special officer
-
రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ ఎస్ఓ మృతి
సాక్షి, శ్రీకాకుళం: బూర్జ మండలం వైకుంఠపురం కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్.ఎన్.పేట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మండల శ్రీదేవి(38) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పెద్దకాపు వీధికి చెందిన శ్రీదేవి ఐదు నెలలుగా ఎల్.ఎన్.పేట కేజీబీవీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు స్కూటీపై వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఎల్.ఎన్.పేట వెళ్లేవారు. ఎప్పట్లాగే శుక్రవారం కూడా విధుల్లో భాగంగా స్కూటీపై వస్తుండగా వైకుంఠపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొట్టారు. ఈ ఘటనలో దవడ భాగం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: (షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి) స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అదే వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీదేవికి తల్లి విజయలక్ష్మి, తమ్ముడు దినేష్, వివాహితురాలైన చెల్లి రేణుక ఉన్నారు. దినేష్ ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేటలో విషాదం.. శ్రీదేవి మృతితో ఎల్.ఎన్.పేటలో విషాదం అలముకుంది. కేజీబీవీ ఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోధనతో పాటు విద్యారి్థనులను తోబుట్టువులా చూసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. మంచి ఎస్ఓను కోల్పోయామని సిబ్బంది, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతి పట్ల ఎల్.ఎన్.పేట జెడ్పీటీసీ కిలారి త్రినాథులు సంతాపం తెలియజేశారు. -
ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం!
ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారడం లేదు. గతనెల జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కన్నీరుమున్నీరు కాగా, కలెక్టర్ విచారణ చేపట్టి రూరల్ కేజీబీవీ ప్రత్యేక అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఎస్వోపై సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు విద్యార్థులతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎస్వోను తిరిగి విధుల్లోకి తీసుకుంటే తాము ఈ పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, బిస్కెట్లు పెడతామని.. ఫుడ్ పాయిజన్ తర్వాత పరిస్థితి మారిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువుతోపాటు నాణ్యమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం పాఠశాలలో పనిచేసే స్వీపర్ కవిత, వంటచేసే సిబ్బంది సుందరమ్మ, సరస్వతి, అనిత బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో డ్యూటీ సీఆర్టీ మాత్రమే ఉన్నారు. వీరితోపాటు ఈ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి చికెన్ తింటారా.. బిస్కెట్లు కావాల అని అడిగి 7, 8వ తరగతి విద్యార్థులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు చికెన్, బిస్కెట్లు తెప్పించడానికని వారిని నమ్మించారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా సంతకం పెట్టించలేదని, కొత్తగా ఎందుకు పెట్టిస్తున్నారని మరికొంతమంది అడిగారు. ఈ సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన ఎస్వోకు మద్దతుగా సంతకాలు చేయించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరితోపాటు ఓ దళిత సంఘానికి చెందిన నాయకుడు ఫుడ్‌పాయిజన్ జరిగిన సమయంలో విద్యార్థులకు మద్దతుగా నిలవగా, ప్రస్తుతం ఎస్వోకు మద్దతుగా విద్యార్థులతో సంతకాలు పెట్టించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు. ‘మీరు రెండు సంవత్సరాలు ఉండి వెళ్లిపోతారు.. పాత టీచర్‌ను తీసుకుంటే మీకేం ఇబ్బంది’ అని విద్యార్థులను ప్రశ్నించారని తెలిపారు. నిబంధనల ప్రకారం కేజీబీవీలోకి ఎవరినీ అనుమతించరాదు. అయినా అక్కడ పనిచేసే సిబ్బందిని బెదిరించి సదరు నాయకుడు క్యాంపస్‌లోనికి వచ్చి విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఆందోళన.. కేజీబీవీలో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను, అక్కడ పనిచేసే సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పిల్లలతో తెల్లకాగితంపై ఎందుకు సంతకాలు తీసుకున్నారని నిలదీశారు. తమ పిల్లలకు ఏమైన జరిగితే వారే బాధ్యులని హెచ్చరించారు. ఎస్వోను తిరిగి ఈ పాఠశాలలో తీసుకుంటే తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్న సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చదువుకోం మా పాత మేడం ఉన్నప్పుడు సరిగా మాకు భోజనం పెట్టేవారు కాదు. నాసిరకం భో జనం, కలుషిత నీరు అందించారు. దీంతో తాము అనారోగ్యం బారిన పడ్డాం. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యాం. ఆ మేడం సస్పెండ్ అయినప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. మళ్లీ ఆమె వస్తే మేం ఇక్కడ చదువుకోం. – నిక్షిత, విద్యార్థిని బలవంతంగా సంతకాలు.. రెండు రోజుల కింద స్వీపర్, అటెండర్ నన్ను గేటు దగ్గరికి పిలిచి ఒక తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారు. ఎందుకోసమని అడిగితే చికెన్, బిస్కెట్లు ఎంతమంది తింటారనేది రాసుకుంటున్నామని చెప్పారు. వారు ఒత్తిడి చేయడంతో నాకు తోచక సంతకం చేశాను. – ప్రసన్న, విద్యార్థి విద్యార్థులతో మాట్లాడాను కేజీబీవీ విద్యార్థులతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడాను. సిబ్బందికి ఈ విషయమై హెచ్చరించాను. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాను. – ప్రణీత, డీఈఓ, ఆదిలాబాద్ -
ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్‌ను స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మైల్డ్ సింటమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నామన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో, 5 వేల మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఫుడ్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని కృష్ణబాబు తెలిపారు. చదవండి: ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ కొడుకు ప్రాణం పోయింది.. తండ్రి గుండె ఆగింది.. -
ప్రత్యేక డీజీపీ సస్పెన్షన్
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్‌దాసు సస్పెండ్ అయ్యారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి ఇద్దరు డీజీపీ స్థాయి హోదా అధికారుల పేర్లు సిఫారసు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి రాజేష్దాసుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఆమె ఫిర్యాదు మేరకు కేసును సీబీసీఐడీకి డీజీపీ త్రిపాఠి అప్పగించారు. దీంతో విచారణపై సీబీసీఐడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై విల్లుపురంలో విచారణ సాగగా, ప్రస్తుతం చెన్నైకు విచారణ చేరింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించే పనిలో పడింది. ఇక విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు చెంగల్పట్టు ఎస్పీగా ఉన్న కన్నన్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. సస్పెండ్ కూడా చేశారు. ఆ మహిళా అధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నందుకే కన్నన్ ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ వద్ద కేవలం విచారణ మాత్రమే సాగినా, సస్పెండ్ చర్యలు తీసుకోలేదు. ఇదే విషయంగా మద్రాసు హైకోర్టు స్పందించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సైతం దృష్టి పెట్టింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఈ ప్రత్యేక డీజీపీని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి డీజీపీ హోదా కల్గిన అభాష్కుమార్, అభయ్ కుమార్సింగ్లలో ఒకర్ని నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరి పేర్లను ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేశారు. చదవండి: ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం ఆ డీజీపీపై 3 కేసులు: దృష్టి సారించిన హైకోర్టు -
ఏపీ: ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్‌కి ఐజీ సంజయ్ సహకరించనున్నారు. ఐజీ సంజయ్‌కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? -
బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం ప్రత్యేక అధికారిణిగా నియమితురాలైన దీపిక పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టవేస్తామని చెప్పారు. మహిళల సంరక్షణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. త్వరిత గతిన దర్యాప్తును పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దిశ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం -2019 అమలు కోసం కృతికా శుక్లా, దీపికాలను ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్పీగా ఉన్న దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. -
టీటీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి
సాక్షి, అమరావతి: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ (ఐడీఈఎస్) 1991 బ్యాచ్‌కు చెందిన ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ధర్మారెడ్డి అక్కడ రిలీవై బుధవారం రాష్ట్ర సచివాలయంలో రిపోర్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా పారుమంచల గ్రామానికి చెందిన ఏవీ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా తిరుమలలో టీటీడీ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. -
కశ్మీర్లో మహిళా ఎస్పీవో కాల్చివేత
శ్రీనగర్: కశ్మీర్లో శనివారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో) ఇంట్లోకి దూరి ఆమెను కాల్చిచంపాయి. షోపియాన్ జిల్లాలోని వెహిల్ ప్రాంతానికి చెందిన ఖుష్బూ జాన్ విధులు ముగించుకుని శనివారం ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకూ అక్కడే మాటేసిన ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి అత్యంత సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఖుష్బూను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్‌సెర్చ్ ప్రారంభించాయి. -
ఖాకీల ఫైట్..!
సాక్షి, పెద్దపల్లి: శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే బాహాబాహీకి దిగారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే బూతులు తిట్టుకొంటూ పరస్పరం దాడి చేసుకున్నారు. తన పోలీసుస్టేషన్లో తనదే రాజ్యమంటూ ఓ ఎస్సై సహచర హెడ్‌కానిస్టేబుల్‌తో కలిసి స్పెషల్ పోలీసులపై వీరంగం సృష్టించారు. జిల్లాలోని ఓ మారుమూల పోలీసుస్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఠాణాలోనే తిట్ల దండకం.. జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పోలీసు స్టేషన్లో ఎస్సై, స్పెషల్ పోలీసుల నడుమ జరిగిన గొడవ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎస్సై, ఓ హెడ్‌కానిస్టేబుల్ మధ్య మొదలైన వాగ్వాదం, చివరకు అదే పోలీసుస్టేషన్‌కు ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన స్పెషల్ పోలీసులకు పాకినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం రాత్రివేళ పోలీసుస్టేషన్లో ఎస్సైతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే ఓహెడ్‌కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం మొదలైంది. కుటుంబపరంగా కూడా కలిసుండే ఇద్దరి మధ్య మామూళ్ల వ్యవహారంతో విభేదాలు పొడచూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సై దురుసు వ్యవహారంపై ఇటీవల సీఐకి ఫిర్యాదు అందింది. ఆయన వెంటనే ఎస్సైని మందలించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. తాజా గొడవ, సీఐకి అందిన ఫిర్యాదు విషయాన్ని మనసులో పెట్టుకొన్న ఎస్సై దీనికి స్టేషన్లోనే ఉంటున్న స్పెషల్ పోలీసులే కారణమంటూ వారిని దుర్భాషలాడారు. వారు కూడా ఎస్సై తీరుపై అసహనానికి గురయ్యారు. మాటకు మాట సమాధానం చెప్పడంతో సహనం కోల్పోయిన ఎస్సై వారిపై చేయి కూడా చేయిచేసుకొన్నట్లు సమాచారం. బూతులు తిడుతూ స్టేషన్ ఆవరణలోనే హంగామా సృష్టించారు. దూషణల క్రమంలో సదరు ఎస్సై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అదేరోజు గొడవ సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌ను సందర్శించి ఎస్సైని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. అయితే విషయం బటకు పొక్కితే పరువు పోతుందనే భావనతో చర్యలు తీసుకోకుండా వేచి ఉన్నట్లు సమాచారం. -
అంతా నా ఇష్టం
గుంటూరు మెడికల్: నా ఇష్టం..నా మాటే శాసనం.. ఇక్కడ నేను ఏది చెబితే అదే చేయాలి..నేను చెప్పిన చోట సంతకం చేయకపోతే నీపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి, నీవు వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేందుకు అనర్హుడిని చేస్తా అంటూ వైద్యుల్ని, సిబ్బందిని జీజీహెచ్‌లో ఓ ముఖ్యఅధికారి కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైళ్లపై వైద్యుల్ని సంతకాలు చేయమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న ఫైళ్లపై సంతకాలు చేస్తే తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో వణికిపోతున్నారు. కొందరితో భయపెట్టి సంతకాలు పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన ఆంశాలపై సైతం సదరు అధికారి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు నెలల కిందట ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉండగానే తాజాగా విజిలెన్స్ అధికారులకు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులకు బాధిత వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయం ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదుల వెల్లువ ఆస్పత్రి అభివృద్ధి సంఘం నిధులు(హెచ్‌డీఎస్), డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ నిధులు(ఆరోగ్యశ్రీ) నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని, దుర్వినియోగం అయ్యాయని ముఖ్యమంత్రికి సైతం సదరు ముఖ్యఅధికారిపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సైతం జీజీహెచ్‌లో నిధుల వినియోగం నిబంధనల ప్రకారం జరగడం లేదని, ఐదేళ్లుగా ఆస్పత్రిలో ఆడిట్లు జరగడం లేదని అంటూ రెండు నెలల కిందట ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా ముఖ్య అధికారి వ్యవహరించారనే విషయంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పారితోషికం పంపిణీ విషయాల్లోనూ అధికారి నిబంధనలకు విరుద్ధంగా తనకు ఇష్టం వచ్చిన వారికి అందజేసినట్టు ట్రస్ట్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరుగుతోంది. గత నెలలో డయేరియా మరణాల విషయంలో అధికారి చేసిన సొంత పెత్తనం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ఆస్పత్రిలో అందరూ చెప్పుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఉన్నతాధికారులు చెప్పకుండానే తన సొంత నిర్ణయం తీసుకుని జీజీహెచ్‌కు తీసుకురావడంతో వారు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు గుర్తింపు కోసం అనుమతులు మంజూరు చేసే విషయంలో సదరు అధికారి బహుమతుల రూపంలో మామూళ్లు తీసుకున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అధికారి బెడద నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధితులు కోరుతున్నారు. -
వన జాతరకు వాకాటి
సాక్షి, వరంగల్ : మేడారం జాతర నిర్వహణకు ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను నియమించనున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క–సారలమ్మ జాతరపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జాతర తేదీలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ విభాగాలతో గురువారం హైదరాబాద్‌లో ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా జాతర ప్రత్యేకతలు, అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞురాలైన సీనియర్ ఐఏఎస్ కరుణను ప్రత్యేకాధికారిగా నియమిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు గురువారం వెలువడనున్నట్లు సమాచారం. నాలుగోసారి.. ప్రస్తుతం భూ పరిపాలన విభాగం డైరెక్టర్‌గా వాకాటి కరుణ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. గతంలో మూడు జాతరల నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించారు. తొలిసారి 2010లో వరంగల్ జేసీ హోదాలో .. ఆ తర్వాత 2012లో రెండో సారి జేసీ హోదాలో జాతర విధులు నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేశారు. అనంతరం 2016 జాతరలో వరంగల్ కలెక్టర్ హోదాలో కరుణ అన్ని తానై వ్యవహరించారు. జాతరకు సంబంధించి నిధుల కేటాయింపు నుంచి పనుల పర్యవేక్షణ వరకు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సకాలంలో పనులయ్యేలా వ్యవహరించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) వేలం పాటను మేడారం నుంచి మణుగూరుకు తరలించడంలో పట్టుదలగా వ్యవహరించారు. ముందే మేడారం చేరుకుని జాతర ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు అక్కడే ఉంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించారు. బ్రాండ్ మేడారం.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. మేడారం జాతరకు బ్రాండ్ ఇమే జ్ తెచ్చేందుకు అంతర్జాతీయ టీవీ చానల్, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీ య, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందిం చా లన్నారు. విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యే క నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని చెప్పా రు. జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన పార్లమెంట్ సభ్యులను ప్ర త్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. జాతర కోసం వచ్చే ముఖ్య అతిథులను తగు ప్రొటోకాల్‌తో ఆహ్వానించాలని సూచించారు. మేడారంలో పారిశుద్ధ్య నిర్వహణకు మునిసిపల్ శాఖ ద్వారా తగు సిబ్బంది ని నియమించాలని, సరిపడా అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. సాంస్కృతిక, దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేయాలని, జాతరకు వచ్చు భక్తులకు హెలికాప్టర్ సేవలందేలా చూడాలన్నారు.ఏ ఒక్క భక్తుడికీ ఎ టువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ సూచించారు. -
సేవల్లో లోపాలు ఉండకూడదు
నరసాపురం : పేదలకు అందించే విద్య, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక అధికారి పీజీ కామత్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని టేలర్ హైసూ్కల్, శారద టాకీస్ వద్ద ఉన్న మున్సిపల్ హైసూ్కల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని వైద్యులకు సూచించారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి ఎం.సూర్యనారాయణ, ఇన్చార్జ్ డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ ఆయన వెంట ఉన్నారు. -
విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రత్యేక అధికారిగా విజయకృష్ణన్
రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం నగరపాలకసంస్థలో విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారిగా రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణ¯ŒSను నియమిస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్‌సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, రాజానగరం మండలంలోని రాజానగరం, పాలచర్ల, నరేంద్రపురం, చక్రద్వారబంధం, లాలాచెరువు, వెలుగుబంద, నామవరం, కోరుకొండ మండలంలోని గాడాల, మధురపూడి, బూరుగుపూడి, నిడిగట్ల గ్రామాలకు ఇప్పటివరకు నగరపాలకసంస్థ కమిషనర్ విజయరామరాజును ప్రత్యేకాధికారిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గ్రామాల విలీన ప్రక్రియ రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం రూరల్ మండల రాజవోలు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి నక్కారాజబాబు 2014లోనే హైకోర్టులో ప్రజావ్యాజ్యం (పిల్నెంబరు 79)దాఖలు చేశారు. ఈ పిల్‌పై 2015 పిభ్రవరి 18 తేదీన హైకోర్టు (డబ్ల్యూపినెంబరు 3489) నక్కా రాజబాబుకు అనుకూలంగా తీర్పునిస్తూ విలీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల విజయరామరాజును గ్రామాల ప్రత్యేకాధికారిగా నియమించడంతో నక్కా రాజబాబు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే విలీన ప్రక్రియ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా ప్రత్యేకాధికారి నియామకం చెల్లదంటూ గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన రాజబాబుకు అనుకూలంగా ఇంటరిమ్ సస్పెన్ష¯ŒS ఆర్డర్‌ను మంజూరు చేసింది. ఇదే సమయంలో యథాతథ ఉత్తర్వులు ఇస్తూనే విలీన ప్రక్రియ అంశం కోర్టులోఉండగా ప్రత్యేకాధికారిగా ఎందుకునియమించారంటూ కోర్టు జిల్లా కలెక్టరుకు డైరెక్ష¯ŒS ఇస్తూ మూడు వారాలలోగా కోర్టుకు నివేదించాలంటూ ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ కూడా హైకోర్టులో ఉన్న విషయాన్ని నివేదించారు. దీం తో ప్రత్యేకాధికారిని మారుస్తూ సోమవారం 3344/ 2011/ఏ2 ప్రొసీడింగ్స్‌తో ప్రత్యేకాధికారిగా ఉన్న విజయరామరాజును తాత్కాలికంగా మార్పు చేస్తూ సబ్‌కలెక్టర్ విజయకృష్ణ¯ŒSకు ప్రత్యేకాధికారి బాధ్యతలు అప్పగించారు. -
నిధులు రాక.. నడపలేక
• విద్యార్థినులను పస్తులు ఉంచలేక.. అప్పులు ఇవ్వక.. • అవస్థలు పడుతున్న స్పెషలాఫీసర్లు • కేజీబీవీల నిర్వహణకు టెండర్లు పిలవని ప్రభుత్వం • అడ్వాన్సు చెల్లింపులోనూ అదే నిర్లక్ష్యం • బంగారు నగలు తాకట్టుపెట్టి హాస్టల్ నిర్వహణ సాక్షి ప్రతినిధి, కడప: కేజీబీవీల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు స్పెషలాఫీసర్లు స్కూళ్లను నడపడానికి అల్లాడిపోతున్నారు. నిధులు కేటారుుంపులో నిర్లక్ష్యం తాండవిస్తోంది. అడ్వాన్సులు లేవు.. బిల్లులు జమకావు. వెరసి స్పెషల్ ఆఫీసర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యార్థినులను పస్తులు ఉంచలేక, హాస్టల్స్ నిర్వహించలేక సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న బంగారం సైతం తాకట్టుపెట్టి నిర్వహించేవారు కొందరైతే, అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు ఇంకొందరు. బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పేదరికంలో ఉన్నవారి కోసం కేజీబీవీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 29 కేజీబీవీలున్నారుు. విద్యాబోధనతోపాటు చక్కటి హాస్టల్ వసతి సమకూర్చారు. వాటి పరిధిలో దాదాపు 6 వేలమంది విద్యార్థినులు చదువున్నారు. ప్రతి హాస్టల్లో సరాసరిన ఒకరోజుకు క్వింటా బియ్యం అవసరం. ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తుండగా, టెండర్‌దారులు సరుకులు సరఫరాకు చేస్తున్నారు. కాగా కూరగాయాలు, పండ్లు, గుడ్లు, పాలు, గ్యాస్, చికెన్ తదితర వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించలేదు. వాటిని ఎస్‌ఓలే తెప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకుగాను నెలకు రూ.1లక్ష అడ్వాన్సు సర్వశిక్షా అభియాన్ చెల్లించేది. ఈమొత్తం ఏడు నెలలుగా చెల్లించడం లేదు. ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. బంగారు నగలు సైతం తాకట్టు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు అంతా మహిళా ఉద్యోగులే. నిధులు అందకపోవడంతో ఏడు నెలలపాటు హాస్టల్ నిర్వహణ వారికి కష్టతరంగా మారింది. ఇప్పటికే కొందరు అప్పులు చేశారు, ఆపై బంగారు నగలు తాకట్టుపెట్టారు. చిరుద్యోగులుగా ఉన్న తమకు కేజీబీవీలు నిర్వహించడం భారంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఏడు నెలలపాటు బిల్లులు జమకాలేదని, ఇంకెంత కాలం భరించాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రరుుస్తున్నారు. ప్రతి కేజీబీవీకి దాదాపు రూ.7లక్షలు రావాల్సి ఉందని ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపుతున్నారని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వేధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. రూ.1కోటి మాత్రమే మంజూరు: ఎస్ఎస్ఏ పీఓ వెంకటసుబ్బయ్య కేవీజీబీల నిర్వహణకు సంబంధించి జిల్లాకు రూ.5కోట్లు నిధులు రావాల్సి ఉంది. అందులో ఇటీవల రూ.1కోటి మాత్రమే మంజూరు చేశారు. స్పెషల్ ఆఫీసర్లకు ఏడు నెలలుగా అడ్వాన్సు బిల్లులు చెల్లించలేదు. నిధుల కొరతే కారణం. ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాం. నిధుల కోసం వేచియున్నాం. త్వరలో పరిష్కారం లభిస్తోందని ఆశిస్తున్నాం. -
మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక అధికారి
భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయం.. కేంద్రం నిర్ణయం మల్కన్ గిరి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు ఆపరేషన్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించనుంది. ఇందుకోసం తెలంగాణలోని భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో మావోల ఏరివేతకు ఆయా రాష్ట్రాలను ఐపీఎస్ అధికారి సమన్వయపరచనున్నారు. ఆయా రాష్ట్రాల మధ్య ఇంటెలిజెన్ ్స సమాచారం పరస్పరం పంచుకోవడంలో ఆ కార్యాలయం చొరవ చూపనుంది. అలాగే అటవీ ప్రాంతంలో రూ. కోట్ల ఖర్చుతో అత్యంత అధునాతన వెబ్ కెమెరాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు వీలు కల్పించనుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ, బస్తర్, కొండగాం, రాంకీ జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణపూర్, తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విశాఖ రూరల్, చింతపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలోని మోతిగూడెం, రంపచోడవరం, ఒడిశాలోని మల్కన్ గిరి, కొరాపుట్ జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలో ఉంటాయని తెలిసింది. -
తొలిరోజు 4లక్షల మంది పుష్కర స్నానాలు
