nivedha Pethuraj
-
వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్‌లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్‌కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి) డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది. ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) -
రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు వారికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 200లకు పైగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం చూసి యావత్ భారత్ ఉలిక్కిపడింది. వారి మృతికి సంతాపంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ నివేదా పేతురాజ్, కేజీఎఫ్ నటుడు యశ్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్లో రాస్తూ..'ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన చూసి నా గుండె పగిలింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సహానటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!) Shocked & heart broken by the tragic train accident in Odisha. My condolences to the families who have suffered the loss of their loved ones. Sending heartfelt prayers for the recovery of those who were injured. — Allu Arjun (@alluarjun) June 3, 2023 రష్మిక తన ట్వీట్లో రాస్తూ..'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతుంది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. Hearbreaking to hear about the news of the train accident in Odisha.. My deepest condolences to the families of the departed. My prayers for the people who are injured… — Rashmika Mandanna (@iamRashmika) June 3, 2023 కేజీఎఫ్ హీరో యశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఒడిశా రైలు దుర్ఘటన ఎంతమంది హృదయాలను కలచివేసిందో మాటల్లో వర్ణించడం కష్టం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. (ఇది చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్‌కి చిరు విజ్ఞప్తి) It’s difficult to describe in words how heart-wrenching the train tragedy of Odisha is. My deepest condolences to the families of the deceased and praying for the speedy recovery of those injured. Gratitude to the people who have come out in large numbers to help with rescue… — Yash (@TheNameIsYash) June 3, 2023 Really saddened to hear abt the accident,May God rest the souls of the deceased in peace,Protect n give strength to the families n the injured from this unfortunate accident. — Salman Khan (@BeingSalmanKhan) June 3, 2023 Odisha train accident is the most chilling news I’ve heard in recent times. May all the souls who lost their lives rest in peace. My prayers and heartfelt condolences to the families of the affected. — Nivetha Pethuraj (@Nivetha_Tweets) June 3, 2023 -
మీరు ఊహించినా దానికంటే ఎక్కువే ఉంటుంది: విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే 'దాస్ కా ధమ్కీ' మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టినా.. అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ. .'దాస్ కా ధమ్కీ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్. ఇంతగా ఆదరణ పొందుతున్న సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. అది మీరు ఊహించినా దాని కంటే పది రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు ఓటీటీలు వేదికలుగా మారాయి. తనకు ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. మరో 3 సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.' అని తెలిపారు. (ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే) తెలుగు సినీ అభిమానులు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని హీరోయిన్ నివేదా పేతురాజ్ అన్నారు. దుబాయ్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించారన్నారు. ఫాస్టెస్ట్ 100 మిలియన్ మినిట్స్ మార్క్‌ను ఈ సినిమా చేరుకుందని ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ పేర్కొన్నారు. -
‘పాగల్’ ప్రీరిలీజ్: విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్
మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ మూవీలో విశ్వక్ లవర్‌బాయ్‌గా అలరించనున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అగష్టు 14న థియేటర్లల్లో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో నేడు పాగల్ ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా విశ్వక్ ‘ఇప్పుడే సినిమా ఫైనల్ కాపీ చూశా. బొమ్మ అదిరిపోయింది. నన్ను డైరెక్టర్ నరేశ్ పిలిచి ‘పాగల్’ కథ వివరించాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అప్పడే అనిపించింది. మా టీం అద్భుతంగా వర్క్ చేసింది. వారందరికి ధన్యవాదాలు. శనివారం నాడు పబ్బులు, బార్లలోనే కాదు నా సినిమా ఆడే థియేటర్లలో కూడా పార్టీలు జరుగుతాయి. పూర్తిగా థియేటర్లు తెరుచుకోకముందే ఇప్పుడేందుకు ‘పాగల్’ విడుదల చేస్తున్నారని అడిగిన వారందరికి నేను చెప్పేది ఒక్కటే. సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవి కొచ్చి ఆడుకునే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ అయ్యేలా చేస్తా. గుర్తుపెట్టుకోండి. నా పేరు విశ్వక్ సేన్.. నేను చెప్పింది జరగకపోతే నా పేరు మార్చుకుంటా’ అని అన్నాడు. ఇక హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి చెబుతూ.. ఏ ఇంటర్వ్యూలోనైనా తను ఇలియాన ఫ్యాన్ అని చెప్పుకున్నానని, కానీ ఇప్పటి నుంచి తాను నివేదా పేతురాజ్ అభిమానిని అన్నాడు. నమ్మండి మీరు కూడా ఆమెకు ఫ్యాన్స్ అయిపోతారని, ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసిందంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. -
థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం
‘‘చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి ‘ఇస్మార్ట్ శంకర్’లో విశ్వరూపం చూపించి, మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రెడ్’ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చాలా సున్నితంగా, క్లాస్‌గా కనిపించే కిశోర్ తిరుమల ‘రెడ్’ చిత్రంతో తాను మాస్ చిత్రాలు రాయగలను, తీయగలనని నిరూపించుకున్నాడు. రామ్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ‘రెడ్’ పెద్ద హిట్ అవ్వబోతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్‌ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం.. వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళుతుంటాం.. అలాగే ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. థియేటర్లలో సినిమా చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ప్రేక్షకులందరూ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాం’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము), నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
-
కొత్త సినిమా ప్రస్థానం
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు సాయితేజ్. ప్రస్తుతం ‘ప్రస్థానం’ చిత్రదర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో తన నూతన చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్. జగపతిబాబు పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్ అందించగా, నటుడు పవన్ కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఎగ్జయిట్మెంట్ కలిగించే అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్ దత్. -
పది వేల అడుగుల ఎత్తులో...
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారె¯Œ ్స, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మాదే. ఇటలీలో ప్రతి ఏటా జరిగే వెనీడియా కార్నివాల్లో పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం క్లాస్, మాస్‌ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి. -
సింహస్వప్నంలా వస్తున్నాడు
మల్టీటాలెంటెడ్ ప్రభుదేవా తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో హీరోగా నటించిన చిత్రం ‘పొన్ మాణిక్వెల్’. ఎ. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తెలుగులో ‘కృష్ణ మనోహర్ ఐ.పి.ఎస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సంఘవిద్రోహ శక్తుల పాలిట హీరో సింహస్వప్నంలా ఎలా నిలిచాడు? అన్నదే కథ’’ అన్నారు సుధాకర్. ఈ సినిమాకు భువన చంద్ర సంగీతం అందించారు. -
రాములో రాములా...
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల...వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ పాత్రలో నటిస్తున్న సుశాంత్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘రాజ్ పాత్ర పోషిస్తున్నాను. ‘అల...వైకుంఠపురములో...’ నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు సుశాంత్. ఈ సినిమాలోని ‘రాములో.. రాములా...’ పాట టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదలవుతోంది. పూర్తి పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నాను. ఈ పాట చాలా క్యాచీగా ఉంటుందంటున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలో ‘సామజవరగమన...’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. టబు, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
వైకుంఠంలో యాక్షన్
వైకుంఠపురములో ఏం జరుగుతుంది? ‘ఇలా జరుగుతుంది’ అని ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్లు ఊహించుకోవచ్చు. మరి.. ఇక్కడి వైకుంఠపురములో ఏం జరుగుతోందంటే నవ్వులు, లవ్వులు, ఫైట్లు, పండగలు.. ఇలా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మాత్రం ఫైట్ జరుగుతోంది. ఇక్కడి వైకుంఠపురానికి హీరో అల్లు అర్జున్. దర్శకుడు త్రివిక్రమ్. ఈ కాంబినేషన్లో ‘అల... వైకుంఠపురములో..’ పేరుతో అల్లు అరవింద్, చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ సారథ్యంలో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కుతున్నాయి. ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. నెక్ట్స్ ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా పండగకి ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. -
అల... ఓ సర్ప్రైజ్
వెండితెర వైకుంఠపురములోని తన బంధువులందర్నీ దగ్గర చేసే పనిలో ఉన్నారట అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘అల.. వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఆ రోజు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని ఊహించవచ్చు. జయరాం, టబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఫుల్ స్పీడ్
సగానికి పైనే ప్రయాణాన్ని పూర్తి చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్. మిగతా భాగాన్ని కూడా ఫుల్ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. -
పంద్రాగస్టుకి ఫస్ట్ లుక్
చిత్రీకరణ చకా చకా జరుగుతోంది. సినిమాలోని ముఖ్య ఆర్టిస్టులంతా సెట్లో ఉండటంతో అంతా సందడి సందడిగా ఉంది. ఈ సందడంతా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లొకేషన్‌కి సంబంధించినది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమాలోని ముఖ్య తారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. తర్వాతి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో రాజమండ్రిలో మొదలు పెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారట. సుశాంత్, టబు, జయరాం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
సరిగమల సమావేశం
అనుకున్న సమయానికి చిత్రీకరణను పూర్తి చేయాలని అల్లుఅర్జున్ అండ్ టీమ్ నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తున్నట్లున్నారు. అటు సన్నివేశం.. ఇటు పాటలను ఒకేసారి కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేతాపేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. టబు, సుశాంత్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలిసింది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌లతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేశారు తమన్. అక్కడి ఫొటోను షేర్ చేస్తూ– ‘‘మా సినిమా మ్యూజిక్ మంచి ప్రాసెస్‌లో, స్పీడ్ ప్రోగ్రెస్‌లో ఉంది’’ అని తమన్ పేర్కొన్నారు. మరి... వీరి సరిగమల సమావేశం శ్రోతలను ఎంతలా ఆకట్టుకుంటాయో చూడాలంటే కాస్త ఓపికపట్టాల్సిందే. -
జెట్ స్పీడ్‌లో!
