run out
-
అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్ అసహనం.. తప్పెవరిది?
మహిళా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. దుబాయ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్‌ప్రీత్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ పద్నాలుగో ఓవర్ ఆఖరి బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. అప్పుడు క్రీజులో ఉన్న అమేలియా కెర్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంది. అప్పటికి అమేలియా సోఫీ డివైన్‌తో కలిసి సింగిల్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో ఓవర్ ముగిసింది కాబట్టి హర్మన్ బంతిని త్రో చేయకుండా అలాగే చేతుల్లో పట్టుకుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కివీస్ బ్యాటర్లు మరో పరుగు కోసం యత్నించారు. అంతలో హర్మన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు బంతిని అందించగా.. అమేలియా రనౌట్ అయింది.కానీ.. అంపైర్ మాత్రం అప్పటికే బంతి డెడ్ అయినట్లు ప్రకటించారు. నిజానికి కివీస్ బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించకముందే ఫీల్డ్ అంపైర్.. బౌలర్ దీప్తి క్యాప్‌ను ఆమెకు తిరిగి ఇచ్చేశారు. అప్పటికే హర్మన్ చేతిలో బంతి ఉండి ఐదు సెకన్లకు పైగా కాలం గడవడంతో బంతిని డెడ్‌గా ప్రకటించారు. అయినప్పటికీ న్యూజిలాండ్ డబుల్‌కు యత్నించగా.. అమేలియా రనౌట్ అయింది. దీంతో ఆమె తాను అవుటైనట్లు భావిస్తూ పెవిలియన్‌కు వెళ్తుండగా.. అంపైర్లు మాత్రం ఆమెను వెనక్కి పిలిపించారు.దీంతో అమేలియా మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంతి డెడ్ అయిందనుకుని తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినా వారికి అనుకూలంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాసేపు వివాదం నెలకొనగా.. మళ్లీ ఆట మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో రెండో బంతికే అమేలియా కెర్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రేణుకా సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. అంపైర్లు ఇలా వ్యవహరించడం సరికాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. సమిష్టిగా విఫలమై 58 పరుగుల తేడాతో పరాజయం పాలై.. తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొంది.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్OUT or NOT OUT 🧐Animated Harmanpreet Kaur Spotted🔥🔥🇮🇳#INDvsNZ #WomenInBlue #T20WorldCup pic.twitter.com/QJVYKG6ZIE— Sports In Veins (@sportsinveins) October 4, 2024 -
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 7) రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్‌లోకి చేరకముందే బ్యాట్‌కు అతని చేతికి కనెక్షన్ కట్టైంది. రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Ruturaj Gaikwad was dismissed in a bizarre fashion during Maharashtra Premier League (MPL).pic.twitter.com/zQHMxWt1kX— OneCricket (@OneCricketApp) June 7, 2024కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుణేరీ టీమ్ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్ (4-0-24-4) పుణేరీ టీమ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్‌లో పవన్ షా (32), రుతురాజ్ (29), యశ్ సాగర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్ (25), అజిమ్ ఖాజీ (31), నిఖిల్ నాయక్ (27 నాటౌట్), సత్యజిత్ (17 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్‌ను గెలిపించారు. -
వారెవ్వా విరాట్.. చిరుతలా పరిగెత్తుతూ! సంచలన రనౌట్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి మరోసారి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సంచలన త్రో తో మెరిశాడు.కళ్లు చెదిరే త్రోతో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్‌ను కింగ్ కోహ్లి రనౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని డిప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే డిప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ లేకపోవడంతో సామ్ కుర్రాన్ రెండో పరుగుకు పిలుపునిచ్చాడు.ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. బంతిని అందుకునే క్రమంలో కోహ్లి బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి గురి మాత్రం తప్పలేదు. బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి రనౌట్ చూసిన సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.He's unfolding magic tonight 💫First with the bat & now on the field with that outstanding direct hit 🎯Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRCB | @imVkohli | @RCBTweets pic.twitter.com/6TsRbpamxG— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
చరిత్ర సష్టించిన ధోని.. ఐపీఎల్లో తొలి ఆటగాడిగా
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 24 రనౌట్లు చేశాడు. ఇంతకు ముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడేజా.. మొత్తం 23 రనౌట్లు చేశాడు. తాజా మ్యాచ్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్కే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే బోణీ కొట్టింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
సర్ఫరాజ్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు!
టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. మరొకరికి సాయం చేసే క్రమంలో అన్యాయంగా అవుటయ్యాడని పేర్కొన్నాడు. కాగా రంజీల్లో పరుగుల వరద పారించి.. ఎన్నో రికార్డులు సృష్టించిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అతడు టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఎంతటి పటిష్ట బౌలింగ్ దళం కలిగి ఉన్నా.. తనకు లెక్కలేదన్నట్లుగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. తొలి రోజు ఆటలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 అయితే, దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. నిజానికి స్ట్రైకర్ ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్ బలైపోయాడు. పరుగు తీస్తే సెంచరీ పూర్తి చేసుకోవచ్చన తొందరలో లేని పరుగు కోసం జడ్డూ.. పిలుపునివ్వగా సర్ఫరాజ్ క్రీజును వీడాడు. అయితే, బంతిని గమనించిన జడ్డూ మళ్లీ వెనక్కి వెళ్లగా.. అంతలోనే ఫీల్డర్ మార్క్ వుడ్ బాల్‌ను అందుకుని స్టంప్‌నకు గిరాటేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. ఈ ఘటన గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ స్పందిస్తూ.. ‘‘తన స్వార్థం కోసం రవీంద్ర జడేజా .. యువ బ్యాటర్ అద్భుత ఇన్నింగ్స్‌ను నాశనం చేశాడు. పాపం.. ఆ యంగ్‌స్టర్ సింగిల్‌కు రమ్మనగానే పరిగెత్తాడు. అంతలో జడేజా తాను వెనక్కి వెళ్లి పోయి, అతడినీ వెళ్లమన్నాడు. వుడ్ మాత్రం వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేశాడు. నిజానికి జడ్డూ చేసిన పని రోహిత్ శర్మకు ఎంతమాత్రం నచ్చలేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ తన కారణంగా రనౌట్ అయ్యాడంటూ జడ్డూ మ్యాచ్ అనంతరం క్షమాపణలు చెప్పాడు. ఇందుకు బదులుగా.. భయ్యా వల్లే నేను స్వేచ్ఛగా ఆడగలిగానంటూ సర్ఫరాజ్.. జడేజాకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ సెంచరీ(112) సాధించాడు. టెస్టుల్లో ఈ ఆల్‌రౌండర్‌కు ఇది నాలుగో శతకం కావడం విశేషం. చదవండి: Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు! మరీ చెత్తగా.. -
Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ.. పాపం సర్ఫరాజ్! రోహిత్ ఫైర్
India vs England, 3rd Test - Rohit sharma was not happy with Jadeja: టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రంలోనే మెరుపు అర్ధ శతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్ రనౌట్‌గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ .. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. రాజ్‌కోట్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. చక్కటి షాట్లు ఆడుతూ.. బౌండరీలు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 తొలుత తప్పించుకున్నాడు రవీంద్ర జడేజాతో కలిసి రోహిత్ మాదిరే మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనించాడు. కానీ.. 82వ ఓవర్లో సర్ఫరాజ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో మూడో బంతికి జడేజా ఆఫ్ దిశగా షాట్ ఆడి.. సర్ఫరాజ్ ఖాన్‌ను పరుగుకు పిలిచాడు. కానీ అంతలోనే ఫీల్డర్ బంతిని దొరకబుచ్చుకోగా.. లక్కీగా అది స్టంప్స్ మిస్ కావడంతో అప్పటికే డైవ్ చేసిన సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి అలా ప్రమాదం తప్పింది. అయితే, ఆ మరుసటి రెండో బంతికే మళ్లీ సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. దురదృష్టం వెంటాడింది ఆండర్సన్ బౌలింగ్‌లో జడ్డూ పరుగు తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా.. సర్ఫరాజ్ కూడా అతడికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, బంతిని గమనించిన జడేజా వెనక్కి వెళ్లగా.. అప్పటికే క్రీజు వీడిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోపే ప్రమాదం జరిగిపోయింది. బంతిని అందుకున్న ఫీల్డర్ మార్క్ వుడ్ స్టంప్‌నకు గిరాటేయగా.. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఒకరకంగా జడ్డూ వల్ల పొరపాటు జరిగిందన్న చందంగా క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొక మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తారనుకుంటే నిరాశ ఎదురుకావడంతో హిట్‌మ్యాన్ ఇలా అసహనానికి లోనయ్యాడు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 మరోవైపు.. సర్ఫరాజ్ సైతం తాను రనౌట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ రనౌట్‌తో టీమిండియా డ్రెసింగ్‌రూంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొనగా.. ఆ మరుసటి బంతికే జడేజా సెంచరీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: #Gill: మొన్న సెంచరీ.. ఇప్పుడు డకౌట్! ఏంటిది గిల్? Jadeja was so selfish 🙄 🤔👀 Your thoughts on this run-out of #SarfarazKhan 🤔#INDvENG #INDvsENGTest #RohitSharma#Jadejapic.twitter.com/brhecR1UqW — Fourth Umpire (@UmpireFourth) February 15, 2024 Rohit sharma was not happy with Sarfaraz run out.... He know jadeja was selfish#INDvsENGTest #SarfarazKhan #INDvENG pic.twitter.com/93cGrcOjXO — Neha Bisht (@neha_bisht12) February 15, 2024 -
క్రికెట్ చరిత్రలోనే విచిత్ర ఘటన.. ఇప్పటి వరకు చూసుండరు!
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇది మీకు వినడానికే కొత్తగా ఉండవచ్చు.. అసలేం ఏం జరిగిందో ఓ లూక్కేద్దాం. అసలేం ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో పేసర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డెవిడ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందించాడు. బంతిని అందుకున్న స్పెన్సర్ జాన్సన్ బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అది క్లియర్‌గా ఔట్ అనుకుని జాన్సన్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రిప్లేలో బిగ్ స్క్రీన్‌పై కూడా బెయిల్స్ కిందపడేటప్పటికి జోషఫ్ క్రీజుకు దూరంగా ఉన్నట్లు కన్పించింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు డేవిడ్ సైతం సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం తను అప్పీల్ చేశానని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతడితో కెప్టెన్ మార్ష్ కూడా అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించకూడదు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! ONE OF THE RAREST MOMENTS ...!!! Johnson attempted the run out, big screen showed its out, but nobody appealed so the on-field umpire dismissed the decision. pic.twitter.com/5b0x6y6KaF — Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024 -
వారెవ్వా శ్రేయస్.. డైరెక్ట్ త్రో! స్టోక్స్ రనౌట్.. వీడియో
India vs England, 2nd Test Day 4 Vizag: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. వైజాగ్ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 56 (27, 29) పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కాలే షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికి బంతి గాల్లోకి లేవగానే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇలా రెండో రోజు ఆటలో... కీలక వికెట్ పడగొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోగా.. టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్! -
రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్
India vs Afghanistan, 1st T20I - Rohit Sharma Run Out: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అండగా నిలిచాడు. శుబ్‌మన్ గిల్ కారణంగానే రోహిత్ వికెట్ పారేసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. గిల్ గనుక సరైన సమయంలో స్పందించి ఉంటే రోహిత్ ఆట తీరు మరోలా ఉండేదని పేర్కొన్నాడు. సుమారు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా తిరిగి టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్.. ఆరంభ మ్యాచ్‌లోనే రనౌట్ అయ్యాడు. గిల్ కదల్లేదు.. రోహిత్ రనౌట్ మొహాలీ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. నిజానికి బంతిని బాదిన తర్వాత వేగంగా క్రీజును వీడిన రోహిత్ శర్మ.. తన జోడీ గిల్‌ను పరుగుకు రావాల్సిందిగా పిలిచాడు. కానీ ఫీల్డర్ల విన్యాసాలు గమనిస్తూ.. బంతిని చూస్తూ అలాగే ఉండిపోయిన గిల్ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే రోహిత్.. గిల్ ఉన్న ఎండ్‌కి వచ్చేయగా.. అఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ వికెట్లను గిరాటేశాడు. అంతే.. రోహిత్ శర్మ సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. రోహిత్ శర్మపై నమ్మకం ఉంచాల్సింది స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మపై శుబ్‌మన్ గిల్ నమ్మకం ఉంచాల్సింది. అంతర్జాతీయ టీ20లలో వాళ్లిద్దరు కలిసి ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు. కానీ వన్డే, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. శుబ్‌మన్ గిల్ బాల్నే చూస్తూ ఉండటం వల్ల సమన్వయలోపం చోటుచేసుకుంది. గిల్ అలా చేసే బదులు రోహిత్ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది’’ అని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా రీఎంట్రీలో రోహిత్ శర్మ ఇలా డకౌట్ కావడం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో మొదటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఇండోర్‌లో జనవరి 14న రెండో మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్ -
ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్‌ను ఎంఎస్ ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్‌తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్‌ను ధోని రనౌట్‌తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్‌లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్‌ను ధోని రనౌట్‌తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్ -
అయ్యో హార్దిక్.. దురదృష్టమంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్
బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో హార్దిక్ రనౌటయ్యాడు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన విండీస్ స్పిన్నర్ యాన్నిక్ కరియా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో కార్నియా క్యాచ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బౌన్స్ అయి నేరుగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కాస్త క్రీజు నుంచి ముందు ఉన్నట్లు అన్పించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తొలుత రిప్లేలో హార్దిక్ క్రీజుకు చేరుకున్నప్పటికీ, బెయిల్స్ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాలిలో ఉన్నట్లు కన్పించింది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ పాండ్యాను రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో 5 పరుగులు చేసిన హార్దిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అస్సలు పాండ్యాది ఔటా? ఇక పాండ్యాపై రనౌట్‌పై బిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నౌటాట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచితే చాలు. ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే పరిగిణలోకి తీసుకోవాలి. అంటే బ్యాట్ గాలిలో ఉండగా స్టంప్ప్‌ను గిరాటేసినప్పటికీ.. బ్యాటర్ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ హార్దిక్ విషయంలో మాత్రం విండీస్‌కు ఫేవర్ థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ ☝️dismissed by a whisker🤏#Windies secure the big wicket of #HardikPandya 🫤 Keep watching #WIvIND - LIVE & FREE on #JioCinema in 11 languages ✨ #SabJawaabMilenge pic.twitter.com/00TiGVvFhs — JioCinema (@JioCinema) July 27, 2023 -
పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే! వీడియో వైరల్
మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్ ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో 142 పరుగులకే ఆలౌటైంది. సీటెల్ ఓర్కాస్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్ ఫిన్ అలెన్ విచిత్రకర రీతీలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? శాన్ ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ వేసిన కామెరాన్ గానన్ బౌలింగ్‌లో రెండో బంతిని అలెన్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డర్ కాస్త దూరంగా ఉండడంతో ఈజీగా పరుగు తీయవచ్చని అలెన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే ఫీల్డర్ షెహన్ జయసూర్య వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రీజుకు దగ్గరలో ఉన్న అలెన్ కాస్త వేగంగా పరిగిత్తే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోయి కింద పడిపోయింది. అంతలో షెహన్ జయసూర్య స్టంప్స్‌ను పడగొట్టడంతో అలెన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగులు చేసిన అలెన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అలెన్ రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రనౌట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. "పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే" అంటూ కామెంట్ చేశాడు. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి WHAT JUST HAPPENED⁉️ Was this the only way Finn Allen could get out tonight? HEADS-UP play and a BEAUTIFUL throw from Shehan Jayasuriya! 4⃣2⃣/1⃣ (3.2) pic.twitter.com/GZk5bkYG4Q — Major League Cricket (@MLCricket) July 16, 2023 -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పోరాడతోంది. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(108) పరుగులతో అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఏం జరిగిదంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. సాధారణంగా ఒక ఆటగాడు ఓవర్ పూర్తి అయిన వెంటనే క్రీజు నుండి బయటకు వచ్చే ముందు కీపర్ లేదా అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే డెడ్‌బాల్(ఓవర్ పూర్తి అయినట్లు)గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బెయిర్‌స్టో అలా చేయనందున అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని చూసిన బెయిర్ స్టో ఆశ్యర్యపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్‌స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆసీస్ ఛీటర్స్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా రనౌట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం సరికాదని ఆసీస్ జట్టుపై విమర్శల గుప్పిస్తున్నారు. మరి కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. చదవండి: Ind vs WI: వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఫోటో వైరల్ BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా? నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆడడం ఎందుకు?
