PM Kisan Samman Nidhi
-
క్రియాశీలకంగా లేని జన్‌ధన్ ఖాతాల్లో వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో 54.03 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో సుమారు 11.30 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా లేవని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. లావాదేవీలు నెరపని ఈ అకౌంట్లలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీ నాటికి రూ.14,750 కోట్ల బ్యాలెన్సు ఉందని వివరించారు. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39.62% వరకు ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య 2024 నవంబర్‌కు 20.91%కి పడిపోయాయన్నారు.రెండేళ్లపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్/కరెంట్ ఖాతాలను ఆర్బీఐ క్రియాశీలకం కాని ఖాతాగా పరిగణిస్తుందన్నారు. ఖాతాలను క్రియాశీలకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రియాశీలకం కాని ఖాతాల సంఖ్యను తగ్గించుకోవాలని బ్యాంకులను కోరామన్నారు. ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌గ్రేడేషన్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ వంటి వాటితో అకౌంట్లను క్రియాశీలకం చేయాలని సూచిస్తున్నామన్నారు.పీఎం–కిసాన్తో 2 కోట్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) ద్వారా దేశవ్యాప్తంగా 2.04 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవలి 18వ ఇన్స్టాల్మెంట్లో 9.58 కోట్ల మంది లబ్ధిదారులు కాగా, వీరిలో 1.16 కోట్ల మంది ఎస్సీ రైతులు, 88.34 లక్షల మంది ఎస్టీ రైతులు, ఇతర కేటగిరీలో 7.54 కోట్ల మంది రైతులు ఉన్నారని వివరించారు. పథకం కింద ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోందంటూ ఆయన ఈ మొత్తాన్ని పెంచే యోచన లేదని వివరించారు.‘పీఎం విశ్వ కర్మ’ కింద రూ.1,751 కోట్ల రుణాలు పీఎం విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31వ తేదీ నాటికి రూ.1,751 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి వృత్తులకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులు, పనివారికి సులభంగా రుణాలు అందేలా పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పథకం కింద ఈ వర్గం వారు మొత్తం 2.02 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారని చెప్పారు. 2023–24 నుంచి 2027–28 కాలానికి గాను కేంద్రం వీరికి ఈ పథకం కింద చేయూతనిచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయించింది. 18.74 కోట్ల రైతులకు పంట రుణాలు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 18.74 కోట్ల మంది రైతులు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇందులో మొదటిస్థానంలో తమిళనాడు నిలిచిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలతో బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. చదవండి: ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదంతమిళనాడులో అత్యధికంగా 2.88 కోట్ల మంది రైతులు పొందగా, తర్వాతి స్థానంలో యూపీలోని 1.88 కోట్ల మంది, కర్ణాటకలో 1.62 కోట్ల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో కేంద్రం ఎటువంటి పంట రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతుల రుణాలను రద్దు చేశాయని మంత్రి పేర్కొన్నారు. -
గంగమ్మ దత్తత తీసుకుంది
వారణాసి: గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లే కనపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాక మోదీ తొలిసారిగా మంగళవారం వారణాసిలో పర్యటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత రూ.20,000 కోట్లను 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మెహందీగంజ్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ‘వారణాసి ప్రజలు మూడోసారి నన్ను ఎంపీగానే కాదు ప్రధానిగానూ ఎన్నుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇదివరకెప్పుడూ చూడని తీర్పునిచ్చారు.చరిత్ర సృష్టించారు’ అని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం రైతులకు, పేదలకు సంబంధించినదని అన్నారు. వికసిత్ భారత్‌కు.. రైతులు, మహిళలు, యువత, పేదలు గట్టి మూలస్తంభాలుగా తాను పరిగణిస్తానన్నారు. ’విశ్వనాథుడు, గంగా మాత ఆశీస్సులు, కాశీ ప్రజల ఆపార ప్రేమతో మూడోసారి దేశానికి ప్రధాన సేవకుడిని అయ్యే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడోసారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకొని కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.ఇప్పుడు గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్లే కనపడుతోంది. నేనిక్కడి వాడిని అయిపోయాను’ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఎన్నికకావడం అరుదని, భారత్ ప్రజలు దీన్ని చేసి చూపించారని ప్రధాని అన్నారు. భారత్‌లో 60 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందన్నారు. ‘యువత ఆకాంక్షలు, ప్రజల కలలు ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మరో అవకాశం రావడం ఘన విజయం. ప్రజల విశ్వాసానికి ప్రతీక’ అని మోదీ అన్నారు.ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ రైతులనుద్దేశించి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్ గురించి ఆలోచించాలి. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఎదగాలి. బనారస్ లంగ్డా మామిడి, జౌన్పూర్ రాడిష్ రకం, గాజిపూర్ లేడీ ఫింగర్ రకం.. తదితరాలు నేడు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి చొరవతో, జిల్లా స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల హబ్‌ల ఏర్పాటుతో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్లో భారత్‌ను మనమిప్పుడు కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’ అని మోదీ పేర్కొన్నారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
వారణాసి: పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. వారణాసి కేంద్రంగా ఈ హామీని అమలు చేశారు.ఏడాదికి మూడు దశల్లో రూ.6 వేల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.20 వేల కోట్ల సాయం ఈ పథకం ద్వారా అందనుంది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. -
17వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
-
నేడు వారణాసికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానిగా వరుసగా మూడో విడత బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ నెల 18న మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో రూ.20 వేల కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు దశాశ్వమేథ ఘాట్‌లో జరిగే గంగా ఆరతి కార్యక్రమంలో పాల్గొంటారు. -
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి పీఎం కిసాన్ 17వ విడత
-
రేపు ‘పీఎం కిసాన్’ తొలి విడత
సాక్షి, అమరావతి: రైతన్నలకు ప్రధానమంత్రి కిసాన్ 17వ విడత సాయం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో తొలి విడత పీఎం కిసాన్ సాయం కింద ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయనుంది. మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ పెట్టుబడి సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు.అన్నదాతలకు అండగా..2018–19 నుంచి కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. తొలి విడత సాయం మే–జూన్‌లో, రెండో విడత అక్టోబర్– నవంబర్‌లో, మూడో విడత జనవరి–ఫిబ్రవరిలో జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో దేశ వ్యాప్తంగా రూ.3.04 లక్షల కోట్లు జమ చేసిన కేంద్రం రాష్ట్రంలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.14,717 కోట్లు అందచేసింది. 2024–25 సీజన్లో ఏపీలో 43.52 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.870 కోట్లు జమ చేయనుంది. ఇప్పటికే ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. యూపీ పర్యటనలో భాగంగా మంగళవారం పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను ప్రధాని మోదీ నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.ఐదేళ్లూ ఠంచన్‌గా ఇచ్చిన వైఎస్ జగన్పీఎం కిసాన్తో పాటే గత ఐదేళ్లూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నలకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని అందజేసి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయంగా అందించి తోడుగా నిలిచింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి వారం రోజులు గడుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటోంది. ఈ సమయంలో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం పట్ల రైతన్నలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
మోదీ పీఎంవో కాదది... ప్రజా పీఎంవో!
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు. పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు. పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం. నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే నా శక్తి రహస్యం... తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు. ‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఇలా చేయండి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యవత్మాల్ను సందర్శించారు. ఆ సందర్భంలోనే మోదీ 9 కోట్ల మంది రైతులకు రూ. 21,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడతను విడుదల చేశారు. కానీ కొందరికి ఈ స్కీముకు సంబంధించిన డబ్బు ఖాతాలో జమ కాలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడత డబ్బు జమకావడానికి కొందరికి ఇంకా కొంత సమయం పట్టచ్చు. అయితే స్కీమ్ నమోదు చేసుకున్నప్పటికీ.. డబ్బు జమకాకపోతే.. దానికి వివిధ కారణాలు ఉంటాయి. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు ఖాతాలో జమకాకపోవడానికి ప్రధాన కారణం కేవైసీ అప్డేట్ సరిగ్గా లేకపోవడం అని తెలుస్తోంది. మీరు కేవైసీ అప్డేట్ చేసినప్పటికీ.. డబ్బు రాకపోతే మీరు హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.. లేదా అధికారిక వెబ్సైట్లో పిర్యాదు చేయవచ్చు. పీఎమ్ కిసాన్ డబ్బు రాకపోవడానికి కారణాలు లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం కేవైసీ పూర్తి కాకాపోవడం అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు IFSC కోడ్ తప్పుగా రాయడం తప్పు అకౌంట్ నంబర్స్ ఇవ్వడం బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్ వాలీడ్ కానీ బ్యాంక్, ఫాస్ట్ ఆఫీస్ పేరు బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండూ సరైనవి కానప్పుడు ఇదీ చదవండి: పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది -
ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా నిలిచామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెట్టుబడి సాయంతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 64 లక్షల 37 వేల మంది ఖాతాలకు 1,294 కోట్ల రూపాయలు బదిలీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రైతులకు గుడ్ న్యూస్ ఖాతాల్లో కి కిసాన్ సమ్మాన్ నిధులు..!
-
Live: వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం
-
‘అకౌంట్లలలో డబ్బులు పడేది అప్పుడే’.. రైతులకు కేంద్రం శుభవార్త!
రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది. రైతులకు ఆర్థికంగా నిలిచేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. దీనిని ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతలకు రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంది. పీఎం కిసాన్కిఅహర్హులు ఎవరంటే? పీఎం కిసాన్ పథకంలో రైతులు మాత్రమే అర్హులు. పన్ను చెల్లింపు దారులు మాత్రం కాదు. పీఎం కిసాన్ 16వ విడత విడుదల ఎప్పుడంటే? పీఎం కిసాన్ 16వ విడుత నగదు పంపిణీని ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీన, అర్హత కలిగిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయబడుతుంది. పీఎం కిసాన్ 16వ విడుత నగదు డిపాజిట్ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకోవాలంటే? స్టెప్1 : అర్హులైన రైతులు https://pmkisan.gov.in/ Portal పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. స్టెప్2 :హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఎంపిక చేసుకోవాలి. స్టెప్3 : పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేయాలి. స్టెప్4 :ఆధార్ లేదా అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.. స్టెప్5 : గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. కేవైసీ తప్పని సరి పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ లో నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ తప్పని సరి చేసుకోవాలి. ఈకేవైసీ పద్దతి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎందుకు? కేంద్రం అందించే పీఎం కిసాన్ పథకాన్ని నేరుగా రైతులకు అందించేలా ఈకేవైసీని ప్రవేశ పెట్టింది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బుల్ని డిపాజిట్ చేస్తుంది. -
పీఎం కిసాన్ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్
రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50 శాతం పెరగవచ్చని అంచనా. ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
రైతులకు మరో ఏడు రోజులు మాత్రమే గడువు..
-
గుడ్‌న్యూస్.. మహిళా రైతులకు రూ.12,000? ఈ బడ్జెట్లోనే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు అంటే రూ. 12,000 లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష, మహిళా రైతులిద్దరికీ రూ.6,000లను అందిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు 15 విడతల్లో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించే ఈ చర్యగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రణాళికపై అటు వ్యవసాయ శాఖ గానీ, ఇటు ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
రైతులకు శుభవార్త.. ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం?
ఏప్రిల్- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి. 16 విడుత విడుదల ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు అండగా ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం.. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. 2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 5 కిలలో ఆహార ధాన్యాలు 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. -
14వ విడత సాయం.. పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రతి విడతకు ఈ–కేవైసీ ఉంటేనే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు జమచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 14వ విడత పీఎం కిసాన్ పథకానికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణను పూర్తిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–కేవైసీ ప్రామాణీకరణ ఉద్దేశం వారి వాస్తవికతను ధ్రువీకరించుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అర్హులైన లబి్ధదారుల ఈ–కేవైసీ ప్రామాణీకరణను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ పూర్తిచేయడానికి మూడు పద్ధతులకు కేంద్రం అనుమతించినట్లు తెలిపారు. ఆధార్ లింక్ అయిన మొబైల్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని సూచించారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు. ఇప్పటికే ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా 45,636 మంది ఈ–కేవైసీ పూర్తిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,48,002 రికార్డులకు ఈ–కేవైసీ పూర్తిచేశారని, ఇంకా 6,47,068 రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. -
PM Kisan: త్వరలో 14వ విడత నగదు జమ.. ఇలా చేయకపోతే రూ.2వేలు రావు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా దేశమంతటా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఈ పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటికే 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కాగా.. తాజాగా 14వ విడత ఎప్పుడు విడుదల కానుందా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. 2019లో ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. దీని ద్వారా భారతదేశంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. రూ. 6వేల వార్షిక వాయిదా ద్వారా రైతుల ఖాతాలోకి నగదు చేస్తోంది మోదీ సర్కార్. అయితే ఇప్పటికే 13వ విడత రుణమాఫీ పూర్తి కావడంతో 14వ విడత నగదు ఎప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పీఎం కిసాన్ తదుపరి విడతను రైతుల బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులు ఒక్కొక్కరికి ₹2000 చొప్పున 13 చెల్లింపులు పూర్తి అయ్యాయి. అయితే, 14వ విడత నగదు విడుదలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతులు వారి ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీని తప్పనిసరి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. మొదటగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వాలి. అధికారిక వెబ్సైట్ హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో అడిగిన వివరాలు నమోదు చేయండి వన్-టైమ్ పాస్వర్డ్ కోసం గెట్ ఓటిపి అనే బటన్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయగలరు. అనంతరం మీరు పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ తెలుసుకోవచ్చు. చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
కేంద్రం శుభవార్త.. బడ్జెట్లో కీలక నిర్ణయం, రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుంది. 2024లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ బడ్జెట్లో అన్ని వర్గాలు ఆశించినే మేరకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక ప్రకటనలు ఉండవచ్చని సమాచారం. వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్న 13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా, భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఈ పథక లబ్ధిదారులైన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం ఈ బడ్జెట్లో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వాయిదా మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. గతంలో ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు నగదుని 3 వాయిదాలో కేంద్రం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేది. తాజాగా ఆ మొత్తాన్ని రూ.8వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రైతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 4 విడతలుగా విభజించనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు చెల్లించాలి!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రయోజనాలను పొందుతున్నారా? అయితే ఈ అలర్ట్ మీకోసమే. ఈ స్కీంలో ఇప్పటికే లబ్ధిదారులు ఈకేవైసీ (eKYC) పూర్తి చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఆపైనే లబ్దిదారులకు డబ్బులు కూడా అందుతాయని తెలిపింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం లబ్దిదారులు చేయనున్న ఈకేవైసీకి ఇకపై చార్జ్(రుసుము) చెల్లించాల్సి ఉంటుంది. రుసుము తప్పనిసరి డీబీటీ అగ్రికల్చర్ బీహార్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. లబ్దిదారులు నేరుగా ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు లేదా మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇది పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆన్లైన్లో ఈకేవైసీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని భావిస్తే.. చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ విధానంలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకున్నదానికి రుసుము రూ. 15గా ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ విధానంలో ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి చార్జీలు ఉండవు. ఆన్లైన్లో పీఎం కిసాన్ ఈకేవైసీ ►ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లండి ►అందులో ఉన్న Pm Kisan Ekyc పై క్లిక్ చేయండి ►అక్కడ మీ ఆధార్ నంబరుతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి ►మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ►అక్కడ ఉన్న సమాచారం ఆధార్‌తో సరిపోలితే మీ పీఎం కిసాన్ ఈకేవైసీ అప్డేట్ పూర్తవుతుంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు!
మోదీ సర్కార్ రైతులకు అందిస్తున్న పథకాలలో ఒకటి పీఎం కిసాన్ యోజన స్కీం(Pradhan Mantri Kisan Samman Nidhi Yojana). ఈ పథకం కింద రైతులకు నేరుగా రూ. సంవత్సరానికి రూ. 6,000 నగదుని మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తోంది. అర్హులైన భూమి ఉన్న కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి 2000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే కొందరు అనర్హులైన రైతులు కూడా ఈ పథకం కింద రిజిష్టర్ చేసుకుని ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి పలు మార్పులు చేసింది. వాటి ప్రకారం అనర్హులు ఎవరంటే.. PM కిసాన్ వెబ్సైట్ ప్రకారం, ఈ దిగువ వ్యక్తులు పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కారు. ► అన్ని సంస్థాగత భూమి హోల్డర్లు. ►కింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు 1. మాజీ, లేదా ప్రస్తుత రాజ్యాంగ పదవులను కలిగి ఉన్నవారు 2. మాజీ, లేదా ప్రస్తుత మంత్రులు/ రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ/ రాజ్యసభ/ రాష్ట్ర శాసన సభలు/ రాష్ట్ర శాసన మండలి మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు. 3. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్మెంట్లు దాని ఫీల్డ్ యూనిట్లు సెంట్రల్ లేదా స్టేట్ పీఎస్‌యూలు, ప్రభుత్వ పరిధిలోని అటాచ్డ్ కార్యాలయాలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు. 4. అలాగే స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV మినహా) సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు. ఉద్యోగులు /D గ్రూప్ ఉద్యోగులు) పై కేటగిరీలో నెలవారీ పెన్షన్ రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగులు మినహా) ఉన్న అన్ని పదవీ విరమణ పొందిన/రిటైర్డ్ పెన్షనర్లు 5. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్నవారు. చదవండి: మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా? -
‘పీఎం–కిసాన్’ సొమ్ము విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. రైతులపై తగ్గిన ఆర్థిక భారం మధ్యవర్తులు, కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా పీఎం–కిసాన్ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖతాల్లోకే బదిలీ చేస్తున్నామని ప్రధానీ మోదీ వివరించారు. కిసాన్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగకు ముందు రైతులకు నిధులు అందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రబీ సీజన్లో పంటల సాగుకు ఈ డబ్బులు ఉపయోగపతాయని చెప్పారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదాతలకు రూ.2 లక్షల కోట్లకుపైగా అందజేశామని తెలిపారు. పీఎం–కిసాన్ పథకం ఆర్థికంగా ఎంతో భారాన్ని తగ్గించిందని రైతులు తనతో చెప్పారని గుర్తుచేశారు. కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం ‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్’ బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్ ఎడ్జ్’ను సైతం మోదీ ఆవిష్కరించారు. మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని, అధిక కమీషన్ కోసం డీలర్లు కొన్ని రకాల బ్రాండ్లనే విక్రయిస్తున్నారని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఏకైక బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఖజానాపై ‘ఎరువుల’ భారం కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్ స్టాప్ షాప్’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు. ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. 13,500 మందికిపైగా రైతులు హాజరయ్యారు. దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి.