Niharika Konidela
-
నిహారిక బర్త్‌డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
సిస్టర్‌కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024 -
'మెగా' ట్యాగ్.. నిహారికకు ప్లస్‌తో పాటు మైనస్ కూడా!? (ఫోటోలు)
-
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
సినిమా సాంగ్ కోసం గ్లామర్ డోస్ పెంచిన నిహారిక (ఫోటోలు)
-
రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ
మెగా డాటర్ నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీసుల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్కారన్' మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఇందులో ఓ పాట షాకిచ్చే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి, నిర్మాతగా మారింది. ఈ ఏడాది 'కమిటీ కుర్రోళ్లు' అనే అద్భుతమైన సినిమాని అందించింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె హీరోయిన్గా చేసిన తమిళ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది.తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు.ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి!(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!) -
'చివాస్ లక్స్ కలెక్టివ్' ఈవెంట్లో తారల సందడి (ఫొటోలు)
-
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
నిహారిక టాలీవుడ్ బంగారం..: డైరెక్టర్
వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ట్రెండింగ్ లవ్. దొరకునా ఇటువంటి ప్రేమ అన్నది ట్యాగ్‌లైన్. హరీశ్ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ పతాకాలపై సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మిస్తున్నారు.‘ట్రెండింగ్ లవ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘ట్రెండింగ్ లవ్ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్ కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. మూవీలోని కొన్ని కట్స్ చూశాను. చాలా బాగున్నాయి. ఈ టీమ్ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు హరీశ్ నాగరాజు మాట్లాడుతూ–‘‘ మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీరే రిలీజ్ చేయాలని ఒక్క మెసేజ్ పెట్టాను.. సరే అని మా టీమ్‌ని ఎంకరేజ్ చేయటానికి నిహారిక ముందుకొచ్చారు. నిహారిక వారి పింక్ ఎలిఫెంట్ సంస్థ టాలెంట్ ఉన్న ఎంతోమందికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.చదవండి: మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక.. -
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు: ‘దిల్’ రాజు
‘‘కొత్త సినిమాలు బాగా ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి చిత్రాలు సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలామంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర స్టూడియోస్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ ఏడాది ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం యాభై రోజులను పూర్తి చేసుకుంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్‌కి ‘దిల్’ రాజు హాజరయ్యారు. నిహారిక మాట్లాడుతూ–‘‘ ఓ మంచి సినిమా తీస్తున్నామనుకున్నాం. కానీ, 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనుకోలేదు. ‘దిల్’ రాజుగారు నాకు స్ఫూర్తి. ఆయనలా డిఫరెంట్, కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంది’’ అని తెలిపారు. ‘‘నా తొలి సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం హ్యాపీ’’ అని పేర్కొన్నారు యదు వంశీ. ‘‘సినిమాను సహజంగా తీసే యదువంశీకి ఇంకా మంచి పేరు రావాలి’’ అని నిర్మాత ఫణి అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు మాట్లాడారు. -
కళ్యాణ్ బాబాయ్ తో సినిమా ఎప్పుడు తీస్తానంటే..
-
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్‌కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్‌పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్‌నే వెబ్ సిరీస్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు పీకే దండి సంగీతమందించారు. -
కమిటీ కుర్రోళ్లు చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు!
టాలీవుడ్ మూవీ కమిటీ కుర్రోళ్లు చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిహారిక నిర్మాతగా తొలిసారి నిర్మించిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం స్పందించారు.కాగా.. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాతోనే యదువంశీ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్నేహితుల మధ్య బంధం, రూరల్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 11 మంది నటీనటులు అందరూ కొత్తవారే విశేషం. ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధాదామోదర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే దాదాపు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశముంది. Congratulations on the massive success of *Committe Kurrollu* Niharika Thalli ! The is well-deserved !! Your hard work and dedication, along with your team are truly inspiring. Kudos to the entire cast and crew for their incredible effort, and a special shoutout to the director… pic.twitter.com/Up6bSQDqPU— Ram Charan (@AlwaysRamCharan) August 13, 2024 -
రికార్డ్ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్ళు' కలెక్షన్స్
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వసూళ్లతో సందడి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో. కలెక్షన్స్ విషయంలో ఇకపై ఇదే జోరుని కొనసాగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.‘కమిటీ కుర్రోళ్ళు’ కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ. -
'త్వరలోనే ఆ సినిమా చూస్తా'.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీతారలు సైతం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని కొనియాడారు. వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీలో నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ అంతా కొత్తవారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు.Hearing great things about #CommitteeKurrollu!Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024 -
‘కమిటీ కుర్రోళ్లు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న(ఆగస్ట్ 10)విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు.ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. -
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: కమిటీ కుర్రోళ్లునటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం తదితరులునిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్నిర్మాత:నిహారిక కొణిదెలదర్శకత్వం: యదు వంశీసంగీతం: అనుదీప్ దేవ్సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలువిడుదల తేది: ఆగస్ట్ 9, 2024మెగా డాటర్ నిహారికగా నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై బజ్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవితో సహా మెగా హీరోలంతా ప్రమోట్ చేయడంతో ‘కమిటీ కుర్రోళ్లు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. బాల్యం.. ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకుని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తున్నంత సేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. ఆ రోజులు వస్తే బాగుండని ఆశ పడతారు. మనల్నీ బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదు వంశీ సక్సెస్ అయ్యారు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపడంతో తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది.. కులం, మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్లు.. అప్పటి ఆటలు.. చిలిపి చేష్టలు అవన్నీ తెరపై చూస్తుంటే నైంటీస్ కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా వినోదాత్మకంగా సాగుతూ.. రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్ని అదే స్థాయిలో ద్వితియార్థంలో కొనసాగించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో టచ్ చేసిన రిజర్వేన్ల అంశానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఆత్రం చావు సీన్‌ని ఎమోషనల్‌గా మలిచి కన్నీళ్లను తెప్పించాడు. ఆ తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. జాతర సీన్‌ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చాలా నేచురల్‌గా నటించారు. శివగా సందీప్ సరోజ్ , సూర్యగా యశ్వంత్ పెండ్యాలా, విలియంగా ఈశ్వర్ రచిరాజు,ఇలా ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో జీవించేశారు. పెద్దోడిగా నటించిన ప్రసాద్ బెహరా.. ఎంత నవ్విస్తాడో..కొన్ని చోట్ల అంతే ఏడిపిస్తాడు. ఇక సీనియర్ నటులైన సాయి కుమార్, గోపరాజు రమణ రోటీన్ పాత్రల్లో మెరిశారు. సత్తయ్యగా నటించిన కంచెరాపాలెం కిశోర్..కొన్ని చోట్ల తనదైన నటనతో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ.. వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్రిటిసిజం పట్టించుకోను.. నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
బడ్జెట్ విషయంలో నిహారిక లిమిట్స్ పెట్టలేదు : యదు వంశీ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ కథ రాసుకుని ఐదారు ప్రొడక్షన్ హౌసెస్‌లో ప్రీప్రొడక్షన్ పనులు చేశాను. కానీ నేను అనుకున్నట్లుగా తీయలేనేమోనన్న భయంతో బయటికొచ్చేశాను. ఆ తర్వాత నిహారికగారికి కథ చెప్పాను. సెట్స్‌లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారామె’’ అన్నారు దర్శకుడు యదు వంశీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల సమర్పణలో నూతన నటీనటులు నటించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో యదు వంశీ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ‘కమిటీ కుర్రోళ్ళు’లో చూపించాం. ఓ గ్రామంలో మరుసటి రోజు పంచాయితీ ఎన్నికలనగా, అక్కడ ముందు రోజు పొలిటికల్‌గా ఏం జరిగింది? ఆ ఊర్లో జరిగిన జాతరకు, రాజకీయాలకు ఉన్న లింక్ ఏంటి? అన్న అంశాలనే కాస్త వ్యంగ్యంగా చూపించా. నిహారికగారు మా కంటెంట్‌ను నమ్మారు. బడ్జెట్ విషయంలో లిమిట్స్ పెట్టకుండా.. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఇందులో మదర్ సెంటిమెంట్ ఓ హైలైట్ పాయింట్. చెప్పాలంటే ఇది ప్రతి కుర్రాడి బయోపిక్’’ అని చెప్పుకొచ్చారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ -
‘కమిటీ కుర్రోళ్ళు’ చూసి ఏడ్చాను : వరుణ్ తేజ్
‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూశాను. చాలా బాగుంది. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి.. చాలా చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుందనిపిస్తోంది. ఇంతమంది ప్రతిభ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, దర్శకుడు వెంకీ అట్లూరి అతిథులుగా హాజరయ్యారు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘కమిటీ కుర్రోళ్ళు’ టైటిల్ విన్నప్పుడే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్ చాలా నచ్చింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. -
Niharika Konidela: 'కమిటీ కుర్రోళ్ళు' టీమ్ లీడర్ నిహారిక (ఫోటోలు)
-
చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు: సిద్ధు జొన్నలగడ్డ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం... మరో సినిమాకి ఎక్కువ ఖర్చు పెడతాం... అంతే’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘కొత్తవారితో ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి మంచి చిత్రాన్ని తీయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నాం. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు’’ అన్నారు నిహారిక. ‘‘నిహారిక, ఫణిగార్లు లేకపోతే ఇంత మంచి సినిమా తీసేవాళ్లం కాదు’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి సినిమా తీశాం. అందరూ చూడండి’’ అన్నారు నిర్మాత ఫణి అడ΄ాక. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, కెమెరామేన్ రాజు మాట్లాడారు. -
‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Committee Kurrollu Trailer: ఇలాంటి 'కమిటీ కుర్రోళ్ళు' ప్రతి గ్రామంలో ఉంటారు (ట్రైలర్)
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్షిప్ వీక్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే, తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యువతను ఆకట్టుకోవడంతో పాటు వారిని ఆలోచించేలా ట్రైలర్ ఉంది.ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటులు కనిపించినా వారు నటించిన తీరు చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ట్రైలర్లో ఎక్కువగా స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ చక్కగా చూపించారు. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి ‘కమిటీ కుర్రోళ్ళు’ తప్పకుండా ఉంటారు అనేలా ట్రైలర్ ఉంది.