Tejaswi
-
ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్ స్పష్టం చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసహజ మరణాల దర్యాప్తు ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్ ఈ–పేపర్ ఎడిటర్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది. -
Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్, తేజస్వి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్‌లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్‌కుమార్, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. -
నితీష్‌కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్‌పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్‌కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్‌కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్‌కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
-
తేజస్విని మాటల యుద్ధం.. వీడియో వైరల్
దొడ్డబళ్లాపురం: యాంకర్‌గా ప్రజలకు పరిచయమై, కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలిచి తరువాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన తేజస్విని రమేశ్ తమ స్వగ్రామం అయిన దొడ్డ తాలూకా దొడ్డరాయప్పనహళ్లిలో వీరంగం సృష్టించారు. గ్రామంలో పాఠశాల నిర్మించడానికి నిధులు వచ్చాయని తేజస్విని పనులు ప్రారంభించారు. అయితే స్థానిక గ్రామపంచాయతీ నిబంధనలు తుంగలో తొక్కి, రాజకీయ దురుద్దేశంతో తన ఇంటి ముందు రాకపోకలు సాగించడానికి కూడా అవకాశం లేకుండా కట్టడం నిర్మించడం జరుగుతోందని మెళేకోట గ్రామపంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో కొందరు తేజస్వినికి మద్దతుగా మరికొందరు నరసింహమూర్తికి మద్దతుగా నిలవడంతో గ్రామం రణరంగంగా మారింది. నరసింహమూర్తి ఇంటి ముందు అడ్డంగా తవ్వేసిన దృశ్యం గురువారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య గొడవలు జరగగా తేజస్విని కొందరిని దుర్భాషలాడుతూ, చేతులతో తోస్తూ, సవాళ్లు విసురుతున్న వీడియోలు స్థానికంగా వైరల్‌గా మారాయి. ఈ గొడవలకు కొనసాగింపుగా శుక్రవారం పంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తికి మద్దతుగా జేడీఎస్ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్వినికి, జేడీఎస్ నాయకులకు మాటల యుద్ధమే జరిగింది. తేజస్విని తమపై దాడి చేసిందని ఆరోపిస్తూ కొందరు దళితులు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ తేజస్విని మాత్రం తాను ఎవరిపై దాడి చేయలేదని, కొందరు తనపై కక్షతో పాఠశాల నిర్మాణానికి అడ్డుపడుతున్నారన్నారు. నిజానికి తనమీదే కొందరు దౌర్జన్యం చేసారన్నారు. తాను నిబంధనలకు లోబడే పాఠశాల నిర్మిస్తున్నానన్నారు. ప్రస్తుతం దొడ్డరాయప్పనహళ్లిలో పరిస్థితి నివురుగ్పిన నిప్పులా ఉంది. -
ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి
హిందీ బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన ఫోన్ హ్యాకింగ్ బారిన పడటంతో.. ఆమె ఫోన్ నుంచి స్నేహితులకు అసభ్య వీడియో కాల్స్ వెళ్లాయి. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న తేజస్వీ దయచేసి ఎవరూ తన వాట్సాప్ నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తవద్దని తెలిపారు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ... ‘ నేను నిన్న సీరియల్ షూటింగ్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అతడు అత్యంత అసభ్యంగా వికృత చర్యలకు పాల్పడుతూ కనిపించాడు. ఒక్కసారిగా అసహ్యం పుట్టింది. అప్పుడు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అతడు నా ఫోన్‌ను హ్యాక్ చేసి నా స్నేహితులతో చాట్ చేసి వాళ్లకు కూడా ఇలాగే అసభ్య వీడియో కాల్స్ చేశాడు’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న తేజస్వీ... తన తోటి నటీమణులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. తన ఫోన్ నుంచి ఈ కాల్స్ వెళ్లడంతో వాళ్లు షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. తనేంటో పూర్తిగా తెలిసిన వాళ్లు కాబట్టి తనను తప్పుగా అర్థం చేసుకోలేదని .. అయితే ఈ ఘటన తననెంతో మానసిక వేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని... హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా వెంటనే ఫిర్యాదు చేయలేకపోతున్నానని వెల్లడించారు. కాగా ‘స్వరాగిణీ’ సీరియల్లో రాగిణిగా నటించిన తేజస్వీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -
మా ఇంట్లో వాళ్లు నన్ను వదిలేశారు
ముంబైకి చెందిన 21 ఏళ్ల తేజస్వీ ప్రభుల్కర్ తన ఒంటి మీద 103 పచ్చబొట్లతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అయితే దాని ప్రతిఫలంగా సమాజం నుంచి ఎదుర్కొంటున్న స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు. ఇదే ఏ అమెరికాయో, ఫ్రాన్సో అయితే పెద్ద పట్టించుకునేవారు కాదేమో కాని భారతదేశంలో పచ్చబొట్టును ఆడపిల్ల వేసుకోవడం మచ్చగానే భావిస్తారు. అదీ ఒకటో రెండో కాకుండా ఏకంగా 103 సార్లంటే గుండెలు బాదుకుంటారు. అయినప్పటికీ తేజస్వీ అలా ఎందుకు చేసింది? ‘నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేదాన్ని. మా అమ్మ ఈ కళను ఉపయోగించుకో అని చెప్పింది. 17 ఏళ్ల వయసులో మొదటిసారి నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నా. ఆ తర్వాత పచ్చబొట్ల మీద మోజు పెరిగింది. నేనే టాటూ ఆర్టిస్ట్‌గా మారుదామని నిశ్చయించుకున్నా. టాటూ ఆర్టిస్ట్‌కు డిగ్రీతో ఏం పని అని మానేశా.చదువు మానేసి 20 ఏళ్లకు దాదాపు 30 పచ్చబొట్లతో తయారయ్యేసరికి మా ఇంట్లో వాళ్లు దాదాపు నన్ను వదిలేశారు. ఇరుగు పొరుగు పిచ్చిదాన్నని అనుకున్నారు. చాలామంది ఇలాగైతే నీకు పెళ్లెలా అవుతుంది అని దిగులు పడుతుంటారు. ముందు కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది’ అంటుంది తేజస్వి. తేజస్వి పూర్తి బట్టలు ధరించి వెళ్లినా ఆమె మిగిలిన శరీరంలో ఉన్న పచ్చబొట్లు జనాన్ని ఆకర్షిస్తాయి. ఇక తక్కువ బట్టలు వేసుకొని వెళితే దారిన పోయేవారంతా ఆమెనే చూస్తూ ఉంటారు.‘చాలామంది నన్ను ఈ దేశం అమ్మాయిని కాదనుకుంటారు. తెలిశాక చీవాట్లు పెడతారు. కొందరైతే ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటావ్ అంటారు. నాకు మాత్రం పచ్చబొట్లతో ఉన్న నా శరీరం ఇష్టం. నన్ను ఇలాగే చూడండి. నా రూపం ద్వారా నన్ను జడ్జ్ చేయకండి’ అంటుంది తేజస్వి. తేజస్వి ఇంకా కొన్ని శరీర భాగాలను మరిన్ని పచ్చబొట్ల కోసం వదిలేసిందట. వాటిని కూడా పచ్చబొట్లతో నింపుతాను అంటోంది. ‘నేనూ అందరిలాంటి అమ్మాయినే. వంట చేస్తాను. నా పనులు నేను చేసుకుంటాను. నా జీవితం ఇప్పుడే మొదలైంది. ముగిసిపోలేదు. నా టాటూలు నా వ్యక్తిగత విషయంగా వదిలేయండి’ అంటుంది తేజస్వి.భారతదేశంలో ఇలాంటి విషయాలు అంత తొందరగా మింగుడు పడవు. ఆమె వార్తల్లోకి ఎక్కడానికి ఈ పచ్చబొట్లు ఉపయోగపడ్డాయి కాని జీవితంలో స్థిరపడటానికి ఎలా ఉపయోగపడతాయా అని కొందరికి సందేహంగా ఉంది. సందేహాలను జనానికి వదిలి తేజస్వి మాత్రం తాను వేయించుకోబోయే తర్వాతి పచ్చబొట్టు కోసం ఆలోచిస్తూ ఉంది.ఇష్ట కామ్య సిద్ధి రస్తు. -
సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు?
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ తేజస్వి స్నేహసామ్రాజ్ఞిలా ఉన్నారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సామ్రాట్‌ని– ఈ సామ్రాజ్ఞినీకలిపి చూడటం మానడం లేదు టీవీ వీక్షకులు!అసలు తేజస్వి–సామ్రాట్ల మధ్య ఉన్నది జస్ట్.. క్లోజ్ ఫ్రెండ్షిప్పా? అంతకన్నా ఎక్కువేనా?!ఎలిమినేట్ అయినవారిని మర్చిపోతాం. తేజస్వి మాత్రం ‘ఎలివేట్’ అయ్యారు!! ఎందుకు? చదవండి. తేజస్వితో సాక్షి ఇంటర్వ్యూ. ‘‘నేనసలు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కే వెళ్లాల్సి ఉండింది. కుదరలేదు. తర్వాత ‘మా’ అవార్డ్స్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ –2 కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అలా సెకండ్ సీజన్లో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాను. నాతో పాటు ఇంకెవరెవరు హౌజ్‌లోకి వస్తున్నారో అప్పటికి హాడ్ నో ఐడియా ఎబౌట్ దట్. వెళ్లాకే తెలిసింది ఎవరెవరెవరు ఉన్నారో! ఏడ్చేశాను నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నకు ఆల్కహాల్ ప్రాబ్లమ్. దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలా నడుచుకోవాలో తెలీలేదు. చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్ చేశాను. హౌజ్‌లోకి ఎంటర్ అవగానే అందరితో కలిసిపోయా. కాని అదే తప్పని తర్వాత తెలిసింది. నాకు కన్నింగ్‌గా ఉండటం రాదు. టీవీలో అందరూ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా పక్కనున్న మనిషి గురించి హౌజ్‌లో కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేది. దాంతో అరిచేశా. ఒకసారి నానీ నన్ను తిట్టాడు.. చాలా బాధనిపించిఏడ్చాను కూడా. ఫోన్ వెదుక్కున్నా.. ఫోన్, టీవీ, ఫ్రెండ్స్ .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. లిమిటెడ్ సోర్సెస్‌తో.. పగలు, రాత్రి తేడా తెలియకుండా.. సగం ఆకలి, సగం నిద్రతో హౌజ్‌లో గడపడం.. యు కాంట్ ఇమాజిన్. అయినా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం అలవాటు కదా. ఆ అలవాటుతోనే ఫస్ట్ టూ డేస్ ఫోన్ కోసం చాలా వెదుక్కున్నా. తర్వాత గుర్తుచేసుకుంటే నవ్వొచ్చేది. అప్పటిదాకా మా ఇంట్లో నేను చేయని పనులన్నీ హౌజ్‌లో చేశాను. బట్టలు ఉతికాను. వంట చేశాను. నా వంటలను అందరూ మెచ్చుకున్నారు. తెలుగులో పొలైట్‌గా ఎలా మాట్లాడాలో హౌజ్‌లోనే తెలుసుకున్నా. ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలి? పదిమందితో ఎలా సర్దుకుపోవాలి? ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలి? పట్టూవిడుపులు అన్నీ నేర్చుకున్నా. సామ్రాట్.. ట్రోలింగ్.. నిజానికి సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల కిందటే పరిచయం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా. అంత క్లోజ్ కాదు అప్పుడు. అసలు సామ్రాట్‌కి పెళ్లి అయిందని, అది ప్రాబ్లమ్‌లో ఉందని హౌజ్‌లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ చాలా జోవియల్‌గా ఉంటాడు.ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. దాంతో అతనితో కనెక్ట్ అయ్యా. క్లోజ్ ఫ్రెండ్‌గా మారాడు. అంతమాత్రాన నన్ను ట్రోల్ చేయడమేనా? మైగాడ్ నా క్యారెక్ట్నే అసాసినేట్ చేసేలా బూతులు..! ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో ఎమోషనల్‌గా అటాచ్ కావడం తప్పా? అది కంప్లీట్ పర్సనల్ థింగ్! నేను ఎవరితో మాట్లాడాలి? నా ఫ్రెండ్స్లిస్ట్లో ఎవరుండాలి? ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి.. ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా? నా పర్సనల్ స్పేస్ నాకు ఉండదా? హౌజ్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. బయటకు వచ్చాక తెలిసింది. ట్రోలింగ్స్ చాలా ఫ్రస్టేట్ అయ్యా. కుంగిపోయా. అయితే నన్ను ఎంకరేజ్ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ పోస్టింగ్స్వచ్చాయి. ‘‘తేజా.. నువ్వు లేని బిగ్ బాస్ చూడాలనిపించట్లేదు. నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావ్.. బ్లెస్ యూ.. వుయ్ లవ్ యూ’’అంటూ చాలా కాంప్లిమెంట్స్.. యూకే, యూఎస్ నుంచి. ఇక్కడి వాళ్లూ చాలామంది మోరల్‌గా సపోర్ట్ చేస్తూ మెస్సేజెస్ పెట్టారు. వాటితోనే తేరుకున్నా. ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు.. నేనే ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నా. కొంతమందైతే సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్‌నెస్‌ను పెళ్లితో ముడిపెడతారా? వండర్! సామ్రాట్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటికీ. డౌటే లేదు. హౌజ్ మేట్స్ తనీష్, బాబుగోగినేని గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. లైఫ్ పట్ల బాబుగోగినేని గారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయో నాకూ అలాంటివే ఉన్నాయి. నేను ఆయనకు అభిమానినైపోయా. తనీష్‌కు కోపం ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చేసుకున్నాడు. వాళ్లమ్మ చాలా టెన్షన్ పడ్తుంటే నేను చెప్తున్నా.. డోంట్ వర్రీ ఆంటీ అని. బాబుగోగినేని గారిలాగే వాళ్లావిడ కూడా చాలా స్మార్ట్ (నవ్వుతూ) ఆవిడ, వాళ్ల బాబు చాలా కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. హౌజ్‌లో ఉన్న వాళ్లందరికీ కెమెరా ముందు ఎలా ఉండాలో తెలిసిపోయింది. అందుకే అందరూ యాక్షన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఎదిగిన ఫీలింగ్ బిగ్ బాస్ హౌజ్‌లో చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మళ్లీ వెళ్లే అవకాశం వస్తే వెళ్తా. ఈ ఎక్స్‌పీరియెన్స్‌తో హౌజ్‌లో బాగా ఓవరాక్షన్ చేస్తా. నా విషయంలో నా ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. నేనేంటో వాళ్లకు తెలుసు. ‘‘ షోలో గెలిచొస్తావని పంపిస్తే..ఇలా వచ్చేశావ్’’ అని ఆటపట్టిస్తుంటారు. బేసిగ్గా నేను కొంచెం లౌడ్‌గా ఉంటా. ఒంటరిపోరాటమే కాబట్టి..అలా అలవాటైంది. పైగా మేల్‌డామినేటెడ్ సొసైటీ.. మేల్‌డామినేటెడ్ ఫీల్డ్.. లౌడ్‌గా లేకపోతే అంతే సంగతి. మొదటి నుంచే స్ట్రాంగే.. బిగ్ బాస్ హౌజ్, ట్రోలింగ్స్ లాంటి అనుభవాలు నన్ను ఇంకా స్ట్రాంగ్ చేశాయి. ఎదిగిన ఫీలింగ్. ఇది కరెక్ట్ .. ఇది రాంగ్ అని నాకు ఎవరూ చెప్పలేదు. సిట్యుయేషన్సే అన్నీ నేర్పాయి. కాబట్టి అవే నాకు పేరెంట్స్. ఫ్రెండ్సే నాకు అన్నీ. డాన్స్ అండ్ వర్క్‌తో నా లోన్లీనెస్‌ను ఓవర్‌కమ్ చేసుకుంటా. నా వెంట నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్. ఫ్యూచర్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వస్తే అన్నీ చేశాను. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.. ఇంకా అలాంటి చానల్స్‌కు ట్రావెల్ షో చేయాలనే థింకింగ్ ప్రాసెస్లోఉన్నా. తమిళ్, తెలుగు సినిమా చాన్సెసూ కొన్ని ఉన్నాయి. కథలు వింటున్నా’’ అని తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నారు తేజస్వి.. బిగ్‌బాస్ స్టార్. చూపిస్తున్నది కొన్నే హౌజ్‌లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. 24 గంటలూ కెమెరాల ముందే కదా.. అంతా టెలికాస్ట్ అవుతుందేమో అనుకుంటాం. కాని కావట్లేదు. నా విషయమే తీసుకుంటే.. నేను అరిచినవి మాత్రమే చూపించారు. దానికిముందు కౌశల్ చేసినవి చూపించలేదు. కౌశల్ చేసిన వాటికి కోపమొచ్చి నేనలా అరిచా. అదే హైలైట్ అయింది. సామ్రాట్ విషయంలోనూ అంతే. ముందూవెనకా చూపించకుండా.. జనాలు దేనికి ఎంటర్టైన్ అవుతారో దాన్నే చూపిస్తున్నారు. ఈవెన్ ప్రోమోస్ కూడా అంతే. దీని వల్లే చాలామంది స్క్రిప్టెడ్ షో అనుకుంటున్నారు. టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేస్తున్నారు. 45 నిమిషాల ఎడిటెడ్ వెర్షన్లో అదే నిజమనుకుంటే ఎలా? దానికి ముందు ఏం జరిగిందో.. ఎవరు దేనికి.. ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నారో చూపించకుండా కేవలం రెస్పాన్సెస్నే చూపిస్తున్నారు. న్యాయంగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలేవీ హౌజ్‌లో ఉన్నవాళ్లకు తెలియవు. బయటకు వస్తే కాని అర్థంకాదు జరుగుతున్నదేంటో! – శరాది -
బిగ్‌బాస్2 :మరోసారి మోడల్ సంజనా ఫైర్
హైదరాబాద్ : బిగ్‌బాస్-2 షోలో ప్రేక్షకులకు కావాల్సిన మజా ఇప్పుడిప్పుడే లభిస్తోంది. బిగ్‌బాస్ ఆసక్తికరమైన టాస్క్‌లు.. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్దం, వారి ఎమోషన్‌తో ఐదో రోజు రసవత్తరంగా ముగిసింది. సామన్యుడి కేటగిరిలో హౌస్‌లోకి వెళ్లిన మోడల్ సంజనా మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. తొలి రోజు నుంచే ఉప్పు-నిప్పులా ఉన్న తేజస్వీ, సంజనాలు ఒకరినొకరు తిట్టుకున్నారు. సెలబ్రిటీ అయితే బయట చూయించుకోండి.. ఎక్స్‌ట్రాలు చేస్తే బాగుండదని సింగర్ గీతామాధురి వద్ద సంజనా బ్లాస్ట్ అయింది. అయితే ఆమె అలా ప్రవర్తిస్తుంటే.. హౌస్ మెట్స్ స్పందించకపోవడం పట్ల ఎమోషన్ అయిన తేజస్వీ ఏడ్చేసింది. ముఖ్యంగా నూతన నాయుడు ప్రవర్తన తనకు నచ్చడం లేదని, అతనితో మాట్లాడనని తేల్చి చెప్పేసింది. ఆయన అన్నీ తనకే తెలిసన్నట్లు ప్రవర్తిస్తున్నాడని కంటతడి పెట్టింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘నవ్వుతూ అందరినీ మెప్పించాలనే సిక్రెట్ టాస్క్’ను తేజస్వీ విఫలమయ్యింది. దీంతో ఆమెను కెప్టెన్ పోటీకి అనర్హురాలుగా బిగ్‌బాస్ ప్రకటించారు. అయితే తేజస్వీ సీక్రెట్ టాస్క్ ఏమిటంటే.. ముఖ్యంగా తనకు గిట్టని వారిని మెప్పించాలన్నాడు. సంజనా పనులన్నీ తానే చేయాలని, బాబు గోగినేనిని ఫ్యాషన్‌గా రెడీ చేయాలి. కౌశల్‌కు మసాజ్ చేయాలి. అమిత్‌కు కోపం వచ్చేలా చేయాలి. గీతా మాధురి మేకప్ చెడగొట్టాలని బిగ్‌బాస్ సిక్రేట్ టాస్క్ఇచ్చారు. ఏడ్చేసిన దీప్తీ సునైనా.. ‘చెప్పండి ప్రభూ లగ్జరీ టాస్క్’ లో భాగంగా యజమానులు, సేవకుల జట్టుగా కంటేస్టేంట్లు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా యజమాని అయిన కిరిటీ దామరాజు దీప్తీ సునైనాతో ఫ్లోర్ క్లీన్ చేయిస్తూ వచ్చిన పాటను పదేపదే పాటించాడు. దీంతో ఆమె కంటతడి పెట్టింది. వెంటనే ఆమెను ఓదార్చిన కిరిటీ.. ఎందుకు ఏడుస్తున్నావని అడగగా.. తేజస్వీ తనతో దురుసుగా మాట్లాడుతుందంటూ దీప్తీ సునైనా ఏడ్చేసింది. ఆమెను యాంకర్ దీప్తీ, శ్యామలు, భానుశ్రీ, కిరిటీ దామరరాజులు ఓదార్చారు. తేజస్వీ, దీప్తీల మధ్య సింగర్ గీతామాధురి రాజీ కుదిర్చింది. తేజస్వీ దీప్తీ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. చెప్పండి ప్రభూ లగ్జరీ టాస్క్‌లో కిరిటీ టీమ్ సంజనా టీమ్‌పై 177 పాయింట్లతో విజయం సాధించింది. సంజనా టీమ్‌కు 170 పాయింట్లు వచ్చాయి, సామన్యుడైన నూతన నాయుడిపై సహచరులు యుద్దం ప్రకటించారు. ఆయన గేమ్ ఆడుతున్నారనీ.. అంతా తనకే తెలుసున్నట్లు ప్రవర్తిస్తున్నట్లు మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో అలిగిన నూతన నాయుడు డిన్నర్ చేయకుండా వెళ్లి పోయాడు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది తేజస్వీ.. ఇలా ఐదో ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. -
తెలంగాణ మాండలికంతో పేరొచ్చింది...
శ్రీమంజునాథ చిత్రంలో ‘‘నాన్నా! సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు’’ అని పలికే ఆనంద్ వర్థన్ (అర్జున్ కుమారుడు) నటించిన పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోశారు తిరుమల తేజస్వి. హైదరాబాద్‌లో ఉంటున్న తేజస్వి రేడియో మిర్చి ఎఫ్ఎం లో ‘ఆర్జె టిజె’గా ప్రేక్షకులకు సుపరిచితులు. ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చే శాక ‘ది హిందూ పత్రిక’లో ఇంటర్న్ షిప్ చేసి తను తీసిన ఫొటోలను ఆ పత్రికలో చూసుకున్నారు. ‘కందిరీగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు... ‘‘నన్ను అందరూ టీజే ఆచార్య అంటారు. నా అసలు పేరు తిరుమల తేజస్వి అనే విషయం మర్చిపోయారు. ‘మిర్చి లవ్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రేడియో జాకీగా ‘నేను మీ టీజే’ అంటూ అందరికీ వినిపిస్తాను’’ అంటున్న తేజస్వి తన మూడవ ఏట నుంచే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. తండ్రి విజయకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ ఫౌండర్‌లో ఒకరు కావడం వల్ల ఇంట్లో అందరూ డబ్బింగ్ ఆర్టిస్టులు అయ్యారు. ‘‘చిన్నప్పటి నుంచి నాన్నతో శబ్దాలయ, ప్రసాద్ ల్యాబ్స్, రామానాయుడు స్టూడియోలకి వెళ్తుండేదాన్ని. అక్కడ నేను కూడా చెప్తానని వచ్చీరాని మాటలతో అన్నానుట. 1994లో మొట్టమొదటగా నా చేత చిన్న పిల్లలకు డబ్బింగ్ చెప్పించారు. సినిమా పేరు‡ అస్సలు గుర్తు లేదు’’ అంటున్న తేజస్వి ‘ఆక్రందన’ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. ఆ సీరియల్‌కు తన డబ్బింగ్ తానే చెప్పుకున్నారు. చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా... శ్రీభాగవతం సీరియల్లో కౌశిక్‌కి, శివలీలలు సీరియల్లో తనీష్‌కు డబ్బింగ్ చెప్పారు. ‘‘నాన్నగారు దూరదర్శన్‌లో టెలీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయనతో పాటు స్టూడియోకి వెళ్లి, అవసరమైన చోట పిల్లలకు డబ్బింగ్ చెప్పేదాన్ని’’ అని బాల్యస్మృతులు వివరించారు. శ్రీమంజునాథ చిత్రంలో ఆనంద్‌వర్థన్ వేసిన పాత్రకు ఇచ్చిన డబ్బింగ్‌కు దర్శకులు కె. రాఘవేంద్రరావు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రం ప్రీమియర్‌కి ఆనంద్‌వర్థన్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ‘‘తేజస్వి చాలా బాగా డబ్బింగ్ చెప్పిందని వారంతా ప్రశంసించారని అమ్మ నాతో చెప్పారు’’ అంటారు తేజస్వి. కందిరీగతో బ్రేక్ ‘‘డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ప్రసాద్, సుబ్బారావు, కాంచనబాబు... వంటి వారు నాకు డబ్బింగ్లో బాగా అవకాశాలు ఇచ్చారు. చదువుకి ఆటంకం వస్తుందని మధ్యలో మానేశాను. కొంతకాలం తరవాత ‘కందిరీగ’ చిత్రంలో చిన్న బిట్‌కి డబ్బింగ్ చెప్పడానికి నాకు పిలుపు వచ్చింది’’ అంటున్న తేజస్వికి ఆ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో నటించిన అక్షకు తెలంగాణ మాండలికంలో తన గొంతు ఇచ్చింది తేజస్వి. ‘‘అనిల్ రావిపూడి నా గొంతు విని, చాలా పెక్యులియర్‌గా ఉందన్నారు. ఒక పెద్ద డైలాగు ఇచ్చి చెప్పమన్నారు. ఆ చిత్రంలో అది నా మొదటి డైలాగు. తప్పులు లేకుండా చెప్పేశాను. సినిమా విడుదలయ్యాక, ఎలా ఉంటుందో అని టెన్షన్ పట్టుకుంది. ఆ రోజున అనిల్‌రావిపూడి ఫోన్ చేసి, ‘ఏంటి ఇలా చేశావు?’ అన్నారు. బెదిరిపోయాను. ఎక్కడో తప్పు చేసేసి ఉంటాను, కెరీర్ పోయింది అనుకున్నాను. ఆయన నవ్వుతూ, డైలాగులు చాలా బాగా చెప్పావు’ అనేసరికి నా గుండె తేలికపడింది’’ అంటున్న తేజస్వి... మోహన్‌బాబు, రామానాయుడు, బెల్లంకొండ సురేశ్ వంటి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన రామ్, స్వయంగా తన అసిస్టెంట్‌తో తేజస్వికి పెద్ద పూల బొకే పంపారు. తెలంగాణ మాండలికం స్పెషలిస్ట్ బిఏ (సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్) పూర్తి చేశాక, ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చేయడానికి బెంగళూరు వెళ్లిన తేజస్వి ‘రేసుగుర్రం’ చిత్రంలో డబ్బింగ్ కోసం సురేంద్రరెడ్డి నుంచి ఫోన్ అందుకున్నారు. ‘‘నన్ను వాయిస్ టెస్ట్‌కి పిలిచారనుకున్నాను. ఒక వీకెండ్‌కి వచ్చి రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్పాను. . అందులో అల్లు అర్జున్‌కి వదినగా వేసిన సలోనీ పాత్రకు తెలంగాణ మాండలికంలో నా చేత డబ్బింగ్ చెప్పించారు. తెలంగాణ అనగానే నన్ను పిలుస్తున్నారు. ఇది నాకొక మార్క్. చాలా సంతోషంగా ఉంటుంది’’ అంటున్న తేజస్వి ఎక్కడకు వెళ్లినా ఆమెను కందిరీగ, రేసుగుర్రం చిత్రాల డైలాగులతో పలకరిస్తారు. ఇప్పటివరకు సుమారు 400 చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు తేజస్వి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా 75, మిగిలినవి పెద్ద వాళ్లకి చెప్పారు. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాలకు డబ్బింగ్ చెబుతున్నారు. ‘‘డబ్బింగ్‌తో పాటు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం నా ఫొటోగ్రఫీ. కొందరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాను. కొన్ని మాక్ షూట్స్ చేశాను’’ అన్నారు తేజస్వి. గుమ్మం బయటే వదిలేయాలి... ‘‘మనకు ఎన్ని చికాకులు ఉన్నా, మైకు ముందుకి వచ్చాక, పాత్ర గురించి మాత్రమే ఆలోచించాలి. మన వ్యక్తిగత విషయాలను స్టూడియో గుమ్మంలో విడిచిపెట్టేసి లోపలకు ప్రవేశించాలి అని నాన్న అంటుంటారు. నటీనటులు స్క్రీన్ ముందర పనిచేస్తే, మనం మైక్ ముందరే చేయాలి అని చెప్పేవారు నాన్న. కందిరీగ చిత్రం టైమ్‌లో నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. అప్పుడు నేను బాగా నవ్వే సీన్‌కి డబ్బింగ్ చెప్పాలి. నాన్నకి ఎలా ఉందోనని మనసు అటు వైపే లాగింది. ఇక్కడ డైలాగులు చెప్పాలి. ఎన్నిసార్లు నవ్వుతున్నా అందులో చిన్న బాధ వినిపిస్తోంది. దాంతో అనిల్ రావిపూడి నన్ను బయటకు పిలిచి ఐదు నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందాం అన్నారు. బయటకు వచ్చాక ఏమైందని అడిగారు. విషయం చెప్పాను. ఆయన తనకు ఎదురైన అనుభవాలు చెప్పి. నన్ను పని మీద దృష్టి పెట్టమని, వాతావరణం హ్యాపీగా ఉంచమని బుజ్జగించారు. ఆయన మాటలకు నా మనసుకి చేరాయి. బ్రేక్ అయ్యాక డైలాగు చెప్పాను. సింగిల్ టేక్‌లో అయిపోయింది’’ అంటున్న తేజస్వి తల్లి రజనీకాంత,,, మణిశర్మ, కీరవాణి వంటి సంగీత దర్శకుల దగ్గర కోరస్ పాడేవారు. ఆమె వీణ వాయిస్తారు, రచయిత కూడా. ఇంటర్వ్యూ: వైజయంతి డైలాగులు కందిరీగ: చల్ (ఆ సినిమా తరవాత చల్ ఊతపదంగా మారింది), గంటేంది... మోగుడేంది, నాయనా టీవీ కే బులాణ్ని పిలు. రేసు గుర్రం: (చంద్రమోహన్ కాళ్లకు మొక్కమన్న సందర్భంలో) ఛత్ గీపొట్టి సాలెగానికా... నే పెట్టపో... కందిరీగ నాకొక మంచి మెమరీ ‘స్వరాభిషేకం’ షూటింగ్‌కి అక్కతో పాటు నేను కూడా వచ్చాను. అక్కడ ఒకాయన కందిరీగ చిత్రంలో నా డైలాగుని రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. అది విని నాకు చెప్పరాని సంతోషం వేసింది. – తేజస్వి -
సాంస్కృతిక రాయబారి
తేజస్వి చాలా సాధారణమైన అమ్మాయి... మన పక్కింటి అమ్మాయిలాంటిది. అందరినీ తన పక్కింటి వాళ్లే అన్నంతగా ఆదరిస్తుంది... యోగసాధన చేయండి, ధ్యానం చేయండి, బాడీని ఇలా స్ట్రెచ్ చేయండి... రోజులో ఎన్ని పనులున్నా ఒక గంట టైమ్‌ని మీ కోసం కేటాయించుకోండి... అని చెబుతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవడం, మితిమీరిన ఒత్తిడిని బయటకు వదిలేయడం ఎలాగో నేర్పిస్తుంది. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మొదలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వరకు విస్తరించింది. ఆ అలవాటే ఆమెని ఇప్పుడు జర్మనీకి పంపిస్తోంది. ఆ ఆసక్తే ఆమెకు జర్మనీలో భారతీయ సంస్కృతిని నేర్పించే బాధ్యతను ఇచ్చింది.తేజస్వి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ గర్ల్స్ స్కూల్లో చదివింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న రామకృష్ణ మఠంలో యోగసాధన, ధ్యానసాధన నేర్చుకుంది. రామకృష్ణ మఠం నుంచి జర్మనీలోని ఇండియన్ ఎంబసీకి దారి తీసిన తేజస్వి ప్రయాణం ఇది. ‘‘అంత చిన్నప్పుడు ప్రత్యేకమైన లక్ష్యాలతో యోగా నేర్చుకోలేదు, ఇంట్లో అమ్మానాన్నలు ప్రాక్టీస్ చేస్తుండటంతో అలవాటైంది. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్, అమ్మ గృహిణి. వాళ్లిద్దరికీ ధ్యానసాధన అలవాటుండేది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక బెంగళూరులో హెచ్‌పిలో ఉద్యోగంలో చేరాను. బెంగళూరులో పోస్టింగ్ రావడం నా అదృష్టమనే చెప్పాలి. అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులకు వెళ్లే అవకాశం కలిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసుల్లో నేర్చుకున్న నాలెడ్జ్‌ని అప్లయ్ చేయడానికి నా సాఫ్ట్వేర్ కంపెనీ చక్కటి వేదికైంది. ఐటీ రంగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్‌ని అదుపులో పెట్టుకోవడానికి మనవంతుగా కొంత సాధన అవసరం. అలాగే ఒత్తిడిని వదిలించుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేను నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తాన్ని యథాతథంగా కుమ్మరిస్తానంటే వినే ఓపిక, టైమ్ ఎవరికీ ఉండవు. అందుకే ఆ ఉద్యోగంలో ఉండే వారికి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాను. కొన్ని గంటలు పని చేసిన తరవాత సీట్లోనే కూర్చుని బాడీని స్ట్రెచ్ చేయడం, నిలబడి ఐదు నిమిషాల పాటు బాడీని ట్విస్ట్ చేయడం, నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ స్ట్రెచ్ చేయడం, ఐ ఎక్సర్సైజ్ చేయించేదాన్ని. యోగా హైకింగ్! : మన కొలీగ్స్ మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, సొసైటీ మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలి... అలా ఉండాలంటే నా సర్వీస్‌ని విస్తృతం చేయాలనిపించింది. హెచ్‌పీలో ఏడేళ్ల అనుభవాన్ని వదిలేశాను. ‘సిట్ అండ్ కామ్’ అని సొంత స్టార్టప్‌తో యోగ, మెడిటేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. ప్రైవేట్ స్కూళ్లలో మినిమమ్ ఫీజుతో సర్వీస్ ఇస్తున్నాను. ఈ రంగాన్ని చాదస్తంగా చూస్తారు. దానిని డైలీ లైఫ్‌తో ఇన్కార్పొరేట్ చేయగలిగాను. ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసే వాళ్లకు ‘యోగా హైకింగ్’ని పరిచయం చేశాను. ఈ ప్రాక్టీస్‌తో వాళ్లు ట్రెక్కింగ్‌లో త్వరగా అలసిపోకుండా దృఢంగా ఉంటారు. ఒప్పించాను... మెప్పించాను: ఉద్యోగం మానేయాలన్నప్పుడు ఇంట్లో కొంత వాగ్వాదం జరిగింది. నీకు ఇష్టమైన రంగాన్ని హాబీగా కొనసాగించుకోవచ్చు కానీ ఉద్యోగం మానేసి మరీ కల్చరల్ స్కిల్స్‌ని విస్తరింపచేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగంలో వచ్చినంత రాబడి ఉండేలా, ఆర్థిక ఇబ్బంది రాకుండా చూసుకోగలను. కెరీర్ పరంగా అంతకంటే మంచి పొజిషన్లో స్థిరపడతాను... అని అమ్మానాన్నలను ఒప్పించాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ గంటలు శ్రమించాను. ఇచ్చిన మాట వెంటాడింది!: ఉద్యోగాన్ని వదిలిన తర్వాత అంతకంటే మంచి పొజిషన్లో స్థిరపడతానని పేరెంట్స్‌కి ఇచ్చిన మాట వెంటాడుతుండేది. యోగ, ధ్యానంతో ఇంకా ఏయే అవకాశాలుంటాయోనని అన్వేషించాను. ఆయుష్ పెట్టిన క్యూసీఐ పరీక్షలో పాసయ్యాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాని విస్తృతం చేయడానికి విదేశాలకు కూడా పంపిస్తారని తెలిసి మినిస్ట్రీలో సంప్రదించాను. అప్పటికే వారి ఎంపిక పూర్తయింది. అయితే అప్పుడే తెలిసింది మన గవర్నమెంట్ కొత్తగా కల్చరల్ టీచర్ అనే కొత్త పోస్టును క్రియేట్ చేసిందని. ప్రతి దేశంలో ఉండే మన ఎంబసీలకు ఒక్కొక్కరిని నియమిస్తారు. నేను జర్మనీలో ఉండే ఇండియన్ ఎంబసీకి సెలెక్ట్ అయ్యాను. కల్చరల్ టీచర్స్ ఆయా దేశాలలో ఇండియన్ కల్చర్ గురించి తెలియచేస్తారు. ఆ దేశాల్లో ఉన్న భారతీయులను సంఘటితం చేయడానికి కూడా ఇవి పనికొస్తాయి. వారిని ఇండియన్ కల్చర్‌తో మమేకం చేయడం, ఒక వేదిక మీదకు తీసుకురావడం వంటివన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు క్లాసికల్ డ్యాన్స్ వంటి కొన్నింటికే ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు యోగా, ధ్యానం కూడా విస్తృతంగా పరిచయమవుతాయి. నాకు ఇష్టమైన రంగంలో పని చేయడమే కాకుండా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది’’. – తేజస్వి, కల్చరల్ టీచర్ – వాకా మంజులారెడ్డి -
విజేతలు రమేశ్, తేజస్వి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్‌లో ఆదివారం జరిగిన సమ్మర్ రోడ్ రన్ పోటీల్లో రమేశ్, తేజస్వి విజేతలుగా నిలిచారు. అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పురుషుల 5కె రన్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌కి చెందిన రమేశ్ 15 నిమిషాల 55.7 సెకన్లలో పరుగు పూర్తి చేసి టైటిల్ సాధించాడు. ఈ పోటీల్లో సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థకు చెందిన పవన్ తేజ (16ని.00.9 సెకన్లు), జెడ్పీహెచ్ఎస్ మేకగూడకి చెందిన శ్రీనివాస్ (16ని.00.9 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల 5కె రన్లో పి.తేజస్వి (సెయింట్ పాయిస్–25ని.02.1 సెకన్లు) విజేతగా నిలిచింది. హిమబిందు (రెడ్డి కాలేజ్–26ని.03.2 సెకన్లు), నిత్య (జేజీఎస్–26ని.20.1 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ శ్రీనివాస్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఇతర విభాగాల ఫలితాలు: బాలురు: అండర్–16 5కె: 1. అజయ్‌కుమార్ ( (డీఎల్ఎస్–17ని.56.3 సెకన్లు), 2. రాయుడు (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ, 18.01.1), 3. సుమిత్ (హైదరాబాద్,18.04.3). అండర్–13 (2.5 కి.మీ): 1. రమేశ్ సింగ్ (ఆర్మీ స్కూల్, 9.18.1), 2. చిన్నయ్య (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.29.3), 3. రంజిత్ కుమార్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.32.2). అండర్–10 (1.5 కి.మీ): 1. నందు ( జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.35.6), 2. భార్గవ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.36.7), 3. రాజేశ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.45.2). మాస్టర్ పురుషులు (2.5 కి.మీ): 1. సంజయ్ కుమార్ (లయన్స్ క్లబ్ ,12.14.1), 2. స్వాములు (12.45.9), 3. సుందర్ రాజన్ (ఎస్బీఐ, 14.12.6). బాలికలు: అండర్–16 (5 కి.మీ): 1. కీర్తి (రైల్వే జూనియర్ కాలేజ్, 20.59.1), 2. సౌజన్య (ఎస్జీబీహెచ్ఎస్, 21.59.1), 3. జువేరియా (హైదరాబాద్, 22.24.6); అండర్–13 (2.5 కి.మీ): 1. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, 10.22.1), 2. యువిక (కెన్నడీ వీబీ, 10.29.1), 3. పి. శ్రేయ (మమత హెచ్ఎస్, 11.10.5); అండర్–10 (1.5 కి.మీ): 1. తేజస్వి (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.58.1), 2. శిరీష (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.59.6), 3. శ్రేయ (హైదరాబాద్, 9.44.7). మాస్టర్ మహిళలు: (2.5 కి.మీ) 1. రూప (14.01.1), 2. సునీత (హైదరాబాద్, 15.00.3), 3. సుబ్బలక్ష్మి (16.10.1). -
స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సీరీస్ల హవా నడుస్తుంది. మెగా వారసురాలు నిహారిక స్టార్ట్ చేసిన వెబ్ సీరీస్ ట్రెండ్‌ను ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఫాలో అవుతున్నారు. వెండితెర మీద సక్సెస్ కావాలనుకునే వారితో పాటు సక్సెస్ కాలేకపోయిన వారు కూడా వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక కళాకారులు వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకోగా ఇప్పుడు స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. అలామొదలైంది, కళ్యాణ వైభోగమే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి కథతో నటుడు శశాంక్ దర్శకత్వంలో ఓ వెబ్ సీరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సీరీస్‌ను దాదాపు 25 ఎపిసోడ్స్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్‌లో హీరో రాహుల్ రవీంద్రన్, ఆదిత్ ఈశ్వరన్‌లతో పాటు హీరోయిన్ తేజస్వీ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
దర్శకుడు చెప్పినట్టే చేస్తా
‘‘నా కూతురు 6వ తరగతి చదువుతోంది. ముద్దుగా ‘మా అమ్మ ఎక్కడ’ అంటుంటాను. ఏ తండ్రికైనా కూతురుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ చిత్రంలో నాది అటువంటి పాత్ర కావడంతో తల్లిదండ్రులు అందరూ తమను తాము చూసుకుంటు న్నారు’’ అన్నారు రావు రమేశ్. బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లో హీరోయిన్ హెబ్బా పటేల్ తండ్రిగా రావు రమేశ్ నటించారు. ఈ 16న రిలీజైన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి పాత్ర రాదంటుంటే హ్యాపీగా ఉంది. హెబ్బా, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ బాగా నటించారు. ‘దిల్’ రాజు సలహాలు వెలకట్టలేనివి. సమష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. ప్రతి సినిమాలోనూ దర్శకుడు చెప్పినట్టు నటిస్తా. మా నాన్నగారి (రావు గోపాలరావు)తో సహా ఎవర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించను. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’, ‘కాటమ రాయుడు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు. -
ఆడాళ్లూ..మరదల్ని చూడండి!
మీరు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆమె చెల్లెలు మీకు ఏమవుతుంది? వరుసకు మరదలే కదా! ఆ లెక్కన వెంకటేశ్‌కు తేజస్వి మరదలు అవుతోందిప్పుడు! ‘నేను.. శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించనున్న చిత్రం ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్ చెల్లెలి పాత్రలో తేజస్వి మదివాడ నటించనున్నారు. అగ్రిమెంట్ మీద ఇంకా సంతకం చేయలేదు గానీ... దర్శకుడు కథ చెప్పడం, ఆమె ఓకే చేయడం జరిగాయి. ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట! ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’లో తేజస్వి పెంపుడు తల్లిగా నిత్య నటించారు. ఇప్పుడీ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా కనిపించనున్నారు. ఇక, ఈ చిత్రకథ విషయానికొస్తే... ‘ప్రేమకు వయసుతో పనేముంది? మనసుతోనే కదా. వయసులో వ్యత్యాసం ఉన్న ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే?’ అనేది ముఖ్యాంశం. మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుందట.ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట! -
ప్రేమ, కామెడీ జత కలిసే?
చిత్రం : 'జత కలిసే' తారాగణం : అశ్విన్‌బాబు, తేజస్వి సంగీతం : ఎం.సి.విక్కీ, సాయి కార్తీక్ కెమేరా : జగదీశ్ ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్ నిర్మాతలు : నరేశ్ రావూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాకేశ్ శశి ప్రయాణంలో పదనిసలు తరహా రోడ్ జర్నీ కథలు తెరపై సుపరిచితమే. ఆ బ్యాక్‌డ్రాప్ తీసుకొని, ప్రేమ, పెళ్ళి, జీవితాశయం లాంటి అంశాలను కలగలిపి కథ అల్లుకుంటే? ఈ ఆలోచనతో చేసిన యత్నం- ‘జత కలిసే’. అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుంటాడు ఋషి (అశ్విన్ బాబు). అతను తన స్నేహితుడి పెళ్ళి కోసం వైజాగ్ వస్తాడు. తీరా అక్కడ పెళ్ళికొడుకుతో తాగుడు పందెం కట్టి, ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణమవు తారు - హీరో, అతని ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో అమెరికా తిరుగు ఫ్లైట్ ఎక్కడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ట్యాక్సీలో బయలుదేరతాడు హీరో. వైజాగ్‌లోనే సూర్య (సూర్య) దంపతుల కూతురు తేజస్వి అలియాస్ పింకీ (తేజస్వి). ఐ.ఏ.ఎస్. ఇంటర్వ్యూ కోసం ఈ హీరోయిన్ కూడా హీరోతో ఒకే ట్యాక్సీలో హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి పెళ్ళి చెడిపోయింది తాగుబోతులైన హీరో బృందం వల్లేనని గుర్తించిన హీరోయిన్ వాళ్ళకు బుద్ధిచెప్పాలని రంగంలోకి దిగుతుంది. కలసి ప్రయాణిస్తున్న హీరో గారికి తెలియకుండానే, ఎఫ్.ఎం. రేడియో, ఫేస్బుక్, యూ ట్యూబ్ లాంటి వాటిని ఆశ్రయించి, హీరో బ్యాచ్ గురించి గబ్బు రేపుతుంది. ఈ లోగా ఒకటీ అరా పాటలు... హీరో హీరోయిన్ల లవ్ సిగ్నల్స్... హీరోయిన్ మంచితనం చూపే ఘట్టాలు వస్తాయి. ఇంతలో ఆ అమ్మాయే తమపై దుమారం రేపుతోందని హీరో కనిపెడతాడు. అక్కడికి ఇంటర్వెల్. సెకండాఫ్ మొదలయ్యాక తాను మంచివాడినేనన్న సంగతి హీరోయిన్‌కు అర్థమయ్యేలా చేస్తాడు హీరో. ఒక దశలో హీరోయిన్ అక్క తన భర్తతో పొసగక, బెంగుళూరులో ఆత్మహత్య చేసుకోబోతుంటే, ‘స్వీట్ మెమొరీస్’ సీడీ చూడమంటూ ఫోన్లోనే చెప్పి, ఫ్యామిలీ కౌన్సెలర్ అవతారమూ ఎత్తుతాడు. ఆ తరువాత ఏమైంది? హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు ఏమయ్యాయి అన్నది మిగతా సినిమా. నట-దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్‌బాబు హీరోగా హుషారుగా చేసిన మరో ప్రయత్నమిది. తేజస్వి ఎప్పటిలానే చలాకీతనంతో కనిపిస్తారు. ఇక, లేడీ ట్యాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్ధ, వారానికి ఆరు రోజులే డ్యూటీలో ఉండే దొంగ కల్యాణ్‌బాబు పాత్రలో షకలక శంకర్ లాంటివాళ్ళు వినోదమందిస్తారు. ధన్‌రాజ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి లాంటి ఇతర కమెడియన్లు కూడా ‘ఆఖరి నిమిషంలో పాలుపంచుకొని’, తెరపై నవ్విస్తారు. ‘గబ్బర్‌సింగ్’ మొదలు తాజా ‘శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్, బెంగాల్ టైగర్’ దాకా పలు చిత్రాల్ని అనుకరిస్తూ, సైటైరికల్ స్పూఫ్ ఒకటి చేశారు. మందు సీసా మీద ఓపెన్ అయి, ఒక పాటతో సహా చాలాసేపు మద్యం వాసన కొట్టే ఈ సినిమా ముగింపు కూడా ఆసక్తికరంగా మద్యం తాగననే హీరో ఒట్టుతోనే! కథ చిన్నది కాబట్టి, కథనం కోసం సందర్భాలు, సన్నివేశాలు అనేకం అల్లుకుంటూ వెళ్ళిన ఈ ఫిల్మ్‌లో లాజిక్‌లు వెతకకూడదు. ఇటు పూర్తి కామెడీ సినిమా చేయాలా, అటు రోడ్ జర్నీలో రొమాంటిక్ ఫిల్మ్ తీయాలా అనే విచికిత్స దర్శక, నిర్మాతలను వెంటాడి నట్లు అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఫార్ములా అన్వేషణలో పాత్రల ప్రవర్తన తీరు ఇ.సి.జి. గ్రాఫే. కథలానే సినిమా ఎక్కడో వైజాగ్‌లో మొదలై ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కొన్నేళ్ళ క్రితం పెట్టిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో బహుమతి అందుకొన్న రాకేశ్ శశికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. అతనికి ఆ పాత వాసనలు ఇంకా పోలేదని గుర్తుచేస్తుంది. ఏమైనా స్పూఫ్ కామెడీ, సవాలక్ష ప్రేమకథల రెడీ మిక్స్ ‘జత కలిసే’నా? -
ప్రేమ ప్రయాణం!
జర్నీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘జతకలిసే’. ‘ఐస్‌క్రీమ్’ ఫేం తేజస్వి, అశ్విన్ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో నరేశ్ రావూరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: జగదీశ్, సంగీతం: విక్కీ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. -
కేటుగాడి ప్రేమకథ
ఆపదలో ఉన్న అమ్మాయి ప్రాణాలు కాపాడటానికి ఓ యువకుడు ఎలా పోరాడాడు? ఆ క్రమంలో ఆ అమ్మాయితో ఎలా లవ్‌లో పడిపోయాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేటుగాడు’. తేజస్, చాందినీ చౌదరి జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. తేజస్ మాట్లాడుతూ -‘‘నా తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నేనీ స్థాయిలో ఉండటానికి కారణం కె.ఎస్. రామారావు గారు, ప్రకాశ్‌రాజుగారు. వారిద్దరూ సినిమా చూసి చాలా బాగుందని అభినందించారు’’ అని చెప్పారు. ‘‘సినిమా క్వాలిటీతో రావడానికి నిర్మాత చాలా బాగా సహ కరించారు’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఒక డిఫరెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తీశారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అచ్చిబాబు ఎం. సంపత్ కుమార్. -
దొంగ పెళ్లి దంపతులకు సత్కారం
సమాజంలో రకరకాల పెళ్లిళ్లలో దొంగ పెళ్లి ఒకటి. ఈ దొంగ పెళ్లిళ్లు కొన్ని సుఖాంతం అవుతాయి. మరికొన్ని ట్రాజిడీగా మారుతాయి. అలా దొంగ పెళ్లి చేసుకున్న దంపతులను ఒక చిత్ర యూనిట్ పట్టు వస్త్రాలతో సత్కరించడం విశేషం. శ్రీ సెంథిల్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు సి.ఎంకిడుపతి, ఎస్.బాలసుబ్రమణ్యం, కె ఎ శశిప్రకాష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తిరుట్టు కల్యాణం (దొంగపెళ్లి). నవజంట రంగయాళి, తేజస్వి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా శక్తివేలన్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. -
కేటుగాడి ప్రేమకథ
ఈ కుర్రాడు ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టిస్తాడు. అందుకే వీణ్ణి కేటుగాడు అని పిలుస్తూ ఉంటారు. ఈ కేటుగాడు ఓ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. మరి.. ఆమె ప్రేమ దక్కించుకున్నాడా, లేదా అనేది తెలియాలంటే ‘కేటుగాడు’ చూడాల్సిందే. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకటేశ్ మూవీస్ బేనర్ లోగోను నిర్మాత కేఎస్ రామారావు, నటుడు రాజీవ్ కనకాల ఆవిష్కరించారు. ఈ టైటిల్ చాలా యూత్‌ఫుల్‌గా ఉందని కేఎస్ రామారావు చెప్పారు. తేజస్ మాట్లాడుతూ - ‘‘ ‘ఉలవచారు బిర్యాని’ తర్వాత అలాంటి కథలు చాలానే వచ్చాయి. కిట్టు చాలా మంచి స్టోరీ లైన్ చెప్పడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అచ్చిబాబు ఎం, సంపత్‌కుమార్ ఎ, సమర్పణ: వి.ఎస్.పి. తెన్నేటి. -
సిటీ వాకిట్లో ఐస్‌క్రీమ్ బ్యూటీ
‘ఐస్‌క్రీమ్’ సినిమాతో ఆడియన్స్ హృదయాలను నైస్‌గా కొల్లగొట్టిన భామ తేజస్వి మదివాడ. తానుపుట్టి పెరిగిన హైదరాబాద్‌లో నాటి, నేటి జ్ఞాపకాలను, తన కెరీర్ విశేషాలను సాక్షి సిటీప్లస్‌తో ఇలా పూసగుచ్చింది. మాది విజయవాడ. అయితే నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. బాల్యమంతా బీహెచ్ఈఎల్, బేగంపేట, సైనిక్‌పురి ప్రాంతాల్లోనే గడిచింది. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఎనిమిది వరకు, బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయలో టెన్త్ వరకు చదివా. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. పీజీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలి టజం చేశా. ఓ టీవీ చానల్లో ఇంటర్నెషిప్ చేశా. నేను ఆరేళ్ల ప్రాయంలో ఉండగా అమ్మ లక్ష్మి చనిపోయింది. అప్పటి నుంచి సిటీలో చిన్నప్పుడు అమ్మతో కలిసి తిరిగిన ప్రాంతాల ఫొటోలు తిరిగేస్తూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటుంటాను. సీఐఎస్ఎఫ్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నాన్న ఎన్కే రావు అన్ని విషయాల్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అన్న హరీశ్ యానిమేటర్. స్కూలింగ్ నుంచే డ్యాన్స్ అంటే నాకు మహా ఇష్టం. స్కూల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వేదికెక్కి స్టెప్పులేసేదాన్ని. అలా బాబాసెహగల్ చికాగో అకాడమీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశా. ఇదే సమయంలో నాకు సెవన్అప్ యాడ్ అవకాశం వచ్చింది. హీరోయిన్ అవుతాననుకోలేదు 2011లో హైదరాబాద్‌లో జరిగిన ‘మిస్ దాబర్ గులబరి’ అందాల పోటీల్లో పాల్గొన్నా. క్యాట్, ర్యాంప్వాక్లతో పాటు డ్యాన్స్ కూడా చేశా. అయితే రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడే నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెల్లెలిగా నటించే చాన్స్ వచ్చింది. హార్ట్ఎటాక్, మనం, అనుక్షణం, లవర్స్ సినిమాల చాన్స్‌లు తలుపుతట్టాయి. రాంగోపాల్‌వర్మ డెరైక్షన్‌లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’లో పూర్తిస్థాయి హీరోయిన్గా చేశా. ప్రస్తుతం ఊర్వశివో...రాక్షసివో, పండగ చేస్కో, రాజు గారి గాడి సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. తమిళ్ మూవీ హోలీలో నటించా. చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండానే అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం సినీ కెరీర్‌పైనే దృష్టి అంతా. సిటీ టేస్ట్ అదుర్స్... చార్మినార్ అంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడికి ఎన్నోసార్లు వెళ్లా. టైమ్ దొరికితే జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ చాట్ భండార్‌లో వాలిపోవాల్సిందే. బేగంపేటలోని నీడ్స్ దాబాలో డిఫరెంట్ స్పైసీ వంటకాల్ని టేస్ట్ చేస్తా. సిటీ సెంటర్ వెనక ఉండే ఓహ్రీస్, రుచి అండ్ ఇదోని బిస్ట్రోకు రెగ్యులర్‌గా వెళ్తుంటా. అక్కడ చెఫ్ చేసే వంటకాలు టేబుల్‌పైకి రాగానే మొదలు కెమెరాతో క్లిక్ చేసిన తర్వాత ఆరగిస్తా. హోలీ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రంగుల్లో మునిగి తేలుతుంటా. నేను చిన్నప్పుడు చూసిన సిటీని మళ్లీ చూడాలనిపిస్తోంది. -
తేజస్ యానం విజయవంతం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తేలికపాటి యుద్ధ విమానాల్లో (ఎల్సీఏ) మొదటిదైన తేజస్ విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించిందని హెచ్ఏఎల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ఏఎల్ చీఫ్ టెస్ట్ ఫ్లైయింగ్ కేఏ. ముతన మంగళవారం సాయంత్రం తొలిసారిగా దీనిని నడిపారని పేర్కొం ది. గత ఏడాది డిసెంబరులో తేజస్‌కు ఐఓసీ సర్టిఫికేషన్ లభించిందని, తొమ్మిది నెలల్లో మరో మైలురాయిని అధిగమించామని హెచ్ఏఎల్ చైర్మన్ డాక్టర్ ఆర్కే. త్యాగి తెలిపారు. భారతీయ వైమానిక దళం కార్యకలాపాలకు ఇక తేజస్ సిద్ధమైనట్లేనని వెల్లడించారు. ఇతర శ్రేణుల్లోని ఎయిర్‌క్రాఫ్ట్ వివిధ నిర్మాణ దశల్లో ఉందని తెలిపారు. ఎల్సీఏ తయారీలో హెచ్ఏఎల్ అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొందని, కార్బన్ ఫైబర్ దిగుమతిలో అమెరికా ఆంక్షలకు గురైందని ఆయన గుర్తు చేశారు. -
అవును... ఇది భయపెట్టే సినిమానే!
సినిమా రివ్యూ చిత్రం: ఐస్‌క్రీమ్, తారాగణం: తేజస్వి, నవదీప్, సంగీతం: పద్యోతన్, కెమెరా: అంజి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు వర్మకూ, హారర్ చిత్రాలకూ తెగని బంధం. జనాన్ని కుర్చీ అంచులో కూర్చోబెట్టే చిత్రాలు తీయాలని ఆయనకు చాలాకాలంగా తపన. పదే పదే విఫలమవుతూ వచ్చినా, ఆ కోరిక ఆయన్ను వదల్లేదు. ఈసారైనా సక్సెస్ సాధించాలనుకుంటూ ఆయన చేసిన తాజా విఫల యత్నం ‘ఐస్‌క్రీమ్’. కథ ఏంటంటే... రేణు (తేజస్వి) ఓ మెడికల్ స్టూడెంట్. ఆమె ప్రియుడు విశాల్ (నవదీప్). తల్లితండ్రులు పెళ్ళికి వెళ్ళడంతో లంకంత కొంపలో రేణు ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఆమె ప్రియుడు విశాల్ ఏం చేశాడు? ఏం జరిగిందన్నది ఈ ‘ఐస్‌క్రీమ్’. ఎలా ఉందంటే... ఈ సినిమా పేరే విచిత్రం. కథానాయికకు ఐస్‌క్రీమ్ అంటే తెగ ఇష్టం. ఆమె తరచూ అది తింటూ కనిపిస్తుంటుంది. అందుకనో ఏమో ఈ సినిమాకు అదే పేరు పెట్టారు. కానీ, తీరా సినిమాలో, మరీ ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో హీరోయిన్ చేసేదల్లా పడుకోవడం, లేవడం, పై దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడమే! ద్వితీయార్ధంలోనూ దాదాపు ఇదే తంతు. హీరోయిన్ కలగంటోందా, అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా - అన్నది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటారు. హఠాత్తుగా వర్మ చేసిన ముగింపు, చూపిన కై్లమాక్స్ తొందరగా జీర్ణించుకోలేరు. హారర్ సినిమా అనగానే కెమేరా పనితనం, రీరికార్డింగ్ కీలకం. విచిత్రమైన కోణాల్లో కెమేరాను ఉంచి తీసిన మాట నిజమే కానీ, సినిమా అంతటా హీరోయిన్ నడుము కింది భాగాన్నే పదే పదే చూపించారు. ఒక దశలో హీరోయిన్ ముఖం నేరుగా తెర మీద కనిపించేది చాలా తక్కువనిపిస్తుంది. వెరసి, ఈ చిత్రీకరణతో దర్శకుడు మరేదో ఉద్దేశించినట్లు అనిపిస్తుంది. అలాగే, వర్మ మార్కు సంచలనమైన హీరోయిన్ నగ్న సన్నివేశ చిత్రీకరణ కూడా ఫక్తు పబ్లిసిటీ స్టంటేనని అర్థమవుతుంది. కిర్రుమనే తలుపు చప్పుళ్ళు, బాత్రూమ్ కుళాయి నుంచి బొట్లు బొట్లుగా నీళ్ళు పడే చప్పుడు, సన్నటి శబ్దంతో సుడులు తిరిగే గాలి లాంటి హారర్ సౌండ్ ఎఫెక్ట్‌లన్నీ ఉన్నా, నిర్దిష్టమైన కథ కానీ, బలమైన సన్నివేశాలు కానీ ‘ఐస్‌క్రీమ్’లో లేవు. వెండితెర దుస్సాహసం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత పక్కన మెరిసిన తేజస్వి నాయికగా ప్రమోటై, భయోద్విగ్నతలు బాగానే పలికించారు. ఆమెకు జంటగా నవదీప్ ఫరవాలేదనిపిస్తారు. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమెకు దెయ్యంగా తారసపడే ముసలావిడే కనిపిస్తుంటారు. మరో మూడు పాత్రలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి. ఇన్ని తక్కువ పాత్రలతో, సినిమా తీయడం ఓ ప్రయోగం, సాహసమే. కానీ, తెలుగు సినిమా మార్కు పాటలేమీ లేకుండానే కాదు... కనీసం కథైనా లేకుండా సినిమా తీయడం వర్మ మాత్రమే చేయగల దుస్సాహసం. సినిమా అంతా ఓ పెద్ద ఇంట్లో కింద హాలు, పైన బెడ్రూమ్, బాత్రూమ్లోనే జరుగుతుంది. దాంతో, ఖర్చు కలిసొచ్చిందేమో కానీ, చూసిన పరిసరాలు, సన్నివేశాలే చూస్తున్నట్లనిపించి, కళ్ళతో పాటు బుర్రకూ అలసటనిపిస్తుంది. మొత్తానికి, అంచనాలతో వెళ్ళి, ఈ సినిమాను ధైర్యం చేసి గంటాము ప్పావు భరించగలిగితే చాలు... ఇక సినిమాలంటేనే ఎవరైనా భయపడడం ఖాయం. వర్మ అలా సక్సెసయ్యారు. వాణిజ్యపరంగా చూస్తే, ఈ వెండితెర కల జనం చూడక ముందే హాలులో నుంచి కరిగిపోయే ఐస్‌క్రీమ్. కొసమెరుపు: సినిమా చూసి మల్టీప్లెక్స్ నుంచి బయటకొస్తూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బృందం కాస్తంత బిగ్గరగానే, తమలో తాము అనుకుంటుండగా చెవినపడ్డ మాట -‘‘వర్మా! మాకు ఇదేం ఖర్మ!!’’ బలాలు: వర్మ ఇమేజ్ తొలిసారిగా ఫ్లోకామ్ టెక్నాలజీ వాడకం, నగ్నంగా నటించిన హీరోయిన్ లాంటి ప్రచారం తక్కువ నిడివి సినిమా బలహీనతలు: యథార్థ ఘటన ఆధారంగా అల్లుకున్నామని వర్మ ప్రకటించిన అర్థం పర్థం లేని స్క్రిప్టు విసుగెత్తించే టేకింగ్ పస లేక నస పెట్టే స్క్రీన్‌ప్లే - రెంటాల జయదేవ -
హాట్ ఐస్‌క్రీమ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌బాబు ముద్దుపెట్టేస్తా అంటే భయపడి పారిపోయిన పాత్రతో వెలుగులోకి వచ్చిందా సిటీబ్యూటీ. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై ‘హాట్’ టాపిక్. రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ చిత్రంలో న్యూడ్‌గా నటించానంటూ పబ్లిగ్గా అంగీకరించి సంచలనం రేపింది. నగరంలోని బేగంపేటలో సెయింట్‌ఫ్రాన్సిస్ కాలేజీలో చదివిన తేజస్వి... డ్యాన్స్ టీచర్‌గా కూడా సిటీలో చాలా మందికి తెలుసు. ఏదో సినిమాలో అడపాదడపా కనిపిస్తుందిలే అనుకుంటుంటే ఏకంగా రామ్‌గోపాల్‌వర్మ చిత్రంలో.. అదీ న్యూడ్‌గా నటించిందంటూ తెలియడంతో ఇది షాకింగ్ న్యూస్ అయింది. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ... వర్మతో పనిచేయడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని, ఆయన ఒక మాస్ట్రో అని కితాబిస్తోంది తేజస్వి. ఐస్‌క్రీమ్ అంటే మహా ఇష్టమంటున్న ఈ బ్యూటీ స్పెయిన్‌లో ఐస్‌క్రీమ్స్ భలే రుచిగా ఉంటాయంది. సినీ పరిశ్రమ తనకు ఎంతో నచ్చిందంటోంది. ఫైనల్‌గా తనకు సంబంధించి వచ్చే రూమర్లపై ఎలా స్పందిస్తావంటే... ‘‘బాగా కష్టపడడం, మన అంతరంగం చెప్పినదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లిపోవడం అంతే’’ అని తేల్చేసింది. - సిద్ధాంతి