narayankhed
-
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ అగ్నిప్రమాదం
-
YSR మరణం తరువాత..!
-
కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయాం
నారాయణఖేడ్: తమ రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలు అమలు కావడం లేదంటూ కర్ణాటకకు చెందిన రైతులు శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ర్యాలీ నిర్వహించారు. తాము మోసపోయామని, మీరు మోసపోవద్దని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే.. వీరి ప్రదర్శనను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన 60 మంది వరకు రైతులు మంగల్‌పేట్ నుంచి నారాయణఖేడ్ రాజీవ్‌చౌక్ వైపు ర్యాలీగా బయలు దేరారు. కొద్దిదూరం రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని ప్లకార్డులను లాక్కొని చించివేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం కర్ణాటక రైతులు రాజీవ్‌చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. హామీల అమలు లేదు: కర్ణాటక రైతులు దేవరాజ్‌గౌడ్, పెనినగౌడ, సోంనాథ్, సంజీవ్‌కుమా ర్ టోల్లె అనే రైతులు విలేకరులతో మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అమలు కావడం లేదని చెప్పారు. మహిళలకు రూ.2వేలు, 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి కేవలం ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా ఉండగా, ప్రస్తుతం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. వారు పెయిడ్ ఆర్టిస్టులు: కాంగ్రెస్ కర్ణాటక నుంచి వచ్చినవారు రైతులు కాదని, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులని పీసీసీ ఎస్టీసెల్ వైస్ చైర్మన్ భీంరావునాయక్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తదితరులు విమర్శించారు. బీఆర్ఎస్కు ఓట మి తప్పదనే భయంతో పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి తప్పుడు ప్రచారానికి తెరలేపారన్నారు. తమ వెంట వస్తే బీఆర్ఎస్ నాయకులను కర్ణాటక తీసుకెళ్లి పథకాల అమలు తీరును చూపిస్తామని అన్నారు. -
నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ ఎవరికీ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాకముందే అసంతృప్తి రాజుకుంటుందా?.. దీని కోసం ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే అలకలు షురూ అయ్యాయా?.. పార్టీకి చెందిన మాజీ ఎంపీలంతా ఇటీవల హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని పరిశీలిస్తే అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖేడ్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పార్టీలోని ఇరు వర్గాలు కూడా తమ నాయకుడికే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నాయి. ఎలాగైనా ఈసారి తమ నాయకుడు పోటీలో ఉంటారని ఇరువర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. తొలి జాబితాలో దక్కని చోటు కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ తొలి జాబితాలో ఖేడ్‌కు చోటు దక్కలేదు. రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఈసారైనా నియోజకవర్గం టికెట్ ప్రకటిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చాకే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో భేటీ అయ్యారు. అందులో నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న సురేష్‌షెట్కార్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ రాని ఈ మాజీ ఎంపీలంతా సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నారాయణఖేడ్‌లో పార్టీ కేడర్ చాలా ఏళ్లుగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టికెట్ రెండో జాబితాలో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
సయోధ్య సాధ్యమేనా..! వైఎస్సార్ ఫార్ములా ప్రయోగించేందుకు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో ఉప్పు, నిప్పు అన్నట్లుగా ఉన్న ఇద్దరు ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డిల సమన్వయానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నేడో, రేపో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (టీపీఈసీ) సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావుఠాక్రే పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇద్దరితో జహీరాబాద్‌కు చెందిన ఓ కీలక నాయకుడు చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గంలో కీచులాటలు తీవ్రనష్టాన్ని తెస్తోంది. ఒకరు పోటీలో ఉంటే మరొకరు ఇందుకు సహకరించకపోవడంతో ఇతర పార్టీలకు కలిసొస్తోంది. ఈ సమస్యను అధిగమించకపోతే వచ్చే ఎన్నికల్లో పరాజయం పునరావృతం అవుతుందని భావిస్తున్న అధినాయకత్వం.. ఇప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్ ఫార్ములా ప్రయోగించేందుకు.. ఈ నియోజకవర్గంలో గతంలో సంజీవరెడ్డి తండ్రి పట్లోళ్ల కిష్టారెడ్డికి, సురేష్‌షెట్కార్ మధ్య ఇదే పరిస్థితి ఉండేది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో వారిద్దరికి సయోధ్య కుదిర్చారు. షెట్కార్‌ను జహీరాబాద్ ఎంపీగా, కిష్టారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించాలని భావిస్తోంది. ఒకరిని ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో ఉంది. వీలు కాని పక్షంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది. ఆసక్తికరమైన పరిణామాలు ఖేడ్ కాంగ్రెస్‌లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజీవరెడ్డి.. సురేశ్ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడగా, ఇటీవల జరిగిన కిష్టారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి షెట్కార్ కూడా హాజరుకావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తార స్థాయిలో కీచులాటలు ఈ నియోజకవర్గంలో షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య కీచులాటలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియామక విషయమై కూడా వివాదానికి దారితీసింది. షెట్కార్ అనుచరులకే అధ్యక్ష పదవులన్నీ దక్కడంపై సంజీవరెడ్డి భగ్గుమన్నారు. దీనిపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఒకానొకదశలో గాంధీభవన్‌ను సైతం ముట్టడించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు సమన్వయం చేయకపోతే ఈ స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని అధినాయకత్వం భావిస్తోంది. వెంటనే సయోధ్య కుదుర్చేందుకు సన్నాహాలు చేస్తుండటం ఆసక్తి కరంగా మారింది. మద్దతు కూడగట్టే ప్రయత్నాలు.. పార్టీ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న వీరు పార్టీ ముఖ్యనేతల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి షెట్కార్‌ను ప్రోత్సహిస్తుండగా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు సంజీవరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న పరిచయాలతో ఎలాగైనా అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు సురేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. ఇద్దరు కూడా అధినాయత్వం మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండటం పార్టీ అంతర్గత వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఒకవేళ సయోధ్య కుదిరినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పని చేస్తారా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్ కంచుకోటలో ఆధిపత్య పోరు.. పార్టీని ముంచుతారా?
రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగలేదు. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యా పోరు తీవ్రమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ రెండు కుటుంబాల కథేంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ తమదే అనే రీతిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షేట్కర్ వంశస్తులు వ్యవహరిస్తున్నారు. షేట్కర్ల శిష్యుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన పట్లోళ్ల కిష్టా రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత శివరాజ్ షేట్కార్ కుమారుడు సురేష్ కుమార్ షేట్కార్ రాజకీయ ప్రవేశంతో పట్లోళ్ల కిష్టారెడ్డి, షేట్కార్ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇరు కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో రాజకీయ పలుకబడి కలిగిన శివరావు షేట్కార్ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన కొడుకుకు సురేష్ షేట్కార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో షెట్కార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డి బీజేపీలో చేరి టికెట్ సాధించడంతో వారి మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత సంవత్సరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ వేరు వేరుగా గ్రామస్థాయిల్లో నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల ప్రత్యక్ష పోరుకు రచ్చబండే వేదికైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఎవరి స్థాయిలో వారు జన సమీకరణ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పిలుపు మేరకు జరుగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుకు నిరసనగా చేసిన ధర్నా కార్యక్రమం కూడా వేరువేరు చోట్ల ఒకే రోజు నిర్వహించి వారి మధ్య విభేదాలను మరోసారి కేడర్‌కు చూపించారు. వీరిద్దరి మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో గ్రామస్థాయిలోని కేడర్ అయోమయానికి గురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు బాహాటంగానే నాయకులకు సూచిస్తున్నారు. ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ వస్తే మరొకరు రెబల్ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ జండా ఎగరేయడానికి కృషి చేస్తారో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పార్టీని బలిచేసుకుంటారో చూడాలనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా? -
దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కామెంట్స్
-
LIVE: కేసీఆర్ బహిరంగ సభ @ నారాయణఖేడ్
-
ఐదు నెలల పసిబిడ్డకు కరోనా
సాక్షి, నారాయణఖేడ్: ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచి్చనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురిలో అయిదు నెలల పాప సైతం ఉంది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. -
నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం
సాక్షి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యమ్మ, విట్టమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. నాలుగు దుకాణాలతో పాటు విద్యుత్ స్తంభాన్ని కూడా బొలేరో వాహనం ఢీ కొట్టింది. దుకాణాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ ఫుల్లుగా మద్యం మత్తులో వాహనం నడిపాడని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పరిశీలించారు. చదవండి: ఆడపిల్లలు పుట్టారని రోజూ వేధింపులు.. భార్య ఆత్మహత్య ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ -
నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం
-
గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
నారాయణఖేడ్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుకు గురై ఆదివారం మృతి చెందాడు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన మురళీ గోవింద్(35) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వారం క్రితం ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడటంతో నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కోవిడ్ వార్డులో పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కాగా మురళీ గోవింత్ 2014, 2018లో ఖేడ్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఏడాదిక్రితం ఆయన బీజేపీలో చేరారు. -
కొబ్బరికాయ కొడదామని గుడికి.. అంతలోనే బాబుతో
నారాయణఖేడ్: రెండున్నర నెలల బాబుతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నారాయణఖేడ్‌లో చోటు చేసుకుందని ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీఎన్టీ తండాకు చెందిన కర్ర ప్రకాశ్ (34)కు సిర్గాపూర్ మండలం జమ్లా తండాకు చెందిన సంగీత (26)తో తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లతోపాటు ఇంకా పేరు కూడా పెట్టని రెండున్నర నెలల బాబు సంతానం ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కర్ర ప్రకాష్ భార్యా పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సంగీత తల్లిగారి గ్రామమైన జెమ్లాతండాకు వెళ్లింది. అత్తగారి గ్రామమైన డీఎన్టీ తండాలో పూజ ఉన్నందున ఈనెల 1వ తేదీన ఇక్కడకు వచ్చింది. పూజ ముగిశాక వారం రోజులుగా ఖేడ్ పట్టణంలోని ప్రకాశ్ అక్క నిర్మల ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నెల 15న ఉదయం డీఎన్టీ తండాలోని ఒక గుడి వద్ద కొబ్బరికాయ కొడదామంటూ తన బాబును తీసుకొని సమీప బందువైన క్రిశాంక్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. కొబ్బరికాయ తీసుకురమ్మంటూ క్రిశాంక్‌ను పంపించి ఆ తర్వాత తనబాబుతో కలిసి సంగీత అదృశ్యమైంది. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త కర్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్ -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..!
సాక్షి, సంగారెడ్డి: నారాయణ్ ఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్ ఖేడ్ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు. -
వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు
సాక్షి, సంగారెడ్డి : లాక్డౌన్ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, పోలీస్టేషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్‌లో భూపాల్‌రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి) మరోవైపు భూపాల్‌రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్‌పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని ఆ పత్రిక పేర్కొంది. ఇక తాజా వివాదంపై నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ , రక్త దానం చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. -
మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
నారాయణఖేడ్: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దంటూ మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సత్తెగామ ప్రజలు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెగామకు చెందిన కుమ్మరి కిష్టయ్య (52) కుటుంబంతో కలసి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఆయన అనారోగ్యానికి గురవడంతో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం మరణించాడు. దీంతో బంధువులు కిష్టయ్య మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తెగామకు తీసుకు వచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సలు చేస్తున్నందున అక్కడి నుంచి కిష్టయ్య మృతదేహాన్ని తీసుకువస్తే తమకు ప్రమాదమని, మృతదేహాన్ని తీసుకురావద్దంటూ గ్రామస్తులు ఊరి శివారులోని పాఠశాల వద్ద వాహనానికి అడ్డుగా రాళ్లువేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాన్ని నేరుగా తీసుకెళ్లి వారి వ్యవసాయ భూమి వద్ద అంత్యక్రియలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. మా ఊరికి రావొద్దు..! రేగోడ్ (మెదక్): కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడ.. ఎలా.. ఎవరి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఏకంగా అరవైమంది కొత్త వ్యక్తులు రావడంతో.. ఆ ఊరివారు తమ గ్రామానికి రావొద్దని.. అపరిచిత వ్యక్తులను అడ్డుకున్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఆర్.ఇటిక్యాలలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు అరవై మంది నాలుగు వాహనాల్లో ఆర్.ఇటిక్యాలకు వచ్చారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. వారంతా ఇటీవల సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వారి సొంతూళ్లకు వెళ్లాలని వట్పల్లిలో ప్రజలు పంపిస్తే వారంతా ఆర్.ఇటిక్యాలకు చేరుకున్నారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో వారిని ఊర్లో ఉండకూడదని, వారి స్వస్థలాలకు వెళ్లాలంటూ పంపించామని సర్పంచ్ సుంకె రమేశ్ తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ వారితో మాట్లాడి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కాంగ్రెస్ వాట్సాప్‌లో టీఆర్ఎస్, బీజేపీల ప్రచారం
