Ranveer sing
-
Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్. నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి -
పుష్ప2 మూవీను మలుపు తిప్పనున్న రణవీర్ సింగ్
-
2022 Year End: బాయ్‌కాట్ బాలీవుడ్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..!
ప్రతిరంగంలో వివాదాలు, గొడవలు సర్వ సాధారణం. కానీ సినీ పరిశ్రమలో అవి మరింత ఎక్కువ. బాలీవుడ్లో అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏకంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అనే నినాదం ఊపందుకునేలా వివాదాలు తలెత్తాయి. 2022లో వివాదాలకు దారితీసిన ఆ చిత్రాలు, సంఘటనలేవో ఓ లుక్కేద్దాం. ఓ మ్యాగజైన్ కవర్‌పై రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో, సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ ఫోటో 2022లో అతిపెద్ద వివాదాలుగా నిలిచాయి. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు రావడం హాట్ టాపిక్‌గా మారింది. అలాదే అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ హిందీ భాషపై వివాదం ఇలా చాలానే ఉన్నాయి. రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోకు పోజులివ్వడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై పోలీసు ఫిర్యాదులు కూడా చేశారు. కొంతమంది బాలీవుడ్ నటులు విద్యాబాలన్, మసాబా గుప్తా, నకుల్ మెహతా, చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ దీన్ని ప్రశంసించగా.. ముంబైకి చెందిన ఎన్జిఓ 'మహిళల మనోభావాలను దెబ్బతీయడం'పై అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. సుస్మితా సేన్‌తో లలిత్ మోదీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ జూలైలో అనుకోని రీతిలో సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. అతను సుస్మితా సేన్‌తో కలిసి మాల్దీవుల్లో ఉన్నరొమాంటిక్ ఫోటోలతో వార్తల్లో నిలిచారు. 2018లో ఆయన భార్య మరణించిన తర్వాత కొత్త జీవితంలో 'బెటర్ హాఫ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . "పెళ్లి చేసుకోలేదు - కేవలం ఒకరితో ఒకరు డేటింగ్. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది.” అంటూ లలిత్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను సుస్మితతో ఉన్న ఫోటోను పెట్టాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన వ్యక్తులలో ఇద్దరూ కూడా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రావడం సంచలనంగా మారింది. దీంతో జాక్వెలిన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె క్రమం తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతూనే ఉంది. ఈడీ ఆరోపణల ప్రకారం ఆమెతో పాటు మరో నటి నోరా ఫతేహి.. సుఖేశ్ నుంచి కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న నోరా దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. బిగ్ బాస్ 16లో సాజిద్ ఖాన్ ఎంట్రీ దుమారం: లైంగిక వేధింపుల జాబితాలో దర్శకుడు సాజిద్ పేరు ముందుటుంది. మీటూ ఉద్యమంలో ఆయనపై పలువురు నటీమణులు ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ షో పోటీదారులలో ఒకడిగా ఉండడాన్ని పలువురు తప్పుబట్టారు. అతనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయాలను ఛానెల్ పట్టించుకోలేదు. అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య గొడవ: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఏప్రిల్‌లో జరిగిన ఒక ఈవెంట్లో "హిందీ జాతీయ భాష కాదు. అందుకే వారు పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు" అంటూ చేసిన వాఖ్యలు వివాదానికి దారితీశాయి. కిచ్చా సుదీప్ ప్రకటనపై హీరో అజయ్ దేవగణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే సుదీప్ దీనిపై స్పందిస్తూ కన్నడలో టైప్ చేసి ఉంటే అతని స్పందన అర్థం అయ్యేదా అని అజయ్‌ని అడిగాడు. “మేము కూడా భారతదేశానికి చెందినవారమే కదా సార్” అని సుదీప్ ట్వీట్ చేశాడు. లాల్ సింగ్ చద్దా వివాదం: అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా ఈ ఏడాది చాలా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. అయితే చాలామంది సినిమాకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీ విడుదల సమయంలో ట్విట్టర్లో బాయ్‌కాట్ లాల్‌సింగ్ చద్దా అంటూ అప్పట్లో ట్రెండ్ అయింది. పఠాన్ మూవీ బేషరమ్ రాంగ్: ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా నటించిన చిత్రం పఠాన్. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రంలో బేషరమ్ రంగ్ పాటకు ధరించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు దీపిక ధరించిన కుంకుమ రంగు బికినీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. షారూక్‌ను సజీవ దహనం చేస్తానని అయోధ్యలోని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారు. -
క్రిస్మస్కి 83
కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలన్నీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయాయి. సినిమా థియేటర్స్ ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో కొత్త తేదీలను, పండగ సీజన్లను టార్గెట్ చేసి తమ చిత్రాల విడుదల తేదీలను లాక్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ‘83’ విడుదల తేదీని ఖరారు చేశారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
