tenth student
-
చిన్ని గుండెకు పెద్ద కష్టం
జీడిమెట్ల (హైదరాబాద్): బాబు పుట్టగానే తల్లి చనిపోయింది.. నాన్న రెండో పెళ్లి చేసుకుని బంధాన్ని తెంచుకున్నాడు. చివరకు అమ్మమ్మ సుబ్బలక్ష్మి అక్కున చేర్చుకుని వృద్ధాప్యంలోనూ అట్టల పరిశ్రమలో పనిచేస్తూ అన్నీ తానై సాకుతోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బాబుకు ఉహించని విపత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చి పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న నూకల లక్ష్మీనారాయణ (15) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం బాబుకు ఛాతీలో నొప్పి రావడంతో అమ్మమ్మ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఆయన సూచన మేరకు మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబుకు అపరేషన్ చేయాలని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబును అమ్మమ్మ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అరోగ్యశ్రీ లేదని తిప్పి పంపించారు. అనంతరం బాబును రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాబు గుండె నుంచి వచ్చే నాళానికి రంధ్రం పడిందని, ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఐదు రోజుల్లో బాబుకు అపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని అమ్మమ్మ కంట నీరు పెట్టడమే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె అందరి కాళ్ల మీద పడి తన మనవడిని రక్షించాలని రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఆమె అట్టల కంపెనీలో పనిచేస్తే నెలకు రూ.7 వేలు వస్తుంది. ఇంటి అద్దె రూ.2,500 పోను మిగిలిన సొమ్ముతోనే మనవడిని చదివిస్తూ తిండిపెట్టాలి. దీంతో దాతల సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తుంది. బాలుడికి ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు 9177376666 (సాయి), 912159 3999(కృష్ణ)లను సంప్రదించవచ్చు.అకౌంట్ నంబర్: 240810100015391 పేరు: చింతలపూడి రామకృష్ణ, బ్యాంక్: యూనియన్ బ్యాంక్, బ్రాంచ్: అపురూపా కాలనీ, ఐఎఫ్ఎస్సీ కోడ్: UBIN0824089 -
TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
నారాయణపేట, సాక్షి: వయసుతో తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. జిల్లాలో ఓ యువ ప్రాణాన్ని బలిగొంది. ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి ఒకరు క్లాస్ రూమ్ ముందే కుప్పకూలి.. కన్నుమూశారు. హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ (15) ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన శ్రీకాంత్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్సలు చేసిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. గుండె పోటు కారణంగానే శ్రీకాంత్ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు హఠాన్మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు శ్రీకాంత్ మృతితో బుడుమలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
35వ అంతస్తు నుంచి దూకి.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: చదువులో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నానంటూ 35వ అంతస్తు పై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజలో హెచ్ టవర్ 6వ అంతస్తులోని ఫ్లాట్‌నంబర్ 604లో ఎం.సురేష్ కుమార్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ముంబైలో ఓ కంపెనీలో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం మై హోం భూజకు మకాం మార్చారు. ఆయన భార్య స్వరూప ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుండగా సురేష్ కుమార్ ముంబైలో ఉంటున్నారు. వారాంతాల్లో ఆయన నగరానికి వచి్చపోతుంటారు. ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తర గతి చదివే పెద్ద కొడుకు ఎం.రియాన్‡్ష రెడ్డి(14) సోమవారం సాయంత్రం 7.45 గంటలకు వ్యక్తి గత కారణాలతో చనిపోతున్నానంటూ తల్లి స్వరూప ఫోన్‌కు మెసేజ్ చేసి ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లాడు. మెసేజ్ చూసుకున్న ఆమె అపార్ట్మెంట్లో గాలించినా, స్నేహితులను ఆరా తీసినా రియాన్‡్ష ఆచూకీ లభ్యం కాలేదు. కుమారుడు కనిపించడంలేదంటూ ఫిర్యాదు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు రియాన్‡్ష కనిపించడం లేదని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అపార్ట్మెంట్లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ల సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా రియాన్‡్ష ఆచూకీ తెలియరాలేదు. దీంతో అపార్ట్‌లోని అన్నిచోట్లా గాలించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో జె బ్లాక్‌లోని గేట్ వద్ద మెట్ల మధ్యలో ఉన్న డక్లో రియాన్‡్ష మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో రియాన్‡్ష మృతదేహం కనిపించింది. హెచ్ బ్లాక్ నుంచి జే బ్లాక్ వెళ్లిన రియాన్‡్ష 35వ అంతస్తు నుంచి డెక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. రియాన్‡్ష కనిపించడం లేదని భార్య సమాచారం ఇవ్వడంతో సురేష్ కుమార్ రెడ్డి హుటాహుటిన నగరానికి వచ్చారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత (చదువుల్లో) ఒత్తిడితోనే రియాన్‡్ష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
హయత్ నగర్లో హిజాబ్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని హయత్ నగర్లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. స్కార్ఫ్‌తో వెళ్లిందని ఓ పదో తరగతి అమ్మాయిని ఇంటికి పంపించేసింది స్కూల్‌యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో.. కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వెళ్లిన ఆ టెన్త్ స్టూడెంట్ను.. స్కూల్ యాజమాన్యం లోనికి రానివ్వలేదు. హిజాబ్‌తో లోనికి రానివ్వమంటూ తేల్చేసింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లకు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థిని స్థానిక కోర్టు న్యాయమూర్తి కూతురని సమాచారం. ఇదీ చదవండి: కురచ దుస్తులెందుకు?.. తెలంగాణ హోంమంత్రి కామెంట్లపై దుమారం -
CBSE Results:టెన్త్‌లో కుమార్తెకు 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి!
చండీగఢ్: తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి? హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. నెలకి రూ.20వేల స్కాలర్షిప్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్షిప్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ
బంజారాహిల్స్: తన ప్రియురాలికి హాయ్ చెప్పాడనే కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి తన స్నేహితులతో కలిసి పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి మూసీ పరిసరాలకు తీసుకెళ్లి చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్, జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీకి చెందిన బాలుడు (16) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)తో కొన్ని రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించడంతోపాటు నువ్వంటే నాకిష్టం అని చెబుతున్నాడు. కాగా సదరు బాలిక లంగర్‌హౌజ్ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కాంబ్లే రోహన్(19)ని ప్రేమిస్తోంది. తనను ఒకరు ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేసి రోహన్‌కు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రోహన్ తన స్నేహితులు సంజయ్, అభిషేక్, నరేష్లతో కలిసి మంగళవారం రాత్రి రెండు బైక్‌లపై ఫిలింనగర్‌కు వచ్చాడు. మాట్లాడే పని ఉందని సదరు బాలుడిని వెంకటేశ్వర హోటల్ చౌరస్తా వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ బైక్‌పై ఎక్కించుకున్న రోహన్, సంజయ్ లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వెనుకాల ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు. చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..) తన లవర్ జోలికి వస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించిన రోహన్ అతడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడమేగాక ఆగకుండా తన లవర్ జోలికి రానంటూ చెప్పాలంటూ వీడియోలు తీశారు. రక్తసిక్తమైన బాలుడితో సెల్ఫీ దిగి తన లవర్‌కు పంపుతూ మరోసారి వీడు నీ జోలికి రాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అతడిని బైక్‌పై ఎక్కించుకొని బాపూఘాట్ వద్ద రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి తన స్నేహితుడు సంజయ్‌తో కలిసి పరారయ్యాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న లంగర్‌హౌజ్ పోలీసులు ఆరా తీయగా సంఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడికి వెళ్లాలని సూచించడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. పోలీసులు అతడిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితులు సంజయ్, రోహన్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: (భర్తతో విడాకులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) -
పరీక్షలపై బెంగతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జియాగూడ: ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేనేమోననే బెంగతో పదో తరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ ఇక్బాల్‌గంజ్‌లో కమల, బాషా గౌడ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. బాషా గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు ప్రియాశక్తి 21 డిగ్రీ మొద టి సంవత్సరం చదువుతోంది. 15 ఏళ్ల చిన్నకూతురు జియాగూడ శ్రీనివాస హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. 15 రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ క్రమంలో సరిగా చదవలేకపోతున్నానని మానసిక ఆందోళనకు గురైంది. శనివారం సాయంత్రం తల్లితో బాగానే ఉంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోని పూజగదిలోని థమ్సప్ బాటిల్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా మంటలు చెలరేగడంతో వేరే గదిలో ఉన్న తల్లి కమల, అక్క ప్రియాశక్తి వెంటనే వచ్చి రగ్గులతో మంటలు ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్యూటీలో ఉన్న ఎస్.ఐ.మురళీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు 67 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..
సాక్షి, చిత్తూరు(రొంపిచెర్ల): పదో తగరతి విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డల తండ్రి ఈ నిర్వాకానికి కారణంగా తెలుస్తోంది. వివరాలివీ.. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని రొంపిచెర్లలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఏడాది క్రితం కొద్ది రోజులు రొంపిచెర్లలోని తన పెద్దనాన్న ఇంట్లో ఉంది. అక్కడ ఎలక్ట్రీషియన్ పనికోసం వచ్చిన పీలేరు మండలంలోని ఎర్రగుంటపల్లెకు చెందిన చంద్రానాయక్ కుమారుడు రాజేష్‌నాయక్(34) విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. విద్యార్థిని రోజూ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తుండేది. ఈ క్రమంలో బాలికను రోడ్డు పక్కనే ఉన్న చెరువు దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఏమీ చేయ లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ తర్వాత బెదిరింపులతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. అన్నకు తెలిసి..) ఈ క్రమంలోనే కడుపునొప్పిగా ఉందంటూ పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం మానేసింది. బుధవారం చికిత్స నిమిత్తం రొంపిచెర్లలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని గర్భం దాల్చినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడే నొప్పులు అధికం కావడం, మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం విద్యార్థిని ఫిర్యాదుతో రొంపిచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేష్‌కు ఇదివరకే వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం. -
ఆటోడ్రైవర్‌ను చితకబాదిన మహిళ
-
కూతురుకు వేధింపులు.. తాట తీసిన తల్లి!
సాక్షి, పశ్చిమగోదావరి: తన కూతురును వేధిస్తున్న ఆటోడ్రైవర్‌ను ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన పాలకేడేరు మండలం విస్సాకోడేరులో మంగళవారం వెలుగుచూసింది. జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని భోరుమంది. దీంతో వారు సదరు ఆటోడ్రైవర్‌ను పాఠశాలకు లాక్కొచ్చి చితకబాదారు. విద్యార్థిని తల్లి నిందితుడికి దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆటో డ్రైవర్‌ను పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు. -
జాతరకు వచ్చి తిరిగిరాని లోకాలకు..
వైఎస్ఆర్ జిల్లా,గాలివీడు : మండలంలోని కొండ్రెడ్డిగారిపల్లె సమీపంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటి తొట్టిలో మునిగి గురువారం ఉదయం భరత్ (15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. నూలివీడు గ్రామంలో బుధ, గురువారాల్లో శ్రీ రేణుకాయల్లమ్మ జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లెకు చెందిన విద్యార్థి భరత్ నూలివీడు పంచాయతీ నల్లాబత్తినవాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంటికి వచ్చాడు. రైతు ఏర్పాటు చేసుకున్న నీటితొట్టిలో ఈత కొడుతూ ఆకస్మికంగా మునిగి మృత్యువాత పడ్డాడు. భరత్ ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 9.5 జీపీఏ సాధించాడు. బంధువుల ఇంటికి వచ్చి కొడుకును కోల్పోయామని భరత్ తల్లిదండ్రులు బోరున విలపించారు. సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. -
టెన్త్ పాసైన ఆనందంలో రోడ్డుపై కొస్తే...
