rajireddy
-
గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో.. ఇద్దరి విషాదం!
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఖమ్మంరూరల్ మండలానికి చెందిన ఈగ రాజిరెడ్డి (37), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన షేక్ షబ్బీర్ (35) కలిసి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. వారం రోజుల కిందట వీరు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో ఓ గ్రానైట్ క్వారీ నుంచి రాయిని తీసుకుని ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో మూలమలుపు వద్ద లారీ అదుపుతప్పింది. ఈ క్రమంలో గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా షబ్బీర్ ఐదేళ్లుగా వరంగల్క్రాస్ రోడ్డులో కుటుంబంతో నివాసముంటున్నాడు. రాజిరెడ్డి ఖమ్మం నగరంలోని సారధినగర్వాసి. ఇవి చదవండి: భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి -
సీఎం మాటలను ప్రజలు నమ్మరు! : ఆవుల రాజిరెడ్డి
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలను నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానని, 2018లో నర్సాపూర్‌ను దత్తత తీసుకుని బంగారు తునక చేస్తానని సీఎం హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని, ప్రస్తుతం ఇచ్చేవాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన చెప్పారు. ధరణి.. పేద రైతుల పాలిట శాపంగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఇచ్చిన హామీలన్నీ గతంలో మాదిరిగానే తుంగలో తొక్కుతారని ఎద్దేవా చేశారు. దేవులపల్లి, వెల్మకన్నె, ముండ్రాయి, శివ్వంపేట తదితర గ్రామాలకు చెందిన రైతుల భూములను ధరణిలో పార్ట్ బీలో పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని, అనంతరం వాటి రికార్డులు సరి చేయించుకుని అధిక ధరలకు అమ్ముతూ కోటీశ్వరులయ్యారని విచారం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంను మండల కేంద్రం చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో చిలిపిచెడ్ మాజీ జెడ్పీటీసీ చిలుముల శేషాసాయిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్, నాయకులు ఆంజనేయులుగౌడ్, రిజ్వాన్, మల్లేష్, శ్రీనివాస్‌గుప్తా, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజాగౌడ్, మల్లేష్‌గౌడ్, అశోక్, రామాగౌడ్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. నర్సాపూర్‌లో ప్రచారం! ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా నర్సాపూర్‌లోని రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో చిన్న అంజిగౌడ్, సుధీర్‌గౌడ్, రషీద్ పాల్గొన్నారు. అప్పుల్లో తెలంగాణ.. నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్, బ్రాహ్మణపల్లి ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు అప్పుల పాలుచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన 6 గ్యారంటీ పథకాలను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, మల్లేష్, అశోక్, ఆకుల నర్సింలు, సుధీర్ గౌడ్, నందు, అశోక్ గౌడ్, ఉదయ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్ తండా సమీపంలో ధాన్యం నూర్పిడి పడుతూ ఓటు వేయాలని రాజిరెడ్డి కోరారు. ఆరు గ్యారంటీలు అమలు.. శివ్వంపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి భార్య శైలజారెడ్డి, సుహాసినిరెడ్డి, కమల, సుదర్శన్‌గౌడ్, నవీన్గుప్తాలు అన్నారు. శుక్రవారం దంతన్‌పల్లి, రత్నపూర్ తండాతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంఘటితంగా కృషిచేయాలి! వెల్దుర్తి: నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గెలుపుకోసం కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప్పులింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్, సత్యనారాయణ, మహేందర్‌గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, సర్వర్మీర్జా కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నారాయణ రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, భూమయ్య, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. హత్నూర: నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం రేండ్లగూడ గ్రామా నికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవుల కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హకీం పాల్గొన్నారు. -
