rashmika
-
తొలి రౌండ్లో రష్మిక పరాజయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ50 మహిళల టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఏడుగురు బరిలోకి దిగగా... రియా భాటియా మినహా మిగతా ఆరుగురు భమిడిపాటి శ్రీవల్లి రషి్మక, అంకితా రైనా, కర్మన్ కౌర్, ఆకాంక్ష, వైదేహి, వైష్ణవి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ రషి్మక 1–6, 3–6తో మరియా కొజిరెవా (రష్యా) చేతిలో, అంకిత రైనా 1–6, 3–6తో లౌరా సామ్సన్ (చెక్ రిపబ్లిక్) చేతిలో, కర్మన్ కౌర్ 4–6, 1–6తో పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో, వైదేహి 4–6, 4–6తో తాతియానా ప్రొజోరోవా (రష్యా) చేతిలో, వైష్ణవి 6–7 (3/7), 2–6తో డాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో, ఆకాంక్ష 0–6, 1–6తో ఫాన్‌గ్రాన్ టియాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. రియా భాటియా 7–6 (7/3), 2–6, 7–5తో ఎరి షిమిజు (జపాన్)పై విజయం సాధించింది. -
త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న బ్యూటీస్ విల్లే
-
2025లో టాలీవుడ్ ని శాసించనున్న రష్మిక, శ్రీలీల, మీనాక్షి
-
ప్రిక్వార్టర్స్‌లో రష్మిక
నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ50 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–4, 6–2తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్యావి థామ్‌చైవాట్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రియా భాటియా (భారత్) 6–3, 6–4తో భారత్‌కే చెందిన తనీషా కశ్యప్‌పై, టాప్ సీడ్ అంకితా రైనా (భారత్) 1–6, 6–4, 6–4తో వాలెంటిని (గ్రీస్)పై నెగ్గగా... ఆకాంక్ష నిట్టూరె (భారత్) 6–7 (8/10), 4–6తో నహో సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సహజ (భారత్)–హిరోకొ కువాటా (జపాన్) ద్వయం 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో వైష్ణవి–పూజా (భారత్) జంటపై గెలిచింది. -
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ రిపీట్?
-
పుష్ప రాజ్ రూలింగ్ స్టార్..
-
పుష్ప కోసం జీవితం పెట్టేశాం: అల్లు అర్జున్
‘‘పుష్ప 1, పుష్ప 2’ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్న మాట అవుతుంది. సుకుమార్‌గారు, నేను, మా యూనిట్ అంతా ఐదేళ్ల జీవితాలు పెట్టేశాం. మా నిర్మాతలు నవీన్, రవిగార్లకు కృతజ్ఞతలు. వాళ్లు కాకుండా ఏ ప్రోడ్యూసర్ అయినా ‘పుష్ప’ అయ్యేది కాదు. మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు.సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2: ది రూల్’ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. నాది, దేవి శ్రీది 20 ఏళ్ల ప్రయాణం. తన పాటల్లో నా కోసం ఎక్స్ట్రా లవ్ ఉంటుంది. ఈ తరం తెలుగమ్మాయిలకు శ్రీలీల స్ఫూర్తి. నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓకే ఒక హీరోయిన్ రష్మిక. తన అంకితభావానికి హ్యాట్సాఫ్. సుకుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.‘పుష్ప 1, పుష్ప 2’ ఆయన సినిమాలే. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా? అనే భావనని ఆయన కలిగిస్తారు. సుకుమార్‌గారు లేకపోతే నేను లేను. ఆయన నాతో ‘ఆర్య’ తీయకపోయి ఉంటే నేను, ఈ వేదిక, ఈ జనాలు ఏవీ ఉండేవి కాదు. ‘పుష్ప’ నా కోసం ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. సుకుమార్‌గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను. అలాగే ఈ సినిమా కోసం మూడేళ్లు త్యాగం చేసి, కష్టపడిన చిత్రబృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాకీ ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను’’ అని తెలిపారు.దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సుమారు రెండు మూడు నెలల క్రితం ‘పుష్ప 2’ షూటింగ్‌కి వెళ్లాను. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ని సుకుమార్‌గారు చూపించారు. ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు అర్థం అయిపోయింది’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను వారం క్రితం ‘పుష్ప 2’ సినిమా చూసి ఇంటికెళ్లాను. ‘మగధీర’ సినిమాకి ముందు మీ మొహం ఎంతో వెలిగిపోవడం చూశాను.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’ అని నా భార్య నిర్మల అన్నారు. ‘పుష్ప’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘పుష్ప’ ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు, బన్నీకి మధ్య ఉన్న బంధమే. తన మీద ప్రేమతోనే ఈ సినిమా తీశాను. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘పుష్ప 2’ని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని రవిశంకర్ చెప్పారు.‘‘ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ. ‘‘పుష్ప’ చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ‘‘ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్, అల్లు అర్జున్గార్ల వల్లే’’ అని తెలిపారు రష్మిక మందన్నా. ‘‘పుష్ప’ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్’’ అని శ్రీలీల చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు నాగవంశీ, సతీశ్ కిలారు, దర్శకులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, నటి అనసూయ, కెమెరామేన్ మిరోస్లో కుబా బ్రోజెక్ తదితరులు మాట్లాడారు. -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
పుష్ప 2 సీక్రెట్స్ బయట పెట్టిన రష్మిక
-
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
రష్మిక , స్మృతి శుభారంభం
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక , స్మృతి భాసిన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 7–5, 6–1తో సోనల్ పాటిల్ (భారత్)పై నెగ్గగా... స్మృతి 4–6, 6–0, 6–2తో ఐదో సీడ్ కరోలాన్ డెలానే (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించింది.తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హుమేరా బహార్మస్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో హుమేరా 7–5, 6–4తో అమోదిని నాయక్ (భారత్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్)–కరోలాన్ డెలానే (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో శ్రావ్య శివాని–కరోలాన్ ద్వయం 7–6 (7/3), 6–3తో శ్రీనిధి బాలాజీ–హర్షిణి నాగరాజ్ (భారత్) జంటను ఓడించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్ర్యాంక్లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు. సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లాస్ఏంజె లిస్లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
బిగ్‌బాస్ 8లోకి హీరోయిన్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్
కాజల్ అగర్వాల్..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను షేక్ చేస్తున్న పుష్ప 2 సాంగ్స్..
-
పుష్ప 2 నుంచి వచ్చేసిన సెకండ్ సింగిల్.. శ్రీవల్లి దెబ్బకు ఆడియన్స్ ఫిదా..!
-
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
నేషనల్ క్రష్‌గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్తో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది. ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. #WATCH | Mumbai: On the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu, Actor Rashmika Mandana says, "Who would have thought that something like this would have been possible. Now we can easily travel from Mumbai to Navi Mumbai. India is moving very fast and growing at a fast pace.… pic.twitter.com/ACwSoSNaa7— ANI (@ANI) May 14, 2024 -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
మెగా కోడలు లేటేస్ట్ లుక్.. రెడ్ డ్రెస్‌లో శ్రీలీల హోయలు!
అలాంటి డ్రెస్‌లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్స్.. కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. శారీలో బుల్లితెర భామ రూపాలీ గంగూలీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్‌లో శ్రీలీల హోయలు.. రెడ్ శారీలో శృతిహాసన్ గ్లామర్ లుక్స్.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
రన్నరప్ రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో రెండో సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన డబ్ల్యూ35 ఐటీఎఫ్ టోర్నీలో 22 ఏళ్ల రన్నరప్‌గా నిలిచింది. రెండో సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 3–6, 2–6తో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో రష్మికకు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసేందుకు తొమ్మిదిసార్లు అవకాశం వచ్చినా ఆమె ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఫైనల్ చేరే క్రమంలో రష్మిక టాప్ సీడ్, ఐదో సీడ్, ఏడో సీడ్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ టోర్నీ ప్రదర్శనతో రష్మిక నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 428వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
విజేత రష్మిక – వైదేహి జోడి
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది. మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది. -
రఫ్ఫాడించిన రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది.