National Park
-
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
US: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్‌లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు. అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్‌లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది. తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం. వేముల ప్రభాకర్ (చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు. -
గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్
సరదాగా సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం దొర్లించేసింది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq — Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024 అసలు ఏమైందంటే... ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో 22 సీటర్ ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు. ఇంతలో డ్రైవర్ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్‌పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది. దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్ ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా ప్రవర్తించిందని పార్క్ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్ సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు. -
ప్రకృతి గొప్పతనం తెలిపే కథ! నక్కలు చేసిన మేలు!
మానవుడు తాను మనుగడ సాగించడానికి ఇష్టారీతిలో అడవులు నరికి అభివృద్ధి ముసుగులో తానేం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. అక్కడకి ప్రకృతి ప్రకోపిస్తూ ఏదో విధంగా మానవుడికి తెలియజేప్పే యత్నం చేసిన మూర్ఖుల్లా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఇలాంటి ప్రకృతి కథ వింటే కనువిప్పు కలుగుతుందేమో. అన్ని జీవులు మనుగడ సాగిస్తే ప్రకృతి అని తెలిపే కథ. ఏదో ఒక్క సంతతే మనుగడ సాగిస్తే ఒక్కసారిగా పరిసరాలపై ఎలా ప్రభావం చూపుతోంది తెలియజేసే గమ్మత్తైన సంఘటన. చిన్నప్పుడూ చదివిన ఆహారపు గొలుసు కథ స్ఫూరింపజేస్తుంది. ఇంతకీ ఏంటా కథ అంటే.. 1995లో యూఎస్‌లోని ఎల్లో స్టోన్ నేషనల్పార్క్ ఒక్కసారిగా జీవకళ తప్పి నిర్జీవంగా కనిపించింది. ఎందువల్లనో గానీ కొలనులు, సెలయేళ్లు, ఎండిపోతూ, చెట్టన్నీ ఆక్కుపచ్చదనాన్ని కోల్పోయినట్లుగా ఉన్నాయి. దీంతో పక్షుల కిలకిలరావాలు, ఇతర సరీసృపాలు సందడి తదితరాలన్నీ కనుమరుగయ్యి నిర్మానుష్యంగా ఉంది. అయితే ఇదే సమయంలో పార్క్ అధికారులు 14 తొడేళ్లను విడుదల చేశారు. వేటాడే జంతువుల లేకపోవడంతో చెట్లను తినే లేళ్లు, తదితర జంతువుల జనాభా పెరిగిపోయింది. అవి మొక్కలు, పచ్చిక బయళ్లును నెమ్మదిగా తినేయడంతోనే ఒక్కసారిగా ఆ అడవి అంత నిర్జీవంగా అయిపోయింది. ఎప్పుడైతే విడుదలయ్యాయో ఈ తోడేళ్లు ఆ లేళ్లనే వేటాడటం ప్రారంభించాయి. నక్కల వేట ఎప్పుడైతే మొదలైందో ...క్రమంగా ఆ అడవి స్వరూపం మారి ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. చెట్లన్ని చిగురించడం ప్రారంభించాయి. దీంతో కాకులు, గ్రద్దలు, ఇతర పక్కుల రావడం ప్రారంబించాయి. దీంతో పాటు సుంచులు, ఎలుకలు, కుందేళ్లు శబ్దాలతో మళ్లీ అడవి ఇదివరకటి పక్కుకిలకిల రావాలు, శబ్దాలతో కళకళలాడింది. ఎప్పుడూ కనిపించని కొన్ని రకాల జాతులు కూడా దర్శనమిచ్చాయి. కూడా. ఒక్కసారిగా పార్క్ నిర్వాహణధికారులు కూడా ఏదో మిరాకిల్ జరిగినట్లుగా జరిగిందంటూ ఆశ్చర్యపోయారు. తాము నిర్జీవంగా ఉన్న అడవిని మునిపటిలా పుష్పించే మొక్కలు చెట్లతో పచ్చగా అందంగా ఉండాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ తోడేళ్లు ఇలా అద్భుతం చేసి చూపుతాయని ఊహించలేదన్నారు. ఆఖరికి అడవిలో ఉండే వేటకుక్కలను కూడా చంపేశాయి. గ్రద్దలు, కాకిల జనాభా పెరిగింది. వేటాడే జంతువు..భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే జంతువుల మధ్య సమతుల్యత ఏర్పడింది. మరోవైపు నదులు, కొలనులు, సెలయేర్లు కూడా ఇదవరకటిలో నీళ్లుతో నిండుగా కళకళలాడుతూ ఉన్నాయి. పరిసరాల సమతుల్యతకు అన్ని జంతువుల మనుగడ అత్యవసరం అనే విషయాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన ప్రకృతి ఎంత అపురూపమైందో తెలియజేసింది. In 1995, 14 wolves were released in Yellowstone National Park. No one expected the miracle that the wolves would bring [📹 Protect All Wildlife]pic.twitter.com/DMlMDx40TY — Massimo (@Rainmaker1973) August 25, 2023 (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా!
ప్రపంచంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలు ఉంటాయి. వేడినీటి బుగ్గల్లోని నీళ్లు సాధారణంగా స్నానానికి అనువుగా ఉంటాయి. డోమనికా రాజధాని రోసోకు చేరువలోని మోర్నె ట్రాయిస్ పిటోన్స్ నేషనల్ పార్కులో ఏకంగా మరుగునీటి సరోవరం ఉంది. దీనిని తొలిసారిగా 1870లో ఇద్దరు బ్రిటిష్ వ్యక్తులు గుర్తించారు. ఈ సరోవరంలోని నీటి ఉష్ణోగ్రత 82 డిగ్రీల నుంచి 92 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇందులోని నీరు నిత్యం సలసల మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. డోమనికా వచ్చే విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సరోవరం చూడటానికి వస్తుంటారు. దీని ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుంటారు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ డేల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
బాబోయ్.. టూరిస్ట్‌లపై పులి ఎటాక్! వీడియో వైరల్
-
Kuno: మరో చీతా కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా కన్నుమూసింది. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైన చీతా.. సాయంత్రం కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. నెల వ్యవధిలో ఇది రెండో చీతా మరణం. సౌతాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరేళ్ల వయసున్న ఉదయ్ అనే చీతా ఆదివారం కన్నుమూసింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అది అస్వస్థతతో కనిపించిందని, మత్తు మందు ఇచ్చి బంధించి చికిత్స అందిస్తుండగా అది సాయంత్రం మరణించింది అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే అది ఎందుకు మరణించిందో తెలుస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఐదేళ్ల వయసున్న నమీబియన్ చీతా షాషా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ చీతా కోసం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను కేంద్ర ప్రభుత్వం రప్పించింది. ఇందులో రెండు మరణించగా.. 18 మిగిలాయి ఇప్పుడు. -
పులులు గర్జిస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలోమీటర్లలో ఉన్న 9 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి. కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది. ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది. వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్ ప్రాజెక్టు బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్..
బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్ చేశారు. రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు. Wild wild world. The tiger name is T 101 of Ranthambore. @HJunglebook recently captured it and want everyone to witness it. pic.twitter.com/dAT7WNvxtv — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 1, 2023 -
అడవిలోకి రెండు చీతాలు విడుదల
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాల్లో రెండింటిని అటవీ ప్రాంతంలోకి వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 2022 సెప్టెంబర్‌లో ఇక్కడికి చేరుకున్న 8 చీతాలను మొదటగా ప్రత్యేకమైన ఎన్క్లోజర్లలోకి, అనంతరం హంటింగ్ ఎన్క్లోజర్లలోకి తరలించారు. శనివారం మొదట మగ చీతా ఒబన్ను, కొన్ని గంటల తర్వాత ఆషా అనే ఆడ చీతాను అడవిలోకి వదిలామని ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ చెప్పారు. మిగిలిన వాటిని కూడా నిర్ణీత సమయాల్లో అడవిలోకి విడిచిపెడతామన్నారు. మొన్న ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
రాజస్థాన్‌లో బన్నీ టూర్.. వైరలవుతున్న వీడియో
ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా విరామం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్‌లో ఫ్యామిలీతో కలిసి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ వ్యాకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అలాగే ఓ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్ పులిని ఫోటో తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా.. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బన్నీ. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. రణథంబోర్ నేషనల్ పార్కులో దూరంగా ఉన్న పులిని తన పిల్లలకు చూపిస్తూ కనిపించాడు బన్నీ. అయితే పుష్ప-2 షూటింగ్లో మళ్లీ త్వరలోనే మళ్లీ బన్నీ జాయిన్ అవ్వాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y — KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
వన్యప్రాణుల వైవిధ్యానికి ఊతం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల రాకతో మన దేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి మరింత ఊతం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చీతాల రాకపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్‌ను మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రాజెక్టు చీతా’ మరో మైలురాయికి చేరుకుందని భూపేంద్ర యాదవ్ తన ట్వీట్లో వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో రప్పించిన 12 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. లద్ధాఖ్‌లో జీవనం మరింత సులభతరం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ప్రజల జీవనాన్ని మరింత సులభతరంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 4.1 కిలోమీటర్ల పొడవైన షిన్‌కున్ లా సొరంగం నిర్మాణానికి రూ.1,681.51 కోట్లు కేటాయించడానికి కేంద్రం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ లద్ధాఖ్ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ చేసిన ట్వీట్‌ను మోదీ ట్యాగ్ చేశారు. ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజలకు అందించిన సుపరిపాలన మనకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. -
దక్షిణాఫ్రికా నుంచి యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు..
