic.twitter.com/sf31KY3Y2e — Mahesh (@Norito_DON) January 23, 2023 చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్ చేశారు. ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు. ‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్‌కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం. మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్‌కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. పవన్ స్పందించాలి ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సెకండ్ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు పవన్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
టికెట్ ధరలు అలా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది: బాలకృష్ణ
సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే చిత్రపరిశ్రమకు మంచిదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో కాచిగూడలో తారకరామ థియేటర్‌ను ఆయన పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నందమూరి తారక రామారావుపై అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను పునరుద్ధరించారు. ఇవాళ 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను బాలకృష్ణతో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ' మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు. తారకరామ థియేటర్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ప్రారంభించడం జరిగింది. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైన విషయం. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది.' అని అన్నారు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'మహనీయుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ థియేటర్ ఉంది. బాలకృష్ణ థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ అద్భుతంగా నిర్మించాం. 600 సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్గానే పెట్టాం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్‌లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
కృష్ణ సినిమాల్లోకి రావడానికి ఆ హీరోనే కారణం!
మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా రాణించారాయన. గతంలో ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమని మాట్లాడారో ఓసారి చూద్దాం.. 'పౌరాణికం, జానపదం, సాంఘికం, హారర్, విప్లవం.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశాను. అందుకు సంతృప్తిగా ఉంది. అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి సినిమాల్లో పోషించిన పాత్రలు నాకెంతో ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తి. నిజానికి నేను నందమూరి తారకరామారావు అభిమానిని. కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. అయితే నాగేశ్వరరావును మాత్రం నాలుగుసార్లు చూశాను. అప్పుడు సినిమా ఆర్టిస్టులకున్న క్రేజ్ చూసి నేనూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నా! అలా మొదటిసారి తేనె మనసులు చిత్రంలో నటించా. ఏడు సంవత్సరాలలోనే వంద సినిమాలు చేశాను' అని చెప్పుకొచ్చారు కృష్ణ. చదవండి: కృష్ణ చివరి చిత్రం ఏంటో తెలుసా? ఆయన లేరన్న వార్త విని గుండె పగలింది: రామ్‌చరణ్ -
ఆ మర్డర్ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: అధికార దాహంతో చంద్రబాబునాయుడు ఎల్లోమీడియాలో తనపై పిచ్చి కూతలు రాయిస్తున్నారంటూ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి స్వార్థం కోసం ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసన్నారు. ఏరోజూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించాక టీడీపీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోని లక్ష్మీ పార్వతి ప్రదర్శించారు. 'చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా?. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్ నాతో చాలాసార్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్‌కు ద్రోహం చేయబోనని చంద్రబాబు నాకు ప్రమాణం చేశారు. పాముకు పాలుపోస్తున్నావని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు రోజుకో అబద్ధం మాట్లాడతాడు. ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలి. ఇప్పటికైనా పశ్చాత్తాప పడరా?. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈటీవీని లాంచ్ చేశారు. రామోజీ పిచ్చి రాతలపై అప్పట్లోనే ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్‌పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్లు వేశారు. ఎల్లోమీడియా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచింది. తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళన సృష్టించారు. అప్పటి స్పీకర్ యనమల వెన్నుపోటులో భాగమయ్యాడు. వైశ్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా?. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్ర చేశారు. ఎన్టీఆర్ ప్రధాని అవుతారన్న భయంతోనే కుట్ర చేశారు. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులు గురించి అందరికీ తెలియాలి. అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా చంద్రబాబూ?. ఎన్టీఆర్ పేరు తీసేయాలని రాధాకృష్ణ, నువ్వు మాట్లాడుకోలేదా?. ఎన్టీఆర్‌ది హత్యా? కాదా?. ఆ హత్య వెనుక నువ్వు, రామోజీ లేరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. -
ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు
ఎన్టీఆర్.. గత మూడు రోజులుగా చంద్రబాబు, ఇప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు వల్లిస్తున్న పేరు. అర్జంట్‌గా ఎన్టీఆర్ పేరును తలకెక్కించుకున్న వీరు.. గతంలో ఎన్టీఆర్‌కు ఏం చేశారో తెలియాలంటే కచ్చితంగా వెనక్కి తిరిగి చూడాల్సిందే. ఎన్టీఆర్, చంద్రబాబు.. మామ అల్లుళ్ల సంబంధం. తన కుమార్తెను చంద్రబాబుకు కానుకగా ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేస్తే.. చంద్రబాబు తన మామకు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే బాబుని ఎన్టీఆర్ దశమ గ్రహంగానూ, ఔరంగజేబుగానూ పోల్చారు. అనుక్షణం చంద్రబాబు అండ్ కో పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ కన్నుమూశారన్నది ఎవరైనా చరిత్ర తెలిసిన వారు చెప్పే విషయం. ఇంత చేసిన తర్వాత కూడా అదే ఎన్టీఆర్‌ను తమ సొంత ప్రాపర్టీగా ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. దశమ గ్రహమై ఎన్టీఆర్‌కు విద్రోహం తలపెట్టిన చంద్రబాబు.. ఆయనపై చెప్పులు వేయించి తమాషా చూశారు. పార్టీని చెరబట్టి సైకిల్ గుర్తును సొంతం చేసుకున్నారు. అనుక్షణం మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి చంద్రబాబు నాయుడు అండ్ కోనే కారణమయ్యారన్న విమర్శలున్నాయి. తెలుగు సినీ రంగానికి మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగారు నందమూరి తారకరామారావు. అభిమాన ధనుడిగా పేరు గడించిన ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజకీయాల్లోకి వచ్చారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ కూడా తనదైన శైలితో వెలిగారు ఎన్టీఆర్. ప్రపంచమంతా గౌరవించే ఎన్టీయార్ తన జీవిత చరమాంకంలో చిత్రంగా తన సొంత మనుషులు అనుకున్న వాళ్ల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొందారు. కంట తడి పెట్టుకున్నారు. గుండెలనిండా మనస్తాపంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఆ క్షోభలోనే అంతిమ శ్వాస విడిచి ఈ లోకానికి గుడ్ బై చెప్పారు. చదవండి: (అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో..) ఎన్టీఆర్‌ను అవమానించింది ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కాదు. తాను పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి తాను ఇచ్చిన పదవులు అనుభవించి రాజకీయంగా బలిసిన వాళ్లే ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. ఈ మొత్తం విద్రోహానికి అల్లుడు చంద్రబాబు నాయుడే సారధ్యం వహించారు. 1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ట్రాప్‌లో పడేసి తన వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుండి తప్పించారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడి మాయలో పడ్డారని భావించిన ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు. ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానంతో కృంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. ఈ విద్రోహంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబు వెన్నంటే ఉండడం అతి పెద్ద విషాదం. తన ఆత్మబంధువులు అనుకున్నవారు.. తాను రాజకీయ భిక్ష పెట్టిన వారు కూడా తనకు ద్రోహం తలపెట్టడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ బాధలో ఉండగానే ఆయన బ్యాంకు ఖాతాను చంద్రబాబు నాయుడు ఫ్రీజ్ చేయించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ గుర్తు సైకిల్‌ను తన సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కుర్చీని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఎన్టీఆర్‌ను అవమానించారు. టీడీఎల్పీ నాయకుడినైన తనను బీఏసీ సమావేశాలకు పిలవలేదని ఎన్టీఆర్ మొర పెట్టుకుంటే టిడిపి సభ్యులు ఆహా ఓహో అంటూ వెటకారాలాడి వెక్కిరించి ఎన్టీఆర్‌ను బాధపెట్టారు. ఆయన కంటతడి పెట్టుకుంటే తమాషా చూశారు. అసెంబ్లీలో తన వాదన వినిపించాలని ప్రయత్నిస్తే ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకు జరిగిన