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే, టెన్త్ ఫలితాలు ఓ కుటుంబంలో తీరని దుఃఖం నింపాయి. పాస్ అయిన ఆనందంలో కూల్‌డ్రింక్ కొనుక్కుందామని రోడ్డుపైకి వచ్చిన తిరుగుపల్లి రుక్మిణి (15) అనే విద్యార్థిని ప్రమాదానికి గురైంది. టాటాఏస్-మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తోడుగా వచ్చిన ఆమె చెల్లెలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి :ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల) ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్.. కేసు నమోదు
ఉప్పల్: చిలుకానగర్‌లోని ఓ ప్రైౖవేటు స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడిపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. చిలుకానగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పద్యం అప్పజెప్పలేదని పదవతరగతి విద్యార్థినిని తెలుగు ఉపాధ్యాయుడు యశ్వంత్ చితక బాదాడు. బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచడంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తండ్రి వేంకటేశ్వర్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థిని కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్లగా సమాచారం తెలుసుకున్న తెలుగు మాస్టార్ కుటుంబ సభ్యులు వచ్చి వెంకటేశ్వర్లుపై స్కూల్లోనే దాడి చేసి చితక బాదారు. దీంతో స్కూల్లో కాసేపు భయానక వాతావరణం నెల కొంది. విద్యార్థినిపై దాడిచేసిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. -
స్కూల్ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: ఇంద్రపాలెంలోని లిటిల్‌బడ్స్ పాఠశాలలో ఓ పదోతరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. ఎడమ చెయ్యి విరిగిపోయిన ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా..ఆమె మాత్రం అందుకు భిన్నంగా పొంతన లేకుండా మాట్లాడుతోంది. దీనిపై జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి దాట్ల సుభద్ర విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. లిటిల్‌బడ్స్‌లో పదోతరగతి చదువుతున్న కోలా రమ్యశ్రీ రోజూ మాదిరిగా బుధవారం ఉదయం 8 గంటలకే ఆటోలో పాఠశాలకు వచ్చింది. అనంతరం మిగతా విద్యార్థులతో కలిసి, అసెంబ్లీకి వెళ్లకుండా మేడపై భాగానికి వెళ్లి అక్కడ నుంచి దూకేసిందని, దీంతో ఎడమ చెయ్యి విరగ్గా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పాఠశాల యాజమాన్యం చెపుతోంది. ఆమె అలా ఎందుకు చేసిందో తమకు తెలియదని ప్రిన్సిపాల్ ఎస్కే ఆలీ డీవైఈవోకు చెప్పారు. చికిత్స పొందుతున్న రమ్యశ్రీని అడిగితే భవనం పైభాగానికి వెళ్లానని, అక్కడ కళ్లు తిరగడంతో కిందకి పడిపోయానని ఒకసారి, మేడపై నుంచి కిందికి ఎవరో తోసేశారని ఇంకోసారి చెప్పింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను డీవైఈఓ పరిశీలించారు. అయితే రమ్యశ్రీ మేడపై నుంచి దూకిన దృశ్యం రికార్డు కాలేదు. కలెక్టర్‌కు నివేదిక ఇస్తా: డీవైఈఓ పాఠశాల డైరెక్టర్ పీఎస్ఎన్ మూర్తిని, ప్రిన్సిపాల్ ఆలీని డీవైఈఓ ప్రశ్నించారు. పాఠశాల జిల్లా విద్యాశాఖ కామన్‌బోర్డు నిబంధనల ప్రకారం పనిచేయడంలేదని, వారికి ఇష్టం వచ్చిన సమయంలో పాఠశాల అసెంబ్లీ నిర్వహిస్తున్నారని, ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రారంభిస్తున్నారని డీవైఈఓ సుభద్ర విలేకరులకు వివరించారు. ఈ పాఠశాలపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుత సంఘటన నేపథ్యంలో విచారణ జరిపి పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా కలెక్టర్‌కు ఇస్తానని చెప్పారు. కాగా ఈ ఘటనపై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కడుపునొప్పి రావడంతో భవనంపైకి వెళ్లి, కళ్లు తిరగడంతో అక్కడి నుంచి పడిపోయానని రమ్యశ్రీ చెప్పిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.రామారావు తెలిపారు. -
భరత్ అనే నేను..
