TPCC Working President
-
మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
నర్సాపూర్ (మెదక్): ‘‘మొన్ననే పెళ్లి చేసిండ్రు...అప్పుడే పిల్లలు పుడతాలేరంటే ఎలా..’’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తమకు పావలా వడ్డీ రుణం రావడం లేదని, ఇళ్లు రాలేదని తదితర హామీలను మహిళలు ప్రశ్నించగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంలో మోసం చేసిందని విమర్శించారు. ప్లాట్లు ఉన్న దళితులకు తమ ప్రభుత్వం రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘మొన్ననే మాకు పెళ్లి చేసిండ్రు. అప్పుడే పిల్లలు పుడుతలేరంటే ఎట్లా? మూడు నెలలే అయింది, ముచ్చటగా 3 నిద్రలు చేసినం. తొందర పడకండి, జెరా టైమియ్యిండ్రి, హామీ లన్నీ అమలు చేస్తాం’’అని జగ్గారెడ్డి చెప్పారు. -
తెలంగాణ కాంగ్రెస్.. అన్నీ ఆ ఆరుగురే! త్వరలో జాబితా విడుదల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత పని విభజన ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీ అప్పజెప్పనుంది. వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యక్షులను కూడా నియమించనుంది. ఈ క్రమంలోనే ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులకు ఏ పార్లమెంటు నియోజకవర్గం అప్పగించాలన్న దానిపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని సమన్వయకర్తగా నియమించాలని, ఒక పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు ఉపాధ్యక్షులు కలిపి మొత్తం ఆరుగురు నాయకులను ఒక లోక్‌సభ నియోజకవర్గంలో రంగంలోకి దింపనుంది. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా.. గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వరకు ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసేందుకు ఈ పని విభజన చేపడుతున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నాయకులకు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెబుతున్నాయి. ఒకవేళ వీరిలో ఎన్నికల్లో పోటీ చేసే నేతలున్నట్టైతే వారి స్థానాలకు వెళ్లిపోతారని, మిగిలిన వారంతా ఆ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పనిచేస్తారని తెలిపాయి. కిందిస్థాయి నుంచి పైవరకు అన్ని వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతతో పాటు సమన్వయం, పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల అమలు లాంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ఇన్చార్జులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి అనుగుణంగా ఎన్నికల సమయంలో పనిచేయించడంతో పాటు ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతను ఈ ఇన్చార్జులు తీసుకుంటారని, అంతర్గత సమస్యల నుంచి ఎన్నికల సంఘం సూచనల వరకు అన్ని అంశాల్లోనూ ఈ ఆరుగురు నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు అక్కడే.. స్థానిక నేతలు, పార్టీ తరఫున అసెంబ్లీ.. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఆరుగురు నేతలు వారికి కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గంలోనే పని చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ జాబితాను కూడా త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. -
‘వార్ రూమ్’ కేసులో ప్రధాన నిందితుడికి నోటీసులు.. కానీ ఇక్కడో ట్విస్ట్!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం. తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ‘ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’ పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్న జగ్గారెడ్డి.. ‘అప్పటి దాకా ఆగుతా’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సంబంధిత వార్త: తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. బయటవారి కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ అసత్య ప్రచారం చేస్తు న్నారని ఆరోపిం చారు. కాగా, తన నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు తన నియోజకవర్గంలో తక్కువగా ఉందని, ఈసారి 75 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని అనుచరులు, కార్యకర్తలను కోరారు. వచ్చేనెల 10న సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని, కార్యకర్తలు 75 వేల కంటే తక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తనను అవమానించినట్లే అవుతుందని, ఈ సభ్యత్వ నమో దును బట్టి తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 21న సోనియా, రాహుల్‌లతో బహిరంగ సభ కాగా, మార్చి 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంగారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ఏంటో ఆ సభలో వెల్లడిస్తానన్నారు. యూపీ ఎన్నికల తర్వాతే! సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున అవి ముగిసిన తర్వాతే జగ్గారెడ్డికి 10 జన్‌పథ్ నుంచి పిలుపు రావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే రాహుల్ కార్యాలయానికి సమాచారం వెళ్లగా, నేడో రేపో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హైకమాండ్‌కు లేఖ రాయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేకు సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇప్పించాలని కోరు తూ సీఎల్పీ పక్షాన ఆయన లేఖ రాయనున్నట్టు సమాచారం. అయితే, 15 రోజుల పాటు వేచి చూస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. తన మనసు మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యలు చెపుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలను కలిసేంతవరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరికి అనుకున్న పదవులు రాకపోతే, మళ్లీ పార్టీని చీల్చే కార్యక్రమం చేస్తారని, అప్పుడు కాంగ్రెస్‌నే నమ్ముకున్న తనలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఎవరిని ఉద్దేశించి జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకుంటున్నానని ప్రకటించి సంచలనం సృష్టించిన జగ్గారెడ్డితో గురువారం భట్టి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... సీఎల్పీ కార్యాలయానికి రావాలని జగ్గారెడ్డికి భట్టి ఫోన్ చేసి ఆహ్వానించారు. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉంటారని, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పడంతో జగ్గారెడ్డి గురువారం మధ్యాహ్నం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న భట్టి, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఈ భేటీకి రాజగోపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై నలుగురు నేతలు మాట్లాడుకోవడంతోపాటు వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. జగ్గారెడ్డి స్పందిస్తూ పార్టీ లో కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇబ్బందులతోపాటు తన ఆవేదనను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలతో చెప్పుకుంటానని, వారి అపాయింట్మెంట్ లభించే వరకు ఆగుతానని స్పష్టం చేశారు. అయితే, వీరి అపాయింట్మెంట్ బాధ్యతను సీఎల్పీ నేతగా భట్టి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సూచించగా కచ్చితంగా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అపాయింట్మెంట్ ఖరారు చేయిస్తానని భట్టి హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్‌ను వీడితే వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డిని ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి వెళితే మాత్రం కొత్త పార్టీ పెట్టుకుంటానని వారికి చెప్పారు. నేడు కార్యకర్తలతో భేటీ కానున్న జగ్గారెడ్డి జగ్గారెడ్డి శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే నెలలో నిర్వహించిన బహిరంగ సభ తేదీ, స్థలాన్ని ఖరారు చేయనున్నట్టు సమాచారం. -
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
టీఆర్ఎస్ అంటే ‘టోటల్ రివర్స్ స్టాండ్’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అంటే ‘టోటల్ రివర్స్ స్టాండ్’ అని మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఒక అంశం గురించి చెప్పిన మాట మీద నిలబడకుండా, పూర్తిగా దానికి విరుద్ధమైన లైన్లో వెళ్లడంలో టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పండిపోయారని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు కేవలం సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే కార్యరూపం దాల్చకుండా పోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కమీషన్లు వచ్చే అవకాశం ఉంటే వెంటనే డీపీఆర్ ఇచ్చేవారని, కమీషన్లు రావనే పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లది దొంగాట అని వ్యాఖ్యానించిన రేవంత్.. మంత్రి కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్‌కు సమాన ప్యాకేజీ అంటూ దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. -
టీపీసీసీ: కొండా సురేఖకు కీలక పదవి..!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరును అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, వాక్పటిమ లాంటివి సురేఖకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీలో కీలక పదవులు చేపట్టి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు దీటుగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. మంచి పోరాట పటిమ ఉన్న నేతగా గుర్తింపు పొందిన సీతక్క.. రాష్ట్రంలోని మహిళల సమస్యలపై మరింత క్రియాశీలకంగా పని చేస్తారనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. చదవండి: (శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..!) అయితే, మహిళా అధ్యక్షురాలి పదవి కోసం సునీతారావు, కాల్వ సుజాత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిని కూడా పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా చేయాలని, ఆమెకు కూడా కీలక పదవి కట్టబెట్టాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక, మహిళా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మరో నాయకురాలు ఇందిరా శోభన్‌లకు కమిటీల్లో సముచిత స్థానం లభిస్తుందని, మైనార్టీ వర్గానికి చెందిన నాయకురాలు ఉజ్మా షకీర్ మరికొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నేతలకు ఈసారి మార్పుల్లో మంచి అవకాశాలు లభిస్తాయనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో రచ్చ కొనసాగుతూనేఉంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఓ రకంగా దుమారాన్ని లేపుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్యాకేజీలు మాట్లాడుకున్నారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ కీలక నేతలపై మీడియాలో విమర్శలు చేశారన్న ఆరోపణలు అంతర్గతంగా వీహెచ్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై వీహెచ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులు, పేపర్లలో వచ్చిన వార్తలను మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో తెప్పించుకున్నారని, దీనిపై నివేదిక తయారు చేసి పార్టీ అధిష్టానానికి ఇస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు తాను చెంచాగిరీ చేస్తున్నానంటూ వీహెచ్ మాట్లాడడాన్ని మాజీ ఎంపీ మల్లురవి కూడా తప్పుపట్టారు. తాను పీసీసీ అధ్యక్షుడి విషయంలో మొదటి నుంచీ ఒకే విధంగా ఉన్నానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే రేవంత్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలన్న తన అభిప్రాయాన్ని అటు మీడియా ముందు ఇటు అధిష్టానం దూతలకు బహిరంగంగా చెప్పానని తెలిపారు. కమిటీలపై ఏం చేద్దాం?..: ఇక, టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఆరు కమిటీలను ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయాలను మరోమారు తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులతో రాహుల్ గాంధీ ఫోన్లో లేదంటే జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
షబ్బీర్ అలీకి కీలక పదవి!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చదవండి: ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. అయితే ఇటీవలి కాలంలో కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. -
మల్కాజిగిరికి రేవంత్ చేవెళ్లకు కొండా
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎనిమిది ఎంపీ అభ్యర్థుల జాబితాలో గ్రేటర్ పరిధిలో రెండు నియోజకవర్గాలకు చోటు లభించింది. చేవెళ్ల లోక్‌సభ స్థానం అందరూ ఊహించినట్టుగానే సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కేటాయించగా, మల్కాజిగిరికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇదిలా ఉండగా పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కేటాయించింది. దీంతో జిల్లాలోని ముగ్గురు నేతలను ఎంపీ టికెట్లు వరించాయి. రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. 2014 ఎన్నికల్లోనే టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపాడనే వార్తలొచ్చాయి. అయితే, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొడంగల్‌కే పరిమితమయ్యారు. ఆపై రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. పార్టీ ఆదేశిస్తే తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అధిష్టానం కూడా ఆయనవైపే మొగ్గు చూపి మొదటి జాబితాలోనే అవకాశం కల్పించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీలకు అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అజారుద్దీన్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. -
హామీల అమలులో కేసీఆర్ విఫలం : అజారుద్దీన్
సాక్షి, ఖమ్మంసహకారనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. ఆదివారం నగరంలోని ఎస్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ను అమలు చేయటంలో ఘోరంగా విఫలమయిందని అన్నారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతూ కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నాలగున్నరేళ్లలో సెక్రటరియేట్‌కు రాని కేసీఆర్‌ను ఇక ఫాం హౌస్‌కు పరిమితం చేయాలని అన్నారు. ప్రజాకూటమికి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాకూటమి (టీడీపీ) అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మైనార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పని చేసిందన్నారు. మైనార్టీలంతా ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరి అజ్మతుల్లా, ఏకె రామారావు, ఎండీ తాజుద్దీన్, చోటే బాబా, టీడీపీ నాయకులు బేగ్, సీపీఐ నాయకులు జానిమియా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
‘సెటిలర్స్ పదాన్ని నిషేధించాలి’
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్ బాధ్యతలు చేపట్టారు. భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపైన అభిమానంతో రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. చంద్రబాబును పదే పదే విమర్శిస్తున్న కేసీఆర్‌ను.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడా అని ప్రశ్నించారు. తరతరాలుగా తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రజలను సెటిలర్స్ అనటాన్ని ఆయన తప్పుబట్టారు. సెటిలర్స్ అనే పదాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన సీఎం ఎవరైనా ఉన్నారు అంటే అది దేశంలో కేసీఆర్ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. గెలిపించకుంటే ఫార్మ్‌హౌస్‌లో పడుకుంటా అంటున్నారని, డిసెంబర్ 7 తరువాత కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కే వెళ్లాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రులను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసి ప్రభావితం చేసిందని ఆరోపించారు. -
కేసీఆర్‌ను నమ్మించేందుకే హరీశ్ యత్నాలు: రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తనను తాను టీఆర్ఎస్కు విధేయుడిగా చిత్రీకరించుకునేందుకు మంత్రి హరీశ్‌రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, కానీ హరీశ్‌రావు జాతకం మొత్తం తెలిసిన కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను నమ్మడని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ‘కారు డ్రైవర్’ను మార్చొద్దని ఓ వైపు కేటీఆర్ విజ్ఞప్తి చేస్తుంటే.. హరీశ్ మాత్రం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే గజ్వేల్ టీఆర్ఎస్ నేత నర్సారెడ్డితో హరీశ్‌రావు గత నెల 25న రహస్య చర్చలు జరిపారన్నారు. ఈ చర్చల మరుసటిరోజు నర్సారెడ్డి ఢిల్లీ వచ్చి కాంగ్రెస్‌లో చేరారన్నారు. దీనిపై ప్రజలకు హరీశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం రేవంత్ ఢిల్లీలో మాట్లాడుతూ.. గత నెల 25న నాటి హరీశ్‌రావు అధికారిక నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలన్నారు. -
‘కేటీఆర్ బామ్మర్ది బ్రోకర్ పని చేస్తున్నాడా’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ బంధువులు బ్రోకర్ అవతారమెత్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వారికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ దన్నుగా నిలుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రేవంత్ శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బామ్మర్దికి చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే సంస్థ యువతులతో వ్యాపారం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. మ్యూజిక్ నైట్స్ పేరుతో బ్రోకర్ పనులు చేస్తున్నారని విమర్శించారు. మేమే అడ్డుకుంటాం.. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ‘సెస్సేషన్ ఈవెంట్’ నిర్వహించే మ్యూజికల్ నైట్ పార్టీపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. లేదంటే, ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా గచ్చిబౌలి వెళ్లి సెన్సేషన్ ఈవెంట్‌ను అడ్డుకుంటాని అన్నారు. అయినా, గోవా, ముంబయ్, పుణెల్లో నిషేదించిన మ్యూజికల్ నైట్స్‌కు హైదరాబాద్‌లో ఎలా అనుమతిస్తారని అన్నారు. డీలర్ల కోసమే.. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డేటింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. లేకుంటే పోలీసు పహరాలో మ్యూజికల్ నైట్స్ నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ అమ్మకానికి, డీలర్లను ఏర్పాటు చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఒక్కక్కరి దగ్గర లక్ష నుంచి 5 లక్షల వసూలు చేస్తున్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చని అన్నారు. కేటీఆర్ బంధువులైన మాదాపూర్ డీసీపీ, ఏసీపీ ఈ ఈవెంట్‌కు పహారా కాస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఇలాంటి నీచమైన పనులు చేస్తోంటే రాష్ట్రం ఏమైపోతుందని అన్నారు. అందుకే విచారణ ఆపేశారు. గతేడాది హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బార్లు, పబ్‌లలో మాదక ద్రవ్యాల అమ్మకాలపై హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని రేవంత్ ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలో పలువురు ప్రముఖులను విచారించిన వివేదికలు బయటపెట్టాని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ముఠాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువర్గం కూడా ఉండడంతో మాదక ద్రవ్యాల ఉదంతంపై విచారణ పక్కన పెట్టారని అన్నారు. -
ఐటీ అధికారుల ముందుకు రేవంత్‌రెడ్డి ..!
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణకు హాజరవాల్సిందిగా వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రేవంత్‌ను ఐటీ అధికారులు రెండుసార్లు సుదీర్ఘంగా విచారించారు. కాగా, ఈ విచారణ రెండో దశకు చేరుకుంది. ఇప్పుడు మరోసారి రేవంత్‌కు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. -
పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా : పొన్నం
సాక్షి, కరీంనగర్ : అసహనంతోనే టీఆర్ఎస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓడి పోతాననే భయంతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకు పాల్పడుతోందని విమర్శిచారు. అంతేకాక తాను పార్లమెంట్ అభ్యర్థినని.. కానీ పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజా కూటమి సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికి టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కోడ్ ఉల్లంఘనలను, అధికార దుర్వినియోగాలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించారని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కసితో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. . -
రేవంత్‌రెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు
-
ముగిసిన సోదాలు.. మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ ఆధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం గంటలకు మొదలైన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 44 గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో రేవంత్‌రెడ్డి, అతని భార్య గీతను అధికారులు విచారించారు. కాగా, రేవంత్ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. (రేవంత్ ఇంట్లో సోదాలు) సోదాలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై రేవంత్, గీతలతో సంతకాలు తీసుకున్నారని, మొత్తం మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారనీ సమాచారం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇంటిపై ఐటీ అధికారుల దాడులు జరిగాయనీ ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం మీడియాముందుకు రానున్నారు. (చదవండి : ‘ఓటుకు కోట్లు’ కొలిక్కి వచ్చేనా?) -
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ నూతన వర్కింగ్ ప్రెసిడెం ట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 10 కమిటీలను ఏర్పా టు చేస్తూ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇప్పటివరకు ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు తాజాగా పొన్నం ప్రభాకర్‌ను, రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ప్రచా ర కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్కను, కో–చైర్‌పర్సన్‌గా డీకే అరుణను నియమించారు. మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను, కో– చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు, క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్‌గా ఎం.కోదండరెడ్డి, ఎల్డీఎమ్మార్సీ కమిటీ చైర్మన్‌గా ఆరేపల్లి మోహన్, ఎన్నికల సంఘం కో–ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యా రు. సినీనటి విజయశాంతి స్టార్ క్యాంపెయినర్‌గా, ఎన్నికల కమిటీకి సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డిని పలు కమిటీల్లో సభ్యుడిగా నియమిస్తూ ప్రకట నలు వెలువడినా ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో ఆయ న పేరును తొలగిస్తూ ప్రకటనలు జారీచేశారు. కోర్ కమిటీలో 15 మంది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, పార్టీ వ్యవహారాల పర్యవేక్షక ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్.బోస్‌రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మ ద్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, జి.చిన్నారెడ్డి, ఎ.సంపత్‌కుమార్, సీహెచ్.వంశీచంద్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లు సభ్యులుగా ఉంటారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఎలక్షన్ కమిటీ ఇలా.. ఈ కమిటీలో ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జి.చిన్నారెడ్డి, మధుయాష్కీ, ఎస్.ఎ.సంపత్‌కుమార్, సీహెచ్ వంశీచంద్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎస్.జైపాల్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, రవీందర్‌నాయక్, ఆర్.దామోదర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సంభాని చంద్రశేఖర్, పి.సుదర్శన్‌రెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, సీతక్క, టి.నాగయ్య, అబీద్ రసూల్ ఖాన్, జెట్టి కుసుమ్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఎ.మహేశ్వర్‌రెడ్డి, కె.మృత్యుంజయం, పి.వినయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు 11 మంది కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క ప్రచార కమిటీని 17 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. దీనికి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా, డీకే అరుణ కో–చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దాసోజు శ్రవణ్‌కుమార్ కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా టి.జగ్గారెడ్డి, అనిల్ యాదవ్ (యువజన కాంగ్రెస్), వెంకటేశ్ (ఎన్ఎస్యూఐ), ఎన్.శారద (మహిళా కాంగ్రెస్), అబ్దుల్లా సొహైల్, బిల్యా నాయక్, కృష్ణారెడ్డి, కిరణ్‌రెడ్డి, మానవతా రాయ్ (ఓయూ), విజ య్‌కుమార్ (ఓయూ), కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, కుమార్‌రావు, హెచ్.వేణుగోపాల్ సభ్యులుగా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, కో–చైర్మ న్గా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, కన్వీనర్‌గా బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించా రు. ఈ కమిటీలో 35 మంది సభ్యులను నియమిం చారు. పొన్నాల లక్ష్మయ్య, టి.జీవన్‌రెడ్డి, ఎన్.పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, సురేశ్‌కుమార్ షెట్కర్, టి.జగ్గారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, అబీద్ రసూల్ ఖాన్, టి.నాగయ్య, ఎం.రంగారెడ్డి, పి.వినయ్‌కుమార్, అజ్మతు ల్లా హుస్సేని, వినోద్‌కుమార్, ఎం.జైపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, గీట్ల సవితారెడ్డి, మహ్మద్ సిరాజుద్దీన్, కె.ప్రేమ్‌సాగర్‌రావు, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్ బిన్ హమ్దాన్, హెచ్.వేణుగోపాల్‌రావు, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతారాయ్, విజయ్‌కుమా ర్, కోమటి రాజేశ్వర్‌రావు, సీహెచ్ కిరణ్‌రెడ్డి, ఎ.జాన య్య, ఎ.రెడ్డి (వేమన వర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్) సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు కుంతియా, ఉత్తమ్, పర్యవేక్షక బాధ్యతలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే పబ్లిసిటీ కమిటీని నలుగురు సభ్యులతో నియమించారు. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చైర్మన్‌గా, ఎస్.గంగారాం కో–చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలంగౌడ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ.. కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు, కో–చైర్మన్లుగా సర్వే సత్యనారాయణ, మధుయాష్కీగౌడ్, శ్రీధర్‌బాబు, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్.జైపాల్‌రెడ్డి, టి.జీవ న్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎంఏ ఖాన్, రాపోలు ఆనంద్ భాస్కర్, రేణుకాచౌదరి, టి.సంతోష్‌కుమార్, క్యామా మల్లేశ్, మల్లు రవి, గడ్డం ప్రసాద్‌కుమార్, నాగం జనార్దన్‌రెడ్డి, కె.దయాసాగర్‌రావు, సీహెచ్ విజయ రమణారావు, ప్రేమ్‌లాల్, నగేశ్ ముదిరాజ్ సభ్యులుగా నియమితులయ్యారు. ముగ్గురితో ఎల్డీఎమ్మార్సీ కమిటీ.. ముగ్గురు సభ్యులతో కూడిన లీడర్షిప్ డెవలప్మెం ట్ మిషన్ ఇన్ రిజర్వ్ కాన్‌స్టిట్యుయెన్సీస్(ఎల్డీఎమ్మార్సీ) కమిటీకి చైర్మన్‌గా ఆరెపల్లి మోహన్, కో–చైర్‌పర్సన్‌గా డి.రవీందర్‌నాయక్, కన్వీనర్‌గా హెచ్.వేణుగోపాలరావు నియమితులయ్యారు. ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ.. ఈ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, కో–చైర్మన్‌గా బి.కమలాకర్‌రావు, కన్వీనర్‌గా జి.నిరంజన్, సభ్యులుగా ఎ.శ్యాంమోహన్, అబీద్ రసూల్ ఖాన్, ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్, టి.నరేందర్‌రావు, టి.రాజేశ్వర్‌రావు వ్యవహరిస్తారు. ఇక క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్‌గా ఎం.కోదండరెడ్డి, కో–చైర్‌పర్సన్‌గా ఎ.శ్యాంమోహన్, కన్వీనర్‌గా బి.కమలాకర్‌రావు నియమితులయ్యారు. సభ్యులుగా నంది ఎల్లయ్య, సంబాని చంద్రశేఖర్, బి.బలరాం నాయక్, సీజే శ్రీనివాస్‌రావు నియమితులయ్యారు. 53 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఈ కమిటీ చైర్మన్‌గా ఆర్సీ కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎన్.ఎస్.బోస్‌రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, జి.చిన్నారెడ్డి, ఎ.సంపత్‌కుమార్, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎ.రేవంత్‌రెడ్డి, జె.గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, పి.బలరాంనాయక్, ఎస్.జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, రవీందర్ నాయక్, డి.శ్రీధర్‌బాబు, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, రాపోలు ఆనంద్‌భాస్కర్, మల్లు రవి, గండ్ర వెంకట రమణారెడ్డి, టి.జగ్గారెడ్డి, ఎం.భిక్షపతి యాదవ్, రేగా కాంతారావు, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, మాగం రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సి.రాంచంద్రారెడ్డి, ఎండీ సిరాజుద్దీన్, వేం నరేందర్‌రెడ్డి, కె.గౌరీశంకర్, టి.నిరంజన్, జి.నిరంజన్ నియమితులయ్యారు. వీరితో పాటు అన్ని కమిటీల చైర్పర్సన్లు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని ఏఐసీసీ తెలిపింది. -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి మల్లు విక్రమార్క మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇక్కడ గన్‌పార్క్ వద్ద నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన ప్రదర్శనకు భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. అంతేగాక ప్రస్తుతం బలమైన కూటమిగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్‌కు తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గన్‌పార్క్ వద్ద నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసన కార్యక్రమానికి భట్టి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. -
అప్పుల కుప్పలా తెలంగాణ: భట్టి విక్రమార్క
సాక్షి, అసిఫాబాద్ : మిషన్ భగీరథ పథకం పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. ఆయన బుధవారం అసిఫాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీళ్లు అందించాలనే సంకల్పంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాగునీటి పథకాలకు భగీరథ అనే పేరు మార్చి నిర్వీరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కమీషన్ల కోసమే రీడిజైన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం ప్రాణహిత-చేళ్లతో పాటు, రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను మొదలు పెట్టి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేకుండా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోవడం ఖాయమని భట్టి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపాలని ప్రజలకు భట్టి పిలుపు ఇచ్చారు. -
సీబీఐ విచారణకు సిద్ధమేనా?
ఖమ్మం : ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందన్నారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని ప్రశ్నించారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
'హరితహారం పెద్ద కుంభకోణం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకం ఓ పెద్ద కుంభకోణమని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. గురువారం హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... హరితహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మంచి కానీ... ఈ కార్యక్రమం అమలులో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతీ పథకంలో ఓ కుంభకోణం ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. ఏ ఒక్క హామీని ఆయన పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. కేజీ టు పీజీ, మైనార్టీ రిజర్వేషన్ల ఊసే లేదని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దోపిడీ, వంచన లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని డిమాండ్ చేశారు. 123 జీవోలో కేవలం భూమి కొనుగోలు గురించి మాత్రమే ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు దాని అనుబంధ సంఘాలను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అందుకోసం 30 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోచ్చామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాలోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. -
రూ. 2 లక్షల కోట్ల అవినీతికి తెర లేపిన కేసీఆర్
కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలపై టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్‌లో మల్లు భట్టివిక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు రాబోయే రోజుల్లో స్కాంలుగా మారనున్నాయని జోస్యం చేప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ తెర లేపారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పార్టీ అభివృద్ధికే నిధులు వినియోగిస్తున్నారని భట్టి విమర్శించారు.