గాంధీభవన్‌లో ఉద్రిక్తత
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
మావోయిస్టు కీలక నేత రాజిరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి (71) అలియాస్ సాయన్న మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాడపడుతున్న ఆయన ఈ నెల 16న చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేశారు. అయితే రాజిరెడ్డి మరణవార్తను మావోయిస్టులు, ఆయ న కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కొండపల్లి పరిచయంతో అడవిబాట... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్పాండేగా దళంలో ప్రసిద్ధుడు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్పూర్లో ఓ కేసులో అరెస్టు అయి వరంగల్ జైలుకు వెళ్లారు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్‌వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడవిబాట పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు బీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్‌లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవభావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరారు. దళ సభ్యురాలితో వివాహం... రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురి ఆలానాపాలనను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించాడు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాశిం. నెట్టింట వీడియో వైరల్... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతిపైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రామచంద్రారెడ్డి మృతిచెందారంటూ ఓ మృతదేహం చుట్టూ పలువురు మావోయిస్టులు రోదిస్తున్నట్లున్న ఓ వీడియో గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మల్లా రాజిరెడ్డి మృతి వార్తకు సైతం అదే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం గమనార్హం. ఈ వీడియోను ఫ్యాక్ట్ చేయగా గురువారమే అది అప్లోడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం. వికల్ప్, విజయ్, రాజుదాదా, జురు, సునీల్, వాసు పేర్లతో ప్రచారంలో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులు... రాజిరెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 1986లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఎస్సై, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య ఉండగా ఏ2గా రాజిరెడ్డి పేరు నమోదైంది. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లిని రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్‌మలైలో ఎస్ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కుట్ర కేసులో మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి, కరీంనగర్ జైలుకు తరలించారు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్‌పై బయటికి వచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి రూ.కోటి వరకు ఉంటాయని అధికారిక సమాచారం. -
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించకలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిచెందారు. కాగా, రాజిరెడ్డి స్వస్థలం.. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఇక, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే, రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించడం విశేషం. మరోవైపు.. రాజిరెడ్డి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. ఇది కూడా చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి. సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది. ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది. సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. శ్రీరాముడే వచ్చినట్టుంది రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట -
టీఎస్ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కరీంనగర్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేవశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ ఈనెల 30న, అక్టోబర్ 1వ తేదిల్లో జరగునుందని టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య రాజీరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 58, 452 అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 14 రీజనల్ సెంటర్లు, 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 30 వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందన్నారు. రెండవ రోజు అక్టోబర్ 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించి శానిటైజర్ బాటిల్‌తో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బయోమెట్రిక్ ద్వారా కాకుండా ఫొటో క్యాప్చర్ విధానంతో అభ్యర్థుల హాజరును నమోదు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పెన్ను తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. -
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్‌లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అరెస్ట్
-
ఆర్టీసీ సమ్మె: ‘నిరుద్యోగులు.. ప్లీజ్ సహకరించండి’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులెవరూ భయపడవద్దని.. అందరికీ తాము అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ పాల్గొన్నారు.(చదవండి : ఆర్టీసీ సమ్మె; రేపు బంద్.. ఉత్కంఠ) సమ్మెకు సహకరించండి.. ఆర్టీసీ జేఏసీని విచ్చిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని రాజిరెడ్డి విమర్శించారు. ‘నిరుద్యోగులెవరూ తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లుగా వెళ్ళకండి. ప్రజా రవాణా వ్యవస్థను విచ్ఛన్నం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దయచేసి నిరుద్యోగులు కార్మికులుగా వెళ్ళకండి. సమ్మెకు సహకరించండి’ అని రాజిరెడ్డి విఙ్ఞప్తి చేశారు. ఇక పద్మనాభన్ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఉద్యమం చేయడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి కార్మిక చట్టాల గురించి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ‘సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తాను అంటే ఎట్లా..100 ఏండ్ల నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మనం నిజాం పాలనలో లేము. రాజ్యాంగ పరమైన దేశంలో ఉన్నాము. సమ్మె చేయడం కార్మికుల హక్కు. బ్రిటిష్ రాజు లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యమానికి రాజకీయ పార్టీలు కలిసి రావడం మంచి పరిణామం. దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. -
పోరాటాన్ని ఉధృతం చేస్తాం
-
ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి, తిరుపతి, వీఎస్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు -
ద్వైదీభావాల సంచారి