అల్లు అర్జున్ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా సెట్లో జాయిన్ అవుతున్నారు. దీంతో సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్గా నివేధా పేతురాజ్‌ను తీసుకున్నారు. ఈమె గతంలో ‘మెంటల్‌మదిలో, చిత్రలహరి’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం నటుడు సుశాంత్‌ను సెలక్ట్ చేసుకున్నారు టీమ్. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం శుక్రవారం వెల్లడైంది. ‘‘లొకేషన్లో నా ఫస్ట్‌డే మొదలైనందుకు ఆనందంగా ఉంది. ‘చిలసౌ’ తర్వాత మంచి అమేజింగ్ టీమ్‌తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. సినిమా గురించి ఎక్కువగా ఇప్పుడే చెప్పలేను’’ అని సుశాంత్ అన్నారు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్. ఈ సినిమా కాకుండా సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వాల్లో హీరోగా నటించనున్నారు అల్లు అర్జున్. -
ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు
‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. హైదారాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్ క్యారెక్టర్స్‌ను హీరోలకు అడాప్ట్ చేస్తూ కిశోర్ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ చిన్న స్పీడ్ బ్రేకర్ దాటి మళ్లీ సక్సెస్‌బాట పట్టింది. సునీల్ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. ‘‘కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే నా దృష్టిలో సక్సెస్. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. కిశోర్ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్‌తేజ్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సునీల్. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. -
వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు
‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్ అది. ఇందులో ఫస్ట్ వస్తే సక్సెస్. అది త్వరగా సాధిస్తే సక్సెస్. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్ అన్నారు. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్ పంచుకున్న విశేషాలు... ► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు. మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ► నా గ్లాస్‌మేట్స్ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్ సరిపోదు. ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్ మాలో నింపేవాడు త్రివిక్రమ్. ► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్బుక్, ట్వీటర్) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్ చేసేశారు. అంటే వ్యూస్ కోసం వేరే వాళ్లను హర్ట్ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. ► సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా? ► కమెడియన్ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్ ప్యాక్స్తోనే కనిపిస్తారు. యాక్షన్ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే. ► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్ కాపీయే. మనవి వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. ► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. ► కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్ కాదు. ‘మొన్న’ ఎఫ్ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం. ► ప్రస్తుతం అల్లు అర్జున్– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ). -
నచ్చలేదని చెప్పే చొరవ వచ్చింది
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నాకు చాన్సులు వస్తున్నాయని నేను నమ్మడం లేదు. కుటుంబ నేపథ్యం వల్ల ఒకటో రెండో వస్తాయి. ఆ తర్వాత పట్టించుకోరు. వరుసగా నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై నాకు జడ్జిమెంట్ రాలేదు. అది వస్తే అన్నీ నేర్చుకున్నట్లే. యాక్టర్‌గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా స్క్రీన్ నేమ్‌ని సాయితేజ్‌గా మార్చుకోవడం వెనక పెద ్దకారణాలేవీ లేవు. ధరమ్‌ని కొంతకాలం పక్కన పెట్టానంతే. ఈ చిత్రంలో జీవితంలో సక్సెస్ తెలియని విజయ్కృష్ణగా నటించాను. ఒకరి జీవితాన్ని ఓ ఐదు పాత్రలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే కథ. విజయ్ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్నప్పుడే మంచి సినిమా అవుతుంది, వదులుకోకూడదనుకున్నాను. ► పదకొండేళ్లుగా కిషోర్ తిరుమల తెలిసినప్పటికీ సినిమా చేయడం కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంశాలను కిషోర్ బాగా చూపిస్తారు. నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నన్ను నమ్మి చాన్స్ ఇచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు ఉండాలి. దేవి అన్న మ్యూజిక్ చాలా ఇష్టం. ‘దేవి మ్యూజిక్‌లో నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని మా అమ్మ అనేవారు. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీ. అలాగే సునీల్ అన్నతో వర్క్ చేయడం అనేది నాకున్న కలలో ఒకటి. అది కూడా నెరవేరినందుకు హ్యాపీ. ► నా గత ఆరు సినిమాలు ఆడలేదు. స్క్రిప్ట్‌ను ఎంచుకునే విధానంలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వచ్చింది. ఏౖమైనా అంటే.. ‘చూశారు కదండీ.. నా ఆరు సినిమాల రిజల్ట్’ అని చెప్పొచ్చు. కథ పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రిప్ట్ విని, డౌట్స్ ఉంటే చెబుతా. అంతే కానీ ఈ మార్పు కావాలి. ఫలానా డైలాగ్స్ మార్చాలి. నా బాడీకి ఇది సూట్ అవ్వవు అన్న అభ్యంతరాలు చెప్పను. కానీ సినిమా ఫెయిల్ అయితే అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే హీరోగా నేను ‘యస్’ అన్నప్పుడే సినిమా ముందుకు వెళ్తుంది. ► మాటిచ్చాను కాబట్టి కొన్ని సినిమాలు చేశాను. మాట ఇస్తే ఎలాగైనా నిలబడాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో కథ విన్నప్పుడు నచ్చి, ఆ తర్వాత కొంతదూరం ట్రావెల్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్లిపోతుందని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాయిస్ లేదు. అప్పుడు సినిమా పూర్తి చేయాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే ఆడియన్స్ రెస్పాన్స్, విమర్శకుల అభిప్రాయాలను విశ్లేషించుకుని నన్ను నేను మెరుగుపరచుకోవడానికి మరింత కష్టపడతాను. ► కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యుర్ వల్ల ఆగిపోతారనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. ప్రతి యాక్టర్‌కి ప్రతి శుక్రవారం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాన్స్. దాన్ని నేను నమ్ముతాను. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ గుంపు ఉంటుంది. సక్సెస్ దూరమైనప్పుడు ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఉంటారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. హిందీ చిత్రం ‘గల్లీభాయ్’ తెలుగు రీమేక్‌లో నేను నటిస్తానన్న వార్తల్లో నిజం లేదు. ► నా బ్రదర్ వైష్ణవ్ తేజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో నా ప్రమేయం లేదు. దర్శకులు బుచ్చిబాబు ప్రొడ్యూసర్స్‌ని కలిసి ముందుకు వెళ్లారు. హెయిర్ సర్జరీ కోసం, లైపోసక్షన్ కోసమే నేను యూఎస్ ట్రిప్ వెళ్లాననే ప్రచారం జరిగింది. అది నిజం కాదు. ‘విన్నర్’ సినిమా సమయంలో హార్స్‌రైడింగ్ వల్ల బాగా గాయపడ్డాను. ఆ గాయాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా టైమ్‌కి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్న టైమ్‌కి ఆ గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. యూఎస్‌లోని స్పోర్ట్స్ ఫిజియో దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాను. -
మా అమ్మగారి ఆశ నెరవేరింది
‘‘కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ నాకు స్పెషల్. ఎందుకంటే ఆరు సినిమాల ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిత్రం ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘కిషోర్ సెన్సిటివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలాంటిది. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకునే హీరోలు తమిళంలో ఉంటారు. అలాంటి హీరోల్లా సాయి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. మంచి పాటలు కుదిరాయి ’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఇంత మంది దర్శకులకు అవకాశం ఇస్తున్నారంటే సంస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేతల తపన. రైటర్‌గా మా దగ్గర పని చేసిన కిషోర్‌లో చాలా టాలెంట్ ఉంది. తన నుండి చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి. నాకీ కథ చెప్పారు. తేజు హానెస్ట్ పర్సన్. తను తప్ప ఎవరూ ఈ కథకు న్యాయం చేయలేరనిపించింది’’ అన్నారు. ‘‘కిషోర్ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, హిట్స్ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘నవీన్ ఎర్నేనిగారి వల్లే ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్ పెట్టాను. అలాగే యలమంచిలి రవి, మోహ¯Œ గారికి థ్యాంక్స్. నా మూడు సినిమాలకు దేవీగారి మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలుస్తూ వచ్చింది. కార్తీక్ కెమెరామేన్‌గానే కాదు.. కథలో నాతో పాటు ట్రావెల్ అవుతూ వచ్చారు. నేను రైటర్‌గా ఉన్నప్పటి నుండి తేజుతో పరిచయం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు కిషోర్ తిరుమల. ‘‘ఇందులో లహరి అనే పాత్ర చేశాను. సొంత వాయిస్‌తో డబ్బింగ్ కూడా చెప్పాను’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్ . ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నివేదా పేతురాజ్. ఈ వేడుకలో సునీల్, బ్రహ్మాజీ, దర్శకులు సంతోష్ శ్రీనివాస్, వెంకీ కుడుముల, మారుతి, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు. -
తేజ్‌కు మళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయి
సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్ నిర్మించారు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కిషోర్ ఈ టైటిల్ చెప్పగానే బాగా నచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సాయి ధరమ్ తేజ్‌కు మళ్లీ ‘సుప్రీమ్’ డేస్ వస్తాయి అనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘మంచి పాత్ర కోసం చూస్తున్న తరుణంలో కిషోర్‌గారు ఈ పాత్రను ఇచ్చారు. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇంటికి వెళ్తాడు’’ అన్నారు సునీల్.‘‘కిషోర్‌గారు కథ ఎంత బాగా చెప్పారో అంతే బాగా తీశారు. సునీల్ అన్న కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు సాయిధరమ్. ‘‘కిషోర్‌గారు నా పాత్రను బ్యూటి ఫుల్‌గా డిజైన్ చేశారు. సాయిధరమ్, కల్యాణితో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు నివేదా. -
హల్లో హాలీవుడ్!
తమ కథను ఎక్కువ మందికి చేరాలని ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకుంటాడు. అందుకే కేవలం తమ ప్రాంతానికే పరిమితం అయిపోకుండా తమ ఇండస్ట్రీలను దాటి పక్క ఇండస్ట్రీల్లోకి ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలనే ముమ్మరంగా చేస్తున్నారు తమిళ భామ నివేధా పేతురాజ్. ‘తిమిరు పుడిచవాన్, టిక్ టిక్ టిక్’ వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగులో ‘మెంటల్ మదిలో’ నటించారు. లేటెస్ట్గా నివేధా తన అదృష్టాన్ని హాలీవుడ్లో టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. హాలీవుడ్లో ‘అవెంజర్స్’ ఫ్రాంచైజ్‌లో ఓ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్తున్నారామె. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘మే, జూన్ నెలల్లో ఆడిషన్స్ కోసం అమెరికా వెళ్లి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని... ఎప్పటి నుంచో అది నా డ్రీమ్. హాలీవుడ్లో ఏదో ఒకటి సాధిస్తాననే నమ్మకం నాకుంది’’ అని ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం నివేధ చేతిలో మూడు తమిళ చిత్రాలున్నాయి. -
బ్రోచేవారెవరురా..
‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఈ ఏడాది హీరోగా ప్రేక్షకులను మెప్పించారు శ్రీ విష్ణు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నివే«థా థామస్, నివేథా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 2017లో వివేక్–శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన ‘మెంటల్ మదిలో..’ చిత్రం ఆడియన్స్‌ను మెప్పించిన విషయం తెలిసిందే. -
చిత్రా.. లహరి..
ఈ రోజు గురువారం సాయంత్రం కచ్చితంగా ‘చిత్రలహరి’ చూడాలి. ఇలా ప్రతి గురువారం కోసం ఎదురుచూసే రోజులవి. 1990వ దశకంలో ప్రతి గురువారం దూరదర్శన్‌లో వచ్చే ఆ ఆరు పాటల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే పేరు ‘చిత్రలహరి’తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ కథలను అందించే దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. నవంబర్లోనే ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న ఇద్దరి పేర్లు ‘చిత్రా’, ‘లహరి’ అని సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నారట చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. -
ఫుల్ జోష్!
తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే కొత్త సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ శర్వానంద్‌తో ఓ సినిమా చేశారు. ఇది రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే మాలీవుడ్‌లో ‘మరార్కర్: అరబికడలింటే సింగమ్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న తమిళ సినిమా ‘వాన్’లో నటించడానికి ఊ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారీ భామ. ఈ సినిమాతో రా కార్తీక్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. అలాగే ఈ సినిమాలో కృతి కర్భందా మరో కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ‘‘ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్. కథ పరంగా కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఫ్రెష్ ఫేస్ కోసం కల్యాణిని తీసుకున్నాం. తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. ప్రచారంలో ఉన్నట్లు ఇది బైలింగ్వల్ సినిమా కాదు. కేవలం తమిళంలోనే తెరకెక్కిస్తాం’’ అని దర్శకుడు కార్తీక్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు నివేథా పేతురాజ్‌ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచిస్తోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.