హీరోయిన్ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ తాజాగా ట్విట్టర్ వేదికగా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈసారి వ్యక్తుల పేర్లను ప్రస్తవిస్తూ టార్గెట్ చేసింది. ‘రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌషల్ ‘కొకైన్ బానిసలు’ అని పుకార్లు ఉన్నాయి. వీరందరూ డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఈ పుకార్లకు స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. క్లియర్ శాంపిల్స్‌తో ఈ యువ నటులందరూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని కంగనా తన ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ ట్వీట్‌పై కాలమిస్ట్ ఆశ్విని మహాజన్ స్పందిస్తూ ‘నేషనల్ అవార్డుకు ఎంపిక చేసేముందు ఆ ఆర్టిస్ట్‌లందరికి డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కంగనా మంచి డిమాండ్ చేశారు. అలాంటివారు మనకు రోల్ మోడల్స్ ఎలా అవుతారు’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది రాజకీయ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా కరణ్ జోహార్ పార్టీకి చెందిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఆ వీడియోలోని వారందరూ డ్రగ్స్ తీసుకున్న స్థితిలోనే ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను కరణ్ జోహార్ ఇంట్లో తీశారు. దీనిని మొదట కరణ్ జోహారే షేర్ చేశారు. ఈ వీడియోలో రణబీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నారు. I request Ranveer Singh, Ranbir Kapoor, Ayan Mukerji, Vicky Kaushik to give their blood samples for drug test, there are rumours that they are cocaine addicts, I want them to bust these rumours, these young men can inspire millions if they present clean samples @PMOIndia 🙏 https://t.co/L9A7AeVqFr — Kangana Ranaut (@KanganaTeam) September 2, 2020 దీని కరణ్ స్పందిస్తూ వారు డ్రగ్స్ తీసుకొని వుంటే నేను ఎందుకు దానిని షేర్ చేస్తాను అంటూ ప్రశ్నించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు అన్న కంగనా ఆరోపణలపై ఇటీవల రవీనా టాండన్, హన్సాల్ మెహతా స్పందించారు. బాలీవుడ్‌లోని ప్రతి ఒక్కరికి దానిని అపాదించడం అన్యాయమని వారు అన్నారు. ఇతర వృత్తులలో ఉన్నట్లుగానే చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని వారు ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ఇంటర్వ్యూ తర్వాత అమ్మ ఏడుస్తూనే ఉంది -
బాలీవుడ్ భీష్మ
టాలీవుడ్లో హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్ 100, ఓ బేబీ, రాక్షసుడు’ వంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘భీష్మ’ చేరింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరెక్కించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో రణ్వీర్ సింగ్ నటించనున్నారని టాక్. -
బూసాన్‌కు గల్లీబాయ్
ఈ ఏడాది భారతదేశం తరపున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘గల్లీబాయ్’ ప్రస్తుతం సౌత్ కొరియాకు వెళ్లనుంది. సౌత్ కొరియాలో జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘గల్లీ బాయ్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవాల్లో ‘రిక్వెస్ట్ సినిమా స్క్రీనింగ్’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. ముంబై మురికి వాడల్లో నివసించే ర్యాపర్ కథే ఈ చిత్రం. -
కపుల్ దేవ్
‘‘తన కలల కంటే కూడా తన భర్త కలల్ని తనవిగా భావించే స్త్రీలందరికీ ఈ సినిమా అంకితం’’ అంటున్నారు దీపికా పదుకోన్. 1983లో భారత జట్టు తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచిన సంఘటన ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకోన్ చేశారు. ఆల్రెడీ రణ్వీర్ లుక్‌ని విడుదల చేశారు. రణ్వీర్–దీపికా కలిసి ఉన్న లుక్‌ను బుధవారం విడుదల చేశారు. వివాహం తర్వాత ఈ కపుల్ కలసి నటించిన చిత్రమిది. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన సంఘటనతో తీసిన సినిమాలో చిన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు దీపికా. ‘83’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
బై బై జయేష్
పాత్ర ఎలాంటిదైనా అందులోకి సులువుగా ఒదిగిపోగలరు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన లేటెస్ట్ చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’ కోసం తుంటరి గుజరాతీ కుర్రాడిలా మారారు. తాజాగా ఆ పాత్రకు బై బై చెప్పారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ‘‘జయేష్ భాయ్ బై బై’’ అన్నారు రణ్వీర్. -
హర్యానా హరికేన్
... అనగానే క్రికెట్ ప్రేమికులకు ఆల్ రౌండర్ కపిల్‌దేవ్ గుర్తుకు వస్తారు. కానీ రీసెంట్ టైమ్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు సినీ లవర్స్. కపిల్‌దేవ్ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో సారథిగా కపిల్‌దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ మధుర క్షణాలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగారు బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్. కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు. శనివారం రణ్వీర్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘1983’ హిందీ సినిమాలోని రణ్వీర్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే వివాహం తరవాత తొలిసారి ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్. -
యంగ్ బాద్షా
‘‘నేను డబ్బు వెనక కాదు, ప్రేమ వెనక పరిగెడతాను’ అంటాడు ‘సింబా’ సినిమాలో రణ్వీర్ సింగ్. విశేషం ఏంటంటే బాలీవుడ్లో ప్రస్తుతం డబ్బంతా ఆయన సినిమాల చుట్టే తిరుగుతోంది. ఒక్క ఏడాదిలో రణ్వీర్ సింగ్ సినిమాలు చేసిన బిజినెసే అందుకు ఉదాహరణ. ఆయన నటించిన ‘పద్మావత్, గల్లీ బాయ్, సింబా’ సినిమాలు గత ఏడాది రిలీజయ్యాయి. ఈ మూడు సినిమాలు దాదాపు 800 కోట్లు బిజినెస్ చేయడం విశేషం. ‘‘సినిమా నిర్మాణం రిస్క్. దర్శకుడు, నటీనటులను నిర్మాతలు నమ్ముతారు. ఓ హీరోగా ఆ నమ్మకాన్ని నా సినిమాలు నిలబెట్టడం చాలా సంతోషం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నా సినిమాలు తమ వంతు సహాయపడటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు రణ్వీర్. యంగ్ హీరోలు ఇలా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించడం ఇండస్ట్రీకి మంచి పరిణామం. ఇప్పుడు బాలీవుడ్ పరిశీలకులు రణ్వీర్ను బాలీవుడ్ యుంగ్ బాద్షా అంటున్నారు. -
పారితోషికం 14 కోట్లు?
