Rani Mukerji
-
మళ్లీ తెరపైకి శివానీ శివాజీ రాయ్
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన ‘మర్దానీ 3’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆమె లీడ్ రోల్లో ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మర్దానీ’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2014 ఆగస్టు 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాణీ ముఖర్జీ నటించారు.న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిలబడే పాత్రలో తనదైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. అంతేకాదు... కష్టాల్లో ఉన్న వారిని కాపాడటం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్లో అద్భుతంగా నటించి, మెప్పించారు. ‘మర్దానీ’కి సీక్వెల్‌గా రాణీ ముఖర్జీ లీడ్ రోల్లోనే ‘మర్దానీ 2’ సినిమా రూపొందింది.గోపీ పుత్రన్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘మర్దానీ’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్. మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా రాణీ ముఖర్జీ నటన చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అని మేకర్స్ పేర్కొన్నారు. -
ఇక నేను బిడ్డను కనలేను: రాణీ ముఖర్జీ
కడుపులో బిడ్డ పెరుగుతుందంటే కోటి ఆశలతో ఎదురు చూస్తుందా మహిళ. కానీ ఆ బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే కాలం చేసిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో! అలాంటి నరకవేదన అనుభవించింది రాణి ముఖర్జీ.. తనకు గర్భస్రావమైన విషయాన్ని గతేడాది వెల్లడించింది. తాజాగా మరోసారి ఆ బాధను గుర్తు చేసుకుంది నటి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా.. 'నా కూతురికి ఇప్పుడు ఎనిమిదేళ్లు. తనకు ఏడాది వయసు రాగానే మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను. దాదాపు ఏడేళ్లు ప్రయత్నించాము. 2020వ ఏడాది గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎన్నోనాళ్లు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయాను. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తుంది. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు. నేనిప్పుడు 46వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ వయసులో బిడ్డను కనలేను. కానీ నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లెనో ఇవ్వలేకపోయానన్న బాధ మాత్రం ఇప్పటికీ ఉంది. తనతో ఆడుకోవడానికి బిడ్డను ఇవ్వలేకపోయా అయినా ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అధీరా (రాణి కూతురు) నా బంగారు తల్లి. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటేశాను. కాబట్టి నాకు అధీరా ఒక్కరు చాలు' అని చెప్పుకొచ్చింది. కాగా రాణి ముఖర్జీ.. హలో బ్రదర్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై, చలో ఇష్క్ లడాయే, చోరీ చోరీ, ఎల్వోసీ: కార్గిల్, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి హిట్ చిత్రాల్లో నటించింది. చదవండి: అయ్యో శ్రీలీల.. అప్పుడేమో నెలకో సినిమా.. ఇప్పుడేమో ఇలా.. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్‌తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్‌తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్‌తో మరింత స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
5 నెలలకే నా రెండో బిడ్డను కోల్పోయా, ఎవరికీ తెలీదు: హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తన జీవితంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది. కోవిడ్ సమయంలో కడుపులో బిడ్డను పోగొట్టుకున్నానని వెల్లడించింది. మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో ఆమె ఈ విషాదవార్తను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. 'ఈ విషయాన్ని బయటకు చెప్పడం ఇదే మొదటిసారి. ఈ రోజుల్లో జీవితంలోని ప్రతి విషయాన్ని పబ్లిక్‌గా చెప్తుంటే సినిమా ప్రమోషన్స్కోసమేనని విమర్శలు చేస్తున్నారు. అందుకే నా సినిమా ప్రమోషన్స్ చేసేటప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి నేనెక్కువగా మాట్లాడను. కోవిడ్‌తో ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నప్పుడు నా జీవితంలో కూడా పెను విషాదం చోటు చేసుకుంది. 2020లో నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. దురదృష్టవశాత్తూ ఐదు నెలలకే బిడ్డను కోల్పోయాను. 2020 చివర్లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నా బిడ్డను కోల్పోయిన 10 రోజులకే నిర్మాత నిఖిల్ అద్వానీ నాకు ఫోన్ చేశాడు. డైరెక్టర్ చెప్పిన కథను నాకు వినిపించాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ ఏదైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడే దాని నుంచి బయటవేసేందుకు ఇలాంటి మంచి సినిమా ఆఫర్ వస్తుందేమో అనిపించింది. మొదట మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే కథ వినప్పుడు అంత నమ్మకం కుదరలేదు. నార్వేలాంటి దేశంలో ఒక భారతీయ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుందా? అనిపించింది' అని చెప్పుకొచ్చింది. కాగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం అనురూమ్, సాగరిక భట్టాచార్య దంపుతల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: జైలర్ రికార్డుల వేట మొదలైంది... తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? అడిగినా సాయం చేయలేదు.. సింధు మరణం తర్వాత కన్నీరు తెప్పించే ఘటన తెరపైకి -
కరోనా: వాయిదాపడ్డ బాలీవుడ్ చిత్రం
రానా నటించిన ‘హాథీ మేరే సాథీ’ (తెలుగులో ‘అరణ్య’గా ఈ చిత్రం నేడు విడుదలవుతోంది) సినిమా తర్వాత మరో బాలీవుడ్ మూవీ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ విడుదల వాయిదా పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్‌కు ఆడియన్స్ రారని, ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడుతుందని భావించిన యశ్ రాజ్ నిర్మాణసంస్థ ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ‘బంటి ఔర్ బబ్లీ 2’ సినిమా విడుదలను వాయిదా వేసింది. #BreakingNews: #BuntyAurBabli2 - which was scheduled to release in *cinemas* on 23 April 2021 - has been postponed... #YRF will announce the new release date later. #SaifAliKhan, #RaniMukerji, #SiddhantChaturvedi #Sharvari pic.twitter.com/nBsSw5swch — taran adarsh (@taran_adarsh) March 25, 2021 2005లో వచ్చిన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ తెరకెక్కింది. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేదీ, షార్వారీ ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు సల్మాన్ కానుక భర్త నగ్న ఫొటోను షేర్ చేసిన సన్నీ లియోన్ -
పరాయి దేశంతో పోరాడే వివాహిత కథ!
