New Logo
-
తెలంగాణ రాజముద్రపై వివాదం.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా నడుస్తోంది.కాగా కొత్త చిహ్నానికి దాదాపు 200పైగా ప్రపోజల్స్ రాగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలుత జూన్ 2న రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ గేయం మాత్రమే విడుదల చేయనున్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇప్పటివరకు లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక దాదాపు ఖరారైనట్లు, ఇదే ఫైనల్ లోగో అంటూ పలు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాంగ్రెస్ పతాకంలోని రంగులకు చోటు లభించినట్లు తెలుస్తున్నది. -
శరద్ పవార్ పార్టీ గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ఫిక్స్
'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ చిహ్నంగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా'ను ఉపయోగించడానికి సుప్రీంకోర్టు మార్చి 19న అనుమతించింది. ఈ గుర్తును శరద్ పవార్ వర్గానికి రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని ఆదేశించిన సుప్రీంకోర్టు, అది ఏ ఇతర పార్టీ లేదా అభ్యర్థికి గుర్తును కేటాయించకూడదని పేర్కొంది. శరద్ పవార్ స్థాపించిన NCP గత ఏడాది జూలైలో అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. పార్టీ విడిపోయిన తరువాత కూడా లోగో, పేర్లను వాడుతున్నారని శరద్ పవార్ వర్గం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు వారికి కొత్త గుర్తును కేటాయించడం వల్ల.. అజిత్ పవార్ గ్రూపును నిజమైన NCPగా ఎలక్షన్ కమీషన్ పేర్కొంది. కాబట్టి పార్టీ గుర్తును వారికే కేటాయించింది. -
కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా?
ముంబై విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో టాటా యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త బోయింగ్ బి737-8 విమానాన్ని 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్'గా ఆవిష్కరించారు. బోయింగ్ 737 మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ పొందుతుంది. ఈ రిఫ్రెష్ బ్రాండింగ్‌ను చైర్ పర్సన్ 'అలోకే సింగ్' (Aloke Singh), సీఈఓ 'కాంప్‌బెల్ విల్సన్' (Campbell Wilson) ఆవిష్కరించారు. ఇది కేవలం డిజైన్ మాత్రమే కాదని తామెవరో, విజన్ ఏంటో.. ఈ మార్పులలో చెప్పదలచుకున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుందన్నారు. రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, లోగోలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు. Dear Guests, Fasten your seatbelts for the moment we've all been waiting for. We're thrilled to unveil the new X factor in Indian aviation - the new livery of Air India Express. #FlyAsYouAre #TailsOfIndia pic.twitter.com/Vif5GDQJlH — Air India Express (@AirIndiaX) October 18, 2023 -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్‌లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్‌లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్‌ను వివరించే స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్‌పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
ట్విటర్ కొత్త లోగో తొలగింపు - షాక్‌లో ఎలాన్ మస్క్.. కారణం ఇదే
Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ట్విటర్‌ను 'ఎక్స్'గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఏర్పాటు చేశారు. అయితే దీనిని శాన్ఫ్రాన్సిస్కో అధికారులు తొలగించి సీఈఓకి పెద్ద షాక్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం మీద ఏర్పాటు చేసిన ఎక్స్ (X) లోగో నుంచి వచ్చే లైట్ల కాంతి రాత్రి సమయంలో తమ ఇళ్లలో పడుతుందని, ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుందని 24 మంది స్థానికులు అక్కడి అధికారులకు పిర్యాదు చేశారని, ఈ కారణంగా లోగో తొలగించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! అనుమతి లేకుండా లోగో ఏర్పాటు చేయడమే కాకుండా, దాని వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సంస్థ ముందుగా లోగో మార్చాలనుకుంటే డిజైన్, భద్రత వంటి వాటి కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ లోగో రుపాటు చేసిందని ఆరోపణ. దీనితో పాటు స్థానికులు పిర్యాదు కూడా తోడవడంతో లోగో తొలగించారు. -
నా లోగో నా ఇష్టం
‘నా లోగో నా ఇష్టం’ అని ఎలాన్ మస్క్ అనుకున్నా సరే, నెటిజనులు మాత్రం రకరకాల మీమ్స్‌తో ట్విట్టర్ కొత్త లోగోను ఆటపట్టిస్తున్నారు. ‘అడల్ట్ ఫిల్మ్ సైట్ లోగోలా ఉంది’ ‘ట్విట్టర్ ఎక్స్–లవర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పేలా ఉంది ఈ లోగో’... ఇలాంటి కామెంట్స్ సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సందడి చేస్తున్నాయి. ప్రాంతీయ భాష చిత్రాల నుంచి హాలీవుడ్ సినిమాలలోని సీన్ల వరకు ఈ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఒక సృజనకారుడు పాత ట్విట్టర్ లోగో పిట్ట, కొత్త లోగో ‘ఎక్స్’ను మిక్స్ చేసి సరికొత్త లోగోను సృష్టించాడు. ఈ లోగోను మస్క్‌గానీ చూశాడంటే పుసుక్కున ‘ఇదే నా కొత్త లోగో’ అని ఎనౌన్స్ చేయడం ఖాయం! రైలు చివరి బోగీపై పెద్ద సైజులో ‘ఎక్స్’ అనే గుర్తు ఉంటుందనేది తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకాయన రైల్వే డిపార్ట్మెంట్కు ఇలా విన్నవించుకున్నాడు... ‘మీ గుర్తును వాళ్లు లాగేసుకున్నారు. కాబట్టి బోగీ చివర ‘ఎక్స్’ స్థానంలో ట్విట్టర్ పాత లోగో పిట్ట ఉండాల్సిందిగా నా విజ్ఞప్తి’. -
ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్
Twitter "X": టాప్ బిలియనీర్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఉన్నట్టుండి ట్విటర్ లోగోను పిట్టను కాస్తా "X" పేరతో రీబ్రాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ట్విటర్ లోగో మారిన నేపథ్యంలో తమ భవనం నుంచి పాత లోగోను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ట్విటర్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో 1355 మార్కెట్ స్ట్రీట్, కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు క్రేన్ సాయంతో ట్విటర్ కొత్త లోగో రీప్లేస్ చేస్తున్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు జోక్యం చేసుకుని, లోగో మారిన విషయాన్ని గమనించక, ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..! ఈ సందర్బంగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలగింపు ప్రక్రియలో ఉపయోగించిన క్రేన్‌కు మస్క్ అనుమతిని పొందలేదని, ఇది పోలీసుల ప్రతిస్పందనను ప్రేరేపించిందని ట్వీట్ చేశారు. కానీ అసలు విషయం తెలిసిన పోలీసులు నాలిక్కరుచుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన తరువాత, వారు ఎటువంటి నేరం చేయలేదని , సంఘటన తమ పరిధిలో లేదని ప్రకటించారు. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కాగా ఐకానిక్ లోగోను కాదని, మస్క్ తన వ్యక్తిగత ప్రాధాన్యతకు అనుకూలంగా బ్రాండ్ పేరును మార్చిన సంగతి తెలిసిందే. దీంతో మస్క్ సంపద 4- 20 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయిందని విశ్లేషకులు, బ్రాండ్ ఏజెన్సీల అంచనా. Welp, @twitter name so coming off the building right now but @elonmusk didn’t get permit for the equipment on the street so @SFPD is shutting it down. pic.twitter.com/CFpggWwhhf — Wayne Sutton (@waynesutton) July 24, 2023 Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO — Elon Musk (@elonmusk) July 24, 2023 -
పిట్ట పోయి ‘ఎక్స్’ వచ్చె.. మారిపోయిన ట్విటర్ లోగో