భరత్ అనే నేను.. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను. రాత్రనక పగలనక కష్టపడి చదివి పదోతరగతి పరీక్ష ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాను. చదువునైతే జయించ గలిగాను కానీ నా ఆర్థిక పరిస్థితులను మాత్రం జయించలేకపోతున్నాను. ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఇచ్చిన చేయూతతో ఇప్పటివరకు చదువులో రాణించగలిగాను. పదోతరగతిని పూర్తి చేసిన నేను కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు భారంగా మారాను. ఇక ముందు చదువును ఎలా కొనసాగించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పూతి భరత్ అనే ఈ విద్యార్థి ద్వారకాతిరుమలకు చెందిన పూతి శ్రీను, కొండమ్మ దంపతుల మొదటి కుమారుడు. చదవాలనే కోరిక.. చదువుపై ఆసక్తిని భరత్ చిన్ననాటి నుంచే పెంచుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూలిపనికి వెళితేనే పూటగడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డను ఉన్నతస్థితిలో చూడాలన్న ఆకాంక్షతో వారు భరత్‌ను 1 నుంచి 3వ తరగతి వరకు పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదివించారు. కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో 4వ తరగతి చదివించారు. ఆ తరువాత మండలంలోని తిమ్మాపురం ఉషోదయా పబ్లిక్ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. అయితే భరత్ 7వ తరగతి చదువుతున్న సమయంలో తమ కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఇక ఫీజులు చెల్లించి తమ బిడ్డను చదివించలేమంటూ టీసీ ఇవ్వాల్సిందిగా ఆ పాఠశాల కరస్పాండెంట్ గంటా చంద్రశేఖరరావును కోరారు. బాగా చదివే భరత్‌కు టీసీ ఇవ్వడానికి మనసొప్పక ఆ కరస్పాండెంట్ తన సొంత ఖర్చులతో పదోతరగతి వరకు చదివించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భరత్ పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటి తనకు ఇంతకాలం భరోసా ఇచ్చిన కరస్పాండెంట్ నమ్మకాన్ని నిలిపాడు. దాతలు దయతలిచి ఆర్థిక సహకారం అందిస్తే చదువును కొనసాగిస్తానని భరత్ వేడుకుంటున్నాడు. నా బిడ్డకు చేయూతనివ్వండి భరత్ ఎంతో బాగా చదువుతాడు. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించాడు. కానీ నా బిడ్డను చదివించే స్తోమత మా దగ్గర లేదు. దాతలు స్పందించి నాబిడ్డకు చేయూతనివ్వండి– పూతి కొండమ్మ,భరత్ తల్లి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం నా చదువుకు చేయూత దొరికితే ఐఐటీలో సీటు సాధిస్తాను. నా తల్లి ఎంతో కష్టపడితేనే గానీ మా కుటుంబం గడవదు. అలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి చదవాలంటే కష్టమే. ఇప్పటి వరకు ఉషోదయ పాఠశాల కరస్పాండెంట్ సహకారంతో చదివాను. సహృదయంతో ఎవరైనా చేయూతనిస్తే చదువుతాను.– పూతి భరత్, విద్యార్థి -
పిల్లోడి పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: టెన్త్ విద్యార్థి దగ్గర రూ.50 వేలు ఉంటే ఏం చేస్తాడు? ఒక మంచి ఫోన్ కొంటాడు.. లేదా ఈ వేసవిలో టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. కానీ విశ్రుత్ అనే విద్యార్థి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి విరాళం ఇచ్చి పది మంది మెచ్చుకునేలా చేశాడు. ‘‘గత 46 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షా 20 వేల కుటుంబాలు లబ్ధిపొందాయి. సుమారు రూ.800 కోట్లను ఖర్చు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి అవసరాలు తీరుస్తున్న సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్లు ‘చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, తెలంగాణ స్టేట్’పేరు మీద చెక్కులను పంపండి’’ అని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఇటీవల ట్వీట్ చేశారు. ఈ విజ్ఞప్తి విశ్రుత్‌ను కదిలించింది. ఫోన్ కొనుక్కునేందుకు దాచుకున్న రూ.50 వేలను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చేలా చేసింది. ఫోన్ తర్వాతైనా కొనుక్కుంటా: తల్లి ఇచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా దాచుకున్న విశ్రుత్, అలా జమ చేసుకున్న రూ.50 వేలతో మంచి ఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు. అయితే కొన్ని లక్షల కుటుంబాలకు ఆసరాగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం చేయడానికి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ‘రామ్(కేటీఆర్) అంకుల్ ప్రజలకు చేస్తున్న సహాయం చూశాక ఫోన్ తర్వాతైనా కొనుక్కోవచ్చనుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుల్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్కరైనా ఆ డబ్బులతో చికిత్స పొందుతా రని భావిస్తున్నా’నని విశ్రుత్ అన్నాడు. ఈ సందర్భంగా విశ్రుత్‌ను కేటీఆర్ అభినందించారు. విశ్రుత్ చేసిన పని మరికొందరికి ప్రేరణలా నిలుస్తుందని, సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
బాలుడిని మింగేసిన కిడ్నీభూతం
కవిటి: అందరితో సరదాగా ఆడుకోవాల్సిన ఆ విద్యార్థిని కిడ్నీ భూతం మింగేసింది. నిండా 15 ఏళ్లు నిండకుండానే కబళించింది. బాలుడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని మాణిక్యపురం గ్రామానికి చెందిన అనీల్ బిసాయి(15) కిడ్నీవ్యాధితో పోరాడి తనువు చాలించాడు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇతడు ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నెల రోజుల క్రితం వరకు చక్కగానే ఉన్న అనీల్ బిసాయికి ఉన్నట్టుండి ఒంట్లో బాగులేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యానికి సోంపేట తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షలన్నీ చేసిన తర్వాత బాలుడికి మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు. దీంతో కన్నీరుమున్నీరైన అనీల్ తల్లిదండ్రులు రత్నాకర్ బిసాయి, ఖిరోమణి బిసాయి తమ బిడ్డకు అందినంతలో వైద్యం చేయిస్తూ వచ్చారు. అనీల్‌కు సీరం క్రియేటినైన్ 8 పాయింట్లు దాటిపోవడంతో తీవ్రంగా నీరసించి ఆదివారం తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనీల్ సోదరుడు సునీల్ బిసాయి విజయవాడలో ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నాడు. -
విద్యార్థి అదృశ్యం
బనగానపల్లె రూరల్: పట్టణంలోని పెండేకంటి నగర్‌కు చెందిన జగన్నాథం నాగన్న కుమారుడు ఎరుకలి చిన్న నాగన్న అదృశ్యమైనట్లు ఎస్ఐ విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల వద్ద విచారించిన ఆచూకీ లభించలేదు.దీంతో విద్యార్థి అన్న ఽమద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థి అచూకి తెలిసిన వారు 85000 38889, 94407 95568కు సమాచారం అందించాలని సూచించారు. -
టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం
చిత్తూరు: పదో తరగతి విద్యార్థిని పై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని తుమ్మింద గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై పాల వ్యాన్‌డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. బాలికపై అత్యాచారం, చిత్తూరు -
గర్భం దాల్చిన గురుకుల విద్యార్థిని
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గురుకుల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన సంచలనం సృష్టించింది. అనారోగ్యంతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థినిని మంగళవారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఐదు నెలల గర్భిణిని అని వైద్యులు చెప్పారు. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పదో తరగతి విద్యార్థి కిడ్నాప్
స్నేహితుడే సూత్రధారి పోలీసుల రంగప్రవేశంతో కథ సుఖాంతం రాజమహేంద్రవరం రూరల్ : సులువుగా సొమ్ము సంపాదించడానికి కిడ్నాప్ చేయాలని అతడు భావించాడు. తన స్నేహితుడినే అపహరించి అతడి తండ్రిని రూ.మూడులక్షలు డిమాండ్ చేశాడు. చివరకు పోలీసుల రంగప్రవేశంతో దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని చింతలు ప్రాంతానికి చెందిన శ్రీపతి శ్రీనివాస్ కుమారుడు 14 ఏళ్ల శ్రీపతి మోహ¯ŒSసాయి బొమ్మూరులోని బాలాజీపేటరోడ్డులో ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం పదో తరగతి చదివి వెళ్లిపోయిన హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉప్పు మునిమాణిక్యం (ఇతడు కూడా మైనర్)తో మోహనసాయికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పాఠశాల అయిన తరువాత మోహనసాయి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఉప్పు మునిమాణ్యికం తన స్నేహితుడు సాయిగోపాల్‌తో కలసి బైక్‌పై వచ్చి తనతో రావాలని కోరాడు. మునిమాణిక్యం తెలిసినవాడే కావడంతో మోహనసాయి వెంటనే బైక్‌పై ఎక్కాడు. మునిమాణిక్యం హౌసింగ్‌బోర్డుకాలనీలోని తన ఇంటికి తీసుకుపోయాడు. అనంతరం మోహనసాయిని ఇంటిలోనే ఉంచి బయటకు వచ్చాడు. సుబ్బారావునగర్‌లో ఒక కిరాణాకొట్టు వద్ద ఒక సిమ్ తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో ఆ నంబరు (73962 42285) నుంచి మోహనసాయి తండ్రి శ్రీనివాస్‌కు ఫో¯ŒS చేసి ‘ మీ అబ్బాయికి కిడ్నాప్ చేశాం, రూ. రెండు లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. అనంతరం మళ్లీ ఫో¯ŒS చేసి రూ.మూడులక్షలు ఇవ్వాలని చెప్పి ఫో¯ŒS స్విచ్ఛాప్ చేసేశాడు. దీంతో రాత్రి పది గంటల సమయంలో బొమ్మూరు పోలీసులకు శ్రీపతి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్వయంగా రంగంలోకి దిగి కిడ్నాప్ కేసుపై దృష్టిపెట్టారు. తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు, బొమ్మూరు ఎస్సై నాగేశ్వరరావు, సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. సిమ్ నంబర్ ఆధారంగా దాన్ని కొనుగోలు చేసిన షాపు యజమాని గుత్తి సతీష్‌గాంధీని గుర్తించి విచారించగా ఉప్పు ముని ఆచూకీ లభ్యం అయ్యింది. రాత్రి 2.30గంటల సమయంలో మునిమాణిక్యంను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న మోహనసాయిని విడిపించారు. -
టెన్త్ విద్యార్థి అదృశ్యం
మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి తప్పిపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబాబాద్ రూరల్ సీఐ జె.కృష్ణారెడ్డి కథనం ప్రకారం... గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామశివారు రాజ్యతండాకు చెందిన కొర్ర దేవా కుమారుడు సందీప్ మహబూబాబాద్ మండలంలోని జమాండ్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో గల ముత్యాలమ్మగూడెంలోని విద్యాభారతి గురుకుల పాఠశాలలో బోర్డర్‌గా ఉండి 10వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థి మూడేళ్లుగా ఇదే పాఠశాల హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 20న ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మొబైల్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తనకు మెటీరియల్ కావాలని మాట్లాడాడు. అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు దేవా పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ఖాదర్ అనుమతితో సందీప్‌ను మెటీరియల్ కోసం మహబూబాబాద్‌కు తీసుకొచ్చాడు. మెటీరియల్ కొన్న తర్వాత సాయంత్రం 5.30 గంటలకు సందీప్‌ను పాఠశాలలోకి పంపించి తిరుగుపయనమయ్యాడు. తిరిగి ఈ నెల 28న సందీప్‌ను చూసి వద్దామని దేవా పాఠశాలకు వెళ్లగా అతడు లేడని పాఠశాల యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో బాలుడి కోసం రెండు రోజులుగా ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బాబు తప్పిపోవటానికి కారకులైన పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నట్ల రూర్ సీఐ జె.కృష్ణారెడ్డి తెలిపారు. -
పరీక్ష రాసి వెళ్తుంటే.. ప్రాణం తీశారు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని దారుణహత్యకు గురైంది. పరీక్ష రాసి వెళ్తున్న విద్యార్థిని సుశీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దుండగులు చిన్నేరు ప్రాజెక్ట్‌లో పడిసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సుశీల మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. పాత కక్షల వల్లే విద్యార్థినిని హతమార్చి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఒత్తిడితో సొమ్మసిల్లిన టెన్త్ విద్యార్థి
వత్సవాయి: కృష్ణా జిల్లా వత్సవాయిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న కన్నెవీడుకు చెందిన విద్యార్థి రామలింగప్రసాద్ ఒత్తిడికి గురై పరీక్ష రాస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. కన్నెవీడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం పరీక్ష రాస్తున్న విద్యార్థి రామలింగప్రసాద్ 11.30 సమయంలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విద్యార్థికి ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగింది. వెంటనే వైద్యసిబ్బంది అతనికి సపర్యలు చేయడంతో కోలుకుని పరీక్ష కొనసాగించాడు. పరీక్ష ముగిసిన అనంతరం కన్నెవీడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆటోలో ఆ విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు. హెచ్ఎం, తహశీల్దార్‌కు మనస్పర్థలు.. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎంకు తహశీల్దార్‌కు మనస్పర్థలు రావడంతో తహశీల్దార్ పరీక్ష కేంద్రాన్ని సమస్యాత్మక కేంద్రంగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులకు సూచించారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పరీక్షలు ప్రారంభం సమయం నుంచి ముగిసే వరకు పాఠశాలలోని ప్రతి గదిని తనిఖీచేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్లు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవలనే గుండె శ్రస్తచికిత్స చేయించుకున్న విద్యార్థి రామలింగప్రసాద్ సొమ్మసిల్లి పడిపోయినట్లు చెప్పారు. తహశీల్దార్ వైఖరిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల ఆరోపణలపై తహశీల్దార్ శ్రీనునాయక్‌ను వివరణ కోరగా వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. -
చదువు రావడం లేదని విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు: చదువు రావడం లేదని మనస్తాపంతో ఓ విద్యార్థి గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనేమోననే భయంతో బుధవారం పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా నివాసమంటున్న శాంతిరాజు(15) విజన్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో శాంతిరాజు తల్లిదండ్రులు అతనికి సర్ది చెప్పి బుధవారం పాఠశాలకు తీసుకువచ్చారు. చదువు రావడంలేదని చెప్పిన వాళ్లు పట్టించుకోకుండా...ఫెయిల్ అయినా పరవాలేదు అని చెప్పి అతనిని పాఠశాలలో వదిలి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్ది సేపటికే విద్యార్థి పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.