Today Stock Market
-
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్‌డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది. నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయి 23,294కు చేరింది. సెన్సెక్స్ 668 పాయింట్లు దిగజారి 76,931 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ క్రితం ముగింపు వద్దే కదలాడింది. నాస్డాక్ 0.11 శాతం దిగజారింది.విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరిస్తున్నారు. రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు పెద్దగా లాభాలు పోస్ట్ చేయకపోవడం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మార్కెట్ అస్థిరతకు కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా మందగించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధి కూడా మార్కెట్ తిరోగమనానికి కారణమని చెబుతున్నారు.అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరింది. సెన్సెక్స్ 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం ఎగబాకింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం కొంత పెరుగుతుననట్లు తెలియజేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇప్పటికిప్పుడే వడ్డీరేట్లను తగ్గించే అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకులతో కదలాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 23,555కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు ఎగబాకి 77,631 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.32 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.24 శాతం దిగజారింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ.22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 78,507.87 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 23,820 వద్ద ఉన్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.ఇక నిఫ్టీ 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల్లో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ ముందుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటోకో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టాల్లో ముందున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల బలంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో మొదలుపెట్టాయి.ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 79,746 వద్ద, నిఫ్టీ 84.5 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 24,225 వద్ద చలిస్తున్నాయి.డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్‌ను విక్రయించడం, యూఎస్ కొనుగోలు చేస్తుండటం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ సంస్థల పనితీరు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 24,066కు చేరింది. సెన్సెక్స్ 290 పాయింట్లు నష్టపోయి 79,196 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.75 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది. నాస్డాక్ 0.09 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?అక్టోబర్ నెలకు సంబంధించిన యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో ఇది 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 24,451కు చేరింది. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 80,302 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.53 శాతం పెరిగింది. నాస్డాక్ 2.95 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టారిఫ్ వార్ 2.0!సుంకాల మోత ఖాయమనే అంచనాతో నష్టాలుఅమెరికాలో అధికారం చేజిక్కించుకున్న రిపబ్లికన్ల పార్టీ ‘ట్రంప్ సరిచేస్తారు’ అనే నినాదం అక్కడి మార్కెట్లనూ ప్రతిధ్వనించింది. ట్రంప్ అమెరికా ఫస్ట్ వైఖరి ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సుంకాల మోత ఖాయమనే అంచనాలతో ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, కొరియా సూచీలు బుధవారం 2.5% నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే జపాన్, సింగపూర్, తైవాన్ సూచీలు 2% వరకు పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ సూచీలు 1% నష్టపోయాయి. ట్రంప్ గెలుపు ఆధిక్యం కొనసాగుతున్న వేళ డాలర్ల రూపంలో ఆదాయాలు ఆర్జించే దేశీయ ఐటీ కంపెనీల షేర్లకు నిన్న డిమాండ్ లభించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల కొనుగోళ్లు!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్దకు చేరింది. సెన్సెక్స్ 901 పాయింట్లు ఎగబాకి 80,378 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగినట్లయింది.ఇటీవల వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక అంచనాకు వస్తుండడంతో మార్కెట్లు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, యూఎన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశీయ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొంత స్పష్టత వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫీసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు తగ్గి 23,942కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు నష్టపోయి 78,607 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.92 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.33 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..సోమవారం మార్కెట్లో ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది. ఈరోజు రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మార్కెట్లో కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్ ఎటాక్..!
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు క్షీణించి 78,782 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24 వేల దిగువన 23,995 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు క్షీణించి 78,233 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 23,816 వద్ద కనిష్టాలు తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. కొన్ని రియల్టీ రంగ షేర్లు 5–6 శాతం వరకూ పతనం కాగా... ప్రైవేటు రంగ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు 3–6 శాతం నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలేఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది.ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. 1% నుంచి అరశాతం నుంచి పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పావుశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 942 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.421 లక్షల కోట్లకు దిగివచ్చింది. రిలయన్స్ 3%, అదానీ పోర్ట్స్ 3%, సన్‌ఫార్మా 2.60%, ఎన్టీపీసీ 2.50%, బజాజ్ ఫిన్సర్వ్ 2.45%, యాక్సిస్ బ్యాంకు 2.40 నష్టపోయాయి. అక్టోబర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు 3–4% చొప్పున నష్టపోయాయి. ఎదురీదిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఎదురీదింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.463)తో పోలిస్తే 7% డిస్కౌంటుతో రూ.430 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 9% క్షీణించి రూ.420 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ట్రేడింగ్ చివర్లో రికవరీతో 2.50% లాభపడి రూ.475 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!నష్టాలు ఎందుకంటే..?అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశాల(6–7 తేదీల్లో) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీజింగ్‌లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సందర్భంగా చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. చమురు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయాన్ని ఓపెక్ వాయిదా వేసుకోవడంతో క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచేలా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్‌వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్‌లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్‌లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్‌పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
పదేళ్లలో భారీగా మార్కెట్లు పడింది ఎప్పుడంటే..
గడిచిన పదేళ్లలో మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఈక్విటీ మార్కెట్లంటేనే ఒడిదొడుకులు సహజం. వాటికి దూరంగా ఉంటూ లాభాలు పొందాలంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడుతున్నప్పుడు దాన్నో అవకాశంగా మలుచుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మరింత ఎక్కవ రాబడులు పొందే వీలుంటుందని సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఏయే నెలలో భారీగా కుదేలయ్యాయో.. తర్వాత ఎంత పుంజుకున్నాయో కింద తెలియజేస్తున్నాం.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు? -
యూఎస్ ఎన్నికలు.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 24,107కు చేరింది. సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 79,022 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.28 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.8 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేపు (మంగళవారం 5వ తేదీ) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్‌కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 తమ రెండు రోజుల విజయ పరంపరను ముగించాయి. ప్రపంచ మిశ్రమ సూచనల మధ్య బుధవారం నష్టాల్లో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 426.85 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 79,942.18 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 125.99 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి 24,340.85 వద్ద ముగిసింది.50 షేర్లలో 31 నష్టాల్లో ముగిశాయి.సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రెంట్ టాప్ లూజర్స్‌గా 4.03 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు తగ్గి 24,362కు చేరింది. సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 80,043 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.78 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 24,466 వద్దకు చేరింది. సెన్సెక్స్ 363 పాయింట్లు ఎగబాకి 80,369 వద్ద ముగిసింది.వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు గడిచిన రెండు సెషన్లలో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బారీగా పడిన మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా మారడంతో రిటైల్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 24,201కు చేరింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 79,616 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం లాభపడింది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్ పంజా.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 146 పాయింట్లు తగ్గి 24,251కు చేరింది. సెన్సెక్స్ 374 పాయింట్లు నష్టపోయి 79,697 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.02 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది. నాస్డాక్ 0.76 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుకార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.2%), డాలర్ ఇండెక్సు 104.02 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 24,381కు చేరింది. సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టపోయి 79,961 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.92 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.6 శాతం దిగజారింది.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.25%), డాలర్ ఇండెక్సు 104.5 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)