Rajasthan Assembly Elections
-
ఇండిపెండెంట్లే కీలకం.. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు. రాజస్థాన్‌లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. -
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్‌లో 19న, రాజస్థాన్‌లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్‌కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్‌కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్‌లో కమల వికాసమే రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్‌లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్‌కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్‌కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్‌కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్‌కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్‌కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్‌కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్‌కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్‌గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్‌కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్‌కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్‌కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. -
రిజర్వ్డ్ స్థానాల్లో గెలిస్తేనే.. ‘రాజ’స్థానం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇచ్చే అలవాటు లేని రాజస్థానీయులు ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజస్థాన్‌లో 1998 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 59 రిజర్వ్డ్ నియోజకవర్గాలలో 34 ఎస్సీ స్థానాలు కాగా, 25 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నపార్టీనే అధికార పీఠం అధిరోహిస్తోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో రెండింటిలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య ఉన్న గెలుపు తేడా మొత్తం ఈ రిజర్వ్డ్ సీట్ల సంఖ్యలో సగం కూడా లేదు. 2008 డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభ ఎన్నికలతో సహా రాజస్థాన్‌లో ఆరు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు ఎన్నికలలో అత్యధిక రిజర్వు స్థానాలను గెలుపొందిన పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించినట్లు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీదే ఆధిక్యం రాజస్థాన్‌లో 2013 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ సహా మూడు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక రిజర్వ్డ్ స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎక్కువ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో అయితే ఒక్క ఎస్సీ రిజర్వ్డ్ సీటును కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. మొత్తం 34 ఎస్సీ స్థానాల్లో బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలు గెలుచుకోగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 33 స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 34 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 32, 25 ఎస్టీ సీట్లలో 19 చోట్ల బీజేపీదే ఆధిపత్యం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో, ఐదు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో కాంగ్రెస్ జోరు రాజస్థాన్‌లో జరిగిన గత నాలుగు ఎన్నికలలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ రిజర్వ్డ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగినప్పటికీ, దాని విజయం ఇంతకుముందు మూడు ఎన్నికలలో బీజేపీ సాధించినంత ప్రబలంగా లేదు. 2018లో కాంగ్రెస్ 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి 12 ఎస్సీ స్థానాలు, 9 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు దక్కాయి. అయితే ఈ ఆధిక్యాన్ని కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి రిజర్వ్డ్ సీట్లలో ఆధిక్యం దక్కుతుందన్నది డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపులో తెలియనుంది. -
వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది. -
ఆ ఆరు జిల్లాల్లో అధిక ఓటింగ్.. పార్టీల్లో దడ!
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇది గత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఎక్కువ. ఇక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. కౌంటింగ్ రోజున ఫలితం గురించి భయం నెలకొంది. 80 శాతానికి పైగా ఓటింగ్ రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బన్స్వారా, జైసల్మేర్, చిత్తోర్‌గఢ్, హనుమాన్‌గఢ్, ఝలావర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 83 శాతం ఓటింగ్‌తో బన్స్వారా జిల్లా టాప్‌లో ఉండగా 80.41 శాతంతో చిత్తోర్‌గఢ్, 82.52 శాతంతో హనుమాన్‌గఢ్, 82.32 శాతంతో జైసల్మేర్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలవారీగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా 88.13 శాతం ఓటింగ్‌తో కుషాల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 87.79 శాతంతో పోఖ్రాన్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండో స్థానంలో ఉండగా, 86.11 శాతంతో తిజారా, 85.58 శాతంతో నింబహెరా, 85.35 శాతంతో ఘటోల్, 84.22 శాతంతో బారీ, 84.12 శాతంతో మనోహర్తన నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం
Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి. తాగునీటి సమస్యపై.. హనుమాన్‌గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్ పరిధిలోని దౌలత్పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రౌండ్ లెవల్లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు. అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్ తహసీల్‌కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్‌కు మెమోరాండం ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్గర్ సబ్‌డివిజన్‌లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు. ఏకంగా 50 గ్రామాలు ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్‌కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్‌గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డు సమస్య.. ఝలావర్ జిల్లాలోని ఓద్పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్‌లోని లాడ్పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా ధోల్పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
భారత్‌లో ఓటేసిన పాకిస్థాన్ వలస జంట.. భావోద్వేగంతో..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) పాకిస్థాన్‌కి చెందిన దంపతులు ఓటేశారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చి భారత పౌరసత్వం పొందిన ఈ జంట శనివారం జైపూర్‌లోని సంగనేర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులైన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు చివరిసారిగా 2013లో పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ తర్వాత మతపరమైన వేధింపులతో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ను వదిలి 2014లో విజిటర్స్ వీసాపై తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చారు. ఎనిమిది సంవత్సరాల పాటు అధికారిక పరిశీలనలో గడిపిన తర్వాత వీరిద్దరూ 2022లో భారత పౌరసత్వం పొందారు. అయితే వీరి పిల్లలకు మాత్రం ఇంకా భారత పౌరసత్వం లభించలేదు. భారతీయులమని గర్వంగా చెప్పుకొంటాం సంగనేర్‌లోని విద్యాస్థలి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తొలిసారి ఓటేసి బయటకు వచ్చిన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు.. తాము ఇప్పుడు భారతీయులమని గర్వంగా చెప్పుకోగలమని భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఏడాది జరిగే భారత పార్లమెంటరీ ఎన్నికలలోనూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నామని నిర్మల తెలిపారు. నిర్మల జనరల్ మెడిసిన్‌లో వైద్యురాలు కాగా అశోక్ అనస్థీషియాలజిస్ట్‌గా ఉన్నారు. తమను ఓటు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని తెలిసి పాకిస్తాన్లో ఉంటున్న తన తల్లి, సోదరులు సంతోషం వ్యక్తం చేశారని, తమను అభినందించారని నిర్మల పేర్కొన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా తమ నిజమైన మాతృభూమి అయిన భారతదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత్‌లో ఎన్నికల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. తమకు పౌరసత్వం ఇచ్చినందుకు కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
రాజస్తాన్‌లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
ఎడారి రాష్ట్రంలో ఓటింగ్ సునామీ!
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 74.06 శాతం రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్లో ఓటింగ్‌పై బీజేపీ ఫిర్యాదు ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 5.25 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు. నువ్వా.. నేనా.. రాజస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. -
ఓటర్లకు కోపమొస్తే.. పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తిచూడని గ్రామస్తులు!
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రమంతటా ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఒక గ్రామం మాత్రం ఎన్నికలను బహిష్కరించింది. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఏడు పర్యాయాలు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ బూత్ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
పోలింగ్ బూత్‌లో కుప్పకూలిన ఏజెంట్.. గుండెపోటుతో మృతి?
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. -
Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు. కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్‌గావ్ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
Rajasthan elections 2023: రాజస్తాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. బరిలో ఉద్ధండులు.. పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు. -
కచ్చితంగా గౌరవప్రదంగా బదులిస్తారు! సుప్రియా సూలే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీఐ) షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసింది. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సులే స్పందించారు. ఈ మేరకు సూలే మాట్లాడుతూ..రాహుల్ గాంధీ గొప్ప పోరాట యోధుడని. ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిజాయితీగా, గౌరప్రదంగా తగిన సమాధానం ఇవ్వగలరని ధీమాగా చెప్పారు. ఇలాంటి వాటికి రాహుల్ భయపడడు. ఎందుకంటే? బీజేపీ అతని కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహారణలు ఉన్నాయన్నారు. రాహుల్ తాతా, మహోన్నత వ్యక్తి నెహ్రూ నుంచి ఎవ్వరిని వదలకుండా ఎలా కుటుంబ సభ్యులందర్నీ కించరపరిచారో అందరూ విన్నారు. కాబట్టి రాహుల్ అందుకు కౌంటర్‌గా ఏదైనా మాట్లాడితే.. బీజేపీ ఎందుకు పెడబొబ్బలు పెట్టుకుంటోంది అని మండిపడ్డారు సూలే. అతడి కుటుంబంలోని వ్యక్తులందర్నీ పేరుపేరున అవమానిస్తూ మాట్లాడటం తప్పుగాదా? అని బీజీపీని నిందించారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బయాతులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పనౌటీ, పిక్‌పాకెట్ వంటి పదాలతో అవమానించాడని బీజేపీ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అలాంటి పదాలతో దూషించడం.. ఎన్నికల ప్రవర్తన నియావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘించడమేనని ఈసీఐకి ఫిర్యాదు చేసింది బీజేపి. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్‌లో ఎన్నికల సంఘం(ఈసీఐ) రాహుల్ తనపై వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘనల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను కుడా వెల్లడించాలని పేర్కొంది. అలాగే రాహుల్‌ని తన వివరణను ఈ నెల 25న 18 గంట్లలోపు సమాధానం ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది ఈసీఐ. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..) -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ప్రచారానికి తెర
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. రాజస్థాన్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు. రూ.682 కోట్లు స్వాధీనం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
ఆ అంశాలతో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?
రాజస్థాన్‌లో అసెంబ్లీ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. ఇరుపక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రచారాలను హోరెత్తించాయి. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఒకదఫా బీజేపీ, మరోదఫా కాంగ్రెస్‌లు అధికారం చేపడుతూ వచ్చాయి. కానీ, ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ వేయాలని కాంగ్రెస్.. ఆ సంప్రదాయామే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్ అనుహ్యమైన రీతీలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి.. ప్రజలకు ఎన్నో రకాల వెల్ఫైర్ స్కీమ్‌లు అందించి మెజార్టీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్‌గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్‌గా మారి కాంగ్రెస్‌కి విజయాన్ని తెచ్చిపెడతాయా? విశ్లేషిస్తే.. రాజస్థాన్‌లో మరోసారి అధికారంలో పాగావేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు కొన్ని సవాళ్ల తోపాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్‌లో చరిత్రను తిరిగే రాసేలా.. కాంగ్రెస్ శతవిధాల యత్నించింది. కానీ ఆ ఆ పార్టీకి ప్రతికూలాంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. ఎగ్జామ్ పేపర్ లీకేజ్.. కాంగ్రెస్ నేతృత్వంలోని విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర లీకేజ్‌లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యావ్యవస్థ పరంగా కాంగ్రెస్‌కి అతి పెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్ లీక్ కుంభకోణం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్‌కి మైనస్ అయ్యి..ప్రజలు అధికారం పట్టకట్టాలా? లేదా అనే మీమాంసంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్గత విభేదాలు.. కాంగ్రెస్‌లో తరచుగా తెరపైకి అంతర్గత విభేధాలు తారస్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నువ్వా-నేనా? అనే స్థాయికి వచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్ బయటకు వచ్చి మరీ నిరాహారదీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయాలా చేశారు. చివరికి కాంగ్రోస్ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒకరంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అవినీతి, అల్లర్లు, నేరాలు.. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో జరిగిన అవతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గహ్లోత్ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరితంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అనుకూలమైన విషయాల వద్దకు వస్తే ఎన్నికలు సమీపిస్తుండగా ఒకరంటే ఒకరికి పడని గహ్లోత్, సచిన్ పైలట్ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలెట్ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పలా ఆయన ప్రవర్తన తీరు తోపాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్ వెల్ఫైర్ స్కీమ్‌లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్తరంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్‌పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్, కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుందా? వాటిల్లో కాంగ్రెస్‌కి ఎంతవరకు సానూకూల అంశాలు ఉన్నాయి అంటే.. సానూకూలమైన అంశాలు యునైటెడ్ ఫ్రంట్ అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు తామెప్పుడూ ఒకటేనని పార్టీని నిలబెట్లుకోవడమే లక్ష్యం అని ప్రకటించారు. అలాగే సచిన్ పైలట్ కూడా రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గహ్లోత్ ఒక్కరే అన్ని తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సంయమనాన్ని పాటించి సచిన్ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు. అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంత ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. పైగా గతంలో చేసిన వ్యాఖ్యల విషయం కూడా రాజకీయ పరంగా వచ్చినవే "క్షమించడం, మరచిపోవడం" అనే మంత్రాలని పాటిస్తున్నానంటూ నాయకులు ఐక్యతకు పీఠం వేశారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వొచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లును కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూలం అంశమే అని చెబుతున్నారు విశ్లేషకులు. గ్యారంటీల గేమ్ అశోక్ గహ్లోత్ ఓటర్లను ఆకర్షించేలా.. ఏడు గ్యారంటీలు, పాత పెన్షన్ స్కీమ్, మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకనేలా సుడిగాలిలో రాష్టం అంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్‌కి గెలుపులో కీలకం అవ్వోచని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానూకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్ గురి చేసింది. ఎలాంటి స్కీమ్, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలనే దిశగా అడగులు వేస్తూ గెలుపే లక్ష్యం దూసుకుపోతుంది. బీజేపీ వ్యూహం ఇలా.. ఇదిలా ఉండగా బీజేపీనేమో కాంగ్రెస్ మైనస్‌లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ తరుణంలో.. ఓటర్ తీర్పు.. అందునా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీదాకా వేచి చూడాల్సిందే. (చదవండి: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి! అమిత్ షా!) -
