Railway
-
సామాన్యులకూ ఒక సీటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైల్‌కు నాలుగు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అంశంపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే..ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రైల్వే శాఖ నిలిపేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే తయారు చేస్తోంది. ఈ కోచ్‌ల తయారీ పెరుగుతున్నకొద్దీ సంప్రదాయ కోచ్‌లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5,748 కోచ్‌లున్నాయి. వీటిల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సంఖ్య 2,181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్ల సంఖ్య 88. మరో ఏడు జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా.. అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే సరఫరా చేస్తున్నారు. అవసరమైతే రిజర్వ్డ్ కోచ్‌లు తగ్గించి.. దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వేశాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ చార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.దీంతో వెంటనే జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లుంటాయి. వాటిల్లో రెండు జనరల్ కోచ్‌లుంటాయి. ఇప్పుడు అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను అనుసంధానించటం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్‌ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అనువుగా ఉండవు. దీంతో రెండు రిజర్వ్డ్ కోచ్‌లను తగ్గించి వాటి స్థానంలో రెండు జనరల్ కోచ్‌లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగటమే కాకుండా, టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది. నవంబర్‌లో వేయి కోచ్లునవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా పదివేల కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6 వేలు అన్రిజర్వ్డ్ కోచ్‌లు కాగా.. మిగతా 4 వేలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే పదివేల జనరల్ కోచ్‌లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు. అంకెల్లో భారతరైల్వే⇒ 4 ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ స్థానం⇒ 2023 నాటికి మొత్తం రైల్వే ట్రాక్ 1,32,310 కి.మీ రైల్వేలో మొత్తం ఉద్యోగులు 12 లక్షల మందికి పైగా⇒ ఇండియన్ రైల్వేలో మొత్తం జోన్లు 17 దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లు 7,325⇒ దేశంలో రోజూ నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు 13,000⇒ దేశంలో రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2.40 కోట్ల మంది రోజూ దేశంలో నడుస్తున్న రైళ్లలో ప్యాసింజర్ కోచ్‌ల సంఖ్య 84,863⇒ 2024 మార్చి నాటికి (2023ృ24) ఇండియన్ రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు రోజువారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు⇒ రైలు ప్రమాదాలను నివారించడానికి ఇప్పటిదాకా కవచ్‌ను ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ 37 వేల కి.మీ⇒ దేశంలో రోజూ నడుస్తున్న సరుకు రవాణా రైళ్లు 8,000⇒ 2024 అక్టోబర్ నాటికి దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 66 వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 400⇒ 2024, మార్చి నాటికి దేశంలో విద్యుత్ రైల్వే మార్గాలు 62,119 కి.మీ⇒ 202-24 లెక్కల ప్రకారం సగటున ఆన్లైన్లో రోజుకు బుక్ అవుతున్న రైల్ టికెట్లు 12.38 లక్షలు⇒ ఆన్లైన్లో నిమిషానికి బుక్ అవుతున్న రైల్ టికెట్లు 28,000⇒ రోజుకు రైళ్లలో అందిస్తున్న భోజనాలు 16 లక్షలు⇒ కేటరింగ్ ద్వారా ఆదాయం రూ.1,947.19 కోట్లు⇒ ఐఆర్సీటీసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు 12.21 కోట్లు -
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్‌ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్‌లతో కూడిన రేక్స్‌ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌లోని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్‌లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్‌లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్‌లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్‌కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్‌లో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్‌లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్‌లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్‌లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్‌ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
పొగ బండులు ఇక మాయం
సాక్షి, హైదరాబాద్: రైలుకు పర్యాయపదంగా వాడే పొగబండి ఇక మాయం కానుంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేను పూర్తిస్థాయిలో విద్యుదీకరించి.. ఇక ఎలక్ట్రిక్ ఇంజన్లనే వాడాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు ఆ మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఎలక్ట్రిఫికేషన్ పనులను కూడా నిర్వహించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.ఆ నిర్ణయాన్నే ఇప్పుడు అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ (పూర్తి కొత్త) లైన్ పనుల్లో దీనిని అమలు చేయనున్నారు. దీనిలో భాగమైన మనోహరాబాద్ (మేడ్చల్ సమీపం), కొత్తపల్లి (కరీంనగర్ శివారు) ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటు ట్రాక్ పనులు నిర్వహిస్తూనే సమాంతరంగా విద్యుత్తు లైన్ కూడా ఏర్పాటు చేసే పని ప్రారంభించబోతున్నారు. మామూలుగా అయితే కనీసం ఓ దశాబ్దం తర్వాత జరగాల్సిన పనులు తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడే జరగనున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. 76.65 కి.మీ. ఉన్న ఈ మార్గాన్ని ముందు విద్యుదీకరించాలని నిర్ణయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరో రెండుమూడు నెలల్లో పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.తెలంగాణలో జరగాల్సింది94 కి.మీ. మాత్రమే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. వీటిల్లో 6,150 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 2,015 రూట్ కి.మీ.లలో ట్రాక్ ఉండగా ఇప్పటికే 1,921 రూట్ కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 94 కి.మీ.మేర మాత్రమే విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. ఏడాదిలో ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రైలు మార్గాల జాబితాలో మనోహరాబాద్–కొత్తపల్లి రూట్‌ను చేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే, విద్యుదీకరించనున్నందున దీనినీ ఎలక్ట్రిఫికేషన్ జాబితాలో చేరుస్తున్నారు. అకోలా మార్గంలో ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మధ్య పనులు జరగాల్సి ఉంది. అక్కన్నపేట–మెదక్ మధ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే తెలంగాణలో 100% విద్యుదీకరణ జరిగినట్టవుతుంది. రూ.105 కోట్లతో పనులు.. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ దాటాక ఈ కొత్త మార్గం మొదలవుతుంది. అక్కడి నుంచి 76.65 కి.మీ. దూరంలో ఉన్న సిద్దిపేట వరకు పనులు పూర్తి కావటంతో రైలు సరీ్వసులు ప్రారంభించారు. ప్రస్తుతం డీజిల్ లోకోతో కూడిన డెమూ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని మానేరు మీద వంతెన నిర్మించి నది దాటాక కొత్తపల్లి వరకు ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2027 నాటికి ఆ పనులు పూర్తవుతాయి. ఈలోపు సిద్దిపేట వరకు విద్యుదీకరించాలని నిర్ణయించి, అక్కడి వరకు రూ.105.05 కోట్లతో నిర్వహించే పనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో నిర్మాణ సంస్థకు అవార్డు అందచేయటంతో పనులు మొదలుకానున్నాయి. గజ్వేల్ సమీపంలో 25 కేవీ సబ్‌స్టేషన్.. విద్యుత్ సరఫరా కోసం గజ్వేల్ సమీపంలో 25 కేవీ సామర్థ్యంతో ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. త్వరలో ఈ పనులు మొదలు కానున్నాయి. స్థానికంగా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానిస్తారు. -
రైళ్లో దుప్పట్లు ఎన్ని రోజులకు ఉతుకుతారో తెలుసా?
రైల్వే ప్రయాణం చేస్తున్నారా? ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? అందులో వాడే ఉన్ని దుప్పట్లు ఎప్పుడు ఉతుకుతారో తెలిస్తే షాకవుతారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వయంగా రైల్వే విభాగం ఆసక్తికర సమాధానం ఇచ్చింది.ఏసీ కోచ్‌ల్లోని ఉన్ని దుప్పట్లు, బెడ్షీట్లు, కవర్లను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం స్పందించింది. బెడ్షీట్లు, పిళ్లో కవర్లు ప్రతి జర్నీ పూర్తయిన వెంటనే శుభ్రం చేస్తామని చెప్పింది. అయితే ఉన్ని దుప్పట్లను మాత్రం నెలలో ఒకటి లేదు రెండుసార్లు ఉతుకుతామని స్పష్టం చేసింది.‘ఏసీ కోచ్‌ల్లో రైలు ప్రయాణం పూర్తయిన వెంటనే పిళ్లో కవర్లు, బెడ్షీట్లు నిత్యం శుభ్రం చేస్తాం. అయితే చాలా సందర్భాల్లో దుప్పట్లు దుర్వాసన, తడిగా ఉండడం..వంటివి గమనిస్తే వెంటనే వాటిని ఉతకడానికి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. వారికి వెంటనే మరో దుప్పటి అందిస్తాం’ అని రైల్వేలో పదేళ్లు అనుభవం ఉన్న హౌజ్‌కీపింగ్ సిబ్బంది తెలిపారు.రైల్వే ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎం) సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా మాట్లాడుతూ..‘టిక్కెట్ ధరలో బెడ్ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి బెడ్షీట్లు, దిండ్లు, దుప్పట్లు ఇస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేస్తారు. ఉన్ని దుప్పట్లు ఉతకడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది’ అన్నారు. రైల్వేశాఖ ఆర్టీఐలో భాగంగా ఇచ్చిన రిప్లైలో..‘రైల్వే విభాగంలో అందుబాటులో ఉన్న లాండ్రీ సదుపాయాలకు అనుగుణంగా ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉతకాల్సి ఉంది’ అని పేర్కొంది. కాగా, రైల్వేలో బ్లాంకెట్లను పరిశుభ్రంగా ఉంచడం లేదని 2017లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రైల్వే విభాగానికి దేశవ్యాప్తంగా 46 డిపార్ట్మెంటల్ లాండ్రీ, 25 బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్-ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహించేవి) లాండ్రీ సదుపాయాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ లాండ్రీల్లోని సిబ్బంది తరచు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతున్నారు. దాంతో కొంత ఇబ్బందులున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బూట్ లాండ్రీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. -
రైలు ప్రమాదం.. ఒకరు మృతి
కైరో: ఈజిప్ట్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
సొంతూళ్లకు నగరవాసులు .. రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
-
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు
మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు -
పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే
సూరత్: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.గుజరాత్‌లోని సూరత్‌లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్‌లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ట్రాక్‌ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.ఎన్ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్‌ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ, శుభం శ్రీజైప్రకాష్ జైస్వాల్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్‌కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న 71 ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్ పోద్దార్‌ను మెచ్చుకున్నారు. అయితే ఎన్ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు.. -
Gujarat: రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర... తప్పిన ముప్పు
సూరత్: గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్‌షా తెలిపారు. రైల్వే నెట్వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo— ANI (@ANI) September 21, 2024 -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
రైల్వే నేర్వని గుణపాఠం!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఉత్తర–దక్షిణాదిని కలిపే కీలక రైలుమార్గం గ్రాండ్ ట్రంక్ రూట్. కన్యాకుమారి నుంచి కశీ్మర్‌ను జోడించే ప్రధాన లైన్ ఇది. ఎగువ రాష్ట్రాల రైళ్లు బల్లార్షా ద్వారా వచ్చి కాజీపేట–ఖమ్మం–విజయవాడ మీదుగా దక్షిణ భారత్‌లోకి ప్రవేశిస్తాయి. ఒడిశా తదితర తీరప్రాంతాల నుంచి మరో మార్గం మీదుగా విజయవాడ వచ్చి అక్కడి నుంచి దక్షిణాదిలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ దానితో పోలిస్తే కాజీపేట మీదుగా వెళ్లేదే ప్రధాన మార్గం. ఈ మార్గం ద్వారా నిత్యం దాదాపు 400 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.అలాంటి కీలక మార్గంలోనే ఇటీవల అవరోధం ఏర్పడింది. కేసముద్రం మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల నుంచి గ్రాండ్ ట్రంక్ రూట్ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను విజయవాడ మీదుగా హౌరా మార్గం నుంచి, మరికొన్నింటిని నిజామాబాద్ మార్గం మీదుగా నాగ్‌పూర్ నుంచి నడిపారు. కానీ ఆ మార్గాలన్నీ కిక్కిరిసి ఉండటం వల్ల మూడు రోజుల వ్యవధిలో 357 రైళ్లను రద్దు చేయాల్సి వచి్చంది. అదే ఒకవేళ ట్రాక్ కొట్టుకుపోయిన ప్రాంతం నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉండి ఉంటే ఈ అవస్థలన్నీ తప్పేవి. ఆ మార్గం డబ్లింగ్ అయ్యుంటే..: సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి వద్ద నడికుడి–గుంటూరు లైన్ మొదలవుతుంది. ఇది గుంటూరు మీదుగా విజయవాడకు అనుసంధానమవుతుంది. కాజీపేట–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్‌కు స్థానికంగా ఇది ప్రత్యామ్నాయ మార్గమే. ఈ మార్గంలో గుంటూరు–మాచర్ల సెక్షన్ 1930లో ప్రారంభమైంది. బీబీనగర్–నడికుడి మధ్య 1974లో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. క్రమంగా ఇది కీలకంగా మారింది. కానీ ఆ మార్గంలో రెండో లైన్ నిర్మించాల్సి ఉన్నా రైల్వేశాఖ దృష్టి సారించలేదు. మూడు దశాబ్దాలుగా డబ్లింగ్ కోసం ఒత్తిడి పెరిగినా ఆ ప్రాజెక్టును మంజూరు చేయలేదు. సామర్థ్యానికి మించి 200 శాతంతో అవి నడుస్తున్నాయి. గ్రాండ్ ట్రంక్ రూట్‌కు ప్రత్యామ్నాయమే అయినప్పటికీ భారీ రద్దీతో ఆ మార్గం ఉపయోగపడకుండా పోయింది. కేసముద్రం వద్ద ట్రాక్ కొట్టుకుపోవడంతో నడికుడి మార్గంలో గూడ్సు రైళ్లను ఆపి కొన్ని రైళ్లను మాత్రమే మళ్లించగలిగారు.ఎట్టకేలకు టెండర్లు..: 248 కి.మీ. ఈ మార్గంలో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు గత బడ్జెట్లో కేంద్రం తొలిసారి రూ. 200 కోట్లను కేటాయించడంతో ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇది గ్రాండ్ ట్రంక్ రూట్‌కు కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది. దాదాపు 16 ఏళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ⇒ వరంగల్ జిల్లా డోర్నకల్ సమీపంలోని గుండ్రాతిమడుగు వద్ద రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దాన్ని పునరుద్ధరించేందుకు 3–4 రోజులు పట్టడంతో రైళ్ల దారిమళ్లింపు కష్టంగా మారింది.⇒ ఈ నెల 1న భారీ వర్షాలు, వరదలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం–ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్ కొట్టుకుపోవడంతో రెండు రోజులపాటు ఉత్తర, దక్షిణాదిని కలిపే గ్రాండ్ ట్రంక్ రూట్లో వందలాది రైళ్లను రద్దు చేయాల్సి వచి్చంది.⇒ ఈ మార్గానికి ప్రత్యామ్నాయమైన బీబీనగర్–గుంటూరు లైన్ డబ్లింగ్ చేయాలని దశాబ్దాలుగా కోరుతున్నా రైల్వేశాఖ పట్టించుకోలేదు. రైల్వే శాఖ అప్పుడే గుణపాఠం నేర్చుకొని డబ్లింగ్ పనులు చేపట్టి ఉంటే ఇటీవల వరదలప్పుడు రైళ్ల రాకపోకలకు సమస్యలు తప్పి ఉండేవి. -
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..
-
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే ట్రాక్‌లపై గస్తీ పెంపు
ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్‌లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్‌లపై పెట్రోలింగ్‌ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.ఆర్పీఎఫ్తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్‌ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. -
జనరల్ బోగీలు : సీట్లు.. పాట్లు.. రైలు ప్రయాణమంటే హడల్ (ఫొటోలు)
-
6 వారాల్లో 3 రైలు ప్రమాదాలు.. 17 మంది మృతి.. 100 మందికి గాయాలు
ఒడిశా రైలు ప్రమాదం(2023) తర్వాత రైళ్లలో భద్రతకు సంబంధించిన అనుమానాలు ప్రజల్లో అలానే ఉన్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం తర్వాత కూడా దేశంలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.తాజాగా జార్ఖండ్‌లోని బారాబంబో వద్ద హౌరా-ముంబై మెయిల్‌కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత ఆరు వారాల్లో మూడు ప్యాసింజర్ రైలు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాలన్నీ ఈ ఏడాది జూన్-జూలై మధ్య జరిగాయి. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత నెల జూన్ 17న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 11 మంది మృతి చెందగా, 60 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.ఈ నెల జూలై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతి చెందగా, 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. జూలై 30న హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు.కాగా రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రైలు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2000-01లో మొత్తం 473 రైలు ప్రమాదాలు జరిగాయి. అది 2014-15 నాటికి 135కి తగ్గింది. అది 2022 నాటికి 48కి చేరింది. రైల్వే ప్రమాదాల దృష్ట్యా కవచ్ వ్యవస్థ అమలును ముమ్మరం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. -
3–4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ
ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు. -
ఏడు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు
ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్‌గా మార్చనున్నారు.ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. -
‘రథయాత్ర’కు రైల్వేశాఖ సన్నాహాలు
దేశంలోని ప్రజలు దూర ప్రయాణాలు సాగించాలనుకున్నప్పుడు రైలునే ముందుగా ఎంచుకుంటారు. రైల్వేశాఖ కూడా ప్రజల ప్రయాణ అవసరాలను గుర్తించి, ప్రత్యక రైళ్లను కూడా నడుపుతుంటుంది. జూలై ఏడు నుంచి ఒడిశాలో ప్రారంభమయ్యే రథయాత్ర ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎంతో ఉత్సాహంతో పూరీకి తరలివెళుతుంటారు. అయితే ఈ సమయంలో అందరికీ రైలులో రిజర్వేషన్ దొరికే అవకాశం ఉండదు. దీంతో చాలామంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వస్తుంది. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, భక్తుల అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.ఈసారి జగన్నాథ యాత్ర వేడుకలు జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగియనున్నాయి. దీనిలో ప్రధానంగా జరిగే రథయాత్ర జూలై 7న జరగనుంది. రథయాత్ర నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ కూడా పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.జగన్నాథ యాత్రను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పూరీ వరకు అనేక రైళ్లను పొడిగించనుంది. పూరీ యాత్రకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను కూడా భక్తులకు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచనన్నారు. తద్వారా ప్రయాణికులు టిక్కెట్లను సలభంగా పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు!
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోజ్‌పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్‌లోని ఓహెచ్‌ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్‌ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్నా ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. -
రైల్ టికెట్ ధర తక్కువే.. ఆదాయం రూ.లక్షల కోట్లు.. ఎలా సాధ్యమంటే..
దేశంలో రైల్వే అతిపెద్ద రవాణ వ్యవస్థగా చలామణి అవుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అందులో ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్య జనాలు కూడా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ రైల్వేశాఖ లక్షల కోట్లు ఆర్జిస్తోంది. అయితే దాదాపు 15 లక్షల మంది పనిచేస్తున్న ఈ సంస్థ టికెట్ ఛార్జీలపైనే ఆధారపడి ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను ఎలా నిర్వహిస్తుంది..? అంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి తగినంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం రాకమానదు.. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా చాలా మార్గాల్లో రైల్వేశాఖ డబ్బు సమకూర్చుకుంటోంది. అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ట్రెయిన్లో ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ఐఆర్సీటీసీలో లేదా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో టికెట్లను బుక్ చేస్తుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం దాదాపు అందరూ ఆన్లైన్ ద్వారానే బుక్ చేస్తున్నారు. వేసవి సెలవులు, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే అడ్వాన్స్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఏవైనా మార్పులు ఉంటే రైల్ టికెట్లను రద్దు చేస్తుంటారు. ఒకసారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మనం మందుగా చెల్లించిన మొత్తం తిరిగిరాదు. అందులో క్యాన్సలేషన్ ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీల పేరిట రైల్వేశాఖ అదనపు భారాన్ని విధిస్తోంది. దాంతోపాటు బుక్ చేసుకున్న సమయంలో టికెట్ బుక్ కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి, చివరి సమయం వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఛార్జీలు విధిస్తుంటారు. అలా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వేశాఖకు 2021-24(జనవరి వరకు) మధ్యకాలంలో ఏకంగా రూ.1,229.85 కోట్లు సమకూరినట్లు తెలిసింది. ఖజానాలో ఇలా తేరగా వచ్చిచేరే ఆదాయంతోపాటు రైల్వే వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తోంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. అద్దెలు: రైల్వేశాఖ కొన్ని ప్రముఖ నగరాల్లో వాణిజ్యభవనాలు నిర్మించి, వాటిని ఇతర ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇస్తుంది. దాంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. టోల్లు: క్లిష్టమైన మార్గాల్లో బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం వంటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ అక్కడి ప్రయాణికుల ద్వారా టోల్ ఆదాయాన్ని పొందుతుంది. కేటరింగ్ సేవలు: ఇందులో రెండు మార్గాల ద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది. ఒకటి ఆన్లైన్ కేటరింగ్, రెండోది ఆఫ్‌లైన్ కేటరింగ్. ఆన్లైన్ కేటరింగ్ జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరి సంస్థలతో జతకూడి రైళ్లలోని ప్రయాణికులకు సేవలిందిస్తూ ఆదాయం సమకూర్చుకుంటుంది. ఒకవేళ ప్రయాణికులు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థకు కొంత, రైల్వేశాఖకు కొంతమేర ఛార్జీల రూపంలో డబ్బు వెళ్తుంది. ఇక ఆఫ్‌లైన్‌లో.. నిత్యం రైల్ కాంపార్ట్‌మెంట్‌లో నేరుగా ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, స్నాక్స్, ఫుడ్.. అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. క్లెయిమ్ చేయని వస్తువుల అమ్మకం: కొన్నిసార్లు గూడ్స్ రైళ్లలో రవాణా అయిన వస్తువులు స్టోర్‌రూమ్‌ల్లో చాలాఏళ్లపాటు అలాగే ఉండిపోతాయి. వాటికి సంబంధించిన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుని వేలం వేయడమో లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటారు. తుక్కుగా మార్చి ఆదాయం: రైల్వే విభాగంలో నిత్యం వినియోగిస్తున్న వస్తువులు, కాలం చెల్లిన ఇనుప వస్తువులను తుక్కుగా మార్చి ఇతర కంపెనీలకు బిడ్డింగ్ ద్వారా కట్టబెట్టి ఆదాయం ఆర్జిస్తారు. పెట్టుబడులు: స్టాక్మార్కెట్లో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సీ వంటి ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో డివిడెండ్ల రూపంలో ఆదాయం సంపాదిస్తోంది. రాయితీ మాఫీ: కరోనా వైరస్ విజృంభించడంతో వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ప్రకటనలు: ఇతర కంపెనీలు రైల్వేప్లాట్ఫామ్లు, బోర్డింగ్‌లో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. దానికోసం రైల్వేకు డబ్బు చెల్లిస్తారు. ప్లాట్‌ఫామ్ రెంట్‌కు ఇస్తూ..: కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్‌ఫామ్ స్థలాన్ని రెంట్ ఇచ్చి ఆదాయం సమకూరుస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్‌లు వంటివాటికి కూడా ప్లాట్‌ఫామ్‌ను కిరాయికి ఇస్తారు. పైన తెలిపిన ఆదాయ మార్గాలతోపాటు ప్రధానంగా ప్రయాణ టికెట్లు, సరకు రవాణాతో సాధారణంగా రైల్వే ఖజానా నిండుతోంది. ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరు 2023లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఆ నెలలో ప్రయాణికుల నుంచి రూ.469.40 కోట్లు, 11.57 మిలియన్ టన్నుల వస్తు రవాణా ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చుకుంటే 2022-23లో ఆదాయం రూ.49 వేల కోట్లు ఎక్కువ. దీనిలో భారతీయ రైల్వే గరిష్టంగా 1.62 లక్షల కోట్ల రూపాయలను సరుకు రవాణా ద్వారా ఆర్జించింది. టిక్కెట్ల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలింది ఇతర ఆదాయం రూపంలో వచ్చింది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారతీయ రైల్వే చరిత్ర దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు ప్రయాణించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ. ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి. అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది. -
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
ఈ రైల్వే షేర్లు కొంటే దశ తిరిగినట్లేనా..?
-
విశాఖ రైల్వే జోన్ కు గత నెల 2వ తేదీనే జీవీఎంసీ భూముల అప్పగింత
-
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్‌పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.