small cap
-
పేరుకు స్మాల్ క్యాప్..మిడ్ క్యాప్ సంస్థల్లో పెట్టుబడెందుకు?
స్మాల్ క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎందుకు కేటాయింపులు చేస్తుంటాయి? – వంశీ గౌడ్నిజానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే పెట్టేయవు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధమైనది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడుల పరంగా కొంత వెసులుబాటు కల్పించింది. స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 35 శాతాన్ని ఏ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలన్నది పూర్తిగా ఫండ్ మేనేజర్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా ఈ 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌లో ఏ విభాగానికి కేటాయించాలన్నది ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఆటుపోట్లు ఎక్కువ. లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అందుకని పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఇతర మార్కెట్ క్యాప్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్‌లను అధిగమించొచ్చు.28 స్మాల్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్‌ను గమనిస్తే.. అవి తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 82 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు, 13 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించాయి. కేవలం ఆరు పథకాలే మిడ్‌క్యాప్ కంపెనీలకు 15 శాతానికి మించి పెట్టుబడులు కేటాయించాయి. వాటి పనితీరు మిశ్రమంగా ఉంది. మూడు పథకాలు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250కి మించి పనితీరు చూపించాయి. మరో మూడు బెంచ్ మార్క్ పనితీరు స్థాయిలో రాబడులు అందించాయి. కేవలం జేఎం స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్‌క్యాప్, ఎస్బీఐ స్మాల్‌క్యాప్, డీఎస్పీ స్మాల్‌క్యాప్ పథకాలే 90 శాతానికి పైగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి అమలవుతున్న ఆరు మార్పులు ఇవే..నా వద్ద రూ.35 లక్షలు ఉన్నాయి. 8 నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏడు పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయాలన్నది నా యోచన. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్‌కు ఇది మంచి వ్యూహమే అవుతుందా? – జయదేవ్రూ.35 లక్షల పెట్టుబడులను 8–10 ఏళ్ల కాలానికి, వివిధ పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, ఏడు పథకాల పరిధిలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది పెద్దగా ఫలితం ఇవ్వదు. దీనికి బదులు మొత్తం పథకాల సంఖ్యను ఐదుకు తగ్గించుకోవడాన్ని పరిశీలించండి. అప్పుడు ఒక్కో పథకానికి 20 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. కొన్ని పథకాలపైనే దృష్టి సారించడం వల్ల వాటికి అర్థవంతంగా కేటాయింపులు చేసుకోవడానికి వీలుంటుంది. ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి పనితీరును ఎప్పటికప్పుడు సులభంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే సర్దుబాట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులను ఎక్కువ పథకాల మధ్య విస్తరించడం వల్ల అది సంతృప్తిని ఇవ్వొచ్చు. కానీ, విడిగా ఒక్కో పథకానికి తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యపడకపోవచ్చు. -
బలమైన రాబడుల చరిత్ర
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో రిస్క్ ఎక్కువ. కానీ, దీర్ఘకాలం పాటు (పదేళ్లు అంతకుమించి) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బలమైన రాబడులు సొంతం చేసుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక మధ్యలో మార్కెట్ల పతనంతో కలత చెందాల్సిన పని ఉండదు. అప్పుడు మీ పెట్టుబడితో ఎక్కువ యూనిట్లు సమకూరుతాయి. కేవలం దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారికే ఇవి అనుకూలం. స్వల్పకాలం కోసం ఇవి అనుకూలం కాదు. వీటిల్లో అస్థిరతులు, రిస్క్ ఎక్కువ. కనుక రాబడుల కోసం రిస్క్ తీసుకునే ధోరణి ఉన్న వారు తమ పోర్ట్‌ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.రాబడులునిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో రాబడి 50 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిని ఏడాదిలోనే 50 శాతం వృద్ధి చేసింది. మూడేళ్ల కాలంలోనూ ఏటా 32 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఐదేళ్లలో చూసుకుంటే ఏటా 38 శాతం, ఏడేళ్లలో 26 శాతం, పదేళ్లలో 25 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ పథకంలో డైరెక్ట్ ప్లాన్ 2013 జనవరిలో ప్రారంభమైంది. రెగ్యులర్ ప్లాన్ అయితే 2010లోనే మొదలైంది. రెగ్యులర్ ప్లాన్‌లోనూ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏటా 23 శాతం మేర రాబడి వచి్చంది. ఈ పథకంలో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం రూ.100 నుంచి (ఎస్‌డబ్ల్యూపీ) వెనక్కి తీసుకోవచ్చు.పెట్టుబడుల విధానం..స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. కానీ, పోర్ట్‌ఫోలియో చూస్తే అలా అనిపించదు. మొత్తం పెట్టుబడుల్లో 32 శాతమే స్మాల్‌క్యాప్‌లో కనిపిస్తాయి. రిస్క్‌ను తగ్గించడం కోసం ఫండ్ మేనేజర్లు ఈ విధానం అనుసరిస్తున్నారు. పైగా ఈ పథకం ఎంపిక చేసుకునే స్టాక్స్ అన్నీ దాదాపుగా భవిష్యత్తులో మిడ్, లార్జ్‌క్యాప్‌గా అవతరించే సామర్థ్యాలున్నవే. ఈ పథకం పెట్టుబడుల చరిత్రను గమనిస్తే ఇలాంటివి పదుల సంఖ్యలో కనిపిస్తాయి. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.61,000 కోట్లున్నాయి. ఇందులో 95.99 శాతం మేర ఈక్విటీలకు కేటాయించింది. మార్కెట్ల కరెక్షన్లో పెట్టుబడుల కోసం 4 శా తం నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 17 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లో 50.57 శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 32.56 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇండస్ట్రియల్స్ కంపెనీలకు అత్యధికంగా 25 శాతం కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 15 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 14.47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 13.74 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా?
రిటైల్ ఇన్వెస్టర్లకు చిన్న కంపెనీలంటే చెప్పలేనంత ఆకర్షణ. అందుకే నేరుగా స్టాక్స్‌లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల్లో అధిక రాబడులు వారిని ఆకట్టుకుంటున్నాయి. కానీ, పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్ పాళ్లు అధికం. ఈ రిస్‌్కను రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది పట్టించుకోవడం లేదు. ఫలితం మార్కెట్ దిద్దుబాట్లలో తప్పటడుగుల కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ రిస్క్‌ను ఇన్వెస్టర్లు అర్థం చేసుకునేందుకు తీసుకొచి్చందే స్ట్రెస్ టెస్ట్. గడిచిన మూడేళ్ల డేటాను గమనించినట్టయితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. ఒక్క 2023 సంత్సరంలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.23,000 కోట్లు వస్తే.. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్ పథకాలు రూ.41,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2022లోనూ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.20,500 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.19,795 కోట్ల చొప్పున వచ్చాయి. కానీ, అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ పథకాల నుంచి 2023లో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. మూడేళ్ల కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏటా 24 శాతం చొప్పున రాబడిని ఇవ్వగా, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏటా 22 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించాయి. ఈ స్థాయి రాబడిని చూసి ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులను ఈ పథకాల్లోకి కుమ్మరిస్తున్నారు. వచ్చే పెట్టుబడుల ప్రవాహానికి తగ్గట్టు ఫండ్స్ సంస్థలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఆ మేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కలసి స్టాక్స్ వ్యాల్యూషన్లు ఓ బుడగ మాదిరి తయారవుతున్నట్టు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆందోళన చెందింది. ఫలితంగా కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఉండే రిస్క్ నుంచి ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులను నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించి ‘స్ట్రెస్ టెస్ట్’ నిర్వహించాలని ఫండ్స్ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం అవసరం. ఏమిటీ ఈ స్ట్రెస్ టెస్ట్? పైకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించకపోవచ్చు. మరి అనూహ్యంగా హార్ట్ ఎటాక్‌తో చిన్న వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నట్టు? గుండె సామర్థ్యాన్ని, సమీప కాలంలో వచ్చే ముప్పును తెలుసుకునేందుకు వైద్యులు థ్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) నిర్వహిస్తుంటారు. మెషిన్‌పై శ్రమతో నడస్తున్న సమయంలో గుండె స్పందనలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా భవిష్యత్ రిస్‌్కలను వైద్యులు అంచనా వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన స్ట్రెస్ టెస్ట్ కూడా ఇదే మాదిరి అనుకోవచ్చు. 2020 కరోనా సమయంలో స్టాక్ మారెŠక్ క్రాష్ గుర్తుండే ఉంటుంది. ఈ తరహా పతనాల్లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ నిర్వహణలోని పెట్టుబడుల (ఏయూఎం)ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి? రిస్‌్కను ఎలా ఎదుర్కొంటాయి? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడగలవు? ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తిరిగిచ్చే సామర్థ్యం ఫండ్స్ సంస్థలకు ఉంటుందా? ఇత్యాది అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ ఉపకరిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇది కొత్తగా విని ఉండొచ్చేమో..! కానీ ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంక్‌లకు సంబంధించి లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్‌ను నిర్వహిస్తుంటుంది. బ్యాంకుల్లో నగదు లభ్యత ఎలా ఉంది? కొరతను ఎదుర్కొంటున్నాయా? అన్నది ఆర్బీఐ మదింపు చేస్తుంటుంది. దీని అవసరం..? బాండ్ల మార్కెట్లలో మాదిరే ప్రతికూల సమయాల్లో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాలకు సంబంధించి కూడా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంటుంది. ఒక మోస్తరు ఆస్తులను (పెట్టుబడులు/ఏయూఎం) నిర్వహిస్తున్నంత వరకు ఈ లిక్విడిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కు పెద్ద సమస్య కాబోదు. కానీ, గడిచిన ఏడాది రెండేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాల్లోకి వస్తున్న భారీ పెట్టుబడులు లిక్విడిటీ పరంగా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి నాటికి అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణలోని ఏయూఎం రూ.2.49 లక్షల కోట్లకు చేరితే, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం రూ.2.95 లక్షల కోట్లకు చేరుకోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ విభాగాల్లోని పెద్ద పథకాలు ఒక్కో దాని నిర్వహణలోని ఆస్తులు రూ.25,000–60,000 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.60,000 కోట్ల ఆస్తులు నిర్వహించే పథకం ఒక శాతం (రూ.600 కోట్లు) మేర స్టాక్స్‌ను విక్రయించినా దాన్ని మార్కెట్ సర్దుబాటు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో (తక్కువ వ్యాల్యూమ్ ట్రేడ్ అయ్యేవి) ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. కొద్ది అమ్మకాలకే స్టాక్ ధరలు నేలచూపులు చూస్తాయి. దీంతో ఆయా పథకాల యూనిట్ నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) అదే స్థాయిలో పడిపోతుంది. స్ట్రెస్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? పథకాల పోర్ట్‌ఫోలియోలో 50, 25 శాతం మేర స్టాక్స్‌ను విక్రయించేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మేనేజర్లు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తమ స్టాక్స్‌కు సంబంధించి గడిచిన మూడు నెలల్లో సగటు ట్రేడింగ్ వ్యాల్యూమ్ను పరిశీలిస్తారు. లిక్విడిటీ (వ్యాల్యూ మ్) చాలా తక్కువగా ఉన్న దిగువ స్థాయి 20 శాతం స్టాక్స్‌ను మినహాయిస్తారు. మిగిలిన స్టాక్స్ వాల్యూమ్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో ఏ మేరకు పెరుగుతుందన్నది ఊహాత్మక గణాంకాల ఆధారంగా అంచనా వేస్తా రు. ఈ గణాంకాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ (హోల్డింగ్స్)ను ఎన్ని రోజుల్లో విక్రయించగలమనే అంచనాకు వస్తాయి. ఒక పథకం తన పెట్టబడుల్లో 25 శాతాన్ని, 50 శాతాన్ని ఎన్ని రోజుల్లో విక్రయించగలదన్నది దీని ద్వారా తెలుస్తుంది. సెబీ ఆదేశాల ప్రకారం ఫండ్స్ ప్రతి నెలా ఈ విధమైన స్ట్రెస్ టెస్ట్ నిర్వహించి, ఫలితాలను తర్వాతి 15 రోజుల్లోపు ఆన్లైన్ పోర్టల్‌పై వెల్లడించాలి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టిన టాప్–10 ఇన్వెస్టర్ల వివరాలను కూడా ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. వర్రీ అక్కర్లేదు.. ఒక పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 60 రోజుల సమయం పడుతుందని వెల్లడించిన సందర్భాల్లో.. ఇన్వెస్టర్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు ఒకే సారి ఎక్కువ మొత్తంలో వస్తే ఆమోదిస్తుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు అన్నీ కూడా వాస్తవంగా మార్కెట్లో విక్రయించి, వెల్లడించిన డేటా కాదు. మార్కెట్ పతనాల్లో ఎన్ని రోజుల్లో విక్రయించగలమో ఊహాత్మకంగా వేసిన అంచనాలే. ఆయా సమయంలో ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్‌్కల గురించి తెలుసుకునేందుకు ఈ డేటా ఇన్వెస్టర్లకు సాయంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల్లో 25 శాతం నుంచి 50 శాతం మేర ఉపసంహరణ ఒత్తిళ్లు రావడం అన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు 10 శాతం మించవు. దీనికంటే కూడా మార్కెట్లు పడడం మొదలైన తర్వాత ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కానీ అప్పటికే చేసిన ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అరుదు. నష్టభయమే దీనికి కారణం. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లిక్విడిటీ రిస్క్ విషయంలో తగిన సన్నద్దంగానే ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్ అయినా, మిడ్‌క్యాప్ అయినా పెట్టుబడుల్లో 35 శాతం వరకు తీసుకెళ్లి లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎదురైతే ముందుగా లార్జ్‌క్యాప్ పెట్టుబడులనే నగదుగా మార్చుకుంటాయి. దీనికి తోడు పథకంలో కొంత మేర నగదు నిల్వలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా పథకం మొత్తం పెట్టుబడుల విలువలో 20 శాతం మేర రుణం తీసుకుని స్వల్పకాల అమ్మకాల ఒత్తిడిని అధిగమించేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. విశ్లేషణకు కీలక డేటా స్ట్రెస్ టెస్ట్ డేటాతో ఇన్వెస్టర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన పథకాల్లో ఉండే రిస్క్ ఎంతన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు నగదుగా మార్చుకుంటున్నారన్నది ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు విడుదలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఒక్కసారి తప్పకుండా గమనించాలి. స్మాల్‌క్యాప్ పథకాలు తమ పెట్టుబడుల్లో 50 శాతాన్ని విక్రయించి నగదుగా మార్చుకునేందుకు సగటున 22 నుంచి 60 రోజులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే 25 శాతం పెట్టుబడులను విక్రయించేందుకు 11–30 రోజుల సమయం పడుతోంది. మొత్తం ఒకే రోజు విక్రయించేందుకు ఇక్కడ అవకాశాలు పరిమితం. ఎందుకంటే ఆయా స్టాక్స్‌లో లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) చాలా తక్కువగా ఉంటుందన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల వద్ద నగదు నిల్వలు 4.5 శాతం నుంచి 11 శాతం మధ్య ఉన్నాయి. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి ఎదురైతే తొలుత ఈ నగదు నిల్వలతో ఫండ్స్ గట్టెక్కగలవు. అప్పటికీ రిడెంప్షన్ (ఉపసంహరణ) ఒత్తిడి ఆగకపోతే పెట్టుబడులను విక్రయించాల్సి వస్తుంది. ఆయా పథకంలో కేవలం కొద్ది మంది ఇన్వెస్టర్లే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉన్నారా? లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పథకం నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనుకుందాం. కేవలం ఐదు, పది మంది ఇన్వెస్టర్లకు సంబంధించే రూ.500 కోట్ల పెట్టుబడులు ఉంటే, అది రిస్‌్కకు దారితీస్తుంది. ఆ స్థాయిలో పెట్టుబడులు కలిగి ఉన్నవారు స్మార్ట్ ఇన్వెస్టర్ల కిందకే వస్తారు. మార్కెట్ పతనం మొదలైన వెంటనే, ముందుగా వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయతి్నస్తే పథకం ఎన్ఏవీ దారుణంగా పడిపోతుంది. ఇది మిగిలిన ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను గణనీ యంగా ప్రభావితం చేస్తుంది. అయితే, తాజా స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను గమనిస్తే ఈ రిస్క్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. ఒక పథకం పెట్టుబడుల విలు వలలో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించి పెట్టుబడుల విలువ 0.61–2.1 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీలకు సైతం చెప్పుకోతగ్గ మేర కేటాయింపులు చేసిన పథకాల్లో లిక్విడిటీ రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌లో లిక్విడిటీ సమస్య ఉండదు. కావాలంటే ఒకే రోజు మొత్తం పెట్టుబడులను విక్రయించుకోగలవు. ఇక స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ మెరుగ్గా ఉంది. స్మాల్‌క్యాప్ పథకాలతో పోలిస్తే సగం వ్యవధిలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడులను విక్రయించుకోగలవని స్ట్రెస్ టెస్ట్ డేటా తెలియజేస్తోంది. కాకపోతే మిడ్‌క్యాప్ పథకాల్లో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించిన పెట్టుబడులు 1.3–4.9 శాతం మధ్య ఉన్నాయి. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నట్టు. అవసరమైతే డేటా విశ్లేషణకు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. సంక్షోభాల్లో ఎలా..? తీవ్ర ప్రపంచ ప్రతికూల పరిణామాల్లో మార్కెట్లు కుప్పకూలితే, ఫండ్స్ పథకాలు లిక్విడిటీ రిస్‌్కను గట్టెక్కుతాయా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఫలితాలు ఇలానే ఉండాలని లేదు. అప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారు..? ప్రతికూల పరిణామాలు స్వల్ప కాలమా? లేక దీర్ఘకాలమా? తదితర అంశాలు అప్పటి వాస్తవ లిక్విడిటీ రిస్‌్కను ప్రభావితం చేస్తాయి. ఎలాంటి ప్రతికూల పరిణామాలు అయినా సరే తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరితే.. ఫండ్స్ సంస్థలు తప్పకుండా అనుసరించాల్సిందే. నష్టానికి అయినా అవి అమ్మి చెల్లింపులు చేస్తాయి. మార్గం ఏంటి? స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సంకేతం కాదు. రిస్‌్కలను అర్థం చేసుకోలేని వారు, ఎన్ఏవీలు గణనీయంగా పడిపోయినప్పుడు ఓపిక పట్టలేని వారు ఈ తరహా పెట్టబడులను తగ్గించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను స్వల్పకాలిక ఆటుపోట్లను చూసి విక్రయించుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అంత రిస్క్ వద్దనుకుంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఒకేసారి ఒక పథకం నుంచి 25–50 శాతం పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం సాధారణంగా జరగదు. కనుక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవీ ఉదాహరణలు ► రూ.46,000 కోట్ల పెట్టుబడులను నిర్వహించే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్.. తన పెట్టుబడుల్లో 50 శాతాన్ని నగదుగా మార్చుకునేందుకు 27 రోజులు, 25 శాతం పెట్టుబడుల విక్రయానికి 13 రోజులు పడుతుందని స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ► రూ.17,193 కోట్ల పెట్టుబడులను నిర్వహించే క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ తన పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 22 రోజులు, 25 శాతాన్ని విక్రయించేందుకు 11 రోజులు తీసుకుంటుందని తెలిపింది. ► రూ.25,500 కోట్లు నిర్వహించే ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ 50 శాతం పెట్టుబడుల విక్రయానికి 60 రోజులు పడుతుందని వెల్లడించింది. ► క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ 100% పెట్టుబడుల విక్రయానికి 10 రోజులు, 25% పెట్టుబడుల అమ్మకానికి 5 రోజులు చాలని ప్రకటించింది. ► అదే యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ 50 % పెట్టుబడులను 12 రోజుల్లో, 25% పెట్టుబడులను 6 రోజుల్లో నగదుగా మార్చుకోగలనని పేర్కొంది. -
ఘనమైన రాబడుల చరిత్ర
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ చాలా ఎక్కువ. కనుక స్వల్ప కాల పెట్టుబడులకు ఇవి అనుకూలంగా ఉండవు. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచి్చపెడతాయి. ఉదాహరణకు పదేళ్ల కాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాన్ని ఎంచుకుని ప్రతీ నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుందాం. పదేళ్లకు మీ పెట్టుబడులను తీసుకునే సమయంలో మార్కెట్లు ఏదేనీ కారణంతో భారీగా పతనం అయితే.. అప్పుడు పెట్టుబడులను మరో ఏడాది రెండేళ్ల పాటు కొనసాగించే వెసులుబాటు ఉన్న వారే ఈ పథకాల వైపు చూడాలి. ఎందుకంటే మార్కెట్ల కరెక్షన్లలో ఎక్కువగా నష్టపోయేవి స్మాల్‌క్యాప్ స్టాక్స్. ఆ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే రాబడులను పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వస్తుంది. ప్రతీ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి కొంత మొత్తాన్ని స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ (గతంలో రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్) పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులు ఉన్నాయంటే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ల కాలంలో ఏటా 32 శాతం రాబడిని తెచి్చపెట్టింది. అదే ఐదేళ్లలో ఏటా 29 శాతం, ఏడేళ్లలో 23.6 శాతం, పదేళ్లలో 28 శాతం చొప్పున రాబడులు అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐ సూచీ రాబడితో పోలిస్తే ఈ పథకమే ఎంతో మెరుగ్గా ఉండడాన్ని గమనించొచ్చు. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చినప్పుడు వివిధ కాలాల్లో గరిష్టంగా 10 శాతం వరకు అధిక రాబడులను అందించింది. స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూసినా సరే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకంలోనే 8 శాతం వరకు అధిక రాబడి ఉంది. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో స్మాల్‌క్యాప్ పథకం అయినప్పటికీ పెట్టుబడుల్లో స్మాల్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు వెయిటేజీ ఇవ్వడాన్ని గమనించొచ్చు. భవిష్యత్తులో మలీ్టబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారినవి ఉన్నాయి. అందుకే మిడ్‌క్యాప్‌లోనూ గణనీయంగా పెట్టుబడులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,044 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. స్మాల్ క్యాప్ పథకం అయినప్పటికీ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 37 శాతం పెట్టుబడులే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలలో 44 శాతం, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 19 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో 202 స్టాక్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ పథకం కావడం, భారీ పెట్టుబడుల నిర్వహణ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 18.79 శాతం ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 12.42 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏది బెటర్..?
స్మాల్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చేయడం మంచిదా? – వరుణ్ మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అది పేరుకు మిడ్‌క్యాప్ అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉంటుంది. పేరుకు మిడ్‌క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, పోర్ట్‌ఫోలియోలని చాలా కంపెనీలు భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌గా మారే అవకాశాలు ఉంటాయి. నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – శివ్ గణేశన్ మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను విక్రయించినప్పుడు కూడా నమోదయ్యే లాభంపై ఇంతే మేర పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి. నాణ్యమైన డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. -
ఇందులో పెట్టుబడులు పెడితే..‘గుండె మీద చెయ్యేసుకుని బతకొచ్చు’!