విజయవాడ: పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ఘాట్ల వద్ద 4లక్షల మంది పుష్కర స్నానమాచరించినట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్బంగా భక్తుల రద్దీ తక్కువగా ఉందని, రేపటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఉండడంతో భక్తల రద్దీ పెరుగుతుందనుకుంటున్నామని ఆయన తెలిపారు. -
ఆగస్టు ఆరులోగా పనులన్నీ పూర్తి
– పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్ శ్రీశైలం: కష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పనులన్ని ఆగస్టు ఆరో తేదీలోగా పూర్తవుతాయని పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్ తెలిపారు. శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయన ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి పాతాళగంగ వద్ద జరగుతున్న ఘాట్ల పనులను పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ నూతన ఘాట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఘాట్ల వద్ద జరిగే పనులన్నీ ఆగస్టు 2వ తేదీలోగా పూర్తి అవుతాయని అనుకున్నామన్నా.. అనివార్య పరిస్థితుల కారణంగా ఎర్త్‌వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైందన్నారు. ఆగస్టు ఆరు లోగా అన్ని పనులు పూర్తవుతాయనే ధీమాను వ్యక్తం చేశారు. అలాగే కొండ చరియలు విరిగిన ఘటనపై కమిటీ సూచన మేరకు పనులు చేపట్టామన్నారు. హైటెన్షన్ వైర్‌తో రిటైర్నింగ్ చేసి మెష్ వేయాలని సూచించడంతో ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పాతఘాట్లు కూడా ఒక వైపు పూర్తయ్యాయని, మెట్ల మార్గంలో ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి దిగి చూశామని, మధ్యలో బారికేడింగ్ కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ప్యాచింగ్ వర్క్ చేయలేదని విలేకరులు అడుగగా, ఇప్పటికే వాటి గురించి సూచించానని, పూర్తవుతాయన్నారు. పుష్కర పనులలో ఎలాంటి రాజీ పడటం లేదని, సీఎం కూడా పనులలో నాణ్యత ఉండాలని ఆదేశించారన్నారు. అనంతరం ఆయన దేవస్థానం పరిధిలో నిర్మిస్తున్న చంద్రావతి కల్యాణమండపం, యజ్ఞవాటిక, హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీ రవిప్రకాశ్, డీఎస్పీ రమేష్‌బాబు, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈ డీఈ,ఈఈ, దేవస్థానం ఈఈ రామిరెడ్డి , ఇంజనీరింగ్ అధికారులు, సీఐవెంకటచక్రవర్తి తదతరులు పాల్గొన్నారు. -
ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కృష్ణా పుష్కారాల ప్రత్యేక అధికారి అనంతరాం కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్ విజయమోహన్‌తో కలసితో ఘాట్ల పనులను పరిశీలించారు. ముందుగా వారు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం పాతాళగంగ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 30లోగా పుష్కరఘాట్ల పనులన్ని పూర్తి కావాలని ఆదేశించించిందని, దానికనుగుణంగానే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి చూస్తే గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉందా అని విలేకరులు అడుగగా, జరుగుతున్న పనులను భద్రతను దష్టిలో ఉంచుకుని వర్క్‌లు చేస్తున్నారని, 20 మీటర్ల చొప్పున రెండు పెద్ద ఘాట్లు తయారవుతాయని, ఈ ఘాట్లు ఆగస్టు 2లోగా పూర్తి చేస్తామన్నారు. అలాగే మిగతా పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు, తదితరులు కూడా ఘాట్ల వద్ద జరుగుతున్న పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అడుగుగా, దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సపరేట్ వింగ్ ఉంటుందని, అధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పానని అన్నారు. క్వాలిటీ కంట్రోల్ నుంచి శ్యాంపిల్స్, టైమ్ టూ టైమ్ టెస్ట్ చేసి వారికే ఇన్చూర్ అయ్యేటట్లు చెబుతామన్నారు. ఘాట్ల పనులో భాగంగా మట్టిని పాతాళగంగలో వేస్తున్నారని కొందరు విలేకరులు చెప్పలగా.. అలా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట ఈఓ నారాయణభరత్‌గుప్త, తహసీల్దార్ విజయుడు, దేవస్థానం ఈఈ రామిరెడ్డి, టూరిజం డీవిఎం, ఇరిగేషన్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్
శాయంపేట: కస్తూర్బా పాఠశాల ప్రారంభానికి స్పీకర్ వస్తున్నారన్న సమాచారం స్పెషలాఫీసర్ శనివారం విద్యార్థులతో మొరం పోయించారు. పాఠశాల ఆవరణను చదును చేయించారు. వరంగల్ జిల్లాలో శాయంపేటలోని కస్తూర్బా పాఠశాల లోపల, బయటి ఆవరణ వర్షపునీటితో మడుగులా తయారైంది. అయితే, భవనం ప్రారంభించేందుకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వస్తున్నారని తెలుసుకొన్న స్పెషల్ ఆఫీసర్ తన సొంత ఖర్చులతో సుమారు 40 ట్రాక్టర్ ట్రిప్పుల మొరం పోయించారు. లెవలింగ్ చేయించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరారు. -
కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జెడ్పీ చైర్ పర్సన్
వరంగల్: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం సరిగ్గా ఉందా లేదా అని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. సాంబారులో ఎండిన కూరగాయలు, పుచ్చులు ఉండటంపై వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల పర్యవేక్షణ సరిగా లేనందుకు స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మీని మందలించారు. (ఏటూరునాగారం) -
రూ. 25 లక్షలు స్వాహా!
నంద్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది స్వాహాపర్వానికి పాల్పడినట్లు తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ పాలన కావడంతో ఇష్టారాజ్యంగా బిల్లులను డ్రా చేశారు. మున్సిపల్ కార్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అకౌంటెంట్ జనరల్ ఆడిట్లో రూ.25 లక్షలకుపైగా వ్యయానికి బిల్లులు, ఓచర్లు లేని విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ అక్రమాన్ని మేనేజ్ చేయడానికి సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికలు గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు రూ.80 లక్షలను రిజర్వ్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ అనుమతి తీసుకున్నారు. కాని ఎన్నికల వ్యయానికి రూ.21 లక్షలను కేటాయించినట్లు తెలిసింది. కాని నిధులు సరిపోలేదని రూ.64 లక్షలు జనరల్ ఫండ్స్, ఇతర నపద్దుల నుంచి రూ.14 లక్షలు బదలాయించి, ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యయానికి సంబంధించిన రికార్డులు, సమాచారాన్ని సిబ్బంది గోప్యంగా దాచారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ సమాచార హక్కు చట్టం ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను కోరగా, సిబ్బంది అసమగ్ర సమాచారాన్నిచ్చి, చేతులు దులుపుకున్నట్లు సమాచారం. వెలుగులోకి అక్రమాలు.. ఎన్నికల వ్యయంలో జరిగిన అక్రమాలు ఆడిట్లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల క్రితం అకౌంటెంట్ జనరల్ కార్యాలయ సిబ్బంది 2011-12 నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల వ్యయంలో పలు అక్రమాలు వెలుగు చూసినట్లు సమాచారం. స్టేషనరీ, భోజనాలు, సప్లయర్స్, పలు ఖర్చులకు సంబంధించి బిల్లులు, ఓచర్లు లేకుండానే డబ్బు డ్రా చేసినట్లు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ అనుమతి ఉందనే సాకుతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన జనరల్ ఫండ్స్ నుంచి రూ.64 లక్షలు, ఇతర ఖాతాల నుంచి రూ.14 లక్షలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆడిట్లో ఈ అక్రమాలు బయట పడటంతో ఎన్నికల విధులను నిర్వహించిన సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది. నకిలీ బిల్లులను సృష్టించి పంపించుకోవడానికి, ఆడిట్ సిబ్బందిని మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆడిట్ అధికారులు వెల్లడించడం లేదు. -
హరితహారం ఉద్యమంలా చేపట్టాలి
ప్రగతినగర్ : ‘తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జిలా ్లలో హరితహారం కింద తీసుకుంటున్న చర్యలను, ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో, ప్రజా ప్రతినిధులలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,ఆసుపత్రులు ఆవరణలో పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించినట్లయితే రోగులకు సగం జబ్బులు నివారించినట్లవుతుందన్నారు.అన్ని పీహెచ్‌సీలను ఆదర్శవంతమైన పీహెచ్‌సీలుగా రూపొందించాలని డీఎంహెచ్ఓ సూచించారు. పాఠశాలలు, కళాశాలలో, వసతిగృహాలలో మొక్కలు నాటించాలన్నారు. మహిళా సంఘాలు టేకు మొక్కలు పెంచడానికి అవసరమైన చర్యలు డీఆర్డీఏ ద్వారా చేపట్టాలన్నారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రోజు వారీగా మొక్కల పెంపకాల వెబ్సైట్ ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఎప్పటికప్పుడు నిర్దేశించిన సాప్ట్‌వేర్‌లో సమాచారాన్ని పొందుపర్చాలన్నారు.అన్నిగ్రామాల సర్పంచులకు సమావేశాలు ఏర్పటు చేసి తెలంగాణ హరితహారం గురించి పెంచాల్సిన మొక్కల గురించి తెలియచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కల పెంపకానికి సంబంధించి మొక్కల పేర్లు నాటిన తేదిలలో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఫారెస్ట్ అడీషన్ల్ ప్రిన్సిపాల్ వైబాబురావు,డీఎంహెచ్ఓ బసవేశ్వర్‌రావు,డీఈఓ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్?
జంటనగరాల పాలన బాధ్యతలను చూసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు బుధవారంతో ముగిసిపోనుంది. అయితే ఎన్నికలు మాత్రం ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పెషలాఫీసర్‌ను నియమించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ సోమవారం భేటీ అయ్యారు. అప్పుడే పాలకమండలి గడువు, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. -
సర్వేకు 2వేల వాహనాలు
మహబూబ్‌నగర్ క్రైం: మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర కు టుంబ సర్వేకు ఆర్టీఏ తరఫున అన్ని చర్య లు తీసుకున్నట్లు ఆర్టీఓ కిష్టయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేల వాహనాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సోమవారం జి ల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో సర్వే కోసం వినియోగిస్తున్న వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రతి డ్రైవరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించకూడదన్నారు. విధులకు హాజరవుతున్న డ్రైవర్లు తమకు కేటాయించిన ప్రాంతానికి సరైన సమయంలో చేరుకోవాలని సూచించారు. సర్వేలో పాల్గొంటున్న స్పెషల్ ఆఫీసర్, జోనల్ ఆధికారులు, మండల కోఆర్డినేటర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు ఈ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. గద్వాల, షాద్‌నగర్, కల్వకుర్తి, పెబ్బేరు, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల వారీగా ఓ ఎంవీఐ అధికారిని నియమించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాహనాలను సమకూర్చినట్లు వెల్లడించారు. సూదర గ్రామాలకు వెళ్లే సంబంధిత అధికారులు వారికి కేటాయించిన వాహనాల సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుభవం కలిగిన డ్రైవర్ల సేవలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కండి షన్లో ఉన్న వాహనాలను మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాలు ఎక్కడైన మరమ్మతులకు గురైతే వెంటనే మరో వాహనాన్ని పంపించే ఏర్పాట్లుచేశామని ఆర్టీఓ స్పష్టంచేశారు. -
నియోజకవర్గానికో గ్రామం
నిరుపేద దళితులకు మూడెకరాల భూపంపిణీలో మార్గదర్శకాలు మారిన నేపథ్యంలో... మండలానికో గ్రామం కాకుండా....నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. దీనికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఆర్డీఓలు ఉన్న చోట వారే ఆ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన గ్రామంలో వీలైనంత త్వరగా ‘‘ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, లేనిచోట ప్రత్యామ్నాయాలపై’’ ప్రత్యేక అధికారులు కసరత్తు చేస్తున్నారు. నీలగిరి దళితుల భూ పంపిణీ పథకంలో ఇటీవల ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తొలుత చెప్పిన విధంగా మండలానికో గ్రామం కాకుండా.. నియోజకవర్గానికి ఒక గ్రామంలో మాత్రమే భూ పంపిణీ చేపట్టాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే భూ పంపిణీని అమలు చేసేందుకు కొత్త మార్గదర్శకాలు అధికారులకు ఓ పరీక్షగా తయారయ్యాయి. దీంతో ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ అంతా కూడా మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. భూముల కోసం అన్వేషణ అధికారులు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వ భూములెన్ని ఉన్నాయి.. ఎంత మేర ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వ భూములు లేకపోవడంతో అధికారులు ప్రైవేటు భూముల అన్వేషణ మొదలుపెట్టారు. ఆగస్టు మొదటి వారంలోగా ఈ ప్ర క్రియ అంతా పూర్తిచేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. దీంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో 12 గ్రామాలను ఎంపిక చేశారు. అయితే కోదాడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో రెండేసి గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో భూమి లభ్యతను బట్టి ఏదేని ఒక గ్రామం ఎంపిక అవుతుంది. ఆయా గ్రామాల్లో భూ ముల లభ్యతకు సంబంధించి అధికారులు దృష్టి సారించారు. కొత్త మార్గదర్శకాలు.. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రధానంగా భూ లభ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామంలో ఎస్సీలు తక్కువగా ఉన్నప్పటికీ...ప్రైవేటు భూములు సాగుకు యోగ్యంగా ఉండేలా గుర్తించి ఖర్చును తగ్గిం చాలని పేర్కొన్నారు. దీనిపై బుధవారం జిల్లా అధికారులు పలుమార్లు చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సాగుకు యోగ్యమైన భూములను గుర్తించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. లబ్ధిదారులకే నిర్ణయాధికారం.. మండల స్థాయిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ ఉంటుంది. కానీ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇష్టపూర్వకంగానే భూమిని గుర్తిస్తారు. భూముల ధర నిర్ణయించే విషయంలో కూడా లబ్ధిదారుల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ గ్రామంలో ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరల ప్రకారం కొనుగోలు చేస్తారు. భూముల ధర నిర్ణయం ఖరారైన అయిన తర్వాత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రామాల్లో సాగు చేసుకుంటున్న భూములను అమ్ముకునేందుకు ఎవరూ ఇష్టపడే పరిస్థితి లేదు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ధర మూడింతలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేటు భూముల అన్వేషణ అధికారులకు కష్టంగా మారనుంది. మారిన నిబంధనలు ఇవీ... ఏడాదికి రూ.60 వేల ఆదాయం కలిగిన వ్యవసాయ కూలీకి ఎటువంటి భూములు లేనట్లయితే అర్హులు. ఎంపికైన గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేని పక్షంలో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కో ఎకరం ధర రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు నిర్ణయించారు. ఒకేచోట పది లేదా పదిహేను ఎకరాలు లభ్యమయ్యే పరిస్థితి ఉంటే వాటిని కొనుగోలు చేయాలి. దీనివల్ల లబ్ధిదారులు ఉమ్మడి వ్యవసాయం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అదీగాక కేంద్ర ప్రభుత్వ నుంచి అమలయ్యే ఇందిర జలప్రభ వంటి పథకాలను వీటికి వర్తింపజేసే వీలుంటుంది. భూముల్లో నీటి వసతి, భూగర్భ జలాలు, భూసార పరీక్షలను వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖలు నిర్వహించాలి.