Urvashi rautela
-
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్‌లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ దివి..కోట్ డ్రెస్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అవార్డ్ గెలుచుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. ఫోటోలు
-
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల బంగారపు డ్రెస్‌లో ఊర్వశి రౌతేలా!
ఇటీవల జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా వేదిక మీద నడుస్తూ ఉంటే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె ధరించిన అచ్చమైన బంగారంతో రూపొందించిన మణిపూర్ సంప్రదాయ బ్రైడల్ డ్రెస్ స్పెషాలిటీని చూపుతిప్పుకోనివ్వలేదు. ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో డిజైన్ చేసిన పాట్లోయ్ డ్రెస్‌లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమె బంగారు జరీ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు పాట్లోయ్ను ధరించింది. సాధారణంగా వధువులు ధరించే సంప్రదాయ దుస్తుల మధ్య ఊర్వశి అద్భుతంగా మెరిసిపోయింది. ప్రఖ్యాత మణిపురి డిజైనర్ రాబర్ట్ నౌరెమ్ రూపొదించిన ఈ దుస్తులలో మణిపూర్‌లోని మెయిటీ కమ్యూనిటీ సాంస్కృతిక గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాధారణంగా మణిపూర్ వధువులు ఈ దుస్తులను ధరిస్తారు. పాట్లోయ్ అనేది వారి సంప్రదాయంలోని ప్రత్యేకమైన, ఐకానిక్ డ్రెస్.క్లిష్టమైన వర్క్స్థూపం, డ్రమ్ ఆకారపు స్కర్ట్‌ని పాట్లోయ్ అంటారు. మణిపురి బ్రైడల్ని ప్రత్యేకంగా చూపే వాటిలో ఇది అత్యంత ముఖ్యమైనది. మందపాటి ఫైబర్, వెదురుతో డ్రమ్ ఆకారం చేసి, శాటిన్ క్లాత్‌ని చుడతారు. దానిని థ్రెడ్‌వర్క్, సీక్విన్స్, అద్దాలతో భారీగా అలంకరిస్తారు. స్కర్ట్పైన చేసే వారి హస్తకళ చాలా క్లిష్టమైనది. ఒక పాట్లోయ్ని పూర్తి చేయడానికి కొన్ని రోజుల పాటు కృషి చేస్తారు. దీనికి అలంకరణగా నడుము పట్టీ, వధువు తలమీదుగా కప్పే షీర్ వీల్, మోచేతులవరకు ఉండే జాకెట్టుతో ఈ డ్రెస్‌కు పూర్తి లుక్ వస్తుంది. ఇతర అలంకరణలో లేయర్డ్ నెక్లెస్‌లు, కోక్గీ లీటెంగ్గా పిలిచే కేశాలంకరణ ఆభరణాలు ప్రత్యేకమైనవి.పాట్లోయ్ చరిత్రపాట్లోయ్ మూలాలు మెయిడింగు భాగ్యచంద్ర మహారాజ్ (1763–1798) పాలనలో గుర్తించినట్టు చారిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతను శాస్త్రీయ రాస్–లీలా నృత్యానికి ఈ దుస్తులను పరిచయం చేశాడు. కాలక్రమేణా ఇది మెయిటీ వధువుల సంప్రదాయ వివాహ దుస్తులలో భాగమైంది. దీంతో వీరికి పాట్లోయిస్ సృష్టించే కళ తరతరాలుగా సంక్రమించింది. అధికారిక సంస్థల కంటే కుటుంబాలలో నేర్చిన నైపుణ్యాలతో పాట్లోయ్ను రూపొందించడం అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీని తయారీలో చాలా మంది కళాకారులు పాల్గొంటారు. అందుకే, దీనిని సామూహిక సమాజ ప్రయత్నంగా చెబుతారు. తన వేషధారణ ఎంపిక ద్వారా, ఊర్వశి ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా మణిపూర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో సహాయపడింది.డిజైనర్ రాబర్ట్రాబర్ట్ నౌరెమ్ ఈశాన్య భారతదేశంలోని సాంప్రదాయ ఫ్యాషన్‌ను హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అతను గతంలో సుస్మితా సేన్, హర్నాజ్ కౌర్ సంధు, లారా దత్తా వంటి ప్రముఖ వ్యక్తులకు ఇన్నాఫీ, ఫనెక్ వంటి సాంప్రదాయ మణిపురి దుస్తులలో మెరిపించాడు. ఇన్నాఫీ అనేది బ్లౌజ్‌పై ధరించే తేలికపాటి మస్లిన్ శాలువా. ఫనెక్ అనేది మణిపురి మహిళలు సాధారణంగా ధరించే చారలతో కూడిన చీరలాంటి వస్త్రం. ఈ ఏడాది గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఊర్వశి రౌతేలా చేత మణిపురి బ్రైడల్ డ్రెస్‌ను ధరింపజేసి అంతర్జాతీయ ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?) -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