అన్యాయానికి గుండెలు పగిలేలా కుమిలిపోయిన ఎన్టీఆర్ న్యాయం కోసం ఎదురు చూస్తోన్న వేళ చంద్రబాబు నాయుడు మరో క్షుద్ర క్రీడకు తెరతీశారు. తన వెన్నుపోటుకు అండగా నిలిచిన ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించేలా కార్టూన్లు వేయించి పైశాచిక ఆనందం పొందారు. పార్టీలో దుష్టశక్తులు ఉన్నాయని ఎన్టీఆర్ అంటే ఆ దుష్టశక్తులు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతులే అన్నట్లు ఓ కార్టూనే వేయించారు. ఆయన బట్టలు ఊడదీసినట్లు మరో కార్టూన్ వేయించారు. ఇలా కాకులు పొడిచినట్లు ఎన్టీఆర్‌ను అవమానాలపై అవమానాలు చేస్తూ హింస పెట్టారు. పదవి కోసం తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఔరంగ జేబుతో పోల్చారు ఎన్టీఆర్. జామాతా దశమగ్రహం పేరిట ఓ క్యాసెట్ రిలీజ్ చేశారు. అందులో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎన్టీఆర్. ఈ వరుస అవమానాలతో ఎన్టీఆర్ మానసికంగా చితికి పోయారు. అంతులేని బాధను అన్నగారి గుండె తట్టుకోలేకపోయింది. ఆ క్షోభలోనే ఎన్టీఆర్ కన్నుమూశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసే చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తి వేశారు. రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీకి గుడ్ బై చెప్పారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరుపుకుంటూ పోయారు. నిజానికి వెన్నుపోటుకు చాలా ముందుగానే స్కెచ్ గీసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రిని కాలేనని తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌నే ఆ కుర్చీలోంచి గెంటేయాలని వ్యూహరచన చేశారు. దానికి ఈనాడు అధినేత రామోజీ మద్దతు ఉందని అంటారు. తన రాజకీయ వారసుడిగా తన పెద్ద కొడుకు హరికృష్ణను తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ అనుకునేవారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన క్షణం నుంచి ఎన్టీఆర్ చైతన్య రథానికి సారధిగా హరికృష్ణే వ్యవహరించారు. హరికృష్ణను తెలివిగా తప్పించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఎన్టీఆర్ ఫోటో లేకుండా జాగ్రత్తలు పడ్డారు ఎన్టీఆర్. అయితే అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే మాత్రం అదే ఎన్టీఆర్ బొమ్మలు అవసరం అయ్యేవి. ఏడాదికోసారి జయంతి, వర్ధంతి వచ్చినపుడు మాత్రమే చంద్రబాబు నాయుడు అండ్ కో ఎన్టీఆర్ విగ్రహాలకు ఓ దండ వేసి దండం పెట్టి ఊరుకుంటున్నారు. ఎన్టీఆర్‌నే కాదు ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ వారికీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవులు ఇవ్వకపోవడం ద్వారా ఎన్టీఆర్‌పై తనకున్న ద్వేషాన్ని బాహాటంగానే చాటుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఎన్టీఆర్తోనే ఉండిపోయారు. వారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అందులో కొందరు తిరిగి టిడిపిలో చేరారు. పార్టీ ఆవిర్బావం నుంచి ఉన్న ఆ నాయకులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారు. తనకంటే సీనియర్లు అయిన ఎన్టీఆర్ వర్గీయులైన దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి నేతలకు తన ప్రభుత్వంలో ఎన్నడూ మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆలోచనలకు ఆశయాలకు తిలోదకాలిచ్చారు చంద్రబాబు. ఇలా ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెడుతూ మోసపూరిత కుట్రలతో మనస్తాపానికి గురి చేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఇపుడు ఎన్టీఆర్ మా వాడే అంటూ నాటకాలాడే ప్రయత్నం చేస్తోంటే జనం ఫక్కున నవ్వుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను ఇప్పటికీ ద్వేషిస్తూనే వస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకం పేరును మార్చేస్తానని ఆంధ్రజ్యోతి ఎండీతో చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు బహిర్గతం కావడంతో అన్నగారి అభిమానులే కాదు తెలుగు ప్రజలంతా బాబు అండ్ ఎల్లోమీడియాలపై ఖాండ్రించి ఉమ్మేసినంత పని చేశారు. జీవించి ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ను క్షోభపెడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా ఆయన్ను వదిలిపెట్టకుండా అవమానిస్తున్నారని పాతతరం టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు విషయంలోనూ ఇదే తీరు. తాను తీసుకురాకపోవడం ఒక ఎత్తయితే అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్రం అంతా సిద్దం చేస్తూ ఉండగా చివరి నిమిషంలో ఆ అవార్డు ఎన్టీఆర్‌కు రాకుండా ఆగిపోయింది. అది ఎవరి కుట్ర వల్ల జరిగిందా అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఎన్టీఆర్‌కు ఇవ్వద్దని వాజ్ పేయ్పై ఒత్తిడి తెచ్చారని తేలింది. -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.