యూరోపియన్ క్రికెట్ గేమ్‌లో సీరియస్‌నెస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్ ఉన్నా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్ చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లెగ్‌సైడ్ దిశగా ఆడి సింగిల్ కంప్లీట్ చేశాడు. ఫీల్డర్ బంతి అందుకొని కీపర్‌కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్ పూర్తి చేసిన స్ట్రైకింగ్ బ్యాటర్ రెండో పరుగు వద్దని సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించని నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్‌గా భావించిన కీపర్ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేయడం.. బ్యాటర్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్గారూ చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్ క్రికెట్లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్నెస్ కూడా లేదు.. ''పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. 😴 😴 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ZX7kP0OECa — European Cricket (@EuropeanCricket) June 23, 2023 చదవండి: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
#ShubmanGill: లవ్ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్‌లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్‌కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
చివరకు వికెట్ కీపర్ వెర్రిబాగులోడయ్యాడు!
క్రికెట్లో రనౌట్స్ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్ కీపర్ లేదా బ్యాటర్ లేదా ఫీల్డర్ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్ క్రికెట్ సందర్భంగా వికెట్ కీపర్ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ లాంగాఫ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్ ఎండ్ నుంచి మిడిల్ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్ అయ్యాననుకొని స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్ బెయిల్స్ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్ మాత్రం తాను బెయిల్స్ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ బ్యాటర్ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్ పడగొట్టలేదు నేను ఔట్ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్ చూపించాడు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడేస్తేనే రనౌట్ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్ చేయనందుకు సదరు బ్యాటర్ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్ ఏం చేయలేక బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/7mAlyHdHe9 — Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2023 చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!' -
ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్ రావత్.. అశ్విన్ డైమండ్ డక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో సూపర్ విజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు కదా.. ఆర్సీబీ బౌలర్ల దాటికి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బంతులు ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం ఎంఎస్ ధోనిని గుర్తుకుతెచ్చింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతిని హెట్‌మైర్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్ అశ్విన్‌కు రెండో పరుగు కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్ కీపర్ అనూజ్ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లిన రావత్.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లవైపు విసిరాడు. గతంలో ధోని కూడా ఇలాగే బ్యాక్ఎండ్ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన అనూజ్ రావత్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇక ఐపీఎల్లో ఒక బ్యాటర్ డైమండ్ డక్ అవ్వడం ఇది ఏడోసారి. ఇందులో ఐదుసార్లు సదరు జట్ల కెప్టెన్లు డైమండ్ డక్ కాగా.. రెండుసార్లు బ్యాటర్లు డైమండ్ డకౌట్ అయ్యారు. డైమండ్ డకౌట్ అయిన ఆటగాళ్లు ఎవరంటే షేన్ వార్న్ వర్సెస్ ముంబై ఇండియన్స్(2009) షేన్ వార్న్ వర్సెస్ సీఎస్కే(2010) గౌతమ్ గంభీర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(2013) ఇయాన్ మోర్గాన్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(2021) కేఎల్ రాహుల్ వర్సెస్ కేకేఆర్(2022) ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్) రవిచంద్రన్ అశ్విన్(రాజస్తాన్ రాయల్స్) వర్సెస్ ఆర్సీబీ 2023 Anuj Rawat channelling a bit of Dhoni? 🤯 Superb presence of mind from the #RCB gloveman 🤩#IPLonJioCinema #RRvRCB #TATAIPL #IPL2023 pic.twitter.com/WXrBSyhQds — JioCinema (@JioCinema) May 14, 2023 చదవండి: పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే -
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
జైశ్వాల్ శివతాండవం.. బట్లర్ త్యాగం ఊరికే పోలేదు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 150 పరుగుల టార్గెట్‌ను 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లోనే 98 పరుగులు నాటౌట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఇదే జైశ్వాల్ రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో బట్లర్ రనౌట్‌కు ప్రధాన కారణమయ్యాడు. జైశ్వాల్‌తో మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల బట్లర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హర్షిత్ రానా వేసిన నాలుగో బంతిని బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే బంతిని చూస్తూ బట్లర్ క్రీజు నుంచి కాస్త ముందుకు కదిలాడు. అయితే సింగిల్ కోసం వస్తున్నాడేమోనని భావించిన జైశ్వాల్ పరిగెత్తుకొచ్చాడు. ఇది గమనించిన బట్లర్ జైశ్వాల్‌ను వద్దని వారించకుండా తాను నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న రసెల్ మెరుపు వేగంతో త్రో విసరగా బట్లర్ డైరెక్ట్ హిట్‌కు బలయ్యాడు. ఒక రకంగా జైశ్వాల్‌ను ఔట్ చేయడం ఇష్టం లేక తన వికెట్‌ను త్యాగం చేశాడు. బట్లర్ త్యాగం అర్థం చేసుకున్న జైశ్వాల్ దానిని వృథా కానివ్వలేదు. తన కారణంగా బట్లర్ ఔటయ్యాడన్న కోపంతో మరింత ధాటిగా ఆడాడు. దీంతో జైశ్వాల్.. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న సమయంలో డగౌట్లో బట్లర్ పైకి లేచి చప్పట్లతో అభినందించడం హైలెట్‌గా నిలిచింది. The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 చదవండి: జైశ్వాల్ సెంచరీ కోసం తపించిన శాంసన్.. -
'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే ప్రభావం చూపాల్సింది పోయి తన జట్టు ఆటగాడికే ఎసరు పెట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ను అనవసరంగా రనౌట్ అయ్యేలా చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ తొలి బంతిని మనీష్ పాండే కవర్స్ దిశగా ఆడాడు. మనీష్ ముందుకు కదలడంతో సింగిల్‌కు పిలిచాడనుకొని మార్ష్ పరిగెత్తాడు. మనీష్ పరిగెత్తినట్లే చేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే మార్ష్ సగం క్రీజు దాటాడు. బంతిని అందుకున్న రహానే తెలివిగా వ్యవహరించాడు. త్రో వేయకుండా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. మార్ష్ స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నప్పటికి మనీష్ పాండే తన వికెట్‌ను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రహానే వికెట్లను ఎగురగొట్టడంతో పాపం మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ తప్పంతా మనీష్ పాండేదే అని క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చిన మార్ష్.. మనీష్ పాండేను ముందుకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. అయితే మార్ష్ ఔట్‌కు తానే కారణమని తెగ బాధపడిపోయిన మనీష్ పాండే తన చేత్తో హెల్మెట్‌ను బలంగా కొట్టుకోవడం కొసమెరుపు. ఇక మార్ష్‌ను ఔట్ చేసి తాను ఏమైనా ఆడాడా అంటే అదీ లేదు. పైగా 29 బాల్స్ ఎదుర్కొని 27 పరుగులు చేసి పతీరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే పనితనం ఎలా ఉందంటే.. తాను ఆడకపోగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా ఔట్ చేసి విలన్‌గా తయరయ్యాడు. దీంతో మనీష్ పాండేపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా రనౌట్ చేశావు.. ఆడేవాడిని ఔట్ చేశావు.. నువ్వు ఆడకపోయావో అంతే సంగతి.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి! It’s so hilarious to see the way Manish Pandey bodied Marsh after calling him halfway through! 🤣🤣 pic.twitter.com/TIxVPOAlvj — Akif (@KM_Akif) May 10, 2023 Impact of Manish Pandey 🔥 pic.twitter.com/tNhUZtCF3i — Indian Memes (@Theindianmeme) May 10, 2023 చదవండి: రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు