Parliamentary Standing Committee
-
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్‌లోని కాక్రపార్‌లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
పార్లమెంటరీ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలకు చోటు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గొల్ల బాబురావు, కెమికల్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మేడ రఘునాథ్ రెడ్డి.. గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గుమ్మ తనుజారాణి, పెట్రోలియం నాచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గురుమూర్తి, కమ్యూనికేషన్స్ ఐటి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు -
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు కొలిక్కి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభకు సంబంధించి వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల కూర్పు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. లోక్‌సభ పరిధిలోని 16, రాజ్యసభ పరిధిలోని 8 విభాగాల స్టాండింగ్ కమిటీల్లో తమకు కనీసంగా 5 కమిటీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వచి్చంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లు కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, జైరాం రమేశ్ తదితరులతో చర్చించారు. 5 కమిటీలతో పాటు, కమిటీల్లో అత్యంత కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ కోరింది. అయితే హోంశాఖను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. లోక్‌సభ స్టాండింగ్ కమిటీల్లో మూడింటికి ఓకే చెబుతూనే.. విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృధ్ధి– పంచాయతీరాజ్, వ్యవసాయం వంటి కీలక విభాగాల స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ ఎంపీలను ఛైర్మన్లుగా నియమించేందుకు అంగీకరించింది. ఇక రాజ్యసభ కమిటీల్లో విద్యా శాఖను అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం దీన్ని ధృవీకరించాయి. -
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్‌సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్‌సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. -
యూసీసీ బిల్లు.. కేంద్రం వడివడి అడుగులు
ఢిల్లీ: ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ(Uniform Civil Code) బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ► బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ► ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్‌లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే.. ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది. మరోవైపు జూన్ 14వ తేదీనే లా కమిషన్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది. ► బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి. ఒకే రకమైన చట్టం ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. ఆ కేసుతోనే మలుపు! -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదుల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఎంపీ పర్‌భాత్‌భాయ్ సవాభాయ్ పటేల్ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది. కెన్–బెట్వా తరహాలోనే చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది. మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. ► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. ► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది. ► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రతిపాదనపై ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి. -
రసాయనాలు, ఎరువుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా థరూర్
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించిందని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో మలికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడం గమనార్హం. థరూర్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్‌కు చోటు కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో రసాయనాలు, ఎరువులతోపాటు వాణిజ్యం, పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్ఖడ్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్‌ను నియమించారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్రావు జాదవ్‌ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టు నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్ పదవి లభించలేదు. -
సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంకక్షోభ సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే రాయితీ పొందే తరుణం రానుంది. ఈ మేరకు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధవర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ ఛార్జీల రాయితీ పునరుద్ధరణపై ఆలోచించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. వారికి స్లీపర్ క్లాస్, ఏసీ-3 కేటగిరీల్లో మొత్తం ఛార్జీలో 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీని అందించాలని సిఫార్సు చేసింది. గతవారం ఆగస్టు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ మేరకు పేర్కొంది. అయితే రాయితీ పునరుద్ధరణపై రైల్వే శాఖ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు,జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని వ్యవసాయం, పశుసంవర్థక, ఆహార శుద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చిచెప్పింది. 2015–16 నుంచి 2018–19 మధ్యకాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్‌కు అందజేసింది. ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖకు సూచించింది. చాలా రాష్ట్రాల్లో రైతాంగం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడం శోచనీయమని తప్పుపట్టింది. బడ్జెట్లో కేటాయించిన నిధులను వ్యవసాయ శాఖ పూర్తిగా ఖర్చు చేయలేకపోతోందని ఆక్షేపించింది. దేశంలో ఆరు ‘ఎయిమ్స్’ల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం పట్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. భోపాల్, భువనేశ్వర్, జో«ద్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేశ్ ఎయిమ్స్‌ల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని వెల్లడించింది. -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
శ్రీనివాస్ గౌడ్ వర్సస్ టీజీ వెంకటేశ్
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఆస్తులు హైదరాబాద్‌లో ఉంటాయి.. కానీ, హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడితే వినే ఓపిక లేదా’ ‘మీటింగ్‌కు–మీరు మాట్లాడే విషయానికి ఏమైనా సంబం ధం ఉందా? ఎజెండా ఏంటో దానిపైనే మాట్లాడాలి.. అనవసర విషయాల ప్రస్తావనెందుకు’ తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ – ఆంధ్రప్రదేశ్ ఎంపీ టీజీ వెంకటేశ్ మధ్య జరిగిన వాదన ఇది. ఓ కీలక సమావేశంలో పలువురు ఎంపీలు, అధి కారుల సమక్షంలో ఇద్దరి మధ్య మాటామాట చోటుచేసుకుంది. ఓ దశలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న దాకా వెళ్లింది. చివరకు తెలంగాణ ఉద్యమ సమయ ప్రస్తావన కూడా చోటు చేసుకుంది. ఇతర ఎంపీల జోక్యం చేసుకోవటంతో వివా దం సద్దుమణిగినా.. ఆ సమావేశంలో మరి కొంత సేపు ఉండాల్సి ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిష్క్రమించారు. ఇదీ విషయం...: రవాణా, సాంస్కృతిక–పర్యాటక శాఖల పార్లమెం టరీ స్థాయీ సంఘం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఆ కమిటీ పరిధిలోని శాఖల పనితీరును పరిశీలిస్తూ, కేంద్రం నుంచి ఉండాల్సిన సహకారం, ప్రాజెక్టులకు బ్యాం కుల రుణాలు.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో ఈ కమిటీ చైర్మన్, ఎంపీ టీజీ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సమావేశం దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తొలుత పర్యాటక, సాంస్కృతిక శాఖపై చర్చ ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, పనుల గురించి మాట్లాడారు. సమావేశం బాగా ఆలస్యమైనందున ఎక్కువ సమయం తీసుకోవద్దని టీజీ వెంకటేశ్ రెండు పర్యాయాలు మం త్రికి సూచించారు. దీనికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. సమావేశంలో అలా గట్టిగా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పి ఎం పీలు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ వెంటనే శ్రీనివాస్‌గౌడ్ సభ నుంచి నిష్క్రమించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 27 మంది ఎంపీలు, స్థానిక అధికారుల సమక్షంలో ఇది జరగడం గమనార్హం. -
దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్ కానుందా..?
సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్లైన్లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ హైలైట్ చేసింది. భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో దేశంలో వీపీఎన్ సేవలను శాశ్వతంగా నిషేదించాలని కమిటీ సీఫారసు చేస్తుందని నివేదిక వెల్లడించింది. వీపీఎన్‌లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది. వీపీఎన్ అంటే ఏమిటి? వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ అని కూడా అంటారు. సాధారణంగా మనం ఇంటర్నెట్ లో ఏ పనిచేసిన.. ఫేస్బుక్ చూసిన, యూట్యూబ్ చూసిన, వెబ్సైట్లను సందర్శించినా.. ఇతర ఏవైనా పనులు చేసినా హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన డేటా సురక్షితంగా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. అంటే, మనకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సురక్షితమైన కనెక్షన్ సృష్టిస్తుంది. మీ ట్రాఫిక్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డ ఛానల్ ద్వారా రూట్ చేస్తుంది. ఇది మీ ఐపీ చిరునామాను దాచిపెడుతుంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!) ముఖ్యంగా, వీపీఎన్ యాప్స్ వినియోగదారులు తమ గుర్తింపును దాచేటప్పుడు తమ నెట్ వర్క్ వేరే భౌగోళిక ప్రదేశంలో ఉన్నట్లు చూపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఉన్నట్లు చూపిస్తుంది. వీపీఎన్ వల్ల మన ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్‌క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు హ్యాకర్ల నుంచి కాపాడుకోవడం కోసం తమ కార్యకలాపాలకు గాను వీపీఎన్‌లను ఉపయోగిస్తుంటాయి. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ కోసం ఇంటి పనిచేసినప్పుడు లాక్ డౌన్ సమయంలో ఇవి చాలా భాగ ఉపయోగపడాయి. -
స్కూళ్లు త్వరగా తెరవండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. బడికి వెళ్లి విద్యాబద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లే నేస్తాలయ్యాయి. ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసానికి బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పి.సహస్రబుద్ధే నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది. రెండు షిఫ్టుల్లో క్లాసులు పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది. స్కూళ్లలో తరచుగా తనిఖీలు విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్–19 ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020 మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. -
‘పెగాసస్ ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారంపై కదలిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. పార్లమెంట్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు చేరింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 28వ తేదీన స్టాండింగ్ కమిటీ పౌరుల భద్రత, గోప్యతపై చర్చించనుంది. ఈ మేరకు ఐటీ, సమాచార, హోంశాఖకు కమిటీ సమన్లు జారీ చేయనుంది. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్ ద్వారా భారతదేశానికి చెందిన 40 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఓ విదేశీ మీడియా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నానా రభస మొదలైంది. దేశంలో పౌరుల భద్రత, గోప్యతకు భంగం కలిగించేలా కేంద్రం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై విచారణ చేయనున్నారు. -
ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: నిన్న ట్రంప్.. నేడు గ్రేసీ) -
వైఎస్ జగన్ పథకాలు దేశానికే ఆదర్శం
కల్లూరు/పులిచెర్ల/తిరుమల (చిత్తూరు జిల్లా): దేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, జమ్మూ–కశ్మీర్ ఎంపీ నజీర్ అహమ్మద్ కొనియాడారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరులో ఎస్‌హెచ్‌జీ గ్రూపులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నజీర్ అహమ్మద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం హర్షణీయమన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్రెడ్డి సాధ్యం చేశారని ప్రశంసించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ గొప్పగా ఉందని ప్రశంసించారు. పర్యటనలో భాగంగా దిగువపోకల వారిపల్లెలో వాటర్‌షెడ్‌లో చేపట్టిన చెక్ డ్యాంను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ చైర్మన్ ప్రతాప్‌రావ్ జాదవ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, నజీర్ అహమ్మద్, తలారి రంగయ్య, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టరు చిన్నతాతయ్య, జాయింట్ కలెక్టరు మార్కండేయులు, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎన్ఆర్జీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులో పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయని, దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై స్థాయీ సంఘం జరిపిన అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి బుధవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, మత్స్య ఉత్పాదనల ఎగుమతుల ప్రోత్సాహానికి నివేదికలో స్థాయీ సంఘం ప్రభుత్వానికి చేసిన కొన్ని ప్రధానమైన సిఫార్సులను వివరించారు. ‘వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ తక్షణమే నడుం బిగించాలి. వ్యవసాయోత్పత్తుల సప్లై చైన్ సామర్థ్యాన్ని పటిష్టం చేయాలి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయోత్పత్తులకు అత్యధిక విలువ చేకూరేలా చర్యలు తీసుకోవాలి..’అని కమిటీ సిఫార్సు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతుల ద్వారా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదనలు సాధించేందుకు ప్రభుత్వం వారికి తగిన మద్ధతు, ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను గణనీయంగా వృద్ధి చేయవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఈజిప్టు, మెక్సికో, మలేíసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతుల కోసం మార్కెట్లను అన్వేషించాలని కోరింది. మత్స్య ఉత్పాదనల ఎగుమతులపై దృష్టి సారించాలి... 2010–11 నుంచి 2014–15 వరకు మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో కనిపించిన వృద్ధి 2015–16 నుంచి క్షీణించడం మొదలైంది. ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో వృద్ధి సాధించడానికి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ‘చేపలు, రొయ్యల సాగులో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగాన్ని ఆరికట్టేందుకు శాఖాపరమైన నియంత్రణ, అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు యాంటీబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో అందుబాటులోకి తీసుకురావాలి..’అని కమిటీ సిఫార్సు చేసింది. ‘మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాలి. ట్యూనా చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా మత్స్య ఉత్పాదనల ఎగుమతులలో ట్యూనా చేపల వాటా పెంచడానికి చర్యలు తీసుకోవాలి’అని వాణిజ్య శాఖకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీతో సంప్రదించి పథకాన్ని రూపొందించాలని కమిటీ సూచించింది. పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018–19 గణాంకాల ప్రకారం) సుమారు రూ. 6 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. పొగాకు పరిశోధనకు అరకొర నిధుల కేటాయింపు కారణంగా ప్రపంచ మార్కెట్లలో దేశీయ పొగాకు ఉత్పాదనలు పోటీకి నిలవలేకపోతున్నాయి. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా పొగాకు పండించడానికి పర్యావరణ ప్రతికూలతలను తట్టుకోగల అత్యత్తుమ నాణ్యత, అధిక దిగుబడి సాధించగల వెరైటీలను సాగు చేయడానికి పొగాకు పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకు పొగాకు పరిశోధనకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి. 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీని వల్ల మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు.