spitting
-
బలవంతంగా ఉమ్మి నాకించారు
రాయ్‌బరేలీ: అధికారుల అనుమతి తీసుకోకుండా వీధి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు గాను తనను నేలపై ఉమ్మి వేసి నాకాలంటూ పోలీసులు బలవంతపెట్టారని ఓ గ్రామ పెద్ద ఆరోపించారు. ఘటనపై జిల్లా ఎస్పీ దర్యాప్తునకు ఆదేశించారు. రాయ్‌బరేలీ జిల్లా నసీరాబాద్ ప్రాంతంలోని కపూర్పూర్ గ్రామ పెద్ద ప్రతినిధి సుశీల్ శర్మ అక్టోబర్ 30వ తేదీన గ్రామంలో వీధి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్థానికులతోపాటు, అక్కడికి వెళ్లిన తమతో మద్యం మత్తులో ఉన్న సుశీల్ శర్మ తదితరులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. వీధి నాటక ప్రదర్శనకు అనుమతులు లేవని చెప్పారు. దీంతో, సుశీల్ శర్మ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అయితే, ఠాణాలో తమపై పోలీసులు చేయిచేసుకున్నారని, తనతో ఉమ్మి వేయించి, నాకాలంటూ పోలీసులు బలవంతం చేశారని సుశీల్ శర్మ ఆరోపించారు. నసీరాబాద్ ఎస్‌హెచ్‌వో శివకాంత్ పాండే 2 లక్షల లంచం డిమాండ్ చేశారన్నారు. ఈ మేరకు రా్రïÙ్టయ పంచాయతీ రాజ్ గ్రామ ప్రధాన్ సంఘటన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఘటనపై ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ యశ్వీర్ సింగ్ చెప్పారు. -
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్‌మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్‌తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్‌లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్‌తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!) -
Video: రెస్టారెంట్లో దరిద్రం.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
రోజూ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తిని బోర్ కొట్టి వారానికి ఒకసారి అయిన బయట భోజనం చేయాలని చాలా మందికి ఉంటుంది. హోటల్‌కి వెళ్లి నచ్చి ఆహారం తెచ్చుకోవడం లేదా ఆర్డర్ పెట్టడం చేస్తుంటారు. అయితే వెళ్లిన హోటల్ మంచిదేనా.. వారు వంట ఎలా చేస్తున్నారో అసలు పట్టించుకోం. రుచిగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ కొన్ని హోటళ్లలో కనీస శుచి, శుభ్రత పాటించకుండా దారుణంగా వంట చేస్తారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఆహార పదార్థాలు, స్నాక్స్ తయారు చేస్తూ వాటిలో ఉమ్మివేసిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి మరొ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్లో తందూరీ రోటీని తయారు చేస్తున్న ఓ వ్యక్తి పిండిపై ఉమ్మివేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గురువారం జరిగింది. సాహిదాబాద్ ప్రాంతంలోని రెస్టారెంట్లో తసీరుద్దీన్ అనే వ్యక్తి తందూరి రోటీలపై ఉమ్మివేస్తూ తయారు చేస్తున్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు రెస్టారెంట్‌ను మదీనా హోటల్‌గా గుర్తించిన తిలా మోర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై బుధవారం 269, 270 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని, అతనిపై చర్యలు తీసుకుంటామని సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూనమ్ మిశ్రా వెల్లడించారు. చదవండి: Delhi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..! Uttar Pradesh | A video was going viral on social media from the area under Tila More police station, in which a man was making rotis by applying spit. Accused Taseeruddin has been arrested in the case & further legal action is being taken: Poonam Mishra, ACP, Sahibabad (19.01) pic.twitter.com/cHi5jtOrwi — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 20, 2023 -
వీడేం మనిషి రా బాబు.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
-
పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా వైరల్‌గా మారింది. ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్ రాడ్‌ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమాన.. ఆ అధికారం కండక్టర్‌కే
ముంబై: ముంబై వాసులకు రవాణా సేవలందిస్తున్న బస్సుల్లో పాన్, గుట్క, పొగాకు నమిలి ఉమ్మివేసే ప్రయాణికులకు రూ.200 జరిమానా విధించాలని సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జరిమానా వసూలుచేసే అధికారం బస్సు డ్రైవర్, కండక్టర్‌కు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికున్ని పోలీసులకు అప్పగించే అధికారం కూడా వారికే కట్టబెట్టింది. దీంతో ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిల్లరాయుళ్లకు ముకుతాడు వేసినట్లైంది. బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో అనేక మందికి గుట్క, పాన్, సున్నం–తంబాకు (పొగాకు) నమిలే అలవాటుంది. సాధారణ (నాన్ ఏసీ) బస్సులో అయితే ఎక్కడైన బస్సు ఆగిన చోట లేదా అదను చూసుకుని కిటికిలోంచి బయటకు ఉమ్మివేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏసీ బస్సుల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేయడానికి ఏ మాత్రం వీలులేకుండా పోయింది. కిటికీలు, డోర్లు అన్ని మూసి ఉంటున్నాయి. ఒకవేళ ఉమ్మి వేయాలంటే కిందికి దిగాల్సిందే. దీంతో పాన్, గుట్కా నములుతున్న ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీటు కింద లేదా రెండు సీట్ల మధ్య ఖాళీగా ఉన్న స్ధలంలో మెల్లగా, ఎవరు చూడకుండా ఉమ్మి వేసి చేతులు దులుపేసుకుంటున్నారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి ప్రయాణికుల నిర్వాకంవల్ల బస్సు దుర్గంధంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి సీట్లవద్ద ప్రయాణికులు కూర్చోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. డిపోలో ఈ మరకలను శుభ్రం చేయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాన్, గుట్కా తిని ఉమ్మివేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ రూ.200 జరిమాన వసూలు చేయనున్నారు. జరిమాన చెల్లించేందుకు నిరాకరిస్తే బస్సు వెళ్లే రూట్లో మార్గమధ్యలో ఎక్కడైన పోలీసు స్టేషన్ లేదా చౌకి ఉంటే అక్కడ ఉమ్మివేసిన వారిని అప్పగించే బాధ్యతలు సిబ్బందికి కట్టబెట్టింది. అయితే ఇలా ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిళ్ల రాయుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు, జనాలను జాగృతం చేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్మెంట్ చేసే సిస్టంను అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంతమంది ప్రయాణికుల్లోనైన మార్పు వస్తుందని సంస్ధ భావిస్తోంది. -
Wimbledon 2022: నిక్ కిరియోస్‌పై 10 వేల డాలర్ల జరిమానా
ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్‌పై వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు 10 వేల డాలర్ల (రూ. 7 లక్షల 90 వేలు) జరిమానా విధించారు. తొలి రౌండ్ మ్యాచ్ అనంతరం గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడివైపు కిరియోస్ ఉమ్మి వేశాడు. మ్యాచ్ సందర్భంగా ఆ ప్రేక్షకుడు విసిగించాడని, అందుకే అతనివైపు ఉమ్మి వేశానని కిరియోస్ అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అనుచిత ప్రవర్తన కారణంగా 13 మంది ప్లేయర్లపై జరిమానా విధించారు. -
యువతి స్పెషల్ టాలెంట్.. సెల్‌ఫోన్‌పై తుపుక్.. తుపుక్ అని ఉమ్మేసి.. !