ఈ ప్రపంచం మీద కుతూహలమే రాజిరెడ్డిని రచయితగా చేసిందని నేననుకుంటాను. బయట కనిపించినదానిని దృశ్యమానం చేసుకుంటూ లోపల కలిగే ఆలోచనలను మననం చేసుకుంటూ ప్రతిదీ తెలుసుకోగోరే బాటసారి అతడు. తనే ప్రశ్నలు వేసుకుని తనే సమాధానాలు చెప్పుకునే జిజ్ఞాసాపరుడు. రచయితల అంతశ్చేతన నుంచే కథనో కవితనో పుడుతుందంటారు. రాజిరెడ్డి రచనలన్నీ బౌద్ధిక స్పృహలోంచే వచ్చినట్టుంటాయి. రచయిత ఉనికితోపాటు అతడు తర్కించుకుని నిర్ధారించుకున్న వాస్తవమే డామినేట్ చేస్తుంటుంది. ఒకపక్క బయటనుంచి పిలిచే సజీవ జీవిత సాంసారిక లోకం, మరొకపక్క లోపల ఆకర్షించే సన్యాసి వైరాగ్యం. ఈ రెండింటిలో దేనినీ వదులుకోలేని ద్వైదీభావాల సంచారి అతడు. తనతో తనే సంవాదం పెట్టుకుంటాడు. ఆ వాదప్రతివాదాల మధ్య నిలబడి కథ చెబుతాడు. స్వతహాగా రాజిరెడ్డి తనదైన జీవితాన్ని అన్వేషించే భావుకుడు. కాని దృక్పథపరంగా జీవితానికీ, అందులోని వాస్తవానికీ లొంగి ఉన్నాడు. ఆదర్శాలను గ్లోరిఫై చేసుకునే భ్రమలు లేవు. కథల్లోని నాటకీయత మీద, కల్పనలోని అతిశయోక్తి మీద ఏవగింపు ఉంది. ఇది కథకుడి నైపుణ్యానికి సంబంధించిన విషయం కాదు, దృక్పథానికి చెందిన ఎంపిక. మరి అతడు అనుకున్నదానికి అతీతంగా ఉండే కల్పన ఉండదా? తను కల్పనను ఎంత బాగా రాయగలడో ‘రెక్కల పెళ్లాం’ చెబుతుంది. రెక్కలు, తురాయి వంటి ప్రతీకలను అవతల ఉంచి కథ నడిపిన తీరులో సహజసిద్ధమైన ప్రతిభ కనిపిస్తుంది. వాస్తవంలోని విషాదం, నిజ జీవితంలోని హిపోక్రసీ అతడికి కనపడలేదా అంటే ‘మంట’ వాస్తవంలోని హిపోక్రసీని ఏవగించుకుంటుంది. అందులోని ప్రొటాగనిస్ట్ తన నిర్ణీత సమయపు కొలతలకు అందని సరిపడని విషయాలన్నిటినీ తిరస్కారంతో నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ పోతాడు. కర్కశంగా ఈ ప్రపంచంతో విభేదిస్తాడు. చివరికి ఊహలో ఊరట పొందుతాడు. అనేక వాస్తవాల సారాంశం చిట్టచివరికి ఒక కళాత్మకమైన కల్పనగా రూపొందడాన్ని ‘తమ్ముడి మరణం’లో చూడవచ్చు. నిజ జీవితంలోంచి తీసుకుని రాసినా ఈ కథ వాస్తవాన్ని దాటి కళాత్మకమైన కథగా రూపొందింది. ’చింతకింది మల్లయ్య ముచ్చట’ ఒక చిత్రకారుడు సగంలో విరమించిన ఒక గొప్ప వర్ణ చిత్రపటంలా నాకనిపిస్తుంది. కథని ఒక సంఘటనగా చూడక ఒక వ్యక్తి జీవితం మొత్తం కథలో వ్యక్తం కావాలని ఏ కథా చెప్పదు. సాహిత్యం జీవితాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేదనేది ఎప్పటికీ నిర్వివాదం. తను చూసే చరాచర జగత్తులో కథకుడు దేన్ని కథ చేయాలనుకుంటున్నాడో, ఏది అతడిని కథ రాయడానికి పురిగొల్పిందో అదే అతడి దార్శనికత. మానసిక ఆధిపత్యం సాధించడం, ఎలుగుబంటితో హీరోలా పోరాడటం, వీటికి అతీతంగా చింతకింది మల్లయ్య జీవితాన్ని పట్టిచ్చే మాట, సంఘటన కథకి దొరికేది ఏదీ ఉండదా? ఒక సంఘటనని కథ చేయడానికీ అందులోని కాల్పనికమైన నాటకీయత చూడటానికీ మధ్య తేడా గుర్తించగలిగితే ఇది సమస్య అనిపించదు. ఇంకాస్త ముందుకెళ్లి అసలు డ్రామాలేని కథ ఉండదు అనికూడా అనగలను. పరిహరించుకోవాల్సింది అందులోని కృతకత్వాన్నే. నాకైతే చింతకింది మల్లయ్య చెప్పిన ముచ్చట్లలో నాటకీయతకి ఆస్కారం లేని అనేక కథలు కనిపించాయి. రాజిరెడ్డి వచనానికి వర్ణనలతోపాటు తర్కం అదనపు అలంకారం. అయితే ఏ తర్కమైతే రాజిరెడ్డి వచనాన్ని, దృక్పథాన్ని పరిపుష్టం చేస్తున్నదో ఆ తర్కమే ఒక్కోసారి అతడి కథనానికి అవరోధం కూడా అవుతున్నది. అదే అతడిని భౌతికవాది అనుకునేట్లుగా చేస్తున్నది. అడుగడుగునా అతడి ‘నేను’ అతడికి అడ్డ్డం పడుతుంటాడు. ఈ పుస్తకంలో కొన్ని కథల ముగింపు కథాంశాన్ని పట్టిస్తుంది. ఎక్కువ కథల్లో అప్పటిదాకా చెప్పిన భావధారకి వ్యతిరేకంగా రచయిత యూటర్న్ తీసుకుంటాడు. అదికాకుంటే ద్వైదీభావంలో ఉన్న మనిషి ప్రాక్టికల్‌గా ఆలోచించి జీవితంలోని వాస్తవానికి లొంగిపోవడం జరుగుతుంది. రాజిరెడ్డి కథల్లో కల్పన తక్కువ. కలలు అసలే ఉండవు. వర్ణనలు ఉంటాయిగాని మితిమీరిన అలంకరణలు ఉండవు. రాజిరెడ్డికి ఏది అందంగా కనిపించింది అని ఈ పుస్తకాన్ని మళ్ళీ తిరగేస్తే ‘కాశెపుల’్లలో అతడికి బాల్యంలో బతుకమ్మ పండుగనాటి గునుగుపువ్వు దొరికింది. ‘చినుకు రాలినది’లో షేరింగ్ ఆటోలో పసిపాప కళ్లలో దివ్యమైన వెలుగు కనిపించింది. కథ చివర కొడుకు నవ్వు ముఖాన్ని చూడటానికి వెళ్లే అతడి ఉత్సాహాన్ని ఆటోవాడి దగ్గరనించి తిరిగిరాని రూపాయి కొంతయినా తగ్గించడం కథ పూర్వరంగాన్ని కరప్ట్ చేసినట్లు అనిపించింది. ఒక కథ పుట్టడానికి ముందు ఏ నిబంధనలూ ఉండవు. ఏ సూత్రాలు అడ్డు పడవు. అది పూర్తయ్యాక అన్ని కొలతలూ సమానంగా ఉన్నాయా, కథనం కథాంశానికి అనుగుణంగా ఉందా? వస్తువుని ఎలా ఇమిడ్చాడు అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది కాని పుస్తకంలో రచయిత అనుభవాలు భవిష్యత్తులోని వర్తమానానికి ఏ మేరకు వర్తిస్తాయి అన్నది కూడా పుస్తకానికి అదనపు విలువ అనుకుంటాను. అలా చూస్తే ఇందులోని కాశెపుల్ల, తమ్ముడి మరణం, రెక్కల పెళ్లాం, మంట లాంటి కథలు కాలానికి నిలబడతాయనే నా నమ్మకం. ఒక సంకలనం తెచ్చాక కథకుడు రూపాంతరం చెందుతాడంటారు. ఈ మలుపు తరవాత ఇకముందు రాజిరెడ్డి ఎలాంటి కథలు రాయబోతున్నాడన్నది ఆసక్తికరమే. నేనైతే అతడు తన బాహ్యప్రపంచపు నలుగులాట కాస్తంత విడిచిపెట్టి ఇంకాస్త కాల్పనికతలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. రాజిరెడ్డి తన బయటినుంచి లోపలికి వెళ్లే దారికంటే తన లోపలినుంచి బయటకు వచ్చేదారి నాకు మరింత కళాత్మకంగా కనిపిస్తుంది. చింతకింది మల్లయ్య ముచ్చట – ఇతర కథలు రచన: పూడూరి రాజిరెడ్డి పేజీలు: 156; వెల: 144 ప్రచురణ: ఛాయ రిసౌర్సెస్ సెంటర్, హైదరాబాద్. ఫోన్: 9848023384 బి.అజయ్‌ప్రసాద్ 9247733602 -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధకి మరో అన్నదాత బలయ్యాడు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి(45) అనే రైతు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యలు అతడిని చికిత్సకోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతను గురువారం మరణించాడు. రాజిరెడ్డి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ట్రిపుల్ ఐటీలో ఎంపిక విధానాన్ని మార్చలేం
వేంపల్లె (కడప) : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని వస్తున్న అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. అలా చేస్తే పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని, అందువల్ల ఎంపిక విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
అల్లుడ్ని గొడ్డలితో నరికిన మామ
స్వయానా మామే ఓ అల్లుడ్ని గొడ్డలితో నరికాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం అర్ధరాత్రిఈ ఘటన జరిగింది. కొండం మహేందర్‌రెడ్డి (50) ఇంటి ముందు నిద్రిస్తుండగా... మామ రాజిరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహేందర్‌రెడ్డిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కుటుంబ విభేదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. -
క్షుద్రపూజలు: కన్నబిడ్డను చంపిన తండ్రి
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్షద్రపూజల కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చాడో తండ్రి. స్థానిక మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన సద్ది రాజిరెడ్డి అలియాస్ దెయ్యాల రాజిరెడ్డి జాతకాలు చెబుతుంటాడు. రాజిరెడ్డి ఓ మహిళతో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. వారికి మూడు నెలల బాబు ఉన్నాడు. చిన్నారిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి రాజిరెడ్డి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికావడం లేదనే బెంగతో ఆత్మహత్య
చిట్యాల : తానకు నత్తి ఉందని, అందుకోసమే తనకు పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో యువకుడు విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలిలా ఉన్నాయి. చల్లగరిగె గ్రామానికి చెందిన దావు రాణి, శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు రాజిరెడ్డి(26)కి పుట్టుకతో నత్తి. గత మూడేళ్ల నుంచి రాజిరెడ్డికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అరుుతే అతనికి అమ్మారుుని ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. కాగా, గురువారం తన వ్యవసాయ బావి వద్ద మిరప తోటకు విష గుళికలు వేసేందుకు వెళ్లాడు . తనకు జీవితంలో ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురై విష గుళికలు మింగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. -
వైస్‌చైర్మన్‌గా శరత్‌రావు!
జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు పేరు దాదాపు ఖరారైంది. పార్టీలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు అధిష్టానానికి సన్నిహితంగా ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా బీసీ మహిళ కానుండటంతో, వైస్‌చైర్మన్‌ను ఓసీలకు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించారు. ఆ సామాజికవర్గంలో సీనియర్ నాయకుడైన శరత్‌రావు పార్టీకి అందించిన సేవలు, విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకొని ఆయనకే వైస్‌చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. హుస్నాబాద్ జెడ్పీటీసీ రాజిరెడ్డి, జమ్మికుంట జెడ్పీటీసీ వీరేశలింగం పోటీపడ్డప్పటికీ అధిష్టానం శరత్రావువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
చివరిచూపూ దక్కలేదు
అణువణువూ గాలించినా... బియాస్లో ఓడి వెనుతిరిగినశ్రీనిధి తండ్రి నా బిడ్డ ఏదంటూ తల్లి ఆక్రందన కరీంనగర్ రూరల్ : జలప్రవాహానికి బలైన కన్నబిడ్డ జాడకోసం... కళ్లల్లో వత్తులు వేసుకుని దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి చూసిన ఎదురుచూపులు ఫలించలేదు. బిడ్డను కడసారి చూపయినా చూసుకుందామనుకున్న ఆశ నెరవేరలేదు. హృదయపొరల్లో నిక్షిప్తమైన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బియాస్ నది వద్ద పదిరోజులుగా పడిగాపులు గాసినా బిడ్డ జాడ తెలియకపోవడంతో... గుండెలనిండా ఉన్న బాధను గొంతులో దిగమింగుకుని రిక్తహస్తాలతో గురువారం ఇల్లు చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8న గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. సంఘటన జరిగిన మరునాడే ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. పది రోజులుగా కూతురు ఆచూకీ కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఒక్కొక్క మృతదేహం బయటపడుతుంటే... తమ కూతురుదేమోనని ఆత్రుత గా... ఆందోళనగా వెళ్లి చూస్తూ... కాదని నిర్ధారించుకుంటూ నరకయాతన అనుభవించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బియాస్ నది వద్ద రాజిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 24 మంది గల్లంతు కాగా పది రోజులపాటు రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా గురువారం వరకు 14 మృ తదేహాలు లభ్యమయ్యాయి. గాలింపు కష్టమని అక్కడి ప్రభుత్వం భావించి విద్యార్థుల పేరిట ఈ నెల 17న డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రకటించడంతో... ఇక ఆశలు వదులుకు న్న రాజిరెడ్డి అక్కడినుంచి భారంగా బయలుదేరారు. కూతు రు కోసం వెళ్లిన ఆయన గురువారం వేకువజామున పుట్టెడు దుఃఖంతో రిక్తహస్తాలతో ఇల్లు చేరారు. ఆయన రాకతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమే అయ్యింది. నా బిడ్డ ఏదంటూ శ్రీనిధ/ తల్లి ఆయనను ప్రశ్నించేసరికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజిరెడ్డిని ‘సాక్షి’ ఓదార్చుతూ... పలకరించగా అంతవరకు కట్టలు కట్టుకున్న కన్నీరు ఓ ప్రవాహమే అయింది. గుండెల నిండా ఉన్న బాధను పంచుకోవాల నే ఆరాటమున్నా... కళ్లల్లో తిరుగుతున్న నీళ్ల సుడులతో ఆయ న గొంతు పెగలలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న శ్రీనిధి నదీ ప్రవాహంలో తరలిరాని దూరాలకు వెళ్తుందని అనుకోలేదని, అణువణువూ గాలించినా... ఎక్కడా జాడ కనిపించలేదని... ఆయన విలపిస్తూ తెలిపారు. శ్రీనిధి జాడ తెలుస్తుంద నే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతున్నప్పటికీ కనీసం నిర్జీవ దేహమైనా లభిస్తుందనే ఆశతో బుధవారం రాత్రంతా ఢిల్లీలో వేచిచూశానని విలపించారు. గురువారం గాలింపులో మూడు మృతదేహాలు లభించడంతో నా బిడ్డ జాడ కూడా దొరుకుతుందనే ఆశ కలుగుతోందని గద్గరస్వరంతో చెప్పారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
మామిడి కోత మెలకువలు: కాయ తొడిమ ఇరువైపులా పసుపు పచ్చరంగు రావడం, కాయ పైన నూనె గ్రంధులు ఏర్పడినప్పుడు కోయాలి. బంగిన పల్లిలో తొమ్మిది, దశేరిలో 8.5 టి.ఎస్. ఎస్. ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి. ఐ.ఐ.హెచ్.ఆర్., ఐ.ఏ.ఆర్.ఐ., డాఫోలి వేర్వేరుగా రూపొందించిన ఆధునిక కోత పరికరాలతో కోయడం ద్వారా కాయకు దెబ్బతగలకుండా నాణ్యతను పెంచుకోవచ్చు. కాయలో ఉన్న జీడి సొన పూర్తిగా కారిపోయే వరకు బోర్లించి ఉంచడం ద్వారా కాయకు జీడి అంటకుండా చూసుకోవాలి. జీడి పూర్తిగా కారిపోయిన తర్వాత గడ్డిలో పేర్చి మాగబెట్టుకోవాలి. కాయలను కోసి కార్బైడ్ ద్వారా మగ్గబెట్టడం చట్టరీత్యా నేరం. కూరగాయలు: వేసవి కూరగాయల నాణ్యత, దిగుబడి దెబ్బతినకుండా కొన్ని మెలకువలు పాటించాలి. నీటి తడులు పలుచగా, తక్కువ వ్యవధి వ్యత్యాసంతో ఇచ్చుకోవాలి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువ ఉన్నప్పు డు, సాయంకాలం సమయంలో నీటిని పిచికారీ చేయడం ద్వారా మొక్కలను, కాయలు వేడి వల్ల కమిలిపోకుండా కాపాడుకోవచ్చు.డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడులు ఇవ్వడం శ్రేయస్కరం. భూమిలో తేమ ఆవిరి కాకుండా ప్లాస్టిక్, గడ్డితో మల్చింగ్ చేసుకోవాలి.ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం ఉన్న చోట డ్రిప్ ద్వారానే ఎరువులను అందించాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందువలన 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.4 గ్రాముల ధయోమిధాక్సామ్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
-
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
హైదరాబాద్ : రాష్ట్రంలో అప్పుడే రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లపై ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకి సొంతపార్టీ ఎమ్మెల్యేలే పొగబెడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సర్వే..గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడుతున్నారు. మాల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్వే వ్యవహారశైలిపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి హస్తినకు చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ కోసం దొరికిన వెంటనే వీరిద్దరు సర్వేపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్పాయింట్మెంట్ లభించిన వెంటనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వందని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు సర్వే మాత్రం తాను మళ్లీ మల్కాజ్గిరి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. రాహుల్ గాంధీ మంత్రివర్గంలో పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
వాచ్‌మన్ దారుణహత్య
హైదరాబాద్, న్యూస్‌లైన్ : శ్రీనగర్‌కాలనీలోని ఓ కళాశాలలో వాచ్‌మన్ దారుణహత్యకు గురయ్యాడు. గొంతుకోసి, తల పగులగొట్టి దుండగులు అతడిని అతికిరాతంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన మోతి రాజిరెడ్డి (55) శ్రీనగర్‌కాలనీ లోని నారాయణ కాలేజీలో పది నెలలుగా వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. రాజిరెడ్డికి ముగ్గురు కొడుకులున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనగర్‌కాలనీ ప్రధాన రహదారిలో నర్సింహారెడ్డి అనే వ్యక్తికి ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులో నా లుగు అంతస్తులు నారాయణ కాలేజీకి అద్దె కు ఇవ్వగా... 5వ అంతస్తులో ఇంటి యజమాని ఉంటున్నాడు. వాచ్‌మన్ రాజిరెడ్డి పగటిపూట సెల్లార్‌లోని ఓ గదిలో ఉంటూ.. రాత్రి కాలేజీ మొదటి అంతస్తులోని కార్యాలయంలో పడుకుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కళాశాల కార్యాలయంలో నిద్రపోయాడు. సో మవారం ఉదయం 7 గంటలకు స్వీపర్ రమాదేవి 2వ అంతస్తులోని క్లాస్‌రూంను ఊడ్చేందు కు వెళ్లగా రాజిరెడ్డి రక్తపు మడుగులో హత్యకు గురై ఉన్నాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే కిందకు వచ్చి ఆఫీస్ బాయ్ అమర్‌కు చెప్పింది. అతడి ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ రవిశంకర్ పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీసీపీ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళాశాల కార్యాలయంలోని రూ.48 వేలు, 2 కంప్యూటర్ సీపీయూలు, ప్రింటర్ మాయమైనట్టు గుర్తించారు. కాలేజీలోని నగదు, సీపీయూలు మాయం కావడం తో రాజిరెడ్డిని చంపి దొంగలు వాటిని తీసుకెళ్లారా ? లేక మరేదైనా కారణం ఉందా? మొద టి అంతస్తులో పడుకున్న రాజిరెడ్డి 2వ అంతస్తులోని క్లాస్ రూంలో ఎలా హత్యకు గురయ్యాడు అనే కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. భవన యజమాని కుమారుడు బాల్‌రెడ్డి నిత్యం మద్యం తాగివచ్చి వాచ్‌మన్ రాజిరెడ్డితో గొడవపడేవాడని తెలిసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే కళాశాలలో వాచ్మచ్గా పని చేసి మానేసిన కృష్ణతో పాటు కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ భీముడు, ఆఫీస్‌బాయ్ అమర్‌ను కూడా విచారిస్తున్నారు. తెలిసిన వారే వాచ్‌మన్‌ను హత్య చేశారని, రెం డు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు హత్యలో పాల్గొని ఉంటారని పోలీ సులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన : తన తండ్రి దారుణ హత్యకు గురైతే కళాశాల యాజమాన్యం వచ్చి కనీసం చూడలేదని, తమ కు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించడానికి వీలులేదని మృతుడి బంధువులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిం చారు. బాధితులు ప్రధాన రహదారిపై ఆందోళన చేయగా స్వల్పంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న తమ పై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదని రాజిరెడ్డి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
చివరి కోరిక తీరకుండానే..
మంథని రూరల్, న్యూస్‌లైన్ : మూడు దశాబ్దాల అజ్ఞాతవాసం తర్వాత వచ్చిన కొడుకు ఇక తనతోనే ఉంటాడని... కాటికి కాలుచాపిన తనకు ఆసరా అవుతాడని అనుకున్న ఆ తల్లి ఆశ నెరవేరలేదు. ఎప్పటికైనా రాకపోతాడా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని చూసీ... చూసీ... చివరకు కొడుకు రాకుండానే కన్నుమూసిందా మాతృమూర్తి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తల్లి రాధమ్మ(90) మంగళవారం చనిపోయింది. మంథని మండలం ఎగ్లాస్పూర్ పరిధి శాస్త్రులపల్లికి చెందిన రాజిరెడ్డి 1975లో అజ్ఞాతంలోకి వెళ్లినప్పటినుంచి ఏనాడూ తల్లిదండ్రులను చూసేందుకు రాలేదు. ఏనాటికైనా కొడుకు రాకపోతాడా? అని చెమ్మగిల్లిన కళ్లతో రాధమ్మ ఎదురుచూసేది. 2009లో ఓ సారి కేసు నిమిత్తం మంథని కోర్టుకు పోలీసులు రాజిరెడ్డిని తీసుకొచ్చినప్పుడు రాజిరెడ్డితో ఆమె మాట్లాడింది. అప్పటికే ఆయన తండ్రి మరణించగా... కనీసం ఇప్పటికైనా ఇంటికి రావాలని, ముసలితనంలోనైనా తనకు తోడుగా ఉండాలని తల్లి కోరింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని తల్లికి నచ్చజెప్పి వెళ్లిన రాజిరెడ్డి మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎదురుచూసీ చూసీ ఆశ నెరవేరకుండానే మంగళవారం ఆమె కన్నుమూసింది. తల్లిని కడసారి చూసుకునేందుకు రాజిరెడ్డి రావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడనే సమాచారం మాత్రం తెలియరాలేదు. ఉద్యమమే ఊపిరిగా భావించిన రాజిరెడ్డి తన తండ్రి మరణించినప్పుడు కూడా రాలేదని, తల్లి మరణవార్త తెలిసినా రాకపోవచ్చని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాధమ్మ అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు, రాజిరెడ్డి అభిమానులు వచ్చే అవకాశముందని పోలీసులు గ్రామంపై గట్టి నిఘా పెట్టినట్లు సమాచారం.