tennis tournnament
-
యూఎస్ఏ ఖాతాలో యునైటెడ్ కప్
సిడ్నీ: తొలిసారి నిర్వహించిన మిక్స్డ్ టీమ్ టెన్నిస్ టోర్నీ యునైటెడ్ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ మ్యాచ్‌ల ఫైనల్లో అమెరికా 4–0తో ఇటలీపై గెలిచింది. మహిళల తొలి సింగిల్స్‌లో జెస్సికా పెగూలా 6–4, 6–2తో మార్టినా ట్రెవిసాన్పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో టియాఫో 6–2తో తొలి సెట్ గెలిచాక అతని ప్రత్యర్థి లోరెంజో ముసెట్టి గాయంతో వైదొలిగాడు. దాంతో అమెరికా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సింగిల్స్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/4), 7–6 (9/7)తో ప్రపంచ 16వ ర్యాంకర్ బెరెటినిని ఓడించడంతో అమెరికాకు టైటిల్ ఖరారైంది. నామమాత్రపు నాలుగో సింగిల్స్‌లో మాడిసన్ కీస్ 6–3, 6–2తో లూసియాపై నెగ్గి అమెరికా ఆధిక్యాన్ని 4–0కు పెంచింది. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ టోర్నీలో మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి. -
TPL: అదరగొట్టిన హైదరాబాద్ స్ట్రైకర్స్.. వరుసగా రెండో టైటిల్
Tennis Premier League Season 4- పుణె: టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) సీజన్ 4 చాంఫియన్స్‌గా హైదరాబాద్ స్ట్రైకర్స్ అవతరించింది. తద్వారా వరుసగా రెండో సారి చాంఫియన్‌షిప్ గెలుచుకుంది. లీగ్ చివరి రోజులో భాగంగా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. తొలి సెమీ ఫైనల్లో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్, చెన్నై స్టాలియన్స్ తలపడ్డాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెర్రిన్, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరీనా కజియోనోవాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్ 10–10తో డ్రాగా ముగియగా... ఆ తరువాత మెన్స్ సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఆ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథియాస్ బౌర్గీపై 13–7తో విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరిగగాయి. ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన శ్రీరామ్ బాలాజీ , కొన్నీ పెర్రిన్లు, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరినా కజియోనోవా, అనిరుద్ చంద్రశేఖర్‌ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ 13–7తో విజయం సాధించింది. ఇదే జోరును కొనసాగిస్తూ మెన్స్ డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ, నిక్కీ పూనాచాలు.. చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథయాస్ బౌర్గీ మరియు అనిరుధ్ చంద్రశేఖర్‌పై 12–8తో విజయం సాధించారు. ఈ క్రమంలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ 48–32 పాయింట్లతో చెన్నై స్టాలియన్స్‌పై పూర్తి ఆధిపత్యం చాటుకుని ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రెండో సెమీ ఫైనల్ ఇలా ఇక రెండో సెమీ ఫైనల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీ, బెంగళూరు స్పార్టన్స్‌తో పోటీపడింది. బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన కర్మాన్ కౌర్ థండి, ముంబై లియాన్ ఆర్మీకి చెందిన ఆకాంక్ష నిట్టర్పై 13– 7స్కోర్‌తో మహిళల సింగిల్స్‌లో విజయం సాధించింది. మెన్స్ సింగిల్ విభాగంలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్, బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్ రావత్‌పై 11–9 స్కోర్‌తో విజయం సాధించాడు. అదే విధంగా... మిక్స్డ్ డబుల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన జీవన్ నెడుంచెంజియాన్ మరియు ఆకాంక్ష నెట్టూరిలు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన విష్ణు వర్ధన్, కర్మాన్కౌర్లతో పోటీపడ్డారు. ఈ పోటీలో 12–8 స్కోర్‌తో బెంగళూరుపై ముంబై విజయం సాధించింది. ఇక మెన్స్ డబుల్స్ పోటీలలో ముంబై లియాన్ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్ మరియు జీవన్ నెడుంచెంజియాన్లు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్ రావత్, విష్ణు వర్ధన్ పై 11–9 స్కోర్‌తో విజయం సాధించారు. ఫైనల్లో మరోసారి ఈ క్రమంలో ముంబై లియాన్ ఆర్మీ 41–39 స్కోర్‌తో ఫైనల్స్‌లో ప్రవేశించారు. దీంతో గత సీజన్ మాదిరే ముంబై లియాన్ ఆర్మీ, ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ మధ్య టైటిల్ కోసం పోరు జరిగింది. ఇందులో భాగంగా.. మహిళల సింగిల్స్ విభాగంలో మ్యాచ్ తొలుత జరిగింది. ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెరిన్, ముంబై లియాన్ ఆర్మీ కి చెందిన ఆకాంక్ష నిట్టర్తో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో 13–7తో కొన్నీ పెర్రిన్ విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం మెన్స్ సింగిల్ విభాగపు పోటీలు జరిగాయి. దీనిలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, ముంబై లియాన్ ఆర్మీ కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో పోటీపడ్డారు. ఈ పోటీలో నిక్కీ పూనాచా 12–8 తో విజయం సాధించారు. ఆ తరువాత మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ తరపున శ్రీరామ్ బాలాజీ మరియు కొన్నీ పెర్రిన్ పోటీపడగా, ముంబై లియాన్ ఆర్మీ తరపున జీవన్ నెడుంచెంజియాన్, ఆకాంక్ష నెట్టూరి పోటీపడ్డారు. ఈ మ్యాచ్ 13–7 స్కోర్‌తో ముంబై లియాన్ ఆర్మీ గెలిచింది. ఆ తరువాత విభాగపు పోటీలుగా మెన్స్ డబుల్స్ జరిగాయి. నిక్కీ పూనాచా మరియు శ్రీరామ్ బాలాజీలు ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ సై్ట్రకర్స్ తరపున పోటీపడగా, రామ్‌కుమార్ రామనాథన్ మరియు జీవన్ నెండుంచెంజియాన్ ముంబై లియాన్ ఆర్మీ తరపున పోటీపడ్డారు. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ సై్ట్రకర్స్ 14–6 తో విజయం సాధించింది. ఈ క్రమంలో ఫైనల్ స్కోర్ 41–32 కాగా ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ విజేతగా నిలిచింది. తద్వారా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ తమ చాంఫియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. కాగా టెన్నిస్ ప్రీమియర్ లీగ్ గ్రాస్‌రూట్ లీగ్‌గా టీపీఎల్ ప్లస్ జరిగింది. దీనిద్వారా యువ టెన్నిస్ అథ్లెట్లు అంతర్జాతీయ, భారతీయ స్టార్ల నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఈ అవార్డును ముంబై లియాన్ ఆర్మీ విజయం గెలుచుకుంది. చదవండి: FIFA WC 2022: సెమీస్ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే! Cristiano Ronaldo: కోచ్ కాదు.. నోటి మాటలే శాపంగా మారాయా? -
Astana Open 2022: జొకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ వారం వ్యవధిలో రెండో టైటిల్‌ను సాధించాడు. గతవారం టెల్ అవీవ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ మాజీ నంబర్‌వన్ తాజాగా అస్తానా ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. కజకిస్తాన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. ఈ సీజన్లో జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్‌కాగా కెరీర్లో 90వ టైటిల్. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 3,55,310 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 94 లక్షలు) దక్కింది. చదవండి: వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్ -
Rafael Nadal: ఫెదరర్ ఆఖరి మ్యాచ్‌లో ఓటమి! నాదల్ కీలక నిర్ణయం
Laver Cup 2022- Rafael Nadal- Roger Federer- లండన్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో కలిసి ఆడిన మ్యాచ్ ముగిసిన వెంటనే స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లేవర్ కప్ టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. ఇక టీమ్ యూరోప్‌లో నాదల్ స్థానాన్ని బ్రిటిష్ టెన్నిస్ స్టార్ కామెరూన్ నోరీ భర్తీ చేయనున్నాడు. ఫెదరర్ స్థానంలో మాటో బెరెటిని ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. కన్నీటిపర్యంతమైన దిగ్గజాలు ఈ క్రమంలో రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన, లేవర్ కప్ టోర్నీ సృష్టికర్తల్లో ఒకడైన రోజర్ ఫెదరర్ శుక్రవారం తన చివరి మ్యాచ్ ఆడాడు. చిరకాల స్నేహితుడు రఫేల్ నాదల్‌తో కలిసి కోర్టులో దిగిన ఫెడ్డీ.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. టీమ్ వరల్డ్‌కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఈ దిగ్గజాలు ఓటమి పాలయ్యారు. కుటుంబ సభ్యులు సైతం.. ఇక ఫెడెక్స్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ అయిన సందర్భంగా కోర్టులో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఫెదరర్, నాదల్ కన్నీంటి పర్యంతమయ్యారు. ఫెదరర్ కుటుంబ సభ్యులు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు, భార్య మిర్కా, నలుగురు పిల్లలు వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నారు. ఇక కోర్టులో ఉన్న ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఫెదరర్‌ను ఎత్తుకుని హర్షధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: Roger Federer- Mirka: మిర్కాతో ఫెదరర్ ప్రేమ ప్రయాణం! కవలల జోడీ.. గొప్ప మనసున్న జంట! Team Europe and Team World come together to celebrate @rogerfederer #LaverCup pic.twitter.com/LR3NRZD7Zo — Laver Cup (@LaverCup) September 24, 2022 -
సెమీస్‌లో సానియా జంట
టొరంటో (కెనడా): నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ ద్వయం 7–5, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’ లో సోఫియా కెనిన్ (అమెరికా)–యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, పత్యర్థిజోడీ సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. చదవండి: Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ -
HAMBURG: రన్నరప్ బోపన్న జంట
న్యూఢిల్లీ: తన కెరీర్లో 22వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జర్మనీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్ లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. విజేతగా నిలిచిన గ్లాస్‌పూల్–హెలియోవారా జోడీకి 1,08,770 యూరోల (రూ. 88 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ, 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ బోపన్న జంటకు 58 వేల యూరోల (రూ. 47 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ, 300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విజేత సాకేత్–యూకీ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని తన కెరీర్లో 12వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పోర్చుగల్‌లో శనివారం ముగిసిన పోర్టో ఓపెన్‌లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నునో బోర్జెస్–ఫ్రాన్సిస్సో కబ్రాల్ (పోర్చుగల్) జోడీపై గెలిచింది. విజేత సాకేత్–యూకీ జంటకు 2,670 యూరోలు (రూ. 2 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: IND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్ -
Wimbledon 2022 Draw: 113వ ర్యాంకర్‌తో సెరెనా తొలిపోరు
లండన్: గత ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ తొలి రౌండ్లోనే గాయంతో వైదొలిగిన సెరెనా విలియమ్స్... ఏడాది తర్వాత మళ్లీ అదే టోర్నీతో పునరాగమనం చేయనుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి శుక్ర వారం ‘డ్రా’ విడుదల చేశారు. తొలి రౌండ్లో ప్రపంచ 113వ ర్యాంకర్ హార్మనీ టాన్ (ఫ్రాన్స్)తో సెరెనా తలపడుతుంది. కెరీర్లో మొత్తం 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టోర్నీలు నెగ్గిన 40 ఏళ్ల సెరెనా ఏడుసార్లు వింబుల్డన్ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. గాయం కారణంగా సెరెనా ఏడాదిపాటు ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ కూడా పడిపోయి ప్రస్తుతం 1,204 స్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్ ప్రకారమైతే సెరెనా ఈ టోర్నీలో ఆడే అవకాశమే లేదు. అయితే ఆమె గత రికార్డులను దృష్టిలో పెట్టుకొని వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ ఎంట్రీని కేటాయించారు. చదవండి: Skating: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట -
కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..!
రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ ఆదివారం జరిగిన హాలీ ఓపెన్ ఫైనల్లో పోలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. మెద్వెదేవ్పై 6-1, 6-4 వరుస సెట్లలో హుర్కాజ్ విజయం సాధించాడు. ఈ ఓటమితో అసహనానికి గురైన మెద్వెదేవ్ తన కోచ్ గిల్లెస్ సెర్వారాపై గట్టిగా అరిచాడు. దీంతో సెర్వారా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించన వీడియోను టెన్నిస్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మెద్వెదేవ్‌కు ఇది వరుసగా రెండో గ్రాస్ కోర్ట్ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో గ్రాస్ కోర్ట్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని మెద్వెదేవ్ గెలుచుకున్నాడు. చదవండి: Queen's Club Championships: సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట View this post on Instagram A post shared by Tennis TV (@tennistv) -
సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట
సించ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. లండన్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 7–6 (7/4), 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జంటకు 35,370 పౌండ్లు (రూ. 33 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
సెమీ ఫైనల్లో అడుగు పెట్టిన సాకేత్ జంట
న్యూఢిల్లీ: మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ జంట 6–3, 7–6తో మైఖైల్ పెర్వోలారకిస్ – మన్సూరి (గ్రీస్) జోడీపై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీ -
శ్రావ్య శివాని జంటకు డబుల్స్ టైటిల్
ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–షర్మద (కర్ణాటక) ద్వయం 6–2, 6–3తో వైదేహి (గుజరాత్)–మిహికా యాదవ్ (మహారాష్ట్ర)పై జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్)–ప్రజ్వల్ (కర్ణాటక) జంట 6–2, 7–6 (7/3)తో చంద్రిల్æ–లక్షిత్ (పంజాబ్) జంటపై నెగ్గింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జంట
Indian Wells Masters 2021: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–3తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జోడీపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
French Open: సుమిత్ తొలి రౌండ్ ప్రత్యర్థి అతడే
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 191వ ర్యాంకర్ మార్కోరా (ఇటలీ)తో ఆడనున్నాడు. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 152వ ర్యాంకర్ ఆస్కార్ ఒట్టె (జర్మనీ)తో... రామ్‌కుమార్ 168వ ర్యాంకర్ మైకేల్ మోమో (అమెరికా)తో తలపడతారు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా)తో అంకిత రైనా ఆడుతుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్ -
మెద్వెదెవ్ మొదటిసారి...
మెల్బోర్న్: రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి అర్హత సాధించాడు. ఆదివారం వీరిద్దరి మధ్య పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–2, 7–5తో ఐదోసీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ కానుంది. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న ఈ రష్యన్ స్టార్ ఏనాడు నాలుగోరౌండ్నే అధిగమించలేకపోయాడు. మొత్తం గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన యూఎస్ ఓపెన్ (2020)లో సెమీస్ చేరడమే! ఈ సారి మాత్రం మెల్బోర్న్లో మరో అడుగు ముందుకేశాడు. టైటిల్ దారిన పడ్డాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ ప్రతీ సెట్లోనూ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ను అలవోకగా గెలుచుకున్న నాలుగో సీడ్ ఆటగాడికి చివరి సెట్లో ప్రత్యర్థి సిట్సిపాస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 5–5 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకున్న మెద్వెదెవ్ తర్వాత గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో అధిక్యంలోకి వచ్చాడు. మరుసటి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 7–5 స్కోరుతో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో రష్యన్ స్టార్ ఏస్‌లతో చెలరేగాడు. మూడు సెట్ల ఆటలో అతను 17 ఏస్‌లు సంధించగా... ప్రత్యర్థి 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 21 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదెవ్ 46 విన్నర్లు కొట్టాడు. మరోవైపు సిట్సిపాస్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 09 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. అయితే రష్యన్ ఆటగాడికి ఫైనల్ మాత్రం కొండను ఢీకొట్టడమే! ఎందుకంటే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది టైటిళ్లను ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే గెలవడం మరో విశేషం. ఇంతటి మేరునగధీరుడ్ని తొలిసారి ఫైనల్ చేరిన మెద్వెదెవ్ ఏ మేరకు ఎదుర్కొంటాడో ఆదివారం జరిగే ఫైనల్లో చూడాలి. -
గట్టెక్కిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అమెరికా యువతార, 27వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/1), 6–4, 3–6, 4–6, 6–2తో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో సెట్ తొలి గేమ్ సందర్భంగా జొకోవిచ్ జారి పడ్డాడు. మెడికల్ టైమ్అవుట్ తీసుకొని కోర్టులోనే చికిత్స చేయించుకొని జొకోవిచ్ ఆట కొనసాగించాడు. నొప్పితోనే ఆడిన జొకోవిచ్ మూడో సెట్, నాలుగో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ ఐదో సెట్లోని ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 4–6, 4–6, 6–3, 6–4, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 3–6, 3–6, 3–6తో క్వాలిఫయర్ కరాత్సెవ్ (రష్యా) చేతిలో... 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 5–7, 5–7, 3–6తో ఆలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయారు. సెరెనా ముందుకు... మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 6–2తో పొటపోవా (రష్యా)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–3తో కుదర్మెతోవా (రష్యా)పై, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో ఆన్స్ జబుయెర్ (ట్యూనిసియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో ఆన్ లీ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
నాట్స్ ఆధ్వర్యంలో టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్
న్యూజెర్సీ: అమెరికాలోని తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే తాజాగా నాట్స్ న్యూజెర్సీలో టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. తెలుగు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. గత కొన్ని వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు ఆడించి, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ టోర్నీలో ప్లయిన్స్‌బొరో జట్టు(కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) విజేతగా, సౌత్ జెర్సీ జట్టు(సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచాయి. నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల ఈ టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. నాట్స్ నాయకులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల టోర్నమెంటు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. టెన్నిస్ టోర్నమెంటుకు కావాల్సిన సహయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవకు నాట్స్ క్రీడా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక టోర్నమెంట్ విజేతలకు నాట్స్ ముఖ్య నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో మోహనకృష్ణ మన్నవ, అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితర నాట్స్ నాయకులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లను వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు. బావర్చీ బిర్యానీ, ఎన్జే లైఫ్ ఈ కార్యక్రమానికి స్పానర్స్గా వ్యవహరించారు. -
లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ వాయిదా
వాషింగ్టన్: టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో ఈ ఏడాది లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. ‘లేవర్ కప్ వాయిదా వేయాల్సి రావడం నిరాశ కలిగిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది. -
మరికొంత సమయం ఆగాల్సిందే!
మాడ్రిడ్: ప్రస్తుత పరిస్థితుల్లో టెన్నిస్ ఆట తిరిగి ఆరంభమవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని 19 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. ‘టెన్నిస్ విశ్వ క్రీడ... ప్రపంచం నలుమూలలా టెన్నిస్ ఈవెంట్లు జరుగుతాయి. మేము టెన్నిస్ ఆడటానికి ఒక దేశం నుంచి మరో దేశానికి తరచూ ప్రయాణించాల్సి ఉం టుంది. కానీ ప్రస్తుతం అలా జరిగే అవకాశమే లేదు.’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. ప్రేక్షకులు లేకుండా టెన్నిస్ ఈవెంట్లను నిర్వహించినా తాను ఆడటానికి సిద్ధమేనని అయితే దానికి కూడా కొంత సమయం వేచి చూడాల్సిందేనని నాదల్ అన్నాడు. -
షరపోవాకు వైల్డ్ కార్డు
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నేరుగా ఆడేందుకు ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఈ టోర్నీ మాజీ విజేత మరియా షరపోవాకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. గాయం కారణంగా గతేడాది ఈ రష్యా స్టార్ ఎక్కువ కాలం ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ 147కు పడిపోయింది. ఫలితంగా ర్యాంక్ ప్రకారం ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 32 ఏళ్ల షరపోవాకు మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కలేదు. అయితే ఈ టోరీ్నలో ఆమె గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు వైల్డ్ కార్డు ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో స్థానం కలి్పంచారు. 2003లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడిన షరపోవా 2008లో చాంపియన్‌గా నిలిచింది. 2007, 2012, 2015లలో ఫైనల్లో ఓడి రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనుండటం ఎంతో ప్రత్యేకం. ఈ టోరీ్నలో నాకెన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి విజేతగా నిలిచాను. మూడుసార్లు ఫైనల్లో ఓడాను. మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఇచి్చనందుకు సంతోషంగా ఉంది’ అని షరపోవా వ్యాఖ్యానించింది. -
క్వార్టర్ ఫైనల్లో సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల రాణిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సంజన 3–6, 7–5, 6–3తో నాలుగోసీడ్ గార్సెవా (రష్యా)పై పోరాడి గెలుపొందింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ చావో యి వాంగ్ (చైనీస్ తైపీ)తో సంజన తలపడుతుంది. -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది. -
చాంపియన్ సన్నీత్ జంట
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో సరోజిని అకాడమీ ప్లేయర్ సన్నీత్ ఉప్పాటి సత్తా చాటాడు. తన భాగస్వామి వేదాంత్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టైటిల్‌పోరులో సన్నీత్–వేదాంత్ ద్వయం 7–6 (7/5), 6–4తో విఘ్నేశ్–శ్రీహరి జంటపై విజయం సాధించింది. 90 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో సన్నీత్ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సన్నీత్ జోడీ 4–1, 4–0తో అనీశ్ జైన్–నైషక్రెడ్డి జంటపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో క్రిస్ మామిల్టన్ రాస్–విజయ్ సారథి జోడీపై గెలుపొందింది. ఈ టోర్నమెంట్లో తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొన్నారు. డబుల్స్ టైటిల్ సాధించిన సన్నీత్ను సరోజిని క్రికెట్ అకాడమీ కార్యదర్శి జి. కిరణ్ రెడ్డి, ఐటీ కమిషనర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్) పీయూశ్ సోన్కర్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. చైతన్య విద్యాలయలో ఎనిమిదో తరగతి చదువుతోన్న సన్నీత్ కోచ్‌లు పురుషోత్తం, ఇమ్రాన్, బోలాసింగ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. -
ప్రజ్నేశ్‌కు టైటిల్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిపై విజయం సాధించాడు. ప్రజ్నేశ్ బలమైన ఫోర్‌హ్యాండెడ్ షాట్లతో ఫైనల్ ఏకపక్షంగా మారింది. ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించగా.. చెన్నై ప్లేయర్ ప్రజ్నేశ్ ఖాతాలో కేవలం రెండు మాత్రమే చేరాయి. కానీ కీలక సమయాల్లో అనవసర తప్పిదాలు చేసిన సాకేత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకుల్లో తన స్థాయిని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 144వ ర్యాంకు నుంచి 110వ స్థానానికి ఎగబాకాడు. మరోవైపు బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే చేరడం విశేషం. గతేడాది సుమీత్ నాగల్ ఈ టోర్నీ విజేతగా నిలిచాడు. -
కార్తీక్ నీల్ ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ మైండ్స్, గ్లోబ్ టోటర్స్ చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో కార్తీక్ నీల్ వడ్డేపల్లి సత్తా చాటాడు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో కార్తీక్ నీల్ (తెలంగాణ) 6–4, 6–3తో అన్షుల్ విక్రమ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరోవైపు అండర్–14 బాలుర డబుల్స్ ఫైనల్లో అన్షుల్ విక్రమ్‌తో జతకట్టిన కార్తీక్‌నీల్ 5–4 (4), 4–2తో ప్రణవ్ (కర్ణాటక)–ఉద్భవ్ (తెలంగాణ) జంటపై విజయం సాధించారు. బాలికల డబుల్స్‌లో అభయ వేమూరి జంట చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌పోరులో అభయ– అపూర్వ వేమూరి (తెలంగాణ) ద్వయం 4–2, 4–1తో ఆర్నిరెడ్డి– ఐరాసూద్ (తెలంగాణ) జోడీపై గెలుపొందింది. అండర్–12 బాలికల ఫైనల్లో అపూర్వ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో కర్ణాటకకు చెందిన టిష్యా ఖండేవాల్ 6–0, 6–0తో అపూర్వపై నెగ్గింది. అండర్–14 బాలికల సింగిల్స్‌లోనూ టిష్యా ఖండేవాల్ 6–1, 6–2తో నీల కుంకుమ్ (తెలంగాణ)ను ఓడించి టైటిల్‌ను చేజిక్కించుకుంది.