సోషల్ మీడియా వాడుతున్న యూజర్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు ఇలా ఒకటేంటి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నెట్టింట దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్‌గా మారి అందులోని వాళ్లు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఘటనలు ఉన్నాయి. అందుకే ప్రపంచ నలుమూలల జరిగిన వీడియోలు క్షణాల్లో సోషల్‌మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ యువతి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన ఓ యువతికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది. సాధారణంగా ఎవరైనా తమ ఫోన్లను చేతివేళ్లతో అన్‌లాక్ చేస్తారు. అయితే రోటీన్‌కి భిన్నంగా ఆ యువతి తన లాలాజలంతో మొబైల్‌ని అన్ లాక్ చేస్తుంది. మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ అన్‌లాక్‌ని చేతివేళ్లు, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్ చేస్తుంటారు. ఆమె మాత్రం అలా చేయకుండా తన ఉమ్మితో ఫోన్‌ను అన్ లాక్ చేస్తోంది. ఇటీవల తాను స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లింది. అక్కడ తన ఫోన్‌ని ఉమ్మితో అన్ లాక్ చేస్తానని పందెం కాసింది. ఇంకేముంది ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ మీద మీద ఉమ్ముతూ ఫోన్ లాక్ చేసింది. అందరు చూస్తుండగానే ఫోన్ పై ఉమ్ముతూ సెల్ ఫోన్ లాక్ తీసింది. మొదట్లో ఆమె చెబితే ఎవరూ నమ్మలేదు గానీ తర్వాత యువతి అలా చేసేసరికి అక్కడి వారు షాకయ్యారు. ఆమె స్పెషల్ ట్యాలెంట్‌ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A girl using her spit to unlock her phone. 🃏 pic.twitter.com/dhMfaj6dYV — Public Outsider (@publicoutsider) April 25, 2022 చదవండి: క్లాస్‌లో అందరి ముందే లవర్‌కు ముద్దుపెట్టిన అబ్బాయి.. తరువాత ఏం జరిగిందంటే.. -
దళితులపై దాష్టీకం.. గుంజీలు తీయించి, ఉమ్మి నాకించి అవమానం
దేశంలో దళితులపై భౌతిక దాడులు జరుగుతునే ఉన్నాయి. ఇంకా గ్రామల్లో పెద్ద మనుషులు వారిపై దాష్టీకానికి తెగపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు ఓటు వేయలేదనే కోపంతో ఇద్దరు దళితులను దారుణంగా వేధించాడు. పైశాచింకంగా గుంజీలు తీయించి.. రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లో ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు సదరు దళితులు ఓటు వేయలేదని బల్వంత్ సింగ్ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు. ఓటు వేయాలని వారికి డబ్బులు ఇచ్చానని, వారు ఓటువేకపోవటంతో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయానని దూషించాడు. వారిద్దని రోడ్డు మీదకు లాక్కొచ్చి.. ఓటు వేయనందుకు శిక్షగా గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా అవమానపరచాలని బలంవంతంగా రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బల్వంత్ సింగ్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. #Casteism A Dalit man made to do sit-ups, lick spit. A candidate for the post of Panchayat head, Balwant Singh, has been accused of blaming the Dalit community for his loss & beating up two people from the community as they allegedly did not vote for him.. pic.twitter.com/6102KQzeJZ — The Dalit Voice (@ambedkariteIND) December 13, 2021 -
తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో..
పట్నా(బిహార్): క్షణికావేశంలో జరిగే సంఘటనలు ఒక్కొసారి వ్యక్తుల ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం వార్తలలో చదువుతుంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సివాన్జిల్లాలోని పోఖ్రాప్రాంతంలో అహ్సాన్ మాలిక్ అనేవ్యక్తి.. వీధిలో బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతంలో.. రెండో అంతస్థులో తన మిత్రులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోని బాల్కని ఉన్న కిటికీ నుంచి అనుకోకుండా పాన్తిని కిందకు ఉమ్మివేశాడు. అది కాస్త.. కింద నిలబడిన ఒక వ్యక్తిపై పడింది. అతను కోపంతో ఊగిపోయి.. అహ్సాన్ ఇంటికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా క్షణికావేశంలో అహ్సాన్ మాలిక్‌ను కాల్చిచంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుల్లెట్ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు -
విద్యార్థిపై టీచర్ కర్కశం.. ఉమ్ము కింద పడిందని...
సాక్షి,శంకర్పల్లి: తరగతిగదిలోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుంటే నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశం ప్రద ర్శించారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్‌కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చదవండి: అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో చితకబాదారు. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచి్చన బాలుడి ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్‌ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని బదులిచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. సస్పెన్షన్ వేటు విద్యార్థి సంజీవ్‌కుమార్‌ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతపై డీఈవో సుశీందర్‌రావు గురువారం వేటు వేశారు. -
వైరల్ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ
లక్నో: సాధారణంగా బయట ఆహారం తీసుకోవాడానికి చాలామంది ఇష్టపడరు. ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు.. వంట చేసేవాళ్లు.. అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో లేదో తెలియదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ భయం మరింత పెరిగింది. పైగా అప్పుడప్పుడు కొందరు నికృష్టపు పనులు చేస్తూ ఉంటారు. గతంలో పానీపూరీ బండి వ్యక్తి ఎలాంటి నీచమైన పని చేశాడో చూశాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తందూరి రోటీలు చేస్తున్న వ్యక్తి వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత కాలుస్తున్నాడు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ధాబాలో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత రోటీ చేసి.. వాటిని కాలుస్తాడు. (చదవండి: వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!) ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం ధాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఇది కాస్త వైరల్‌గా మారడమే కాక సదరు ధాబా మీద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..? गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8 — Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021 -
మనోళ్ల ‘ఉమ్మి’ తుడవడానికి వెయ్యి కోట్ల పైనే!
లాక్డౌన్ టైంలో మీరొకటి గమనించారా?.. రోడ్ల మీద బహిరంగ మలమూత్ర విసర్జనలు, ఉమ్మేయడాలు లాంటి చర్యలు బాగా తగ్గిపోయాయి. అఫ్కోర్స్.. బయటికి రాకపోవడం వల్ల చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే జనసంచారం మొదలైందో.. మళ్లీ ఈ వ్యవహారం పుంజుకుంది. ‘దయచేసి ఇక్కడ ఉమ్మేయకండి’.. అని వాళ్ల వాళ్ల భాషల్లో అర్థమయ్యేలా బోర్డులు రాసి పెడుతున్నప్పటికీ.. మొహమాటానికి కూడా పోకుండా ఉమ్మేయడం మనవాళ్లకి అలవాటైన వ్యవహారమే!. ఇక రోడ్ల సంగతి పక్కనపెడితే.. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో, పట్టాల మీద.. ఆఖరికి రైళ్ల మీద కూడా నిర్మొహమాటంగా ఉమ్మేస్తుంటారు. మరి ఆ మరకల్ని పొగొట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక ఏడాదికి ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా? ► పాన్ పరాగ్, గుట్కా(నిషేధం ఉన్నా కూడా), తంబాకు.. ఉమ్మి మరకల్ని, సిగరెట్ గుర్తులను పొగొట్టేందుకు సాలీనా 1,200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది భారతీయ రైల్వే శాఖ. ► అదనంగా శుభ్రం చేయడం కోసం గాలన్ల గాలన్ల నీటిని ఉపయోగించాల్సి వస్తోంది. ► బహిరంగంగా ఉమ్మేయడం చాలామందికి అలవాటుగా ఉన్నా.. కొందరికి ఇదంతా ఇబ్బంది కలిగించే అంశం. ► ‘దయచేసి నన్ను వాడండి’.. అని రాసి ఉండే డస్ట్బిన్లను, మట్టి డబ్బాలను ఉపయోగించకుండా.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం చూస్తుంటాం. ► శుభ్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రత్యేకించి గైడ్‌లైన్స్ లేకపోవడం, కఠిన చర్యలు లేకపోవడంతో గుట్కా బాబులు పద్దతి మార్చుకోలేకపోతున్నారు. ► ముఖ్యంగా కరోనా టైం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యం కనిపిస్తోంది. ► ఇంతకాలం విజ్ఞప్తులు-హెచ్చరిక బోర్డులు, ఛలానా వార్నింగ్ నోటీసులతో సరిపెట్టిన రైల్వే శాఖ.. తాజాగా వినూత్న ఆలోచనకు దిగింది. ► గ్రీన్ ఇన్నొవేషన్‌లో భాగంగా.. రీయూజబుల్, బయోడెగ్రేడబుల్ స్పిట్టూన్‌ను తీసుకొచ్చింది. పాకెట్ సైజులో ఉండే జీ స్పిట్టూన్‌ను డిస్పోజ్ చేసినప్పుడు మొక్కలు మొలుస్తాయి. ► దేశవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లలో ఐదు నుంచి పది రూపాయల ధరకు ఈ పాకెట్‌సైజ్ డబ్బాల్ని అందిస్తున్నారు. ► ఎజైస్పిట్ అనే స్టార్టప్ పశ్చిమ, నార్తర్న్, సెంట్రల్ రైల్వే జోన్లలో కాంట్రాక్ట్ తీసుకుంది. ► ఈ స్పిట్టూన్ బ్యాగ్‌లు మట్టిలో సైతం కలిసిపోతాయి. ► మరకలు లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. మరి ఈ మార్పు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!! చదవండి: మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు -
ఉమ్మితే పర్సు ఖాళీ.. రూ.1,200 జరిమానా
ముంబై: ముంబైలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు బీఎంసీ హెచ్చరించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఉమ్మితే రూ.200 గా ఉన్న జరిమానా ఇపుడు రూ.1,200కి పెంచారు. ఇటీవలె బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ జరిమానా పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆరు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తుల నుంచి రూ.రూ. 28.67 లక్షల జరిమానా రూపంలో బీఎంసీ వసూలు చేసింది. కేవలం సాకినాకల ప్రాంతంలోని ఎల్ వార్డు నుంచి రూ .4.70 లక్షలు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే రూ.200 వసూలు చేస్తూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి నుంచి రూ.1,200 వసూలు చేయడాన్ని హైకోర్టు బీఎంసీని ప్రశ్నించింది. -
దారుణం: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు దాడి!
సాక్షి, మలక్‌పేట: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)పై చేయి చేసుకోవడమే కాకుండా అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు, పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ వాక్సిన్ వేయించుకోవడానికి ఆదివారం శాలివాహననగర్ యూపీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకున్నారు. ఓల్డ్‌మలక్‌పేట డివిజన్లో పని చేస్తున్న ఎస్ఎఫ్ఏ సుదర్శన్ కూడా వాక్సిన్ తీసుకొవడానికి అక్కడి వచ్చాడు. సుదర్శన్‌ను తీసుకెళ్లడానికి అతడి కుమారుడు దేవేందర్ ఆసుపత్రికి వచ్చాడు. మూసారంబాగ్‌కు చెందిన పాండురావు తన ఇద్దరు కొడుకులు రమేష్, జగదీష్‌లను తీసుకొని ఆసుపత్రికి వచ్చాడు. పాండురావు ఆసుపత్రి ఆవరణలో ఉమ్మివేస్తుండగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఆసుపత్రి ఆవరణలో ఉమ్మివేయద్దొని దేవేందర్ చెప్పాడు. పాండురావు బూతులు తిడుతూ ఎక్కడ ఉమ్మి వేయాలని అతనిపై ఆగ్రహించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో పక్కనే ఉన్న అతని కొడుకులు దేవేందర్‌పై దాడి చేసి కొట్టగా కుడి కన్నుపై గాయమైంది. అడ్డుకోబోయిన దేవేందర్ తండ్రి ఎస్ఎఫ్ఏ సుదర్శన్‌పై కూడా చేయి చేసుకున్నారు. సుదర్శన్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవేందర్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంఈయూ నాయకులు, బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ అధ్యక్షుడు ఊదరి గోపాల్, శ్రీహరి, రాము ఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. విధి నిర్వాహణలో ఉన్న ఎస్ఎఫ్ఏపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు. చదవండి: కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు! -
వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా పాన్ మసాలా, జర్దా, గుట్కాలకు దూరంగా ఉండడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ కూడదంటూ భారత వైద్య పరిశోధన మండలి గత మార్చి నెలలో దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినట్లయితే జరిమానా విధిస్తామంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ నాలుగో తేదీన ఉత్తర్వులు జారీ చేశాయి. జరిమానాను రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు పేర్కొన్నాయి. చదవండి: కోవిడ్ శాంపిల్ కోసం రోబో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం, జూదంపై విధించిన నిషేధం నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ వరకు అమలవుతుండగా, ఉమ్మ కూడదన్న నిబంధన అసలు ఏమాత్రం అమలవడం లేదనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. నోటి నిండా మీటా పాన్ లేదా జర్దా పాన్ దట్టించడం, కసాపిసా నమలి రోడ్డు పక్కనో, గోడల మీదో తుపుక్కున ఉమ్మేయడం మహా నగరాల వీదుల్లో మనకు నిత్యం కనిపించే దశ్యాలే. పాన్లు గీన్లు ఏమీ వేసుకోక పోయినా వీధుల్లో ఉమ్మడం, ముక్కులు చీదడం మనకు కొత్త కాదు. కరోనా లాంటి వైరస్ల ద్వారా వచ్చే అంటు రోగాలను అరికట్టడంలో భాగంగా ఉమ్మ కూడదనే నిబంధనను తీసుకొచ్చినప్పటికీ అది దేశంలో ఎక్కడా సరిగ్గా అమలు కాకపోవడానికి కారణాలేమిటీ? నిబంధనను అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడమా, ఉమ్మడం తమ స్వేచ్ఛలో భాగమని భావించే ప్రజలు తమ వైఖరిని మార్చుకోవడానికి సుముఖంగా లేకపోవడం కారణమా? మరి పౌరుల ప్రవర్తనలో ఎలా మర్పు తీసుకరావాలి? 19వ శతాబ్దంలో అమెరికాను వణికిస్తోన్న టీబీ (ఉమ్మి ద్వారానే టీబీ ఇతరులకు వ్యాపిస్తుందని తెల్సిందే)ని అరికట్టడం కోసం అక్కడి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయింది. 1910లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలోని 74 నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకరాగా, చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా 34 నగరాల్లో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 13 రాష్ట్రాల్లో ఈ చట్టడం కింద ఓ 20 మందిని అరెస్ట్ చేయగా, ఒక్క న్యూయార్క్ నగరంలో 2,513 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఖ్య ఇలాంటి కేసుల్లో దేశం మొత్తం మీద అరెస్ట్ అయిన వారిలో 73 శాతం. ఉమ్మి వేయడాన్ని అరికట్టడం కోసం చట్టాలు తీసుకొచ్చి, అరెస్ట్‌లు చేసినంత మాత్రాన, ఉమ్మడం తమ స్వేచ్ఛలో అంతర్భాగమని భావించే ప్రజల వైఖరిలో మార్పురాదని అమెరికా ప్రజారోగ్య విభాగం నాడు అవగాహనకు వచ్చింది. చట్టాలతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకరావడం ఇంకా ముఖ్యమని భావించింది. ఉమ్మడం ద్వారా ఇతరులు ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాస్తున్నామన్న భావన నగర పౌరుల్లో తీసుకరావడంతోపాటు ఉమ్మక పోవడం ఓ సామాజిక బాధ్యతగా, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే పౌరులకు సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. న్యూయార్క్ నగరం పాలక మండలి ఆధ్వర్యాన దేశంలోని పలు నగరాలు ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి విస్తత కార్యక్రమాలను నిర్వహించింది. ఉమ్మడం, దాని పర్యవసనాల గురించి టాక్సీలపై, కార్లపై, బస్సులపై పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. వీధుల్లో, ఇళ్లల్లో కరపత్రాల ప్రచారాన్ని చేపట్టింది. మొబైల్‌తోపాటు అన్ని ప్రసార, ప్రచార మాద్యమాలను ఉపయోగించుకొని ప్రచారాన్ని ఉధతం చేసింది. రోడ్లపై ఉమ్మవేసిన వారిని వార్తా పత్రికలు, ఇతర ప్రసార మాద్యమాల ద్వారా గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించింది. ఉమ్మవేసే వారిని చిన్న చూపు చూడండంటూ ప్రతి సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది. జరిమానాలు విధించింది. ఈ విషయంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సంఘాలతోపాటు ఎన్జీవో సంస్థల సేవలను ఉపయోగించుకుంది. నాటి ఉమ్మడం వ్యతిరేక ఉద్యమంలో నేషనల్ ట్యూబర్కులోసిస్ అసోసియేషన్, విమెన్స్ హెల్త్ ప్రొటెక్టివ్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ విమెన్స్ క్లబ్స్ క్రియాశీలక పాత్ర వహించాయి. మరోపక్క మున్సిపల్ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి ప్రత్యేక కుండీలను ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో ప్రతి బహిరంగ ప్రదేశంలో శానిటరీ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఇలాంటి విస్తత ప్రచార కార్యక్రమాలతో మూడేళ్లలోనే ఉమ్మివేయడంపై విధించిన నిషేధాన్ని నూటికి నూరు పాళ్లు అమెరికా నగర పాలక అధికారులు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఫలితంగా టీబీ వ్యాప్తిని అమెరికా ప్రజారోగ్య శాఖ అరికట్టగలిగింది. -
కోవిడ్ శాంపిల్ కోసం రోబో
సింగపూర్: గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10 సెంటీమీటర్ల లోతు నుంచి శాంపిల్‌ను సేకరిస్తుంది. వివిధ రకాల ముక్కు పరిమాణాలు ఉన్న వారికీ అసౌకర్యం కలగకుండా శాంపిల్‌ను తీసుకుందని పరిశోధనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ రోబో వల్ల శాంపిళ్లను సేకరించే వారికి వ్యాధి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా
‘కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. 1939లో అమల్లోకి వచ్చిన ప్రజారోగ్యచట్టం ప్రకారం ప్రజలకు ఆరోగ్యవసతులు కల్పించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఉమ్మేయడం, వీధుల్లో చెత్త వేయడంపై నిషేధం విధిస్తూ 2002లో మరో చట్టం వచ్చింది. కాగితాలకే పరిమితమైన ఈ చట్టా న్ని అమలు చేసేందుకు తీవ్రమైన చర్యలు చేపట్టాలి. తమిళనాడులో జనాభా దామాషా ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు పర్యవేక్షణ లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం, మూత్ర విసర్జన నిరోధించలేకపోయారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. వైద్యవ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులను శాస్త్రీయంగా విభంజించి నిర్మూలించాలి. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో తగిన మరుగుదొడ్ల వసతి ఉందోలేదో తనిఖీ చేయాలి. ఘనవ్యర్థాల మేనేజ్మెంట్ విధులను కఠినంగా అమలుచేయాలి. వీధుల్లో నివసించే వారిని కేటగిరి వారీగా విభజించి శరణాలయాలకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, హేమలతతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. సదరు పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఒకటి నుంచి మాస్క్‌ల పంపిణీ ఇంటింటికీ ఉచిత మాస్కుల పంపిణీకి ఆగస్టు 1వ తేదీ నుంచి టోకెన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్నిమార్లు ప్రచారం చేసినా ప్రజల్లో అధిక శాతం మాస్కులు ధరించనందునే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సంకల్పించింది. మాస్కుల పంపిణీ సులువుగా సాగేందుకు రేషన్ దుకాణదారులు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో ఇంటింటా టోకన్లు పంపిణీ చేయనున్నట్టు గురువారం తెలిపింది. ఇదిలావుండగా లాక్డౌన్ కారణంగా అమెరికా, నెదర్లాండ్, సౌదీ, కతర్, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో చిక్కుకున్న 834 మంది భారతీయులు ఆరు ప్రత్యేక విమానాల ద్వారా గురువారం చెన్నైకి చేరుకున్నారు. -
రోడ్డుపై ఉమ్మి, చేతులతో క్లీన్ చేసి
చండీగఢ్: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఫేస్ మాస్కు ధరించకపోయినా, అనవసరంగా రోడ్ల మీదకు వచ్చినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా రోడ్డుపై ఉమ్మివేశాడు. అయితే కొన్ని క్షణాలకే తిరిగొచ్చి మరీ దాన్ని క్లీన్ చేసిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. పిల్లాడిని వెంటేసుకుని ఓ వ్యక్తి బైక్‌పై వెళుతున్నాడు. తననెవరూ గమనించట్లేదనుకున్నాడో ఏమో కానీ రోడ్డుపై ఉమ్మేశాడు. దీన్ని గమనించిన బల్దేవ్ సింగ్ అనే ట్రాఫిక్ వలంటీర్ అతడిని ఆపేశాడు. (లాక్డౌన్: రోడ్లపై అడవి జంతువుల కలకలం) సదరు వ్యక్తి ఉమ్మిన ప్రదేశాన్ని అతనితోనే శుభ్రం చేయించాడు. విశేషమేంటంటే ఇందులో అతను రోడ్డుపై కూర్చొని తన స్వహస్తాలతో క్లీన్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా ప్రధాని మోదీ సైతం రోడ్లపై ఉమ్మివేయరాదని ప్రజలను కోరిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రాథమిక పరిశుభ్రత మెరుగవుతుందని, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా వుండగా కరోనా ముఖ్యంగా నోరు, ముక్కుతో పాటు కంటి ద్వారా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. (వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు) -
ఆ దురలవాటుపై ప్రధాని మోదీ అసంతృప్తి
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని ‘స్వచ్ఛభారత్’లో పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాటల్ని దేశ ప్రజానీకం పట్టించుకోలేదు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ దురలవాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం కరోనా వ్యాప్తిని ఎక్కువ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కరోనా కట్టడికి ఈ ‘అలవాటు’ను మానుకోవాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. ‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సరైన పద్ధతి కాదని మనందరికీ తెలుసు. చాలా చోట్ల ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిని నిర్మూలించేందుకు ఈ వైరస్ క్లిష్ట సమయమే సరైన సమయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆ దురలవాటును దూరం చేసుకుంటే పరిశుభ్రతను పెంచడంతోపాటు, కోవిడ్‌తో పోరుకు బలం సమకూరుతుందని అన్నారు. లేకపోతే ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినట్టేనని ఆయన హెచ్చరించారు. కోవిడ్ పోరులో ప్రజలు సహకారం బాగుందని ప్రధాని ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: 'కరోనాపై సైనికుల్లా యుద్దం చేస్తున్నారు') కాగా, కోవిడ్ బాధితులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరగుతుందనే విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఉమ్మివేయకుండా.. నిషేదం విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతోపాటు పాన్ గుట్కా అమ్మకాలను నిషేధించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా బహిరంగంగా ఉమ్మే అలవాటును మానుకోవాలని సూచించింది. ఇక ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు, ముంబై నగర పాలక సంస్థ బహిరంగంగా ఉమ్మితే నేరంగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేశాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1990 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 26,496కు చేరింది. ఒక రోజు ఇంత స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు వైరస్ బారినపడి 824 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: వధూవరులకు కరోనా, గ్రామానికి సీల్) -
యువతిపై ఉమ్మేసిన వ్యక్తి అరెస్టు
ముంబై: యువతిపై ఉమ్మివేసి వికృత చర్యకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన మంగళవారం ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో మణిపురికి చెందిన యువతి ఏప్రిల్ 6న నిత్యావసరాలు తెచ్చుకునేందుకు గీతా విహార్ జంక్షన్ నుంచి కలీనా మిలటరీ క్యాంప్ వైపుగా వెళ్లింది. సరిగ్గా ఇదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యుకుడు బైక్ స్పీడు తగ్గించి ఆమెను సమీపించాడు. అనంతరం ఆమె దుస్తులపై ఉమ్మివేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో కావాలని కరోనాను అంటించాలనే ఉద్దేశ్యంతోనే సదరు వ్యక్తి ఇలా చేసుంటాడని ఆ యువతి భయభ్రాంతులకు గురై పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సుమారు పది రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. అతడు పశ్చిమ ముంబైలోని కుర్లాలో నివసించే అమిర్ఖాన్గా గుర్తించారు. కాగా దేశంలో పలుచోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. (ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు!) (కరోనా వైరస్ ; నటుడిపై దాడి) -
వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు
చెన్నై : తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి ఉమ్మి వేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్ శనివారం రోజున చేరాడు. అయితే అతడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు సహకరించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం
-
కరోనా : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. రోడ్లు, వివిధ పబ్లిక్, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకూ ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే అవకాశముంది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, లేదా ఉమ్మి వేయడం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం’ అని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: కరోనా పోరు: బీసీజీ టీకాతో భారత్‌కు ఎంతో మేలు!) (చదవండి: 400 జిల్లాల్లో మహమ్మారి జాడ లేదు..)