Saikumar
-
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్ఆర్ నగర్లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. -
క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభం
లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. విలేజ్ ప్రేమకథ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దిగంగనా సూర్యవంశీ ఇందులో హీరోయిన్. ఈ చిత్రాన్ని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు. సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. -
Aadi Saikumar: ఆది సాయికుమార్ మరదలి ఎంగేజ్మెంట్.. హీరో కూతుర్ని చూశారా? (ఫోటోలు)
-
'అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని..' సూసైడ్ నోట్ రాసి యువకుడు..
సాక్షి, నిజామాబాద్: ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ (23) తాగుడికి బానిసై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి రాజు బాయి దత్తత కుమారుడు సాయికుమార్ తాగుడికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. తరచూ తల్లితో గొడవ పడుతూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తల్లిని కొట్టాడు. దీంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లి లేని సమయంలో శనివారం రాత్రి నా చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని, మరో జన్మలో నీ కడుపునే పుట్టాలని ఉందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో.. -
ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు..!
-
Natho Nenu Review: 'నాతో నేను' సినిమా రివ్యూ
టైటిల్: నాతో నేను నటీనటులు: సాయికుమార్, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి, ఐశ్వర్య తదితరులు బ్యానర్: శ్రీ భవ్నేష్ ప్రొడక్షన్స్ సమర్పణ: ఎల్లలుబాబు టంగుటూరి నిర్మాత: ప్రశాంత్ టంగుటూరి సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్‌రెడ్డి సంగీతం: సత్య కశ్యప్ ఎడిటింగ్: నందమూరి హరి దర్శకత్వం: శాంతి కుమార్ తూర్లపాటి డైలాగ్ కింగ్ సాయి కుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నాతో నేను'. జబర్దస్త్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాంతి కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుల్లితెరపై కామెడీతో అలరించిన ఈయన.. డైరెక్టర్‌గా వెండితెరపై సత్తా చాటాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? ఓ గ్రామంలో కోటీశ్వరరావు(సాయికుమార్) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కష్టాన్ని తెలుసుకుని వరమిస్తాడు. మరోవైపు కోటిగాడు(సాయి శ్రీనివాస్), దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై లవ్ చేసుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపోయేసరికి సాయికి ఐశ్వర్య హ్యాండ్ ఇస్తుంది. మరో స్టోరీలో ఓ మిల్లులో పనిచేసే కోటిగాడు (ఆదిత్య ఓం).. నాగలక్షీ(దీపాలి) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. 60 ఏళ్ల కోటీశ్వరరావు, 40 ఏళ్ల కోటిగాడు, 20 ఏళ్ల కోటీగాడు జీవితంలో ఏం జరిగింది? స్వామిజీ కోటీశ్వరరావుకి ఇచ్చిన వరం ఏంటనేది 'నాతో నేను' స్టోరీ. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? మనిషి అనే దానికంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అనే స్టోరీతో తీసిన సినిమా ఇది. 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు ఆర్టిస్ట్‌లు నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి, దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఈ సినిమాతో ఇచ్చారు. సాయికుమార్ డైలాగ్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. వాళ్ల పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్తవాళ్లే అయినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్‌గా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం కోసం ఓసారి చూడొచ్చు. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఎవరెలా చేశారు? కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పనిచేస్తూ, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన బాగుంది. బ్రేకప్ అయిన కుర్రాడి పాత్రలో సాయి శ్రీనివాస్ బాగా నటించాడు. మొదటిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్ మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు. కానీ దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డారు. మాటలు బావున్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకటుకున్నాయి. రెట్రో సాంగ్, ఐటెమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. 'మనిషి ఎంత డబ్బు సంపాదించిన మన అని తోడు లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు అని నిదర్శనమే నాతో నేను సినిమా సినిమాతో నిదర్శనం ఇలాంటి సినిమాలు సొసైటీ చాలా అవసరం' (ఇదీ చదవండి: ‘డిటెక్టివ్ కార్తీక్’ మూవీ రివ్యూ) -
‘నాతో నేను’ రెట్రో సాంగ్ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్
‘‘నాతో నేను’ చిత్రంలోని రెట్రో సాంగ్ వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ పాటను తీర్చిదిద్దారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రల్లో శాంతకుమార్ తూర్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ఈ పాట చూస్తే ప్రేక్షకులు 1980 జ్ఞాపకాల్లోకి వెళతారు’’ అన్నారు శాంతకుమార్. ‘‘త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ప్రశాంత్ టంగుటూరి. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, నేపథ్య సంగీతం: ఎస్ చిన్న, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి. -
ఇన్విజిలేటర్ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం
నర్సంపేట రూరల్: పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ మందలించి, చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్యా ఈర్య– పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు భూక్య సాయికుమార్ (23) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో అదే పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన ఇన్విజిలేటర్.. సాయికుమార్‌ను మందలించి కొట్టాడు. దీంతో మనోవేదనకు గురై, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్ మృతికి ఇన్విజిలేటర్, యాజమాన్యం కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహంతో కాలేజీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులతో మాట్లాడిన నర్సంపేట సీఐ పులి రమేష్çగౌడ్... మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌రాజ్‌ను వివరణ కోరగా... సాయి కుమార్ అనే విద్యార్థి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తోపాటు బుక్‌లెట్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, గుర్తించిన ఇన్విజిలేటర్ మందలించి, తమ వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థి రిక్వెస్ట్‌తో పరీక్ష రాసేందుకు అనుమతించామే తప్ప.. ఎవరూ కొట్టలేదన్నారు. -
‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’
హైదరాబాద్: రెండు సెల్ఫోన్లు పోయాయనే బెంగ. మరో ఫోన్ కోసం నాన్నకు భారం కావద్దన్న ఆవేదన.. ఆ యువకుణ్ని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. ‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అంటూ సోదరుడికి ఫోన్ చేసి బలవర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన చుక్కా శ్రీనివాస్ పంజగుట్ట నిమ్స్‌మేలో పని చేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు సాయికుమార్ (21) నగరంలోని ఓ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ చదువుతూనే పార్ట్ టైమ్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం సాయికుమార్ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస్ కుమారుడికి ‘ఈఎంఐ’ పద్ధతిలో రూ.28 వేల విలువ చేసే మరో సెల్‌ఫోన్ కొనిచ్చాడు. గత శుక్రవారం ఆ ఫోన్ సైతం పోయింది. దీంతో సాయికుమార్ లోలోపల కుమిలిపోయాడు. శనివారం బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం పాదచారుల ఫోన్ ద్వారా తన సోదరుడు వినోద్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అమ్మా నాన్నను నువ్వే బాగా చూసుకోవాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆందోళన చెందిన బంధువులు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు తుకారం గేటు వద్ద పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మృతదేహం తమ కుమారుడు సాయికుమార్దేనని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆది సాయికుమార్ ‘టాప్‌గేర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వైరల్ : ఘనంగా సాయికుమార్ షష్టిపూర్తి వేడుకలు
Sai Kumar Shashti Poorthi : ప్రముఖ నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సాయికుమార్ ఆ తర్వాత పలు సపోర్టింగ్ క్యారెక్టర్లతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్ భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సాయికుమార్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికుమార్ హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే పోలీస్ స్టోరీలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం బుల్లితెరపై వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్న సాయికుమార్ సినిమాల్లోనూ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏకాంబరం
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం (జూలై 27) సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్ర ఏకాంబరం లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: జె. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
‘కాలేజ్ కుమార్.. లైఫే డమార్’
నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించారు. కన్నడ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క తండ్రి కనెక్ట్ అయ్యే సినిమా ‘కాలేజ్ కుమార్’అని పేర్కొన్నాడు. విజయ్ మాస్టర్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి ఆనందంగా ఫీలయ్యానన్నాడు. మంచి ఎమోషన్, ఫీల్ ఉన్న సినిమా అని.. మార్చి 6న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించాలని సాయి కుమార్ కోరాడు. ‘ఈ సినిమాలో మర్చిపోలేని పాత్ర చేశాను. రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈసినిమాను కూడా తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సెంటిమెంట్, ఫన్ ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ విజయ్, డైరెక్టర్ హరి సంతోష్, సురేష్ కొండేటి, హీరో హీరోయిన్లు, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’ ‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ -
అంతర్వేది స్వామివారి సన్నిధిలో హీరో ఆది..
సాక్షి, సఖినేటిపల్లి: ప్రముఖ సినీనటుడు సాయికుమార్, ఆయన తనయుడు హీరో ఆది కుటుంబ సమేతంగా అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సాయికుమార్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహర్షికి విలన్?
కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా సినిమాలు చేసిన నటుడు సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. వీలైనప్పుడు ప్రతినాయకుడి పాత్రలు చేస్తున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ చిత్రాల్లో ఆయన విలనిజమ్‌కి మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు. తాజాగా మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవడు’ చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సాయికుమార్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ‘మహర్షి’లో కూడా మంచి పాత్ర డిజైన్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ‘మహర్షి’ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అందుకే నన్ను ఓడించారు: సాయికుమార్
విజయవాడ: కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ఉంటాయన్న నమ్మకం తనకు లేదని నటుడు, బీజేపీ నేత సాయికుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ అమ్మవారిని సాయికుమార్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెళ్లి వేడుక నిమిత్తం విజయవాడ వచ్చినట్లు తెలిపారు. ‘నా స్వరం నాన్నగారిది, ఆయన స్పూర్తి నన్ను ఈ స్థాయిని తీసుకు వచ్చింది. పుష్కరాల సమయంలో నా గొంతుకతో సేవ చేసే భాగ్యం కలిగింది. సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులతో కలిసి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉంది. నా కుమారుడు ఆది మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాడు. రాజకీయాల్లో కూడా సినిమాల మాదిరిగా గెలుపు ఓటములు ఉంటాయి. దేశానికి మనం ఏం చేశాము అనే ఆలోచనతో ఉన్నానని, ప్రజలకు నాపై ఇంకా నమ్మకం కలగలేదని, అందుకే నన్ను గెలిపించలేదు. నాకు దేశభక్తి మెండుగా ఉంది. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. విభజన తర్వాత విజయవాడ బాగా అభివృద్ధి చెందింద’ని వెల్లడించారు. రాజకీయంగా శత్రువులు లేకపోయినా ప్రత్యర్థులు ఉంటారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. -
సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ‘బతకాలని లేదు.. ఉండలేకపోతున్నా.. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష.. ఏమీ సాధించలేకపోయా.. నాకు జీవితం మీద విరక్తి వచ్చింది.. అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోకిలారం గ్రామానికి చెందిన బత్కుల సాయికుమార్ (21) గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పంజాల అనిల్‌కుమార్ కాలనీలో రూమ్ అద్దెకు తీసుకుని స్నేహితులతో కలసి ఉంటున్నాడు. రిలయన్స్‌లో మార్కెట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్యూకు వెళ్లి వచ్చాడు. సెలెక్ట్ కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి పది గంటలకు బయటి నుంచి ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫోన్లో రికార్డు చేసిన వీడియోను పోలీసులు గుర్తించారు. తొలుత ఆత్మహత్యాయత్నం.. విరమణ ‘బతకాలని లేదు.. ఉండలేక పోతున్నా,,,, అందరినీ మిస్ అవుతున్నా.. నాలా ఎవరూ చేయకండి..’అంటూ ఆ సెల్ఫీ వీడియోలో ఉంది. సెల్‌ఫోన్ ఆన్ చేసి పెట్టి కుర్చీ ఎక్కి మెడకు ఉరి బిగించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ.. ధైర్యం సరిపోక మెడకు ఉన్న క్లాత్‌ను తొలగించి కిందికి దిగినట్టు సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. చావాలని ఉంది... కానీ ధైర్యం సరిపోవడం లేదంటూ వీడియోలో రికార్డై ఉంది. అయితే ఆత్మహత్య చేసుకున్నప్పటి వీడియో మాత్రం లభించలేదు. మొదట తన ప్రయత్నాన్ని విరమించుకుని, కొద్దిసేపటి తరువాత ఉరేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామసూర్యన్ తెలిపారు. సాయికుమార్ మృతికి రూమ్మేట్స్, స్నేహితులు కారణం అయి ఉండవచ్చని మృతుడి సోదరుడు సుధీర్ పోలీసులకు తెలిపాడు. మృతుడి తల్లిదండ్రులు, సోదరిది కూడా బలవన్మరణమే.. సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సాయికుమార్ కుటుంబంలో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం సాయికుమార్ తండ్రి ఆత్మహత్య చేసుకోగా తల్లి, సోదరి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. జీవితంపై విరక్తి చెందే సాయికుమార్ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
వీరి బొమ్మ హిట్టా.. ఫట్టా?
సాక్షి, బెంగళూరు: పలువురు సినీ ప్రముఖులు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఉమాశ్రీ, జగ్గేశ్, సాయికుమార్, శశికుమార్, బీసీ పాటిల్, సీపీ యోగేశ్వర్, మధు బంగారప్ప, కుమార బంగారప్ప, నిర్మాత కుమారస్వామి, సీఆర్ మనోహర్, మునిరత్న నాయుడు తదితరులు వీరిలో ఉన్నారు. వీరి రాజకీయ చిత్రం హిట్ అవుతుందా..? తుస్సుమంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ► సీనియర్ నటి, ప్రస్తుత మంత్రి ఉమాశ్రీ కాంగ్రెస్ టికెట్‌పై తెరదాళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆమె పోటీ చేసి విజయం సాధించారు. ► తెలుగు వారికి ఎంతో సుపరిచితుడయిన నటుడు సాయికుమార్. ఆయన బీజేపీ తరఫున తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బాగేపల్లి నుంచి బరిలో ఉన్నారు. ► మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప ఇద్దరు కుమారులు కుమార బంగారప్ప, మధు బంగారప్పలు కూడా పలు కన్నడ చిత్రాల్లో హీరోలుగా రాణించారు. ప్రస్తుతం కుమార బీజేపీ నుంచి, మధు జేడీఎస్ పార్టీల నుంచి సొరబ నియోజకవర్గంలో ముఖాముఖి తలపడుతుండటం విశేషం. ► ప్రముఖ నటుడు శశికుమార్ కాంగ్రెస్ టికెట్‌పై మాళకాల్మురు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఇటీవలే జేడీఎస్ తీర్థం పుచ్చుకుని, హోసదుర్గలో బరిలో దిగారు. ► గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నటుడు జగ్గేశ్ ప్రస్తుతం బెంగళూరు యశ్వంతపుర నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో వొక్కళిగ వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ వర్గం ఓటర్లను బాగానే ప్రభావితం చేయగలరని బీజేపీ ఆశిస్తోంది. ► నటుడు బీసీ పాటిల్ కాంగ్రెస్ తరఫున హిరేకెరూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడే ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► నటుడు, రాజకీయ నేత సీపీ యోగేశ్వర్ చన్నపట్టణ నియోజవర్గం నుంచి జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిపై పోటీలో దిగారు. ► చలన చిత్ర రంగం, టీవీ సీరియల్లలో నటునిగా పేరు పొందిన నె.ల.నరేంద్ర బాబు ఈసారి బీజీపీ అభ్యర్థిగా మహాలక్ష్మి లేఔట్లో పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► సినీ నిర్మాత మునిరత్న నాయుడు రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేస్తున్నారు. ► అయితే, రెబెల్ స్టార్ అంబరీష్ ఆశ్చర్యకరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. -
మోదీపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరైనవి కాదు
-
మందు కొట్టి.. యువతి ర్యాష్ డ్రైవింగ్
హైదరాబాద్: స్నేహితులతో కలసి కారులోనే పార్టీ చేసుకుని, మద్యం సేవించారు. అదే మత్తులోనే ఓ యువతి మితిమీరిన వేగంతో కారు నడిపింది. దీంతో కారు అదుపు తప్పి యాక్టివాను ఢీకొట్టింది. శనివారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యాక్టివాపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు బోర బండకు చెందిన రామాయణం చిరంజీవి(20)గా, క్షతగాత్రుడు రామనాతి సాయికుమార్(20)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకురాలైన న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్(26)ను అదుపులోకి తీసుకుని, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా 51 శాతం బీఏసీ రీడింగ్ నమోదైందని పోలీసులు చెప్పారు. ఆదివారం రాయదుర్గం ఎస్ఐ నదీమొద్దీన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్, లీజా.. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ కోకాపేట్‌లోని బ్లాసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం స్నేహితుడు రవనీత్ సింగ్‌ను కలిసి.. రాత్రి జూమ్‌కార్‌లో క్రెటా కారును అద్దెకు తీసుకొని కారులోనే పార్టీ చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు లీజాతో కలసి కారు నడుపుకుంటూ మాదాపూర్ నుంచి నిర్మాణంలో ఉన్న టీహబ్ మీదుగా రాయదుర్గం వైపు వెళుతున్నారు. మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ కారును మితిమీరిన వేగంతో నడుపుతూ బయోడైవర్సిటీ వద్ద హోండా యాక్టివాను ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న చిరంజీవి, సాయికుమార్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. మాదాపూర్‌లోని జుమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న చిరంజీవి రోజూమాదిరిగానే విధులు ముగించుకొని స్నేహితుడు సాయికుమార్‌తో కలసి యాక్టివాపై గచ్చిబౌలి నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉన్న ఒక్క కుమారుడు చిరంజీవి మృతి చెందడంతో రామాయణం శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పల్టీలు కొట్టిన కారు.... మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. క్రేటా కారులో బెలూన్ ఓపెన్ కావడంతో జెన్నీ, లీజాకు గాయాలు కాలేదు. కారులో బీరు సీసాలు, చికెన్ లెగ్ పీస్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నదీమొద్దీన్ తెలిపారు. -
వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్టిస్ట్ సురేష్ కమల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దివ్య మణి’. వైశాలి, కిమయా కథానాయికలు. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్, రెడ్ నోడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గిరిధర్ గోపాల్–స్టీవ్ శ్రీధర్ స్వరపరచిన ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. లెజెండరీ డ్యాన్సర్, పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్‌ల గ్రహీత డా. యామిని కృష్ణమూర్తి పాటల సీడీలను విడుదల చేసారు. సురేష్ కమల్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ఇది నా తొలి చిత్రం. యోగా నేర్పటం కోసం నేను ప్రపంచమంతా తిరిగినా తెలుగు నేలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కథ చెప్పారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశా. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘మనిషి తనని తాను జాగృతి పరచుకోవటానికి సృజనాత్మకత ఎంతో అవసరం. పాటలు బాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తీస్తాం’’ అన్నారు గిరిధర్ గోపాల్. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు సాయికుమార్, మాటల రచయిత బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాటా, నేపథ్య సంగీతం: స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్. -
బాలాజీ మహిమలతో...
సాయికుమార్, సుమన్, యస్.పి బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ శ్రీ చిలుకూరి బాలాజీ’. ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏయస్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రమణ సౌజన్యంతో నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాను విడుదల చేయిస్తున్నారని అల్లాణి శ్రీధర్ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ– ‘‘యువతరానికి వీసాల బాలాజీగా ఆశీర్వాదాలు అందిస్తూ తరతరాలుగా ఆరాధించబడుతున్న చిలుకూరి బాలాజీ గొప్పతనాన్ని, ఆ ఆలయ పురాణాన్ని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించాం. చినజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. అర్జున్ మంచి సంగీతాన్ని అందించారు. సుద్ధాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, రాపర్తి వీరేంద్ర, రాణి పులోమజాదేవి మంచి సాహిత్యం అందించారు. సినిమాను మెచ్చి రిలీజ్ చేస్తున్న ‘దిల్’ రాజుకి ధన్యవాదాలు’’ అన్నారు. -
ప్రతి రైతు.. ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా
సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఇందులో కశిస్ వోహ్రా కథానాయిక. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రచయితలు సప్తగిరి కోసం డిఫరెంట్ కథలు రాస్తారు. రామానాయుడుగారు బతికి ఉంటే చరణ్ లక్కాకులకు చాన్స్ ఇచ్చేవారు. మంచి లీగల్ పాయింట్ ఉన్న సినిమా ఇది. ప్రతి రైతు, ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా. చివరి 45 నిమిషాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లు, పాటలను విడుదల చేసిన సెలబ్రిటీలందరికీ థ్యాంక్స్. వారి వల్ల సినిమాకు హైప్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు. ‘‘నేను పరుచూరి బ్రదర్స్గారి దగ్గర వర్క్ చేశాను. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగ్స్ రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చరణ్ లక్కాకుల. ‘‘సాయికుమార్‌గారు, శివప్రసాద్‌గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. పరుచూరి బ్రదర్స్ మా సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతకు రుణపడి ఉంటా’’ అన్నారు సప్తగిరి. -
బి. జయకు సిల్వర్ క్రౌన్!
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమాలో ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ప్రముఖ మహిళా దర్శకురాలు జయ బి. గారిని ‘సిల్వర్ క్రౌన్’ పురస్కారంతో సత్కరిస్తున్నామని ‘అక్కినేని–ఫాస్’ ఫిల్మ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా‘‘ కె. ధర్మారావు తెలిపారు. 2017 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనున్న కార్యక్రమంలో జయ బి.ని సత్కరించనున్నారు. ‘అక్కినేని–ఫాస్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రాలుగా ‘ప్రేమమ్, శతమానం భవతి, ఫిదా, నిన్ను కోరి, వైశాఖం’ (2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకున్నారు)లను ఎంపిక చేశారు. నటుడు సాయికుమార్‌ను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్.