Ohio
-
US Presidential Election 2024: ట్రంపే అమెరికా ఆశాకిరణం
మిల్వాకీ: అమెరికా శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం చివరి శ్వాస దాకా పాటుపడతానని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (39) అన్నారు. వారిని అధికార డెమొక్రటిక్ పార్టీ పూర్తిగా విస్మరించిందంటూ మండిపడ్డారు. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్‌లో వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యరి్థగా బుధవారం లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాసీదా, నిరుపేద మూలాలున్న తాను ఇంత దూరం వస్తానని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. ‘‘జీవితంలో ఒక్క మెట్టూ ఎదుగుతూ వచ్చా. ఒకరకంగా సగటు అమెరికన్ కలగనే జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా. వారంతా భద్రమైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తా. ఏ పారీ్టవారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి అమెరికన్‌కూ నా సర్వస్వం ధారపోస్తా. అమెరికా ఎన్నడూ మరిచిపోలేని ఉపాధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్‌పై ప్రశంసల వర్షం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ప్రస్తుతం ఆయనే ఏకైక ఆశాకిరణమన్నారు. ‘‘ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఎవరైనా జీవితంలో కలలుగనేవన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. అయినా అమెరికన్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపించారు. అందుకోసం తిట్లను, వేధింపులను, మరెన్నింటినో సహిస్తున్నారు. నిజానికి ట్రంప్‌కు ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అమెరికా ప్రజలకే ఇప్పుడు ట్రంప్ అత్యవసరం’’ అని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలను కేవలం కెరీర్‌గా మలచుకున్న స్వార్థపరుడంటూ వాన్స్ దుయ్యబట్టారు. బైడెన్ మతిలేని వాణిజ్య ఒప్పందాలు, విదేశీ యుద్ధాలకు అర్థం లేని మద్దతు తన స్వస్థలం ఒహాయో వంటి నిరుపేద అమెరికా ప్రాంతాలను సర్వనాశనం చేశాయంటూ మండిపడ్డారు. పాలక వర్గ ప్రతినిధిగా బైడెన్ ప్రతి చర్యా అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలపరం చేసింది. మన యువతను యుద్ధక్షేత్రాలకు బలిచి్చంది. ఇరాక్ నుంచి అఫ్గానిస్తాన్ దాకా, ఆర్థిక సంక్షోభం నుంచి మాంద్యం, అక్రమ వలసల దాకా ప్రస్తుత పాలక వర్గం అన్ని రంగాల్లోనూ పదేపదే విఫలమవుతూ వస్తోంది. ఈ సమస్యలన్నింటి నుంచి అమెరికాను గట్టెక్కించే చిట్టచివరి, అత్యుత్తమ ఆశాకిరణం ట్రంప్ మాత్రమే. సగటు అమెరికన్‌కు అగ్రతాంబూలమే ఆయన విజన్. ఆయనను పోగొట్టుకుంటే మనకిక భవిష్యత్తుండదు’’ అన్నారు. ‘‘దేశానికి తొలి ప్రాధాన్యమిచ్చే ట్రంప్‌నే అమెరికన్లు గెలిపించుకోబోతున్నారు’’ అని వాన్స్ జోస్యం చెప్పారు.దక్షిణాసియా వలసదారులపై వాన్స్ ప్రశంసలు దక్షిణాసియా నుంచి వచ్చినవారు అమెరికాను సుసంపన్నం చేశా రని వాన్స్ అన్నారు. భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాసియా నుంచి వలస వచి్చనవారి కుమార్తెను నేను పెళ్లాడాను. ఆమెకు పెళ్లి ప్రస్తావన చేసినప్పుడు లా స్కూల్ చదువు కోసం, ప్లాట్ కొనుగోలుకు చేసిన 1.2 లక్షల డాలర్ల అప్పులు నా నెత్తిన ఉన్నాయని చెప్పా. అయినా పెళ్లికి అంగీకరించింది’’ అని చెప్పారు. తన వ్యక్తిగత, ఆధ్యాతి్మక జీవితంపై భార్య ప్రభావం ఉందన్నారు. తల్లి బెవర్లీని సభకు పరిచయం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.భారతీయ వంటలు నేర్చుకున్నారు: ఉషవాన్స్ గొప్ప ఉపాధ్యక్షునిగా తనను తాను నిరూపించుకుంటారని భార్య ఉషా చిలుకూరి (38) విశ్వాసం వెలిబుచ్చారు. వాన్స్ ప్రసంగానికి ముందు ఆయనను రిపబ్లికన్ కన్వెన్షన్‌కు ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ‘‘జేడీది నిరుపేద స్థానిక శ్వేతజాతి కుటుంబం. నాదేమో భారతీయ వలసదారుల కుటుంబం. అలాంటి మేం కలుసుకోగలిగామన్నా, ప్రేమలో పడి పెళ్లి చేసుకోగలిగామన్నా కేవలం అమెరికా గొప్పదనమే అందుకు కారణం’’ అన్నారు. ‘‘నా భారతీయ జీవన శైలి గురించి జేడీ ఆసక్తిగా అన్ని విషయాలూ తెలుసుకున్నాడు. పక్కా మాంసాహారి అయినా నా శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డాడు. మా అమ్మనడిగి భారతీయ వంటకాలు చేయడం నేర్చుకున్నాడు’’ అన్నారు. -
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఉమా సత్యసాయి గద్దె స్వస్థలం, ఇతర నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio. Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India. All possible assistance is being extended including to transport… — India in New York (@IndiainNewYork) April 5, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం. మరీ ముఖ్యంగా.. ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీ స్టూడెంట్ నీల్ ఆచార్య, జార్జియాలో వివేక్ సైనీ హత్య ఘటనలు షాక్‌కి గురి చేశాయి. అదే సమయంలో భారతీయ, భారత సంతతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు సైతం జరిగాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం సైతం ఈ ఘటనల్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో చోటుచేసుకున్న నాలుగో ఘటన ఇది. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో లిండ్నెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డి బెనిగెరి అనే తెలుగు విద్యార్థి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని, అతడి మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం గురువారం తెలిపింది. శ్రేయస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, సాధ్యమైనంత మేర వారికి సాయం అందజేస్తామని పేర్కొంది. శ్రేయస్ రెడ్డి తండ్రి త్వరలోనే అమెరికా రానున్నారని తెలిపింది. -
కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి
సిన్సినాటి: అమెరికాలోని ఓహియోలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిత్య అడ్లఖా(26) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న తుదిశ్వాస విడిచారు. ఓహియో రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో డాక్టరేట్ చేస్తున్న ఆదిత్య ఈనెల 9న కారులో వెళ్తుండగా దుండగులు పలుమార్లు అతడిపైకి కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడగా, కారు అదుపుతప్పి గోడను ఢీకొని ఆగిపోయింది. ఆదిత్యను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 18న అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రాంజస్ కాలేజీలో బీఎస్సీ, 2020లో ఎయిమ్స్‌లో ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అతడు సిన్సినాటి యూనివర్సిటీలో జాయినయ్యారు. కాగా, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దుండగుడి కాల్పులకు బలైపోయాడు. నార్త్ ఇండియాకు చెందిన వైద్య విద్యార్థి ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే కాల్పులు జరిపారు. ఈ సంఘటన నవంబర్ 9న జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత తుదిశ్వాస విడిచాడు. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదిత్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆదిత్య అద్లాఖా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్లో మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో నాల్గవ సంవత్సరం డాక్టరల్ విద్యార్థి. వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది. దీంతో అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని యూసీ మెడికల్ సెంటర్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు బుల్లెట్ రంధ్రాలను గుర్తించామని విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. యూనివర్శీటీ సీనియర్లతోపాటు ఆరోగ్య వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డీన్ ఆండ్రూ ఫిలక్ అద్లాఖా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్లో అద్లాఖా అద్భుతమైన పరిశోధన చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీలో పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లాడు. -
ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి...
వాషింగ్టన్: అమెరికాలో ఒక కుటుంబంలోని అక్కాచెల్లెళ్ల తోపాటు వారిలో ఒకరి కుమారుడు.. ముగ్గురికీ ప్రపంచ పోకడ నచ్చక జనాల ఉనికంటూ లేని ప్రదేశానికి వెళ్లి బ్రతకాలనుకున్నారు. చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు. గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను అటాప్సీ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గన్నిసన్ కౌంటీ అధికారి మైకేల్ బార్నెస్ తెలిపిన వివరాల ప్రకారం మృతులను క్రిస్టీన్ వాన్స్(41), రెబెక్కా వాన్స్(42), రెబెక్కా వాన్స్ కుమారుడు(14) గా గుర్తించారు. కొలరాడోలోని ఓహియో సిటీకి 14 కిలోమీటర్లకు దూరంలో వీరు దయనీయ స్థితిలో చనిపోయి ఉన్నారని తెలిపారు. ఆకలి బాధలకి తాళలేక ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా రెబెక్కా వాన్స్ బంధువుల్లో ఒకరిని ఆరా తీయగా రెబెక్కాకు ప్రపంచం తీరు నచ్చేది కాదు. తనతోపాటు క్రిస్టీన్ ను తన కుమారుడిని కూడా జనజీవన స్రవంతికి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి ఒంటరిగా జీవించాలని చెప్తూ ఉండేదని తెలిపారు. అజ్ఞాతంలోకి వెళ్లి బ్రతకడమెలా అని యూట్యూబ్ వీడియోలు చూసి అరకొర అవగాహనతో నిర్మానుష్య ప్రాంతానికి సరైన సిద్ధపాటు లేకుండా వెళ్లిపోవడం వలననే వారు దయనీయంగా మృతి చెందారని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే.. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్‌కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం -
ఓహియో రాష్ట్రంలో వాతావరణం విషపూరితం
-
అందాలరాశిని పెళ్లాడి అదే ఇంట్లో కాపురం పెట్టాడు.. అయితే అంతకంటే ముందే!
