Vemireddy prabhakar reddy
-
నేను చెప్పిందే ఫైనల్
సాక్షి తిరుపతి టాస్క్‌ఫోర్స్: ‘మైకా క్వార్ట్జ్ ఎంత తవ్వితే అంత మొత్తం నాకే అమ్మాలి. అదీ నేను చెప్పిన ధరకే. లేదంటే మైనింగ్ జరగదు. నా మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. నేను చెప్పిందే ఫైనల్’.. తిరుపతి–నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో విలువైన మైకా క్వార్ట్జ్ గనుల యజమానులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివి. ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత అండదండలతో సైదాపురం, గూడూరు పరిధిలో లభ్యమయ్యే విలువైన తెల్లబంగారం మొత్తాన్ని ఆయన గుప్పిట్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు లీజుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆయనపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులోని ఓ కన్వెన్షన్‌లో రహస్యంగా సమావేశమై కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆయన ఒక్కరికే విక్రయిస్తే నష్టపోతామని, అలా కాకుండా ఎక్కువ రేటు ఇచ్చిన వారికి విక్రయిస్తే ప్రయోజనం ఉంటుందని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది.సైదాపురం, గూడూరు, పొదలకూరు పరిధిలో ఏడు భూగర్భ గనులు, మరో 140 మైకా క్వార్ట్జ్ , క్వార్ట్జ్ గనులున్నాయి. మైకా క్వార్ట్ ్జకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యా దేశాల్లో రూ.లక్షలు పెట్టి కొంటున్నారు. విలుౖవెన మైకా క్వార్ట్జ్ పై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరి కొందరు ఎమ్మెల్యేలు కన్నేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల్లో తవ్వకాలు నిలిపేశారు. ఆ తరువాత వారికి అనుకూలంగా ఉన్న వారికే తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇలా ఇప్పటివరకు 24 గనులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.మైనింగ్ డాన్‌కు అమ్మడం ఇష్టంలేక తవ్వకాలు నిలిపివేతఇక్కడ తవ్విన మైకా క్వార్ట్జ్ మొత్తం తనకే విక్రయించాలని, తాను చెప్పిన రేటుకే ఇవ్వాలంటూ మైనింగ్ డాన్ లీజుదారులకు హుకుం జారీ చేశారు. తనను కాదని వేరొకరికి విక్రయించడానికి వీల్లేదని ఆదేశించారు. దీంతో కంగుతిన్న లీజుదారులు తవ్వకాలు నిలిపివేశారు. అనుమతులిచ్చిన గనుల్లో ప్రస్తుతం నాలుగింట్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ దందా భరించలేని లీజుదారులు 32 మంది చిల్లకూరులోని ఓ కన్వెన్షన్‌లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహస్యంగా సమావేశమయ్యారు.సమావేశంలో విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరి నుంచి మొబైల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మైకా క్వార్ట్జ్ మంచి డిమాండ్ ఉన్నందున, బయట అమ్మితేనే లాభమని, డాన్‌కి అమ్మితే నష్టమేనని వారు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొంత మైనింగ్ డాన్‌కి విక్రయించినా.. మరి కొంత ఇతరులకు విక్రయిస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందని భావించినట్లు తెలిసింది. ఈయనతోపాటు సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాలను శాసిస్తున్న మరో బడా పారిశ్రామికవేత్తకు కూడా విక్రయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఒకటి, రెండు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్త, ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా జిల్లా మైనింగ్ అధికారిని కూడా మరోసారి కలిసి తమ ఆవేదనను చెప్పుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ రహస్య సమావేశం విషయం తెలుసుకున్న మైనింగ్ డాన్ లీజుదా రులతో మాట్లాడినట్లు తెలిసింది. ఎవరెవరు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎంతమంది అనుకూలంగా మాట్లాడారు అనే విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశం వివరాలను ప్రభుత్వ పెద్దలు కూడా నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు తెలిసింది. -
వేమిరెడ్డికి గనుల యజమానుల షాక్
-
ఎంపీ వేమిరెడ్డి ఆగడాలు..గనుల యజమానుల రహస్య భేటీ..!
సాక్షి,నెల్లూరు:టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)జిల్లా మైనింగ్ కంపెనీల యజమానులు సమావేశమయ్యారు. జిల్లాలో క్వార్జ్ మైనింగ్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సైదాపురంలో ఉన్న తెల్లరాయి తవ్వకం,రవాణాకు అనుమతులు దక్కించుకుని వందల కోట్ల మైనింగ్‌ను ఎంపీ వేమమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakarreddy) తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే క్వార్ట్జ్ అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గూడూరులోని ఓ హోటల్లో గనుల యజమానులు రహస్య సమావేశం నిర్వహించారు. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు మైనింగ్ యజమానులు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు -
వేమిరెడ్డికే క్వార్ట్జ్ గనులు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్ట్జ్ గనులపై ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఎంపీదే పైచేయిగా మారినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ‘ముఖ్య’ నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుంది. నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వార్ట్జ్ మెటల్‌ను ఆయనకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు నజరానాగా ప్రతి నెలా ‘ముఖ్య’ నేతకు ముడుపులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి గత నెల రోజులుగా నిత్యం వందల లారీల్లో ఖనిజాన్ని అనధికారికంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.తమకు ముడిసరుకు మొత్తం అప్పగించాలని లేదంటే కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని అన్ని అనుమతులున్న ఇతర గనుల యజమానులను బెదిరిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ గత ఆర్నెళ్లుగా గనుల యజమానులు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. లీగల్ మైన్లను దుర్మార్గంగా నిలిపివేయడంపై గనుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అనుకూల అధికారులను నియమించుకోవడంతోపాటు సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సైదాపురం కేంద్రంగా ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వేమిరెడ్డి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గనుల తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి దొరుకుతుందంటూ కంపెనీ ముసుగులో ప్రజలను మభ్యపుచ్చి కొన్నాళ్ల పాటు హడావుడి చేసి అనంతరం అందరి నుంచి గనులను లాక్కునే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.గనుల యజమానులకు బెదిరింపులు.. జిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న వేమిరెడ్డి అనుచరులు అధికారికంగా అన్ని అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే తవ్విన ఖనిజంతోపాటు ఇకపై వెలికితీసేది కూడా తాము చెప్పిన నామ మాత్రపు ధరకే ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో గనుల యజమానులను హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంపీ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ తమను బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని పేర్కొన్నాడు.రూప్ కుమార్ ద్వారా..ఎంపీ వేమిరెడ్డి తన అనుచరుడైన రూప్‌కుమార్‌ను ముందుపెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆర్నెళ్లుగా అందరి మైన్లు నిలిపివేసి కేవలం ఎంపీ అనుచరుడికి చెందిన నాలుగు గనులకే అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది తెలిసిపోతోంది.అనుకూల అధికారి రాకనెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తిరుపతి జిల్లా డీడీ బాలాజీ నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేలా ఎంపీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్‌ను కలెక్టర్ ద్వారా 20 రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే దీన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి విజయవాడకు బదిలీ చేశారు. అనంతరం ఆ పోస్టులో తమ అనుకూల అధికారిని నియమించేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేయించారు.విదేశాల్లో భారీ గిరాకీ..కూటమి ప్రభుత్వం రాగానే సైదాపురం క్వారŠట్జ్ గనులపై ‘ముఖ్య’ నేత కన్ను పడటంతో వెంటనే అనుమతులు నిలిపివేశారు. అన్ని అనుమతులతో వందేళ్ల లీజుపై తీసుకున్న గనులను సైతం మూసి వేయించారు. ఇక్కడ లభ్యమయ్యే మైకా క్వార్‌ట్టŠజ్, తెల్లరాయి క్వార్‌ట్టŠజ్‌పై నివేదిక తెప్పించుకున్నారు. వందేళ్లకు సరిపడా గనుల్లో నిల్వలున్నట్లు గుర్తించడంతో వాటిని తవ్వి సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారు. సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఎనిమిది నెలలుగా మైకా, క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాణ్యతను బట్టి ముడి ఖనిజం టన్ను రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. చైనాలోని సెమీకండక్టర్ పరిశ్రమల్లో మైకా క్వార్ట్ ్జని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎండీ ఫరూక్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు.అయితే, మంత్రులకు బొకేలు ఇచ్చి ఎంపీని అధికారులు పట్టించుకోలేదు. ప్రభాకర్‌రెడ్డిని ఆనం రామనారాయణరెడ్డి సముదాయించారు. అయినా కూడా వేమిరెడ్డి పట్టించుకోకుండా అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
కోవూరు.. అల్లుడు జాగీరు
ఆయన నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులకు బంధువు. వరసకు అల్లుడు. ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి నియోజకవర్గంలో తిష్టవేసి గిల్లుడు ప్రారంభించాడు. టీడీపీ అధికారంలోకి రావడం, ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. ఆమె ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి షాడో ఎమ్మెల్యేగా రంగ ప్రవేశం చేసి అక్రమాలకు తెర తీసినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇసుకతో దోపిడీ ప్రారంభించిన షాడో ఎమ్మెల్యే ప్రతి పనికీ కమీషన్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నాడు. గత ప్రభుత్వంలో ఖరారైన పనులనూ వదలకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. మొత్తంగా వంద రోజుల్లోనే కోవూరును అవినీతికి కేరాఫ్‌గా మార్చేశాడు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అవినీతి రహిత పాలన, వివాదరహిత పాలనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. అందరూ సహకరించండి. ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలు చేయొద్దు. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రతిపాదించండి తప్పక చేద్దాం’ ఇది కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తరచూ నియోజకవర్గ పర్యటనల్లో చెప్పే సూక్తులు. అయితే ఇవన్నీ గాలి మాటలని గడిచిన వంద రోజుల పాలనలోనే తేలిపోయింది. ఆ నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోంది. స్థానిక ఎమ్మెల్యే బంధువు షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతూ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో లబోదిబోమంటున్నారు. మినగల్లు నుంచి ఇందుకూరుపేట వరకు పెన్నానదిలో అడుగడుగునా ఇసుక దోపిడీకి తెర తీశారు.కమీషన్ ఇవ్వలేదని.. మైపాడు రోడ్డు పనులకు బ్రేక్కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో పర్యాటక ప్రదేశంగా ఉన్న మైపాడు బీచ్‌కు వెళ్లే రహదారి అభివృద్ధికి గత ప్రభుత్వంలో రూ.48 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆయా నిధులతో నెల్లూరు– మైపాడు వెళ్లే రహదారి 2/500 నుంచి 22/200 కిలో మీటర్ల వరకు రోడ్డు విస్తరణతో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానించారు. అప్పట్లో నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ 4 శాతం లెస్తో టెండర్లు దక్కించుకున్నాడు. ఆ వర్క్‌కు సంబంధించి అగ్రిమెంట్ పూర్తయ్యే సరికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వర్క్ ప్రారంభించలేదు. ప్రస్తుతం వర్క్ ప్రారంభించేందుకు సిద్ధపడగా షాడో ఎమ్మెల్యే కూడా పెద్ద కాంట్రాక్టర్ కావడంతో వర్క్ ప్రారంభానికి ససేమిరా అన్నాడు. ఆర్అండ్బీ శాఖ ఇంజినీరింగ్ అధికారులను బెదిరించి ఆ వర్క్ సంబంధించి 5 శాతం కమీషన్ ఇవ్వాలని చెప్పించాడు. లేని పక్షంలో 60సీ ద్వారా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి తనకు అగ్రిమెంట్ చేసివ్వాలని ఒత్తిడి తేవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వేళ రాజకీయ ఒత్తిళ్ల తలోగ్గి వర్క్ క్యాన్సిల్ చేస్తే సదరు కాంట్రాక్టర్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ వివాదం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా షాడోకు అనుకూలంగానే పని చేయాలని ఆదేశించినట్లు సమాచారం.గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులనూ వదలని వైనంషాడో ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ప్రారంభించి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను వదల్లేదు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి, రాజుపాళెం–ఇస్కపల్లి వరకు వెళ్లే రోడ్ల విస్తరణ పనులకు గత ప్రభుత్వంలోనే ఎన్డీబీ ద్వారా ఆయా వర్క్‌లకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో పనులు ప్రారంభమైనా.. దశల వారీగా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం జిల్లా మొత్తంలోని పనులన్ని ఒకే ప్యాకేజీ ద్వారా టెండర్ల ప్రక్రియ జరిగింది. ప్రముఖ కాంట్రాక్టర్ ఆయా వర్కులకు సంబంధించి టెండర్ దక్కించుకుని సబ్ కాంట్రాక్టర్లకు పని అప్పగించారు. ఇప్పటికే ఆయా పనులు రోడ్డు వైండింగ్‌తో పాటు వంతెనలు నిర్మించారు. ఇక బీటీ రోడ్లు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా రోడ్ల పనులను కొనసాగించాలంటే 5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని షాడో ఎమ్మెల్యే సంబంధింత ఇంజినీరింగ్ అధికారుల ద్వారా ఒత్తిడి తేవడంతో సదరు సబ్ కాంట్రాక్టర్లు అడిగినంత ఇచ్చుకోకపోతే.. నష్టపోతామని ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చేసిన పనులకూ బిల్లులుకోవూరు నియోజకవర్గంలోని వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పంట కాలువలను అభివృద్ధి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సొంతంగానే యంత్రాలు పంపించి కాలువలు బాగు చేయించారు. అయితే షాడో ఎమ్మెల్యే మాత్రం ఆయా పనులకు కూడా అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి బిల్లులు చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇరిగేషన్ శాఖలో వివిధ రకాల పనుల కోసం రూ.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారని ప్రచారం జోరుగా సాగుతుంది.గుట్టుచప్పుడు కాకుండా ఇసుక దోపిడీకోవూరులో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక మినగల్లు ఇసుక డంపింగ్ యార్డు నుంచి 12 వేల టన్నుల ఇసుకను బహిరంగంగానే అక్రమ రవాణా సాగించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. డంపింగ్ యార్డు నుంచి ఇసుకను బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేశారనే విషయం బయటపడడంతో మైనింగ్‌శాఖ అధికారులు డంపింగ్‌ను పరిశీలించి 12 వేల టన్నుల ఇసుక మాయమైన మాట వాస్తవేనని నిర్ధారించారు. విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే విచారణ పర్వం కథ కంచికి చేరినట్లు తెలుస్తోంది. సదరు షాడో ఎమ్మెల్యే ప్రస్తుతం పెన్నానదిలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు షాడో వేసిన ఇసుక టెండర్ చెల్లుబాటు కాదని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినా ఇరిగేషన్ అధికారులు మాత్రం కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ఇసుక రవాణా సాగించడం విశేషం. బుచ్చిరెడ్డిపాళెం నుంచి కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట వరకు దాదాపు ఏడు చోట్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
ఆనందం ఆవిరై.. ఆందోళన ఆవిష్కృతమై..!
విజయం మాదేనంటూ నిన్నామొన్నటి వరకు బీరాలు పలికిన వేమిరెడ్డి దంపతులు.. ఇప్పుడు గౌరవ స్థాయిలో ఓట్లు దక్కితే చాలు భగవంతుడాననే స్థితికి వచ్చారు. డబ్బులను వెదజల్లితే ఏదైనా చేసేయొచ్చనే భ్రమలో ఉన్న వీరికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నాయి. తమ ప్రచారాలు.. చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలు వెలవెలబోవడం.. నగదు ప్రలోభాలకు గురై సైకిలెక్కిన నేతలు ఒక్కొక్కరూ తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటంతో ఏమి చేయాలో పాలుపోక దిక్కుతోచక స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రచారాలను సైతం వీరు తగ్గించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలకు పట్టుమని 12 రోజుల్లేవు. ఈ స్థితిలో ప్రచారాలతో పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటుతుంటాయి. అయితే నెల్లూరులో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ధనబలంతో ఏదైనా చేయొచ్చనే ధీమాతో ఇప్పటి వరకు ఉన్న వేమిరెడ్డి శిబిరంలో టెన్షన్ మొదలైంది.బూమరాంగ్.. నిజానికి వేమిరెడ్డి దంపతులకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు. ఈ తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి నెల్లూరు లోక్‌సభ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్లను టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో తమ బలాన్ని ప్రదర్శించాలనే భావనతో నగదు ప్రలోభాలకు గురిచేసి పలువురు నేతలను వీరు ఆకర్షించారు. అయితే టీడీపీలో చేరిన నేతల్లో చాలా మంది అక్కడ ఇమడలేక తిరిగి తమ సొంతగూటికి చేరుకుంటుండటంతో వీరి వ్యూహాలు బూమరాంగయ్యాయి. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టబెట్టిన పదవులను అనుభవిస్తూ.. వీరు పార్టీని మారి తప్పటడుగేశారని ఆయన వర్గీయులే బహిరంగంగా చెప్తుండటం గమనార్హం.ఏదీ ప్రజాస్పందన..? ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్న కోవూరుతో సహా ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ టీడీపీకి కనిపించడంలేదు. డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, కొద్దిసేపటికే ముఖం చాటేస్తున్నారు. కోవూరులో నిర్వహించిన ఆతీ్మయ సమావేశాల్లో ప్రజాస్పందన కానరాకపోగా, గ్రూపుల మధ్య కీచులాటలు వీరికి వెల్కమ్ పలుకుతున్నాయి. మరోవైపు కావలి, ఉదయగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలకు జనం రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై వీరికి ఎటూ పాలుపోవడంలేదు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులను కొన్నంత సులభంగా ఓట్లు బదిలీ అవుతాయనే వీరి భ్రమ సైతం తొలగిపోయింది.నిన్ను నమ్మం బాబూ..! టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు జనాలు పలుచగా హాజరవుతున్నారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించడంతో చంద్రబాబుపై నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ తరుణంలో వరుస సెగతో ఆ పార్టీ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓటేయాలని అడిగే నాథుడేడీ..? వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఓటేయాలని అడిగే నాథుడే కరువవుతున్నారు. తనకు ఓటేయమని ప్రజలను కోరాలని వేమిరెడ్డి సూచిస్తే.. ఖర్చులకు డబ్బులివ్వందే ప్రచారం చేయలేమని అభ్యర్థులు చెప్పారని సమాచారం. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటును తమకే వేయాలని.. లోక్‌సభకు సంబంధించి మీ ఇష్టమంటూ నారాయణ టీమ్ ప్రచారం చేస్తోంది. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు అభ్యర్థుల ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నామినేషన్లకు ముందే స్పష్టత వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీడీపీకి ప్రజాదరణ లేకపోయినా.. డబ్బు మూటలతో ఓట్లు కొల్లగొట్టొచ్చనే ధీమాతో వేమిరెడ్డి దంపతులు ఉన్నారు. అయితే నామినేషన్లకు ముందే వీరికి తమ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చింది. మరోవైపు వేమిరెడ్డి ఆర్థిక బలంతో నెల్లూరు లోక్‌సభ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు తాము గెలిచేస్తామని కలలుగన్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులపై వీరికి ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. మరోవైపు నగదు ప్రలోభాలతో టీడీపీ మాజీలను వీరు తమవైపు తిప్పుకొన్నా.. ఆ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. గ్రూపులతో తలనొప్పికోవూరుపై ఇప్పటివరకు దృష్టి సారించిన వేమిరెడ్డి తాజాగా ఆ ఫోకస్‌ను తగ్గించారని తెలుస్తోంది. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం.. ప్యాకేజీలు ఇచ్చి తెచ్చుకున్న నేతలతో ఒరిగేదేమీ లేదని గ్రహించారు. నాలుగు గ్రూపులు వేమిరెడ్డి దంపతులకు తలనొప్పిగా పరిణమించాయి. నిన్నామొన్నటి వరకు భారీగా ఖర్చు పెట్టిన వీరు ఇప్పుడు తగ్గించేశారనే టాక్ వినిపిస్తోంది. సైలెంట్‌గా పక్కకు తోసేశారు కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు వ్యూహకర్త పోలంరెడ్డి దినేష్ రెడ్డేననే ఉద్దేశంతో ఆయన్ను సైలెంట్‌గా సైడ్ చేశారని సమాచారం. ఎన్నికల ఖర్చుల వ్యవహారాలను చూసేందుకు తమ సొంత టీమ్‌ను రంగంలోకి దింపారని తెలుస్తోంది. వేమిరెడ్డి నామినేషన్ సమయంలోనూ దినేష్ ఒకింత అసంతృప్తిగా కనిపించారని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకున్నాం.. తిరిగి వెనక్కి వెళ్లలేం.. ఎన్నికల తర్వాత మా వ్యాపారాలు మాకున్నాయంటూ ముఖ్య నేతల వద్ద వేమిరెడ్డి దంపతులు వాపోయారని సమాచారం. -
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ఫైర్
-
వేమిరెడ్డి దంపతులకు ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు.. మొత్తం బయటపెట్టిన ప్రసన్నకుమార్ రెడ్డి..
-
కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు
డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది. కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్‌గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అడుగడుగునా ప్రతికూలతలే.. క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఆడియో కలకలం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది. -
వేమిరెడ్డి దంపతులకి ప్రసన్నకుమార్ రెడ్డి వార్నింగ్
-
SPSR Nellore: ఓటమి భయం.. వేమిరెడ్డి దంపతుల అడ్డదారులు
ఓటమి తప్పదనే సంకేతాల తరుణంలో టీడీపీ నెల్లూరు లోక్‌సభ, కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు అడ్డదారులు తొక్కుతున్నారు. కోవూరు నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించిన వీరు నోట్లతో ఓట్ల కొనుగోలుకు సన్నద్ధమయ్యారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నగదును ఎర వేసి ఈ వికృత పర్వానికి తెరలేపారు. మత్స్యకార గ్రామాల్లో దురాయి దురాచారాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కొనుగోలుకు రూ.80 లక్షలతో బేరం పెట్టిన అంశం వెలుగులోకి రావడం.. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో ప్రజాప్రతినిధులపై వీరు తాజాగా దృష్టి సారించారు. కోవూరు: ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విలువల్లేని రాజకీయాలకు వేమిరెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారు. ఓటమి భయంతో నేతలకు వీరు రేట్లు ఫిక్స్ చేసి తమ వైపునకు తిప్పుకొనే దుస్సాహసానికి తెరలేపారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను తమ శిబిరాలకు రహస్యంగా ఆహ్వానించి ఈ రకమైన మంతనాలకు శ్రీకారం చుట్టారు. ప్యాకేజీలు ఖరారు.. ఆయా గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీలను ఫిక్స్ చేశారని స్థానిక నేతలే పేర్కొంటున్నారు. ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ వారికి ఈ మొత్తాలను ఎర వేస్తున్నారు. ఓటర్లకు సైతం భారీగానే ముట్టజెప్తామని, ఈ నగదు పంపిణీ బాధ్యతా మీదేనంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది. బంధుగణంతో టీమ్ ఏర్పాటు ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సదరు టీమే ఈ వ్యవహారాలను ముందుండి నడిపిస్తోంది. ప్యాకేజీ ఆశ చూపి కొందర్ని ఇప్పటికే తమ శిబిరంలో చేర్చుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఓటర్లు భగ్గుమంటున్నారు. రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఓటేయాలని ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు చెప్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో తమకు అండగా ఉండి.. సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి కాకుండా మరెవరికీ ఓటేయబోమని వారు తెగేసి చెప్తున్నారు. అధికార యంత్రాంగం నిఘా స్వేచ్ఛాయుత పోలింగ్‌పై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్ జిల్లా స్థాయిలో నిఘా ఉంచింది. మత్స్యకార గ్రామంలో దురాయి పేరిట ఓట్లు కొనుగోలు చేస్తున్న సమాచారం నిఘా వర్గాల ద్వారా అధికారులకు అందింది. దీనిపై ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
వేమిరెడ్డికి ఎన్నికలకు ముందే షాకులు..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంటాడుతున్న ఓటమి భయం.. స్వపక్షం నుంచే ఎదురవుతున్న నిరసనలు.. ఖర్చు పేరిట పీల్చిపిప్పి చేస్తున్న నేతలు.. ఇలా వరుస షాకులతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎన్నికలకు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని ఆయన ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, అభ్యర్థులు మాట్లాడే సమయానికి వీరు నిష్క్రమిస్తుండటంతో పుండుమీద కారం జల్లిన పరిస్థితి వేమిరెడ్డికి ఏర్పడింది. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతోంది. ప్రచారానికి వెళ్తున్న వేమిరెడ్డి దంపతులకు స్వపక్ష నేతల నుంచే అవమానాలు, నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో టీడీపీ గ్రాఫ్ మెరుగుపడకపోవడం.. పైగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవనే సంకేతాల తరుణంలో కీలక నేతలుగా ప్రచారం చేసుకుంటూ అందిన కాడికి గుంజాలనే ఉద్దేశంతో కొందరు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు. వలసలను ప్రోత్సహిస్తున్నా పెరగని ప్రజాదరణ భారీ ప్యాకేజీలతో టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రజాదరణ ఏ మాత్రం పెరగడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిన అత్యుత్తమ పదవులతో పాటు గౌరవ మర్యాదలు పొందిన వీరి పరిస్థితి ప్రస్తుతం ఒక్కసారిగా తిరగబడింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పట్టుబట్టి టీడీపీ కోవూరు అభ్యర్థిగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఖరారు చేయించారు. వాస్తవానికి ఏళ్ల పాటు కష్టించి తానే అభ్యర్థినని విస్తృత ప్రచారం చేసిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి ఈ పరిస్థితి మింగుడుపడలేదు. తనను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేని దినేష్ తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపారు. వెన్నంటే ఉంటూ నిరసనలకు సై.. వేమిరెడ్డి వెన్నంటే దినేష్‌రెడ్డి ఉంటూ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అధిష్టాన ఆదేశాలతో పార్టీ కోసం పనిచేస్తూ.. ప్రశాంతక్కను గెలిపించుకుందామంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్న దినేష్.. పరోక్షంగా వారికి నిరసన సెగ చూపేలా కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారని సమాచారం. ఇందుకూరుపేట మండలానికి ఆదివారం ఆమె వెళ్లగా, టీడీపీ వర్గీయులు భారీగా గుమిగూడి గో బ్యాక్.. ప్రశాంతి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరీక్షించినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆమె వెనుదిరిగారు. ఇదే సమయంలో దినేష్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించడం.. అనంతరం తన వర్గంతో కలిసి వెళ్లి ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. ఆత్మీయ సమావేశాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ప్రశాంతిరెడ్డికి వెన్నుపోటు తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఆగండయ్యా..! కోవూరులోని నెల్లూరు గ్రాండ్ హోటల్, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతుండగానే, సభ నుంచి వెళ్లేందుకు కేడర్ సన్నద్ధమయ్యారు. ఎక్కడికెళ్తున్నారు.. ఆగండి అని వేమిరెడ్డి వేడుకున్నా పట్టించుకోకుండా అందరూ బయల్దేరారు. ఖర్చులంటూ ఒత్తిడి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం వేమిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. వేమిరెడ్డి నివాసంలో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వారు డిమాండ్ చేశారని తెలిసింది. ఇంకా నామినేషన్ల పర్వమే ప్రారంభం కాలేదు.. అప్పుడే డబ్బులేంటి.. తర్వాత చూద్దామని ఆయన చెప్పారని సమాచారం. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు -
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి ప్రసన్నకుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ప్రశాంతిరెడ్డి అభ్యర్థిత్వంపై దినేష్‌రెడ్డి ఆగ్రహం
టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో ఆశావహుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆయన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తమ ఆక్రోశం వెళ్లగక్కారు. 20 ఏళ్ల పాటు ప్రజలతో అనుబంధం ఉన్న తమ కుటుంబాన్ని కాదని.. కనీస పరిచయం లేని ఆమెను బరిలో ఎలా నిలుపుతారంటూ టీడీపీ అధినేతలపై మండిపడిన వీరు అంతలోనే మౌనం దాల్చారు. ఇలా మెత్తపడటంతో వీరి తీరును జీర్ణించుకోలేని టీడీపీ కేడర్ అయోమయంలో పడింది. కోవూరు: విజయమే లక్ష్యంగా టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకై నా వెనుకాడటంలేదు. కుదిరితే వెన్నుపోటు.. కుదరకపోతే డబ్బు సంచులనే రీతిలో ముందుకెళ్తోంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా టీడీపీలో అరంగ్రేటం చేసిన తనయుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఆ పార్టీ అధిష్టానం ప్యాకేజీతో సమాధి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశలు ఆవిరి టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ దినేష్‌రెడ్డి దాదాపు రెండున్నరేళ్లుగా ప్రచారం చేసుకున్నారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యమంటూ చంద్రబాబు, లోకేశ్ తమ ప్రచారాలతో ఊదరగొట్టారు. వీరి వ్యాఖ్యలతో తనకు ఇక తిరుగులేదనే ఊహల పల్లకిలో దినేష్‌రెడ్డి విహరించారు. అయితే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్‌ను ఖరారు చేసి తమ చేష్టలతో దినేష్‌రెడ్డిని నేలపైకి తీసుకొచ్చారు. మొదట్లో ధిక్కారస్వరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు అభ్యర్థిగా ఖరారు చేయడంతో తండ్రీకొడుకులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి హతాశులయ్యారు. టీడీపీ నిర్వహించిన నాలుగు సర్వేల్లోనూ దినేష్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నా.. ధనబలం, రాజకీయ పరపతితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్‌ను కేటాయించి తమ గొంతు కోశారని ఆత్మీయ సమావేశంలో ఫైరయ్యారు. 2014 ఎన్నికలకు ముందు కోవూరులో టీడీపీకి అభ్యర్థి లేకపోతే.. కాంగ్రెస్‌లో ఉన్న తనను చంద్రబాబు బతిమిలాడి పార్టీ టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం కోల్పోయాక పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు. లోకేశ్ నిర్వహించిన యువగళం యాత్రకు దాదాపు రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టామని, తమకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అల్టిమేటమిచ్చారు. ఫలించిన ‘డబ్బు’ సంప్రదింపులు ఈ తరుణంలో పోలంరెడ్డితో పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపారు. రూ.30 కోట్లకు బేరం పెట్టగా, చివరికి రూ.20 కోట్లకు ఓకే అన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో పోలంరెడ్డి మౌనం దాల్చారని తెలుస్తోంది. అయితే ఇవ్వాల్సిన మొత్తంలోనూ రూ.ఐదు కోట్ల మేర పంగనామం పెట్టడంతో పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దిక్కుతోచని స్థితిలో కేడర్ పార్టీ అధిష్టానం పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్‌గా దినేష్‌రెడ్డి పోటీ చేయాలని.. తామంతా టీడీపీకి కాకుండా ఆయనకే మద్దతుగా నిలుస్తామని కేడర్ చెప్పారు. ఎవరు పోటీ చేసినా తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అయితే కేడర్ వ్యాఖ్యలపై పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో కేడర్‌లో స్తబ్దత నెలకొంది. -
టీడీపీలో కొత్త కష్టాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వద్దనుకున్న నాయకులను అక్కున చేర్చుకున్న టీడీపీకి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పార్టీ ఫిరాయించి వలస వచ్చిన నేతలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఎసరు పెడుతున్నారు. భారీగా నిధులు ఇస్తుండటంతో చంద్రబాబు కూడా వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వలస నేతల దెబ్బకు సీట్లు ఎగిరిపోయిన నేతలు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. దిగుమతి నేతలపై కారాలు మిరియాలు నూరుతూ నియోజకవర్గాల్లో వారికి పట్టు దొరక్కుండా చేస్తున్నారు. ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి, తమను అవమానిస్తున్నారని సీనియర్లు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నెల్లూరు టీడీపీలో చిచ్చుపెట్టిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పెద్ద చిచ్చే పెట్టారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆయన నెల్లూరు ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా మరికొన్ని ఎమ్మెల్యే స్థానాల్లో తాను చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కోవూరు స్థానాన్ని తన సతీమణి ప్రశాంతికి ఇవ్వాలని చంద్రబాబుపై గట్టి ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు ఆమె పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. దీంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి రగిలిపోతున్నారు. ఆయన ఈసారి తన కొడుకుని అక్కడ పోటీ చేయించేందుకు చాలారోజుల నుంచి పని చేస్తున్నారు. ఇప్పుడు బయటి వ్యక్తి కోసం తమను మోసం చేయడం ఏమిటని ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వేమిరెడ్డి ప్రవేశంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీటు కూడా ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది. సర్వేపల్లిలో సోమిరెడ్డి స్థానంలో తనతోపాటు టీడీపీలో చేరిన నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ని పోటీ చేయించడానికి వేమిరెడ్డ రంగం సిద్ధం చేశారు. రూప్‌కుమార్ పేరుతో సర్వే కూడా చేస్తుండడంతో సోమిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. టీడీపీలో ఆది నుంచి ముఖ్య నాయకుడిగా ఉన్న సోమిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బున్న నేతలతోనే అంతా అయిపోతే ఇక తామెందుకుని ఆయన అనుయాయుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాన మొన్న పార్టీలో చేరి తమ సీట్లను ప్రభావితం చేయడం ఏమిటని, చంద్రబాబు ఆయనకు వంతపాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘లావు’ దెబ్బకు ఇద్దరు సీనియర్లు విలవిల వైఎస్సార్సీపీ నర్సరావుపేట లోక్‌సభ సీటు నిరాకరించడంతో చంద్రబాబు పక్కన చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు దెబ్బకు ఇద్దరు టీడీపీ సీనియర్లు విలవిల్లాడుతున్నారు. పార్టీలో చేరకముందే ఆయన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సీటుకు ఎసరు పెట్టారు. యరపతినేని పోటీ చేసే గురజాల సీటును జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు దానికి సరేనని యరపతినేనికి సీటు ఖరారు చేయకుండా పక్కనపెట్టేశారు. అంతటితో ఆగకుండా యరపతినేనిని నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానానికి పంపాలని సూచించడంతో చంద్రబాబు దానిపై ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు సీటు ప్రశ్నార్థకమైంది. లావు రాజకీయంతో నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో అయోమయం నెలకొంది. గుమ్మనూరు రాకతో జితేంద్రగౌడ్ సీటు గల్లంతు వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిపోయి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సమ్మతించడం టీడీపీలో అగ్గి రాజేసింది. గుంతకల్ సీటును జయరాం దక్కించుకోవడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సీటు గల్లంౖతైంది. దీంతో ఆయన వర్గం జయరాంకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానాన్ని బయట నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రశ్నార్థకమైంది. నూజివీడు సీటును వలస నేత కేపీ సారథికి కేటాయించడంతో పదేళ్లుగా అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చోటు లేకుండాపోయింది. ఇలా రాజకీయ అవసరాల కోసం అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించిన వారిని చంద్రబాబు అందలం ఎక్కించుకుని పార్టీ కోసం పని చేసిన వారిని పూచికపుల్లల్లా తీసివేస్తుండటం టీడీపీలో కల్లోలం రేపుతోంది. -
SPSR Nellore: నయా పెత్తందారు
రాజ్యాధికారం అందరికీ దక్కాలనే సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని నయా పెత్తందారులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. ఇలా అందరికీ సీట్లు కేటాయించి సామాజిక సమతుల్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి పాటిస్తోంది. తాజాగా జిల్లాలో మైనార్టీలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ నెల్లూరు నగర సీటును కేటాయించడంతో ఓర్వలేని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసిన పార్టీకే పంగనామాలు పెట్టిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పోకడలపై నిన్నామొన్నటి వరకు దుమ్మెత్తి పోస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తానేనంటూ ప్రకటించుకున్న ఆయన అకస్మాతుగా పార్టీని ఫిరాయించడం వెనుక ఏమి జరిగిందనే అంశం విస్తృత చర్చకు దారితీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించారు. అయితే పెత్తందారీ పోకడలను అలవర్చుకున్న వేమిరెడ్డికి ఇది నచ్చకపోవడంతో పార్టీ కండువా మార్చారనేది నిర్వివాదాంశం. నెల్లూరు నగర సీటును తమకు కేటాయించడాన్ని సహించలేని వేమిరెడ్డి పార్టీ మారడంపై మైనార్టీలు మండిపడుతున్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల కేటాయింపు సామాజిక సమతుల్యతతో సాగుతోంది. గతంలో మాదిరిగా కాకుండా అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుండటంతో పార్టీని అందరూ తమదిగా భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీఎం జగన్మోహన్రెడ్డి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఇది ఓర్వలేని పెత్తందారుల పోకడలు ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కోవలోనే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడుగులు పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మైనార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి తానేనని ప్రకటించుకున్న వేమిరెడ్డి ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ తరుణంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని మైనార్టీలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పేరును సీఎం ప్రకటించారు. ఇలా మైనార్టీ వ్యక్తి పేరును ప్రకటించగానే వేమిరెడ్డిలోని అసలు రంగు బయటపడింది. దీన్ని బూచిగా చూపి తనకు పార్టీలో గౌరవం లేదంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కందుకూరులో బీసీ సామాజికవర్గానికి సీటు కేటాయించడం కూడా ఆయనకు రుచించలేదని తెలుస్తోంది. మండిపడుతున్న మైనార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేసింది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్‌కు రెండుసార్లు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఏకంగా మంత్రిని చేసింది. మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు మేయర్ పదవిని కట్టబెట్టింది. తాజాగా మరోసారి నెల్లూరు నగర సీటును మైనార్టీలకే కేటాయించారు. తమకు ఎనలేని ప్రాధాన్యమిచ్చి అసెంబ్లీకి పంపేలా చేస్తుంటే.. ఓర్వలేని వేమిరెడ్డి ఆత్మగౌరవమంటూ పార్టీ ఫిరాయించడంపై మైనార్టీ నేతలు భగ్గుమంటున్నారు. వేమిరెడ్డి కుటిల రాజకీయాలను ఛీదరించుకుంటున్నారు. -
రాజ్యసభను నడిపిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ రోజు(సోమవారం) అరుదైన ఘనత దక్కించుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ కుర్చీలో ఆసీనులై, ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా సభను నడిపించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ హోదాలో.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ స్థానంలో కూర్చొని సభను సజావుగా నడిపించారు. 2018, ఏప్రిల్‌లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఈ సందర్భంగా రాజ్యసభ్యులుగా ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా ఇటీవల ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆయన ఛైర్మన్ స్థానంలో ఆసీనులై సభను నడిపించారు. -
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వేమిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. నలుగురు మహిళలు సహా మొత్తం 8 మంది సభ్యులతో కూడిన వైస్ చైర్మన్ల ప్యానెల్‌ను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పునరి్నయామకం చేశారు. ప్యానెల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రమీలాబెన్ బేచర్ భాయ్ బారా, సీమా ద్వివేది, డాక్టర్ అమీ యాజి్ఞక్, మౌసమ్ నూర్, కనకమేడల రవీంద్ర కుమార్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, లెఫ్టినెంట్ జనరల్ డీపీ వత్స్ (రిటైర్డ్) ఉన్నారు. చైర్మన్ ధన్‌ఖడ్ గైర్హాజరైన సందర్భాల్లో వీరు సభను నిర్వహిస్తారు. -
ప్రభుత్వానికి ఏం సంబంధం?
రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదంటే... ఆంధ్రప్రదేశ్ గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిపోయిందని బ్రాండ్ చెయ్యాలి. కొన్నాళ్లు ఇదే స్కీమ్‌ను అమలు చేశాయి టీడీపీ, ఎల్లో మీడియా!. కానీ దాదాపు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేశమంతా ఏపీకి క్యూ కట్టింది. ఎల్లో ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఇప్పుడు విశాఖ వంతు! సీఎం జగన్ సంకల్పిస్తున్నట్టుగా అక్కడకు రాజధాని రాకూడదు. అలా వస్తే తాము స్కెచ్ వేసిన రూ.లక్షల కోట్ల అమరావతి భూముల లూటీ సాధ్యం కాదు. అందుకే కొన్నాళ్లుగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే పనిలో పడ్డాయి. ప్రైవేటు ఒప్పందాలకు సైతం... ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లుగా మసి పూస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. ‘రేడియంట్ భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం’ అంటూ టీడీపీ చేసిన ఆరోపణలను సోమవారం ‘ఈనాడు’ మొదటి పేజీల్లో అచ్చువేయటం కూడా ఇలాంటిదే. ఎందుకంటే ఆ భూములు రేడియంట్ కంపెనీకి కేటాయించింది టీడీపీ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపులిచ్చిందీ టీడీపీనే. ఆ భూముల కోసం వీఎంఆర్డీఏకు డబ్బులు చెల్లించింది కూడా వైసీపీ ప్రభుత్వం రాకముందే. ఆ తర్వాత సదరు కంపెనీ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో తనకున్న సాన్నిహిత్యం కారణంగా వీపీఆర్ ప్రాజెక్ట్స్‌తో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందానికి ఇప్పుడు తెలుగుదేశం మసిపూస్తోంది. ‘ఈనాడు’ మారేడుకాయ చేస్తోంది. ఈ కూతలు, రాతలన్నీ విశాఖ బ్రాండ్ ఇమేజ్ను ఫణంగా పెట్టినవే!. ఆ ఒప్పందం ప్రకారం హై ఎండ్ అపార్ట్మెంట్ల నిర్మాణంలో భూ యజమానికి 30%, డెవలపర్‌కు 70% వాటా ఉంటుంది. విల్లాలకు వచ్చేసరికి 40:60... మిగతా భూమిలో 50:50 వాటా ఉంటాయి. కానీ మనసులో దుర్మార్గం, దుర్బుద్ధి మాత్రమే నింపుకున్న టీడీపీ తైనాతీలు 70:30% వాటానే ప్రస్తావిస్తూ ఆరోపణలతో చెలరేగిపోయారు. ఇక్కడ ఆరోపణలు చేసిన వారికి గానీ, కుట్ర బుద్ధితో అచ్చేసిన రామోజీరావుకు గానీ ఒక్కటే ప్రశ్న. మీ ఇంటి మనిషి జయభేరి మురళీమోహన్ హైదరాబాద్‌లో నిర్మించిన హై ఎండ్ అపార్ట్మెంట్ నిర్మాణాల్లో భూ యజమానికిచ్చిన వాటా ఎంత? 30 కన్నా తక్కువేకదా? అప్పుడెందుకు ఈ విమర్శలు చేయలేదు? విశాఖలో నిర్మాణంలో ఉన్న ఎంకే–1, స్కైవ్యూ వంటి హై ఎండ్ ప్రాజెక్టుల్లోనూ ఇదే స్థాయి వాటా కదా? అసలు ఇటీవలి కాలంలో హై ఎండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేపట్టిన ఏ డెవలపరైనా భూ యజమానికి 40% వాటా ఇచ్చిన సందర్భాలున్నాయా? టీడీపీకో, రామోజీరావుకో ఇది తెలియక కాదు. ఒక కుట్ర ప్రకారం సీఎం కుటుంబంపై బురదజల్లే ప్రయత్నమిది. విశాఖలో ఏదో జరిగిపోతోందన్న భయాలు రేకెత్తించే ప్రయత్నమిది. ఇంతటి నీచ రాజకీయాలు చేయటానికి ఎవరికైనా సిగ్గుండాలి కదా? ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టపడి ఒక ఒప్పందానికి వస్తే దాంతో ప్రభుత్వానికేం సంబంధం? తనను బలవంతంగా తక్కువ వాటాకు ఒప్పించారని సదరు భూ యజమాని మీకేమైనా చెప్పాడా? ఆరోపణలు చేసిన టీడీపీ వాళ్లకెలాగూ నిజాలతో పనిలేకపోవచ్చు. కానీ పేరున్న పత్రికాధిపతిగా మీకైనా ఉండాలి కదా? ఈ రాతలపై మండిపడ్డ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చెప్పిన వాస్తవాలివిగో... నెల్లూరు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా... రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వానికి అంటగట్టి బురద జల్లేందుకు టీడీపీ, ఈనాడు, పచ్చ పత్రికలు ప్రయత్నిస్తున్నాయని వీపీఆర్ ప్రాజెక్ట్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనాడు, ఎల్లో మీడియాలో రేడియంట్ డెవలపర్స్ భూమికి సంబంధించి రాసిన టీడీపీ అసత్య ఆరోపణలపై నిజానిజాలను వివరించారు. ‘రేడియంట్ సంస్థకు టీడీపీ హయాంలో జీవో నంబరు 77 పేరుతో 2019 ఫిబ్రవరి 14న 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూముల్ని కూడా కోర్టు తీర్పుతో అప్పట్లో సీఎం చంద్రబాబు హయాంలోనే అప్పగించారు. సుప్రీంకోర్టులో కూడా కేసు గెలుచుకుని, ట్రిబ్యునల్‌లో కూడా అనుకూలంగా తీర్పు తెచ్చుకుని... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందే ఆ సంస్థ వీఎంఆర్డీఏకు నగదు చెల్లించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మా కంపెనీ వీపీఆర్‌కు రేడియంట్కు మధ్య 2021 ఫిబ్రవరి 23న డెవలప్మెంట్ ఒప్పందం కుదిరింది. రేడియంట్ సంస్థతో మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. రేడియెంట్ ఒక్కటే కాదు. చాలా సంస్థలతో మేం వ్యాపారం చేస్తున్నాం. మరి దీన్లో కుంభకోణం ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు. అన్ని నగరాల్లోనూ అంతే కదా? ‘మేం ఒక సంస్థతో వ్యాపార ఒప్పందం చేసుకుంటే తప్పేంటి? సాధారణంగా హై ఎండ్ అపార్ట్మెంట్ల కోసం విశాఖ, హైదరాబాద్, బెంగళూరు వంటి ఏ నగరంలోనైనా 70–30 శాతం అగ్రిమెంట్లే జరుగుతున్నాయి. రామోజీరావు గానీ, చంద్రబాబు గానీ ఇలాంటి ప్రాజెక్టుల్లో భూ యజమానికి 50 శాతం వాటా ఇస్తారా చెప్పండి? నేను వందలు కాదు... వేల ఎకరాలు కొని మీకు డెవలప్మెంట్ కోసం ఇస్తా?’ అని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని అడ్డుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదంతా భాగమేనని వేమిరెడ్డి ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీద ఈనాడుకు ప్రేమ ఉంటే మా బిజినెస్ వ్యవహారాలను కూడా వక్రీకరించి రాస్తారా? చివరికి దగదర్తి విమానాశ్రయం గురించి కూడా ఇలాగే రాశారు. దగదర్తిలో కంటే తెట్టు దగ్గర విమానాశ్రయం రావటం వల్ల నెల్లూరు జిల్లాకే కాకుండా ప్రకాశం జిల్లాకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. దీనిపై నీచపు రాతలు రాయడం దుర్మార్గం కాదా?’అని ప్రశ్నించారు. వైఎస్ భారతికి ఏమి సంబంధం? కనీస సంస్కారం లేకుండా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పేరును ఈ వ్యవహారంలోకి లాగడం సిగ్గు చేటు అని వేమిరెడ్డి విమర్శించారు. వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి పేరు కూడా వైఎస్ భారతి అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నుంచి వివరాలు తీసుకున్నప్పుడు భారతి అని ఉంటే ఆమె ఎవరో కూడా తెలుసుకోవాలి. అందులో వయసు ఉంటుంది. ఇవేవీ చూడకుండా సీఎం భార్యను టార్గెట్ చేసి రాయడానికి సిగ్గు, బుద్ధి ఉండాలి. కుటుంబ సభ్యులను కూడా బయటకు లాగుతున్న దుర్మార్గాన్ని జర్నలిజం అంటారా?’ అని వేమిరెడ్డి ప్రశ్నించారు. -
ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తా: ఎంపీ వేమిరెడ్డి
సాక్షి, నెల్లూరు: రేడియంట్ డెవలపర్స్‌కు సంబంధించి ఎలాంటి కుంభకోణం జరగలేదని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అది రెండు ప్రైవేటు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అని, రేడియంట్ సంస్థతో తనకు 30 ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మా ఒప్పందంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్లో మీడియా మమ్మల్ని టార్గెట్ చేసి దుష్ఫ్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వ పరంగా సాయం తీసుకుని ఉంటే ఎప్పుడో పని పూర్తయ్యేది.. వైఎస్సార్సీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా?. అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందనే విషయం మరవకూడదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మమ్మల్ని టార్గెట్ చేశాయి. ఎల్లో పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..? -
విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ బిడ్డలు చేసిన పాపం ఏమిటో వారెవరికీ తెలియదు. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే అనాథలయ్యారు. అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగానికి దూరమయ్యారు. వారిని ‘దాతృత్యం’ అక్కున చేర్చుకుంది. కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి కడపు నింపింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు మారినా ఇటువంటి వారికి అందరి మాదిరిగానే ప్రభుత్వ పథకాలకు అర్హులైనా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయాన్ని కదిలించింది. హృదయాలు ద్రవించే విషాద జీవితాల అనాథ బిడ్డలకు ఒక్క సంతకం ‘అమ్మఒడి’ ఆలంబనగా నిలిచింది. తల్లిదండ్రుల స్థానంలో దేవుళ్ల పేరు పాఠశాలలో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్లు, మతం, కులం తప్పనిసరిగా పొందుపర్చాల్సింగా స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ బిడ్డలకు దేవుళ్లే తమ తల్లిదండ్రులుగా భావించి (సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి) వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేయడంతో తల్లి పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన విద్యార్థులు చివరకు తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తుల్లో నమోదు చేసుకుంటున్నారు. సంక్షేమానికి దూరంగా అనాథ బాలబాలికలు రాష్ట్ర ప్రభుత్వం విద్యావిప్లవాన్ని తీసుకొచ్చింది. పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. నాడు–నేడు పథకంతో మౌలిక వసతులను సమకూర్చింది. అర్హులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలనే సంకల్పం తీసుకుంది. ఇంతటి మహోన్నత ఆశయంలో కూడా అనాథ బాలబాలికలకు ‘అమ్మఒడి’ అర్హత లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్ కార్డు తప్పనిసరిగా అయ్యాయి. ఎవరో దాత దాతృత్వంతో బతికే వీరికి కులం, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు కార్డులు గగనమయ్యాయి. దీంతో అర్హులైనప్పటికీ అమ్మఒడి వర్తించడంలేదు. ఫలించిన ఎంపీ వేమిరెడ్డి కృషి వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఓ వైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే మరోవైపు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలబాలికల విద్యకోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణంలో అనాథలకు అమ్మఒడి పథకం వర్తించకపోవడాన్ని విని చలించిపోయారు. కలెక్టర్‌తో చర్చించి నివేదికను రూపొందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది అనాథ బాలబాలికలు అమ్మఒడికి అర్హులుగా తేల్చారు. అదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమాల్లో ఉంటూ చదుకుంటున్న అనాథ బాలబాలికలు వివరాలపై నివేదిక కోరారు. ఆ విధంగా 5,990 మంది అనాథ విద్యార్థులకు రూ.7.787 కోట్లు విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లెటర్ నంబర్.1768275/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలోని అనాథ బాలబాలికలకు రూ.29.51 లక్షలు విడుదలయ్యాయి. నెల్లూరులో బీజం.. అనాథ బిడ్డలకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలనే ఆలోచనకు నెల్లూరులో బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న అందరికీ వర్తించింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రమం పొందుతున్నారు. దాతల దాతృత్వంలో నడిచే ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలో విద్యను అభ్యసించే ఇతర విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తోంది. అనాథలుగా ఉన్న విద్యార్థులకు వర్తించడం లేదు. ఇదే విషయం జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ చక్రధర్‌బాబు చొరవతో ఇటువంటి అనాథలను జిల్లా వ్యాప్తంగా 227 మందిని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అమ్మఒడి పథకం వర్తించింది. జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ బాలబాలికలకు 5,590 మందికి రూ.7.787 కోట్లు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి. అనాథలకు ఎంతో ఉపయోగం చదువుకు సర్కార్ తోడ్పాటునిస్తోంది. అమ్మఒడి చక్కటి పథకం. ఎంతో కాలంగా అనాథ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. మా అభ్యర్థను కలెక్టర్ మన్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొవర కారణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని చాటుకున్నారు. ఆశ్రమాలు నిర్వహణకు అమ్మఒడి తోడ్పాటు కానుంది. – జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమం సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపు సమాజంలో అనా«థలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనా«థల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయింది. కేవలం దాతల దాృతత్వంతోనే జీవనం సాగిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అమ్మ ఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షనీయం. అనా«థలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేయాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు -
అందుకే చంద్రబాబును ప్రజలు సాగనంపారు: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మంత్రికాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం అట్టహాసంగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్లీనరీ పరిశీలకులు సుకుమార్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ప్లీనరీ సమావేశం సాగింది. వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. ప్లీనరీ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌కి రోజురోజుకూ జనాదరణ పెరుగుతోంది. ఇది ఓర్వలేని టీడీపీ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలు సంఘటితమై టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే చంద్రబాబును ప్రజలు సాగనంపారు. ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి సీఎం జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టింది. ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేస్తోంది. పేద పిల్లల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పైన పచ్చ మీడియా విషం చిమ్ముతోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: (‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’)