ఇండస్ట్రీలో పారితోషికంపరంగా కొన్ని లెక్కలుంటాయి. హీరో కంటే హీరోయిన్‌కు పెద్ద అంకెల్లో చెక్కులు అందేవి కావు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. మార్కెట్ ఉన్న యాక్టర్స్‌కు అదే రేంజ్లో పారితోషికాలు అందుతున్నాయి. తాజాగా ‘83’ సినిమా కోసం దీపికా పదుకోన్ 14 కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలిసింది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘83’. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కపిల్ దేవ్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారు. వివాహం తర్వాత రణ్వీర్– దీపికా కలసి నటిస్తున్న సినిమా ఇదే. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంతో పాటు దీపిక– రణ్వీర్ మళ్లీ కలసి నటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో దీపికా 14 కోట్లు వరకూ తీసుకుంటున్నారనుకోవచ్చు. అన్నట్లు ‘పద్మావత్’ సినిమాకి అందులో నటించిన రణ్వీర్, షాహిద్ కపూర్లకన్నా దీపికానే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఇక ‘83’ షూట్లో జాయిన్ అయ్యే ముందు రోమీ భాటియాతో కొంత సమయం గడిపి ఆ కథను తన కోణం నుంచి అర్థం చేసుకోవాలనుకుంటున్నారట దీపిక. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఎనిమిదో అడుగు
భర్త ముందు నడుస్తాడు. భార్య వెనుక నడుస్తుంది.ఇది లోకాచారం. భర్త ఒకడుగు వెనుక నడిచి, భార్యను ముందుకు నడిపిస్తాడు!ఇది అఫెక్షన్.ఏడడుగుల తర్వాత.. భార్యపై ప్రేమతో, అఫెక్షన్తోఆమెను ముందుకు నడిపించడానికిభర్త వేసే వెనకడుగే.. ఎనిమిదో అడుగు. ఈ ఎనిమిదో అడుగు ప్రతి భర్తకూ ఆదర్శం కావాలి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ చూడచక్కని జంట. రణ్వీర్ దీపిక మీద ఎంత అఫెక్షన్ చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. చూపించడం కాదు. చూపించకుండా ఉండలేకపోవడం అది! మనసులో అంత ప్రేమ ఉంటే బయటికి వచ్చేయకుండా ఉంటుందా? పక్కన వాళ్లున్నారు, వీళ్లున్నారు అని చూసుకుంటుందా! ఈమధ్య.. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ పెళ్లింటికి వెళ్లారు. సాధారణంగా కొత్తగా పెళ్లయిన కపుల్ ఎక్కడికి వెళ్లినా ఒకర్నొకరు అంటుకుని అడుగులు వేస్తుంటారు. వీళ్లూ అంతే కానీ.. దీపిక మనుషుల్లో పడిపోయారంటే రణ్‌వీర్‌ని అస్సలు పట్టించుకోరు. రణ్వీర్ కూడా ఫీల్ అవడు. ఆమె ఫ్రీడమ్‌ను తనూ ఎంజాయ్ చేస్తాడు. దీపిక ఫ్రీడమ్‌కు ఏవైనా అడ్డుపడితే వాటిని కూడా తొలగిస్తూ ఆమెను కంఫర్ట్‌గా ఉంచుతాడు. పెళ్లికి వెళ్లారు కదా..అక్కడ ఏమైందంటే.. వాళ్లను వీళ్లనూ గ్రీట్ చేస్తూ నట్టింట నడుస్తున్న దీపికకు హైహీల్స్ అడ్డుపడుతున్నాయి. ఆమె ఇబ్బందిని గమనించాడు రణ్వీర్. ‘‘నాకివ్వు.. పట్టుకుంటాను’’ అని తీయించి, వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముందుకు నడుస్తుంటే.. హైహీల్స్ పట్టుకుని ఆమె వెనుక నడిచాడు! (పట్టుకుని నడవడం ఎందుకు? ఎక్కడైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు. కానీ దీపికకు మళ్లీ వాటి అవసరం వస్తేనో!) రణవీర్ దీపిక హైహీల్స్‌ని చేత్తో పట్టుకున్న దృశ్యం ఎవరి కెమెరాలోనో క్లిక్ అయింది. తర్వాత నెట్లో వైరల్ అయింది. రణ్వీర్ మెరూన్ కలర్ షేర్వాణీలో, దీపిక పూల వైట్ కలర్ శారీలో ఉన్నారు. కొప్పు, కొద్దిగా ఆభరణాలు దీపికను మెరిపించేస్తున్నాయి. అయితే ఫొటోల్లో ఇవేవీ నెటిజన్లకు కనిపించడం లేదు. రణవీర్ చేతుల్లోని దీపిక హైహీల్స్పైనే అందరి చూపు. ‘‘ఇలాంటి భర్త ఉంటేనా?’’ అని అమ్మాయిలు పరవశించిపోయారు. ఇది కాదు విశేషం. రణ్వీర్ ఫాన్స్ అస్సలు ఈగోలకు పోలేదు. భార్య చెప్పులు చేత్తో పట్టుకుని నడవడం ఏంటి అని ఒక్కరూ ఒక్క పోస్టయినా వెయ్యలేదు. పైగా లైకుల మీద లైకులు కొట్టారు. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారని ఈ మధ్య ఒక దుర్మార్గమైన వార్త వచ్చింది. పాశ్చాత్య మీడియా సృష్టింపు అది. ‘అయ్యో’ అని ఎన్నో మనసులు కలత చెందాయి. అయితే ఆ వార్త నిజం కాదు. ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెళ్లయ్యాక మొన్న వచ్చిన తొలి ఈస్టర్ను నిక్.. ప్రియాంక హృదయాన్ని హత్తుకునేలా సెలబ్రేట్ చేశాడు. రోజంతా ప్రియాంకను తన కుటుంబ సభ్యులతోనే ఉండనిచ్చాడు. అత్తగారు, భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోని ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హ్యాపీ ఈస్టర్ ఫ్రమ్ అవర్స్ టు యువర్స్’ అని కామెంట్ కూడా రాశారు. ఇంటర్వ్యూలలో ప్రియాంక మర్చిపోకుండా ఒక మాట చెబుతుంటారు. ‘నిక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్’ అని. ఆ ఫ్యామిలీని అతడు తననెంతో ప్రేమించే ప్రియాంకకు కొంత పంచి పెట్టాడు. ‘తననెంతో ప్రేమించే’ ఓకే. ‘తనెంతో ప్రేమించే’ కాదా! ఇదిగో ఇలాంటి విరుపుల కారణంగానే విడిపోతల వదంతులు బయటికి వస్తుంటాయి. ప్రియాంక నిక్ని ఎంతగా ప్రేమిస్తున్నారో.. నిక్ కూడా ప్రియాంకను అంతగా ప్రేమిస్తున్నాడు. బ్రేక్ వస్తే చాలు.. ప్రియాంకను తీసుకుని అమ్మావాళ్ల (నిక్వాళ్ల) ఇంటికి వెళ్లిపోతున్నాడు. భూమండలాన్నంతా ఆల్రెడీ తిరిగేసిన ప్రియాంకకు ఇప్పుడు భువిపైనున్న స్వర్గసీమ అత్తగారిల్లు మాత్రమే. అలా ఆమె మనసులో అనుబంధాల పూలు పూయించాడు నిక్. మేఘన్ మార్కల్తో పెళ్లయ్యాక ప్రిన్స్ హ్యారీ సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజులు ఇవ్వడం (ప్రపంచానికి) సర్వసాధారణం అయిపోయింది. మేఘన్ పరిచయం కాకముందు వరకు ప్రిన్స్ హ్యారీ మూడీగా ఉండేవారు. లైఫ్‌లోకి ఆమె వచ్చాకే అతడిలోకి కాస్త జీవం వచ్చింది. తల్లి డయానా తలపుల్లోంచి బయటికి రాలేకపోయిన పసిపిల్లవాడే అతడు అన్నేళ్ల పాటు! అలాంటి పిల్లాణ్ని ఇప్పుడు మేఘన్ ఒడిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమే అతడి లోకం. ఆమె పట్ల అతడికెంత ఆరాధననో ఆ మధ్య వాళ్లు మొరాకో టూర్ వెళ్లినప్పుడు మళ్లీ ఒకసారి బయటపడింది. పి.డి.ఎ. అనే మాట వినే ఉంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నవాళ్లు ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’ (ఇదే పి.డి.ఎ)తో నలుగురి కంటా పడుతుంటారు. అంటే తమకు తెలియకుండానే ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పోతుంటారు. మొరాకోలోని ఆండలూషియన్ గార్డెన్స్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు మేఘన్‌కు ఒక పెండెంట్ నచ్చింది. దానిని మెడలో ధరించడానికి పోనీ టెయిల్ అడ్డం వచ్చి మేఘన్ ఇబ్బంది పడుతుంటే ప్రిన్స్ హ్యారీ ఆమె పోనీని ఎత్తి పట్టుకుని పెండెంట్ వేసుకోడానికి హెల్ప్ చేశారు! రాజకుటుంబంలోని జంట.. అదీ పురుషుడు ఇలా చొరవచూపడం అపురూపం, అపూర్వం కూడా! విరాట్, అనుష్క మనకు పాతబడి పోయి ఉండొచ్చు. వాళ్లకు వాళ్లు ఇంకా కొత్తగానే ఉన్నారు. అయినా పాతబడాలని రూల్ ఏముంది? ప్రేమికులుగా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, భార్యాభర్తలుగా ఇప్పుడు ఆనందవాసంలో ఉన్నప్పుడు విరాట్ ప్రతి ట్రోలింగ్‌లోనూ అనుష్కకు సపోర్ట్‌గా ఉన్నాడు, ఉంటున్నాడు. ఆమె ఇష్టాలను గౌరవిస్తున్నాడు. ఆమె అయిష్టాలను అల్లంత దూరంలోనే ఉంచేస్తున్నాడు. స్టేడియంలో అనుష్క ఉండడం వల్లనే విరాట్ ఓడిపోతున్నాడని విమర్శలు వచ్చినప్పుడు అమెకు గట్టి అండగా ఉన్నాడు విరాట్. ‘ఇలాంటివి మాట్లాడొద్దు’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ టీమ్‌తో కలిసి అనుష్క గ్రూప్ ఫొటో దిగడం ఏమిటన్నప్పుడు కూడా అలాంటి విజ్ఞప్తే చేశాడు. ‘తను నా స్నేహితురాలు’ అని వివాహానికి పూర్వం, ‘తను నా భార్య’ అని వివాహానంతరం ఆమెను తను సాధించిన ట్రోఫీలా ఎత్తి చూపాడు. రోడ్డుమీద ఎవరో చెత్తపారబోస్తే అనుష్క తిడుతున్న వీడియోను ఎవరో నెట్లో పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా ‘ఆమె తిట్టడంలో తప్పేమిటి?’ అని నెటిజన్లను ప్రశ్నించాడు తప్ప, ‘మనకెందుకొచ్చింది చెప్పు..’ అని భార్యను నిరుత్సాహపరచలేదు. ఈ ఏడాది జనవరిలో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌కు భార్యతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్.. అదే సమయంలో అక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంటే అనుష్క ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌కు ఆమెను తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఫెదరర్, విరాట్, అనుష్క.. ముగ్గురూ కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోలను ‘త్రీ లెజెండ్స్ : వన్ ఫొటో’ అనే కామెంట్‌తో అనుష్క పోస్ట్ చెయ్యడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఇరవైసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌కి, ఇండియా జట్టు కెప్టెన్ విరాట్‌కి.. ఒక సినిమా నటి సమానం ఎలా అవుతుంది? అసలు ఆమె లెజెండ్ ఎలా అవుతుంది అని నెటిజెన్స్ విమర్శించారు. విపరీతార్థాలు తీశారు. ‘రోజన్ని కలిస్తే నేనూ లెజెండ్‌ని’ అవుతానా అని ఒకరు వెటకరించారు. ‘అసలు అనుష్కే లెజెండ్. మిగతా ఇద్దరూ కాదు’ అని ఇంకొకరు వ్యంగ్యంగా గుడ్లు మిటకరించారు. ఆ సమయంలో విరాట్ అనుష్కకు ఇంటా బయట ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాడు. చివరిగా సోనమ్, ఆనంద్. సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా గతవారం ఢిల్లీలో ఒక స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్లో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. సోనమ్ స్టోర్‌లోని షూజ్‌ని తొడుక్కుని చూస్తున్నప్పుడు ఆనంద్ కిందికి వంగి ఆమెకు లేస్‌లు కట్టడం కపూర్ అభిమానుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆనంద్, విరాట్, హ్యారీ, నిక్, రణవీర్‌ల ఈ ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’కు అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం విశేషం. సహజమే. అమ్మాయిలు.. పెళ్లయినవాళ్లయినా, పెళ్లి కావలసినవాళ్లయినా.. ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ అఫెక్షన్’ని ఇష్టపడతారు. నిజంగా ప్రేమ ఉంటే అది పైకి కనిపించకుండా పోతుందా అన్నది వారి పాయింట్. -
కృష్ణమాచారిగా...
భారతదేశానికి క్రికెట్లో తొలి ప్రపంచ కప్ సాధించి పెట్టిన ఘనత కపిల్‌దేవ్, అండ్ టీమ్‌కి దక్కుతుంది. 1983లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో ఇండియాని విశ్వవిజేతగా నిలిపి భారతీయులంతా గర్వపడేలా చేశారు. ఆ మధుర క్షణాల్ని, అప్పటి ఇండియా టీమ్ కెప్టెన్ కపిల్‌దేవ్ బయోపిక్‌ని బాలీవుడ్లో తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏక్ థా టైగర్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘1983’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఇతర ఆటగాళ్లలో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఒకరు. తమిళనాడుకు చెందిన శ్రీకాంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగి చక్కని ఆటతీరును ప్రదర్శించేవారు. ‘1983’ చిత్రంలో ఆయన పాత్రలో టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నటించనున్నారంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా శ్రీకాంత్ పాత్రలో హీరో జీవా నటించనున్నారట. తమిళనాడుకు చెందిన శ్రీకాంత్ పాత్రలో తమిళ హీరో అయితేనే బాగుంటుందని భావించిన చిత్రవర్గాలు జీవాని సంప్రదించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఈ పాత్ర కోసం కృష్ణమాచారి శ్రీకాంత్ వద్ద ఆయన క్రికెట్లో శిక్షణ తీసుకుంటుండటం విశేషం. -
ఏక్ దీపిక దోసె పార్సిల్
అమెరికాలో టెక్సాస్ ప్రాంతంలోని దోసె ల్యాబ్స్ దగ్గర వేరే ఏ దోసె అడిగినా ఆర్డర్ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ.. అదే ‘దీపికా పదుకోన్ దోసె’ అనగానే ఆలూ, చిల్లీతో నిండిన వేడి వేడి మసాలా దోసె మన ముందుకొస్తుంది. సినిమా స్టార్ల పేర్లు నచ్చిన వాటికి పెట్టడం చాలాసార్లే విన్నాం.. చూశాం. తాజాగా టెక్సాస్‌లో ‘దోశ ల్యాబ్స్’ అనే స్ట్రీట్‌ఫుడ్ రెస్టారెంట్లో ఓ దోసెకు దీపికా పదుకోన్ పేరును పెట్టుకున్నారు హోటల్ యాజమాన్యం. ట్వీటర్లో ఈ విషయాన్ని చూసిన దీపిక ‘ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్..’ అంటూ తన ట్వీటర్లో ఈ విషయాన్ని వడ్డించారు. ‘‘కొత్త సంవత్సరం ఇంతకన్నా గొప్పగా ప్రారంభం అవ్వదనుకుంటా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారామె. వెంటనే ‘‘మేడమ్ నార్త్ ఇండియాలో (పూణే) దీపికా పదుకోన్ పరాతా ఫుల్ ఫేమస్ అంటూ మరో హోటల్ సర్వ్ చేసే మెనూ పిక్ పోస్ట్ చేస్తూ రిప్లై చేశారో నెటిజన్. ‘‘నేనా హోటల్‌కి వెళ్తే కచ్చితంగా ‘దీపికా పదుకోన్ దోసె ఆర్డర్ ఇచ్చేవాణ్ణి’’ అని సరదాగా పేర్కొన్నారు దీపికా భర్త రణ్వీర్ సింగ్. -
కన్ను కొట్టలేక...
