nephew
-
కాళ్లకు నమస్కరించి.. కాల్చి చంపారు!
ఢిల్లీ: సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. మేనమామను చంపింది ఎవరో తెలుసుకుందామని వెళ్లిన మేనల్లుడిపై సైతం అగంతకులు కాల్పులు జరిపారు. ఈ దర్ఘుటనలో మేనల్లుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు.ఢిల్లీ షహదారాలో నివాసం ఉంటున్న ఆకాష్ శర్మ(44),అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (10) గురువారం రాత్రి 8 గంటల సమయంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి బయట టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడికొచ్చారు. అందులో ఓ వ్యక్తి ఆకాష్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. మరో వ్యక్తిపై అనుమానం రావడంతో ఆకాష్ శర్మ భయపడి ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో ఇంట్లోకి వెళ్లిన ఆకాష్‌ను వెంటాడి మరి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మేనమామ ఆకాష్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి బయట బాంబులు అంటించే ప్రయత్నంలో ఉన్న రిషబ్ శర్మ తొలుత ఇదేమీ పట్టించుకోలేదు. తుపాకి పేలిన శబ్దం రావడంతో అప్పుడు గమనించి పారిపోతున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు మేనల్లుడిపై కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనతో ఉలిక్కి పడ్డ కుటుంసభ్యులు, స్థానికులు గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రి తరలించగా ఆకాశ్, రిషబ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. క్రిష్‌కు చికిత్స కొనసాగుతోంది. Farsh Bazaar double murder cctvA man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024కాగా, ఆశీర్వాదం తీసుకున్న యువకుడు ఆకాష్ శర్మకు డబ్బులు ఇచ్చాడు. ఆడబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన యువకుడు ఆకాష్ శర్మను హతమార్చేలా నిందితుడికి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో హత్యకోసం నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. మైనర్, బాధితుడు ఆకాష్ ,అతని కుటుంబంపై గతంలో కేసులు ఉన్నాయి అని పోలీసులు తెలిపారు. -
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది. సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆకాష్ ఆనంద్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్‌ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్‌ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
ఇద్దరు చిన్నారులును కాపాడేందుకు ..ఆ నలుగురు మహిళలు..!
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను కాపాడటం కోసం ఆ నలుగురు అత్తలు చేసిన పని వింటే షాక్‌కి గురవ్వుతారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తలు ఉన్నారా? అనిపిస్తుంది. చెప్పాలంటే.. కుంటంబ బంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యత తోపాటు, బాధలో ఉంటే మన అనుకునే వాళ్లకు ఎలా అండగా ఉండాలనేది చాటి చెబుతోంది ఈ కథ. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఫిబ్రవరి 20న పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక కేకే, నాలుగేళ్ల చిన్నారి దండన్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదు రోజులు కోమాలో ఉన్నారు. శ్వాసకోశ మంట, అవయవ వైఫల్యంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ చిన్నారుల తల్లి మిన్ ఈ విషయాన్ని తన కుంటుంబు సభ్యులకు తెలియజేసింది . పిలల్లను ప్రాణాలు దక్కాలంటే చర్మం, జుట్టు దానం చేయాలని పేర్కొంది. వెంటనే అందుకు ఆమె నలుగురు ఆడపడుచులు ముందుకు రావడమే గాక చర్మాన్ని, జుట్టుని దానం చేశారు. ఆ ప్రమాదంలో చిన్నారుల చర్మం తీవ్రంగా కాలిపోవడంతో ఆ ప్రదేశంలో ఆ మహిళలు దానం చేసిన చర్మన్ని అతికించి సర్జరీ చేస్తారు వైద్యులు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ..ఈ విషయం గురించి తన ఆడపడుచులకు చెప్పగానే..వారు ముందుకు వచ్చి సాయం చేశారని సంతోషంగా చెప్పింది. ఇక ఆ ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. తన పిల్లల గదిలో ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేయగానే అకస్మాత్తుగా అది విరిగిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది ఆ చిన్నారుల తల్లి మిన్. ఆ మహిళల తోపాటు ఆ చిన్నారుల తల్లి కూడా చర్మాన్ని, జుట్టుని దానం చేసింది. కాగా, ఆ చిన్నారులకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు.ఈ మేరకు ఆ నలుగురు మహిళలు మాట్లాడుతూ.."మేము నలుగురం ఇలా ఒకేసారి గుండు గీయించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. అయినా తమ మేనకోడలు, మేనల్లుడి ప్రాణాలు రక్షించడం కోసం ఏం చేసేందుకైనా తాము సిద్దం అని చెబుతున్నారు." ఆ నలుగురు మహిళలు. ఈ ఐదుగురు మహిళలు ఆస్పత్రి బెడ్‌పై ఆ చిన్నారులను ఒడిలో ఉంచుకుని దిగిన ఫోటోల తోపాటు ఈ విషయం చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వండర్ విమెన్ అని ఒకరూ, ఈ ఏడాది అత్యంత అందమైన ఆంటీలు వీరే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
YS Raja Reddy Engagement: మేనల్లుడి నిశ్చితార్థంలో సీఎం జగన్
-
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఏది అనగానే వెంటనే గుర్తొచ్చేది 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ. అంటే ఇందులో చాలామందికి తెలిసిన పేర్లు నీతా, ఇషా, అనంత్ అండ్ ఆకాష్ అంబానీ మాత్రమే. కానీ వీరి కుటుంబానికి చెందిన మరో బిలినీయర్ 'అర్జున్ కొఠారి' (Arjun Kothari) ఒకరున్నారనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అర్జున్ కొఠారి ఎవరు? ఈయన మొత్తం సంపద ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ సోదరి 'నీనా కొఠారి' కొడుకే ఈ అర్జున్ కొఠారి. అంటే ఈయన స్వయానా ముఖేష్ అంబానీ మేనల్లుడే. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 845 కోట్లు కావడం గమనార్హం. ఇంతపెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ ఈయన గురించి చాలామందికి తెలియకపోవడం కొంత ఆశ్చర్యమనే చెప్పాలి. కొఠారీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న అర్జున్ కొఠారి.. అమెరికాలోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రొటేషన్ ప్రోగ్రామ్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాను కలిగి ఉన్నాడు. ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! వ్యాపార లావేదేవాలను చూసుకోవడానికి ముందు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నార్త్ఈస్టన్ యూనివర్సిటీ (Bachelor of Science at Northeastern University)లో పూర్తి చేసాడు. ఆ తరువాత కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టి గొప్ప వేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్తలైన అంజలి & రాజేన్ మరివాలా కుమార్తె ఆనందిత మరివాలాను వివాహం చేసుకున్నారు. -
రూ.90 వేల కోసం సొంత మామనే హతమార్చి.. ఆ తర్వాత..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రూ.90 వేల అప్పు తీర్చమని అడిగినందుకు సొంత మేనమామనే కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. స్థానికంగా జిల్లాలో వివేక్ శర్మ(45) వ్యాపారిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తన మేనల్లుడు మోహిత్‌కు అప్పుగా రూ.90 వేలను ఇచ్చాడు. డబ్బు చెల్లించమని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో వివేక్ శర్మ నేరుగా మోహిత్ ఇంటికే వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని మోహిత్.. వివేక్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. టీలో మత్తు మందు ఇచ్చి, అపస్మారక స్థితికి వెళ్లాక.. వివేక్ శర్మ దేహాన్ని ముక్కలుగా కోశాడు. ఆనంతరం సంచుల్లో వేసి సమీపంలో ఉన్న ఓ ఆనకట్ట వద్ద పూడ్చి పెట్టాడు. వివేక్ శర్మ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తాను హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. శరీరభాగాలు పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృత దేహాన్ని వెలికితీశారు. శరీర భాగాలలోని చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా అది వివేక్దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతుని శరీర భాగాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఇదీ చదవండి: టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి.. -
ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబయి: అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తేవడం మహారాష్ట్ర రాజకీయంలో పెను సంచలన మార్పు. ఈ కీలక పరిణామంలో రాజకీయ ఉద్దండుడిగా పేరుగాంచిన శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ తన మేథోసంపత్తితో పార్టీ పునర్నిర్మాణం దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో నాసిక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అజిత్ పవార్‌ను ఉద్దేశించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవ్వరినీ నమ్మకూడదని అన్నారు. కొందరిని గుడ్డిగా నమ్మి తప్పు చేశానని శరద్ పవార్ అన్నారు. మళ్లీ అలాంటి తప్పులను పునరావృతం చేయబోనని చెప్పారు. 83 ఏళ్లు వచ్చాయని రిటైర్మెంట్పై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ తిప్పికొట్టారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన వయస్సు ఏంటో తెలుసా? అని సభా వేదికగా ప్రశ్నించారు. (నా టైర్డ్ హు.. నా రిటైర్డ్ హు..) అలసిపోను.. రిటైర్మెంట్ తీసుకోను అనే వాజ్‌పేయీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత కొడుకును కానందునే తనను ఎన్సీపీలో పక్కకుపెట్టారని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. కుటుంబ విషయాలు బయట మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ క్రమంలో పార్టీని పునర్నిర్మించడానికి రాష్టవ్యాప్త పర్యటనకు శరద్ పవార్ తెరతీశారు. తిరుగుబావుటా ఎగురవేసిన తన సన్నిహితుడైన ఛగన్ బుజ్భల్ నియోజకవర్గమైన నాసిక్ జిల్లా యోలా నుంచి శరద్ పవార్ ర్యాలీ ప్రారంభించడం గమనార్హం. ఇదీ చదవండి: ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్ -
'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ఎన్సీపీకి షాక్ ఇచ్చిన శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన శరద్ పవార్.. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. కుటుంబంలో రాజకీయాల గురించి మాట్లాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాట నాయకుడు వై బీ చౌహాన్ స్మారకాన్ని దర్శించడానికి సతారాకు ఈ రోజు ఉదయమే శరద్ పవార్ వెళ్లారు. నిన్న నుంచి ఎవ్వరినీ తాను కలవలేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయ పరమైన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అయితే.. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం కలగదని శరద్ పవార్ చెప్పారు. బెంగళూరులో త్వరలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జులై 16-18 మధ్య ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ మేరకు రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అజిత్ పవార్‌తో పాటు షరద్ పవార్‌కు నమ్మిన బంటు ఛగన్ భుజ్‌భల్, ప్రఫుల్ పటేల్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఏంపీలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఇదీ చదవండి: ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది.. -
బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
గుజరాత్:గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. పిల్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్‌నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి. జీవన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి మృతిచెందారు. జీవన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్‌లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్‌గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్‌లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్‌లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్‌లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్‌కి మొదటి భార్య మైజాబిన్‌తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్‌పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..) -
రవితేజ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరో
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన రవితేజ ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇండస్ట్రీలోకి పరిచయం కానున్నారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు 'ఏయ్‌పిల్లా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ కథ అందిస్తుండగా,లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రుబుల్ షెకావత్ హీరోయిన్గా నటిస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Hi everyone, Here is the first look of my debut film #EyPilla Produced by bujji garu @LNPOfficial Directed by ludheer 🎬 Music by @mickeyjmeyer 🎶🎻 Super excited 🎉🎉🎉 pic.twitter.com/kZlfiv2eQK — maadhav bhupathiraju (@maadhav_9999) August 9, 2022 View this post on Instagram A post shared by MB (@maadhav._.bhupathiraju) -
అమెరికాలో మేనల్లుడితో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీ రామారావు తన బిజీ షెడ్యూల్లోనూ తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనయుడు ఆదిత్యను కలిసి ముచ్చటించారు. తన కుమారుడు ఆదిత్యతో మంత్రి కేటీఆర్ ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పంచుకున్నారు. కేటీఆర్ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన మేనల్లుడు ఆదిత్యను మరిచిపోకుండా కాలేజీకి వెళ్లి కలుసుకున్నారని, అమెరికాలో కేటీఆర్ ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని కవిత పేర్కొన్నారు. కేటీఆర్‌ను కలసిన ఆదిత్య మిట్టల్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ గ్రూప్ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ అల్లుడు కూడా అయిన ఆదిత్య తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి కేటీఆర్‌తో చర్చించారు. ఉక్కు పరిశ్రమ గురించి పలు విషయాలు చర్చకు వచ్చినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
నాలుగేళ్లుగా మేనబావతో ప్రేమ.. పెళ్లికి నిరాకరించడంతో..
సాక్షి, నవీపేట(బోధన్): ప్రేమించిన మేనబావ మోసం చేసిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని మండల కేంద్రానికి చెందిన యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్‌కు చెందిన మేనబావ ప్రేమ్‌ను నాలుగేళ్లుగా ప్రేమించానని, పెళ్లికి నిరాకరించడంతో న్యాయం చేయాలని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారు స్పందించక పోవడంతో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగడంతో సిబ్బంది గుర్తించి చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. మేనబావ మోసం చేశాడని ఫిర్యాదు రావడంతో పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పడంతో సమయం ఇచ్చినట్లు తెలిపారు. ఆలోగా ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో ప్రేమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చందర్, లోకేష్, పప్పిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోధన్‌లో... మండలంలోని స్షేషన్ ఏరియాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని బుధవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పక్కింటి వాళ్లు గమనించి కాపాడారని పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు
కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్‌పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్‌లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు. చదవండి: మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు Northern's Mohammad Huraira who scored his maiden triple-century in the Quaid-e-Azam Trophy 2021-22 final-round clash against Balochistan talks about his heroic effort. #QeAT #HarHaalMainCricket pic.twitter.com/dz7n3MkZN7 — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 MONUMENTAL EFFORT! 19-year-old Mohammad Huraira becomes the second youngest Pakistan batter to score a first-class triple century! 👏👏#HarHaalMainCricket pic.twitter.com/QtYRKDRCKT — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 -
Sarath Babu: శరత్‌బాబు నట వారసుడు హీరోగా ఎంట్రీ
Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ. చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్‌బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు
జైపూర్: జోధ్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే దంపతులు పోలీస్‌స్టేషన్‌లో ధర్నాకు దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన తన మేనల్లుడిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోధ్‌పూర్‌లో గత ఆదివారం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్థానిక ఎమ్మెల్యే మీనాకున్వార్ మేనల్లుడు అధిక మోతాదులో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మీనా కున్వార్, తన భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నేలపై కూర్చోని నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘పిల్లలు కొన్ని సందర్భాల్లో తాగుతారు.. అది పెద్ద విషయంకాదన్నారు.. ’తమ మేనల్లుడిని విడిచిపెట్టాలని కోరారు. ఒక ఎమ్మెల్యేకు సరైన గౌరవం ఇవ్వడం లేదని స్టేషన్ అధికారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో మానవత్వంతో మాట్లాడాలని సదరు పోలీసు అధికారి కోరారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో.. ఇప్పటికే కొంత మంది అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన విషయం గుర్తుంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, చివరకు డీసీపీ అధికారి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్ -
మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే..
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం): మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలికొంది. సొంత మేనమామను హత్య చేసేలా మేనల్లుడిని ఉసిగొల్పింది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న తగాదా ప్రాణం తీసేస్థాయికి చేరింది. కర్రతో కొట్టి ఆపై పంట పొలంలోకి ఈడ్చుకువెళ్లి తలను బురదలోకి తొక్కేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరఘట్టం మండలంలోని సీఎస్పీ రహదారిలో చిట్టపులివలస జంక్షన్–విక్రమపురం గ్రామాల మధ్య పొలాల్లో ఈ నెల 23న దొరికిన గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం వెనుక మిస్టరీ వీడింది. బుధవారం పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం కేసు వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం ల చ్చయ్యపేట గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ బత్తు ల పోలినాయుడు(38), వీరఘట్టం మండలం విక్ర మపురం గ్రామానికి చెందిన అతని మేనల్లుడు(మైనర్) రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద బంధు వుల ఇంటిలో జరిగిన పెళ్లికి ఈ నెల 22న వెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి బయల్దేరి వీరఘట్టంలో దిగి మందు తాగారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నడుచుకుంటూ విక్రమపురం గ్రామానికి బయల్దేరారు. దారిలో ఇద్దరి మధ్య జరిగిన చి న్న గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో మేన ల్లుడు అతడి మామ పోలినాయుడును కర్రతో బ లంగా కొట్టి, ఆపై పక్కనే ఉన్న పంట పొలంలో తలను తొక్కేయడంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ హత్య జరిగింద ని, వీరిద్దరి మధ్య పాత కక్షలు లాంటివి ఏవీ లేవని పేర్కొన్నారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నామని, విశాఖపట్నం బాల నేరస్తుల కేంద్రానికి అప్ప గిస్తామని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ] చదవండి: Work From Home: తెగ నవ్వులు తెప్పిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఫొటో -
పిల్లల్ని చంపి, సూట్‌కేస్‌లో కుక్కి, కారు డిక్కీలో ఏడాది పాటు
వాషింగ్టన్: ఓ మహిళ ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపి, మృతదేహాలను సూట్‌కేస్‌లో కుక్కి కారు డిక్కీలో పెట్టుకొని కొన్ని నెలలపాటు చక్కర్లు కొట్టిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గతేడాది మేలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. బాల్టిమోర్‌లోని ఈస్ట్ కోస్ట్ నగరానికి చెందిన నికోల్ జాన్సన్ అనే మహిళ కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్‌ను పోలీసులు వివరాలు అడుగుతుంటే.. ‘’మీరేం చేసిన నేను పట్టించుకోను..ఎందుకంటే మరో ఐదు రోజుల్లో నేను మీడియాకు సంచలనంగా మారబోతున్నాను అని చెప్పింది. మహిళ మాటలపై అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో జాన్సన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను విచారించగా.. అ మృతదేహాలు తన బంధువు పిల్లలవని చెప్పింది. ఏడేండ్ల మేనకోడలు, అయిదేళ్ల మేనల్లుడిని 2019లో అక్క తనకు అప్పగించిందని పేర్కొంది. మేనకోడలు తలను అనేకమార్లు నేలకేసి కొడితే తన చనిపోయిందని, డెడ్‌బాడీని కారులో దాచానని చెప్పింది. అనంతరం బాబును కూడా చంపానని వివరించింది. అయితే, పిల్లలను ఎందుకు చంపిందని కానీ మిగతా వివరాలు కానీ పోలీసులకు వెల్లడించలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
రూ.120 బిల్లు కోసం.. మామ హత్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి రూ.120 చెల్లించమన్నందుకు తన మేనమామను హత్య చేశాడు. ఈ ఘటన గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు సమీపంలో చేపల వేపుడును అమ్మేవాడు.అయితే ఆదివారం రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను కొని, బిల్లు చెల్లించలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే కల్లు అనే వ్యక్తి కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇక మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్ రూంలో మేనల్లుడు మృతి
గురుగ్రామ్: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఐసీయూలో ఐస్ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు. రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్ రూంలో సామువేల్ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్, రోసిల మృతిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్ చనిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్ తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు.