Tirupati By-elections
-
తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలే అందుకు నిదర్శనం
-
పోలింగ్ తగ్గినా వైఎస్సార్సీపీకి పెరిగిన ఓట్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్ నమోదైంది. వైఎస్సార్సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్ తగ్గింది. అయినా వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది. -
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటర్లు సంక్షేమ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అపూర్వ విజయాన్ని అందించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 95 శాతం ఎన్నికల హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. సీఎంకు, అండగా నిలిచిన ప్రజలకు, వైఎస్సార్సీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 75 శాతం పోలింగ్ నమోదవుతుందని భావించామని, అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. పోలింగ్ శాతం పెరిగి ఉంటే అనుకున్న మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. అయినా గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో తమ పార్టీ 55.03 శాతం, టీడీపీ 37.67 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి వైఎస్సార్సీపీ 56.5 శాతం, టీడీపీ 32.01 శాతం ఓట్లు సాధించాయన్నారు. 5.66 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ పాల్గొన్నారు. -
Maddila Gurumoorthy: ఇది ప్రజావిజయం
నెల్లూరు (సెంట్రల్)/తిరుపతి తుడా: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తన విజయం ప్రజా విజయమని ఎంపీగా గెలుపొందిన మద్దిల గురుమూర్తి చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో కలిసి నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం డీకేడబ్ల్యూ కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. అనంతరం అక్కడ, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద గురుమూర్తి విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని, సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు తనను దీవించారని చెప్పారు. ముఖ్యమంత్రికి తాను రుణపడి ఉంటానని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల మద్దతుతో గెలిపించిన సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. సీఎం అడుగుజాడల్లో నడవడమే తన లక్ష్యమన్నారు. ఈ విజయం జగనన్నదేనని చెప్పారు. సాధారణ వ్యక్తి అయిన తనను పార్లమెంట్‌కు పంపించాలన్న జగనన్న సంకల్పం గొప్పదన్నారు. ఇలాంటి మంచి మనసున్న జగనన్న దేశ రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేస్తున్నారని తెలిపారు. ధ్రువీకరణపత్రం అందుకునే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పి.రూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Panabaka Lakshmi: మాకు ఓటేసినవారే ఓటర్లు..
తిరుపతి అర్బన్: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి అనంతరం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను అవమాన పరిచేలా మాట్లాడారు. ఆదివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓటు వేసిన వారే నిజమైన ఓటర్లని, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారు కాదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం నుంచి తాను పారిపోయినట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. -
Tirupati Election Results 2021: జననేత వైపే జనం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధిని ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 2.71 లక్షలకుపైగా ఓట్లతో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 2019 ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ కట్టబెట్టడం గమనార్హం. తన 23 నెలల పాలన చూసి ఓటేయాలన్న సీఎం జగన్ మాటను గౌరవిస్తూ విశ్వసనీయతకే పట్టం కట్టారు. ఊహించిందే అయినప్పటికీ భారీ మెజారిటీ రావడం పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెలువడ్డ ప్రజా తీర్పు సీఎం జగన్ పాలన పట్ల రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ దాదాపు 2.28 లక్షల మెజారిటీతో గెలుపొందడం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికలో రాజకీయ అనుభవం లేని, పాదయాత్రలో తన వెన్నంటి ఉన్న డాక్టర్ ఎం.గురుమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. ఫలించని ‘పచ్చ’రాజకీయం! స్థానిక ఎన్నికల్లో కుదేలైన టీడీపీ తాజాగా తిరుపతి ఎన్నికల్లో మరోసారి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. రోజుల తరబడి అక్కడే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఉనికి కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. రకరకాల ఎత్తుగడలు వేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకూ వెనుకాడలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తన బహిరంగ సభను రద్దు చేసుకుని ఓటర్లకు లేఖ రాస్తే విపక్షం దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలకు దిగింది. అయినప్పటికీ సీఎం సంయమనాన్ని పాటిస్తూ హుందాగా వ్యవహరించారు. ఫలితాల జోరు చూస్తే ఒక్క తిరుపతే కాదు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. -
నిన్ను నమ్మం బాబూ..
సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఎత్తులు పారలేదు. రాళ్ల రాజకీయం చేసినా.. ధర్నాలు చేసినా.. దొంగ ఓట్లంటూ డ్రామాలు వేసినా.. ఓటర్లు నమ్మలేదు. ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ స్పష్టంగా తీర్పు చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి 37.65 శాతం ఓట్లు పడ్డాయి. అదే స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి 32.08 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు రెండేళ్లలో టీడీపీ ఓటు బ్యాంకు 5.57% పడిపోయింది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఏడాదిగా కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోని చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం తనతోపాటు టీడీపీ శ్రేణులను రంగంలోకి దించారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన తనయుడు లోకేశ్‌తోపాటు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు వీధివీధికి తిరిగినా ప్రజల ఆదరణ దక్కలేదు. వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆడని డ్రామాలేదు. కోడ్ అమలులో ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన చిత్తూరులో 5 వేలమందితో ధర్నా, నిరసనకు వెళ్లి రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్ నిబంధనలు, తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చంద్రబాబు ఆందోళన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి కూర్చుని తిరుపతి ప్రజల సానుభూతి కోసం ఆడిన హైడ్రామా ఆయనకు రాజకీయ మైలేజీ తేలేకపోయింది. చివరకు బహిరంగసభలో చిన్న రాయిని పట్టుకుని.. తమపై రాళ్లు వేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ‘రాయి’ రాజకీయం రక్తికట్టలేదు. తనపై రాళ్లు విసిరి హత్యాయత్నం చేశారంటూ తిరుపతి ప్రజలను నమ్మించి సానుభూతి ఓట్లు పెంచుకోవాలన్న బాబు ఎత్తుగడ పారలేదు. అక్కడే నేలపై కూర్చుని ధర్నా చేసి దాన్ని లబ్ధిపొందాలన్న కుతంత్రం నెరవేరలేదు. చివరకు ఓట్ల వేటలో రాజకీయ మౌలిక సూత్రాలను సైతం పక్కన పెట్టి ‘వకీల్‌సాబ్’ పేరుతో సినిమా ట్రిక్కులకు తెరలేపారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత అయిన పవన్‌ను భుజానికెత్తుకున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో ఆ సామాజికవర్గ ఓట్లకు గాలం వేశారు. పవన్ నటించిన వకీల్‌సాబ్ సినిమాకు రేట్లు పెంచుకునేందుకు, ఎక్కువ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు.. పవన్ అనుకూల ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. అయినా బాబు వేసిన సినిమా ట్రిక్కులు తిరుపతి ప్రజల ముందు పారలేదు. చివరకు పోలింగ్ రోజున అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు పార్టీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. స్వేచ్ఛగా వచ్చి ఓటేసే ప్రజలను దొంగ ఓట్ల పేరుతో బెదరగొట్టి వైఎస్సార్సీపీకి వచ్చే మెజారీటిని తగ్గించేందుకు చంద్రబాబు హైడ్రామా నడిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి వచ్చే అనేకమంది బయటి భక్తులను సైతం దొంగ ఓటర్లుగా చూపించి మభ్యపెట్టేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన హడావుడికి తిరుపతి ప్రజలు గట్టి బదులిచ్చారు. చంద్రబాబు చీప్ ట్రిక్కులను నమ్మని తిరుపతి ఓటర్లు ఛీత్కరించడమే కాకుండా ఘోర పరాజయంతో గట్టి బదులిచ్చినట్టు అయింది. -
Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది. టీడీపీ దీనావస్థ.. రెండు దఫాలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో 4,94,501 ఓట్లు సాధించగా ఈసారి ఆమెకు 3,54,516 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో టీడీపీకి 37.65 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 32.08 శాతం మాత్రమే వచ్చాయి. అంటే 5.57 శాతం ఓట్లు తగ్గాయి. అది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డితే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 20,971 (1.60 శాతం) ఓట్లు సాధిస్తే అప్పుడు బీజేపీకి 16,125 (1.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే 37,096 ఓట్లు (2.82 శాతం) వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 57,080 ఓట్లు (5.17 శాతం) సాధించింది. ఇదే అత్యధికం తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, తిరుపతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. గత ఎన్నికలే కాదు 1989 నుంచి చూసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన పార్టీలు ఫ్యాన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. బీజేపీ – జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా టీడీపీ మరోసారి పరాజయం పాలైంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 11,04,927 ఓట్లు పోల్ కాగా 64.42 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించింది. తిరుపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అక్కడే మకాం వేసి రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత 22 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రజలకు లేఖ రాశారు. 56.67 శాతం ఓట్లతో విజయభేరీ.. తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఆధిక్యం.. ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైఎస్సార్సీపీ ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో 809 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఖాతా తెరిచారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 35 నుంచి 40 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యం పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ సమయంలో గురుమూర్తితోపాటు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ రావడంతో పనబాక లక్ష్మి నిరుత్సాహంతో వెనుదిరిగారు. మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు. మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి.. గురుమూర్తి స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు. డిక్లరేషన్ అందుకున్న గురుమూర్తి.. ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవిఎన్ చక్రధర్‌బాబు డిక్లరేషన్ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఘన విజయం అందరిదీ నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది..’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ
సాక్షి, తిరుపతి: ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్‌సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిసిన తరువాత రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు.. పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం పీక్ లెవెల్‌కు వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు.. బీజేపీ, టీడీపీల రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికీ పదవీగండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు సీరియస్‌నెస్ లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల అనంతరం వీర్రాజుకు పదవీగండం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. సైకిల్ గాలి తీసిన అచ్చెన్నాయుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేశ్ రెండు వారాలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి్డలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించారు. ప్రచారం పీక్ లెవెల్‌కు చేరిందని భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒక్కసారి టీడీపీ సైకిల్ గాలి తీసింది. టీడీపీ బాధితుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆవేదన నిజమేనని, లోకేశ్ సరిగా వ్యవహరించరని ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది. తండ్రీతనయుల శైలిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా వెల్లడించడం, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు.. బొ.. లేదని స్వయంగా చెప్పడంతో పార్టీ ఒక్కసారిగా డీలాపడింది. 2019 ఫలితాల కంటే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి పదవీగండం తప్పదని చంద్రబాబు సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు టీడీపీ పెద్దలను నమ్మి మోసపోయినట్లు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తనతో సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, పోటీచేయనన్నా నిలబెట్టారని, పోలింగ్ సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు చేతులెత్తేసి అవమానించారని చెప్పి ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. ఇక్కడ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ తీవ్రస్థాయిలో విభేదాలు.. టీడీపీలో సస్పెన్షన్ల కలకలం -
Tirupati Lok Sabha Bypoll 2021: ఈవీఎంలలో తీర్పు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పారదర్శకంగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 2వ తేదీ ఈ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ఆరింటిలో మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. మొత్తం ఓటర్లు 17,10,699 మంది ఉండగా 10,99,814 ఓట్లు (64.29 శాతం) పోలయ్యాయి. పురుషులు 5,43,450 మంది, మహిళలు 5,56,341 మంది, ఇతరులు 23 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్ల కంటే 12,891 మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ అన్ని సెగ్మెంట్లలోను మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీటిలో తిరుపతి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలోను మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పథకంలోను మహిళలకు పెద్దపీట వేయడం, మహిళలు అన్ని రంగాల్లోను ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఆర్థికసాయం చేయడంతో పాటు, ప్రతి పేద మహిళ పేరుతో ఇంటి స్థలం కేటాయించడం వంటి చర్యలతో మహిళల ఓట్లు తమకే పడ్డాయని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళిని చూసిన తరువాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నిస్తేజంగా ఉన్నారు. -
ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ
తిరుపతి తుడా/నగరి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక వీడియోని విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందుతారని అన్ని సర్వేలు తేల్చాయన్నారు. ఘోరాతి ఘోరంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు, లోకేశ్‌లు తిరుపతిలో సరికొత్త నాటకానికి దిగారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో ఇదే పద్ధతిని ఆ పార్టీ నేతలు అవలంబిస్తున్నారన్నారని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని లోకేశ్ వీరప్పన్ అంటూ విమర్శించడం సిగ్గుచేటన్నారు. నీచ, దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైఎస్సార్సీపీకి గాని, సీఎం వైఎస్ జగన్‌కిగానీ లేదన్నారు. ఎక్కడా డబ్బులు పంచకుండా, ఎవరినీ ప్రలోభ పెట్టకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పారు. -
ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ యత్నం
ముత్తుకూరు: తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికల సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో శనివారం జరిగిన పోలింగ్‌లో చదువురాని ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. టీడీపీ కార్యకర్తలు కొందరు ఓటు వేసేందుకు వెళ్లి ఈవీఎంలో సైకిల్ గుర్తుకు ఇరువైపులా చిక్కగా ఇంకు మార్కు వేశారు. అందరూ సైకిల్‌కే ఓటు వేస్తున్నారనే భ్రమలు కల్పించేందుకు, చదువురాని ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఈ ఎత్తుగడను వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెంటనే పసిగట్టారు. ఈ విషయాన్ని పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు కూడా అప్రమత్తమై సైకిల్ గుర్తుకు ఇరువైపులా ఉన్న సిరా గుర్తులను పూర్తిగా తుడిచి వేశారు. -
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి: డీజీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు. -
ఓటమికి ముందే కారణాలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు ముందే కారణాలు వెతుక్కుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్సీపీపై అబద్ధపు ప్రచారం నెత్తికెత్తుకున్నారని మండిపడ్డారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంటే.. జగన్ పాలనకు సానుకూలంగా ఓటేయాలని ప్రజలు భావిస్తుంటే, చంద్రబాబు మాత్రం అబద్ధాల ప్రచారంతో తిరుపతిలో తన విశ్వరూపం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాల్నే ఇక్కడా అమలు చేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ బస్సుల్లో తిరుపతికి దొంగ ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలను ఖండించారు. పుణ్యక్షేత్రం కావడంతో రోజూ లక్షమంది భక్తులు తిరుపతికి వస్తుండటంతో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే తన ఆరోపణలకు పదునుపెట్టారన్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుకూల మీడియా చేసిన హడావుడిని ఖండించారు. ఆ బస్సుల్లోనే చంద్రబాబు తన మనుషులను పెట్టి.. తన అనుకూల మీడియాకు సానుకూలంగా చెప్పించారన్నారు. ఇదంతా పథకం ప్రకారం చేసిన కుట్ర అని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఇదీ తప్పేనా? టీడీపీ ఆరోపిస్తున్నట్టు దొంగ ఓటు ఎక్కడేస్తారు? పోలింగ్‌బూత్‌లో కదా? అక్కడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్లు ఉంటారు. అన్నీ తనిఖీ చేశాకే ఓటు వెయ్యనిస్తారు. దొంగ ఓటేస్తే పట్టుకోరా? అసలు దొంగ ఓట్లయితే పోలింగ్‌బూత్‌లో పట్టుకోవాలి. బస్సులను అటకాయించి, భక్తులను దొంగ ఓటేయటానికి వచ్చారనడం ఏమిటి? అంటే టీడీపీకి ఏజెంట్లే లేని దిక్కుమాలిన స్థితి వచ్చిందా? ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర బలగాలను దించారు. కేంద్ర పరిశీలకులూ ఉన్నారు. పోలింగ్ బూత్‌ల్లో వెబ్ కెమెరాలున్నాయి. వీటిని దాటుకుని పోవడం సాధ్యమా? ఎన్నికల్లో దెబ్బతినే ప్రతీసారి ముందే సాకులు వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే’’ అని విమర్శించారు. దొంగ ఓట్ల చరిత్ర టీడీపీదే డిపాజిట్లు కూడా రాని పార్టీలు మాత్రమే దొంగ ఓట్లు వేయించాలనుకుంటాయని, అలాంటి పని టీడీపీనో, బీజేపీనో చేసే వీలుంది తప్ప వైఎస్సార్సీపీకి ఏం అవసరమని సజ్జల అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం ప్రజలు వైఎస్ జగన్ వైపే ఉన్నారని ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయి. ఏ అవకాశం వచ్చినా జగన్‌కు ఆశీస్సులివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తిరుపతిలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. ఓడిపోతామని తెలిసే టీడీపీ కారణాలు వెతుక్కుంటోంది. ఇందులో భాగమే దొంగఓట్ల నాటకం. ఫలితాలు వచ్చాక ఆ పార్టీ ఇదే చెప్పబోతోంది. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేయడంలో హేతుబద్ధత లేదు. ఇదే జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం తనను తాను అవమానించుకోవడమే. ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్సీపీకి ఓట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు’’ అని స్పష్టం చేశారు. -
Tirupati Lok Sabha Bypoll 2021: ఆడలేక దొంగాట!
సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి ఖాయమనే నిర్థారణకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలంతా ఏకమై ‘దొంగ ఓట్లు’ రాగం అందుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేకున్నా ఏదో జరిగిపోయిందని చిత్రీకరించేందుకు నానాపాట్లు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగితే ఓటర్లు దూరంగా ఉంటారనే వ్యూహంతో బరి తెగించిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారిని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు ఫోటోతో కూడుకుని ఉంటుంది. ఒకవేళ ఓటర్లకు అది లేకపోతే ఆధార్ చూపాలి. ఓటర్ స్లిప్పు, పోలింగ్ బూత్‌లో ఉండే ఓటర్ లిస్టులో కూడా ఫొటో ఉంటుంది. పోలింగ్ ఏజెంట్లుగా అన్ని పార్టీల వారుంటారు. ఫొటోలను, సదరు ఓటరును ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకున్నాకే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అనుమానం వస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇన్ని దశల్లో తనిఖీలు చేసి నిర్థారించుకునే ప్రక్రియ ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఓట్లు వేశారంటూ అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారు ఎలా దొంగ ఓట్లు వేస్తారు? అదెలా సాధ్యం? పోలింగ్ బూత్, చిరునామా, ఓటరు స్లిప్పు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఇవన్నీ లేకుండా దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యం? నిత్యం తిరుపతికి 50 వేల నుంచి లక్ష మంది దాకా భక్తులు వస్తుంటారు. అలాంటప్పుడు వీరంతా దొంగ ఓట్లు వేశారనేందుకు వచ్చారని ఆరోపణలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడులైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా అసత్య ప్రచారాలకు దిగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేసి పోలింగ్ రోజైన శనివారం కుట్రలను కార్యరూపంలోకి తెచ్చారు. ప్లాన్ ప్రకారం వీడియో చిత్రీకరణ.. తిరుపతిలో పోలింగ్ రోజు హైడ్రామా నెలకొంది. కొందరు విపక్ష నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వీడియో ఆన్ చేయగానే క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి పారిపోయేలా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సదరు వ్యక్తి పరారయ్యే సమయంలో వీడియో చిత్రీకరించి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని తాము పట్టుకుంటున్నట్లు ప్రచారం కల్పించారు. మరి అదే నిజమైతే పారిపోతున్న వ్యక్తిని తాము పట్టుకోవడం గానీ లేదంటే కనీసం అతడిని పట్టుకోవాలని ఇతరులను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నది ప్రశ్న! టార్గెట్ పెద్దిరెడ్డి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటకు బీటలు వారాయన్న నిర్వేదంతో తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రతి సందర్భంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలకు దిగారు. 1983 నుంచి కుప్పంలో టీడీపీ అభ్యర్థులు 9 పర్యాయాలు గెలుపొందగా చంద్రబాబు 7 దఫాలుగా నెగ్గుతున్నారు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 89 పంచాయితీలకుగానూ 74 సర్పంచ్‌లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం వహించిన టీడీపీ కేవలం 14 సర్పంచ్‌లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు) ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగే.. దొంగా దొంగా! దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులు, వాహనాలు నిలిపివేసి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారా?’ అంటూ నిలదీస్తూ ఆ పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. పథకంలో భాగంగా చంద్రబాబు అనుకూల మీడియాతో ఫోటోలు, వీడియోలు తీసి హంగామా సృష్టించారు. కొందరు మహిళలు వీరి వికృత చేష్టలకు భయపడి చేతులతో ముఖాన్ని కప్పుకోవడంతో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. ఫలితంగా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చేందుకు తటపటాయించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అధికారులు, పోలీసులకు కూడా బీజేపీ, టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అయ్యాక మీపై చర్యలు ఉంటాయంటూ బెదిరిస్తూ పేర్లు రాసుకున్నారు. -
తిరుపతి ఉప పోరు ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి లోక్‌సభా స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ సజావుగా కొనసాగింది. మొత్తంగా 64.29 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి సెగ్మెంట్లో 50.58 శాతం మేరకే పోలింగ్ జరిగింది. తిరుపతి నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు అనుకూల మీడియా హంగామా చేశారు. ఇది తప్పించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సాయంత్రం 7 గంటలలోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో కొన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ రాత్రి 9.30 వరకు కొనసాగింది. పార్లమెంటరీ స్థానం పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా.. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే.. శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలవద్ద పెద్దసంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పోలింగ్ వేగంగానే కొనసాగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 7.80 శాతం, 11 గంటల వరకు 17.39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.67 శాతం, 3 గంటలకు 47.42 శాతం, 5 గంటలకు 54.99 శాతం, రాత్రి 7 గంటలకు 64.29 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే.. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో 63.81 శాతం, సర్వేపల్లిలో 66.19 శాతం, సూళ్లూరుపేటలో 70.93 శాతం, వెంకటగిరిలో 61.50 శాతం, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో 50.58 శాతం, శ్రీకాళహస్తిలో 67.77 శాతం, సత్యవేడులో 72.68 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మన్నసముద్రం గ్రామంలో ఓటు వేసిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, అతని కుటుంబసభ్యులు స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పోలింగ్‌ను సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బలగాలతో సమ్యస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా పోలింగ్ చేపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఈవీఎంలను తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చారు. సూళ్లూరుపేటకు సంబంధించి నాయుడుపేట బాలికల జూనియర్ కళాశాల వసతి గృహం, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి విశ్వోదయ పాత డిగ్రీ కళాశాల, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఆదివారం ఉదయం సర్వేపల్లి మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచిన ఈవీఎంలను నెల్లూరులోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలోనే జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడ.. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులోని స్వగ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోట మండలం వెంకన్నపాళెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె తిరుపతికి చేరుకుని అక్కడే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ తిరుపతికే పరిమితమయ్యారు. ► సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక్కొక్క పోలింగ్ బూత్‌ను పూలు, బెలూన్లతో సర్వాంగ సుందరంగా అలంకరించడం విశేషం. పూర్తి పండుగ వాతావరణం తరహాలో పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ► నెల్లూరు జిల్లాలో కలువాయి మండలం పెరంకొండ 43ఏ పోలింగ్స్టేషన్లో పోలింగ్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించారు. చిట్టమూరు మండలం అరవపాళెం కాలనీ పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు రవి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం బురదగల్లి కొత్తపాళెంలో శాశ్వత రోడ్డు కోసం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గూడూరు సబ్‌కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ నేరుగా గ్రామస్తులతో మాట్లాడినా, కలెక్టర్ సైతం ఫోన్లో స్థానికులకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు తమకు అందిన సమాచారం మేరకు 64.29 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి అంటే రాత్రి ఏడు గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్యూలైనులో ఉన్నవారందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. దీంతో తుది పోలింగ్ శాతానికి సంబంధించి రిటర్నింగ్ అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పోలింగ్‌సరళిని పరిశీలిస్తే.. సర్వేపల్లిలో 66.19 శాతం, గూడూరు 63.81 శాతం, సూళ్లూరుపేట 70.93 శాతం, వెంకటగిరి 61.50 శాతం, తిరుపతి 50.58, శ్రీకాళహస్తి 67.77, సత్యవేడు 72.68 శాతం చొప్పున పోలింగ్ నమోదైందని తెలిపారు. -
ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్
-
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ అప్డేట్స్
-
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్
-
దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: తిరుపతికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లనటం దుర్మార్గం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. తనకు తిరుపతిలో సొంతిల్లు ఉంది అని, చంద్రబాబుకే అక్కడ సొంతిల్లు లేదన్నారు. బాబు జూమ్‌లో, లోకేష్ ట్విట్టర్లో మాత్రమే కనబడతారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చదవండి: దళిత ఓటర్లను అడ్డుకున్న టీడీపీ నేతలు -
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
-
దొంగ ఓట్లు వేసే అవసరం మాకు లేదు: సజ్జల
-
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ఊరందూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామంలో దళితులపై ఆయన అనుచరులు ఆంక్షలు పెట్టారు. ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే ఓటింగ్‌లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు. టీడీపీ మంత్రి అనుచరులు దళితవాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు. తాము ఓటు వేసి తీరుతామని దళిత ఓటర్లు పేర్కొన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్ అప్డేట్స్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