నిశబ్దపుచెరలో చిక్కిన ఒంటరితనానికీ, నిశీధి నీడలో నక్కిన రాతిరికీ.. అసలైన రారాజు ‘భయం’. ఆ భయం తెరలు మనసుని అలముకున్నప్పుడు.. ఎక్కడో దూరంగా కుక్క మొరిగినా.. కాస్త దగ్గర్లో పిల్లి నడిచినా.. చివరికి చిరుగాలి వీచి చిన్న కాగితం ముక్క రెపరెపలాడినా సరే.. గుండె అదరడం ఖాయం. అలాంటిది ఇంట్లోనే ఆత్మలు తిరిగితే? దెయ్యాలు వికృత చేష్టలు చేస్తుంటే? ఆ ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ? అమెరికాలోని ది బెల్లెయిర్ హౌస్ అలాంటిదే. పరిశోధకులే పలు నిర్ధారణలతో నిరూపించిన నిజమిది. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయి? ఎలా గుర్తించారు? చదవండి ఈ వారం మిస్టరీలో.. అది 1847. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని బెల్లెయిర్ విలేజ్‌లో ఎకరం స్థలంలో ఈ ఇంటిని నిర్మించారు. అది ఒహైయో నదీతీర ప్రాంతం. ఆ ఇంటి భూగర్భంలో మైనింగ్ జరుగుతూ ఉండేది. జాకోబ్ హెతెరింగ్టన్ అనే గనుల తవ్వకాల వ్యాపారి.. ఎలిజా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే అందాలరాశిని పెళ్లాడి అదే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే పెళ్లికి ముందు మొదటిసారి జాకోబ్‌ని కలవడానికి ఆ ఇంటికి వచ్చిన ఎలిజా.. ఒహైయో నదీతీరంలో ఆకాశం నుంచి రాలి పడిన ఓ తారను చూసింది. అలా చూస్తే అమెరికన్లు దాన్ని అపశకునంగా భావిస్తారు. ఊహించినట్లే పెళ్లి తర్వాత ఎలిజా ఆ ఇంట్లో ఎన్నో విచిత్రపరిణామాలు చూసిందనేది వినికిడి. దానికి కారణం ఆ ఇంటి సమీపంలో ఒహైయో నది ఒడ్డునే 1754 నుంచి 1763 వరకూ ఫ్రెంచ్–ఇండియన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చనిపోయిన వారంతా అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది స్థానికంగా. మరోవైపు ఇంటి వెనుకున్న ఓ గుహలో షానీ జాతి అమెరికన్లు.. చనిపోయిన తమ వంశస్థుల శవాలను అక్కడే పూడ్చిపెట్టేవారు. అలా పూడ్చిన సమాధుల్లో క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్ల మృతదేహాలూ ఉండటంతో ఆ నెగెటివ్ ఎనర్జీ.. బెల్లెయిర్ హౌస్ చుట్టే తిరుగుతోందని ఆనాటి హారర్ వార్త. ఆ నేపథ్యంలో ఆ ఇంట్లో ఓ దుర్ఘటన జరిగింది. మైనింగ్ వ్యాపారిగా ఉన్న జాకోబ్.. అంచలంచెలుగా ఎదుగుతున్న సమయమది. ఆ ఇంటి భూగర్భంలో ఉన్న ఓ గనిలో అగ్ని ప్రమాదం జరిగి 42 మంది సజీవదహనం అయ్యారు. ఆ నష్టనివారణలో జాకోబ్ చాలా ఆస్తుల్ని కోల్పోయాడు. కొంతకాలానికి జాకోబ్ చనిపోతూ.. తన గనుల వ్యాపారాన్ని కొడుకు అలెక్స్‌కి అప్పగించాడు. జాకోబ్ మనవరాలు లైడ్ కూడా అలెక్స్‌కి మైనింగ్ వ్యాపారంలో తోడుగా నిలిచింది. ఆ ఇంట్లో జరిగిన పరిణామాలతో అలెక్స్ చాలా ఇబ్బందిపడ్డాడు. ‘దెయ్యాలు నన్ను చంపేస్తాయి’ అంటూ చాలా భయపడేవాడు. పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే మైనింగ్ వ్యాపారం చేజెక్కించుకున్న లైడ్ ఆ ఇంట్లోని డైనింగ్ రూమ్‌లో శవమై కనిపించింది. మేరీ అనే ఆ ఇంటి పనిమనిషి కూతురు ఇంటి కిటికీ నుంచి కిందపడి చనిపోయింది. దాంతో ఎన్నో ఏళ్లు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. అయితే ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో కదలాడుతున్నట్లు.. లోపల ఎవరో ఉన్నట్లు.. కిటికీల్లోంచి ఎవరో తొంగి చూస్తున్నట్లుగా అనిపించేదట స్థానికులకు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, రైటర్, ప్రస్తుత ఇంటి యజమాని క్రిస్టిన్ లీ అనే మహిళ కూడా ఆ ఇంట్లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. దాంతో ఆ ఇంటి చరిత్రపై.. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది అనే దానిపై పరిశోధనలు చెయ్యడం మొదలుపెట్టింది. దానికి సంబంధించి ‘పారానార్మల్ కన్ఫెషన్’ అనే పుస్తకమూ రాసింది. అందులో అక్కడున్న దెయ్యాల గురించి, వాటి ప్రవర్తన గురించి వివరించింది. అంతేకాదు కొందరి పరిశోధకుల సాయంతో అక్కడ నిజంగానే ఆత్మలు ఉన్నాయని నిరూపించింది. 20వ శతాబ్దం నుంచే ఆ ఇల్లు దెయ్యాల వశమైందనీ, రకరాకాల నెగెటివ్ ఎనర్జీలన్నీ అక్కడ పోగయ్యాయనీ, అందులో మంత్రగాళ్లు, సైనికులు ఇలా చాలా ఆత్మలు ఉన్నాయనీ పరిశోధకులు తేల్చారు. అక్కడ ఆత్మలతో మాట్లాడిన వీడియోలు యూట్యూబ్‌లో కూడా బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం క్రిస్టిన్ లీ ఆధ్వర్యంలో.. 175 ఏళ్ల నాటి ఈ ఇల్లు ఆత్మల నిలయంగా మారి ఉత్సాహవంతులు, సాహసికులకు రాత్రిళ్లు విడిది ఇచ్చే టూరిస్ట్ ప్రాంతంగా మారిపోయింది. అక్కడకి వెళ్లి కొన్ని గంటలు ఆ ఇంట్లో గడిపి, అక్కడ జరిగే వింతలను స్వయంగా ఆస్వాదిస్తున్నారు భూతప్రేతాత్మ ప్రియులు. తమ అనుభవాలను ఎంతో గొప్పగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. మొత్తం ఐదు కారణాలు ఆ ఇంటి నుంచి ఆకాశంలోకి చూస్తే.. అంగారక, శని, బుధ, శుక్ర, గురు గ్రహాలు కనిపిస్తాయట. ఆ గ్రహాల నెగెటివ్ ప్రభావం కూడా ఆ ఇంటిపై ఉండవచ్చునని పరిశోధకులు తేల్చారు. మొత్తంగా.. యుద్ధంలో సైనికుల ఆత్మలు, ఆకాశం నుంచి రాలిన తార, గుహలో సమాధులు, గనిలో ప్రమాదం, గ్రహాల ప్రభావం.. ఇలా ఐదు ప్రధాన కారణాలతో ప్రేతాత్మలు, నెగెటివ్ ఎనర్జీలు బెల్లెయిర్ హౌస్‌పై పడ్డాయనేది పరిశోధకుల మాట. ‘చనిపోయిన తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలంటే.. ఆ ఇంటికి వెళ్లాల్సిందే’ అంటున్నారు సాహసికులు. ఏది ఏమైనా అమెరికాలో దెయ్యాల భయంతో ఖాళీ అయిన నాలుగు అతిపెద్ద ఇళ్లల్లో ఇదీ ఒకటి. నిజంగానే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? స్థానికంగా ఉన్న భయాన్ని అవకాశంగా తీసుకుని.. టూరిజం డెవలప్మెంట్ కోసం సాగుతున్న డ్రామానా అనేది నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా -
అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి
వాషింగ్టన్: ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చైనా జెట్ విమానాలు కొన్న పాక్) -
జుకర్ బర్గ్‌పై మరో పిడుగు, ఫ్రాన్సెస్ హౌగెన్ ఎంత పని చేశావమ్మా..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఒహాయో అటార్నీ జనరల్ డేవిడ్ యోస్ట్ మెటాపై (ఫేస్బుక్) దావా వేశారు. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఆరోపణల కంటే ఇప్పుడు ఒహాయో అటార్నీ జనరల్ వేసిన దావా చాలా ప్రమాదకరమని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెట్టిన చిచ్చుకంటే ఇదే పెద్దది ఓహియో అటార్నీ జనరల్ మెటాపై పరువు నష్టం దావా వేశారు. ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఒహాయో పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారుల తరపున ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగిగా మారిన విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ మొదట వాల్ స్ట్రీట్ జర్నల్‌కు అంతర్గత పత్రాలను లీక్ చేశారు. ఆ లీక్ చేసిన డాక్యుమెంట్లు కారణంగా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారులు 100 బిలియన్ల మార్కెట్ వాటాను కోల్పోయినట్లు డేవిడ్ యోస్ట్ చెప్పారు. అయితే ఈ దావా మార్క్ జుకర్బర్గ్లాంటి వ్యక్తుల గురించి కాదని, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దావాతో పెన్షన్ ఫండ్ నష్టాలను తిరిగి పొందవచ్చని, అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండటానికి కంపెనీ మార్పులు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు యోస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్బుక్ పై కఠిన చర్యలు తప్పవ్ డేవిడ్ యోస్ట్ చేసిన కేసు అంశంపై మెటా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌పై నమోదైన ఫిర్యాదుల కంటే యోస్ట్ వంటి రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన కేసు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎనలిస్ట్ బ్లెయిర్ లెవిన్ చెప్పారు. కోర్టు మెటాను మరిన్ని అంతర్గత పత్రాలను పబ్లిక్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని, తద్వారా ఫేస్‌బుక్‌కు మరిన్ని చిక్కులు తప్పవని లెవిన్ చెప్పారు. గతంలోనే యోస్ట్ లేఖ 40 మంది రాష్ట్ర అటార్నీ జనరల్‌లలో ఒకరైన యోస్ట్ గతంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్‌కు లేఖ రాశారు. పిల్లల కోసం డిజైన్ చేసే ఇన్స్టాగ్రామ్ వెర్షన్‌పై ఆంక్షలు విధించాలని జుకర్ బెర్గ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
ఒహియోలో మహానేత రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
కొలంబస్ (ఒహియో): డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఒహాయో రాష్ట్రం లో కొలంబస్ నగరం లో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వినోద్ రెడ్డి డేగ, ఉదయ కిరణ్ బసిరెడ్డి గారి నాయకత్వం లో చక్రధర్ కోటి రెడ్డి నరేంద్ర రూక, రాజీవ్ రెడ్డి పెనుబోలు, కిషోర్ కుర్రి తిరు గాయం. రామ్ సోనేపల్లి మరియు గోవర్ధన్ ఎర్రగొండ, సుబ్బా రెడ్డి కోవూరు, ప్రశాంత్ తల్లపురెడ్డి, ప్రహ్లాద రెడ్డి కంభం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనది. -
ఫైజర్ ట్రైల్స్ : చావు బతుకుల మధ్య బాలిక
ఓహియో : ఫైజర్ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొన్న ఓ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వీల్ ఛైర్‌కు పరిమితమై అల్లాడిపోతోంది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన స్టెఫినీ డి గ్రే కూతురు 12 ఏళ్ల మ్యాడీ డీ గ్రే ఫైజర్ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొంది. కొద్ది రోజుల క్రితం ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. ఆ తర్వాతి నుంచి కడుపులో, రొమ్ము భాగంలో నొప్పి రావటం మొదలైంది. ‘‘ అమ్మా! నాగుండె గొంతులోంచి బయటకు వస్తున్నట్లు ఉంది’ అంటూ తన బాధను తల్లికి చెప్పుకుంది. ఆ తర్వాత గ్యాస్ట్రోపారెసిస్, న్యూసియా, వాంతులు రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీనిపై స్టెఫినీ మాట్లాడుతూ.. ‘‘ తనకు తిన్న ఆహారం అరగటం లేదు. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. కనీసం ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉంది. వీల్ ఛైర్‌కు పరిమితమైంది. మెడ పైకెత్తడానికి వీలులేకుండా ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ, ఫైజర్ యాజమాన్యం కానీ, దీనిపై స్పందించలేదు. నా కూతురికి ఎందుకిలా జరుగుతోందో వాళ్లు కనిపెట్టాలి. ఈ మేరకు పరిశోధనలు జరగాలి. ముఖ్యంగా ట్రైల్స్‌లో పాల్గొంటున్న వారి విషయంలో. ట్రైల్స్‌లో భాగంగా అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన చికిత్స అందేలా ఉండాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది’’ అని పేర్కొంది. -
కరోనా వ్యాక్సిన్: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే..
వాషింగ్టన్: కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ రూపొందించారు. కరోనా కట్టడికి ఏకైక పరిష్కారం వ్యాక్సినేషనే. ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ వేయించేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కొన్ని దేశాలు, రాష్ట్రాలు బహుమతులు, ప్రోత్సహాకాలు, సహాయం వంటివి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒహియో రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే అక్షరాల 7 కోట్లకు పైగా డబ్బులు మీ సొంతమే. అమెరికాలోని ఒహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్ వేయించుకుంటే లాటరీలో పాల్గొనవచ్చు. అందులో గెలిస్తే ఒక మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం ఎన్నో సాధించాం. ఈరోజు మనం సురక్షితంగానే ఉన్నాం. భవిష్యత్‌లో మెరుగైన సమాజం కోసం.. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ వేయించుకోండి’ గవర్నర్ పిలుపునిచ్చారు. మే 26వ తేదీన తేదీన లాటరీ ఓపెన్ చేసి విజేతను ప్రకటిస్తామని గవర్నర్ మైక్ డివైన్ తెలిపారు.. 18 ఏళ్లు పైబడిన వారికి లాటరీలో ఒక మిలియన్ డాలర్ల నగదు అందిస్తామని వెల్లడించారు. మే 18వ తేదీ నుంచి పెద్ద వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వివరించారు. ఇక 17ఏళ్లలోపు వారందరూ వ్యాక్సిన్ వేసుకుంటే గెలిచిన వారికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు Also starting May 26th, we will announce the winner of a drawing of all those 17 years-old and under who are vaccinated. The winner will receive a full, four-year scholarship to our state universities. We will do this every Wednesday, for five straight Wednesdays. — Governor Mike DeWine (@GovMikeDeWine) May 13, 2021 -
బిల్లు 500.. టిప్పు 2 లక్షలు!
క్లీవ్‌లాండ్: ఓహియో రాష్ట్రం (అమెరికా) క్లీవ్‌లాండ్ నగరంలోని ఓ రెస్టరెంట్‌కు ఆదివారం ఒక కస్టమర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు 500 రూపాయలు) బిల్లుకి 3,000 డాలర్ల (సుమారు రూ. 2.21 లక్షలు) టిప్పు కలిపి మొత్తం 3,007 డాలర్లు చెల్లించాడు. రెస్టరెంట్ యజమాని బ్రెండన్ రింగ్ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ.. ‘‘ఓహియోలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రెస్టరెంట్‌ను స్వచ్ఛందంగా జనవరి వరకూ మూసివేయాలనుకున్నాం. చివరి రోజు కావడంతో ఆదివారం రెస్టరెంట్ కిటకిటలాడుతూ ఉంది. అంతలో అప్పుడప్పుడు మా దగ్గరికొచ్చే ఒక కస్టమర్ లోపలికొచ్చాడు. ఒక స్టెల్లా డ్రింక్ ఆర్డర్ చేశాడు. రెండు సిప్పులు తాగిన తర్వాత ‘చెక్’ ఇమ్మన్నాడు. దాన్ని తీసుకుని రింగ్ టేబుల్ వద్దకొచ్చిన అతను బిల్లుతో పాటు రింగ్‌కు డబ్బులిస్తూ ‘‘గుడ్‌లక్. మళ్లీ కలుద్దాం!’’ అని వెళ్లిపోయాడు. ఆ బిల్లుపై టిప్పు ముందు 300 గా కనబడింది. కళ్లజోడు పెట్టుకున్నాక గానీ అది 3,000 అని తెలియలేదు. వెంటనే బయటకు పరుగు తీసి అతన్ని కలిసాను. ‘‘ఏమైనా పొరబడ్డారా?’’ అని అడిగాను. అందుకతను ‘‘లేదు. తెలిసే ఇచ్చాను. దాన్ని స్టాఫ్ అందరికీ పంచండి. మెరీ క్రిస్మస్’’ అన్నాడు. ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానని మొదట ఒక వెయిట్రెస్ నమ్మలేదు. ఆ రోజు నలుగురు డ్యూటీలో ఉన్నారు. తలా 750 డాలర్లు ఇచ్చాను’’ అని వివరించాడు. అయితే తన పేరు బయటపెట్టొద్దని ఆ కస్టమర్ కోరాడని రింగ్ తెలిపాడు. ఈ సంఘటన పేపర్లో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ‘అజ్ఞాత’ కస్టమర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన సోదరి కూడా ఈ విషయాన్ని పేపర్లో చదివిందని ఉత్సాహంగా చెప్పాడు రింగ్. ‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప కథలా కనిపిస్తుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. -
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
సాక్షి, గుడ్లవల్లేరు: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. కోటి ఆశలతో సప్త సముద్రాలు దాటి వెళ్లిన యువతి నూరేళ్ళ జీవితాన్ని చిదిమేసింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జలరక్కసి మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. -
ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట
వాషింగ్టన్ : ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేరోజున ఒకే హాస్పిటల్లో ప్రసవించిన ఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం..దనీషా హేన్స్, ఏరియల్ విలియమ్స్, ఆష్లే హేన్స్ అనే అక్కాచెల్లెళ్లు ఈనెల 3న ఒకే ఆసుపత్రిలో కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో బిడ్డలకు జన్మనిచ్చినట్లు మాన్స్ఫీల్డ్ న్యూస్ జర్నల్ నివేదించింది. . 50 మిలియన్లలో ఎవరో ఒక్కరికి ఇలా జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ముగ్గురికీ డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఒకరే కావడం విశేషం. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించాడని తెలుస్తోంది. ఇక ఒకేరోజు తమ బిడ్డలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని ముగ్గురు సోదరీమణులు పేర్కొన్నారు. మొదటగా విలియమ్స్ పురుడు పోసుకోగా పాపకు సిన్సిర్ అని పేరు పెట్టారు. ఈమె బరువు 8 పౌండ్లు ఉండగా, తదనంతరం ఆష్లే హేన్స్ ..అడ్రియన్ అనే కుమారుడికి జన్మనివ్వగా అతని బరువు 10 పౌండ్లు ఉంది. చివరగా ప్రసవించిన దనీషాకు పుట్టిన శిశువుకు ఎమ్రీ అని నామకరణం చేశారు. అందరికంటే ఈ చిన్నారి బరువు 14 పౌండ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవజాత శిశువుల బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై తల్లి డెబోరా వేర్ స్పందిస్తూ..ఇక మా పార్టీలో అదనంగా వేరే పిల్లలు ఉండరేమో అంటూ చమరత్కరించారు. (ఆ బాబు నిజంగానే మూడు కళ్లతో జన్మించాడా?) -
‘పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిలో మన పాత్ర పోషిద్దాం’
ఓహియో(అమెరికా): ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెస్తోన్న అద్భుతమైన మార్పులు విద్యార్థులకు ఎంతో మేలు చేయనున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తెలిపారు. ఆ యజ్ఞంలో తమ వంతు పాత్రగా ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తే.. మెరుగైన ప్రణాళికలో భాగస్వామ్యులు అవ్వాలని కోరారు. ‘విద్యామూలం ఇదం జగత్’, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న రెండు కార్యక్రమాలను తక్షణ కర్తవ్యంగా ఎంచుకున్నామని రత్నాకర్ వెల్లడించారు. అభిమాన మిత్రుడికి ఆత్మీయ సత్కారం అమెరికాలోని గ్రేటర్ క్లీవ్ లాండ్ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా పండుగాయల రత్నాకర్‌ను సత్కరించింది. ఓహియో క్లీన్ లాండ్లో సబర్బన్ ప్రాంతమైన మిడిల్ బర్గ్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల కోసం రత్నాకర్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తిందన్నారు. అమెరికా, కెనడా దేశాలలో ప్రవాసాంధ్రులకు ఏ ఇబ్బంది ఉన్నా.. నేనున్నానంటూ ముందుకొచ్చే రత్నాకర్.. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార రంగంలోకి వచ్చిన ఎంతో మందికి తనవంతు సహకారం అందించారని చెప్పారు. భవిష్యత్తులో రత్నాకర్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రవాసాంధ్రులకు చేరువవుతారని నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణ ప్రసాద్ మువ్వ, ఉపాధ్యక్షులు శివ భీమవరపు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ తెలుగు అసొసియేషన్ ట్రస్టీ గిరిరాజు అయ్యగారి, సంస్థ ఫౌండర్ డా.సీతారామరెడ్డి తొండపు, డా.లక్కిరెడ్డి మురళి, డా. ఛార్లెస్ తోడెటి, రాజశేఖర్ కల్లం, హరినాథ్ బత్తిని, సూర్య బుద్ధవరపు, యోగశ్వరరెడ్డి, కిషోర్ కుమార్, అర్జున్, పవన్ కుమార్, శశిధర్, రమేష్ పసుమర్తి పాల్గొన్నారు. అలాగే క్లీవ్ లాండ్లో వైఎస్సార్సీపీ సభ్యులు రవి పచిపాల, సలీం షేక్, వెంకట్ మట్ట, రామ్ మేడపాటి, రవి నూక, నరేష్ బొద్దు, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి
వాషింగ్టన్/హ్యూస్టన్: వరుస కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా షాక్‌కు గురైంది. 24 గంటల్లో చోటుచేసుకున్న రెండు కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. ఇందులో ఒకటి విద్వేషపూరిత ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది. టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలో శనివారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఓహియో రాష్ట్రం డేటన్ నగరంలో జరిగిన మరో ఘటనలో అగంతకుడు సహా 10 మంది చనిపోయారు. రెండు ఘటనల్లో 40 మందికిపైగా గాయపడ్డారు. ఎల్‌పసో ఘటనను అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం నైట్‌క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌కు పేరుగాంచిన డేటన్ నగరం ఓరెగన్ డిస్ట్రిక్ట్‌లో శనివారం అర్థరాత్రి(స్థానిక కాలమానం) దాటిన తర్వాత జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మట్టుపెట్టారు. ఈ ఘటనకు కారణాలు, అగంతకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయపడిన 16 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగంతకుడు అక్కడికి దగ్గర్లోని బార్ వైపునకు వెళ్తూ తన వద్ద ఉన్న .223 హైకెపాసిటీ గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అగంతకుడిని కాల్చి చంపారని, లేకుంటే మరింత ఘోరం జరిగి ఉండేదన్నారు. జాత్యహంకార ఘటన.. అంతకుముందు శనివారం ఉదయం(స్థానిక కాలమానం) టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 20 మంది చనిపోగా 26 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. ‘శనివారం ఉదయం వాల్‌మార్ట్ స్టోర్ కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంది. అదే సమయంలో దుండగుడు(21) వెంట తెచ్చుకున్న అసాల్ట్ రైఫిల్‌తో యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 26 మంది గాయాలపాలయ్యారు’ అని ఎల్‌పసో పోలీస్ చీఫ్ గ్రెగ్ అలెన్ తెలిపారు. క్షతగాత్రుల్లో 2 ఏళ్ల బాలుడు సహా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు తెగబడిన అనంతరం నిందితుడు పాట్రిక్ క్రుసియస్(21) పోలీసులకు లొంగిపోయాడు. ‘డల్లస్కు చెందిన క్రుసియస్ శ్వేత జాత్యంహకార, విద్వేషపూరిత ధోరణితో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దేశంలోకి హిస్పానిక్, లాటిన్ అమెరికా దేశాల ప్రజల వలసల కారణంగానే టెక్సస్‌లో స్థానికులకు ఉద్యోగాలు దొరకకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పలు పోస్టులు చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని సమర్థించాడు’ అని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం అతడి ట్విట్టర్ ఖాతాను పోలీసులు మూసివేశారు. అతడిపై ఉగ్రవాదం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. రోదిస్తున్న బాధితురాలు -
అమెరికాలో మరోసారి కాల్పులు.. 9 మంది మృతి
ఓహియో: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికింది. ఓహియో, డేటాస్‌లోని ఓ బార్ వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, 16 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. తాము కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని.. దుండగుడిని మట్టుబెట్టినట్టు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు కొన్ని గంటల ముందే టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక రోజు వ్యవధిలోనే అగ్రరాజ్యంలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి -
విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!
ఓహియో/కొలంబస్ : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు వ్యక్తులకు ఆర్థిక చేయూతనందించాలని ‘గో ఫండ్ మీ’ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. కారు ప్రమాదంలో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనైన అశోక్ అధికారి, సౌజన్య బండ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో జనం తమకు తోచినంత సాయం చేస్తే ‘ఆర్థిక అత్యవసర స్థితి’లో ఉన్న ఈ ఇద్దరి ప్రాణాలు నిలుస్తాయని తెలిపింది. ‘ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన అశోక్, వివాహిత సౌజన్య కుంటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దాతలు ముందుకొచ్చి చేయూతనందిస్తే.. వారు కోలుకుంటారు. మీ వంతుగా సాయమందించడంతో పాటు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి చేయండి. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడమే మా కర్తవ్యం’అని గో ఫండ్ మీ తెలిపింది. మీ వంతు సాయాన్ని ఈ కింది లింక్ ద్వారా అందించండి : https://www.gofundme.com/f/critical-car-crash-ashok-and-soujanya?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cp+share-sheet ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఆఫీస్ అనంతరం తన సహోద్యోగులు అశోక్ అధికారి, సౌజన్య బండను ఇళ్ల వద్ద దింపేందుకు నిఖిల్ గోపిషెట్టి తన కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. అశోక్ ఇంటికి మరో నిముషంలో చేరుతామనగా బెతెల్ రోడ్డు (కొలంబస్)పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రికి తరలించారు. అఖిల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, అశోక్, సౌజన్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. మెదడుకు గాయాలు : రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రి అశోక్, సౌజన్య ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తలకు బలమైన గాయాలతో పాటు సౌజన్యకు మడమ, చెవి భాగంలోనూ గాయాలయ్యాయి. ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అశోక్ వెన్నుపూస, భుజం, పక్కటెముకలు విరిగిపోయాయి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అమెరికా రావాల్సిందిగా సమాచారమిచ్చాం. -
నేనైతే.. నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని
కొలంబస్ : భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు ఆటపట్టించుకోవటం మామూలే. కొంతమందైతే ఒకరినొకరు భయపెట్టుకుని సరదా పడుతుంటారు. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించటానికి అతని భయాన్ని ఆసరాగా చేసుకుంది. సరదాగా ఆమె చేసిన పనికి భర్త హడలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించాలని అనుకుంది. భర్తకు ఓఫిడియోఫోబి ఉండటంతో ఆమెకు కలిసోచ్చింది. అనుకున్నదే తడవుగా ఉత్తరాలు వగైరా పడేసే మెయిల్ బాక్స్‌ను ఇందుకు అనువుగా ఎంచుకుంది. భర్త రోజూలాగే ఆ రోజు కూడా ఉత్తరాల కోసం ఇంటి బయట ఉన్న బాక్సును తెరిచాడు. అంతే! లోపల నల్లటి త్రాచు పాము ఉండటం చూసి ఒక్కసారిగా హడలి బిక్కచచ్చిపోయాడు. లోపల ఉన్న పామును బయటకు రాకుండా చేయటానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు అది బొమ్మపామని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాడు. అది తన భార్య పనేనని తెలిసి ఆమెపై రంకెలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ఆ స్థానంలో నేనుంటే గనుక నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. -
అమెరికాలో సిక్కు డ్రైవర్ మృతి
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సిక్కు ట్రక్ డ్రైవర్ మరణించాడు. ఈ నెల 12న ఒహయోలో జస్ప్రీత్ సింగ్(32) అనే ట్రక్కు డ్రైవర్‌పై బ్రోడరిక్ మలిక్ జోన్స్ రాబర్ట్స్(20) కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జస్ప్రీత్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21న కన్నుమూశాడు. జస్ప్రీత్ ట్రక్‌లో ఉండగా దోపిడీకి ప్రయత్నించిన రాబర్ట్స్.. అతను ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేయనున్నారు.