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విటర్లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ట్విటర్ లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది. ట్విటర్ లోగో మార్పుతోపాటు ఇతర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాజాగా ట్విటర్ హోమ్‌పేజీకి దారితీసే కొత్త లింక్‌ను ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. 'X.com ఇప్పుడు twitter.com కి తీసుకెళ్తుంది. కొత్త ఎక్స్ లోగో ఈరోజు (జులై 24) అమల్లోకి వస్తుంది' అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ తన ట్విటర్ బయోలో కొత్త లింక్‌ను కూడా షేర్ చేశారు. మస్క్ ప్రకటన తర్వాత ట్విటర్ సీఈఓ లిండా యాకారినో కూడా తన మొదటి స్పందనను పంచుకున్నారు. ఎక్స్ అనేది భవిష్యత్‌లో యూజర్లకు ఆడియో, వీడియో, మెసేజింగ్, చెల్లింపులు, బ్యాంకింగ్ వంటి అపరిమిత సేవలు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఆధారితమైన ‘ఎక్స్’ ఊహించని రీతిలో అందరినీ కలుపుతుందని వివరించారు. ఇదీ చదవండి ➤ Twitter Advertising Loss: పాపం ట్విటర్! సగానికి సగం పడిపోయింది.. ట్విటర్‌ను ఇప్పటికే X.corp అనే పేరుతో రిజస్టర్ చేసినట్లు గత మే నెలలో ట్విటర్ వెల్లడించింది. ట్విటర్‌ను చైనాకు చెందిన వుయ్‌చాట్ మాదిరిగా పేమెంట్లు, మెసేజింగ్, జాబ్ సెర్చ్ తదితర ఫీచర్లతో సూపర్ యాప్‌గా మార్చాలన్న ఎలాన్ మస్క్ ఆలోచనకు అనుగుణంగా మార్పులు చకాచకా జరిగిపోతూ వచ్చాయి. Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO — Elon Musk (@elonmusk) July 24, 2023 -
మీషో బ్రాండ్ కొత్త లోగో ఇదే - ఓ లుక్కేసుకోండి!
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ వాటాలు కలిగిన ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో నూతన బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేసింది. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, మీషో ప్లాట్‌ఫామ్‌ను సమాజంలోని భిన్న వర్గాలు పెద్ద ఎత్తున ఆమోదించేందుకు వీలుగా నూతన లోగోని రూపొందించినట్టు ప్రకటించింది. నూతన లోగోతో బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ప్రజలు మీషోను నేడు, రేపు ఏ విధంగా గుర్తిస్తారనే దానికి బ్రాండ్ ఐడెంటిటీ కీలకమన్నారు. ‘‘దేశంలో ఈ కామర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించేందుకు అపార అవకాశాలున్నా యి. షాపర్లు అందరికీ చేరువ చేయడం ద్వారా తదుపరి దశ వృద్ధిని చూడొచ్చు. పునరుద్ధరించిన బ్రాండ్‌తో మీషో తదుపరి బిలియన్ కస్ట మర్లకు చేరువ అవుతుంది’’అని ఆత్రే తెలిపారు. -
రైట్ కాదు.. ఫ్లైట్! లోగో మార్చిన యస్ బ్యాంక్
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిపుణ్ కౌశల్ తెలిపారు. జూన్ 20 నుంచి ప్రారంభించే ప్రచార కార్యక్రమాలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తమ రిటైల్ కార్యకలాపాలు కీలక స్థాయికి చేరుకున్నాయని, ఇక నుంచి లాభదాయకత పెరగగలదని చెప్పారు. యస్ బ్యాంక్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కౌశల్ ఈ విషయాలు తెలిపారు. స్వల్ప మార్పులతో యస్ బ్యాంక్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. బ్యాంక్ ప్రస్తుత ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ టిక్ స్థానంలో పైకెగిరే పక్షిని తలపించేలా మార్పులు చేశారు. ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర -
సహకార రంగంలో పత్రిక సాహసోపేతం
విజయవాడ, మే 29: సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సహకార వ్యవస్థకు సహకారభూమి పక్షపత్రిక నూతన జవసత్వాలు అందించాలని సి. రాఘవాచారి మీడియా కమిషన్ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సూచించారు. సహకార రంగంలోని సానుకూల అంశాలతో పాటు లోటుపాట్లను కూడా సహకారభూమి పత్రిక అందించాలని చెప్పారు. విజయవాడ శ్యామ్ నగర్ ఎన్జీవో కాలనీలోని సహకారభూమి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన సహకారభూమి లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభకు సహకారభూమి వ్యవస్థాపక అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కొమ్మినేని మాట్లాడుతూ.. సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. సహకార రంగంలో పత్రిక తీసుకురావడం ఒక సాహసోపేతమైన చర్య అనీ, దీనిని జయప్రదం చేసేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. మరో ముఖ్య అతిథి, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనాథ్ రెడ్డి సహకారభూమి కార్యాలయం ముందు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సభలో ఆయన మాట్లాడుతూ.. సహకారమంటే అపకారం కాదని, సహకార రంగంపై ఉన్న ఈ అపవాదును పోగొట్టేలా సహకార వ్యవస్థను తీర్చిదిద్దాలని హితవు పలికారు. పరస్పర సహకారంతోనే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సహకార రంగ ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ త్వరలో విడుదల కానున్న సహకారభూమి పత్రిక చిరకాలం సేవలు అందించాలని అభినందనలు తెలిపారు. తప్పులు చేయడం మానవ సహజమని, వాటిని తగ్గించేందుకు జరిగే ప్రయత్నం హర్షణీయమన్నారు. తమ సిబ్బందికి ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని పంపించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. సహకారభూమి పక్షపత్రికకు తాము అన్నివిధాలా సహకరిస్తామని, అన్ని ప్రాథమిక సహకార సంఘాలకు ఈ పత్రిక చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. తమ ఆప్కాబ్ సిబ్బందికి సహకారభూమి పత్రిక మార్గదర్శకత్వం వహించేలా ఉండాలని, సహకారం అంటే స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సహకార రంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఈ పత్రిక ఉపయోగపడాలని కోరారు. ఇప్పుడు ఉన్న సిబ్బందికి సమగ్ర సమాచారం అందడం లేదని, ఏ జీవోలో ఏముందో తెలియడం లేదన్నారు. ఈ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఈ లోటును ఈ పత్రిక భర్తీ చేయాలని ఆకాంక్షించారు. కొన్ని లక్షల మంది ఉన్నా సహకార వ్యవస్థకు సమగ్ర సమాచారం అందించే పేపరు, పత్రిక లేకపోవడం పెద్దలోటేనని, ఈ లోటును సహకారభూమి తీర్చాలని ఆకాంక్షించారు. సహకారభూమి పత్రికు తాము అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సహకార ధర్మపీఠం సంపాదకులు, సహకార రంగ నిపుణుడు భూమయ్య సహకారం రంగ పితామహుడు రామదాసు పంతులు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సభలో భూమయ్య మాట్లాడుతూ.. సహకార చట్టాల మార్పు తీరుతెన్నులను, వస్తున్న మార్పులను వివరించారు. సహకార వ్యవస్థకు కొత్త విధానాలు నిబంధనలు తీసుకొస్తామని చెపుతూ ఇప్పుడున్న చట్టాలను నిర్వీర్యం చేసే పరిస్థితి రానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సహకారభూమి లాంటి పత్రికలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకారభూమి వ్యవస్థాపకులు దాసరి కేశవులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ ఎల్లారావు, సహకారభూమి పత్రిక సంపాదకులు అక్బర్ పాషా, సహకార రంగ ప్రముఖులు సాంబిరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు కేవి కృష్ణ, కేఎస్ జ్యోతి శ్రీ, సిహెచ్ త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు. సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యదర్శి రత్నప్రసాద్ వందన సమర్పణ చేశారు. -
సెబీ కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది. గణాంకాలు, టెక్నాలజీ, కన్సల్టేషన్, పార్టనర్షిప్ తదితరాల వినియోగం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో అత్యుత్తమ నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థకుగల అత్యుత్తమ సంప్రదాయాలు, డేటా, టెక్నాలజీ ఆధారిత కార్యాచరణ, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ, ఇన్వెస్టర్ల పరిరక్షణ కొత్త లోగోలో ప్రతిఫలిస్తున్నట్లు చైర్‌పర్శన్ మాధవి పురీ బచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెబీ 1988 ఏప్రిల్‌లో ఏర్పాటైంది. పరిశ్రమతో చర్చలు, భాగస్వామ్యం తదితరాలను చేపడుతూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
మళ్ళీ మారిన ట్విటర్ లోగో.. ఎలాన్ మస్క్ ప్లానా? లేక అజ్ఞాత వ్యక్తి కోరికా?
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విటర్ సీఈఓ 'ఎలాన్ మస్క్' గత సోమవారం ట్విటర్ లోగో బ్లూ బర్డ్ స్థానంలో క్రిప్టో కాయిన్ 'డోజ్ కాయిన్' మార్చిన విషయం అందరికి తెలిసిందే. ట్విటర్ లోగో స్థానాన్ని కైవసం చేసుకున్న డోజ్ కాయిన్ ధర ఒక్క రోజులోనే ఏకంగా 30 శాతం పెరిగిపోయింది. అయితే మళ్ళీ డోజ్ కాయిన్ లోగో స్థానంలో 'బ్లూ బర్డ్'ని చేర్చారు. దీనితో డోజ్ కాయిన్ ధర 9 శాతం క్షిణించింది. ఎలాన్ మస్క్ చాలా కాలంగా డోజ్ కాయిన్‌కు మద్దతుదారుగా ఉన్నారు, ఇందులో భాగంగానే చాలా సందర్భాల్లో బహిరంగంగా మద్దతు కూడా అందించారు. 2013లో మస్క్ సరదాగా డోజ్ కాయిన్ సృష్టించడంతో పాటు ఈ కాయిన్ టెస్లా ఇంక్ లో చెల్లింపులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ పునరుద్ధరణపై అప్పట్లో బ్లూమ్ బర్గ్ అడిగిన ప్రశ్నకు ట్విటర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ట్విటర్ లోగోను మార్చిన తరువాత డోజ్ కాయిన్ గరిష్టంగా పెరిగినప్పటికీ, మళ్ళీ పడిపోయింది. ప్రస్తుతం 13.7 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో డోజ్ కాయిన్ ఏడవ అతి పెద్ద క్రిప్టోకరెన్సీగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ లోగోను డోజ్ కాయిన్ గా మార్చడానికి ముందు దీని మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉండేది. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేయడానికి ముందు ఒక వ్యక్తి బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ కాయిన్ మార్చాల్సిందిగా కోరాడు. అయితే అతని కోరిక మేరకు ఇప్పడూ లోగో మార్చినట్లు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ట్వీట్ చేశారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి కోరికను మస్క్ ఇంత సీరియస్ గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత...
పెప్సీ.. పరిచయం అక్కరలేని కూల్‌డ్రింక్ బ్రాండ్. త్వరలో 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీల ఆవిష్కరించింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోంది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచమంతటా ఈ లోగో అమల్లోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగోను 2008లో రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ. పెప్సీ కొత్త లోగోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నల్లటి వృత్తం మధ్యలో పెద్దగా ‘PEPSI’ అనే అక్షరాలు, దాని చుట్టూ ఎరుపు, తెలుపు, నీలం చారలతో రూపొందించారు. కంపెనీ లోగోకు గొప్ప శక్తి, విశ్వాసం, ధైర్యాన్ని అందించడానికి రీడిజైన్ చేసినట్లు పెప్సికో చీఫ్ డిజైన్ ఆఫీసర్ మౌరో పోర్సిని తెలిపారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు పెప్సికో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో మొదటగా ఎలక్ట్రిక్ బ్లూ, బ్లాక్ క్యాన్లపై పెప్సీ కొత్తలోగోను వినియోగిస్తారు. దీంతోనే అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తారు. తర్వాత 2024లో ప్రపంచమంతటా కొత్త లోగోను పరిచయం చేస్తారు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ -
నోకియా కొత్త లోగో చూశారా? నెటిజన్ల రియాక్షన్స్ మాత్రం..!
సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా నోకియా (NOKIA) లోగో మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ లోగోతోపాటు బిజినెస్ వ్యూహాన్ని కూడా మార్చుతుండటం గమనార్హం. తద్వారా తన బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించాలని భావిస్తోంది. కొత్త లోగోతో కొత్త శకనాకి నాంది పలకాలని భావిస్తోంది. సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ తన ప్లాన్లను ప్రకటించారు. నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై నోకియా కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదు బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు. బిజినెస్-టు-బిజినెస్ ఇన్నోవేషన్లీడర్గా ఎదగనుందని తెలిపారు. దీని ప్రకారం నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్లతో NOKIA అనే పదాన్ని రూపొందించింది. (నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!) మరోవైపు నోకియా కొత్తలోగోపై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లోగోను బాగా ఇష్టపడుతోంటే, మరింకొందరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. పాతదే బావుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కనెక్టింగ్ పీపుల్ అంటూ విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్ లోగోను మార్చడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇటీవల రైట్ రిపేర్ లో భాగంగా కస్టమర్లు సొంతంగా రిపేర్ చేసుకునే జీ22ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. If you are eliminating vertical components from logo , then remove ‘I’ also. #Nokia pic.twitter.com/WclL5o0GZ6 — Anupam Biswas (@flyanupam) February 27, 2023 The new Nokia logo is mathematically correct. pic.twitter.com/uKu5O0kry8 — Arto Vartiainen (@artovartiainen) February 26, 2023 So disturbing #NokiaLogo #NokiaNewLogo The old one looked elegant and gorgeous. pic.twitter.com/ZYR6Ci3pU2 — Bernard D'sa (@bernarddsa) February 27, 2023 -
హెచ్‌సీఎల్ టెక్ కొత్త లోగో
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన లోగోను, బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్’ అంటూ లోగో పక్కన క్యాప్షన్‌ను పెట్టింది. లోగోలో రాకెట్ సింబల్‌ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో!
రష్యాలో మార్చిలో మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. అయితే, ‘కుస్నో ఈ టొచ్కా (రుచికరమైన సమయం)’ అనే కొత్త పేరుతో, సరికొత్త లోగోతో! రష్యా కుబేరుడు అలెగ్జాండర్ గొవోర్ దాన్ని కొనుగోలు చేశారు. ఆదివారం నుంచి మాస్కో సహా పలుచోట్ల ఔట్లెట్లు తెరుచుకున్నాయి. దాంతో వాటిలోకి జనం విరగబడ్డారు. మూతబడ్డ 800పై చిలుకు ఔట్లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది. -
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!
ప్రముఖ మల్టీనేషనల్ బెవెరేజస్ కంపెనీ కోకాకోలా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్లోబల్ బ్రాండ్ ఫిలాసఫీ, ప్లాట్‌ఫాంను కోకాకోలా ఆవిష్కరించింది. కౌగిలింతలాగా చుట్టి ఉన్న కోకాకోలా పేరు రియల్ మ్యాజిక్ అనే ట్యాగ్‌తో కొత్త లోగోను లాంచ్ చేసింది. ఈ కొత్త లోగో కాన్సెప్ట్‌ను వీడెన్+కెన్నెడీ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇన్విజిబుల్ బాటిల్ లో బెవెరేజస్ డ్రింక్‌ను కోకాకోలా అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను కోకాకోలా రిలీజ్ చేసింది. కోకాకోలా బ్రాండ్ చరిత్రలో అత్యంత విభిన్న దృశ్య ప్రాతినిధ్యమని కోకాకోలా కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, రఫా అబ్రూ అన్నారు. చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు కోకాకోలాకు అదొక చీకటి రోజు...! 2021 జూన్ 18 నెలలో యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. రొనాల్డో ప్రెస్మీట్లో.. వాటర్ బాటిల్ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్ చేయగా అప్పట్లో ఈ వీడియో తెగ సంచలనమైంది. కోకాకోలాకు చీకటి రోజైంది. రొనాల్డో కామెంట్ ఎఫెక్ట్ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లింది. కోకాకోలా లోగో ఏం చెప్తుదంటే...! కోకాకోలా లోగోలో రెడ్ కలర్.. అభిరుచి, బలం,లవ్‌ను సూచిస్తుంది. వైట్ కలర్...అమాయకత్వం, యువత, శాంతి, స్వచ్ఛత, వినయాలను సూచిస్తోంది. చదవండి: RRR Actress Invests: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! -
‘సువర్ణభూమి’ కొత్త లోగోను ఆవిష్కరించిన రాంచరణ్
రాయదుర్గం: ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతన లోగోను ఆవిష్కరించింది. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో కొత్త లోగో, యాడ్ ఫిల్మ్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం సినీ హీరో రాంచరణ్ ఆవిష్కరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను, వినియోగదారుల మన్ననలను పొందుతున్న సంస్థగా సువర్ణభూమి నిలుస్తోందని రాంచరణ్ ప్రశంసించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సువర్ణభూమి సంస్థతో పనిచేయడం, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం సంతోషం కలిగిస్తోందన్నారు. అందుబాటు ధరలలో అపార్ట్మెంట్లు, విల్లాలను వినియోగదారులకు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న సువర్ణభూమి సంస్థను అభినందించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక సకల సౌకర్యాలతోపాటు సరసమైన ధరలకు ఫ్లాట్స్, విల్లాలతో పాటు స్థలాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. -
ఎస్యువి కార్ల కోసం మహీంద్రా సరికొత్త లోగో
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సోమవారం(ఆగస్టు 9) ఇండియా ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో తన అన్ని ఎస్యువి కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరించింది. రాబోయే మహీంద్రా ఎక్స్యువి 700 కారు ఈ లోగోతో రానున్న మొట్ట మొదటి ఎస్యువి అవుతుంది. దేశంలో తన ఎస్యువిల కోసం తీసుకొస్తున్న లోగోను చూస్తే 'ఎక్స్ ప్లోర్ ది ఇంపాజిబుల్' అనే బ్రాండ్ స్టేట్ మెంట్ ను అండర్ లైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోగో కొత్త సవాళ్లను స్వీకరించే ఆశయం & సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. "ఇది కొత్త లోగో మాత్రమే కాదు, మహీంద్రాలో పునరుజ్జీవం పొందిన స్ఫూర్తికి ప్రాతినిధ్యం" అని ఎంఅండ్ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ వీజయ్ నక్రా అన్నారు. లాంఛ్ చేయడానికి సిద్దంగా ఉన్న ఎక్స్యువి 700పై ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది. త్వరలో రాబోయే ఎక్స్యువి 700 మీద సరికొత్త లోగో డిజైన్ ఉంటుంది. "లోగో మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చు, మీరు కోరుకున్నప్పుడు పూర్తి భద్రతతో సరికొత్త ప్రపంచానికి వెళ్లడం" అని ఎంఅండ్ఎం లిమిటెడ్ లో ఇవిపీ, చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ అన్నారు. -
కొత్త పేరుతో త్వరలో పబ్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాపులర్ గేమ్ పబ్జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్‌కే పరిమితం కానుందని దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ వెల్లడించింది. చైనా యాప్స్‌కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్ అన్నోన్స్ బాటిల్‌గ్రౌండ్స్ (పబ్జీ) మొబైల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్ భారత్‌లో పబ్జీని ఆఫర్ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్ అధికారం టెన్సెట్ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్‌ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. భారత్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ కోసం ప్రత్యేక గేమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్‌లో పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్‌లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్లోడ్స్ దేశంలో 17.5 కోట్లకుపైమాటే. -
వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్ వీఐ
మొబైల్ సేవల దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా పావులు కదిపింది. వీఐ పేరుతో కొత్త వైర్లెస్ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్ సేవలలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్ ప్రకటించడం గమనార్హం! ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారాంతాన వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 25,000 కోట్ల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విభిన్న మార్గాలలో దశలవారీగా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించింది. కంపెనీ సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. భారీ స్పెక్ట్రమ్ వొడాఫోన్ ఐడియా.. భారీగా 1846 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 4జీ సర్వీసులను అందించడం ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. గత రెండేళ్లుగా వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను విడిగా నిర్వహిస్తూ వచ్చింది. ఇటీవల కస్టమర్లను కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో యూనిఫైడ్ బ్రాండుగా వీఐను తీసుకువచ్చింది. తద్వారా మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోగలమని కంపెనీ ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఐడియా బ్రాండుకు పట్టుంటే.. పట్టణాలలో వొడాఫోన్ అధికంగా విస్తరించింది. రెండు కంపెనీల విలీన సమయంలో 40.8 కోట్లుగా ఉన్న కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చి తాజాగా 28 కోట్లకు చేరింది. షేరు జూమ్ కొత్త యూనిఫైడ్ బ్రాండుతోపాటు.. లోగో ఆవిష్కరణ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్‌కు నేటి ట్రేడింగ్‌లో ఉదయం నుంచీ డిమాండ్ కనిపిస్తోంది. తొలుత ఒక దశలో ఈ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 13.25ను తాకింది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 12.7 వద్ద ట్రేడవుతోంది. -
గూగుల్ మ్యాప్స్ కొత్త అప్డేట్స్
-
గూగుల్ మ్యాప్స్ పుట్టిన రోజు : కొత్త అప్డేట్స్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన యాప్‌లలో ప్రధాన యాప్ గూగుల్ మ్యాప్‌ను కొత్త లోగో, కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. గూగుల్ మ్యాప్ 15 వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నుంచి ఈ కీలక మార్పులు చేసింది. గూగుల్ మ్యాప్స్ 15 ఏళ్లు మైలురాయిని అధిగమించిన సందర్భంగా కలర్‌ఫుల్ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూజర్ల సౌలభ్యం కోసం తాజాగా అయిదు కొత్త సదుపాయాలను పరిచయం చేసింది. యాప్ అడుగుభాగంలో ఎక్స్ప్లోర్, కమ్యూట్, సేవ్డ్, కంట్రిబ్యూట్, అప్డేట్స్ (అన్వేషించండి, ప్రయాణించండి, సేవ్ చేయండి, సహకరించండి, నవీకరణ) అనే ఐదు ట్యాబ్స్ ను కొత్తగా జోడించింది. దీంతో ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ లో అంతర్గతంగా ఉన్న సదుపాయాలన్నీ ఈ ఐదు ట్యాబ్స్‌లో ఇక మీదట సులభంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అన్వేషించండి: సమీప రెస్టారెంట్లు, ముఖ్య ప్రదేశాలు, సమీక్షలు , అలాగే సమీక్షలను వ్రాయడానికి, ఫోటోలను అప్లోడ్ చేయడానికి, ఇతర సిఫార్సులను అనుమతినిస్తుంది. కమ్యూట్ : ఒక ప్రదేశానికి దిశలను ఇస్తుంది, ప్రయాణ సమయ అంచనాలు, ట్రాఫిక్ హెచ్చరికలను అందిస్తుంది ఎప్పటిలాగానే. సేవ్డ్ : సులభంగా సెర్చ్ చేసేందుకు వీలుగా ఇప్పటివరకు వినియోగదారులు సేవ్ చేసిన హోం, ఆఫీస్, నచ్చిన రెస్టారెంట్లు, తదితర వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. అలాగే గతంలో ఎక్కడెక్కడ తిరిగారో అన్ని వివరాలు చూపించే టైం లైన్ ఆప్షన్ కూడా దీంట్లోనే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే లొకేషన్ హిస్టరీ డిజేబుల్ చేసుకోవచ్చు. కంట్రిబ్యూట్: ఎప్పటికప్పుడు వెళ్లే ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు, ఆయా రెస్టారెంట్లు ఇతర స్థలాల గురించి రివ్యూలను ప్రపంచంతో షేర్ చేసుకునే అవకాశం. అలాగే ఇప్పటికే ఉన్న ప్రదేశాలకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సూచించవచ్చు. అప్డేట్స్ : ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అన్ని ప్రదేశాలకు సంబంధించిన రికమండేషన్లు, స్థానిక నిపుణులు, వివిధ వ్యాపార సంస్థల మెసేజ్‌ల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి..అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణం గురించి ప్రయాణం ముగిసిన వెంటనే మరింత సమాచారం ఇచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లను ఇక మీదట ప్రోత్సహిస్తుంది. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతుంది. మీరు ఈ టాబ్ ద్వారా నేరుగా మ్యాప్స్‌లోని ఇతర వ్యాపారాలతో కూడా సంభాషించవచ్చు. వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇక మీదట అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వీల్ ఛెయిర్ వంటి సదుపాయాలు లాంటి వివరాలు లభ్యం. ఇక చివరగా నిర్దిష్ట ప్రాంతాల్లో, మహిళల కోసం కొత్త భద్రతా సమాచారం కూడా ఉంది. ఇందులో సురక్షితమైన రవాణా మార్గాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అక్కడ ఉండే సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది.