Negligent
-
ఆక్సిజన్ సిలిండర్‌తో.. నడి రోడ్డుపై..
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. -
బస్తీ దవాఖానాలకు సుస్తీ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉదాత్త సంకల్పంతో బీఆర్ఎస్ 400పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(సెప్టెంబర్23) కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అయితే తాము ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను కూడా కాంగ్రెస్ సర్కారుకు సరిగా నడపడం చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. అనేక రకాల విష జ్వరాలతో నగరవాసులు నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన బస్తీ దవాఖానాలకే ఈ అసమర్ధ ప్రభుత్వంలో సుస్తీ చేసిందన్నారు. ప్రజారోగ్యంపై మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ వేసిన కమిటీ సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
Big Question: నేరం నీదే బాబు
-
AP: ఇంత నిర్లక్ష్యమా?.. మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలించగా, వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు ఉండగా, రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే కుటుంబీలు నిరీక్షిస్తున్నారు. పోస్టు మార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు అధికారులు, పోలీసులు జాప్యం చేస్తున్నారు.కాగా, బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. -
ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఎక్స్(ట్విటర్) వేదికగా నిలదీశారు.‘‘ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.’’వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్-వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాం.’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘పటిష్టమైన ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వసతులూ ఉన్నా, చంద్రబాబూ… మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్తకాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు.’’ వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.‘‘మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటువల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసేదిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.. @ncbn గారూ… రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2024 -
17 మంది చనిపోయినా చర్యలు తీసుకోని ప్రభుత్వం
-
అచ్యుతాపురం ఘటనపై బాబు సర్కార్ ఉదాసీన వైఖరి!
విజయవాడ, సాక్షి: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీన వైఖరి తేటతెల్లమైంది. అంత భారీ ప్రమాదం జరిగితే.. ఏం పట్టనట్లు అధికారిక కార్యక్రమాల్లో మునిగిపోయారాయన. మంత్రుల సంగతి పక్కన పెడితే.. కనీసం అక్కడి ప్రజాప్రతినిధుల్ని కూడా ఆయన ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించకపోవడం గమనార్హం. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం 1.30 -2 గంటల మధ్య ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ టైంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఆ టైంలో ప్రమాదంపై సమాచారం అందినా.. ఆయన సహాయక చర్యలపై ఏమాత్రం సమీక్షించలేదు. పైగా ఆ మీటింగ్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. వాళ్లకూ కనీస ఆదేశాలు ఇవ్వలేదు.చంద్రబాబు సమీక్ష అనంతరం.. 4 గంటలకు హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రమాదంపై కనీసం స్పందించకుండా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలతో సరిపెట్టారు. ఆ తర్వాత 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి శుభాష్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అయితే ఆయన కూడా ప్రమాదంపై సగం సగం మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు ముక్కలు, చెక్కలైపోయారని అప్పటికే మీడియా ఛానెల్స్‌లో కథనాలు వచ్చాయి. ఇక పాలనా యంత్రాంగం అంతా ప్రెస్ నోట్లు, మీడియా దిగ్భ్రాంతులకే పరిమితం అయ్యింది. చివరకు.. రాత్రి 7 గంటలు దాటాక ప్రమాదంపై అనకాపల్లి కలెక్టర్‌తో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రికి హోం మంత్రి అనిత ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నాం చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. అదే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ తరహా ఘటనలు జరిగితే.. సత్వర చర్యలు ఉండేవి. స్థానిక ప్రజా ప్రతినిధులు సత్వరమే అక్కడికి పంపించి.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించేవారు. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే యత్నమూ చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పరిహారం కూడా సత్వరంగా ప్రకటించి.. అదే త్వరగా బాధిత కుటుంబాలకు అందించేవారు. ఇదీ చదవండి: 'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యే, ఎంపీ.. అఖరికి అధికారులు కూడా సకాలంలో అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. మరోపక్క.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో హెలికాఫ్టర్‌లో డీజీపీకి గంటలో పంపిన చంద్రబాబుకి.. అచ్యుతాపురం ఘటనలో సత్వరమే స్పందించాలన్న స్పృహ లేకపోవడంపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Delhi incident: ప్రమాదం వెనుక నిర్లక్ష్యం! ఏడుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందనే విమర్శ బలంగా వినిపిస్తోందిప్పుడు. ప్రమాదానికి నెల ముందే ఈ ఇనిస్టిట్యూట్ పరిస్థితులపై అధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. కిషోర్ సింగ్ కుష్వా అనే సివిల్స్ అభ్యర్థి.. కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కు కోచింగ్ సెంటర్ నిర్వహణ తీరుపై లేఖ రాశాడు. ‘‘ఇది అత్యవసరమైన అంశం. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించింది. కేవలం పార్కింగ్ కోసమో, స్టోరేజ్ కోసమో సెల్లార్లను ఉపయోగించుకోవాలన్న ఎంసీడీ నిబంధనలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. .. సెల్లార్లోనే క్లాసులు, లైబ్రరీలను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కోచింగ్‌సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కిషోర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు ఇంకా విచారణ దశలోనే ఉందని ఆయన చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో స్టేటస్ చూపిస్తోంది. దీనిపై స్పందించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు.. ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ఏడుకు అరెస్టులు.. ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ప్రమాద ఘటనలో.. బిల్డింగ్ యజమాని సహా ఐదుగురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇంతకు ముందే కోచింగ్ సెంటర్ ఓనర్‌ను, కో ఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దీంతో వాళ్లకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. -
82 మార్కులు సాధిస్తే 18 వేశారు!