‘సింబా’ సినిమా షూటింగ్ లొకేషన్ అది. కెమెరా లెన్స్‌ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్. ఓ షాట్ కోసం టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్ మాత్రం టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్ కన్ను కొట్టే సీన్. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో హీరోయిన్ కుడికన్ను కొట్టే ఓ సీన్ ఉందట. ఈ సీన్ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్‌లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
తిరిగొచ్చేశారు
ఇటలీలో పెళ్లి సంబరాలు ముగించుకొని ఆదివారం ముంబైకి తిరిగొచ్చారు కొత్త దంపతులు దీప్‌వీర్ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్). ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ నూతన జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అక్కడి నుంచి నేరుగా రణ్‌వీర్‌సింగ్ ఇంటికి చేరుకొని, గృహప్రవేశ కార్యక్రమం చేసినట్టు సమాచారం. క్రీమ్ కలర్ మ్యాచింగ్ డ్రెసుల్లో ‘దీప్‌వీర్’ కనిపించేసరికి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అక్కడితో ఆగకుండా రణ్వీర్ చేతికున్న మెహందీలో దీపం డిజైన్ చూసి దీపం అంటే హిందీలో దీప్ (దీపికా) అని ఊహించేసుకుని తెగ సంబరపడిపోతున్నారు. ఈ నెల 21న బెంగళూర్‌లో, 28న ముంబైలో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది. -
సదా సౌభాగ్యవతీ భవ
దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ వివాహ వేడుకలు ముగిశాయి. కానీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కపుల్ మ్యారేజ్ విశేషాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దీప్‌వీర్ వివాహ వేడుకల గురించి ప్రచారంలో ఉన్న హైలైట్స్ కొన్ని... ► నిశ్చితార్థం రోజున దీపికా వేలికి రణ్వీర్ తొడిగిన ఉంగరం ఖరీదు సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్లు ఉండొచ్చని సమాచారం. ► ఈ వివాహ వేడుకకు బీమా కూడా తీసుకున్నారట దీప్‌వీర్. వివాహానికి బీమా ఏంటి? అనుకుంటున్నారా. దీప్‌వీర్ పెళ్లి, సంగీత్ కార్యక్రమాలన్నీ ఇటలీలోని ఓ హోటల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలు జరిగే హోటల్స్‌లో ఏదైనా డ్యామేజ్ జరిగినా, అగ్నిప్రమాదం, ఏదైనా వస్తువు పోవడం, లేదా ఇంకేదైనా నేచురల్ డిజాస్టర్ జరిగినా ఆ బాధ్యత ఆ హోటల్స్ తీసుకున్నవాళ్లే భరించాలన్నది నియమం. ఇవన్నీ ఆ బీమా పాలసీ కిందకే వస్తాయట. ఆ హోటల్స్‌లో ఏ వేడుక చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి అట. ► వివాహం తర్వాత రణ్వీర్ సింగ్ తండ్రి జగ్జీత్ సింగ్ భవ్నానీ కొత్త కోడలు దీపికా పదుకోన్‌తో సరదాగా ‘ఏ దీవానీతో భవనానీ హో గయీ’ అన్నారట. ► దీపికా పదుకోన్‌కు రణ్వీర్ తరపువారు పెట్టిన పెళ్లి వస్త్రాల్లో ‘సదా సౌభాగ్యవతీ భవ’ అనే శ్లోకం ఉందట. అలాగే తలపై ధరించిన మేలి ముసుగులో కూడా అదే శ్లోకం బంగారు వర్ణంతో రాయించారని సమాచారం. మరి రానున్న రోజుల్లో ఇలాంటి హైలైట్స్ ఇంకెన్ని బయటికొస్తాయో చూడాలి. అన్నట్లు దీప్‌వీర్ ఆదివారం ముంబై చేరుకుంటారట. -
ఐదేళ్లకు ఏడడుగులు
సరిగ్గా ఐదేళ్ల క్రితం దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ మొదటిసారి కలసి నటించిన ‘రామ్‌లీల’ (2013) రిలీజై నిన్నటితో ఐదేళ్లయింది. ఆ సినిమా స్టార్ట్ అయిన (2012) ఆరేడు నెలలకు వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది జరిగిన ఐదేళ్లకు దీపికా, రణ్వీర్ ఏడడుగులు వేశారు. నవంబర్ 14, 15తేదీల్లో ఇటలీలోని లేక్ కోమో వద్ద వీరి వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. 14న కొంకిణీ పద్ధతిలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, 15న ఆనంద్ కరాజ్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కొంకణి వేడుక కామ్‌గా, కూల్‌గా జరిగితే మరుసటి రోజు రణ్వీర్ వాళ్ల సంప్రదాయం ప్రకారం రణ్వీర్ ఎనర్జీ లెవల్స్ మ్యాచ్ అయ్యేలా మస్త్ హుషారుగా జరిగిందట. ఈ గ్రాండ్ వెడ్డింగ్ విశేషాలేంటంటే... పెళ్లి వేడుకకు హాజరైన అతిథులందరికీ సౌత్ స్టైల్లో ఫిల్టర్ కాఫీతో ఆహ్వానం పలికారట. ఈ పెళ్లి పనుల్లో ఇటలీ స్టాఫ్ అందరూ సౌత్ ఇండియన్ దుస్తులు ధరించారు. అతిథులకు విస్తరిలో వడ్డించారట. వంటలు రుచికరంగా ఉండాలని ఇండియా నుంచి చేయి తిరిగిన వంటగాళ్లను ఇటలీకి తీసుకువెళ్లారట. ఇక దీపికా, రణ్‌వీర్‌ల కొంకణి సంప్రదాయ వివాహం నాలుగు గంటలు సాగిందట. ఈ వేడుకలకు బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారట. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా అధికారికంగా విడుదల చేసేవరకూ బయటకు రాలేదంటే ఎంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... దీప్‌వీర్ ఈ 21న బెంగళూరులో, 28న ముంబైలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ జంట హనీమూన్ వివరాలేవీ బయటకు రాలేదు. -
దీప్‌వీర్... ఒకటయ్యార్
వేద మంత్రాలు, ఆనందబాష్పాలు, అతిథుల ఆశీర్వాదాల మధ్య బుధవారం ఇటలీలోని లేక్ కోమోలో గల విల్లా డెల్ బాల్బియనెల్లో దీప్‌వీర్ (దీపిక–రణ్వీర్) పెళ్లి ఘనంగా జరిగింది. కొంకణి కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘చిత్రపుర్ సరస్వత్’ పద్ధతిలో దీపికా, రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు. దీపికా కుటుంబ సంప్రదాయం ఇది. మ్యారేజ్ థీమ్ ‘వైట్’ అని భోగట్టా. తెలుగు, బంగారు వర్ణం కలగలసిన చీరను దీపికా, కాంచీపురం షేర్వాణీని రణ్వీర్ ధరించారట. అతిథులందరూ తెలుపు రంగు దుస్తుల్లో హాజరయ్యారట. వేదిక కూడా తెల్లటి పువ్వులతో, పరదాలతో ఆహ్లాదకరమైన వాతావరణం తలపించిందని సమాచారం. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరిగిందట. గురువారం రణ్వీర్ కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలోనూ ఈ దంపతుల పెళ్లి జరుగుతుందని తెలిసింది. పెళ్లి వేడుకల కోసం శనివారం ఇటలీ వెళ్లిన దీప్‌వీర్ వరుసగా మెహందీ, సంగీత్ వేడుకలతో బిజీ అయ్యారు. సంగీత్ కార్యక్రమం ‘పంజాబీ’ టచ్‌తో సాగిందట. ఈ గానా భజానా కార్యక్రమంలో ఉద్వేగానికి గురైన దీపికాను రణ్వీర్ ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారట. అలాగే ‘ఫూల్ మడ్డీ’ (కొంకణీ సంప్రదాయం) పేరుతో జరిపిన కార్యక్రమంలో ఉంగరాలు మార్చుకునే సమయంలో రణ్వీర్ మోకాళ్ల మీద కూర్చుని, ఉంగరం తొడిగినప్పుడూ దీపిక ఎమోషన్ అయ్యారట. ఇదే కార్యక్రమంలో దీపికా తండ్రి ప్రకాశ్ పదుకోన్ అల్లుడు రణ్వీర్ కాళ్లు కడిగి, కొబ్బరికాయ చేతికి అందించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు 30 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారట. ఫొటోలు తీయొద్దని అతిథులను కోరడంతో పాటు బహుమతులు వద్దని, ఒకవేళ ఇవ్వాలనిపిస్తే ‘లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వవలసిందిగా కోరారట. దీపిక నిర్వహిస్తున్న సేవా సంస్థ ఇది. -
నంది పూజతో సందడి ప్రారంభం
ఒకవైపు ప్రియాంకా చోప్రా– నిక్ జోనస్ పెళ్లి పనులు హుషారుగా జరుగుతుంటే ఇంకా దీపికా పదుకోన్– రణ్వీర్ సింగ్ ఏంటీ? సైలెంట్‌గా ఉన్నారు అని అనుకునేవాళ్లందరూ ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీప్‌వీర్ (దీపిక–రణ్వీర్ జంటను ఇప్పుడు ఇలానే పిలుస్తున్నారు) పెళ్లి సందడి బెంగళూరులో మొదలైపోయింది. దీపికా తల్లి ఉజ్వల్ పదుకోన్ నంది పూజతో పెళ్లి పనులను స్టార్ట్ చేశారు. దీపిక కాస్ట్యూమ్ స్టైలిస్ట్ షలేనా నాథానీ, హెయిర్ స్టైలిస్ట్ గాబ్రియల్ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో తాము ఒక్కటి కాబోతున్నట్లు దీపిక–రణ్వీర్ ఈ ఏడాది అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీప్‌వీర్ వెడ్డింగ్ ఇటలీలో జరగనుందని బాలీవుడ్ టాక్. ‘‘దీపికా సౌత్ గర్ల్. రణ్వీర్ సింగ్ నార్త్. అందుకనే ఇటు దక్షిణాది అటు ఉత్తరాది సంప్రదాయాల ప్రకారం రెండు రకాల పెళ్లి వేడుకలను ప్లాన్ చేశారట. అలాగే ముంబైలో ఒకటి, బెంగళూరులో మరొక రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు దీప్‌వీర్. ఈ నెల 10న అందరూ ఇటలీకి ప్రయాణం అవుతారు. పూజ చేస్తున్న దీపిక -
పెళ్లి క్లాష్ వచ్చేస్తే ఎలా?
