six killed
-
అమెరికాలో హెలికాప్టర్ కూలి... ఆరుగురి దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది. ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
ఆస్టిన్(అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. గతంలో జైలుకు వెళ్లొచి్చన 34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో నాలుగు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు అధికారులుసహా ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని కారులో వెంబడించి మరీ పోలీసులు అరెస్ట్‌చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడింటి దాకా ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. శాన్ ఆంటోనియో ప్రాంతంలో కాల్పులు జరిపాక 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో చోటా ఇతను కాల్పులకు తెగబడ్డాడు. ఎందుకు కాల్పులు జరిపాడు? మృతులతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇది 42వ కాల్పుల ఘటన. -
కూలిన చిన్న విమానం..10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్‌లో గురువారం చిన్న విమానం కూలిన ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. లంగ్క్వావి నుంచి సుబంగ్ విమానాశ్రయం వైపు వస్తున్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా విమానం పల్టీలు కొడుతూ రహదారిపై కుప్పకూలింది. రహదారిపై వెళ్తున్న బైక్, కారుపై పడటంతో విమానంలోని 8 మందితోపాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్‌బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్‌లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్‌లో ముగ్గురు... కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
ఇంగ్లండ్‌లో కాల్పుల మోత
లండన్: ఇంగ్లండ్‌లోని ప్లేమౌత్ నగరంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లేమౌత్‌లోని కేమాన్ అనే ప్రాంతంలో గురువారం సాయంత్రం దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు, జరిపి తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందారు. దుండగుడితో సహా మొత్తం ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశంలో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద కాల్పుల ఘటన అని పేర్కొన్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి సైతం ఉందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని జేక్ డెవీసన్(22)గా గుర్తించారు. -
ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్కో’
మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్ఎన్ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ తెలిపాయి. -
మహారాష్ట్ర కెమికల్ ఫాక్టరీలో ప్రమాదం
సాక్షి, ముంబై/పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లోని కెమికల్ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఆరుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండోర్ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్ అగర్వాల్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్‌తో పాటు పలువురు లిఫ్ట్ ఎక్కగా, ప్రమదవశాత్తూ లిఫ్ట్(ఎలివేటర్) తీగ తెగిపోవడంతో ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దాంతో వీరంతా కాంక్రీట్ గుంతలో పడిపోయారు. దుర్ఘటనలో పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పాలక్ (27), అల్లుడు పాల్కేశ్, మనవడు నవ్తో పాటు బంధువులు గౌరవ్, ఆర్యవీర్ ప్రాణాలు విడిచారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్ అగర్వాల్ భార్య నిధి అగర్వాల్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పునీత్ అగర్వాల్ దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. పాత్ ఇండియా సంస్థ ద్వారా వంతెనలు పర్యవేక్షణ, హైవే నిర్మాణాలు, టోల్ ఫ్లాజాల నిర్మాణాలతో పాటు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమైన రహదారి ప్రాజెక్ట్‌లను చేపట్టింది. -
ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్ అజీమ్ (8), అబ్దుల్ అహద్ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం
న్యూఢిల్లీ: భారత్‌లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆందోళనలతో అట్టుడికింది. నిరసనల సందర్భంగా యూపీలో శుక్రవారం ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ఐదుగా పేర్కొన్నారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌లో ఒక్కరు చొప్పున చనిపోయారని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. కాన్పూర్‌లోనూ ఒకరు చనిపోయినట్లు సమాచారం. పోలీసు కాల్పుల కారణంగా ఈ మరణాలు సంభవించాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆందోళనకారుల దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ఇప్పటివరకు ఆందోళనలు జరగని ప్రాంతాల్లోనూ శుక్రవారం భారీ స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్ నుంచి బులంద్‌షహర్ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగాయి. ఢిల్లీలో జాతీయ పతాకం చేతపట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదాలతో నిరసనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనకారులు తమది శాంతియుత నిరసన అని తెలిపేందుకు పోలీసులకు గులాబీ పూలను అందించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మంగళూరు, ఒకరు చనిపోయిన లక్నో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో.. సీఏఏపై, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్నార్సీపై సలహాలు, సూచనలను స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఢిల్లీలో.. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆందోళనకారులు కారును తగలబెట్టారు. ఢిల్లీగేట్ వద్ద రాళ్లు రువ్వడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. రోడ్లపై భారీగా బారికేడ్లను నిలిపినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసేసినప్పటికీ, నిషేధాజ్ఙలను ఉల్లంఘిస్తూ వేలాదిగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. జామా మసీదు, ఇండియా గేట్, సెంట్రల్ పార్క్‌ల వద్ధ భారీ స్థాయిలో గుమికూడారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భారీ ర్యాలీకి నేతృత్వం వహించారు. పోలీసులు డ్రోన్లతో ఆందోళనలపై నిఘా పెట్టారు. హోంమంత్రి అమిత్ షా నివాసం దగ్గరలో నిరసన తెలుపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళ కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భిన్నాభిప్రాయాన్ని పోలీసు బలంతో అణచేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. జాతీయ గీతంతో.. బనశంకరి: పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింపజేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై అందోళనలు చేయడానికి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ గురువారం కొన్ని సంఘాల నాయకులు టౌన్‌హాల్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడకు చేరుకున్న డీసీపీ చేతన్‌సింగ్‌రాథోడ్ మాట్లాడుతూ ‘నేను మీవాడిని అనుకుంటే నేను ఆలపించే జాతీయ గీతాన్ని ఆలకించాల’ని కోరారు. అనంతరం ఆయన జాతీయగీతం ఆలపించగా అందోళనకారులు గౌరవంగా లేచి నిల్చుని, ధర్నా విరమించారు. డీసీపీ చేతన్‌సింగ్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నేరవిభాగ ఐజీ హేమంత్ నింబాళ్కర్ ట్వీట్ చేశారు. మిత్రపక్షాల వేరు బాట జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని బిహార్‌లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జేడీయూ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరో మిత్రపక్షం ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ తీరును తప్పుబట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విషయంలో కేంద్రం విఫలౖ మెందన్నారు. ఎన్నార్సీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు వ్యతిరేకత తెలిపిన విషయం తెలిసిందే. యూపీలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గోరఖ్‌పూర్, సంభాల్, భదోహి, బహ్రెచ్, ఫరుఖాబాద్, బులంద్ షహర్, ఫిరోజ్‌బాద్‌లో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ యా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లక్నో, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్ సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ► మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్, పర్బాని జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్‌లో హిందువులే ఉండేలా మోదీ సర్కారు చట్టాలు తీసుకువస్తోందని ఆరోపించింది. ► కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో గురువారం ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కేరళలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ► అస్సాంలో ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినట్లు సీఎం శర్బానంద సోనోవాల్ తెలిపారు. మమత యూ టర్న్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని గురువారం డిమాండ్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట మార్చారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టం విషయంలో జోక్యం చేసుకుని, రద్దుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు విషయంలోనూ వెనక్కు తగ్గాలని కోరారు. డీసీపీ చేతన్ -
అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు. -
14 ఏళ్లు.. 6 హత్యలు
కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్‌ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్‌ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
బస్సును ఢీకొన్న కంటైనర్,ఆరుగురు మృతి
-
కూలిన ‘కసబ్’ బ్రిడ్జి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రద్దీగా ఉండగా కుప్పకూలిన వంతెన ముంబైలోని సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్ షిరాద్ ఖాన్(32), టి.సింగ్(35)గా గుర్తించారు. ఇంకొకరి వివరాలు తెల్సియాల్సి ఉంది. ముంబైలో ఇలాంటి ప్రమాదాలు కొత్తకాదు. 2017, సెప్టెంబర్ 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే పాదచారుల వంతెన కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. సీఎస్టీ మార్గంలో పాదచారుల బ్రిడ్జి కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ సందర్భంగా డీఎన్ రోడ్డు, జేజే ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించవద్దని వాహనదారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు సాగుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతులకు రూ.5 లక్షల పరిహారం.. ముంబై దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై బృహన్ ముంబై కార్పొరేషన్, రైల్వేశాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయన్నారు. కాపాడిన రెడ్ సిగ్నల్ కసబ్ బ్రిడ్జి దుర్ఘటనలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ భారీగా ప్రాణనష్టాన్ని నివారించింది. ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిపోవడానికి కొద్దినిమిషాల ముందు ఎరుపురంగు ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో సీఎస్టీ రైల్వేస్టేషన్ సమీపం నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. మరికాసేపట్లో సిగ్నల్ మారబోతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా బ్రిడ్జి కింద ఎవరూ లేకపోకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ విషయమై ఓ వాహనదారుడు మాట్లాడుతూ..‘రెడ్ సిగ్నల్ పడటంతో మేమంతా ఇళ్లకు వెళ్లేందుకు అసహనంగా ఎదురుచూస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగులోకి మారకముందే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఒకవేళ అప్పుడు వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. గురువారం ఉదయమే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారనీ, అంతలోనే రాకపోకలకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
పట్టాలు తప్పిన ‘సీమాంచల్’
సోన్పూర్(బిహార్): బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్ జిల్లా జోగ్బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్‌లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్‌పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్‌ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. -
ముంబై ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా 141 మందికి గాయాలయ్యాయి. ఎంఐడీసీ సమీపంలో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రి భవనం చివరి నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు శ్వాసించేందుకు ఇబ్బంది పడ్డారు. అప్పటికే కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో రోగులను, వారి సంబంధీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆరుగురు మరణించారు. వీరిలో ఒక రోగి ప్రాణభయంతో పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోగా మరొకరు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. -
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్ చేసే బాయిలర్ సేఫ్టీ వాల్వ్ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. -
ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం,ఆరుగురు మృతి
-
చెరువులో విద్యుత్ తీగ; 6 మంది మృతి
రూపొహి(అసోం): అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైరు చెరువులో తెగిపడటంతో 10 ఏళ్ల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నగాన్ జిల్లా ఉత్తర్ ఖాటూల్‌లో జరిగింది. గ్రామంలోని చెరువులో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగిపడటం గుర్తించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. తీగలో విద్యుత్ ప్రసారం లేదని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు. కానీ అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాన్ని ధ్వంసం చేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరంతా కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా అచ్చరపాక్కం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది. దీంతో లోపల ఉన్నవారు నీటిలో నుంచి బయటకు రాలేకపోయారు. కారులో మొత్తం ఎనిమిది మంది ఉండగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుదుకొట్టే జిల్లా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కారును చెరువులో నుంచి బయటకు తీయించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జడ్చర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరొకరు చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉదండాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం చెందిన విషయం విదితమే. కాగా, రహదారిపై అండర్ గ్రౌండ్ బిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. దీంతో హైవేపై ఎటు చూసినా కిలోమీటరు మేర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా ప్రమాద బాధితులంతా గంగాపూర్ గ్రామంలో పత్తి తీయటానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. మృతులను బాలమ్మ (66) లక్ష్మమ్మ (50) నాగమణి (30) రంగమ్మ (60)గా గుర్తించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది -
క్వెట్టాలో బాంబుపేలుడు, ఆరుగురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందగా.. 8 మంది గాయపడ్డారు. క్వెట్టా-సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్వెట్టాలో భద్రతాబలగాలపై దాడులు ఇటీవలికాలంలో ఎక్కువయిపోయాయి. ఆగస్టు 13న మిలటరీ వాహనం లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జూన్ 14న జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.