నార్వే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడనున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఎందుకంటే ‘మిస్ట్రస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా కోసం. మార్చి 21న రాణీ ముఖర్జీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఆషిమా చిబ్బర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇది ఓ మంచి హ్యూమన్ స్టోరీ. తన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ వివాహిత పరాయి దేశంతో పోరాడే కథ ఇది. ఈ సినిమా కథ బాగా నచ్చింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు, ఇటువంటి సినిమాను నా బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. ఇక రాణి తాజా చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’ వచ్చే నెల విడుదల కానుంది. పదిహేనేళ్ల క్రితం రూపొందిన ‘బంటీ ఔర్ బబ్లీ’కి ఇది సీక్వెల్. తొలి భాగంలోనూ రాణీ ముఖర్జీ నటించారు. చదవండి: ఈ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సివంగి -
నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తను కుటుంబ నేపథ్య ఆలోచనలు కలిగిన మహిళనని.. తాను ఎప్పుడు కుటుంబంతో గడపడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆరేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉండే తన భర్త ఆదిత్య చోప్రా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను రాణీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (ఒళ్లు గగుర్పొడిచేలా అనుష్క వెబ్ టీజర్..) ‘కరణ్ జోహార్ మాదిరిగా ఆదిత్య సామాజిక వ్యక్తి అయివుంటే.. నేను ఎప్పటికీ ఆయనను ప్రేమించేదాన్ని కాదు. ఆదిత్య తన వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు ప్రైవేటుగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. తను పెద్ద నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. తన పర్సనల్ లైఫ్‌ను కానీ.. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆదిత్య, కరణ్ జోహర్లా ప్రతి విషయాన్ని బహిరంగపరిస్తే నేను ఆయనను ఇష్టపడే దాన్ని కాదేమో. కరణ్ మీడియా ఫ్రెండ్లీ పర్సన్. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తుంటారు. అంతేగాక పార్టీ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నేనెప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటాను. అలాగే ఆదిత్య కూడా. షూటింగ్ అయిపోయాక సరాసరి ఆయన ఇంటికే వచ్చేస్తారు’’ అని రాణీముఖర్జీ తెలిపారు. ('షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?) కాగా నిర్మాత కరణ్ జోహార్ తరచూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకోవడంతలో ఏమాత్రం మొహమాటం చూపించరు. నిరంతరం తన పిల్లలు ఫొటోలను, కుటుంబానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. -
లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం
నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి. కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం రిలీజ్ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు. -
‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’
ప్రపంచంలోని ఏ దేశం కూడా మహిళలకు, యువతులకు సురక్షితం కాదనేది సాధారణంగా తెలిసిన విషయమేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనేలా.. నైపుణ్యాలు పెంపొందించుకునేలా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాణి ముఖర్జీ తాజాగా నటిస్తున్న చిత్రం మార్దానీ-2. ఇటీవల విడుదలైన సినిమా ఈ ట్రైలర్లో యువతులపై జరిగే భయనక లైంగిక దాడులు ఉండటంతో ఈ చిత్రం వివాదస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ-2’ మహిళలకు, యువతులకు అవగాహన కల్పించేలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కనిపించే సంఘటనలను గుడ్డిగా వ్యతిరేకించకుండా అలాంటి దాడులు నిజంగానే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులుగా తమ కూతురు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు.. అదే క్రమంలో వారికి భద్రత కూడా కల్పించాలని రాణి ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా మహిళలపై 2000లకు పైగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులోనూ ఎక్కువగా 18 ఏళ్ల వయసున్న యువకులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో తమ అధికారిక రికార్డులలో పేర్కొంది. వాటి ఆధారంగానే ‘మర్దానీ-2’ తెరకెక్కించాం. మేము తీసేది భారతీయ సినిమా కాబట్టి భారత్‌లో జరిగే లైంగిక దాడులనే ప్రధానంగా తీసుకుని సినిమా చేశాం’ అని రాణి చెప్పుకొచ్చారు. ‘యువతను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించడమే మర్దానీ సారాంశం. ఆపద అనేది ఇంటి తలుపు తట్టి రాదు.. అది మన పక్కనే ఉంటుంది. అయితే అది గ్రహించి అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడమే సినిమా ఉద్దేశం. అయితే ఇది పూర్తిగా నేరాలను అరికట్టకపోవచ్చు కానీ కొంతమేర యువతులను మాత్రం అప్రమత్తం చేయగలదని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. కాగా 2014లో వచ్చిన ‘మర్దానీ’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి ముఖర్జీ క్రైం పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. (చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: ఓం బిర్లా) -
ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్ అభ్యంతరం!
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్‌లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ... సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014లో బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్‌గా మార్దానీ-2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి తన నటనా విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అయితే పాశవిక అత్యాచారాలే ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో పదే పదే కోటా పేరును ప్రస్తావిస్తాంచడం నిరసనకు కారణమైంది. కాగా మార్దానీ-2 ను డిసెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.(మర్దానీ 2 ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..) -
ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..
