Okkadu Migiladu
-
లుక్ మార్చేస్తున్న యంగ్ హీరో
హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. మంచు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కథానాయకుడు స్టార్ ఇమేజ్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్, త్వరలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు చందు డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మనోజ్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే వెయిట్ తగ్గేందుకు మనోజ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ అయినా మనోజ్‌కు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
‘సెంటర్‌ని నమ్ముకుంటే...’
ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ రంగం నుంచి కూడా మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే యంగ్ నిఖిల్, దర్శకుడు కొరటాల శివ వంటి వారు హోదా కోసం తమ గళం వినిపించగా బీవీయస్ రవి, కొనవెంకట్లు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో యంగ్ హీరో మంచు మనోజ్ కూడా చేరిపోయాడు. తాజాగా ట్వీటర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఘాటుగా స్పందించాడు మనోజ్. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించిన విషయం గుర్తు చేసిన ఓ అభిమానికి సమాధానంగా ‘మనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తా అన్నారు. చిప్ప తప్ప ఏమీ మిగల్లా. సెంటర్ ని నమ్ముకుంటే సంకనాకి పోతాం.’ అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీని నమ్మాలన్న ప్రశ్నకు సమాధానంగా నిన్ను నువ్వు నమ్ముకోవటం బెస్ట్ అని సమాధానమిచ్చారు. స్టేటస్ అయినా, ప్యాకేజ్ అయిన ఇవ్వాల్సింది సెంటర్ కదా ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్నకు బదులుగా ‘దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టేవరకు మనకి ఈ బానిస బతుకులు తప్పవ్’ అంటూ విమర్శించారు. -
మంచు మనోజ్ మరో ప్రయాణం..!
స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ ఆ స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరీర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే హిట్ ఒక్కటి కూడా పడలేదు మనోజ్‌కు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనోజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తనకు ప్రయాణం లాంటి డిఫరెంట్ సినిమాను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, ఇంత వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా సాధించలేదు. చివరగా మనమంతా సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్ సినిమా అని మాత్రం అనిపించలేకపోయాడు. మనోజ్ కమర్షియల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు ఏలేటి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
రౌండప్ చేశారు!
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... ఇలా భాష ఏదైనా, పాత్ర ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు సుహాసిని. కాదు.. జీవిస్తారంటే బాగుంటుంది. క్యారెక్టర్ నటిగా మారిన తర్వాత కూడా మంచి రోల్స్ చేస్తున్నారామె. ఈ నెలలో మంచు మనోజ్ హీరోగా రిలీజైన ‘ఒక్కడు మిగిలాడు’లో మంచి పాత్రలో కనిపించారు. ఇప్పుడు రెండు కన్నడ సినిమాల్లో నటించేందకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి తమిళ ‘పవర్ పాండి’కి రీమేక్. తమిళ హీరో, నిర్మాత అయిన ధనుష్ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా మారిన విషయం తెలిసే ఉంటుంది. సినిమాకి మంచి ప్రశంసలు రావడం, యూనివర్సల్ కథాంశం కావడంతో బాగుంటుందని కన్నడంలో రీమేక్ చేయాలనుకున్నారట. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ చేసిన పాత్రను అంబరీష్ చేయనున్నారు. ధనుష్ చేసిన గెస్ట్ రోల్‌ను సుదీప్, ఓ కీలక పాత్రను సుహాసిని చేయనున్నారు. ఈ చిత్రానికి ‘అంబి నింగె వయసాయితు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది కాకుండా కన్నడ నటుడు అనంతనాగ్ నటించనున్న సినిమాలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని శాండిల్‌వుడ్ టాక్. అంటే ఒకటి గెస్ట్ రోల్ అయితే... రెండోవది ఇంపార్టెంట్ అన్నమాట. కన్నడంలో ఈ రెండు సినిమాలే కాదు.. తమిళంలో మూడు నాలుగు, మలయాళంలో ఒక సినిమా.. ఇలా సౌత్‌ని రౌండప్ చేస్తూ, సుహాసిని ఫుల్ బిజీగా ఉన్నారు. -
'ఒక్కడు మిగిలాడు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్కడు మిగిలాడు జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస, అజయ్ ఆండ్రూస్ నూతక్కి, మిలింద్‌గునాజీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : శివ ఆర్ నందిగాం దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి నిర్మాత : ఎస్ఎన్ రెడ్డి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా ఓ భారీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ ఫార్ములా సినిమాల కన్నా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించే మనోజ్, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాదించాడా..? కథ : తన ప్రమోషన్ కోసం ఓ కాలేజ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్ (మిలింద్ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య(మంచు మనోజ్) విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనచివేసి సూర్యని అరెస్ట్ చేయిస్తాడు. కేసు కూడా నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) వారి కుట్రల నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు..? సూర్యకు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్ (మంచు మనోజ్)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటంలో చివరకు సూర్య గెలిచాడా..లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న మంచు మనోజ్ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్ లు మాత్రమే చేసిన మనోజ్ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్ గా కనిపించిన మనోజ్, పీటర్ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్ ఆండ్రోస్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల్లో అజయ్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. (సాక్షి రివ్యూస్)బోట్ ప్రయాణంలో కనిపించిన వారంతా నేచురల్ గా నటించి మెప్పించారు. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన మార్క్ చూపించాడు. జర్నలిస్ట్ పాత్రలో అనీష ఆంబ్రోస్ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్ గునాజీ, బెనర్జీ తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్, సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కించటంతో కమర్షియల్ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్ గా అనిపిస్తుంది. బోట్ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కినా.. నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎమోషనల్ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది.(సాక్షి రివ్యూస్) అక్కడక్కడ వినిపించిన బిట్ సాంగ్స్ సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మంచు మనోజ్ నటన కథ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : మితిమీరిన డ్రామా సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...!
‘‘హీరోలు, దర్శకులు... ప్రతి ఒక్కరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలసిమెలిసి ఉంటున్నాం. ఇదే సంస్కృతి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వచ్చి, అందరూ ఓచోట చేరితే బాగుంటుంది. ఇదొక సలహా మాత్రమే. సలహాను తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి’’ అన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి, థియేటర్ల సమస్య గురించి మనోజ్ చెప్పిన ముచ్చట్లు... కమర్షియల్ ఫిల్మ్ కాదిది... హార్ట్ టచింగ్ హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా! నో కామెడీ, నో సాంగ్స్. ఇందులో సూర్య, పీటర్... రెండు పాత్రలు చేశా. ఓ వర్గానికి దేవుడైన పీటర్ (ఎల్టీటీఈ ప్రభాకరన్!) కథను తెరపై చూపిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని రీసెర్చ్ చేశా. దర్శకుడు ఇచ్చిన నోట్స్ హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్‌లో 40 నిమిషాలు నేనుండను. అయినా... కథకు రెస్పెక్ట్ ఇచ్చి చేశా. ఇలాంటి కథలు కొత్తవాళ్లు చేస్తే అంత రీచ్ ఉండదు. అందుకని చేశా ∙ఆర్నెల్లుగా కలల్లోనూ యుద్ధం చేస్తున్నా. అంతలా వెంటాడుతోందీ కథ. క్యారెక్టర్ మూడ్‌లోనే ఉంటున్నా. (నవ్వుతూ...) చైనాలోనూ యుద్ధానికి వెళ్లా. కలల్లో మనకిష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు వస్తారు కదా. ప్రతి రాత్రి కలలో ఫ్యామిలీని సేవ్ చేయడమే నా పని! అంత డెప్త్ ఉందీ సినిమాలో. తెరౖపై చూసిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరిగిందా? నిజంగా మనిషికి మనిషి తోడుంటున్నాడా? అనేది ఆలోచిస్తారు ∙రియలిస్టిక్‌గా సినిమా తీశాం. సమాజంలో జరిగినదాంట్లో ఒక్క శాతమే చూపించాం... సినిమాటిక్‌గా! ఇటువంటి సినిమాలు తీయడమే కష్టమంటే... సెన్సార్ వాళ్లు చుక్కలు చూపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఉద్దేశంతో ఇంకా తమిళ సెన్సార్ చేయించలేదు. రెండు వారాల తర్వాత తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నాం ∙ఈ సినిమా చేసిన తర్వాత జనాల్లోకి వెళ్లి, సేవ చేయాలనుకున్నా. దేశాన్ని ఉద్ధరించలేం. నా ఏరియాను ఉద్ధరించగలుగుతాను కదా! కనీసం ప్రయత్నించగలను కదా! ఇంట్లో విష్ణు అన్న ఓ తన్ను తన్ని చక్కగా సినిమాలు చేయమన్నారు. ఏదో రోజున సేవ చేయడానికి వస్తా. నైజాంలో థియేటర్స్ కోసం మావాళ్లు (దర్శక–నిర్మాతలు) ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో? నాకు క్లియర్‌గా తెలీదు. తెలిసినంత వరకూ... ఫస్ట్ కొంతమందిని అడిగారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చక, ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్‌కి మావాళ్లు సినిమాను ఇచ్చారు. ఫస్ట్ అడిగిన వాళ్ల దగ్గరే థియేటర్లున్నాయి. మళ్లీ థియేటర్ల కోసం వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ముందు అడిగితే... 50 థియేటర్లు ఇస్తామన్నారు. సడన్‌గా రెండు డబ్బింగ్ (తమిళ్) సినిమాలు రావడంతో థియేటర్లు లేవన్నారట! దర్శకుడు అజయ్ సెన్సిటివ్ అండ్ వెరీ సీరియస్ పర్సన్. క్వశ్చన్ చేయడానికి వెళితే... రెచ్చగొట్టేలా మాట్లాడి, మాటల్లో పెట్టి పోలీసుల్ని పిలిచారట. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉండగా పోలీసుల్ని పిలవడం ఏంటి? ఒక పరిష్కారం కావాలి కదా! ఇలాంటి సమస్యలు మున్ముందు రాకుండా పెద్దలందరూ కూర్చుని, పరిష్కార మార్గం ఆలోచిస్తారని ఆశిస్తున్నా. పోలీసులు, కొట్టుకోవడాలు అయితే ఎంతసేపు! సినిమాలు మానేసి అందరూ అదే పనిలో ఉండాలి. ‘ఒక్కడు మిగి14లాడు’ విడుదల తర్వాత, అతి త్వరలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస యాదవ్‌లను కలసి ప్రభుత్వం తరపున ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేద్దామనుకుంటున్నా. ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా! అందులోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే... పెద్దవాళ్లు అయినా, చిన్నవాళ్లు అయినా అక్కడికి వెళతారు. సినిమా విడుదలవుతుందని చెబితే... ఎన్ని థియేటర్లు ఉన్నాయనేది చాంబర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా విడుదల చేయాలంటే వందచోట్ల తిరగాల్సి వస్తుంది. నా బాధ ఒకటే... రెచ్చగొడితే ఓ నాయకుడు పుడతాడు. నాయకుడి మాటల్ని అణచి వేయాలనుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటును తొక్కేయాలనుకుంటే... తీవ్రవాదంగా మారుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో తిరుగుబాటు పరిస్థితులొచ్చాయి. అది తీవ్రవాదంగా మారడానికి ఎంతోసేపు పట్టదు. కడుపు కాలితే... ఏ ఫ్యామిలీ వల్ల తను నాశనం అయితే వాళ్లపై పగ తీర్చుకుంటాడు. అప్పుడు మన ఇండస్ట్రీకి ఎంత చెడ్డపేరు వస్తుందో ఆలోచించుకోండి! ‘ఫలనా నిర్మాత ఎవర్నో చంపేశాడంట’ అంటే... ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి! fv -
బ్రేక్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు
‘‘నేను కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలని రూల్ పెట్టుకోలేదు. డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నా. అందుకే ‘ఒక్కడు మిగిలాడు’ చేశా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ, ఇలాంటివి ఎప్పుడో కానీ రావు’’ అని కథానాయిక అనీషా ఆంబ్రోస్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనీషా ఆంబ్రోస్ చెప్పిన చిత్ర విశేషాలు... ►రెండు ఫ్రేమ్స్‌లో జరిగే సినిమా ఇది. ఒక ఫ్రేమ్ 1990 ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కోణంలో ఉంటే ఇంకొకటి ప్రస్తుతంలో ఉంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను. 1990కి, ప్రస్తుతానికి సంబంధం ఏమిటన్నది సస్పెన్స్. కథ సీరియస్‌గా ఉంటుంది. పాటలు, కామెడీ అస్సలు ఉండవు ►అజయ్ ఆండ్రూస్ ఈ సినిమా కోసం బాగా రీసెర్చ్ చేశారు. ఎల్టీటీఈ సభ్యుల వద్దకు వెళ్లి వాళ్ల అనుభవాల్ని, అప్పటి పరిస్థితుల్ని తెలుసుకుని, వాస్తవ ఘటనలతో రూపొందించారు. దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథలను దర్శకుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు ►మనోజ్ పవర్ఫుల్ యాక్టర్. సినిమా కోసం తను పడే కష్టం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఈ చిత్రంలో మా మధ్య లవ్‌ట్రాక్ ఉన్నా అదే ప్రధానాంశం కాదు. ఎన్ని సినిమాలు చేసినా నాకు బ్రేక్ ఎందుకు రాలేదో తెలియదు. బ్రేక్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు. నాకు వచ్చిన, నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. ►‘విఠలాచార్య’తో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్నా. తమిళంలో ఒక సినిమా షూటింగ్ పూర్తయింది. -
మంచు హీరో కోసం నారా రోహిత్
కెరీర్ లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీయి ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న యూనిట్ సభ్యులు మరింత హైప్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఓ యంగ్ హీరోతో వాయిస్ ఓవర్ చేయిస్తున్నారు ఒక్కడు మిగిలాడు టీం. ఇప్పటికే వరుస మల్టీ స్టారర్లతో అలరిస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ ఒక్కడు మిగిలాడు సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. సినిమా టైటిల్స్ పడే సమయంలో రోహిత్ వాయిస్ వినిపించనుంది. మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. Terrific voice for the titles of #OkkaduMigiladu by my friend/cousin #NaraRohith ❤❤Love you! Thank you for adding up the intensity! ☺ pic.twitter.com/crUT0e1e0r — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 7 November 2017 -
హీరో నేను కాదు.. అజయ్ – మంచు మనోజ్
‘‘ఒక్కడు మిగిలాడు’ కథ వినగానే ఆ కథకి గౌరవం ఇవ్వాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా. శ్రీలంకను బేస్ చేసుకుని తీసిన సినిమా కాదిది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చేసిన చిత్రం’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో మనోజ్ మాట్లాడుతూ– ‘‘సిరియాలో ఓ చిన్నారి మృతదేహం నీటిలో కొట్టుకుని వచ్చిన ఫోటో చూసినప్పుడు ప్రపంచం ఉలిక్కి పడింది. ఓ ఫొటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనే ఆలోచనతో అజయ్ ఈ సినిమా చేశాడు. ఈ చిత్రానికి హీరో నేను కాదు... అజయ్ ఆండ్రూస్. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్న రోజునే మన దేశం ముందుకెళుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్‌తో క్యారీ చేశాడు. టీమ్ చేసిన ఈ మంచి ప్రయత్నం చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నా’’ అని నారా రోహిత్ అన్నారు. ‘‘విజువల్స్ చూస్తుంటే మంచి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టీజర్లో మనోజ్ పర్ఫార్మెన్స్ చూసి థ్రిల్లయ్యా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ తెలిపారు. అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ – ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే టెంపోలో ఉంటుంది. పాటలు ఉండవు. ఇలాంటి సినిమా చేయడానికి రెండు పిల్లర్స్ కావాలి. మొదటి పిల్లర్ మనోజ్గారు. రెండో పిల్లర్ నిర్మాతలు. బ్రతకడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడనే సామాన్యుడి వేదన ఈ సినిమాలో కనపడుతుంది. నా ముత్తాత, తాతలు స్వాతంత్య్ర సమరయోధులు. నాన్న, మావయ్యలు ఆర్మీలో పనిచేశారు. అందుకనే ఈ డిఫరెంట్ కంటెంట్‌ను సినిమాగా తీశా’’ అన్నారు. ‘‘ఏడాదికి పైగా ఈ సినిమాతో జర్నీ చేశాం. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన మూవీ ఇదే’’ అన్నారు ఎస్.ఎన్. రెడ్డి. అనీషా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఒక్కడు మిగిలాడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
కామెడీ, సాంగ్స్ లేకుండా యంగ్ హీరో ప్రయోగం
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించినా, సక్సెస్ సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న మనోజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎల్టీటీయి నాయకుడు ప్రభాకరన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాకరన్ పాత్రతో పాటు విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నాడు మనోజ్. సినిమా విశేషాలపై అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాలో కామెడీ, పాటలు ఉండవని కేవలం ఒక్క బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉండదని తెలిపారు. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. There's only 1 track(Song) in this film :) Only Emotion No commotion 😉 https://t.co/jUfVO0oSqq — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 29 October 2017 No comedy No Songs ... only BG songs .. it's an High Intense Emotional Drama Movie with a strong Realistic touch .. 'Untold True story'.. https://t.co/xgplZgzXXj — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 29 October 2017 -
10+10=20–10!
మంచు మనోజ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ– ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే మనం పరిస్థితులకు తగ్గట్టు ఎలా ప్రవర్తిస్తామో... మనోజ్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా కోసం తనతో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నా. ఇందులోని ఓ పాత్ర కోసం మనోజ్ 20 కిలోలు బరువు పెరిగారు. మరో పాత్ర కోసం 10 కిలోలు తగ్గారు. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. సముద్రంలో, సముద్రం దగ్గర షూట్ చేసిన సీన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్. నవంబర్ 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. మిలింద్ గునాజీ, పోసాని కృష్ణమురళి, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నీఫర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ. -
'ఒక్కడు మిగిలాడు'కు అదే ప్రధాన ఆకర్షణ
మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతోంది. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ ఈ సీ బ్యానర్ల పై ఎస్ ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్ ఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి వివరించారు. 'ఈ చిత్రం లో 35 నిమిషాల పాటు సాగే సముద్ర ప్రయాణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. కొత్త నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటాయి. బతుకు పోరాటంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు హృదయాలను కదిలిస్తాయి. ఈ సన్నివేశాలు చిత్ర ద్వితీయార్థం లో వస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. మనోజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఛాయాగ్రహణం వికే రామరాజు పనితనం, శివ నందిగాం నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని అన్నారు. రెండు పాత్రల్లో మనోజ్ నటన అలరిస్తుంది. హీరోయిన్ అనీషా అంబ్రోస్, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజీ, అజయ్, జెన్నిఫర్, రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ పీఎస్ వర్మ, గ్రాఫిక్స్ శ్రీనివాసులు, పాటలు గురుచరణ్, రామదుర్గం మధుసూధన్. -
'వీడెవడు' అదే రోజు వస్తున్నాడు..!
సెప్టెంబర్ మూడో వారం నుంచి భారీ చిత్రాలు లైన్ లో ఉండటంతో చిన్న సినిమాలన్ని ఈ లోపే థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 8న భారీ పోటి తప్పేలా లేదు. ఆ రోజు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న యుద్ధం శరణంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నెలాఖరున రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 8న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు పోటి పడుతున్న మరో సినిమా మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు. చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్.. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గెటప్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కామెడీ స్టార్ అల్లరి నరేష్ కూడా అదే రోజు రిస్క్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి సినిమాతో సెప్టెంబర్ 8న బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ మూడు సినిమాలతోనే థియేటర్లు బిజీ అంటే తాజాగా మరో సినిమా లైన్ లోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సచిన్ జోషి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'వీడెవడు' సినిమాను కూడా సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఇంట్రస్టింగ్ సినిమాలతో భారీ పోటి నెలకొన్న నేపథ్యంలో వీడెవడు సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అని భావిస్తున్నా.. తమిళ్ లోనూ అదే రోజు రిలీజ్ చేస్తుండటంతో డేట్ మార్చే ఛాన్స్ కనిపించటం లేదు. -
ఒక్కడు మిగిలాడు సినిమా స్టిల్స్
-
హింస.. అహింస ఒకేసారి ఎదురైతే..?
మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా అంబ్రోస్ హీరోయిన్. సెప్టెంబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం మంచు లక్ష్మీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నా తమ్ముడు మనోజ్ నటుడిగా నాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాడు. కొత్త రకం సినిమాలు, పాత్రలు చేయాలనుకుంటాడు. ‘మనోజ్ ఇండస్ట్రీకి ఒక వరం’ అని నేను భావిస్తున్నాను. దర్శకుడు అజయ్ మంచి హార్డ్‌వర్కర్. నిర్మాతలకు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది’’ అన్నారు. ‘‘నేను రెండు పాత్రలు చేయగలనని నమ్మి నాతో సినిమా చేసిన దర్శకుడు అజయ్, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు మనోజ్. ‘‘హింస, అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే ఆ పరిస్థితులకు తగ్గట్లు ఎలా ప్రవర్తిస్తారో అలా ఉంటుంది మనోజ్‌గారి క్యారెక్టరైజేషన్. ఒక దేశం, రాష్ట్రం, కుటంబంలో పెద్ద ఫెయిల్ అయితే ఆ ప్రభావం ఆ సమాజం లేదా ఆ కుటుంబంపై ఎలా ఉంటుందనేదే చిత్రకథ. సినిమా కోసం మనోజ్ ఒక దశలో 20 కేజీల బరువు పెరిగారు. ఆ తర్వాత పది కేజీలు తగ్గారు’’ అన్నారు అజయ్. -
మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'
'స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి!' అంటూ పవర్ఫుల్ డైలాగ్‌తో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అదరగొడుతున్నారు. ఆయన నటించిన చిత్రం 'ఒక్కడు మిగిలాడు' థియెట్రికల్ ట్రైలర్‌ను శనివారం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న మనోజ్. 'భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు?. తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా?' అనే ఉద్విగ్నభరిత వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్రలో ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా మనోజ్ నటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే' అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తుండగా, లక్ష్మీకాంత్, ఎస్ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి! Here comes #OkkaduMigiladuTrailer.A revolt for respect! pic.twitter.com/Y8znpJAwtK — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 19 August 2017 -
మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'
-
సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు'
వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "గతంలో ఎన్నడూ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చూడని సరికొత్త కథాంశాన్ని 'ఒక్కడు మిగిలాడు' చిత్రంతో ప్రేక్షకులు చూడనున్నారు. మంచు మనోజ్ యాంగ్రీ యంగ్ మేన్ గా ఆశ్చర్యపరుస్తాడు. ఈ చిత్రం ట్రైలర్, పాటలు త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ చిత్రం సాంకేతికత పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. సినిమా నేపధ్య సంగీతాన్ని ప్రాగ్ లో రికార్డ్ చేయనున్నాం.' అన్నారు. మంచు మనోజ్ తో పాటు ఈసినిమాలో అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
మనోజ్ మనసు మార్చుకున్నాడా..?
బుధవారం ఉదయం నటనకు గుడ్ బై చెపుతున్నానంటూ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన యంగ్ హీరో మంచు మనోజ్ సంచలనం సృష్టించాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతున్న మనోజ్ సడన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. అయితే మనోజ్ ఈ ప్రకటన వైరల్ కావటంతో కొద్ది సేపటికి మనోజ్ తన ట్విట్టర్ నుంచి నటనకు గుడ్ బై చెపుతున్నట్టుగా చేసిన ట్వీట్ ను డిలీట్ చేశాడు. దీంతో మనోజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో మనోజ్ ట్విట్టర్ కూడా హ్యాక్ అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కేవలం ట్వీట్ ను డిలీట్ చేయటంతో అభిమానులు.. అసలు కారణం ఏమై ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు. ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే మనోజ్ నుంచి క్లారిటీ రావాల్సిందే. -
యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్‌కి గుడ్ బై
స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మంచు మనోజ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. బుధవారం తన సోషల్ మీడియా ద్వారా త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఎల్టీటీయి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాలో నటిస్తున్న మనోజ్ ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేస్తానని ప్రకటించాడు. నటుడిగా ఇవి నా చివరి చిత్రాలు అని ప్రకటించిన మనోజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీకి సంబంధించి మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అదే బాటలో మనోజ్ కూడా నిర్మాతగా కొనసాగుతాడా..? లేన ఇతర రంగాల మీద దృష్టి పెడతాడా తెలియాల్సి ఉంది. తన ట్విట్టర్ ద్వారా సినిమాలకు గుడ్ బై చెపుతున్నట్టుగా ప్రకటించిన మనోజ్, కాసేపటికే ఆ ట్వీట్ ను డిలిట్ చేశాడు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడా..? లేక మనోజ్ అకౌంట్ కూడా హ్యక్ అయ్యిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై త్వరలో మనోజ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
పవర్ఫుల్ జర్నలిస్ట్!
ఎల్టీటీఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. పద్మజ ఫిలిమ్స్–న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ సంస్థలపై ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేటితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఇందులో పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కీలక పాత్ర చేస్తున్న ‘అలియాస్ జానకి’ ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాతలు ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇందులో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మనోజ్ ప్రభాకరన్ ఫస్ట్ లుక్కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలో మనోజ్ మరో పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేయాలనుకుంటున్నాం. 1990ల నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం’’ అన్నారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: పీఎస్ వర్మ, కెమేరా: వి. కోదండ రామరాజు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కథనం: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ. -
ఎల్.టి.టి.ఈ నేపథ్యంలో 'ఒక్కడు మిగిలాడు'
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్, న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఆదివారంతో పూర్తవుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అనీషా ఆంబ్రోస్ పాత్ర గురించి దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి మాట్లాడుతూ.. 'అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ గా మంచి పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఒక నటిగా అనీషాకు మంచి పేరు తెచ్చిపెడుతుంద' న్నారు. చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్లు మాట్లాడుతూ.. 'ఇటీవల విడుదలైన మంచు మనోజ్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్‌ను కూడా విడుదల చేయనున్నాం. రేపటితో హైద్రాబాద్‌లో గత కొన్ని రోజులుగా షూట్ చేస్తున్న లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం' అన్నారు. -
12 కిలోలు తగ్గిన మనోజ్
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్.టి.టి.ఈ) చీఫ్ వేలు పిళ్లై ప్రభాకరన్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శ్రీలంక యుద్ధంలో ప్రభాకరన్ పాత్ర ఏంటి? ప్రభాకరన్ మరణానికి దారి తీసిన పరిస్థితులేంటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాలంటున్నారు దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి. ప్రభాకరన్ జీవిత కథ నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మంచు మనోజ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అందులో స్టూడెంట్ పాత్ర కోసం 12 కేజీల బరువు తగ్గారు. 1990 కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. చిత్రం ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ అద్భుతంగా తెరకెక్కిస్తు న్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ. -
యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది
అలియాస్ జానకి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. గోపాల గోపాల, మనమంతా లాంటి సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చినా.. బ్రేక్ మాత్రం రాలేదు. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ సరసన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం కూడా ఈ ముద్దుగుమ్మను తీవ్రంగా నిరాశపరిచింది. తాజాగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాలో చేస్తున్న పాత్ర మీదే ఆశపెట్టుకుంది ఈ బ్యూటి. అజయ్ ఆండ్రూ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. మనోజ్ ద్విపాత్రాబినయం చేస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అనీషాను తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. Thrilled to announce my next project with @HeroManoj1 directed by Ajay Andrew,produced by SN Reddy Garu, Padmaja films banner. @HappyCasting — Anisha Ambrose (@anishaambrose) 8 March 2017