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులు కూడా మెరుగ్గా ఉంటాయి. అస్థిరతలు చూసి చలించకుండా, సహనంతో ఉండే వారికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు అందిస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక పిల్లల వివాహం, ఉన్నత విద్య, రిటైర్మెంట్ తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తమ పోర్ట్‌ఫోలియోలో తప్పకుండా చోటు కల్పించుకోవడం ఎంతైనా అవసరం. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం దీర్ఘకాలంలో మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. రాబడులు ఏడాది, మూడేళ్ల కాలంలో సూచీలతో పోలిస్తే రాబడుల విషయంలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ వెనుక బడింది. కానీ, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సూచీలకు మించి అధిక రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం ఇన్వెస్టర్లకు 37 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 25 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలో 26 శాతం, ఏడేళ్లలో 21 శాతం, పదేళ్ల కాలంలో 27 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్‌క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల్లో 65 శాతం వరకు స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంటుంది. అయితే, అన్ని సమయాల్లోనూ స్మాల్‌క్యాప్ కంపెనీలకు ఇదే స్థాయిలో కేటాయింపులు చేయదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు మరీ ఖరీదుగా మారాయని భావించినప్పుడు, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌నకు కేటాయింపులు పెంచుతుంది. అలాగే, డెట్‌కు కూడా కొంత కేటాయిస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.24,862 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జనవరి చివరికి 93.13 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 6.87 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించినట్టయితే, 59.23 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 40.77 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ, ప్రస్తుతం అధిక భాగం పెట్టుబడులు మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆయా స్మాల్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరుతో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ పెట్టుబడులు మిడ్‌క్యాప్‌లో కనిపిస్తున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 55 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్‌లోనూ పెట్టుబడులు 28 శాతం మించలేదు. అంటే ఈ పథకంలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోంది. సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 18 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీలకు 12 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 12 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 9.49 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
పెట్టుబడుల వరద, స్మాల్‌క్యాప్ వైపు ఇన్వెస్టర్ల చూపు.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ పథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ పథకాలు నికరంగా రూ.11,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. లార్జ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడుల విషయంలో ఫండ్ మేనేజర్లు సవాళ్లను ఎదుర్కొంటుండడంతో, ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా. లార్జ్‌క్యాప్ పథకాలు జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కేవలం రూ.3,360 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.6,932 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘గడిచిన కొన్ని నెలలుగా మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బలమైన ర్యాలీ చేస్తున్నాయి. దీంతో లార్జ్‌క్యాప్ విభాగంలో ఆల్ఫా నమోదు చేయడం అన్నది చాలా కష్టమైన పనే అవుతుంది. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి భారీ పెట్టుబడులు రావడానికి ఇదే కారణం’’అని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ తెలిపారు. అసాధారణం.. స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు వస్తుండడంతో, ఫండ్ మేనేజర్లు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్, టాటా స్మాల్‌క్యాప్ పథకాలు లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయి. కేవలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులనే అనుమతిస్తున్నాయి. భారీ పెట్టుబడులను సర్దుబాటు చేసేంత లిక్విడిటీ స్మాల్‌క్యాప్ విభాగంలో ఉండదు. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఫండ్ మేనేజర్లు ఈ వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘ఇటీవలి నెలల్లో స్మాల్‌క్యాప్ స్టాక్స్ పనితీరు ఎంతో అసాధారణంగా ఉంది. లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల మధ్య వ్యాల్యూషన్ పరంగా ఉన్న అంతరమే దీనికి కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల వ్యాల్యూషన్ ఖరీదుగా మారినప్పుడు ఇలాంటి ధోరణి కనిపించడం సహజమే. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్టాక్స్ కోసం అన్వేషిస్తుంటారు’’అని ఏయూఎం క్యాపిటల్ మార్కెట్ వెల్త్ హెడ్ ముకేశ్ కొచ్చర్ తెలిపారు. మిడ్‌క్యాప్ స్థాయి రిస్క్‌తో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు మొగ్గు చూపిస్తున్నట్టు ఆనంద్ రాథి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారీ రాబడులు మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్ విభాగం భారీ రాబడులు ఇస్తుండడం కూడా ఈ విభాగం వైపు ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇవి 30–37 శాతం, మూడేళ్ల కాలంలో 40–44 శాతం, ఐదేళ్లలో 18–21 శాతం చొప్పున వార్షిక కాంపౌండెడ్ వృద్ధితో రాబడులు అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ చివరికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ అన్నింటి నిర్వహణలోని ఆస్తులు మార్చి నుంచి చూస్తే 28 శాతం వృద్ధితో రూ.1.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పథకాలు ఆటో, ఆటో విడిభాగాలు, క్యాపిటల్ గూడ్స, ఐటీ కంపెనీలకు పెట్టుబడుల పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి గరిష్టంగా 30 శాతం వరకే కేటాయించుకుని, 50 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం మంచిదని అజీజ్ సూచించారు. -
జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇదే..
ముంబై: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా యులిప్స్ విభాగంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. జీవిత బీమా రంగంలో ఇదే తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ మిహిర్ వోరా తెలిపారు. పదేళ్ల వ్యవధిలో 22 శాతం రాబడి అందించిన నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 క్వాలిటీ 50 సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. యూనిట్‌కు రూ. 10 చొప్పున ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25 వరకు అందుబాటులో ఉంటుంది. అధిక రిస్కు సామరŠాధ్యలు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వోరా వివరించారు. -
స్మాల్ క్యాప్ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున ఎస్ఎంఎస్లు పంపిణీ చేయడం ద్వారా ఐదు స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో మ్యానిపులేషన్‌కు పాల్పడినందుకు 135 సంస్థలపై సెబీ చర్యలు తీసుకుంది. అడ్డంగా సంపాదించినందుకు రూ.126 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, 7ఎన్ఆర్ రిటైల్ లిమిటెడ్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ లిమిటెడ్, జీబీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విషాల్ ఫ్యాబ్రిక్స్ షేర్లను కొనుగోలు చేయాలంటూ ఆయా సంస్థలు ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపించినట్టు సెబీ గుర్తించింది. మూడు పెద్ద బృందాలు కలసికట్టుగా ఈ ముందస్తు పథకాన్ని నడిపించినట్టు పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా ముందు ఆయా షేర్ల ధరలను పెంచుతూ వెళ్లారు. మానిపులేటివ్ ట్రేడ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. షేరు ధర పెరుగుతుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంది. ధరలను పెంచిన తర్వాత బై కాల్స్ ను ప్రసారం చేశారు. హనీఫ్ షేక్ అనే వ్యక్తి సూత్రధారిగా దీన్ని నడిపించాడు. బై కాల్స్ చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు రావడంతో వీరు తమవద్దనున్న షేర్లను అధిక ధరల వద్ద అమ్ముకుని బయటపడ్డారు. తద్వారా భారీ లాభాలను ఆర్జించారు’’అని సెబీ పేర్కొంది. -
మెటల్, ఆటో షేర్లకు డిమాండ్
ముంబై: మెటల్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్పలాభపడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 173 పాయింట్ల పెరిగి 62,602 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 18,551 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సెషన్లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసి రావడంతో తిరిగి లాభాల బాటపట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 340 పాయింట్ల పరిధిలో 62,380 వద్ద కనిష్టాన్ని, 62,720 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,478 – 18,574 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి సెన్సెక్స్ 119 పాయింట్లు బలపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీ లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, వినిమయ, ఇంధన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దేశీయంగా మే నెల ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్టీ ఆదాయ వృద్ధి, తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ 31 నెలల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. -
దీర్ఘకాలంలో అధిక రాబడులకు మార్గం
గడిచిన ఏడాదిన్నర కాలంలో మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు చాలా వరకు దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో దీర్ఘకాల పెట్టుబడి అవకాశాల దృష్ట్యా ఇవి ఆకర్షణీయంగా మారాయి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ సమయంలో ఆయా విభాగాలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను పరిశీలించొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకం ఒక మంచి ఎంపిక అవుతుంది. మార్కెట్ ర్యాలీల్లో మంచి పనితీరును చూపించడమే కాకుండా, మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడం ఈ పథకం పనితీరు ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇందుకు నిదర్శనం గత ఏడాది కాలంలో ఇదే విభాగంలోని ఇతర పథకాలు, బెంచ్ మార్క్ సూచీతో పోలిస్తే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకం మెరుగైన రాబడులు ఇచ్చింది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 16 శాతం రాబడులు ఇచ్చింది. బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చి చూసినా, లేదా స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చినా నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ పథకమే ఎక్కువ ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 47 శాతంగా ఉంది. ఐదేళ్లలో చూసినా 16%, ఏడేళ్లలో 21%, పదేళ్లలో 26 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. సూచీతో పోల్చినా, స్మాల్‌క్యాప్ విభాగంతో పోల్చినా ఈ పథకమే 5–6% అదనపు రాబడిని వార్షికంగా అందిస్తోంది. కనీసం ఐదేళ్లు, అంతకు మించి కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సిప్ మార్గంలో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవడాన్ని పరిశీలించొచ్చు. పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పాటిస్తుంటుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 169 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకంలో 26వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆస్తులు ఉండడంతోపాటు విడిగా ఒక్కో స్టాక్ వారీగా పెట్టుబడులను పరిమితం చేయడం వల్ల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ కనిపిస్తున్నాయి. అన్ని రకాల మార్కెట్ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఏదో ఒక రంగానికి ఎక్కువగా కేటాయింపులు చేయదు. ప్రస్తుతం ఈక్విటీల్లో 96.79 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంది. పెట్టుబడుల్లో 16 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 36 శాతం పెట్టుబడులు ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకం కదా, మిడ్‌క్యాప్‌లో అన్నేసి పెట్టుబడులు ఎందుకు ఉన్నాయనే సందేహం రావచ్చు..? ఈ పథకం మల్టీబ్యాగర్ల వృద్ధిని చూసే సామర్థ్యాలనున్న చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీంతో అవి మిడ్, లార్జ్ కంపెనీలుగా దీర్ఘకాలంలో అవతరిస్తుంటాయి. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 48 శాతం పెట్టుబడులు ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అత్యధికంగా 17 శాతం కేటాయించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13 శాతం కేటాయించగా, కెమికల్స్ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు ఉన్నాయి. -
ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్.. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్ దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్‌డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్‌ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి. మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్‌క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి. -
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని అనుకుంటున్నారా?
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే వాటి షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వ్యాల్యూఫండ్స్ను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి దీర్ఘకాలంలోనే మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. గ్రోత్ ఇన్వెస్టింగ్ అయితే స్వల్పకాలంలోనే లాభాలకు అవకాశం ఉంటుంది. కానీ, వ్యాల్యూ ఫండ్స్‌లో స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను ఆశించడం సమంజసం కాదు. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 3 శాతంగా ఉన్నాయి. ప్రధాన సూచీల రాబడులు సైతం ఇదే స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 11 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,749 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఏడేళ్ల కాలంలో 16 శాతం, పదేళ్లలో 14.53 శాతం చొప్పున ఈ పథకం ఏటా రాబడిని తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. ముఖ్యంగా లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 12 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 72 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 20 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 78 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగ కంపెనీలకు 9.59 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 9 శాతం, ఇంధన కంపెనీలకు 8 శాతం కేటాయింపులు చేసింది. -
స్మాల్‌క్యాప్ విభాగంలో రాబడులు ఇచ్చే పథకాల్లో ఇది ఒకటి
మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక రాబడులు కోరుకునే వారికి స్మాల్‌క్యాప్ పథకాలు అనుకూలం. దీర్ఘకాలం పాటు, అంటే కనీసం పదేళ్లు అంతకుమించిన లక్ష్యాలకు ఈ పథకాలు మంచి రాబడులను అందిస్తాయనడంలో సందేహం లేదు. అందుకు అందుబాటులోని గణాంకాలే నిదర్శనం. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇవి చిన్నవి కనుక ఆర్థిక సంక్షోభాలు, ఆయా రంగాల్లో వచ్చే ప్రతికూలతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యం సమర్థతలు చిన్న కంపెనీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆ తర్వాత అవి పనిచేసే రంగం, ఆయా రంగంలో కంపెనీ స్థానం ఇత్యాది ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది. సాధారణ ఇన్వెస్టర్లకు ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం కష్టమైన పని. అందుకుని చిన్న కంపెనీల కోసం ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను నమ్ముకోవడమే పెట్టుబడులకు అధిక రాబడితోపాటు తగినంత రక్షణిస్తుంది. స్మాల్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో టాటా స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు 2018 నవంబర్ 12న ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 30.65 శాతంగా ఉంది. ఏడాది కాల రాబడి చూస్తే 13 శాతంగా ఉంది. కానీ ఏడాది కాల రాబడి బీఎఎస్ఈ 250 స్మాల్‌క్యాప్‌లో 6 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్ పథకాల సగటు రాబడి చూసినా కానీ, 6 శాతమే ఉంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 రాబడి కూడా 4.50 శాతమే ఉంది. ఫండ్ మేనేజర్ చంద్రప్రకాష్ పడియార్కు 21 ఏళ్ల అనుభవం ఉంటే, సహాయక ఫండ్ మేనేజర్ సతీష్ చంద్ర మిశ్రాకు సైతం 15 ఏళ్ల అనుభవం ఉంది. టాటా స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. రూ.4.8 లక్షల పెట్టుబడి కాస్తా, రాబడి కలుపుకుని రూ.8.39 లక్షలు అయి ఉండేది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం అనే ప్రధాన ధ్యేయంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2,664 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 87.55 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. 0.54 శాతాన్ని రియల్ ఎస్టేట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టగా, మిగిలిన మేర నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.32 శాతమే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 3.76 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీల్లో రూ.28.92 శాతం పెట్టబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 43 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 17 శాతం పెట్టుబడులు వీటికే కేటాయించింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13.60 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకంలో మొదటి సారి అయితే కనీసం రూ.5,000, సిప్ రూపంలో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. చదవండి ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిమిత ఆఫర్.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం! -
ఈ స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు
స్మాల్‌క్యాప్ అంటే అధిక రిస్క్, అధిక రాబడులతో కూడిన విభాగం. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌తో పోలిస్తే అస్థిరతలు ఎక్కువ. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, మార్కెట్ కల్లోలాల్లో ఈ విభాగంలో ఎక్కువ నష్టాలు ఎదురవుతుంటాయి. చిన్న కంపెనీలు లిక్విడిటీ తక్కువతో ఉంటాయి. కనుక, కొంచెం అమ్మకాల ఒత్తిడికే స్టాక్స్ ధరలు ఎక్కువగా నష్టపోతుంటాయి. అందుకని ఈ విభాగంలో దీర్ఘకాలానికి మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెట్టడం, అస్థిరతల సమయాల్లో ఆ పెట్టుబడులను ధైర్యంగా కొనసాగించడం కేవలం నిపుణులైన ఫండ్ మేనేజర్లకే సాధ్యపడుతుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు పెట్టుబడిదారులకు మంచి రాబడులను తెచ్చి పెట్టడంలో ఈ పథకం అన్ని కాలాల్లోనూ ముందుంటోంది. ఇతర పథకాలతో, స్మాల్‌క్యాప్ సూచీ, విభాగంతో పోల్చినా మెరుగైన ప్రతఫలాన్నిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడినిచ్చింది. కానీ, ఇదే కాలంలో బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐ, ఈక్విటీ స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడి 1.5 శాతంలోపే ఉండడాన్ని ఇన్వెస్టర్లు విస్మరించరాదు. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 35 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. దీన్ని అద్భుత రాబడిగానే చూడొచ్చు. ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో 16.43 శాతం, ఏడేళ్లలో 19.38 శాతం, పదేళ్లలో 24.44 శాతం చొప్పున వార్షిక రాబడిని తీసుకొచ్చింది. గడిచన పదేళ్లలో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 250 సూచీ రాబడి ఏటా 13 శాతంగా ఉంటే, స్మాల్‌క్యాప్ విభాగం సగటు వార్షిక రాబడి 18 శాతంగా ఉండడం గమనార్హం. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తను పాటిస్తుంటుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 159 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. అన్ని రకాల మార్కెట్ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఏదో ఒక రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టే విధానానికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను గమనిస్తే.. క్యాపిటల్ గూడ్స్‌లో 15 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 12.53 శాతం, కెమికల్స్ 11 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 9 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.22,844 కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటే.. ఈ పథకం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.62 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 17 శాతాన్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. 34 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌నకు కేటాయించగా, 49 శాతం పెట్టుబడులు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఉన్నాయి. -
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి..
స్మాల్‌క్యాప్ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. కనుక ఒకటికి మించిన స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు చేసుకోవచ్చా? ఎందుకంటే అసెస్మెట్ మేనేజ్మెంట్ కంపెనీలన్నవి ఒక్కోటీ వేర్వేరు వెలుగు చూడని జెమ్స్ లాంటి కంపెనీలను గర్తించొచ్చు కదా..? – యోగేష్ పెట్టుబడులన్నవి ఎల్లప్పుడూ చాలా సులభంగా ఉండాలి. మేము అనుసరించే సూత్రం ఇదే. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించొచ్చా? అన్నది ప్రశ్న. పూర్తి స్థాయి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి వివిధ మార్కెట్ క్యాప్ సైజుల నుంచి నాలుగు లేదా ఐదు పథకాలను సూచిస్తుంటాం. చిన్న పోర్ట్‌ఫోలియో అయితే ఒక్కో కేటగిరీ నుంచి ఒక పథకాన్ని కలిగి ఉండొచ్చు. పెద్ద పోర్ట్‌ఫోలియో అయితే ఒకే విభాగం నుంచి రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు పథకాల మధ్య వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని గమనించి, ఆయా పథకాల పట్ల నమ్మకం ఏర్పడితే రెండు స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఇలా రెండు పథకాలను ఎంపిక చేసుకున్నప్పుడు వాటి పెట్టుబడుల పరంగా ఏకరూపత (ఒకే స్టాక్స్) 50% మించి ఉండకూడదు. ఏకరూపత అంటే రెండు స్మాల్‌క్యాప్ పథకాలు అవే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం. ఇంతకుమించితే పోర్ట్‌ఫోలియోకు రిస్క్ పెరుగుతుంది. ఈ రిస్క్‌ను వైవిధ్యం చేసుకునేందుకు.. వేర్వేరు పెట్టుబడుల విధానంతో కూడిన వేర్వేరు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సంబంధించి రెండు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ఏకరూపత రిస్క్ తగ్గుతుంది. మొత్తంపెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి 20% మించకుండా చూసుకోవాలి. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న మార్గాలు ఏంటి? విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ రాబడి కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బ ణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్! -
చిన్న కంపెనీలు అనుకూలమేనా?
స్మాల్‌క్యాప్ ఫండ్స్ దీర్ఘకాలం పెట్టుబడులకు (రిటైర్మెంట్) అనుకూలమేనా? – వర్షిల్ గుప్తా స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందకుండా ఉండడం కష్టం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులుగా పెట్టరాదు. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ పెద్దది, ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది. అనుకూలతలు దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మరీ చిన్న కంపెనీలకు దూరంగా ఉంటాయి. ప్రతికూలతలు ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్‌గా ఉండేవి తక్కువే. డెట్, ఈక్విటీల మధ్య అస్సెట్ (పెట్టుబడులు) అలోకేషన్ పరంగా ఏ విభాగం డెట్ ఫండ్స్ అనుకూలం? – ఎస్కే శర్మ ఫైనాన్షియల్ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు అస్సెట్ అలోకేషన్ ముఖ్యమైనది. ఈక్విటీలు దీర్ఘకాలంలో రాబడులను ఇస్తాయి. డెట్ సాధనాలు తక్కువ రాబడులనే ఇచ్చినా, పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నిస్తాయి. డెట్ ఫండ్స్ రాబడులను వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయనే దానిపై ఇన్వెస్టర్లకు అవగాహన ఉండాలి. బాండ్ల ధరలు, వడ్డీ రేట్ల మధ్య వ్యతిరేక సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే బాండ్ల ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుంటే బాండ్ల ధరలు పెరుగుతాయి. దీర్ఘకాల డెట్ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. డెట్ ఫండ్స్ పరంగా ఇన్వెస్టర్ల ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల రిస్క్ లేదా క్రెడిట్ రిస్క్ ఎక్కువగా ఉండకూడదని అనుకుంటే.. అప్పుడు లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా లో డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా 91 రోజుల నుంచి ఏడాది కాలం సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అస్సెట్ అలోకేషన్ పరంగా డెట్ విభాగం నుంచి షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు చోటు ఇవ్వాలి. ఏడాదిలోపే పెట్టుబడులను తిరిగి తీసుకునేట్టు అయితే లిక్విడ్ లేదా లో డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు హైబ్రిడ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఎక్కువ పెట్టుబడులను డెట్‌కు, ఈక్విటీలకు 25 శాతం మించకుండా కేంటాయింపులు చేస్తుంటాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు ఈక్విటీలకు 65–80 శాతం వరకు, మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తుంటాయి. ఇక డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాల మేనేజర్లు మార్కెట్లు, వడ్డీ రేట్ల ఆధారంగా ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య కేటాయింపులు మారుస్తుంటారు. ఈక్విటీలు ఎక్కువ దిద్దుబాటుకు లోనై స్టాక్స్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉంటే, అప్పుడు డెట్‌కు కేటాయింపులు తగ్గించి ఈక్విటీలకు పెంచుతారు. ఈక్విటీల వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయిని భావించినప్పుడు కొంత మేర విక్రయించి డెట్ పెట్టుబడులు పెంచుతుంటారు. -
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ?
నేను యాక్సిస్ మిడ్‌క్యాప్, యాక్సిస్ బ్లూచిప్, మిరేఅస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకాల్లో గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని కంపెనీల షేర్లు సైతం ఇదే కాలంలో 100–200 శాతం పెరగడాన్ని గమనించాను. కనుక మంచి రాబడుల కోసం నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? – ప్రశాంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు పథకాలు కూడా మంచివే. వీటితో కూడిన పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉంది. అయితే, యాక్సిస్‌కు చెందిన రెండు పథకాల్లో ఏదో ఒక దానిలోనే ఇన్వెస్ట్ చేసుకుని.. ఇతర ఫండ్‌హౌస్‌కు చెందిన మరో పథకాన్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల వైవిధ్యం పెరిగి రిస్క్ తగ్గుతుంది. ఈ మూడు పథకాల్లోనూ సమానంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు మూడింట రెండొంతులు యాక్సిస్ ఫండ్ పథకాల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంబంధిత ఫండ్‌హౌస్ పరంగా అంచనాలు తప్పితే రాబడులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని యాక్సిస్‌కు చెందిన ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేసుకుని, రెండో పథకానికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులను.. ఏ కంపెనీ షేరుతోనూ పోల్చి చూడకూడదు. మీ మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరును సంబంధిత సూచీ రాబడులతోనే పోల్చి చూడాలి. అంటే మిడ్‌క్యాప్ పథకాన్ని మిడ్‌క్యాప్ ఇండెక్స్ రాబడులతోనే పోల్చి చూడాలి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు కేవలం ఒకటి, రెండు కంపెనీల్లోనే పెట్టుబడులకు పరిమితం కాకూడదు. తగినంత వైవిధ్యం కోసం కనీసం 10–20 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పోర్ట్‌ఫోలియో నిర్వహించినట్టయితే రాబడులు మోస్తరుగా ఉంటాయి. రిస్క్ కూడా తగ్గుతుంది. ఎవరైనా కానీ ఒక కంపెనీ 200 శాతం రాబడులను ఇస్తుందని పెట్టుబడులన్నింటినీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. 200 శాతం రాబడులకు అవకాశం ఎలా అయితే ఉంటుందో.. కొనుగోలు ధర నుంచి 60–70 శాతం పతనానికీ అవకాశం ఉంటుంది. ఈ రిస్క్‌లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటాయి. అలాంటప్పుడు రాబడులు మోస్తరు నుంచి మెరుగ్గా దీర్ఘకాలానికి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10లక్షలను ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరైన సమయమేనా? నేను కనీసం పదేళ్లపాటు నా పెట్టుబడులను కొనసాగించగలను – గజేంద్ర రూ.10లక్షలు అన్నవి మీకు అంత అవసరమైనవి కాకపోతే ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి గణనీయమైన పెట్టుబడి మొతాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఒకేవిడత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కిందకు వెళితే మీరు కచ్చితంగా భయానికి లోనవుతారు. భయపడి పెట్టుబడులను నష్టాలతో వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న మీ ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. కనుక క్రమంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీదగ్గర ఉన్న పెట్టుబడులను వచ్చే 12–15 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు భారీ పెట్టుబడి అనిపిస్తే 18–36 నెలల పరిధిలో పెట్టుబడులు పెట్టడాన్ని విస్తరించుకోవడం కూడా సూచనీయం. రిటైర్ అయిన వ్యక్తి క్రమ ఆదాయం కోసం ఎన్పీఎస్ టైర్–2 అకౌంట్‌ను వాడుకోవచ్చా? – ఎం.మాధుర్ ఆదాయం పన్ను పరిధిలో లేకపోతే మీ సౌకర్యం ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఎన్పీఎస్ సరైన ఆప్షన్ అవుతుంది. మీ అస్సెట్ అలోకేషన్ (ఏ విభాగంలో ఎంత మేర కేటా యింపులు) ఆధారంగా ఈ తరహా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో అందుబాటులో ఉన్న మూడు రకాల ఆప్షన్లలో సరైనది ఎంపిక చేసుకోవడం మీ బాధ్యతే. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి ఎంత కేటాయింపులు చేయగలరు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరనే దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్థిరాదాయ పథకాల కంటే ఎక్కువ రాబడులను మీరు ఆశిస్తున్నట్టు అయితే.. మీ ఆదాయం రూ.6.5 లక్షల వరకు ఉన్నట్టయితే అప్పుడు రూ.1.5 లక్షలను పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో మిగిలిన రూ.5లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఈక్విటీలకు కేటాయింపులు 20–30% మించనీయకండి. డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే కూడా స్థిరాదాయ ప్లాన్ల నుంచే తీసుకోవాలి. ఇదే మాదిరి మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జిరోదా..! -
Fund Review : రిస్క్ తట్టుకుంటే రాబడులు
మోస్తరు రిస్క్ భరించే వారు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోని పథకాలను పెట్టుబడులకు పరిగణనలోకి తీసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ పరంగా అనువైన అవకాశాలున్న చోటు పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఉన్నవే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్. గతేడాది సెబీ కొత్తగా ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో డీఎస్పీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్, స్మాల్క్యాప్లతో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం మల్టీక్యాప్ పేరుతో కొనసాగడం గమనార్హం. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టుగానే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో ఆకర్షణీయైమన పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ఒక విభాగంలో వ్యాల్యూషన్స్ ఖరీదుగా మారిన సందర్భాల్లో పెట్టుబడుల కేటాయింపులు తగ్గించుకుని, ఆకర్షణీయంగా ఉన్న ఇతర విభాగాల్లోని అవకాశాలపై ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. నాణ్యమైన, సత్తా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుని, ఎక్కువ కాలం పాటు కొనసాగడాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ కరెక్షన్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా 2008, 2011, 2015 మారెŠక్ట్ పతనాల్లో నష్టాలు పరిమితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2017 బుల్ మార్కెట్లో ఈ పథకం పనితీరే ఇందుకు నిదర్శనం. 2020 మార్చి మార్కెట్ పతనం సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులు 93 శాతంగానే ఉన్నాయి. మార్కెట్ల విలువలు గరిష్టాలకు చేరాయన్న జాగ్రత్తతో నగదు నిల్వలను పెంచుకుంది. మే వరకు చూసిన తర్వాత క్రమంగా ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు ఈ పథకం నమోదు చేసింది. రోలింగ్ రాబడులను గమనించినట్టయితే ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ పథకంలో ప్రతికూల రాబడులు (నష్టాలు) లేకపోవడం ముఖ్యంగా గమనించాలి. మార్కెట్ పతనాలు, ర్యాలీల్లో మెరుగైన ప్రదర్శన చూపించిందని చెప్పడానికి నిదర్శనంగా.. డౌన్‌సైడ్ క్యాప్చర్ రేషియో 93గా, అప్‌సైడ్ క్యాప్చర్ రేషియో 103గా ఉన్నాయి. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడులున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 55 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 15.5 శాతం చొప్పన వార్షిక రాబడులను ఇచ్చింది. ఫ్లెక్సీక్యాప్ విభాగంతో పోలిస్తే రెండు శాతం వరకు అధిక రాబడులను ఈ పథకంలో చూడొచ్చు. మొత్తం పెట్టుబడుల్లో 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన ఒక శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 64 శాతం పైగా పెట్టుబడులు కలిగి ఉండగా.. మిడ్‌క్యాప్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32 శాతం కేటాయింపులు ఈ రంగంలోని కంపెనీలకే ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల కేటాయింపులు ఐసీఐసీఐ బ్యాంకు 8.26 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.02 ఇన్ఫోసిస్ 4.12 అల్ట్రాటెక్సిమెంట్ 3.79 బజాజ్ ఫైనాన్స్ 3.27 బజాజ్ ఫిన్సర్వ్ 3.16 అవెన్యూ సూపర్‌మార్ట్స్ 3.07 గుజరాత్ గ్యాస్ 2.93 యాక్సిస్ బ్యాంకు 2.78 మదర్సన్ సుమీ 2.34 చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
మహీంద్రా మాన్యులైఫ్ నుంచి కొత్త ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్ యోజన పేరిట కొత్త ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఫ్లెక్సి క్యాప్ యోజన ఫండ్ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్ రెపో వంటి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు), ఇన్విట్స్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. -
నిఫ్టీ 250ని మించి లాభాలు తెస్తున మ్యూచువల్ ఫండ్ ఇదే!
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్వల్ప కాలంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచ్చిపెడతాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాబడుల గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ (గతంలో రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్) పథకం ఒకటి. రాబడులు ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.15వేల కోట్లకు పైనే ఇన్వెస్టర్ల పెట్టుబడులున్నాయి. ఒక స్మాల్‌క్యాప్ పథకం ఈ స్థాయిలో పెట్టుబడులను నిర్వహించడం అంత తేలికైన విషయం కానేకాదు. అయినప్పటికీ ఈ ఫండ్ నిర్వహణ బృందం తమ పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంది. గడిచిన ఏడాది కాలంలో 107 శాతంగా ఉన్నాయి. అంటే పెట్టుబడులను ఏడాది కాలంలో రెట్టింపు చేసింది. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 21 శాతంగా, ఏడేళ్ల కాలంలో 22 శాతం, పదేళ్ల కాలంలోనూ 22 శాతం చొప్పున సగటు వార్షిక ప్రతిఫలాన్ని ఈ పథకం తెచ్చిపెట్టింది. నిఫ్టీ 250 టీఆర్ఐ రాబడులతో ఈ పథకం రాబడులను ప్రామాణికంగా పోల్చి చూసుకోవచ్చు. సూచీతో పోలిస్తే ఈ పథకమే 5 శాతానికి పైగా అధిక రాబడులను ఇస్తోంది. రూ.5,000 కోట్ల వరకు మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు స్మాల్‌క్యాప్ కిందకు వస్తాయి. అధిక రిస్క్ తీసుకునే వారికి ఈ విభాగం చక్కగా సరిపోతుంది. ఈ పథకంలో ఉన్న మరో వెసులుబాటు సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీసం రూ.100 నుంచి వెనక్కి తీసుకునే విధంగా సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల విధానం.. స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. అదే సమయంలో మిడ్‌క్యాప్ కంపెనీలకూ చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం ద్వారా రిస్క్‌ను కొంత తగ్గించే విధానాన్ని ఫండ్ మేనేజర్లు అనుసరిస్తున్నారు. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారినవే ఉన్నాయి. ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 98 శాతాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన రెండు శాతం మేర నిధులను నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలిస్తే.. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 55 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీలకు 38 శాతం, మెగా, లార్జ్‌క్యాప్ కంపెనీలకు 7 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఇంజనీరింగ్, కెమికల్స్, ఫైనాన్షియల్స్, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ, సేవలరంగ కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో 123 స్టాక్స్ ఉన్నాయి. రిస్క్ ఎక్కువగా ఉంటుంది కనుక స్మాల్‌క్యాప్ పథకాలు ఏకమొత్తంలో పెట్టుబడులకు ప్రస్తుత తరుణంలో అనుకూలం కాదు. దీర్ఘకాలం కోసం ప్రతీ నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్ కోణంలో నుంచి చూస్తే అనుకూలంగా ఉంటుంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం దీపక్ నైట్రేట్ 3.76 నవీన్ ఫ్లోరిన్ 2.71 ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 2.51 బలరామ్‌పూర్ చినీ 2.30 బిర్లా కార్పొరేషన్ 2.25 బజాజ్ ఎలక్ట్రికల్స్ 2.23 ఓరియంట్ ఎలక్ట్రిక్ 2.19 రాడికో ఖైతాన్ 1.88 డిక్సన్ టెక్నాలజీస్ 1.79 నిట్ 1.79 -
2020లో 10 పెన్నీ స్టాక్స్ బొనాంజా
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఆటుపోట్లను చవిచూశాయి. తొలుత జనవరిలో సరికొత్త గరిష్టాలవైపు నడక సాగించాయి. అయితే చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ధాటికి మార్చికల్లా కనిష్టాలకు పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్న సహాయక చర్యలతో తిరిగి నెల రోజుల్లోనే రికవరీ బాట పట్టాయి. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్లుబడుల వెల్లువతో సరికొత్త గరిష్టా రికార్డులను సాధిస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లుగా పెద్దగా వృద్ధి చూపని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మార్కెట్లను మించి లాభపడుతూ సరికొత్త గరిష్టాలను చేరాయి. పెన్సీ స్టాక్స్ 2019లో పెన్నీ స్టాక్స్‌గా నిలిచిన 10 కంపెనీల షేర్లు ఈ ఏడాది(2020) లాభాల పరుగందుకున్నాయి. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక శాతం రిటర్నులు అందించాయి. ఇందుకు రూ. 25 ధరకంటే తక్కువగా ఉన్న షేర్లను మాత్రమే పరిగణించినట్లు ఏస్ ఈక్విటీ పేర్కొంది. రూ. 100 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) మించని కంపెనీలను మాత్రమే మదింపులోకి తీసుకున్న్లట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం.. (బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్) అలోక్ గెలాప్ సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 38 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో అలోక్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగింది. ఫలితంగా అలోక్ ఇండస్ట్రీస్ షేరు 2020లో ఏకంగా 602 శాతం దూసుకెళ్లింది. 2019 డిసెంబర్ 31న రూ. 3.04గా నమోదైన ఈ షేరు వారాంతానికల్లా రూ. 21.4కు చేరింది. లాభాల బాట అలోక్ ఇండస్ట్రీస్ బాటలో టెక్నాలజీ సేవల కంపెనీ స్యుబెక్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ షేరు గతేడాది చివర్లో నమోదైన రూ. 5.90 నుంచి వారాంతానికల్లా రూ. 29.70కు ఎగసింది. వెరసి 403 శాతం ర్యాలీ చేసింది. ఈ జాబితాలో కర్దా కన్స్ట్రక్షన్స్ షేరు రూ. 23.74 నుంచి 376 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా రూ. 113ను దాటేసింది. ఇక టెక్ సొల్యూషన్స్ అందించే కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేరు రూ. 18 నుంచి రూ. 72.40కు పురోగమించింది. ఇది 301 శాతం వృద్ధికాగా.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీ సీజీ పవర్ ఇండస్ట్రియల్ షేరు రూ. 10.82 నుంచి రూ. 43.20వరకూ పెరిగింది. ఇది 299 శాతం లాభంకావడం గమనార్హం! ఇదేవిధంగా రతన్ ఇండియా ఇన్ఫ్రా స్టాక్ రూ. 1.87 నుంచి రూ. 6.60కు బలపడింది. వెరసి 253 శాతం వృద్ధి చూపింది. హెల్త్‌కేర్ కంపెనీ మార్క్‌శాన్స్ ఫార్మా రూ. 16.71 స్థాయి నుంచి రూ. 58కు ఎగసింది. 247 శాతం లాభపడింది. టెలికం సేవల కంపెనీ టాటా టెలీసర్వీసెస్ షేరు రూ. 2.25 నుంచి 237 శాతం ర్యాలీ చేసింది. రూ. 7.59ను తాకింది. దుస్తుల తయారీ కంపెనీ బాంబే రేయాన్ ఫ్యాషన్స్ రూ. 4.20 నుంచి 220 శాతం జంప్‌చేసింది. రూ. 13.44కు చేరింది. ఇక మౌలిక రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ షేరు రూ. 1.96 నుంచి రూ. 6.16కు పెరిగింది. ఇది 214 శాతం లాభం! -
క్రిస్మస్ టు క్రిస్మస్: చిన్న షేర్లు చిరుతలు
ముంబై, సాక్షి: గతేడాది(2019) క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకూ మార్కెట్లు పలు ఎత్తుపల్లాలను చవిచూశాయి. అంతక్రితం ఏడాది మార్కెట్లు పెద్దగా ర్యాలీ చేయకపోవడంతో నెమ్మదిగా బలపడుతూ వచ్చాయి. అయితే 2020 మార్చికల్లా కోవిడ్-19 దెబ్బకు ఉన్నట్టుండి పతనమయ్యాయి. తిరిగి వెనువెంటనే కోలుకుని బుల్ ధోరణిలో సాగిపోయాయి. ఫలితంగా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చాయి. తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురానికి అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు సాగుతోంది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కాలంలో 13 శాతం చొప్పున బలపడగా.. మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 19 శాతం, 32 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం.. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) కారణాలేవిటంటే? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పడగ విప్పడంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. తద్వారా భారీ స్థాయిలో నిధులను వ్యవస్థలోకి విడుదల చేయడంతో అటు బంగారం, ఇటు స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సంక్షోభ పరిస్థితుల భయాలతో పసిడి జోరందుకోగా.. లిక్విడిటీ కారణంగా మార్కెట్లు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తదితర దిగ్గజాలు వేగంగా వ్యాక్సిన్లను రూపొందించడంతో సెంటిమెంటు పుంజుకున్నట్లు తెలియజేశారు. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం ప్రభావం చూపింది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) షేర్లు మరింత స్పీడ్ బీఎస్ఈ-500 ఇండెక్సులో 65 శాతం షేర్లు లాభాలతో నిలిచాయి. వీటిలో 50 శాతం రెండంకెల వృద్ధిని చూపాయి. ప్రధానంగా 36 స్టాక్స్ 100-900 శాతం మధ్య దూసుకెళ్లడం ద్వారా మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. వీటిలో మిడ్, స్మాల్ క్యాప్స్ అధికంగా చోటు సాధించడం విశేషం! ప్రధాన కంపెనీలలో అదానీ గ్రీన్, ఆర్తి డ్రగ్స్, లారస్ లేబ్స్, ఐవోఎల్ కెమికల్స్, ఆల్కిల్ అమైన్స్, బిర్లాసాఫ్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, గ్రాన్యూల్స్, వైభవ్ గ్లోబల్, టాటా కమ్యూనికేషన్స్, నవీన్ ఫ్లోరిన్, పాలీ మెడిక్యూర్, దీపక్ నైట్రైట్, అఫ్లే ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమికల్స్, అదానీ గ్యాస్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫస్ట్‌సోర్స్, అదానీ ఎంటర్, యాంబర్ ఎంటర్, ఏపీఎల్ అపోలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టెయిన్, టాటా ఎలక్సీ, దివీస్ లేబ్స్, మైండ్‌ట్రీ, ఇండియా సిమెంట్స్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎస్కార్ట్స్, రెస్సాన్సివ్, వొకార్డ్ 600-100 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! ఇతర కౌంటర్లలో తాన్లా సొల్యూషన్స్ 900 శాతం పురోగమించింది. నేలచూపులో గతేడాది కాలంలో ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని నేలచూపులకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోటళ్లు, రిటైల్ రంగ కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్ రిటైల్, జీఈ పవర్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, రేమండ్, కెనరా బ్యాంక్, చాలెట్ హోటల్స్, ఇండస్ఇండ్, బీవోబీ, లెమన్ ట్రీ, షాపర్స్‌స్టాప్, ఎడిల్వీజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, జాగరణ్ ప్రకాశన్, డీసీబీ బ్యాంక్, కోల్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తదితరాలు 30 శాతం స్థాయిలో నీరసించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.