Suspicious death case
-
నిర్మాత అంజిరెడ్డి కేసులో వెలుగులోకి సంచలనాలు
హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించి ఎన్నారై, సినీ నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజేష్ మొదటి నుంచి పథకం ప్రకారమే కథ అంతా నడిపించాడు. ఇల్లు కొనుగోలు చేస్తానని నమ్మించి..డబ్బు చెల్లించకుండానే ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఆయనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్, ఆయన డ్రైవర్, ఇద్దరు బిహారీ పనిమనుషులు మొత్తం ఆరుగురి ప్రమేయం బయటపడగా మరికొంత మంది కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది? గత నెల 29వ తేదీ సాయంత్రం 5.31 నిమిషాలకు సికింద్రాబాద్ ఎస్.డి రోడ్డులోని డి–మార్ట్ భవనంలో బేస్మెంట్–3కు నిందితుడు రాజేష్ ఒక కారులో రాగా ఆయనతో పాటు అంజిరెడ్డి తన వ్యాగన్ ఆర్ కారులో వచ్చారు. ఇదే భవనంలోని మొదటి అంతస్తులో జీఆర్ కన్వెన్షన్ ఉండగా దీనికి సంబంధించిన కారు పార్కింగ్ బేస్మెంట్–3లో కొనసాగుతుంది. ఈ కన్వెన్షన్‌లో ఫంక్షన్లు అయినపుడు మాత్రమే కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి. లేకుంటే పార్కింగ్ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంజిరెడ్డిని బెదిరించి సంతకాలు చేయించుకుని అంతమొందించేందుకు మంచి ప్రదేశమని పథకం వేశారు. 5.31 నిమిషాలకు కార్లు బేస్మెంట్–3 లోపలికి వెళ్లగా దాదాపు రాత్రి 8.45 ప్రాంతంలో అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని కుమారుడు చరణ్‌కు సమాచారం వచి్చంది. దీంతో 9.15 నిమిషాలకు పోలీసులు ఈ భవనంలోని బేస్మెంట్–3కి చేరుకున్నారు. అయితే ముందుగానే సిద్ధం చేసుకున్న రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల డ్రాప్టును ఆయన ముందుంచి సంతకాలు తీసుకునేందుకు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కర్రతో ఆయనను తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అంజిరెడ్డి కారు ప్రమాదానికి గురై మరణించినట్లు చిత్రీకరించేందుకు ఆయన వ్యాగన్ ఆర్ కారును భవనం పిల్లర్లకు గుద్ది ప్రమాదంగా నమ్మించారు. మృతదేహాన్ని కారు పక్కన పడేసి ఏమి తెలియనట్లు ఉన్నారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి..మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాక...రాజేష్ కారులో నిందితులు బేస్మెంట్–3 నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మూడు కార్లలో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. సాయంత్రం 5.31 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు మధ్యలో ఏమి జరిగిందనేది ఇంకా కొంత సస్పెన్షన్ కొనసాగుతోంది. హత్యకు గురైన అంజిరెడ్డి గతంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. 1993లో దొంగ అల్లుడు, చెలికాడు తదితర చిత్రాలు నిరి్మంచగా...గత కొద్ది రోజుల నుంచి ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
విద్యార్థినిది ఆత్మహత్యా.. లేక హత్యా..?
విశాఖపట్నం: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. తమ కుమార్తెది హత్యేనని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనంగా మారింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యార్థిని రితీ సాహా హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందితే.. పశ్చిమ బెంగాల్లో నేతాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితీ సాహా విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కాలేజీకి అనుసంధానంగా నెహ్రూబజార్ ప్రాంతంలో ఉన్న సాధనా హాస్టల్లో ఉండేది. ఈ క్రమంలో గత నెల 14న హాస్టల్ 4వ అంతస్తు పైనుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం సమాచారమిచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు విశాఖకు వచ్చి విగత జీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. అయితే విద్యార్థిని మరణానికి గల కారణాలపై హాస్టల్ సిబ్బంది, పోలీసులు పొంతన లేకుండా చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. ఒకసారి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని, మరోసారి దూకేసిందంటూ చెప్పుకొచ్చారు. సీసీ ఫుటేజ్‌లతో మరిన్ని అనుమానాలు రీతి సాహా మృతిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో ఆమె తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాలనే కాకుండా దాని ఎదురుగా ఉన్న భవనం సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. రితీ సాహా నాలుగో అంతస్తు పైకి వెళ్లే సమయంలో ఒక డ్రెస్‌లో ఉండగా.. కింద పడి ఉన్న మృతదేహంపై మరో కలర్ డ్రెస్ ఉందని గ్రహించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం సీరియస్ అవడంతో పాటు మంత్రి అనూప్‌ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా సీఎం ఆదేశాలతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో సంఘటన జరిగితే మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం అరుదు. కానీ రితీ సాహా అనుమానాస్పద మృతిపై బెంగాల్లో కేసు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నం? రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్, హాస్టల్ నిర్వాహకుల నుంచి స్థానిక పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డీసీపీ విద్యాసాగర్‌నాయుడును ఆదేశించినట్లు సమాచారం. వారంలో ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసుపై డీసీపీ–1 విద్యాసాగర్‌నాయుడును మీడియా ప్రశ్నించగా.. రితీ సాహా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక మరో వారం రోజుల్లో వస్తుందని దాని ప్రకారం తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. -
రమేశ్ మద్యం సేవిస్తుండగా వీడియో తీసిన శివాని!
క్రైమ్: విశాఖపట్నం వన్‌టౌన్ కానిస్టేబుల్ రమేశ్ మృతి కేసులో ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని భార్య శివాని(జ్యోతి) చెబుతుండగా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో భర్తను చంపించి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన తర్వాతే కేసు వివరాలు వెల్లడిస్తామని ఎంవీపీ సీఐ మల్లేశ్వర రావు సాక్షితో తెలిపారు. 2009 లో కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరాడు బర్రి రమేష్. 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే.. ఆరోజు రాత్రి ఇంట్లో భర్త మద్యం సేవిస్తుండగా శివాని వీడియో తీసింది. తాగిన తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కానీ, శివాని తీరుపై అనుమానం రావడంతో రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపే.. గుట్టుచప్పుడు గా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది శివాని. ఎంవీపీ పోలీసుల ఎంట్రీతో.. వివాహేతర సంబంధ బాగోతం బయటపడింది!. ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో సంబంధం నడుపుతున్న ఆమె.. ప్రియుడు,అతని స్నేహితుడు సాయంతో భర్తను అంతమొందించింది. దిండుతో రమేశ్‌కు ఊపిరి ఆడకుండా చేసి చంపించి.. గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేసింది. ఏ ఒక్కరినీ వదలం కానిస్టేబుల్ రమేశ్ అనుమానాస్పద మృతి కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు సాక్షితో చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాక మాకు కొన్ని నిజాలు తెలిశాయి. రమేశ్ భార్య శివాని మొబైల్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టాం. కొంతమంది అనుమానితులను విచారిస్తున్నాం. రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటివి ఫుటేజ్ సేకరించాం. శివాని ఇతర పరిచయాలపై ఆరా తీస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ మృతికి కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రమేష్ డ్యూటీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతని సహచరులు అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు వెల్లడిస్తాం అని సాక్షితో అన్నారాయన. -
విశాఖ: బాలుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెందుర్తి లెండి వనంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందిన తర్వాత ఓనర్ భాను కుమార్‌కు వాచ్మెన్ సత్యనారాయణ సమాచారం ఇచ్చాడు. లెండి వనం నిర్మాణం సమయంలో స్థానిక టీడీపీ నేత బండారి సత్యనారాయణతో కలసి ఓ స్థలం కబ్జాకు యత్నించిన ఓనర్ భాను కుమార్.. లెండి వనం రిసార్ట్‌కి పక్కనే ఉన్న స్థలంపై కన్ను ఉండటంతో బాలుడు మృత దేహాన్ని ఆ స్థలంలో పడేయాలని ఆదేశించాడు. ఓనర్ చెప్పినట్టు ఆ బాలుడు మృత దేహాన్ని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పనస చెట్టు వద్ద వాచ్మెన్ పడేశాడు. ఆ విధంగా మృతదేహం పడేస్తే స్థలం యజమాని తక్కువ రేటుకి అమ్మకం జరుపుతారనే ఆలోచన పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వాచ్మెన్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిసార్ట్ ఓనర్ భానుకుమార్ హైదరాబాద్‌లో ఉండటంతో విశాఖకి రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. -
పక్కా ప్లాన్‌తో ప్రియుడి హత్య.. ఇప్పుడేమో మరో డ్రామా?!
క్రైమ్: సంచలనం సృష్టించిన షరోన్ రాజ్(23) హత్య కేసులో.. ఊహించని పరిణామం నెలకొంది. ప్రియుడ్ని పక్కా ప్లాన్‌తో హత్య చేసిందని భావిస్తున్న యువతి(22).. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పరిణామాన్ని కూడా డ్రామాగానే అనుమానిస్తుండడం గమనార్హం. తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23)ను ప్రేమించిన ఉష అలియాస్ గ్రీష్మ(22)కు.. మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అది తెలిసి ఆమెకు షరోన్ ఆమెకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే.. కావాలనే అతనికి మళ్లీ వాట్సాప్ ద్వారా దగ్గరైంది గ్రీష్మ. ఈ క్రమంలో అక్టోబర్ 14వ తేదీన ఇంటికి పిలిచి మరీ స్లోపాయిజన్ ఇచ్చి.. అతన్ని ఆస్పత్రిపాల్జేసింది. రెండు వారాల పాటు నరకం తర్వాత.. చికిత్స పొందుతూ గత సోమవారం అతను ఆస్పత్రిలోనే మరణించాడు. అయితే.. ఈ ఘటన తర్వాత నిందితురాలి కుటుంబం పరారు కాగా.. ఎట్టకేలకు ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఉష.. అరెస్ట్ ముందర ఉత్కంఠకు తెర తీసింది. సోమవారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరించాయి. ఆస్పత్రి బాత్రూంలో ఉన్న ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్‌ను తాగి.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లిందని.. ఆపై వాంతులు చేసుకుంటూ పోలీస్ జీపు వైపు అడుగులేసిందని.. ఈ క్రమంలో ఆమెను గమనించిన సిబ్బంది వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గ్రీష్మ ఆత్మహత్యాయత్నాన్ని ఫేక్‌గా భావిస్తున్నారు. సింపథీ దక్కించుకోవడం, బయటకు వచ్చేందుకు ఆమె ఈ ప్రయత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె కుటుంబానికి దగ్గరి బంధువైన వైద్యుడే.. ఆస్పత్రిలో ఆమెకు చికిత్స(డ్రామా) అందించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. గ్రీష్మ కస్టడీని పర్యవేక్షిస్తున్న అధికారులను సైతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)కు చెందిన గ్రీష్మ అలియాస్ ఉష.. కేరళ తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్‌తో ప్రేమలో