ఆస్పత్రిలో బాలీవుడ్ భామ.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన చేతి వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. "నా కోసం ప్రార్థించండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. అయితే చిన్న గాయానికే ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఎర్రటి గులాబీలతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన డైహార్డ్ ఫ్యాన్స్ లక్ష గులాబీలు పంపించారంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.కాగా.. చివరిసారిగా గుస్పైథియా అనే చిత్రంలో ఊర్వశి రౌతేలా నటించింది. అంతకుముందు తెలుగులో వాల్తేరు వీరయ్య, అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
అందుకే రిషబ్ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్‌ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ ఒక క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆమె తన మేనేజర్‌తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఊర్వశి మాట్లాడిన మాటలు ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ టాపిక్ పెద్ద దుమారమే రేపింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన డ్యాన్స్ వేసిన ఈ బ్యూటికి తెలుగులో కూడా పాపులారటీ ఉంది. ఆయితే, ఆమె పర్సనల్ వీడియో అంటూ వైరల్ అయిన క్లిప్పింగ్ గురించి ఊర్వశి తాజాగా రియాక్ట్ అయింది.అందరూ అనుకునేలా ఆ వీడియో లీక్ అవడం నిజమేనని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను బాలీవుడ్లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరోకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదని ఆశిస్తున్నాను.' అని ఊర్వశి చెప్పుకొచ్చింది.ఈ విషయంపై ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. వీడియో లీక్ అయింది సరే.. మేనేజర్‌తో మాట్లాడిన కాల్ ఎలా లీక్ అయిందంటూ వారు ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు చెప్పుకొస్తున్నారు. బాత్రూమ్ వీడియో లీక్ చేసుకుంటూ సినిమా ప్రమోషన్ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఊర్వశి రౌతేలాను తిట్టిపోస్తున్నారు. ఆమె నటించిన గుస్పేటియా చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా.. సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి నటిస్తుంది. -
హీరోయిన్ ఆడియో క్లిప్ లీక్.. మండిపడుతున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్‌తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన మేనేజర్‌తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్‌గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్‌యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తెలుగు సినిమా షూటింగ్లో గాయపడ్డ హాట్ బ్యూటీ ఊర్వశి!
హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గాయపడింది. బాలీవుడ్లో ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో 'వాల్తేరు వీరయ్య' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈమెకు ఓ సీన్లో భాగంగా తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో రీసెంట్‌గానే ఊర్వశి రౌతేలా జాయిన్ అయింది. తాజాగా ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యతో పాటు చాందిని చౌదరి, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ పరిస్థితుల బట్టి రిలీజ్ డేట్ అటు ఇటు కావొచ్చని కూడా తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్‌ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఊర్వశి రౌతేలా అలాంటి కామెంట్స్.. మండిపడ్డ నెటిజన్స్!
