panniru selvam
-
బల ప్రదర్శనకు సిద్ధమైన పన్నీరు
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటుకు ముందుగా తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పురట్చి (విప్లవ) పయనం పేరిట జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం కాంచీపురం నుంచి తన ప్రయాణాన్ని మొదలెట్టారు. వివరాలు.. అన్నాడీఎంకేను కై వసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఆయనకు చుక్కెదురైంది. ఇదే సమయంలో ప్రత్యర్థి పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆపార్టీని పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం పన్నీరు జీర్ణించుకోలేకున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు సైతం తనను విస్మరించడంతో అన్నాడీఎంకే దూరమైనట్టే అన్న నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, తనను నమ్ముకున్న వారి కోసం అమ్మడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉన్నట్టు తెలిసింది. అలాగే తన కోసం ప్రత్యేకంగా ఓ పత్రికను సైతం స్థాపించడం గమనార్హం. పార్టీ ఏర్పాటుకు ముందుగా తన బలాన్ని చాటుకునే విధంగా , పళణి వ్యతిరేకులను తన వైపునకు తిప్పుకునే రీతిలో పురట్చి పయనం పేరిట జిల్లాల పర్యటనకు ఆదివారం పన్నీరు శ్రీకారం చుట్టారు. కాంచీపురం కళియనూరు బహిరంగ సభతో తన ప్రచార ప్రయాణాన్ని మొదలెట్టారు. అందరూ ఐక్యంగా ఉంటేనే లోక్‌సభ ఎన్నికల్లో విజయం అని లేకుంటే ఓటమి తప్పదని పన్నీరు వ్యాఖ్యానించారు. వారంలో రెండు జిల్లాలను ఎంపిక చేసిన బహిరంగ సభలతో పురట్చి పయనాన్ని పన్నీరు విస్తృతం చేయనున్నారు. దేవుడికే తెలుసు.. మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చిన సత్యనారాయణ రావు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారా? అని ప్రశ్నించగా, అది దేవుడి చేతిలోనే అంటూ సమాధానం ఇచ్చారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నించగా వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పన్నీరు సెల్వం భేటీ గురించి ప్రశ్నించగా, ఇందులో రాజకీయాలు ఏమీ లేవు అని సమాధానం ఇచ్చారు. రజనీతో భేటీ తొలుత పోయెస్ గార్డెన్లో సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పన్నీరు సెల్వం భేటీ కావడం చర్చకు దారి తీసింది. రజనీకాంత్‌కు బీజేపీ పెద్దలతో సన్నిహితం ఉన్న దృష్ట్యా, ఆయన ద్వారా కేంద్రం ఆశీస్సులను తిరిగి పొందేందుకు పన్నీరు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. మూసుకు పోయిన బీజేపీ తలుపులను రజనీ కాంత్ ద్వారా తెరిపించుకునే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం. అయితే, ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని రజనీ సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొన్నారు. -
అమ్మ డీఎంకే పేరుతో సెల్వం కొత్తపార్టీ..!
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు. ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది. ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం. -
పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతుదారులే టార్గెట్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్ మద్దతు దారులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ముగ్గురు మినహా తక్కిన నాయకులు అందరూ పార్టీలోకి రావాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఆయా జిల్లాలోని పార్టీ నేతల ద్వారా మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం మదురై వేదికగా మహానాడును పళణి స్వామి విజయవంతం చేసుకుని మంచి జోష్ మీదున్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న దక్షిణ తమిళనాడులో తన బలాన్ని నిరూపించుకునే విధంగా పళణి స్వామి సఫలీకృతులయ్యారు. మహానాడుకు 15 లక్షల మంది వచ్చినట్టుగా స్వయంగా పళణిస్వామి ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యా రు. పార్టీ కిందిస్థాయి కేడర్ అంతా తన వెన్నంటి ఉండడంతో, ద్వితీయ శ్రేణి, జిల్లాస్థాయిలో కీలకంగా ఉన్న పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతు నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు నాయకులు మినహా తక్కిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదురై కోటలో పళణి స్వామి తన బలాన్ని నిరూపించుకు వెళ్లడంతో ఆయన వెన్నంటి నడిచేందుకు పన్నీరు, టీటీవీ, శశకళ మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. వీరందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే బాధ్యతలను ఆయా జిల్లాలోని నేతలకు పళణి స్వామి అప్పగించారు. -
పన్నీరుకు కొడుకుతో తలనొప్పి.. అన్నగా భావిస్తే ఆశపడి..
సాక్షి, చైన్నె: ఓ సామాన్యుడి న్యాయం పోరాటం ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటున్న మాజీ సీఎం పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. గత కొన్ని నెలలుగా తనకు లైంగిక వేధిస్తున్నారంటూ ఆయనపై బుధవారం డీజీపీ శంకర్ జివ్వాల్ కార్యాలయంలో చైన్నెకు చెందిన గాయత్రి దేవి ఫిర్యాదు చేశారు. ఇందులో 2014లో బంధువుల వివాహ సమయంలో పన్నీరు సెల్వం కుటుంబ సభ్యులతో తన కుటుంబానికి పరిచయం ఏర్పడినట్టు ఆమె పేర్కొన్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఫ్యామిలీ, తమ ఫ్యామిలీ అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని పేర్కొన్నారు. అయితే గత ఏడాది చివరి నుంచి పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్ రూపంలో తనకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఆయన్ని తన సొంత అన్నయ్య లాగా భావించానని, ఆ విధంగానే ఆయనతో మెలిగానని పేర్కొన్నారు. అయితే, ఆయన మిత్రుడు ఒక రోజు ఫోన్ చేసి రవీంద్రనాథ్‌కు తానంటే ఎంతో ఇష్టం అని తెలియజేశాడని, సహకరిస్తే రాణిలా ఉంటావు.. లేకుంటే చంపేస్తామని బెదిరించినట్టు తెలిపారు. తొలుత ఈ బెదిరింపును తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే, ఓ రోజు మద్యం తాగని తనతో అసభ్యకరంగా రవీంద్రనాథ్ ఫోన్లో మాట్లాడడం ఆవేదనకు గురి చేసిందన్నారు. రోజూ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఫలితంగా రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశ పడుతుండడం గురించి ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు బెదిరింపులు పెరిగాయని, ఆందోళనతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వాపోయారు. -
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్‌ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
ఎంపీ రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం వారసుడు, ఎంపీ రవీంద్రనాథ్‌కు సంబంధించి రూ. 10 కోట్ల ఆస్తిని అటాచ్ చేస్తూ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చైన్నెలో చేపట్టిన దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం అఽధికారులు చర్యలు విస్తృతం చేశారు. శనివారం సీఎం స్టాలిన్ కోడలు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సతీమణి కృతికకు చెందిన రూ. 36 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కల్లాల్ గ్రూప్ నుంచి సేకరించిన ఆధారాల మేరకు పన్నీరు సెల్వం వారసుడు , ఎంపీ రవీంద్రనాథ్‌కు సంబంధించిన సాయిరాం ట్రస్టుకు రూ. 8.5 కోట్లు నగదు బదిలీ జరిగి ఉండటాన్ని ఈడీ గుర్తించింది. ఈ మొత్తాన్ని రవీంద్రనాథ్ తక్షణం బ్యాంక్ నుంచి డ్రా చేసి ఉండటంతో ఆయన్ని కూడా విచారణ వలయంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, లైకా సంస్థకు చెందిన అధికారి జీకే ఎం కుమార్‌కు చెందిన టీ నగర్‌లోని రూ. 15 కోట్లు విలువైన ఇంటిని కూడా అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
పళణి కేసులో సాక్షిగా పన్నీరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది. సేలం సబ్ రిజిస్టార్, బ్యాంక్ మేనేజర్‌తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్ హోదాలో పళణి స్వామి నామినేషన్‌ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బీజేపీలోకి పన్నీరు సెల్వం తనయుడు?
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్ కొత్తవ్యూహాలకు పదును పెట్టారు. సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన కమలం (తామర) చిహ్నంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా ఆ పార్టీని తన వశం చేసుకునే వ్యూహాలకు సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం యత్నిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే తన గుప్పెట్లోకి చేరేనా అన్న కలవరంలో పన్నీరు సెల్వం ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఆయన వారసుడు, ఎంపీ పి. రవీంద్రనాథ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. అన్నాడీఎంకే నుంచి తనకు అవకాశం దక్కేది అనుమానం కావడంతో ఈసారి కాషాయం కండువాతో కాకుండా, కమలం చిహ్నంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే కూటమి రాష్ట్రంలో 38 స్థానాలు కై వసం చేసుకోగా, వ్యక్తిగత చరిష్మా, పార్టీ బలంతో అన్నాడీఎంకే తరపున రవీంద్రనాథ్ మాత్రమే పార్లమెంట్ మెట్లు ఎక్కారు. తాజాగా తన కుటుంబ వ్యక్తిగత చరిష్మతో మళ్లీ గెలవవచ్చు అనే ఽధీమాతో ఆయన ఉన్నా, చిహ్నం ఎక్కడ ఇరకాటంలో పెడుతుందో అనే బెంగ తప్పడం లేదటా...! అందుకే ఈ సారి ఆయన కమలం చిహ్నంతో పోటీ చేసి తేని లోక్‌సభ నియోజకవర్గంలో తమ బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తనకు తామర చిహ్నంలో పోటీ చేసే అవకాశం కల్పించిన పక్షంలో దక్షిణ తమిళనాడులోని తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా మారుస్తామనే విషయాన్ని ఢిల్లీలో తను సన్నిహితంగా ఉన్న కేంద్రం పెద్దల దృష్టికి రవీంద్రనాథ్ తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం బీజేపీ తన సీట్ల సంఖ్యను 13కు పెంచినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలపై గురి పెట్టి బీజేపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా రవీంద్రనాథ్ కోసం తేని సీటు, పుదయ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం కోసం వేలూరు సీటును ప్రస్తుతం బీజేపీ తెర మీదకు తెచ్చినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే నుంచి ఈ 13 సీట్లను రాబట్టుకునే వ్యూహాలకు పదును పెట్టే విధంగా బీజేపీ ఢిల్లీ నేతలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. -
తిరుచ్చి వేదికగా పన్నీరు బల ప్రదర్శన
సాక్షి, చైన్నె: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుచ్చి వేదికగా సోమవారం తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. మద్దతుదారులు రెండు లక్షల మేరకు ఈ మహానాడుకు మద్దతుదారులు తరలిరావడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేను చేజిక్కించుకునే విషయంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎంలు పన్నీరు, పళణి స్వామి మధ్య పెద్ద పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌తో జరిపిన సంప్రదింపులతో అన్నాడీఎంకేను పళణి స్వామి కై వసం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామిరాజకీయ చక్రం తిప్పుతున్నారు. అయితే న్యాయ పోరాటంలో తుది గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్న పన్నీరు సెల్వం సోమవారం తిరుచ్చి వేదికగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తిరుచ్చి వేదికగా ముప్పెరుం విళాగా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి మహానాడు ప్రారంభమైంది. గంట పాటుగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితలు నటించిన చిత్రాలలోని పాటలను గాయకులు పాడుతూ పన్నీరు మద్దతు దారులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటలకు వేదికపై పన్నీరు సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్, పార్టీ నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్, వెల్లమండి నటరాజన్, కూపా కృష్ణన్లు వచ్చారు. మద్దతు దారులను పలకరించేందుకు వీలుగా పన్నీరు సెల్వం కోసం ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. మద్దతు దారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఆయన అభివాదం తెలియజేశారు. పళణి స్వామి, ఆయన బృందాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం తన ప్రసంగంలో విరుచుకు పడ్డారు. కోర్టు తుది తీర్పుతో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా, తన సామాజిక వర్గం వెన్నంటి ఉంటుందని, లక్షల్లో తరలి వస్తారని భావించిన పన్నీరు సెల్వం చివరకు రెండు లక్షల మంది మేరకు మద్దతుదారులతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. -
కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం
సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. పోటీ తథ్యం.. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు. -
జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే, జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. దివంగత సీఎం జే జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజుగా అపోలో వైద్యులు పలువురు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్‌క్రాస్ ఎగ్జామిన్‌లో ప్రశ్నలు సంధించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పన్నీరుసెల్వంకు ఆ కమిషన్ సమ న్లు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటంతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. తాజాగా ఆయన్ని ఈనెల 21వ తేది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసు విచారణ సమయంలో శశికళ వదిన ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారించేందుకు కమిషన్ నిర్ణయించింది. శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. -
చిన్నమ్మతో భేటీ.. పన్నీరు సోదరుడిపై వేటు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారనే కారణంతో పన్నీరు సెల్వం సోదరుడు రాజాపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది. శనివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి ఈ అంశంపై సంయుక్త ప్రకటన చేశారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి ఆహ్వానించే విధంగా ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం అయితే, చిన్నమ్మను ఆహ్వానించేందుకు తగ్గట్టుగా తరచూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న తరహాలో కో– కన్వీనర్ పళనిస్వామి శిబిరం స్పందిస్తోంది. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం సోదరుడు రాజా చిన్నమ్మ శశికళతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. వేటుపై నిర్ణయం చిన్నమ్మ శశికళ జిల్లాల బాట పట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి తిరుచెందూరులో ఆమె బస చేశారు. ఆమెను ఓ రాజాతో పాటుగా తేని జిల్లాకు చెందిన పలువురు అన్నాడీఎంకే నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెతో ఫొటోలు దిగడమే కాదు, చిన్నమ్మకు మద్దతుగా గళాన్ని వినిపించారు. ఇది అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం రేపింది. దీంతో శనివారం పన్నీరు, పళని సంయుక్తంగా ప్రకటన విడుదల చేసి రాజాతో పాటుగా తేని జిల్లా నేతలు మురుగేషన్, వైగై కరుప్పు, సేతుపతి తదితరులకు ఉద్వాస పలికారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, క్రమ శిక్షణను ఉల్లంగించి పార్టీకి కళంకం తెచ్చే విధంగా వీరు వ్యవహరించారని, వీరందరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తేని జిల్లాలో పన్నీరుకు కుడి భుజంగా రాజా ఉన్నారు. గతంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి ఆయన ఉద్వాసనకు గురయ్యారు. చివరకు మళ్లీ పన్నీరు అక్కున చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మకు మద్దతుగా పన్నీరు పరోక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన సోదరుడు రాజా ఏకంగా భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. -
లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట
సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. వానతీ శ్రీనివాసన్ గెలుపు బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్ విచారణను తిరస్కరించింది. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
Tamil Nadu: పన్నీర్‌సెల్వం సోదరుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్ (55) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలమురుగన్ మూడేళ్లకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకుని గురువారం రాత్రి తేని జిల్లా పెరియకుళత్తిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కాని శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీర్‌సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్ ఫంగస్ -
అన్నాడీఎంకేలో ‘సీఎం’ వేడి
చెన్నై: ఎన్నికలకు మరో 9 నెలల సమయముండగానే అన్నాడీఎంకేలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై వేడి రాజుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో మంత్రులు బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీనికితోడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ శనివారం పలుచోట్ల పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంలతో భేటీ అవుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అభ్యర్థిపై ప్రచారాలు మొదలు కావడంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమష్టిగా జరుగుతాయని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ బాహాటంగా ప్రకటించకూడదని కోరారు. ‘ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంతో సహా నిర్ణయాలన్నీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొనే జరుగుతాయి. విజయం కోసం పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’అని ఆ ప్రకటనలో అగ్రనేతలిద్దరూ హెచ్చరించారు. ఇటీవల సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని అన్నారు. మరో మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ పళనిస్వామే సీఎం అభ్యర్థని ప్రకటించారు. దీంతో పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగి ‘ఏఐఏడీఎంకే లక్ష్యం... వరుసగా మూడోసారి నెగ్గడం. అదే అమ్మ (జయలలిత) కల కూడా. అందరూ క్రమశిక్షణతో ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు. -
కలలు సాకారం చేస్తాం
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్‌కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు. కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మోదీ విరాళం 21 లక్షలు ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కరుణానిధిని చూసి వెళ్లారు. -
స్పీకర్, డిప్యూటీ సీఎంలకు సుప్రీం నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తమిళనాడు స్పీకర్ ధనపాల్, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు 4వారాల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వంతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హతవేటు వేయాలని డీఎంకే విప్ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయంలో తలదూర్చలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చక్రపాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సైతం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. -
పదవి సరే.. పవరేది !
ఇంటి ముందు బోర్డు తగిలించుకునే రీతిలో పేరుకే డిప్యూటీ సీఎం పదవి అన్నట్టుగా మారింది పన్నీరు సెల్వం పరిస్థితి. ఐఏఎస్‌లు పలువురు సీఎం.. సీఎం అంటూ, డిప్యూటీ కోరల్ని కత్తిరించే పనిలో పడ్డట్టున్నారు. పన్నీరుకు పదవి ఇచ్చినా పవర్‌ను మాత్రం సీఎం పళని స్వామి తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా సచివాలయంలో చర్చ సాగుతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో పన్నీరు మౌనం పాటిస్తున్నా, ఆయన సేనల్లో మాత్రం సందిగ్ధత నెలకొనడం గమనార్హం. సాక్షి, చెన్నై : పురట్చి తలైవి శిబిరానికి నేతగా, మాజీ సీఎంగా పన్నీరు ప్రభంజనానికి హద్దే లేదని చెప్పవచ్చు. మీడియాల్లోనూ పతాక శీర్షికల్లో ఆయనే. అయితే, అమ్మ శిబిరంతో విలీనం తదుపరి పన్నీరు మూలనపడ్డారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేతిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్నా, పరిస్థితి మాత్రం అది అలంకారప్రాయం అన్నట్టుగా మారింది. ఆర్థిక, ప్రణా ళిక, అసెంబ్లీ వ్యవహారాలు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వంటి శాఖలు చేతిలో ఉన్నా, కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పన్నీరు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అధికారాలకు కళ్లెం దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత తదుపరి అన్నాడీఎంకేకి అన్నీ తానే అన్నట్టుగా సీఎం పళని స్వామి దూకుడు సాగుతున్న విషయం తెలిసిందే. విలీనం రూపంలో పన్నీరును అక్కున చేర్చుకున్నా, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూపంలో చిక్కులు ఎదురైనా, పళని మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమ్మ తరహాలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కు తగ్గడం లేదని చెప్పవచ్చు. అదే సమయంలో డిప్యూటీ పళని స్వామి, తనను అధిగమించకుండా జాగ్రత్తల్లోనూ ఉన్నట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గత కొద్ది రోజులుగా సచివాలయంలో ఆవిష్కరించినట్టుగా చర్చ జోరందుకుంది. వ్యవహారాలన్నీ పళని డైరెక్షన్లోనే సాగుతున్నట్టుగా చర్చ తెర మీదకు వచ్చింది. పురట్చి తలైవి శిబిరంతో ముందుకు సాగినప్పుడు, తనకు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించిన అధికారులను, ప్రస్తుతం తన చుట్టూ నియమించి ఉండడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టు సమాచారం. పదవి చేతిలోకి రాగానే, కొందరి భరతం పట్టే రీతిలో పన్నీరు నిర్ణయాలు తీసుకున్నా, అందుకు పళని మోకాలొడ్డి ఉండడం గమనార్హం. తన సన్నిహిత అధికారుల్ని చుట్టూ నియమించుకునేందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసినా, అందుకు ఆమోద ముద్ర పడని దృష్ట్యా, పన్నీరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లోనే.. అనేక నామినేటెడ్ పోస్టుల్లో తన మద్దతుదారుల్ని నియమించేందుకు పన్నీరు చర్యలు చేపట్టినా, ఆ ఫైల్‌ను తీసుకెళ్లిన అధికారులు, సీఎం చాంబర్‌కే పరిమితం చేసి ఉండడం ఆలోచించాల్సిందే. పదవి చేతికి ఇచ్చిన పవర్ కట్ చేసి ఉండడాన్ని పన్నీరు మౌనంగా భరిస్తున్నా, ఆయన మద్దతుదారులు మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నారని చెప్పవచ్చు. అయితే, గత్యంతరం లేని పరిస్థితి కాబట్టి, అన్నీ మౌనంగా భరించాల్సిందేనని సేనలకు పన్నీరు సూచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పన్నీరుకు ఎదురవుతున్న సమస్యల్లో ఆయన శిబిరానికి చెందిన మంత్రి పాండియరాజన్‌కు కూడా తప్పనట్టు సమాచారం. ప్రభుత్వ వ్యవహారాల పరంగా కొందరు అధికారులు, ఈ ఇద్దర్ని ఖాతరు చేయడం లేదని సమాచారం. అధికారుల దాటవేత పదే పదే సీఎం.. సీఎం అంటూ అధికారులు దాటవేతతో, పరోక్షంగా బెదిరింపు ధోరణితో ముందుకు సాగుతున్నట్టుగా సచివాలయంలో చర్చ జోరందుకుని ఉండడం గమనార్హం. సచివాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పార్టీ పరంగా పన్నీరుకు సంకటం ఎదురవుతున్నట్టు సమాచారం. అందుకే గత కొద్ది రోజులుగా ఎంజీయార్ శత జయంతి వేడుకల వేదికల్లో పన్నీరు మౌనంగా, అంటీముట్టనట్టు ఉంటున్నట్టు ప్రచారం. పార్టీ నిర్వాహక కమిటీలో పదిహేను మంది సభ్యుల ఎంపికలో పన్నీరుకు చాన్స్ ఇవ్వకుండా పళని ముందుకు సాగుతుండడమే ఇందుకు నిదర్శనంగా చర్చ ఊపందుకుంది. -
పోతే.. పోనీ!
పళని గొడుగు నీడకు ఎమ్మెల్యే ఆరుకుట్టి n ఆయనే వచ్చారు..ఆయనే వెళ్లారన్న పన్నీరు n మద్దతుదారులతో మంతనాలు తనంతకు తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే..పోనీ.. అంటూ పళని పంచన చేరిన ఎమ్మెల్యే ఆరుకుట్టిని ఉద్దేశించి పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న వారినైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. పార్టీ వర్గాలతో ఆదివారం మంతనాల్లో మునిగినా, మళ్లీ చర్చల నినాదాన్ని పలువురు ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. సాక్షి, చెన్నై :సేలం ఆర్ ఆండ్ బి గెస్ట్ హౌస్ వేదికగా సీఎం పళని స్వామి నేతృత్వంలోని ఎమ్మెల్యే ఆరుకుట్టి అమ్మ శిబిరంలో చేరారు. మరికొందరు ఆయన బాటలో పయనిస్తారనే సమాచారంతో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సీ ఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట 122 మంది, మాజీ సీఎం పన్నీ రు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం శిబిరంలో ఇటీవల అసంతృప్తి రాజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సైతం పన్నీరుకు తగ్గుతుండడంతో ఆ శిబిరంలోని నేతలు, ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. అసంతృప్తిని బయటపెడుతూ గౌండం పాళయం ఎ మ్మెల్యే ఆరుకుట్టి ఆ శిబిరం నుంచి బయటకు అడుగువేశారు. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని గతంలో ప్రకటించినప్పుడు అందులో అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు ఆ శిబిరం నుంచి బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ దృష్ట్యా, ఇక, ఆ శిబిరం నుంచి జంప్‌జిలానీల సంఖ్య ఇక పెరగడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. పళని పంచన ఆరుకుట్టి పన్నీరు శిబిరం నుంచి బయట పడ్డ ఆరుకుట్టి ఆదివారం ఉదయం సేలం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఉన్న సీఎం పళని స్వామిని కలుసుకున్నారు. తన మద్దతుదారులు, నియోజకవర్గ నేతలతో కలిసి అమ్మ శిబిరంలో చేరారు. అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు సాగుతానని ప్రకటించారు. ఇక, తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా హితం లక్ష్యంగా తాను అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నానని ఆరుకుట్టి ప్రకటించారు. తనవలే మరెందరో ఆ శిబిరంలో అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా అమ్మ ప్రభుత్వం వైపు రావడం ఖాయం అని ప్రకటించడం గమనార్హం. ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు.. ఆరుకుట్టి బాటలో మరికొందరు అమ్మ శిబిరంలోకి వెళ్లే అవకాశాలున్న సమాచారంతో పన్నీరు సెల్వం మేల్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంట కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. 12మందిలో మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తటస్థంగా ఉండగా, ఆరుకుట్టి హ్యాండిచ్చారు. ఇక, పన్నీరుతో పాటుగా సెమ్మలై, శరవణన్, మనోహరన్, మాణిక్యం, షణ్ముగనాథన్, చిన్నరాజ్, అరుణ్‌కుమార్, పాండియరాజన్, మనోరంజితం మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు అమ్మ గొడుగు నీడకు చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆరుకుట్టికి అమ్మ శిబిరంలో ఇచ్చే విలువ, ప్రాధాన్యత మేరకు ఈ నలుగురు జంప్ జిలానీ కావడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఆదివారం గ్రీన్ వేస్ రోడ్డులోని తన నివాసంలో ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగారు. ఇందులో కొందరు మళ్లీ అమ్మ శిబిరంతో చర్చలకు సిద్ధం అవుదామన్న నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. అందుకే కాబోలు పన్నీరు సెల్వం సమావేశం మధ్యలో బయటకు వచ్చేసి కారులో వెళ్లి పోవడం గమానార్హం. అంతకు ముందు ఆరుకుట్టి జంప్ గురించి మీడియా సంధించిన ప్రశ్నకు, ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు..పోతే పోనీ.. అంటూ పన్నీరు వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా, ఆగస్టు తర్వాత అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూపంలో ఏదేని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉండబట్టే, బలాన్ని పెంచుకునే విధంగా పన్నీరు శిబిరాన్ని పళని గురిపెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
అంతా రహస్యం!
► పన్నీరుతో పళని విలీన వ్యూహం ► ఢిల్లీకి దినకరన్ ► కమలనాథులతో ఆశీస్సుల కోసం ప్రయత్నం ► శశికళతో దివాకరన్ ములాఖత్ ► అన్నాడీఎంకేపై పెరిగిన కేంద్రం ఒత్తిడి ► ప్రతిపక్షాల ఆరోపణ ► మా జోక్యం లేదన్న వెంకయ్య సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం అంతా రహస్యంగా మారుతోంది. రహస్య చర్చలు, మంతనాల్లో గ్రూపులు నిమగ్నమయ్యాయి. కమలం పెద్దల దర్శనంతో వారి ఆశీస్సుల కోసం దినకరన్ ఢిల్లీ బాట పట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, దినకరన్ ఆదిపత్యానికి చెక్ పెట్టడం లక్ష్యంగా పన్నీరుతో రహస్యంగా విలీన చర్చలో పళని తలమునకలై ఉన్నట్టు సమాచారం. ఈ పరిణా మాల నేపథ్యంలో అన్నాడీఎంకే సర్కారుకు మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను తెర మీదకు తెస్తూ గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి ప్రధాన ప్రతి పక్షం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకేలోసాగుతున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు మద్దతుగా 32 మంది ఎమ్మెల్యేలు కదలడం, ఆ కుటుంబానికి చెందిన దివాకరన్‌తో మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీకావడం సీఎం పళనిస్వామి ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితిలో దినకరన్ లేదన్న సంకేతాలు కాస్త ఊరట నిచ్చినా, ఎక్కడ కుర్చీకి ఎసరు పెడుతాడోనన్న బెంగ పళనికి తప్పడం లేదు. దినకరన్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం లక్ష్యంగా పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం పన్నీరు శిబిరంతో విలీనం లక్ష్యంగా పావులు కదిపేందుకు వ్యూహ రచన చేశారు. కమిటీలు, మంత్రుల బృందాల ద్వారా చర్చల వ్యవహారాలు బహిర్గతం అవుతుండడంతో రహస్య మంతనాలకు సిద్ధమైనట్టు తెలిసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవీ శిబిరంతో విలీనం సాగిన పక్షంలో కేంద్రం అండదండాలు మరింతగా తన ప్రభుత్వానికి దక్కడం ఖాయం అన్న నిర్ణయానికి సీఎం వచ్చారు. కేంద్రం సహకారంతో దినకరన్‌కు చెక్ పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకోవచ్చన్న నిర్ణయంతో విలీన ప్రయత్నాల వేగవంతానికి పరుగులు తీస్తున్నట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం వర్గాల్లో చర్చ సాగుతోంది. రహస్యంగా పరుగులు.. విలీన చర్చలు రహస్యంగా సాగడం లక్ష్యంగా పళని నిర్ణయించారు. స్వయంగా పన్నీరు సెల్వంతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. సీఎంగా తాను కొనసాగేందుకు కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దృష్ట్యా, ఇక, పన్నీరును విలీనం వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం ద్వారానే ‘విలీనం’ సాధ్యం అవుతుందన్న నిర్ణయాన్ని ఓ సీనియర్ మంత్రి సీఎంకు సూచించినట్టు తెలిసింది. దీంతో పన్నీరుకు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించేందుకు కొత్త ఎత్తులకు సిద్ధం అవుతోన్నట్టు చర్చ. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడాన్ని పరిగణలోకి తీసుకుని ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, పార్టీ సాధారణ సభ్యురాలుగా నియమించేందుకు తగ్గ వ్యూహంతో పళని ముందుకు సాగుతున్నట్టు సమాచారం. శశికళను సాధారణ సభ్యురాలుగా చేసిన పక్షంలో ఆమె నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి పదవి రద్దు అయ్యేందుకు చాన్స్ ఉందన్న విషయాన్ని పరిగణించారు. విలీనం తదుపరి కేంద్రం అండదండాలతో దినకరన్‌ను ఒంటరి చేయడం, ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకుని నాలుగేళ్లు సజావుగా ముందుకు సాగే వ్యూహంతో పళని ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, పళని వ్యూహాలు ఆచరణలో పెట్టే విధంగా పన్నీరు ముందుకు సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. కమలం పెద్దల ఆశీస్సుల కోసం: తనకు వ్యతిరేకంగా పళని సర్కారు వ్యూహ రచనల్లో ఉన్న సమాచారంతో ముందస్తు ప్రయత్నాల్లో దినకరన్ ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన ఢిల్లీలో తిష్ట వేసి కమలం పెద్దల దర్శనం, ఆశీస్సుల కోసం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. గురువారం రాత్రి తన మద్దతుదారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దినకరన్ ఢిల్లీకి చెక్కేయడం గమనార్హం. పళనిస్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో కమలం పెద్దలతో సంప్రదింపులు సాగించి, తనకు ఆశీస్సులుఅందించాలని కమలం పెద్దల్ని వేడుకునేపనిలో పడ్డట్టు చర్చ. ఇక, శశికళ సోదరుడు దివాకరన్ పరప్పన అగ్రహార చెరలో సోదరితో ములాఖత్ కావడం గమనార్హం. ఇక్కడి రాజకీయ పరిస్థితులను, దినకరన్‌కు మద్దతు కదిలిన ఎమ్మెల్యేలు, తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేల గురించి శశికళకు వివరించినట్టు తెలిసింది. ఫిర్యాదుకు ప్రతి పక్షాలు : అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను ప్రతిపక్షాలు తెర మీదకు తెచ్చారు. కేంద్రం గుప్పెట్లో ఆ ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, మనుగడ సాగిస్తున్నదని వీసీకే నేత తిరుమావళవన్ విమర్శించారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ అయితే, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చుకునేందుకు గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక, తమిళనాడు ప్రభుత్వంలో తమ జోక్యమే లేదని మరో మారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
దీక్షకు సిద్ధం
► రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు ► జిల్లా కేంద్రాల్లో నిరసన ► సీబీఐ విచారణకు పట్టు జయలలిత మరణం మిస్టరీ గుట్టురట్టు లక్ష్యంగా సీబీఐ విచారణకు పట్టుబడుతూ బుధవారం నిరాహరదీక్షకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు దీక్షలకు పన్నీరు శిబిరం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, పన్నీరును పంటినొప్పి వెంటాడుతుండడం గమనార్హం. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరి ణామాలపై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ఎగుర వేసిన పన్నీరుసెల్వం ఇక, అన్నాడీఎంకే తనదేనని ధీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గ ప్రయత్నాలను ఓ వైపు వేగవంతం చేశారు. మరో వైపు అమ్మ జయలలిత ఆశీస్సులతో ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగానే పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మ జయలలిత మరణంలో అనుమానాలు ఉన్నాయంటూ రోజుకో ఆరోపణలను పన్నీరు సెల్వం శిబిరం గుప్పిస్తూ వస్తోంది. ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. ఒక రోజు దీక్షకు కేంద్రం దిగిరానిపక్షంలో తదుపరి అడుగులకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. నేడు నిరాహర దీక్ష: బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహరదీక్షకు పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. ఆ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ముందస్తుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చారు. ఇక్కడ జరిగే దీక్షకు పన్నీరుసెల్వం నేతృత్వం వహించనున్నారు. పన్నీరు శిబిరంలోని ముఖ్య నాయకులు ఈ వేదిక మీదుగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సేలంలో కలెక్టరేట్ వద్ద, కోయంబత్తూరులో శివానంద కాలనీ, తిరుప్పూర్‌లో కుమరన్ పాళయం, తిరునల్వేలిలో కొత్త బస్టాండ్, తంజావూరులో హెడ్ పోస్టాఫీసు, తూత్తుకుడి ఎంజీఆర్ దిడల్, తిరుచ్చి ఉలవర్ సందై వేదికగా దీక్షలు జరగనున్నాయి. పన్నీరుకు పంటి నొప్పి: దీక్షకు సిద్ధమైన వేళ పన్నీరుకు పంటి నొప్పి వెంటాడుతోంది. మంగళవారం ఆయనకు తీవ్రనొప్పి రావడంతో వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందారు. దీంతో అన్ని అపాయింట్ మెంట్లను రద్దు చేశారు. పన్నీరు కోసం పలు ప్రాంతాల నుంచి మద్దతుదారులు వచ్చినా, ఎవర్నీ ఆయన కలవలేదు. పార్టీ ముఖ్య నాయకులు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరం వద్ద ఉండి, దీక్ష ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. -
ఇక సమరమే!
► నేటి నుంచి సభా పర్వం ► అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ► గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం ► సభా మందిరంలో మార్పులు చేర్పులు ► 24న అమ్మకు సంతాపం ► 25న జల్లికట్టు ముసాయిదా సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. జల్లికట్టు ప్రకంపనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభాపర్వం వాడివేడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్(ఇన్ )విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక, ఈనెల 24న అమ్మ జయలలిత మృతికి సంతాపం తీర్మానం, 25వ తేదీన జల్లికట్టుకు మద్దతుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలం విషయంగా ముసాయిదాలు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికారంలోకి వచ్చినానంతరం దివంగత సీఎం జయలలిత నేతృత్వంలో గత ఏడాది బడ్జెట్ సమావేశాలు సాగాయి. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో అమ్మ జయలలిత ఆసుపత్రి పాలు కావడం, చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరడం చోటు చేసుకున్నాయి. సీఎంగా అమ్మ నమ్మిన బంటు పన్నీరుసెల్వం పగ్గాలు చేపట్టినా, రాష్ట్రంలో పాలన అంతంత మాత్రమే. ఇక, జల్లికట్టు నినాదం పన్నీరుసెల్వం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోనే పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తొలి అసెంబ్లీ సమావేశానికి తగ్గ ఏర్పాట్ల మీద సీఎం పన్నీరుసెల్వం దృష్టి పెట్టారు. ఆయా విభాగాల్లోని కేటాయింపులు, పథకాల తీరు తెన్నుల మీద మంత్రులు సమీక్షలు ముగించి, ప్రతి పక్షాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సభాపర్వం తేదీని రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశానికి తగట్టు సర్వం సిద్ధమైంది. ఇక సమరమే...జల్లికట్టు ప్రకంపన తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశం అవుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు బలమైన ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. దీంతో సభాపర్వం వాడి వేడిగా సాగే అవకాశాలు ఎక్కువే. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే తొలి సమావేశం కావడంతో, ఇందులో ఏదేని కొత్త పథకాలను ప్రకటించేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అమ్మ పథకాల కొనసాగింపుతో పాటు, ఇతర పథకాల మీద పన్నీరు దృష్టి పెట్టేనా అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. అమ్మ జయలలిత లేని తొలి సమావేశం కావడంతో ఇక, అన్నాడీఎంకే వర్గాల్లో అమ్మ భక్తి ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, ఈ ఏడాదిలో తొలి సమావేశాన్ని ప్రారంభించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ ఆవరణకు చేరుకుంటారు. స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతారు. పది గంటలకు సరిగ్గా గవర్నర్ ఆంగ్ల ప్రసంగం ప్రారంభం అవుతుంది. తదుపరి ఆ ప్రసంగాన్ని స్పీకర్ ధనపాల్ తమిళంలో అనువదిస్తారు. ఇంతటితో తొలి రోజు సభ ముగుస్తుంది. తదుపరి స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి సమీక్షించి ఇందులో నిర్ణయం తీసుకుంటారు. రేపు అమ్మకు సంతాపం: అందరి అమ్మ జయలలిత భౌతికంగా దూరమైనానంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సంతాప తీర్మానం, సందేశాలు సభలో సాగించాల్సి ఉంది. రెండో రోజు మంగళవారం అమ్మ జయలలిత మృతికి సంతాప తీర్మానం, నేతల ప్రసంగాలు ఉంటాయి. అదే రోజు మాజీ మంత్రి కోశిమణితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ గవర్నర్ బర్నాల, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రోల మృతికి సంతాపంగా మౌనం పాటించనున్నారు. ఈ ప్రక్రియతో రెండో రోజు సభ ముగియనుంది. ఇక మూడో రోజు బుధవారం నుంచి సభలో వాడివేడి ప్రసంగాలు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా, చర్చలు, జల్లికట్టు ముసాయిదా సభ ముందు కు రానున్నాయి. అలాగే, స్థానిక సంస్థల ఎన్నిక లు ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ సభలోముసాయిదాను దాఖలు చేయనున్నారు. ఇక, అమ్మ జయలలిత సీఎంగా ఉన్న సమయంలో శాసనసభ పక్ష నేతగా పన్నీరు సెల్వం వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన దృష్ట్యా, శాసన సభ పక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారోనన్న ఎదురుచూపులు అన్నాడీఎంకేలో పెరిగాయి. ఇక, అమ్మ సభలో లేని దృష్ట్యా, మందిరంలో కొన్ని మార్పులు చేర్పులు జరి గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.అసెం బ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సమాయత్తమయ్యే విధంగా డీఎంకే శాసనసభా పక్ష సమావేశం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగనుంది. -
రంకెలేసిన తంబి
► ఓ పక్క నిరసన..మరోపక్క రంకెలేసిన బసవన్న ► తెరుచుకున్న వాడి వాసల్ ► తిరుచ్చి, పుదుకోట్టైలలో జల్లికట్టు జోరు ► పుదుకోట్టైలో ఇద్దరి బలి ► అలంగానల్లూరులో సీఎంకు వ్యతిరేకత ► పోటెత్తిన మెరీనా తీరం నిషేధపు కట్లు తెంచుకున్నా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జల్లికట్టు విషయంలో తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. శాశ్వత పరిష్కార నినాదం మిన్నంటింది. అత్యవసర ఆర్డినెన్స్ తో ఆదివారం కొన్నిచోట్ల బసవన్నలు రంకెలే శాయి. మరెన్నో చోట్ల వ్యతిరేకత తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం పన్నీరు సెల్వం వెనుదిరగాల్సి వచ్చింది. పుదుకోట్టైలో నిర్వహించిన సాహసక్రీడలో రంకెలేసిన ఎద్దుల దాడిలోఇద్దరు క్రీడాకారులు బలి అయ్యారు. సాక్షి, చెన్నై : తమిళుల సాహస, సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు పట్టు బడుతూ సాగుతున్న నిరసనల గురించి తెలిసిందే. మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుతూ శనివారం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. కంటి తుడుపుచర్యతో మాకేంటి, శాశ్వత పరిష్కారం లక్ష్యం అంటూ జల్లికట్టు మద్దతు ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. సెలవు రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తినా, ఎక్కడికక్కడ బలగాల్ని మోహరింప చేస్తుండడం గమనార్హం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగి తీరుతామని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. ఇక, ఆర్డినెన్స్ తో ఆదివారం జల్లికట్టుకు శ్రీకారం చుట్టి తీరుతానంటూ ముందుకు సాగిన సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులకు వ్య తిరేకత తప్పలేదు. అలంగానల్లూరులో సీఎం పన్నీరు సెల్వం పాచికలు పారలేదు. అన్ని చో ట్ల వాడి వాసల్ తెరచుకున్నా, కొన్ని చోట్ల మా త్రమే బసవన్నలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి. అటు ఆట : నిషేధపు కట్లు తెంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దక్షిణాదిలోని జల్లికట్టుకు పేరు గడించిన తిరుచ్చి, మదురై, దిండుగల్, శివగంగై జిల్లాల్లో, డెల్టా పరిధిలోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో జల్లికట్టుకు, పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నామక్కల్‌లలో రెక్లాతో ఎడ్ల పందేలకు చర్యలు తీసుకున్నారు. ఆటకు తగ్గ అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగినా, వ్యతిరేకత మాత్రం తప్పలేదు. తిరుచ్చి మనప్పారైలో మూడు, నాలుగు రోజులుగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, కట్లు తెంచుకోవడంతో ఆదివారం మరింత ఉత్సాహంతో జల్లికట్టులో ఎద్దులతో కలిసి క్రీడాకారులు రంకెలు వేస్తూ తమ సత్తాను చాటుకున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను నిర్వాహకులు అందజేశారు. పుదుకోట్టైలోని ఇలుపురు సమీపంలోని రాపూసల్ గ్రామంలో జల్లికట్టును మంత్రులు విజయభాస్కర్, పాండియరాజన్ ప్రారంభించారు. వాడివాసల్ నుంచి ఎద్దులు దూసుకొచ్చాయి. ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో జల్లికట్టు సాగింది. అయితే, ఎద్దుల్ని పట్టుకునే క్రమంలో లక్ష్మణ పట్టికిచెందిన మోహన్, ఉడుక్కురుకు చెదిన రాజా అనే క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ప్రాంతంలో మరో యాభై మంది స్వల్పం గా గాయపడ్డారు. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడంతోనే భద్రత కరువైందని, పాలకుల తీరుతో ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయని సహచర క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, రామనాథపురంలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో రెండు రోజులుగా జల్లికట్టు సాగినా, ఆదివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎద్దులు దూసుకొచ్చాయి. ఇక, కోయంబత్తూరు కొడీస్సియా మైదానంలో రెక్లా పోటీలను మంత్రి ఎస్పీ వేలుమణి జెండా ఊపి ప్రారంభించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో రెక్లా పోటీలను మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. రెక్లా పోటీలకు వచ్చిన మంత్రులకు జల్లికట్టు మద్దతు దారుల సెగ తగిలింది. వారిని బుజ్జగించి బయట పడేలోపు మంత్రులకు ముచ్చెమటలు తప్పలేదు. ఇటు పట్టు : జల్లికట్టుకు ప్రసిద్ది గాంచిన అలంగానల్లూరులో ‘ఆట’కు శ్రీకారం చుట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే సాగాయి. శాశ్వత పరిష్కారం నినాదంతో వాడివాసల్ వైపుగా ఏ ఒక్కర్నీ యువత, గ్రామస్తులు, మద్దతుదారులు వెళ్లనివ్వ లేదు. జల్లికట్టుకు జెండా ఊపుతానంటూ మదురైకు రాత్రికి రాత్రే పరుగులు తీసిన సీఎం పన్నీరుసెల్వం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. జోరు వాన కురిసినా మద్దతుదారులు ఏ మాత్రం వెనక్కు తగ్గని దృష్ట్యా, ఆగమేఘాలపై జల్లికట్టు నిర్వాహకుల్ని పిలిపించి బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఫలితం శూన్యం. వాడివాసల్ తెరిచే ఉందని, ప్రజలు ఎప్పుడు కోరితే, అప్పుడు జల్లికట్టుకు సిద్ధమని మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు ప్రకటించారు. దిండుగల్ జిల్లా నత్తం, సాత్తూరు, సేలం ఆత్తూరు, తంజావూరులో జల్లికట్టుకు ఏర్పాట్లు సాగినా, వ్యతిరేకతతో రద్దు చేసుకోక తప్పలేదు. ఇక, జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సెలవు రోజు పెద్ద ఎత్తున జన సమూహం తోడు కావడం విశేషం. ఈరోడ్‌లోని వీరప్పన్ పాళయంలో బీజేపీ నేతృత్వంలో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీ శాయి. యువత తిరగ బడడంతో, ఓ సందర్భంలో రాళ్లు రువ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు, బీజేపీ వర్గాలు పరుగులు తీశారు. మదురై మేలూరులో వర్షంలోనూ నిరసన కొనసాగగా, రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు మద్దతు ఉద్యమంలో శాశ్వత పరిష్కారం నినాదం మిన్నంటింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా స్పం దించిన జంతు సంరక్షకుడు రాధా రాజన్ ఇరకాటంలో పడ్డారు. బీసెంట్‌నగర్‌లోని ఆయన ఇంటిని డీఎండీకే వర్గాలు ముట్టడించాయి. ఇదే శాశ్వతం : అలంగానల్లూరులో జల్లికట్టుకు జెండా ఊపేందుకు వెళ్లి నిరాశతో చెన్నైకు చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రూపొందించిన ఆర్డినెన్స్ శాశ్వతం అని, ఇది తాత్కాళికం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. అన్ని చోట్ల వాడివాసల్ తెరచుకుందని, జల్లికట్టుకు అనుమతుల్ని కలెక్టర్లు ఇస్తున్నారని, జిల్లాల ఎస్పీలు భద్రతను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చట్ట, నిబంధనలమేరకు ముందుకు సాగుతోందని, ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి , రాష్ట్రపతి ఆమోదం పొంది తీరుతామని స్పష్టం చేశారు. అత్యవసరంగా తీసుకొచ్చిన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ నియమ నిబంధనలు సిద్ధం అయ్యాయని, ప్రభుత్వ గెజిట్‌లో అన్ని వివరాలను ప్రకటించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టు మద్దతుదారులు ఎందుకు ఏకీభవించడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ› ఆ కారణం ఏమిటో మీకే తెలుసు అంటూ పన్నీరు ముందుకు సాగారు. ఇక, ఆర్డినెన్స్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని రీతిలో సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉండడం ఆహ్వానించ దగ్గ విషయం. సరైన వివరణ ఇవ్వండి : జల్లికట్టు కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే, ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చి ఉండేది కాదన్నారు. అయితే, ఇదే శాశ్వతం అని ప్రకటనలు చేయడం కాదు అని, ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ పూర్తి వివరణను సీఎం పన్నీరుసెల్వం జల్లికట్టు మద్దతు దారులుకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా మద్దతుదారుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు. గతంలో జల్లికట్టు విషయంగా సాగిన నాటకీయ నిర్ణయాలతోనే ప్రస్తుతం, ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టుమద్దతు దారులు ఏకీభవించడం లేదన్న విషయాన్ని సీఎం గుర్తెరగాలని హితవు పలికారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా నినాదం మిన్నంటింది. ఆదివారం ఎక్కడిక్కడ ఆందోళనలు సాగాయి. చెన్నై మెరీనా తీరంలో జన సందోహం పోటెత్తింది. యువత, విద్యార్ధులు ఆందోళనల బాటలో ఉదృ్ధతంగా దూసుకెళ్తుండడంతో సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్నడం గమనార్హం. దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. మార్చి 31వరకు సంయమనం పాటిద్దాం. అంతవరకు ఉద్యమాన్ని వాయిదా వేద్దామంటూ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జల్లికట్టు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నిర్వాహకులు చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నిర్వాహకులు చెన్నై ప్రెస్‌క్లబ్ వేదికగా ఈ ప్రకటన చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చే రీతిలో ఉండడం గమనార్హం. అదే సమయంలో వీరి చర్యలను తప్పుబట్టేవారు తెరమీదకు వస్తున్నారు. దీంతో జల్లికట్టు ఉద్యమం సోమవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కొందరు విద్యార్థులయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని మెరీనాతీరంలో బైఠాయించారు.