సాధారణంగా సినిమా వాళ్లకు రిలీజ్ విషయంలో, డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడుతుంది. హీరోయిన్స్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో క్లాష్ వస్తుంది. తాజాగా దీపికా పదుకోన్‌కు, ప్రియాంకా చోప్రాకు విభిన్నంగా పెళ్లి విషయంలో క్లాష్ ఏర్పడేలా ఉందని బాలీవుడ్ మీడియా టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్‌ల వివాహం నవంబర్ 14,15 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత నవంబర్ చివరి వారంలో ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. అయితే విచిత్రంగా నిక్ జోనస్‌తో ప్రియాంకా వెడ్డింగ్ కూడా నవంబర్ నెలాఖరులో అని ఒక తేదీ, డిసెంబర్ ఒకటి, రెండూ తేదీల్లో అని మరో వార్త వినిపిస్తోంది. ఈ ప్రేమికుల వివాహం జో«ద్‌పూర్‌లో గ్రాండ్‌గా జరగనుందని తెలిసిందే. ఒకవేళ దీపికా రిసెప్షన్ తేదీ, ప్రియాంక పెళ్లి తేదీ, టైమ్ కూడా ఒకటే అయితే అప్పుడు ఈ ఫంక్షన్లు క్లాష్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. అదే కనుక జరిగితే అటు వెళ్లాలా? ఇటు వెళ్లాలా? రెండు వేడుకలకూ ఎలా ప్రెజెంట్ వేయించుకోవాలా? అని సెలబ్రిటీలు తికమక పడక తప్పదు. క్లాష్ ఉన్నా లేకపోయినా బాలీవుడ్లో కొన్ని రోజుల పాటు పెళ్లి కళ మాత్రం కనిపిస్తుందనడంలో సందేహం లేదు. -
మీ ఆశీర్వాదం కావాలి
బాలీవుడ్ ప్రేమ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి తేదీ అదీ.. ఇదీ అంటూ ప్రతిరోజూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇక వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే దీపికా, రణ్వీర్ ఒక్కటయ్యే తేదీని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో మేం (దీపికా, రణ్వీర్) నవంబర్ 14, 15 తేదీల్లో వివాహం చేసుకోబోతున్నాం. మా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితంలో ప్రేమ, స్నేహం, విధేయత, కలిసి ఉండటం.. ఇవన్నీ కలగలిసిన సరికొత్త మజిలీ మొదలు పెడుతున్నాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ప్రేమతో దీపిక, రణ్వీర్’’ అంటూ వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. కాగా, వీరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. -
ఐష్‌ను మిస్సయ్యా
హాలీవుడ్ యాక్టర్స్‌తో వెండితెర పంచుకోవాలని చాలా మంది నటీనటులు కలలు కంటుంటారు. కానీ, ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మాత్రం అందాలతార ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో జరిగిన ఓ సంభాషణలో భాగంగా విల్ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఐశ్వర్యారాయ్‌ని కలిసి, ఓ సినిమా గురించి మాట్లాడాను. కానీ, కుదర్లేదు. డ్యాన్స్ సీక్వెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టారు విల్ స్మిత్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్యారాయ్‌కి ఎంత క్రేజ్ ఉందో. ఖతర్ దేశంలో జరిగిన ఓ ఫ్యాషన్ ర్యాంపులో పాల్గొన్న ఐశ్వర్యను చూస్తే ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదనే విషయం తెలుస్తోంది. ఇంకా వ్యక్తిగత విషయాల గురించి విల్‌స్మిత్ మాట్లాడుతూ –‘‘ చిన్నప్పుడు నేను హింసాత్మక వాతావరణంలో పెరిగాను. అందుకే నా పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. ఇటీవల విల్‌స్మిత్ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్, నిర్మాత కరణ్ జోహార్లతో కలిసి సందడి చేసి, ఓ సెల్ఫీ దిగారు విల్‌స్మిత్. ఈ ఫొటోలను రణ్వీర్ షేర్ చేశారు. -
చాలాసార్లు పెళ్లి చేశారు
బాలీవుడ్లో పెళ్లి టాపిక్ వస్తే... అందులో రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ జంట తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్ ముందు ప్రస్తావిస్తే...‘‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను. ఇప్పటికే నాకు, దీపికాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు (నవ్వుతూ). అసలు నా పెళ్లి ఎప్పుడో అందరితో చెప్పే చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు రణ్వీర్. ఇంకా మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలి. మహిళలపై లైగింక వేధింపులు తప్పు’’ అన్నారు. ‘‘మీటూ’ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించినది కాదు. తప్పొప్పులకు చెందినది’’ అన్నారు దీపికా పదుకోన్. ఇదంతా ఓ ప్రైవైట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్ పాల్గొన్నారు. కమల్‌హాసన్, రణ్వీర్, దీపికలు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తమ అభిప్రాయాలను చెప్పారు.