ఉండేది. అయితే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో.. షరోన్ ఆమెను కలిసి దిగిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పి.. అంతా కలిసి పక్కా ప్లాన్‌తోనే షరోన్‌ను ఇంటికీ రప్పించి మరీ పురుగుల మందు లాంటి ద్రావణాన్ని బహుశా కషాయంలో కలిపి తాగించి హత్య చేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడని, అందుకే వివాహాన్ని ఫిబ్రవరి దాకా వాయిదా వేసుకుందని షరోన్ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో షరోన్ ద్వారా ఆ గండం తొలగించుకుందని ఆరోపిస్తోంది. ఈ మేరకు మూఢనమ్మకంతోనే తమ బిడ్డను హత్య చేయించిందని గ్రీష్మ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. విశేషం ఏంటంటే.. కషాయంలో కలిపిన మందు ఏంటన్నదానిపై పోలీసులు ఇప్పటిదాకా ఒక నిర్ధారణకు రాకపోవడం!. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
ఆశ్రమ నిర్వాహకుడి అనుమానాస్పద మృతి
యాదమరి: చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండపల్లె సమీపంలోని శ్రీ రామతీర్థం ఆశ్రమ నిర్వాహకుడు సచ్చిదానంద స్వామి మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి స్వామిని ఉరివేసి చంపేశాడని సేవకురాలు లక్ష్మమ్మ చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతుని సోదరుడు శ్రీరాములురెడ్డి మాట్లాడుతూ.. సచ్చిదానందస్వామి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు మిట్టూరులో ఓ భవనాన్ని కొనుగోలు చేశారని.. సంవత్సరాలు గడచినా ఆ భవనంలో ఉన్నవారు ఇంటిని ఖాళీ చేయకపోవడంతో పలుమార్లు వారిని స్వామీజీ సంప్రదించారని చెప్పారు. వారే హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. -
పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త, అత్తమామలు
పట్నంబజారు (గుంటూరు): అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందిన నర్రా మనోజ్ఞ (29), ఆమె కుమార్తె తులసి (9 నెలలు) కేసులో భర్త కల్యాణ్ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్నారాయణలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్ల మృతి) ►అత్తింటివారే తమ కుమార్తెను చంపారని మనోజ్ఞ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అపార్ట్మెంట్ వాచ్మెన్, అక్కడ నివసించే కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. ►రెండు మృతదేహాలపై కనీసం రక్తం చుక్క కూడా లేకపోవడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ►శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం వరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంపై మనోజ్ఞ తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కరరావు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ►వివాహం అయిన నాటి నుంచి మనోజ్ఞను ఆమె తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై భర్త, అత్తమామలు దెప్పిపొడుస్తూ ఉండేవారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ►పుట్టింటికి కూడా వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేసేవారని మృతురాలి బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ►మనోజ్ఞ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తూ ఉండేదని, ఈ విషయంపై భర్త, అత్తమామలు వేధించేవారని పోలీసుల దృష్టికి వచ్చింది. ►ఇప్పటికే మనోజ్ఞ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న పలు ఆధారాలను సేకరిస్తున్నారు. ►మనోజ్ఞ, తులసిల మృతదేహాలకు ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి శివారులోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్–వందనల కుమార్తె బి.వైష్ణవి(9) నాల్గో తరగతి చదువుతూ అదే పాఠశాల హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సెలవులు రావడంతో ఈనెల 10న తన ఇంటికి వెళ్లింది. ఈనెల 18న బాలికను ఆమె తండ్రి హాస్టల్లో వదిలివెళ్లాడు. సోమవారం అనారోగ్యంతో ఉన్న బాలికను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. మంగళవారం ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అయితే పోచమ్మ, దురద, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లిదండ్రులే ఆసుపత్రిలో చూపించి తగ్గకుండానే మందులతో హాస్టల్లో వదిలి వెళ్లారని యాజమాన్యం చెబుతుండగా..జ్వరం తగ్గాకే హాస్టల్లో వదిలి వెళ్లామని, మందులు వాడే విధానాన్ని టీచర్‌కు తెలపాల్సిందిగా సోమవారం ఫోన్లో తెలపడం జరిగిందని, ఇంతలోనే మంగళవారం మధ్యాహ్నం మీ కూతురుకు ఫిట్స్ వచ్చాయని, సీరియన్‌గా ఉందని ఫోన్లో తెలపడంతోనే కరీంనగర్‌కు చేరకున్నామని, ఇక్కడికి రాగానే చిట్టితల్లి విగతజీవిగా మార్చురీలో పడుందని తల్లి వందన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వైష్ణవి మృతి చెందిందని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌టీఎస్‌ఎఫ్, ఏఐఎస్బీ, ఎల్‌హెచ్‌పీఎస్ విద్యార్థి సంఘాలు మార్చురీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. çసంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ టూటౌన్, రూరల్ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విచారణ జరిపించాలి.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను బయటకు తీస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బుర్ర సంజయ్, గుగులోత్ రాజునాయక్, జూపాక శ్రీనివాస్, గవ్వ వంశీధర్‌రెడ్డి, గట్టు యాదవ్, మల్లేశం, రత్నం రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నా కుమారుడిది హత్యే..
సాక్షి, ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని రైల్వేస్టేషన్ సమీపం ఓ కల్యాణ మండపం వద్ద జూన్ 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రామినేని లక్ష్మణ్ సత్యగోపీనాథ్ అలియాస్ లక్ష్మణ్ (32)ది హత్యేనని అతడి తల్లి శ్రీదేవి అనుమానం వ్యక్తం చేస్తోంది. లక్ష్మణ్ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా లక్ష్మణ్ తల్లి రామినేని శ్రీదేవి స్థానిక కాపు కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన కుమారుడిది అనుమానాస్పద మృతి కాదని, హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె కథనం ప్రకారం.. శ్రీదేవిది గుంటూరు జిల్లా దుగ్గిరాల. కుమారుడు లక్ష్మణ్ ఆమెతో గొడవపడి మూడేళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి తాను ఒంగోలులో ఉంటున్నానని తల్లికి చెప్పాడు. కొన్ని రోజుల క్రితం తల్లికి ఫోన్ చేసి తనపై హత్య కేసు ఉందని, జామీనుదారులను తీసుకొచ్చి తనను విడిపించుకెళ్లాలని తల్లిని వేడుకున్నాడు. తల్లి జామీనుదారులను తీసుకొచ్చి కుమారుడిని విడిపించుకుంది. అప్పటికే ఆమె కుమారుడు పలువురు స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన కుమారుడితో పాటు కొంతమంది అతడి స్నేహితులు, హిజ్రా హిరిణి అనేక సార్లు లక్ష్మణ్ తల్లి వద్దకు వెళ్లారు. తమకు డబ్బులు కావాలని ఆమెను బెదిరించారు. ఆమె కుమారుడి ఆస్తి వాటా ఇవ్వాలని హిరిణి డిమాండ్ చేసింది. మద్యం తాగివచ్చి మరీ గొడవ చేసేవారు. హిజ్రా హిరిణితో సహజీవనం చేస్తున్నానని తన కుమారుడు గతంలో తనతో తెగేసి చెప్పాడని తల్లి విలపించింది. గత నెల 28వ తేదీన తన కుమారుడు లక్ష్మణ్, హిజ్రా హిరిణి, ఆటో డ్రైవర్ కమ్ ఓనర్నని చెప్పుకొచ్చిన మరో వ్యక్తి తన వద్దకు వచ్చారన్నారు. డబ్బులు కావాలని గొడవ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జూన్ 30న హిరిణి ఇంట్లో తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోందని శ్రీదేవి కన్నీటిపర్యంతమైంది. తన కుమారుడి అనుమానాస్పద మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. తన కుమారుడితో పాటు తన వద్దకు వచ్చిన ఆ ఇద్దరిపై అనుమానం ఉందన్నారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ప్రత్యేక చొరవ తీసుకొని తన కుమారుడి అనుమానాస్పద మృతి దర్యాప్తును పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. -
ప్రమాదమా.. హత్యా?
గొలుగొండ(నర్సీపట్నం): కృష్ణదేవిపేట– నర్సీపట్నం రోడ్డులో ఉన్న రాజులు బాబు గుడి వద్ద శనివారం అర్ధరాత్రి ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎవరైనా హత్య చేశారా ? లేక ప్రమాదం కారణంగా మృతి చెందాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారనే అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఏటిగైరంపేటకు చెందని సారిపల్లి నాని(35) అనే వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కృష్ణదేవిపేట– నర్సీపట్నం మార్గంలో రాజులుబాబు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ప్రధాన రోడ్డును బ్లాక్ చేసి కల్వర్టు నిర్మాణం వద్ద డైవర్షన్ ఇచ్చారు. రోడ్డుకు అడ్డంగా పెద్ద రాళ్లు, మట్టి వేసి పనులు చేస్తున్న ప్రాంతంలోకి ఎవరూ రాకుండా కాంట్రాక్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ మార్గం పూర్తిగా బంద్ అయినప్పటికీ నాని బైక్‌పై వచ్చి ఈ కల్వర్టులో పడి ఉన్నట్టు గుర్తించారు. బైక్ కల్వర్టు వద్దకు అచ్చే అవకాశం లేదని, ఎవరో గుర్తుతెలియన వ్యక్తులు హత్యచేసి కల్వర్టులో పడేశారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పనులు జరిగే ప్రాంతం వద్దకు బైక్ వెళ్లిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు. నాని హెల్మెట్ ధరించి ఉండగా తలకు బలమైన గాయం కావడంతో పాటు ముఖమంతా గాయాలున్నాయి. ఘటన స్థలంలో బైక్ ఒకచోట, నాని మృతదేశం ఒకచోట, చెప్పులు మరో చోట ఉన్నాయి. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫోన్లో కాల్‌డేటాను పరిశీలించారు. నాని ఏటిగైరంపేట గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు, భార్య లక్ష్మి ఉన్నారు. నాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘ఇంత దారుణంగా చంపుతారనుకోలేదు’
సాక్షి, హైదరాబాద్: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ సోమవారం హైదరాబాద్ పోలీసులను కోరారు. తన భర్తను ఇంత దారుణంగా చంపుతారని ఊహించలేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మీటింగ్ కోసమే తన భర్త అమెరికా నుంచి వచ్చారని తెలిపారు. భర్త బంధువుల వల్లే సమస్యలు వచ్చాయని, తనకు ప్రాణహాని ఉందని 2016లోనే చెప్పారని వెల్లడించారు. సొంత అక్క నుంచే ప్రాణభయం ఉందని జయరాం తనతో చెప్పారని తెలిపారు. శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతోనే ఎక్స్‌ప్రెస్ చానల్ బాధ్యతల నుంచి తొలగించినట్టు చెప్పారు. కాగా, జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేయడంలో ఈ కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. విచారణ పూర్తైందని నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఏపీ పోలీసులు వెల్లడించారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
