Opposition party leaders
-
19న ‘ఇండియా’ భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 19న భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకం, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడిగా ర్యాలీల నిర్వహణ వంటి కీలక అంశాలపై నేతలు ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలో 19న సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ఆదివారం తెలిపారు. ప్రధాని మోదీకి దీటుగా మనం, నేను కాదు(మై నహీ, హమ్)అనే ఐక్య ఇతివృత్తంతో ఇండియా కూటమి నేతలు ముందుకు సాగుతారని ఆయన చెప్పారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కీలక నేతలు ఈ భేటీకి హాజరవుతారని భావిస్తున్నారు. -
విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్ సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్‌కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ–ఐఎన్(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) యాపిల్ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్‌లోని యాపిల్ సంస్థ ప్రతినిధులు సీఈఆర్టీ–ఐఎన్ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్ సైబర్ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. -
విపక్ష నేతల ఐఫోన్ల కు హ్యాకింగ్ అలర్ట్స్
-
‘నితీష్ ప్రధాని అవుతారు, ఆయన్ను మించిన సమర్థుడు లేడు’
బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధానమంత్రి అవుతారని జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ప్రధాపి అభ్యర్థిగా ఉంటారని బిహార్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ పేర్కొన్నారు. నితీష్‌కు మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని అన్నారు. నితీషే ప్రధానమంత్రి అభ్యర్థనే విషయాన్ని ఇండియా కూటమి తర్వలోనే ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోకసభ ఎన్నికలకుముందు పార్టీ సన్నద్ధత గురించి ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్లో ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి పేరును ఎప్పుడు ప్రకటించినా.. అది నితీష్ కుమార్ పేరే అయి ఉంటుందని తెలిపారు. దేశంలో రామ్మనోహర్ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్ జీ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వ్యాఖ్యానించారని, నితీష్ కుమార్ 5 సార్లు కేంద్రంలో మంత్రిగా 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని అభ్యర్థి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ హజారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇదివరకే అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగాలన్నదే తన కోరిక అని తెలిపారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తానని చాలాసార్లు చెప్పారు. చదవండి: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, బీజేపీకి సర్ప్రైజ్!: రాహుల్ గాంధీ -
G20 Summit: జీ20కి పిలవకుండా ఎలా వెళ్లాలి?: ఖర్గే
బనశంకరి: ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు ఎలా వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇంతవరకు ఇలాంటి రాజకీయాలు చేయలేదని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జీ20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు ఆహా్వనం ఇవ్వకపోవడం వంటి పనికిమాలిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తుపై పత్రికల్లో చూశానని, దేవెగౌడ, నరేంద్ర మోదీ చేతులు కలపడం చూశానని అన్నారు. ఇద్దరూ ఒకటి కావడానికి ప్రయతి్నస్తున్నారని, వారి మధ్య సీట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. కానీ, వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. సనాతన ధర్మం విషయంలో రాజకీయాలు తీసుకురాకూడదని, అందరూ ఒక్కటే అనే భావనతో వెళ్లాలని సూచించారు. -
‘ఇండియా’ భేటీ ప్రారంభం
ముంబై: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు స్పష్టం చేశారు. కూటమి సమావేశం గురువారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభమైంది. కూటమిలోని వివిధ పారీ్టల అగ్రనేతలు హాజరయ్యారు. తొలిరోజు సాధారణ సమావేశమే జరిగింది. రెండో రోజు నాటి అజెండాపై చర్చించారు. అనంతరం కూటమి నాయకులకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందు ఇచ్చారు. కీలక సమావేశం శుక్రవారం జరుగనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. మొదటి రోజు భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రా్రïÙ్టయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని వెంటనే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీట్ల పంపకంపై తేల్చాలని ఆప్ డిమాండ్ చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. -
ముంబైలో జరిగే ‘ఇండియా’ భేటీకి సోనియా
ముంబై: త్వరలో ముంబైలో జరిగే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతల మూడో సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం ఈ విషయం వెల్లడించారు. ఆగస్ట్ 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో ముంబై శివారులోని ఓ లగ్జరీ హోటల్లో నేతలు భేటీ కానున్నారు. డజనుకుపైగా పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఎజెండాపై చర్చించడంతోపాటు ఇండియా కూటమి అధికారిక లోగోను ఖరారు చేయనున్నారు. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో యథావిధిగా రగడ కొనసాగింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో శుక్రవారం ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగిలారు. రాజస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు నినదించారు. గందరగోళం కారణంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో పట్టువీడని విపక్షాలు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టాల్సి ఉందని, సభ్యులంతా సహకరించాలని కోరారు. సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. నినాదాలు కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య దాదాపు 20 నిమిషాలపాటు సభ జరిగింది. అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా విపక్షాలు శాంతించలేదు. దాంతో చేసేదిలేక సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సైనిక దళాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘ఇంటర్–సరీ్వసెస్ ఆర్గనైజేషన్స్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప చర్చ అనంతరం సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అలాగే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(అమెండ్మెంట్) బిల్లు–2023’ కూడా ఆమోదించారు. జ్యసభలో అధికార బీజేపీ ఆందోళన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారాన్ని రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్‌లో శాంతి భద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిష్టంభనకు తెరపడలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
Defamation Case: సత్యమే జయిస్తుంది
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సుప్రీం తీర్పుతో విపక్ష కూటమి ఇండియాలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగడానికి అవకాశం ఏర్పడడంతో కేరళలో ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. మా నాయకుడు తిరిగి వస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. విద్వేషంపై ప్రేమ సాధించిన విజయమని నాయకులు వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన కొద్ది సేపటికి రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సత్యమేవ జయతే అంటూ పార్టీ శ్రేణులు రాహుల్‌కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, లేదంటే ఆ మర్నాడు. నాకు మద్దతుగా ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. నేను ఎలా ముందుకెళ్లాలో నాకు తెలుసు. నా కర్తవ్యం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. నాకు సాయం చేసిన, ప్రేమ పంచిన వారందరికీ నా ధన్యవాదాలు’’ అని రాహుల్ చెప్పారు. అంతకు ముందు ఒక ట్వీట్లో ఏది ఏమైనా తన కర్తవ్యాన్ని తాను వీడనని దేశ సిద్ధాంతాలు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే తన బాధ్యతని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ విజయం రాహుల్ గాంధీది మాత్రమే కాదని, ఈ దేశ ప్రజలది, ప్రజాస్వామ్యానిదని అన్నారు. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటలు తిరగక ముందే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు దానిని ఎత్తేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు. ఆ మూడు ఎక్కువ కాలం దాగవు రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టనుండడంతో సోదరి ప్రియాంక ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆమె తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గౌతమ బుద్ధుని కొటేషన్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, నిజం.. ఈ మూడింటిని ఎక్కువ కాలం దాచలేరు అంటూ గౌతమ బుద్ధుడు చెప్పిన మాటల్ని ట్వీట్లో రాసిన ప్రియాంక సత్యమేవ జయతే అంటూ ముగించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో రాజకీయ పార్టీలన్నీ సుప్రీం తీర్పుని స్వాగతించాయి. పార్లమెంటులోకి తిరిగి రాహుల్ అడుగు పెట్టే రోజు కోసం చూస్తున్నామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. న్యాయపోరాటం కొనసాగిస్తా : పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతించారు. సుప్రీం తీర్పుని తాము గౌరవిస్తామని, అయితే సెషన్స్ కోర్టులో న్యాయపోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. సోదరుడు రాహుల్‌గాంధీ జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడం హర్షణీయం. ఈ తీర్పుతో మన న్యాయ వ్యవస్థ మీద , ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మీద మరింతగా విశ్వాసం పెరిగింది. – ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ప్రజా స్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని ఈ తీర్పు బలపరుస్తోంది. రాహుల్‌కి, వయనాడ్ ప్రజలకి నా శుభాకాంక్షలు. – ఎ.కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం రాహుల్ గాంధీ మళ్లీ సభలోకి అడుగు పెట్టనుండడం ఎంతో శుభవార్త. దీంతో ఇండియా కూటమి మరింత బలోపేతమవుతుంది. మాతృభూమి కోసం విపక్షాల పోరాటం మరింత ఐక్యంగా సాగి విజయం సాధించి తీరుతాం. – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం -
‘ఇండియా’ కూటమి భేటీ వాయిదా?
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. -
విపక్షాల మేధోమథనం: యాంటీ భేటీ.. ఫ్రెండ్స్ పోటీ
జాతీయ రాజకీయాల తీరుతెన్నులను నిర్ణాయక మలుపు తిప్పగల కీలక పరిణామాలు మంగళవారం చోటు చేసుకోనున్నాయి. అటు బెంగళూరులో కాంగ్రెస్ చొరవతో సోమవారం మొదలైన 26 విపక్షాల కీలక సమావేశం మంగళవారం పూర్తిస్థాయిలో జరగనుంది. ఇటు అందుకు దీటుగా బీజేపీ సారథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకంగా 38 పార్టీలతో హస్తినలో పోటీ భేటీ తలపెట్టింది. ఇరు పక్షాల నుంచీ ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సోనియా, రాహుల్, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు నితీశ్ సహా పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు... ఇలా మొత్తం 26 విపక్ష పార్టీల అధినేతలు సోమవారమే బెంగళూరు చేరారు. మంగళవారం చర్చించాల్సిన అంశాలపై సాయంత్రం నుంచి రాత్రి విందు భోజనం దాకా సుదీర్ఘ మంతనాల్లో మునిగి తేలారు. మరోవైపు బీజేపీ కూడా ఎల్జేపీ (పాశ్వాన్)ని సోమవారం ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా విపక్షాల సవాలుకు దీటుగా స్పందించింది. మంగళవారం జరిగే ఎన్డీఏ పూర్తిస్థాయి భేటీలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త మిత్రులతో కలిపి ఏకంగా 38 పార్టీలు పాల్గొంటాయని కూడా బీజేపీ వర్గాలు వెల్లడించాయి! హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగనున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సమరానికి ఈ భేటీలను వైరి కూటముల తొలి సన్నాహకంగా పరిశీలకులు భావిస్తున్నారు. బెంగళూరు: 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు కొంతకాలంగా చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తలపెట్టిన రెండు రోజుల సమావేశాలు సోమవారం బెంగళూరులో మొదలయ్యాయి. కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీల అధినేతలు, అగ్ర నేతలు సాయంత్రానికల్లా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చర్చోపచర్చల్లో మునిగి తేలారు. బీజేపీని నిలువరించడమే ఏకైక అజెండాగా ఉమ్మడి కార్యాచరణకు రూపమిచ్చేందుకు మంగళవారం రోజంతా కీలక మేధోమథనం జరపనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం జరగవచ్చని తెలుస్తోంది. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్ (జేడీ–యూ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జయంత్చదరి (ఆరెల్డీ), వైకో (ఎండీఎంకే) తదితరులు సోమవారం సమావేశంలో పాల్గొన్నారు. బెంగళూరు నగరమంతటా ఎటు చూసినా ‘కలుద్దాం, నిలుద్దాం’ నినాదంతో విపక్ష కూటమి నేతలందరి ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లే కని్పంచాయి. ఇక కాంగ్రెస్‌తో చిరకాలంగా ఉప్పూనిప్పుగా ఉన్న మమత విందు భేటీలో సోనియా పక్కనే కూర్చోవడం ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా వారిరువురూ 20 నిమిషాల పాటు చర్చలు కూడా జరిపారు. పార్టీలో చీలికతో సతమతమవుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కుమార్తె సుప్రియా సులేతో పాటు ఆయన చర్చల్లో పాల్గొంటారని విపక్ష వర్గాలు తెలిపాయి. విపక్షాలతో తలపడేందుకు తానొక్కన్నే చాలని గొప్పలకు పోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు 30కి పైగా పార్టీలతో జట్టు కట్టేందుకు ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. జేడీ(ఎస్)తో పాటు బీజేపీ ఓటమి కోరే భావ సారూప్య పార్టీలన్నింటికీ కూటమిలోకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. సయోధ్య ఏ మేరకు సాధ్యం? అయితే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు–తృణమూల్ సహా పలు రాష్ట్రాల్లో విపక్షాల మధ్యే సహజ వైరం నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి మధ్య సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుంన్నది ఆసక్తికరం. తృణమూల్‌తో బెంగాల్లో ఎలాంటి పొత్తూ ఉండబోదని సమావేశ వేదిక వద్దే సీపీఎం ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. అయితే, విపక్షాల ఓటు బ్యాంకులో చీలికను నివారించేందుకు కలిసి పని చేస్తామంటూ ముక్తాయించారు. భేటీలో పాల్గొంటున్న పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఎస్పీ, జేడీ(యూ), ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, అప్నాదళ్, మణిథనేయ మక్కల్ కచ్చి (ఎంఎంకే) సహా మొత్తం 26 పార్టీలు. వీటన్నింటికీ కలిపి లోక్‌సభలో 150 మంది దాకా ఎంపీల బలముంది! కూటమి కన్వీనర్‌గా నితీశ్...? కొత్త కూటమి పేరు కూడా మంగళవారం నాటి చర్చల అజెండాలో ఉన్నట్టు సమాచారం. ‘‘ఇండియా అని వచ్చేలా కూటమికి ఆకర్షణీయమైన పేరును పార్టీలన్నీ సూచిస్తాయి. ‘యునైటెడ్ వుయ్ స్టాండ్’ అన్నది ట్యాగ్‌లైన్‌గా ఉండనుంది’’ అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ► అంతేగాక యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సోనియాగాం«దీని కొత్త కూటమి సారథిగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు. ► సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ► కనీ్వనర్‌గా బిహార్ సీఎం నితీశ్ కీలక బాధ్యతలు తీసుకోవచ్చు. ► మంగళవారం భేటీ అనంతరం సంయుక్త ప్రకటనతో పాటు ఉమ్మడి ఆందోళన ప్రణాళికను కూడా విపక్ష కూటమి ప్రకటించవచ్చని సమాచారం. ► కీలకమైన రాష్ట్రాలవారీగా పార్టీలవారీగా పోటీ చేయాల్సిన లోక్‌సభ స్థానాల సంఖ్యను ఖరారు చేసుకోవడం వంటివీ చర్చకు వస్తాయంటున్నారు. ► ఒక కమిటీతో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, విపక్షాల సంయుక్త నిరసన కార్యక్రమాల ఖరారుకు రెండు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. -
విపక్షాల భేటీ.. 17, 18 తేదీల్లో...?
న్యూఢిల్లీ: దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు జూన్ 23న బిహార్ రాజధాని పాటా్నలో సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి భేటీ ఈ నెల 17, 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం ట్వీట్ చేశారు. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే ధ్యేయమని, అందుకోసమే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే విపక్ష కూటమి సంకల్పమని వివరించారు. వాస్తవానికి విపక్షాల సమావేశాన్ని ఈ నెల 13, 14న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తమ భేటీని 17, 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. -
పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..
Updates. ♦ పట్నా సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు సిమాల్లో జులైలో మరోమారు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తన నేతృత్వంలోనే ఆ మీటింగ్ జరగనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | "We will meet again in July in Shimla to prepare an agenda on how to move ahead together while working in our respective states to fight BJP in 2024," says Congress President Mallikarjun Kharge on the Opposition meeting in Patna. pic.twitter.com/cruKD6W8x8 — ANI (@ANI) June 23, 2023 ♦ దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. ♦ ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. "We have decided to fight elections together": Nitish Kumar after opposition meeting Read @ANI Story | https://t.co/QgN1xeuDE3#oppositionpartymeeting #NitishKumar #Patna #PatnaOppositionMeeting pic.twitter.com/z8wxq6LXZi — ANI Digital (@ani_digital) June 23, 2023 ♦పట్నా సమావేశంతో ప్రజా ఉద్యమం మొదలవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంపై పోరుకు ఐక్యంగా పోరాడతామని చెప్పారు. నేటి సమావేశం చరిత్రకు పునాది వేస్తుందని చెప్పారు. #WATCH | Patna, Bihar: Bengal CM Mamata Banerjee during the joint opposition meeting said "We are united, we will fight unitedly...The history started from here, BJP wants that history should be changed. And we want history should be saved from Bihar. Our objective is to speak… pic.twitter.com/BB2qLgbApP — ANI (@ANI) June 23, 2023 ♦ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని మమతా బెనర్జీ ఆరోపించారు. మొదట ఐక్యమయ్యాం. పట్నాతో కలిసి పోరాడతామనే నిర్ణయానికి వచ్చాం. మిగిలినది సిమ్లాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. ♦ పట్నా మీటింగ్ ఫలవంతంగా ముగిసినట్లు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరికీ తాము ప్రతిపక్షమేనని పేర్కొన్నారు. ♦ పట్నాలో విపక్ష పార్టీల నేతల భేటీ ప్రారంభమైంది. Bihar | Opposition leaders' meeting to chalk out a joint strategy to take on BJP in next year's Lok Sabha elections, begins in Patna More than 15 opposition parties are attending the meeting. pic.twitter.com/absFUpmARO — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ #WATCH | Jharkhand CM and Jharkhand Mukti Morcha (JMM) leader Hemant Soren reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/KrwrM91ZBA — ANI (@ANI) June 23, 2023 ♦ విపక్షాల భేటీకి హాజరైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. #WATCH | Aam Aadmi Party (AAP) MP Raghav Chadha reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/r1qWibztFR — ANI (@ANI) June 23, 2023 ♦ సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చేరుకున్న సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | West Bengal CM Mamata Banerjee leaves from Patna Circuit House to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/wlrxWiQIul — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. #WATCH | Former Maharashtra CM Uddhav Thackeray reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/nHzrUWxT2C — ANI (@ANI) June 23, 2023 #WATCH | Samajwadi Party (SP) president and former Uttar Pradesh CM Akhilesh Yadav reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/l5YUS4LAOQ — ANI (@ANI) June 23, 2023 ♦ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ బీహార్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలోని పేదల కోసం కాంగ్రెస్ మాత్రమే పనిచేస్తుంది. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గం. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని, విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ♦ పాట్నా చేరుకున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి VIDEO | CPI(M) General Secretary Sitaram Yechury arrives at Patna airport to attend the opposition meeting later today.#OppositionMeet pic.twitter.com/wWWoCx1e7x — Press Trust of India (@PTI_News) June 23, 2023 ♦ పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులతో సహా దేశాన్ని పీడిస్తున్న వివిధ ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం- శరద్ పవార్ ♦ పాట్నా చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | Congress president Mallikarjun Kharge and party leader Rahul Gandhi arrive in Bihar's Patna for the Opposition leaders' meeting pic.twitter.com/O51rWBsKaw — ANI (@ANI) June 23, 2023 #WATCH | Congress leaders welcome party president Mallikarjun Kharge and party leader Rahul Gandhi as they arrive in Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/vuSA3oj304 — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నాకు బయలుదేరిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ♦ ఇది దేశంలోని ప్రతిపక్షాల సమావేశం కాదు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ సమావేశం. బీజేపీని ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే, దేశంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ బీజేపీని ఓడించలేరు- పప్పు యాదవ్. #WATCH ये देश के विपक्ष की बैठक नहीं है, ये बैठक देश को 140 करोड़ लोगों की जिंदगी और उनके हिफाजत के लिए है। बैठक बिहार को हमेशा अपमान की दृष्टि से देखने के खिलाफ है और अच्छी शुरुआत के लिए है...कांग्रेस भाजपा को हराने वाली अकेली पार्टी है, देश में कांग्रेस से अलग रहकर कोई भाजपा को… pic.twitter.com/nZ2isZG0Ha — ANI_HindiNews (@AHindinews) June 23, 2023 పాట్నా:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. ♦ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. -
సోమవారం చెన్నైలో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం అమలు తీరుతెన్నులపై చర్చించడానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో భేటీ కానున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెరెక్ ఓ బ్రియన్ తదితరులు పాల్గొంటారు. మరికొన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ సమావేశం కాదని, సామాజిక అంశంపై చర్చించడానికి జరుగుతున్న భేటీ అని విపక్ష నేతలు వెల్లడించారు. -
ప్రధాని మోదీకి విపక్షాల లేఖ
-
ప్రధాని మోదీకి కేసీఆర్ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే?
గత కొన్ని నెలలుగా దేశంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), సీబీఐ, ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో, ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా విపక్షాలు లేఖ రాశాయి. సీఎం కేసీఆర్ సహా 9 మంది విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. ఇక, లేఖలో భాగంగా మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండించారు విపక్ష నేతలు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక, గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని నమ్ముతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న వాళ్లు బీజేపీలో చేరితే క్లీన్చిట్ ఇస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్‌ఫండ్‌పై 2014, 2015లో సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి లేదన్నారు. అలాగే, బీజేపీలో చేరిన సువేందు అధికారి, ముకుల్ రాయ్, నారాయణ్ రాణే వంటి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇదే క్రమంలో సిసోడియా అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉంది. దేశంలోనే విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారన్న మంచి పేరుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా సిసోడియాను అరెస్ట్ చేశారు. సిసోడియాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖ రాసిన వారిలో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. -
ఐఎన్ఎల్డీ ర్యాలీకి పవార్, నితీశ్, ఠాక్రే
న్యూఢిల్లీ: హరియాణాలోని ఫతేబాద్‌లో ఈ నెల 25వ తేదీన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) తలపెట్టిన ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నేత కళిమొళి ఈ సమావేశంలో పాల్గొంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని చేపట్టే ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా వస్తామని తెలిపారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా చారిత్రక ఘట్టం కానుందని పేర్కొన్నా రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కూడా ఐఎన్ఎల్ డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానాలు పంపారన్నారు. -
టీడీపీ తీరు షరా మామూలే
సాక్షి, అమరావతి: శాసనసభలో వరుసగా మూడోరోజు కూడా ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరు మారలేదు. పాలనాపరమైన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నా సరే సభలో గలాభా సృష్టించేందుకే ఆ పార్టీ మొగ్గుచూపింది. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చల కంటే సభ నుంచి పలాయనానికే మరోసారి ప్రాధాన్యమిచ్చింది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామానంతరం సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు. కానీ, టీడీపీ సభ్యులు వ్యవసాయ రంగంపై చర్చించాలని పట్టుబట్టారు. వ్యవసాయం, రైతుల అంశాలపై బుధవారం సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రభుత్వం చర్చకు వెనుకంజ వేస్తే అభ్యంతరం తెలపాలి గానీ, చర్చించేందుకు సిద్ధమని ప్రకటించాక అడ్డుకోవడం తగదని స్పీకర్ ఎంతగా చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అంతేకాక, ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, బుచ్చయ్యచౌదరి తదితరులు స్పీకర్ పోడియంపైకి చేరుకుని సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించే విషయంలో టీడీపీ సభ్యులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. ఎంత త్వరగా సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్నదే వారి ఉద్దేశంగా ఉందని మూడు రోజులుగా తెలుస్తూనే ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అంశంపై మాట్లాడేందుకు టీడీపీ సభ్యులకు ధైర్యంలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే సభకు ముఖం చాటేయగా ఆ పార్టీ సభ్యులూ బయటకెళ్లి తమ పచ్చ మీడియాతో మాట్లాడాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతగా సర్దిచెప్పినప్పటికీ టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్ చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని శాసనసభా వ్యవహారాల శాఖను సోమవారం పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాను ఆదేశించారు. దాంతో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ, పెతకంశెట్టి గణబాబు, చినరాజప్ప, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ స్వామిలను సస్పెండ్ చేయాలని అంజాద్‌బాషా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దాంతో స్పీకర్ వారిని ఒకరోజు సస్పెండ్ చేశారు. సభను అడ్డుకునేందుకే వస్తున్నారు : సీఎం జగన్ ఇక కేవలం అసెంబ్లీ కార్యక్రమాలను అడ్డుకోవాలనే దురాలోచనతోనే టీడీపీ సభ్యులు సభకు వస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. శాసనసభ కార్యకలాపాలను వారు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగకూడదు.. ప్రజలకు నిజాలు తెలియకూడదనే ఉద్దేశంతోనే వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ అంశాలపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అందుకు స్పీకర్ అనుమతించిన తరువాత కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తన మారకపోవడాన్ని సీఎం తప్పుబట్టారు. చంద్రబాబు సభకు రారు.. వీళ్లను పంపించి సభను అడ్డుకోవాలని ప్రయత్నింస్తారని విమర్శించారు. టీడీపీ సభ్యులను అవసరమైతే సస్పెండ్‌చేసి సభా కార్యక్రమాలను సజావుగా సాగేలా.. ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని ఆయన స్పీకర్‌కు సూచించారు. ప్రజలే నిర్ణయిస్తారు: స్పీకర్ తమ్మినేని సీతారాం మరోవైపు.. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సభా కార్యక్రమాలను ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్న వారిని ఈ సమావేశాల వరకూ సస్పెండ్ చేయవచ్చన్నారు. కానీ, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో సంయమనంతో వ్యవహరిస్తున్నానన్నారు. అందుకే వారికివ్వాల్సిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడేందుకు అనుమతిస్తున్నా వారు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ప్రజలకు అన్ని విషయాలను తెలియాలని, వారే అంతిమ నిర్ణేతలన్నారు. ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ‘సుప్రీం’ స్పందన.. మార్గదర్శి, రామోజీకి నోటీసులు -
ఎన్నికలొస్తున్నాయిగా..మీకోసమే ఐయామ్.. వెయిటింగ్
‘బీజేపీ.. అచ్చంగా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎవరినైనా భయపెట్టాలనుకుంటే వారిపైకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించేది. ఈ రోజు బీజేపీ అదే చేస్తోంది’ లక్నో/రాయ్‌బరేలి: ఎన్నికలు సమీపించగానే.. రాజకీయ ప్రత్యర్థులపైకి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను శాఖ (ఐటీ)ను ఉసిగొల్పుతుందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం అఖిలేశ్ సన్నిహితులు ముగ్గురిపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై ఎస్పీ చీఫ్ స్పందిస్తూ... ‘నేను ముందు నుంచీ చెబుతున్నాను. ఎన్నికలు దగ్గరపడగానే.. ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీల దాడులు మొదలవుతాయని. ఇప్పుడు ఐటీ వాళ్లొచ్చారు. తర్వాత సీబీఐ, ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)లు రంగంలోకి దిగుతాయి. వారి రాకకోసం ఎదురుచూస్తున్నా. వాళ్లు ఏంచేసినా సైకిల్ (ఎస్పీ ఎన్నికల చిహ్నం) ఆగదు... ఇదే వేగంతో ముందుకెళతాం. రథయాత్ర, పార్టీ తీసుకున్న ఇతర కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయి. యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదు. ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజలను మాయ చేయలేరు. రాజీవ్ రాయ్‌పై ఇవే ఐటీ దాడులు నెల కిందట ఎందుకు జరగలేదు. ఇప్పుడెందుకు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. బీజేపీకి ఓటమి భయం పెరిగేకొద్దీ ఈ దాడులూ పెరుగుతాయి’ అని కాషాయదళంపై ధ్వజమెత్తారు. రాజీవ్ రాయ్ ఎస్పీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి. కర్ణాటకలో పలు విద్యాసంస్థలను నడిపే గ్రూపునకు యజమాని. అఖిలేశ్ వ్యక్తిగత కార్యదర్శి జ్ఞానేంద్ర యాదవ్, ఎస్పీకి కంచుకోట నిలుస్తున్న మెయిన్‌పూరికి చెందిన వ్యాపారవేత్త (ఆర్సీఎల్ గ్రూపు యజమాని), అఖిలేశ్‌కు సన్నిహితుడైన మనోజ్ యాదవ్‌లపై కూడా శనివారం ఐటీ దాడులు జరిగాయి. రెండూ ఒకటే.. లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండను జలియన్‌వాలా భాగ్ ఊచకోతతో పోల్చారు అఖిలేశ్. ‘జలియన్‌వాలా భాగ్‌లో బ్రిటిషర్లు ప్రజలను ముందు నుంచి కాల్చారు.. లఖీంపూర్‌లో బీజేపీ నేతలు వెనకనుంచి రైతులపైకి జీపును తోలార’ని రాయ్‌బరేలీలో రథయాత్ర సందర్భంగా విలేకరులతో అన్నారు. -
అంత అవసరం ఏమొచ్చింది?
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆగమేఘాల మీద ఆర్డినెన్సులను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. కొన్ని వ్యవస్థలకు ఉన్న స్వతంత్రతను ఈ ఆర్డినెన్సులతో కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టేసిందని విమర్శించాయి. ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని వాటిని తీసుకురావడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. పదవీ కాలం పొడిగింపు చాలా తక్కువ కాలం ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పించుకునేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టు.. ఎక్స్టెన్షన్ పట్టు’అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ సంస్థలకు ఎంతో కొంత సమగ్రత ఉందని, ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. కాగా, కేంద్ర నిరంకుశ పాలనను ప్రతిపక్షాలమంతా కలసి అడ్డకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియెన్ పేర్కొన్నారు. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా టీఎంసీ రాజ్యసభలో నోటీసులు అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రాథమిక నిబంధనల్లో కేంద్రం సవరణలు చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్మెంట్ అనంతరం విధులకు సంబంధించి అన్ని అంశాలు ఈ నిబంధనల్లో ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును కూడా రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు మించి పొడిగించడానికి వీల్లేదు. కాకపోతే కేబినెట్ సెక్రటరీ, బడ్జెట్ సంబంధిత అంశాలు చూసుకునే అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐబీ, ఆర్ఏడబ్ల్యూ చీఫ్‌లు, సీబీఐ డైరెక్టర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణల్లో డిఫెన్స్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్ఏడబ్ల్యూ, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచే అధికారం కేంద్రానికి వచ్చింది. కాగా, సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రాథమిక నిబంధనల జాబితా నుంచి విదేశీ వ్యవహారాల సెక్రటరీని తొలగించి ఈడీ పేరును చేర్చారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకేనా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డినెన్స్–2021, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్–2021 ప్రకారం సీబీఐ డైరెక్టర్, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఒకేసారి ఏడాది పాటు పెంచే వీలుంది. ఆ పొడిగింపు ఐదేళ్లకు మించి ఉండొద్దని ఈ రెండు ఆర్డినెన్సులు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈడీ చీఫ్ ఎస్కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆర్డినెన్సులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రెండేళ్ల పాటు ఈడీ చీఫ్‌గా పనిచేసిన అనంతరం 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది. -
పాకాల ఏటిపై వంతెన నిర్మించాలి
గార: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి పాకాల ఏటిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కాన్వాయ్‌లను మండల అఖిలపక్షం నాయకులు ఆదివారం గార్లచెక్ డ్యాం వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వంతెన నిర్మాణం హామీ నెరవేర్చాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అఖిలపక్ష నాయకులతో చర్చలు జరిపారు. వంతెన నిర్మాణానికి రూ.24 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, త్వరలో నిధులు విడుదల కాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. -
ఆసక్తి రేపుతున్న పవార్, ప్రశాంత్ కిశోర్ భేటి.. అందుకేనా?
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. దీంతో రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. కాగా జూన్ 11న ముంబైలోని శరద్ పవార్ ఇంటిలో వారి సమావేశం తరువాత నేడు ఢిల్లీలో మళ్లీ కలుసుకున్నారు. నేడు జరిగిన భేటీతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. నివేదికల ప్రకారం.. రాజకీయ వ్యూహకర్తను కలిసిన తరువాత, 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశానికి హాజరు కావాలని పవార్ ఆహ్వానించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడేమే గాక ఆసక్తి కూడా రేపుతోంది. ‘ఇది సాధారణ సమావేశంగా కలిసామని, రాజకీయాలతో సంబంధం లేదని’ కిషోర్ అన్నారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశం శరద్ పవార్ నివాసంలో జరుగునుంది. ఈ సమావేశనికి ఎన్సీపీకి చెందిన మజీద్ మీనన్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ ఇతర నాయకులు పాల్గొననున్నారు. ఇక తాజా భేటీలో ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్, పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరు కాలేదు. పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం. #NewsAlert | Prashant Kishor meets NCP chief Sharad Pawar in Delhi. Kishor says, 'it's just a routine meeting'. This is the second meeting between the duo in 2 months. Prashant Kumar with analysis. pic.twitter.com/FIJB6E4RS8 — TIMES NOW (@TimesNow) June 21, 2021 చదవండి: బీజేపీతో కలిసిపోదాం.. సీఎంకు శివసేన ఎమ్మెల్యే లేఖ -
‘నేను ఉంటే ఇలా అయ్యేది కాదు’
ఇస్లామాబాద్: ‘మూడు సంవత్సరాల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.. మీ ముఖాల్లో నవ్వు మాయమయ్యింది. నేను ఉంటే ఇలా అయ్యేది కాదు అన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గుజ్రాన్వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వంపైన, ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వాపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది.. నిత్యవసరాలు మొదలు బంగారం దాక అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 మిలయన్ల ఉద్యోగాలు అన్నారు.. కానీ 15 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఐదు మిలియన్ల ఇళ్లు కట్టిస్తాం అన్నారు.. ఒక్క ఇంటిని అయినా నిర్మించారా’ అని ప్రశ్నించారు. అలానే 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం కట్టబెట్టాడని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. (చదవండి: పాకిస్తాన్లో విపక్ష కూటమి) 'జావేద్ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్రధాని పదవి కట్టబెట్టారు' అని షరీఫ్ వ్యాఖ్యానించారు. కాగా, 2018 ఎన్నికల తర్వాత నవాజ్ షరీఫ్ బహిరంగ సభలో మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగంపై కూడా నవాజ్ విమర్శలు చేశారు. అప్పటి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం పని చేసిందని షరీఫ్ ఆరోపించారు. ఇప్పటికైనా రాజకీయాల్లో పాక్ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు. దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చిన పాక్ సుప్రీంకోర్టు ఆయనకు 2017లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో లండన్‌లో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఇమ్రాన్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే) ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సంస్కరణలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని నవాజ్ షరీఫ్ విమర్శించారు. 'మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా 'మీ టైం అయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. -
ఇమ్రాన్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. తక్షణమే ఆయన రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో 'పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్' అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు ఆదివారం ప్రకటించాయి. ఈ మేరకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నిర్వహించిన ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ (ఏపీసీ) 26 పాయింట్ల ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్ ముస్లిమ్స్ లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), జామియాత్ ఉలేమా-ఈ-ఇస్లాం ఫాజల్ (జేయూఐ-ఎఫ్)తో పాటు అనేక ఇతర పార్టీలు దీనిలో పాలుపంచుకున్నాయి. అనంతరం విలేకరుల సమావేశంలో జామియాత్ ఉలేమా-ఈ-ఇస్లాం(జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్ల్-ఉర్-రెహమాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికైన ప్రధానమంత్రి ఇమ్రాన్ అహ్మద్ నియాజీని వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో న్యాయవాదులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు పౌర సమాజం పాల్గొనడం జరుగుతుంది’ అన్నారు. (చదవండి: ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు) అంతేకాక ‘మొదటి దశలో, అక్టోబర్‌లో సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, పంజాబ్‌లలో ర్యాలీలు జరుగుతాయి. రెండవ దశలో, డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరుగుతాయి. ఇక మూడవ దశలో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో ఇస్లామాబాద్ వైపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం’ అని రెహామాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించటానికి, ఉమ్మడి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం, పార్లమెంటు రాజీనామాలతో సహా అన్ని వ్యూహాలను ఉపయోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీల మార్గదర్శకత్వం, మద్దతుతో ప్రతిపక్షాలు ముందుకు వెళ్తాయని నొక్కి చెప్పారు. అయితే, ఉద్యమ నాయకుడిని ఇంకా నిర్ణయించలేదన్నారు బిలావాల్. (చదవండి: ఇమ్రాన్ లాడెన్‌ను కీర్తిస్తారా..!) అంతకుముందు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్‌లో వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీల పోరాటం ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదని తనలాంటి "అసమర్థ" వ్యక్తిని అధికారంలోకి తెచ్చిన వారిపైన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదు. తనలాంటి అసమర్థ వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడానికి (2018 లో) ఎన్నికలను తారుమారు చేసి దేశాన్ని నాశనం చేసినవారిపై మా పోరాటం’ అని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శక్తివంతమైన పాక్ సైన్యం ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని, జాతీ పితా ముహమ్మద్ అలీ జిన్నా రాజ్యాంగాన్ని, దూరదృష్టిని అనుసరించడానికి అవకాశం కల్పించాలని కోరారు. అవసరమైతే ఆర్మీతో యుద్ధానికి సైతం వెనకాడమన్నారు షరీఫ్. పాకిస్తాన్ సైన్యం దాదాపు 70 సంవత్సరాలకు పైగా దేశాన్ని ఏలుతోంది. అంతేకాక దేశ భద్రత, విదేశాంగ విధానం వంటి విషయాలలో గణనీయమైన స్థాయిలో అధికారం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. -
సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ కాంగ్రెస్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలను పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై దాడి చేసినంత పని చేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో, ఆగ్రహంతో ఆయన ముఖంపైకి నిబంధనల పుస్తకాన్ని విసిరారు. మరికొన్ని అధికారిక పత్రాలను చించి, విసిరారు. ఆయన ముందున్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు విఫలయత్నం చేశా రు. ఈ గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయి దా పడింది. ఆ తరువాత ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. సభా సంఘానికి పంపించాలంటూ.. ఈ బిల్లుల ఆమోదం కోసం ముందుగా పేర్కొన్న సమయం కన్నా ఎక్కువ సేపు సభ జరిగింది. ఈ సమయంలో, బిల్లులను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లను, తీర్మానాలను ప్రతిపక్ష సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చపై వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం ఏకగ్రీవంగా జరగాలన్నారు. ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. విపక్షం తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుండటంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చకు తానివ్వాల్సిన జవాబును కుదించుకుని, క్లుప్తంగా ముగించారు. క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఈ రెండు బిల్లులను సభా సంఘాలకు పంపాలన్న విపక్షం తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది. అయితే, దీనిపై డివిజన్ ఓటింగ్ జరగాలని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే డివిజన్ ఓటింగ్ సాధ్యమవుతుందని పేర్కొంటూ, వారి డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తోసిపుచ్చారు. దాంతో, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. అక్కడే ఉన్న మార్షల్స్ అది డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన వైపు దూసుకువచ్చిన మరో పుస్తకం కూడా తగలకుండా చూశారు. మరోవైపు, సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను డిప్యూటీ చైర్మన్ పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైన తరువాత.. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఈ బిల్లులను మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు. తొలి బిల్లు ఆమోదం పొంది, విపక్ష తీర్మానాలు వీగిపోయిన సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు రాజ్యసభ ఆఫీసర్స్ టేబుల్స్‌పై ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రెండో బిల్లు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. విపక్ష తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబట్టారు. రైతులకు మరణ శాసనం వంటి ఈ బిల్లులను తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం ఇదని ఆరోపించింది. ప్రతిపక్షం తీరు సిగ్గుచేటు: రాజ్‌నాథ్ రాజ్యసభలో రైతు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేట ని, పార్లమెంట్ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతు బిల్లులను సభ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యుల ఇలాంటి ప్రవర్తను, ఘటనలను ఊహించలేమన్నారు. సభాధ్యక్షుని నిర్ణయంతో ఏకీభవించని నేతలు ఆయనపై దాడికి ప్రయత్నించడం, హింసాత్మక చర్యలకు పూనుకో వడాన్ని అనుమతించబోమన్నారు. ఎంఎస్పీపై అనుమానాలొద్దు: ప్రభుత్వం విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లుగా.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఎంఎస్పీ విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా తాము కోరుకున్న ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులకు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. బిల్లులో తాము పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్య(ప్రోత్సాహ, సులభతరం)’ బిల్లు ద్వారా లభిస్తుందన్నారు. రైతులపై సెస్, చార్జీలు ఉండబోవన్నారు. అలాగే, రైతులు వ్యవసాయాధారిత సంస్థలు, కంపెనీలు, ఎగుమతిదారులతో తమ ఉత్పత్తులను ముందే కుదుర్చుకున్న ధరకు అమ్మేందుకు ఒప్పందంకుదుర్చుకునే వీలు ‘రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లు కల్పిస్తుందని మంత్రి తోమర్ వివరించారు. ఉపసభాపతిపై అవిశ్వాసం! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై 12 విపక్ష పార్టీలు ఆదివారం అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఆయన పక్షపాత ధోరణిలో, అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించాయి. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానాలపై డివిజన్ ఓటింగ్ జరగాలన్న డిమాండ్‌ను ఆయన పట్టించుకోలేదని విమర్శించాయి. అవిశ్వాస నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్ ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రభుత్వం పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. జేడీయూ నేత హరివంశ్ గతవారమే రాజ్యసభ ఉపసభాపతిగా రెండో సారి ఎన్నికయ్యారు. రాజ్యసభలో మెజారిటీ లేనందునే ప్రభుత్వం డివిజన్ ఓటింగ్‌కు అంగీకరించలేదని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమన్నారు. ఆ ఎంపీలపై ప్రివిలేజ్ మోషన్ రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో అనుచితంగా ప్రవర్తించిన పలువురు విపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ సహా ముగ్గురు, లేక నలుగురు ప్రతిపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిల్లుల ఆమోదం సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ విపక్షపార్టీలు ఆయనపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ తరువాత, వెంటనే కొందరు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి, సభలో జరిగిన ఘటనలపై చర్చించారు. విపక్ష సభ్యుల ప్రవర్తనను ఆయనకు వివరించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రైతులకి మరణశాసనం లిఖించింది. భూమిలో బంగారు పంటలు పండించే రైతన్నల కంట్లో నుంచి రక్తం ప్రవహిస్తోంది. రైతులకి మరణశాసనంగా మారే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వారి బంగారు భవిష్యత్‌కు ఈ బిల్లులు బాటలు వేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో ఈ బిల్లుల్ని తీసుకువచ్చారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు కొనసాగుతాయి – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం. కానీ అత్యధికుల అణచివేత కాదు. బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించాలి – సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం, కార్పొ రేట్లకు అనుకూలం. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాల పరిధిలో వ్యాపార లావాదేవీలను నియంత్రిస్తాయి. చరిత్ర ఎవరినీ క్షమించదు. – ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2028 సంవత్సరం వచ్చినా రైతుల ఆదాయం పెరగదు. ఈ బిల్లుల ఆమోదం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. బిల్లుల్ని వెంటనే సెలక్ట్ కమిటీకి పంపాలి – డెరెక్ ఓబ్రీన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వ్యవసాయ బిల్లులతో రైతు ఆత్మహత్యలు ఇంక జరగవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? వీటిపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలి – సంజయ్ రౌత్, శివసేన ఎంపీ స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఈ బిల్లులు రైతులకు ఎలా మేలు చేస్తాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించి చెప్పాలి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో ఈ బిల్లుల్ని అత్యవసరంగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది ? – హెచ్డీ దేవెగౌడ, జేడీ (ఎస్) ఎంపీ వ్యవసాయ బిల్లులపై చర్చించకుండా హడావుడిగా ఆమోదించడమేంటి? రైతు బిడ్డలెవరూ ఇలాంటి బిల్లుల్ని రూపొందించరు. తిరిగి స్వగ్రామాలకు వెళితే అక్కడ యువత పార్లమెంటులో కూర్చొని రైతన్నలకు మరణశాసనం లిఖిస్తారా అని ప్రశ్నిస్తారు. – రామ్‌గోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద రైతులకు స్వీట్లు తినిపిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్