నారాయణఖేడ్: మున్సిపోల్స్ ప్రచారానికి కాంగ్రెస్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రచారం ఆశ్చర్య పరుస్తుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్ ‘మున్సిపల్ కాంగ్రెస్ ఎన్‌కేడీ’అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్‌నకు ‘ఇన్వైట్ లింక్’ ఇవ్వడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం యాడ్ అయ్యారు. ఆపై తమ పార్టీకి ఓటేయాలనే ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు. టీఆర్ఎస్కు ఓటేయాలని వీడియోలు, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఫారాలు ఇచ్చే ఫొటోలు, టీఆర్ఎస్ అభ్యర్థి ఫొటోలు పోస్ట్ చేశారు. అలాగే బీజేపీకి ఓటేయాలంటూ ఆ పార్టీ అభిమాని సైతం వీడియోను పోస్ట్ చేశారు. -
నాడు నాన్న.. నేడు అమ్మ
సాక్షి, కల్హేర్(నారాయణఖేడ్): నాడు నాన్న చనిపోయాడు.. నేడు అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లి మరణించడంతో వారి కొడుకు నవీన్(17) అనాథగా మారాడు. మంగళవారం కల్హేర్ మండలం మార్డిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరుడి సాయిలు, నీరుడి విఠ్ఠమ్మ దంపతులకు.. ఇద్దరు సంతానం. కూతురు చిట్టమ్మ, కుమారుడు నవీన్ ఉన్నారు. సాయిలు 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కూతురు చిట్టమ్మ వివాహం ఇటీవలే నారాయణఖేడ్ మండలం కొత్తపల్లికి చెందిన ఓ వ్యక్తితో జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి చిట్టమ్మ పుట్టింట తల్లి విఠ్ఠమ్మ వద్ద ఉండేది. చిట్టమ్మ రెండు నెలల క్రితం పురిటి నొప్పులు తాళలేక మృతి చెందింది. దీంతో ఇంట్లో తల్లి నీరుడి విఠ్ఠమ్మ(45)కు కుమారుడు నవీన్ ఒక్కడే తోడుగా మిగిలాడు. అనారోగ్యంతోపాటు మానసిక క్షోభతో విఠ్ఠమ్మ మంగళవారం మృతిచెందింది. దీంతో నవీన్ అనాథగా మిగిలాడు. తల్లి అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. విఠ్ఠమ్మ దూరం కావడంతో గ్రామస్తులు చలించిపోయారు. వారు చందాలు వేసి విఠ్ఠమ్మ అంత్యక్రియల కోసం రూ. 11,500 నగదు సహాయం అందజేశారు. తల్లి విఠ్ఠమ్మ మృతదేహం వద్ద నవీన్ -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్‌లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్
జోగిపేట (అందోల్): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’అంటూ ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ (45) భార్య సుజాత కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ నాగేశ్వర్ జోగిపేటకు చెందిన సుజాతను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రతి రోజు సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో సుజాత తన తల్లి నివాసం ఉండే జోగిపేటకు భర్తతో కలసి వచ్చింది. మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్ టికెట్.. టికెట్.. బస్ ఆగింది దిగండి.. రైట్ రైట్ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇస్తున్నాడు. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్ కట్టివస్తా .. అని కూడా అంటున్నాడని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడంలేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో చదువులను మధ్యలోనే మాన్పించేసినట్లు ఆమె చెప్పింది. నాగేశ్వర్ రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండడంతో భర్త ప్రవర్తనను చూసి సుజాత కన్నీరు మున్నీరవుతూ జాగారం చేస్తుండగా, కొడుకులు కూడా తల్లిదండ్రుల బాధను చూసి వారు కూడా నిద్రకు దూరం అవుతున్నారు. చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అలాగే ఉన్నట్లు తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. (చదవండి: చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్) -
ధార లేని మంజీర
సాక్షి, నారాయణఖేడ్: జిల్లా జీవ నది మంజీర ఇంకా వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నదిలో నీటి జాడలే లేవు. ఇప్పటికే నీటితో కళకళలాడాల్సిన నదిలోకి నీరు రాకపోవడంతో జిల్లావాసులు కలవర పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా మంజీరా నదిలో ఆ జాడలు మాత్రం కానరావడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా దానికి ఉప నదిగా ఉన్న మంజీరలో మాత్రం నీరే లేదు. గత ఏడాది ఈ సమయం వరకే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎండిపోయే కన్పిస్తోంది. కర్ణాటకలో నెల క్రితం కురిసిన భారీ వర్షంతో మంజీరా నదిలోకి వరద వచ్చింది. అప్పటికే వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయి ఉండడంతో వచ్చిన వరద నీరు కాస్త భూమిలోకి ఇంకిపోయింది. నది తిరిగి యథా పరిస్థితికి వచ్చి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్గిద్ద మండలం గౌడ్‌గాంజన్‌వాడ వద్ద ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నది ప్రవేశ ప్రాంతం నుండి ఎక్కడా నీరు రాలేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసే భారీ వర్షాలు, వరదలతో నదిలోకి నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి కొంత నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడం లేదు. కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరినప్పుడే ఈ ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు వదిలే అవకాశం ఉంది. అప్పుడే నదిలోకి నీరు వస్తుంది. మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.91టీఎంసీలు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టులో ఉన్న నీరు 0.44 టీఎంసీలు మాత్రమే. తాగునీటికి కష్టకాలమే.. మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్‌తోపాటు జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. నదిలో నీరు లేని కారణంగా మూడు నెలలుగా నీటి పథకాలు వట్టిపోయాయి. రెండు నెలల క్రితం వరకు సింగూరు సమీపంలోని పెద్దారెడ్డిపేట్ నుండి నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలకు కలిపి మిషన్ భగీరథ అధికారులు 953 గ్రామాలకు తాగునీటిని అందించారు. రెండు నెలలుగా ప్రాజెక్టులో చుక్కనీరు లేని కారణంగా నీటి పథకాలన్నీ వృథాగానే మారాయి. ఫలితంగా వందల గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. చాలా గ్రామాల్లో బోర్లను కిరాయికి తీసుకోవడం, ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు కూడా గ్రామీణులకు అవసరమైన మేర సరిపోవడం లేదు. వృథాగా నీటి పథకాలు.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీర నది నుండే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1 కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40 గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్ వెల్లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. నది ఎండిపోవడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీర నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీరు ఎండిపోయింది. నది ఎండడంతో బోర్లు కూడా ఎండిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. -
3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్
రాష్ట్రంలోని ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి లేని విధంగా విభిన్న సంçస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు, భాషల సమ్మిళితం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సరిహద్దుగా కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతం పరిధిలో మిళితమై ఉన్నాయి. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలకు కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గానికి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లో కన్నడ భాష మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. దీంతో జుక్కల్‌లో మరాఠీ భాషను మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మరాఠీ భాష పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కరీంనగర్ యాసతో కూడిన భాషను మాట్లాడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడే కోస్తాంధ్రా వారూ ఉన్నారు. ఆచారాలు అనేకం.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగాల మండలాల్లో గిరిజనులు అధికం. ఆయా మండలాల్లో లంబాడీ భాషను అధికంగా మాట్లాడతారు. గాంధారిలో మథురాల తెగ కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి ఎక్కువ. అంతేకాక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా లింగాయత్ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో బసవేశ్వరుడి ఆచార వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ముస్లిం మైనార్టీలు సైతం జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చెరకు, వరి, అల్లం, ఆలుగడ్డ, జొన్న, కంది, మినుము, పెసర, పత్తి, గోధుమ తదితర పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. జీవన వైవిధ్యం.. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆచార వ్యవహారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కట్టూబొట్టూ దగ్గరి నుంచి సంస్కృతీ సంప్రదాయాల వరకు అన్నింటా ఇక్కడ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్ నియోజకవర్గాలు మెదక్ లోక్‌సభ పరిధిలో ఉండేవి. జహీరాబాద్ లోక్‌సభ ఆవిర్భావంతో జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్‌తో పాటుగా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్ ప్రాంతంపై బీదర్ ప్రభావమూ ఎక్కువ ఉంటుంది. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాల వారు ఎక్కువగా పనులపై కర్ణాటక, మహారాష్ట్రలోని పట్టణాలకే వెళ్లి వస్తుంటారు. నారాయణ్‌ఖేడ్‌లో మహారాష్ట్ర సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ గల పండరి భక్తులు వేల మంది ఏటా పండరినాథుని దర్శనానికి కాలినడకన ‘దండుయాత్ర’గా మహారాష్ట్రలో గల పండరి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక పాలు కూడా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ. నిత్యం సప్తాహాలు, భజనలు వంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు తలపై టోపీలతో మహారాష్ట్ర ఆచార వ్యవహారాలను తలపిస్తారు....::: దివాకర్ రెడ్డి కొలన్, సంగారెడ్డి -
పురాతన బావిలో మంటలు..
సాక్షి, నారాయణఖేడ్: ప్రమాదశాత్తు పురాతన బావిలో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదం పట్ల పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన హనుమాన్ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద పురాతన బావి ఉంది. చాలా కాలంగా బావిని ఉపయోగించకపోడంతో చెత్తా, చెదారం వేస్తుండడంతో బావిలో చెత్త నిండిపోయింది. గురువారం మధ్యాహ్నం బావిలో ఎవరూ మంటలు అంటించారో తెలీదు కానీ ఒక్కమారుగా మంటలు అంటుకున్నాయి. ఈ బావి పక్కనే ఓ ప్రధాన బ్యాంకు, హనుమాన్ ఆలయం, మరో వైపు పెట్రోల్‌బంక్, చుట్టూ నివాసగృహాలు ఉన్నాయి. ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని స్థానికులు అగ్నిమాపకకేంద్రం అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయింపు వ్యవహారంలో తలెత్తిన అసమ్మతికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాములు నాయక్ ఖండించారు. ఓ దశలో కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గత నెల మొదటి వారంలో విడుదల చేసిన టీఆర్ఎస్... నారాయణఖేడ్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేరును మరోమారు ఖరారు చేసింది. అయితే భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని రాములు నాయక్ వ్యతిరేకించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చాలంటూ తన వర్గానికి చెందిన కొందరు నేతలతో కలసి ప్రత్యేక సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించారు. అలాగే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాదాపు పక్షం రోజులుగా రాములు నాయక్‌తో పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతోందని, త్వరలో ఖేడ్‌లో తలెత్తిన అసమ్మతి సమసిపోతుందని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ రాములు నాయక్‌ను పార్టీ సస్పెండ్ చేయడంతో అయన అనుచరుల రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. కుంతియాతో భేటీయే కారణం? గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి రాములు నాయక్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నారాయణఖేడ్ లేదా బోథ్ స్థానాల నుంచి టికెట్ ఆశించినట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాములు నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్ కోరినట్లు ప్రచారం జరగ్గా దీన్ని ఆయన ఖండించారు. తన మిత్రుడిని కలవడానికే హోటల్‌కు వెళ్లినట్లు ఆదివారం రాత్రి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాములు నాయక్‌ను టీఆర్ఎస్ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతకాలంగా రాములు నాయక్ వర్గం పేరిట అసమ్మతి రాగం వినిపిస్తున్న కంగ్టి ఎంపీపీ రామారావు రాథోడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాములు నాయక్ వెంట నడుస్తూ వస్తున్న కంగ్టి జెడ్పీటీసీ సభ్యుడు రవి కుమార్, మల్శెట్టి యాదవ్ తదితరులు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రాములు నాయక్ అనుచరుల్లో కొందరిని మంత్రి హరీశ్‌రావు ఇటీవల బుజ్జగించినట్లు సమాచారం. రాములు నాయక్ సస్పెన్షన్ వ్యవహారం నియోజకవర్గంలో కాస్త రాజకీయ వలసలకు దారితీస్తుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: రాములు నాయక్ టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని.. ఆ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేయడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నిర్మాణంలో ప్రతి రాయిపైనా తన పేరు ఉందన్నారు. తెలంగాణ ద్రోహి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరుతో తనను సస్పెండ్ చేయించడం చూసి బాధపడుతున్నానన్నారు. ‘టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే గర్వపడేవాడిని. 2004, 2009, 2014, 2018లో టికెట్ అడిగా. అధిష్టానం ఇవ్వకపోపోయినా పార్టీ మారలేదు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికయ్యా. గిరిజనుల రిజర్వేషన్లు అడిగినందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్కు సేవ చేసినందుకు, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసారా? గిరిజన మేధావులతో త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. నా జాతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాలాగా బాధపడుతున్న వాళ్లు టీఆర్ఎస్లో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఏదో ఒకరోజు బయటకు వస్తారు’అని రాములు నాయక్ చెప్పారు. కేసీఆర్ చెప్పిన గిరిజన పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అతీగతీ లేదని, గిరిజనులను టాటా బిర్లా చేస్తామని ఈ నాలుగేళ్లలో బికారీలను చేశారని మండిపడ్డారు. ఒక్కరోజూ తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్లో ఉన్నారని, ఉద్యమ సమయంలో విద్యార్థులు తరిమికొట్టిన వారిని మంత్రి కేటీఆర్ తన కారులో తిప్పుకుంటూ వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. స్నేహితులను కలిసేందుకే గోల్కొండ హోటల్‌కు వెళ్లానని, కుంతియాను కలవలేదని, అక్కడ రేవంత్, మధు యాష్కీ తనకు యాదృఛికంగా తారసపడ్డారనని రాములు నాయక్ చెప్పారు.