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారాలు తుది అంకానికి వచ్చేశాయి. నేటితో పార్టీల ప్రచార ర్యాలీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అల్లర్లకు ఆధ్యం పోశారే గానీ నియత్రించేలా కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. గహ్లోత్ ప్రభుత్వం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటాయి. గత ఐదేళ్లలో ఛబ్రా, కరౌలీ, భిల్వారా, జోధ్‌పూర్, చిత్తోర్‌గఢ్, నోహర్, వేవాత్, మల్పురా, జైపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లే అందుకు ఉదాహారణ అని ఆరోపించారు. బుల్డోజర్లతో సలాసర్‌లోని రామ్ దర్బార్ని, ఆవుల షెడ్డుని ఎలా కూలదోసిందో చెప్పుకొచ్చారు. అలాగే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసంగా చెప్పారు. రాజస్తాన్‌లో తమ పార్టీ ప్రతి మూలన సమూలమైన మార్పు తీసుకువస్తుందని, ముఖ్యంగా నేరాల తీవ్రత తగ్గిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా చివరి రోజు ర్యాలీలో బీజేపీపై విమర్శల దూకుడును పెంచేశారు. అదాని వంటి ఇష్యులను అస్త్రాలుగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా ఇరు పార్టీలో పోటాపోటీగా తమ అగ్ర నాయకులను ప్రచార ర్యాలీల బరిలోకి దింపారు. ఇటు బీజేపీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటిని ప్రచారంలోకి దించితే..అటు కాంగ్రెస్ కూడా పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని దింపింది. కాగా, ఈ నెల 25న 200 అసెంబ్లీ స్థానాలున్నా రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనూ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని.) -
రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ..
రెండు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్ మ్యాచ్‌ని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్‌లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోసింది. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్‌లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్ శర్మ టీమ్ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్ మ్యాచ్ జరగడంతోనే టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్‌లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. (చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్ షా ఫైర్) -
మేమొస్తే రాజస్తాన్‌లో కులగణన
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బుధవారం ధోల్పూర్, భరత్పూర్లలో జరిగిన ప్రచారసభల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘ దేశ రక్షణ కోసం పాటుపడేందుకు సైన్యంలో చేరాలని కలలు కనే లక్షలాది మంది యువత ఆశలను మోదీ సర్కార్ అగ్నిపథ్ పథకం తెచ్చి చిదిమేసింది. ఈ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రంలో, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. దళితులు, వెనుకబడిన తరగతుల జనాభా వంటి సమగ్ర వివరాలు బహిర్గతంకావాలంటే కులగణన జరగాల్సిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా ప్రజా సంపద పంపిణీ ఏ విధానంలో జరుగుతోందనేది పెద్ద ప్రశ్నగా మారింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అప్పుడలా.. ఇప్పుడిలా ‘‘తాను ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినని మోదీ పదేపదే చెప్పుకునేవారు. నేను ఎప్పుడైతే కులగణన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చానో అప్పటి నుంచి ఆయన మాట మార్చారు. దేశంలో ఒక్కటే కులం ఉందట. అది పేదకులమట’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు. ‘ప్రజాధనం లూటీ చేయడంలో మోదీ, కుబేరుడు గౌతమ్ అదానీ, హోం శాఖ మంత్రి అమిత్ షా బిజీగా మారారు. ముందుగా ప్రధాని మోదీ టీవీల్లో ప్రత్యక్షమై హిందువుల, ముస్లింల గురించి ప్రసంగాలు దంచేస్తూ ప్రజల దృష్టి మరల్చుతారు. వెంటనే గౌతమ్ అదానీ వెనక నుంచి వచ్చి ప్రజల జేబుల్లోని సొమ్ము నొక్కేస్తారు. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత, ఆందోళన అణచివేసేందుకు లాఠీ పట్టుకుని అమిత్ షా సిద్ధంగా ఉంటారు. ఇపుడు దేశంలో ప్రభుత్వం ఇలాగే నడుస్తోంది. మోదీ అనుక్షణం చానెళ్లలో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ చానెళ్లకు అధిపతి అదానీ కదా. మోదీనే ప్రజాధనాన్ని అదానీకి ముట్టజెప్తారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సిమెంట్ కర్మాగారాలను ధారాదత్తం చేస్తారు. అదానీకి అనుగుణంగా చట్టాలు చేస్తారు. పెద్ద నోట్లను రద్దుచేస్తారు’’ అని రాహుల్ విమర్శించారు. -
నిజం మాట్లాడే సొంత నేతలనూ బహిష్కరిస్తుంది
జైపూర్: రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారసభల్లో అధికార కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరింతగా విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్వాడా జిల్లాలోని కోట్రీ గ్రామంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ కాంగ్రెస్ కుటుంబం ముందు ఎవరైనా నిజం మాట్లాడితే ఇక అంతే. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఒకప్పుడు రాజేశ్ పైలట్ ఆహార సమస్యపై కాంగ్రెస్ కుటుంబాన్నే సవాల్ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజేశ్ పైలటే కాదు ప్రస్తుతం ఆయన కుమారుడు సచిన్ పైలట్ సైతం పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 1997లో పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేసరికి పోటీగా ఎన్నికల్లో నిల్చున్నందుకు రాజేశ్ పైలట్‌పై పార్టీ కన్నెర్రజేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అశోక్ గెహ్లోత్‌తో పోటీపడినా అధిష్టానం దీవెనలు సచిన్‌కు దక్కలేదు’’ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు క్లీన్ చిట్ ‘‘అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు రాష్ట్ర మంత్రులే క్లీన్చిట్ ఇస్తున్నారు. ఇలాంటి పాలనలో మన తల్లులు, కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు రక్షణ ఏది? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. కమలానికి మీరు వేసే ఒక్కో ఓటు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేందుకు దోహదపడుతుంది’’ అని మోదీ అన్నారు. అంతకుముందు దుంగార్పూర్ జిల్లాలోని సాగ్వారా పట్టణంలో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు సచిన్ పైలట్ కూడా ఖండించారు. ఆయన సొంత పార్టీపై దృష్టి పెడితే మంచిదని సచిన్ సూచించారు. -
Rajasthan Election 2023: హామీలా, హిందుత్వా?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది... పథకాలకు థమ్సప్... గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్‌లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. ‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే. శాంతిభద్రతలపై పెదవి విరుపు... పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు. ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్! రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. -
ఆ రెండు దేశానికి రాహు-కేతువులు!
రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా బహిరంగ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన ఈ బహిరంగ ర్యాలీ అమిత్ షా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న రాహు-కేతువులని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో భారతదేశానికి తలెత్తే కష్టాలన్నింటికీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ల వల్లనే వస్తుందని విమర్శలు గుప్పించారు. భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మోదీ.. తాను చెప్పినట్లుగానే చంద్రయాన్‌తో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రునిపై రెపరెపలాడేలా చేశారు. అంతేగాక జీ 20 ఆతిథ్యంతో భారత దౌత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాన మోదీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ. 6 వేలుగా ఉన్నదాన్ని కాస్తా రూ. 12 వేలు చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మిల్లెట్‌ను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్లను తమ పార్టీ కేవలం రూ. 450/- లకే అందిచింది. ఇలా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఇదిలా ఉండగా అంతకు మునుపు రాజస్తాన్‌లోని నసీరాబాద్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ..రాహుల్ గాంధీ పదేపదే ఓబీసీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. జవహర్ లాల్ నెహ్రు దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు సుమారు నాలుగు తరాలు గాంధీలు ఓబీసీ వర్గాల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కానీ బీజేపీ జాతీయ వెనుకబడిని తరగతుల కమిషన్(ఎన్సీబీసీ)ని రాజ్యాంగబద్ధంగా మార్చింది. అలాగే తొలి ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చిన ఘనత కూడా మాదే. ఇలాంటివి కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. పైగా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజస్తాన్ ముఖ్యమంతి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవినీతి మయ ప్రభుత్వాని చూడలేదంటూ చిరాకుపడ్డారు. ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అవినీతి పరులందరికీ శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేపర్ లీక్‌లు జరగకుండా చూడటమే కాకుండా సుమారు 2.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అంతేగాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. 2004-14 మధ్య కాలంలో రాజస్తాన్‌కి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయాలు తగ్గించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ మోదీ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌కు తొమ్మిదేళ్లలో దాదాపు 6 లక్షల డభైవేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మాన్ కింద రైతులకు రూ. 12 వేలు వరకు ఇవ్వడమే గాక వైద్య ఖర్చులు దాదాపు 10 లక్షల వరకు భరిస్తామని చెప్పుకొచ్చారు అమిత్ షా. కాగా, రాజస్తాన్‌లో ఈ నెల 25న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగనుండటం గమనార్హం. (చదవండి: నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం)