towns
-
పట్టణాలతో సమానంగా గ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి 71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్టణాలు, గ్రామాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 39.3 శాతమేనని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4,870 ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెలవారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. 2011–12తో పోల్చి చూస్తే 2022–23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీలో అసమానతలు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
మురికికూపాలు..సుందర జలాశయాలుగా..
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) నిర్లక్ష్యానికి నిలయాలుగా.. అపరిశుభ్రతకు ఆలవాలంగా.. కాలుష్యపు కాసారాలుగా మారిన పట్టణాల్లోని చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చూడముచ్చటగా అభివృద్ధి చేస్తోంది. పార్క్ వాతావరణం, గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది. వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు వాటిల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మొదటి దశలో 101 జలాశయాలను, రెండో దశలో మరో 95 చెరువులను సుందరీకరించే పనిని ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) ఇప్పటికే చేపట్టింది. రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించి, తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీలు–అర్బన్ లోకల్ బాడీలు) 196 చెరువులను ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.522 కోట్లను వెచ్చిస్తోంది. మొదటి దశలోని 101 జలాశయాల్లో ఇప్పటికే 50 చెరువుల్లో సుందరీకరణ పనులు దాదాపు పూర్తిచేశారు. ఆయా పనులకు అవసరమైన ప్రణాళికను పురపాలక శాఖ రూపొందించి, ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి దశలోని చెరువుల్లో సగం చెరువుల పనులు పూర్తిగా, మిగతావి దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వరద నష్టాన్ని నివారించేలా మార్పులు.. వరదలు వచ్చినప్పుడల్లా పట్టణాల్లో వీధులు నీటమునగడం పరిపాటిగా మారి, ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టణాల్లోని చెరువులను అమృత్ 2.0 పథకంలో అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని పట్టణ జలాశయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొచ్చేందుకు నడుంబిగించింది. మొదటి దశలోని 101 చెరువులను రూ.189.07 కోట్లతోను, రెండో దశలో 95 చెరువులకు రూ.332.97 కోట్లతోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులో చెరువులను వినియోగంలోకి తీసుకొచి్చ, వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వర్షపు నీరు తప్ప మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగును శుద్ధిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. జలాశయాల గట్లను రాళ్లతో పటిష్టం చేసి గట్లపై మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు ఆయా పట్టణాలకు ఈ చెరువులు సహజ రక్షణ వలయాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. నాడు ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంటూరు మున్సిపాలిటీలోని అంకిరెడ్డిపాలెం చెరువు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ముఫ్పై ఏళ్ల క్రితం వరకు తాగునీటిని అందించింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మురుగునీరు, జారిపోయిన గట్లు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. దీనినిప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్తగా తీర్చిదిద్దుతోంది. పటిష్టమైన గట్లు, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో సందర్శకులకు నిలయమైంది. పక్కనే ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ సైతం ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు చెరువుల అభివృద్ధి ఇలా.. మురుగుతో నిండిపోయిన జలాశయాలను శుద్ధి చేస్తారు. గట్లను పటిష్టం చేయడం, వీలైనంత ఎక్కువగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లా తీర్చిదిద్దుతారు. గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుచేస్తారు. ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను కలి్పస్తారు. ఆక్రమణలు జరగకుండా చుట్టూ రక్షణగా ఇనుప కంచె వేస్తున్నారు. తాగునీటి చెరువులుగా మార్పు జలాశయాల పునరుజ్జీవంలో మొదటి విడతగా 101 చెరువులను తీసుకున్నాం. ఇవి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 50 జలాశయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రతి చెరువును శుద్ధమైన నీటితో ఉండేలా ప్రక్షాళన చేయడంతో పాటు, గట్లను పటిష్టం చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటస్థలం, వస్తువులతో పాటు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో కురిసిన వర్షపునీరు చెరువులోకి చేరేలా.. అక్కడ నుంచి బయటకు వెళ్లేలా ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం. తాగునీటి చెరువులను సైతం అభివృద్ధి చేస్తున్నాం. నవంబర్‌కి మొదటి దశ చెరువుల అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం. – బొమ్మిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏపీయూజీబీసీ ఎండీ స్థలాల రేట్లు పెరిగాయి ఈ ఊరిలో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ చెరువు నీటితోనే గ్రామం దాహం తీర్చుకునేది. కానీ, గత 30 ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయింది. ఊరు గుంటూరులో కలిసిపోయినా ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రభుత్వం ఈ చెరువును పార్కులా మారుస్తుండడంతో చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరిగాయి. చుట్టూ వెంచర్లు కూడా వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లల్లో ఈ ప్రాంతమంతా కొత్త పట్టణంగా మారిపోతుంది. – అప్పిరెడ్డి, అంకిరెడ్డిపాలెం (గుంటూరు) మా ప్రాంతానికి ఐకాన్ గతంలో ఈ చెరువులో చేపలు పెంచేవాళ్లం. కలుషిత నీరు చేరడంవల్ల చేపలు చనిపోతుండడంతో మానేశాం. వాకింగ్‌కు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజెల్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీపీ)కి వెళ్లా ల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు మా చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో ఇకపై వాకింగ్‌కు, పిల్లలు ఆడుకునేందుకు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఈ ప్రాంతానికి ఇప్పుడీ చెరువు ఐకాన్‌లా మారుతోంది. – వి.వెంకటరమణ, అక్కిరెడ్డిపాలెం (విశాఖ) ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా.. విశాఖపట్నం లంకెలపాలెం చెరువు మూడెకరాలకు పైగా ఉండేది. 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోయింది. ఇన్నేళ్లకు అధికారులు ఆక్రమణలను తొలగించి అద్భుతంగా మారుస్తున్నారు. గతంలో వాకింగ్‌కు స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఈ చెరువు గట్టుపైనే చేస్తున్నాం. జిమ్, పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు. – సాలపు విజయకుమార్, లంకెలపాలెం (విశాఖపట్నం) బోటింగ్ కూడా పెడుతున్నారు హిందూపూర్‌లోని 113 ఎకరాల సూరపుకుంట చెరువు గత నెల వరకు గట్లు అడవిలా, పాములు, పందులకు నిలయంగా ఉండేవి. నీరు కూడా మురికిగా ఉండేది. అధికారులు పదిరోజుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్నాం. అధికారులు బోటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు. బెంగళూరు, ఎలహంకలో ఇలా చెరువుల అభివృద్ధిని చూశాను. – సింగిరెడ్డిపల్లి ప్రసాదరెడ్డి, హిందూపూర్ -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
టర్మ్ పాలసీల్లో పట్టణ ప్రజలు మెరుగు
న్యూఢిల్లీ: టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మెట్రోలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారు. జైపూర్, పాట్నా, పుణె తదితర పట్టణాల్లో ఎక్కువ మంది ప్రజలు అచ్చమైన బీమా ఉత్పత్తిగా పరిగణించే టర్మ్ ప్లాన్లను తీసుకుంటున్నట్టు మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ సర్వే’లో తెలిసింది. ఇక్కడ ఏజెంట్ల ద్వారా టర్మ్ ప్లాన్లను ఎక్కువ మంది తీసుకుంటుంటే, అదే సమయంలో ఆన్లైన్ చానళ్లపైనా గణనీయమైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో 3,500 మంది ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. జీవిత బీమా ఉత్పత్తుల పట్ల విజ్ఞానం పట్టణ ప్రజల్లో 2019లో 39గా ఉంటే, అది తాజా సర్వేలో 57కు పెరిగింది. జీవిత బీమా ఉత్పత్తులను కలిగి ఉన్న వారిలోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. 73 శాతానికి చేరింది. టర్మ్ ఇన్సూరెన్స్ విలువను అర్థం చేసుకోవడం మొదలైందని, మరింత మందికి దీన్ని చేరువ చేసేందుకు జీవిత బీమా పరిశ్రమ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో..
కూలి కోసం.. ఉపాధి కోసం.. ఎదిగిన బిడ్డ చదువు కోసం.. కుటుంబ సభ్యుల అవసరాల కోసం పట్టణంలో బతుకుదామని పల్లెవాసి వలస బాట పడుతున్నాడు. ఫలితంగా పట్టణీకరణ పెరుగుతోంది. గత 20 ఏళ్లలో పుర/నగరాల జనాభా గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2001 నుంచి 2011 మధ్య 29 శాతం పట్టణ జనాభా పెరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ పదేళ్లలో ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం జనాభా 2001 జనæ గణన ప్రకారం.. 44,65,144. 2011 నాటికి ఇది 48,87,813కి పెరిగింది. ఆ పదేళ్ల కాలంలో జిల్లా మొత్తం జనాభా 9.46 శాతం అంటే 4,22,669 పెరిగింది. అదే సమయంలో పట్టణ జనాభా ఏకంగా 29 శాతం అంటే 3,67,158 పెరగడం విశేషం. 2001లో జిల్లాలో మొత్తం 12 పట్టణాలు ఉండగా, 2011 నాటికి మరో పట్నం అదనంగా చేరింది. ప్రస్తుతం దాచేపల్లి, గురజాల కూడా పట్నాలుగా రూపాంతరం చెందాయి. ఎన్నో గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో విలీనమయ్యాయి. కరోనా వల్ల 2021లో జరగాల్సిన జన గణన చేపట్టలేదు. జనగణన పూర్తయితే పట్టణ జనాభాలో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యా, వైద్య, ఉపాధి సదుపాయాల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయాధారిత జిల్లా. గత 20 ఏళ్లలో సాగునీటి వనరులు అభివృద్ధి చెందడంతో వాణిజ్య, ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. గ్రామీణ రైతుల, రైతు కూలీల ఆదాయాలూ, జీవన ప్రమాణాలూ మెరుగుపడ్డాయి. ఫలితంగా సౌకర్యాలపై మక్కువ పెరిగింది. దీనికితోడు పల్లెవాసుల్లో విద్యకు ప్రాధాన్యం పెరిగింది. నగరాలకు వలస వెళ్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, విద్య, వైద్య, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచన గ్రామీణుల్లో బలంగా నాటుకుంది. అందుకే పల్లె ప్రజలు పట్టణాలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. గుంటూరు విద్యా కేంద్రంగా భాసిల్లుతుండటంతో ఇక్కడ జనాభా పెరుగుదల అధికంగా ఉంది. వైద్యం, ఇంజినీరింగ్, వాణిజ్య, సాంకేతిక, ఫార్మా తదితర కళాశాలలు అందుబాటులో ఉండడం కలిసొస్తోంది. ఒకప్పుడు పంచాయతీలుగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నగర పంచాయతీలు, పట్టణాలుగా రూపాంతరం చెందడం పట్నం వాసంపై ప్రజల్లో ఉన్న అమితాసక్తికి సూచికగా విశ్లేషకులు చెబుతున్నారు. నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో.. గతంలో పల్లెటూళ్లుగా ఉన్న రెడ్డిపాలెం, గోరంట్ల, అడివితక్కెలపాడు, పెదపలకలూరు, నల్లపాడు, బుడంపాడు, లాలుపురం, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, నాయుడుపేట, చౌడవరం, ఏటుకూరు, బొంతపాడు లాంటి గ్రామాలన్నీ ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమయ్యాయి. ఫలితంగా పట్టణ సొబగులు అద్దుకున్నాయి. ఇస్సపాలెం, రావిపాడు, లింగంగుంట్ల గ్రామాలు దాదాపుగా నరసరావుపేట పట్టణంలో కలిసిపోయాయి. మెరుగైన జీవనం కోసమే.. పట్టణాల్లో మెరుగైన విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు అందుబాటులో ఉండడంతో పల్లెల్లోని ప్రజలు దగ్గర్లోని నగరాలకు వలస వెళ్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలే వీరిలో అధికం. వీరికి పల్లెల్లో పెద్దగా ఆస్తులేవీ ఉండవు కాబట్టి కుటుంబ అవసరాల కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్నారు. – డాక్టర్ బి నాగరాజు, మానవ వనరుల అభివృద్ది విభాగం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మా పల్లె మారిపోయింది మాది 2001 వరకు పల్లెటూరే. 12 ఏళ్ల క్రితం గుంటూరులో విలీనమైంది. పూరి గుడిసెల స్థానంలో ఇప్పుడు బహుళ అంతస్తుల మేడలు వెలిశాయి. గతంతో పోలిస్తే భూమి ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి. వ్యాపారాలు వృద్ధి చెందాయి. – డొక్కు కాటమరాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోరంట్ల పిల్లల చదువుల కోసం.. మా గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. కానీ మెరుగైన విద్య అందుబాటులో లేదు. దీంతో నా ఇద్దరు అమ్మాయిల చదువుల నిమిత్తం గుంటూరు నగరానికి వలస వచ్చాను. నగరం నుంచి గారపాడుకు వెళ్లి వస్తూ వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ నివాసం ఉంటూ పిల్లల చదివిస్తున్నాను. పట్టణాల్లో అన్ని వసతులూ ఉంటాయి. – బొబ్బా నాగిరెడ్డి, గారపాడు, వట్టిచెరుకూరు మండలం -
పల్లె జనం.. పట్టణ జపం
సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి : పల్లె తల్లి వంటిది.. అందుకే గతంలో స్వగ్రామాలను విడిచి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అంతా పట్నం బాటే పడుతున్నారు. ఫలితంగా పంటపొలాలకు లోగిళ్లుగా చెప్పుకునే పల్లెలు వివిధ కారణాలతో ఇప్పుడు పట్టణాలకు చేరువయ్యాయి. బతుకుతెరువు కోసం వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయిన కుటుంబాలు భారీగా పెరుగుతున్నాయి. ఎకరాల కొద్దీ మాగాణి భూములతో అలరారిన కుటుంబాలు సైతం ఇప్పుడు పట్టణాలను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నిటికీ ఒకటే సూత్రం..బతుకుదెరువు. లేదా పిల్లల చదువులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజాగా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. చదువుల కోసం నగరాలకు.. 2000 సంవత్సరానికి ముందు ఉపాధి కోసం ఎక్కువ మంది పట్టణాలకు చేరుకునే వారు. చిన్న చితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. దీంతో పట్టణ జనాభా కొద్దికొద్దిగా పెరుగుతూండేది. 2000 సంవత్సరం తర్వాత పిల్లలను చదివించుకోవాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. దీంతో భూములను కౌలుకు ఇవ్వడం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పట్టణాల్లో స్థిరపడి పిల్లలను చదివించుకుంటున్నారు. ఈక్రమంలోనే గడిచిన 20 ఏళ్లలో పట్టణాలకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా విషయానికే వస్తే అనంతపురం నగరానికి పక్కనే ఉన్న నారాయణపురం పంచాయతీ జనాభా ఒకప్పుడు 8 వేల లోపే. ప్రస్తుత లెక్కల ప్రకారం జనాభా 24 వేలు ఉందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే, హిందూపురానికి దాదాపు 5 కిలోమీటర్ల పైనే దూరముండే కొట్నూరుకూడా పట్టణంలో కలిసిపోయింది. 1991 లెక్కల ప్రకారం సదరు పంచాయతీ జనాభా 1,350 కాగా ఇప్పుడు దాదాపు 4,500 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క పంచాయతీనే కాదు సడ్లపల్లి, పూలకుంట పంచాయతీలు కూడా హిందూపురం పట్టణంలో దాదాపు కలిసిపోయాయి. 2008 తర్వాత నుంచి భారీగా.. గతంలో ఇంజినీరింగ్ చదవాలంటే ఏ కొద్దిమందికో అవకాశం ఉండేది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య చదివే అవకాశం వచ్చింది. దీంతో పాటు మెరిట్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు పట్టణాలకు క్యూ కట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని లక్షలాదిమంది ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలా రకరకాల కారణాల వల్ల పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పట్టణాల్లో ఒకప్పుడు చదరపు కిలోమీటరకు 111 మంది ఉండగా..ఇప్పుడు 213కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 242కు చేరి ఉంటుందని అంచనా. అంటే పట్టణాలు ఎంత ఇరుకుగా మారుతున్నాయో అంచనా వేయచ్చు. పెరిగిన కాలనీలు.. ఒకప్పటి అనంతపురం నగరానికి ఇప్పటికీ భారీగా తేడా కనిపిస్తోంది. గతంలో పాతూరు, కొత్తూరు ప్రాంతాలు మాత్రమే ఉండేవి. శ్రీకంఠం సర్కిల్ వరకూ పాతూరు.. ఆ పైభాగం మొత్తం కొత్తూరుగా పిలుచుకునే వారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం పూర్తిగా నగరంలో కలిసిపోయిన పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే బళ్లారి రోడ్డుకు ఎస్టేట్‌కాలనీ, సిండికేట్‌నగర్, రాచానపల్లిపల్లి వరకూ నగరం విస్తరించింది. కళ్యాణదుర్గం రోడ్డుకు ఒకప్పడు బైపాస్ తర్వాత చివరన రాజా హోటల్ ఉండేది. అక్కడి వరకూ కూడా ఆటోలు రావాలంటే గగనంగా ఉండేది. ఇప్పుడు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల భారీ భవనాలు వెలిశాయి. కక్కకలపల్లి కాలనీ, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ, అక్కంపల్లి, ఎన్ఆర్కాలనీ, ధర్మభిక్షకాలనీ ఇలా కురుగుంట వరకూ నగరం విస్తరిచింది. ఆలమూరు రోడ్డుకు రుద్రంపేట, కట్టకిందపల్లి రూరల్ మండల పరిధిలో ఉండేవి. ప్రస్తుతం ఇవి కూడా నగరంలోకి కలిసిపోయాయి. కొత్తగా ప్రభాకర్‌చౌదరి కాలనీ, పంతులకాలనీ, చంద్రబాబు కొట్టాల, వికలాంగుల కాలనీ, అజయ్‌ఘోష్ నగర్, ఆదర్శనగర్ తదితర పేర్లతో కాలనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పట్టణం.. సౌకర్యవంతం మాది సోమందేపల్లి మండలం మండ్లి పంచాయతీ రూకలపల్లి. గ్రామం కావడంతో ఉపాధి కోసం హిందూపురం పట్టణానికి 2008లో వచ్చాము. ముద్దిరెడ్డిపల్లిలో పవర్ లూమ్స్‌లో చీరల నేస్తూ ఇక్కడే సిర్థపడ్డాను. ఉపాధి దొరకడంతో పాటు పట్టణం కావడంతో అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. – రవికుమార్ రెడ్డి, హిందూపురం పిల్లల ఉన్నత చదువుల కోసం వచ్చాం మా ఊరు పెద్దవడుగూరు మండలంలోని కిష్టిపాడు. నేను గుత్తి మండలం వన్నేదొడ్డి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం చేశా. కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాడికి ఇబ్బంది ఉండవద్దని ‘అనంత’కు వచ్చి స్థిరపడ్డాం. – మస్తాన్‌వలి, టీచర్, అనంతపురం ఒకప్పుడు పల్లె... నేడు పట్టణం మాది నారాయణపురం. 30 సంవత్సరాల క్రితం మాదొక పల్లెటూరు. నగరంలో నివాసముంటున్న వారి దుస్తులు తీసుకొని గాడిదలపై వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నగరం బాగా పెరిగింది. ఈ ఊరు నగరంలో కలిసిపోయింది. రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు మీ ఊరేది అంటే అనంతపురం అని చెబుతున్నాం. – చాకలి సుబ్బరాయుడు, నారాయణపురం పంచాయతీ -
పట్టణాలు.. ఇక సహజ అడవులు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఎండ వేడిమిని తగ్గించేందుకు.. కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రాణవాయువును అధికంగా అందించేందుకు అనువైన పార్కుల రూపకల్పనకు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో (అర్బన్ లోకల్ బాడీస్–యూఎల్బీ) ఏర్పాటు చేయబోయే గ్రీన్ బెల్ట్, పార్కులు, సెంట్రల్ మీడియన్స్ వంటి వాటిలో పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విధిగా చేపట్టాలని ఆదేశించడంతో రాష్ట్రంలోని మునిసిపాలిటీలు పట్టణాల పరిధిలో పార్కుల అభివృద్ధిని ఈ సంస్థ ద్వారా చేపడుతున్నాయి. ఆయా యూఎల్బీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పార్కులు, పట్టణ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచే మొక్కలతో సహజ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు ఆగ్రో క్లైమాటిక్ జోన్లలో నాలుగు పార్కులను (విజయవాడ వాంబే కాలనీ, విశాఖ సమీపంలోని సింహాచలం ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో) పెంచారు. ఈ పార్కుల ఏర్పాటు తర్వాత స్థానికంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదలతోపాటు, ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి కావడం గమనించిన అధికారులు ఈ తరహాలోనే రాష్ట్రంలోని 124 యూఎల్బీల్లో సహజ అడవుల పెంపకానికి సిద్ధమవుతున్నారు. ఏమిటీ.. మియావాకి అడవులు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ విధానాన్ని మియావాకి పద్ధతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనం పరుచుకుని వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ కనుగొనడంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఈ విధానం నేల, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పని చేస్తుందని మియావాకీ నిరూపించాడు. పైగా ఇది పట్టణ ప్రాంతాలకు అనువుగా ఉంటూ.. సేంద్రియ పద్ధతిలో పెరిగే అడవి కావడంతో స్థానిక జీవ వైవిధ్యానికి తోడ్పాటునిస్తుంది. ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పెంచే మొక్కల కంటే ఈ విధానంలో మొక్కలు 10 రెట్లు వేగంగా పెరగడంతో పాటు 30 రెట్లు దట్టంగా ఉండటం గమనార్హం. మియావాకి అనుసరించిన విధానం నుంచి ప్రేరణ పొంది మన ప్రాంతానికి అనువైన ‘హైడెన్స్ ప్లాంటేషన్’ విధానంలో రాష్ట్రంలో అర్బన్ పార్కులు, మినీ అడవుల పెంపునకు గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ నిర్వహణ వ్యయంతో ఏడాది కాలంలోనే దట్టమైన అడవిగా మారడంతో పాటు వివిధ రకాల పక్షులు, కీటకాల వంటి జీవులకు ఇవి ఆవాసంగా మారుతున్నాయి. విజయవాడలోని వాంబే కాలనీలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 150 రకాల వృక్ష జాతులతో మొత్తం 2,600 మొక్కలు ఎంపిక చేసి నాలుగేళ్ల కిందట నాటారు. ఇప్పుడు ఆ ప్రాంతం నివాసాల మధ్య సహజమైన అడవిని తలపిస్తోంది. అనేక పక్షులకు నివాసంగా మారడంతో పాటు జీవవైవిధ్యం పరిరక్షణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ (కర్బనాలను వేరు చేయడం) మెరుగుపడినట్టు గుర్తించారు. ప్లాంటేషన్ అయిన ఎనిమిది నెలల తర్వాత విజయవాడ వాంబే కాలనీలో మియావాకి తరహా అడవులు జీవ వైవిధ్యం, ఆక్సిజన్ పెంపునకు తోడ్పాటు చెట్లను విచక్షణా రహితంగా నరికేస్తూ పట్టణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఏటా ఉష్ణోగ్రతలు, రేడియేషన్ పెరిగిపోతున్నాయి. చెట్లు లేకపోవడంతో మనుషులతో మమేకమైన అనేక పక్షి జాతులు కనిపించకుండా పోయాయి. ప్రస్తుత కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రజల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి కూడా కరవవుతోంది. ఈ క్రమంలో జీవరాశి మనుగడకు, అర్బన్ అడవులు తప్పనిసరని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వియావాకి పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. అర ఎకరం విస్తీర్ణంలో రూ.20 లక్షల ఖర్చుతో అద్భుతమైన మియావాకి అర్బన్ పార్కును తయారు చేయవచ్చు. నాటే మొక్కల్లో పళ్ల రకాలు, నీడనిచ్చేవి, ఔషధ రకాల మొక్కలు ఉండటం వల్ల కోతులు వంటి జీవులు, పక్షులకు ఆహారం లభిస్తుంది. తద్వారా అవి పట్టణాలపై దాడి చేయడం నిలిచిపోతుందంటున్నారు. మేం రూపొందించిన 4 మియావాకి పార్కులు మంచి ఫలితాలిచ్చాయి. ప్రభుత్వ భూముల్లో ఇలాంటి పార్కుల రూపకల్పన ఎంతో అవసరం. – పి.సత్యనారాయణ, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ -
పల్లెల్లోకి కరోనా
సాక్షి, హైదరాబాద్ : నగరాలు, పట్టణాలను చుట్టేసిన కరోనా ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళ్తోంది. మొదట్లో హైదరాబాద్ నగరం సహా కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో మాత్రమే కేసులు నమోదయ్యేవి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉండి వచ్చిన వలస కార్మికుల ద్వారా కేసులు విస్తరించాయి. తద్వారా హైదరాబాద్ నగరం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పల్లెల నుంచి పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం వచ్చినవారు, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వెళ్లారు. దీంతో పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 270 మండలాలు, 1,500 గ్రామాల్లోకి వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. వచ్చేనెలలో దాదాపు ఐదు వేల గ్రామాల్లో వైరస్ వ్యాప్తి జరుగుతుందని అంచనా వేసింది. సామాజిక వ్యాప్తి కారణంగా ఈ పరిస్థితి నెలకొందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ద్వితీయశ్రేణి పట్టణాలు, అన్ని మున్సిపాలిటీల్లోనూ వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1,100 కేంద్రాల్లో యాంటిజెన్ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుండటంతో కూడా పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇదిలావుంటే గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కేసులు పెరుగుతుండటంతో ఆ మేరకు వైద్య వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ కరోనాకు సంబంధించిన చికిత్స కోసం అవసరమైన వైద్య వసతులు, వెంటిలేటర్లు లేక సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. కొందరు వైద్యులు కూడా బాధితులకు సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌కే పంపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. ఫీవర్ సర్వే... గ్రామాల్లోనూ కరోనా బాధితులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి గ్రామంలో 150 వరకు కొత్త ముఖాలు ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, ఇప్పటిదాకా ఉపాధి ఉద్యోగాల రీత్యా నగరాలకు వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. చాలా ఏళ్ల తర్వాత వారు స్వగ్రామాలకు వచ్చినట్లు తేలింది. ఫలితంగా గ్రామాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి పట్టణాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని, ఆగస్టు చివరి నాటికి మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కేసులు నమోదుకాకపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినలేదు. వ్యవసాయ రంగంపైనా పెద్దగా ప్రభావం పడలేదు. మున్ముందు కేసులు పెరిగితే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వైద్య వర్గాలను కలవరపెడుతోంది. అయితే పట్టణాలు, నగరాలతో పోలిస్తే పల్లెల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో దగ్గర దగ్గరగా ఉండి పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. దీనివల్ల వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ వైరస్ వ్యాపిస్తే మాత్రం వైద్య ఆరోగ్య సదుపాయాలు పట్టణాల్లో మాదిరిగా ఉండవని ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా స్థానిక వైద్యులు, ప్రైవేట్ ప్రాక్టీషనర్లపైనే ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. వైరస్‌ను సరైన సమయంలో అంచనా వేయకపోతే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి పల్లెల్లో కేసుల నియంత్రణ, చికిత్స, ముందస్తు గుర్తింపుపై ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాలు... ►కరోనా లక్షణాలుంటే స్థానిక ప్రైవేట్ ప్రాక్టీషనర్లు వెంటనే అప్రమత్తం అవ్వాలి. అలాగే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వారిని గుర్తించాలి. ►అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలి. అవసరమైతే వైరస్ నిర్ధారణ పరీక్షలకు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ►దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగానే చికిత్స అందించాలి. అందుకోసం మందులను 104 సర్వీసు ద్వారా అందించాలి. ►పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాలి. అన్నిచోట్లా యాంటిజెన్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ►గ్రామాల్లో భయాందోళనలు తలెత్తకుండా వారిలో చైతన్యం తీసుకురావాలి. అందుకోసం ప్రచారం నిర్వహించాలి. కరపత్రాలు వేయాలి. స్థానిక మీడియాను ఉపయోగించుకోవాలి. ►కొత్తగా తీసుకువచ్చే వంద ‘108’ అంబులెన్స్‌లను గ్రామాల్లో కరోనా సేవలకే కేటాయించాలి. ►అత్యవసర కేసులను సమీప ఆసుపత్రికి తీసుకొచ్చేలా జిల్లా వైద్యాధికారులు, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. -
పట్టణాలు, నగరాల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నడుస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నానికి నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అమృత్ పథకం కింద దాదాపు రూ. 3,762 కోట్లతో పనులు చేపట్టామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించారు. రూ.800 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (సాయం అర్ధించిన విద్యార్థిని, చలించిన సీఎం జగన్) టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: విజయవాడలోని నీటి కాలువల్లోకి చెత్త వేయకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్మార్ట్‌సిటీ కింద రూ. 4,578 కోట్ల విలువైన పనులు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో చేస్తున్నామని, వాటిని వేగంగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏఐఐబీ ఆర్థిక సహాయంతో 50 పట్టణ ప్రాంతాల్లో, లక్ష జనాభా కన్నా తక్కువ ఉన్న నగరాల్లో తాగునీటి కోసం రూ. 5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పట్టణాలకు వెళ్లే దారిలో ఉన్న 111 గ్రామాలకు తాగునీరు అందించాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని జులై 8న లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రైల్ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయలన్నారు. కోవిడ్ కారణంగా డీపీఆర్ తయారీలో కాస్త వెనకబడ్డామని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. (అది పిల్లల భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్) ఆధునిక వసతులు సమకూర్చాలి: లక్ష జనాభా దాటిన పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఉద్దేశించిన రూ.10,666 కోట్లతో కార్యక్రమాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను మోడల్ మున్సిపాలిటీలుగా చేయడంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. వంద శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. పాఠశాలల అభివృద్ది, నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ఉండాలని సీఎం తెలిపారు. అలాగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంపైనా అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణంపైన సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. పేదలకు కట్టే ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళగిరి ఆలయ అభివృద్ధి, మాడ వీధుల పునర్నిర్మాణంపైన సమావేశంలో సీఎం అధికారులతో చర్చించారు. బకింగ్‌హాం కెనాల్ డెవలప్మెంట్, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ది తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆధికారులు ప్రతిపాదించారు. వీటన్నింటికీ జూన్ నాటికి పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న పట్నవాసం
సాక్షి, అమరావతి : ఇప్పటివరకు గ్రామీణాంధ్రగా గుర్తింపు పొందిన రాష్ట్రం క్రమంగా పట్టణాంధ్రగా మారుతోంది. పల్లెవాసులు పట్టణాలకు వలస పోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇది ఇలాగే కొనసాగితే మరో 11ఏళ్లలో అంటే 2031 నాటికి పట్టణాల్లో జనాభా ప్రస్తుతం ఉన్న దానికంటే 43 శాతం పెరగనుంది. ఇదే సమయంలో గ్రామాల్లో భారీగా తగ్గనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామాల్లోనే అత్యధిక జనాభా ఉంది. కానీ, 2031 నాటికి పట్టణ జనాభా పెరిగిపోయి, గ్రామీణ జనాభా తగ్గిపోయిన పక్షంలో రెండు ప్రాంతాల జనాభా మధ్యనున్న వ్యత్యాసం భారీగా తగ్గిపోనుంది. ప్రస్తుతం గ్రామీణ జనాభా 3.48 కోట్లు ఉండగా 2031 నాటికి ఇది 2.78 కోట్లకు పడిపోనుంది. అంటే 70 లక్షల జనాభా పట్టణ బాట పట్టనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం పట్టణాల్లో 1.46 కోట్లుగా ఉన్న జనాభా.. 2031 నాటికి ఏకంగా 2.79 కోట్లకు చేరనుంది. అంటే ఏకంగా 1.33 కోట్ల మంది పట్టణాల్లో పెరగనున్నారు. దీంతో పట్టణ జనాభా మొత్తం2.79 కోట్లకు, గ్రామీణ జనాభా 2.78 కోట్లకు చేరుకోనుంది. ఈ రెండు ప్రాంతాల జనాభా ఇంచుమించు ఒకే స్థాయికి చేరనుంది. పట్టణాల్లో రెట్టింపైన జనాభా ఇదిలా ఉంటే.. గత దశాబ్ద కాలంలో గ్రామీణ జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే పెరగ్గా, పట్టణాల్లో మాత్రం 2011తో పోలిస్తే రెట్టింపైంది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 4.94 కోట్ల జనాభా ఉండగా.. అది 2031 నాటికి 5.57 కోట్లకు చేరవచ్చని అంచనా. మరోవైపు.. అర్బన్ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల కారణంగా అక్కడి వారికి మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారనుంది. ఎందుకంటే.. - పట్టణాల్లో ఇప్పటికే ఇంకా 35 లక్షల గృహాలకు మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. - 18 లక్షల గృహాలకు పైపుల ద్వారా మంచినీటి సరఫరా సౌకర్యంలేదు. - 13,000 కిలోమీటర్ల మేర వరదనీటి, డ్రైనేజీ వ్యవస్థ లేదు. - గత ఏడాది మేలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న 1.46 కోట్ల మంది జనాభాకు మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉన్నట్లు తేలింది. -
భవిష్యత్తు భారతీయ నగరాలదే
భారతదేశ నగరాలు పరుగెడుతున్నాయి. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి 10 భారతదేశ నగరాలేనని తాజా నివేదిక చెబుతోంది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా 2019–2035 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందే నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి 10 భారతీయ నగరాలే. నివేదిక ప్రకారం వజ్రాల వ్యాపారానికి పేరుగాంచిన సూరత్ (గుజరాత్) 9.17% వార్షిక వృద్ధితో మొదటి స్థానంలో, 8.47% వృద్ధితో హైదరాబాద్ 4వ స్థానంలో, 8.16 % వృద్ధితో విజయవాడ పదో స్థానంలో నిలవనున్నాయి. మొదటి పది నగరాల్లో తమిళనాడుకు చెందిన మూడు నగరాలు మూడవ స్థానం సంపాదించుకోనున్నాయి. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, భవిష్యత్తులో చైనాను మించిపోతుందని వస్తున్న అంచనాలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. చిన్నవే అయినా.. ఘనంగా! ప్రపంచంలోని అతిపెద్ద నగరాలతో పోలిస్తే భారతీయ నగరాలు ఆర్థికపరంగా చాలా చిన్నవే అయినా 2027 నాటికి ఆసియా దేశాల్లోని అన్ని నగరాల సగటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని అన్ని నగరాల జీడీపీని మించిపోతుందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అధిపతి రిచర్డ్ హాల్ట్ స్పష్టం చేశారు. ప్రపంచ మహానగరాల జాబితాలో ఇప్పటికీ, 2035 నాటికి తొలి స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండవని అంచనా వేశారు. ప్రస్తుతం జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న న్యూయార్క్, టొక్యో, లాస్ ఏంజెలిస్, లండన్లు తమ స్థానాలను పదిలపరుచుకుంటాయని, పారిస్ స్థానంలో షాంఘై, చికాగో స్థానంలో బీజింగ్ వస్తాయన్నారు. -