భోపాల్: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. #WelcomeHome An #IAF C-17 aircraft carrying the second batch of 12 #Cheetahs landed at AF Station Gwalior today, after a 10 hour flight from Johannesburg, South Africa. These Cheetahs will now be airlifted in IAF helicopters and released in the #KunoNationalPark. pic.twitter.com/Pk0YXcDtAV — Indian Air Force (@IAF_MCC) February 18, 2023 భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు ఏకంగా రూ.800 వరకు ఖర్చు! -
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు
జోహన్నెస్‌బర్/న్యూఢిల్లీ: భారత్‌కు మరో డజను చీతాలు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చే చీతాలను మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో ఉంచుతారు. దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ పెంచేందుకు కొద్ది నెలల క్రితం నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి తోడుగా ఫిబ్రవరిలో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వస్తాయని అటవీ, మత్స్య సంపద సంరక్షణ, పర్యావరణ (డీఎఫ్ఎఫ్ఈ) శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 12 చీతాలు వస్తే, ఆ తర్వాత ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఏడాదికి 12 చీతాలు చొప్పున వస్తాయి. ప్రపంచంలోనున్న 7 వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో ఉన్నాయి. -
గుడ్‌న్యూస్.. భారత్‌కు మరో 12 చీతాలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు దక్షిణాఫ్రికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. జనవరిలో మరో 12 రానున్నాయి. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
ఉల్లాసంగా చీతాలు: మోదీ
న్యూఢిల్లీ: నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా గొప్పవార్త. నిర్బంధ క్వారంటైన్ తర్వాత కునో పార్కు వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా రెండు చీతాలను మాత్రం మరింత పెద్దదైన ఎన్‌క్లోజర్‌లోకి వదులుతామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత మిగతా వాటిని విడతలుగా వదులుతారు’అని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. రెండు చీతాలను శనివారం పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. పెద్ద ఎన్‌క్లోజర్ విస్తీర్ణం ఐదు చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెప్పారు. 30–66 నెలల వయస్సున్న 8 చీతాలను సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ
ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్‌కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అన్నారు. 'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్‌గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు. బీజేపీ గట్టి కౌంటర్.. అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్‌కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. Nana Patole who is Rahul Gandhi of Maharashtra says Lumpy Virus originated in Nigeria & it came because Modi ji brought Cheetahs! Cheetahs came from Namibia Does he know Nigeria & Namibia are different nations? Congress has always spread such lies & rumours 1/n — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 3, 2022 కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది. నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. చీతాలు.. చిన్నవైనా వేగంగా.. ►ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. ►ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ►శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. ►రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. ►3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. ►చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. ►ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. ►ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. ►నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. ►ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ►ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్ సహరన్ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. ►తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. ►ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. జాగ్వార్లు.. భారీ పరిమాణంలో.. ►ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. ►చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. ►ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు. -
ఆ అతిథులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఏనుగులు!
భోపాల్: సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చిరుతలను.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ కునో నేషనల్ పార్క్‌లో ఈనెల 17వ తేదీన విడిచిపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాట చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే స్వేచ్ఛగా జాతీయ పార్క్‌లో విడిచిపెడతారు. మరోవైపు.. ఈ చీతాల భద్రతకు అన్ని ఏర్పాటు చేప్టటారు కునో పార్క్ నిర్వహణ అధికారులు. చీతాల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. నర్మదాపురంలోని సత్పురా టైగర్ రిజర్వ్‌కు చెందిన రెండు గజరాజులను కునో పార్క్‌కు తీసుకొచ్చారు. వాటికి ఉన్న అనుభవం ఆధారంగా గజరాజులు లక్ష్మి, సిద్ధనాథ్లను గత నెలలోనే పార్క్‌కు తీసుకొచ్చారు అధికారులు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన 5 చిరుతలను బయటకి తరిమేసే ఆపరేషన్‌లో ఈ రెండు ఏనుగులు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గజరాజులు నేషనల్ పార్క్ సెక్యూరిటీ బృందాలతో కలిసి రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. ఏనుగులతో తిరుగుతూ చీతాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఏనుగులు ఉండటం ద్వారా ఏ వన్యప్రాణులు చీతాలు ఉన్న ఎన్‌క్లోజర్ వైపు రావని చెబుతున్నారు. ‘పులుల రెష్యూ ఆపరేషన్‌లో 30 ఏళ్ల సిద్ధనాథ్ మంచి గుర్తింపు పొందాడు. అయితే, సిద్ధనాథ్‌కు టెంపర్ సమస్య ఉంది. 2010లో ఈ ఏనుగు కోపానికి ఇద్దరు బలయ్యారు. అలాగే..2021, జనవరిలో ఓ టైగర్‌ను నియంత్రించటంలో సిద్ధనాథ్ కీలక పాత్ర పోషించింది. 25 ఏళ్ల లక్ష్మి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తన పనిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని తెలిపారు కునో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ వర్మ. ఇదీ చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. వాటిలో ఒకదానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