Nikhil Siddharth
-
ముక్కోణపు ప్రేమకథ
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కీలకపాత్రలో, హర్ష చెముడు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 8న విడుదల కానుంది. కాగా దసరా పండగని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రిషి అనేపాత్రలో నిఖిల్ కనిపించనున్నారు. యాక్షన్ ఎలిమెంట్, చేజింగ్ సన్నివేశాలు, కథలోని కొన్ని కీలక మలుపులతో టీజర్‌ని విడుదల చేశాం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి వినోదం, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. ‘స్వామి రారా, కేశవ’ వంటి చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్. -
ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ సర్ప్రైజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్‌గా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.(ఇది చదవండి: స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్..)అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Into the World of #AppudoIppudoEppudo ❤️This'll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC— sudheer varma (@sudheerkvarma) October 6, 2024 -
స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
'కార్తికేయ 2', '18 పేజీస్' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ గతేడాది 'స్పై' చిత్రంతో బోల్తా పడ్డాడు. ఈసారి ఎలాగైనా మరో బంపర్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'లో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రీకర్, భువన్ నిర్మిస్తున్నారు. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్’ వంటి చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.శనివారం (జూన్ 1) నాడు నిఖిల్ బర్త్‌డేను స్వయంభూ సెట్లో సెలబ్రేట్ చేశారు. స్వయంభూ సినిమాలోని నిఖిల్ గెటప్స్‌తో కేక్‌ను ముస్తాబు చేశారు. నభా ఆ కేకుపై క్యాండిల్స్ పెట్టి వెలిగించింది. యుద్ధవీరుడి గెటప్‌లో నిఖిల్ కేక్ ముందు కత్తితో నిలబడ్డాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో పాటు అక్కడున్నవారికి కేక్ తినిపించాడు. ఈ వీడియోను నిర్మాణ సంస్థ పిక్సెల్ స్టూడియో ట్విటర్లో విడుదల చేసింది. A sweet surprise for @actor_Nikhil on the sets of #Swayambhu ✨The team celebrated his birthday on the sets with all the cast and crew extending their heartfelt wishes to Nikhil ❤🔥@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar pic.twitter.com/eUolNTQfE9— Pixel Studios (@PixelStudiosoff) June 2, 2024 చదవండి: రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి -
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కళ్ళకు గంతలు కట్టేయగా, దానిపై అనుమమ ఏదో రాస్తున్నట్లు ఆసక్తికరంగా పోస్ట్‌ర్‌ను డిజైన్ చేశారు. ఇక అనుమమ సైతం పోస్టర్‌ను షేర్ చేస్తూ.. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. రొమాంటికి ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook pic.twitter.com/JE32WXbrdv — Anupama Parameswaran (@anupamahere) June 1, 2021 చదవండి : సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు! -
మనల్ని ఎవరూ కాపాడలేరు: నిఖిల్ ఎమోషనల్
కరోనా వల్ల పరిస్థితులు రోజురోజుకూ ఎంతలా దిగజారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది కనీసం ఆసుపత్రి బెడ్లు కూడా దొరక్క విలవిల్లాడిపోతున్నారు. ఈ విషమ పరిస్థితులను చూసి చలించిపోయిన యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. కోపం, ఫ్రస్టేషన్, నిరాశ, నిస్సహాయత వల్ల ఈ వీడియో చేస్తున్నాని పేర్కొన్నాడు. "కరోనా వల్ల షూటింగ్స్ రద్దయ్యాయి. ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు నేను, నా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటున్నాం. సోషల్ మీడియా ద్వారా నా ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలామందికి ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు అందించడం, ఐసీయూ వార్డులో చేర్పించడం వంటి సలు సహాయక చర్యలు చేపట్టాం. కానీ మేం చేసే సాయం సరిపోవడం లేదు. బయట పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది." "కళ్ల ముందే జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్ బెడ్ కావాలని ఓ కోవిడ్ పేషెంట్ ఫోన్ చేశాడు. అరగంటలో దాన్ని సమకూర్చి ఫోన్ చేయగా, అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇలాంటివి చూడటం చాలా బాధగా ఉంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారనుకోవడం జరగని పని. నాయకులు ఒకర్ని ఒకరు బ్లేమ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్లు మనల్ని కాపాడలేరు. కాకపోతే మానవత్వం ఇంకా మిగిలే ఉంది. జనాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ విపత్కరం సమయంలో అదొక్కటే పాజిటివ్ అంశం. దయచేసి మాస్కులు వేసుకోండి, ఎవరినీ కలవకండి" అని చెప్తూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. చదవండి: మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్ సాయం పెళ్లి వార్తలపై స్పందించిన చార్మి -
మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్ సాయం
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను గడగడలాడిస్తోంది. చేయి చేయి కలిపినా, మాస్క్ లేకుండా కనిపించినా, పార్టీలంటూ, వినోదమంటూ పదే పదే బయట తిరిగినా మన ఒంట్లోకి ప్రవేశించేందుకు రెడీగా ఉందీ కరోనా. సవాలక్ష జాగ్రత్తలు తీసుకున్నవారు కూడా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు చేసినా ఆ మాయదారి రోగం బారిన పడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెడుతుందీ కరోనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఉధృతి విపరీతంగా ఉంది. అదే సమయంలో కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్స్‌ల కొరత కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి రెమిడిసివిర్ ఇప్పించాలంటూ హీరో నిఖిల్‌ను ట్విటర్లో సంప్రదించాడు. దయచేసి మాకు సాయం చేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. దీనిపై పెద్ద మనసుతో స్పందించిన హీరో.. 'సిరివూరి రాజేశ్ వర్మ మీకు అవసరమయ్యేన్ని రెమిడిసివిర్ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది' అని భరోసా కల్పించాడు. Will get it done... Sirivuri Rajesh Varma will contact you. With the Required doses of #Remdisivir . Wishing your father a Speedy recovery. https://t.co/khN8bjLEYz — Nikhil Siddhartha (@actor_Nikhil) April 20, 2021 చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్‌కు సడన్ బ్రేక్! -
ఆగిపోయిన 'కార్తికేయ 2' షూటింగ్!
-
నిఖిల్ ‘పేజీలు’ ప్రారంభం
‘అర్జున్ సురవరం’ హిట్‌తో మంచి స్పీడు మీదున్న హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’. నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. అల్లు అరవింద్ çసమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సూర్యప్రతాప్ మాట్లాడుతూ– ‘‘నిఖిల్, అనుపమ మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: వసంత్. -
కేర్ అండ్ షేర్లో నిఖిల్..
-
ఇంటివాడైన హీరో నిఖిల్
-
నేడు నిఖిల్ వివాహం
‘స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం’ వంటి విజయాలు సొంతం చేసుకున్న కథానాయకుడు నిఖిల్ నేడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డాక్టర్ పల్లవి వర్మతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 16న వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నేడు షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో నిఖిల్–పల్లవిల వివాహం ఉదయం 6:31 గంటలకు జరగనుంది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులతో నిరాడంబరంగా ఈ పెళ్లి జరగనుంది. కాగా బుధవారం సాయంత్రం నిఖిల్‌ని పెళ్లి కొడుకుని, పల్లవిని పెళ్లి కూతురిని చేశారు. -
రేపే హీరో నిఖిల్-పల్లవి వివాహం?
కరోనా లాక్డౌన్ కారణంగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వివాహం వాయిదా పడుతూ వస్తోంది. పల్లవి వర్మ అనే డాక్టర్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెలసిందే. అయితే వీరి వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే లాక్డౌన్ మే 17 వరకు పొడిగించడంతో మరోసారి వీరి పెళ్లి వాయిదా పడింది. మే 17 తర్వాత సైతం లాక్డౌన్ కొనసాగింపు ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం, ఆ తర్వాత(మే14) మూఢం, ముహుర్తాలు లేకపోవటం వలన వధూవరులు ఇద్దరి జాతకాల రీత్యా రెండో సారి అనుకున్న ముహూర్తానికే (ఈ నెల 14న) పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు ఫిక్సయ్యారంటా. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రేపు(గురువారం) నగర శివార్లలోని ఓ ఫామ్ హౌజ్‌లో నిఖిల్ పెళ్లి జరగనుందని సమాచారం. అంతకుముందు ఎవరి ఇళ్లలో వాళ్లు సంప్రదాయ బద్దమైన కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి కూతుర్ని, అలాగే పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం కూడా ఈ రోజు సాయంత్రం ఉండునున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇరుకుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’? -
నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా..
హైదరాబాద్ : హీరో నిఖిల్ వివాహం మరోసారి వాయిదా పడింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇదివరకు ఒకసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్న నిఖిల్.. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సారి పెళ్లి తేదీని మాత్రం నిఖిల్ ప్రకటించలేదు. ఇలా జరగడంపై ఆయన తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కరోనాతో పోరాటం ముగిసే వరకు మా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. బయట చాలా మంది పడుతున్న బాధలతో పోలిస్తే.. నేను పడుతున్న బాధ పెద్దది కాదు. నా పెళ్లి జరిగే సమయంలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకినా.. ఆ బాధ నన్ను జీవితం మొత్తం వేధిస్తోంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మరుపురానిదిగా ఉంటుంది. కాబట్టి అది చాలా వేడుకగా జరుపుకోవాలి. ఇలాంటి కష్టకాలంలో పెళ్లి చేసుకోవడం సరైనది కాదని భావిస్తున్నాం. నేను, పల్లవి మా పెళ్లికోసం వేచి ఉంటాం. కరోనా ముగిశాక మేము చాలా వేడుకగా పెళ్లి చేసుకుంటాం’ అని తెలిపారు. కాగా, ఫిబ్రవరిలో డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 16న వీరి వివాహం జరపాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో నిఖిల్-పల్లవిల పెళ్లిని మే 14కు వాయిదా వేశారు. అయితే మరోసారి మే 17 వరకు లాక్డౌన్ పొడిగించడంతో.. పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు నిఖిల్ వెల్లడించారు. చదవండి : కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్ -
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..
కరోనా కారణంగా మరో టాలీవుడ్ హీరో పెళ్లి వాయిదా పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు హీరో నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజుల క్రితం తన పెళ్లిని ఎవరూ ఆపలేరని నిఖిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకోవడమే మంచిదని నిఖిల్ భావించినట్టుగా తెలుస్తోంది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవడం సాధ్యపడేలా కనిపించడం లేదు. వేరే మార్గం లేక మేము మా పెళ్లిని వాయిదా వేసకుంటున్నాం. అయితే ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో తెలియడం లేదు. పెళ్లి వాయిదా పడినందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిగా నిరాశ చెందారు. కానీ భద్రత అనేది అనింటి కంటే ముఖ్యమైనది. మనం కష్టాల్లో ఉన్న సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైనది కాదు’ అని నిఖిల్ తెలిపారు. కాగా, ఫిబ్రవరి 1 వ తేదీన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్, పల్లవిలు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. చదవండి : కరోనా ఎఫెక్ట్: అభిమానులకు నితిన్ విజ్ఞప్తి డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం -
కార్తికేయ 2 షూటింగ్ ప్రారంభం
-
డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే పల్లవి వర్మకు నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఓ డాక్టర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పిన సంగతి తెలిసందే. కాగా, టాలీవుడ్లో డిఫరెంట్ మూవీస్‌తో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. -
అర్జున్ సురవరం ప్రెస్‌మీట్
-
అర్జున్ సురవరం : మూవీ రివ్యూ
టైటిల్: అర్జున్ సురవరం నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ దర్శకత్వం: టీఎన్ సంతోష్ సంగీతం: సామ్ సీ.ఎస్ సమర్పణ: ‘ఠాగూర్’ మధు నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ మొదటినుంచీ డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్. హ్యాపీడేస్ నుంచి మంచి కథలతో ఎంచుకుంటూ ప్రతి సినిమాకీ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం అర్జున్ సురవరం. తమిళ సూపర్‌హిట్ ‘కణితన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ జర్నలిస్ట్‌గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తోపాటు ఇప్పటివరకు రిలీజైన పాటలు మంచి క్రేజ్తెచ్చాయి. ఇంతకు రిపోర్టర్ అర్జున్ సురవరం ఎలా రిపోర్ట్ చేశాడు? ఏ స్కామ్‌ను బయటపెట్టాడు? తెలుసుకుందాం పదండి. కథ: అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్).. తండ్రికి కూడా చెప్పకుండా సాప్ట్వేర్ ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసి జర్నలిజంపై మక్కువతో ఓ టీవీ చానెల్లో రిపోర్టర్‌గా చేరుతాడు. బీబీసీలో పనిచేయాలన్నది అతని కల. ఈ విషయమై కావ్య (లావణ్య త్రిపాఠి)కు అబద్ధం చెప్తాడు. కానీ, కావ్య అర్జున్ పనిచేస్తున్న టీవీ చానెల్ సీఈవో కూతురు కావడంతో నిజం వెంటనే బయటపడుతుంది. మొదట అబద్ధం చెప్పాడని అర్జున్ గురించి నెగిటివ్‌గా థింక్ చేసినా.. బాధ్యతాయుతమైన రిపోర్టర్‌గా అతను పనిచేస్తున్న తీరును గుర్తించి.. బీబీసీలో ఉద్యోగం కోసం కావ్యనే అర్జున్ అప్లికేషన్ పంపుతుంది. అర్జున్‌కు బీబీసీలో ఉద్యోగం వస్తుంది. ఈ క్రమంలో అర్జున్, కావ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. కావ్యకు అర్జున్ ప్రేమ వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు హఠాత్తుగా వచ్చి అర్జున్ను అరెస్టు చేస్తారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్ లోన్స్ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్ సురవరం ఫేక్ సర్టిఫికెట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది మిగతా కథ. విశ్లేషణ: ఫేక్ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ నెట్‌వర్క్‌ను, వ్యవస్థతో మమైకమై అతిపెద్ద స్కాంను ఓ రిపోర్టర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్ సురవరం కథ. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమా పవర్ఫుల్ కథతో తెరకెక్కింది. ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల చదువుకున్న నిరుద్యోగులు మోసపోవడమే కాదు.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. తమిళ రీమేక్ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. ఫేక్ సర్టిఫికెట్స్ నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు హీరో ప్రయత్నించడం.. తన లోగుట్టును బయటకు లాగుతున్న హీరోను తెలుసుకునేందుకు విలన్ వెంటాడటం సెంకడాఫ్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి. ఎమోషనల్ సీన్లను దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కానిస్టేబుల్ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్లో అతని కొడుకు (వెన్నెల కిషోర్) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట క్లైమాక్స్ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్ మరోసారి హాస్యాన్ని పంచాడు. విలన్ పాత్రలో తరుణ్ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు. బలాలు పవర్ఫుల్ కథ ప్రీక్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్టులు ఏమోషనల్ సీన్స్ బలహీనతలు సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం అక్కడక్కడ ఓవర్ సినిమాటిక్‌గా ఉండటం నేపథ్య సంగీతం అంత ఆప్ట్‌గా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘అర్జున్ సురవరం’ మరోసారి వాయిదా!
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్ సురవరం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్ తరువాత అర్జున్ సురవరం రిలీజ్ అవుతుందని తెలిపారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. pic.twitter.com/3scqEuhKAO — Asian Cinemas (@AsianCinemas_) 25 April 2019 -
వాయిదా పడిన ప్రతిసారీ హిట్టే
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేశారు. మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం చిత్రబృందం ప్రెస్మీట్లో పేర్కొంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘హ్యాపీడేస్’ నుండి ‘అర్జున్ సురంవరం’ వరకు 16 చిత్రాలు చేశాను. అన్ని సినిమాల్లోకి ఈ చాలా బాధ్యత గల సినిమా ఇది. టాప్ రిపోర్టర్ అవ్వాలనుకునే అర్జున్ క్యారెక్టర్ని ఈ చిత్రంలో ప్లే చేస్తున్నాను. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, పడగొట్టాలన్నా మీడియాకి పవర్ ఉంటుంది. మీడియాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నా కెరీర్లోనే మోస్ట్ రెస్పాన్సిబుల్‌గా ఫీలై ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మే 1న రిలీజ్ చేస్తున్నాం. నైజామ్ ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్. నా సినిమాలు పోస్ట్‌పోన్ అయిన ప్రతిసారీ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, రాజ్‌కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ – ‘‘సినిమా బాగుండాలని కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పుడు ఎన్నికల జోరు ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు మే 1న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ‘ఠాగూర్’ మధు పాల్గొన్నారు. -
‘శ్వాస’ ఆగిపోయిందా?
