Shraddha Srinath
-
ఆ టైమ్‌లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. -
ఆ హీరోయిన్ నో చెప్పడంతో బాధపడ్డా: విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్లో విశ్వక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెప్తూనే శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.ఫలక్‌నుమా దాస్ సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్‌నే తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.చదవండి: ‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు -
‘మెకానిక్ రాకీ’ఈవెంట్లో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్‌గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్‌లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది. -
గులాబీలు గుప్పే పిల్లడే...
‘‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే...’ అంటూ మొదలవుతుంది ‘మెకానిక్ రాకీ’ సినిమాలోని ‘గుల్లేడు గుల్లేడు...’ పాట. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ‘గుల్లేడు గుల్లేడు..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జేక్స్ బిజోయ్ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ‘జాతి రత్నాలు’ దర్శకుడితో... మంగళవారం విశ్వక్ 13వ సినిమా ప్రకటన రాగా, బుధవారం ఆయన 14వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
'మెకానిక్ రాకీ' కోసం సింగర్ మంగ్లీ సాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. 'నడుము గీరుతూ..' అంటూ సాగే ఈ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ రచించగా సింగర్ మంగ్లీ ఆలపించారు. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. -
'మెకానిక్ రాకీ' గ్లింప్స్.. ఎల్ అంటే సరికొత్త చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్‌ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
Shraddha Srinath: గెటప్ శ్రీను భార్య.. తర్వాత వెంకీతో లవ్.. సైంధవ్‌లో మెప్పించిన బ్యూటీ (ఫోటోలు)
-
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్‌కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్‌లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్‌గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్‌తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్‌తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్‌ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్‌తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్‌కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్‌గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
‘జెర్సీ’భామ సినీ జర్నీ..ఎల్ఎల్బీ పట్టా పొంది సినిమాల్లోకి
శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు.. ► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకుంది. ► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్‌గా పనిచేసింది. ► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్‌కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్‌ను ఆమె సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌నూ అందుకుంది. ► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది. ► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్‌ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్‌తెర చాన్స్లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్ -
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఇంతకుముందు సరైన సినిమాలు చేయలేకపోయా.. ఆ బాధే..: హీరో
నటుడు విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ శ్రద్ధా శ్రీనాథ్, సానియా అయ్యప్పన్, అపర్నిధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. ఎస్సార్ ప్రభు తన పొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించాడు. యువరాజ్ దయాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం గోకుల్, సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఇళ్లల్లో తాత శివాజీ గణేషన్ ఫోటో ఉంటుందన్నారు. ఈ ఇరుగప్పట్రు చిత్రం కూడా అలా ప్రతి ఇంటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కొన్ని సరైన చిత్రాలు ఇవ్వలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశానని.. ఆ విచారమే ఈ చిత్ర విజయానికి కారణమని పేర్కొన్నారు. దర్శకుడు యువరాజ్ దయాళన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలైన అక్టోబర్ 6న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సంఘటన జరిగిందన్నారు. సాధారణంగా భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు బాగా ఆడతాయా, ఆడవా అని ఆలోచించకుండా చేస్తామన్నారు. అయితే ఎవరైనా కులచిత్రాలను నిర్మిస్తున్నట్లు తర్వాత చెబితే బాగా ఆలోచించి నిర్మించండి అని చెప్తానన్నారు. దాంతో చాలామంది తనపై ఆగ్రహించుకునేవారని చెప్పారు. అదేవిధంగా కరోనా కాలం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని, మంచి కథా చిత్రాలను యువత చూడడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కథ, కథనాలతో రూపొందిస్తే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా సక్సెస్ అవుతాయని తమ ఇరుగప్పట్రు చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. చదవండి: 'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం -
బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తమిళ మూవీ!
హీరో విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రద్ధ శ్రీనాథ్, అపర్ణతి, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్ దయాళ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్. ప్రభు తన పొటన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు. ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్గా 'జెర్సీ' బ్యూటీ
శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ నాని 'జెర్సీ' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 'విక్రమ్ వేద' మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేర్కొండ పార్వై' చిత్రంతో సత్తాచాటింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. తమిళంలో చేసిన కొత్త సినిమా 'ఇరుగపట్రు'. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, విధార్థ్, శ్రద్ధా శ్రీనాథ్, మహిమా నంబియార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత జనరేషన్ ఈగో సమస్యల కాన్సెప్ట్‌తోనే 'ఇరుగపట్రు' తీశారని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) -
ఏమవుతుంది?
ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కేఎస్ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె. రామ్‌చరణ్.