నాడు పల్లెలు.. నేడు పట్టణాలు
చుట్టూ పచ్చటి పంట పొలాలు.. ఒకే గొడుగు కింద ఉన్నట్లుగా కనిపించే పదుల సంఖ్యలో పెంకుటిళ్లు, రేకుల గదులు.. ఇళ్ల మధ్యలో చిన్న చిన్న సందులు.. ఇరుకు రోడ్లు.. ఇదంతా పదేళ్ల క్రితం నాటి ఆ గ్రామాల పరిస్థితి. ఇప్పుడు ఆ గ్రామాలు బహుళ అంతస్తుల భవనాలు, ఖరీదైన బంగ్లాలు, విశాలమైన రోడ్లతో నగరాలను తలపిస్తున్నాయి. పట్టణ ప్రాంత ప్రజలు శివార్ల బాటపట్టడంతో పంట పొలాలు మాయమై కనుచూపు మేర కాలనీలు విస్తరించాయి. వందల సంఖ్యలో ఆధునిక హంగులతో గృహాలు వెలిశాయి. పట్టణీకరణ నేపథ్యంలో గ్రామీణ వాతావరణం పూర్తిగా మారిపోయింది. – శంషాబాద్ రూరల్/హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: శంషాబాద్ రూరల్/హయత్‌నగర్/ పెద్దఅంబర్‌పేట : హైదరాబాద్ నగర శివారు మండలాలు శంషాబాద్, మొయినాబాద్, మహేశ్వరం, కందుకూరు, హయత్‌నగర్, చేవెళ్ల, కొత్తూరు ప్రాంతాల్లోని గ్రామాల్లో పల్లె శోభ కనుమరుగవుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగురోడ్డును ఆనుకుని ఉన్న మండలాల్లో శరవేగంగా అభివృద్ధి కనిపిస్తోంది. దీనికి తోడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్లలో టాటా ఎయిరోస్పేస్ సంస్థలను నెలకొల్పడంతో పాటు ఫార్మాసిటీ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. భూముల ధరలు పెరగడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో గ్రామీణుల జీవన శైలిలో మార్పు సంతరించుకుంటోంది. పెద్ద పెద్ద ఇళ్లు, ఖరీదైన బంగ్లాలు వెలుస్తున్నాయి. గత ఐదేళ్లలో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శంషాబాద్ మండలం ఊట్పల్లిలో డూప్లెక్స్ భవనాలు, అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలు ఊపందుకున్నాయి. వలస జీవుల రాకతో... హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్, కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుండడంతో జనం శివారు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. దీనికి తోడు ఉపాధి, ఉద్యోగం, పిల్లల చదువుల కోసం చాలా మంది మారుమూల గ్రామాల నుంచి శివారు మండలాలకు వలస వస్తున్నారు. దీంతో నగరానికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో కొత్తగా లేఅవుట్లు వెలసి నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. గ్రామాలు కాస్త పట్టణాలుగా మారిపోతున్నాయి. ఆయా మండల కేంద్రాలతో పాటు ఊట్పల్లి, తొండుపల్లి, నర్కూడ, చౌదరిగూడ, మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో కొత్తగా కాలనీలు వెలస్తున్నాయి. ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయంతో పచ్చగా కనిపించే భూముల్లో నేడు ఎక్కడ చూసినా ఇళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం శివారు మండలాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో సైతం ఎకరం ధర రూ.30లక్షల పైమాటే. ఇక లేఅవుట్లకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.కోట్లు పలుకుతోంది. కొత్తగా వెలుస్తోన్న కాలనీల్లో చాలా మంది ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉంటున్నారు. స్థానికంగా భూములు అమ్ముకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో లాభాలు ఆర్జించిన వారు ఖరీదైన జీవనశైలికి అలవాటుపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఇళ్లు, కార్లు సమకూర్చుకుంటున్నారు. శంషాబాద్ మండలంలోని ఊట్పల్లి, నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో వెలుస్తున్న కాలనీల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాల వారే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. శంషాబాద్ మండలంలోని ఊట్పల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 960 ఎకరాల భూములుండగా.. ఇందులో 686 ఎకరాల్లో లేఅవుట్లు వెలిశాయి. ఐదేళ్ల కాలంలో దాదాపు 200 ఎకరాల్లో కొత్తగా వెంచర్లు వెలిశాయి. శంషాబాద్ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో కొత్త కాలనీల సంఖ్య పెరిగిపోతోంది. వీటి పరి«ధిలో 3,858 ఎకరాల భూములుండగా.. 1500 ఎకరాల్లో లేఅవుట్లు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ 350 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. పల్లె రూపు కోల్పోయిన మునుగనూర్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మునగనూరు గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 300 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం 1992 వరకు ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ అనుబంధ గ్రామం. రోడ్డుకు దూరంగా ఉండడంతో ఉనికి కూడా కనిపించేది కాదు. బ్యాంక్ కాలనీ ఏర్పడిన తర్వాత 700పైగా ఓటర్లు కావడంతో అప్పడు గ్రామ పంచాయతీగా అవతరించింది. 2000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండేది. హయత్‌నగర్ పట్టణానికి అనుకుని ఉన్న ఈ గ్రామంలో 1982 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. క్రమంగా గ్రామంలోని వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారాయి. పది సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. పొలాలను అమ్ముకున్నవారు రియల్ వ్యాపారంలోకి దిగారు. దీనికి తోడుగా బిల్డర్లు రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సుమారు 15 కాలనీలలో 1500 వరకు ఇళ్ల నిర్మాణం జరిగింది. వందల సంఖ్యలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. పట్టణ ప్రాంతం నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ ఇళ్లను కొగోలు చేస్తుడండంతో మునుగనూర్ హాట్ కేక్‌గా మారింది. మౌలిక వసతులు కల్పించాలి శంషాబాద్ మండల శివారు గ్రామాల్లో కొత్తగా కాలనీలు వేగంగా పుట్టకొస్తున్నాయి. చాలా వరకు ఇతర ప్రాంతాల వారు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్థానికేతరులే ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు. జనావాసాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – జి.కృష్ణకుమార్, ఉప సర్పంచ్, ఊట్పల్లి అభివృద్ధితో ఉపాధి దొరుకుతోంది.. మునుగనూరు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు వ్యవసాయం మీదనే అధారపడి బతికేవారు ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో అనేక మందికి పనిదొరుకుతుంది. ప్రశాంత వాతావరణం ఉండడంతో స్థానికేతరులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తుడండంతో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. –దోమలపల్లి దర్శన్, మునగనూరు గ్రామస్తుడు -
పట్టణాల్లో ప్రక్షాళన!
-
పట్టణాల్లో ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా భూముల వివరాలు తేల్చాలని స్పష్టం చేశారు. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, ఆ నెల 5వ తేదీకల్లా పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరేలా కార్యాచరణ రూపొందిం చుకోవాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి నిర్వహణ తదితర అంశాలపై గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్తులకు ప్రత్యేక నంబర్లు ‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అంగుళం భూమి లెక్క తేలింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్–బిలో నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని భావిస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావాలి. ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నంబర్ల తరహాలో ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలి. తెలంగాణ భూ భాగంలోని ప్రతీ అంగుళం భూమి ఎవరి ఆధీనంలో ఉంది, అందులో ఎలాంటి కార్యకలాపాలు జరగుతున్నాయి.. తదితర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండాలి’అని సీఎం అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీ ప్రక్షాళన చేయడంతోపాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పాస్ పుస్తకంపై రైతు ఫొటో, ప్రత్యేక నంబర్ ‘పాస్ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల చాలా కాలమ్స్ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. రైతుల వద్ద ఉండే పాస్ పుస్తకాలు, పహాణీల్లో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం వంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవి రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’అని సీఎం సూచించారు. ఈ మేరకు ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలనే దానిపై విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేక నంబరు కేటాయించాలని నిర్ణయించారు. -
పట్నమెళ్లి పోతున్నారు!
ఉద్యోగావకాశాల కోసం కావొచ్చు లేదా సకల సౌకర్యాలుగల జీవన విధానం కోసం కావొచ్చు...కారణం ఏదైనా ఆసియా దేశాల్లో పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు వలసపోతున్న ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం వచ్చే పదేళ్లలో గ్రామాలను విడిచి పట్టణాల బాట పడతారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ అధ్యయనంలో తేలింది. ఆసియా దేశాల్లో, ప్రత్యేకించి భారత్‌లో పట్టణీకరణ మరింత వేగమందుకుంది. ప్రజల ఆదాయాలు పెరిగి సమాజంలో మధ్యతరగతి వారి సంఖ్య సింహభాగానికి చేరుకుంటోంది. ఆసియాలో 24.. అమెరికాలో రెండే 2014–50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని హోమీ ఖరాస్ అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఆసియాలో ప్రస్తుతం సగానికి పైగా ఉన్న గ్రామీణ జనాభా 2050 నాటికి 45 శాతం కంటే దిగువకు పడిపోతుంది. ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. పుష్కర కాలం తర్వాత ఆ సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు. కోటి జనాభా దాటిన మహానగరాలు 2030కి ఆసియాలో 24కి పెరుగుతాయని, అమెరికాలో మాత్రం వీటి సంఖ్య రెండు దగ్గరే ఆగిపోతుందని అంచనా. అలాగే కొత్తగా వలస వచ్చే వారికోసం పట్టణాల్లో గృహనిర్మాణం, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు తదితర సదుపాయాల కల్పనకు 10,400 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. తత్ఫలితంగా రియల్ ఎస్టేట్(ఖాళీ స్థలాలు, భవనాలు) రంగానికి డిమాండ్ ఉంటుందంటున్నారు నిపుణులు. పట్టణాలకు చేరే జనాభా అవసరాలను తీర్చడానికి మానవ వనరులు అవసరం కాబట్టి కొత్తగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నారు. 2030 నాటికి అతిపెద్ద మార్కెట్‌గా భారత్ ఓ అంచనా ప్రకారం మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుంది. భారత్‌లో పట్టణీకరణ ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటోంది. ఇదే ఒరవడి కొసాగితే 2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని బ్రూకింగ్స్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న వస్తువులు, సేవల్లో 60 శాతం వరకు పట్టణాల్లోని ప్రజలే కొంటున్నారు. అలాగే 2030 నాటికి చైనా, అమెరికాలను సైతం దాటి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని బ్రూకింగ్స్‌కు చెందిన హోమీ ఖరాస్ చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి
కర్నూలు(టౌన్): నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆశాఖ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో మొదటి దశలో 18,618 ఇళ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పేరుతో జిల్లాలో 1.89 లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కను జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలను జిల్లాలో 13, 733 ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ఈ– ఆఫీసు పాలన అమలు చేయాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, పట్టణ ప్రణాళిక విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, ఎమ్మిగనూర్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
-
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
తెలంగాణ పల్లెల్లో కరువు ఛాయలు తీవ్ర వర్షాభావంతో కుదేలైన వ్యవసాయం అడుగంటిన ప్రాజెక్టులు, పడిపోయిన భూగర్భ జలాలు దిక్కుతోచని స్థితిలో రైతులు, కూలీలు కరువు ప్రభావంతో పెరుగుతున్న వలసలు పనులు లేక ఖాళీ అవుతున్న ఊళ్లు నగరాలు, పట్టణాలకు తరలివెళుతున్న కుటుంబాలు సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: తెలంగాణ పల్లెలు కరువు కోరల్లో చిక్కాయి. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం వెక్కిరించింది. ఆదాయమార్గం లేక రైతన్నలకు దిగులే మిగిలింది. ఉపాధి కరువై కూలీల్లో కలవరం మొదలైంది. గత్యంతరం లేక పేద కుటుంబాలు వలసబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర వర్షాలతో ఖరీఫ్ ఆదుకోలేదు. నీళ్లు లేక రబీలో పంటలే వేయలేదు. దీంతో ఉపాధి కోసం వలసలు జోరందుకున్నాయి. ఈ సమయానికి రబీ పనులతో కళకళలాడాల్సిన పల్లెలు కళావిహీనమయ్యాయి. కాలం కలసిరాక చిన్నకారు రైతులు, పొలం పనులు దొరక్క వ్యవసాయ కూలీలు ఉన్న ఊళ్లను విడిచిపెడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక తల్లడిల్లే దయనీయస్థితిలో పట్టణాలకు బయలుదేరుతున్నారు. ఈ ఏడాది తగ్గిపోయిన సాగు విస్తీర్ణమే అసలు దుస్థితిని కళ్లకు కట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే.. ఇప్పటివరకు కేవలం 5.16 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దాదాపు 120 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే రాష్ర్టంలో నాలుగో వంతు పల్లెలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. సాధారణ వర్షపాతంకన్నా ఈ ఏడాది 33 శాతం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో అకాల వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం రైతుల కొంప ముంచింది. మరోవైపు నిరుటితో పోల్చితే జల వనరులన్నీ బాగా ఇంకిపోయాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఆందోళనకరస్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత రబీ సీజన్ ఆరంభంలో 7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలం ఈ రబీ సీజన్ ఆరంభానికి 9.70 మీటర్లకు పడిపోయింది. బోర్లు, బావుల నుంచి నీటిని తోడే భగీరథ యత్నాలకే రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో అన్నదాతలకు సేద్యం భారంగా మారింది. ఈ దుర్భర పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. ఈ ప్రభావంతో పరోక్షంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవసాయ కూలీలకు గడ్డుకాలం చిన్న సన్నకారు రైతులు ఉపాధి వెతుక్కునే పనిలో పడటంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది కూలీలు వలస వెళ్లినట్లు అంచనా. గత ఏడాది ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 6.18 లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు లెక్క తేలింది. అప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు ఎంతో ప్రయాస పడి ఈ సర్వేలో పాలుపంచుకునేందుకు స్వస్థలాలకు తిరిగొచ్చాయి. అయినా లక్షలాది ఇళ్లకు తాళాలే దర్శనమిచ్చాయి. ఈ లెక్కన వసల వెళ్లిన కుటుంబాల సంఖ్య భారీగానే ఉంటుందని అర్థమవుతోంది. కాగా, తాజాగా నెలకొన్న పరిస్థితులతో రెండు నెలలుగా పనులు దొరక్క పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాలమూరు జిల్లా నుంచే ఏటా పది లక్షల మంది కూలీలు వలసపోతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానాతో పాటు హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ర్టం నుంచి దాదాపు 15 లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. వీరిలో అప్పుల పాలైన రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక గుజరాత్లో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ వారున్నారని ఇటీవలే ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ బృందం గుర్తించింది. రైతులతో పాటు చేనేత, గీత కార్మికులు ఉపాధి కరువై గుజరాత్, ముంబాయిలో బతికేందుకు బయల్దేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది పొరుగున ఉన్న మహారాష్ట్రకు వలస వెళుతున్నారు. ఇప్పటికే సిర్పూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పనులు అరకొరగానే సాగుతున్నాయి. గత నెల రోజుల్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి పనులు కావాలని కోరుతున్న కూలీల సంఖ్య రెట్టింపైంది. కానీ ఉపాధి హామీ పనులను విస్తరించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో పేదలకు వలస మార్గమే శరణ్యమవుతోంది. కరువు మండలాలు 120 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 120 వరకు కరువు మండలాలున్నాయి. అయితే పంట కోత ప్రయోగాల (సీసీఈ) రిపోర్టు రావాల్సిన అవసరం ఉందని... అప్పుడే పూర్తిస్థాయి నివేదిక వచ్చినట్లు అవుతుందని వ్యవసాయ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. సీసీఈ రిపోర్టు వస్తే మరో 80 మండలాలు కరువు జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాటితో కలిపి రాష్ట్రంలో 200 కరువు మండలాలు అవుతాయి. సీసీఈ రిపోర్టు వచ్చాకే కరువు మండలాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీసీఈ నివేదిక రావడానికి ఈ నెలాఖరు వరకు పట్టనున్నట్లు సమాచారం. అయితే కరువు మండలాల ఎంపికలో జాగు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ వస్తున్నాయి. యంత్రాంగం నిర్లిప్తత ఫలితంగా కరువుపై కేంద్రానికి నివేదిక పంపడం ఆలస్యం అవుతుందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర బృందం పర్యటన మరింత ఆలస్యం అవుతుంది. ఫలితంగా రైతుకు అందాల్సిన పరిహారం సరైన సమయంలో అందని పరిస్థితి దాపురించనుంది. అప్పులు తీర్చేందుకు వెళ్లాడు మాకు రెండెకరాల భూమి ఉంది. పొలం సాగు చేద్దామని రూ. 30 వేలు పెట్టి బోరు వేశాం. చుక్కనీరు కూడా రాలేదు. ఉన్న భూమి బీడుగా మారుద్దని మరో చోట బోరు వేశాం. రూ. 40 వేలు ఖర్చయినా నీళ్లు పడలేదు. వ్యవసాయం చేసి అప్పులు తీర్చే మార్గం కనిపించక మరో రూ. లక్ష అప్పు చేసి మా ఆయన దేవరాజు సౌదీకి వెళ్లాడు. నేను కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. - గద్ద పద్మ, కొలనూర్, కోనరావుపేట మండలం, కరీంనగర్ వరంగల్‌లో తండాలు ఖాళీ ఉపాధి లభించే పరిస్థితి లేక వరంగల్ జిల్లాలోని పలు తండాల్లోని కుటుంబాలు వలసబాట పట్టాయి. కురవి మండల కేంద్రం శివారులోని కీమ్యా తండాలో 20 కుటుంబాలు వలస వెళ్లాయి. వారిలో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నా తండాలో 30 కుటుంబాలు, గుండ్రాళ్ళగడ్డ తండాలో 10 కుటుంబాలు పట్టణాలకు తరలాయి. పనిలేక వలసపోతుండ్రు మా తండాలో పని కరువై గిరిజనులంతా వలస పోతుండ్రు. నేను, నా భార్య, మనుమరాలు ముగ్గురమే ఇక్కడ ఉన్నాం. నా ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు. అందరూ మళ్లీ ఉగాదికి తిరిగొస్తరు. తండాలోని 50 ఇళ్లలో ప్రస్తుతం పది మంది వృద్ధులం మాత్రమే ఉన్నాం. వ్యవసాయభూమి ఉన్నా నీళ్లు లేవు. మా తండాకు రోడ్డు మార్గం లేదు. నీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం పోతున్నాం. - హఠ్యానాయక్, మల్పరేగడి తండా, అబ్బెంద, నారాయణఖేడ్ మండలం, మెదక్ -
ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్
నరసరావుపేట వెస్ట్ ప్రపంచ బ్యాంకు నిధులతో మున్సిపల్ పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు. రోల్టా ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పట్టణ హద్దులు, శాశ్వత గుర్తులు, పెద్ద భవనాలు తదితర అంశాలతో ప్లాన్ తయారు చేసే పనులు జరుగుతున్నాయన్నారు. ఆయన శుక్రవారం జిల్లా రీజనల్ డైరక్టర్ వై.వెంకటపతిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి గురవారెడ్డిలతో కలిసి రోల్టా ఆధ్వర్యంలో నరసరావుపేటలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు ఉండగా మొదటి విడతలో 76 పట్టణాలను ఈ ప్రక్రియకు ఎంపిక చేసినట్టు చెప్పారు. ఉపగ్రహ చాయాచిత్రాల సహకారంతో పట్టణాల్లో ఏ నిర్మాణం ఎక్కడ ఉంది, ఖాళీస్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రోడ్లు, డ్రైన్లు, కళాశాలలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తదితర 44 రకాల అంశాలతో ఆ సంస్థ ఒక ప్లాన్‌ను రూపొందిస్తుందన్నారు. రాబోయే 20 ఏళ్ల కాలంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు ఏవిధంగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా తగిన అవగాహన కోసం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోందని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ సంస్థ ఏవిధంగా చేస్తుందో పరిశీలించేందుకు తాను వచ్చానని చెప్పారు. పట్టణంలో సెల్లార్ల కొనసాగుతున్న నిర్మాణాల విషయాన్ని ప్రస్తావించగా గతంలో కంటే ఇప్పుడు నిబంధనలతో కఠినతరమయ్యాయని, పాటించని యజమానులు భారీగా అపరాధరుసుం చెల్లించాలని పేర్కొన్నారు. సెల్లార్లలో ఏమైనా నిర్మాణాలు కొనసాగుతుంటే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. తొలుత ఆయన పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో మ్యాప్‌లను చూస్తూ ఎక్కడెక్కడ నిర్మాణాలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, టవర్లు, కాలనీలు ఉన్నాయో పరిశీలించారు. ఆయన వెంట జిల్లా రీజనల్ డైరక్టర్ వై.వెంకటపతిరెడ్డి, టీపీవో గురవారెడ్డి, బిల్డింగ్ ఇనస్పెక్టర్లు చంద్రశేఖర్, వేణు, లోల్టా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పల్లె మహిళ పరిస్థితే బాగుంది..!
ఇంతి పని పట్టణాలు అంటే సౌకర్యాలకు నెలవులు. ఇక్కడ లభించే సౌకర్యాలు మనిషి జీవితంలో సుఖప్రదం చేస్తాయి. ప్రత్యేకించి ఆడవాళ్లకు... పట్టణ ఆవాసం చాలా కష్టాన్ని తగ్గిస్తుంది. పల్లెల్లోని ఆడవాళ్లు ఇంటిపని, వంటపని అంటూ కష్టపడాల్సి ఉంటుంది. పుర మహిళలకు మాత్రం అలాంటి కష్టమేదీ ఉండదు... అనేవి మన మధ్యన సహజంగా వినిపించే అభిప్రాయాలు. పట్టణ, పుర ప్రాంతాల్లోని జీవనశైలిని పరిశీలించి... అక్కడా, ఇక్కడ మహిళలు చేయాల్సిన, చేసే పనులను చూసి ఈ అభిప్రాయానికి వస్తుంటారు. అయితే ఈ అభిప్రాయాలు ఒట్టిభ్రమలు మాత్రమే. పల్లెల్లోని మహిళలతో పోలిస్తే చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లోనూ నివసించే మహిళలకే ఈ కష్టం చాలా ఎక్కువ అని అంటున్నారు భారత ప్రభుత్వ అధికారిక గణాంక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్వో) అధ్యయనకర్తలు. ఎన్ఎస్ఎస్వో చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం పట్టణ, నగరాల్లో నివసించే మహిళలకు ఇంటి పని చాలా భారంగా పరిణమించింది. దాదాపు 64 శాతం మంది మహిళలకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ ఏదో విధంగా ఇంటిపనులే కలవరపెడుతున్నాయి. వీరిలో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్లు అయితే అటు ఆఫీస్ పని, ఇటు ఇంటిపని రెండు భారాలనూ మోయాల్సి వస్తోంది. వీళ్లతో పోలిస్తే పల్లెల్లోని మహిళలే చాలా సుఖంగా జీవిస్తున్నట్టు లెక్క! ఇంతే కాదు అనేక రకాలుగా పరిశీలించి చూసినా... పట్టణ మహిళల కన్నా వ్యవసాయపు పనుల్లో భాగస్వామ్యులు అవుతూ ఇంటిని తీర్చిదిద్దుకొనే పల్లె మహిళల పరిస్థితే బాగుందనేది ఎన్ఎస్ఎస్వో విశ్లేషణ. అదెలా అంటే... పల్లెల్లో ఉండే మహిళకు ఇంట్లోని అత్తగారో, అదే ఊర్లో ఉండే బంధువుల తోడు ఉంటుంది. వాళ్లతో అనుబంధాన్ని బట్టి పనిని షేర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే పట్టణంలోని మహిళకు ఆ అవకాశమే లేదు. ఎవరికి వారుగా బతికే చోట పనులను పంచుకోవడం ఏముంటుంది?! అని అధ్యయనకర్తలు పరిస్థితిని తెలియజెప్పుతున్నారు. 15 యేళ్లు దాటగానే అమ్మాయిలకు ఇంటి పని ఒక బాధ్యత అవుతోందని కూడా అధ్యయనకర్తలు గుర్తించారు. పల్లెల్లోని, పట్టణాల్లోని మహిళలను కలుపుకొని చూస్తే 34 శాతం మంది పనిమనిషి ఉంటే బావుంటుందన్న కోరికను వెలిబుచ్చారు. మిగిలిన వారు మాత్రం తమ ఇంటి పనిని తాము చేసుకొంటేనే తమకు సంతృప్తి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. భారతదేశం మొత్తం మీదున్న పరిస్థితిని పరిశీలించి చూసుకొంటే... 92 శాతం మంది మహిళలకు ఇంటిపని చేయడమే పని. ఇవి భారతీయ మహిళ జీవన చిత్రం గురించి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలు. -
వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి
తిరుపతి : తిరుపతిలో పారిశుధ్యంపై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో పారిశుధ్యంపై వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల ఆధునీకరణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నారాయణ తెలిపారు. పట్టణ ప్రజల మౌలిక వసతులు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. -
పట్టణాల నుంచి 75 శాతం జీడీపీ
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి రాయదుర్గం: పట్టణాలు, నగరాల నుంచి 2030 నాటికి జీడీపీలో 75 శాతం వస్తుందని అంచనాలు చెబుతున్నాయని, పట్టణ ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి పరచాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెట్రో పొలిస్ సదస్సును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అర్బన్ ఫైనాన్స్‌పై ప్రీ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు. మన దేశంలో 62 శాతం జాతీయ ఆదాయం పట్టణ ప్రాంతాల నుంచే వస్తోందని ఇటీవ ల అహ్లూవాలియా కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని గుర్తు చేశారు. పట్ణణ ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, వసూలు చేస్తున్న పన్నులపై మరింత పరిశోధన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వృత్తి పన్ను వసూలును గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలని, అలా చేస్తే మొదటి ఏడాదిలోనే నాలుగింతలు వసూలు చేసి చూపిస్తామని అర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. వాహనాల పన్నును ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తోందని తెలిపారు. ఏడాదికి రూ.100 కోట్లు వసూలవుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌కు కేటాయిస్తే మొదటి ఏడాదే రూ.500 కోట్లు వసూలు చేసి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది గత ఏడాది రూ. 747 కోట్లు ఆస్తిపన్ను వసూలు కాగా ప్రస్తుతం రూ.1023 కోట్లు వసూలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌కే అవకాశం మెట్రో పొలిస్ సదస్సు నిర్వహణకు జోహెన్నెస్‌బర్గ్ నగరం పోటీకి వచ్చినా హైదరాబాద్‌కే అవకాశం దక్కిందని స్పెషల్ కమిషనర్ ఎ.బాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలోని 136 పట్టణాలకు చెందిన 1900 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారన్నారు. 380 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉంటారని తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మెట్రో పోలిస్ సదస్సులో చర్చలు సాగుతాయని చెప్పారు. 10న ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాలలో క్షేత్ర పర్యటన ఉంటుందన్నారు. సదస్సులో భాగంగా వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ‘షహర్ నామా’ పేరిట జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో పట్టణ సమస్యలపై రూపొందించిన 40 సినిమాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భార త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, రాజేంద్ర పచోరి వంటి ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. 100 స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ కె.రామకృష్ణారావు, అదనపు డీజీ డాక్టర్ బి.గంగయ్య, డెరైక్టర్లు వి.శ్రీనివాసాచారి, షబ్బీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
పానీ.. పరేషానీ..
పట్టణాల్లో తాగునీటి కొరత సాక్షి, హైదరాబాద్: దాహం.. దాహం.. దాహంతో రాష్ట్రంలోని పట్టణాల గొంతెండిపోతోంది.. గుక్కెడు నీళ్ల కోసం నానా యాతనా పడాల్సి వస్తోంది.. రెండు మూడు రోజులకోసారి, అదీ కొద్ది నిమిషాల పాటే జరుగుతున్న నీటి సరఫరాతో జనం హాహాకారాలు చేస్తున్నారు. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న చోట బిందెడు నీళ్ల కోసం కుస్తీలు పడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా సరఫరా అయ్యే నీళ్లు కూడా.. మురికిగా ఉంటుండడంతో తాగలేని పరిస్థితి. దీంతో రోజూ 30-40 రూపాయలు వెచ్చించి మంచినీటిని కొనుక్కోక తప్పడం లేదు. ఇలా పరిస్థితి దుర్భరంగా ఉన్నా.. జనం గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 2.4 కోట్లుకాగా.. రోజూ 3,240 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాలి.. కానీ 1,584 ఎంఎ ల్డీ మాత్రమే సరఫరా అవుతోంది. పనుల్లో జాప్యం..: ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలది. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. ప్రస్తుత అవసరాల రీత్యా నిర్ధారిత ప్రమాణాల మేరకు... ప్రతి ఒక్కరికి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లది. కానీ ప్రస్తుతం సరఫరా 75 నుంచి 80 లీటర్లకు మించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే జాతీయ పట్టణ నవీకరణ పథకంలో తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చినా.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల ప్రాజెక్టులు పూర్తయినా.. అసలు అక్కడ నీరే అందుబాటులో లేకపోవడం గమనార్హం. సమ్మర్ స్టోరేజీపై నిర్లక్ష్యం.. సకాలంలో సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్లను నింపుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. దాంతో వేసవిలో తాగునీటి సమస్య మరింతగా పెరిగింది. ఆగంతుక ప్రణాళికలు (కంటింజెన్సీ ప్లాన్) కేవలం కాగితాలకు పరిమితం అవుతున్నాయి. ప్రతీరోజూ సరఫరా చేయాల్సిన చోట 2 నుంచి ఐదారు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంటే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎన్నికలు, పన్ను వసూళ్లపైనే దృష్టి.. అసలే అంతంత మాత్రం పనిచేసే అధికార యంత్రాంగం వరుసగా ఎన్నికలు రావడంతో.. మరింత నిర్లక్ష్యం వహించింది. ఎన్నికల పనులు, విధులతో పాటు ఆస్తి పన్ను వసూళ్లపైనే అధికారులు, సిబ్బంది ఎక్కువగా దృష్టిపెట్టి తాగునీటి సరఫరాను గాలికి వదిలేశారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రధాన ఘట్టం పూర్తయినా.. ఇంకా నీటి సమస్యపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి.. తెలంగాణ ప్రాంతంలోని 70 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు, సీమాంధ్ర ప్రాంతంలోనూ తాగునీటి సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 162 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో సగానికిపైగా పట్టణాలు, నగరాల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. ప్రతీరోజు మంచినీటి సరఫరా జరిగే మున్సిపాలిటీల సంఖ్య 93 ఉంటే.. 61 మున్సిపాలిటీల్లో 2 రోజులకోసారి, 18 మున్సిపాలిటీల్లో మూడు రోజులకోసారి, రెండు చోట్ల నాలుగు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుండగా... ఐదు మున్సిపాలిటీల్లోనైతే మరీ దారుణంగా ఐదు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అదికూడా చాలా చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వచ్చినా అరకొరే..: రోజూ నీటి సరఫరా చేసే మున్సిపాలిటీల్లో గంట నుంచి రెండు గంటలపాటు ఇస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ పేరుకు రోజూ ఇస్తున్నా.. అరగంట పాటు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదు. దీంతో బయట క్యాన్ల లెక్కన నీరు కొనుగోలు చేయక తప్పడం లేదు. ఇక అపార్ట్మెంట్లలో ఉండే వారికి తాగునీరు ఏమాత్రం సరిపోని దుస్థితి. సురక్షిత నీరు అందకపోవడం వల్ల నగరాలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలు రోగాలబారిన పడుతుండడం మరింత ఆందోళనకరం. రాష్ట్రంలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, అచ్చంపేట. భువనగిరి, హుస్నాబాద్, సదాశివపేట, సూర్యాపేట, వనపర్తి, ఇల్లెందు మున్సిపాలిటీల్లో 3 రోజులకోమారు నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్‌నగర్, మదనపల్లిల్లో నాలుగు నుంచి ఐదారు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రామగుండం కార్పొరేషన్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కార్పొరేషన్‌కు నీటి సరఫరాకు రూపొందించిన పథకం రాజకీయ కారణాల వల్ల అమలుకు నోచుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లోనూ నీటి సరఫరా సరిగా లేదు. పలు చోట్ల ఫిల్టర్బెడ్లు చెడిపోయాయి. దీంతో శివారు ప్రాంతాల్లో వారానికి రెండుసార్లు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. నీళ్లు రాకున్నా.. రూ. 15,300 బిల్లు ‘‘మేము 2005లో నల్లా కనెక్షన్ తీసుకున్నం. మూడు నెలలు మాత్రమే నీళ్లు వచ్చాయి. తర్వాత ఎన్టీపీసీలోని ట్యాంకు నుంచి నీళ్లు ఇడుస్తామన్నరు. ఇప్పటిదాకా చుక్క నీళ్లు రాలేదు. కానీ మా పేరిట ఇప్పటికే రూ. 15,300 బిల్లు వచ్చింది. మేము సీఐఎస్ఎఫ్ బ్యారెక్స్ నుంచి నీళ్లు మోసుకొని తెచ్చుకుంటున్నం..’’ - తన్నీరు లక్ష్మి, నర్రశాలపల్లి, రామగుండం కార్పొరేషన్ పదేండ్ల నుంచి బోరు నీళ్లే.. ‘‘మా కాలనీకి నల్లా పైపులైన్ వేయలేదు. పదేండ్ల నుంచి మేము బోరింగ్ నీళ్లే తెచ్చుకుంటున్నం. ఇండ్లకు, బయటకు, తాగడానికి ఆ నీళ్లే వాడుతున్నం. మున్సిపాలిటీ సార్లకు ఎన్నిసార్లు మా బాధలు చెప్పుకున్నా చెవిన పెట్టలేదు. ఇప్పుడైనా పైపులైను వేసి నల్లా కనెక్షన్లు ఇస్తే మా కష్టాలు తీర్తయి..’’ - వానరాసి మైసమ్మ, జగిత్యాల -
పల్లెల్లోనూ ఈతకొలనులు
పల్లెల్లోనూ ఈతకొలనులు పరిగి, ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితమైన స్విమ్మింగ్‌పూల్ కల్చర్ క్రమంగా గ్రామాలకూ విస్తరిస్తోంది. పదేళ్ల క్రితం వరకూ ఏ ఊరిలో చూసినా వాగులు, చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీళ్లుండేవి. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 వ్యవసాయ బావులు ఉండేవి. వేసవి సీజన్లోనూ నీళ్లు కనిపించేవి. వేసవి వచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా ఈత కొడుతూ ఉల్లాసంగా గడిపేవారు. ప్రస్తుతం చెరువులు, కుంటలు ఎండిపోవడం, బావుల స్థానంలో బోరుబావులు రావటంతో ఈత కొట్టేందుకు అవకాశమే ఉండడం లేదు. ఈ నేపథ్యంలో నగరాల్లోనే కనిపించే స్విమ్మింగ్‌పూల్స్ సంస్కృతి పల్లెటూళ్లకూ పాకింది. ఇప్పటికే పూడూరు మండల పరిధిలోని చాలా ఫాంహౌస్‌లలో ఆటవిడుపు కోసం స్విమ్మింగ్‌పూల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల పరిగి పరిధిలో ఓ స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించారు. దీంతో ఫీజుకు వెరవకుండా పిల్లలు, యువకులు అని తేడా లేకుండా స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా గడుపుతున్నారు.