‘కిరాక్ పార్టీ’తో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు నిఖిల్. సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ యువ హీరో కెరీర్‌కు కిరాక్ పార్టీ అడ్డుకట్టవేసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఓ తమిళ రీమేక్‌పై దృష్టి సారించాడు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన కణిథణ్ చిత్రాన్ని ‘అర్జున్ సురవరం’ పేరుతో టాలీవుడ్‌కు తీసుకువస్తున్నాడు. టీజర్‌తో ఈ మూవీ ఒక్కసారిగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే నిఖిల్ హీరోగా,నివేదా థామస్ హీరోయిన్గా అప్పట్లో శ్వాస అనే చిత్రం మొదలైంది. తాజాగా ఈ మూవీపై ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కన పడేశారనీ, ఈ సినిమాను ఆపేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అర్జున్ సురవరం తరువాత నిఖిల్ కార్తికేయ సీక్వెల్లో నటిస్తాడని సమాచారం. -
‘అదే నాకు పెద్ద విషయం’
‘కిరాక్ పార్టీ’ సినిమాతో గతేడాది పలకరించిన నిఖిల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అయితే మళ్లీ సక్సెస్ సాధించాలని తమిళ రీమేక్‌పై కన్నేశాడు. తమిళ్లో సూపర్‌హిట్ అయిన కణిథణ్ చిత్రాన్ని తెలుగులో అర్జున్‌సురవరం పేరుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. అయితే ఈ మూవీ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అంతేకాకుండా.. టీజర్చూసి చిత్ర నిర్మాతకు అభినందనలు తెలియజేశారట. ఇదే విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మా నిర్మాత రాజ్‌కుమార్ ఓ మెసెజ్‌ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అదెంటో చూద్దామని నేను ఆయన ఫోన్‌ను లాక్కున్నాను. ఓమైగాడ్.. ఆ మెసెజ్ చేసింది మన మెగాస్టార్. ఇదే మా లైఫ్‌కు పెద్ద విషయం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నా’ను అంటూ ట్వీట్‌చేశారు. ఇంతకీ మన చిరు టీజర్ చూసి.. ‘ హాయ్.. డియర్ ప్రొడ్యుసర్ రాజ్‌కుమార్.. ఇప్పుడే అర్జున్‌సురవరం టీజర్ చూశాను. ఆసక్తికరంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ టు నిఖిల్, డైరెక్టర్’ అంటూ ప్రశంసించారు. ఠాగుర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. My prod Rajkumar was so happy reading some mssgs on his phn. I pulled his phn 2 check wht it is ..nd OMG its the msg from our beloved Mega Star himself on #ArjunSuravaram teaser. The biggest high of our life.🤸♂🤸♂ #BOSS 🙏 p.s- took the legends permission b4 sharing this 🤗 pic.twitter.com/ZvEDpaAgTa — Nikhil Siddhartha (@actor_Nikhil) 4 March 2019 -
‘నిజాన్ని నిజం అని ఫ్రూవ్ చేయడం చాలా కష్టం’
వరుస హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్.. కిరాక్ పార్టీతో ఆశించిన మేర విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు. అయితే తమిళ్ హిట్ మూవీ కణితణ్ రీమేక్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ టైటిల్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి చిత్రయూనిట్ వెనక్కితగ్గి.. ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌తో అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒక అబద్దాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ ఒక నిజాన్ని నిజం అని ఫ్రూవ్ చేయడం చాలా కష్టం’.. ‘జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్’..‘వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సినవాడు తెలియట్లేదు..’ లాంటి మాటలతో ఆసక్తిగా ఉన్న టీజర్ ఆకట్టుకునేలానే ఉంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఠాగుర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Anduke JIO ki mara manedi 😂🤣 Even im waiting for the Teaser of #ArjunSuravaram 😃 https://t.co/f4BlEOLG2G — Nikhil Siddhartha (@actor_Nikhil) March 4, 2019 ఈ టీజర్‌ను రిలీజ్ చేసే క్రమంలో టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యేసరికి కాస్త ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిఖిల్‌చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సాంకేతిక లోపం వల్ల కాస్త ఆలస్యం కానుందని లహరి మ్యూజిక్ సంస్థ చేసిన ట్వీట్‌కు నిఖిల్ రిప్లై ఇస్తూ.. ‘అందుకే జియోకి మారమనేది.. నేను కూడా టీజర్ గురించి వెయిట్ చేస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు. -
నిఖిల్ వెనుకడుగు వేయకతప్పలేదు!
‘కేశవ’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో కాస్త వెనుకపడ్డాడు యంగ్ హీరో నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు తీసి విజయాలు సాధించిన ఈ హీరో గత రెండు సినిమాలతో ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాడు. తాజాగా ఓ తమిళ రీమేక్‌తో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. తమిళ్లో ఘన విజయం సాధించిన కణిథన్ సినిమాను తెలుగులో ‘ముద్ర’ పేరుతో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయాలని భావించారు. కానీ నవంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లపై దాడి చేయనున్నాయి. విజయ్ ‘సర్కార్’, ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ దీపావళి కానుకగాకే విడుదల కానుండగా.. రజనీకాంత్ 2.ఓ నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ తన ‘ముద్ర’ను డిసెంబర్లో వేయబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
నిఖిల్..నివేద..‘శ్వాస’ కొత్త చిత్రం ప్రారంభం