Shillong
-
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
అందరి చూపు షిల్లాంగ్ వైపే
న్యూఢిల్లీ: జలపాతాలు, ప్రకృతి రమణీయతలకు నెలవై ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’గా ఖ్యాతిగడించిన మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌లో వచ్చే ఏడాది పర్యటించేందుకు భారతీయులు తెగ ఉవి్వళ్లూరుతున్నారని ప్రఖ్యాత ట్రావెల్ యాప్ స్కైస్కానర్ తన నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన ‘ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ను బుధవారం విడుదలచేసింది. తరచూ పర్యటనకు వెళ్లే భారతీయుల్లో 66 శాతం మంది 2025 సంవత్సరంలో మరింతగా పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పర్యాటకం అనగానే విదేశీయానం చేసే భారతీయులు స్వదేశంలో షిల్లాంగ్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. అజర్బైజాన్ దేశంలోని బాకూ నగరం, మలేసియాలోని లాంగ్కావీ నగరాలను పక్కకునెట్టి షిల్లాంగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం, ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయడానికి అనువైన పచ్చటి కొండలతో అలరారే షిల్లాంగ్‌లో పర్యటించాలని ఎక్కువ మంది భారతీయులు భావిస్తున్నారు. దీంతోపాటే నార్వేలోని ట్రోంసో, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్, సౌదీ అరేబియాలోని అల్–ఉలాలనూ పర్యటనల కోసం భారతీయులు ఎక్కువగా సెర్చ్‌చేశారు. తమ పర్యాటక ఖర్చులకు తగ్గ ఆనందం లభిస్తుందన్న ‘బెస్ట్ వాల్యూ డెస్టినేషన్ కేటగిరీ’లో కజక్‌స్థాన్‌లోని అల్మటీ తొలిస్థానంలో నిలిచింది. ఇండోనేసియాలోని జకార్తా, మలేసియాలోని సింగపూర్, కౌలాలంపూర్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలకు విమానచార్జీలు గత ఏడాదికాలంలో భారీగా తగ్గడమూ ఇందుకు మరో కారణం. ఖర్చులే కీలకం ఏ దేశాల్లో పర్యటించాలనే విషయంలో హోటల్ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటామని 65 శాతం మంది చెప్పగా విమానచార్జీలను లెక్కిస్తామని 62 శాతం మంది చెప్పారు. అక్కడి ఆహారం, చిరుతిళ్ల ఖర్చులు సైతం బేరేజు వేసుకుంటామని 54శాతం మంది పేర్కొన్నారు. విమాన ఖర్చులకే ఎక్కువ ఖర్చవుతోందని 86 శాతం మంది చెప్పగా, ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదితో పోలిస్తే 2025లో ఖచి్చతంగా పర్యటించాలన్న బలమైన కాంక్ష ఎక్కువ మందిలో ఉండటం విశేషం. వచ్చేసారి ఎక్కడికి వెళ్లాలనే తుది నిర్ణయంలో ఖర్చులదే అత్యంత కీలక పాత్ర అని స్కైస్కానర్కు సంబంధించిన పర్యాటక నిపుణుడు మోహిత్ జోషి వ్యాఖ్యానించారు. అబూధాబిలో డిసెంబర్లో జరగబోయే ఫార్ములా1 రేసింగ్ వంటి క్రీడలు చూసేందుకు భారతీయులు విపరీతంగా విమానాల్లో వెళ్తున్నారని నివేదిక పేర్కొంది. పాలపుంత వెలుగుల్లోనూ.. జెడ్ జనరేషన్ యువతలో 62 శాతం మంది ఖాళీ సమయాలను విదేశాల్లో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా 57 శాతం మంది తాము ఆడిన వీడియోగేమ్‌లో తరచూ చూసిన ప్రపంచ ప్రఖ్యాత స్థలాలను వెళ్లిరావాలని కోరుకుంటున్నారు. రాత్రిళ్లు వినీలాకాశంలో పాలపుంత అందాలను కళ్లారా చూసేందుకూ ఆయా ప్రదేశాలకు వెళ్లేలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పారు. ఖగోళ వింతలను కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడుతున్నట్లు 56 శాతం మంది చెప్పారు. ధృవకాంతులను చూసేందుకు విదేశీయానం చేయాలనుకుంటున్నట్లు 44 శాతం మంది చెప్పారు. -
ఈశాన్యం అభివృద్ధికి ఆకాశమే హద్దు
షిల్లాంగ్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ ఎనిమిదేళ్లలో తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘ఎనిమిదేళ్లలో ఈశాన్యం నుంచి విమాన సేవలు మెరుగవడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగింది. విమానాశ్రయాలు 9 నుంచి 16కు, విమానాల సంఖ్య 900 నుంచి 1,900కు పెరిగాయి. రైల్వేమ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలు కూడా చేరాయన్నారు. జాతీయ రహదారులు 50 శాతం పెరిగిందన్నారు. జలమార్గాలను విస్తరించే పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈశాన్యమే కేంద్రస్థానం ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలే మన ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి ఈశాన్యం కేంద్రస్థానంగా మారగలదని చెప్పారు. ఆ దిశగా ఇండియన్–మయన్మార్, థాయ్‌లాండ్ ప్రధాన రహదారి, అగర్తలా–అఖురా రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈశాన్యంలో ఎన్నో శాంతి ఒప్పందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు. ఫలితంగా తీవ్రవాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్ చట్టం ద్వారా నార్త్ఈస్ట్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. 1972 నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. త్రిపుర బహుముఖ అభివృద్ధే లక్ష్యం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2 లక్షకుపైగా నూతన గృహాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. త్రిపుర బహుముఖ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు 2 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని, మెజారిటీ లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. గత ఐదేళ్లుగా పరిశుభ్రత అనేది ఒక ప్రజాఉద్యమంగా మారిందని, త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందని ప్రశంసించారు. త్రిపురలో అనుసంధానం, మౌలిక ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘త్రిపుర గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండేది. 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి, అనుసంధానానికి, శుభ్రతకు పర్యాయపదంగా మారింది’’ అన్నారు. ఈశాన్య భారత్‌ను, బంగ్లాదేశ్‌ను అనుసంధానించే 15 కిలోమీటర్ల అగర్తలా–అఖౌరా రైల్వేప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందన్నారు. ఆ రాష్ట్రాలు.. అష్టలక్ష్ములు ఈశాన్య ప్రాంతాల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు రెడ్‌కార్డ్ చూపించామని మోదీ అన్నారు. ‘‘నార్త్ఈస్ట్ను విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మేమొచ్చాక అలాంటి ఆటలు సాగనివ్వడం లేదు’’ అన్నారు. ఆదివారం ఉదయం షిల్లాంగ్‌లో ఆయన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన ‘గోల్డెన్ ఫూట్ప్రింట్స్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశాన్యం అభివృద్ధి విషయంలో ఎన్ఈసీ అందించిన సేవలను మరువలేమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నార్త్ఈస్ట్లోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిలుగా అభివర్ణించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనిమిది పునాది స్తంభాలపై ప్రభుత్వం పనిచేయాలని ఉద్బోధించారు. అవి.. శాంతి, అధికారం, పర్యాటకం, 5జీ అనుసంధానం, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు పనిచేయగల శక్తి అని వివరించారు. -
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
షిల్లాంగ్: వాతావరణం అనుకూలించకపోవటంతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. షిల్లాంగ్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగాల్సి ఉండగా.. వాతావరణం అందుకు అనుకూలించలేదు. దీంతో ఉమియామ్ సరస్సు సమీపంలో ల్యాండింగ్ చేశారు పైలట్లు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా. తురా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన ఎదురైనట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన యూనియన్ క్రిస్టియన్ కాలేజీ క్యాంపస్‌లోని పర్యావరణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నారు సంగ్మా. తమను సురక్షితంగా కిందకు చేర్చినందుకు హెలికాప్టర్ కెప్టెన్, పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. క్యాంపస్‌లోని అందమైన ప్రకృతిని ఆస్వాదించాను. యూసీసీ సిబ్బందిని కలిశాను. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశాను.’ అని రాసుకొచ్చారు సంగ్మా. What an adventure! •Emergency Landing at UCC, Umiam due to bad weather •Enjoyed the beautiful scenery in the Campus •Met with staff of UCC •Lunch in UCC Canteen The weather is truly unpredictable. Thank the Captain & Pilot for bringing us back safely. pic.twitter.com/D4rMAzGYhC — Conrad Sangma (@SangmaConrad) November 2, 2022 ఇదీ చదవండి: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం... తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో!
