varla ramaiah
-
‘జగనన్నకు చెబుదాం’పై టీడీపీ నీచ రాజకీయం.. వర్ల రామయ్య పైత్యం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ సెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూకుమ్మడిగా ఫోన్లు చేశారు. వెటకారంగా మాట్లాడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నుంచే వర్ల రామయ్య.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనతోపాటు మరో 20 మంది పార్టీ నేతలు, కార్యకర్తలను మీడియా సమావేశంలో కూర్చోబెట్టి వారితో 1902 హెల్ప్‌లైన్‌కి ఒకేసారి ఫోన్లు చేయించారు. తాను కూడా తన ఫోన్ నంబరు, ల్యాండ్‌లైన్ నంబర్ల నుంచి ఫోన్ చేశారు. హెల్ప్‌లైన్‌లో మాట్లాడుతున్న ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ, వెటకారం చేస్తూ వర్ల రెచ్చిపోయారు. ‘నీ పేరేంటి.. నీ ఫోన్ నంబర్ చెప్పు.. నీ దుంప తెగ.. నువ్వు చాలా తెలివైనవాడివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా? అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించేస్తామన్నారుగా..’ అంటూ ఉద్యోగిని వేధించారు. ‘సీఎం జగన్ అవినీతి చేస్తున్నారు.. ఫిర్యాదు రాసుకో అంటూ’ ఉద్యోగిని చాలాసేపు ఇబ్బంది పెట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమమైన ‘జగనన్నకు చెబుదాం’ను అడ్డుకోవడం, దానిపై బురద జల్లడమే లక్ష్యంగా వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ తన నీచ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను వేధించడానికి, వారి విధులకు ఆటంకం కలిగించడానికి చేసిన ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. -
తప్పు చేయకపోతే భయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి తప్పూ చేయకుండా పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినీతి దురుద్దేశం ఉన్నప్పుడు ఎందుకు విచారించకూడదని ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని భావించిన తర్వాతి ప్రభుత్వం, వాటిని సమీక్షించకూడదంటే తప్పు జరిగినట్లు వందశాతం అంగీకరించినట్టే (ఇమ్యూనిటీ ఇచ్చినట్లే) కదా అని వ్యాఖ్యానించింది. ఇలా సమీక్షించడం ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకమా అని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదా అని నిలదీసింది. పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా , శాశ్వతంగా తప్పించుకోలేరు కదా అని వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు స్వీకరించలేదన్న కారణంతో తప్పు ఏమీ జరగనట్లేనని ఎలా భావించాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, అమరావతి భూసేకరణ, ఫైబర్‌నెట్ తదితర అంశాలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గురువారం వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందంలో అందరూ వారి పార్టీ వారేనని ఆరోపించారు. న్యాయమూర్తి జస్టిస్ షా స్పందిస్తూ.. గత ప్రభుత్వం చేసిన పనులపై తర్వాతి ప్రభుత్వం సమీక్షించకూడదా అని ప్రశ్నించారు. పాలన వ్యవహారాలైతే తప్పకుండా పరిశీలించొచ్చని దవే అన్నారు. దురుద్దేశపూర్వకమైన పాలనా వ్యవహారమైతే విచారణ చేపట్టొచ్చుకదా అని జస్టిస్ షా మరోసారి ప్రశ్నించగా.. రాజకీయపరమైన ఉద్దేశాలైతే విచారణలను నియంత్రించాలని దవే అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడని వారు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించడంలో ఉద్దేశం తెలుసుకోవాలన్నారు. నిజ నిర్ధారణ బృందం నివేదిక పరిశీలించిన సభాపతి దర్యాప్తు చేయమని ఆదేశించారని అన్నారు. నిజ నిర్ధారణ బృందంలో రాజకీయ నేతల గురించి తాను మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, విచారణకు సీబీఐ చేతులు ఎత్తేసిందన్నారు. సీబీఐ నిరాకరించినంత మాత్రాన దురుద్దేశపూర్వక వ్యవహారాలు జరగలేదని ఎలా భావించాలని, ఈ విధంగా ఎలా ఊహించుకుంటారని జస్టిస్ షా ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన తర్వాత దురుద్దేశ చర్యలపై వీకే ఖన్నా తీర్పును దవే ప్రస్తావించారు. పక్షపాతం ఉంటే న్యాయపరమైన చర్యలకు వెళ్లొచ్చని ఆ తీర్పులో ఉందని జస్టిస్ సుందరేశ్ చెప్పారు. ఈ కేసు విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నామని, కేవలం రాజకీయ కక్షలు మాత్రమే నిజాలను వెలికితీస్తాయని భజన్‌లాల్ తీర్పు చెబుతోందని జస్టిస్ షా గుర్తుచేశారు. మీరు పారదర్శకంగా ఉంటే ఆందోళన ఎందుకని దవేనుద్దేశించి అన్నారు. ఈ వ్యవహారంలో అధికారులేమైనా ప్రకటన చేస్తే సీఆర్పీసీ వర్తించడంతోపాటు అరెస్టులు ఉంటాయని దవే తెలిపారు. గోద్రా ఘటన ఎఫ్ఐఆర్ల గురించి దవే ప్రస్తావిస్తుండగా అవి అవసరం లేదని జస్టిస్ ఎంఆర్ షా చెప్పారు. దవే వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ జీవో ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందన్నారు. సిట్ కూడా చీకట్లో దేని కోసమో వెతుకుతున్నట్లు ఉందన్నారు. దీనికి జస్టిస్ షా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెదుకుతారని, విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. వాదనలకు సంబంధించి క్లుప్తంగా కోర్టుకు అందజేయాలని ఇరుపక్షాలకు ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కొన్ని అంశాలు ప్రస్తావించాలని పేర్కొనగా ఒక్కో పక్షం నుంచి ఒకరికే అవకాశం ఇస్తామని, ఇది అందరికీ వర్తిస్తుందని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జిపై సీజేఐకి సీఎం లేఖపై విచారణ వాయిదా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సీజేఐకి రాసిన లేఖలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. న్యాయవాదికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలేమిటని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించగా.. సీజేఐకి ముఖ్యమంత్రి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గతం చేశారని, ఈ పద్ధతిని అనుమతించకూడదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయకుండా హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ పిటిషన్‌ను వేరు చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబరు 12కు వాయిదా వేసింది. ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై సిట్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ గురువారంతో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీం ధర్మాసనం. అంతకు ముందు విచారణ సమయంలో జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా? అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా?.. దురుద్దేశం లేదని చెప్పేందుకే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యం వల్ల ఎంక్వేరీ చేయవద్దా?. గత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఎలా?. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధానాలు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన సిట్ పై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇక వర్లరామయ్య తరపు న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై జివో ఇచ్చారని, అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటుచేశారని వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది. ఇదీ చదవండి: అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ -
అవినీతి దురుద్దేశాలపై దర్యాప్తు చేయొద్దా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవినీతి చేయాలనే దురుద్దేశాలపై దర్యాప్తు చేయకూడదా? ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం వృథా, దుర్వినియోగం లాంటివి ఉంటే దర్యాప్తు వద్దా..?’’ అని టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. కోర్టు సమీక్ష అధికారాలను ప్రభుత్వాల సమీక్ష అధికారాలతో పోల్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం. ఆర్. షా గతంలో ఇచ్చిన ఓ తీర్పులో కొంత భాగాన్ని సింఘ్వి చదివి వినిపించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చు.. రాజకీయ శత్రుత్వంతో కమిషన్ల నియామకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు పలు తీర్పులు ఇచ్చాయని సింఘ్వి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జగన్నాధరావు కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో కొంత భాగాన్ని చదివి వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్టే ఇస్తే ఇక విచారణ అధికారం రాష్ట్రానికి ఎక్కడుంటుందని, ఇలా చేయడం దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడమేనన్నారు. ఎఫ్ఐఆర్పై విచారణ చేయవద్దని అనడం అవగాహన లేకపోవడమేనని, ఇది జాతీయ దర్యాప్తు సంస్థ విచారించదగిన కేసు అని పేర్కొంటూ సింఘ్వి వాదనలు ముగించారు. సీబీఐ విచారించాలా వద్దా? అనే అంశంపై చర్చిద్దామని ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్ కేసుల కోసమే.. టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపిస్తూ ఇది పాలనా ప్రతీకార కేసుగా అభివర్ణించారు. సిట్ ఉద్దేశం నిజ నిర్ధారణ మాత్రమే కాదని, క్రిమినల్ కేసులతో అనుసంధానానికి మార్గాలను అన్వేషించేందుకేనని ఆరోపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది. ఎక్కడ దుర్వినియోగం జరిగిందో చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చి సిట్ ఏర్పాటు చేశారని దవే పేర్కొన్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం ఏకపక్షంగా ఉందన్నారు. ఎలాంటి దర్యాప్తు నివేదిక రాకుండా అలా ఎలా అంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి కూడా కేబినెట్ సబ్కమిటీల సమావేశానికి హాజరయ్యేవారని దవే పేర్కొన్నారు. కొందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటైందన్నారు. పాలనా చర్యలంటూ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి? అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ నివేదిక వచ్చే వరకు ఆగలేరా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కీలక విధాన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని మేం కోరాం. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. తదుపరి విచారణను రేపటి(గురువారం)కి వాయిదా వేశారు. చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!) -
అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
సిగ్గుమాలిన మనిషి.. ఈ వీడియో చూసి బాబు,వర్ల సిగ్గు తెచ్చుకోవాలి
-
టీడీపీ నేత ‘వర్ల’ తనయుడిపై కేసు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): టీడీపీ నేత వర్ల రామయ్య తనయుడు, కృష్ణాజిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్‌రాజా (రాజా)పై కేసు నమోదైంది. డివిజన్ అభివృద్ధి పనుల కోసం నిర్మించిన శిలాఫలకం దిమ్మె కూల్చివేయడం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన ఘటనపై విజయవాడలోని భవానీపురం పోలీసులు కుమార్‌రాజాపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ విద్యాధరపురం 44వ డివిజన్ చిన్న సాయిబాబా గుడి ఎదురుగా అంబేడ్కర్ నగర్లో మంచినీటి పైపులైన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనుల శంకుస్థాపన కోసం అంబేడ్కర్ నగర్ ఆర్చి వద్ద శిలాఫలకం ఏర్పాటుచేసేందుకు కాంట్రాక్టర్ శేఖర్ దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంత లో వర్ల కుమార్‌రాజా అక్కడకు వచ్చి శిలాఫలకం నిర్మాణం చేయొద్దంటూ అడ్డుకున్నారు. ఆర్చికి అడ్డువస్తుందంటూ వాగ్వాదానికి దిగి చంపేస్తానంటూ కాంట్రాక్టర్‌ను బెదిరించారు. అంతటితో ఆగక దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ శేఖర్ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ ఏఈ ఇస్సార్ అహ్మద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కుమార్‌రాజాపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతుంటే జీర్ణించుకోలేక ఇలా ధ్వంస రచన చేయడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. పేదలకు తాగునీరు అందడం వర్ల రామయ్య, ఆయన తనయుడుకు ఇష్టంలేదా అని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక
సాక్షి, అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు వర్ల రామయ్య తరచు ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి తప్ప అధికారులను తరచుగా వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడేటప్పుడు పదప్రయోగం అత్యంత ముఖ్యమన్నారు. ఇదే రకమైన వ్యవహారశైలి కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాబు, లోకేష్‌లకే కాసినో గురించి బాగా తెలుసు
సాక్షి, అమరావతి: కాసినోలు, అశ్లీల నృత్యాల గురించి చంద్రబాబు, లోకేష్‌లకు బాగా తెలుసని రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో మహిళలతో అర్ధ నగ్నంగా, చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని చేసిన వేషాలను అందరూ చూశారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కల్యాణ మండపంలో కాసినో, జూదం నిర్వహించినట్టు రుజువు చేస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో చంద్రబాబు చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది, చేస్తోంది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పటికీ మహిళలను అడ్డు పెట్టుకుని బతుకుతున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. గతంలో లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. మరో మహిళను అడ్డుపెట్టుకుని బ్రోకర్ పని చేసి సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని చెప్పారు. చివరికి కట్టుకున్న భార్యను కూడా రాజకీయాల కోసం రోడ్డుపైకి తెచ్చారన్నారు. రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడని వ్యాఖ్యానించారు. రెండు వారాలుగా గుడివాడలో లేను తాను గత రెండు వారాలుగా గుడివాడలో లేనని, కోవిడ్‌తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిæ కేబినెట్ మీటింగ్ కోసం వచ్చినట్టు తెలిపారు. అటువంటిది చంద్రబాబు పెట్టే పెడిగ్రీ తింటూ.. ఆయన ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, మొరిగే తొత్తులు గుడివాడలోని తన కల్యాణ మండపంలో ఏదో జరిగిపోతోందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూట్రల్ మీడియా గుడివాడ వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకుని ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారని, ఇంకా సిగ్గూ, శరం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ గుడివాడ వెళ్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయన్నారు. ఎక్కడో డ్యాన్సులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తే.. తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించానని చెప్పారు. చంద్రబాబు కాదు కదా.. ఎవరొచ్చినా గుడివాడలో ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. -
Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు. చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. -
పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళి అమలు చేయకపోవడం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది. మరోవైపు ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని కోరుతూ జనసేన నేత శ్రీనివాసరావు, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సత్యనారాయణమూర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, వి.వేణుగోపాలరావు, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వ్యయం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని వేదుల నివేదించారు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. అయితే వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఆయనకు లేదని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వర్ల చెబుతున్నందున ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుందని, దీనిపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని, ఎన్నికలను రద్దు చేస్తే మళ్లీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది ఖజానాపై భారం మోపడమే అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని వివరించారు. ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. జనసేన తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికలలో బలవంతపు ఉపసంహరణలు జరిగాయన్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనల గురించి అప్పటి ఎన్నికల కమిషనర్ కేంద్రం దృష్టికి తెచ్చారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదు
గుంటూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీసులపై పలు రకాలుగా ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగు పులమడం సరికాదని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంకు చెందిన బాణావత్ యలమంద నాయక్‌ను ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమారుడు ప్రసన్నకుమార్‌కు సీఆర్పీసీ నోటీసును అందజేసిన తర్వాతనే రెవెన్యూ అధికారి సమక్షంలో పోలీసులు అరెస్టు చేశారన్నారు. లిక్కర్ కేసులో నాయక్ ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిన అనంతరం చర్యలు చేపట్టామన్నారు. కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడామని చెప్పడం సరికాదన్నారు. రిమాండ్ కోసం వైద్యుల వద్ద పరీక్షలు జరిపామని, అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచినప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడే చెప్పాల్సి ఉందన్నారు. రిమాండ్ అనంతరం యలమంద నాయక్ తనను కిడ్నాప్ చేసి దుర్భాషలాడి కొట్టారని చెప్పడం ఎంతవరకు వాస్తవమో గుర్తించాలని అన్నారు. గురజాల డీఎస్పీ, సీఐలు ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గుర్తించి వారికి చార్జి మెమోలు జారీ చేశామని, ఆపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు నివేదిక పంపానని, దీని ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారన్నారు. -
వర్లకే అలా..ఇక మనకెలా!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీకి విధేయుడు, సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకే ఇలా జరిగితే పార్టీలోని ఇతరుల పరిస్థితిపై టీడీపీలోని ఎస్సీ వర్గాల నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లోనూ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైన జేఆర్ పుష్పరాజ్‌ను రాజ్యసభకు పంపుతున్నట్లు చివరి నిమిషం వరకు చెప్పి మోసం చేయడాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు గుర్తుచేస్తున్నారు. దళిత నాయకులు, కార్యకర్తలు జెండాలు మోయడానికి, పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ పదవులు కట్టబెట్టడానికి తప్ప అధికార పదవుల విషయంలో ఎన్నడైనా ప్రాధాన్యమిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా పేద వర్గాలతో ఆడుకోవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీనియర్ నాయకులు గుర్తుచేస్తున్నారు. ►అధిష్టానం వర్ల రామయ్యకు మూడు పర్యాయాలు అగౌరపరిచింది. ఎన్నికల బరిలో తలపడిన ప్రతిసారీ చివరకు అనుయాయులు అయ్యో! రామయ్య!! అనే సానుభూతిని మిగిల్చింది. ►గుంటూరు జిల్లా గురజాల ప్రాంతానికి చెందిన వర్ల రామయ్య పోలీసు శాఖకు రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లాలో పనిచేసినందున విస్తృత పరిచయాలు ఉన్నాయని, రిజర్వుడు స్థానం నుంచి పోటీకి అవకాశం కలి్పంచాలని అధిష్టానాన్ని కోరినప్పుడు 2009 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆఖరు నిమిషంలో ఆదేశించారు. తిరుపతిలో అన్నీ తానే చూసుకుంటానంటూ భరోసా ఇచ్చి సాగనంపారు. ఆ ఎన్నికల్లో వర్ల ఓటమి పాలయ్యారు. ►2014 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్టు ఆశించిన రామయ్య తన సామాజిక వర్గం, విస్తృత పరిచయాలు ఉన్నందున నందిగామ, తిరువూరుల్లో ఏదో ఒక స్థానం కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. కాని పామర్రులో పోటీకి దింపారు. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు నియోజకవర్గ పరిధిలో సానుకూల ఓట్లు రాగా వర్ల ఓటమి పాలయ్యారు. ►2019లో ఏకంగా టిక్కెట్టుకే ఎగనామం పెట్టారు. వైఎస్సార్ సీపీ నుంచి కొనుగోలు చేసిన ఉప్పులేటి కల్పనకు పామర్రు టికెట్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ►పార్టీకి తగినంత బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల బరిలోకి వర్లను దింపి ముచ్చటగా మూడోసారి ఓటమిని మూటకట్టుకునేలా ఆయన పేరిట రికార్డు చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి మాత్రం దక్కింది. స్వామిదాసు కుటుంబానికీ మొండిచేయి.. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు ఆ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వలేదు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన తన సతీమణి నల్లగట్ల సుధారాణికి అయినా టికెట్ ఇవ్వాలని స్వామిదాసు కోరారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కె.ఎస్.జవహర్‌ను తిరువూరు నుంచి పోటీ చేయించారు. ►గుంటూరు జిల్లాకు చెందిన జేఆర్ పుష్పరాజ్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, రెండు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 రాజ్యసభ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆశపెట్టి టీజీ వెంకటేశ్‌కు ఆ సీటును కట్టబెట్టారు. భారీ మొత్తం తీసుకునే టీజీకి సీటిచ్చారనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వచ్చిన సంగతి తెలిసిందే. ►గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి మధ్యలో తొలగించారు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయని సాకుగా చూపారు. పశి్చమగోదావరి జిల్లాకు చెందిన రిజర్వుడు వర్గానికి చెందిన పీతల సుజాతను కూడా మధ్యలోనే మంత్రి పదవి నుంచి పక్కనపెట్టేశారు. అదే మంత్రి వర్గంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పట్టించుకోలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎన్ని అరాచకాలు చేసినా తన సామాజికవర్గం అయినందున చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. -
‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఆరునెలలు ముందుగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ అందించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు ఇచ్చినందుకు ఆయన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ధర్మవరంలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తన పాలనతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం నేతృత్వంలో కొత్త పథకాలు పరంపర కొనసాగుతుందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. (శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్) ‘‘రాజ్యసభ ఎన్నికలతో టీడీపీ పతనం అయ్యింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 6 కి పెరిగింది. టీడీపీకి ఒక్కటే మిగిలింది. దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలి పశువు చేశారు. ఓడిపోయే సీటు వర్లకు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దళితులకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు. ఆయన సామాజిక వర్గం వారికే చంద్రబాబు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. ఆదిరెడ్డి భవాని ఓటు తప్పుగా వేసిందో, ఉద్దేశపూర్వకంగా వేసిందో తరువాత తెలుస్తుంది. దళితులైన మోత్కుపల్లి, పుష్పరాజ్, వర్లకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని’ సుధాకర్‌బాబు దుయ్యబట్టారు. గెలిసే సీటు ఆయన సామాజిక వర్గం వారికి, ఓడిపోయే సీటు దళితులకు ఇచ్చారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. లోకేష్ ను ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తున్నారని సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు. ('కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు') -
అందుకే వర్ల రామయ్యను బరిలోకి..
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానాల పాలు చేశారనే ఆగ్రహం పార్టీలో వ్యక్తమవుతోంది. నాలుగు రాజ్యసభ స్థానాలూ సంఖ్యాబలం దృష్ట్యా వైఎస్సార్ సీపీకి దక్కడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా దళిత వర్గాన్ని మోసం చేసేందుకే చంద్రబాబు రామయ్యను బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలకు అనివార్యంగా ఎన్నికలు వచ్చేలా చేసి చివరికి తమకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలతోనూ పూర్తిస్థాయిలో ఓట్లు వేయించుకోలేక అభాసుపాలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వర్లకు పూర్తి స్థాయిలో పడలేదని స్పష్టమవుతోంది. పోటీలో ఉన్నది దళిత నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్‌పై.. గెలిచేటప్పుడు మీ సొంత కులం వారికి, ఓడేటప్పుడు దళిత నేతకు సీటిస్తారా? అని రాసి ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీలో దళితులకున్న గౌరవం ఏపాటిదో దీనిద్వారా స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. (నలుగురూ నెగ్గారు ) ► ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజికవర్గానికి చెందిన వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చి సీట్లిచ్చారు. ఇప్పుడు ఓడిపోయే సీటును దళిత వర్గానికి కట్టబెట్టారు. ఆరేళ్లలో ఒక్క దళితుడు, ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపకపోగా నమ్మించి మోసం చేశారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా తన సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ► 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపినప్పుడు ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు కేటాయించారు. మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన సన్నిహితుడైన సుజనా చౌదరికి చంద్రబాబు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి అవమానించి పంపారు. ► 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి అవకాశం ఇచ్చారు. మరో సీటు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. -
డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడినట్లు నిరూపిస్తారా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం) : అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు వ్యవహారంపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో దీనిని మేనేజ్ చేయడానికి తాను రంగంలోకి దిగినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణలను ఖండించారు. (స్థానికులే చేతులు కట్టేశారు) డాక్టర్ సుధాకర్‌తో గాని, వాళ్ల అమ్మతో గాని నేను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్ విసిరారు. మేనేజ్ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్ చేయగలరని విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ డిమాండ్ చేశారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. (డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్) -
వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తిస్తుంటే వర్ల రామయ్య పోలీసు వ్యవస్థపై అవాస్తవ ఆరోపనలు చేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయే విధంగా, పోలీసుల మనోభావాలు దెబ్బవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ముందు అందరూ సమానమే. అందులో ప్రత్యేకంగా పోలీసు శాఖకు కోర్టులపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఒక మాజీ పోలీసు అధికారి అయివుండి, కోర్టులపై మీసాలు తిప్పి, తొడలు కొడుతూ సవాలు విసరడం మీ అజ్ఞానాన్ని అవగహనారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సమాజంలో జరిగిన ఏ సంఘటన పై అయినా, సరైనా వివరాలు అవసరమై సందర్భరాల్లో విధినిర్వహణలో భాగంగా అధికారులను కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడం సాధారణం. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కోర్టుల ఆదేశాల మేరకు హాజరై వివరాలు తెలిపారు. అదే విధంగా డీజీపీ కూడా విధినిర్వహణలో భాగంగా, బాధ్యత గల అధికారిగా కోర్టులో హాజరై వారి ఆదేశాలను పాటించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ విధినిర్వహణలో సమర్థత, వారి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన గుర్తింపు గల అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. వర్ల రామయ్య లాంటి వ్యక్తుల తప్పుడు ప్రకటనలు ఎవరూ నమ్మరు. మాచర్ల ఘటనలో ఐపీసీ 307 ప్రకారం కేసు నమోదు చేశాము. వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తే.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కళ్లుండి చూడలేని మీరు ఇకనైనా మీ కళ్లకు పట్టిన పచ్చకామెర్లను వదిలించుకుని వాస్తవాలు తెలుసుకుని అవగహనతో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమాను మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హెచ్చరిస్తోంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఓడిపోతారని తెలిసే టికెట్ ఇచ్చారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతలకు నమ్మకం పోయిందన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసే టీడీపీ ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు దళితులకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వలేదని.. ఇప్పుడు ఓడిపోతారని తెలిసే వర్ల రామయ్యకు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. వర్ల రామయ్యను బలిపశువును చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును టీడీపీ దళిత నేతలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. అందుకే వైయస్ జగన్‌ను ప్రజలు గెలిపించారని, మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం జగన్ అని.. తొమ్మిది నెలల జగన్ పాలన చూసి నేతలు క్యూ కడుతున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. -
దళిత నేతకు గెలవని సీటు
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది. ఈసారి రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్న వైఎస్సార్ సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపడం ఆ వర్గాన్ని మోసం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆరేళ్లలో ఒక్క దళిత, బీసీ నేతనైనా రాజ్యసభకు పంపకపోగా.. మాట ఇచ్చి వారిని మోసం చేసిన ఉదంతాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2002 నుంచీ మాటిచ్చి మోసగించడమే - 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన కోటరీలో సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. - ఆ సమయంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. - 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు ఇచ్చారు. - మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికి కేటాయించారు. - అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. - 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. - 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు. - గతంలో రాజ్యసభ సీటివ్వాలని కోరిన పరసా రత్నం, సత్యవేడుకు చెందిన హేమలత, బల్లి దుర్గాప్రసాద్ (అప్పట్లో టీడీపీ నేత) వంటి వారికి మొండిచేయి చూపారు. - ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్‌గా పంపిస్తానని నమ్మించి మోసం చేశారని మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో వాపోయారు. -
‘దళితులను చంద్రబాబు కించపరుస్తున్నాడు’
సాక్షి, ప్రకాశం : సానుభూతి పొందడానికి దళిత వ్యక్తిని ఎన్నికల్లో పోటీలో ఉంచి చంద్రబాబు దళితులను కించపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు దళితులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యే సీట్లతో రాజ్య సభ సీటు గెలిచే అవకాశం లేకున్న చంద్రబాబు దళిత వ్యక్తి వర్ల రామయ్యను పోటీలో పెట్టడం సానుభూతికోసమేనన్నారు. మంగళవారం మార్కాపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2016లో దళిత వ్యక్తి టీ పుష్పరాజ్‌ను రాజ్యసభకు పంపుతానని చెప్పి చివరి నిమిషంలో టీజీ వెంకటేష్‌ను రాజ్యసభకు పంపిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2018లో దళిత వ్యక్తి వర్ల రామయ్యకు సీటు ఇస్తానని చెప్పి రెండు గెలిచే సీట్లు ఉన్న సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ను రాజ్యసభకు పంపించి రామయ్యను మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ సమన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. -
దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపడం ద్వారా మరోసారి వారిని మోసం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడం వల్లే వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో నిలిపినట్టుగా తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. తన సామాజికవర్గం, అగ్రవర్ణాలకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్రావు, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్‌లను రాజ్యసభకు పంపించారు. గతంలో వర్ల రామయ్య కన్నీరు పెట్టుకున్నా రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు అతన్ని బరిలో నిలపడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే.. వర్ల రామయ్యకు అప్పుడు ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దళితులను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా, 2002 నుంచి ఇప్పటివరకు ఒక్క దళిత నేతను కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. 2016లో జేఆర్ పుష్పరాజ్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని తిప్పించుకున్న చంద్రబాబు.. చివరి నిమిషంలో దానిని అగ్రవర్ణాలకు కేటాయించారు. చదవండి : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం -
రాజీనామా చేసిన వర్ల రామయ్య
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం...
సాక్షి, విజయవాడ: పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీస్ అనేది ఒక వ్యవస్థ అని ఎవరైనా చట్టానికి లోబడే పని చేస్తారని స్పష్టం చేసింది. బుధవారం ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ...‘ వర్ల రామయ్యపై పోలీస్ ఉద్యోగిగా మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. పోలీసుల జాతకాలు తెలుసు, ఒక జెండా పట్టుకున్నారని టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలను వర్ల రామయ్య ఎందుకు సమర్థిస్తున్నారు. ఖండించాల్సిన ఆయన డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారు. మా శాఖలో పని చేసిన మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా సంఘంలో పని చేసిన అనుభవం కూడా రామయ్యకు ఉంది. మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే...ఖండించడం తప్పా?. పోలీసులకు కులం, మతం లేవు. మా అందరిదీ ఖాకీ కులమే. పోలీస్ శాఖను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించం. పోలీస్ సంఘంలో మనుషులు మారారేమో...విధానాలు మారలేదు. వర్ల రామయ్య కేసుపెట్టి ఉంటే.. ఆ స్టేషన్ ఎస్‌హెచ్‌వో చట్టప్రకారం వెళతారు. పోలీసుల జాతకాలు నా దగ్గర ఉన్నాయని బెదిరించడాన్ని వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం.’ అని అన్నారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ... వర్ల రామయ్య పోలీస్ వ్యవస్థను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పోలీస్‌గా, సంఘం సభ్యుడిగా పనిచేసిన ఆయనకు వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. పోలీస్ శాఖలో కులాన్ని తీసుకు వస్తున్నారని, అది సరికాదని అన్నారు. పోలీసుల సంఘానికి ప్రెస్‌మీట్ పెట్టే అర్హత ఎందుకు లేదో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఎవరు పోలీస్ శాఖపై విమర్శలు చేసినా సహించేది లేదన్నారు. విజయవాడ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు కులం పేరు చెప్పుకుంటున్న వర్ల రామయ్య ఏనాడైనా దళితులకు న్యాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ చైర్మన్ హోదాలో దళిత విద్యార్థులను అవమానించిన చరిత్ర ఆయనది అని గుర్తు చేశారు. రాజకీయ నేతగా మీరు దళితుల ఎదుగుదలకు ఎప్పుడైనా ప్రోత్సహించారా అంటూ డీజీపీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా నేను చేయను. మా పోలీసు వేదికపై నుంచి వర్ల రామయ్యకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మా శాఖలో పనిచేసిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే మాకు బాధ కలిగింది. మాది ఖాకీ కులమే తప్ప... మరే కులాలతో మాకు సంబంధం లేదు. వర్ల రామయ్యది ఏ కులమో కూడా మాకు తెలియదు. ఈ ఖాకీ డ్రెస్ వేసుకున్నందుకు ప్రాణ త్యాగానికైనా నేను సిద్దంగా ఉన్నాను’ అని ఏపీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.