sudden death
-
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?
లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. ఉత్తర ప్రదేశ్ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్లోనే సదాఫ్ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది. అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024 పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది. -
Michaela DePrince: నృత్యం కాదు ‘యుద్ధమే’ చేసింది
‘మేము షాక్‌లో ఉన్నాం’ అంటూ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణంపై స్పందించారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే 29 ఏళ్ల ‘బ్యాలే ఐకాన్’ మైఖేలా డిప్రిన్స్ మరణం ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే బ్యాలే ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకున్న మైఖేలా డిప్రిన్స్ తన కీర్తి దగ్గరే ఆగిపోలేదు. ఆఫ్రికాలోని తన మూలాల్లోకి వెళ్లింది. యుద్ధ బాధిత పిల్లల కన్నీళ్లు తుడిచింది. వారికి ధైర్యాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్లింది.దేశంలో ఎటు చూసినా అల్లర్లు. అంతులేని హింస. ఆ అంతర్యుద్ధకాలంలో మూడేళ్ల మాబింటి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. బంధువులు ముఖం చాటేశారు. అనాథాశ్రమంలోనూ ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడింది. చర్మ సమస్యలతో బాధ పడుతున్న మాబింటిని తోటి వాళ్లు ‘దెయ్యం పిల్ల’ అని వెక్కిరించేవాళ్లు. ఒక అమెరికన్ కుటుంబం మాబింటి బంగురాను దత్తత తీసుకోవడంతో ఆమె పేరు మైఖేలా డిప్రిన్స్గా మారింది. కష్టాలకు ‘శుభం’ కార్డు పడినట్లు అనిపించినా అది తాత్కాలికమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురొచ్చేవి.ఐదవ ఏట బ్యాలేలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది డిప్రిన్స్. రాక్ స్కూల్ ఫర్ డ్యాన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అయిన డిప్రిన్స్ ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ బ్యాలే థియేటర్లో చదవడానికి ఎంపికైంది. కెరీర్ ప్రారంభంలోనే ‘బోస్టన్ బ్యాలే’లాంటి ప్రసిద్ధ కంపెనీలతో కలిసి పనిచేసింది.కొద్దికాలంలోనే ‘బ్యాలే’ లో ప్రపంచస్థాయి గుర్తింపు పోందింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత ప్రసిద్ధ హార్లెం డాన్స్ థియేటర్లో అది పిన్న వయస్కురాలు అయిన మెయిన్ డ్యాన్సర్‌గా డిప్రిన్స్ చరిత్ర సృష్టించింది. వృత్తి విజయాల మాట ఎలా ఉన్నా మరోవైపు... జాత్యహంకార కామెంట్స్ డిప్రిన్స్కు తరచుగా ఎదురయ్యేవి. అయితే తనని ఎవరైనా కించపరిచేలా కామెంట్ చేస్తే గట్టిగా సమాధానం చెప్పేది. తన జాతి జనుల గురించి, వారి సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడేది.‘బ్యాలే’కు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో మానవత్వానికి అద్దం పట్టే కార్యక్రమాలకూ అంతే ప్రాధాన్యత ఇచ్చేది. తాను పుట్టి పెరిగిన ఆఫ్రికాలోని సియోర లియోన్ దేశంలో పేద పిల్లల కోసం డ్యాన్స్ స్కూల్ స్థాపించింది.‘మార్పు తెచ్చే శక్తి కళకు ఉంది. నా విషయానికి వస్తే నృత్యం అనేది ఇతరులతో నా భావోద్వేగాలను పంచుకోవడానికి ఉపకరణంలా పనికి వచ్చింది’ అనేది డిప్రిన్స్.‘వార్ చైల్డ్ నెదర్ల్యాండ్స్’ అంబాసిడర్‌గా పనిచేసిన డిప్రిన్స్ ‘డేర్ టు డ్రీమ్’ సంస్థ ద్వారా యుద్ధబాధిత పిల్లల మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసింది. సేవారంగంలో డిప్రిన్స్ కృషిపై ‘ఫస్ట్ పోజిషన్’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. డిప్రిన్స్ ఎదుర్కొన్న కష్టాలకు ఆమె రాసిన ‘టేకింగ్ ఫ్లైట్: ఫ్రమ్ వార్ ఆర్ఫన్ టు స్టార్ బ్యాలెరీన’ పుస్తకం అద్దం పడుతుంది.తాము పని చేస్తున్న రంగంలో పెద్ద పేరు రాగానే చాలామంది కళ్లు ఆకాశానికేసి మాత్రమే చూస్తాయి. కాని మైఖేలా డిప్రిన్స్ విషయంలో అలా జరగలేదు. ఆమె నేల కేసి చూడడమే కాదు, తాను నడిచి వచ్చిన దారిని బాగా గుర్తు పెట్టుకుంది.అందుకే ‘బ్యాలే ఐకాన్’గా కంటే ‘మానవతావాది’ ‘ఆత్మాభిమానం మూర్తీభవించిన సాహసి’గా మైఖేలా డిప్రిన్స్ను గుర్తు తెచ్చుకోవడానికి అభిమానులు ఇష్టపడతారు.కూతురిని వెదుక్కుంటూ వెళ్లిందితన కుమార్తె మైఖేలా డిప్రిన్స్ మరణించిన 24 గంటల్లోనే ఆమె తల్లి ఎలైన్ డిప్రిన్స్ కన్నుమూసింది. ఆస్పత్రిలో సర్జరీకి సన్నద్ధమవుతున్న సమయంలో ఎలైన్‌కు కుమార్తె మరణం గురించి తెలియదు. డిప్రిన్స్ను దత్తపుత్రిక అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సొంతబిడ్డలాగే చూసుకుంది. బ్యాలేపై డిప్రిన్స్ ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించింది. ఎలైన్, చార్లెస్ దంపతులకు 11 మంది పిల్లలు. వీరిలో తొమ్మిదిమంది దత్తత తీసుకున్న పిల్లలే. -
డ్యాన్స్ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్ గుండె
గుండె ఆగిపోయి.. హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో.. అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. Delhi Police Head Constable Dies of Heart Attack During Farewell PartyDelhi Police Head Constable Ravi Kumar, posted at Roop Nagar police station in North District, died of a heart attack on Wednesday evening. Kumar was attending a farewell party at the police station when he… pic.twitter.com/rfXSKGdcpa— Atulkrishan (@iAtulKrishan1) August 29, 2024 -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
పసిపిల్లలను నిద్రలోనే బలితీసుకుంటున్న ఎస్‌యూడీసీ!
అడుతూ పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే.. గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కళ్లు మూస్తే? ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగుకోలేరు కూడా. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూండటం. సౌత్ ఇంగ్లాండ్‌లోని బాన్‌బరీలో ఇటీవలే 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? కారణాలేమిటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? ఊహూ... ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నో అనే చెప్పాలి. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఛైల్డ్‌హుడ్ (ఎస్‌యూడీసీ) అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకూ ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్‌బరీలో జరిగిన ఘటననే ఉదాహరణగా తీసుకుంటే...13 ఏళ్ల మాథ్యూ కౌలీ ముందురోజు రాత్రి... స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకుని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్ట్‌మార్టంలోనూ మరణానికి కారణమేమిటన్నది స్పష్టం కాలేదు. ఎస్‌యూడీసీ అంటే... వైద్యుల అభిప్రాయం ప్రకారం, సడన్ అన్ ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్‌యూడీసీ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఏటా 40 - 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని వైద్యులు రిచర్డ్ ట్సీన్, ఓరిన్ డెవిన్స్కీ నేతృత్వంలో ఎస్యూడీసీకి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్‌యూడీసీ బాధితుల శరీరాల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు (ఉత్పరివర్తనాలు ఇంగ్లీషులో మ్యూటేషన్స్)లను గుర్తించారు. బాధితుల డీఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యుమార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు. డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80 శాతం పిల్లలకూ సంక్రమించాయి. మొత్తం జన్యుమార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు వందలో తొమ్మిది మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్‌లో మార్పు SUDCలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని జన్యుపరమైన ప్రమాద కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి. -
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’
Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. भिवानी में घटी दुखद घटना, श्री राम मूर्ति प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हनुमान बने कलाकार ने त्यागे प्राण,भगवान राम की झांकी के दौरान श्री राम के चरणों में त्यागे प्राण।डॉक्टरों के मुताबिक कलाकार को हार्ट अटैक आने से हुई मौत। #RamMandirPranPrathistha #Haryana #bhiwani… pic.twitter.com/uBRwsRcT50 — Haryana Tak (@haryana_tak) January 23, 2024 Video Credits: Haryana Tak మృతుడి పేరును హరీష్ మెహతా. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్‌ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
పెప్పర్ఫ్రై సీఈవో అనూహ్య మరణం: లాస్ట్పోస్ట్, వీడియో వైరల్
Ambareesh Murty Instapost viral ఆన్లైన్ ఫర్నిచర్ సంస్థ పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు సీఈవో అంబరీష్ మూర్తి ఆకస్మిక మరణం తరువాత ఏ నిమిషానికి ఏం జరుగునో..ఈ మాటలు కచ్చితంగా గుర్తొస్తాయి ఎవరికైనా. లేహ్‌లో విహార యాత్రలో ఉండగా గుండెపోటుతో మూర్తి కన్నుమూయడం దిగ్ర్భాంతికిగురించి చేసింది. ఈసందర్బంగా ఆగస్టు 6న ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ వీడియో వైరల్‌గా మారింది. మోటార్ సైకిల్ డైరీస్ (వై మీ :)?)" అని టైటిల్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బైకర్, ట్రెక్కర్ మూర్తి మోటార్‌సైకిల్‌తో కొన్ని గేర్ సమస్యలను ఎదుర్కొన్న తర్వాత దేవుడు తనను "దేవదూత"గా అంగీకరించడానికి "తిరస్కరించాడు" అని ప్రకటించారు. లడఖ్ ట్రిప్‌లో "ప్రతి బైకర్‌కి స్వర్గం" అంటూ లడఖ్ రోడ్లను ప్రశంసించిన ఆయన ఈ ట్రిప్‌లో తనకెదురైన సమస్య గురించి మాట్లాడుతూ, "నాకు గేర్ ట్రబుల్స్ మొదలయ్యాయి. నేను నా బైక్ థర్డ్, ఫోర్త్, ఫిప్త్ ఐదవ గేర్లను యాక్సెస్ చేయలేకపోయాను. అందుకే ఒక గేర్‌పై, ఫస్ట్, అండ్ సెకండ్లోవెళ్లా. చివరికి ఐన్‌స్టీన్ ఏమి చేస్తాడో అదే చేసా..ఒక పెద్ద రాయిని తీసుకొని గేర్ పెడల్‌ను కొట్టాను,ఆ తర్వాత అంతా బాగానే ఉంది." అన్నారు. కానీ అంతలోనే అనంతలోకాలకు తరలిపోవడం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానలను విషాదంలో ముంచేసింది. లేహ్ పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు మరో సహ వ్యవస్థాపకుడు ఆశీష్ షా సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బైక్ రైడ్ అంటే ఎంతగానో ఇష్టపడే మూర్తి.. తరచుగా మోటార్‌సైకిల్‌పై ముంబై నుంచి లేహ్‌కు వెళ్లేవారు. మూర్తి మృతిపై స్పాటిఫై ఇండియా ఎండీ అమర్జిత్ బాత్రా, డ్రూమ్ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్, క్యాష్‌కరో కో-ఫౌండర్ స్వాతి భార్గవ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1994లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివిన మూర్తి ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత క్యాడ్బరీస్, ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్), లివైస్, ఈబే ఇండియా తదితర సంస్థల్లో పని చేశారు. 2011లో ఆశీష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని ప్రారంభించారు. View this post on Instagram A post shared by Ambareesh Vedantam Murty (@ambareeshmurty) -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే! -
వివాహితతో చనువుగా... యువకుడు మృతి
నరసన్నపేట: మడపాం పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన తోట కృష్ణ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన మృతదేహం మేజరు పంచాయతీ నరసన్నపేట మారుతీనగర్–1లోని సాయి మందిరం వద్ద పోలీసులు గుర్తించారు. కృష్ణ మృతికి స్పష్టమైన కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎవరో మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోను లభించచడంతో దాని ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు. కొత్తపేటకు చెందిన తోట కృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి సాయమ్మలు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనే తమ కుమారుడు కృష్ణను హత్య చేసి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా కృష్ణ నరసన్నపేట మారుతీనగర్ ప్రాంతానికి చెందిన వివాహితతో చనువుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణ శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. రాత్రికి రాలేదని, ఉదయానికే పోలీసులు ఫోను చేస్తే తెలిసిందని మృతుని తండ్రి లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. కృష్ణ గతంలో ఆటో నడిపే వాడ ని.. ప్రస్తుతం టోల్గేట్లో పని చేస్తున్నట్లు చెప్పారు. 2017లో ఈదులవలసకు చెందిన హారికతో కృష్ణకు వివాహమైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వారం క్రితమే సీమంతం చేశారు. కాగా వివాహిత ఇంటి వెనుక భాగంలో మృతదేహం లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడ పైనుంచి దూకడం వల్ల మృతి చెందాడా.. లేదా వివాహిత ఇంట్లో వాళ్లు ఏదో చేసి కిందకు పడేశారా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలచంద్రరెడ్డి, సీఐ డి.రాములు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్‌గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
RRR నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన విదేశీ నటుడు రే స్టీవెన్సన్(58) హఠాన్మరణం చెందారు. RRRలో ఆయన బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్టన్ రోల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్లో అలరించారు. కరడుగట్టిన ‘స్కాట్ దొర’ పాత్రగా అది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్లో పాల్గొంటున్న ఆయన.. ఆదివారమే మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. బ్రిటిష్ నటుడైన రే స్టీవెన్సన్ పూర్తి పేరు జార్జ్ రేమండ్ స్టీవెన్సన్. పలు చిత్రాలతో పాటు టెలివిజన్ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. 1964 మే 25వ తేదీన నార్త్ ఐర్లాండ్‌లోని లిస్బర్న్లో స్టీవెన్సన్ జన్మించారు. ఆయన తండ్రి రాయల్ ఎయిర్‌ఫోర్స్ పైలట్. తన 29వ ఏట బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు రే స్టీవెన్సన్. స్టేజ్ ఆర్టిస్ట్‌గా మొదలైన స్టీవెన్సన్ యాక్టింగ్ కెరీర్.. క్రమంగా సినిమాల వైపు మళ్లింది. ది థియరీ ఫ్లైట్(1998) చిత్రంతో ఆయన సిల్వర్ స్క్రీన్ యాక్టింక్ కెరీర్ ప్రారంభమైంది. కింగ్ ఆర్థర్(2004)లో డాగోనెట్ రోల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. హెచ్‌బీవో రోమ్ టీవీ సిరీస్‌లో టైటస్ పులోగా ఆయన అలరించారు. థోర్, స్టార్‌వార్స్ లాంటి హిట్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. సరిగ్గా ఇరవై ఏళ్ల పాటు స్టేజ్ నాటకాలతో, చిత్రాలతో, వెబ్ సిరీస్‌లతో అలరించారాయన. స్టీవెన్సన్ బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు. బాండ్ ఆఫ్ గోల్డ్ చిత్రంలో వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1997లో వీళ్ల వివాహం జరిగింది. అదే ఏడాది పీక్ ప్రాక్టీస్ అనే చిత్రంలోనూ వీళ్లు కలిసి నటించారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది ఈ జంట. వీళ్లకు ముగ్గురు సంతానం. స్టీవెన్సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ‘సర్ స్కాట్.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటార’ని ట్వీట్లో పేర్కొంది. What shocking news for all of us on the team! 💔 Rest in peace, Ray Stevenson. You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi — RRR Movie (@RRRMovie) May 22, 2023 Ray Stevenson, who portrayed Volstagg in the #Thor trilogy, has passed away at the age of 58 years old: https://t.co/JcV4RIWIUj pic.twitter.com/vEpJu45LpK — MCU - The Direct (@MCU_Direct) May 22, 2023 -
డ్యాన్స్ చేయకుంటే.. కుప్పకూలి ప్రాణం పోయేది కాదా?
బస్.. ఆజ్‌కీ రాత్ హై జిందగీ.. కల్ హమ్ కహాన్.. తుమ్ కహాన్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. అందుకే సంతోషంగా గడపడమని చెప్తుండేవాళ్లు పెద్దలు. కానీ, సీను మారింది. మనుషులు ప్రాణాలు.. గాల్లో దీపంగా మారిపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదుకాబట్టి.. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు.. కుప్పకూలి మరణిస్తున్న వార్తలు ఈమధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అందులో వయసు తేడాలు కూడా ఉండడం లేదు మరి!. సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా-మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ కారణంగా అందరికీ ఆ చావు క్షణాలను వీక్షించే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకరకంగా ఇలాంటివి చూడడం అలవాటు అయిపోయింది జనాలకు. కర్ణుడి చావుకి లక్ష కారణాల మళ్లే.. ఇలాంటి హఠాన్మరణాలపై కూడా పోస్ట్‌మార్టం అనేక రకాలుగా, రకరకాల వెర్షన్లుగా ఉంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోస్టల్ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ దీక్షిత్ మరణం.. మరో చర్చకు తావిచ్చింది. ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాల్లో జిమ్ మరణాలతో పాటు డ్యాన్స్లవి కూడా ఉంటున్నాయి. వేడుకల్లో హుషారుగా చిందులేయడం కూడా ఒకరకంగా ప్రమాదమే అంటూ వాదిస్తున్న కొందరు.. సురేంద్ర మరణాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ.. వైద్యులు, పరిశోధకుల దగ్గరే దీనికి సమాధానం లేకుండా పోయింది. ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్లో భాగంగా.. మార్చి 16వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో హుషారుగా చిందులేస్తూ సందడి చేశారాయన. ఈక్రమంలోనే ఉన్నట్లుండి కుప్పకూలి మరణించాడు. అందుకు కార్డియాక్ అరెస్ట్ కారణమని చెప్పారు వైద్యులు. అన్నట్లు.. పైన రెడ్ కలర్లో పేర్కొన్న హిందీ లైన్లతో కూడిన పాటకే పాపం సురేంద్ర డ్యాన్స్ వేశారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో!. Bhopal: Officer dies of cardiac arrest while dancing at a function. #Bhopal #CardiacArrest pic.twitter.com/xgFW2XjqP6 — TIMES NOW (@TimesNow) March 20, 2023 Video Credits: టైమ్స్ నౌ సౌజన్యంతో.. -
లాంగ్ కోవిడ్ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్ల క్లారిటీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన గుండె సమస్యలు కోవిడ్ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్ట్ కోవిడ్ కండిషన్) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్ అరెస్ట్‌లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్ (పాచ్యురల్ టాచీకార్డియా సిండ్రోమ్) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు. ఇవీ కారణాలు ♦ రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. ♦ గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ♦ గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్–అర్రిటమియా) కూడా కారణం. ♦ పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది. ముందుగా గుర్తించడం కష్టమే కోవిడ్ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అపోహలెన్నో.. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని.. ఫలానా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్ఎన్ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ♦ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు. ♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ♦ జీవన శైలిని మార్చుకోవడం ♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ♦ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్‌తోనే.. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్టు కోవిడ్ కమిషన్) ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్ అరెస్ట్‌లు కారణంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు. – బి.విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
‘అమ్మా.. తలనొప్పి’ అంటూ కుప్పకూలింది
ఈరోజుల్లో చావు అనేది.. హఠాత్తుగా వచ్చి మనిషి ప్రాణాన్ని చుట్టేసుకుని వెళ్లిపోతోంది. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు.. వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తుండడంతో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక కారణాల కోసమూ పరిశోధకుల అన్వేషణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ జార్జియాలో ఓ టీనేజర్ మరణం.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలనొప్పితో బాధపడుతున్న ఆ టీనేజర్.. హఠాత్తుగా కుప్పకూలి ప్రాణం విడిచింది. ఈ మరణం వెనుక కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించగా.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదనే కామెంట్లు చేస్తున్నారు చాలామంది. 13 ఏళ్ల ఆ చిన్నారి పేరు జూలియా చావెజ్. కొలంబియా కౌంటీలోని హర్లీం మిడిల్ స్కూల్లో చదువుతోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన తలనొప్పి.. చెవినొప్పితో బాధపడింది. తల్లికి ఈ విషయం చెప్తే స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందామె. ఆ డాక్టర్ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి యాంటీబయోటిక్స్ రాశాడు. అయితే గత ఆదివారం ఉదయం ఉన్నట్లుండి కుప్పకూలిందా అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఓ పెద్దాసుపత్రికి తరలించగా.. లుకేమియా(రక్త క్యాన్సర్) కారణంగా మెదడు, ఊపిరితిత్తులు, కడుపు.. ఇలా ప్రతీ చోట రక్తస్రావం జరిగిందని షాక్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. తల్లిదండ్రుల ఎదుటే నొప్పితో విలవిలలాడిన ఆమె.. మృత్యువు చేతిలో ఓడింది. ఆ చిన్నారికి అలాంటి స్థితి ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలిసే మార్గం లేదని వైద్యులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. నిత్యం ఆడిపాడుతూ.. చదువుల్లో రాణిస్తూ.. మంచి మనసుతో అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి లేదన్న విషయాన్ని ఇంట్లోవాళ్లు, స్నేహితులు, టీచర్లు తట్టులేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఆస్పత్రి గడప తొక్కని ఆ చిన్నారి.. అర్ధాంతరంగా చిన్నవయసులోనే తనకు ఏం జబ్బు ఉందో కూడా తెలియకుండానే ప్రాణం విడిచింది. చావు చెప్పి రాదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడం లేదు. మన చేతుల్లో ఉండేది.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మాత్రమే!. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా ముందుకు పోతుంటారు చాలామంది. కానీ, ఒక్కోసారి దాని వెనుక విపరీతాలు ఉండొచ్చు. అందుకే ఎలాంటి సమస్య తలెత్తినా అప్రమత్తత అవసరం ఈరోజుల్లో. ఆరోగ్యంగా ఉండండి.. అయినవాళ్లతో సంతోషంగా గడపండి. -
జోష్‌తో డ్యాన్స్.. విధి విచిత్రంగా ప్రాణం తీసింది
వైరల్: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. యూపీ కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది. సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉... He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa — Anand Panna (@AnandPanna1) January 18, 2023 -
బడే భాయ్.. శరద్ యాదవ్ మృతిపై లాలూ భావోద్వేగం
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్మరణం.. బీహార్ రాజకీయాల్లో విషాద ఛాయలు నింపింది. ఐదు దశాబ్దాలపాటు.. జాతీయ రాజకీయాల్లో రాణించి తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. శరద్ యాదవ్ మరణంపై ఎమోషనల్ అయ్యారు. తమ మధ్య రాజకీయపరంగా రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రిత్యా సింగపూర్‌లో ఉన్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. బడే భాయ్(పెద్దన్న)గా శరద్ యాదవ్‌ను సంబోధిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అతను(శరద్ యాదవ్), ములాయం సింగ్, నితీశ్ కుమార్, నేను.. మీమంతా రామ్ మనోహర్ లోహిలా, కార్పూరి థాకూర్ నుంచి సోషలిజం రాజకీయాలు నేర్చుకున్నాం. ఎన్నోసార్లు మేం రాజకీయాల పరంగా పోటీ పడ్డాం. కానీ, మా మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెడిపోలేదు’’ అని లాలూ గుర్తు చేసుకున్నారు. अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में। शरद भाई...ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg — Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023 శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టినప్పటికీ.. ఆయన మాధేపురనే బేస్‌గా చేసుకుని ముందుకు వెళ్లారు. ఇందులో లాలూతోనే పోటాపోటీ నడిచింది. నాలుగుసార్లు గెలిస్తే.. నాలుగుసార్లు ఓడిపోయారు. 1991, 1996 నుంచి నెగ్గి, 1998లో లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 1999లో లాలూను ఓడించారు. మళ్లీ 2004లో లాలూ చేతిలో ఓడారు. 2009లో మళ్లీ నెగ్గారు. 2014, 2019లో మోదీ మేనియాలో శరద్ యాదవ్ ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీ-యూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీకి అధికారిక గుర్తింపు లేకుండా పోయింది. తొలుత బహుజన్ ముక్తి పార్టీ తో విలీనం కావాలని భావించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్ లేదు. మేము తొలుత సీపీఆర్ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు’ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలాడు.. మృతిపై అనుమానాలు!
దోహా: అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్‌బాల్ స్టేడియం వద్ద రెయిన్ బో కలర్ దుస్తులు ధరించి.. ఖతార్ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. శుక్రవారం లుసాయిల్ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను కవర్ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్ వాల్ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్ మరణంలో.. ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. నా పేరు ఎరిక్ వాల్. వాషింగ్టన్ సియాటెల్‌లో జీవిస్తున్నా. గ్రాంట్ వాహ్ల్ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్బో రంగు షర్ట్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది. Free to read: What happened when Qatar World Cup security detained me for 25 minutes for wearing a t-shirt supporting LGBTQ rights, forcibly took my phone and angrily demanded that I remove my t-shirt to enter the stadium. (I refused.) Story: https://t.co/JKpXXETDkH pic.twitter.com/HEjr0xzxU5 — Subscribe to GrantWahl.com (@GrantWahl) November 21, 2022 ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభంలో గ్రాంట్ వాల్‌ను సెక్యూరిటీ సిబ్బంది అల్ రయాన్లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వాల్ భార్య గౌండర్ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. I am so thankful for the support of my husband @GrantWahl's soccer family & of so many friends who've reached out tonight. I'm in complete shock. https://t.co/OB3IzOxGlE — Céline Gounder, MD, ScM, FIDSA 🇺🇦 (@celinegounder) December 10, 2022 వాల్.. ప్రిన్స్టన్ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా రాణించారు. సాకర్, బాస్కెట్ బాల్ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్ స్పోర్ట్స్‌లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. -
అవమానాల్ని దిగమింగుకుంది.. హఠాత్తుగా నింగికెగసింది
అట్టావా: ఆమె వీడియోలు చూసి బోలెడంత మంది పగలబడి నవ్వుకున్నారు. పుల్లలా ఉంది! ఇదేం ఇన్ఫ్లుయెన్సర్ రా బాబూ అంటూ జోకులు పేల్చారు. అయితే అవమానాలకు ఆమెకు కుంగిపోలేదు. నవ్వుతూనే ముందుకు సాగింది. ఒకానొక దశలో పరిధి దాటినా.. ఆమె ఒర్చుకుంది. ఆమె సానుకూల వైఖరికి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. క్రమక్రమంగా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. అలా అందనంత ఎత్తుకు ఎదుగుతుందని ఆమె తల్లిదండ్రులు ఆశపడుతున్న టైంలో.. విధి దెబ్బ కొట్టింది. ఇండో-కెనెడియన్ సోషల్ మీడియా సెలబ్రిటీ మేఘా థాకూర్.. కెనడాలో మరణించింది. 21 ఏళ్ల ఈ ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణాన్ని ఆమె తల్లిదండ్రులు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. ఆమె తమను వీడిందంటూ భావోద్వేగ సందేశం ద్వారా విషయాన్ని తెలియజేశారు. అయితే ఆమె ఎలా మరణించింది అనే విషయాన్ని వాళ్లు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం.. మేఘా థాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. నవంబర్ 24వ తేదీన ఆమె చనిపోగా.. మే 29వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Megha (@meghaminnd) View this post on Instagram A post shared by Megha (@meghaminnd) భారత సంతతికి చెందిన 21 ఏళ్ల మేఘ థాకూర్.. 2001, జులై 17వ తేదీన ఇండోర్(మధ్యప్రదేశ్)లో జన్మించింది. ఆపై కుటుంబంతో కెనడాకు చేరుకుంది. ఒంటారియో మేఫీల్డ్ సెకండరీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వెస్ట్రన్ యూనివర్సిటీలో చేరింది మేఘ. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పాపులర్ అయిన మేఘకు.. ఫాలోయింగ్ ఎక్కువే. View this post on Instagram A post shared by Megha (@meghaminnd) View this post on Instagram A post shared by Megha (@meghaminnd) మోడలింగ్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆ యువతికి మొదట్లో బక్కచిక్కిన పర్సనాలిటీ వల్ల అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఆమె ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆత్మ విశ్వాసం, బాడీ పాజిటివిటీ గురించి ఆమె చేసిన వీడియోలు, స్పీచ్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీల డ్రెస్సింగ్‌ను, వాళ్ల ఆటిట్యూడ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని వీడియోలు చేసేది మేఘ. అలా ఆమెకు సోషల్ మీడియా గుర్తింపు దక్కినా.. చిన్నవయసులో రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణంతో నింగికెగసి అభిమానుల్లో విషాదాన్ని నింపింది.