బయటపడుతున్న రాకేష్ నేరచరిత్ర
-
బయటపడుతున్న రాకేష్ లీలలు
సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి నేరచరిత్రపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అతడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో అతడు పట్టుబడినట్టు గుర్తించారు. యువతులతో హైటెక్ వ్యభిచార ముఠా నడిపినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం కూకట్పల్లి ఎమ్మెల్యే పేరుతో బెదిరించి ఓ వ్యక్తి 80 లక్షలు వసూలు చేసిన కేసులో రాకేష్ అరెస్టైనట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉన్న అతడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మాయామాటలతో మోసాలు పాల్పడటం అతడి నైజమని వెల్లడైంది. అనేక మోసాలు, దందాలు సాగించినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో అతడు అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంట్లోనే జయరాంను నిర్బంధించినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం రాకేష్ నివాసం ఉంటున్న ఇంట్లో సోదాలు జరిపారు. అయితే రాకేష్ విలాసవంతమైన జీవితం చూసే శిఖా చౌదరి అతడి మాయలో పడినట్టు తెలుస్తోంది. జయరాంకు రాకేష్ రెడ్డి రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి అప్పుగా ఇచ్చాడనేది తెలియాల్సివుంది. జయరాంను రాకేష్ హత్య చేశాడా, లేదా అనేది వెల్లడి కాలేదు. దర్యాప్తు దాదాపు ముగిసిందని, నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని కృష్ణా జిల్లా డీఎస్పీ బోస్ తెలిపారు. (మిస్టరీ వీడినట్లే.. నా?) -
పెళ్లికి అడ్డుగా నిలిచాడనే హత్య?
-
మిస్టరీ వీడినట్లే.. నా?
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి సూత్రధారిగా, ఆమె ప్రియుడు రాకేష్‌రెడ్డి హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక పరమైన లావాదేవీల్లో విభేదాలే ఈ హత్యకు కారణమని తేలింది. గత నెల 31న దస్పల్లా హోటల్ వద్ద నుంచి జయరామ్‌ను కారులో తీసుకొచ్చిన రాకేష్.. మరికొందరితో కలిసి అతనికి జబ్బుతో ఉన్న కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ చేసి హైదరాబాద్‌లోనే హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. జగ్గయ్యపేటలోని రాంకో సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఎస్పీ ఎస్.త్రిపాఠి.. రాకేష్‌ని, శిఖా చౌదరిని వేర్వేరుగా విచారించారు. హత్య కేసులో వారిద్దరి పాత్రపై ఒక స్పష్టతకు వచ్చిన పోలీసులు.. వారికి సహకరించిందెవరు? హత్యకు గల కారణాలు మరేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు.. పెళ్లికి అడ్డుగా నిలిచాడనే హత్య? రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శిఖా అడిగిన మేరకే రాకేష్ జయరామ్‌కు రూ. 4.5 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అయితే డబ్బు తిరిగి చెల్లించే విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అదేసందర్భంలో రాకేష్‌రెడ్డితో పెళ్లికి మామయ్య జయరామ్ అడ్డుపడ్డారని, అలాగే జయరామ్ తన విల్లాకు తరచూ రావడం రాకేష్‌కు ఇష్టం లేదని శిఖా పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేసమయంలో టెక్ట్రాన్ అనే కంపెనీ లావాదేవీల విషయంలో శిఖాకు, జయరామ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, మామయ్యకు తెలియకుండా కంపెనీ చెక్కులపై శిఖా ఫోర్జరీ సంతకాలు కూడా చేసినట్లు వెల్లడయింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినట్లు సమాచారం. ఈ విషయం జయరామ్‌కు తెలియడంతో వారిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జయరామ్ స్థాపించిన అనేక కంపెనీలను శిఖా చౌదరినే నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం మంగొల్లు సమీపంలో 10 ఎకరాల ఫాం హౌస్‌ను శిఖా పేరిట జయరామ్ రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను జయరామ్ తన వద్దే ఉంచుకున్నారు. వాటిని చేజిక్కించుకోవడం కోసం ఇటీవల ఓ యువతిని సైతం జయరామ్‌కు ఎరగా వేసినట్లు తెలుస్తోంది. అయినా డాక్యుమెంట్లు లభించకపోవడం, తమ పెళ్లికి అడ్డుగా ఉండటం, అప్పు విషయంలో విభేదాల కారణంతో బాయ్‌ఫ్రెండ్ రాకేష్‌రెడ్డితో కలిసి హత్యకు పథక రచన చేసినట్లు పోలీసుల విచారణలో శిఖా అంగీకరించినట్లు సమాచారం. బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితులు మరికొందరితో కలసి గత నెల 31న జయరామ్‌ను దస్పల్లా హోటల్ నుంచి కారులో తీసుకొచ్చి హైదరాబాద్ శివార్లలో ఇంజెక్షన్ చేసి జయరామ్‌ను హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు వివరాలను కృష్ణా జిల్లా పోలీసులు సోమవారం మీడియాకు వెల్ల డించే అవకాశం ఉంది. అత్యంత రహస్యంగా విచారణ..వీఆర్‌కు కానిస్టేబుల్ హత్య కేసులో అనుమానితులను కృష్ణా జిల్లా పోలీసులు అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు. దర్యాప్తు సందర్భంగా పోలీసు బృందాలకు లభ్యమైన కీలక ఆధారాలు, అలాగే తమ అదుపులోకి తీసుకున్న అనుమానితుల వివరాలు కానీ ఎక్కడా వెల్లడించకుండా ఎస్పీ త్రిపాఠి జాగ్రత్తలు తీసుకున్నారు. శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్న ఫొటో ఆదివారం ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఎస్పీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫొటో మీడియాకు ఇచ్చారన్న కారణంతో ఓ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపించారు.అలాగే మరో ఐదుగురు కానిస్టేబుళ్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో ఎస్పీ ఎందుకంత గోప్యత పాటిస్తున్నారనే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం ఆఫీసులో రాకేష్ హవా! తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. సీఎం కార్యాలయంలో పనిచేసే అభిష్టా అనే వ్యక్తితో రాకేష్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అభిష్టా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ క్లాస్మేట్ కావడం వల్లే అతడిని సీఎంవోలో ఓఎస్డీగా నియమించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాకేష్‌రెడ్డి కూడా ఇటు చంద్రబాబుతో అటు నారా లోకేష్‌తో సత్సంబంధాలు నెరిపినట్లు సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి. రాకేష్ ఫోన్ కాల్‌తో ఎవరికైనా తిరుమలలో ఎల్–1 దర్శనం లభిస్తుందంటే అతడి పలుకుబడి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ కారణంతోనే హైదరాబాద్‌లోనే జయరామ్‌ను హత్య చేసినప్పటికీ కృష్ణా జిల్లాకు తీసుకువచ్చి ఐతవరం సమీపంలో ఓ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు అయితే తనకు ఉన్న పలుకుబడితో బయటపడొచ్చనే ధీమాతోనే ఇలా చేశాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. శిఖాకు ఏ పాపం తెలియదు కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి కంచికచర్ల(నందిగామ): జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఏ మాత్రం లేదని కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి చెప్పారు. ఆదివారం కంచికచర్ల వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఆమెకు ఈ పాపంలో ఎలాంటి ప్రమేయం లేదన్నారు. జయరామ్ అంటే శిఖాకు ప్రాణం అని, ఆయన ఆస్తి విషయాలన్నీ శిఖాయే చూసుకుంటుందని చెప్పారు. జయరామ్‌కు బిజినెస్‌లలో పూర్తి సహకారం ఇచ్చేదని తెలిపారు. పోలీసులపై అధికారపార్టీ ఒత్తిళ్లు.. జయరామ్ కేసులో నిందితులైన వారిద్దరినీ తప్పించేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జయరామ్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులకు అందులో గుంటూరుకు చెందిన టీడీపీ ఎంపీ సోదరుడి కుమారుడి ఫోన్ నంబర్ ఉండటం..అతడికి శిఖా చౌదరికి మధ్య మద్యం వ్యాపారానికి సంబంధించిన అంశంలో భాగస్వామ్యం ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వారి ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికే ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హత్య హైదరాబాద్‌లో జరిగింది కాబట్టి ఆ ప్రాంత పోలీసుస్టేషన్‌కు నిందితులతోపాటు కేసును బదలాయించాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిసింది. జయరామ్ అంత్యక్రియలు పూర్తి సాక్షి, హైదరాబాద్: హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు డైరక్టర్, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ముగిశాయి. అమెరికాలో ఉంటున్న జయరామ్ భార్య పద్మశ్రీ, కుమార్తె, కుమారుడు సాయి శ్రీరాం శనివారం అర్ధరాత్రి 2 గంటలకు అమెరికా నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44లో ఉన్న భర్త ఇంటికి చేరుకున్నారు. అనంతరం బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిలో భద్రపరిచిన జయరామ్ శవపేటికను ఇంటికి తరలించారు. సన్నిహితులు, మిత్రుల నివాళి అనంతరం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు శ్రీరాం తండ్రి చితికి నిప్పటించారు. కాగా, జయరామ్ బొంతపల్లిలో ఏర్పాటు చేసిన టెక్ట్రాన్ పోలి లెన్సెస్ పరిశ్రమలో 2015 నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా సీఈవోగా పనిచేసిన శిఖా చౌదరి అడ్డుకున్నారని సంస్థ ఉద్యోగులు ఆరోపించారు. జయరామ్‌కు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి వచ్చిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ శిఖా వచ్చాకే సంస్థ మూతపడిందన్నారు. ఆమె తీరు వల్ల 150 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారని విమర్శించారు. -
యువతిని ఎరవేసిన మాట నిజమే: శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పలు విషయాలు వెల్లడించింది. జయరాం చనిపోయిన రోజు తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్‌డ్రైవ్‌లో ఉన్నానని శిఖా చౌదరి విచారణలో తెలిపింది. మామయ్య రోడ్డుప్రమాదంలో మరణించిన విషయం ఆమె తల్లి చెబితేనే తెలిసిందని శిఖా స్పష్టం చేసింది. తన పేరున జయరాం పది ఎకరాల భూమిని కొన్నారని, డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వెల్లడించింది. జయరాంను తాను చంపలేదని పేర్కొన్న శిఖా.. డాక్యుమెంట్ల కోసం ఓ యువతిని ఎరవేసిన మాట నిజమేనని ఒప్పుకుంది. డాక్యుమెంట్ల కోసం జయరాం ఇంటికి వెళ్లటం వాస్తవమేనని తెలిపింది. అయితే జయరాంను రాకేష్ ఏం చేశాడో తెలియదని పేర్కొంది. నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించండి: జయరాం భార్య జయరామ్ భార్య పద్మశ్రీ వాంగ్మూలాన్ని నందిగామ పోలీసులు రికార్డ్ చేశారు. ఎస్ఐతో పాటు ఇద్దరు పోలీసులు, న్యాయవాది సమక్షంలో పద్మశ్రీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తనకు ఎవరిపై అనుమానం లేదని, తన భర్తను ఎవరు హత్య చేసారో.. ఎందుకు హత్య చేసారో తేల్చాలని ఏపీ పోలీసులను కోరింది. తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఏపీ పోలీసులను కోరింది. ఇండియాలో ఏం జరుగుతుందో తనకు ఏమీ తెలియదని వెల్లడించింది. -
విచారణలొ కీలక విషయాలు వెల్లడించిన శిఖా చౌదరి
-
జయరాంకు బినామీగా శిఖా..!
సాక్షి, కృష్ణా: నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. టెక్ట్రాన్ కంపెనీ లావాదేవీల విషయంలో శిఖాకు, జయరాంకు మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. జయరాంకు తెలియకుండా కంపెనీ చెక్కులపై శిఖా సంతకాలు కూడా చేసినట్లు వెల్లడయింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయాల టర్నోవర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెక్కులపై శిఖా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు జయరాం తెలుసుకున్న తరువాత వారిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. శిఖా ఇచ్చిన చెక్కులు బౌన్సు కావడంతో జయరాం పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. టెక్ట్రాన్ కంపెనీ వ్యవహారాలను కూడా శిఖా ఎక్స్‌ప్రెస్ టీవీ కార్యాలయంలోనే జరిపేవారు. జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజేష్.. శిఖాతో పాటు కంపెనీ సమావేశాలకు కూడా హాజరయ్యేవారు. ఇదిలావుడంగా అనేక కంపెనీల్లో జయరాం తరుఫున శిఖా బినామీగా వ్యవహరించారు. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. శిఖాపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆమె పాత్రపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. (జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!) -
జయరాం హత్య కేసును ఛేదించిన పోలీసులు
-
జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. జయరాం, రాకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరిచేందుకు రాకేష్ యత్నించాడని తెలిపారు. రాకేష్‌కు సహకరించిందెవరో తేలాల్సి ఉందని అన్నారు. ఈకేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(మేనకోడలు పాత్రపై అనుమానాలు!) మహాప్రస్థానంలో అంత్యక్రియలు.. చిగురుపాటి జయరాం భార్యాపిల్లలు ఆమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. జయరాం మృతదేహాన్ని జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఆయన భార్య స్టేట్మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
శిఖాను తప్పించేందుకే ఆ నిర్మాత వచ్చారా..!?
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. జయరాం హత్య వెనుక ఆర్థికలావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (మేనకోడలు పాత్రపై అనుమానాలు!) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిఖాను నందిగామ రూరల్ సర్కిల్ ఆఫీస్‌లో విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆమెను కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశజూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శిఖా కోసం సీని నిర్మాత కేపీ చౌదరి రావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. స్టేషన్ వద్ద ఉన్న శిఖా కారును కేపీ చౌదరి తీసుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతుని స్నేహితుల వివరాలపై వారిని ఆరా తీస్తున్నారు. -
మేనకోడలు పాత్రపై అనుమానాలు!
సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనంలో ఆయన మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్న పోలీసులు.. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు రేకెత్తడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచికచెర్ల సర్కిల్ స్టేషన్లో ఉంచి జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించినప్పటికీ అమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జయరామ్, శిఖా చౌదరి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జయరామ్ ఎక్కడెక్కడికి వెళ్లారు? జయరామ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాన్నిబట్టి మొదట దస్పల్లా హోటల్ వద్దకు వెళ్లి అక్కడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. జయరామ్‌తో పాటు ఎవరైనా కొత్తవ్యక్తులు ఉన్నారా అనే కోణంలో హోటల్ సిబ్బందిని విచారించారు. హోటల్ వద్ద జయరామ్‌కు ఓ వ్యక్తి రూ. ఆరు లక్షలు ఇచ్చాడని, హోటల్ గది అప్పటికే ఓ యువతి పేరుమీద ఉన్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు.. శిఖా చౌదరి.. జయరామ్‌కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. జయరామ్ ప్రారంభించిన ఏ వ్యాపారంలోనైనా ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అతను నిర్వహించిన ఓ న్యూస్ చానల్లోనూ శిఖా చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భార్యా పిల్లల కంటే ఈమెకే జయరామ్ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిఖా సోదరి మనీషా చదువు కోసం రూ. కోటి వరకు జయరామ్ చెల్లించినట్లు సమాచారం. జయరామ్ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా శిఖా ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్లేవాడని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చెబుతున్నాడు. గత నెల 29న రాత్రి కూడా ఆమె ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు గురైన రోజున రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి ఒంటరిగా కారు తీసుకుని హడావుడిగా వెళ్లినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోనే హత్యకు స్కెచ్! హత్య కేసులో నందిగామ పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగా జయరామ్ హత్యకు కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జయరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మేనకోడలు పాత్రపై ఆరా తీశారు. దస్పల్లా హోటల్లో జయరామ్ పేరిట 10 రోజులుగా ఓ రూమ్ బుక్ చేయడం, అదే హోటల్లో గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరగడం, అక్కడి నుంచే జయరామ్ ఓ తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో కలిసి కారులో వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. పతంగి టోల్గేట్ వద్ద నమోదైన సీసీ టీవీ ఫుటేజీలోనూ జయరామ్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించినట్లు తేలింది. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి కారు నడిపినట్లు గుర్తించారు. కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు తదితరాలను బట్టి ఈ హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ ఎవరనే కోణంలో ఆరా.. జయరామ్ చెల్లులు సుశీలతోపాటు మేనకోడళ్లు శిఖా చౌదరి, మనీషాలతోపాటు డ్రైవర్ సతీష్‌తోపాటు గన్మెన్లను పోలీసులు విచారిస్తున్నారు. అదే సందర్భంలో మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడుగా భావిస్తున్న రాకేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిఖా చౌదరికి రాకేష్ రూ. 4.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో రెండేళ్లుగా రాకేష్–శిఖా మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన మేనకోడలి అప్పును తీరుస్తానని జయరామ్ హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత డబ్బు సర్దుబాబు చేయకపోవడంతోనే వీరి ముగ్గురి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ వివాదమే హత్యకు దారితీసిందా? అన్న కోణంలో రాకేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్ అనే మరో యువకుడిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ తమ్ముడి కొడుకుతోనూ శిఖాకు పరిచయాలున్నాయని, బీర్ కంపెనీ పెడతానని అతని ద్వారా భారీగా పెట్టుబడి పెట్టించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఏం జరిగింది? జయరాం స్వస్థలం విజయవాడ కాగా గత నెల 30న హైదరాబాద్ నుంచి బయల్దేరారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గత నెల 31వ తేది రాత్రి 2గంటలకు ఆయన కారు సీసీ పుటేజీలో కనిపించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ మిగతా సమయం ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఫోరెన్సిక్ నివేదిక అనుమానస్పద స్థితిలో మృతి చెందిన జయరామ్ మృతదేహంపై పలు భాగాల్లో గట్టిగా దెబ్బలు తగిలిన దాఖలాలేమి కనిపించలేదు. మోచేయి కింద భాగంలో, పొట్ట ఎడమ వైపున, కుడివైపు ఛాతీ పైభాగంలోనూ కందిన గాయాలున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. చేతులు నల్లగా ఉండడం, శరీరంలో నీలిరంగులోకి మారడంతో ఆయనపై ఏదైనా విషప్రయోగం చేశారా? కొట్టి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శరీర భాగాలను వైద్యులు సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక అందాకే హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసు భావిస్తున్నారు కేన్సర్ ఆస్పత్రిలో మృతదేహం జయరామ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని ఇంట్లో గత కొద్దిరోజులుగా జయరామ్ ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలాఉండగా జయరామ్ భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ప్లోరిడాలో మంచు తుఫాను వల్ల హైదరాబాద్ రావడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని భావించినా సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. గది తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసింది: వాచ్మెన్ వెంకటేశ్ జయరామ్ మృతిచెందిన మరుసటిరోజు శిఖా చౌదరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని జయరామ్ ఇంటికి వచ్చి రూం తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసినట్లు జయరామ్ ఇంటి వాచ్మెన్ వెంకటేశ్ తెలిపాడు. తాను తాళాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆ రోజు రాత్రి డ్యూటీకి రాగానే జయరామ్ సార్‌కు ఫోన్ చేశానని, మీటింగ్‌లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడన్నాడు. ఆ తర్వాత గన్‌మెన్ ద్వారా జయరామ్ మృతి విషయం తెలిసిందని, ఎవరు హత్య చేశారో అంతు చిక్కడంలేదన్నారు. రెండేళ్ల కిందట జయరామ్ తల్లి చనిపోయిన సమయంలో శిఖా చౌదరికి, జయరామ్ కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పాడు. తాను గత 20 ఏళ్లుగా జయరామ్ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా, ఇంటి కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. జయరామ్ వైన్ తప్ప మద్యం తాగడని ఆయన స్పష్టం చేశాడు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదు : సర్వశ్రేష్ఠ త్రిపాటి, ఎస్పీ కంచికచెర్ల సర్కిల్ పోలీసు స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన కోడళ్లు, డ్రైవర్, గన్మెన్లతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఎస్పీ త్రిపాఠి విచారించారు. ఈ సందర్బంగా ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘జయరామ్ హత్య కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేవలం అనుమానితులను మాత్రమే విచారణ చేస్తున్నాం. త్వరలోనే కేసుని ఛేదిస్తాం’ అని తెలిపారు. -
జయరామ్ హత్య కేసులో కొత్త మలుపు