దేశంలో 2000కు పైగా అత్యాచారాలు చేస్తున్నది 18 ఏళ్ల లోపు వయసున్నవారే. ఇది రికార్డుల్లో నమోదైన లెక్కలు. మరి రికార్డులకు అందనివి ఇంకెన్ని ఉంటాయి? మానవ మృగాలు ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి భయానక ఘటనలతో మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగడం మాట అటుంచితే, కనీసం పట్టపగలు కూడా గడప దాటాలంటే జంకుతున్నారు. నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. 2014లో విజయాన్ని సొంతం చేసుకున్న మర్దానీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో నిండి ఉంది. ఇందులోని ప్రతీ సీన్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్న వ్యక్తి... మృతదేహాలకు రాణీ ముఖర్జీ మాస్క్‌లు పెట్టి ఆమెకు సవాల్ విసురుతాడు. అతన్ని పట్టుకోడానికి రాణీ ఏం చేసింది? ఆ దారుణాలను ఎలా అరికట్టింది? అనేది సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇందులో రాణీ ముఖర్జీ ఒక నటిగా కాకుండా ఆడపిల్లలను వేధించేవాళ్ల భరతం పట్టే స్త్రీ శక్తిగా దర్శనమిస్తుంది. ఈ సినిమాతో రాణీముఖర్జీ స్థాయి రెట్టింపు అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాణీ ముఖర్జీ ఉగ్రరూపాన్ని చూసిన నెటిజన్లు ఈ యేడాదిలోనే బెస్ట్ ట్రైలర్ అని కొనియాడుతున్నారు. -
అయిగిరి నందిని నందిత మేదిని
చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ ఆ గెలుపు వెనుక ఉండే శక్తి.. స్త్రీ!దేశమంతా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకో అలంకారాలతో స్త్రీ శక్తిని కొలుస్తూ ఉన్న ఈ సమయంలో.. సరిగ్గా నవరాత్రులు ఆరంభమైన 29వ తేదీన బాలీవుడ్ ఒక శక్తిని టీజర్ ద్వారా సాక్షాత్కరింపజేసింది! ఆ శక్తి.. రాణీ ముఖర్జీ.ఆ సినిమా.. మర్దానీ 2. ఆ టీజర్.. ‘అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే..’ స్తోత్రానికి సరిగ్గా సరిపోయే దృశ్యరూపం. 38 సెకన్ల ఆ టీజర్లో పోలీస్ ఆఫీసర్ రాణీ ముఖర్జీ బెల్టు తీసి బాదిపడేసే సన్నివేశం చూస్తే ఈవిల్ డెడ్డే..! చెడు చచ్చిందే.శివానీ శివాజీ రాయ్ ఆమె పేరు. అమ్మాయిల్ని వెంటాడేవాళ్ల మోకాళ్లలో బులెట్లు దింపుతుంది.అమ్మాయిల్ని వేటాడే కళ్లను వేళ్లతో పైకి పెకిలిస్తుంది. ఇంత కోపం ఏంటి! ఇంత నిర్దయ ఏంటి! ఇంత క్రౌర్యం ఏంటి! దేవుడంటే కూడా భయం లేదా! భయమా?! దుర్గామాతకు భయం ఉంటుందా?! టీజర్ ఎలా మొదలైందో చూడండి. పోలీస్ ఆఫీసర్స్ టీమ్ గన్స్‌తో అలర్ట్ అయింది. ఎవర్నో షూట్ చేయాలి. ఎవర్నో కాదు. అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా వెనుక ఉన్న దుష్టశక్తిని. ఎవరా దుష్టశక్తి! ఒకడే ఉంటాడా? మాఫియా లీడర్, పొలిటికల్ లీడర్, డిపార్ట్మెంట్లోనే ఒక పోలీస్ లీడర్.. అందరూ కలిసిన దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని వెంటాడుతూ ఎన్‌కౌంటర్‌కు సిద్ధమైంది దుర్గా శక్తి.ముందు టీమ్. వెనుకే రాణీ ముఖర్జీ.‘‘ఇప్పుడు తాకండ్రా ఒక్క అమ్మాయినైనా’’..!ఆమె ఆగేట్లు లేదు.‘‘ఒంటికి ఒంటిని తాకిచ్చారు కదా. ఇప్పుడు నేను తాకిస్తా మీ ఒంటికి నా ఒంటిని. ఎలా ఉంటుందో చూద్దురు. చెప్పుకోడానికి కూడా మీకు మీ వయసెంతో గుర్తుకు రాదు’’ ఆమె ఆగేట్లు లేదు. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. నడుముకు ఉన్న తోలు బెల్టుతో తోలు తీస్తోంది. వాడిలో కదలిక ఉందో చచ్చిందో తెలీదు. రాణీ ముఖర్జీలోని ల్టు మాత్రం కదులుతూనే ఉంది.టీజర్ ఎండ్. సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అవుతోంది. 2014లో వచ్చిన వణుకు పుట్టించే (నేరస్తులకు లెండి) యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ’కి ఇది సీక్వెల్. ‘మార్దానీ 2’. రాణీ ముఖర్జీ అందులోనూ పోలీస్ ఆఫీసరే, ఇందులోనూ పోలీస్ ఆఫీసరే. అందులో ట్రాఫికింగ్, డ్రగ్స్ మీద.. ఇందులో అమ్మాయిల మీద చెయ్యేసిన వాళ్ల మీద. కన్నేసిన వాళ్ల మీద. మర్దానీ అంటే ‘మగతనం’ అని అర్థం. నిజంగా మగతనం ఉన్న మగాడెవడూ ఆడపిల్లల్ని అల్లరి పెట్టడు. అమ్మాయిల్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడు. రాణీ ముఖర్జీలో కనిపించే మర్దానీ అలాంటి మగాళ్లకొక సమాధానం. ఒక సవాల్. టీజర్లో రాణీ మాటలు వినిపించవు. యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో రాణి 21 ఏళ్ల విలన్‌తో తలపడుతుంది. ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’ సంస్థ దీనిని నిర్మిస్తోంది.పోకిరీలకు భయం ఉండాలంటే.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఒక మహిషాసుర మర్దిని ఉండాలి. -
స్క్రీన్ టెస్ట్
హీరోయిన్ అంటే తెరపై కనిపించడం వరకే అనే రోజులు మొదటి తరంలోనే లేవు. తెరపై రాణించడంతో పాటు తెర వెనక కూడా సాంకేతిక నిపుణులుగా సత్తా చాటిన, చాటుతున్న నాయికలు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రతిభావంతుల గురించి స్పెషల్ క్విజ్. 1. తెలుగు చలన చిత్రరంగంలో మొదటితరం సూపర్‌స్టార్ ఈమె. సినిమాకి సంబంధించిన అనేక శాఖల్లో ఈమెకు టాలెంట్ ఉండటం వల్ల ‘అష్టావధాని’ అనేవారు. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఈ ప్రముఖ నటి ఎవరు? ఎ) సావిత్రి బి) భానుమతి సి) వాణిశ్రీ డి) జమున 2. 1990లలో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న నటి ఆమె. తెలుగులో హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్నారామె. ఎవరా నటి? ఎ) రాధిక బి) ఖుష్బూ సి) విజయశాంతి డి) రాధ 3. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘సింధుభైరవి’కి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఆ చిత్రకథానాయిక ఎవరు? (చిన్న క్లూ: కథానాయిక కాకముందు ఆమె కెమెరా శాఖలో చేశారు) ఎ) సుహాసిని బి) సుమలత సి) ఆమని డి) సరిత 4. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకు చిరునామాగా మారారు అనుష్క. కానీ ఈమె తన మొదటి సినిమాలో కిలాడి లేడీగా నటించారు. అనుష్కను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) త్రివిక్రమ్ శ్రీనివాస్ సి) పూరి జగన్నాథ్ డి) శ్రీను వైట్ల 5. తమిళ నటుడు ‘శివాజీ గణేశన్’ని డైరెక్ట్ చేసిన నటీమణులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సావిత్రి. మరో దర్శకురాలు ఎవరో కనుక్కోండి? ఎ) సుజాత బి) కన్నాంబ సి) భానుమతి డి) విజయనిర్మల 6. ఆమె అసలు పేరు సరస్వతి. మూడు సార్లు నేషనల్ అవార్డు పొందారు. ఆ నటి పేరేంటి? (ఆమె తెలుగులో ఎంత పాపులరో మలయాళంలో కూడా అంతే పాపులర్) ఎ) శారద బి) కాంచన సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి 7. జపాన్, జర్మన్, ఇంగ్లీషు భాషల్లోని పాటలతో పాటు మొత్తం 17 భాషల్లో తన గళాన్ని వినిపించారు ఈమె. వేల పాటలు పాడిన ఆ ప్రముఖ సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) వాణీ జయరాం బి) పి.సుశీల సి) చిత్ర డి) ఎస్. జానకి 8. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారీమె. ఆ తర్వాత కథానాయికగా కూడా రాణించారు. ‘సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన ఆ అందాల సుందరి ఎవరు? ఎ) సుస్మితా సేన్ బి) ప్రియాంకా చోప్రా సి) దియా మీర్జా డి) మాధురీ ధీక్షిత్ 9. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ కళాకారిణి ఎవరు? ఎ) కస్తూరి బి) శ్రీరెడ్డి సి) చిన్మయి డి) కల్పన 10. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా 7 సంవత్సరాలు పని చేశారీమె. 2010లో ‘ద్రోహి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విజయం సాధించారు. ఎవరా దర్శకురాలు? ఎ) సుధా కొంగర బి) నందినీ రెడ్డి సి) అంజనా డి) చునియా 11. నెల్లూరులో పుట్టిన ఈ నటి పేరు రత్నకుమారి. 1966లో నటి జమున పక్కన చిన్న చెలికత్తె వేషంలో నటించారీమె. తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఆమెవరో తెలుసా? ఎ) జయంతి బి) శారద సి) వాణీశ్రీ డి) ‘షావుకారు’ జానకి 12. 1994లో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘బాండిట్ క్వీన్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన అస్సామీ నటి పేరేంటి? ఎ) సీమా బిస్వాస్ బి) ఆషిమాల్లా సి) పాంచీ బోరా డి) నేహా జుల్కా 13. శివాజీగణేశన్‌తో 17 సినిమాలు, యన్టీఆర్ కాంబినేషన్లో 12 చిత్రాలు, అక్కినేనితో 8 చిత్రాల్లో నటించిన ఈ ప్రముఖ హీరోయిన్ ఎవరో కనుక్కోండి ? ( క్లూ: 2016లో ఆమె మరణించారు) ఎ) అంజలీదేవి బి) సావిత్రి సి) కృష్ణకుమారి డి) జయలలిత 14. ఇద్దరు టీవీ యాంకర్లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, దర్శకుడు దాసరి నారాయణరావు ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమా తీశారు. అందులో హీరోగా చేసింది అప్పటి యాంకర్, ఇప్పటి ఫిల్మ్ డైరెక్టర్ వక్కంతం వంశీ. మరి ఈ హీరోయిన్ ఎవరు? ఎ) సుమ బి) ఝాన్సీ సి) ఉదయభాను డి) శిల్పా చక్రవర్తి 15. తమిళంలో కె.బాలచందర్, తెలుగులో కె.రాఘవేంద్రరావు ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు. ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్. ఆమె పేరేంటి? ఎ) శ్రీదేవి బి) జయప్రద సి) రేఖ డి) హేమమాలిని 16. మలయాళీ బ్యూటీ విద్యాబాలన్ బాలీవుడ్లో హోమ్లీ క్యారెక్టర్స్‌తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్స్ క్వీన్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’లో హాట్‌గా కనిపించారు. ఇంతకీ ఆ ఐటెమ్ క్వీన్ ఎవరో తెలుసా? ఎ) జయమాలిని బి) సిల్క్ స్మిత సి) అనూరాధ డి) జ్యోతిలక్ష్మీ 17. 13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావత్’ కథను అద్భుతంగా చూపించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ. పద్మావతిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) అలియా భట్ సి) దీపికా పదుకొనే డి) ప్రియాంకా చోప్రా 18. తెలుగు ప్రేక్షకులకు ‘దేవదాసు’ అనగానే అక్కినేని, సావిత్రి గుర్తుకొస్తారు. అదే పేరుతో బాలీవుడ్లో 2002లో షారుక్ ఖాన్ ఓ సినిమా చేశారు. అందులో దేవ్‌గా షారుఖ్ ఖాన్ నటించారు. మరి పార్వతిగా నటించింది ఎవరో కనుక్కోండి? ఎ) కాజోల్ బి) రాణీ ముఖర్జీ సి) ప్రీతీ జింటా డి) ఐశ్వర్యా రాయ్ 19. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో దీపికా పదుకొనే లాంటి స్టార్ బాలీవుడ్‌కు లభించారు. ఆమెను ఆ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకురాలెవరు? ఎ) దీపామెహతా బి) ఫరాఖాన్ సి) జోయాఅక్తర్ డి) కొంకణాసేన్ శర్మ 20. ‘మిత్ర్.. మైఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దక్షిణ భారత నటి ఎవరో తెలుసా? ఎ) రేవతి బి) భానుప్రియ సి) శ్రీప్రియ డి) గౌతమి సమాధానాలు 1) (బి) 2) (సి) 3) (ఎ) 4) (సి) 5) (డి) 6) (ఎ) 7) (డి) 8) (ఎ) 9) (సి) 10) (ఎ) 11) (సి) 12) (ఎ) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (డి) 19) (బి) 20) (ఎ) మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! నిర్వహణ: శివ మల్లాల -
‘ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు’
‘నా అంతరాత్మ క్షోభిస్తోంది. ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు. బాధితులే మారాలి గానీ, కారకులకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాలనుకుంటున్నారా ఏంటి రాణీ గారు!’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పిందే సరైంది అనుకుంటే...నాలుగు నెలల పాపాయి తనపై అకత్యానికి పాల్పడే వ్యక్తిని ఎలా అడ్డుకోగలదు అని ఆమెను విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అనుష్క శర్మ , అలియా భట్, రాణి ముఖర్జీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోన్న ‘మీటూ’ ఉద్యమం గురించి వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దీపికా, అనుష్కలు మాట్లాడుతూ ఇంటి తర్వాత మహిళలకు అత్యంత సురక్షితంగా భావించాల్సిన ప్రదేశం పని ప్రదేశమే కాబట్టి వారికి అక్కడ రక్షణ ఉండాలని పేర్కొన్నారు. కాగా వీరి వ్యాఖ్యలకు స్పందించిన రాణీ ముఖర్జీ..‘ మహిళలు స్వతహాగా బలవంతులుగా ఉండాలి. వేధింపులు ఎదురైనపుడు, అకృత్యాలు జరిగినపుడు వాటిని అడ్డుకునే ధైర్యవంతులై ఉండాలి. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అప్పుడే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో... ‘ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ కలిగి ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పారు.. ఇందుకు బదులు ప్రతీ తల్లి తన కొడుకును సత్ప్రవర్తనతో పెంచాలని మీకు అనిపించడం లేదా... మీరు జోక్ చేయట్లేదు కదా! పసికందులు ఎన్ని విద్యలు నేర్చుకున్నా మీరు చెప్పినట్లు జరిగే అవకాశమే లేదు’ అని రాణీని విమర్శిస్తున్నారు. ఇక.. రాణీముఖర్జీ బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా భార్య అన్న సంగతి తెలిసిందే. I'm cringing my soul out! Rani's take on #Metoo is the worst thing I have ever heard, she's basically saying that the victims should change but not the other way around. Annoying as fuck that she didn't let Anu & Deepika talk... #RaniMukerji pic.twitter.com/du5ieVYhW1 — ♡ (@bollypardesi) December 30, 2018 #RaniMukerji was never relevant enough to be cancelled but seeing what she had to say abt #Metoo movement is truly appalling. The woman who has the biggest production house behind her rich entitled ass saying women should behave themselves? You've got to be kidding me!!! pic.twitter.com/RSN6jC5QNX — ً (@srkkajol_) December 29, 2018 -
సల్మాన్.. షారూఖ్‌లు వియ్యంకులైతే..!
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు ఇటీవల పాత పగలను పక్కన పెట్టి కలిసి మెలిసి కనిపిస్తున్నారు. ఒకరి సినిమాలో ఒకరు అతిథి పాత్రలు చేస్తూ సాయం చేసుకుంటున్నారు. తాజా ఈ ఇద్దరి గురించి నటి రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. షారూఖ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దస్ కా ధమ్ కార్యక్రమ గ్రాండ్ ఫినేలుకు సల్మాన్ రాణీ ముఖర్జీలు గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ సల్మాన్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్‌ని ఉద్దేశించి ‘నువ్వు పెళ్లి చేసుకోకపోయినా.. కూతుర్ని మాత్రం కను. షారూఖ్ కొడుకు అబ్‌రామ్‌కు సల్మాన్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే చూడాలిని ఉంది’ అన్నారు. అంతేకాదు ‘నేను సల్మాన్ షారూఖ్‌లు ఇద్దరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాను. వీరిలో షారూఖ్ ప్రేమగా స్వీట్‌గా ఉంటే.. సల్మాన్ప్రేమ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంద’న్నారు. -
మనిషిగా ఉండటం గొప్ప
‘ఉద్యోగ సంతృప్తి’ని పొందేవారు నిజంగా అదృష్టవంతులు. చేస్తున్న పనిలో అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తారు వాళ్లు. కొందరికి ఏ ఉద్యోగమూ సంతృప్తినివ్వదు. వాళ్లను దురదృష్టవంతులు అనలేం కానీ, స్థిరంగా ఒక చోట ఉండలేరు వాళ్లు. మారడంలోనే వాళ్లకు జాబ్ శాటిస్ఫ్యాక్షన్! ప్రపంచంలో ఎక్కడైనా ప్రధానంగా ఈ రెండు రకాల ఉద్యోగులే ఉంటారు. అయితే రాణీ ముఖర్జీ మాత్రం తను తనకిష్టమైన జాబ్ చెయ్యడానికే పుట్టానని అంటున్నారు. ఆమెకు ఇష్టమైన జాబ్.. యాక్టింగ్. ఆ విషయం రాణీ ముఖర్జీకి 24వ యేట తెలిసిందట. 2002లో మణిరత్నం చిత్రం ‘సాథియా’ షూటింగ్లో తనకు ఈ ఫీలింగ్ కలిగిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆ తర్వాత రాణీ చాలా సినిమాలు చేశారు. అవన్నీ సూపర్‌హిట్ కాకపోయినా, అన్నిట్లోనూ రాణీ యాక్షన్ హిట్టు, సూపర్‌హిట్టే. అంతలా ఆమె తన ప్రొఫెషన్ని ప్రేమించారు. రాణి లేటెస్ట్ చిత్రం ‘హిచ్కీ’.. ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. అంతకుముందు ‘మర్దానీ’లోనూ ఆమెది మర్చిపోలేని యాక్టింగ్. అయితే నటిగా ఇంత పేరు వచ్చినా.. రాణీ మాత్రం ఒక మనిషిగానే గుర్తింపును కోరుకుంటున్నారట! ముందు మనిషిగా ఉండటం గొప్ప. ఆ తర్వాతే మిగతా గొప్పలు అని ఆమె అంటున్నారు. ‘నటన కోసమే నేను పుట్టాను’ అని ఆమె అనడంలోనే మనిషిగా ఆమె ఔన్నత్యం తెలుస్తోంది. వృత్తిని ప్రేమించేవారు, వృత్తిని ఆరాధించేవారు.. వారి హోదా చిన్నదైనా, పెద్దదైనా వాళ్లంతా గొప్పవాళ్లే. -
పెళ్లయితే సినిమా హిట్ కాకూడదా?
సాక్షి, ముంబై : పెళ్లయి తర్వాత గ్యాప్ తీసుకుంటున్న హీరోయిన్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత తిరిగి ‘హిచ్కీ’తో రీఎంట్రీ ఇచ్చిన రాణీ ముఖర్జీ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. మొదటి రోజు ఆ చిత్రం రూ. 3కోట్ల 30లక్షలు వసూలు చేసి.. ఈ మధ్య రిలీజ్ వచ్చిన లేడీ ఓరియంటల్ చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో టాప్ స్థానంలో నిలిచింది. అయితే పెళ్లయితే వాళ్ల సినిమాలు హిట్ కాకూడదా? అని రాణీ ముఖర్జీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ‘ఓ సినిమా విజయవంతం కావటానికి కావాల్సింది మంచి కథ, నటీనటుల ఫెర్ ఫార్మెన్స్. అంతేగానీ అందులో నటించేవారికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతానా? అన్న అనుమానాల మధ్యే నటించటం మొదలుపెట్టాను. కానీ, నటనే నా జీవితం అన్న విషయం నాకు ఈ చిత్రం మళ్లీ గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా కూతురు అదిరాను చూసుకుంటూనే.. ఇకపై నటనలోనూ కొనసాగుతా. ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు. టూరెట్ సిండ్రోమ్‌తో బాధపడే ఓ మహిళ, టీచర్‌గా మారి వీధి బాలల బతుకులను మార్చాలని యత్నించటం... ఆ క్రమంలో అందరితో ఆమె అవమానాలు ఎదుర్కోవటం...ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధించటం అనే కథాంశంతో హిచ్కిని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించాడు. Heroine-centric movies and Day 1 biz... Note: Diverse genres... Varying screen count... India biz...#Hichki Day 1: ₹ 3.30 cr#TumhariSulu Day 1: ₹ 2.87 cr#Mom Day 1: ₹ 2.90 cr#Simran Day 1: ₹ 2.77 cr#BegumJaan Day 1: ₹ 3.94 cr — taran adarsh (@taran_adarsh) 24 March 2018 -
నేటితో 'బ్లాక్' బ్యూటీకి 40
బాలీవుడ్ 'బ్లాక్' బ్యూటీ రాణీ ముఖర్జీ జన్మదినం నేడు. నేటితో ఈ భామకు 40ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఒక లేఖను విడుదల చేశారు రాణీ. '40ఏళ్లు.. అని తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. ఈ 40ఏళ్లలో, 22ఏళ్లు బాలీవుడ్లోనే గడిచిపోయాయి. ఇక్కడ ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నాతో పనిచేసిన చిత్ర నిర్మాతలకు, నన్ను నమ్మి సమాజ నియమాలను సవాలు చేసే పాత్రలను నాకు ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానలకు ధన్యవాదాలు. నటీనటులకు సమాజం, మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపే కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. అదృష్టవశాత్తు అలాంటి అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదం వల్లే. నేను పుట్టిందే నటించడం కోసం అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అయినా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోగలిగాననే భావిస్తున్నాను. ఒక విషయమైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం చాలా కష్టమైన అంశం. ఆడవారికైతే మరీ కష్టం. ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది.ఇక పెళ్లయిన హీరోయిన్ల సంగతి చెప్పనవసరం లేదు. తల్లిగా మారాక స్త్రీలు తమ ఆశలను, కలలను, కోరికలను చంపుకోవాల్సిందే. ఇక్కడ స్త్రీ ప్రధానంగా వచ్చే చిత్రాలు విజయవంతమవ్వడం చాలా కష్టం. ఈ వివక్షలను దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మేము ప్రతీరోజూ పోరాడుతూనే ఉంటాము. పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మా రూపాన్ని, గాత్రాన్ని, నటనను, నాట్యాన్ని, ఎత్తును బట్టి మమ్మల్ని ప్రతిరోజు నిర్ణయిస్తారు. వీటన్నిటిని దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకుంటాము. నేను నా స్నేహితుల నుంచి అనేక విషయాలను నేర్చుకుంటాను' అంటూ ముగించారు. లాంగ్ గ్యాప్ తరువాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హిచ్కీ’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జీరో సినిమాలోనూ రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. -
పారితోషికంపై నటి భిన్న స్పందన
ముంబై : సినీ ఇండస్ట్రీలో హీరోల కన్నా హీరోయిన్ల పారితోషికం తక్కువన్న విషయం తెలిసిందే. ఇందుకు బాలీవుడ్ మినహాయింపేమీ కాదు. సోనమ్ కపూర్ నుంచి ప్రియాంక చోప్రా వరకూ ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులో మార్పు వస్తోంది. అందుకు నిదర్శనం 'పద్మావత్' సినిమానే. ఈ సినిమాలో రాణి పద్మావతిగా నటించిన దీపికా పదుకొనే తీసుకున్న పారితోషికం రణవీర్ సింగ్, షాహీద్ కపూర్ కన్నా అధికం. ఆ సంగతలా ఉంచితే హీరోయిన్ల తక్కువ పారితోషికం విషయంపై... రాణి ముఖర్జిని అడిగితే ఆమె భిన్నంగా స్పందించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పనికే ప్రాధన్యత ఇస్తానని తెలిపారు. తానెప్పుడు పనిచేయడం గురించే ఆలోచిస్తానని, ఆర్థిక వ్యవహారాలన్ని తన తల్లిదండ్రులే చూసుకుంటారని తెలిపారు. 'ఈ మధ్యకాలంలో నటించడం రానివాళ్లు కూడా పారితోషికం గురించి మాట్లాడుతున్నారు. మనం చేసే పనికి సంబంధించి మెళకువలు నేర్చుకుంటే డబ్బు దానంతట అదే వస్తుంది' అన్నారు. నటులు ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాణిముఖర్జి 'హిచ్కి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె 'టౌరెట్ సిండ్రోమ్' తో బాధపడే ఉపాధ్యాయురాలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది. -
నా భర్తను ప్రతిరోజూ తిడతాను..
సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది. పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్క్క్’ అంటూ వింత శబ్దం చేసే ఓ స్కూల్ టీచర్ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్‌లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది. ‘ముఝ్సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది. -
హిచ్కీ టీచర్.. రాణి ఈజ్ బ్యాక్!
‘‘నాకు తెలిసి మాట్లాడడంలో ఇబ్బంది పడేవారు టీచర్లు అయినట్టు ఎక్కడా లేదు’’ అంటాడు ప్రిన్సిపాల్, తమ స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం వచ్చిన హీరోయిన్‌తో! ‘‘కానీ నాకు టీచర్ అవ్వాలన్నదే డ్రీమ్’’ అంటుంది హీరోయిన్. హీరోయిన్కేమో మాట్లాడడం సరిగ్గా రాదు. మాట్లాడలేదు. టోరెట్ సిండ్రోమ్ ఆమెకు. నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి ఒక టీచర్ పాఠాలు చెప్తే విద్యార్థులు ఎలా ఉంటారు? అసలు ఆమె మాటను పట్టించుకుంటారా? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఈ కథతో హిచ్కి (ఎక్కిళ్లు అని..) అనే ఓ సినిమా వస్తోంది. ఆ హీరోయిన్ పాత్రలో కనిపిస్తోంది ఎవరో కాదు.. మన రాణి ముఖర్జీ. కెరీర్ రెండో దశలో థ్రిల్లర్స్‌తో మెప్పించిన ఆమె, కూతురు పుట్టాక సినిమాలకు దూరమయింది. ఇక ఇప్పుడు మళ్లీ అన్నీ సెట్ చేస్కొని, ఒక కొత్త కథాంశంతో హిచ్కీ అంటూ వచ్చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకుడు. నటనలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న రాణి, ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ, ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 23, 2018న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే
ముంబై: హీరో, హీరోయిన్ల పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు ఓపెన్ చేయడం, అందులో వారి విషయాలు, ఫొటోలను పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. ఈ తర్వాత సంబంధిత నటులు ఈ విషయం తెలుసుకుని స్పందించారు. అవి నకిలీ ఎకౌంట్లను, తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రాణి ముఖర్జీ ముద్దుల తనయ అడిరా ఫొటో ఇంటర్నెట్లో చక్కర్లుకొట్టడంతో ఆమె తరఫున ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశాడు. రాణి ముఖర్జీకి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ఎకౌంట్ లేదని తెలియజేశాడు. ఇక మీదట కూడా ఉండబోదని చెప్పాడు. సోషల్ మీడియాలో రాణి ముఖర్జీ పేరు మీద నకిలీ ఎకౌంట్లు చాలా ఉన్నాయని ఆమె ప్రతినిధి వెల్లడించారు. అభిమానులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని, రాణి పేరు మీదున్న ఎకౌంట్లను ఫాలోకావద్దని, వాటిలో పోస్ట్ చేసే వివరాలు నిజంకాదని చెప్పాడు. 2014లో రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను ఇటలీలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది డిసెంబర్లో ఓ పాప జన్మించింది. -
ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది!
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టి అగ్రతారగా ఎదిగింది ఐశ్వర్యరాయ్ బచ్చన్. హిందీలో టాప్ హీరోలు అందరి సరసన నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాల్లో చాలా చిత్రాలు ఘన విజయం సాధించాయి. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి బిజీ అయిపోయిన ఐష్ డైరీ ఖాళీలేక వదిలిలేసిన సినిమాలు కూడా సక్సెస్ కావడం విశేషం. కుచ్ కుచ్ హోతా(1998) సినిమాలో రాణిముఖర్జి పాత్రకు మొదట ఐష్ ను అడిగారు. అయితే డేట్స్ ఖాళీలేకపోవడంతో ఈ అవకాశం వదులుకుంది. 'దోస్తానా' సినిమాలో ప్రియాంక చోప్రా చేయాల్సి పాత్ర ముందుగా ఐశ్వర్యరాయ్ కే దక్కింది. బిజీగా ఉండడంతో ఈ అవకాశం కూడా ఐష్ వదులుకుంది. హీరోయిన్, భూల్ భులైయా, వీర్ జారా సినిమాల్లో కూడా ఆమె నటించాల్సినవే. 'చల్తే చల్తే' సినిమా షూటింగ్ లో షారూఖ్ ఖాన్ తో సల్మాన్ ఖాన్ గొడవ చేయడంతో ఐశ్వర్యరాయ్ స్థానంలో రాణిముఖర్జిని తీసుకున్నారు. మిస్ ఇండియాగా ఎంపికైనప్పుడే బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయడానికి రెడీ అయింది. 'రాజా హిందూస్తానీ'లో ఆమిర్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. అయితే మిస్ వరల్డ్ పోటీలు ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. కాగా, ఐష్ వదిలేసిన సినిమాల్లో నటించిన రాణిముఖర్జి స్టార్ గా ఎదిగించింది. ఈ విషయంలో ఐష్ కు రాణి థ్యాంక్స్ చెప్పుకోవాలి. -
పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ
ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాణీ ముఖర్జీ. కొన్ని నెలల కిందట ఆమె అమ్మగా ప్రమోట్ అయ్యాక ఎంతో సంతోషంగా ఉంది. 2014 ఏప్రిల్‌లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. వారి పాపకు భర్త, తన పేరు లింక్ అయ్యేలా 'ఆదిరా' అని పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చోప్రా కుటుంబం కొన్ని నెలలు పారిస్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో హాలీడ్ ట్రిప్ తో పాటు గెట్ టుగెదర్ లా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఆదిరా చేరని తర్వాత ఎక్కడికి వెళ్లడానికి తీరక దొరకలేదని, ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రియురాలు నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రాణి ముఖర్జీ తన కూతురు అదిరా, తల్లి పమేలాతో కలిసి పారిస్ లో కొన్ని రోజులు జాలీగా గడపనుంది. రాణి తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ట్రిప్ లో జాయిన్ అవుతారని కథనాలు వస్తున్నాయి. ఆదిత్యా చోప్రా 'బేఫికర్' మూవీ తీస్తున్నాడు. రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారిస్ లో 6 బెడ్ రూమ్స్ ఉన్న ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారట. కుటుంబసభ్యులతో పాటు ఇంటి పనివాళ్లను కూడా యూరప్ ట్రిప్ భాగ్యం కలిగించారు. వంటవాళ్లు, ఓ ఆయాను కూడా తమవెంట తీసుకెళ్లారు.