బత్తలపల్లి: పదో తరగతిలో ఫెయిల్‌గా చూపిన ఓ విద్యార్థి.. జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 82 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాలు... బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన గోగుల సూర్యనారాయణ కుమారుడు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివాడు. ఈ ఏడాది మార్చిలో బత్తలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు. తెలుగులో 98, హిందీ 89, గణితం 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రంలో 86 మార్కులు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌లో కేవలం 18 మార్కులు వేయడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. మెరిట్ విద్యారి్థగా మన్ననలు పొందిన అంజి ఫెయిల్ అయ్యాడనగానే ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. మానసికంగా కుదేలైన బాధిత విద్యారి్థకి సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయించారు. ఈ ఫలితాలు సోమవారం అందాయి. 100కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడు ఇన్ని రోజులు మానసిక వేదన అనుభవించాడని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కోరారు. -
రామోజీఫిల్మ్ సిటీలో ప్రమాదం..ఒకరు మృతి, మరొకరికి గాయాలు
-
దేవుని కొలువులోనూ అదే నిర్లక్ష్యమా ?
-
ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి
సాక్షి, క్రైమ్: కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్ సెంటర్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
‘సీఎమ్మార్’పై నిర్లక్ష్యం
జగిత్యాల రూరల్: జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వాటి సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చి స ర్కారు ఇచ్చిన గడువులోగా సీఎమ్మార్ అప్పగించాలి. కానీ, రైస్‌మిల్లర్లు బియ్యం అప్పగింతలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా బియ్యం సేకరణలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడంతోపాటు ఆంక్షలు విధిస్తోంది. అంతేకాదు.. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచుతోంది. మిల్లుల్లో అధికారులను నియమించి మర ఆడించే పనులనూ పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ వరకు గడువు 2022–23 వానాకాలం సీజన్లో ప్రభుత్వం సేక రించిన 3,38,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 132 రైస్‌మిల్లులకు అప్పగించింది. ఆ ధాన్యం స్వీకరించిన మిల్లర్లు.. 2,26,585 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను ప్రభుత్వాని(ఎఫ్‌సీఐ)కి అప్పగించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం 28,780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సర్కారుకు అప్పగించారు. రంగంలోకి దిగిన అధికారులు.. మిగతా బియ్యాన్ని సెప్టెంబర్ చివరి నాటికి అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. బియ్యం అప్పగింతలో జాప్యం.. జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్లోనూ 3,25,444 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 135 మంది రైస్‌మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 2,06,171 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్ప గించారు. ఇంకా 38 మంది రైస్‌మిల్లర్లు 11,875 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2021– 22 యాసంగి సీజన్లో 2,70,776 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 125 మంది రైస్‌మిల్లర్లకు అధికారులు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 1,77,018 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎమ్మార్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. మిగతా ఏడుగురు రైస్‌మిల్లర్లు.. 6,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. నిర్లక్ష్యంపై ఆగ్రహం.. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు. సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు, ఆయా రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు తరచూ తనిఖీ చేయిస్తోంది. నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రతినెలా సమీక్ష.. సీఎమ్మార్ అప్పగింతలో రైస్‌మిల్లర్లు చేస్తున్న జాప్యంపై చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతినెలా రైస్‌మిల్లర్లతో కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమీక్షిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని రైస్‌మిల్లర్లను ఆదేశిస్తున్నారు. బియ్యం అప్పగించిన మిల్లర్లు మినహా అప్పగించని వారిని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. -
LB Nagar: కారు డోర్ తగిలి రెండేళ్ల పాప మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం రెండేళ్ల పాప జీవితాన్ని బలి తీసుకుంది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో.. కారు డ్రైవర్ రోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్కు తగిలింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు. చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె భర్త గాయాలతో బయటపడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.] కేసు నమోదు ఎల్బీనగర్లో చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద స్థలంలో ఇప్పటికీ రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. -
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం...మహిళా కడుపులో గుడ్డ మర్చిన వైద్యులు
-
విజయవాడ:చంటిబిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేటకు చెందిన ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్కుమార్లు భార్యభర్తలు. వీరికి పాప(8 నెలలు) సంతానం. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా, ప్రణితి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా, పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే.. ప్లాస్టిక్ బకెట్లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది. పాప వేడినీటి బకెట్లో తల కిందులుగా పడి ఉండటంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడినీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, రెండు చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పసిపిల్లలు ఉన్న ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటారు తల్లిదండ్రులు, పెద్దలు. కానీ, ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. అనుక్షణం పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
మృతదేహాలనే మార్చేశారు..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో శనివారం అనూహ్య ఘటన చోటు చే సుకుంది. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ బిడ్డ చనిపోయాడని రోదించే క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది కట్టిన కట్టు విప్పి చూసే సరికి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో ఇరువురు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్పలి్లకి చెందిన రాగుల రమేశ్ (33) శుక్రవారం కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అశాడపు పరమేశ్ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో పరమేశ్ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శనివారం పోలీసుల పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్యులు పో స్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయిలో మృతదేహాలకు క ట్టు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి రోదిస్తున్న క్ర మంలో కట్టు విప్పి చూడగా మృతదేహం తమది కా దని భావించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు ల సహాయంతో మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్చురీ సి బ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరి మృతదేహాలను వారికి అప్పగించారు. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
180 కిలో మీటర్లు.. 5 ఆస్పత్రులు.. సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
సాక్షి, అమ్రాబాద్/పాలమూరు: కాన్పు విషయంలో కుటుంబ సభ్యులు చేసిన జాప్యం, సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. పురిటినొప్పుల తో బాధపడుతూ రెండు పీహెచ్‌సీలు, రెండు ఆస్పత్రుల పరిధిలో 180 కి.మీ. దూరంపాటు ప్రయా ణించినా తల్లీబిడ్డ ప్రాణాలు దక్కలేదు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సోమ వారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరానికి చెందిన స్వర్ణ(23)కు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ ప్రసాద్‌తో వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వర్ణ గర్భం దాల్చడంతో కాన్పు కోసం 2 నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో నొప్పులు రావడంతో ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ కిందిస్థాయి సిబ్బందే ఉండటంతో భయపడిన కుటుంబ సభ్యులు... అమ్రాబాద్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యుడు లేకపోవడంతో అచ్చంపేటకు తీసుకెళ్లారు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడంతో స్వర్ణకు ఫిట్స్ వచ్చాయి. అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేయడంతో అంబులెన్స్‌లో బయల్దేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ప్రాథమికంగా ఇంజక్షన్లు ఇచ్చి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయగా సోమవారం అర్ధరాత్రి 2:30గం. సమయం లో అక్కడికి చేరుకున్నారు. చివరకు సోమవారం అర్ధరాత్రి దాటాక 3:30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రసవించిన కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు మృతి చెందింది. అరగంట తర్వాత బాలింత కూడా మరణించింది. పదర, అమ్రాబాద్ పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండి ప్రసవం చేసుంటే తమ బిడ్డ బతికేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గుండెపోటుతో మృతి చెందింది... స్వర్ణకు బీపీ సమస్య ఉంది. ప్రసవ సమయం కంటే ముందే ఆస్పత్రిలో ఆడ్మిట్ కావాలని స్థానిక వైద్యులు సూచించినా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసి నొప్పులు మొదలయ్యాకే అమ్రాబాద్ తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఆ తర్వాత మహబూబ్‌నగర్‌కు వచ్చేసారికి నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. మేం సాధారణ ప్రసవం చేశాక మరోసారి ఫిట్స్, ఆపై గుండెపోటు రావడంతో స్వర్ణ మృతి చెందింది. – మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ చదవండి: చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా? -
ఎనిమిదేళ్లనాటి ఘటన.. అపోలో వైద్య బృందానికి భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపోలో ఆసుపత్రి వైద్యుల బృందానికి భారీ జరిమానా విధించింది రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ ఘటన ఎనిమిదేళ్ల కిందటి నాటిది కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ హుడా కాలనీలో నివసించే ఎం.ఆర్.ఈశ్వరన్(53) తీవ్ర కడుపునొప్పితో 2012 సెప్టెంబర్ 18న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే డయాబెటిక్ పేషెంట్‌గా ఎనిమిదేళ్లు ఆయన వైద్య సహాయం పొందుతున్నాడు. ఈశ్వరన్‌ను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకొని కొలొనోస్కోపీ టెస్ట్ చేయించాలని సూచించారు. అదే నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ‘కొలొనోస్కోపీ’పరీక్ష కోసం వైద్యులు అపాయింట్మెంట్ ఇవ్వగా, 3 గంటలు ఆలస్యంగా పరీక్షకు తీసుకెళ్లారు. అయితే ఈశ్వరన్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లాడు. 116 రోజులు వెంటిలేటర్‌పై ఉండి 2013 జనవరి 14న చనిపోయాడు. ఆసుపత్రి వైద్యులు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఈశ్వరన్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంతో.. తాజాగా పరిహారం తీర్పు వెల్లడించింది ఫోరం. ఇదీ చదవండి: డబ్బుకోసం చూస్తే.. సుతారీ మేస్త్రీకి గుండె ఆగినంత పనైంది -
లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరు
పాములపాడు: ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా, మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు గ్రామంలో ఉద్యోగం కల్పించింది. ఈ విధానం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి పూనుకున్నాయి. అయితే కొన్నిచోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో సచివాలయ ఉద్యోగుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉదయం 11.30 దాటినా ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడం, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరీక్షించి వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని కోరుతున్నారు. -
ఆడుకున్న తండ్రి భుజాల మీదే శవంగా..
భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన. మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది. బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు. A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp — Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022 ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్‌కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్‌పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్‌స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్‌పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. -
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!)