ప్రతి పనిలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు నేటితరం మహిళలు. గరిటే కాదు స్టీరింగ్నూ తిప్పేస్తామని అనేక సందర్భాల్లో స్టీరింగ్‌ను చాకచక్యంగా తిప్పిచూపించిన వారెందరో. తాజాగా ఈ జాబితాలో చేరిన జాయిసీ లింగ్డో.. అతిపెద్ద సంస్థ అమెజాన్‌లో ట్రక్ స్టీరింగ్ తిప్పుతూ ఔరా అనిపిస్తోంది. ఒకచోటనుంచి మరోచోటుకు అమెజాన్ గూడ్స్‌ను రవాణా చేస్తూ అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా నిలిచింది . తనలాంటి వారెందరికో డ్రైవింగ్ కూడా ఒక ఉపాధి మార్గమంటూ చెప్పకనే చెబుతోంది. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 35 ఏళ్ల నిరుపేద మహిళే జాయిసీ లింగ్డో. ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం జాయిసీ భుజాలపైన పడింది. దీంతో చదువుని త్వరగా ముగించేసి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. గువహటీలోని స్టీల్ కంపెనీతోపాటు ఇతర కంపెనీలు, స్థానిక షాపుల్లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసేది. సరదాగా ప్రారంభించి... ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల సాయంతో సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంది. స్టీరింగ్ తిప్పడం బాగా వచ్చాక ఓ స్కూల్ బస్‌కు డ్రైవర్‌గా చేరింది. కొంతకాలం పని చేశాక అమెజాన్‌లో ట్రక్ డ్రైవర్స్‌ను తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది. ఆరేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండడంతో అమెజాన్ కంపెనీ జాయిసీని తీసుకుంది. దీంతో అమెజాన్ ఇండియాలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ గా నిలిచింది. గువహటీ వ్యాప్తంగా అమెజాన్ గూడ్స్‌ను సమయానికి డెలివరీ చేస్తూ మంచి డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, తనలాంటి మహిళలెందరికో కొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న జాయిసీ అమేజింగ్ డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంటోంది. మనసుంటే మార్గం ఉంటుంది వివిధ ప్రాంతాలకు తిరుగుతూ కొత్త ప్రాంతాలు, కొత్త మనుషుల్ని కలవడం బాగా నచ్చింది. అందుకే డ్రైవింగ్ మీద ఉన్న ఆసక్తిని వృత్తిగా మార్చుకుని రాణించగలుగుతున్నాను. డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునేవారు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. కొత్త ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి వాటిని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడాలి. కొత్తదారిలో నడిచేటప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. సాధించాలన్న మనస్సుంటే మార్గం తప్పకుండా దారి చూపుతుంది. – జాయిసీ లింగ్డో చదవండి: Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్ ఆడుతోంది చూడండి -
కరోనా బారినపడిన మరో సీఎం.. హోం ఐసోలేషన్‌లో..
షిల్లాంగ్: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కాన్రాడ్ సంగ్మా 2020లోను కరోనా బారిన పడ్డారు. I have tested positive for COVID-19. I am isolating myself for the required time. I have mild symptoms. All those who came into contact with me last few days are requested to observe their symptoms and test if necessary. — Conrad Sangma (@SangmaConrad) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
కిలేడీ ఎత్తుగడ.. బ్యాంకు దోచేయడానికి ఏకంగా 3 రోజులు
షిల్లాంగ్ (మేఘాలయ): కూటి కోసం కోటి విద్యలనేది ఓ నానుడి. అయితే కొందరు అప్పనంగా కోట్లకు పడగెత్తాలనే అత్యాశతో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడి కటకటాపాలవుతారు. తాజాగా మేఘాలయలోని బిష్ణుపూర్ శాఖ గ్రామీణ బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన ఓ కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ 40 ఏళ్ల మహిళ బ్యాంకులో గత శుక్రవారం డబ్బులు జమ చేయడానికి వచ్చింది. అయితే బ్యాంకును దోచేయాలనే ఉద్దేశంతో లోపలే ఉండిపోయింది. శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో దోపీడీకి అనువుగా బావించింది. తాను బ్యాంకు లోపల చిక్కుకున్నానని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇక ముందస్తు ప్రణాళికతో ఆమె కొన్ని ఆహార పదార్థాలను కూడా తన వెంట తెచ్చుకుంది. అయితే డబ్బు సంచుల మూటలు ఉంటాయేమో పట్టుకెళ్తాననే భ్రమలో ఉన్న ఆ మహిళ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు. సోమవారం బ్యాంకు మేనేజర్ లోపలికి అడుగుపెట్టినప్పుడు మహిళ అక్కడే ఉంది.. అని పోలీసులు పేర్కొన్నారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేశారు. చదవండి: వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న -
అక్రమ మైనింగ్ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు
షిల్లాంగ్: మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు కార్మికులు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురూ అస్సాంకు చెందిన వారని సిల్చార్ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. తావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష్య సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్ జైంతియా హిల్స్ ఎస్పీ జగ్పాల్ ధనోవా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జైంతియా హిల్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయంపై తనకు అంత అవగాహన లేదని స్థానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
షిల్లాంగ్ వేళ్ల వంతెన.. చూడాల్సిందే
ఇది కంప్యూటర్లో చేసిన గ్రాఫిక్ కాదు. ప్రకృతి చేసిన విన్యాసం. అక్వేరియంలో చేపలకు బదులు పడవ బొమ్మను వదిలినట్లు అనిపిస్తోంది కదూ! కానీ ఇది బొమ్మ పడవ కాదు, నిజమైన పడవ. అందులో ఉన్న మనుషులు ఆ సరస్సు సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు. ఆ సరస్సు పేరు ఉమియా లేక్. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది 220 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సు. ఈ సరస్సులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో పదాల్లో చెప్పాల్సిన పని లేదు, ఈ ఫొటో చెప్పేస్తోంది. ఉమియా సరస్సులో తేలుతున్న పడవ మెత్త చీపురు ఇక్కడిదే.. మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంట చేలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టు కుచ్చులా మెత్తగా ఉండే చీపురును మనం కొండ చీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే. వేళ్ల వంతెన మీద పర్యాటకుల సందడి చెట్ల వేళ్లతో వంతెన... టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో మన ఇంజనీర్లు చెరువుల మీద సస్పెన్షన్ బ్రిడ్జి కడుతున్నారు. వీటిని మనిషి మేధోవికాసానికి పరాకాష్టలుగా చెప్పుకుంటాం. షిల్లాంగ్ వాసులు మనసుతో వంతెనలు కట్టారు. ఉన్న వనరులను అవసరమైనట్లు మలుచుకోవడానికి మేధతోపాటు సున్నితమైన మనసు కూడా ఉండాలి. చుట్టూ అన్ని చెట్లు ఉన్నప్పటికీ చెట్లను నరికి వంతెన కట్టాలనే ఆలోచన చేయలేదు. మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయలేదు. కాబట్టి అవి చెట్టుకు బలాన్నిస్తూనే ఉంటాయి. మనుషులను చేరవేసే వాహకాలుగా కూడా పని చేస్తుంటాయి. పెద్ద చెట్లకయితే రెండు వరుసల వంతెనలు కూడా అల్లుతారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊయల ఊగినట్లు ఊగినా సరే పట్టు సడలవు. ఇదే మంచికాలం... మేఘాలయలో రోడ్లు ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వెళ్తే గతుకుల రోడ్ల తిప్పలు తప్పవు. ఏటా నవంబర్ నుంచి రోడ్డు పనులు మొదలై డిసెంబర్‌కి పూర్తవుతాయి. మేఘాలయ రాష్ట్రం మేఘాలమయం కావడంతో రాష్ట్రం మొత్తంలో ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. షిల్లాంగ్ చేరాలంటే పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రం, గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే ప్రయాణంలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కాబట్టి అస్సాంలో దిగడం ఏ మాత్రం వృథా కాదు. షిల్లాంగ్ టూర్లో బారాపానీ, నెహ్రూ పార్క్, నోహ్స్గితలాంగ్ జలపాతం, నోహ్కాలికాల్ జలపాతం, మావ్సమాల్ గుహలు, మావ్లాయ్నాంగ్ విలేజ్, ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్ చూడాల్సిన ప్రదేశాలు. -
మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత
షిల్లాంగ్: మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మారీ రాష్ట్ర సీఎం కొన్రాడ్ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు. ఎర్నెస్ట్ ప్రస్తుతం ఖాసీ హిల్స్ వైన్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు) రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవి తెలుస్తోంది. (విదేశీ ‘తబ్లిగీ’లపై చర్యలు) -
అక్కడ ఇప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం నిరసన జ్వాలలు ఇప్పుడు మేఘాలయను చుట్టుముట్టాయి. శుక్రవారం నుంచి ముగ్గురు మృత్యువాత పడగా, అనేక మంది కత్తిపోట్లకు గురయ్యారు. అనేక దుకాణాలు తగులబడ్డాయి. ఖాసి, జైంటియా ప్రాంతాల్లోని ఆరు జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచి పోయాయి. షిల్లాంగ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం వల్ల అక్రమ వలసదారులకు పౌరసత్వం లభిస్తుందని వారు భయాందోళనలకు గురవుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు చట్టబద్ధంగా పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెల్సిందే. ఆ దేశాల నుంచి మేఘాలయతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు అక్రమంగా వలసవచ్చిన వారందరికి పౌరసత్వం లభిస్తుందన్నది వారి వాదన. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఉన్న ఆదివాసీలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పౌరసత్వ సవరణ చట్టం కింద ఆరవ షెడ్యూల్ పరిధిలోని ప్రాంతాలకు పూర్తి మినహాయింపు ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషయంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ రక్షణ వల్ల పెద్ద ఉపయోగం లేకపోవచ్చని మేఘాల ప్రజలు భయాందోళన లకు గురవుతున్నారు. ఆరవ షెడ్యూల్ ప్రాంతాలకు ఇతరులు ఎవరు వెళ్లాలన్న అధికారిక అనుమతి పత్రం అవసరం. అయినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేఘాలయలోని ఖాసి విద్యార్థుల సంఘం పెద్ద ఎత్తున విధ్వంసకాండకు దిగింది. మృత్యువాత పడిన వారు కూడా విద్యార్థులే. 1960వ దశకంలో ‘బొంగాల్ ఖేదా ఉద్యమం’ కొనసాగిన మేఘాలయ ప్రజలతో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒప్పించడం చాలా కష్టం. బొంగాల్ ఖేదా ఉద్యమం సందర్భంగా వందలాది మంది ఆదివాసీయేతరులను ఇళ్ల నుంచి తరమి తరమి కొట్టారు. అప్పుడు పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. ఈ మధ్యనే అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనగా మళ్లీ ఇప్పుడు చిచ్చు రేగింది. నెలరోజుల్లోగా ఆదివాసీయేతరులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ తాజాగా ఆదివాసీ మిలిటెంట్ సంస్థలు అల్టిమేటమ్ జారీ చేశాయి. అస్సాంలో చాలా ప్రాంతాలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు వెలుపల ఉన్నాయి. అందుకనే అక్కడ ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విధ్వంసకాండ చెలరేగింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో ముస్లింలు, హిందువులకు మధ్య చిచ్చు రగులుకోగా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీలు, ఇతరులకు మధ్య చిచ్చు రగులుతోంది. (చదవండి: అంతర్జాతీయ సమస్యగా సీఏఏ) -
డ్రగ్స్ పేరుతో రస్నా పౌడర్
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా పోలీసు డిపార్టుమెంట్ వారు సోషల్ మీడియాలో వినూత్నమైన ట్వీట్లు చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం మేఘాలయ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ అమ్మేముఠాలపై ట్విట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో డ్రగ్స్ పేరుతో రస్నా పౌడర్‌ను అమ్ముతున్నారు. అదే విధంగా డ్రగ్ మాదిరిగా ఉన్న రస్నా పౌడర్‌ను కొని మోసపోయిన వారు తమకు ఫిర్యాదు చేయాలని’ ట్విటర్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అస్సాంలోని గౌహతి పోలీసులు కూడా వినూత్నంగా ‘ మీలో ఏవరైనా 590 గ్రాముల గంజాయి పోగొట్టుకున్నారా ? అయితే వచ్చి మాకు ఫిర్యాదు చేయండి’ అని ట్విటర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు చేస్తున్న ఈ వినూత్నమైన ట్విట్లు వైరల్ మారుతున్నాయి. SCAM ALERT! *clears throat* Shillong market is so dry that peddlers are fooling their clients with Rasna(!?) Powder. 😆😆 If you just got 'Rasna Ripped' off by your drug peddler, you know where to report. Kudos to ANTF team! Cc: @Rasna_House pic.twitter.com/7XVZhLaOt8 — Meghalaya Police (@MeghalayaPolice) August 15, 2019 -
షిల్లాంగ్‌లో మళ్లీ ఘర్షణలు.. ఆర్మీ ఫ్లాగ్ మార్చ్
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. షిల్లాంగ్‌లో విధించిన కర్ఫ్యూను భద్రతాబలగాలు ఆదివారం 8 గంటల పాటు ఎత్తివేయడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు మావ్‌లైలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు మళ్లీ కర్ఫ్యూను విధించారు. మరోవైపు సోమవారం షిల్లాంగ్‌కు చేరుకున్న ఆర్మీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించింది. స్థానిక గిరిజన తెగ ప్రజలకు, ఇక్కడే స్థిరపడ్డ పంజాబీలకు మధ్య గొడవ జరగడంతో గత ఐదు రోజులుగా నగరం అట్టుడుకుతోంది. కాగా, షిల్లాంగ్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించేందుకు 1,500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి అదనంగా కేంద్రం మరో 10 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిందన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేందుకు దాదాపు 500 మంది దుండగులు నగరంలోకి ప్రవేశించారన్న నిఘావర్గాల హెచ్చరికతోనే కర్ఫ్యూను పునరుద్ధరించినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం కన్రాడ్ సంగ్మా.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో మేఘాలయకు వచ్చిన ప్రతినిధుల బృందానికి వాస్తవ పరిస్థితిని తెలిపామన్నారు. కాగా, ఈ ఘర్షణలపై విచారణకు తమ ప్రతినిధి మన్జిత్సింగ్ రాయ్‌ను పంపిస్తున్నట్లు జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకటించింది. -
షిల్లాంగ్ ఎందుకు మండుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ గురువారం రాత్రి వాట్సాప్‌లో నకిలీ వార్త ప్రచారం కావడంతో షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాసీ (అగ్రవర్ణ కులం) వర్గానికి చెందిన కొంత మంది యువకులు పంజాబీ లైన్ లేదా స్వీపర్స్ కాలనీ సమీపంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులతో ఘర్షణకు దిగారు. గుంపులో నుంచి ఓ యువకుడు ఇనుప రాడ్‌తో కొట్టడంతో పోలీసు సూపరింటెండెంట్ స్టీపెన్ రింజా తీవ్రంగా గాయపడ్డారు. ఆ అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. పంజాబీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. నేటికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతో కాలనీని విడిచి దాదాపు 500 మంది దళిత సిక్కులు పిల్లా పాపలతో సమీపంలోని గురుద్వార్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడి కమ్యూనిటీ కిచెన్‌లో వంటచేసుకొని అక్కడే కాలం గడుపుతున్నారు. గురవారం ఉదయం జరిగిన ఓ సంఘటన ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మేఘాలయ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఎక్కడ పార్క్ చేయాలనే విషయమై బస్సు డ్రైవర్, కొంత మంది పంజాబీ మహిళలకు మధ్య గొడవ జరిగింది. మహిళల తరపున వచ్చిన ఓ పంజాబీ యువకుడు బస్సు డ్రైవర్‌పై, అందులోని ఇద్దరు ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనలో కంటోన్మెంట్ బోర్డు పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆ పంజాబీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ‘సిక్కు మహిళల పట్ల మాకు ఎలాంటి కాఠిన్యం లేదు. దాడి చేసిన యువకుడి పట్ల ద్వేషమూ లేదు. మా గాయాల చికిత్స కోసం మాకు నాలుగు వేల రూపాయలను నష్టపరిహారంగా కూడా వారు చెల్లించారు’ అంటూ బస్సు డ్రైవర్ స్వయంగా రాజీ పత్రాన్ని రాసిచ్చారు. గురుద్వార్‌లో తలదాచుంటున్న మహిళలు ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ అదే రోజు రాత్రి వాట్సప్‌లో వచ్చిన ఫేక్ న్యూస్ ఒక్కసారిగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి పంజాబీ కాలనీ పరిసర ప్రాంతాల్లో, ఖాసీలు ఎక్కువగా ఉన్న షిల్లాంగ్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సైన్యం కవాతు కూడా నిర్వహించింది. తరతరాలుగా తాము పంజాబీ కాలనీలో ప్రశాంతంగా జీవిస్తున్నామని, తాము మరుగుదొడ్లు శుభ్రంచేసే పాకీ పనిని మానేసిన 1980 వ దశకం నుంచే అగ్ర కులానికి చెందిన ఖాసీల దాడులు తమపై ప్రారంభమయ్యాయని పంజాబీ మహిళలు చెబుతున్నారు. తమను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ కౌన్సిల్ సెక్రటరీ గుర్జీత్ సింగ్ ధృవీకరించారు. బ్రీటీషర్ల కాలం నుంచి.. బ్రిటీష్ కాలం నుంచి, దాదాపు 160 సంవత్సరాలుగా పంజాబీ దళితులు ఈ కాలనీలోనే నివసిస్తున్నారు. వీధులను ఊడ్చేందుకు, మరుగు దొడ్లను శుభ్రం చేసేందుకుగాను బ్రిటీషర్లు 1853లో పంజాబీ దళితులను తీసుకొచ్చారు. వారు నివసించేందుకు అప్పటి మిల్లీయం సియెమ్ (మిల్లీయం పాలకుడు) కొంత భూమిని వారికి రాసిచ్చారు. ఆ తర్వాత 1863, డిసెంబర్లో ఇదే నివాస స్థలంపై బ్రిటీష్ ప్రభుత్వానికి, స్థానిక పాలకుడికి, పంజాబీ దళితులకు మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు తామున్నది అతి ఖరీదైన స్థలంగా మారడంతో తమను ఎలాగైనా ఖాళీ చేయించాలని చూస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. గురద్వార్ కమ్యూనిటీ కిచెన్‌లో చపాతీలు చేస్తున్న మహిళలు అక్రమ వలసదారులు.. షిల్లాంగ్‌కు చెందిన ఖాసీలు మాత్రం సిక్కు దళితులను అక్రమ నివాసితులుగానే పరిగణిస్తున్నారు. పంజాబీ కాలనీకి చెందిన కొంత మంది యువకులు నేరాలకు పాల్పడుతున్నారన్నది కూడా అభియోగం. 1980 ప్రాంతంలోనే జిల్లా కమిషనర్ పంజాబీలకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై మేఘాలయ హైకోర్టు 1986లో స్టే ఇచ్చింది. ఖాసీ విద్యార్థి సంఘం, ఖాసీ ప్రజా సమాఖ్య లాంటి సంస్థలు అప్పుడప్పుడు పంజాబీలను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పంజాబీలు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్‌కు పలు సార్లు ఫిర్యాదు చేశారు. భారత పౌరులుగా తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చంటూ హైకోర్టులో కూడా వారు పలు పిటిషన్లు దాఖలు చేశారు. గురుద్వారాలకు, స్థానిక దేవాలయాలకు పట్టాలు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం వారి ఇళ్ల స్థలాలకు మాత్రం ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయలేదు. మల్టీప్లెక్స్ నిర్మానానికి.... మున్సిపాలిటీ అనుమతి లేకుండా విద్యుత్ బోర్డు కూడా దళితులకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదు. అది వివాదాస్పద స్థలంగా తమ రికార్డుల్లో నమోదై ఉందని స్థానిక మున్సిపాలిటీ బోర్డు వాదిస్తోంది. ఒకప్పుడు మరుగుదొడ్డు శుభ్రం చేసిన వారికి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకుండా పోయింది. 2009 రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు వారికి కనీస సౌకర్యాలు సమకూరాయి. బీజేపీ కుట్రతో అధికారంలోకి వచ్చిన జాతీయ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుంచి దళితులను షిల్లాంగ్ శివారులోకి తరలించి అక్కడ మల్టీఫ్లెక్స్ నిర్మించానుకుంటోంది. -
‘ఘర్షణలు రెచ్చగొట్టేవారిని వదిలిపెట్టం’
షిల్లాంగ్: మేఘాలయలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలను కొందరు కావాలనే ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆరోపించారు. గురువారం షిల్లాంగ్‌లో ఖాసీ పిల్లాడిపై ఒక సిక్కూ మహిళ దాడి చేయడంతో ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే. పంజాబ్ వాసులు నివాసముంటున్న మావ్‌లాంగ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, ఘర్షణలను అదుపు చేయడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులకు కొంతమంది డబ్బులు, మద్యం అందిస్తున్నారని సీఎం సంగ్మా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను ప్రోత్సహిస్తున్న పంజాబీలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయలో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవడానికి తమ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పంపుతామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కమిటీ నివేదిక ఆధారంగా పంజాబ్ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. మేఘాలయలోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. షిల్లాంగ్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయని, గురుద్వారపై ఎవరూ దాడి చేయలేదనీ, వదంతులు నమ్మొద్దని ట్వీట్ చేశారు. Beware of rumour-mongers & troublemakers. There was no damage to any Gurdwara or other institutions belonging to the Sikh Minority in Meghalaya. Law & Order situation is under control and the State Govt is extremely vigilant & settling the case. — Kiren Rijiju (@KirenRijiju) June 3, 2018 -
రాళ్ల దాడి, 144 సెక్షన్ అమలు
షిల్లాంగ్: మత ఘర్షణలు చెలరేగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కర్ఫ్యూ విధించారు. తమ మతానికి చెందిన పిల్లలపై దాడి చేశారంటూ మరో మతానికి చెందినవారు నిరసనలకు దిగడంతో.. షిల్లాంగ్ నగరంలో వాణిజ్య కేంద్రమైన మోట్‌ఫ్రాన్ ఉద్రిక్తలకు కేంద్రంగా మారింది. గురువారం రాత్రి నుంచి అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. వివరాలు.. గురువారం ఉదయం తన పిల్లలపై ఏ కారణం లేకుండా ఒక వర్గానికి చెందిన మహిళ దాడి చేసిందని ఓ బస్ డ్రైవర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల చొరవతో ఆ గొడవ సామరస్యంగా సద్దుమణిగింది. కానీ, తన కొడుకును అకారణంగా గాయపరిచిన వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బాధితుని తండ్రి సిద్ధమయ్యాడు. ఇరుగు పొరుగు వారిని, సహోద్యోగులను మతం పేరుతో రెచ్చగొట్టి గురువారం రాత్రి మోట్‌ఫ్రాన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, పాత్రికేయుడు, మరి కొంతమంది గాయపడ్డారు. ఈ ఘర్షణ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పి మత ఘర్షణలకు దారి తీయొచ్చని భావించిన ఖాసీ హిల్స్ (తూర్పు) డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్.దిఖార్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపి వేశారు. కర్ఫ్యూతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయని ఆయన తెలిపారు. జయా, మావ్‌ఖర్, ఉమ్‌సోసన్, రియత్సంతియా, వాహింగ్దా, మిషన్, మాప్రేమ్, లున్‌డింగ్రీ, అమా విల్లా, ఖ్వాలాపతి, వాతప్రూ, సన్నీ హిల్, కంటోన్మెంట్, మావ్‌లంగ్‌లలో కర్ఫ్యూ విధించారు. -
‘స్కామ్‌లతో దేశ ప్రతిష్టకు మచ్చ’
సాక్షి, షిల్లాంగ్ : కుంభకోణాలు దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగులుతాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగు చూసిన బ్యాంకింగ్ స్కామ్‌లను ప్రస్తావిస్తూ ఇలాంటి కుంభకోణాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, కార్పొరేట్ విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్రాండ్ ఇండియా బలోపేతానికి ఎగ్జిక్యూటివ్‌లు పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ఐఐఎం షిల్లాంగ్ వార్షిక స్నాతకోత్సవంలో వెంకయ్య పేర్కొన్నారు. భారత్‌ను బలోపేతం చేసేందుకు కార్పొరేట్ ఇండియాను దీటుగా మలిచేందుకు భవిష్యత్ బిజినెస్ లీడర్లుగా కృషి సాగించాలని ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఆయన పిలుపు ఇచ్చారు. జాతీయ దృక్పథంతో సామాజిక స్పృహతో పనిచేయాలని విద్యార్ధులను కోరారు. భవిష్యత్‌లో వ్యాపారం, ఉద్యోగం ఏది చేపట్టినా ఆర్థిక కోణంతో పాటు మానవతా దృక్పథంతోనూ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
ట్రక్కు ఢీ..16 మంది మృతి..50 మందికి గాయాలు
షిల్లాంగ్: మేఘాలయాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టడంతో దానిలో ఉన్న 16 మంది మృతి చెందగా 50 మంది పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాలోని నాంగ్‌స్టోయిన్‌కు సమీపంలోని జ్దోక్రో గ్రామంలో చోటు చేసుకుంది. అయితే 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు మీడియాకు తెలిపారు. మృతుల్లో 9 మంది మహిళలలు, ఓ బాలిక (13) ఉందన్నారు. ప్రమాద బాధితులు నాగలాండ్ గ్రామస్తులని, వీరంతా ప్రేస్బెటేరియన్ చర్చికి వెల్లోస్తున్నారుని చెప్పారు. క్షతగాత్రులను షిల్లాంగ్ సివిల్ ఆసుపత్రికి తరిలించామని పోలీసులు తెలిపారు. -
థ్రిల్లింగ్ షిల్లాంగ్...
టూర్‌దర్శన్ - షిల్లాంగ్ వెండిమబ్బులను తాకే కొండల తీరు... కొండల మీదుగా జోరుగా దూకే జలపాతాల హోరు... పచ్చని పరిసరాల్లోంచి తలపెకైత్తి చూస్తే నింగీ నేలా కలుసుకున్నాయా అనిపించే ప్రకృతి వర్ణవైవిధ్యం... బాతులు ఈదులాడే కొలనులు, కొంగలు వాలే సరస్సులు సరేసరి... సముద్ర మట్టానికి దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున వెలసిన పట్టణం షిల్లాంగ్... పట్టణానికి చుట్టూ దట్టమైన అరణ్యం... ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది సాక్షాత్తు స్వర్గధామాన్నే తలపిస్తుంది. అస్సాం నుంచి మేఘాలయ 1972లో విడిపోయేంత వరకు షిల్లాంగ్ అస్సాం రాజధానిగా ఉండేది. ఇక్కడి చల్లని వాతావరణానికి, చూడచక్కని ప్రకృతి అందాలకు ముగ్ధులైన బ్రిటిష్ పాలకులు ఇక్కడ తరచుగా విడిది చేసేవారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఇక్కడ ఒక వేసవి విడిది గృహాన్ని నిర్మించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత సుందర నగరంగా పేరుపొందిన షిల్లాంగ్, నేటికీ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. ఏం చూడాలి? చిన్న పట్టణమే అయినా షిల్లాంగ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు, విశేషాలు చాలానే ఉన్నాయి. షిల్లాంగ్ శిఖరం పైనుంచి పరిసరాల పచ్చదనాన్ని తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం, పరిసర ప్రాంతాలు చక్కగా కనిపిస్తాయి. తూర్పు ఖాసీ కొండలపై వెలసిన షిల్లాంగ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ జలపాతాలు కనిపిస్తాయి. వీటిలో ఎలిఫెంట్ జలపాతం, స్ప్రెడ్ ఈగల్ జలపాతం, స్వీట్ జలపాతం, క్రినోలిన్ జలపాతాల వద్దకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఉరకలేసే ఈ జలపాతాల సొగసును చూసి తీరాల్సిందే. ఈశాన్య సంస్కృతికి ఆలవాలమైన షిల్లాంగ్‌లో తప్పనిసరిగా చూడాల్సినవి మ్యూజియమ్స్. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాంప్లెక్స్‌లోని కెప్టెన్ విలియమ్సన్ సంగ్మా స్టేట్ మ్యూజియం, డాన్‌బాస్కో ఆదిమ సంస్కృతుల మ్యూజియంలలో ఈశాన్య సంస్కృతికి సంబంధించిన రకరకాల పురాతన వస్తువులను చూడవచ్చు. ఎంటమాలజీ మ్యూజియంలో రంగురంగుల సీతాకోకలు, అరుదైన కీటకాలను తిలకించవచ్చు. లేడీ హైదరీ పార్కు నందనవనాన్నే తలపిస్తుంది. ఈ పార్కులోనే ఉన్న ఫారెస్ట్ మ్యూజియంలో అటవీ సంపదకు సంబంధించిన అరుదైన వస్తువులను తిలకించవచ్చు. ఎగువ షిల్లాంగ్‌లో ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి వార్డ్స్ లేక్, ఉమియమ్ లేక్ వంటి సుందర సరోవరాలు బాతులు, కొంగలు వంటి పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి పురాతన మహాదేవ్ ఖోలా ధామ్ శైవక్షేత్రం, కేథలిక్ కెథడ్రల్, ఆల్ సెయింట్స్ చర్చి వంటివి ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. ఇక క్రిసాలిస్ ఆర్ట్ గ్యాలరీని కళాభిమానులు చూసి తీరాల్సిందే. ఏం చేయాలి? జనసమ్మర్దం తక్కువగా ఉండే షిల్లాంగ్ వీధుల్లో జాలీగా షికారు చేస్తూ, షాపింగ్ చేయవచ్చు. షిల్లాంగ్ పీక్ పెకైక్కి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ఉరకలేసే జలపాతాల వద్ద ఉత్సాహంగా, ఉల్లాసంగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కొండలు, గుట్టలు ఎక్కవచ్చు. సరస్సుల్లో బోటు షికార్లు చేయవచ్చు. ఈశాన్య సంస్కృతి, ఇక్కడి ఆదిమ తెగలు, అరుదైన జీవజాతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఇక్కడి మ్యూజియమ్స్ను చూసి తీరాల్సిందే. షిల్లాంగ్ శివార్లలోనే దట్టంగా విస్తరించి ఉన్న మాఫ్లాంగ్ అరణ్యంలో వనవిహారం చేయవచ్చు. ఈ అరణ్యాన్ని ‘సేక్రెడ్ ఫారెస్ట్’ (పవిత్రారణ్యం) అంటారు. ఎలా చేరుకోవాలి? షిల్లాంగ్‌కు వెలుపల ఉన్న ఉమ్రాయ్లో విమానాశ్రయం ఉంది. అయితే, కోల్‌కతా నుంచి మాత్రమే ఇక్కడకు విమానాల రాకపోకలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోల్‌కతాలో మరో విమానం ద్వారా ఇక్కడకు రావచ్చు. విమానాశ్రయం నుంచి షిల్లాంగ్ పట్టణానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వచ్చేవారు గువాహటి రైల్వేస్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో షిల్లాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఏం కొనాలి? ఇక్కడి అడవుల్లో విస్తారంగా దొరికే స్థానిక కళాకారులు రూపొందించిన వెదురు అలంకరణ వస్తువులు, బుట్టలు, పూలసజ్జలు, వెదురు కర్టెన్లు వంటివి కొనుక్కోవచ్చు. నాగా, మణిపురి నేతగాళ్లు నేసిన ఊలు దుప్పట్లు, శాలువలు, తేలికపాటి ఊలుతో ప్రత్యేకంగా నేసిన మణిపురి లుంగీలు, షర్టులు కొనుక్కోవచ్చు. బడాబజార్ అని ఇక్కడి స్థానికులు పిలుచుకునే ల్యూడహ్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు, చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. ఈ బజారులోని దుకాణదారులందరూ మహిళలే కావడం విశేషం. పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఇక్కడ బజార్లలో చౌకగా దొరుకుతాయి. ఇక్కడ మాత్రమే దొరికే ‘ఖాసీ స్క్రబ్’ను కొని తీరాల్సిందే. పాత్రలు తదితరమైన వాటిని శుభ్రం చేసుకునేందుకు వాడవచ్చు. చాలా పెద్ద సైజులో దొరికే ఈ స్క్రబ్‌ను కావలసిన రీతిలో ముక్కలుగా కత్తిరించుకుని వాడుకోవచ్చు. -
సీఎం భార్యకు నోటీసులు
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా భార్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తురాలో ఈ నెల 16న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆయా సభల్లో పాల్గొన్న సంగ్మా భార్య డికాంచీ డి షిరా బీజేపీకి వ్యతిరేకంగా, అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకుగానీ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించింది. ప్రచారంలో పాల్గొన్న సంగ్మా.. నేషనల్ పీపుల్స్ పార్టీకి బీజేపీకి మధ్య ఒప్పందం జరిగిందని, బీజేపీ ఎజెండా మేరకే ఎన్ పీపీ పనిచేస్తుందని, మైనారిటీలకు బీజేపీ రక్షణ కల్పించలేదంటూ కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ మాటలను నేరుగా మీడియా నుంచి సుమోటోగా తీసుకున్న ఈసీ ఆమెకు నోటీసులు పంపించారు. దీనిపై ఆమెను వివరణ కోరగా తమ స్థానిక భాష మీడియాకు అర్థంకాగ తప్పుగా రాసిందని, తానేం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తురా స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున డికాంచి డీ షిరా పోటీ చేస్తుండగా.. ఎన్ పీపీ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ పుర్నో ఏ సంగ్మా కుమారుడు కాన్ రాడ్ కే సంగ్మా పోటీ చేస్తున్నారు. -
ఫిబ్రవరి 6 నుంచి దక్షిణాసియా క్రీడలు
గువహటి, షిల్లాంగ్ ఆతిథ్యం గువహటి: దక్షిణాసియా క్రీడలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరగనున్నాయి. గువహటి, షిల్లాంగ్ నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భుటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఇందులో పాల్గొంటాయి. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ఆదివారం జరిగిన సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ తెలిపారు. అథ్లెట్లు, అధికారులతో కలిపి మొత్తం 4 వేల మంది ఈ పోటీలకు వస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వాములతో కలిసి క్రీడలను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 17 క్రీడాంశాలకు గుహవటి, 8 క్రీడాంశాలకు షిల్లాంగ్ వేదిక కానుంది. ఈసారి టెన్నిస్‌కు కూడా దక్షిణాసియా క్రీడల్లో స్థానం కల్పించారు. -
సహజసుందరం
మేఘాలయం ప్రెజెంటేషన్: నిర్మలారెడ్డి ఏడాది పొడవునా చల్లగా, వర్షపాతం అధికంగా ఉండి, హోరుమని దుమికే జలపాతాలకు నెలవై, పచ్చదనంతో ప్రకృతి ఆరాధకులను తనవైపు తిప్పుకొని విస్మయపరిచే ప్రాంతం చిరపుంజి. గిరిజన సంస్కృతులు కొలువుదీరి, అబ్బురపరిచే వన్యప్రాణులు విహరించే ప్రాంతం, ప్రశాంతతకు ఆలవాలమైన ఆలయాలుగల షిల్లాంగ్. ఈశాన్య భారతదేశంలో కొలువైన ఈ ప్రాంతాల సోయగాలను కనులారా వీక్షించిన హైదరాబాద్ తపాలా శాఖలో మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ జి.సూర్యనారాయణ పర్యటన అనుభవాలివి... ‘‘మా కుటుంబ సభ్యులతో కలిసి కిందటి నెలలో ఈశాన్యభారతదేశంలోని చిరపుంజిని సందర్శించాలని బయల్దేరాను. చిరపుంజితో పాటు షిల్లాంగ్, అస్సాంలోని గౌహతి పట్టణం సందర్శించాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్‌కోస్ట్ రైలులో ఉదయం 10 గం.లకు బయల్దేరిన మేము మరుసటి రోజు 4:30 గంటలకు కోల్కత్తా చేరుకున్నాం. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి విమానయానం ద్వారా షిల్లాంగ్‌కు బయల్దేరాం. హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు చిరపుంజికి టాక్సీలో బయల్దేరాం. చిరపుంజి చేరడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. జలపాతాల హోరు చిరపుంజి... మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కి.మీ దూరంలో తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం చిరపుంజి. దీనిని సోహ్రా, చురా అని కూడా అంటారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతి చెందింది. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్లే దారంతా పచ్చని ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయాం. అదనపు ఆకర్షణగా చిరపుంజిలో అన్నీ జలపాతాలే! ‘నోహ్కాలికై’ జలపాత సోయగమైతే మాటల్లో వర్ణించలేం. దేశంలోనే ఎత్తై జలపాతాలలో ఒకటిగా ‘నోహ్కాలికై’కి పేరుంది. చిరపుంజికి 5 కిలోమీటర్ల దూరంలోనే గల ఈ జలపాతం ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ఏడాదికి సాధారణ వర్షపాతం 12000 మి.మీ గా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో 2500 మి.మీకు పైగా నమోదైన రోజులూ ఉన్నాయి. మేం వెళ్లిన రోజునా వర్షం మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. రోడ్డుకి ఇరువైపులా బొగ్గుక్షేత్రాలు, సున్నపురాయి గనులు లెక్కకు మించి ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ‘దైనత్లేన్’ అనే మరో జలపాతమూ ఉంది. గుహల సముదాయం... జలపాతాల హోరును, పర్వతశ్రేణులను, పచ్చని ప్రకృతిని తిలకిస్తూ అక్కడ ఫొటోలు దిగాం. చూసినంత సేపు చూసి అక్కడ నుంచి గుహల సందర్శనకు బయల్దేరాం. ‘లైమ్‌స్టోన్ కేవ్స్’గా పిలిచే సున్నపురాయి గుహలు చిరపుంజికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇక్కడి పర్వతప్రాంతమంతా పచ్చని గడ్డి తివాచీ పరుచుకున్నట్టే ఉంది. ఈ గుహలలో చిన్నవి, పెద్దవి కలుపుకొని ఇంచుమించు వందకుపైగా ఉంటాయి. రాకాసి జంతువుల్లా రకరకాల రూపాల్లో గుహ లోపలి దృశ్యాలు అబ్బురపరిచాయి. చిరపుంజిలో లివింగ్ బ్రిడ్జికి పెట్టింది పేరు. వందల ఏళ్లుగా చిరపుంజీ వాసులు చెట్ల వేళ్లనే వంతెనలుగా మార్చుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్న పురాతన బ్రిడ్జి వయసు 500 ఏళ్లకు పైగా ఉంటుందని అంచనా! ఉత్సాహభరితం షిల్లాంగ్... ఇక్కడి గిరిజన సంస్కృతులు, డాన్ బాస్కో సెంటర్, మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే! షిల్లాంగ్ శిఖరం అత్యంత సుందరమైనది. దీనికి సంబంధించిన కథనాలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ తెలిసింది. లిర్ అనే కన్య మగబిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డను ఒక తోటలో పాతిపెడుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత అర్ధరాత్రి తలుపు దగ్గర శబ్దం రావడంతో మెలకువ వచ్చి లేచి చూస్తే ఒక అందమైన యువకుడు లోపలికి వచ్చి ‘అమ్మా భయపడవద్దు.. నాడు తోటలో పాతిపెట్టిన బిడ్డను నేనే’ అని చెప్పాడు. వెంటనే ఆమె అతనిని ‘షిల్లాంగ్’ అని ఆనందంగా పిలుస్తుంది. ‘షిల్లాంగ్’ అంటే ‘స్వతహాగా, స్వయంగా’ పెరిగిన అని అర్థం. సహజసిద్ధమైన ప్రాంతంగా అవడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఎలిఫెంట్ హిల్స్... షిల్లాంగ్‌లో ఎత్తై, అతి సుందరమైన మరో ప్రదేశం ఎలిఫెంట్ జలపాతం. దీనిని ఆంగ్లేయుల కాలంలో గుర్తించారు. జంతువులలో ఏనుగు ఎంత పెద్దదో జలపాతాలలో ఎలిఫెంట్ హిల్స్ అంత పెద్దది అని చెబుతారు. కొండ ఎడమభాగం ఏనుగు ఆకారంలో ఉండేదని, 1897లో భూకంపం రావడం వల్ల ఆ ఆకారం గల కొండ కొట్టుకుపోయిందని టూరిస్ట్ గైడ్ తెలిపారు. ఇక్కడ మరో ఆకర్షణీయ ప్రాంతం ‘లేడీ హైదర్ పార్క్’ తప్పక సందర్శించాల్సిన ఉద్యానవనం. సీతాకోకచిలుకలు ఎన్నో... షిల్లాంగ్‌కి 2 కిలోమీటర్ల దూరంలో, ఎలిఫెంట్ గుహలకు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో బటర్‌ఫ్లై మ్యూజియం ఉంది. షార్జా, దుబాయ్, ఒమన్, పొలస్కా, పనామా మొదలగు ప్రపంచంలో గల విభిన్న జాతుల రంగురంగుల సీతాకోక చిలుకలు ఇందులో ఉన్నాయి. జనవరి 17 న మొదలైన మా ప్రయాణం 27న ముగిసింది. పది రోజుల పాటు సాగిన ఈశాన్యభారతదేశ ప్రయాణం మదినిండా ఆనందోల్లాసాలను కలిగించింది. ఈ ప్రయాణం సరికొత్త అనుభవాన్ని మిగిల్చింది. తూర్పు స్కాట్లాండ్‌గా పిలబడే షిల్లాంగ్‌ని అత్యద్భుత పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. విశాల మైదానాలలోనూ, పర్వతాల మీద పచ్చదనం, జలపాతాలు, మంత్రముగ్ధులను చేసే శిఖరాలు, అనేక ఆసక్తికరమైన విషయాలతో షిల్లాంగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. -
ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!
తొలి పరిచయం కెమెరా ముందు తొలిసారిగా నిల్చోవడానికి, తొలి సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడలేదు. భయపడలేదు. కారణం ఏమిటంటే, గతంలో నేను చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించాను. నేను షిల్లాంగ్‌లో పుట్టి పెరిగాను. అక్కడ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా నేను ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘టైటానిక్’ ‘ప్రెట్టీ ఉమన్’ నా అభిమాన చిత్రాలు. నేను చూసిన తొలి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’. పోటీకి భయపడేవాళ్లు ఆటలో దిగవద్దు. దిగితే భయపడవద్దు. సినీ పరిశ్రమలోనే కాదు ప్రతిచోటా పోటీ ఉంది. ‘ఇతరులు ఏం చేస్తున్నారు?’ అనేదాని కంటే ‘నేనేం చేస్తున్నాను’ అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను. షిల్లాంగ్ నేపథ్యం, సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం విజయం సాధించడం, నాకు గుర్తింపు రావడం... నావరకైతే అతిపెద్ద విజయాలు. ఈ సంతృప్తి చాలు. కెరీర్ మొదట్లో లభించే ప్రశంసలు జీవితకాలం గుర్తుండి పోతాయి. ‘సిటీ లైట్స్’ ప్రదర్శన తరువాత నటి అలియాభట్ నన్ను కౌగిలించుకొని చాలాసేపు మెచ్చుకోలుగా మాట్లాడింది. నాకు స్ఫూర్తి కలిగించిన నటి విద్యాబాలన్ కూడా నన్ను మెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ కూడా. ఈ ప్రశంసలతో సంతోషం కంటే ‘బాధ్యత’ ఎక్కువ పెరిగింది. ‘కొత్తనటిని కదా. ఏదైనా సలహా చెప్పండి’ అని ఒక నటుడిని అడిగితే ‘ఏ సలహా ఇవ్వక పోవడం కూడా సలహానే’ అన్నారు నవ్వుతూ. అంతేనేమో! - పత్రలేఖ, హీరోయిన్ (సిటీలైట్స్ ఫేమ్) -
ఆకలి బాధల నుంచి ఐఏయస్ వరకు
స్ఫూర్తి స్కూల్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకొని ‘శభాష్’ అనిపించుకునే పేమ్‌కు పెద్దగా కలలేమీ ఉండేవి కావు. మంచి కళాశాలలో చదువుకోవాలనే కోరిక మాత్రం ఉండేది. కాలేజీ చదువు కోసం షిల్లాంగ్ వెళ్లడం అతని జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. అప్పుడు తానొక కల కన్నాడు... ఐఏయస్ అవ్వాలని. కల సంపన్నంగా ఉంది. ఇంట్లో తిష్ఠ వేసిన బీదరికం మాత్రం వెక్కిరించింది. అయితే వెక్కిరింపులకు వెరవకుండా కష్టాలకు ఎదురీది అనుకున్నది సాధించాడు. ఐఏయస్ అయ్యాడు. ఐఏఎస్ ట్రైనింగ్ కాలంలో వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. తప్పనిసరి పరిస్థితిలో నాన్నను విడిచి వెళ్లాల్సి వచ్చింది. క్లాసులో కూర్చున్నా మనసంతా నాన్న మీదే ఉండేది. ఒకరోజు నాన్నకు సీరియస్‌గా ఉందనే వార్త తెలిసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆయన చనిపోయారు. కన్నీళ్లు ఆగలేదు. ‘‘మా నాన్న చివరి రోజుల్లో దగ్గర లేను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది’’ అంటాడు బాధగా పేమ్. ‘‘బీదవాళ్లకు సహాయపడు’’ అని నాన్న చెప్పిన మాట మాత్రం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటాడు. మణిపూర్‌లో కొన్ని జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు తన పరిధిలో పేదవాళ్లకు సహాయపడ్డాడు. ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ ఆయనకు ఆదర్శం. మండేలా, మదర్ థెరిసా అంటే కూడా చాలా అభిమానం. ‘‘బాగా కష్టపడి పని చేసే అధికారి’’ అన్న పేరును తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు ఇరవై తొమ్మిది ఏళ్ళ పేమ్. మేఘాలయాలోని జెమి నాగ తెగలో తొలి ఐఏయస్ అధికారి అయిన పేమ్ ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో జాయింట్ సెక్రటరీ హాదాలో పనిచేస్తున్నాడు. -
చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్
12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ముగ్గురు ఖాకీ కీచకులను అరెస్ట్ చేసినట్లు షిల్లాంగ్ జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ శనివారం ఇక్కడ వెల్లడించారు. మేఘాలయాలోని పశ్చిమ గారో పర్వత ప్రాంతంలో ఆ ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. కాగా నిందితులు ఒకరు ఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తుండగా, మరో ఇద్దరు ప్రొబిహిషన్ పిరియడ్‌లో ఉన్నారని తెలిపారు. అయితే ఆ ముగ్గురు నిందితులను విధుల నుంచి ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... గతేడాది డిసెంబర్ 28వ తేదీన 12 ఏళ్ల చిన్నారి తన మేనమామతో కలసి షాపుకు వెళ్లి వస్తుంది. ఆ క్రమంలో మేనమామపై దాడి చేసి తాము తీవ్రవాదులమని చెప్పి, ఆ బాలికపై ఆటో రిక్షాలో అత్యాచారం చేశారు. అనంతరవారిని తురాలోని చాంద్‌మరి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కొన్ని తెల్లపేపర్లపై బాధితులు ఇద్దరి వద్ద నుంచి సంతకాలు తీసుకుని, ఆ విషయం ఎక్కడైనా చెబితే చంపెస్తామని బెదిరించారు. దాంతో బాధితురాలు తన తల్లితండ్రులను ఆశ్రయించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై మహిళ పోలీసులు ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ వివరించారు.