Sandarbham
-
దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసింది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్వి ళ్లూరుతున్న బీజేపీకీ, అధి కార గులాబీ పార్టీకీ ఇక్కడ విజయం అనివార్యంగా మారింది. రాబోయే శాసనసభ ఎన్నికల పోరా టానికి ఇది కచ్చితంగా మొదటి అడుగు కాబో తోంది. కాంగ్రెస్ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నా ధన ప్రవాహమే చోదకశక్తిగా మారినందున ఆ పార్టీ దూకుడు కనబర్చలేకపోతోంది. ఢిల్లీలోనూ, రాష్ట్రం లోనూ ఉన్న అధికార పార్టీలపై ఉన్న వ్యతిరేకత పైనే హస్తం పార్టీ ఆశలన్నీ. అయితే ప్రచారంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ మిగతా రెండు పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉంది. కాంగ్రెస్ తెచ్చుకునే ఓట్లను బట్టి ఫలితం ఎటైనా తిరగ బడొచ్చు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా మును గోడు అభివృద్ధికి నోచుకోలేదు. 2.42 లక్షల ఓట ర్లున్న ఈ నియోజకర్గం ఫ్లోరోసిస్ నుంచి విముక్తమై ఇప్పుడిపుడే కోలుకుంటోంది. మునుగోడు బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభివృద్ధి ఎజెండాలను పేర్కొనడం కంటే పరస్పర విమ ర్శలు, తిట్లదండకాలతో వినోదం పంచుతు న్నాయి. మరోవైపు మెజారిటీ ఓటర్లు తమ ఓట్లకు దక్కే మూల్యంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి ఎంత వెదజల్లుతారనేదే గెలుపును నిర్ణయించే ప్రధాన అంశం అయింది. రాజ్యాంగం లోని మూడో అధికరణ, ఆర్టికల్ 84 – 174 ప్రకారం పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు ఒక ప్రమాణ పత్రం సమర్పిస్తారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్(ఈసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పడమే ఈ ప్రమాణ పత్రం ఉద్దేశం. కానీ జరుగుతున్నదేమిటి? అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.40 లక్షలు దాటకూడదు. నామినేషన్ వేసిన రోజు నిర్వహించే ర్యాలీలు, ప్రచార హంగామాకే 50 లక్షల దాకా వెదజల్లు తున్న పరిస్థితి. నేతల ప్రసంగాలు వినడానికి రోడ్డుపై గంట సేపు నిలబడటానికి కార్యకర్తలు చేస్తున్న ఛార్జి రూ. 500 లేదా అంతకు మించి. ఊరేగింపులో ద్విచక్ర వాహనంతో పాల్గొంటే ఒక రేటు, కారుతో వస్తే ఇంకాస్త ఎక్కువ భత్యం ఇవ్వాల్సి వస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ మొదలై నప్పటి నుంచీ రూ. 20 కోట్ల దాకా లెక్క చెప్పని డబ్బు, హవాలా మనీ పట్టుబడింది. ప్రధాన అభ్య ర్థుల ఎన్నికల వ్యయం రూ. 500 కోట్లు దాటు తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మునుగోడులో మూడు ప్రధాన పార్టీల తరఫున దాదాపు 4 వేల మంది బయటి వాళ్లు తిష్ట వేసి ఉన్నారు. వీరి వాహనాల వ్యయం, బస, తిండి ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో వేయాల్సి ఉంది. మునుగోడుకు చెందిన దాదాపు 40 వేల మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా మందికి నియోజకవర్గం వెలుపలి ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వాటిలో జమ అయ్యే నిధులను ఎలా లెక్కిస్తారు? పైగా పోలింగ్ రోజు నియోజకవర్గం వెలుపల ఉన్న వారందరినీ డబ్బు ముట్టచెప్పి, రవాణా ఖర్చులు చెల్లించి పిలిపి స్తున్నారు. ఒకప్పటిలా అభ్యర్థులు ప్రచారానికి మీడి యాలో ప్రకటనలు ఇవ్వడం లేదు. పెయిడ్ వార్తలు వేయించుకుని భారీ మొత్తం చెల్లిస్తున్నారు. దీన్ని గుర్తించి నిరూపించడం అంత తేలిక కాదు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘ భవ నాలు, పేద వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చే హామీలు ఎన్నికల్లో గెలిస్తే నెరవేరుస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత చేసే వ్యయంపై ఎవరి నిఘా ఉంటుంది? దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలవబోతోంది. ఓటుకు ఎంత చెల్లించి కొనుక్కుం టారనేది పోలింగుకు రెండు, మూడు రోజుల ముందు తెలవొచ్చు. మొత్తంమీద ఉప్పెనలా ప్రవహిస్తున్న ధనం ఈసీ నియమావళిని అపహాస్యం చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో రూ. 50,000 కోట్ల బ్లాక్ మనీ చేతులు మారిందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ వెల్లడించింది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆందో ళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత జరగాల్సిన ప్రక్షాళన గురించి, డబ్బు, మద్యం ప్రలోభాలు లేని స్వేచ్ఛా యుత ఎన్నికల గురించి అనేక చర్చలు జరిగాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అందులో భాగ స్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు పరివర్తనకు సిద్ధంగా లేనప్పుడు మునుగోడు లాంటి బై ఎలక్ష న్లలో అభ్యర్థుల చెల్లింపు శక్తే జయాపజయాలను నిర్దేశిస్తుంది. ఇటువంటి ఎలక్షన్ నిర్వహించడం కంటే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కువ ‘వితరణ’ కోట్ చేసిన అభ్యర్థి విజయం సాధించినట్టుగా ప్రక టించడం ఉత్తమం అనే నిస్పృహతో కూడిన సూచ నలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బులో సగం ఓటర్ల ఖాతాలకు బదిలీచేసి మిగిలిన మొత్తాన్నీ అభివృద్ధి పనులకు వ్యయం చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తే ఏ గొడవా ఉండదేమో! ప్రజాస్వామ్య విరుద్ధమనిపించినా జరుగుతున్నది అదే కదా!! బీటీ గోవింద రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు / సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!? అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ నారా యణరావు తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగా రావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీ కాంత్ శ్రీనివాస రామరాజ్.’ కర్ణాటక రాష్ట్రంలోని ‘రట్టహళ్లి’ గ్రామంలో 9 సెప్టెంబర్ 1914న జన్మించారు. ‘కాళన్న’గా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. తెలంగాణ జీవిత చలనశీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. స్వాతంత్య్ర సమరయోధుడు. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ ‘కాళన్న’గా పరిణామం చెందడం ఒక చారిత్రక ఘట్టం. కాళోజీ తెలంగాణ భాష, యాసలను తరతరాలకు తెలిసే విధంగా రచనలు చేశారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి, ప్రజాకవిగా నిలిచారు. కవిత్వంతో ప్రజలను నిద్రలేపారు. మనిషితనం పట్ల ప్రేమ కలిగిన కాళోజీకి తెలంగాణ యాసపై విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. కాళోజీ తన భాషాసోయిని తెలుగు ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపింపజేసిన వ్యవహారదక్షుడు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష గావాలె’ అని వ్యావహారిక భాషను అందలమెక్కించిన భాషావాది. శతాబ్దపు జీవన ప్రయా ణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వీ కరించిన వ్యక్తి. ‘నేను ప్రస్తుతాన్ని/ నిన్నటి స్వప్నాన్ని/ రేపటి జ్ఞాపకాన్ని’ అని చెప్తూ... ఒక్కమాటలో తన వస్తుతత్వాన్ని చెప్తాడు. అలాగే ‘నవ యుగంబున నాజీ నగ్న నృత్య మింకెన్నాళ్ళు... / హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వ మింకెన్నాళ్లు...’ అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన యోధుడు. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట’ అంటూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా... భూస్వామ్య వాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. వ్యక్తిత్వం, కవిత్వం వేర్వేరు కాని మనీషి కాళోజీ. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ. జీవితం, కవిత్వం, రాజకీయాలు అన్నింటిలోనూ కాళోజీ ప్రజాస్వామికవాది. ఇంకా చెప్పాలంటే తీవ్ర ప్రజాస్వామిక వాది. కేవలం పౌర హక్కులకే కాదు, సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించటంలో ఆయన ముందుండేవారు. ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను / దూరందాకా తన్ని తరుముతం / ప్రాంతం వారే దోపిడీ చేస్తే / ప్రాణంతోనే పాతర వేస్తం’ అని దళారుల అణచివేత, దోపిడీలను, వాళ్ళతో మిలాఖతయిన ప్రాంతం వారిని నిర్ద్వంద్వంగా ఖండించారు. కలం సిరాను ‘న భూతో న భవిష్యతి’గా వర్ణించిన విశిష్ట కవి కాళోజీ నారాయణరావుకు శత సహస్ర వందన చందన ములతో తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘కాళన్న యాదిలో...’ కవితా సంకలనాన్ని 226 మంది కవులతో పుస్తకం తెచ్చింది. అనేక దేశాల్లో వివిధ రంగాలలో... కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులైన తెలుగు వారిని గుర్తించి ‘ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాలు అందించింది. నేడు ఆ మహాను భావుని జయంతి సందర్భంగా ఘనమైన నివాళి. దాసరి (జంగిటి) శాంతకుమారి వ్యాసకర్త వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘ మొబైల్: 96524 83644 (నేడు కాళోజీ జయంతి) -
Ukraine Russia War: కానరాని యుద్ధ విరమణ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచానికి ఆశ్చర్యమేం కాదు. ఆశ్చర్యం ఏంటంటే.. ఉక్రె యిన్ ప్రతిఘటన రష్యాకు దీటుగా ఉండటం. ఉక్రెయిన్ తిరుగుదాడులతో రష్యన్ దళాలకు అపరిమితమైన నష్టం వాటిల్లుతుండటం! ఈ ఘర్షణల కదలికలను గమనిస్తుంటే వ్యూహా త్మకమైన అనేక భౌగోళిక, సామాజిక, ఆర్థిక సమస్యలు కేవలం ఆ రెండు దేశాలపైనే కాక యావత్ ప్రపంచం మీదా విస్తృత ప్రభావాన్ని చూపబోతున్నట్లే ఉంది. ట్రంప్ మాదిరిగా ఏకపక్షంగా కాకుండా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మిత్రపక్షాలన్నిటినీ కలుపుకొని రష్యాపై విధించిన ఆంక్షలకు ఆయా దేశాలు గట్టి మద్దతునే ఇస్తు న్నాయి. యు.ఎస్. ఇంత చేస్తుందనీ, ఆంక్షల ప్రభావం ఇంతగా ఉంటుందనీ రష్యా ఊహించక పోయుండొచ్చు. సైనిక శక్తిలో ఆధిక్యం కలిగి ఉన్నప్పటికీ రష్యా లక్ష్యాలు నెరవేరకపోవడం అన్నది క్షేత్రస్థాయి సమస్యలకు ఒక సంకేతం అయింది. ఘర్షణలు ఇలా కొనసాగుతూ పోతే కనుక, సైనిక నష్టంతో పాటుగా.. రష్యా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన చేదు ఫలితాన్నే రష్యా ఇక్కడా చవి చూడవచ్చు. అదే జరిగితే కనుక రష్యాకు ఇది మరొక విపత్తు అవుతుంది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఆ దేశానికి ఏళ్లు పట్టవచ్చు. మరొక ప్రధాన సమస్య.. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళుతున్న ఉక్రెయిన్ పౌరుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీగా శరణార్థి సంక్షోభం ఏర్పడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 31 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని వదిలి వెళ్లారని అంచనా. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. దీనర్థం ఏంటంటే ఉక్రెయిన్ సమస్య పొరుగు దేశాలకు సమస్యగా మారడం మొదలైందనీ; శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆ దేశాలు సామాజికంగా, ఆర్థికంగా ఒత్తిళ్లకు గురి కాబోతున్నాయనీ; ఇప్పట్లో కనుక ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన జరకపోతే శరణార్థులుగా తమ భూభాగంలోకి వచ్చిన వారిని దీర్ఘకాలం తమ సంరక్షణలో ఉంచుకోక తప్పని స్థితిలో ఆ దేశాలు తమవైన సామాజిక, ఆర్థిక సంక్షోభాలలో పడిపోతాయనీ. పైకి తెలియని మరొక అంశం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధం వల్ల పెరిగే ఆర్థిక భారం. 117 మిలియన్ డాలర్ల విలువైన బాండ్ల బకాయీలను రష్యా ఎలా తీరుస్తుందని మొన్నటి వరకు అన్ని దేశాలూ వేచి చూశాయి. గడువు తీరినా రష్యా తీర్చలేకపోయింది. మరో 150 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని రష్యా కంపె నీలు, ప్రభుత్వం బకాయీ పడ్డాయి. అందులో కంపెనీల అప్పు 105 బిలియన్ డాలర్లు. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రష్యా కరెన్సీ విలువ దాదాపు 35 శాతం పడిపోయింది. ఫలితంగా దేశంలో వడ్డీ రేట్లు, ధరలు పెరిగిపోయాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే రష్యాకు ఈ అప్పులు తలకు మించిన మొత్తాలేమీ కాదు. అయితే అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా తమ విదేశీ నిల్వల్లో సగభాగం.. దాదాపుగా 300 బిలియన్ యూఎస్ డాలర్ల మొత్తాన్ని కదిల్చేందుకు లేకుండా పోయిందని రష్యన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. రష్యా బకాయీలు ఈ స్థాయిలో పేరుకు పోవడం అన్నది ఇది మూడోసారి. 1917లో ఒకసారి, 1998లో ఇంకోసారి ఇలా జరిగింది. రష్యా ప్రభుత్వం మాత్రమే ఈ ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకుపోలేదు. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన ప్రపంచ సంస్థలు కూడా ఇరుకున పడ్డాయి. వాటికీ, రష్యా కంపెనీలూ ప్రభుత్వానికీ మధ్య ఆర్థికపరమైన మార్కెట్ లావాదేవీలు మరి కొన్నేళ్ల వరకైనా సజావుగా జరిగే అవకాశాల్లేవు. దీనికి తోడు సరఫరాలో అంతరాయం వల్ల వస్తూత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దగ్గరగా గమనించ వలసిన రెండు ప్రధాన దేశాలు.. రష్యా, చైనా. సంక్షోభ ప్రభావం అమెరికా, ఐరోపా దేశాలపై ఎంతగా పడినప్పటికీ వాటి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలోని మిగతా దేశాల కన్నా కూడా దృఢంగా ఆ పర్యవసానాలను తట్టుకుని నిలబడగలవు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్‌కు మాత్రం ఇది అతడి జీవితంలోనే ఒక పెను సవాలు. ఉక్రెయిన్‌పై దాడి వైఫల్యం రష్యాలో అతడి స్థానాన్ని బలహీన పరుస్తుంది. నిరంకుశ పాలకులు శక్తిహీనం అయ్యారని తెలియగానే దీర్ఘకాలంగా అణచివేతలో ఉన్న ప్రత్యర్థి పక్షాలు ఒక్కసారిగా జూలు విదులుస్తాయి. ఇక మనం గమనించాల్సిన రెండో దేశం చైనా. తైవాన్ను కలిపేసుకునేందుకు ఆ దేశం కాచుకుని కూర్చుంది. అలా చేయకుండా చైనాను హద్దుల్లో ఉంచేందుకే రష్యాకు బుద్ధి చెప్పాలని పశ్చిమ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నట్లనుకోవచ్చు. చైనా కూడా ప్రస్తుత ఘర్షణలకు పూర్తి మద్దతుగా ఏమీ లేదు. కోవిడ్ తాజా కలకలం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సతమతం చేస్తోంది. ధరలు పెరిగాయి. ఇంకా పెరిగితే కనుక దేశంలో అసంతృప్తి తలెత్తవచ్చు. ప్రస్తుత సంక్షోభంలోని విషాదం ఏంటంటే చివరికొచ్చేసరికి ఎవరూ విజేతలుగా మిగిలే సూచనలు లేకపోవడం, ఎవరూ కూడా వెనకడుగు వేసినట్లుగా కనిపించడానికి సిద్ధంగా లేకపోవడం. డా. ఎస్. సుధాకర్ బాబు వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
ఇప్పుడు వ్యవసాయం దండగ కాదు పండగ
తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేక బాలారిష్టాలను దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అభివృద్ధి పధం వైపు నడిపించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో, ప్రజాసంక్షేమ పథకాలు అమలు విషయంలో జాతీయ పార్టీల కంటే మెరుగైన పాలననందిస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడటంలోను, సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథ కాల ఫలితాలనందించంలోనూ, దండగన్న వ్యవసాయాన్ని పండుగగా చేయడంలోను, మతం కంటే మనిషి సంక్షేమం ముఖ్యమని భావించడంలోనూ అందరికంటే ముందున్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడినందుకు కలగాల్సిన ఫలాలు ఈ ఇద్దరు పాలకుల వల్ల ప్రజల కందుతున్నాయి. ముఖ్యంగా బహుజన కులాలందరూ వీరి వల్ల లబ్ధి పొందుతున్నారు. బహుజనుల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్ చదువులు రెండురాష్ట్రాల్లోనూ సాకారమౌతున్నాయి. ప్రభుత్వ రంగంలో తెలుగు మాధ్యమం, ప్రైవేటు రంగంలో ఇంగ్లిష్ మాధ్యమం వల్ల జరుగుతున్న వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణాలో వందలాది రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మాధ్యమ విద్యాలయాలను స్థాపించి తెలంగాణా బహుజనులకు నాణ్యమైన విద్యా కోర్కెను సఫలం చేశారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ పిల్లల చదువులకోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుంటే, తెలంగాణలో రెసిడెన్షియల్ విద్యాలయాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యాదానం చేస్తున్నారు. వ్యవసాయమే ఓ దండుగ అంటూ టీడీపీ, గిట్టుబాటు ధర కావాలన్న రైతును కొడుతూ, నిర్బంధిస్తూ బాధించే చీకటి చట్టాలను తెచ్చిన బీజేపీ రెండూ రైతు నడ్డి విరిచాయి. వ్యవసాయాన్ని, రైతు బతుకును సంక్షోభంలోకి నెట్టాయి. పాలకుల రైతు వ్యతిరేక విధానాలు రైతు బతుకును అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు సీఎంలు వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెట్టుబడి సాయం చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు నిర్మించి నీటివసతి కలిపించడం, వివిధ పథకాలతో రైతును హృదయానికి హత్తుకొని ప్రోత్సహించడం, ఆర్గానిక్ వ్యవసాయం, మంచి విత్తనాల సరఫరా, రైతు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లాంటి పనులతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతుల ఆదాయం పెరుగుతోంది. త్వరలో వ్యవసాయం పండుగే అవుతుంది. తెలం గాణాలో కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. రెండు రాష్ట్రాలు వృత్తి పని వారలకు ఆయావృత్తులకు సంబంధించిన ఆదాయ వనరులు కల్పించి లక్షలాది కుటుంబాల ఆదాయాలు పెంచడంతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్‌ను, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, లాంటి నగరాలను ఐటీ హబ్బులుగా మార్చుతూ, అంతర్జాతీయ స్థాయి సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల ఫార్మా హబ్బులను స్టాపిస్తోంది. దేశ విదేశీయులు ఇక్కడ స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో ముందువరసలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు సబ్బండ వర్ణాలకు ఉపయోగకారులుగా ఉంటూ దేశానికే ఉదాహరణ ప్రాయాలుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను తమవైన శైలిలో అభివృద్ధి ప«థంలో నడిపిస్తున్న పార్టీలపై ఏదో విధంగా బురదజల్లి, సెంటిమెం ట్లను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అయితే ద్రవిడ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో ద్వేషం ఎజండా పని చేయదు, మనుషులను ప్రేమించే ఎజండా తప్ప. జగన్, కేసీఆర్ లాంటి బాహుబలులు తెలుగు రాష్ట్రాల్లోకి మత తత్వం ప్రవేశించకుండా నిరోధించగలుగుతారు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రచయిత, విమర్శకుడు మొబైల్ : 91829 18567 -
కొత్త జాతీయ విద్యావిధానంతో సరికొత్త సమస్యలు
‘ఒకే దేశం ఒకే విద్య’ అనే ప్రాతిపదికన ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘కొత్త జాతీయ విద్యావిధానం 2020’ దేశవ్యాప్త చర్చకు దారితీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం చట్టంగా రూపొందించనున్న ‘నూతన విద్యావిధానం’లో మేలు చేసే పలు సంస్కరణలకు చోటు కల్పించినప్పటికీ, వారసత్వంగా పీడిస్తున్న కీలక సమస్యలను పరిష్కరించే ప్రతిపాదనలు ఏవీ అందులో కనబడలేదు. రెండు దశల్లో 8వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే విద్యార్థులకు విద్యను అందించాలని ప్రతిపాదించడం ఏ మేరకు ఆచరణాత్మకం అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విద్యనందించే బాధ్యత నుండి గత ప్రభుత్వాలు తప్పుకొన్న కారణంగా విద్య క్రమేపీ ప్రైవేటు రంగంలోకి జారిపోయింది. పోనీ, ఆ ప్రైవేటు రంగంలోనైనా సవ్యమైన విద్యనందిస్తున్నారా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొన్ని విద్యా సంస్థలు కేవలం మార్కులు సాధించడమే విద్యార్థుల జీవిత లక్ష్యమన్నట్లుగా చీకటి కొట్టాల్లాంటి గదుల్లో ఉంచి విద్యార్థులపై ఒత్తిడి పెంచే విధానం మొదలై దాదాపు 3 దశాబ్దాలు దాటింది. కొత్తదనం ఏదీ? కొత్త విద్యావిధానంలో పాత సమస్యలను పరిష్కరించే విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానాన్ని మార్పుచేసి 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టడం కొత్తదనంగా చూపుతున్నారు. ఈ మార్పు వల్ల ఇంటర్ కూడా పాఠశాల విద్య కిందికి వస్తుంది. పిల్లలకు 3 ఏళ్ల నుంచే కిండర్ గార్డెన్ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనుకోవడం ఆహ్వానించదగినదే. అయితే, ఈ విద్యను బోధించే బాధ్యతను అంగన్వాడీలలో పనిచేసే ఆయాలకు అప్పగించి.. వారికి డిజిటల్, డిస్టెన్స్, డీటీహెచ్ పద్ధతులలో 6 నెలలపాటు శిక్షణ అందించాలనుకోవడం ఎంతవరకు ఆచరణాత్మకం? అంగన్వాడీ ఆయాలకు తగిన బోధనా అర్హతలు ఉండాలి కదా. ఇక, 6వ తరగతి నుంచే ఒకేషనల్ విద్యను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి సహేతుకత కన్పించదు. 9–10 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు వృత్తి విద్యకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస అంతగా ఉండదు. ఆసక్తిలేని అంశాలను వారిపై బలవంతంగా రుద్దితే అసలుకే మోసం వస్తుంది. 15 సంవత్సరాలు నిండిన తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ వంటి వృత్తి విద్య కోర్సులలో ప్రవేశిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ తక్కువ శాతంగానే ఉంది. పిన్న వయసులోనే వృత్తి విద్యను నేర్పినట్లయితే.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించాలన్న బలీయమైన కోరిక, పట్టుదల సడలిపోతుంది. కొత్త విధానంలో మాతృభాషలో లేదా స్థానిక భాషలో 5వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని, రెండవ అంచెలో 8వ తరగతి వరకు దానిని పొడిగించాలని ప్రతిపాదించడం కచ్చితంగా పేద, మధ్య తరగతి వర్గాలవారి పిల్ల లకు నష్టం కలుగుతుంది. ఒకవైపు పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించి.. వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలన్న కోరిక 95% మంది బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులలో బలంగా ఉన్న నేపథ్యంలో.. ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కొత్త విద్యావిధానంపై కేంద్ర ప్రతిపాదన ప్రతిబంధకంగా మారుతుంది. ఇంగ్లిష్ విద్యను పేద పిల్ల లకు దూరం చేయడం సమంజసం కాదు. ఇంగ్లిష్‌ను లేకుండా చేయడం అంటే మనల్ని మనం వెనక్కు నెట్టుకోవడమేనని ‘ఎం.సి. చాగ్లా’ ఏనాడో స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉండే విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలలోనే విద్యను బోధించాలని 1967లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినపుడు విద్యాశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎం.సి. చాగ్లా దానిని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇంగ్లిష్ భాషపై వ్యతిరేకత దేనికి? భాషను జాతీయతా లక్షణంగా పరిగణించరాదని ఎంతోమంది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఒక భాష.. అది హిందీ కావొచ్చు.. మరొకటి కావొచ్చు. దానిద్వారానే ప్రజ లలో దేశభక్తి కలుగుతుందనుకోవడం హేతుబద్ధత కాదు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌లో బోధన చేయాలన్న అంశానికి 95% మందికిపైగా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లో మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన జరపడం అన్నది మాతృభాషాభివృద్ధికి వ్యతిరేకం కాదు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికల్లో మార్పు తెచ్చి ప్రాథమిక స్థాయి నుంచి పరిశోధన వరకు ప్రాచీన, సమకాలీన సంస్కృతులు, చరిత్రలకు సంబంధించిన అంశాలను చేరుస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా వివాదాస్పదం కానుంది. జాతి మొత్తానికి సంబంధించి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి వాటిని పాఠ్యాంశాలుగా చేయడం వల్ల.. భవిష్యత్తులో ప్రాంతీ యంగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం కేంద్రం అనుసరించబోయే విధానం అనుచిత బీజాలు నాటినట్లవుతుంది కదా! ఇది దేశ సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం కలిగించవచ్చు, విభేదాలకు దారితీయవచ్చు. భారత రాజ్యాంగంలోని 254 అధికరణ ప్రకారం ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి విద్యపై సమాన హక్కులు, బాధ్యతలు దఖలు పడ్డాయి. రాష్ట్రాలలో చేసే చట్టాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. పాఠశాల విద్యకు సంబంధించి.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకొంటున్నాయి. అయితే, నూతన విద్యావిధానం చట్టంగా రూపొం దిన తర్వాత.. రాష్ట్రాలు తప్పనిసరిగా దానినే అనుసరించాల్సిన అనివార్యత ఏర్పడితే.. అది మరో దేశవ్యాప్త సమస్యగా మారవచ్చు. కేంద్రం ప్రకటించిన ఈ నూతన విద్యావిధానం ఇంకా ముసాయిదా రూపంలో ఉంది కనుక ఇందులో అనేక సమగ్ర మార్పులు, చేర్పులు చేయవచ్చు. అందుకు దీనిపై పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరగాలి. రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం స్వీకరిం చాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. విస్తృత అంగీకారంతోనే కొత్త విద్యావిధానం విజయవంతం కాగలదు తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సరికొత్త సమస్యలకు బాటలు పరిచినట్లవుతుంది. వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
అవును... కోవిడ్‌తో సహజీవనం తప్పదు
కోవిడ్–19 పూర్తిగా తగ్గిపోతుందా, పెరుగుతుందా అనేది కాలమే చెబు తుందనీ; అది ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదనీ చెబు తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి, నియంత్రణల గురించి ఆమె పలు విషయాలు పంచుకున్నారు. కోవిడ్–19కు మందుగానీ, వ్యాక్సిన్‌గానీ ఎంత త్వరలో రానుంది? సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి పదేళ్లు పడుతుంది. కాలక్రమం గమనిస్తే– ఎబోలా వ్యాక్సిన్ రూపొందించడానికి ఐదేళ్లు పట్టింది; జైకా రెండేళ్లలోపే సమయం తీసుకుంది, కానీ అప్పటికే జైకా సమస్య తీరి పోయింది. పన్నెండు నెలల లోపే వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, ఆ రికార్డు బద్దలుకొట్టాలనే ఆశాభావంతో ఉన్నాం. అదే గనక జరిగితే అబ్బురపరిచే విజయం కాగలదు. అలా జరగాలంటే ఉన్న ఏకైక మార్గం, సంస్థలు పోటీపడటం కాకుండా పర స్పర సహకారంతో పనిచేయాలి. నూటికి మించిన సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఏడు మనుషుల మీద ప్రయోగాల్లో మొదటి దశలో ఉన్నాయి. (మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్) చైనా, అమెరికా, జర్మనీల్లో రెండేసి; బ్రిటన్‌లో ఒకటి. ఇండియాలో చాలా సంస్థలు ప్రి–క్లినికల్ దశలో ఉన్నాయి. ఇది కొత్త వ్యాక్సిన్ కాబట్టి, ఎంత సురక్షితం అనేదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి; అదే సమయంలో కోవిడ్–19 మీద ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నది రుజువు కావాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021 తొలి నాళ్లకల్లా వ్యాక్సిన్ సిద్ధం అవుతుంది. అంటువ్యాధి ఇదివరకే వ్యాపించివున్నందున ఇక దాన్ని కట్టడి చేయలేమని కొందరు ఊహిస్తున్నారు. శాస్త్రీయంగా ఈ భావన ఎంత సరైనది? ఆఫ్రికాలోనూ, ఇండియాలోనూ అంటువ్యాధి వ్యాప్తి తక్కు వగా ఉండటానికి గల కారణాలు ఏమిటన్నదానికి ఎన్నో వాదనలున్నాయి. కానీ స్పష్టమైన జవాబే లేదు. భౌతిక దూరం పాటించడం లాంటి చర్యల్ని కచ్చితంగా అమలు చేసిన కొన్ని దేశాల్లో ఇది తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. దేశాలు లాక్డౌన్లను ఎత్తివేయడం మొదలైంది కాబట్టి, అది మళ్లీ ఎంత బలంగా వెనక్కి వస్తుందో చూడాలి. వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రమాదం అయితే ఉంది. అది పూర్తిగా తగ్గిపోయి, మళ్లీ వచ్చే చలి కాలానికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. లేదా, లాక్డౌన్ ఎత్తేయగానే పెరగొచ్చు. స్పష్టంగా చెప్పగలిగేది ఒకటే మంటే, అంటువ్యాధి ఇప్పటికే బాగా వ్యాపించివున్నందున అది మనతో ఉంటుంది. తగ్గుతుందా పెరుగుతుందా అనేది కాలమే జవాబు చెప్పగలదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు ఏమైనా ఉన్నాయా? బాగా ఆలోచించి అమలుచేసే వ్యూహం అయితే ఉండాలి. మొదటిది, అది దశలవారీగా జరగాలి. తర్వాతిది, ప్రజా రోగ్య వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవాలి, టెస్టుల సంఖ్య పెరగాలి. బాధితులను చురుగ్గా గుర్తించడం, వారిని వేరుగా ఉంచడం, చికిత్స చేయడం; వీరితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్లో ఉంచడం, వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరగాలి. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం, సహ కారం నిర్ణయాత్మకమైనది. కేరళ ఈ విషయంలో విజయ వంతం కావడానికి కారణాలు అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఉండటం. స్వీడన్ లాక్డౌన్ అమలు చేయలేదు. (కరోనా నివారణలో ముందంజ) ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య పరస్పర నమ్మకం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉంది, వాళ్లకు మెరుగైన వైద్యం లభిస్తుంది. వారివి అన్నీ చిన్న కుటుంబాలు. ముసలివాళ్లు వృద్ధాశ్ర మాల్లో ఉంటారు. ఇండియా, ఇంకా ఇతర అభివృద్ధి చెందు తున్న దేశాల్లో ఇదంతా భిన్నంగా ఉంటుంది. మనవి ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, పెద్దవాళ్లను వేరుగా ఉంచడం కష్టం. కాబట్టి దీనికి ఒక సమతుల్యంతో కూడిన విధానం కావాలి. నేననుకోవడం, నియంత్రణలో ఉండేంత తక్కువ కేసులు ఉంచుకోవడం అనేది ప్రస్తుతం చాలా దేశాల లక్ష్యం అయి వుంటుంది. అప్పుడు మాత్రమే ఆరోగ్య వ్యవస్థ కుప్పకూల కుండా ఉంటుంది. వైరస్ మూలం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏమిటి? ఉన్న సాక్ష్యాలు బలంగా సూచించేదేమంటే అది ఒక జంతువు నుంచి వచ్చింది. దాని జన్యుక్రమాన్ని చూసి శాస్త్రవేత్తలు ఇట్టే చెప్పేయగలరు. చాలావరకు అది గబ్బిలాల నుంచి వ్యాపించి వుంటుంది. గబ్బిలాల కరోనా వైరస్కూ కోవిడ్–19కూ సామ్యాలున్నాయి. లేదా అది ఇంకో జంతు వుకు సోకి అక్కడినుంచి వ్యాపించిందా, అయితే ఆ జంతు వేమిటి? దీన్ని గుర్తించే విషయంలో మేము చైనా నిపు ణులకు పూర్తి సహకారం అందిస్తున్నాం. అలాగే ఇది వ్యాప్తి చెందడానికి అనుకోకుండా వైరస్ బయటపడిన ఒక విడి ఘటన కారణమా, చాలాసార్లు జరిగిందా అన్నదీ తేలాలి. ఈ అవగాహనే దీన్ని నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది. మలేరియా మందులను దీనికి వాడటంలో ఇండియా ఏమైనా ముందడుగు వేయాల్సిందా? మందుల్ని ఎలా వాడాలనేది ప్రతి దేశం దానికదే నిర్ణయిం చుకుంటుంది. మనకు మొదటినుంచీ ఉన్న స్థితి ఏమంటే– నివారించడానికి గానీ చికిత్సచేయడానికీ గానీ తగిన ఆధా రాలు లేవు. కాబట్టి అత్యుత్తమ నాణ్యతతో కూడిన పరిశోధన జరగాలని సూచించాం. హెల్త్‌కేర్ వర్కర్లకూ, అంటువ్యాధి ప్రబలే అవకాశం ఉన్నవారికీ హైడ్రాక్సిక్లోరోక్విన్ (హెచ్‌సీ క్యూ) ఇవ్వడానికి ముందూ, ఇచ్చిన తరువాతా మారిన రోగ నిరోధకతను తెలుసుకోవడానికి రెండు పెద్ద కేంద్రాల్లో బహు ముఖ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాల ఆధా రంగా సిఫారసులు జరగాలి. ఇండియాకు సంబంధించి నంత వరకూ హెచ్‌సీక్యూ సాఫల్యత ఎంతనేది ఐసీఎంఆర్ అధ్యయనం చేయగలదు. హెల్త్‌కేర్ వర్కర్లు నుండి డేటా సేకరించడానికి పలు మార్గాలున్నాయి, దానిద్వారా అది ఎంత బాగా పనిచేసిందనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆర్థిక సాయాన్ని ఉపసంహరించుకుంటానన్న అమెరికా నిర్ణయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందన ఏమిటి? అమెరికా నిర్ణయం పట్ల విచారిస్తున్నాం. ఆర్థిక వనరుల విషయంలోనే కాదు, సాంకేతికంగానూ సుదీర్ఘకాలంగా గట్టి సహకారాన్ని ఇస్తున్న ఉదార మిత్రదేశం అమెరికా. భవిష్య త్‌లోనూ అమెరికా తన సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. సౌమ్య స్వామినాథన్ (టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో) -
వక్ర భాష్యాలు... విపరీతార్థాలు
‘కోవిడ్ –19 అనేది భయంకరమైన రోగం, ఇది అంటరానిదనే భావన దయచేసి అందరూ బుర్రలోంచి తీసేయండి‘ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటనపై మీడియాలో ఒక వర్గంతో పాటు కొందరు ప్రతిపక్ష నాయకులు విపరీతార్థాలు తీస్తున్నారు. కోవిడ్–19తో కలిసి జీవించాల్సి వస్తుందనీ, ప్రస్తుతానికి దీనికి మందు లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమనీ ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రకటన పరిపక్వతతో, వాస్తవికంగా ఉంది. వైరస్ వల్ల వచ్చే మహమ్మారుల చరిత్ర చూస్తే అవి మారణహోమం సృష్టించి, కొంతకాలం కనుమరుగై మళ్ళీ కోరలు చాచాయని శాస్త్రవేత్తలంటున్నారు. నేటి కోవిడ్–19కు 1918–1920 మధ్య వచ్చిన హెచ్ 1ఎన్1 (స్వైన్‌ఫ్లూ)కు దగ్గర పోలికలున్నాయి. స్వైన్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు నుంచి వది కోట్లమంది చనిపోయారు. ఇటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలతో మెలిగి ప్రాణాలు కాపాడుకోవడం అవసరమని వైఎస్ జగన్ చెప్పారు. స్వైన్‌ఫ్లూకు ఇంతవరకూ వ్యాక్సిన్ లేదు. 1978లో వెలుగుచూసిన ఎయిడ్స్ వ్యాధి హెచ్.ఐ.వి. వల్ల వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తలు తప్ప మందులు లేవు. వైరస్ల వల్ల వస్తున్న ఇంకొన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఇంతవరకూ మందులు లేవు. చరిత్రను పరిశీలిస్తే వైరస్‌లతో సహజీవనం చేయడం మానవాళికి అనివార్యమని అర్థమవుతుంది. క్రీస్తు శకం 165–180 మధ్య ఎంటోనిన్ ప్లేగ్ 50 లక్షలమంది ప్రాణాలు తీసింది. 541–544 మధ్య ప్రబలిన ప్లేగ్ రెండున్నరకోట్ల మందిని, 1334–1340 మధ్య వచ్చిన బ్లాక్‌డెత్ ప్లేగ్ ఆరు కోట్ల మందిని, 1855–1875 థర్డ్ ప్లేగ్ కోటి మందిని, 1945–47 నాటి టైఫస్ 30 లక్షల మందిని బలిగొన్నాయి. మంచి ఆహార అలవాట్లు, రోగనిరోధకశక్తి పెంచుకుంటే ఈ వ్యాధి దానంతటదే అంతరించిపోతుందని వైఎస్ జగన్ చెప్పడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. కానీ దీన్నే అమెరికా బయోలాజికల్ ఇంజనీర్ శివ అయ్యాదొరై ధ్రువీకరిస్తున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాస్తూ, అమెరికా పౌరులకు సమతుల పోషకాహా రాన్ని రెండు నెలలపాటు ఇస్తూ, వారికి రోగనిరోధకశక్తి పెరగడానికి ఉపయోగపడే విటమిన్ ఎ, విటమిన్ డి మాత్రలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. మానవ దేహానికి మించిన అద్భుతమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరొకటి లేదని ఆయన అంటారు. మానవ శరీరంలో సుమారు ఆరు ట్రిలియన్ల రోగనిరోధక కణాలు ఉంటాయని, ఇవి మానవ శరీరం వెలుపల, లోపల దాడి చేసే వైరస్‌లను, బాక్టీరి యాను సంహరిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్లు విధించడాన్ని కూడా ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు. ఏపీ సీఎం కూడా పూర్తి లాక్‌డౌన్‌కు అయిష్టత తెలిపిన విషయం గమనార్హం. ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని అనేక దేశాల్లో పూర్తి లాక్డౌన్లు లేకపోయినప్పటికీ అక్కడ కరోనా కేసులు స్వల్పంగా ఉన్నాయి. కరోనాపై అధ్యయనం చేస్తున్న సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ ఘూషిన్ భారత్‌లో ఈ మహమ్మారి మే 21 నుంచి తగ్గుముఖం పట్టవచ్చని చెబుతున్నారు. మానవాళి ఉన్నంతవరకూ వైరస్ల బెడద ఉంటుందని, వీటిని ఎదుర్కోవడానికి నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ల పేరిట ప్రజల్ని ఇళ్ళలో ఉంచడం వల్ల ఆయా దేశాలకు ఆర్థికంగా జరిగే నష్టాలతోపాటు ఆరోగ్య, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియా ఈ నెల 15వ తేదీన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లలో లాక్డౌన్ విధించి మిగిలిన ప్రాంతాల్లో సడలించడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. అమెరికా రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను ఒక సభ్యుడు ‘మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వబోతున్నారు?’ అని ప్రశ్నించగా, ‘అది మనకు లభించే ప్రతి పక్షాన్ని బట్టి ఉంటుంది‘ అన్నారు. మన దేశంలో ప్రతిపక్షంలో ఉండటమంటే అధికార పక్షం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడమనుకుంటున్నాయి. మీడియా కూడా సమాజ పరిణామాలకు దర్పణంగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక వర్గం మాయాదర్పణంగా మారి ఉన్నది లేనట్టుగానూ, లేనిది ఉన్నట్టుగానూ చూపించే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల సమాజానికన్నా ఆ మీడియాకే ఎక్కవ నష్టం వాటిల్లే ప్రమాదముంది. వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త అధ్యక్షుడు, ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ మొబైల్ : 95052 92299 -
ఆది–అంతం తెలియని చిక్కుప్రశ్న
ఆధునిక ప్రపంచం ఊహించని విపత్తు ఇది. జీవాయుధమో, జంతువుల ద్వారా మనుషులకు సోకిందో కానీ కోవిడ్–19 మహమ్మారి ఆది –అంతం తెలియని చిక్కు ప్రశ్నలా తయారైంది. ఒకటి మాత్రం నిజం. ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు. కోవిడ్–19 నుంచి బయట పడటానికి రెండు మార్గాలున్నాయి. నేరుగా వైరస్‌ను ఎదిరించే చికిత్స, వైరస్ సోకకుండా నిరోధించే టీకా. ఈ రెండూ ఏడాది తర్వాతే సాధ్యమయ్యేట్టు ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా నుంచి కోలుకున్న రోగుల రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీస్ ఆశాకిరణాల్లా కనిపిస్తు న్నాయి. యాంటీబాడీస్‌తో కూడిన ప్లాస్మాను రోగికి ఎక్కించడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు దీన్ని ఆచరణీయ చికిత్సగా భావిస్తున్నారు. మీజిల్స్, ఎబోలా, బర్డ్ ఫ్లూ సమయంలో ఈ విధానం ఫలి తాన్నిచ్చింది. ఎయిడ్స్ రోగులకిచ్చే యాంటీ వైరల్ ఔషధాలు, మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించే అజిత్రోమైసిన్ లాంటివి మొదట్లో ఆశలు కల్పించినా వీటి వల్ల ఎంత వరకు మేలు కలుగుతుందనే దానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. వైరస్లు నిరంతరం మ్యుటేషన్లు చెందుతుం టాయి. ప్రతిఘటనల నుంచి రక్షించుకోవడానికి ఆర్ఎన్ఏను మార్చుకుంటుంటాయి. వ్యాక్సిన్ తయా రీలో ప్రధాన ప్రతిబంధకం ఇదే. అయినా 70కి పైగా పరిశోధన సంస్థలు కొంత పురోగతిని సాధించాయి. చైనా ఈ రేసులో ముందుంది. అక్కడి క్యాన్ సినో బయో, సినోవ్యాక్ బయోటెక్ మనుషులపై రెండో దశ ప్రయోగాలు ప్రారంభించాయి. ఈ రెండూ చైనా ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. మోడెర్నా అనే అమెరికన్ సంస్థ మనుషులపై మొదటి దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో హడావుడి మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ పేథాలజీ ప్రొఫెసర్ జాన్ నికోల్స్ హెచ్చరి స్తున్నారు. మొదట ఎలుకలు లాంటి చిరు జీవుల పైన, తర్వాత మనుషులకు దగ్గరగా ఉండే కోతుల పైన ప్రయోగించిన తర్వాతే హ్యూమన్ ట్రయల్స్ మొదలు పెట్టాలనేది ప్రోటోకాల్. చైనా తొందరను గమనిస్తే ఇందులో ఒక దశను వదిలేసినట్టు శాస్త్రవే త్తలు అనుమానిస్తున్నారు. కోవిడ్–19 వల్ల వినోద, పర్యాటక, ఆతిథ్య, రవాణా వ్యవస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. లాక్డౌన్ ఉపసంహరణ తర్వాత రైళ్లలో 30 శాతం మాత్రమే టికెట్లు విక్రయిస్తారని అంటున్నారు. వంద శాతం అమ్మినపుడే నష్టాలు వచ్చాయి. గూడ్స్ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతో ప్యాసెంజర్ రైళ్ల నష్టాలను పూడ్చుకుంటోంది రైల్వే. ఆక్యుపెన్సీ 50–60 మాత్రమే ఉండే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల ఆదాయం ఇంకా పతనమవుతుంది. ఏవియేషన్ రంగం కోలుకుని మునుపటిలా విమానాలు తిప్ప డానికి మరో రెండేళ్లయినా పడుతుంది. తాజా తీవ్ర తను బట్టి చూస్తే జూన్ నుంచి పాఠశాలలు, కళా శాలలు నడిచేది అనుమానమే. ఒక విద్యా సంస్థలో విద్యార్థికో, ఉపాధ్యాయునికో వైరస్ సోకిందంటే ఏం చేయాలి? కనీసం 14 రోజుల పాటు మూసేసి అంద రినీ పరిశీలనలో ఉంచాలి. విద్యా సంవత్సరంలో ఇలా ఎన్నిసార్లు మూసి, తెరవడం సాధ్యమవు తుంది? భౌతిక దూరం అనివార్యమైన ప్రస్తుత పరిస్థి తుల్లో సినిమా హాళ్లకు వెళ్లేదెవరు? యూరప్, అమెరికా కార్ల కంపెనీలు వెంటిలే టర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమలు వైద్య చికిత్సల్లో వాడే ఇతర యంత్రాలను కూడా తయారు చేయాల్సి రావచ్చు. మద్యం డిస్టిల్లరీలు శానిటైజర్లను తయారు చేయడం ఎప్పటికీ కొనసాగు తుండొచ్చు. పానీ పూరి అమ్మే చిరువ్యాపారి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి అందరినీ ఆకర్షించింది. భవన నిర్మాణ కార్మి కుడు ఫ్లాస్కులో టీ పోసుకుని రోడ్డు పక్కన విక్రయి స్తున్నాడు. ఇవి ఆసక్తి కలిగించే దృశ్యాలే కాదు. కొందరు ఔత్సాహికులు రోజుల వ్యవధిలో తమకు అలవాటైన పనులను పక్కకు పెట్టడం. సంక్షోభాల సమయంలో ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకుంటేనే మనిషికి మనుగడ. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఆమె వెలికి మారు పేరు ముట్టుగుడిసె
ప్రపంచవ్యాప్తంగా స్త్రీల నెలసరి సమయాల మీద చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ శారీరకస్థితి గురించిన అవగాహన ఆసియాదేశాల్లో పూర్తిస్థాయిలో లేదు. నెలసరికి–మత కర్మకాండలకి, నెలసరికి–సంస్కృతికి అన్యాయమైన ముడిపడింది. నెలసరి మూడురోజులూ మైల కనుక స్త్రీలు ఇళ్ళలో ఉండకూడదన్న మూఢవిశ్వాసం కొన్నికాలాల్లో ఉండేది. అందుకే మైలరోజుల్లో అన్నివర్గాల స్త్రీలకి, స్థాయీభేదాల్లో ‘ముట్టుగదులు’, ‘ముట్టుకొట్లు’, ‘ముట్టుగుడిసెలు’, ‘ముట్టుదొడ్లు’ నిర్మాణమయ్యాయి. దేశంలో అనేకపేర్లతో అంటుస్థలాలు కొనసాగుతూనే ఉన్నాయి.అధునాతన సాంకేతికతకి ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ఇంతటి మధ్యయుగాల ఆచారం కొనసాగుతూ ఉండటం విరోధాభాస. ఊరినాయన పల్లి, ఊరినాయన కొత్తూరు, పాళ్యం, సలార్లపల్లి, తమిళనాడు బోర్డర్లోని ఏకలనత్తంలాంటి ఊళ్లలో ముట్టుగుడిసెలు ఉన్నాయి. నెలసరి మూడురోజులూ ఆయాగ్రామాల్లో బాలికలు, స్త్రీలు ముట్టుగుడిసెలో ఉండాలి. ప్రసవం అయిన స్త్రీలు పురిటిస్నానం అయ్యేవరకూ పసిగుడ్డుతో సహా అక్కడే ఉండాలి. దీని నిర్మాణం అమెరికా, జర్మనీల కాన్సన్ట్రేషన్ క్యాంపులకి తీసిపోదు. ఆ గ్రామంలో ఒకేసారి బహిష్టు అయిన స్త్రీలు ఎందరు ఉన్నాసరే–పదడుగుల పొడవు వెడల్పులున్న ఆ ఒక్కగదిలోనే ముడుచుకుని కూచోవాలి. చీకటి గుయ్యారంలాంటి ఆ గదికి కరెంటు లేదు, బాత్రూమ్ లేదు. తలుపు వేస్తే గాలివచ్చే మార్గం లేదు, గోడలు నానిపోయి ముదురాకుపచ్చ రంగు పాచిపట్టి ఉన్నాయి. ముంజువాసన, నీచువాసన ముక్కులు బద్దలు గొడుతోంది. వానాకాలంలో పెచ్చులు ఊడిన పైకప్పు నుంచి పెళ్లలు రాలిపడుతుంటాయి. పైనుంచి ధారాపాతంగా కారే నీటికి, అపరిశుభ్రతకి అంటురోగాలు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మురికి కాలువల పక్కన పదడుగుల రోడ్డుమీద ఒకపక్కకి ముడుచుకుని పడుకుంటారు. బహిష్టు స్త్రీలు, ఊరు లేవకముందే లేచి పొలాల్లోకి వెళ్లి బోర్లు ఉన్నచోట, నీరు పారేచోట స్నానాలు చేసి, ముట్టుగుడ్డలు ఉతికి ఆరేసుకుని కూలిపని, పొలంపనులు చేసుకుని చీకటిపడే సమయానికి ముట్టుగుడిసెకి చేరుకుంటారు. ఇళ్ళలో ఉన్న మిగతా స్త్రీలుగానీ వేరేఇంటి స్త్రీలుగానీ ఇంత తిండి తెచ్చిపెడతారు. బహిష్టు సమయాల్లో స్త్రీలకి విశ్రాంతి కావాలి కనుక ఇలాంటి గదుల నిర్మాణం జరిగిందనే వాదన ఈ కాలానికి తగినది కాదు. వారికి పగలంతా పొలం పని, కూలిపనులు తప్పవు. ఆ మూడురోజుల్లో ఇంట్లో పేరుకున్న పనిని మళ్ళీ మైలస్నానం ముగించి వచ్చిన మహిళే చేసుకోవాలి. ఈ నియమానికి ఆయాగ్రామాల పరిధిలోకి వచ్చే ఏ మహిళా అతీతురాలు కాదు. అక్కడి ఎలి మెంటరీ స్కూల్ లేడీ టీచర్, నెలకి మూడురోజులు సెలవు పెట్టాల్సిందే, జీతం కోతని భరించాల్సిందే. అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కూడా జీతం కోతమీద సెలవు పెట్టాల్సిందే. ఆ మూడురోజుల్లో జాతర సమయాల్లో పదేళ్ళు దాటిన ఆడపిల్లల్ని ఎని మిదిరోజుల పాటు గ్రామం బైటకి తరిమేస్తారు. ఆ సమయంలో సమర్తాడితే గ్రామానికి అరిష్టం కనుక. జాతర అన్నిరోజులూ వారిని అంగన్వాడీ కేంద్రంలో ఉంచుతారు. ‘ఇదంతా మీకు ఇష్టమేనా? వద్దని చెప్పొచ్చు కదా?’ అనడిగితే లెంపలు వేసుకుని, ‘గొడ్డావుల మల్లయ్యకి, కదిరి నరసింహస్వామికి కోపంవస్తే ఊరు నాశనం అయిపోతుందని, ఇష్టం తోనే ముట్టుగుడిసెలో ఉంటున్నామని’ చెప్పారు. ముట్టుగుడిసెలకి బాత్రూం, కరెంటు, నీటి సదుపాయాలు వచ్చేలా చూడమన్నారు. ఇదొక సంకట స్థితి. ముందుగా ఈ ఆచారం పోవడానికి కృషి జరగాలా? వారు కోరిన సదుపాయాల కల్పన జరగాలా? ద్రవిడ భాషల పరిశోధక, అధ్యాపక మిత్రులతో జరి గిన చర్చల్లో ఈ ప్రస్తావన వచ్చింది. ప్రతీ మార్పుకి ఒక ప్రాసెస్ ఉంటుందని, దానికి తోడ్పడే చర్యలు చేపడుతూనే, ఆ స్థితినుంచి ఆ స్త్రీలను బయట పడేయాలన్న మాటలతో చాలామంది ఏకీభవించారు. బహిష్టుని అంటుగా చూడడం, దానిమీద కొనసాగుతున్న నిర్బంధపూరిత మత, సాంస్కృతిక విశ్వాసాలు–మానవ హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంది. సృష్టిలో ఏ ప్రాణికీ సాధ్యంకాని రీతిలో బంధనాలను ఆమోదించి అత్యంత హేయమైన గదుల్లోనూ, రోడ్లమీదా బహిష్టు సమయాలను గడిపే ఆ స్త్రీలకి, వారు కోరిన పద్ధతుల్లో తాత్కాలికంగా కొద్దిసదుపాయాలను కల్పిం చడం ఎంతవరకు సాధ్యమన్నది ఆలోచించాలి. మిత్రులు వరదరాజు, శ్రీనివాస్, రాజారావు చెప్పినట్లు, ‘మనుషుల్లో మెరుగైన జీవి తం కోసం తపన ఉంటుంది, ఇపుడు ముట్టుగుడిసె బాగుపడితే, రేపు ముట్టుసమస్యని పరిష్కరించుకోవడానికి ఆలోచిస్తారు. ప్రతి చలనం కొత్త చైతన్యానికి దారి తీస్తుంది’. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే -
సవాళ్లకు ప్రజాతంత్ర సంస్కృతే సమాధానం
సాహిత్యం, సమాజం, రాజకీయాలలో నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రజాతంత్ర సంస్కృతే ప్రత్యామ్నాయం. పాలకులు పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ ఆ ప్రజలనే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. మరికొందరు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్ కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి. ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవోద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయం. సందర్భం దేశంలో ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా, సమాజంలో భాగంగా ఆయా రంగాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మనం అంటే– రచయితలుగా, మేధావులుగా, బుద్ధి జీవులుగా మాట్లాడుకుంటున్నాం. సమకాలీన సమాజంలో అందరికంటే ముందుగా మేల్కొని హెచ్చరిస్తున్న వాళ్లుగా ఆలోచిస్తున్నాం. శుష్క వాగ్దానాలతో, నినాదాలతో అధికారానికి వస్తున్న పాలకులు నేలపైనున్న వాస్తవాలను మరచి, ఆకాశంలో అంచనాలు వేస్తున్నారు. సమస్యల మూలాల నుంచి దారి మళ్లించి తాత్కాలిక ఉపశమనంతో బతుకు భారాన్ని మోయమంటున్నారు. ఆయా పథకాల ద్వారా ఉచితంగా ప్రజల డబ్బును పంచిపెడుతూ వారినే బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోయే ప్రయోగాలతో వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఎదిగిన ఇండియాను ఒకవైపు, ఇక్కడి నేలపై రుణ భారంతో, వ్యవసాయం గిట్టుబాటుగాక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దీనమైన భారత్‌ను మరోవైపు చూస్తున్నాం. రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్న వైరుధ్యాలు,అంతరాల మధ్యనే సామాజికంగా మతతత్వం, కుల జాడ్యం విస్తరించిన ఈ వ్యవస్థలో జీవిస్తున్న కవులు, రచయితలు, మేధావులు నిజాలు చెప్పినా, రాసినా జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. భావప్రకటన, అభివ్యక్తి స్వేచ్ఛ అనే మౌలికమైన ప్రాథమిక, మానవ హక్కులను బంధించాలని పాలకవర్గాలు కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉండవలసిన కవులు, కళాకారులు, మేధావులు పదవులకు సన్మానాలు, పురస్కారాలకు ఎగబడుతున్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. డిజిటల్ ఎలక్ట్రానిక్ విప్లవం వచ్చిన తర్వాత, నయా ఫాసిజం కోరలు చాస్తున్నది. అన్ని మానవ రంగాలపై నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నది. దళారీ పెట్టుబడిదారీ వర్గం సంపన్నుల సౌలభ్యం కోసం ఉన్నత మధ్యతరగతిని పెంచి పోషిస్తున్నది. క్యాపిటలైజేషన్లోని న్యాయమైన పోటీని కూడా అమలు చేయకుండా, మన రాజకీయ నాయకులు, పాలకులు భూస్వామ్య, ఫ్యూడల్ మానసికతతో పాలిస్తున్నారు. ఇక ఇంతవరకు అణగారిన కులాలు, తమ అస్తిత్వ పోరాటాల ద్వారా ఉనికిని చాటుకోవడం న్యాయమే. అయితే తాత్కాలికంగానైనా రాజ్యాధికారంలో తమ వంతు వాటాను సాధించుకోడానికి ఆయా కుల సంఘాలు షార్ట్‌కట్ మార్గాలను వెదుకుతున్నాయి. సమష్టి ప్రజా పోరాటాల నుండి విడిపోయి తమ కుల పంచాయితీలలో, రిజర్వేషన్ల ఉద్యమంలోనే తమ విముక్తి ఉందని భావిస్తున్నాయి. ఇదే సందర్భాలలో వామపక్ష ఉద్యమాల వర్గపోరాటాల స్ఫూర్తిని తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామంవల్ల దళిత, వెనుకబడిన కులాల నుంచి వచ్చే ప్రజలు కేవలం కుల పోరాటాలకే పరిమితం కాగా వామపక్ష పోరాటాలు బలహీనపడిపోయిన వాస్తవాన్ని గుర్తించక తప్పదు. సమాంతరంగా విప్లవ రాజకీయ పక్షాల ప్రజా పోరాట చరిత్ర ఉంది. ప్రజానుకూల పంథాలో అతి, మితవాదాలను ఎదిరిస్తూ విప్లవకారులు ఏకం కావలసి ఉంది. ప్రస్తుతం మనకు రాజ్యాంగపరమైన హక్కులున్నా, వాటిని కాపాడవలసిన న్యాయ వ్యవస్థ బలహీన పడుతున్నది. ప్రజల మాన, ప్రాణాలను రక్షించవలసిన చట్టాలన్నీ అవినీతి పాలకుల కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి. పవిత్రమైన గ్రంథమనుకొనే మన రాజ్యాంగాన్ని వందసార్లు సవరించుకొన్నాం. సోషలిజం, సెక్యులరిజం నామమాత్రంగా అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. మరోవైపు గ్రామీణ ప్రజల కులవృత్తులు ధ్వంసమైన తర్వాత, ఉపాధి కోల్పోయి, పేదల సంఖ్య పెరిగి నగరాలకు వలసబాట పడుతున్నారు. ఇక సహజ వనరుల విధ్వంసం జరిగి పర్యావరణ సమతౌల్యం పెద్ద సవాలుగా మనముందున్నది. విద్య, వైద్యం సామాన్యుడికి అతి ఖరీదైపోగా, ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమైనాయి. విగ్రహాలు, మందిరాల నిర్మాణమే ప్రాధాన్యతను సంతరించుకోగా, ఆయా మతాచార్యులు, కాలం చెల్లిన సంప్రదాయాలతో సామాజిక జీవితాల్ని నిర్దేశిస్తున్నారు. పాలకులు తమ పదవుల భద్రత కోసం స్వాములవార్లకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎన్నికలు జూదంగా పరిణమించి, ఓటర్లను కొనివేయగలమనే ధీమా ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఈ రాజకీయ, సామాజికమైన సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ప్రజా పోరాటాల ద్వారానే సాధించుకోగలమనే నమ్మకం మిగిలి ఉంది. కార్మిక, రైతాంగ విప్లవపోరాటాల మార్గాన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస సామ్రాజ్యవాద శక్తులను ఓడించగలం. కీలకమైన వ్యవసాయిక విప్లవంతో భూమి సమస్య పరిష్కారం కాగలదని చరిత్ర చెబుతున్నది. మరో ముఖ్యమైన సవాలు–వర్తమాన సాంఘిక వ్యవస్థలోకి మార్కెట్ ఆర్థిక విధానాలవల్ల వాడకం దినుసుల వ్యామోహంతో విలాసాలకు ఎగబడే మన స్తత్వం వ్యాపించింది. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వికృతమైన వినోదం, లైంగిక విశృంఖలత మూలంగా స్త్రీ పురుష సంబంధాలలో, సహజమైన ప్రేమానుబంధాలు నశించిపోతున్నాయి. వ్యక్తి తోపాటు, కుటుంబాలు మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఇది. ఈ సంక్షోభాన్ని, మానవ సంబంధాలలో వచ్చిన మార్పును మన సమకాలీన సాహిత్యం చిత్రించడం లేదు. ఇప్పటికీ మధ్యతరగతి మనస్తత్వంతో, సంకుచిత వ్యక్తి స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్నది. పాలకుల ఫాసిస్టు చర్యలను ఎండగట్టే ప్రజలకు మనో ధైర్యాన్ని, ప్రతిఘటనా శక్తిని ఇవ్వవలసిన రచయితలు మౌనం వహిస్తున్నారు. పాలకులు భజనపరులైన కవులు, కళాకారుల అవకాశవాదాన్ని సహిస్తున్నారు. మెజారిటీ ప్రజాస్వామ్యం పేరిట, హిందుత్వ భావజాలంతో గోవుల రక్షణ, ఆహార వ్యవహారాలపై ఆంక్షలతో హత్యలను ప్రోత్సహిస్తున్న సంస్కృతిని సామూహిక స్వరం ద్వారా, సామూహిక ప్రజాతంత్ర సంస్కృతి ద్వారా ప్రతిఘటించక తప్పదు. ఈ ప్రజాతంత్ర సంస్కృతి విప్లవో ద్యమాల బాసటగా రావలసిన సాంస్కృతిక విప్లవం ద్వారానే వికసించే అవకాశం ఉంది. అంతిమంగా మానవీయ విలువల కోసం, సామ్యవాద స్వప్నాన్ని నిజం చేయగల శక్తి ఈ దేశ ప్రజలకే ఉన్నదని నమ్ముతున్నాం. శ్రామికశక్తితో, మన ప్రజా పోరాటాల వారసత్వం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో, రచయితలు తమ సృజనాత్మక శక్తితో వివిధ ప్రక్రియలలో పాపులిస్టు, కాలక్షేప రచయితలకు సమాంతరంగా శక్తివంతంగా రచనలు చేయడమే ప్రత్యామ్నాయ మార్గం. (23.12–2018 జ్వాలాముఖి 10వ వర్ధంతి సదస్సులో చదివిన పత్రం) నిఖిలేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ కవి ‘ 91778 81201 -
బ్యాంకులకు చిట్కా వైద్యమా?
సందర్భం జనసామాన్యానికి అండగా బ్యాంకులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ 1990 లలో ప్రబలిన నయా ఉదారవాద ప్రపంచీకరణ నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మరిచిపోయాయి. అమెరికా కేంద్రంగా 2008 సెప్టెంబర్‌లో ప్రపంచ ఫైనా న్స్, ఆర్థిక సంక్షోభాలు మొద లయ్యాయి. కానీ, నాడు ఈ సంక్షోభ ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థను పెద్దగా తాక లేదు. ఈ కారణం చేతనే 2009వ సంవత్సరంలో నాటి మన కేంద్ర ఆర్థిక మంత్రి, వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ - దేశ ఆర్థిక వ్యవస్థ అంత ర్గత బలానికి కారణాలలో మన జాతీయం చేయబడిన బ్యాంకుల పాత్రను ప్రధానంగా పేర్కొన్నారు. కాగా, ఇది నిన్నటి మాట! నేడు, మన దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడి కింద ఉన్నాయి. ఈ బ్యాంకులలో-మొండి బకా యిలు భారీగా పెరిగిపోయి 2013-14 నాటికి 2.16 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీనితో, ఈ బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మన దేశంలో కూడా అమెరికా తరహాలో సబ్-ప్రైమ్ సంక్షో భం ఏర్పడుతుందా? అనే భయాందోళనలు పెరిగిపోసా గాయి. ప్రభుత్వం పూనుకొని ఈ బ్యాంకులకు మూల ధన మొత్తాన్ని సమకూర్చవలసిన అగత్యం ముందు కొచ్చింది. ఈ నేపథ్యంలోనే 2019 ఆర్థిక సంవత్సరం వరకూ - అంటే 2015-16 నుంచీ 4 సంవత్సరాల కాలంలో ఈ బ్యాంకులకు 70 వేల కోట్ల రూపాయల మేర మూలధనాన్ని అందించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే, రానున్న నెల రోజుల కాలంలో (ఆగస్టు 15 నుంచీ మొదలుకొని) 13 జాతీయ బ్యాంకులకు, 20 వేల 88 కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ జరిగిన కథ ఇది. కానీ, అసలీ బ్యాంకులు 2008-09 నాటి పటి ష్టస్థితి నుంచి ఎందుకు ప్రస్తుత ఇబ్బందులలో పడిపో యాయి? ఈ మౌలిక లోపాలను సరిదిద్దుకునే దిశగా ప్రభుత్వం లేదా బ్యాంకులు ఎంత మేర కృషి చేస్తున్నా యి? అనేవి ఇక్కడి ప్రశ్నలు. బ్యాంకుల మొండి బకాయిలలో సింహభాగం మన దేశ కార్పొరేట్ రంగానిదే అన్నది ఇక్కడ గమనా ర్హం. కాగా, నేటి మన ఈ పరిస్థితికి గత 3-4 ఏళ్లుగా మన దేశ ఆర్థిక పరిస్థితిలో కూడా ఏర్పడిన మందగింపు కొంత మేరకు కారణంగానే ఉంది. దేశీయ బ్యాంకుల వడ్డీరేట్లు బాగా పెరిగిపోవడం, ఆర్థిక మందగింపు వల న రుణాల చెల్లింపు కార్పొరేట్లకు పెనుభారంగా మారిం దన్నది కూడా సత్యమే! కానీ, ఈ స్థితికి దీనికి మించిన ఇతరేతర మౌలిక కారణాలు కూడా ఉన్నాయి. 2008 అనంతరం పలు దఫాలు, మన దేశం ‘అగ్రరాజ్యం’ కాబోతుందనే, నేల విడిచి సాము చేసే ఆశలను మన పాలకులు పెంచి పోషించారు. ప్రపంచ ధనిక దేశాలలో ఏర్పడిన ఫైనాన్స్ సంక్షోభం నేపథ్యంలో, మన దేశం అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులూ, సట్టా వ్యాపారా నికి (రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటివి) కేంద్రం కావడం ద్వారా, మనం ఈ ‘అగ్రరాజ్య’ స్థాయిని చేరు తామనేది దీని వెనుకన ఉన్న తర్కం. దీనికి తోడుగా 2004-08 కాలంలో రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపా రాలు కేంద్ర బిందువుగా మన దేశం భారీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ముందూ వెనుకా చూసుకోకుండా రుణ వితరణ జరిపాయి. నిజానికి, 1969లో మన బ్యాంకుల జాతీయీకరణ జరగడం వెనుకన ఉన్న ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా నేటి మన ప్రభుత్వరంగ బ్యాంకుల తీరు ఉంది. దేశం లోని జనసామాన్యానికి అండగా, వెన్నుదన్నుగా బ్యాం కులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ కాలక్రమంలో, మరీ ముఖ్యంగా 1990 లలో దేశంలో నయా ఉదారవాద ప్రపంచీకరణ క్రమం నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాయి. వాటి పని తీరు కార్పొరేట్ సంస్థలూ, ధనికులకూ అనుకూలమైన దిశలోకి మళ్లింది. కానీ, స్వయాన మన కేంద్ర ఆర్థిక మంత్రులు కూడా తమ ప్రసంగాలలో అడపాదడపా - బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను చెల్లించటంలో, సామాన్యులే (ధని కులు, కార్పొరేట్ల కంటే!) ఎక్కువ నిజాయితీగా ఉన్నా రని చెప్పడం ఇక్కడ గమనార్హం. దీనంతటితో పాటుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశీ య వ్యవసాయ రంగంలో కంటే కూడా, చాలా పెద్ద స్థాయిలో కార్పొరేట్ రంగంలోనే ఈ మొండి బకాయి లూ ఉన్నాయనేది కఠిన వాస్తవం. అంతకుమించి, నేడు మన జాతీయ బ్యాంకులు తమ రుణ వితరణలో వ్యవ సాయ రంగం పట్ల చిన్నచూపు చూపడం వలన కూడా మన వ్యవసాయదారులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం! కాబట్టి, మన ప్రభుత్వరంగ బ్యాంకులు తమ తీరు తెన్నులను, విధానాలనూ సరైన దిశగా సవరించు కోకుండా ప్రభుత్వాలు వాటిని ఎంతగా ఆదుకున్నా ఫలి తం పెద్దగా ఉండదు. మన దేశ పాలకులు 1990ల నుం చీ తలకెత్తుకున్న ఉదారవాద ప్రపంచీకరణ విధానాలే ఈ పరిస్థితి అంతటికీ మూలకారణంగా ఉన్నాయి. ధనవంతులూ, కార్పొరేట్ల సేవలో తరించేందుకు గాను ‘మరో ప్రత్యామ్నాయం లేదు’ అనే పేరిట - బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్, అమెరికాలో రోనాల్డ్ రీగన్ల కాలంలో తెరపైకి వచ్చిన - ఈ విధానాలే అమెరికాలోని నిన్నటి ఆర్థిక సంస్థల, బ్యాంకుల పతనానికీ, నేటి మన దేశీయ బ్యాంకుల సమస్యలకూ, స్థూలంగా నేటి ప్రపంచంలోని ఆర్థిక మాంద్య స్థితికీ అసలైన కారణం! ఈ విధానాలను మార్చుకోకుండా, వాటి కారణంగా నష్టాల బాటను పట్టిన మన బ్యాంకులను ‘ఆదుకునేందుకు’ ప్రభుత్వా లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, వాస్తవ స్థితిలో మాత్రం మార్పు ఉండదు!!! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్: 9866179615. -
పుష్కరాల్లో వీఐపీల వికృతహేల
సందర్భం భారీ జనసందోహం పోగుపడే పుష్కరాల వంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావ కంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహించాలి. ప్రియమైన ఐ.వై.ఆర్. కృష్ణా రావు గారూ! గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మెల గిన విధానం నన్ను చాలా బాధించింది, వ్యాకులపర్చింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుం బం యాత్రికుల వ్యథపై కాసింత సున్నితంగా వ్యవహరించి ఉంటే పుష్కరాల ప్రారంభ దినాన 30 మంది (పిల్లలతో సహా) తొక్కిసలాటలో అసు వులు బాసిన ఘటన జరిగి ఉండేది కాదు. ఇలాంటి ఘటనల్లో ఒక్కరంటే ఒక్క వీఐపీ ఉన్నా చాలు.. అది భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్‌పై, ఇతర సేవలపై ప్రభావం చూపుతుంది. ప్రముఖ వ్యక్తులు లేకున్నట్లయితే రాజమండ్రిలో పుష్కరాలకు తరలివచ్చిన లక్షలాది మంది యాత్రికులకు పైసేవలన్నీ అందుబాటులో ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అతి పెద్ద తొక్కిసలాట సందర్భంగా క్షమా ర్హం కాని ఘటన జరిగినప్పటికీ, స్వయం ప్రకటిత వీఐపీలు తమ కుటుంబాలు, ఇతర పరివారం తోడుగా పుష్కరాల్లో పాల్గొనడానికి కదం తొక్కారని వార్తలు. యాత్రికులు సొం త ఖర్చులు పెట్టుకోవాల్సివచ్చింది కానీ, తమ ప్రైవేట్ ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వ ఖజానా అన్ని వేళలా పుష్కరాల్లో అందుబాటులో ఉందన్న చందాన వీఐపీలు పుష్కరాలకు పోటెత్తారు. నాకు అర్థమయిందేమిటంటే, రాజమండ్రి చేరుకుని పుష్కర జలాల్లో మునగడానికి ఉత్తరాన తుని నుంచి, దక్షి ణాన ఏలూరు వరకు యాత్రికులు భారీ సంఖ్యలో క్యూ కట్టి వేచి ఉన్నారు. ఇంత భారీ జనసందోహం మున్నె న్నడూ కనీవినీ ఎరుగనిది. మామూలు పరిస్థితుల్లో అయితే బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా.. అతడు లేదా ఆమె క్యూలో నిల్చుని వేచి చూడటానికి సిద్ధపడితే తప్ప, ఈ స్వయం ప్రకటిత వీఐపీల ప్రవేశంపై నిషేధం విధించేది. వీఐపీలను కూడా ఇతర యాత్రికులలాగే భావించి వారు మామూ లుగా పుష్కరాల్లో పాలు పంచుకునేలా చేసేది. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కనీస బాధ్య తతో అయినా వ్యవహరించినట్లు కనిపించలేదు. పైన పొందుపర్చిన చిత్రాన్ని చూసినట్లయితే, తొక్కిస లాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా గవర్నర్ తన కుటుంబంతోపాటు రాజమండ్రిని సం దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన వీఐపీ ఘాట్‌లో మునకవెయ్యడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. మనలాం టి ప్రజాస్వామ్యవ్యవస్థలో, కొంతమందిని వీఐపీలుగా గుర్తించి ప్రజాధనంతో వారికి అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని వారు ఆక్రమించడానికి అనుమతించడం జరిగితే అలాంటి పరిస్థితి ఎవరికైనా అసహ్యం కలిగించ దా? పుష్కరాల సందర్శన కోసం రాజమండ్రి రావడానికి గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్‌ను ఉపయోగించారని నాకర్థమైంది. పూర్తిగా వ్యక్తిగతమైన ఇలాంటి సందర్శనలకు ఎవరు డబ్బు చెల్లిస్తున్నారు? గవ ర్నర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కారు. ప్రభు త్వ ఖజానా నుంచి వారికోసం ఎలాంటి చెల్లింపులు చేయ కూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జవాబుదారీత నాన్ని తప్పక పాటించాలి. తమకు తాము పుణ్యం సంపా దిం చుకోవడం కోసం వీఐపీలు చెల్లింపులు జరిపేలా ప్రభు త్వ పన్ను చెల్లింపుదారును ఒత్తిడికి గురిచేయకూడదు. అలాంటి పుణ్యసాధన కోసం తాము ప్రజలను అసౌకర్యా నికి గురి చేయకూడదని వీఐపీలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర గవర్నర్ పాత్ర ఏమిటన్నది రాజ్యాంగంలో చక్కగా నిర్వచించారు. ఆయన పాత్రకు పరిమితులు న్నాయి. రాజ్యాంగంలో తమకు నిర్దేశించని పాత్రలను వారు చేపట్టనే కూడదు. పైగా, ఈ తొక్కిసలాట ఘటన మధ్యనే సింగపూర్ నుంచి అత్యున్నత స్థాయి బృందం రాజమండ్రిని సంద ర్శించిందని విన్నాను. ఈ బృందం సందర్శన కూడా యాత్రికులకు మరిన్ని ఇబ్బందులను కలుగజేసి ఉంటుం దని నా నమ్మకం. ప్రజలకు అసౌకర్యం కలిగించటమే కాక, ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారే వీఐపీలను ఇలాంటి పరిమాణాలకు పూర్తి బాధ్యత వహించేలా చేసి, వారిపై ఆరోపణలను బుక్ చేసే రోజొకటి వస్తుంది. టైమ్స్ టీవీ న్యూస్ చానల్లో వీఐపీల ఉపద్రవాన్ని విస్తృతంగా కవర్ చేయడం నా దృష్టికి వచ్చింది. కింది లిం కులో దాన్ని మీరు కూడా చూడవచ్చు. https://www.youtube.com/watch?t=75&v=WlLD0kF7DfQ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆర్నాబ్ గోస్వామి సంధించిన ప్రశ్నలకు నేరుగా సమా ధానం చెప్పకూడదు. ఎందుకంటే ఆ ఘటనకు సంబం ధించి వాస్తవంగానే ఎలాంటి సమాధానాలు లేవు. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్య మంత్రి విశాఖపట్నంలో ఉండిపోయిన ఘటన అసాధారణ మని, అది సహాయ చర్యలను వేగవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడిందన్న భావం కలిగించడానికి సీఎం అప్పట్లో ప్రయత్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సహా య చర్యలకు నేతృత్వం వహించడం అభినందనీయమే కానీ బహుశా సీఎం తెలుసుకోని విషయం ఏమిటంటే, విశాఖపట్నంలోని 90 శాతం అధికారులు ఆ సమయంలో సీఎం వద్ద హాజరు వేయించుకోవడంలోనే కాలం గడిపేశా రు. పైగా నిజంగా తుపాను ప్రభావానికి గురైన గుడిసెవా సులను అధికారులు పలకరించలేకపోయారు. ఈ అధికా రుల్లో చాలామంది 5 స్టార్ హోటల్లో బస చేశారు. తుపా ను ముగిసిన తొమ్మిది నెలల తర్వాత కూడా పేదలలో కేవలం 15 శాతం మంది మాత్రమే తుపాను సహాయాన్ని అందుకోగలిగారు. మిగతావారు ఈనాటికీ సహాయం కోసం వేచి చూస్తూనే ఉంటున్నారు. హుద్ హుద్ తుపాను అనంతరం ప్రధానమంత్రి విశాఖపట్నం సందర్శన ఎంత ఇబ్బంది కలిగించిందంటే, బాధితులకు ఉద్దేశించిన ఆహార సామగ్రి మొత్తంగా పాడయిపోయింది, అధికారుల అప్ర మత్తత కూడా దారి తప్పింది. ఇలాంటి సందర్భాల్లో తమ అహాలకంటే, వ్యక్తిగత పుణ్యాన్ని సాధించాలనే యావకంటే ప్రజా ప్రయోజనాన్ని అన్నిటికంటే ప్రథమస్థానంలో ఉంచాలన్న సందేశాన్ని గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రహిస్తారని ఆశిస్తు న్నాను. ప్రచారం పట్ల ఆత్రుత, రాజకీయ ప్రయోజనాలకు కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది. తాము ప్రజాస్వా మ్యంలో భాగమే కానీ జమీందారీ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని వారు తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. తన ఘోరమైన, అతిశయించిన వీఐపీ సంస్కృతిని భారతదేశం అధిగమించే రోజొకటి వస్తుందని నేను ఆశిస్తు న్నాను. ప్రజాస్వామ్యంలో వీఐపీలకు చోటు లేదు. ఈ ఉత్తరాన్ని గవర్నర్, ముఖ్యమంత్రుల ముందు ఉంచాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో వారు ఎలాంటి పాత్రలను నిర్వహించాలనే విషయంపై నా ఉత్తరం ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను. తొక్కిసలాటపై న్యాయవిచారణపై ఇకనయినా దృష్టి పెడతారని ఆశిస్తాను. ఈ ఘటనలో పోలీసులు, జూనియర్ అధికారుల పాత్రపైనే కాదు.. వీఐపీల పాత్రపై కూడా దృష్టి పెట్టగలరని ఆశిస్తున్నాను. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుకు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ రాసిన లేఖ) ఈఎఎస్ శర్మ (వ్యాసకర్త మొబైల్: 9866021646) ఈ మెయిల్:eassarma@gmail.com. -
ఆ సహానుభూతికి బాధితుల గోడు పట్టదేం?
సందర్భం తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అభిజిత్ ఒకరు. ఈ బాలీవుడ్ గాయకుడి ట్వీట్ ప్రకారం వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారట. నూరుల్లా షరీఫ్ కేసులో కారు స్పీడ్, ఆల్కహాల్ అనేవి చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట. నూరుల్లా షరీఫ్, రవీంద్ర పాటిల్, ముస్లిం షేక్ గురించి బహుశా ఇప్పుడెవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్ల శిక్ష విధిం చడానికే ఈ ముగ్గురే కారకు లు. వీరిలో షరీఫ్... సల్మాన్ కారు గుద్దిన ఘటనలో మరణించాడు. పాటిల్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసు బాడీగార్డు. ఇతడిని కోర్టు సహజ, నిష్పాక్షిక సాక్షిగా పేర్కొన్నది. ఇక ముస్లిం షేక్ ఆ ఘటనలో తీవ్రంగా గాయపడగా శస్త్ర చికిత్స చేసి శరీరంలో స్టీల్ రాడ్ అమర్చారు. అయితే ఆ కేసులో పతాక శీర్షిక వార్త సల్మాన్‌ఖాన్ మాత్రమే. ఆ ఘటన అనంతరం పాటిల్ ఒత్తిళ్లనుంచి తప్పించుకోవ డానికి బహిరంగ జీవితం నుంచి కనుమరుగయ్యాడు. అతడిని సర్వీసు నుంచి తొలగించారు కూడా. ఆ తరువాత ముంబైలో ఒక వీధిలో పడిపోయి, ఆసుపత్రి లో చనిపోయాడు. ఇక షేక్ యూపీలోని తన ఊరిలో కటిక దారిద్య్రంలో బతుకుతున్నాడు. సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో సెలబ్రిటీ ఫ్యాక్టర్ బాధితులను కనిపించకుండా చేసేసింది. మన సమాజం ఎంతగా చీలిపోయి ఉందనే విష యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రత్యేకించి ఇలాంటి అన్ని ఘటనల్లోనూ ఇతర అంశాల కంటే సెలబ్రిటీ ఫ్యాక్టర్‌నే మీడియా బలంగా ముందుకు తీసుకువస్తున్నది. ఆ వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ గాయకుడు అభిజిత్ ఒకరు. వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారని సెలవిచ్చాడు. ఆ కేసులో కారు వేగం, మద్యం చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట. ఎందరో తీవ్రంగా దుయ్యబట్టినా అభిజిత్ తన వ్యాఖ్యలకు కట్టుబడటమే కాక టీవీ చానల్స్‌లో సమర్థించుకున్నాడు. పైగా అతడు కూడా మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు సంవత్సరం పాటు వీధుల్లోనే గడిపాడట! వీధుల్లో నివసించడానికి అవి పేదవారి ఆస్తి కాదని అతగాడు ఇప్పుడంటున్నాడు. ఇలాంటి ఘటనల్లో చనిపోయినవారు, గాయపడినవారు వారి మూర్ఖత్వపు బాధితులని ఆయన వివరణ. చిన్న, పెద్ద తేడా లేకుండా మన ప్రతి నగరం లోనూ నిరాశ్రయులున్నారు. ఎండ, వాన, ఎముకలు కొరికే చలిలో బతికే దుర్భర జీవితాలకు మన నగరాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించు కోవడానికి అందరూ అభిజిత్ వంటి అదృష్టవంతులు కారు. ఇలాంటి వారి గురించి సమాజం అరుదుగా మాత్రమే పట్టించుకుంటుంది. ఎందుకంటే వారు మను షుల లెక్కలోకి రారు. కొందరు ప్రముఖులు వీధివాసు లకు ఓటుహక్కు రద్దు చేయించాలని ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ, విజ్ఞతాయుతమైన వాదనకు కట్టుబడి చాలామంది వెనక్కు తగ్గారు. కానీ ఒకే ఒక న్యాయవాది మాత్రం ఈ సమస్యపై ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా డు. బాలీవుడ్ పేదలపై చాలానే సినిమాలు నిర్మించింది. కేఏ అబ్బాస్, రాజ్‌కపూర్ తీసిన ‘శ్రీ 420’, ‘ఆవారా’ సినిమాలు పేదలు, నిరాశ్రయుల జీవితాలకు సంబం ధించినవి. కానీ ఇదే పరిశ్రమ మురికివాడల్లోని జీవితాల గురించి, సమాజంలోని అధోజగత్ సహోదరులు ఉనికి కోసం పోరాడుతుండటం గురించి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్స్’ సినిమాలో చూపించినప్పుడు దాన్ని ఏమంత పెద్దగా పట్టించుకోలేదు. అభిజిత్ ఉదంతంపై ఇతరులు మౌనం పాటించారు కానీ, రిషికపూర్ మాత్రం తనకు అవకాశం ఉంటే అభిజిత్‌పై విమర్శలను తటస్థం చేయడానికి ప్రయత్నించే వాడినని చెప్పారు. వ్యక్తిగత సంక్షోభంలో కూరుకునిపోయిన స్నేహితు డిని అతడి మిత్రులు గాలికి వదలేయాలని ఎవరూ భావించరు. సల్మాన్ ఖాన్ పట్ల వ్యవస్థ నిర్దయగా ఉంద నే అర్థం వచ్చేలా ట్వీటర్‌ను ఉపయోగించడం కాకుండా సంఘీభావ వ్యక్తీకరణ అనేది ప్రైవేట్‌గానే ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నప్పటికీ ఆల్కహాల్ సేవించి మరీ కారు డ్రైవ్ చేసిన సల్మాన్ అనేక అబద్ధాలాడి తన్ను తా ను సమర్థించుకున్నట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. ఈ వ్యవహారంలో రాజకీయవాదులు కూడా జోక్యం చేసు కున్నారు. రాజ్‌థాకరే సైతం సల్మాన్‌ను సందర్శించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే సల్మాన్‌పై తీర్పు అనంతరం అతడికి దారి కల్పించే ప్రయత్నం చేశాడు కూడా. అయితే ఈ యోగ్యతలేవీ బాధితుల గురించి ఏమీ చెప్పడం లేదు. ఎవరైనా వారి ప్రస్తావన చేశారు అను కుంటే బాధితుల ఉనికి పట్ల వారు ఫిర్యాదు చేసేవారే. గూడు లేకపోవడం అనే సమస్యను ఎలా చర్చించాలి అనే చర్చను వారు ప్రారంభించటం కాదిది. శరవేగంగా నగరీకరణ, రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుతున్న సందర్భంలో దీన్ని పరిష్కరించ డంలో దేశం ముందు ఎలాంటి మార్గమూ కనిపించటం లేదు. అభిజిత్ కూనిరాగాలు పెడుతున్నాడు. మరో వైపున సల్మాన్ ఖాన్ అభిమానులు అతడున్న భవంతి ముందు వరదలాగా గుమిగూడుతుంటారు. మరి పేదలవల్ల, దరిద్రుల వల్ల దేశానికి ఎంత ఇబ్బందో చూడండి మరి! (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
ఆయనకు ఎన్నాళ్లీ ఖైదు?
సందర్భం ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను సరిగ్గా ఏడాది క్రితం మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ యంలో దారికడ్డంపడి కళ్ళకు గంతలు కట్టి ఎత్త్తుకుపోయి నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘అండా సెల్’ అని పిలిచే గాలీ వెలుతురు సోకని ఇరుకు గదిలో నిర్బంధించారు. మావోయిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్త్తున్నాడని ఆరోపణ చేసి అత్యంత అమానవీయ పరిస్థితుల్లో నాగపూర్ సెంట్రల్ జైల్లో పడవేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్లు రాజకీయ విశ్వాసాలను, అస మ్మతిని నేరంగా పరిగణిస్తాయి. నేరం నిరూపించి ముద్దాయికి శిక్ష నిర్ణయించడం కాకుండా, నేరారోపణకు గురైన వ్యక్తే తాను నిర్దోషినని నిరూపించుకునేవరకూ శిక్షను అమలు చేయవచ్చు. ఆ శిక్ష కూడా ఎంత అమా నుషంగా ఉంటుందో సాయిబాబా కేసే ఉదాహరణ. ఆయనకు శారీరక వైకల్య సమాన అవకాశాల చట్టం ప్రకారం చక్రాల కుర్చీ కదలికలకు కావల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు. మనిషి సహకారం లేనిదే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పట్టించుకోకుండా ఒంటరి ఖైదులో ఉంచారు. ఆయనకు 90 శాతం అంగ వైకల్యంతో పాటు తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజాల నరాల క్షీణత, వెన్నెముక నొప్పి ఉన్నాయి. జైల్లో మందులు, ఆహారం నామమాత్రంగా కూడా లేవు. బైటి నుండి కుటుంబ సభ్యులు, మిత్రులు పంపించినా నిరాకరిస్త్తున్నారు. ఆయన ప్రత్యేక పరిస్థితి దృష్టిలో పెట్టుకునైనా బెయిల్ ఇవ్వమని న్యాయవాదులు పలుమార్లు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి వల్ల హైకోర్టు కూడా నిరాకరించింది. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ స్థితిలో సాయిబాబా, ఆయ నకు చట్టపరంగా అందవలసిన కనీస సౌకర్యాలు, మం దులు, వైద్యం కోసం ఏప్రిల్ 11న జైల్లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. 14 నాటికి రెండుసార్లు స్పృహ కోల్పోయాడు. చివరికి 16వ తేదీ రాత్రి 11 గంటలకు మళ్ళీ స్పృహ కోల్పోయి పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఆయనకు బలవంతంగా సెలైన్ ఎక్కించి భారీ బందోబస్తు నడుమ నాగపూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. కోర్టు ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించింది. ఏప్రిల్ 17న ఆసుపత్రిలో దీక్ష విరమించాక ఒక్క రోజు తిరక్కుండానే మళ్ళీ ఆయన్ని అండా సెల్లో నిర్బంధించారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబాకు అయిదేళ్ళ వయసు నుండే పోరాటం మొదలయ్యింది. పోలియో తన శరీరంపై దాడిచేసి ఆయన నడుము కింది భాగమంతా చచ్చుబడేలా చేసింది. అమలాపురం దగ్గర పల్లెటూరులో మట్టి రోడ్లపై తన రెండు చేతులతో దేహాన్ని ఈడ్చుకుంటూ మొదలు పెట్టిన ప్రయాణం కాలేజీ చదువు నాటికి మలుపు తిరిగింది. తన శారీరక అనారోగ్యంకన్నా దేశాన్ని పట్టి పీడించే దోపిడీ అసమా నతలు ఎన్నో రెట్లు తీవ్రమైనవని అర్థం చేసుకున్నందుకే ఆయన చక్రాల కుర్చీలో దేశమంతా పీడితుల వెంట తిరిగాడు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఎన్నో రచనలు చేశాడు. ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా ఆ తర్వాత జాతీయ కార్య దర్శిగా ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా అవి శ్రాంతంగా పనిచేశాడు. అంతర్జాతీయ వేదికల్లో పోరాడే ప్రజలకు బాసటగా నిలిచాడు. ఆయన కష్టాలను లెక్క చేయ లేదు. నిర్బంధాలకు వెరవలేదు. ఆ చక్రాల కుర్చీని చూసి బంగారపు కుర్చీ భయపడుతోందని ఒక హిందీ కవి రాశాడు. అక్రమ అరెస్టు, తప్పుడు కేసులు మోపడమే కాక విచారణ ైఖదీగా ఉన్న మనిషి పట్ల, అదీ తీవ్రమైన అనారోగ్యమూ, శారీరక వైకల్యమూ ఉన్న మనిషి పట్ల చట్టాలనూ, కోర్టు ఆదేశాలనూ ఉల్లంఘించి, హింసకు గురిచేస్తున్న రాజ్య దుర్మార్గాన్ని ఖండిస్తూ, ఆయన విడుదల కోసం ప్రజాసంఘాలు డా.జి.ఎన్.సాయి బాబా విడుదల పోరాట కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రజాస్వామిక నిరసనను ఏ మాత్రం భరించలేని తెలంగాణ రాష్ర్టప్రభుత్వం మే 9న జరుపతలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించింది. చివరికి ఇందిరా పార్క్ వద్ద పరిమిత ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అనుమతించారు. సాయిబాబాను జైల్లోనే అంతం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం ప్రజాసంఘాలకు కలుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం ఎట్లాగు ప్రధాన దోషి అవుతుంది, అయితే ఆ పాపంలో ప్రశ్నించని సభ్య సామా జానికీ భాగస్వామ్యం ఉండదా? (వ్యాసకర్త విరసం కార్యదర్శి) ఫోన్: 8179913123 -
దేవతా వనాలకు పట్టిన దెయ్యాల పీడ
సందర్భం అరణ్యకాండ -2 ‘శేషాచలం’ కథ ఎన్నో ఎన్కౌంటర్ కథల్లా ముగిసిపోలేదు. ప్రభుత్వానికి, పోలీసులకు సంకటమై సశేషంగా మిగిలింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో, పలు అంచెలుగా విస్తరించిన భూతగణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలను తమిళ కూలీల పీనుగులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లు కాపాడగలవా? ఉన్నపళంగా చంటిబిడ్డను చంకనేసుకొని పొద్దుటే మొదటి బస్సుకు చంద్రగిరి కొచ్చే సింది మునియమ్మాళ్. పాత చీర కొంగుతో అదేపనిగా కన్నీ రు తుడుచుకునే ఆ ఆడకూతు రికి ఎందుకీ దుఃఖమని అడిగి నవారూ లేరు, ఆమె చెప్పిందీ లేదు. తమిళం తప్ప మరే భాషా రాని ఆమె చంద్రగిరి ఠాణాకు చేరడానికే నానా తంటాలూ పడింది. పోలీసుల ప్రశ్నలకూ కన్నీళ్లే సమా ధానాలు. శేషాచలం ఎన్కౌంటర్లో మరణించిన 20 మంది తమిళ కూలీల్లో ఆమె భర్త శశికుమార్ ఒకడు. తిరువణ్ణామలై, ధర్మపురి జిల్లాల్లోని మృతుల గ్రామా లన్నీ శోకసముద్రాలయ్యాయి. ‘శేషాచలం’ నిజం తేల్చా ల్సిందేనని ప్రజా, హక్కుల సంఘాలు పట్టుబట్టాయి. శవాలను చూసి ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సురేష్ కూలీలు చిత్రహింసలకు గురైనట్టున్నారన్నారు. మునియమ్మాళ్ గోడును రాష్ట్ర హైకోర్టు సుమోటో గా స్వీకరించి, ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్‌గా చేర్చింది. మద్రాసు హైకోర్టు శశికుమార్ మృతదేహం రీపోస్ట్ మార్టంకు ఆదేశించింది. మరో ఐదు మృతదేహా లకూ మళ్లీ శవపరీక్షలు తప్పలేదు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న బాలచందర్, ఇళంగో, శేఖర్లు సాక్షులు గా ముందుకొచ్చారు. ‘‘గుడిపాల గ్రామం వద్ద పోలీసు లు మమ్మల్ని పట్టుకున్నారు. తప్పించుకున్నవాళ్లం బతికి పోయా’’మంటూ మహేంద్రన్, మురళీ భారతీ దాసన్ వంటివాళ్లు మీడియాకు చెప్పారు. కీలక సాక్షులైన శేఖర్, బాలచంద్రన్లు తమకు ప్రాణ హాని ఉన్నదనడంతో జాతీయ మానవ హక్కుల సంఘం వారికి, వారి కుటుం బాలకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధిత ప్రాంతమంటూ ఏపీ పోలీసులు హక్కుల సంఘాలను ఎన్కౌంటర్ ప్రాంతాలకు వెళ్లనివ్వ లేదు. సచ్చినోడిబండ, చీగటిగలకోన ప్రాంతాల్లో పర్య టించిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్కౌంటర్ కథ నంపై ఎన్నో సందేహాలను, మరెంతో అసంతృప్తిని వ్య క్తం చేశారు. హక్కుల సంస్థలన్నీ ఎక్కడో పట్టుకుని తెచ్చి కూలీలను కాల్చేశారంటున్నాయి. పూర్తి వివరాలతో నివే దికనివ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ‘శేషాచ లం’ కథ ఎన్నో ఎన్కౌంటర్లలా ముగిసిపోలేదు. ప్రభు త్వానికి, పోలీసులకు సంకట సశేషమైంది. కొందరు ‘శేషాచలం’తో ఎర్రచందనం దొంగల ఆట ఇక కట్టేనన్నారు. రెండు వారాలైనా గడవకముందే కడప సబ్ డివిజన్లో నలభై గొడ్డళ్లు, ఎనిమిది ఎర్రచం దనం దుంగలతో కొందరు పట్టుబడ్డారు. అదేరోజు ప్రొద్దుటూరులో ఒక ముఠా 50 గొడ్డళ్లతో, రైల్వే కోడూ రులో పది దుంగలతో మరో ముఠా కూలీలు పట్టుబడ్డా రు. అంత పెద్ద ఎన్కౌంటర్ స్మగ్లర్లను, కూలీలను భయ పెట్టలేకపోయింది! ఏజెంట్లు తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, చెంగల్పట్టు జిల్లాల్లోని వివిధ గ్రామాల నుంచే ఎక్కువగా కూలీలను కుదుర్చుకుని, ఐదు, పది మంది బృందాలను చేసి వివిధ ప్రాంతాల్లో చెట్లు కొట్టే పని అప్పగిస్తారు. నెల నుంచి రెండు నెలలు వారికి వనవాసమే. పది రోజుల పనికి ఒక్కొక్కరికి రూ. 30 వేలు. ఏజెంట్లే తప్ప స్మగ్లర్లు కనబడరు. పోలీసు కళ్లకు కూలీలే స్మగ్లర్లు! కొట్టిన చెట్లను డ్రెస్సింగ్ చేసిన దుంగ లుగా ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు తర లిస్తారు. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి 30 కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో పెట్టి విమానాలెక్కించి సరిహద్దులు దాటించడం, పొడి చేసి దుబాయ్ మీదుగా చైనాకు చేర్చడం రచ్చకెక్కిన పద్ధతులు. ఈ అక్రమ రవా ణాలో తమిళనాడే కీలకం. దుంగలు రోడ్డు మార్గాన చెన్నై పోర్టు చేరి విదేశాలకు ‘ఎగుమతి’ అవుతాయి. అధి కారులు స్వాధీనం చేసుకున్న సింగపూర్‌కు చేరాల్సిన ‘‘వేరుశనగపప్పు, ఉప్పు వగైరా వంట సామాగ్రి’’ కంటై నర్ అడుగున ఎర్రచందనం దుంగలున్నాయి. మరో కంటైనర్‌లో 18 టన్నుల దుంగలు దొరికాయి. అయితే స్మగ్లర్లిచ్చే ఖరీదైన బహుమతుల ప్రలోభానికి చూసీ చూడనట్టు వదిలేసే కస్టమ్స్ అధికారులకు కొదవ లే దు. ఇక రోడ్డు మార్గాన బెంగాల్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలకు ఎర్రచందనం చేరుతూనే ఉంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్ర్రాల నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటా న్, చైనాలకు వ్యూహాత్మకంగా తరలిస్తున్నారు. మయన్మా ర్కు చేరిస్తే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా సరఫరా చేసే సత్తా అక్కడి నెట్వర్క్కుంది. గుజరాత్ కాండ్లా రేవు నుంచి దుబాయ్‌కి చేర్చేది మరో దారి కాగా, అగర్తలా నుంచి చైనా, జపాన్‌లకు ఇంకో దారి. దిగువ ఏజెంట్ల నుంచి జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, పలు అంచె లుగా విస్తరించిన ఈ భూత గణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలకు రక్ష తమిళ కూలీల పీను గులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లేనా? (వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు) మొబైల్ నం : 9440074893 -
‘చందన’ సీమకు చీకటి దారులు
సందర్భం అరణ్యకాండ -1 రాయలసీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్ల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం అక్కడే లభ్యమౌతోంది. అందుకే స్మగ్లర్లందరి కళ్లూ ఆ అరణ్యాలపైనే. ‘తమిళ కూలీ’లతో సీమ జైళ్లన్నీ నిండిపోతున్నా మన ‘బంగారం’ మటుమాయమైపోతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు... ఎర్రచందనం స్మగ్లింగ్ దారులు ఎన్నని? రాస్తే రామాయణం, చెబితే భారతం. సూట్‌కేసులు, వ్యాన్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, పాల వ్యాన్లు, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలు.. ఏదైనా ఎర్రచందనాన్ని తరలించదగిందే. యూరియా మూటలు, పైపులు, మొక్కజొన్న బస్తాలు, పండ్ల పెట్టెలు, నిమ్మ అంట్లు, బొప్పాయి, చీనీ కాయలు, టెంకాయలు, మామిడి కాయలు, వరిపొట్టు, కరేపాకు, ఇనుప ఖనిజం, ఇసుక.... ఇలా ఎర్రచందనం ఎలా దొరకలేదు? ఎక్కడ పట్టుబడలేదు? ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపో తున్న వృక్ష సంపదగా గుర్తింపును పొందిన ఎర్రచంద నం కడప, చిత్తూరు జిల్లాల అడవులంతటా ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఐదు లక్షల హెక్టార్లలో కూడా అవి ఉన్నాయి. అటవీ శాఖ ఆ చెట్లను 10-20 ఏళ్లు, 20-30 ఏళ్లు, 30-40 ఏళ్లు వయసున్న మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. స్మగ్లర్ల దృష్టి ఎప్పుడూ 30-40 ఏళ్ల చెట్లపైనే. అటవీ శాఖ అధి కారులు శాటిలైట్ రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పరిశీలించగా చిత్తూరు జిల్లాలోని చామల అటవీ రేంజ్ పరిధిలో ఎక్కువగా ఆ చెట్లను నరికేసినట్టు తెలిసింది. కడప జిల్లాలో 3,14,590 హెక్టార్లలో ఎర్రచందనం చెట్లున్నాయి. డివిజన్ల వారీగా కడప డివిజన్లో 1,28, 644 హెక్టార్లు, ప్రొద్దుటూరులో 1,01,142 హెక్టార్లు, రాజంపేట డివిజన్లో 84,803 హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి 11 కిలో మీటర్ల దూరంలోని శేషాచలం కొండల్లోని శ్రీ వెంకటే శ్వర అభయారణ్యం ప్రధానమైనది. కుక్కలదొడ్డి నుంచి 10 కిలో మీటర్ల దూరంలోని తుంబుర తీర్థం ద్వారా అడవిలోకి దారులున్నాయి. రైల్వే కోడూరు రేంజిలో పోట్రాలగుండం, కేసరి బండలు, వాననీళ్ల గుట్ట, చిన్నక లుజులు, పల్లెగుండాలు, కాశికోన, గాదెల, బాటగుం డం, చాకలిరేవుకోన, వలసకోన, ముత్తరాచకోన, దొంగ బండల ప్రాంతాలున్నాయి. అలాగే బాలపల్లె రేంజి పరి ధిలో యర్రడ్లమడుగు, సిద్ధలేరు, కంగుమడుగు, దేశెట్టి గుడాలు, గుంజనేరు, యుద్ధరాల తీర్థం, విష్ణుగుండం, సందలేరు, తలకోన ప్రాంతాల్లో నీటి కుంటలు ఉండ టం వల్ల ఎర్రచందనం కూలీలకు ఈ ప్రాంతాలు ఆవా సాలుగా మారుతున్నాయి. బాలపల్లె, రైల్వేకోడూరు, చిట్వేలి, రాజంపేట, సానిపాయ రేంజ్‌లు రాజంపేట డివిజనల్ అటవీ అధికారి (డీఎఫ్ఓ) పరిధిలో ఉన్నాయి. బాలపల్లి రేంజ్లో 30-40 ఏళ్లకు పైబడిన ఎర్రచందనం వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో స్మగ్లర్ల కన్ను ప్రస్తు తం దానిపైనే ప్రధానంగా ఉంది. అందుకే ఆ రేంజ్‌లోనే అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం వాహనాలు ఎక్కువగా పట్టుబడుతున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్ అటవీ ప్రాంతం 1,64,516 హెక్టార్లు. కాగా అందులో లంకమల అభయారణ్యం 20,050 హెక్టార్లలో, పెనుశిల నరసింహ అభయారణ్యం 7,844 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఆ రెండిట్లో కాక ఇంకా 68,440 హెక్టార్లలో 21,17,614 ఎర్రచందనం వృక్షాలున్నాయి. కోడూరు రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ తెల్లవారు జామున చెన్నై నుంచి వచ్చే రైల్లోంచి వందల్లో ‘తమిళ కూలీ’లు దిగుతుంటారు. తిండిగింజలు, సరుకులు, వం టపాత్రలు మోసుకుంటూ దిగినవారు దిగినట్టే వారు అడవుల్లోకి వెళ్లిపోవడం స్థానికులకు నిత్యం కనిపించే దృశ్యమే. 350 మంది వరకు ఎర్రచందనం కూలీలు రిమాండు ఖైదీలుగా ఉన్న కడప కేంద్ర కాగారారం కిక్కి రిసిపోయింది. వారిలో 90 శాతం మంది తమిళులే. గత ఏడాది జూలై 1న 356 మంది ‘ఎర్రచందనం కూలీ’ లను నిందితులుగా విచారించడానికి కోర్టులు సరిపోక తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో ‘బహిరంగ కోర్టు’ నిర్వహించాల్సి వచ్చింది. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖాధికారులను (డేవిడ్, శ్రీధర్) కిరాతకంగా హత్య చేసిన ఆ కేసు సంచలనం సృష్టించింది. కూలీలు, విద్యార్థులు, యువకులు, నిరక్షరాస్యులు, మైనర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాయలసీమలోని జైళ్లన్నీ ‘తమిళ కూలీ’లతోనే నిండిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల అడవుల్లో సాధారణంగా ఒక్కో బీటు పరిధి 5-10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోపే ఉంటుంది. కానీ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్‌ల్లో ఒక్కో బీటు 25 నుంచి 75 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించి ఉంటోంది. ఒక అంచనా ప్రకారం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విస్తీర్ణం అధికంగా ఉన్న ఎనిమిది అటవీ డివిజన్ల పరి ధిలో అటవీశాఖ పట్టుకోగలిగిన వి 50 వేల దుంగలు మా త్రమే. అంత మొత్తం సరిహద్దులు దాటిపోయాయి. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం దుం గలలో వేటిని ఏ రేంజిలో, ఏ సెక్షన్లో, ఏ బీటులో నరి కారో గుర్తించలేని స్థితి. అక్రమంగా రవాణా చేసే ఎర్ర చందనం ఎక్కడ దొరికినా వాటిని విక్రయించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే దక్కేలా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నుంచి ఒక హామీని మాత్రం మన అధికారులు పొందగలిగారు. రాయల సీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్లనే అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం ఇక్కడి అరణ్యాల్లో లభ్యమౌతోందని శాస్త్రవేత్తల అభిప్రాయం. (వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు) e-mail: gangadhar.vempalli@gmail.com -
హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకు చంద్రబాబు తిలోదకాలు
సందర్భం సాగునీటి రంగంలో సం క్షోభాన్ని పరిష్కరించడా నికి మారుగా చంద్రబాబు ప్రాంతాలు, జిల్లాల మధ్య వివాదాలు రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీ ర్యం చేస్తూ... గోదావరి, కృష్ణా జిల్లాల రైతాంగం భవిష్యత్‌నూ ప్రశ్నార్థకం చేసే దిశగా ఆయన తన రాజకీయ గమనం కొనసాగించారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన హంద్రీ-నీవా కాలువకు ఇరువైపుల సేద్యపు నీటి వసతులు కల్పిం చే కాలువల పనులను ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. నేడు హంద్రీ- నీవాను కుదించి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, కుప్పం తదితర ప్రాంతాలకు నీటిని తీసుకుని వెళ్లాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు అనంతపురం జిల్లా వాసులను కలవరపెడు తున్నాయి. అనంతపురం ప్రజలు ఏ రోజూ చిత్తూరు జిల్లా తాగు, సాగునీటి అవసరాలకు వ్యతిరేకం కాదు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో కేటాయించిన జలా లతో ఈ ప్రాంత అవసరాలను తీర్చి చిత్తూరు, కడప జిల్లాల అవసరాలకు కృష్ణా జలాలను తరలించాలని మాత్రమే ఈ జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఒక ఏడాదిలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించడం జరు గుతుందని, ఆ మేరకు అదే సామర్థ్యపునీటిని ఎగువ శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలు తీర్చడానికి జరుగుతున్న కృషిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారని బాబు ఆరోపణలు చేశారు. పట్టి సీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలిం చడం జరిగినప్పుడు ఎగువన శ్రీశైలం నుంచి ఆ మేరకు నీటిని హంద్రీ-నీవాకు, గాలేరు-నగరికి శ్రీశై లం కుడికాలువ ద్వారా మరియు కేసీ కెనాల్‌కు నీటిని కేటాయించి రాయలసీమ అవసరాలు తీర్చ గలిగే అవకాశమున్నప్పుడు హంద్రీ-నీవాను కుదిం చాల్సిన అవసరమేమిటి? పట్టిసీమను జగన్ మోహ న్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారని విషప్రచారం చేసిన బాబు తానెందుకు పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తు న్నారు? ఒక ప్రాజెక్టుకు మార్పులు, చేర్పులు జరిపే టప్పుడు రైతు సంఘాలతో, ప్రతిపక్ష నాయకులతో, కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపే సంప్రదాయా లు ఎందుకు వదులుకుంటున్నారు? 1972 కేంద్ర ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన నిరంతర కరువు పీడిత ప్రాంతాలు కేవలం వర్షాధా రిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వ్యవసాయం అటకెక్కింది. రైతులు దివాళా తీశారు. లక్షల సంఖ్యలో అనంతపు రం, చిత్తూరు, కడప, కర్నూలు, మెట్ట ప్రాంతాల లోని వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు పొట్ట చేత పట్టుకుని కూలి పనుల కోసం నగరాలకు వలస బాట పట్టారు. వేల గ్రామాలలో తాగునీటి ఎద్దడి తీవ్రత మనం ఎదుర్కొంటున్నాం. అనంతపురం జిల్లాలో 2 లక్షల బోరు బావులు భూగర్భ జలాలను లాగివేశాయి. అలాగే కడప జిల్లాలోని రాయచోటి తదితర ప్రాంతాలలో తాగు నీరే దొరకని పరిస్థితి. ఇంత సంక్షోభం ఉన్న ప్రాంతాల అవసరాలు తీర్చ డానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కోట్లు వెచ్చిం చి ఎవరూ సాహచించని ఎత్తిపోతల పథకం, హంద్రీ నీవా గురించి చేసిన ఆలోచన ఎంత గొప్పది. ఆ ప్రాజెక్టు పట్ల నిరంతరం విషం కక్కుతూ... వైఎస్‌పై, జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిం చిన బాబు చేస్తున్నది ఏమిటి? నిజంగా చంద్రబా బులో ఏ మాత్రం ప్రజాస్వామిక విలువలు ఉన్నా సేద్య పు నీటి ప్రాజెక్టులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయడానికి సాహసించగలరా? సీమవాసుల, ప్రత్యే కించి అనంతపురం జిల్లావాసుల అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయగలరా? (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్: 99899 04389 -
మృత్యు రహదారులకు అడ్డుకట్ట... ‘రోడ్డు సేఫ్టీ’
సందర్భం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత విస్తృత పరిమాణంతో కేంద్రప్రభుత్వం రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015పై బిల్లును ప్రవేశపెట్టింది. గత నెల చివర్లో దేశవ్యాప్తంగా రవాణా ఆపరేటర్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపినా ప్రజా భద్రత దృష్ట్యా ఈ బిల్లుపై జాతీయస్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రోడ్డురవాణా, భద్రతా చట్టం 2015 పేరిట ఒక బిల్లును ప్రవే శపెట్టింది. దీనికి ప్రతిస్పంద నగా ఏప్రిల్ 30న లారీ, ఆటో డ్రైవర్ యూనియన్లతోపాటు దేశవ్యాప్తంగా రవాణా ఆపరే టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. దేశంలో జరుగుతు న్న రోడ్డు ప్రమాదాలను నిత్యం పరిశీలిస్తున్న ప్రజలు భారతీయ వాహన చట్టాలను సవరించాల్సిన అవసర ముందని భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాద క్లెయిమ్‌లు తదితరమైన ఘటనలపై కోర్టు కేసులు పెరిగి పోతున్నాయి. టోల్ చార్జీలపై ప్రజా నిరసన కారణంగా పలు రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న రవాణా అవస రాలు, రవాణా మౌలిక సౌకర్యాల అవసరం కారణంగా దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్‌ల విస్తరణకు, నిర్వహణకు ప్రైవేట్ పెట్టుబడే పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి చట్టాల్లో మార్పు తీసుకువస్తానని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, భద్రతా చట్టం 2015ను ప్రతిపాదించారు. ఇది 350 పేజీల భారీ డాక్యు మెంట్. రోడ్డు రవాణాకు సంబంధించిన ప్రతి అంశాన్ని దీంట్లో పొందుపర్చారు. ఈ చట్టం కింద ఇన్ని నిబంధన లను ఏర్పర్చవలసిన అవసరం ఉందా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఈ చట్టం కింది సాధికారిక వ్యవస్థ లను ప్రతిపాదించింది. 1. జాతీయ రహదారి భద్రత, వాహన క్రమబద్ధీకరణ అథారిటీ. 2. జాతీయ రోడ్డు రవాణా, బహుళ నమూనా సమన్వయ అథారిటీ. వీటిలో మొదటిది ప్రధానంగా వాహనాలకు సం బంధించింది. రెండోది రహదారులు మినహా రవాణా మౌలిక సౌకర్యాల వ్యవస్థకు సంబంధించింది. డ్రైవింగ్ లెసైన్స్, మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్లు, బీమా, ఉత్పత్తి దారుల నుంచి వెహికల్ సమాచారం, పర్మిట్లు, రోడ్ ప్రమాదాలు, నేరాలు, జరిమానాలు వంటి వాటికి సం బంధించి జాతీయ ఏకీకృత వ్యవస్థను కూడా ఈ బిల్లు ప్రతిపాదించింది. రాష్ట్రాల మద్య సమాచార పంపకంలో అంతరాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యల కారణంగా ఇది సరైన చర్యే. అయితే దీనికి సమాచారా న్ని రూపొందించి, అందించే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పర్చుకోవడం అవసరం. అయితే, ఈ బిల్లు మొత్తం మీద క్రమబద్ధీకరణ సం స్థలను కేంద్రీకరించాలని చూస్తోంది. ఇది కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని, సమాచార పంపకాన్ని, సంస్థల మధ్య సహకారాన్ని ఈ చట్టం ప్రతిపాదించడం లేదు. కేంద్రీ కరణ అనేది అవినీతికి రాచమార్గం కల్పిస్తుంది. దేశవ్యా ప్తంగా నెలకొన్న పలు రహదారి సమస్యలకు ఇది పరి ష్కారం చూపదు కూడా. 2005 జనవరి 13న నాటి ప్రధాని నేతృత్వంలో ఉన్న, మౌలిక సౌకర్యాల కల్పనపై కేబినెట్ కమిటీ ఆదే శాల మేరకు రోడ్డు భద్రత, నిర్వహణపై ఒక నిపుణుల కమిటీ ఏర్పడింది. రోడ్డు భద్రత విషయంలో వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిలో రాజకీయ చిత్తశుద్ధి ఉం దని ఈ కమిటీ తన అధ్యయనంలో కనుగొంది. రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహించే ఏకైక సంస్థ ఏ దేశంలోనూ లేదని ఆ అధ్యయనం తెలిపింది. రోడ్డు ప్రమాదాలకు చెందిన నేరస్థ స్వభావాన్ని నివారించాలని, నిబద్ధ హైవే పోలీసును, రోడ్డు భద్రత నిధిని, సమర్థ నిర్వహణను కమిటీ ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత ప్రతిపాదిత బిల్లులో మెడికో- లీగల్ కేసుల సమస్యను ఏమాత్రం ప్రస్తావించలేదు. జాతీయ రహదారులపై కీలకమైన ఆ గంట సమయం లో తీసుకోవలసిన తక్షణ చర్యలను నిర్వచించినప్పటికీ ఇతర రహదారుల ఊసు ఈ బిల్లులో లేదు. పైగా ప్రమా దకరమైన వస్తువులను, సరకులను తీసుకువెళుతున్న పెట్రోలియం, రసాయనాల టాంకర్లకు పబ్లిక్ లయబి లిటీ ఇనూరెన్స్ యాక్ట్ 1991 కింద బీమా సౌకర్యం కల్పించాలని ప్రస్తుత బిల్లు ప్రతిపాదించిందే కానీ అలాంటి వాహనాలు కలిగిస్తున్న ప్రమాదాల బారిన పడిన ప్రజలను గాలికొదిలేసింది. పైగా వాహనాల నుం చి వచ్చే వాయు, శబ్ద కాలుష్యం గురించి పేర్కొనడమే తప్ప, సహజ వనరులను దెబ్బతీస్తున్న వాహనాల కాలు ష్యం గురించి ప్రస్తావించలేదు. ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రధానంగా నిరక్షరాస్యులు నడుపుతున్న సరుకు రవా ణా రంగానికి సంబంధించి ఈ బిల్లు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. భారతీయ ఆర్థికవ్యవస్థలో ప్రాధాన్యం ఉన్న ఈ రంగాన్ని అహేతుకమైన రీతిలో ఇబ్బంది పెట్ట కూడదు. అదే సమయంలో ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తున్న ఏక వాహన యజమానులు, చిన్న స్థాయి రవాణాదారులకు భద్రతకు ఈ బిల్లు హామీ ఇవ్వాలి. పైగా ప్రభుత్వ నిధులపై భారాన్ని తగ్గించాలి కూడా. (వ్యాసకర్త ప్రభుత్వ విధాన నిపుణులు) ఈమెయిల్: nreddy.donthi@gmail.com -
ఉన్నత విద్యకు గ్రహణం పట్టిస్తారా?!
సందర్భం అరవైయ్యేళ్లుగా విద్యాసంస్థలన్నిటినీ హైదరాబాద్‌లోనే స్థాపించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసిన పాలకులు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే తప్పు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పరిశేష ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న త విద్యా సంస్థలను నెలకొల్పు తామని, విద్యారంగం అభివృద్ధికి దోహదపడతామని ఇచ్చిన హామీ ఆచరణలో నిరర్ధక చర్యగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో మొత్తం 11 జాతీయ విద్యాసంస్థలు స్థాపించాలని విభజన చట్టం నిర్దేశించిం ది. ఇందులో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్ఈ ఆర్(ఇండియ న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి. విభజన నిర్ణయమే అనాలోచితంగా చేశారనుకుంటే ఆ విభజన అనంతర నిర్ణయాలు సైతం లోపభూయిష్టంగా ఉండ టం విచారకరం. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తమిళ నాడు సరిహద్దుల్లో తిరుపతి పరిసరాల్లోనూ, సెంట్రల్ వర్సిటీని కర్ణాటక సరిహద్దున ఉన్న అనంతపురంలోనూ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందు వల్ల ప్రధానంగా బాగుపడేది తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు మాత్రమే. నూతన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు న్నాయి. అరవైయ్యేళ్లుగా విద్యాసంస్థలన్నిటినీ హైదరా బాద్లోనే స్థాపించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసిన పాలకులు కొత్త రాష్ట్రంలో కూడా అదే తప్పు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పొరుగు రాష్ట్రాల సేవలో తరించి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలకు గండి కొడుతున్నారు. వాస్తవానికి శ్రీకాకుళంలో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థనూ, విజయనగరంలో గిరిజన విశ్వ విద్యాలయాన్నీ, విశాఖలో ఐఐఎంనూ, ప్రకాశంలో మైన్స్ విశ్వవిద్యాలయాన్నీ, నెల్లూరులో మెరైన్ ఇనిస్టిట్యూట్నూ, కర్నూలులో ట్రిపుల్ ఐటీనీ, తూర్పు గోదావరిలో పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని, పశ్చిమ గోదావరిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాల యం, ఎయిమ్స్ స్థాపించాలన్న ఆలోచనతో స్థల సేక రణ, తాత్కాలిక భవనాల ఏర్పాటులాంటివి దాదాపు పూర్తిచేశారు. విశాఖ ఐఐఎం, తిరుపతి పరిసర ప్రాంతా ల్లో నెలకొల్పదలుచుకున్న ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లకు కేంద్ర మానవ వనరుల మంత్రి శంకుస్థాపనలు చేశారు. చెన్నైలో 1959 నుంచీ నడుస్తున్న ఐఐటీ విద్యా ప్రమాణాలపరంగా, సౌకర్యాలపరంగా ఎంతో ప్రతిష్టా త్మకమైనది. దీనికి కూతవేటు దూరంలోని తిరుపతిలో మరో ఐఐటీ స్థాపించడంవల్ల మన విద్యార్థులకన్నా తమిళనాడు విద్యార్థులకే ప్రయోజనం చేకూరుతుంది. దేశంలోని వివిధ ఐఐటీల్లో మన రాష్ట్ర విద్యార్థులే అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రంగా ఉండి నిత్యమూ లక్షలాదిమంది భక్తుల తో కిటకిటలాడే తిరుపతిలో మంచినీరు మొదలుకొని అన్నీ సమస్యలే. ఐఐటీ స్థాపిస్తే ఈ సమస్యలు మరిం తగా పెరుగుతాయి. పైగా అక్కడ వెంకటేశ్వర యూని వర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, సంస్కృత విశ్వ విద్యాలయం, స్విమ్స్లాంటివి ఉన్నాయి. అనుభవజ్ఞు లైన అధ్యాపకులు సకల సౌకర్యాలున్న చెన్నై ఐఐటీలో పనిచేయడానికి మొగ్గుచూపుతారు తప్ప సమస్యలతో సతమతమయ్యే తిరుపతికి రావడానికి ఇష్టపడరు. దీన్ని విజయవాడ-రాజమండ్రిల మధ్య ఎక్కడ స్థాపించినా రాష్ట్ర విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనకు అనంతపురాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకన్నా సెంట్రల్ యూనివర్సిటీల్లోని విద్యార్థులకు సౌకర్యాలు ఎక్కువుంటాయి. పరిశోధక విద్యార్థులకు నెలకు రూ. 8,000 ఇస్తారు. అన్ని రాష్ట్రాల విద్యార్థినీ విద్యార్థులుం డటంవల్ల వివిధ భాషలు, సంస్కృతిపట్ల మంచి అవగా హన కలుగుతుంది. వీటిల్లో భాషా శాస్త్రాలు తప్ప మిగిలి నవన్నీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. అన్ని రకాల కోర్సులూ తక్కువ ఫీజులతో, ఉపకార వేతనాలతో, ఫెలోషిప్‌లతో అన్ని వర్గాల విద్యార్థులకూ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాల యాన్ని పొరుగు రాష్ట్రానికి చేరువలో స్థాపించడం అవివే కం. అనాలోచితం. అనర్థదాయకం. రైలు, రోడ్డు సౌక ర్యాలు పుష్కలంగా ఉండి, ఇంతవరకూ ఎలాంటి యూ నివర్సిటీలేని ఒంగోలులో స్థాపించడం వల్ల దాదాపు అన్ని జిల్లాలవారికీ అనుకూలంగా ఉంటుంది. పైగా ప్రకాశం జిల్లా ఎన్నాళ్లనుంచో నిరాద రణకు గురవుతున్న జిల్లా. అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉన్నా మన నేతల దృష్టిపడని జిల్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాక కూడా ఇదే వివక్ష కొనసాగడం అన్యాయం. కనీసం సకల సౌకర్యాలున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సి టీగా మార్చినా విద్యార్థులకు ఉప యుక్తంగా ఉంటుంది. అలాగే మైనింగ్ యూనివర్సిటీ గనులు అధికంగా ఉండే అనంతపురంలో స్థాపించడం అన్నివిధాలా ప్రయోజన కరం. ఇప్పటికే కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలున్న అనంతపురంలో సెంట్రల్ యూనివ ర్సిటీ స్థాపనను విరమించుకోవాలి. గుంటూరు, విజయవాడల్లో ఇప్పటికే అనేక వైద్య కళాశాలలు, వైద్య విశ్వవిద్యాలయం, టీబీ శానిటోరి యం ఉన్నాయి. పైగా రాజధాని ఆ ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నది. అందువల్ల ఎయిమ్స్ వంటి ఉన్నత శ్రేణి వైద్య శాస్త్రాల సంస్థను ఏలూరు-రాజమండ్రి మధ్య స్థాపిస్తే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. మన నాయకులు భేషజాలకు పోకుండా తమ నిర్ణయా లను పునః సమీక్షించుకోవాలి. అన్ని ప్రాంతాల ప్రయో జనాలకూ అనుగుణంగా వాటిని ఏర్పాటుచేయాలి. లేన ట్టయితే ఆంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు ఎప్పటిలాగే హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీనే ఆశ్రయించ వలసి ఉంటుంది. ఉన్నత విద్యారంగం విస్తృతికి ఇది ఏ రకంగానూ తోడ్పడదని నాయకులు గుర్తించాలి. వ్యాసకర్త సోషల్ ఎవేర్నెస్ క్యాంపెయిన్ ప్రతినిధి మొబైల్ : 9441048958 -
ఆదివాసీల ప్రాణరక్షణే ‘బంగారు తెలంగాణ’
సందర్భం ఆదివాసులకు టీఆర్ ఎస్ పార్టీ చేసిన ‘హెలికాప్టర్ అంబులెన్స్’ వాగ్దానం ఎటు పోయిందో కానీ, గూడేల్లో అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అవుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసాగుతోంది. అత్యంత వెనుకబడ్డ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ -గిరిజ నుల దారిద్య్రాన్ని నిర్మూలించే లక్ష్యంతో అనేక సామాజిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వా లు 68 ఏళ్లుగా అమలు చేస్తు న్నాయి. అయినా ఆదివాసీ - గిరిజనుల జీవితాల్లో ఏవిధమై న మార్పులేదు. ఆఫ్రికాలో అత్యంత వెనుకబడ్డ దేశాల ప్రజల కంటే, ఆదిలాబాద్ ఆదివాసీలు మరింత దుస్థితి లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. నిజమైన స్వేచ్ఛకొరకు రాంజీగోండ్ పోరాటం, కొమురంభీమ్ నాయకత్వంలో ఆదివాసీల సామూహిక పోరాటం, ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన పోరాటం తర్వాత కూడా ఆదివాసుల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. చెలిమల్లో వాగుల్లో నీళ్లుతాగుతూ, పోష కాహారం కరువై శరీరంలో రక్తం లోపించి, చిన్నారులు, బాలింతలు మలే రియా, విష జ్వరాలతో ఏటా వందల మంది మర ణిస్తూ, జీవన్మరణ పోరాటం నేటికీ సాగిస్తూనే ఉన్నారు. గొంతెండితే గుక్కెడు నీళ్ల కోసం 68ఏళ్ల అనంతరం 6కిలోమీటర్లకుపైగా తాగు నీటి కుండలతో నడుస్తున్నా రంటే అభివృద్ధి అందమేమిటో అర్థం అవుతుంది. ఇటీవలి ప్రణాళికా సంఘం సభ్యుల నిశిత సర్వే నివేదిక ఆదివాసీ గిరిజనుల దుస్థితికి అద్దంపడుతోంది. ఆరున్నర దశాబ్దాల ప్రణాళికల అనంతరం కూడా దేశం లో అసమానత్వం, అభివృద్ధి పక్క పక్కనే కొనసాగి తిష్టవేసిన వైనాన్ని యువప్రణాళికా సంఘ ఆర్థికశాస్త్ర నిపుణులు ఆర్థిక రాజకీయ వారపత్రిక(ఈ.పీ.డబ్ల్యూ) జనవరి -2015 సంచికలో విశ్లేషించారు. దేశంలోని 640 జిల్లాలు, 5955 ఉప జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో అభివృద్ధి అనేది సహజంగానే ఒకే రకంగాలేదు. ఈ విశ్లేషణలో అభివృద్ధి అంశంలో జిల్లాల మధ్య అవధుల్లేని అంతరాలను ఎత్తిచూపుతూనే, ఒకే జిల్లాలోని ఉప జిల్లాలు/ రెవెన్యూ డివిజన్ల మధ్య తర గని అంతరాలున్నాయని పేర్కొన్నారు. 27 జిల్లాల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న 10 శాతం రెవెన్యూ డివిజన్లు, వాటి సరసన అభివృద్ధిలో అట్టడుగున ఉన్న 10 శాతం రెవెన్యూ సబ్డివిజన్లలో దారుణ దుస్థితిలో ప్రజలు మగ్గుతున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన గ్రామాలు, ప్రజలు దారుణ దుస్థితిలో బతు కులీడుస్తు న్నారని ఆ నివేదిక సారాంశం. దేశంలోనే తొలి వరుసన ఉన్న 166 జిల్లాల్లో ఉచ్ఛస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్ డివిజన్లు, అధమస్థాయి అభివృద్ధిలోని 30 శాతం సబ్డివిజన్లు కలగలిసి ఉన్నాయి. ఈ అధ్యయనంలో ముఖ్యాంశం ఏమిటంటే : ఏ జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయో, ఆయా జిల్లాల్లో గిరిజనులు ఆదివాసుల జనాభా అత్యధికంగా ఉంది. ఈ డివిజన్లలోని అపార మైన సహజ వనరుల ఆధారంగా వెలసిన పరిశ్రమలు ఒక జిల్లాలోని ఒక సబ్ డివిజన్లో అపారమైన సంప దను సృష్టిస్తే అదే జిల్లాలోని మిగతా ప్రాంతాలు, వాటి లో ఉన్న గిరిజనుల జనాభా కటిక దారిద్య్రంలో మగ్గి పోతోంది. నిండు యవ్వనంలోనే అనారోగ్య మరణాల తో వీరి జనాభా తగ్గుతోంది. ప్రముఖంగా గిరిజనులు అధికంగా ఉన్న అనేక రెవెన్యూ డివిజన్లు అపారమైన ఖనిజసంపదతో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్న ప్పటికీ, వీటి ఫలితమైన ఆర్థికోత్పత్తి సంపదల భాగ స్వామ్యం నుంచి ఆ గిరిజన ఆదివాసీ ప్రాంత ప్రజలను బలవంతంగా కట్టుబట్టలతో బయటకు గెంటివేసేలా నేటి అభివృద్ధి విధానం సాగుతోంది. ఆ వనరులపై అన్నివిధాల ఆధిపత్యం నెరిపే కొద్ది ప్రాంతపు పట్టణా నికే అభివృద్ధి పరిమితమైంది. ఈ జిల్లాలో ఉన్న అత్యధి క శాతం గిరిజనులు ఆదివాసీలు కడు పేదరికంలో మగ్గుతుంటే, పట్టణాల్లో సంపద పోగు కావడం కాకతాళీ యం కాదని ఆ నివేదిక తెలిపింది. పెట్టుబడిదారీ విధానం దానికనుగుణమెన అభివృ ద్ధిని దారుణ అసమానత్వాన్ని ప్రజల దుస్థితులను పక్క పక్కనే నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో నయం చేయగల సాధారణ మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచ నాలు, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బులతో వంద లాది ఆదివాసులు మరణిస్తే అందులో ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి వీసమంత ప్రయత్నమైనా వివక్ష లేకుం డా నేటికీ ఎందుకు జరగడంలేదు? 68 ఏళ్ల స్వాతంత్య్రం ఈనాటికీ ఆదివాసీలకు రోడ్లు రహదారులను, గుక్కెడు నీటిని ఎందుకందించటం లేదు? ఎక్కడ తప్పనిసరిగా వైద్య వసతులు కల్పించాలో అక్కడే అవి నేటికీ ఎందుకు కల్పించలేదు? ఆదివాసుల ఆయువులను కాపాడుతా మని టీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన హెలికాప్టర్ అంబులెన్స్ వాగ్దానం ఎక్కడికెళ్లింది? హెలికాప్టర్ అం బులెన్స్ ఎటుపోయిందో కానీ, ఆదివాసీ గూడేల్లో ఎడ్ల బండ్లు నడవకపోతే, అనారోగ్యంతో మనిషి పడుకున్న మంచమే అంబులెన్స్ అయి ఈనాటికీ కొనసాగుతోంది, ప్రాణంపోతే ఆ మంచమే నేటికీ ‘పాడె’ అయి కొనసా గుతోంది. 2008-09లో మూడువేల మంది ఆదివా సీలు- గిరిజనులు పోషకాహార లోపంతో రోగ నిరోధక శక్తి తగ్గి, తీవ్ర అనారోగ్యంతో మరణించారు. నాటి నుం డి ప్రతి ఏటా 200-500 మంది చనిపోతూనే ఉన్నారు. వెనుకబాటుతనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఉట్నూ ర్, బోథ్ ఆదివాసీ ప్రాంతాలకు త్వరలో వస్తోన్న ప్రపం చ బ్యాంకు బృందం ఈ అంశాన్ని తీవ్రంగా ఆలోచిం చాలి. ఎన్ని ప్రణాళికలు వేసినా దారిద్య్ర నిర్మూలన మాట అటుంచి, దాని నీడను కూడా చెరపని ప్రణాళిక లకు పడ్డ పందికొక్కుల గురించి మథనం చేయాలిప్పు డు. ఆదివాసీ గిరిజన దారిద్య్ర సమూల నిర్మూలనే నేటి విధానం కావాలి. (ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాల ను ప్రపంచబ్యాంక్ సందర్శించనున్న సందర్భంగా) వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నేత మొబైల్ 97013 81799 -
యుద్ధము ముగియలేదు ప్రభూ!; ఇప్పుడే ఆరంభమైనది!!
సందర్భం చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్‌బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్కౌంటర్ గుర్తుకు వస్తాయి. వారి మలివిడత పాలనలో పోలీసు కాల్పులు శేషాచలంతో మొదలయ్యాయి. వానపాముని చూపించి అన కొండ అనిపించడానికీ, ఎలుక ను చూపించి డైనోసార్ అని పించడానికీ, కూలీల్ని చూపిం చి అంతర్జాతీయ స్మగ్లర్లు అనిపించడానికీ, ఒక వాస్తవా న్నీ అబద్ధం చేయడానికీ, ఒక అబద్ధాన్ని నిజం అనిపించడా నికీ సమస్త అధికారగణాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి. అందరికీ తెలుసు వాళ్లు చెట్లు నరికే కూలీలని. అందరికీ తెలుసు స్మగ్లర్లు ఎండా కాలం అడవిలో గోచి చుట్టుకుని, గొడ్డళ్లుపట్టి, చెమట కక్కుకుంటూ చెట్లు నరికే శ్రమజీవులు కారనీ. వాళ్లు కాళ్లకు చెప్పులు, ఒంటి మీద చొక్కాలు లేని కడు పేదరి కంలో ఉండరనీ. అందరికీ తెలుసు ఎర్రచందనం స్మగ్లర్లు చెన్నైలోనో, బెంగళూరులోనో నక్షత్రాల హోటళ్ల లో విలాసాలు చేస్తుంటారని. వాళ్లు దొరికితే మారిషస్ లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారని. ఎర్రచందనం వృక్షాలు ప్రపంచంలో నల్లమల అడవులు విస్తరించిన నాలుగు జిల్లాలకే ప్రత్యేకం అయి నా వాటి ఉపయోగాల గురించి పదేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎర్రచందనానికి సంబంధించి ఇటీవల బయటపడిన రెండు ప్రధాన ఉపయోగాల్లో మొదటిది దీని పొడిని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియో గిస్తున్నారనేది. రెండో ప్రయోజనం అంతకన్నా ఆసక్తిక రమైనది. ఎర్రచందనం పొడికి లైంగిక పటుత్వాన్ని పెంచేగుణం ఉందనేది. దీనికి శాస్త్రీయ ప్రతిపత్తి ఉందో లేదోగానీ, జపాన్‌లో మాత్రం ఈ నమ్మకం బలంగా ఉంది. లైంగిక ఆసక్తి అతితక్కువగల దేశంగా జపాన్ను పేర్కొంటూ ‘ద గార్డియన్’, ‘వాషింగ్టన్’ పోస్ట్ పత్రికలు రెండేళ్ల క్రితం రెండు సంచలన కథనాలు ప్రచురిం చాయి. ఎర్రచందనం కోసం జపాన్ చూపుతున్న ఆసక్తిని గమనిస్తే ఈ కథనాలు నిజమే అనిపిస్తాయి. స్మగ్లర్ల ద్వారా దొంగమార్గంలో కొన్నా, ప్రభుత్వం ద్వారా రాజమార్గంలో కొన్నా ఎర్రచందనం ప్రధాన దిగుమతి దారుడు మాత్రం జపానే. ఇప్పుడు ఎర్రచందనం నిల్వలకు మరో ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరాన్ని కట్టాలని చంద్రబాబు కన్న కలల మీద నరేంద్రమోదీ చల్లటి మంచునీళ్లు చల్లారు. చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఆశలన్నీ ఎర్రచందనం మీదే పెట్టుకు న్నారు! జపాన్, చైనాలకు ఎర్రచందనాన్నీ అమ్మి రాజ ధాని నిర్మాణానికి నిధుల్ని సమీకరించుకునే పనిలో వారున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తమకూ అవ కాశం ఇవ్వాలని జపాన్ కూడా సింగపూర్‌తో పోటీపడు తోంది. అలా నల్లమల టూ జపాన్, జపాన్ టూ అమరా వతి అంటూ ఒక రక్తచందనపు దారి ఏర్పడింది. గిరాకీ పెరగడంతో, ఏపీ రాజధాని నిర్మాణం ఎర్రచందనం కూలీల చావుకొచ్చింది. అమరావతిలో భూమిపూజకు ముందే శేషాచలంలో ‘నరబలి’ జరిగిపోయింది!. ‘‘వాళ్లు ఎర్రచందనం దొంగలు కాకుంటే గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా?’’ అని అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎగతాళి చేశారు. వాళ్లు కూలీ డబ్బుల కోసం ఎర్రచందనం చెట్లు నరకడానికే వస్తారు. అనుమ తి లేకుండా అడవిలో ఏ చెట్టును నరికినా నేరమే. ఎర్రచందనం చెట్టును నరికినా నేరమే. ఆ విషయం ఆ కూలీలకు కూడా తెలుసు. అయినా, బ్రోకర్లు చూపించే ఆశను కాదనలేని పేదరికం వాళ్లది. నేరంలో వాళ్లు నిస్సందేహంగా పాత్రధారులు. అయితే ఆ నేరానికి వాళ్లు సూత్రధారులు మాత్రం కాదు. ప్రధాన లబ్దిదా రులు అంతకన్నా కాదు. సూత్రధారులు, ప్రధాన లబ్ధిదా రులు నిజానికీ అధికారవర్గం నీడలోనే ఉంటారు. లేదా అధికారవర్గమే ప్రధాన లబ్ధిదారులు, సూత్రధారుల నీడల్లో ఉంటుంది. నిజానికి శేషాచలం అడవుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ 20 మంది అలా నేరం చేయడానికి వచ్చినవాళ్లు కూడా కాదు. బస్సులో ప్రయా ణిస్తున్న వాళ్లను పోలీసులు దారిలో ఆపి ఎత్తుకుపోతుం డగా చూసినవాళ్లున్నారు. అంటే నేరం చేసినందుకుకాక నేరం చేయబోతున్నారనే అనుమానంతోనే వాళ్లను పోలీసులు చంపేశారు అనుకోవాలి. గీత దాటిన పేదవాళ్లను అక్కడికక్కడే అధికారి కంగా చంపవచ్చు అనే మధ్యయుగాల శిక్షాస్మృతిని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ప్రవేశపెట్టింది. శేషాచలం ఎన్కౌంటర్ ‘‘అంతం కాదు ఆరంభమే’’ అని అటవీ శాఖ మంత్రి అంటున్నారు. నిజానికి చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్‌బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్కౌంటర్ గుర్తుకు వస్తాయి. వారి మలివిడత పాలనలో పోలీసు కాల్పులు శేషాచలంతో మొదలయ్యాయి. కాల్దారీలో ఇద్దరు రైతులు చనిపోతే, శేషాచలంలో చెట్లు నరికే కూలీలు 20 మంది చనిపోయారు. మలివిడత ఆరంభమే ఈ స్థాయిలో ఉంటే ముగింపు ఏస్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. పోలీసు కాల్పులు, ఎదురుకాల్పులు ప్రభుత్వ కార్యక్రమంగా మారినప్పుడు ప్రజలు కూడా వాళ్ల కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. యుద్ధము ముగియలేదు; ఇప్పుడే ఆరంభము అయినది!! (రచయిత సీనియర్ పాత్రికేయుడు) మొబైల్ : 9010757776 -
మా నీళ్లు మాకే కావాలి
సందర్భం ప్రాణహితను కాళేశ్వరంలో నిర్మించినా... ఎస్.పీ.ఎం(సిర్పూర్ కాగజ్‌నగర్)ను మూసేసినా... ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో గ్రామాలను మాయం చేసినా... అవి పుట్టిన పేర్లే అస్తిత్వం కోల్పోతాయి. ఇది నవ తెలంగాణలో జరగడానికి వీల్లేదు. ఇందుకేనా తెలంగాణను తెచ్చుకున్నది? తెలంగాణలో పలు జిల్లాలకు ఎన్నో వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు. శతాబ్దాలుగా.. వెనుకబడిన ఆదివాసీలకు నిల యమైన మా జిల్లాకు కొత్తవి రావాల్సినవి రాకపోగా, ఉన్న వే పోతాయంటూ పిడుగులాం టి వార్తను ప్రజలనెత్తి మీద వేస్తున్నారు. దశాబ్దాల తరువాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో పనులు చేపట్టి న తర్వాత ఈ జిల్లాలో ఇప్పటికే రూ.5వేల కోట్లను ఖర్చు చేశారు, కొద్ది రోజుల లోపలే జాతీయ హోదా వస్తుందని ఎంపీ కవిత ప్రకటన చేసిన విషయం తెలిసిం దే. కానీ మా జిల్లాలోని ప్రాణహిత నీళ్లను మాకు ఇవ్వ కుండా చేవెళ్ల వరకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించడం ఆదిలాబాద్ ప్రజలకు పిడుగులాంటి వార్తే అవుతుంది. తెలంగాణలో అధికారపార్టీకి ఏ జిల్లాలోనూ లేనంత ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీలను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చింది. ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. జిల్లాలోని చెన్నూర్, సిర్పూర్, పెద్దపల్లి నియోజకవర్గాల ప్రజలు స్థానికేతరులను దాదాపు 7 నుండి 8 సార్లు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. కానీ నైజాం దగ్గర నుండి నిన్నటి దాకా పాలకులుగా ఉన్నవారు వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీరం అని వర్ణించిన కేసీఆర్, లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తుమ్మిడిహెట్టి నుండి ప్రాణహిత నది ద్వారా వచ్చేటటువంటి ఈ నీళ్లను ఇతర జిల్లాలకు పందేరం పెట్టి, ఆదిలాబాద్ పొట్ట కొట్టడానికి పథకాలు సిద్ధం చేయడం న్యాయమా? ఇతర జిల్లాల్లోని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ఆ తర్వాతే ఈ జిల్లాకు దక్కా ల్సినవి ఇస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం వారు సెలవివ్వాలి. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌కు 5 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌కు 3 లక్షల ఎకరాలు, రంగా రెడ్డికి 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌కు లక్షా 71 వేల ఎక రాలు, నల్గగొండకు 2లక్షల 29 వేల ఎకరాలకు నీటి కేటాయింపు చేస్తూ ఆదిలాబాద్‌కు మాత్రం లక్షా 56 వేల ఎకరాలకు మాత్రమే నీటి కేటాయింపులు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించిన మేరకు, ఈ జిల్లాలోని లక్షా 50 వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నీరు దక్కకుండా పోయే ప్రమాదం పొంచుకుని ఉంది. ఏ న్యాయం ప్రకారం చూసినా సరే.. ఏ జిల్లాలో ఉన్న టువంటి నీళ్లు ముందు ఈ జిల్లాకే రావాలి. రాజ్యాంగం ప్రకారమైనా, సహజ న్యాయసూత్రాల ప్రకారమైనా ఇదే సరైనది. ఈ విషయమై గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయం ఇక జరగదని ఆశిస్తున్న తరుణంలో మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాకు తీరని నష్టం జరుగుతూ ఉన్నది. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు పరిశ్రమల మూసివేత, మరోవైపు మా జిల్లా చుట్టూ మూడువైపులా నీళ్లు, ఒక వైపు గోదావరి మరోవైపు ప్రాణహిత, మరో వైపు ఆదిలాబాద్ నుండి వస్తున్న పెన్‌గంగా, వాగులకు, వంకలకు కొదువే లేదు. కట్టక కట్టక కట్టిన చిన్న చిన్న ప్రాజెక్టులు, ఆఖరుకు ‘కొమురం భీం’ పేరుతో కట్టిన ప్రాజెకులోకూడా నిండుగా నీళ్లు ఉన్నాయి. కానీ కాలు వలు పూర్తి కాక అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. అన్ని విధాలా అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లా మీ ద్వారానైనా అభివృద్ధి చెందుతుందని ఆశించినాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో కాసిన్ని నీళ్లు లభిస్తాయనుకుంటే అవి కూడా దక్కకుండా ఆ ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గర నిర్మిస్తామంటున్నారు. ఇది ఇతర జిల్లాలకు న్యాయం, మా జిల్లాకు అన్యాయం కాక మరేమవుతుందని మేము భావించాలో చెప్పండి. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలకు న్యాయం చేయాలి కానీ, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయ వద్దని కోరుతున్నాం. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికేతరులే పదవుల్లో ఉన్నారు. ప్రజాప్రతినిధులు అయిన మిమ్మల్ని మేము ప్రశ్నించేది ఒక్కటే. మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటారా, లేక ఈ ప్రాంత ప్రజల ను ప్రాణహిత నదిలో, ఎస్పీఎంలో, ఓపెన్‌కాస్ట్‌ల బొం దలగడ్డలో సమాధి చేస్తారా? కాబట్టి తెలంగాణ ముఖ్య మంత్రి తక్షణమే కల్పించుకొని జాతీయహోదాకు సమీ పంగా వచ్చిన ప్రాణహిత వద్ద వీలైన పద్ధతుల్లో ప్రాజె క్టును నిర్మించి 1,56,000 ఎకరాలకు గానూ మాకు హామీ ఇచ్చిన, మాకు హక్కు ఉన్న నీళ్లను మాకు ఇచ్చి ఎక్కడికైనా నీళ్లను తీసుకెళ్లండి. అంతేకాని మిమ్ములను నమ్ముకున్నటువంటి ఈ ప్రజలకు అన్యాయం చెయ్య వద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే వెనుకబడిన ఈ జిల్లాను మరింత వెనకకు నెట్టవద్దని, అదిలాబాద్ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యవద్దని మిమ్మల్ని మరీమరీ కోరుతూ ఉన్నాం. ప్రాణహితపై మరోసారి పునరాలోచన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. - వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, మొబైల్ : 9849588825 -
జస్టిస్ తమాంగ్ నేటి అవసరం
సందర్భం సెక్షన్ 176 1(ఎ)ని తలచుకున్నప్పుడల్లా న్యాయమూర్తి తమాంగ్ గుర్తుకొస్తారు. ఆయన సాహసం, ధైర్యం ఆశ్చర్యాన్ని గొల్పుతాయి. అతను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా పనిచేసింది అహ్మదాబాద్‌లో. కాని ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు. ‘అర్థాలు మారిపోతాయి/ కాలక్రమంలో అర్థాలు మారి పోతాయి!/ నిఘంటువులు మార్చుకోక తప్పదు’ అన్నాడు ఓ తెలుగుకవి, ‘హాజిర్ హై’ అన్న కవితా సంపుటిలో. లాకప్‌డెత్‌లు, ఎన్కౌంటర్లను చూసి ఆ విధంగా అన్నాడు. ఇది 1986 ప్రాంతంలో రాసి న కవిత. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పూ లేదు. ‘మనుష్యులందరిలోనూ ఉన్నది ఒక్కటే రక్తమ న్నట్లు పోలీసులు చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనా త్మకత ఉంటుంది’ అంటుంది ఓ కథలో ఓ పాత్ర. ఆ కథలు ఎన్కౌంటర్ గురించి కావచ్చు, సరెండర్ గురిం చి కావచ్చు. ఆ కథలని ప్రజలు విశ్వసించినా, విశ్వ సించకున్నా పోలీసులకి ఎలాంటి బాధా లేదు. ఎందు కంటే ఎలాంటి జవాబుదారీతనం లేదు కాబట్టి. ఏదైనా అసహజ మరణం సంభవించినప్పుడు ఆ సమాచారం పోలీస్ అధికారికి తెలిసినప్పుడు ఆ మరణానికి గల కారణాలను ఆ అధికారి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ మరణం ఆత్మహత్య వల్ల సంభవించి ఉండవచ్చు. ఏదైనా ప్రమాదం కావచ్చు. ఇలాంటి మర ణాల గురించి కారణాలు తెలుసుకోవడానికి పోలీస్ అధికారి రెండు రకాలైన చర్యలు చేపడతాడు. మొద టిది శవ పంచనామా. రెండు పోస్ట్‌మార్టమ్ పరీక్ష. అసహజ మరణ సమాచారం అందిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు తెలియచేసి శవం ఉన్న ప్రదేశానికి వెళ్లి విచారించవలసిన బాధ్యత పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారిపై ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు గౌరవప్రదమైన వ్యక్తుల సమక్షంలో మరణానికి గల కారణాలను విచా రించి నివేదికను ఆ పోలీసు అధికారి తయారు చేయ వలసి ఉంటుంది. శవ పంచనామాలతో పాటు ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులను గురించి కొన్ని సందర్భాలలో ఎగ్జి క్యూటివ్ మెజిస్ట్రేట్లు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 176 ప్రకారం విచారణ జరపాలి. ఈ నిబంధనకి 2005లో కొన్ని సవరణలు తెచ్చి సెక్షన్ 176 (1)ఎ ని కొత్తగా చేర్చారు. ఈ సవరణలు 23-06.2006 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం పోలీసుల అధీనంలో ఎవరైనా మరణించినా, కనిపించ కుండా పోయినా లేదా స్త్రీ మానభంగానికి గురైనప్పుడు పోలీసుల విచారణకి, దర్యాప్తుకి ఎగ్జిక్యూటివ్ మెజి స్ట్రేట్ విచారణకు అదనంగా సంబంధిత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆ నేరానికి గల కారణాలను తెలుసుకోవ డానికి విధిగా విచారణ జరపవలసి ఉంటుంది. ఆ కేసు పరిస్థితులను బట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాక్ష్యాలను నమోదు చేయాలి. మరణించిన వ్యక్తుల బంధు వుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ సాక్ష్యాలు నమోదు చేయాలి. సెక్షన్ 176 1(ఎ)ని తలచుకున్నప్పుడల్లా న్యాయ మూర్తి తమాంగ్ గుర్తుకొస్తారు. ఆయన సాహసం, ధైర్యం ఆశ్చర్యాన్ని గొల్పుతాయి. అతను మెట్రోపాలి టన్ మెజిస్ట్రేట్‌గా పనిచేసింది అహ్మదాబాద్‌లో. కాని ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు. గూర్ఖా వర్గానికి చెం దిన వ్యక్తి. ఇశ్రాత్ జహాన్‌తో పాటు నలుగురు వ్యక్తులు అహ్మదాబాద్ సమీపంలో ఎన్కౌంటర్లో చనిపోయా రు. అవి హత్యలని మానవ హక్కుల సంఘాలు ఘోషించాయి. వాటిపై విచారించి నివేదికను సమర్పిం చమని అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తమాంగ్ని ఆదేశించారు. శవ పరీక్ష నివేదికలను, ఫోరె న్సిక్, ప్రథమ సమాచార నివేదికలను పరిశీలించాడు. ఎన్నో సాక్ష్యాలు నమోదు చేశాడు. 243 పేజీల నివేది కని స్వదస్తూరితో రాసి, 7 సెప్టెంబర్, 2009న సమ ర్పించాడు. ఆ నలుగురు చనిపోయింది బూటకపు ఎన్కౌంటర్లోనని, ఆ ఎన్‌కౌంటర్‌కి 21 మంది పోలీస్ అధికారులు బాధ్యులని, ఐపీఎస్ అధికారి వంజర కూడా అందులో ఉన్నాడని నిర్ధారించాడు. న్యాయవ్య వస్థలో కిందిస్థానంలో ఉన్న ఒక మెజిస్ట్రేట్ ఆ రకంగా విచారణ జరపడం, ఇరవై అయిదు రోజుల్లో నివేదికను సమర్పించడం ఒక సంచలనం. అయితే సెక్షన్ 176 నిబంధన 23.06.2006 నుంచి అమలులోకి వచ్చింది. ఇది 2004లో జరిగిన సంఘటన. కాబట్టి తమాంగ్ నివేదికకు న్యాయబద్ధత లేదని సుప్రీంకోర్టు 12.08.2010 రోజున స్టేట్ ఆఫ్ గుజరాత్ - ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండి యా కేసులో స్పష్టం చేసింది. సెక్షన్ 176 1(ఎ) ప్రకా రం ఇలాంటి సందర్భాలలో విచారణ జరపవచ్చని అది నిజనిర్ధారణ విచారణ లాంటిదని కూడా స్పష్టం చేసిం ది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అసా ధారణమైన పరిస్థితులు ఉండి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వాలు విభేదించవచ్చు. అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టులు రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం సమీక్షించి తగు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఎన్కౌంటర్ల గురించి అనుమానాలు కలిగినప్పుడు న్యాయవిచారణను కోరుతున్నారు. అయితే సెక్షన్ 176 1(ఎ) ప్రకారం విచారణ జరపాలని సంబంధిత వ్యక్తులు డిమాండ్ చేయడంలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఈ నిబంధన ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు భార తదేశంలోని చాలా రాష్ట్రాలలో న్యాయమూర్తి తమాంగ్ లాంటి మెజిస్ట్రేట్ల అవసరం ఎంతో ఉంది. క్రియా శీలక సుప్రీంకోర్టు హైకోర్టుతో పాటు క్రియాశీలక సబా ర్డినేట్ కోర్టుల ఆవశ్యకత ఈ దేశానికి మరెంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మానవహక్కుల సంఘం లేదు. దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో అందులో క్రియా శీలక చైర్మన్‌ని, సభ్యులని ఎంపిక చేయడం ఇంకా ఎంతో అవసరం. తెలుగు ప్రజలకి రాష్ట్రాలు కొత్తవే గాని ఎన్ కౌంటర్ల కథనాలు మరీ పాతవి. (వ్యాసకర్త న్యాయనిపుణులు-ఫోన్: 27610182) -
మానవతా శిఖరంపై మెరిసిన మణిదీపం
సందర్భం జాతిజనుల కష్టాలను, అవమానాలను, బాధ్యత లను జీవితాంతం తన శిర స్సున మోసిన ధన్యజీవి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. తన యవ్వనాన్ని, ఆత్మశక్తి ని, శారీరక బలాన్ని ఫణం గా పెట్టి అంటరాని జాతి విముక్తి కోసం మంచి, చెడు, పొగడ్తలు, శాపనార్థాలు, గౌరవ, అగౌరవా లకు అతీతంగా ఆత్మగౌరవ కేతనమై, రణన్నినాద మైన ధీరోదాత్తుడాయన. న్యాయశాస్త్ర కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, జ్ఞాన పిపాసి, విద్యాధికుడు, గొప్ప పండితుడు, ప్రపంచం గర్వించదగ్గ సామాజి కవేత్త, స్త్రీ పక్షపాతి, నిష్కలంక దేశభక్తుడు, పోరా టాలు, త్యాగాలతో నిండిన నిప్పుకణికల కొలిమి గుండా ప్రయాణించి మానవత్వపు మహోన్నత శిఖ రాలను చేరుకున్న తాత్వికుడు అంబేడ్కర్. ఆధునిక భారతీయ సంఘ సంస్కర్తలలో మొదటి వరుసలో నిలిచిన అంబేడ్కర్ సమాజంలో సగభాగమైన స్త్రీల సమస్యలను ప్రధానంగా తీసు కుని ఉద్యమించాడు. స్త్రీలను అణిచివేయడానికి హిం దూ పితృస్వామ్యవ్యవస్థ అమలుచేసిన సతీసహగమనం, తప్పనిసరి వైధవ్యం, వితంతువులకు నిర్బంధ బ్రహ్మచర్యం, కుటుంబంలోని పురుషుల లైంగిక దాడు లు భరిస్తూ జీవించవలసిరావడం.. ఇలా స్త్రీల పట్ల హిందూ సమాజం ఏర్పర్చిన నియమాలన్నీ పూర్తిగా పక్షపాతమైన వని అంబేడ్కర్ ఆవేదన చెందాడు. భారతీయ స్త్రీల దాస్య శృంఖలాలను తెంచడానికి, వారికి గౌరవ స్థానం లభించేందుకు న్యాయశాఖ మంత్రిగా 1947 ఏప్రిల్ 11వ తేదీన పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు. 1947 సెప్టెంబర్ 17న చర్చకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖర్జీ అంబేడ్కర్‌ని తీవ్రంగా ఎద్దేవా చేయడమే కాకుండా, అద్భుతమైన హిందూ సాంస్కృతిక కట్టడాన్ని హిందూకోడ్ బిల్లు ధ్వసం చేస్తుందని ఆగ్రహించాడు. ఈ బిల్లు ఆమోదం పొం దకుండా ఉండేందుకు రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, నాటి ఉపప్రధాని వల్లభ్ భాయ్‌పటేల్ ఎన్నో ఆటంకాలు కల్పించారు. హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిపాస్తులన్నిం టికీ పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కునివ్వడం బిల్లు లక్ష్యం. ఈ బిల్లు ఆమోదం పొందకపోతే రాజీనా మా చేస్తానన్న తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మౌన ముని అయ్యాడు. స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం, విముక్తి కోసం నిరంతరం తపనపడిన మానవతామూర్తి అం బేడ్కర్ అవమానభారంతో న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశాడు. రాజ్యాంగ రచనకు పూర్తి పేరు తనకు దఖలు పడినప్పటికీ తన సహచరులను అంబేడ్కర్ విస్మ రించలేదు. అదే సమయంలో ‘నా అభీష్టానికి వ్యతి రేకంగా నేను గాడిద చాకిరీ చేశాను. నా మిత్రులు ఈ రాజ్యాంగాన్ని నేను రచించానని చెబుతున్నారు. కానీ, ఈ రాజ్యాంగాన్ని తగులబెట్టేవాళ్లలో నేను మొదటివాడిని. ఈ రాజ్యాంగం నా శరీరానికి సరి పోని దుస్తులాంటిది’ అని ప్రకటించాడు. జస్టిస్ చిన్నపరెడ్డి మాటల్లో ఆయన గురించి విందాం. ‘కానీ ఆయన ఒక పాపం చేశాడు. పుట్టుక తోటే ఆ పాపం చేశాడు. కులంపై నిర్మితమైన సమాజంలో నిమ్న కుటుంబంలో పుట్టి, క్షమించ రాని పాపం చేశాడు. అందుకు శిక్షగా తన జీవితాన్ని సాగించాడు. ఉన్నత శిఖరాలను, అనంతమైన కీర్తిని సాధించేవాడే, కాని తన జీవితాన్ని ఫణంగా పెట్టి యోగిగా, తాత్వికుడిగా, రాజకీయవేత్తగా ఎదిగిపో యాడు. ఉన్న విధంగా ఉండడానికే ఇచ్చగించాడు. అంటే పుట్టుకతోటే అణచివేతకు గురై, అట్టడుగు వర్గాలవారి మనిషిగా, వారి వాంఛలకు ప్రతీకగా చివరిదాకా నిలబడ్డాడు. గొప్ప జాతీయవాది, ప్రజా స్వామ్యవాది. నిరంతరాయంగా, భయరహితంగా, పీడిత సోదరులు పక్షాన పోరాడటానికే జీవితాన్ని అంకితమొనర్చాడు. అంబేద్కర్‌ను అర్థం చేసుకున్న వారికంటే అపార్థం చేసుకున్నవారే ఎక్కువ. తన భావాల పట్ల గాఢ విశ్వాసమున్నవాడు కనుకనే ధర్మ యుద్ధంలో గాంధీకి సైతం ఎదురు నిల్చాడు. ఈ మాటల వెలుగులోనే అంబేద్కర్‌ను అధ్యయనం చేయాలి. అదే ఆయనకు నిజమైన నివాళి. (నేడు డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి) (వ్యాసకర్త, రాష్ట్ర అధ్యక్షులు, మాల మహాసభ, మొబైల్ః 9291365253) -
పోలవరానికి ‘పట్టిసీమ’ గ్రహణం
సందర్భం బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను పంపితే రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని కేంద్రం చెప్పినా పంపక బాబు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఏ మేలూ చేయని పట్టిసీమతో పోలవరాన్ని అటకెక్కించాలని చూస్తున్నారు. తాడి చెట్టు ఎందుకు ఎక్కా వంటే దూడ మేత కోసమన్న ట్టుంది మన రాష్ట్ర సర్కారు తీరు. ‘సత్వర నీటి ప్రయోజన పథకం’ కింద కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన రూ. 850 కోట్లను మరే ప్రభుత్వ మైనా అయితే... పూర్తికానున్న ప్రాజెక్టులకు కేటాయించి వెం టనే రైతులకు సాగునీటిని అందించడానికి ప్రాధాన్యం ఇచ్చి ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటే వేరు. అందుకే హఠాత్తుగా తెరపైకి తెచ్చిన పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి ఏకంగా రూ.775 కోట్లను కేటాయిం చింది. ఉభయ గోదావరులు, కృష్ణా డెల్టా, రాయలసీమ రైతులకెవరికీ ఏ మేలూ చేయలేని పట్టిసీమను చేపట్టిం ది. పైగా అది సీమకు తక్షణమే నీరందించేందుకేనని, గోదావరి, కృష్ణాజిల్లాల రైతాంగం ప్రయోజనాల కోసమే నని నమ్మించాలని ప్రయత్నిస్తోంది! పట్టిసీమపై జారీ చేసిన జి.ఒ. ఆర్టీ. నం: 200ను పరిశీలిస్తే బాబు ప్రభుత్వ దగాకోరుతనం బట్టబయలవుతుంది. పట్టిసీమ వద్ద లిఫ్ట్‌ను 14 మీటర్ల ఎత్తున అమరుస్తున్నట్టు అది పేర్కొం ది. కాబట్టి గోదావరి వరద నీటిని మాత్రమే కృష్ణకు లిఫ్ట్ చేస్తామని ప్రభుత్వ వాదన. కానీ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ 10.67 మీటర్లు, గరిష్ట వరద స్థాయి (ఎంఎఫ్ఎల్) 13.67 మీటర్లు. 40 కిలోమీటర్ల దూరం లోని పట్టిసీమ, ధవళేశ్వరం కంటే రెండు మీటర్ల ఎత్తులో ఉంది. అంటే పట్టిసీమ వద్ద 15.67 మీటర్ల ఎత్తున లిఫ్ట్‌ను అమరిస్తేనే వరద జలాలనే పంపు చేస్తారని నమ్మ డం సాధ్యం. కానీ పంపును 14 మీటర్ల ఎలివేషన్‌లో, ఫుట్‌వాల్వును కనీస నీటినిల్వ స్థాయి 12.5 మీటర్ల వద్ద అమరుస్తున్నారు. అంటే కనిష్ట నీటి స్థాయి నుంచి కూడా నీటిని లిఫ్ట్ చే సే ఉద్దేశం ఉన్నట్టే. గోదావరి జిల్లాల అవస రాలు తీరాకనే 14 మీటర్లపై నుంచే లిఫ్ట్ చేస్తామని ప్రభు త్వం అంటోంది. జీవోలో ఆ ప్రస్తావనే లేదు. ఎత్తిపోతల విషయంలో జీవోల్లోని పరిమితులు, నిషేధాలు అమలు కావు. తాటిపూడి, గూటాల, వేగేశ్వరపురం, పుష్కర, చాగల్నాడు తదితర లిఫ్ట్‌లు మొదటి పంట తర్వాత పని చేయకూడదని జీవోలో ఉంది. కానీ తాగునీటి, పారిశ్రా మిక అవసరాల కోసం అవి నిరంతరం పనిచేస్తూనే ఉం టాయి. వరద జలాలు లభించే కొద్ది రోజులే పట్టిసీమ లిఫ్ట్‌లు పనిచేస్తాయనే నోటి మాట నీటి మూట కాకుం డా ఉంటుందా? 3,20,000 ఎకరాల పోలవరం కుడికాలువ ఆయ కట్టులో పశ్చిమ గోదావరిలో 2,00,000 ఎకరాలు వివిధ ఎత్తిపోతల కింద సాగవుతున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మిగతా 1,20,000 ఎకరాల ఆయ కట్టుకు పాక్షికంగా నీరందిస్తామని జీవో నం: 1 చెబు తోంది. అంటే పంట కాలంలో సగానికా? ఆయకట్టులో సగానికా? చంద్రబాబే చెప్పాలి. కృష్ణానదిలోకి 80 టీఎంసీల నీటిని పంప్ చేస్తామంటున్నారు. ఉభయ గోదావరుల తాగునీటి, పారిశ్రామిక అవసరాలే 8 టీఎంసీలు. మరి ఒక్క కృష్ణా డెల్టాకే అంత నీరు దేనికి? బచావత్ అవార్డు ప్రకారం కుడి కాలువకు తాగునీటి కేటాయింపు లేదు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు మాత్రం ఎడమ కాలువకు 23.44 టీఎంసీలను కేటాయించింది. ప్రస్తుతం ఎడమ కాలువ ప్రాంత రైతులు తాగునీటి కోసం పోరాటానికి సిద్ధమ వుతున్నారు. అదే జరిగితే చంద్రబాబు ఎడమ కాలువపై మరో లిఫ్ట్ పెట్టేస్తానంటారు. ఆపై పోలవరం అవస రమే లేదని వాదించొచ్చు. పాత అంచనా ప్రకారం పోల వరం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లు. ప్రస్తుత అంచనా రూ. 15,000 కోట్లకు పైనే. ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించింది రూ. 100 కోట్లు! ఈ కేటాయింపులతో అది ఎన్నటికి పూర్తికావాలి? ఇది కూడా బాబు ‘పుణ్య మే.’ ఏ ప్రాజెక్టుకైనా కేంద్ర బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను (యూసీ) పంపాలి. యూసీ ఇస్తే పోలవరా నికి వెయ్యి కోట్లయినా కేటాయించడానికి సిద్ధమేనని కేంద్రం చెప్పినా బాబు ప్రభుత్వం యూసీని ఇవ్వక ఆ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచింది. అది చాలక, పోలవ రంపై కపట ప్రేమను ఒలకబోస్తూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలను మోసగిస్తున్నారు. ప్రాజెక్టు నిధులను ఖర్చుపెట్టకుండా పనులను ఆపేసినందుకు పోలవరం అథారిటీ మొట్టికాయలు వేసినా దానికి పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పోలవరాన్ని అటకెక్కిం చేస్తాడని 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు అక్షర సత్యాలని బాబు పట్టిసీమ దొంగాట రుజువు చేసి చూపిస్తోంది. కృష్ణానది నుంచి సీమకు సాగునీటిని అందించడం తోపాటూ అనంతపూర్ దాహార్తిని తీర్చేస్తానంటూ బాబు చెబుతున్న మాటలను సీమవాసులెవరూ నమ్మ డం లేదు. సీమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, గాలేరునగరి, వెలుగొండ, తెలుగుగంగలకు బడ్జె ట్లో బాబు నామమాత్రంగా నిధులను కేటాయించారు. హంద్రీనీవా, గాలేరునగరి పూర్తికావడానికి రూ. 4,500 కోట్లు కావాలి. అది పూర్తికాకుండానే సీమకు తాగునీరు, సాగునీరు ఎలా అందిస్తారు? సమాధానం లేదు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన రాష్ట్ర రైతు సంఘాల సదస్సు... పట్టిసీమకు కేటాయించిన రూ. 1,300 కోట్లకు, మరో రూ. 1,200 కోట్లు కలిపి మొత్తం రూ. 2,500 కోట్లను రాయలసీమ ప్రాజెక్టులకు కేటా యించి తాగు, సాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాన్ని పెడచెవిన పెట్టి బాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. అది చాలక హంద్రీనీవా, తెలుగుగంగల కోసం ఎన్టీఆర్ కృష్ణా మిగు లు జలాలపై హక్కును వదులుకుంటామని ఆనాడే కేంద్ర జల సంఘానికి తెలిపారు. బాబు సహా తర్వాతి ప్రభుత్వాలూ దాన్నే కొనసాగిస్తూ వచ్చాయి. అంతా తెలిసి కూడా కృష్ణా మిగులు జలాలపై హక్కులను వైఎస్ఆర్ వదిలేసుకున్నారని ఎదురుదాడి చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభు త్వం కల్లబొల్లి కబుర్లు మాని, పట్టిసీమను రద్దు చేసి పోలవరం పరిపూర్తిపై దృష్టిని కేంద్రీకరిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందనడం నిస్సందేహం. (వ్యాసకర్త ‘రాష్ట్ర నీటి వినియోగదారుల సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి) ఫోన్ నం: 9440204323