బాలీవుడ్ భామ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో జేఎన్‌యూ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్‌తో ఈ భామ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. రిషబ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సైతం ఊర్వశి పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత వైరలయ్యాయి. వీరిద్దరు చాలాసార్లు ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, పార్టీల్లో కనిపించడంతో డేటింగ్లో ఉన్నారని ఫ్యాన్స్ భావించారు. కానీ వీటన్నింటినీ రిషబ్ పంత్ కొట్టి పారేశాడు. ప్రస్తుతం రిషబ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఊర్వశి తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో మెరిసింది. ఓ మ్యాట్రిమోనీ సైట్‌కు సంబంధించిన ప్రకటనలో నటించింది. అయితే ఇందులో 'ఎవరు కూడా నా అంత ఎత్తు కలిగిన వారు దొరకడం లేదంటూ' నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రకటనలో భాగంగా చెప్పుకొచ్చింది. కానీ ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఆమె రిషబ్ పంత్‌ను ఉద్దేశించి అలా మాట్లాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్‌ను అవమానించిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ఊర్వశి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. అయితే యాడ్ స్క్రిప్ట్ తనకు ఆ కంపెనీ అందించిందేనని.. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి పాజిటివ్ తీసుకోవాలని సూచించింది. ఒక బాధ్యతగల వ్యక్తిగా బ్రాండ్ అంబాసిడర్‌గా నా వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఊర్వశి ప్రస్తుతం జేఎన్‌యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్‌ఫుల్ డ్రెస్‌లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్‌లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్‌లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఐటం సాంగ్స్‌తో రఫ్ఫాడించిన బ్యూటీ.. రాజకీయాల్లోకి?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా పార్టీ స్థాపించారు. తాగాజా ఊర్వశి రౌతేలా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పలు పార్టీలు సినీతారలకు టికెట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇన్స్టంట్ బాలీవుడ్‌తో మాట్లాడిన రౌతేలా, "నాకు ఇప్పటికే టిక్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి" అని అన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయాలని వెల్లడించింది. ఊర్వశి రౌతేలాకు ఎలక్షన్ టికెట్ ఇచ్చారని వెల్లడించింది. కానీ.. ఏ పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బర్త్‌డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్‌గా గడుపుతారు. రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్‌డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్‌గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్‌డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్‌గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
అలాంటి అవుట్‌ఫిట్‌లో దేవర భామ.. వాలెంటైన్ డే వైబ్‌లో ఊర్వశి రౌతేలా!
రెడ్ డ్రెస్‌లో మత్తెక్కిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్.. వాలెంటైన్ ప్రపోజ్ డే మూడ్‌లో ఊర్వశి రౌతేలా.. యోగాసనాలతో మైమరిపిస్తోన్న శ్రద్ధాదాస్.. గ్రీన్ డ్రెస్‌లో రవీనా టాండన్ హోయలు.. హాట్ ట్రీట్ ఇస్తోన్న బాలీవుడ్ భామ నిక్కి తంబోలి.. రెడ్ డ్రెస్‌లో రీతూ చౌదరి పోజులు.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్
భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. అన్ని చోట్లా వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కువైంది. ఈసారి భారత్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా భారత్ తనదైన ప్రదర్శనదో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. భారత్ గెలుస్తుంటే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఈ జట్టులో చాలా మంది మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు రిషబ్ పంత్‌ని గుర్తుచేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్‌కు రిషబ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఊర్వశి రౌతేలా, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా భారీగానే నడిచింది. అప్పట్లో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఎవరూ ఖండిచలేదు. తాజాగా ఊర్వశి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెప్పే నటి. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ స్టోర్ట్స్ డ్రెస్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో అది. దీనితో పాటు 'కొత్త అధ్యాయం, కొత్త సినిమా' అని రాసి ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ‘కీడా కోలా’ మూవీ రివ్యూ) ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా చుట్టు ఎప్పుడూ కొంత వివాదం ఉన్న మాట నిజం. అందులో రిషబ్ పంత్‌తో వివాదం కూడా ఒకటి. ఆ వ్యక్తి (రిషబ్) తనకు చాలాసార్లు ఫోన్ చేశాడని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఊర్వశి కూడా క్షమాపణలు చెప్పింది. మళ్లీ తాజాగా కొత్త సినిమా కోసమే అంటూ.. వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో రిషబ్ పంత్ గొడవను మళ్లీ తెరపైకి తెస్తుందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. ఊర్వశి రౌతేలా తన వికెట్ కీపింగ్ వీడియోలో కీపర్ ఉపయోగించాల్సిన గ్లౌజులు కాకుండా బ్యాటింగ్ గ్లౌజులను ఉపయోగించింది. దీనిని గమనించిన నెటిజన్లు ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. 'ఆమె బ్యాటింగ్ గ్లౌజులతోనే ఆట ఆడుతుంది.. ఎందుకంటే ఆమెకు ధైర్యం ఉంది' అంటూ ఫన్నీగా అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. మరోకరు రిషబ్ పంత్ రీప్లేస్ మెంట్ దొరకలేదా..? అంటూ కామెంట్ చేస్తే.. 'రిషబ్ పంత్ లైట్ వెర్షన్' అని మరొకరు వ్యాఖ్యానించారు ఊర్వశి పోస్ట్ చేసిన వీడియోతో రిషబ్ పంత్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన ట్రోల్ అవుతున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా?
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్‌ను అందుకుంది.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్‌లు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్ ముగిసిపోయిందని అనుకుంది. (ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ) సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్‌ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్‌తో కూడా ఆమె డేట్ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్‌లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్‌లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్‌బై చెప్పేసింది. ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్‌తో లైఫ్‌లో సెటిల్ కావచ్చని ఆమె కలలు కనేది. అలా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్ పంథీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్ తిప్పికొట్టాడు. మొదట రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు,స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని వార్తలు వచ్చాయి. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్కమ్ సోర్స్ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్‌తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్‌లో ఎక్కువ క్రేజ్ అట. అక్కడి షేక్స్ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్‌ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్‌తో డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. -
ఫోన్ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాలలో ప్రత్యేక సాంగ్‌తో అలరించిన ఈ మ్యూటీ తెలుగువారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'లో బిగ్‌బాస్-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్) దీంతో పోలీస్‌స్టేషన్‌లో కూడ ఫిర్యాదు చేసింది. కానీ తన ప్రయత్నంగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్‌ను కూడా షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా చేసిన ట్వీట్‌కు ఫలితం దక్కింది. ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. 'మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి.' అని ఆ వ్యక్తి కండీషన్ పెట్టాడు. దీంతో ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్ అప్ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్ తెచ్చి ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్‌లోనూ ప్రత్యేక సాంగ్‌తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్‌ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్‌లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్‌ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
IND Vs Pak మ్యాచ్: గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు పెద్ద కష్టమే వచ్చింది. శనివారం నాడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందీ బ్యూటీ. ఈ క్రమంలో సదరు స్టేడియంలో తన ఫోన్ పోగొట్టుకుంది. అది 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గోల్డ్ ఐ ఫోన్ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దొరికినవాళ్లు దయచేసి తనకు తిరిగివ్వాలని కోరింది. ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేసింది. మరి ఆ జనసంద్రంలో ఊర్వశి పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి దొరుకుతుందో, లేదో చూడాలి! కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాక్‌కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. ఇక ఊర్వశి రౌతేలా విషయానికి వస్తే.. 'సింగ్ సాబ్ ద గ్రేట్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె సన్నీడియోల్‌కు జంటగా నటించింది. సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్‌పంతి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఐటం సాంగ్స్ ద్వారానే సుపరిచితురాలైంది. 'వాల్తేరు వీరయ్య'లో బాస్ పార్టీ, 'ఏజెంట్'లో వైల్డ్ సాలా, 'బ్రో'లో మై డియర్ మార్కండేయ, 'స్కంద'లో కల్ట్ మామా.. ఇలా వరుసగా ఐటం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశి హిందీలో 'దిల్ హై గ్రే' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్ ఆఫ్ కొత్త హిందీ వర్షన్.. ఎప్పుడు? ఎక్కడంటే? -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఈఫిట్ టవర్‌ను వన్డే వరల్డ్ కప్‌ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan)